Suryapet
-
రాష్ట్ర ప్లినరీని విజయవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట): తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 21న సికింద్రాబాద్‌లో జరిగే రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దక్షిణ తెలంగాణ కోఆర్డినేటర్ అనంతుల మధు కోరారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల చైతన్య బస్సు యాత్ర వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతుల మధు మాట్లాడుతూ.. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అలుపెరుగని పోరాటం చేస్తుందని తెలిపారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారుల అంశం చేర్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీను వాస్, తెలంగాణ ఉద్యకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిళ్ల విప్లవ్ కుమార్, రాష్ట్ర నాయకులు పడిదల ప్రసాద్, తెలంగాణ ఉద్యమ నాయకులు పంతం యాకయ్య, బాసిపంగు సునీల్, ఎండీ మజహార్, యాతకుల సునీల్, అంజయ్య, భారీ ఖాన్, దుర్గయ్య, నాగేశ్వర్ రావు, రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి, విరస్వామి, జ్యోతి రెడ్డి, గగన్ కుమార్, జానికి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నికఅనంతగిరి: వ్యవసాయ కార్మిక సంఽఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా రెమిడాల రాజు, ప్రధాన కార్యదర్శిగా దూళిపాళ్ల ధనుంజయ నాయుడు ఎన్నికయ్యారు. శనివారం అనంతగిరిలో జరిగిన వ్యవసాయ కార్మికసంఘం నాల్గవ జిల్లా మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. తమ నియామకానికి సహకరించిన వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య, సీపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, బద్దం కృష్ణారెడ్డి, హనుమంతరావుకు ఆదివారం వారు కృతజ్ఞతలు తెలిపారు. వైభవంగా నారసింహుని కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. హోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. ఎదుర్కోళ్ల మహోవత్సవం అనంతరం స్వామివారి కల్యాణం జరిపించారు. అదేవిధంగా గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామిఅమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రవేశం తరువాత మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి పాల్గొన్నారు. -
లక్ష్యానికి మించి ఆదాయం
తిరుమలగిరి (తుంగతుర్తి): జిల్లాలో 2024– 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా మార్కెటింగ్ శాఖకు నిర్దేశిత లక్ష్యానికి మించి ఆదాయం వచ్చింది. ఆరు వ్యవసాయ మార్కెట్లలో కోదాడ, హుజూర్నగర్ మినహా మిగిలిన సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, నేరేడుచర్ల మార్కెట్లు టార్గెట్‌ను అధిగమించాయి. 2024–25లో మార్చి నుంచి ఏప్రిల్ వరకు మార్కెట్ కమిటీల ద్వారా రూ.32.02 కోట్ల మేర ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా రూ.33.14 కోట్ల ఆదాయం సమకూరింది. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ సెలక్షన్ గ్రేడ్ మార్కెట్లుగా, తుంగతుర్తి స్పెషల్ గ్రేడ్ మార్కెట్‌గా, నేరేడుచర్ల గ్రేడ్–2 మార్కెట్‌గా, తిరుమలగిరి గ్రేడ్ – 3 మార్కెట్‌గా విభజించారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.10.57కోట్లు కాగా.. రూ.13.11కోట్లు వసూళ్లు సాధించింది. అదేవిధంగా తుంగతుర్తి మార్కెట్ లక్ష్యం రూ.2.25కోట్లు కాగా.. వసూళ్లు రూ.2.39 కోట్లు, తిరుమలగిరి మార్కెట్ లక్ష్యం రూ.5.23కోట్లు అయితే వసూళ్లు రూ.5.67కోట్లు, నేరేడుచర్ల మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.1.77కోట్లు కాగా.. వసూళ్లు రూ.1.99కోట్లు సాధించింది. ఇక.. కోదాడ రూ.4.49కోట్లు, హుజూర్నగర్ మార్కెట్ కమిటీలు రూ.5.45కోట్ల వసూళ్లు సాధించాయి. మార్కెట్లలో జరిగే పంటల విక్రయాలు, పలు రకాల ఫీజులు, గోదాములు, దుకాణాల అద్దెలు, చెక్ పోస్టులు, సీసీఈ కొనుగోలు కేంద్రాలు, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇలా పలు రకాలుగా ఆదాయం సమకూరింది. 5లక్షల ఎకరాలకుపైగా పంటల సాగు జిల్లాలో ఈ సంవత్సరం 5 లక్షలకు పైగా ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో ఎక్కువగా వరి, పత్తి రైతులు సాగు చేశారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో రైతులు విక్రయించిన ధాన్యం, పత్తికి సంబంధించి మార్కెట్ ఫీజులు వసూలు కావడంతో ఎక్కువగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. ఫ టార్గెట్‌ను అధిగమించిన సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్లు ఫ లక్ష్యం రూ.32.02 కోట్లు.. వసూలు రూ.33.14 కోట్లు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటాం తిరుమలగిరి వ్యవసా య మార్కెట్లో సంవత్సరం పొడవునా క్రయవిక్రయాలు జరుగుతా యి. నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించాం. మార్కెట్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కోరుతాం. – చామంతి, మార్కెట్ చైర్పర్సన్, తిరుమలగిరి ఆదాయ లక్ష్యాలు మార్కెట్ లక్ష్యం వసూళ్లు (రూ.కోట్లలో) సూర్యాపేట 10.57 13.11 కోదాడ 6.32 4.49 హుజూర్నగర్ 5.86 5.45 తుంగతుర్తి 2.25 2.39 తిరుమలగిరి 5.23 5.67 నేరేడుచర్ల 1.77 1.99 -
ఉద్యాన సాగుకు ఔట్సోర్సింగ్ సేవలు
నాగారం : జిల్లాలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. సంప్రదాయ పంటలతో నష్టాలు వస్తున్నాయని కొందరు రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లుతున్నారు. అయితే ఉద్యాన పంటలు సాగు చేసే వారికి సలహాలు, సూచనలిచ్చే అధికారులు, సిబ్బంది అరకొరగా ఉన్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్నదాతలకు ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రస్తుతం ఐదుగురు మాత్రమే.. జిల్లాలో రైతులు సమారుగా 36,559 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగుచేస్తున్నారు. పండ్ల తోటలు 15,846 ఎకరాల్లో, కూరగాయలు 813 ఎకరాల్లో. మిర్చి 14,917 ఎకరాలు, ఆయిల్‌పామ్ 4,885 ఎకరాల్లో సాగవుతుంది. తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, పెన్‌పహాడ్, మోతె, సూర్యాపేట, నడిగూడెం, తిరుమలగిరి, నూతనకల్, ఆత్మకూర్ తదితర మండలాల్లో ఉద్యాన పంటలు అధికంగా సాగుచేస్తుంటారు. మొలకెత్తింది మొదలు పంట చీడపీడల నివారణకు జాగ్రత్తలు పాటించాలి. మెరుగైన దిగుబడులు, గిట్టుబాటు ధర దక్కేలా రైతులను సరైన బాటలో నడిపించేది క్షేత్రస్థాయి సిబ్బందే. జిల్లాలో 23 మండలాలు ఉండగా ప్రస్తుతం ఐదుగురు మాత్రమే ఉద్యాన అధికారులు ఉన్నారు. జిల్లాలో హుజూర్నగర్, తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ, మేళ్లచెరువు మండలాలకు అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం ఒక్కో ఉద్యానాధికారి మూడు, నాలుగు మండలాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. దీంతో ఉద్యాన అధికారులపై అదనపు భారం పడుతోంది. పొరుగు సేవల సిబ్బంది విధుల్లో చేరితే సలహాలు, సూచనలు త్వరితగతిన అందించేందుకు వీలుంటుంది. మూడేళ్ల కిందట ఔట్సోర్సింగ్ సిబ్బందిని తొలగించగా వారిని తిరిగి చేర్చుకునేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో తొమ్మిది మంది సిబ్బంది వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాలి ప్రభుత్వ ఆదేశాలు వస్తే జిల్లాలో ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమిస్తాం. ఈమేరకు సిబ్బంది నియామకానికి సంబంధించి ప్రతిపాదనలు ఇప్పటికే పంపించాం. – నాగయ్య, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, సూర్యాపేట ఫ సిబ్బంది నియామకానికి ప్రతిపాదనలు ఫ అన్నదాతలకు తప్పనున్న ఇబ్బందులు జిల్లాలో సాగు విస్తీర్ణం (ఎకరాల్లో..) పండ్ల తోటల సాగు 15,846 కూరగాయలు 813 మిర్చి 14,917 ఆయిల్‌పామ్ 4,885 ఇతర పంటలు 95 మొత్తం 36,559 -
స్వర్ణోత్సవ సమ్మేళనం.. మది నిండా సంతోషం
సూర్యాపేట టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆదివారం పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవ సమ్మేళనం నిర్వహించారు. సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 1973–75 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ బైపీసీకి చెందిన పూర్వ విద్యార్థులు 50 ఏళ్ల తర్వాత కలుసుకొని తమ చిన్న నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఒకరినొకరు తమ బాగోగులు తెలుసుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. కార్యక్రమానికి హాజరైన పూర్వ విద్యార్థి, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ వర్ధెల్లి మురళి మాట్లాడుతూ.. యాభై ఏళ్ల క్రితం ఈ కళాశాలలో చదువుకున్న తాము మళ్లీ ఇప్పుడు కలుసుకోవడం ఎంతో పునరుత్తేజాన్ని ఇచ్చిందన్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి వేడుకలు ప్రతి బ్యాచ్ నిర్వహించుకుని తమ పాత స్నేహితులను కలుసుకొని మధురానుభూతి పొందాలన్నారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శంకర్, శ్యాంసుందర్, అశోక్, రాజేంద్రప్రసాద్, నరేందర్ రెడ్డి, పిచ్చిరెడ్డి, రంగారెడ్డి, అశ్విని కుమార్, నరసింహారావు, డాక్టర్ రామచంద్రరావు, జగన్, రంజన్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. ఫ 50 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు -
గాలిదుమారం.. వడగండ్లు
సూర్యాపేట అర్బన్, ఆత్మకూర్(ఎస్), తిరుమలగిరి, అర్వపల్లి, నూతనకల్ నాగారం, నడిగూడెం : అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. అకాల వర్షాలు రైతులకు అంతులేని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి జిల్లాలో ఆదివారం సాయంత్రం కురిసిన వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో పోసిన ధాన్యం తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోత దశలో ఉన్న వరి నేలవాలింది. కరెంట్ తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ● సూర్యాపేట పట్టణంలో బలమైన ఈదురు గాలులు వీయంతో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు సుమారు రెండు గంటల తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఈదురుగాలుల బీభత్సవానికి కుడకుడలోని ఓ ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. ప్రహరీ కూలిపోయింది. ● నాగారం మండలంలో వరిచేలు, పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. నర్సింహులగూడెం గ్రామాలనికి వెళ్లే రహదారిపై చెట్లు రోడ్డుకు అడ్డంగా కూలడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో వరి పైరు నేలకొరగగా, మామిడి, నిమ్మ తోటలు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ● ఆత్మకూర్(ఎస్) మండలంలోని పలు గ్రామాల్లో చెట్లు విరిగి, విద్యుత్ స్తంభాలు కూలాయి. సుమారు 40 నిమిషాల పాటు ఈదురు గాలులు వీయడంతోపాటు రాళ్ల వర్షం కురిసింది. పలు గ్రామాల్లో ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. అకస్మాత్తుగా వచ్చిన గాలివానతో ధాన్యం రాశులపై పట్టాలు కప్పడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు. ● తిరుమలగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరద నీరు చేరింది. భారీ ఈదురు గాలులకు మామిడి, నిమ్మకాయలు నేల రాలాయి. అదేవిధంగా నూతనకల్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో మామిడి కాయలు నేలరాలాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు వర్షానికి తడిసి ముద్దయింది. ● జాజిరెడ్డిగూడెం మండలంలోరైతులు తీవ్రంగా నష్టపోయారు. జాజిరెడ్డిగూడెం. అర్వపల్లి, కోడూరు, తూర్పుతండా కాసర్లపహాడ్ తదితర గ్రామాల్లో వరిపంటలకు నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాల్లో కొంత ధాన్యం వర్షానికి కొట్టుకుపోయింది. జాజిరెడ్డిగూడెంలో నోముల నరేష్ ఇంట్లో చెట్టుకొమ్మ విరిగి గేదైపె పడి మృతిచెందింది. అర్వపల్లిలో హైవేలు జలమయమయ్యాయి. మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ● నడిగూడెం మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బృందావనపురం గ్రామంలో తాటి చెట్టుపై పిడుగు పడింది. నడిగూడెంలోని ప్రధాన రహదారిపై ఉన్న పలు భారీ వృక్షాల కొమ్మలు విరిగాయి. ఫ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ఫ నేలరాలిన మామిడి, నిమ్మకాయలు ఫ పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఫ చెట్ల కొమ్మలు విరిగి పడడంతో రాకపోకలకు అంతరాయం ధాన్యం పూర్తిగా తడిసిపోయింది అమీనాబాద్ ఐకేపి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వారం రోజుల క్రితం ధాన్యం తీసుకువచ్చాను. ధాన్యం ఆరబోసుకుని కాంటాల కోసం ఎదురు చూస్తున్నా. ఆదివారం కురిసిన వడగండ్ల వానకు ధాన్యం కల్లంలోనే తడసిపోయింది. పూర్తిగా నష్టం వాటిల్లింది. – నాగరాజు, రైతు అమీనాబాద్, అనంతగిరి మండలం -
