National
-
దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు ఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ కేసులో తిరుపతన్న గతేడాది అక్టోబర్‌లో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై గురువారం జస్టిస్ బి.వి. నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్‌సింగ్ ధర్మాసనం విచారణ జరిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న ప్రధాన నిందితుడని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.ఫోన్ ట్యాపింగ్‌తో పాటు ఆధారాలు చెరిపివేయడంలోనూ తిరుపతన్న కీలకంగా వ్యవహరించారని.. 2023 డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాగానే ఆధారాలు ధ్వంసం చే శారని లూథ్రా తెలిపారు. రాజకీయ నేతల ఆదేశాల మేరకు పలువురి ఫోన్లను ట్యాప్ చేశారని, హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇందులో ఉన్నాయని వివరించారు. మరోవైపు తిరుపతన్న 9 నెలలుగా జైలులో ఉన్నారని.. ఆయన పాత్రపై ఇప్పటికే చార్జిïÙట్ దాఖలైందని తిరుపతన్న తరఫు న్యాయవాది సిద్ధార్థ దవే వాదించారు. బెయిల్ పొందడం హక్కు అని.. తప్పనిసరైతేనే జైలులో ఉంచాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పులిచి్చందని దవే ప్రస్తావించారు. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగడం సరికాదన్న ధర్మాసనం... విచారణను ఎప్పటికి పూర్తిచేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.అంతేగాక దర్యాప్తు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను అడ్డుకోలేరని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు పూర్తికి ఇంకా ఎంత సమయం పడుతుందో రాతపూర్వకంగా తమకు ఇవ్వాలని ఆదేశించింది. అయితే విచారణ పూర్తయ్యేందుకు మరో 4 నెలలు సమయం పడుతుందని, అఫిడవిట్ దాఖలుకు సమయం కావాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ధర్మాసనాన్ని కోరారు. దీంతో తదుపరి విచారణను జస్టిస్ నాగరత్న ధర్మాసనం జనవరి 27కు వాయిదా వేసింది. -
పదే పది నిమిషాలు.. "ఇదెక్కడి టార్చర్ భయ్యా..!"
ఢిల్లీ : వ్యాపార వేత్త పునీత్ ఖురానా ఆత్మహత్య ఘటనలో సంచలన ఆడియో,వీడియో టేపులు వెలుగులోకి వచ్చాయి. సీసీటీవీ ఫుటేజ్ వీడియోల్లో బ్రతికుండగానే భర్త పునీత్ ఖురానాకు భార్య మనీకా పహ్వా ఎలాంటి నరకం చూపించిందో స్పష్టంగా తెలుస్తోంది. ఇంట్లోనే భర్తకు ఎదురుగా కూర్చున్న పహ్వా చెప్పుకోలేని విధంగా బూతులు తిడుతున్న ఆడియో,వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఢిల్లీలో ప్రముఖ వుడ్‌బాక్స్ కేఫ్ సహ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా(40) భార్య మనికా జగదీష్ పహ్వా వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.2016లో పునిత్కు,పహ్వాకు వివాహం జరిగింది. ఇద్దరు ఉడ్‌బాక్స్ కేఫ్, ఫర్గాడ్ కేక్ పేరుతో బేకరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారం జోరందుకుంది. అంతా సాఫిగా సాగుతున్న జీవితంలో మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో విడాకుల తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కోర్టు ద్వారా విడాకుల కోసం అప్లయ్ చేశారు.#PuneetKhurana did not commit suicide just because being humiliated on a late night phone call by his wife. This harassment and extortion was going on since long. Suicide is never easy. Suicide is never a choice for anyone. Its the extreme helplessness which turns people… pic.twitter.com/ip69yCS4Bd— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) January 1, 2025 పరస్పర అంగీకారంతో కోర్టు ఇద్దరికి విడాకులు ఇచ్చేందుకు అంగీకరించింది. నా డిమాండ్లను నెరవేరిస్తే విడాకులు ఇస్తానునని పహ్వా కోర్టుకు తెలిపింది. కోర్టు సైతం పహ్వా షరతులకు లోబడి ఆమె డిమాండ్లు నెరవేర్చాలని పూనిత్కు సూచించింది. అందుకు పునిత్ సైతం అంగీకరిస్తూ సంతకం కూడా చేశాడు. 180 రోజుల్లో కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది.ఈలోగా భార్య,భర్తలు వ్యాపారాలు వేర్వేరుగా చేసుకుంటున్నారు. కానీ కోర్టు ఎదుట విధించిన షరతులు కాకుండా అంతకు మించి పహ్వా కుటుంబ సభ్యులు పునిత్ను వేధించడం మొదలు పెట్టారు. దీంతో తట్టుకోలేక 59 నిమిషాల వీడియోను రికార్డ్ చేసి డిసెంబరు 31న మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నారు. ఆ వీడియోలో తన భార్య పహ్వా, ఆమె కుటుంబసభ్యులు ఎంతలా వేధించారో చెప్పారు.ఆ వీడియోలో ‘నా భార్య నా తాహతకు మించి డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఐదు డిమాండ్లను నెరవేర్చా. లాయర్ ఫీజు కింద నెలకు రూ.70వేలు ఇచ్చా. అవి సరిపోలేదని మరో రూ.10లక్షలు ఇవ్వాలని భార్య,అత్తమామలు వేధిస్తున్నారు. ఇంకా డబ్బులు కావాలని నన్ను పీక్కుతింటున్నారు. ఇంతుకు మించి ఇవ్వలేను. డబ్బులు కావాలని నా తల్లిదండ్రులను అడగలేను ’ అని తెలిపారు.పునీత్ ఖురానా ఆత్మహత్యపై డిసెంబరు 31న మధ్యాహ్నం 4:30 గంటలకు ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా పునీత్ ఖురానా ఇంట్లో సీసీటీవీ ఫుటేజీ వెలుగులోకి వచ్చాయి. ఆ ఫుటేజీలు ఎప్పటివి అనేది తెలియాల్సి ఉండగా భార్య మనికా జగదీష్ పహ్వా భర్త పునీత్ ఖురానాను బ్రతికి ఉండగానే ఎంతటి నరకం చూపించిందో తెలుస్తోంది.ఆ సీసీటీవీ ఆడియో,వీడియో ఫుటేజీలో ఓ పది నిమిషాలు సమయం నీకు ఇస్తున్నా అంటూ ‘ఓ బిచ్చగాడ. నువ్వు ఏమి అడిగావో చెప్పు. నీ మొహం చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు నా ముందుకు వచ్చావనుకో నీ రెండు చెంపలు వాయిస్తా. ఏంటి నీకు విడాకులు కావాలి. నన్ను వ్యాపారం చేసుకోనివ్వవా?అంటూ భర్తను,అతని కుటుంబ సభ్యుల్ని అనరాని మాటలు అన్నది. అయినా సరే ఇవన్నీ పర్వాలేదు. నీకేం కావాలో చెప్పు’ అని భర్త బదులివ్వడం గమనించవచ్చు. వాటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
వీధి కుక్కలు రాసిన మరణ శాసనం
జైపూర్ : ‘తల్లి మీరిక్కడే ఆడుకోండి. నేను బజారుకెళ్లి వస్తానంటూ ఓ తాత తన మనువరాలికి జాగ్రత్త చెప్పి వెళ్లాడు. కానీ ఆ చూపే తన మనువరాలిని చూసే చివరి చూపవుతుందనుకోలేదు.’ ఇంతకి ఏం జరిగిందంటే..రాజస్థాన్(rajastan)లోని అల్వార్ జిల్లాలో ఇక్రానా తన తాత, ఐదుగురు స్నేహితులతో కలిసి పొలానికి వెళ్లింది. పొలం పనిచేసిన అంనతరం తాత స్థానికంగా ఉండే మార్కెట్‌కు వెళ్లాడు. వెళ్లే సమయంలో మనువరాలికి జాగ్రత్త చెప్పి వెళ్లాడు.తాత మాట విన్న ఆ మనువరాలు తన స్నేహితులతో పొలంలోనే ఆడుకుని సాయంత్రం ఇంటికి బయలు దేరింది. మార్గం మధ్యంలో 7-8 వీధి కుక్కలు (street dogs) ఇక్రానా,ఆమె స్నేహితులపై దాడి చేశాయి. కుక్కుల దాడితో భయాందోళనకు గురైన చిన్నారులు బిగ్గరుగా కేకలు వేశారు. చిన్నారుల కేకల విన్న పక్కనే పొలం పనులు చేస్తున్న రైతులు పరిగెత్తుకుంటూ వచ్చారు. పిల్లల్ని కుక్కల దాడి నుంచి కాపాడారు. అత్యవసర చికిత్స నిమిత్తం ట్రాక్టర్లో తరలించారు.అయితే, ఆ వీధి కుక్కల్లోని ఓ కుక్క మాత్రం ఇక్రానాను వదిలి పెట్టలేదు. వెంటపడి మరీ కరిచింది. ట్రాక్టర్లో తరలిస్తున్నా ఇంకా కరించేందుకు ప్రయత్నించింది. ఎట్టకేలకే కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారుల్ని ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. ఈ దుర్ఘటనలో ఇక్రానా మరణించింది. ఇక్రానాపై దాడి చేసిన కుక్క గతంలో ఇతర జంతువులపై దాడి చేసిందని, అందువల్లే బాలిక చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 👉చదవండి : వృద్ధురాలిపై వీధి కుక్కల దాడి, వైరల్ వీడియో -
రైల్వేస్టేషన్లో ఎన్నారైకి టోకరా.. అధికారులు సీరియస్
సాధారణంగా రైల్వే స్టేషన్లలో నడవలేని వారి కోసం వీల్‌చైర్స్ అందుబాటులో ఉంటాయి. వీటిని ఉపయోగించుకోవడానికి ఏ మాత్రం ఫీజు చెలాయించాల్సిన అవసరం లేదు. కానీ ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఓ పోర్టర్.. ఎన్ఆర్ఐ (NRI) ప్యాసింజర్ నుంచి రూ.10,000 వసూలు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో వీల్‌చైర్ సేవలను అందించినందుకు పోర్టర్ రూ. 10వేలు వసూలు చేసాడు. ఈ ఘటన డిసెంబర్ 28న జరిగినట్లు తెలిసింది. ఆ స్టేషన్లో వీల్‌చైర్ సర్వీస్ ఉచితం అని తెలుసుకున్న ఆ ఎన్ఆర్ఐ కుమార్తె రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసింది.ఎన్ఆర్ఐ నుంచి 10,000 రూపాయలు వసూలు చేసిన ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టి, స్టేషన్‌లోని సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ పోర్టర్‌ను గుర్తించారు. ఎన్ఆర్ఐ దగ్గర నుంచి వసూలు చేసిన రూ. 10వేల రూపాయలలో 90 శాతం వెనక్కి ఇవ్వాలని ఆదేశించారు. అంతే కాకుండా ఆ పోర్టర్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసి.. అతని దగ్గర ఉన్న బ్యాడ్జ్‌ను కూడా అధికారులు వెనక్కి తీసుకున్నారు.ప్రయాణికులను మోసం చేస్తే సహించేది లేదని, ఇలాంటి ఘటనలు రైల్వే ప్రతిష్టతను దెబ్బతీస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల ప్రయోజనాలకే మొదట ప్రాధాన్యత కల్పిస్తామని వారు స్పష్టం చేశారు. ఇలాంటి సమస్యలు ఎదురైతే ప్రయాణికులు 139 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వారు సూచించారు. -
చిన్మయ్ కృష్ణదాస్‌కు నో బెయిల్
ఢాకా : దేశ ద్రోహం నేరారోపణలతో అరెస్టై జైల్లో ఉన్న బంగ్లాదేశ్ (Bangladesh) ఇస్కాన్ చిన్మయ్ కృష్ణదాస్‌కు (Chinmoy Krishna Das) ఎదురుదెబ్బ. 42 రోజులుగా జైలు జీవితం అనుభవిస్తున్న కృష్ణదాస్‌కు చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టును బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. చిన్మయ్ కృష్ణదాస్‌ను నవంబర్ 25న బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి దేశ ద్రోహం నేరారోపణలతో జైలు శిక్షను అనుభవిస్తున్నారు. ఈ తరుణంలో తనకు బెయిల్ కావాలని కోరుతూ కృష్ణదాస్ గురువారం చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ ((Chattogram Metropolitan Sessions court) కోర్టును ఆశ్రయించారు.కృష్ణదాస్ తరుఫున కోర్టులో వాదనలు వినిపించేందుకు బంగ్లాదేశ్ సుప్రీం కోర్టు న్యాయవాది అపూర్బా భట్టాచార్యతో పాటు మరో 10 న్యాయవాదులు కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. అయితే విచారణ ప్రారంభమైన 30 నిమిషాల తర్వాత ఇరు పక్షాల వాదనలు విన్న చటోగ్రామ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎండీ సైఫుల్ ఇస్లాం కృష్ణదాస్‌కు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించినట్లు చటోగ్రామ్ మెట్రోపాలిటన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడ్వకేట్ మోఫిజుర్ హక్ భుయాన్ తెలిపారు.కృష్ణదాస్‌కు బెయిల్ రాకపోవడంపై కోల్‌కతా ఇస్కాన్ వైస్‌ప్రెసిడెంట్ రాధా రామ్మోహన్ దాస్ విచారం వ్యక్తం చేశారు. ‘42 రోజులుగా జైలు శిక్షను అనుభవిస్తున్న చిన్మోయ్ కృష్ణదాస్‌కు కొత్త ఏడాదిలో జైలు జీవితం నుంచి విముక్తి కలుగుతుందని ఆశించాం. కానీ ఇవాళ కూడా ఆయనకు బెయిల్ రాలేదు. కృష్ణదాస్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం అందింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం అతనికి న్యాయం జరిగేలా చూడాలి. ఆ నమ్మకం మాకు ఉందని తెలిపారు.చదవండి : చిన్మయ్ కృష్ణదాస్‌పై కేసుల మీద కేసులు -
ఒకతాటిపైకి పవార్ ఫ్యామిలీ!
