
నోయిడా: కారును ర్యాష్ డ్రైవ్ చేయడమే కాదు.. ఫుట్ పాత్ పైకి ఎక్కించేశాడు లాంబోర్కిని కారును డ్రైవ్ చేస్తున్న డ్రైవర్. అదే సమయంలో ఫుట్ పాత్ పై ఇద్దరు కార్మికులు పని చేస్తున్నారు. తలకు హెల్మెట్ పెట్టుకుని ఆరంజ్ జాకెట్లు తొడక్కుని పనిలో ఉన్నారు. ఇంతలో ఓ కారు అమాంతం ఫుట్ పాత్ పైకి వచ్చేసింది. దీంతో కొద్ది పాటి గాయాలతో తప్పించుకున్నారు ఇద్దరు కార్మికులు. తలకు హెల్మెట్ ఉండటం వల్ల కూడా పెద్ద ప్రమాదం తప్పింది.
అయితే కారు డ్రైవర్ ను పట్టుకుని నిలదీశాడు ఆ కార్మికుల్లో ఒకరు. రోడ్డుపై ఫుట్ పాత్ పై స్టంట్స్ ఏమైనా చేస్తున్నావా అంటూ ప్రశ్నించాడు. అయితే దానికి ఆ డ్రైవర్ నుంచి ఎటకారంతో కూడిన సమాధానం వచ్చింది. ఎంతమంది చచ్చిపోయారేంటి అంటూ బదులిచ్చాడు. దానికి ఆ కార్మికులకు కోపం చిర్రెత్తు కొచ్చింది. ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఆ డ్రైవర్ పై అసహనం వ్యక్తం చేశారు. ఇప్పుడేంటి.. నేను కారును ఫుట్ పాత్ పైకి ఎక్కించా.. ఎంతమంది చచ్చిపోయారంటూ హిందీలో మళ్లీ ప్రశ్నించాడు.
దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడకు వచ్చిన వారు.. ఆ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు కారును కూడా సీజ్ చేశారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. నోయిడాలోని సెక్టార్ 94లో నిర్మాణంలో ఉన్న ఒక కాంప్లెక్స్ పక్కన ఉన్న ఫుట్‌పాత్ వద్ద ఇది జరిగింది. అయితే ఈ ఇద్దరు కార్మికుల్ని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించామని, ఎటువంటి ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు.
A #Lamborghini, a fat bank account, and ZERO Humanity
This #Noida brat mows down two labourers and casually asks—“Koi mar gaya idhar?” pic.twitter.com/TaUgdB769z— Smriti Sharma (@SmritiSharma_) March 30, 2025