నల్లగొండ బిడ్డకు ఉన్నత పదవి
నల్లగొండ : నల్లగొండ వాసికి మరో ఉన్నత పదవి లభించింది. హైకోర్ట్ జస్టిస్‌గా పలు ఉన్నతస్థాయి హోదాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జస్టిస్ షమీమ్ అక్తర్‌ను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ షమీమ్ అక్తర్ ఇటీవల రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్‌గా ఏమాత్రం వివాదం లేకుండా ఎస్సీ వర్గీకరణపై నివేదిక ఇచ్చారు. నల్లగొండ పట్టణానికి చెందిన ఒక సామాన్య సాంప్రదాయ కుటుంబంలో జన్మించిన షమీమ్ పట్టణంలోనే పాఠశాల, ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారు. నాగపూర్‌లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన అనంతరం ఎల్ఎల్ఎం, ీపీహెచ్డీ చేశారు. నల్లగొండలో దాదాపు 16 సంవత్సరాల లాయర్‌గా ప్రాక్టీస్ చేసి సివిల్, క్రిమినల్, రెవెన్యూ కేసులను వాదించారు. 2002లో జిల్లా కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. తెలంగాణలోని వివిధ న్యాయ స్థానాల్లో సేవలందించారు. న్యాయపరమైన తీర్పులు, సామర్థత, చట్టంపై లోతైన అవగాహన తదితర కారణాలతో జస్టిస్ షమీమ్ అక్తర్‌కు 2017లో హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణలో కీలక పాత్ర బడుగు, బలహీన వర్గాలు ప్రధానంగా కార్మికులు, మహిళలు, పేదల హక్కుల పరిరక్షణలో జస్టిస్ షమీమ్ అక్తర్ కీలక పాత్ర వహించారు. ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం (ఏడీఆర్) ద్వారానే సత్వర న్యాయం లభిస్తుందనే నమ్మకంతో అనేక కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించి కోర్టులపై కేసుల భారాన్ని తగ్గించారు. రాజ్యాంగం అంశాలపై విశేష పట్టు ఉన్న జస్టిస్ షమీమ్ అక్తర్ తీర్పులు పలు కేసుల తుది నిర్ణయాలకు మార్గదర్శకంగా మారాయి. 2022లో హైకోర్టు న్యాయమూర్తిగా రిటైర్ అయినప్పటికీ అనేక న్యాయ సంబంధిత, రాజ్యాంగ పరమైన అంశాలపై తన ప్రసంగాల ద్వారా యువ న్యాయవాదులు, సహచర న్యాయమూర్తులకు మార్గదర్శకంగా నిలిచారు. ఆయనను తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఫ మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ షమీమ్ అక్తర్ నియామకం -
పెండింగ్ బిల్లులు చెల్లించాలని ధర్నా
సూర్యాపేటటౌన్ : జీపీఎఫ్ పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) సూర్యాపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.రాములు మాట్లాడుతూ జిల్లా పరిషత్ పరిధిలో నిర్వహిస్తున్న జెడ్పీ జీపీఎఫ్ పార్ట్ ఫైనల్స్, రుణాలు, ఫైనల్ పేమెంట్స్ సుమారు రూ.18 కోట్ల 72 లక్షలు రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం చేయడంతోపాటు వరుస క్రమం పాటించకుండా చెల్లింపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సోమయ్య, సిరికొండ అనిల్ కుమార్, కె అరుణ భారతి, పి శ్రీనివాసరెడ్డి, వెంకటయ్య, ఆర్.దామోదర్, నాగేశ్వరరావు, వి.రమేష్, బి.ఆడం, డీ.లాలుసభ్యులు పాల్గొన్నారు. -
హనుమాన్ జయంతికి పోలీస్ భద్రత
సూర్యాపేటటౌన్ : హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం భక్తుల సౌకర్యార్థం జిల్లాలో కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. నిర్ణీత సమయంలో కార్యక్రమాలు ముగించుకోవాలన్నారు. ఉత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో ఒకరినొకరు గౌరవించుకుంటూ జరుపుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడి అవగాహన కల్పించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పోలీసు శాఖ తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిఒక్కరూ మొక్కలను కాపాడాలిసూర్యాపేట అర్బన్ : ప్రతిఒక్కరూ మొక్కలను కాపాడాలని అదనపు కలెక్టర్, సూర్యాపేట మున్సిపల్ ప్రత్యేక అధికారి పర్స రాంబాబు అన్నారు. శుక్రవారం వాటరింగ్ డే ను పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలోని సద్దుల చెరువు కట్టపై మొక్కలకు ఆయన నీరు పోశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవికాలంలో మొక్కలకు నీరు పోసి కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బోళ్ల శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఎస్.ఎస్.ఆర్.ప్రసాద్, వసుంధర, వసీం తదితరులు పాల్గొన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యంగరిడేపల్లి : అభివృద్ధి, సంక్షేమం బీజేపీతోనే సాధ్యమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండల పరిధిలోని సర్వారం గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుక్కడపు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన గావ్ చలో..బస్తీ చలో అభియాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గావ్ చలో..బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలు ప్రతి గ్రామంలోని వార్డుల్లో సమస్యలను గుర్తించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసిన వక్ఫ్‌బోర్డు సవరణల వల్ల పేద ముస్లింలకు కలిగే ప్రయోజనాలను వివరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ నర్సింగ్ అంజయ్య, పొలిశెట్టి అంజయ్య, జెనిగల శ్రీను, చిత్తలూరు సోమయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, తాళ్ల సురేష్, గుండు బాలకృష్ణ, రామకృష్ణ, కందుల వెంకటరెడ్డి, రాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం ఆరబెట్టి కేంద్రాలకు తీసుకురావాలి భానుపురి (సూర్యాపేట) : మార్కెట్ యార్డుకు రైతులు ఆరబెట్టిన ధాన్యం తీసుకురావాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి సంతోష్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మార్కెట్‌కు 25వేల బస్తాల ధాన్యం వచ్చిందని, రూ.2329 గరిష్ట, రూ.1500 కనిష్ట ధర పలికిందన్నారు. లైసెన్స్ కలిగిన వ్యాపారులు రైతుల ధాన్యం కుప్పలో తేమ శాతం, తాలు, చెత్త పరిశీలించిన తర్వాత ధర నిర్ణయిస్తారని తెలిపారు. మునగాల మండలం రేపాల గ్రామానికి చెందిన రైతు బత్తిని లింగరాజు 40 బస్తాల ధాన్యం తీసుకురాగా.. నాణ్యత ప్రమాణాల మేరకు రూ.1606 ధరను ఖరీదుదారులు చెల్లించేందుకు ముందుకు వచ్చారన్నారు. ధర ఎక్కువ కావాలని రైతు కోరగా.. తాలు, తేమ ఎక్కువగా ఉండడంతో ఖరీదుదారులు అంత ధర చెల్లించలేమన్నారని పేర్కొన్నారని అన్నారు. చుట్టుపక్కల రైతులు, లింగరాజు కలిసి చెట్ల ఆకులను ధాన్యం రాశి వద్దకు తీసుకొచ్చి నిప్పంటించారన్నారు. తేమశాతం 22 ఉందని, ధాన్యాన్ని ఆరబెడితే ధర అధికంగా చెల్లించే అవకాశం ఉందని అధికారులు తెలపడంతో రైతు అంగీకరించి శనివారం ధాన్యం అమ్ముకుంటానని చెప్పాడన్నారు. మార్కెట్‌కు నిత్యం కొందరు కావాలనే మార్కెట్ కమిటీని అభాసుపాలు చేయాలని చూస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, రైతులు అధైర్య పడకుండా ధాన్యం తీసుకురావాలని సూచించారు. -
నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి
చివ్వెంల(సూర్యాపేట) : కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం చివ్వెంల మండల పరిధిలోని బీబీగూడెం గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు రైతులు అరబెట్టిన ధాన్యం తీసుకురావాలన్నారు. 17 శాతం తేమ ఉంటే ధాన్యం కొనుగోలు చేసి కాంటాలు వేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ సంతోష్‌కుమార్, నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
మహిళల చదువుతోనే సమాజ అభివృద్ధి
తాళ్లగడ్డ (సూర్యాపేట) : మహిళల చదువుతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆనాడే ఫూలే గుర్తించారని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డితో కలిసి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో విద్యతో గుర్తింపు లభిస్తుందని గుర్తించిన మొదటి వ్యక్తి ఫూలే అన్నారు. అస్పృశ్యత, లింగ వివక్షత నిర్మూలించేందుకు, వితంతువులకు పునర్వివాహం చేసేందుకు జ్యోతిబాఫూలే కృషి చేశారని అన్నారు. మహిళా సాధికారత లభిస్తే సమాజానికి ఆలంబనగా నిలుస్తారని నమ్మి భార్య సావిత్రిబాయి ఫూలే ను మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తయారు చేశారని పేర్కొన్నారు. జిల్లాలో 13 ప్రాథమిక పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చదువు చెబుతున్నారని తెలిపారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజలను ఉన్నత స్థానానికి చేర్చేందుకు జ్యోతిబా ఫూలే ఎంతగానో కృషి చేశారని అన్నారు. అనంతరం బీసీ ఉద్యోగుల డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌్ వి.రామారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌శ్రీనివాస్, బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
శాస్త్రోక్తంగా నిత్య కల్యాణం
మఠంపల్లి : జిల్లాలో ప్రసిద్ధిగాంచిన మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి మహాక్షేత్రంలో శుక్రవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సుప్రభాతసేవ, నిత్య అగ్నిహోత్రి, పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్ర నామార్చలు గావించారు. నూతన పట్టు వస్త్రాలంకరణతో స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని రక్తికట్టించారు. అనంతరం , మాంగల్యధారణ, తలంబ్రాలతో వేదమంత్రోచ్ఛరణాలతో వైభవంగా నిర్వహించారు. సాయంత్రం కృష్ణానదికి అర్చకులు హారతి ఇచ్చారు. కార్యక్రమంలో అర్చకులు తూమాటి కృష్ణమాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనర్సింహమూర్తి, ఆంజనేయచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
ఏదీ సౌకరా్యల జాడ!
కోదాడ: కోదాడ ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి 20 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడ (ఇండస్ట్రీయల్ పార్క్) పరిస్థితి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కి అనే చందంగా మారింది. పారిశ్రామిక వాడలో కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారు. పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని తక్కువ రేట్లకు స్థలాలు దక్కించుకున్నవారు అటువైపు చూడకపోవడంతో పారిశ్రామిక వాడ కంపచెట్లతో దర్శనమిస్తోంది. చీకటి పడిందంటే అటువైపు వెళ్లడానికి భయపడే పరిస్థితి నెలకొంది. జాతీయ రహదారి పక్కన ఉండే ఈ పారిశ్రామిక వాడ అభివృద్ధిపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు. 20 ఏళ్లలో భారీ, చిన్న తరహా పరిశ్రమలు అన్నీ కలిపి ఇప్పటి వరకు 20 నుంచి 30 మాత్రమే ఇక్కడ ఏర్పాటు అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు జాతీయ రహదారి పక్కన 61 ఎకరాలు.. కోదాడ మండల పరిధిలోని దోరకుంట వద్ద 2005లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ).. ప్రస్తుతం టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో కోదాడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి పక్కన రూ.44.73 లక్షలతో 61 ఎకరాల భూమిని సేకరించారు. దీన్ని లేఅవుట్ చేసి రోడ్లను ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం కల్పించారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చేవారికి స్థలాలు కూడా కేటాయించారు. 2006 నుంచే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని స్థలాలు తీసుకున్నవారు నేటికీ పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. ఇక్కడ 200 వరకు చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నా గత 20 సంవత్సరాల్లో కేవలం 20 నుంచి 30 వరకు మాత్రమే పరిశ్రమలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 119 మంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేయగా వారికి స్థలం కేటాయించారు. స్థలం కోదాడలో.. కార్యాలయం వరంగల్‌లో.. కోదాడ పరిధిలో ఉన్న పారిశ్రామిక వాడకు సంబంధించిన ఏ సమాచారం కూడా ఇక్కడ దొరకడం లేదు. ఇది వరంగల్ రీజియన్ పరిధిలో ఉంది. దీంతో ఏ సమాచారం కావాలన్నా వరంగల్‌కు వెళ్లాల్సి వస్తోంది. రీజియన్ అధికారులు ఇక్కడికి సంవత్సరానికి ఒకసారి కూడా వస్తున్నారో లేదో తెలియని పరిస్థితి. స్థానికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తే పారిశ్రామిక వాడ అభివృద్ధి చెందడంతో పాటు పలువురికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్థానికులు భావిస్తున్నారు. సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలి కోదాడ పరిధిలోని దోరకుంట పారిశ్రామికవాడలో కనీస సౌకర్యాలు లేవు. రోడ్లు గుంతలుపడి కంకర తేలాయి. కంపచెట్లు కమ్మేశాయి. కోదాడ దుర్గాపురం జంక్షన్ నుంచి పారిశ్రామికవాడ వరకు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలి. ఇక్కడి నుంచి భారీ వాహనాలు ఐదు కిలోమీటర్లు ముందుకు వెళ్లి చిమిర్యాల క్రాస్ రోడ్డు నుంచి తిరిగి రావాల్సి వస్తోంది. – ఏర్నెని బాబు, మాజీ సర్పంచ్, కోదాడ ఫ 20 ఏళ్ల క్రితం దోరకుంట వద్ద ఏర్పాటు ఫ దరఖాస్తు చేసుకున్నవారికి స్థలం కేటాయింపు ఫ ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఏర్పాటు కాని పరిశ్రమలు ఫ మౌలిక వసతుల కల్పనలో అధికారులు విఫలంకనీస సౌకర్యాలు కరువు పారిశ్రామిక వాడకు కావాల్సిన మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదు. 20 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లపై కంకర తేలి నడవడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. వీధి దీపాలు వేసే దిక్కేలేదు. ఆ ప్రాతం మొత్తం కంపచెట్లు పెరిగి చీకటి పడితే వెళ్లడానికి భయపడే పరిస్థితి ఏర్పడింది. నీటి వసతి కూడా లేకపోవడంతో పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. కోదాడలోని ఖమ్మం క్రాస్ రోడ్డులో అనేక ట్రాక్టర్ ట్రాలీ, ఇతర వ్యవసాయ పనిముట్లు, షట్టర్లు తయారు చేసే పరిశ్రమలు రోడ్డుమీదే ఏర్పాటు చేశారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. వీరందరికీ పారిశ్రామిక వాడలో స్థలాలు కేటాయించాలని పలువురు కోరుతున్నా అది కార్యరూపం దాల్చడంలేదు. -