పవార్ ఫ్యామిలీ మళ్లీ కలిసిపోతుందా? రాజకీయ వైరుధ్యాలను పక్కనపెట్టి పవార్ కుటుంబం ఒక్కటి కానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా పరిణామాలను గమనిస్తే ఈ దిశగా అడుగులు పడుతున్నట్టు కనబడుతోంది. కుటుంబ పెద్ద అయిన శరద్ పవార్‌పై 2023, జూలైలో అజిత్ పవార్ తిరుగుబాటు బావుటా ఎగరవేయడంతో పవార్ ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని చీల్చి శివసేన-బీజేపీ మహాయుతి సర్కారు పంచన చేరి పెద్దాయన పెద్ద షాకే ఇచ్చారు అజిత్ పవార్. అప్పటి నుంచి ఇద్దరు అగ్రనేతల మధ్య రాజకీయ వైరుధ్యాలు కొనసాగుతున్నాయి.కలిసిపోవాలని కోరుకున్నాతాజాగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తల్లి ఆశా-తాయ్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. నూతన సంవత్సరం తొలిరోజు సందర్భంగా బుధవారం పండరీపూర్ శ్రీ విఠల రుక్మిణిమాయిలను ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ అంతరాలు సమసిపోయి పవార్ కుటుంబమంతా ఏకతాటి పైకి వచ్చేలా కటాక్షించాలని విఠలేశుడిని కోరుకున్నట్టు తెలిపారు. ‘పవార్ కుటుంబంలో ఉన్న మనస్పర్థలన్నీ తొలగిపోవాలని.. అజిత్, శరద్ పవార్ మళ్లీ కలిసిపోవాలని దేవుడిని కోరుకున్నాను. నా ప్రార్థనలు నెరవేరుతాయని ఆశిస్తున్నాన’ని ఆశా పవార్ అన్నారు.పెద్దాయన అంటే చాలా గౌరవంపవార్ ఫ్యామిలీ ఏకతాటిపైకి వస్తే అంతకంటే ఆనందం మరోటి ఉండదని ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేక పక్షంలో ఉన్నప్పటికీ పెద్దాయన అంటే అజిత్‌కు చాలా గౌరవం ఉందని తెలిపారు. ‘శరద్ పవార్ మాకు తండ్రి లాంటివారు. భిన్నమైన రాజకీయ వైఖరిని తీసుకున్నప్పటికీ, మేము ఎల్లప్పుడూ ఆయనను గొప్పగా గౌరవిస్తాం. పవార్ కుటుంబం మళ్లీ కలిస్తే చాలా సంతోషిస్తాం. నన్ను నేను పవార్ కుటుంబంలో భాగమని భావిస్తున్నాన’ని ప్రఫుల్ పటేల్ వ్యాఖ్యానించారు.అప్పుడు చాలా బాధపడ్డాంఎన్సీపీ మరో సీనియర్ నాయకుడు, మహారాష్ట్ర మంత్రి నరహరి జిర్వాల్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శరద్, అజిత్ పవార్ తిరిగి చేతులు కలిపితే పార్టీకి, కార్యకర్తలకు మేలు జరుగుతుందని అన్నారు. శరద్ పవార్‌ను తాము చాలా గౌరవిస్తామని, పార్టీ చీలిపోయినందుకు బాధపడ్డామని ఆయన తెలిపారు.పెద్దాయనతో అజిత్ భేటీ వెనుక..శరద్, అజిత్ మళ్లీ చేతులు కలుపుతారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆశా పవార్ వ్యాఖ్యలు ఈ ప్రచారానికి మరింత బలాన్నిచ్చాయి. మరో సంఘటన కూడా ఈ ప్రచారానికి ఊతంగా నిలిచింది. పార్టీని చీల్చిన తర్వాత తనపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న పెద్దాయనను అజిత్ గత డిసెంబర్ నెలలో కలవడంతో ఈ ప్రచారం మొదలయింది. పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలో ఉన్న శరద్ పవార్‌ను డిసెంబర్ 12న అజిత్ కుటుంబ సమేతంగా కలిశారు. పెద్దాయనకు జన్మదిన శుభాకాంక్ష తెలిపి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. అయితే అరగంట పాటు వీరిద్దరి మధ్య రాజకీయ చర్చలు నడిచాయని, త్వరలోనే పవార్ ఫ్యామిలీ కలిసిపోవడం ఖాయమని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని అజిత్ తోసిపుచ్చారు. కుటుంబ విషయాలు మాత్రమే మాట్లాడుకున్నామని, రాజకీయాల ప్రస్తావన రాలేదని వివరణ ఇచ్చారు. చదవండి: ఆ 35 నిమిషాలు : సాధారణమా? రాజకీయమా? మళ్లీ ఒక్కటవుతారా?ఎన్సీపీ రెండుగా చీలిపోయిన తర్వాత గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ పార్టీ భంగపాటు ఎదురైంది. ఇటీవల ముగిసిన మహారాష్ట్ర ఎన్నికల్లో మాత్రం అజిత్ సత్తా చాటారు. ఆయన పార్టీకి 41 స్థానాల్లో విజయం సాధించగా, శరద్ పవార్ వర్గానికి కేవలం 10 సీట్లు మాత్రమే దక్కాయి. మహాయుతి సంకీర్ణ సర్కారులో అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యారు. అంతేకాదు రాష్ట్ర కేబినెట్లో మొత్తం 9 మంత్రి పదవులు దక్కించుకుని అజిత్ మరింత పవర్ఫుల్ అయ్యారు. అటు కేంద్రం, అటు రాష్ట్రంలో ఎన్నికల హడావుడి ముగియడంతో అజిత్, శరద్ మధ్య సయోధ్య వాతావరణం నెలకొంది. అజిత్ కుటుంబ సమేతంగా తన ఇంటికి రావడంతో పెద్దాయన కాస్త మెత్తబడినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా అజిత్ తల్లి కూడా పవార్ కుటుంబం.. ఒకతాటిపైకి రావాలని ఆకాంక్షించడంతో మళ్లీ చర్చ మొదలయింది. మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి. -
‘అత్యాచారం కేసును రాజకీయం చేస్తున్నారు’
చెన్నై: తమిళనాడును కుదిపేసిన అన్నా యూనివర్సిటీ(Anna University) ఘటనపై ఆ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇంజనీరింగ్ విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్‌ను తాజాగా మద్రాస్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. ఈ ఘటనను రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.ఘటనను నిరసిస్తూ చెన్నై వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పట్టాలి మక్కల్ కట్చి(పీఎంకే) భావించింది. అయితే.. పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారు. దీంతో పీఎంకే హైకోర్టు(High Court)ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం.. ‘‘అసలు మహిళల భద్రతపై ఎవరికీ అసలు చిత్తశుద్ధి లేదు. అన్నా యూనివర్సిటీ లైంగిక దాడి కేసును అంతా రాజకీయం చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరం వాడుకుంటున్నారు’’ అని వ్యాఖ్యానించింది.మరోవైపు..ఈ కేసులో ప్రజాగ్రహం పెల్లుబిక్కడంతో సిట్‌తో దర్యాప్తు చేయించాలని మద్రాస్ హైకోర్టు ఇదివరకే ఆదేశించింది కూడా.డిసెంబర్ 23వ తేదీన రాత్రి 8గం. ప్రాంతంలో క్యాంపస్‌లో విద్యార్థిని తన స్నేహితుడితో మాట్లాడుతుండగా.. దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనకు దిగాయి. అదే సమయంలో..ఈ కేసులో నిందితుడిగా పేర్కొంటూ జ్ఞానేశ్వర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా బిర్యానీ వ్యాపారి అయిన జ్ఞానేశ్వర్.. అధికార డీఎంకే యువ విభాగానికి గతంలో పని చేశాడు. దీంతో రాజకీయంగానూ దుమారం రేగింది. విద్యా సంస్థలలోనూ విద్యార్దినులకు భద్రత కరువైందన్న ఆందోళనను ప్రతిపక్షాలు వ్యక్తంచేశాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి, బీజేపీ అధ్యక్షుడు అన్నామలై(Annamalai), డీఎండీకే ప్రధాన కార్యదర్శిప్రేమలత విజయకాంత్, పీఎంకే నేతలు రాందాసు, అన్బుమణి రాందాసు వేర్వేరు ప్రకటనలో ఈ ఘటనను ఖండించారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌తో పాటు పలువురు డీఎంకే నేతలతో జ్ఞానేశ్వర్ దిగిన ఫొటోలను వైరల్ చేస్తూ ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఓ అడుగు ముందుకు వేసి ఘటనకు నిరసనగా కొరడాతో బాదుకున్నారు. ప్రభుత్వం కదిలేవరకు చెప్పులు వేసుకోనంటూ ప్రతిన బూనారు. మరోవైపు టీవీకే అధ్యక్షుడు, నటుడు విజయ్ కూడా కేసులో బాధితురాలికి సత్వర న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా మద్రాస్ హైకోర్టు రాజకీీయం చేస్తున్నారని వ్యాఖ్యానించడం గమనార్హం. -
టెన్త్ అర్హతతో 10 మెడికల్ కోర్సులు.. తక్షణ ఉపాధి.. అధిక జీతం
టెన్త్ చదువుతున్న చాలామందికి వైద్యవిద్యను అభ్యసించాలని ఉంటుంది. అయితే వారి ఆర్థిక పరిస్థితులు, ఇతరత్రా కారణాలతో ఎంబీబీఎస్ చేయలేని స్థితిలో ఉంటారు. ఇలాంటివారికి వైద్యరంగంలోకి ప్రవేశించేందుకు పలు మార్గాలు ఉన్నాయి. వీటికి 10వ తరగతి పాసయితే చాలు. ఈ కోర్సులను పూర్తిచేసి, చక్కని ఉపాధితో పాటు అధిక జీతాన్ని కూడా అందుకోవచ్చు. ఆ కోర్సులు వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.1. డీఎంఎల్టీ (డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీ)మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు రెండు సంవత్సరాలు ఉంటుంది. ఇందులో ల్యాబ్ టెస్టులు, రోగ నిర్ధారణ, రిపోర్టు ప్రిపరేషన్ మొదలైనవి నేర్పిస్తారు. ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన ఈ కోర్సు చేసిన వారికి మంచి డిమాండ్ ఉంది. అధిక జీతం కూడా అందుకోవచ్చు.2. రేడియాలజీ టెక్నాలజీ కోర్సుఈ కోర్సులో చేరినవారికి ఎక్స్-రే, అల్ట్రాసౌండ్ యంత్రాలను ఆపరేట్ చేయడం నేర్పుతారు. 10వ తరగతి తర్వాత రెండు సంవత్సరాల ఈ డిప్లొమా కోర్సు చేయవచ్చు. కోర్సు పూర్తయ్యాక రూ.30,000 నుంచి రూ.50,000 వరకు ప్రారంభ వేతనం పొందవచ్చు.3. డిప్లొమా ఇన్ ఫార్మసీ (D.Pharm)ఈ రెండు సంవత్సరాల కోర్సులో ఔషధాలు, వాటి విక్రయాల గురించిన సమాచారాన్ని బోధిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసినవారు మెడికల్ స్టోర్ ప్రారంభించవచ్చు. లేదా ఫార్మాస్యూటికల్ కంపెనీలలో పని చేయవచ్చు.4. ఆప్టోమెట్రీలో డిప్లొమాఈ కోర్సులో కంటి సంబంధిత వ్యాధుల చికిత్స, దృష్టిని మెరుగుపరచడానికి అవసరమైన శిక్షణను అందిస్తారు. ప్రారంభ వేతనం రూ. 25,000 నుంచి రూ. 40,000 వరకు ఉంటుంది.5. ANM/GNM (నర్సింగ్ కోర్సు)రెండు సంవత్సరాల పాటు ఉండే ఈ కోర్సులో ప్రాథమిక నర్సింగ్ నైపుణ్యాలను బోధిస్తారు. నర్సింగ్ ఫీల్డ్‌ను కెరీర్‌గా ఎంచుకోవడం ద్వారా మంచి ఆదాయం అందుకోవచ్చు.6. డెంటల్ హైజీనిస్ట్ కోర్సుఈ కోర్సులో దంతాల శుభ్రత, వ్యాధులను గుర్తించడం మొదలైనవి నేర్పిస్తారు. ఇది రెండు సంవత్సరాల కోర్సు. ప్రారంభ వేతనం రూ. 25,000 నుంచి మొదలవుతుంది7. డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ (DPT)ఈ రెండు సంవత్సరాల కోర్సులో శారీరక రుగ్మతలను నయం చేసే పద్ధతులు నేర్పుతారు. ఈ కోర్సు పూర్తి చేశాక క్లినిక్ తెరవడం లేదా ఆసుపత్రిలో పని చేయడం ద్వారా మంచి ఆదాయాన్ని అందుకోవచ్చు.8. హోమియోపతి అసిస్టెంట్ కోర్సుఈ కోర్సు రెండు సంవత్సరాల పాటు ఉంటుంది. దీనిలో హోమియోపతి మందులు, చికిత్సకు సంబంధించిన శిక్షణను అందిస్తారు. దీనిని పూర్తి చేసిన తర్వాత, సొంతంగా ప్రాక్టీస్ చేసే అవకాశం ఉంటుంది.9. సర్జికల్ అసిస్టెంట్ కోర్సుశస్త్రచికిత్స సమయంలో వైద్యునికి సహాయం చేయడానికి ఈ కోర్సు ద్వారా శిక్షణనిస్తారు. ఈ కోర్సు రెండు సంవత్సరాలు ఉంటుంది. ఈ కోర్సుకు అత్యధిక డిమాండ్ ఉంది.10. అంబులెన్స్ అసిస్టెంట్ కోర్సుఅత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ను నడపడానికి, ప్రథమ చికిత్స అందించడంపై శిక్షణనిస్తారు. ప్రారంభ వేతనం రూ.20,000 నుండి రూ.30,000 వరకు ఉంటుంది.ఇది కూడా చదవండి: అర్థ, పూర్ణ, మహాకుంభమేళాల్లో తేడాలేమిటి?.. ఈసారి ఎందుకంత ప్రత్యేకం? -