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులను ప్రోత్సహించాలి
గరిడేపల్లి : ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు చేసుకునేవిధంగా గర్భిణులను ప్రోత్సహించాలని డీఎంహెచ్ఓ కోటాచలం అన్నారు. శుక్రవారం గరిడేపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్సీడీ (నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్) కార్యక్రమంలో భాగంగా 30 సంవత్సరాలు పైబడిన వారందరూ తప్పనిసరిగా బీపీ, షుగర్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వేసవి కాలంలో ప్రజలు తమ పనులను ఉదయం 11 గంటలలోపు, సాయంత్రం 4 గంటల తర్వాత చేసుకోవాలన్నారు. మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఉండాలన్నారు. అత్యవసరమైతే తప్పనిసరిగా గొడుగు తీసుకుని వెళ్లాలన్నారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. వేసవి కాలంలో తీసుకునే జాగ్రత్తలపై ఉపాధి హామీ కూలీలకు అవగాహన కల్పించాలన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించి మందులు వాడేటట్లు చూడాలన్నారు. కార్యక్రమంలో జిల్లా టీబీ అధికారి డాక్టర్ నజీయా, ఏఓ డాక్టర్ శ్రీశైలం, డాక్టర్ నరేష్, ఎస్ఓ వీరయ్య, సతీష్, శారద, అంజయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
సూర్యాపేట కోర్టు సంచలన తీర్పు.. కూతురిని చంపిన తల్లికి ఉరిశిక్ష
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కూతుర్ని చంపిన కేసులో తల్లికి జిల్లా కోర్టు ఉరిశిక్ష విధించింది. మానసిక స్థితి సరిగ్గాలేదని కన్న కూతుర్నే తల్లి చంపేసింది. మోతె మండలం మేకపాటి తండాలో 2021, ఏప్రిల్‌లో జరిగిన ఘటనలో ఇవాళ జిల్లా న్యాయస్థానం తీర్పు చెప్పింది.నాంపల్లి పోక్సో కోర్టు సంచలన తీర్పు..నాంపల్లి పోక్సో కోర్టు కూడా ఇవాళ సంచలన తీర్పునిచ్చింది. బాలికపై లైంగికదాడి యత్నం చేసిన నిందితుడికి 25 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 2023లో రాజ్ భవన్ మక్త ప్రాంతంలో బాలికపై అత్యాచారయత్నం జరిగింది. సెల్‌ఫోన్ ఇస్తానని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి శ్రీనివాస్ అనే వ్యక్తి లైంగికదాడి యత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు శ్రీనివాస్‌పై పోలీసులపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్‌కు 25 జైలు శిక్షతో పాటు కోర్టు జరిమానా విధించారు. -
బియ్యం బాగున్నాయి
గతంలో బియ్యం కోసం ప్రతి నెలా రూ.2వేలు ఖర్చు చేశాం. ప్రస్తుతం రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేయడంతో మాకు ఆ డబ్బు మిగిలింది. బియ్యం బాగున్నాయి. అన్నం కూడా ఎంతో రుచిగా ఉంది. సన్న బియ్యంను మధ్యలో నిలిపివేయకుండా నిరంతరం సరఫరా చేయాలి –జటంగి నర్సమ్మ, కేతేపల్లి నెలకు రూ.1500 ఆదా అవుతున్నాయి ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం బాగానే ఉన్నాయి. మా ఏరియా వారందరూ సన్నబియ్యం వండుకుని తింటున్నారు. ప్రభుత్వం సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడం వల్ల మాకు బియ్యం కొనుగోలు చేయడం తప్పింది. నెలకు దాదాపు రూ.1500 వరకు ఆదా అవుతోంది. – రమ్య, హుజూర్నగర్ -
ధాన్యం కొనుగోళ్లు త్వరగా ప్రారంభించాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను త్వరగా ప్రారంభించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు సూచించారు. గురువారం చివ్వెంల మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. రైతులు ఆరబెట్టిన ధాన్యం తీసుకవచ్చి మద్దతు ధర పొందాలన్నారు. తేమశాతం 17 రాగానే సీరియల్ ప్రకారం తూకం వేయాలన్నారు. కాంటా వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాజేశ్వర్, నిర్వాహకులు కృష్ణారెడ్డి, మహేందర్ పాల్గొన్నారు. -
అమ్ముకోం.. వండుకుంటం
సన్న బియ్యంపై లబ్ధిదారుల సంతృప్తిసాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో సన్న బియ్యం పంపిణీపై ప్రజల నుంచి ఆనందం వ్యక్తం అవుతోంది. సరిగ్గా వండుకుంటే సమస్యే లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. గంజి సరైన సమయంలో సరిగ్గా వార్చకపోతే కొద్దిగా ముద్ద అవుతోందని, అయినా పరవాలేదని సన్న బియ్యం పంపిణీపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొత్త బియ్యం అయినందున కొన్నాళ్లు ఆగి వండుకుంటే మరింత బాగుంటుందని పేర్కొంటున్నారు. అక్కడక్కడ కొంతమేర నూకలు వస్తున్నా, దొడ్డు బియ్యంతో పోల్చితే సన్న బియ్యాన్ని పూర్తిగా వండుకొని తింటామని ప్రజలు చెబుతున్నారు. ఈ నెల మొదటి వారంలోనే సన్నబియ్యం సరఫరా అయ్యాయి. 90 నుంచి 60 శాతం మంది లబ్ధిదారులు బియ్యాన్ని ఇప్పటికే తీసుకెళ్లారు. తొలి మూడు, నాలుగు రోజులు లభ్దిదారులు షాపుల వద్ద బారులు తీరారు. సన్న బియ్యం చింట్లు, హెచ్‌ఎంటీలు రకంగా పలువురు చెబుతున్నారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్నవి ఫోర్టిఫైడ్ సన్నబియ్యం అని చెబుతున్నారు. సన్న బియ్యంలో మూడు రకాల బియ్యం ఉన్నాయని, 30శాతం వరకు నూకలు, మెరిగెలు ఉన్నాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. బియ్యం తీసుకున్న ప్రతి ఒక్కరూ వండుకుంటున్నారు ఎక్కడా అమ్ముకోవడం లేదు. బియ్యంలో సుమారు 15 నుంచి 20 శాతం వరకు నూకలు ఉన్నట్లు లబ్ధిదారులు తెలుపుతున్నారు. బియ్యం తినడానికి వీలుగా ఉన్నట్లు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అన్నం బాగానే ఉంటుందని గంజి వార్చితే ఇంకా బాగుంటుందని మహిళలు చెబుతున్నారు. ఇదివరకు దొడ్డు బియ్యం ఇస్తుండడంతో తాము పిండి పట్టించడానికి ఇతర అవసరాలకు వాడుకున్నామని, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతో అన్నం వండుకొని తింటున్నట్లు పలువురు లబ్ధిదారులు పేర్కొంటున్నారు. సన్న బియ్యం తీసుకున్న ప్రజలు ఆ బియ్యంతో ఏం చేస్తున్నారు.. గతంలో దొడ్డు బియ్యాన్ని ఇడ్లీ, దోశలకు వినియోగించినట్లుగానే వినియోగిస్తున్నారా? వాటిలా అమ్ముకునేందుకు ఆలోచన చేస్తున్నారా? లేదంటే తినేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారా? అనే అంశాలపై ‘సాక్షి’ గురువారం క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపింది. లబ్ధిదారులతో మాట్లాడింది. మొత్తానికి సన్న బియ్యంను తాము తినేందుకే వినియోగిస్తామని ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్‌లో ప్రజలు ముక్తకంఠంతో చెప్పుకొచ్చారు. ఇంకా సాగుతున్న పంపిణీ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం రేషన్ షాపులు 2122 ఉండగా, వాటి పరిధిలో 10,08,829 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆయా కార్డులపై ప్రతినెలా 1,75,70,855 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ నెలలో సన్న బియ్యం పంపిణీని ప్రారంభించింది. ఇందులో భాగంగా 1,92,12,855 కిలోల బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేయగా, ఇప్పటివరకు 1,44,47,914 కిలోల బియ్యాన్ని ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. ఇంకా 31.22.941 కిలోల బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. పేదలకు మేలు సన్నబియ్యం పంపిణీతో పేదలకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో దొడ్డుబియ్యం పంపిణీతో దళారులకు లబ్ధిచేకూరేది. ఆ బియ్యాన్ని తినలేక చాలా మంది అమ్ముకునేవారు. కోళ్లకు, గేదెలకు పెట్టేవారు. ఇప్పుడు ప్రతిఒక్కరూ ఈ బియ్యాన్నే తింటారు. – గంపల కిష్టమ్మ, నెమ్మికల్లు, ఆత్మకూర్(ఎస్) మండలం సన్నబియ్యం పర్వాలేదు గతంలో ఇచ్చిన దొడ్డు రకం బియ్యం కంటే ప్రస్తుతం రేషన్ దుకాణంలో ఇస్తున్న సన్న బియ్యం పర్వాలేదు. అన్నం కొద్దిగా మెత్తగా అవుతోంది. గతంలో ఉన్న బియ్యం తినలేకపోయాం. నాకు నెలకు ఆరు కిలోలు వస్తాయి. సన్నబియ్యం నిరంతరం ఇస్తే బాగుంటుంది. – కిన్నెర రాములమ్మ, తిప్పర్తిఫ సరిగ్గా వండితే.. సాఫీగానే భోజనం ఫ కొన్నిరోజులు ఆగి వండుకుంటే మరింత బాగు ఫ గంజి సరిగ్గా వార్చకపోతే కాస్త ముద్దగా అన్నం ఫ కొంతమేర నూకలు.. అయినా బాగున్నాయని ఆనందం -
నేడు కోదాడ బార్ అసోసియేషన్ ఎన్నికలు
కోదాడరూరల్ : కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడి ఎన్నిక దాదాపుగా ఏకగ్రీవమైనట్లే. అధ్యక్ష పదవికి న్యాయవాదులు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, నాళం రాజయ్యలు పోటీపడుతున్నారు. అయితే బార్ అసోసియేషన్ క్షేమం కోరి సీనియర్ల సలహా మేరకు నాళం రాజయ్య పోటీ నుంచి విరమించుకొని లక్ష్మీనారాయణరెడ్డికే మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బార్ కౌన్సిల్ నియమావళి ప్రకారం ఎన్నిక జరగాల్సి ఉన్నప్పటికీ రాజ య్య పోటీనుంచి తప్పుకోవడంతో లక్ష్మీనారాయణరెడ్డి ఎన్నిక దాదాపుగా ఖరారు అయింది. శుక్రవారం అధ్యక్ష పదవితో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్ 4వ స్థానానికి ఎన్నికను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు పోలింగ్ ఆ తర్వాత కౌంటింగ్ నిర్వహించి విజేతలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లో 104 మంది న్యాయవాదులు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నట్లు నాగేశ్వరరావుతో పాటు సహాయ అధి కారులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ తెలిపారు. ఉపాధి పనులను వాటర్ షెడ్ పద్ధతిలో గుర్తించాలి భానుపురి (సూర్యాపేట) : యుక్తధార పోర్టల్ ద్వారా ఉపాధి హామీ పనులను వాటర్ షెడ్ పద్ధతిలో గుర్తించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్, టెక్నికల్ అసిస్టెంట్లకు యుక్త ధార శిక్షణ తరగతుల్లో డీఆర్డీఓ వీవీ అప్పారావుతో కలిసి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీలో వాటర్ షెడ్ పద్ధతిలో ఎత్తు పల్లాల నుంచి దిగువపల్లం వరకు సంబంధించిన పనులను పోర్టల్‌లో గుర్తించాలన్నారు. సాగర్ కాల్వలకు నీటి నిలిపివేతనాగార్జునసాగర్: సాగర్ కుడి, ఎడమ కాల్వలకు గురువారం సాయంత్రం నీటిని నిలిపి వేశారు. యాసంగి పంటకుగాను అధికారులు గత సంవత్సరం డిసెంబర్ 15 నుంచి ఆయకట్టుకు ఏకధాటిగా నీటిని విడుదల చేశారు. కుడికాల్వ కింద ఏపీలో 10.50 లక్షల ఎకరాలు సాగైంది. ఎడమకాల్వ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3,98,790 ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2,63,736 ఎకరాల్లో వరి సాగైంది. ఈ సీజన్లో 115 రోజులపాటు కుడి కాల్వకు 100టీఎంసీలు, ఎడమ కాల్వకు 74టీఎంసీల నీటిని విడుదల చేశారు. విద్యుత్‌లైన్ పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలిహుజూర్నగర్రూరల్ : విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రాంక్లిన్ సిబ్బందిని ఆదేశించారు. హుజూర్నగర్ మండలంలోని వేపలసింగారంలో మంగళవారం అర్ధరాత్రి వీచిన ఈదురుగాలులకు సబ్‌స్టేషన్‌కి వచ్చే 33 కేవీ లైన్ విద్యుత్ స్తంభాలు ఎనిమిది విరిగిపోయాయి. కాగా గురువారం డీఈ వెంకటస్వామితో కలిసి విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులను పరిశీలించి మాట్లాడారు. వీరి వెంట ఏఈ రాంప్రసాద్, సిబ్బంది తదితరులు ఉన్నారు. -
సర్కారు బడి బలోపేతానికి..