ప్రార్థనా స్థలాల చట్టంపై సుప్రీంకోర్టులో ఒవైసీ పిటిషన్
సాక్షి, ఢిల్లీ: దేశంలో ప్రార్థనా స్థలాల అంశంపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని కోర్టును ఒవైసీ కోరారు. దీంతో, ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లతో ఒవైసీ పిటిషన్ జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అన్ని పిటిషన్లపై వచ్చే నెల 17న విచారణ చేపట్టనున్నట్టు కోర్టు తెలిపింది.ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దేశవ్యాప్తంగా ప్రార్థనా స్థలాల చట్టం 1991 అమలు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో నేడు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఇదే అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లతో ఒవైసీ పిటిషన్ జత చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతర, అన్ని పిటిషన్లపై ఫిబ్రవరి 17న విచారణ జరుపుతామని సంజీవ్ ఖన్నా ధర్మాసనం వెల్లడించింది. -
వీడియో: 15 అడుగుల స్టేజ్‌పై నుంచి పడిపోయిన మహిళా ఎమ్మెల్యే.. తీవ్ర గాయాలు
తిరువనంతపురం: ఈవెంట్‌కు వెళ్లడమే కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే పాలిట శాపమైంది. సదరు ఎమ్మెల్యే ఈవెంట్లో వేదికపై నుంచి కింద పడిపోవడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఆమె తలకు గాయం కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స జరుగుతోంది. ఇక, ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది.కేరళలోని కలూర్ స్టేడియంలో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమా థామస్ హాజరయ్యారు. ఈ క్రమంలో స్టేజీపై సదరు ఎమ్మెల్యే నిర్వాహకులు, కార్యక్రమానికి వచ్చిన వారితో మాట్లాడుతున్నారు. అనంతరం, కుర్చీలో నుంచి లేచి పక్కకు వెళ్లే సమయంలో ఆమె.. వేదికపై నుంచి జారి పడ్డారు. ఈ సమయంలో నేల మీద కాంక్రీట్ స్లాబ్‌కు తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తీవ్ర రక్తస్రావం అయింది.అయితే, వేదిక ఎత్తు దాదాపు 15 అడుగులు ఉండటంతో ఎమ్మెల్యే తలకు, ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. అలాగే, గర్భాశయం, వెన్నెముకలో గాయాలు కూడా అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్‌పై వైద్యం జరుగుతోందని.. ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగైనట్టు వైద్యులు వెల్లడించారు. తన వద్దకు వచ్చిన వారిని గుర్తించి, ఆమె మాట్లాడుతున్నారని వైద్యులు తెలిపారు.Footage of MLA Uma Thomas falling from the stage at Kaloor JLN Stadium is now out.#umathomas #kochi #kerala pic.twitter.com/xW7saafNEw— Sreelakshmi Soman (@Sree_soman) January 2, 2025ఇదిలా ఉండగా.. ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా బయటకు వచ్చింది. వేదిక ఏర్పాటు విషయంలో నిర్వాహకుల నిర్లక్ష్యం, తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు తెలిపారు. కార్యక్రమం నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. The site where MLA Uma Thomas fell at the Kaloor stadium and the visuals from the dance event that took place.@NewIndianXpress video by @sanesh_TNIE@MSKiranPrakash @PaulCithara #UmaThomas #Kaloor #Kochi #Kerala pic.twitter.com/odr6oj98y8— TNIE Kerala (@xpresskerala) December 29, 2024 -
వాడో వికృత జీవి, చచ్చేదాకా జైల్లోనే!
అమాయకులైన మైనర్బాలికలను మభ్యపెట్టి అత్యంత అమానుషంగా అత్యాచారాలకు పాల్పడుతున్న వైనానికి అద్దం పట్టిన ఘటన ఇది. అంతేకాదు సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను నమ్మడం, ప్రయాణాల్లో అపరిచితుల మాటలకు మోసపోవడం వల్ల జరిగే అనర్థాలకు నిదర్శనం కూడా. అసలు స్టోరీ ఏంటంటే..! వివరాలు ఇలా ఉన్నాయిఅది 2021, అక్టోబరు 18.. ఒక టీనేజ్ బాలికను మాయ చేసి, నీచాతి నీచంగా అత్యాచారానికి పాల్పడిన ఘటనకు మౌన సాక్ష్యంగా నిలిచిన రాత్రి అది. ఈ కేసులో నేరస్తుడు పేరు 35 ఏళ్ల మహమ్మద్ సాదిక్ ఖత్రీ. ఏడు నెలలకు తనతో షేర్ చాట్‌లో మాట్లాడుతున్న స్నేహితుడిని కలవడానికి ముంబై బయలుదేరింది 16 ఏళ్ల బాధిత బాలిక. వల్సాద్‌లోని పార్డి తాలూకాలో నివసిస్తుంది . మహారాష్ట్రలోని భివాండికి చెందిన అబ్బాయితో షేర్‌చాట్‌లో పరిచయమైంది. ఇద్దరూ ఏడు నెలల పాటు మాట్లాడుకున్నారు. తనను కలవాలని పట్టుబట్టడంతో ముంబైకి బయలుదేరింది. ఇక్కడే అమాయకంగా, బెరుకు బెరుకుగా కనిపించిన ఆ ‘లేడిపిల్ల’ పై కన్నేశాడు సాదిక్. ఆమెతో మాట కలిపి మాయ చేశాడు. బాలికను నమ్మించాడు.వసాయ్ రైలు స్టేషన్లో ఆగినప్పుడు, అతను ఆమెను బలవంతంగా రైలు నుండి దింపేశాడు. ముంబైకి తాను దగ్గరుండి తీసుకెడతానంటూ హామీ ఇచ్చాడు. వెనుకా ముందూ ఆలోంచకుండా అతగాడిని నమ్మడమే ఆమె జీవితంలో తీరని బాధను మిగిల్చింది. ఖత్రీ బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. సెక్స్ ఉద్దీపన మాత్రలు వేసుకొని మరీ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఐదు గంటల్లో మూడుసార్లు అత్యాచారం చేశాడు. ఆ తరువాత బాలికను అక్కడే వదిలేసి పారి పోయాడు. చివరకు ఆమె తన బంధువుకు సమాచారం ఇవ్వడంతో విషయం పోలీసులదాకా వెళ్లింది. ఫిర్యాదు అందిన వెంటనే నవ్సారి రూరల్ పోలీసులు అక్టోబర్ 24న ఖత్ర్ అరెస్టు చేశారు. ఆ సమయంలో అతని దగ్గర సిల్డెనాఫిల్ డ్రగ్స్ దొరికాయి. అతని దుస్తులపై రక్తపు మరకలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఘటనా స్థలంలో పోలీసులు ఫోరెన్సిక్ బృందం బాలిక జుట్టుతో పాటు ,హెయిర్‌పిన్ తదితర కీలక సాక్ష్యాలను కూడా సేకరించింది. దీంతో ప్రాసిక్యూషన్ సాదిక్‌ను నేరస్తుడిగా తేల్చింది. తన కామాన్ని నెరవేర్చుకోవడానికి ఈ కేసు నిస్సహాయులను లేదా మైనర్లను వేటాడే వికృత మనస్తత్వాన్ని ప్రదర్శించిన వైనమని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. సాదిక్‌కు చివరి శ్వాసదాకా జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. ఇలాంటి కేసుల (మైనర్ బాలికపై అత్యాచారం కేసు) విచారణ సందర్భంగా న్యాయస్థానం శిక్షాస్మృతిలో మెతక వైఖరిని అవలంబించకూడదని కోర్టు పేర్కొంది. అంతేకాదు బాధితురాలు తరచూ తల్లిదండ్రులకు, పోలీసులకు, న్యాయవాదులకు, కోర్టుకు తాను పడిన శారీరక బాధను, కష్టాన్ని అనేకసార్లు వివరించవలసి వస్తుంది, ఇది ఆమెకు తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందని కూడా, సున్నితంగా వ్యవహరించాలని కూడా కోర్టు సూచించింది. సమాజంలో మైనర్లపై లైంగిక వేధింపుల కేసులు పెరుగు తున్నప్పుడు, బాధితుల బాధను, ఆవేదనను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. -
పల్లెటూరి కుర్రాడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు..!: మోదీ
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బడిలో పాఠాలు చదువుకునే రోజుల్లో గురుద్వారలో కీర్తనలు పాడేవాడు దిల్జిత్ దోసాంజ్. తర్వాత ఆ గొంతే అతడికి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది. పంజాబీ, హిందీ ఇండస్ట్రీలో సింగర్‌గా, నటుడిగానూ రాణిస్తున్నాడు. అంతేగాదు ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'లో 'భైరవ ఏంథమ్' పాటని కూడా పాడారు. ఆయన పాటలకు సాధారణ ప్రజలే కాదు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభిమానే. ఇటీవల ఆయనకు దిల్జిత్ దోసాంజ్‌ని కలుసుకునే అవకాశం లభించింది. ఆ మధర క్షణానికి సంబంధించిన వీడియోని న్యూ ఇయర్ రోజున పోస్ట్ చేస్తూ తమ మధ్య జరిగిన సంభాషణను పంచుకున్నారు. ఆ వీడియోలో..గాయకుడు దిల్జిత్ ప్రధాని మోదీని ప్రశంసించారు. మోదీ తన తల్లి గంగానది గురించి మాట్లాడిన విధానం అందరినీ కదిలించింది అని దోసాంజ్ అన్నారు. ఆ తర్వాత మోదీ దోసాంజ్‌ని "మీ తల్లిదండ్రులు పెట్టిన దిల్జిత్(హృదయాల విజేత) అనే పేరుని సార్థకం చేసుకునేలా జీవస్తున్నారని అభినందించారు. ఒక పల్లెటూరు కుర్రాడు నేడు ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చకున్నాడు". అని ప్రశంసించారు. అంతేగాదు దోసాంజ్‌ని సదా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మనసులను గెలుచుకుంటూనే ఉన్నారని అన్నారు. ఇక ఆ సంభాషణలో దోసాంజ్ చిన్నప్పుడు పుస్తకాల్లో భారతదేశం ఎంతో గొప్పదని మాత్రమే చదువకున్నాను, కానీ అలా ఎందుకంటారనేది తాను దేశమంత పర్యటించినప్పుడే తెలిసిందన్నారు. అందుకు ప్రతిస్పందనగా ప్రధాని మోదీ అతి పెద్ద భారతవని మనకొక బలం, పైగా ఇది అత్యంత శక్తిమంతమైన సమాజం అని అన్నారు. ఆ సమావేశంలో ఇరువురు సంగీతం, యోగా ప్రయోజనాలు గురించి మాట్లాడారు. అనంతరం గాయకుడు గురునానక్‌పై భక్తి గీతాన్ని ఆలపించారు. A great interaction with Diljit Dosanjh! He’s truly multifaceted, blending talent and tradition. We connected over music, culture and more… @diljitdosanjh https://t.co/X768l08CY1— Narendra Modi (@narendramodi) January 1, 2025 ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ మారింది. కాగా,మోదీ, దోసాంజ్‌లు సోషల్ మీడియా ఎక్స్‌లో ఈ సమావేశం గురించి రాశారు. మోదీ దోసాంజ్‌ని ప్రతిభను, సంస్కృతిని మిళితం చేశాడని రాయగా, దోసాంజ్ ఇది మరుపురాని సమావేశం అని, సంగీతం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నామని రాశారు. View this post on Instagram A post shared by Narendra Modi (@narendramodi) (చదవండి: ఇంతులు ధరించడం వల్లే వెయిట్ పెరిగేది..!) -
అర్థ, పూర్ణ, మహాకుంభమేళాల్లో తేడాలేమిటి?.. ఈసారి ఎందుకంత ప్రత్యేకం?
ప్రపంచంలోని హిందువులంతా ఎంతో పవిత్రమైనదిగా భావించే మహాకుంభమేళా ఈనెల(జనవరి)లోనే జరగనుంది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరిగే మహాకుంభమేళాకు ముమ్మర సన్నాహాలు జరుగుతున్నాయి. మహాకుంభమేళా 2025, జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ జరగనుంది. ఈసారి మహాకుంభమేళాను అత్యంత భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఈ మేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి, పుణ్యస్నానాలు చేయనున్నారు.కుంభమేళా అనేది అర్థకుంభమేళా, పూర్ణకుంభమేళా, మహాకుంభమేళా అనే వర్గాలుగా జరుగుతుంటుంది. ఈ మూడూ వేర్వేరు సమయాల్లో జరుగుతాయి. దీని వెనుక ప్రత్యేక కారణం కూడా ఉంది. దేశంలోని నాలుగు ప్రదేశాలలో కుంభమేళా జరుగుతుంటుంది. వీటిలో హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్‌రాజ్‌లున్నాయి. కుంభమేళా సమయంలో భక్తులు గంగా, గోదావరి, క్షిప్రా నదులలో భక్తిప్రపత్తులతో పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ప్రయాగ్‌రాజ్‌లో త్రివేణి సంగమంలో భక్తులు పుణ్య స్నానాలు చేస్తారు.ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే మేళాను అర్ధ కుంభమేళా అంటారు. ఇది యూపీలోని ప్రయాగ్‌రాజ్, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లలో మాత్రమే జరుగుతుంది. ఈ అర్థకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేస్తారు. పూర్ణ కుంభమేళా విషయానికొస్తే ఇది ప్రతీ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమ తీరంలో జరుగుతుంది.గతంలో అంటే 2013లో పూర్ణకుంభమేళా జరిగింది. ఇప్పుడు 2025లో మరో పూర్ణ కుంభమేళా వచ్చింది. అయితే దీనికి మహాకుంభమేళా అనే పేరుపెట్టారు. దీని వెనుక ఒక కారణం కూడా ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో 12 సార్లు పూర్ణ కుంభమేళా జరిగిన దరమిలా ఇప్పుడు మరోమారు జరుగుతున్నందున దీనికి మహాకుంభమేళా అనే పేరు పెట్టారు. పూర్ణ కుంభమేళా 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుండగా, 12 పూర్ణకుంభమేళాల తరువాత మహాకుంభమేళా వస్తుంది. ఇది కూడా చదవండి: భోపాల్ దుర్ఘటన: 40 ఏళ్ల తర్వాత విషపూరిత వ్యర్థాల తరలింపు -
వాట్సాప్‌లో మునిగిపోవడం వల్లే ఘోరం!
తిరువనంతపురం: కేరళ కన్నూరు స్కూల్ బస్సు ప్రమాదం ఘటనలో విస్తుపోయే విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలోనే.. డ్రైవర్ ఫోన్ నుంచి వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయ్యి ఉంది. దీంతో డ్రైవర్ ఫోన్లో మునిగిపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.కన్నూరు జిల్లా వలక్కై శ్రీస్కంధపురం వద్ద బుధవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేట్ స్కూల్‌కు చెందిన బస్సు ఒకటి బోల్తాపడడంతో ఓ చిన్నారి మృతి చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి బస్సు కిటీకిలోంచి చిన్నారి బయట ఎగిరిపడగా.. ఆ వెంటనే బస్సు ఆమె మీద పడడంతో చిధ్రమయ్యింది. కలవరపరిచే ఆ దృశ్యాలు సోషల్ మీడియాకు చేరాయి.#Kerala : A tragic accident occurred in Valakkai, Sreekantapuram, #Kannur, when a school bus belonging to Chinmaya School overturned, claiming the life of an 11-year-old student and injuring 13 others.The deceased, Nedya S Rajesh, a Class 5 student, lost her life after falling… pic.twitter.com/csNHtZAiv3— South First (@TheSouthfirst) January 1, 2025అయితే నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వాదనను డ్రైవర్ నిజాం తోసిపుచ్చాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను.. తాను బస్సు నడుపుతూ ఫోన్ వాడలేదని.. ఎలాంటి వాట్సాప్ స్టేటస్(Whatsapp Status) అప్లోడ్ చేయలేదని.. బహుశా ఫోన్ టచ్ అయ్యి అలా జరిగి ఉంటుందని చెబుతున్నాడు. అంతేకాదు బస్సు బ్రేకులు పడకపోవం వల్లే యాక్సిడెంట్ జరిగిందని అంటున్నాడతను. అయితే.. యాక్సిడెంట్ టైంకే డ్రైవర్ వాట్సాప్ స్టేటస్ అప్లోడ్ అయిన విషయాన్ని స్థానిక చానెల్స్ ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.ఇక బస్సును పరిశీలించిన మోటార్ వెహికిల్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఆ డ్రైవర్ వాదనను కొట్టిపాస్తున్నారు. బ్రేకులు కండిషన్లోనే ఉన్నాయని చెబుతున్నారు. అలాగే బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ కిందటి నెల డిసెంబర్ 29తో ముగియగా.. తిరిగి ఈ ఏడాది ఏప్రిల్ దాకా రెన్యువల్ అయినట్లు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం(Driver Negligence) వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. మరోవైపు..స్థానికులు మాత్రం సర్వీస్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లే ప్రమాదకరమైన మలుపు కారణంగానే ఈ ఘోరం జరిగిందని, తరచూ ఇక్కడ పలు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతుండడం గమనార్హం.అప్పటికే ఆలస్యమైంది..శ్రీస్కంధపురం స్కూల్ బస్సు ప్రమాదం(School Bus Accident)లో చనిపోయిన స్టూడెంట్ను ఐదో తరగతి చదువుతున్న నెద్యా రాజేష్(11)గా గుర్తించారు. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడికి చేరుకున్న స్థానికులు పిల్లలను బయటికి తీసుకొచ్చి ఆస్పత్రికి తరలించారు. అయితే.. బస్సు కింద నలిగిపోయిన నెద్యాను మాత్రం కాస్త ఆలస్యంగా గుర్తించినట్లు చెబుతున్నారు వాళ్లు.‘‘పెద్ద శబ్దం రాగానే ఇక్కడున్న కొందరం పరిగెత్తాం. బోల్తా పడ్డ బస్సులోంచి పిల్లల రోదనలు వినిపించాయి. వాళ్లను బయటకు తీసి నీళ్లు తాగించాం. డ్రైవర్ సహా పిల్లల్లో కొందరికి గట్టి దెబ్బలే తగలడంతో వెంటనే ఆస్పత్రికి తరలించాం. కానీ, ఓ అమ్మాయి బస్సు కిందే ఉందన్న విషయం కాసేపటికి తెలిసింది. ఆమెను బయటకు తీసేసరికి బాగా రక్తం పోయి స్పృహ లేకుండా ఉంది. ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది’’ అని స్థానికుడొకరు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 15 మందికి చికిత్స అందుతుండగా.. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
భోపాల్ దుర్ఘటన: 40 ఏళ్ల తర్వాత విషపూరిత వ్యర్థాల తరలింపు
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గ్యాస్ దుర్ఘటన జరిగిన నలభై ఏళ్ల తర్వాత అక్కడి విషపూరిత వ్యర్థాలను తరలించారు. బుధవారం రాత్రి యూనియన్ కార్బైడ్ ఫ్యాక్టరీ నుంచి దాదాపు 377 టన్నుల విషపూరిత వ్యర్థాలను పారవేయడం కోసం తీసుకెళ్లారు. భోపాల్‌కు 250 కిలోమీటర్ల దూరంలోని ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి 12 సీల్డ్ కంటైనర్ ట్రక్కుల్లో విషపూరిత వ్యర్థాలను తరలించారు.1984, డిసెంబరు 2- 3 తేదీల మధ్య భోపాల్‌లోని యూనియన్ కార్బైడ్ పురుగుమందుల కర్మాగారం(Union Carbide Pesticide Factory) నుండి అత్యంత విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ)వాయువు లీకైంది. ఈ ప్రమాదంలో 5,479 మంది మృతిచెందారు. వేలాది మంది అంగవైకల్యానికి గురయ్యారు. భోపాల్ దుర్ఘటన ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక విపత్తులలో ఒకటిగా పరిగణిస్తారు.12 trucks carrying 337 tonnes of toxic waste from the Union Carbide factory in Bhopal, stored for 40 years, left at 9:05 p.m. for Pithampur near Indore. The waste is expected to arrive early on January 2nd, following a 250-km green corridor with heavy security. 📹@MehulMalpani pic.twitter.com/zU78cVRE85— The Hindu (@the_hindu) January 1, 2025భోపాల్ గ్యాస్ ట్రాజెడీ రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ స్వతంత్ర కుమార్ సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ 12 కంటైనర్ ట్రక్కులు బుధవారం రాత్రి విషపూరిత వ్యర్థాలను తరలించేందుకు తీసుకువెళ్లాయన్నారు. ఈ వాహనాల తరలిపునకు గ్రీన్ కారిడార్(Green Corridor) రూపొందించారు. ఈ మార్గంలో ఈ వాహనాలు ఏడు గంటల్లో ధార్ జిల్లాలోని పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి చేరుకున్నాయి. వ్యర్థాలను ప్యాక్ చేసి, ట్రక్కుల్లో లోడ్ చేసేందుకు 30 నిమిషాల షిఫ్టుల్లో సుమారు 100 మంది పనిచేశారని స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. ఈ సిబ్బంది ఆదివారం నుంచి ఈ పనిలో నిమగ్నమయ్యాయని, పితంపూర్ పారిశ్రామిక ప్రాంతానికి తరలించిన ఈ వ్యర్థాలను కాల్చివేస్తామని తెలిపారు. కాగా భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను తొలగించనందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు ఇటీవల తన అసంతృప్తి వ్యక్తం చేసింది. అక్కడి విషపూరిత వ్యర్థాలను(Toxic waste) తరలించడానికి నాలుగు వారాల గడువు విధించింది. ఈ ఆదేశాలను పాటించకపోతే ధిక్కార చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది.గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఈ రోజు వరకు ఆ వ్యర్థాలు ఎంత విషపూరితం అనేది అర్థం చేసుకోవడంలో విఫలమయ్యామని చీఫ్ జస్టిస్ ఎస్కె కైట్, జస్టిస్ వివేక్ జైన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. కాగా పితంపూర్‌లోని వ్యర్థపదార్థాల యూనిట్లో తొలుత కొంత వ్యర్థాలను కాల్చివేస్తామని, వాటిలో ఇంకా ఏదైనా హానికరమైన పదార్ధం మిగిలి ఉందా లేదా అని తెలుసుకోవడానికి అవశేషాలను పరీక్షిస్తామని స్వతంత్ర కుమార్ సింగ్ తెలిపారు. విషపూరిత మూలకాల జాడలు లేవని నిర్ధారించిన తర్వాతనే ఆ బూడిదను రెండు పొరలతో కప్పి, మట్టిలోకి, నీటిలోకి చేరకుండా పూడ్చివేస్తామని అన్నారు.2015లో పీతాంపూర్లో 10 టన్నుల యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను ప్రయోగాత్మకంగా కాల్చివేయడం వల్ల సమీప గ్రామాల్లోని మట్టి, భూగర్భ జలాలు, నీటి వనరులు కలుషితమవుతున్నాయని స్థానికులు ఆరోపించారు. 1.75 లక్షల జనాభా ఉన్న పితాంపూర్‌లో యూనియన్ కార్బైడ్ వ్యర్థాలను పారవేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో జనం ఇటీవల నిరసన ప్రదర్శన చేపట్టారు.ఇది కూడా చదవండి: బోరుబావి ప్రమాదాలు.. ఒకసారి విఫలం.. మరోసారి సఫలం -