వేసవి సెలవులకు ముందే బడిబాట ఫ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యం ఫ 23 వరకు కొనసాగనున్న కార్యక్రమంప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని వసతులు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కూడా లేదు. నాణ్యమైన బోధన అందుతోంది. కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన బోధన, డిజిటల్ తరగతులు, సౌకర్యాలు కల్పిస్తున్నాం. పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆసక్తితో స్వచ్ఛందంగా వారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. – అశోక్, డీఈఓ సూర్యాపేటటౌన్ : సర్కారు బడి బలోపేతానికి కొందరు ఉపాధ్యాయులు నడుం బిగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా వేసవి సెలవులకు ముందే వీరు స్వచ్ఛందంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అధికారికంగా కాకపోయినప్పటికీ రెండు మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఈనెల 23 వరకు కొనసాగనుంది. జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు.. జిల్లాలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు మెత్తం 950 ఉన్నాయి. వీటిలో 690 ప్రాథమిక, 70 ప్రాథమికోన్నత, 190 ప్రభుత్వ ఉన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 70వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా బడిబాట కార్యక్రమాన్ని ఏటా జూన్‌లో నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏడాది ముందస్తుగానే స్వచ్ఛందంగా ఉపాధ్యాయులు బడిబాట నిర్వహిస్తున్నారు. ముందస్తుగానే విద్యార్థుల గుర్తింపు.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన కొంత మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి స్వచ్ఛందంగా ముందస్తుగా బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఒంటి పూట బడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఉదయం 7 నుంచి ఉదయం 8 గంటల మధ్య నిర్వహిస్తున్నారు. మరి కొన్ని పాఠశాలల్లో మధ్యాహ్నం 12.30 గంటల తర్వాత నిర్వహిస్తున్నారు. గ్రామంలో బడిబయట ఉన్న పిల్లలు, ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, మోడల్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులను గుర్తించి స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సర్కారు కల్పిస్తున్న సౌకర్యాలు, డిజటల్ తరగతులు గురించి పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. గుర్తించిన పిల్లలను జూన్ మొదటి వారంలో లో నిర్వహించే అధికారిక బడిబాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో చేర్చుకోనున్నారు. రెండు మూడు రోజుల్లో జిల్లా వ్యాప్తంగా.. ప్రతి సారి జూన్‌లో బడిబాట నిర్వహిస్తుండటంతో అప్పటికే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో అడ్మిషన్లు పొందుతున్నారు. ఈ విషయాన్ని కొంత మంది ప్రధానోపాధ్యాయులు కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ సారి జిల్లాలో ముందస్తుగానే బడిబాట నిర్వహించి పాఠశాలలు ముగిసే సమయానికి జిల్లా అంతా బడిబాట నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే జిల్లాలో మరో రెండు మూడు రోజుల్లో అన్ని పాఠశాలల్లో బడిబాట నిర్వహించాలని ఆదేశాలు రానున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. -
నల్లగొండ రీజియన్‌కు 152 ఎలక్ట్రిక్ బస్సులు
భానుపురి (సూర్యాపేట): నల్లగొండ ఆర్టీసీ రీజియన్ పరిధిలో బస్సుల కొరత తీరనుంది. డొక్కబస్సుల స్థానంలో త్వరలో అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. నల్లగొండ రీజియన్‌కు 152 బస్సులను కేటాయించారు. వీటిలో ఇప్పటికే 41 ఎలక్ట్రిక్ బస్సులు సూర్యాపేట డిపోకు చేరుకున్నాయి. మిలిగిన బస్సులు త్వరలోనే ఆయా డిపోలకు రానున్నాయి. ఈ బస్సులన్నీ చార్జింగ్తోనే నడవనున్నాయి. ప్రస్తుతం సూర్యాపేట, నల్లగొండలో ఈ చార్జింగ్ పాయింట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. రెండుచోట్ల చార్జింగ్ పాయింట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొద్దిరోజులుగా ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రధాన నగరాలకు ఈ బస్సులు ఇప్పటికే నడుస్తున్నాయి. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిలో ప్రధాన బస్టాండ్ అయిన సూర్యాపేట హైటెక్ బస్టాండ్‌లో ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం చార్జింగ్ పాయింట్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ చార్జింగ్ పాయింట్లో రోజుకు ఐదారు బస్సులకు మాత్రమే చార్జింగ్ పెడుతున్నారు. సూర్యాపేట డిపోకు దాదాపు 77 బస్సులు రావడంతో కొత్తబస్టాండ్ డిపో ఆవరణలోనూ చార్జింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇక నల్లగొండలో కూడా చార్జింగ్ పాయింట్ పనులు కొనసాగుతున్నాయి. ఆయా బస్టాండ్ల నుంచి హైదరాబాద్‌కు ఎక్కువ మొత్తంలో బస్సులను నడపనున్నారు. నల్లగొండ – సూర్యాపేట, సూర్యాపేట – వరంగల్, సూర్యాపేట – ఖమ్మం, నల్లగొండ– మిర్యాలగూడ రూట్లలో ఇలా డిపోల పరిధిలో బస్సులను నడపనున్నారు. డ్రైవర్లకు శిక్షణ అత్యాధునిక సదుపాయాలతో ఉన్న ఈ ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు హైదరాబాద్‌లో డ్రైవర్లకు సుమారు 20 రోజులుగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ముగిసిన వెంటనే బస్సుల రూట్లను పూర్తిస్థాయిలో కేటాయిస్తారు.ఫ సూర్యాపేటకు 75, నల్లగొండకు 77 బస్సుల కేటాయింపు ఫ ఇప్పటికే సూర్యాపేట డిపోకు 41 బస్సులు రాక ఫ త్వరలో రోడ్డెక్కనున్న బస్సులుప్రయాణికులకు మెరుగైన రవాణా ప్రయాణికులకు ఆర్టీసీ మెరుగైన రవాణా సదుపాయాలు కల్పించడానికి అత్యాధునిక బస్సులను ప్రవేశపెడుతోంది. త్వరలోనే రీజియన్‌కు కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డుపైకి రానున్నాయి. ఆయా రూట్లలో బస్సుల కొరత తీరడంతో పాటు ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణం అందనుంది. – జాన్‌రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం -
ఈదురుగాలులు.. వడగండ్ల వర్షం
హుజూర్‌నగర్‌రూరల్ : హుజూర్నగర్ మండలంలో మంగళవారం అర్ధరాత్రి ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం కురవడంతో రైతులు ఆరబెట్టిన ధాన్యం రాశులు తడిసిపోయాయి. వేపలసింగారంలో కొనుగోలు కేంద్రంలో రైతులు చల్మారెడ్డి, యూకుబ్లకు చెందిన సుమారు 10 ఎకరాల ధాన్యం తడవడంతో పాటు రాశులపై కప్పిన పట్టాలపై వర్షపు నీరు నిలిచింది. దీంతో ఆ నీటిని తొలగించి బుధవారం వాటిని ఆరబెట్టారు. అంతేకాకుండా బూరుగడ్డ, శ్రీనివాసపురం, లక్కవరం, అమరవరం గ్రామాల్లో కోతకు దశకు వచ్చిన వరి పొలాలు నేలవాలాయి. ఆకాల వర్షానికి నష్టపోయిన రైతులను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతు సంఘాల నాయకులు కోరారు. తోటల్లో రాలిన మామిడి, నిమ్మ కాయలు తిరుమలగిరి (తుంగతుర్తి): తిరుమలగిరి మండలంలో మంగళవారం అర్ధరాత్రి వీచిన భారీ ఈదురు గాలులకు మామిడి, నిమ్మతోటలకు నష్టం వాటిల్లింది. జలాల్పురం, తొండ గ్రామాల్లో తోటల్లో మామిడికాయలు, నిమ్మకాయలు రాలాయి. ఫ అకాల వర్షానికి తడిసిన ధాన్యం ఫ నేలవాలిన వరి చేలు -
కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఇద్దరు పోటీ
కోదాడరూరల్: కోదాడ బార్అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఇద్దరు న్యాయవాదులు పోటీపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పలు పదవులు ఏకగ్రీవం కాగా కొన్ని పదవులకు పోటీ తప్పలేదు. అధ్యక్ష పదవికి సీహెచ్.లక్ష్మీనారాయణరెడ్డి, నాళం రాజయ్య పోటీలో ఉండగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ 4వ స్థానానికి ఎండి.హుస్సేన్, ఎస్. నవీన్‌కుమార్‌లు పోటీపడుతున్నారు. కాగా వైస్ ప్రెసిడెంట్‌గా ఉయ్యాల నర్సయ్య, జాయింట్ సెక్రటరీగా ఎండి.నయీం, లైబ్రరీ సెక్రటరీగా షేక్.కరీముల్లా, ట్రెజరర్‌గా కోడూ రు వెంకటేశ్వరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్సెక్రటరీగా బండారు రమేష్‌బాబు, లేడీ రిప్రజెంటేటివ్‌గా ధనలక్ష్మితో పాటు ఈసీ మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎన్నికల అధికారి పాలేటి నాగేశ్వరరావు, సహాయ అధికారులు వెంకటేశ్వర్లు, రామకృష్ణ తెలిపారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలిచివ్వెం(సూర్యాపేట) : విద్యార్థుల ఆహారం, ఆరోగ్యం విషయంలో నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి సూచించారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని విజయకాలనీలో ఉన్న బాల సదన్ చిల్ట్రన్స్ హోమ్‌ను తనిఖి చేశారు. విద్యార్థులను మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు క్రమ శిక్షణ పట్టుదలతో చదివి, భావిపౌరులుగా ఎదగాలని సూచించారు. ఈకార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి, బి.విష్ణు స్వ రూప్ పాల్గొన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి కోదాడరూరల్ : యువత చెడువ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్పీ కొత్తపల్లి నరసింహ సూచించారు. బుధవారం రాత్రి కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండలో నిర్వహించిన పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యువత చిన్నవయస్సులోనే గంజాయి వంటి మత్తుపదార్థాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటోందన్నారు. తల్లిదండ్రులు పిల్లల కదలికలను గమనిస్తుండాలన్నారు. సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. కొంతమంది స్వార్థంతో దాడులకు పాల్పడుతున్నారని తమ దృష్టికి వచ్చిందని అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఎం.శ్రీధర్‌రెడ్డి, రూరల్ సీఐ రజితారెడ్డి, రూరల్ ఎస్ఐ ఎం.అనిల్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రి భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలి
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో చేపట్టిన 650 పడకల భవన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. బుధవారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో వైద్య అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో నూతన భవన నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నూతన భవన నిర్మాణ ప్లానింగ్‌ను పరిశీలించారు. ఏ అంతస్తులో ఏ డిపార్ట్మెంట్ వస్తుందో అడిగి తెలుసుకొని కొన్ని సూచనలు చేసి మార్పుల కోసం టీఎస్ఎంఐడీసీకి ప్రతిపాదనలు పంపాలని ఆయన కోరారు. ఆ తర్వాత హెచ్ఓడీల వారీగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్పిటల్‌కు వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. తర్వాత నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి వైద్య సేవలు అందించేందుకు భవనాలు అందుబాటులోకి తేవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సత్యనారాయణ, దేవేందర్, ఈఈ జైపాల్ రెడ్డి, హెచ్ఓడీలు, ఏఈలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సాధించాలి భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు సాధించేందుకు ఉపాధ్యాయులందరూ కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీస సామర్థ్యాల సాధనలో భాగంగా పాఠశాలలు ప్రారంభమైన మొదటి 60 రోజుల్లో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పది రోజులకు ఒకసారి పరీక్ష నిర్వహించాలన్నారు. పరీక్షకు పరీక్షకు విద్యార్థి మార్కుల్లో పురోగతి కన్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరారు. సూర్యాపేట జిల్లా వానాకాలం, యాసంగి సీజన్ లలో అత్యధికంగా వరి పంట సాగు చేసి రాష్ట్రానికి అన్నం పెట్టేలా ఎదిగిందన్నారు. అలాగే చదువులో కూడా జిల్లాను ఉన్నత స్థాయి కి చేర్చి మోడల్‌గా మార్చాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, సెక్టోరియల్ అధికారి జనార్దన్, మండల విద్యాశాఖ అధికారులు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు, ఆర్పీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ధాన్యం ట్రాక్టర్ల బారులు
నేరేడుచర్ల: రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవడానికి నేరేడుచర్లలో కమీషన్ ఏజెంట్లను ఆశ్రయించారు. దీంతో వారి దుకాణాల వద్ద ధాన్యం ట్రాక్టర్లు బారులుదీరాయి. పట్టణంలోని హుజూర్నగర్ రోడ్డు, జాన్‌పహాడ్ రోడ్డులో వందలాది ధాన్యం ట్రాక్టర్లు నిల్చున్నాయి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈనెల 8న స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసింది. కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే ఖరీదు చేస్తుండటంతో రైతులు కమీషన్ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పినా పచ్చి ధాన్యం అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఆరబోసేందుకు సరైన స్థలం లేకపోవడం, బస్తాల కొరత ఉండటంతో రైతులు దళారులు, మిల్లర్లను ఆశ్రయిస్తున్నారు. వీరు వారం రోజుల క్రితం రూ.2500 కొనుగోలు చేయగా ప్రస్తుతం రూ. 2200 నుంచి రూ.2250 వరకు కొనుగోలు చేస్తున్నారు. -
మహాత్మా.. కదిలించు!