బోరుబావి ప్రమాదాలు.. ఒకసారి విఫలం.. మరోసారి సఫలం
రాజస్థాన్‌లో మరో బోరుబావి దుర్ఘటన చోటుచేసుకుంది. బోరుబావిలో పడిపోయిన చిన్నారి చేతన(3)ను రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. రెస్క్యూ సిబ్బంది 10 రోజుల ప్రయత్నాల అనంతరం ఆ చిన్నారిని విగతజీవిగా బయటకు తీసుకువచ్చారు. ఇటువంటి దుర్ఘటనలు గతంలోనూ అనేకం చోటుచేసుకున్నాయి.ప్రిన్స్ కుమార్ కశ్యప్ (హర్యానా) 2006లో హర్యానాలోని ఒక బోరుబావిలో పడిపోయిన ఐదేళ్ల ప్రిన్స్ కుమార్ కశ్యప్‌ను రక్షించేందుకు భారీ ఆపరేషన్ నిర్వహించారు. హర్యానాలోని కురుక్షేత్రలోని ఓ గ్రామంలో 55 అడుగుల లోతైన బోరుబావిలో ప్రిన్స్ పడిపోయాడు. దాదాపు 48 గంటల తర్వాత రెస్క్యూ సిబ్బంది ప్రిన్స్‌ను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. నాడు బాధిత బాలుడు సురక్షితంగా బయటపడాలని కాంక్షిస్తూ దేశవ్యాప్తంగా చాలామంది పూజలు, యజ్ఞాలు నిర్వహించారు.మహి(హర్యానా) 2012, జూన్‌లో హర్యానాకు చెందిన ఐదేళ్ల మహి తన స్నేహితులతో ఆడుకుంటూ 60 అడుగుల పాడుబడిన బోరుబావిలో పడిపోయింది. ఐదు రోజుల పాటు సైన్యం, జిల్లా యంత్రాంగం భారీ ప్రయత్నాలు చేసినప్పటికీ బాలికను రక్షించలేకపోయింది. ఒక భారీ రాయి రెస్క్యూ ఆపరేషన్‌కు అడ్డంకిగా నిలిచింది.సాయి బర్హతే (మహారాష్ట్ర)2017, మే నెలలో మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని కోపర్గావ్లో ఏడేళ్ల బాలుడు సాయి బర్హతే బోరుబావిలో పడిపోయాడు. రెస్క్యూ సిబ్బంది పలు ప్రయత్నాలు చేసినప్పటికీ బాలుడిని రక్షించలేకపోయారు.నదీమ్ (హర్యానా)2019, మార్చిలో హిసార్ జిల్లాలోని బల్సామంద్ గ్రామంలో 55 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో ఒకటిన్నర ఏళ్ల బాలుడు నదీమ్ పడిపోయాడు. ఎన్డీఆర్ఎఫ్, సైన్యం విభాగాల 48 గంటల సుదీర్ఘ ఆపరేషన్ తర్వాత బాలుడిని రక్షించారు. బోరుబావికి సమాంతర గొయ్యి తవ్వడం కోసం దాదాపు 40 జేసీబీ యంత్రాలను వినియోగించారు. 150 మంది పోలీసులతో పాటు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 100 మంది సిబ్బంది సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.సీమ (రాజస్థాన్)2019, మే నెలలో జోధ్‌పూర్‌లోని మెలానా గ్రామంలో 440 అడుగుల లోతైన బోరుబావిలో సీమ అనే నాలుగేళ్ల బాలిక పడిపోయింది. 260 అడుగుల లోతులో ఇరుక్కుపోయిన చిన్నారిని బయటకు తెచ్చేందుకు 14 గంటల ఆపరేషన్ చేపట్టినా ఫలితం లేకపోయింది. బాలిక మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చారు. బాలిక తండ్రి మరమ్మతుల కోసం బోరుబావిని తెరిచి ఉంచిన కారణంగా ప్రమాదం చోటుచేసుకుంది. ఫతేవీర్ సింగ్ (పంజాబ్)2019, జూన్‌లో రెండేళ్ల ఫతేవీర్ సింగ్ ఆడుకుంటూ 120 అడుగుల లోతైన బోర్‌వెల్‌లో పడిపోయాడు. 109 గంటలపాటు రెస్క్యూ ఆపరేషన్ చేసినప్పటికీ, బాలుడిని రక్షించలేకపోయాడు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎన్డిఆర్ఎఫ్ భారీ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినప్పటికీ, ప్రయోజనం లేకపోయింది. అధికారులు బాధిత చిన్నారికి ఆక్సిజన్ సరఫరా చేయగలిగినప్పటికీ, ఆహారం లేదా నీరు అందించలేకపోయారు.రితేష్ జవాసింగ్ సోలంకి (మహారాష్ట్ర)2021 నవంబర్‌లో ఆరేళ్ల బాలుడు రితేష్ జవాసింగ్ సోలంకి 200 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బందికి 16 గంటల సమయం పట్టింది.గుజరాత్2022 జూన్ 9న, గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాలోని వ్యవసాయ క్షేత్రంలో రెండేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. సైన్యం, అగ్నిమాపక దళం, పోలీసులు, ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమై బాలుడిని రక్షించగలిగారు.పంజాబ్2022, మే 22న పంజాబ్‌లోని హోషియార్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో 100 అడుగుల లోతైన బోరుబావిలో ఆరేళ్ల బాలుడు పడిపోయాడు. తొమ్మిది గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించనప్పటికీ ఫలితం లేకపోయింది.సుప్రీంకోర్టు మార్గదర్శకాలు2009లో బోరుబావి ప్రమాదాలను అరికట్టేందుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను జారీ చేసింది. 2010లో వీటిని సవరించింది. వీటిలో బోరుబావి నిర్మాణ సమయంలో బావి చుట్టూ ముళ్ల కంచెను ఏర్పాటు చేయడం, బావి అసెంబ్లీపై బోల్ట్‌లతో స్టీల్ ప్లేట్ కవర్లను అమర్చడం, బోరుబావి పాడయినప్పుడు దానిని మూసివేయడం మొదలైనవి ఉన్నాయి. ఇది కూడా చదవండి: New Year 2025: ఇకపై పుట్టేవారంతా ‘బీటా బేబీస్’ -
పెళ్లైన ఆటో డ్రైవర్‌తో యువతి ప్రేమ.. చివరకు
తిరువళ్లూరు: వివాహితుడితో ప్రేమ వ్యవహరం నడుపుతున్న కుమార్తెను తల్లిదండ్రులు మందలిండంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు..తిరువళ్లూరు జిల్లా తన్నీర్‌కులం రామాపురం గ్రామానికి చెందిన శివకుమార్ కుమార్తె ఆర్తి (21). ఈమె చైన్నె భక్తవత్సలం మహిళ కళాశాలలో డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతోంది. కాగా ఆర్తికి అదే ప్రాంతంలో ఆటో డ్రైవర్ అయిన వివాహితుడైన వ్యక్తితో గత రెండేళ్ల నుంచి ప్రేమ వ్యవహరం నడుపుతున్న తెలుస్తోంది. వీరి ప్రేమ వ్యవహరం ఇద్దరి ఇంటి పెద్దలకు తెలియడంతో మందలించినట్లు తెలుస్తోంది. దీంతో యువతి మంగళవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన బంధువులు ఉరికి వేలాడుతున్న యువతిని కిందకు దింపి స్థానికంగా ఉన్న ప్రైవేటు వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. ఈ ఘటనపై తాలుకా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. కాగా ఆటో డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని మహిళ పోలీసులకు యువతి బంధువులు ఫిర్యాదు చేశారు. -
‘రక్షణ’లో సంస్కరణలు
న్యూఢిల్లీ: 2025ను రక్షణ సంస్కరణల ఏడాదిగా కేంద్రం ప్రకటించింది. త్రివిధ దళాల ఆధునీకరణ, మెరుగైన సమన్వయం, నిరంతర యుద్ధ సన్నద్ధతతో పాటు ఆధునిక పరిజ్ఞానాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవడం తదితరాలే లక్ష్యంగా నూతన సంవత్సరంలో రక్షణ శాఖ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ఇందుకోసం 9 సూత్రాలతో కూడిన సమగ్ర రక్షణ సంస్కరణల ప్రణాళికను రూపొందించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సారథ్యంలో బుధవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఇందుకు ఆమోదముద్ర పడింది. త్రివిధ దళాధిపతులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు తదితరులు భేటీలో పాల్గొన్నారు. 21వ శతాబ్దపు సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ దేశ భద్రతకు, సార్వ భౌమత్వ పరిరక్షణకు పెద్దపీట వేసేలా కనీవినీ ఎరగని రీతిలో త్రివిధ దళాలను సన్నద్ధం చేసేందుకు ఈ సంస్కరణలు బలమైన పునాదులు వేస్తాయని రాజ్‌నాథ్ వెల్లడించారు. త్రివిధ దళాల సంయుక్త కమాండ్ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీ సామర్థ్యాలను మరింతగా ఏకీకృతం చేయడం ద్వారా యుద్ధ సమయాల్లో, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో రక్షణ వనరులను గరిష్ట స్థాయిలో వినియోగించుకోవాలని రక్షణ శాఖ భేటీ అభిప్రాయపడింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ సంయుక్త సైనిక కమాండ్లు ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి కమాండ్లోనూ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో కూడిన యూనిట్లు ఉంటాయి. ఆయా ప్రాంతాల్లోని భద్రతాపరమైన సవాళ్లు తదితరాలను తిప్పికొట్టేందుకు పూర్తి సమన్వయంతో సాగుతాయి. ఈ త్రివిధ దళాలు ఇప్పటిదాకా విడివిడిగా కమాండ్ల కింద వేటికవే స్వతంత్రంగా పని చేస్తూ వస్తున్నాయి. అవి పరస్పరం మరింత సమన్వయంతో పని చేయాల్సిన అవసరం చాలా ఉందని భేటీ అభిప్రాయపడింది. 9 సూత్రాల రక్షణ సంస్కరణ ప్రణాళికలో ముఖ్యాంశాలు...→ దేశీయ రక్షణ సామర్థ్యం ప్రపంచ స్థాయి ప్రమా ణాలను అధిగమించే దిశగా నిరంతర కృషి. అందుకోసం బలగాల అవసరాలను ఎప్పటి కప్పు డు గుర్తించడం, వాటిని యుద్ధ ప్రాతిపది కన తీర్చడం.→ ఇందుకోసం రక్షణ సంబంధిత కొనుగోళ్లు, ఆయుధ సేకరణ ప్రక్రియలను వీలైనంతగా సరళతరం చేయడం, వాటిలో అనవసర జాప్యాలను నివారించడం.→ ప్రపంచవ్యాప్తంగా పలు ఆధునిక సైనిక శక్తుల్లోని అత్యుత్తమ విధానాలను అందిపుచ్చుకోవడం, వాటిని మన పరిస్థితులకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకోవడం→ భారతీయ సంస్కృతి, ఆలోచనా ధోరణులను గర్వకారణంగా చర్యలు చేపట్టడం→ సైబర్, స్పేస్‌తో పాటు ఏఐ, మెషీన్ లెర్నింగ్, హైపర్సోనిక్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీలకు పెద్దపీట→ రక్షణ రంగంలో భావి సంస్కరణలకు మరింతగా ఊతం. తద్వారా భద్రతా దళాలను మరింత శక్తిమంతంగా, సాంకేతికంగా సాటి లేని శక్తిగా మార్చడం. భిన్నమైన డొమైన్లలో సమగ్ర కార్యకలాపాలను అత్యంత సమర్థంగా నిర్వహించగలిగేలా తీర్చిది ద్దడం.→ రక్షణ, పౌర, ప్రైవేటు రంగాల మధ్య మరింతగా పరిజ్ఞాన బదిలీకి వీలు కల్పించడం. వ్యాపార సరళీకరణ కోసం ప్రభుత్వ– ప్రైవేట్ భాగస్వా మ్యాలకు ప్రోత్సాహం.→ రాబోయే కొన్నేళ్లలో రక్షణ ఎగుమతుల్లో భారత్‌ను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చి దిద్దడం. విదేశీ తయారీదారులతో భారత రక్షణ పరిశ్రమ సంయుక్తంగా పరిశోధన, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు చేయూత.→ మాజీ సైనికుల సంక్షేమంపై మరింత దృష్టి. వారి అనుభవానికి పెద్దపీట. -
కొత్త ఏడాదిలో... ఇలా చేద్దాం!
న్యూ ఇయర్‌ను ‘హ్యాపీ’గా మలచుకునే మార్గాలు కాలం ఒక మాయాజాలం. కళ్లముందే కరిగిపోతుంది. ఒడిసిపట్టేందుకు ఎంత ప్రయత్నించినా వేలి సందుల గుండా ఇట్టే జారిపోతుంది. ఆ క్రమంలో మరో ఏడాది చూస్తుండగానే కరిగిపోయింది. తీపి, చేదు అనుభవాలను మిగిల్చి 2024 చరిత్ర పుటల్లోకి జారుకుంది. కొత్త ఆశలను, సరికొత్త ఆకాంక్షలను మోసుకుంటూ 2025 వచ్చేసింది. బద్ధకం వదిలించుకుంటామని, ఇంకోటని, మరోటని... ఇలా న్యూ ఇయర్ అంటేనే ఎన్నో తీర్మానాలు, మనకు మనమే చేసుకునే వాగ్దానాలు. ఇటు చేసే పనిని, అటు ఈదే సంసారాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంటిల్లిపాదితో పాటు మన ఆరోగ్యమూ జాగ్రత్తగా చూసుకోవాలి. పెట్టుకున్న లక్ష్యాలన్నింటినీ సాధించేయాలి. కొత్త అభిరుచులు పెంచుకోవాలి. మొత్తమ్మీద వీలైనన్ని ఆనందమయ క్షణాలను ఒడిసిపట్టుకోవాలి. ఇలాంటివన్నీ ఎవరికైనా ఉండే ఆశలే. ఇవన్నీ తీరి 2025 ఆసాంతం హాయిగా సాగేందుకు ఏమేం చేయాలంటే..!ఆందోళనకు చెక్ ఆధునిక జీవన విధానం పుణ్యమా అని అప్పుడప్పుడు ఒత్తిళ్లు ఎవరికైనా ఉండేవే. కానీ రోజులో చాలాభాగం ఆందోళన మధ్యే గడుస్తోందంటే మాత్రం డేంజరే. కాస్త ఆగి, అర్థం చేసుకునే లోపే పూడ్చుకోలేనంత నష్టం జరిగిపోతుంటుంది. కనుక మనసును కుంగదీసే ఆలోచనల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు నిష్పాక్షికంగా మదింపు చేసుకుంటూ ఉండాలి. ఇందుకోసం వారానికోసారి కొంత సమయాన్ని ప్రత్యేకించుకోవాలి. ప్రథమ కోపం వంటివేమైనా పెరుగుతున్నాయా అని ఒకటికి రెండుసార్లు పరిశీలించి చూసుకోవాలి. ఆ లక్షణాలు కనిపిస్తే మొదట్లోనేవదిలించుకోవాలి. లేదంటే ఆఫీసులోనూ, ఇంట్లోనూ లేనిపోని సమస్యలు నెత్తిన పడటం ఖాయం. లేదంటే నచ్చనిది, ఊహించనిది జరిగితే వెంటనే అరిచేసి అవతలి వారిని గాయపరచడం లాంటివి పెరిగిపోతాయి. ఇది సంబంధాలను సరిచేయలేనంతగా దెబ్బ తీస్తుందని గుర్తుంచుకోవాలి. అది ఆఫీసైనా కావచ్చు, ఇల్లయినా కావచ్చు. అయితే ఎంత ప్రయత్నించినా మనమూ మనుషులమే గనుక ఎప్పుడైనా నోరు జారవచ్చు. అప్పుడు పరిస్థితిని చక్కదిద్దేందుకు మీరే చొరవ తీసుకోండి. అవసరమైతే అవతలి వారికి సారీ చెప్పినా తప్పు లేదు. అది మీకు నామర్దా అని అస్సలు అనుకోవద్దు. అవతలి వారి దృష్టిలో వ్యక్తిగా మిమ్మల్ని మరో మెట్టు ఎక్కిస్తుందని తెలుసుకోండి. మంచి సావాసం మీకన్నా తెలివైన వారితో, మంచివారితో వీలైనంత ఎక్కువగా గడపండి. తెలివైనవారి సాహచర్యంలో తెలియకుండానే బోలెడు విషయాలు నేర్చుకుంటారు. మంచివారు ఆచరించి చూపే జీవిత విలువలు మనకు దారి చూపే దీపాలవుతాయి. వాటిని ఎంతగా అలవర్చుకుంటే అహంకారం వంటి అవలక్షణాలు అంతగా అణగుతాయి. మానసిక ప్రశాంతతకు, నిజమైన తృప్తికి బాటలు పడతాయి. బద్ధకానికి బై బై బద్ధకాన్ని వదలించుకుందాం. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా దీన్ని న్యూ ఇయర్ తీర్మానాల చిట్టాకు పరిమితం చేయకండి. ఈ క్షణం నుంచే ఆచరణలో పెట్టండి. దీన్నొక్కదాన్ని దూరం చేసుకుంటే చాలా సమస్యలు పరిష్కారమైనట్టేనని గుర్తుంచుకోండి. మెదడును ఖాళీగా ఉంచకపోవడమే ఈ సమస్యకు పరిష్కారం. ఏఐ వంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోండి. వృత్తి సంబంధ నైపుణ్యాలను మెరుగుపెట్టుకోండి. అది మీ ఆత్మవిశ్వాసాన్నీ అమాంతంగా పెంచేస్తుంది. నిత్యం ఏదో ఒక కొత్త విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే అటు బద్ధకమూ వదులుతుంది. ఇటు చక్కని ఐడియాలూ పుట్టుకొస్తాయి. రెండిందాలా లాభమే. ఇతరులకు సాయపడదాం ప్రతిఫలం ఆశించకుండా చేసే సాయం వల్ల కలిగే ఆత్మసంతృప్తి అంతా ఇంతా కాదు. అది ఎన్ని వేలు, లక్షలు ఖర్చు చేసినా దొరికేది కాదు. మనకిష్టమైన వారికి సాయపడటం పెద్ద విషయమేమీ కాదు. మీకిష్టం లేని వారికి అవసరాల్లో సాయపడితే మనిíÙగా మరో మెట్టు ఎక్కినట్టే. ఇతరుల్లోని మంచిని గుర్తించడం, అభినందించడం అలవాటుగా మార్చుకుంటే మన సాన్నిధ్యాన్ని అంతా ఇష్టపడతారు. పరిష్కారాలు సూచిద్దాం ఎప్పుడూ సమస్యలను ఎత్తిచూపడం కాదు. అది అందరూ చేసేదే. ఇంతకాలంగా మనమూ చేస్తూ వస్తున్నదే. వాటికి ఆచరణసాధ్యమైన పరిష్కారాలను సూచించే ధోరణి అలవర్చుకుందాం. మొదట్లో కాస్త కష్టమే అనిపించినా మనల్ని అందరికీ అత్యంత ఇషు్టలను చేస్తుందిది. ముఖ్యంగా ఆఫీసుల్లో మేనేజర్ వంటి పొజిషన్లలో ఉంటే ఈ ఒక్క అలవాటుతో సహోద్యోగులందరి మనసూ ఇట్టే గెలుచుకోవచ్చు. వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి వాళ్లకు సలహాలివ్వడమే గాక ఎప్పటికప్పుడు తోడు నిలిస్తే వాళ్లకూ బాగుంటుంది. మనకూ తృప్తిగా ఉంటుంది. సంస్థా లాభపడుతుంది. అలా ఆల్ హ్యాపీసే. చిన్న విజయాలనూ ఆస్వాదిద్దాం విజయం సాపేక్షం. దానికి ఒక్కొక్కరూ ఒక్కో నిర్వచనమిస్తారు. భారీ లక్ష్యాలు సాధించినప్పుడు కలిగే విజయానందం గొప్పదే. కానీ దాని కోసమని ఆనందాన్ని అప్పటిదాకా వాయిదా వేసుకోవడమెందుకు? ఆ లక్ష్యాలను సాధించే క్రమంలో ఎదురయ్యే చిన్న చిన్న సాఫల్యాలను కూడా సెలబ్రేట్ చేసుకోవడాన్ని అలవాటుగా మార్చు కుందాం. అప్పుడిక ప్రతి రోజూ పండుగే. ఆత్మానందమూ ముఖ్యమే వ్యక్తిగత, వృత్తిగత, సాంసారిక సంతృప్తి చా లా ముఖ్యమే. కానీ ఆత్మానందం వీటన్నింటి కంటే విలువైనది. దాన్ని పొందేందుకు కూడా ఇప్పటినుంచే ప్రయత్నం మొ దలు పెడదాం.అంటే ఎకాయెకిన కఠోర ఆధ్యాత్మిక సాధనలు చేసి తీరాలని కాదు. ఏ కవిత్వం, సంగీతం వంటివాటితో లోపలి ప్రయాణాన్ని మెల్లిమెల్లిగా మొదలు పెట్టవచ్చు. నేనెవరిని అనే మూలాలోచన అంటూ ఒకటి మనసులో ఒక పక్కన సాగుతూ ఉంటే చాలు. ఆత్మాన్వేషణకు క్రమంగా బాటలు అవే పడతాయి. చివరగా, వీలైనంతగా నవ్వండి. మానసికంగా అది కలిగించే సానుకూల ప్రభావం అంతా ఇంతా కాదని ఎన్నెన్నో అధ్యయనాలు ముక్త కంఠంతో తేల్చాయి. మొహంపై చిరునవ్వు చెరగని వారికి ప్రతి క్షణమూ ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుస్తుంది. మరింకెందుకు ఆలస్యం?! ఈ క్షణమే రంగంలోకి దిగుదాం. బద్ధకాన్ని వదిలించుకుందాం. మనల్ని మనం నిత్యం సానబట్టుకుంటూ సాగుదాం. 2025ను మన జీవితంలోకెల్లా అత్యంత ఆనందమయమైన ఏడాదిగా మలచుకుందాం. అవసరాలకే జై కోర్కెలకు, కనీస అవసరాలకు చాలా తేడా ఉంది. ఆశలు అనంతమే గానీ ఆర్జన ఎప్పుడూ పరిమితమే. ఇదొక్కటి గుర్తుంచుకుంటే అవసరాలు, సౌకర్యాలు, ఆడంబరాలకు మధ్య స్పష్టమైన గీత గీయగలం. వేటిని తీర్చుకోవాలో, వేటిని దూరం పెట్టాలో, వేటిని వదిలించుకోవాలో తేల్చుకోవ డం తేలికవుతుంది. చాలా ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అనుకోని అవసరాల కోసం కొంత మొత్తం కూడా పక్కన పెట్టుకోగలుగుతాం. ఆర్థిక ప్రశాంతత ఎంత బావుంటుందో అనుభవంలోకి వస్తుంది.బంధాలే ముఖ్యం చిన్న పొరపాట్లకు బంధాలు తెంచుకునేదాకా వెళ్లకండి. ఇందుకోసం ప్రత్యేకించి ఏమీ చేయనక్కర్లేదు. అవతలివాళ్లు కూడా మనలాగే మామూలు మనుషులేనని, అప్పుడప్పుడు తప్పులు, పొరపాట్లు చేస్తుంటారని గుర్తుంచుకుంటే చాలు. క్షమించే గుణాన్ని పెంచుకుంటే ప్రపంచమంతా మరింత అందంగా మారుతుంది. ఎప్పుడో జరిగిన అవమానాలను, చేదు సంఘటనలను మనసులో మోయకండి. ఆ భారం నానారకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.సహోద్యోగులు కీలకం తిండీ, నిద్రా తదితరాలకు పోగా మన జీవితంలో మిగిలే నాణ్యమైన సమయంలో అత్యధిక భాగం గడిపేది కలిసి పనిచేసే సహోద్యోగులతోనే. వారితో సత్సంబంధాలు చాలా ముఖ్యమని గుర్తుంచుకోండి. చిన్నాచితకా కారణాలతో సహోద్యోగులతో కీచులాటలకు దిగకండి. అందుకోసం అవసరమైతే మీరే కాస్త తగ్గండి. తప్పేమీ లేదు. చక్కని పని వాతావరణం మన మానసిక, శారీరక ఆరోగ్యాలకు ఎంతో అవసరం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
జల్లికట్టు చిన్నారి పట్టు