కోదాడ: కోదాడ పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ పేరిట ఏర్పాటు చేసిన పార్కు ఆక్రమణకు గురైంది. కొందరు పూల వ్యాపారులు పార్కు స్థలాన్ని కబ్జా చేసి తమ దుకాణాలను విస్తరించారు. వాకింగ్ ట్రాక్‌ను సైతం ఆక్రమించేశారు. పూల వ్యర్థాలను కూడా పార్కులోనే డంపు చేస్తున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదు. మున్సిపాలిటీ పరిపాలన వ్యవహారాలను చూడాల్సిన ప్రత్యేక అధికారి కనీసం చుట్టపుచూపుగా కూడా రావడంలేదన్న విమర్శలున్నాయి. 12 అడుగుల మేర లోపలికి చొచ్చుకొని వచ్చి.. కోదాడ మున్సిపాలిటీలో 80వేలకుపైగా జనాభా ఉన్నారు. కోదాడ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో మున్సిపాలిటీ కార్యాలయం పక్కన గాంధీ పేరిట పార్కును ఏర్పాటు చేశారు. ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడం కోసం దీనిని ఏర్పాటు చేశారు. గతంలో దీన్ని కొందరు కారు పార్కింగ్ కోసం ఉపయోగిస్తుండగా అప్పటి మున్సిపల్ కమిషనర్ బాలోజినాయక్ వారిని ఖాళీ చేయించి దానిలో మొక్కలు పెట్టారు. ఈ పార్కుకు జాతీయ రహదారి వైపు కొందరు చిన్న బండ్లపై పూల వ్యాపారం చేసుకుంటారు. కొంత కాలంగా ఈ వ్యాపారులు తమ డబ్బాకొట్లను కొద్దికొద్దిగా పార్కు లోపలకు విస్తరిస్తూ దాదాపు 12 అడుగుల మేరలోపలికి చొచ్చుకొనిపోయి పక్కానిర్మాణాలు చేసుకున్నారు. ఇంతటి తో ఆగకుండా పార్కు లోపల వాకింగ్ ట్రాక్నూ కబ్జాచేశారు. దీంతో పార్కుకు వచ్చేవారు నడవకుండా అయ్యింది. పాడైపోయిన పూలు, చెత్తను పార్కులోపలే వేస్తున్నారు. పూలవ్యాపారులు తమ ద్విచక్రవాహనాలను పార్కులోపలే పార్కింగ్ చేస్తున్నారు. దీంతో పార్కుకు వచ్చేవారు ఇబ్బందులు పడాల్సివస్తోంది. నిర్వహణ మరిచిన మున్సిపల్ అధికారులు గాంధీ పార్కు అభివృద్ధి పేరుతో గత పాలకవర్గం లక్షల రూపాయలను ఖర్చు చేసింది. మొదట పార్కులోపల రూ.10 లక్షలు ఖర్చు చేసి ఓపెన్‌జిమ్, పిల్లలు ఆడుకునే కొన్ని వస్తువులను ఏర్పాటు చేశారు. నాణ్యత లేకపోవడంతో కొద్దిరోజుల్లోనే అవన్నీ పాడైపోయాయి. తరువాత మరో రూ. 25 లక్షలు ఖర్చుపెట్టి పార్కులోపల మొక్కలునాటారు. గ్రీనరీతో పాటు వాకింగ్ ట్రాక్ లను ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ మరువడంతో ప్రస్తుతం పార్కులో సగం మొక్కలు చనిపోయాయి. ఇక పార్కులోపల ఏర్పాటు చేసిన మూత్రశాలలకు తాళం వేసిఉంచారు. దాన్ని తీసేనాథుడే లేడు. పార్కు నిర్వహణకు ఒకరిని నియమించాలి గాంధీపార్కుతో పాటు పట్టణంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఉత్తమ్ పద్మావతినగల్లోని పార్కు, పట్టణ ప్రకృతి వనాలలో మొక్కలు ఎండిపోతున్నాయి. గాంధీ పార్కువద్ద ఆక్రమణల విషయంలో ము న్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలి. మున్సిపాలిటీ కాంప్లెక్స్‌పై అనుమతి లేకుండా నిర్మాణం చేసిన షెడ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ప్రత్యేక అధికారి మున్సిపాలిటీ విషయాలపై దృష్టిసారించాలి. –కుదరవెళ్లి బసవయ్య, కోదాడకోదాడ పట్టణంలోని గాంధీ పార్కులో ఆక్రమణల జోరు ఫ తాత్కాలికంగా కొట్లు ఏర్పాటు చేసి ఆ తర్వాత పక్కా నిర్మాణాలు ఫ పార్కుస్థలంలోపలి వరకు దుకాణాల విస్తరణ ఫ వాకింగ్ ట్రాక్ సైతం కబ్జా ఫ చెత్త మొత్తం పార్కులోనే డంపు ఫ చోద్యం చూస్తున్న మున్సిపల్ అధికారులు -
పెంచిన గ్యాస్ ధర తగ్గించాలి
సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపునకు నిరసనగా సీపీఐ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట పట్టణంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి పేద ప్రజల పై భారం మోపిందన్నారు. కార్యక్రమంలో అనంతుల మల్లేశ్వరి, కొప్పోజు సూర్యనారాయణ, దొడ్డ వెంకటయ్య, బూర వెంకటేశ్వర్లు, చామల అశోక్ కుమార్, ఖమ్మంపాటి రాము, రేగట్టి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన సేవలందించాలి
కోదాడ: కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్‌నంద్‌లాల్ పవార్ కోరారు. మంగళవారం కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు పాల్గొన్నారు. వంద పడక వైద్యశాల నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై వారు అధికారులతో సమీక్షించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్యులు పనిచేయాలని కోరారు. వైద్యుల కొరత లేకుండా త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ దశరథనాయక్, ఆర్డీఓ సూర్యానారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్లకు స్లాట్ బుకింగ్
త్వరలోనే ఆధార్ ఈ– సంతకం ప్రస్తుతం రిజిస్ట్రేషలన్లు జరిగే సమయంలో ఆయా ఆస్తులకు సంబంధించి అమ్మినవారు, కొనుగోలు చేసే వారు కార్యాలయాలకు వెళ్లి వ్యక్తిగతంగా సంతకాలు చేయాల్సిన విధానం ఉంది. ఈ సంతకాలు చేసే క్రమంలో చాలా సమయం పడుతుండడంతో దస్తావేజుల ప్రక్రియ ఆలస్యమవుతోంది. సమయం వృథాను నివారించడంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ఆధార్ ఈ– సంతకం విధానాన్ని ప్రవేశపెట్టనుంది. త్వరలోనే విదివిధానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విధానం ఈనెలాఖరు నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.చౌటుప్పల్: ఇళ్లు, ఇంటిస్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు గతంతో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే జరిగేవి. ఽగత ప్రభుత్వ హయాంలో 2020లో తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌తో వ్యవసాయ భూములు తహసీల్దార్ కార్యాలయాల్లో, వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగేవి. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లకు సంబంధించి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద ఆయా ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం నిరీక్షణ కొనసాగుతుండేది. ఈ పద్ధతికి స్వస్తి పలకడంతోపాటు సమర్థవంతంగా, పారదర్శకంగా సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ నూతనంగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రాష్ట్రంలో 144 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా ప్రయోగాత్మకంగా 22 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈనెల 10వ తేదీ నుంచి అమలు చేయనుంది. ఈ కార్యాలయాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఎంపిక చేసిన 22 కార్యాలయాల్లో భువనగిరి, చౌటుప్పల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు కూడా ఉన్నాయి. ప్రతిరోజు 48 స్లాట్లుగా విభజన ఇప్పటివరకు ఆస్తుల రిజిస్ట్రేషన్ జరగాలంటే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. ఇలాంటి ఇబ్బందులను నివారించడానికి ప్రభుత్వం నూతన విధానాన్ని తీసుకువచ్చింది. ఒకే రోజు ఒకే సమయంలో అత్యధిక డాక్యుమెంట్లు సమర్పిండంతో జరిగే జాప్యాన్ని నివారించేందుకు ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ రోజువారీ పనివేళలను 48స్లాట్లుగా విభజించనున్నారు. ప్రజలు డాక్యుమెంట్ రైటర్లపై ఏమాత్రం ఆధారపడకుండా registration.tela ngana.gov.in వెబ్సైట్లో తమకు అనుకూలమైన తేదీ, రోజును ఎంచుకొని ఆ సమయానికి కార్యాలయానికి చేరుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఈ స్లాట్ బుకింగ్ ద్వారా జరిగే రిజిస్ట్రేషన్ పూర్తిగా 10– 15నిమిషాల్లోనే పూర్తికానుంది. ఫలితంగా క్రయవిక్రయదారులకు ఎంతో సమయం కలిసిరానుంది. రేపటి నుంచి భువనగిరి, చౌటుప్పల్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు ఇళ్లు, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు కొత్త విధానం స్లాట్ బుకింగ్ లేని ఐదు డాక్యుమెంట్లకు అనుమతి స్లాట్ బుకింగ్ విధానం అమలులోకి వచ్చిన తర్వాత కూడా స్లాట్ బుకింగ్ చేసుకోని వారిని విస్మరించొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. స్లాట్ బుకింగ్ చేసుకోని 5 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ చేసే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ప్రతిరోజు సాయంత్రం 5గంటల నుండి 6గంటల వరకు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లకు అనుమతి ఉంటుంది. అప్పటికే సిద్ధం చేసుకున్న డాక్యుమెంట్లతో క్రయవిక్రయదారులు నేరుగా కార్యాలయానికి చేరుకుంటే ఐదు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. -
కక్షిదారులకు అందుబాటులో ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : న్యాయవాదులు కక్షిదారులకు అందుబాటులో ఉండాలని జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్ శ్రీ అన్నారు. మంగళవారం సూర్యాపేట పట్టణంలోని సఖీ సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన జువైనల్ కోర్టును ప్రారంభించి మాట్లాడారు. 18 సంవత్సరాల లోపు బాల బాలికలు నేరాలకు పాల్పడితే జువైనల్ కోర్టులో విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. అదే విధంగా రిమాండ్‌లో భాగంగా నల్లగొండలొని చైల్ట్ హోంకు తరలించనున్నట్లు తెలిపారు. బాలలు చెడు వ్యసనాలకు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి మంగళవారం కోర్టులో విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, ఉపాధ్యక్షుడు గుంటూరు మధు, సీనియర్, జూనియర్ లాయర్లు తదితరుల పాల్గొన్నారు. ఫ జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎమ్.శ్యామ్ శ్రీ -
టార్గెట్ రూ.6
కోట్లుసూర్యాపేట మున్సిపాలిటీలో ఈ నెల ఆస్తిపన్ను వసూలు లక్ష్యం ఇదీజూన్ దాటితే .. మున్సిపాలిటీలో ప్రతి ఆరు నెలలకు సంబంధించిన ఆస్తి పన్నును మొదటి మూడు నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల ఆస్తి పన్నును జూన్ నెలాఖరులోగా చెల్లించకుంటే ఆస్తి పన్నుపై ఫైన్ పడుతుంది. అదే విధంగా అక్టోబర్ నుంచి మరుసటి ఏడాది మార్చికి సంబంధించిన ఆరు నెలల ఆస్తి పన్నును డిసెంబర్ నెలాఖరులోగా చెల్లించాల్సి ఉంటుంది. గడువులోగా ఆస్తి పన్ను చెల్లించని వారికి అపరాధరుసుంతో సహాచెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆస్తి పన్ను చెల్లింపులకు సంబంధించి గడువు ప్రకారం చెల్లించకపోతే ఆటోమెటిక్‌గా కంప్యూటర్లో అపరాధ రుసుంతో జనరేట్ అవుతుంది. అపరాధ రుసుముకు సంబంధించి తగ్గింపు లాంటివి ఇక్కడి స్థానిక మున్సిపల్ అధికారుల పరిధిలో ఉండదు. దీనిపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తుంది. భవన యజమానులందరు అపరాధ రుసుం పడకుండా ఉండాలంటే ఏప్రిల్ నెలలో ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీలో వచ్చే ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నులో భాగంగా ఈనెలలో రూ.6కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆస్తి పన్ను మొత్తం ఒకేసారి ముందస్తుగా చెల్లించిన వారికి 5శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఈ రాయితీ నివాస, వాణిజ్య భవనాలకు వర్తించనుంది. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.90లక్షలు వసూలు చేశారు. ఈనెల 30తో రాయితీ గడువు ముగియనుంది. ఆస్తి పన్ను రాబట్టుకోవడానికి.. ఆస్తి పన్ను రాబట్టుకోవడానికి మున్సిపల్‌శాఖ రాయితీ అవకాశం కల్పించింది. ఏడాదికి సంబంధించిన ఆస్తి పన్ను మొత్తం ఒకే సారి చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఈమేరకు ఆశాఖ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. రాయితీ ప్రకటనతో ఎక్కువ మంది ముందస్తుగా తమ ఆస్తి పన్ను చెల్లించడానికి మొగ్గు చూపుతున్నారు. దీనిని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి తద్వారా ఏప్రిల్ మాసంలోనే ఎక్కువ శాతం ఆస్తి పన్ను వసూలు చేసుకోవాలని మున్సిపల్ అధికారులు లక్ష్యంగా పెట్టుకుంటున్నారు బకాయిలతో సహా చెల్లిస్తేనే.. మున్సిపల్ పట్టణంలోని భవనాలు, బహుళ వాణిజ్య భవనాలకు గతంలో ఎలాంటి ఆస్తి పన్ను బకాయిలు లేని వారు మాత్రమే ఐదు శాతం రాయితీకి అర్హులు అవుతారు. 2025 మార్చి 31లోపు రూపాయి కూడా ఆస్తి పన్ను బకాయి ఉండకూడదు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొత్తం ఆస్తి పన్ను ను ఈనెల 30వ తేదీలోగా పూర్తిగా చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ఇస్తారు. బకాయి ఉన్న వారు బకాయితో సహా చెల్లిస్తే ఈ ఏడాదికి సంబంధించిన పన్నులో 5 శాతం రాయితీ ఇవ్వనున్నారు. ఉదాహరణకు ఏడాదికి లక్ష రూపాయల ఆస్తి పన్ను చెల్లించే వారికి ముందస్తుగా చెల్లించడం ద్వారా రూ. 5వేల ను భవనాల యజమానులు లబ్ధిపొందనున్నారు. ఆస్తి పన్ను ఆలస్యంగా చెల్లించినా అపరాధ రుసుం చెల్లించాలి. అందువల్ల ప్రజలు ఈ5 శాతం రాయితీని వినియోగించుకుంటే బాగుంటుంది.రాయితీని సద్వినియోగం చేసుకోవాలి ఇంటి యజమానులు ఈ సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ఒకేసారి చెల్లించి 5శాతం రాయితీ పొందాలి. బకాయిలతో సహా ఈ ఏడాది పన్ను చెల్లిస్తే కూడా రాయితీ వర్తించనుంది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. జూన్ తర్వాత పెనాల్టీ పడుతుంది. – బి.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట ఇప్పటి వరకు రూ.90లక్షలు వసూలు సూర్యాపేట మున్సిపాలిటీలో 35,429 నివాస గృహాలు, వాణిజ్య సముదాయాలున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తిపన్ను డిమాండ్ రూ.15కోట్లు ఉంది. ఎర్లీబర్డ్ స్కీం కింద ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5శాతం రాయితీ కల్పిస్తున్నారు. ఈనేపథ్యంలో ఈనెలలో రూ.6 కోట్లు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. 20 మంది మున్సిపల్ సిబ్బంది, ఆర్ఓ కలిసి మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.90లక్షలు వసూలు చేశారు. ఫ ఎర్లీబర్డ్ స్కీం కింద 5శాతం రాయితీ ఫ ముందస్తు ఆస్తి పన్ను చెల్లించే వారికి వర్తింపు ఫ ఇప్పటి వరకు రూ.90లక్షలు వసూలు సూర్యాపేట మున్సిపాలిటీలో ఆస్తి పన్ను వివరాలు(రూ. కోట్లలో) సంవత్సరం మొత్తం ఏప్రిల్ వసూలు డిమాండ్ టార్గెట్ 2024–25 13.60 5 4.982025–26 15 6 0.90 -
బెట్టింగ్‌కు పాల్పడితే చర్యలు : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పతే చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆన్లైన్ గేమ్స్, పేయింగ్ గేమ్స్, ఆన్లైన్ జూదం, రమ్మి లాంటి ఆటలతో పాటు ఇతరత్రా బెట్టింగ్‌లకు పాల్పడవద్దని సూచించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో యువత అధికంగా క్రికెట్ బెట్టింగ్ యాప్‌లు, ఇతర బెట్టింగ్‌ల మోజులో పడి వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకోవడమే కాకుండా ఆప్పుల పాలై ప్రాణాల మీదికి తెచ్చుకుంటోందని పేర్కొన్నారు. ఈ బెట్టింగ్ భూతాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సూచించారు. ఎవరైన బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తెలిస్తే పోలీసులకు గానీ లేదా డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని కోరారు. యోగిక్ అగ్రికల్చర్ శిక్షణలో రైతు నర్సింహారావునడిగూడెం : నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన ఆదర్శ రైతు మారిశెట్టి నర్సింహారావు రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 3 నుంచి 8 వరకు నిర్వహించిన శాశ్వత యోగిక్ అగ్రికల్చర్ శిక్షణలో పాల్గొన్నారు. మంగళవారం శిక్షణ ముగింపు సందర్భంగా ఆయన సంస్థ నుంచి ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగు మందుల వల్ల కలిగే దుష్ఫప్రభావాలు, ప్రకృతి కాలుష్యం అవుతున్న విధానం, తద్వారా జరిగే ప్రకృతి వైపరీత్యాలు, ఆహారం విషంగా మారడం, మానవ జాతికి విషాహారం వల్ల మానవజాతికి కలిగే అనర్థాలు తదితర అంశాలు నేర్చుకున్నట్లు తెలిపారు. మహనీయుల ఆశయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలునల్లగొండ టూటౌన్ : మహనీయుల ఆశయాలు ప్రతిబింబించేలా ఈ నెల 11 నుంచి 14 వరకు జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఎంజీయూ వీసీ ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ అన్నారు. ఉత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 11న ఉదయం 6 గంటలకు 5కే రన్, పానెల్ డిస్కషన్, 12న విశ్వవిద్యాలయ యువకులకు కెరీర్ అవకాశాలపై అవగాహన, 13న సింపోసియం, 14న శ్రీసామాజిక పరివర్తనలో విశ్వవిద్యాలయాల పాత్రశ్రీపై సెమినార్ నిర్వహించనున్నట్లు తెలిపారు. వ్యాసరచన, వకృత్త్వం, పాటలు, కవితల పోటీలను నిర్వహిస్తామని వివరించారు. మహనీయుల భావ స్ఫూర్తిని విద్యార్థుల్లోకి తీసుకుపోయేందుకు ఈ కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవాల చైర్మన్ కొప్పుల అంజిరెడ్డి, రిజిస్ట్రార్ అల్వాల రవి, శ్రీదేవి, వసంత, కె.ప్రేమ్‌సాగర్, సుధారాణి, అరుణప్రియ, సబీనా, హరీష్‌కుమార్, శ్రవణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో లక్ష పుష్పార్చనయాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం లక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు పుష్పాలు, తులసీ దళాలతో లక్ష పుష్పార్చన పూజ జరిపించారు. పూజల్లో భక్తులు అధికంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ఆంజనేయస్వామికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ఆలయంలో నిత్య పూజలు కొనసాగాయి. -
కాంటాలు వేయడంలో జాప్యం వద్దు
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోదాడరూరల్: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు వేయడంలో జాప్యం చేయవద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం కోదాడ మండల పరిధిలోని చిమిర్యాల పీఏసీఎస్ ఆధ్వర్యంలో నల్లబండగూడెంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కాంటాలు వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నప్పటికీ బస్తాలు, మిల్లుల ట్యాగులు కాక ఆలస్యం అవుతోందని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, స్థానిక పీఏసీఎస్ చైర్మన్ కొత్తా రఘుపతి.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కలెక్టర్ డీసీఓ, సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి బస్తాలు, ట్యాగులు పంపించాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్డీఓ సూర్యానారాయణ, తహసీల్దార్ వాజిద్‌అలీ, కోదాడ పీఏసీఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి, సీఈఓ జొన్నలగడ్డ జయకృష్ణ, రైతులు ఉన్నారు. సహకార సంఘాలను బలోపేతం చేయాలి భానుపురి (సూర్యాపేట) : సహకార సంఘాలను బలోపేతం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కోఆపరేటివ్ అభివృద్ధి కమిటీ, జాయింట్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్డ్ స్టోరేజ్, సోలార్ యూనిట్స్, ఐస్ ప్రాజెక్ట్‌లపై పీఏసీఎస్‌ల ద్వారా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు. పీఏసీఎస్ ద్వారా కామన్ సర్వీస్ సెంటర్లపై శిక్షణ ఇప్పించి వాటిని ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. పీఏసీఎస్ చింతలపాలెంలో కోల్డ్ స్టోరేజ్‌కు డీపీఆర్ సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీసీఓ పద్మ, నాబార్డ్ ఏజీఎం ఎన్. సత్యనారాయణ, డీసీసీబీ సీఈఓ ఆర్. శంకర్రావు, డీఏఓ శ్రీధర్ రెడ్డి, మత్స్యశాఖ అధికారి నాగులు నాయక్, ఉద్యానవన శాఖ అధికారి నాగయ్య పాల్గొన్నారు. -
ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలి
చివ్వెంల(సూర్యాపేట) : ఖైదీలు సత్ప్రవర్తన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పి.శ్రీవాణి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సబ్ జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఖైదీలు ఉంటున్న గదులను పరిశీలించి, మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేశారు. మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. క్షణికావేశంలో చేసిన తప్పిదాల వల్ల జైలు జీవితం గడపాల్సి వస్తుందన్నారు. దీని వల్ల కుటుంబ సభ్యులు బాధపడాల్సి వస్తుందన్నారు. మంచి నడవడిక కలిగి ఉండి సమాజంలో పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలన్నారు. జైలులో ఉన్న ఖైదీలు అడ్వకేట్లను పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకుంటే డీఎల్‌ఎస్‌ఏకు దరఖాస్తు చేసుకోవాలని, ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. ఈకార్యక్రమంలో డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకటరత్నం, బట్టిపల్లి ప్రవీణ్ కుమార్, పెండెం వాణి ,జైలు సిబ్బంది తదితరలు పాల్గొన్నారు.ఫ జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీవాణి -
నేటి నుంచి ఎస్ఏ–2
సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల్లో బుధవారం నుంచి ఎస్ఏ(సమ్మెటివ్ అసెస్మెంట్)–2 పరీక్షలు జరగనున్నాయి. 9వ తేదీ నుంచి 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ప్రారంభం కానుండగా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి జరగనున్నాయి. ఇందుకు సంబంధించి జిల్లా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రశ్నాపత్రాలను జిల్లా కేంద్రంలో భద్రపరిచారు. ఆ తర్వాత ప్రశ్నాపత్రాలను అయా మండలాలు, పాఠశాలలకు పంపిణీ చేశారు. జిల్లాలో 1261 పాఠశాలలు... జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 1,261 ఉన్నాయి. వీటిలో 1 నుంచి 9వ తరగతి వరకు 1.18లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరంతా ఎస్ఏ –2 పరీక్షలు రాయనున్నారు. ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.45 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలు ముగిసిన తర్వాత విద్యార్థులు సాధించిన మార్కులు, హాజరు వివరాలను ‘ఐఎస్ఎంఎస్’ పోర్టల్‌లో నమోదు చేయనున్నారు. ఈ నెల 23న తల్లి దండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతి వెల్లడించనున్నారు. ఫ 17వ తేదీ వరకు నిర్వహణ షెడ్యూల్ ఇలా... తేదీ సబ్జెక్ట్ 9 తెలుగు 10 హిందీ 11 ఇంగ్లిష్(6 టు 9) తెలుగు(1 టు 5) 12 సోషల్(6, 7), మ్యాథ్స్(8, 9) ఇంగ్లిష్(1 టు 5) 15 జనరల్ సైన్స్(6, 7), ఫిజికల్ సైన్స్(8, 9) మ్యాథ్స్( 1 టు 5) 16 మ్యాథ్స్(6, 7) బయో సైన్స్(8, 9) ఈవీఎస్(1 టు 5) 17 సోషల్ (8, 9వ తరగతులకు) -
వరంగల్ సభను విజయవంతం చేయాలి
సూర్యాపేటటౌన్ : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం సందర్భంగా ఈనెల 27 వతేదీన వరంగల్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ సభ పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సభలో పార్టీ అధినేత కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమ కార్యాచరణకు దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, నాయకులు నెమ్మాది భిక్షం, జీడి భిక్షం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు . -
Telangana: గ్రూప్–1 ఉద్యోగం సాధించిన జువేరియా
మిర్యాలగూడ: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది నల్ల గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డ కాలనీకి చెందిన చిరువ్యాపారి ఎండీ మౌజంఅలీ, అమీనాబీ దంపతుల రెండో కుమార్తె జువేరియా. డిగ్రీ పూర్తికాగానే గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలవ్వడంతో సొంతంగా ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే కొలువు విజయం సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 465.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 162వ ర్యాంకు, మల్టీ జోన్–2లో 6వ ర్యాంకు సాధించింది. తక్కువ సమయంలోనే ఉన్నత ఉద్యోగం సాధించడానికి జువేరియా చేసిన కృషి ఆమె మాటల్లోనే..మా అక్కనే స్ఫూర్తి..నేను 1–7వ తరగతి వరకు మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో గల కైరళి స్కూల్లో, 8–10వ తరగతి వరకు చైతన్యనగర్లోని ఆదిత్య స్కూల్లో చదివాను. పదో తరగతిలో 10జీపీఏ సాధించడంతో పాటు మిర్యాలగూడలోనే కేఎల్ఎన్ కళాశాలలో ఇంటర్లో ఎంపీసీ విభాగంలో 989మార్కులు సాధించి టాప్ ర్యాంకర్‌గా నిలిచాను. దీంతో 2022–23లో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష చొప్పున మూడు సంవత్సరాల డిగ్రీకి రూ.3లక్షల స్కాలర్షిప్ అందించింది. 2023లో హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ మ్యాథ్స్ పూర్తిచేసి యూజీసీ చైర్మన్ జగదీష్ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ అందుకున్నాను. 2024లో గ్రూప్–1 నోటిఫికేషన్ పడగా దరఖాస్తు చేసుకోని సొంతంగా ప్రిపేరయ్యాను. మా అక్క సుమయ్య పర్వీన్ కూడా ఇంటర్మీడియట్ పూర్తికాగానే డీఎస్సీ రాసి ఉర్దూ మీడియంలో జిల్లా మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం కోదాడ ఉర్దూ మీడియం పాఠశాలో ఎస్జీటీగా పనిచేస్తోంది. ఆమె నాకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడంలో స్ఫూర్తిగా నిలిచింది.సొంతంగానే చదివా..గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే వారు కోచింగ్ సెంటర్లలో సుదీర్ఘంగా కోచింగ్ తీసుకుంటారు. కానీ నేను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగానే ప్రిపేరై గ్రూప్–1 ఉద్యోగాన్ని సాధించా. ప్రిపరేషన్‌కు అవసరమయ్యే మెటీరియల్‌ను హైదరాబాద్ నుంచి తెప్పించుకొని రోజుకు 12–14 గంటల పాటు చదివేదాన్ని. అంతేకాకుండా ఇంట్లో కూర్చొనే చోట, హాల్లో, బెడ్రూంలో, కిచెన్‌లో నాకు అవసరమైన మెటీరియల్‌ను చార్ట్ రూపంలో గోడలకు అంటించి నిత్యం చూస్తూ ఉండేదాన్ని. కూర్చొన్నా, నిల్చున్నా ఆ చార్ట్‌లను చూసుకొని అందులోని విషయాలను ఒకటికి రెండుసార్లు నెమరువేసుకునేదాన్ని. దీనికి తోడు యూట్యూబ్, ఇంటర్నెట్ ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించుకోని ప్రిపేరయ్యాను. కలెక్టర్ కావడమే లక్ష్యం..గ్రూప్–1 ఉద్యోగం సాధించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. డిగ్రీ పూర్తయ్యే వరకు గ్రూప్స్ రాస్తానని అనుకోలేదు. డిగ్రీ పూర్తికాగానే నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకున్నా. భవిష్యత్తులో సివిల్స్‌కు ప్రిపేరై కలెక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నా. కలెక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవలు అందిస్తా. నా విజయం వెనుక నా తల్లిండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. -