‘జల్లికట్టు’ అంటే ఎద్దును లొంగదీసుకుని దాని కొమ్ములకున్న అలంకరణలను సొంతం చేసుకోవడం. జల్లికట్టు ఎద్దులకు ΄పౌరుషం ఎక్కువ. కొమ్ములకు వాడి ఎక్కువ. తమ మూపురాలను తాకనివ్వవు. అందుకే ఈ మనిషి–పశువు క్రీడ తరాలుగా తమిళనాడులో ఉంది. జల్లికట్టులో దించబోయే ఎద్దుకు తర్ఫీదు ఇస్తూ పదేళ్ల యజిని వార్తల్లోకి ఎక్కింది. రాబోయే సంక్రాంతికి యజిని.. ఎద్దు‘నన్బన్’ చాలా పెద్ద వార్తలనే సృష్టించనున్నాయి.రాబోయే‘΄పొంగల్’కి తమిళనాడులో జల్లికట్టు ధూమ్‌ధామ్‌గా జరగనుంది. మదురై, తంజావూరు, తిరుచిరాపల్లి తదితర ప్రాంతాల్లో ΄పొంగల్ నుంచి మొదలై వేసవి వరకు జల్లికట్టు పోటీలు జరుగుతూనే ఉంటాయి. అక్కడి పల్లెవాసులు కూడా వేలాదిగా వీటిలో పాల్గొంటారు. తమ ఎడ్లను తెచ్చి పాల్గొనేలా చేస్తారు. మన కోళ్ల పందేలకు కోడిపుంజులను తీర్చిదిద్దినట్టే ఇందుకై ఎడ్లనూ తీర్చిదిద్దుతారు. రైతు కుటుంబాల్లో తండ్రులు వారికి తోడు పిల్లలు ఈ పనిలో నిమగ్నమవుతారు. అలాంటి రైతు కూతురే పదేళ్ల వయసున్న యజిని.ఎద్దు– మనిషిమదురైలోని మంగులం అనే గ్రామంలో శ్రీనివాసన్ అనే రైతుకు రెండు ఎడ్లు ఉన్నాయి. వాటిలో ఒకదాన్ని జల్లికట్టులో పాల్గొనేలా చేస్తున్నాడు. ‘జల్లికట్టు’లో ‘జల్లి అంటే రెండు కొమ్ములకు అలంకరణ వస్త్రాలు ‘కట్టు’ అంటే కట్టడం. రెండు కొమ్ముల మధ్య వెండి లేదా బంగారు నాణేలు కూడా కడతారు. ఆటగాళ్లు పరిగెడుతున్న ఎద్దును తాకి, మూపురం పట్టి నెమ్మదించేలా చేసి ఆ అలంకరణలను, నాణేలను సొంతం చేసుకుంటారు. ఎన్ని సొంతం చేసుకుంటే అంత వీరుడిగా గుర్తింపు. అలాగే ఈ వీరులకు చిక్కకుండా వారి మీద కొమ్ము విసిరి తరిమికొడితే ఆ ఎద్దుకు అంతటి ఘనత. ‘మా ఎద్దు కూడా అంతటి గొప్పదే. చాలా మెడల్స్ సాధించింది’ అంటుంది యజిని.పాపకు స్నేహితుడుయజినికి ఐదేళ్లుండగా తండ్రి ఎద్దులను కొన్నాడు. వాటిలో ఒకదానికి యజిని‘నన్బన్’ (స్నేహితుడు) అనే పేరు పెట్టింది. రోజూ దానికి మేత వేయడం, నీళ్లు పెట్టడం, కబుర్లు చెప్పడం ఇదే పని. ‘నేను దగ్గరికి వెళితే ఏమీ చేయదు. పిలవగానే వచ్చేస్తుంది’ అంటుంది యజిని. గత మూడేళ్లుగా జల్లికట్టులో తండ్రితో పాటు నన్బన్ను తీసుకొని వెళుతోంది యజిని. ‘వాడివాసల్ (స్టార్టింగ్ పాయింట్) నుంచి మా నన్బన్ పరుగు అందుకోగానే చాలామంది ఆటగాళ్లు దాని మూపురం పట్టుకోవాలని, కొమ్ములు అందుకోవాలని ట్రై చేస్తారు. కాని మా నన్బన్ అందరి మీదా బుసకొట్టి దూరం పోయేలా చేస్తుంది. ఆట గెలిచాక బుద్ధిగా నా వెంట ఇంటికి వస్తుంది. ఆ ఎద్దు – ఈ ఎద్దు ఒకటేనా అన్నంత డౌట్ వస్తుంది’ అంటుంది యజిని.ట్రైనింగ్జల్లికట్టు కోసం ట్రైనింగ్ యజిని ఇస్తోంది తండ్రితో పాటు. జల్లికట్టులో పాల్గొనే ఎద్దును రోజూ వాకింగ్‌కి, స్విమ్మింగ్‌కి తీసుకెళ్లాలి. తడి నేలలో, మెత్తటి నేలలో కొమ్ములు గుచ్చి కొమ్ములు బలపడేలా చేయాలి. దీనిని ‘మన్ కుథల్’ అంటారు. ఇక మంచి తిండి పెట్టాలి. ఇవన్నీ యజిని చేస్తోంది. ‘నేను ఇంగ్లిష్ మీడియంలో చదువుకుంటున్నా. గవర్నమెంట్ జల్లికట్టు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎద్దుకు ఎటువంటి అపాయం కలక్కుండా రూల్స్ పెట్టింది. అందుకే నన్బన్ను నేను ధైర్యంగా పోటీకి తీసుకెళ్తా’ అంటోంది యజిని. -
10 రోజుల తర్వాత బోరుబావి నుంచి చేతన వెలికితీత
జైపూర్ : రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీ జిల్లాలో 10 రోజుల క్రితం బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి చేతనను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.గత డిసెంబర్ 23న మధ్యాహ్నం కోట్‌పుత్లీ జిల్లా కిరాత్‌పురా గ్రామానికి చెందిన చేతన ఆటలాడుకుంటూ ప్రమాదవశాత్తూ 700 అడుగుల బోరుబావిలో పడిపోయింది. 10 నిమిషాల తర్వాత బాలిక ఏడుపు విన్న కుటుంబ సభ్యులు బోరుబావిలో పరిశీలించారు. చేతన అందులో పడిపోయినట్లు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు చిన్నారిని వెలికి తీసేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేశాయి. ఓవైపు పైపు ద్వారా ఆక్సిజన్ అందిస్తూనే.. మరోవైపు తవ్వకాలు ప్రారంభించారు. ఇలా ఆరుసార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఏడు సారి బుధవారం రెస్య్క్యూ సిబ్బంది చిన్నారిని బోరుబావి నుంచి సురక్షితంగా బయటకు తీశారు.ఈ సందర్భంగా చేతన తాత దయారామ్ మాట్లాడుతూ.. చిన్నారిని వెలికి తీసేందుకు రెస్క్యూ బృందాలు అవిశ్రాంత కృషిని కొనియాడారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఓపెన్ బోర్వెల్లను కవర్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. बोरवेल में फंसी बच्ची के हाथों में हलचल कैमरे में दिख रही है. #Jaipur https://t.co/7BBzFMGzHk pic.twitter.com/RD66L65NAY— Avdhesh Pareek (@Zinda_Avdhesh) December 23, 2024 -
అందుకే చంపేశా.. సంచలన విషయాలు వెల్లడించిన అర్షద్
‘మాకు సహాయం చేయమని చాలా మందిని అడిగాం, కానీ మాకు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు నా సోదరీమణులు చనిపోతున్నారు. కొద్దిసేపట్లో నేను కూడా చచ్చిపోతాను. మాకు జరిగిట్టుగా భారతదేశంలోని ఏ కుటుంబం కూడా వేధింపుల బారిన పడకుండా చూడాలి. బతికుండగా మాకు న్యాయం జరగలేదు. కనీసం చనిపోయిన తర్వాతైనా మాకు న్యాయం చేయాలని చేతులు జోడించి వేడుకుంటున్నాను. మమ్మల్ని వేధించిన వారికి కఠిన శిక్ష పడాలి. రాజకీయ నాయకులు, పోలీసులతో వారికి సంబంధాలున్నాయి. మా స్థలంలో సగం లాక్కున్నారు. మరో సగం కూడా గుంజుకోవాలని ప్రయత్నిస్తున్నారు’- యూపీ రాజధాని లక్నోలో ఐదుగురు కుటుంబ సభ్యులను కిరాతంగా హత్య చేసిన అర్షద్(24) మాటలివి. తన తండ్రి సహాయంతో తల్లితో పాటు నలుగురు చెల్లెళ్లను అర్షద్ అత్యంత దారుణంగా చంపేశాడు. అనంతరం సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు. తాను హత్యలు చేయడానికి దారి తీసిన పరిస్థితులను అందులో వివరించాడు.చెల్లెళ్లను అమ్ముకోవడం ఇష్టం లేకనే..ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ పట్టణం అర్షద్ స్వస్థలం. తమ పొరుగున్న వారు, ల్యాండ్ మాఫియాతో కలిసి వేధింపులకు గురిచేయడంతో విసిగిపోయి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అర్షద్ వెల్లడించాడు. తనను, తన తండ్రిని కుట్రపూరితంగా దొంగ కేసుల్లో ఇరికించి.. తమ చెల్లెళ్లను అమ్మేయాలని చూశారని అతడు ఆరోపించాడు. దీంతో తన చెల్లెళ్లను చంపుకోవాల్సి వచ్చిందని వాపోయాడు. వేధింపులు భరించలేక ఒక దశలో తామంతా మతం మారాలనుకున్నామని చెప్పాడు. తమకు న్యాయం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను అభ్యర్థించాడు. మాకెవరూ అండగా నిలబడలేదు‘ఇరుగుపొరుగు వారి వేధింపుల కారణంగా మా కుటుంబం ఈ నిర్ణయం తీసుకుంది. మా అమ్మ, నా చెల్లెళ్లను నేనే చంపాను. నేను మాట్లాడిన ఈ వీడియో పోలీసులుకు దొరికినప్పుడు స్థానికులే బాధ్యులని వారికి తెలుస్తుంది. మా ఇంటిని కబ్జా చేసేందుకు నానారకాలుగా వేధించినా మేము గట్టిగా ప్రతిఘటించాం. కానీ మాకు ఎవరూ అండగా నిలబడలేదు. ఇల్లు వదిలిపెట్టి 15 రోజులుగా చలిలో తిరుగుతూ ఫుట్‌పాత్‌పైనే నిద్రపోయాం. పిల్లలు చలిలో తిరగడం మాకు ఇష్టం లేదు. కబ్జాకోరులు మా ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. కానీ పత్రాలు మా దగ్గరే ఉన్నాయ’ని అర్షద్ తన వీడియోలో తెలిపాడు.ఈ హత్యలకు బాధ్యులు వారే..తమ కుటుంబ నాశనానికి రాణు, అఫ్తాబ్, అలీమ్ ఖాన్, సలీం, ఆరిఫ్, అహ్మద్, అజార్ అనే వ్యక్తులు కారణమని అర్షద్ ఆరోపించాడు. బంగ్లాదీశీయులమని తమపై అసత్య ప్రచారం చేశారని వాపోయాడు. ‘వాళ్లు ల్యాండ్ మాఫియా. ఆడపిల్లలను అమ్మేస్తారు. నన్ను, మా నాన్నను తప్పుడు కేసులో ఇరికించి.. మా చెల్లెళ్లను హైదరాబాద్‌లో అమ్మేయాలని ప్లాన్ చేశారు. వాళ్ల బారిని నుంచి తప్పించడానికి మాకు మార్గం మరో లేకుండా పోయింది. అందుకే మా నాన్న సహకారంతో నా సోదరీమణులను గొంతు, మణికట్టు కోసి బలవంతంగా చంపాల్సి వచ్చింది. వారి గౌరవాన్ని కాపాడటానికి మాకు ఇంత కంటే మార్గం తోచలేదు. నేను ఉదయం వరకు జీవించి ఉండకపోవచ్చు. మా స్థలాన్ని ప్రార్థనాలయానికి, వస్తువులను అనాథాశ్రమానికి విరాళంగా ఇవ్వాల’ని అర్షద్ తెలిపాడు. తన వీడియోలో తల్లి, చెల్లెళ్ల మృతదేహాలను చూపించాడు.చదవండి: ట్యూషన్ టీచర్‌కు 111 ఏళ్ల కఠిన కారాగార శిక్షకొనసాగుతున్న విచారణహోటల్ శరణ్‌జిత్‌లో ఐదుగురు మహిళల హత్యలు జరిగాయని సెంట్రల్ లక్నో డిప్యూటీ పోలీసు కమిషనర్ రవీనా త్యాగి తెలిపారు. ఘటనా స్థలంలోనే నిందితుడు అర్షద్‌ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. విచారణ కొనసాగుతోందని, ఫోరెన్సిక్ నిపుణులు శాంపిల్స్ సేకరించారని చెప్పారు. -
న్యూఇయర్ వేళ.. 18 వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు.. ఎక్కడంటే?
ముంబై : న్యూఇయర్ వేడుకల్లో ట్రాఫిక్ ఉల్లంఘనలు భారీ మొత్తంలో నమోదైనట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. దేశంలో అత్యధికంగా ముంబైలో ఈ ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినట్లు తెలుస్తోంది. ఫలితంగా మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లలో వాహనదారుల నుంచి రూ.89లక్షల ఫైన్ల రూపంలో వసూలు చేశారు. ముంబై పోలీసుల సమాచారం మేరకు..న్యూఇయర్‌లో మొత్తం 17,800 ఇ-చలాన్లను జారీ చేశారు. అందులో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 2,893 కేసులు, హెల్మెట్ లేకుండా ప్రయాణించిన వ్యక్తులపై 1,923 కేసులు, ట్రాఫిక్ సిగ్నల్స్ జంపింగ్ చేసిన 1,731 కేసులు, ప్రజా రవాణాకు అర్హతలేని వాహనాల్ని డ్రైవ్ చేసినందుకు 1,976 కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు నగరంలో మితిమీరిన వేగానికి 842 చలాన్, సీటు బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేయడంపై 432 చలాన్లు వేసినట్లు పోలీసులు వెల్లడించారు. న్యూఇయర్ సందర్భంగా మద్యం తాగి డ్రైవ్ చేసిన వారికి 153 చలాన్లు, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడినందుకు 109 చలాన్లు, ట్రిపుల్ రైడింగ్ 123 చలాన్లను, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేసినందుకు 40 చలాన్లు విధించారు. అలా మొత్తంగా విధించిన చలాన్లతో రూ.89,19,750 వసూలు చేసినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. మీడియా కథనాల ప్రకారం 2025 నూతన సంవత్సర వేడుకల్లో ఎనిమిది మంది అదనపు కమిషనర్లు, 29 మంది డిప్యూటీ కమిషనర్లు, 53 మంది అసిస్టెంట్ కమిషనర్లు, 2184 మంది ఇన్స్పెక్టర్లు, 12,000 మందికి పైగా కానిస్టేబుళ్లు ముంబై వీధుల్లో విధులు నిర్వహించారు. -
ఫోన్లో భార్య సతాయింపులు.. భరించలేక భర్త బలవన్మరణం!
కట్టుకున్న భార్య రాచిరంపాన పెడుతుందని ఓ భర్త వాపోతే ఎలా ఉంటుంది?. నవ్వి ఊరుకుంటుంది ఈ సమాజం. కానీ, అతుల్ సుభాష్ అనే భార్యాబాధితుడి బలవన్మరణం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇలాంటి కేసులు.. వ్యక్తుల జీవితాలకు సంబంధించిన విచారణే కాకుండా చట్టాలను సవరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. ఓ అతుల్.. కర్ణాటకలో ఓ కానిస్టేబుల్ తిప్పన్న.. రాజస్థాన్‌లో ఓ డాక్టర్ అజయ్ కుమార్ .. ఇలా రోజుకొక ఉదంతం ఈ చర్చలో భాగమవుతోంది. ఇదిలా ఉండగానే.. ఢిల్లీలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.వుడ్‌బాక్స్(Woodbox) అనే పాపులర్ కేఫ్ నడిపిస్తున్న పునీత్ ఖురానా(40) బలవనర్మణానికి పాల్పడ్డాడు. కల్యాణ్ విహార్ ప్రాంతం మోడల్ టౌన్ నివాసంలో మంగళవారం సాయంత్రం ఉరేసుకుని చనిపోయాడు. పునీత్ అతని భార్య మానిక జగదీష్ పహ్వాకి మధ్య విడాకుల కేసు నడుస్తోంది. అయితే.. ఈ కేసులో భార్య సతాయింపుల కోణం బయటకు వచ్చింది.తన భార్య వేధింపులకు సంబంధించి 16 నిమిషాల ఫోన్‌కాల్ ఆడియో.. అలాగే ఆమె ఎలా వేధించిందో చెబుతూ 54 నిమిషాల సెల్ఫ్ వీడియో రికార్డింగ్.. రెండింటిని బయటపెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడతను. ఈ మేరకు కుటుంబ సభ్యులు కూడా మానికపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.2016లో ఈ ఇద్దరికీ వివాహం జరిగింది. ఆపై వుడ్‌బాక్స్ కేఫ్‌ను ఆ భార్యాభర్తలిద్దరూ కలిసే ప్రారంభించారు. విడాకుల కేసు నేపథ్యంలో ఇద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ.. వ్యాపారంలో మాత్రం ఇద్దరూ భాగంగానే కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయి. పునీత్ మరణం తర్వాత.. మానికతో జరిగిన జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఒకటి బయటకు వచ్చింది.మనం విడాకులు తీసుకున్నాం. అయినా కూడా నేను వ్యాపార భాగస్వామినే. కాబట్టి, నా బకాయిలు త్వరగా చెల్లించు అని మానిక, పునీత్‌తో వాగ్వాదం పెట్టుకుంది. పునీత్ ఎంత వేడుకుంటున్నా.. ఆమె మాత్రం కఠువుగానే మాట్లాడిందా ఆడియో క్లిప్‌లో. దీంతో.. చేసేది లేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మానికను విచారణ జరపాలని నిర్ణయించారు.ఇదిలా ఉంటే.. అతుల్ సుభాష్(Atul Subash) కోసం పుట్టుకొచ్చిన #JusticIsDue హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియా నుంచి కనుమరుగు కాలేదు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిఖితా సింఘానియా బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది. అయితే.. బిడ్డను సాకుగా చూపి బెయిల్ పొందలేరంటూ బెంగళూరు కోర్టు నిఖిత లాయర్‌కు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై తదుపురి వాదనలు జనవరి 4వ తేదీన వింటామంది. మరోవైపు.. బెంగళూరు హైకోర్టులోనూ నిఖితా సింఘానియా ఓ పిటిషన్ వేసింది. అదే టైంలో.. మనవడి సంరక్షణ కోరుతూ అతుల్ తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పైనా హైకోర్టు విచారణ జరపుతోంది. ఈ క్రమంలో నిఖితా సింఘానియా రిమాండ్‌లో ఉన్న విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని బెంగళూరు హైకోర్టు అతుల్ పేరెంట్స్‌కు సూచించింది.కొడుకును వంకగా పెట్టుకుని భార్య తన నుంచి డబ్బు గుంజుతోందని.. తప్పుడు కేసులతో కోర్టుల చుట్టూ తిప్పుతూ తనను వేధిస్తోందంటూ 90 నిమిషాల వీడియో.. పేజీలకొద్దీ మరణ వాంగ్మూలం రాసి బెంగళూరు మరాథాహల్లి నివాసంలో అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకన్నాడు. ఆయన సోదరుడు బికాస్ కుమార్ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ 108, రెడ్‌విత్ 3(5) కింద మారథాహల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న నిఖితను, అటు ఆమె తల్లి సోదరుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. అయితే.. తన భర్త అదనపు కట్నం కోసం తనను వేధించిన మాట వాస్తవమేనని, అతని మృతిలో తనకుగానీ, తన కుటుంబ సభ్యులకుగానూ ఎలాంటి ప్రమేయం లేదని నిఖిత మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. -
ఎంజాయ్ చేద్దామని గోవా వెళ్లి.. శవమై తిరిగొచ్చిన ఏపీ యువకుడు
గోవా: న్యూఇయర్‌లో విషాదం చోటు చేసుకుంది. గోవాలో ఏపీ టూరిస్ట్ హత్యకు గురి కావడం సంచలనంగా మారింది. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట సమయంలో ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ఏపీకి చెందిన బొల్లా రవితేజ హత్యకు గురయ్యాడు. మృతుడు పశ్చిమగోదావరి జిల్లా, తాడేపల్లికి చెందిన బొల్లా రవితేజగా గోవా పోలీసులు గుర్తించారు. ఈ దుర్ఘటనలో నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు గోవా డీఐజీ వర్షా శర్మ తెలిపారు.బీచ్ షాక్ యజమాని బీచ్ షాక్ యజమాని అగ్నెల్ సిల్వేరా,అతడి కుమారుడు షుబర్ట్ సిల్వేరియాతో పాటు సిబ్బంది అనిల్ బిస్టా, సమల్ సునర్‌లను అరెస్ట్ చేసినట్లు డీఐజీ వెల్లడించారు. గోవాలోని ప్రముఖ కలంగుట్ బీచ్‌లో మరీనా బీచ్ షాక్ అనే రెస్టారెంట్ ఉంది. నిన్న రాత్రి ఒంటి గంటకు ఆ రెస్టారెంట్‌కు అర్థరాత్రి వచ్చిన రవితేజ, అతని స్నేహితుడు హైదరాబాద్‌కు చెందిన స్పందన్ బొల్లు ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు. అయితే బీచ్ షాక్ రెస్టారెంట్ యజమాని సిల్వేరా.. రవితేజ, అతని స్నేహితుడి నుంచి ఉన్న ధర కంటే ఎక్కువ మొత్తం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఉన్న బిల్లుపై ఎక్కువ మొత్తం ఇవ్వాలంటే సాధ్యం కాదని చెప్పే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో రెస్టారెంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తి రవితేజపై దాడి చేశాడు. అలా ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంలో చోటు చేసుకున్న వివాదం హింసాత్మకంగా మారింది. నిందితులు టూరిస్ట్ తేజపై వెదురు కర్రలతో తలపై మోదారు. ఆపై శరీర భాగాలపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో, నిందితులు కొట్టిన దెబ్బలకు తాళలేక బాధితుడు తేజ మరణించినట్లు పేర్కొన్నారు.కాగా, గోవాలో గత కొద్ది రోజుల్లో ముగ్గురు టూరిస్ట్‌లు మరణించారు. అంతకుముందు నవంబర్‌లో ఢిల్లీ టూరిస్ట్ డ్యాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్లో మరణించాడు. క్రిస్మస్ రోజు మహరాష్ట్రకు చెందిన టూరిస్ట్ బోట్ బోల్తా పడి మరణించాడు.