మైనార్టీ గురుకులాల్లో వసతులు కరువు
● ఉమ్మడి జిల్లాలో మొత్తం 14 మైనార్టీ గురుకులాలు ● అందులో 13 గురుకులాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్న వైనం ● అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్న విద్యార్ధులుచౌటుప్పల్ రూరల్: మైనార్టీ గురుకులాల్లో విద్యార్థులకు అత్యుత్తమ విద్యాబోధన జరుగుతుందని ప్రభుత్వం చెప్పుకుంటున్నా.. చాలా గురుకులాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా చాలా మైనార్టీ గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఒక్క గురుకులానికే సొంత భవనం..ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 14 మైనార్టీ గురుకులాలు ఉన్నాయి. ఇందులో కేవలం నల్లగొండ పట్టణంలో ఉన్న బాలుర మైనార్టీ గురుకులానికి మాత్రమే సొంత భవనం ఉంది. మిగతా 13 గురుకులాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బాలికల మైనార్టీ గురుకుల పాఠశాల, చౌటుప్పల్, భువనగిరిలో బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలలు ఉన్నాయి. వీటికి నెలకు సుమారు రూ.3.5 లక్షలు అద్దె చెల్లిస్తున్నారు. వసతుల్లేక ఇబ్బందులు..ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మైనార్టీ గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. అద్దె భవనాల్లో విద్యార్థులకు సరైన వసతులు లేవు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో గల మైనార్టీ గురుకుల పాఠశాల మూతపడిన పరిశ్రమ షెడ్లో కొనసాగుతోంది. డార్మిటరీ లేక రేకుల షెడ్లోనే సుమారు 320 మంది విద్యార్థులు నిద్రిస్తున్నారు. అంతేకాకుండా పెద్ద రేకుల షెడ్‌ను గదులుగా విభజించి తరగతులు నిర్వహిస్తున్నారు. బాత్రూంలు కూడా సరిపడా లేవు, భోజనం చేయడానికి రేకుల షెడ్లోనే డైనింగ్ హాల్ ఏర్పాటుచేశారు. అరకొర సౌకర్యాలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటిగ్రేటెడ్ గురుకులాల్లో విలీనం చేసేనా..రాష్ట్ర ప్రభుత్వం 28 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న సమీకృత గురుకులాల్లో మైనార్టీ గురుకులాలను కూడా విలీనం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆలేరు, భువనగిరిలో నిర్మిస్తున్న సమీకృత గురుకులాల్లోకి ఆయా ప్రాంతాల్లో ఉన్న మైనార్టీ గురుకులాలు విలీనం అయ్యే అవకాశం ఉంది. ఇక మునుగోడు నియోజకవర్గంలో ఉన్న చౌటుప్పల్ మైనార్టీ గురుకుల పాఠశాలను మునుగోడు మండలం కలకుంట్లలో నిర్మిస్తున్న సమీకృత గురుకులంలో విలీనం చేస్తారని సమాచారం. సమీకృత గురుకులాల్లో మైనార్టీ గురుకులాలను విలీనం చేయకపోతే మైనార్టీ గురుకుల పాఠశాలలకు ప్రభుత్వ స్థలాలను కేటాయించి సొంత భవనాలు నిర్మించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
వైభవంగా శ్రీరాముడి పట్టాభిషేకం
యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వతవర్థిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం శివాలయంలో నిత్యారాధనలు నిర్వహించిన అర్చకులు మూలమంత్ర జపములు, దశ శాంతి పంచసూక్త పారాయణములతో అభిషేకములు, ఆధ్యాత్మిక రామాయణ పారాయణం, అష్టోత్తర శతనామార్చనలు జరిపించారు. అనంతరం శ్రీసీతారామచంద్రస్వామికి పట్టాభిషేకం వేడుకను ఆలయ సిద్దాంతి, ప్రధానార్చకులు చేపట్టారు. సాయంత్రం నిత్యారాధనలు జరిపించిన అనంతరం రాత్రి 7గంటల నుంచి 8.30గంటల వరకు శివాలయ యాగ మండపంలో సహస్రనామార్చనలు, నివేదన, నీరాజన, మంత్ర పుష్పములు, కార్యక్రమాలు జరిగాయి. ఆయా వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి, పూజారులు, భక్తులు పాల్గొన్నారు. -
అజొల్లాతో పశుగ్రాసం కొరతకు చెక్ !
నడిగూడెం: ప్రస్తుత వేసవిలో పశుగ్రాసం కొరతతో పాడి రైతులు ఇబ్బందులు పడుతుంటారు. దీనికి చెక్ పెట్టేందుకు అజొల్లా పెంపకమే సరైన పరిష్కారమని నడిగూడెం మండల పశువైద్యాధికారి డాక్టర్ అఖిల చెబుతున్నారు. ఆకుపచ్చ ఫెర్న్ జాతికి చెందిన ఈ నీటి మొక్క త్వరగా పెరుగుతుందని, ఇది పశుగ్రాసానికి ప్రత్యామ్నాయమని ఆమె పేర్కొన్నారు. అజొల్లాతో లాభాలు ఇవీ..అజొల్లా తిన్న పశువులకు పోషక విలువలు అందుతాయి. ఎండబెట్టిన అజొల్లా పొడిలో 25–35 శాతం వరకు మాంసకృత్తులు, 10–15 శాతం ఖనిజ లవణాలు, 7–10 శాతం అమినో ఆమ్లాలు, కెరోటిన్, బీ–12 విటమిన్లు ఉంటాయి. అజొల్లా లిగ్నైట్ తక్కువగా ఉండడటం వలన పశువులు తేలికగా జీర్ణం చేసుకుంటాయి. ఒక కిలో అజొల్లా ఉత్పత్తికి 20–30 పైసలు మాత్రమే ఖర్చవుతుంది. ప్రతి రోజు 1.5 నుంచి 2 కిలోల అజొల్లాను పశువులకు దాణాలో కలిపి తినిపించవచ్చు. దాణాలో వేరుశనగ పిండికి బదులుగా అదే పరిమాణంలో అజొల్లాను వాడవచ్చు. దీని వలన పాల దిగుబడి 15నుంచి 20 శాతం పెరుగుతుంది. పాలలో వెన్న శాతంలో పాటు ఎస్ఎన్ఎఫ్ పెరిగి ప్రతి లీటరు పాలకు 60 పైసలు నుంచి 150 పైసల వరకు అదనపు ఆదాయం పెరుగుతుంది. ఇలా పెంచాలి..సూటిగా సూర్యకాంతి పడని కొద్దిపాటి నీడ గల భూమి కలపును పూర్తిగా చదును చేసుకోవాలి. 10 సెం.మీ. లోతు వచ్చేలా గోతిని తవ్వాలి. అందులో చుట్టూ ఇటుకలను పేర్చాలి. ఇలా ఒక తొట్టిని 2.50 నుంచి 1.5 మీటర్ల సైజుల్లో నిర్మిస్తే అజొల్లా ఉత్పత్తి చేయవచ్చు. గోతి లోపల భూమిపై కలుపు మొక్కల వేర్లు రాకుండా ప్లాస్టిక్ సంచులు పరచాలి. దీనిపై 150 జీఎస్ఎం మందం ఉన్న ప్లాస్టిక్ షీటు వేయాలి. షీటు చివరలు ఇటుకలపై అంచువరకు వచ్చేలా పరచాలి. ఇందుకు 3.2 మీటర్ల సైజు గల ప్లాస్టిక్ షీటు ఉండాలి. షీటు కప్పిన తొలి లోతు 10 సెం.మీ. ఉండాలి. 30 నుంచి 35 కిలోల భూసారం గల మట్టిని జల్లెడ పట్టి, మెత్తని మట్టిని ప్లాస్టిక్ షీటుపై సమానంగా పరచాలి. ఒక చదరపు మీటరుకు 10 నుంచి 12 కిలోల పశువుల పేడను 10 లీటర్ల నీటిలో పలుచగా కలిపి, దానిలో 10–20 గ్రాముల సూపర్ పాస్పేట్ను కలిపి పోయాలి. ఈ తొట్టిలో 7–10 సెం.మీ. ఎత్తు ఉండేలా నీరు పోయాలి. బెడ్లోని మట్టి, నీటిని కలియతిప్పాలి. అజొల్లా త్వరతగతిన పెరిగి 7–10 రోజుల్లో నీటి తొట్టెను పూర్తిగా ఆక్రమిస్తుంది. 8వ రోజు నుంచి ప్రతిరోజు ఒక కిలో అజొల్లాను ఒక్కొక్క తొట్టి నుంచి తీసుకోవచ్చు. బెడ్ మీద చల్లిన ఒక కిలో అజొల్లా వారం రోజుల్లో 8–10 కిలోలు అజొల్లా ఉత్పత్తవుతుంది.మేపేది ఇలా..తొట్టి నుంచి తీసుకొచ్చిన అజొల్లా చదరపు సెంటీమీటరు వెడల్పు ఉన్న రంధ్రాలు గల ప్లాస్టిక్ ట్రేలో ఉంచాలి. దానిని సగం నీరు నింపిన బకెట్‌పై పెట్టి పైనుంచి నీరు పోయాలి. ట్రేలో పైన ఉన్న అజొల్లాను పశువులకు మేపాలి. ట్రేలోని రంధ్రాల ద్వారా చిన్న చిన్న అజొల్లా మొక్కలు బకెట్‌లోని నీళ్లలోకి వెళ్తాయి. ఈ నీటిని మరలా బెడ్లో పోయడం వలన అజొల్లాను తిరిగి పెంచవచ్చు. ప్రస్తుతం నడిగూడెం, కోదాడ మండలాలలో చుట్టుపక్కల వరి పొలాల్లో కూడా అజొల్లా కనిపిస్తోంది. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు
కేతేపల్లి: కేతేపల్లి మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి చెందిన కందికంటి అశోక్ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బైక్‌పై నకిరేకల్‌కు బయల్దేరాడు. మార్గమధ్యలో విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై పల్లె రుచులు హాటల్ సమీపంలో బైక్ అదుపుతప్పడంతో హైవే పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో అశోక్ కుడి కాలు పూర్తిగా తెగిపోయి ప్రమాద స్థలంలో పడిపోయింది. అశోక్‌ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. అదేవిధంగా చెర్కుపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. చెర్కుపల్లి గ్రామానికి చెందిన మున్న శివ ఆదివారం రాత్రి పక్కనే ఉన్న కొండకిందిగూడెం గ్రామం నుంచి బైక్‌పై ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో రోడ్డుపై ఆరబోసిన వరి ధాన్యం రాశి పైకి బైక్ దూసుకెళ్లి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మొదట సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. -
చలో వరంగల్ సభను జయప్రదం చేయాలి
నకిరేకల్: బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 ఏళ్లు నిండిన సందర్భంగా వరంగల్‌లో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ(చలో వరంగల్)ను జయప్రదం చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు. ఈ సభకు సంబంధించిన పోస్టర్‌ను నకిరేకల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. చలో వరంగల్ సభకు లక్షలాదిగా పార్టీ శ్రేణులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు. ఈ సభను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకునేందుకు కుట్ర చేయడం సరికాదన్నారు. ఈ సభకు తరలివెళ్లకుండా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను నిర్బంధించడంతో పాటు అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు మాద ధనలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షుడు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, నాయకులు పల్లె విజయ్, పెండెం సదానందం, పల్రెడ్డి మహేందర్‌రెడ్డి, గొర్ల వీరయ్య, సోమ యాదగిరి, సామ శ్రీనివాస్‌రెడ్డి, వంటల చేతన్, యానాల లింగారెడ్డి, రాచకొండ వెంకన్నగౌడ్, బోయిళ్ల కిషోర్, గుండగోని జంగయ్య, రాచకొండ శ్రవణ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
● మృతుడు ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వాహన డ్రైవర్ నిడమనూరు: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఈ ఘటన నిడమనూరు మండలం వేంపాడు గ్రామ శివారులో సోమవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామానికి చెందిన ఉప్పునూతల నరసింహ(41) మిర్యాలగూడలోని బాపూజీనగర్‌లో నివాసముంటూ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నరసింహ సోమవారం బైక్‌పై స్వగ్రామానికి వచ్చి తిరిగి మిర్యాలగూడకు వెళ్తుండగా.. నిడమనూరు మండలం వేంపాడు గ్రామ శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరసింహను 108 వాహనంలో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడి భార్య ఉప్పునూతల రామేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నరేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
బావిలో పడి మానసిక దివ్యాంగుడు మృతి
కట్టంగూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి మానసిక దివ్యాంగుడు మృతిచెందాడు. ఈ ఘటన కట్టంగూర్ మండలం ఈదులూరు గ్రామంలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం పరడ గ్రామానికి చెందిన కాసర్ల యాదమ్మ, నర్సిరెడ్డి దంపతుల ఏకై క కుమారుడు కాసర్ల శ్రీనివాసరెడ్డి(47) పుట్టుకతో మానసిక దివ్యాంగుడు. శ్రీనివాసరెడ్డికి 25 సంవత్సరాల క్రితం వివాహం చేయగా కుమార్తె జన్మించిన మూడు సంవత్సరాల అనంతరం భార్య విడాకులు తీసుకొని వెళ్లిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి నర్సిరెడ్డి అనారోగ్యంతో మృతిచెందాడు. నాటి నుంచి యాదమ్మ తన మనువరాలు, కొడుకు ఆలనాపాలన చూసుకుంటుంది. ఈ నెల 2వ తేదీ సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాసరెడ్డి తిరిగి రాలేదు. అతడి కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కాగా సోమవారం ఈదులూరు గ్రామ శివారులో గల బావిలో శ్రీనివాసరెడ్డి మృతదేహం తేలి ఉండటాన్ని బంధువులు గుర్తించారు. తన కొడుకు మానసికస్థితి సరిగా లేక ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందినట్లు శ్రీనివాసరెడ్డి తల్లి యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మునుగోటి రవీందర్ తెలిపారు. -
ఆర్థిక సమస్యలతో ప్రభుత్వ ఉద్యోగి ఆత్మహత్య
నాగార్జునసాగర్: ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురైన ప్రభుత్వ ఉద్యోగి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్‌కాలనీలో జరిగింది. ఎస్ఐ సంపత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. హిల్‌కాలనీకి చెందిన నెల్లం శ్రీనివాసరావు డిండి మండలంలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆయన అనారోగ్య, ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య విజయశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎయిమ్స్‌లో పీడియాట్రిక్ సర్జరీ డేబీబీనగర్ : మండల కేంద్రంలోని ఎయిమ్స్ వైద్య కళాశాలలో సోమవారం వరల్డ్ పీడియాట్రిక్ సర్జరీ డే ఘనంగా నిర్వహించారు. పీడియాట్రిక్ వైద్య విభాగంలో చికిత్స పొందడానికి వచ్చిన చిన్నారులతో కలిసి డైరెక్టర్ వికాస్ భాటియా, వైద్యులు కేక్ కట్ చేశారు. చిన్నారుల ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చిన్నారులకు ఆరోగ్య సమస్యలు ఉంటే సంప్రదించాలన్నారు. ఆధునిక సర్జరీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు వికాస్ భాటియా తెలిపారు. -
డిగ్రీ పూర్తికాగానే కొలువు !
మిర్యాలగూడ: పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది నల్ల గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డ కాలనీకి చెందిన చిరువ్యాపారి ఎండీ మౌజంఅలీ, అమీనాబీ దంపతుల రెండో కుమార్తె జువేరియా. డిగ్రీ పూర్తికాగానే గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలవ్వడంతో సొంతంగా ప్రిపేరై మొదటి ప్రయత్నంలోనే కొలువు విజయం సాధించి పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఇటీవల ప్రకటించిన గ్రూప్–1 ఫలితాల్లో 465.5 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 162వ ర్యాంకు, మల్టీ జోన్–2లో 6వ ర్యాంకు సాధించింది. తక్కువ సమయంలోనే ఉన్నత ఉద్యోగం సాధించడానికి జువేరియా చేసిన కృషి ఆమె మాటల్లోనే.. ● మా అక్కనే స్ఫూర్తి.. నేను 1–7వ తరగతి వరకు మిర్యాలగూడ పట్టణంలోని బంగారుగడ్డలో గల కై రళి స్కూల్లో, 8–10వ తరగతి వరకు చైతన్యనగర్లోని ఆదిత్య స్కూల్లో చదివాను. పదో తరగతిలో 10జీపీఏ సాఽధించడంతో పాటు మిర్యాలగూడలోనే కేఎల్ఎన్ కళాశాలలో ఇంటర్లో ఎంపీసీ విభాగంలో 989మార్కులు సాధించి టాప్ ర్యాంకర్‌గా నిలిచాను. దీంతో 2022–23లో కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి రూ.లక్ష చొప్పున మూడు సంవత్సరాల డిగ్రీకి రూ.3లక్షల స్కాలర్షిప్ అందించింది. 2023లో హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ మ్యాథ్స్ పూర్తిచేసి యూజీసీ చైర్మన్ జగదీష్ చేతుల మీదుగా గోల్డ్‌మెడల్ అందుకున్నాను. 2024లో గ్రూప్–1 నోటిఫికేషన్ పడగా దరఖాస్తు చేసుకోని సొంతంగా ప్రిపేరయ్యాను. మా అక్క సుమయ్య పర్వీన్ కూడా ఇంటర్మీడియట్ పూర్తికాగానే డీఎస్సీ రాసి ఉర్దూ మీడియంలో జిల్లా మొదటి ర్యాంకు సాధించి ప్రస్తుతం కోదాడ ఉర్దూ మీడియం పాఠశాలో ఎస్జీటీగా పనిచేస్తోంది. ఆమె నాకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడంలో స్ఫూర్తిగా నిలిచింది. ● సొంతంగానే చదివా..గ్రూప్స్‌కు ప్రిపేరయ్యే వారు కోచింగ్ సెంటర్లలో సుదీర్ఘంగా కోచింగ్ తీసుకుంటారు. కానీ నేను ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే సొంతంగానే ప్రిపేరై గ్రూప్–1 ఉద్యోగాన్ని సాధించా. ప్రిపరేషన్‌కు అవసరమయ్యే మెటీరియల్‌ను హైదరాబాద్ నుంచి తెప్పించుకొని రోజుకు 12–14 గంటల పాటు చదివేదాన్ని. అంతేకాకుండా ఇంట్లో కూర్చొనే చోట, హాల్లో, బెడ్రూంలో, కిచెన్‌లో నాకు అవసరమైన మెటీరియల్‌ను చార్ట్ రూపంలో గోడలకు అంటించి నిత్యం చూస్తూ ఉండేదాన్ని. కూర్చొన్నా, నిల్చున్నా ఆ చార్ట్‌లను చూసుకొని అందులోని విషయాలను ఒకటికి రెండుసార్లు నెమరువేసుకునేదాన్ని. దీనికి తోడు యూట్యూబ్, ఇంటర్నెట్ ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించుకోని ప్రిపేరయ్యాను. ● కలెక్టర్ కావడమే లక్ష్యం..గ్రూప్–1 ఉద్యోగం సాధించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. డిగ్రీ పూర్తయ్యే వరకు గ్రూప్స్ రాస్తానని అనుకోలేదు. డిగ్రీ పూర్తికాగానే నోటిఫికేషన్ రాగానే దరఖాస్తు చేసుకున్నా. భవిష్యత్తులో సివిల్స్‌కు ప్రిపేరై కలెక్టర్ కావడమే లక్ష్యంగా పెట్టుకున్నా. కలెక్టర్ అయ్యి పేద ప్రజలకు సేవలు అందిస్తా. నా విజయం వెనుక నా తల్లిండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. గ్రూప్–1 ఉద్యోగం సాధించిన జువేరియా ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా సొంతంగా ప్రిపరేషన్ -
రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోండి
భానుపురి (సూర్యాపేట): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత ఈ నెల 14లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. ఈ పథకం ద్వారా రూ.50 వేల నుంచి రూ.4లక్షల వరకు రుణం పొందవచ్చని పేర్కొన్నారు. రూ.50వేల లోపు యూనిట్లకు 100 శాతం, రూ.లక్ష లోపు యూనిట్లకు 90 శాతం, రూ.2లక్షల యూనిట్ల వరకు 80శాతం, రూ.4లక్షల యూనిట్లకు 70 శాతం సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. వ్యవసాయేతర పథకాలకు సంబంధించిన యూనిట్ల స్థాపనకు 21–55 ఏళ్ల వయస్సు, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21–60 ఏళ్ల వయస్సు కలిగి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఆదాయం ఉన్నవారు అర్హులని తెలిపారు. ఆధార్, ఆహార భద్రతకార్డు లేదంటే ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా పథకాలకు), పట్టాదారు పాస్‌పుస్తకం (వ్యవసాయ రంగ పథకాలకు), సదరం సర్టిఫికెట్ (వైకల్యమున్న వ్యక్తులు), పాస్పోర్ట్సైజ్ ఫొటో, బలహీన వర్గాల ధ్రువీకరణ పత్రం ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలకు సంబంధి పత్రాలు జతచేసి ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో అందించాలని కోరారు. గోదావరి జలాల నిలిపివేతఅర్వపల్లి: ప్రస్తుత యాసంగి సీజన్‌కు గాను అదనంగా విడుదల చేస్తున్న గోదావరి జలాలను ఆదివారం నిలిపివేశారు. 7వ తడిగా ఈ నెల 2న గోదావరి జలాలను జిల్లాకు పునరుద్ధరించారు. అయితే ఐదు రోజులపాటు నీటిని వదిలారు. కాగా ఈ సీజన్‌కు సంబంధించి జనవరి 1న జిల్లాకు గోదావరి జలాలను విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం వారబందీ విధానంలో మార్చి 24 వరకు 6 తడులుగా నీళ్లిచ్చారు. అయితే పంటలు చేతికొచ్చే సమయంలో నీళ్లు నిలిపివేశారు. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చేయడంతో అధికారులు మరో తడికి అదనంగా విడుదల చేశారు. -
పెద్దవూర మండల వాసి
తెలంగాణ లోకాయుక్తగాపెద్దవూర: నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం శిర్సనగండ్ల గ్రామానికి చెందిన హైకోర్టు రిటైర్ట్ న్యాయమూర్తి జస్టిస్ యడవెల్లి రాజశేఖర్‌రెడ్డి తెలంగాణ లోకాయుక్తగా నియమితులయ్యారు. శిర్సనగండ్ల గ్రామానికి చెందిన రైతు యడవెల్లి రామాంజిరెడ్డి–జయప్రద దంపతులకు ఐదుగురు సంతానం కాగా.. రాజశేఖర్‌రెడ్డి పెద్దవారు. ఆయన 1960 మే 4వ తేదీన జన్మించారు. రాజశేఖర్‌రెడ్డి ప్రాథమిక విద్యాభ్యాసం మిర్యాలగూడలోని సెయింట్ మేరీ పాఠశాలలో, 6 నుంచి 10వ తరగతి వరకు నల్లగొండలోని సెయింట్ ఆల్పోన్సెస్ పాఠశాలలో, ఇంటర్మీ డియట్ హైదరాబాద్‌లోని ఏవీఎం కళాశాలలో, బీఎస్సీ డిగ్రీ, ఎల్ఎల్బీ వరంగల్‌లో సాగాయి. ఆ రోజుల్లోనే ఆయన విద్యాభ్యాసం అంతా ఇంగ్లిష్ మీడియంలో సాగింది. డిగ్రీ సైన్స్‌లో చేసినప్పటికీ బాబాయి కొండల్‌రెడ్డి అడ్వకేట్‌గా స్థిరపడటంతో ఆయనను ఆదర్శంగా తీసుకుని రాజశేఖర్‌రెడ్డి ఎల్ఎల్బీ పూర్తి చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో బంగారు పతకం సాధించారు. ఎల్ఎల్బీ పూర్తికాగానే 1985లో మొదట నల్ల గొండలో న్యాయవాదిగా ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేశారు. అనంతరం హైదరాబాద్‌కు వెళ్లి అక్కడే న్యాయవాదిగా 1985 ఏప్రిల్‌లో ఏపీ బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టారు. తొలుత మహమూద్ అలీ వద్ద ప్రాక్టీస్ చేశారు. అనంతరం స్వతహాగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2004లో హైకోర్టు న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా, అదే ఏడాది కేంద్ర ప్రభుత్వానికి సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా, 2005లో అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. సెంట్రల్ ఎకై ్సజ్, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియాకు న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013 ఏప్రిల్ 12వ తేదీన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2014లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై 2022 ఏప్రిల్‌లో పదవీ విరమణ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో కూడిన ఎంపిక కమిటీ సమావేశమై లోకాయుక్తగా యడవెల్లి రాజశేఖర్‌రెడ్డి పేరును ఖరారు చేసి రాజ్‌భవన్‌కు పంపింది. ఒకటి, రెండు రోజుల్లో నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయి. శిర్సనగండ్ల గ్రామానికి చెందిన యడవెల్లి రాజశేఖర్‌రెడ్డి పేరు ఖరారు రాజ్‌భవన్‌కు చేరిన ప్రతిపాదనలు ఒకటి రెండు రోజుల్లో జారీకానున్న ఉత్తర్వులు -
నేటి నుంచి ‘పది’ మూల్యాంకనం
సూర్యాపేట టౌన్: పదో తరగతి వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి జిల్లా విద్యా శాఖ యంత్రాంగం సిద్ధమైంది. ఇందుకు జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేశారు. గత ఏడాది నుంచి జిల్లాలో పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. ఈ ఏడాదికి సంబంధించిన మూల్యాంకనం ప్రక్రియం సోమవారం నుంచి ప్రారంభమై 15వ తేదీ వరకు కొనసాగనుంది. జిల్లాకు 1.5లక్షల జవాబు పత్రాలు!మూల్యాంకనానికి జిల్లాకు దాదాపు సుమారు 1.5 లక్షలకు పైగా జవాబు పత్రాలు వస్తాయని అధి కారులు భావిస్తున్నారు. విధుల్లో పాల్గొ నేందుకు జిల్లా నుంచి మొత్తం ఏఈలు, సీఈ లు, స్పెషల్ అసిస్టెంట్లు కలిపి 600 మంది ఉపాధ్యాయుల్ని నియమించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పేపర్లు దిద్దనున్నారు. జిల్లాకు వస్తున్న జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూంలో భద్రపరుస్తున్నారు. మరోపక్క కోడింగ్ ప్రక్రియ జరుగుతోంది.ఫ 15వ తేదీ వరకు కొనసాగనున్న ప్రక్రియ ఫ 600 మంది ఉపాధ్యాయులకు విధులు ఫ సూర్యాపేటలోని ఏవీఎం స్కూల్లో ఏర్పాట్లు ఉపాధ్యాయులంతా హాజరుకావాలి పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ఈ ఏడాది జిల్లా కేంద్రంలోని ఏవీఎం పాఠశాలలో జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే జవాబు పత్రాలు స్ట్రాంగ్ రూంలో భద్రపరిచాం. మూల్యాంకనానికి సంబంధించి ఆర్డర్లు వచ్చిన ఉపాధ్యాయులంతా తప్పకుండా విధులకు హాజరు కావాలి. – అశోక్, డీఈఓ, సూర్యాపేట -
మట్టపల్లిలో నిత్యారాధనలు
మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం శ్రీరాజ్య లక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యారాధనలు కొనసాగాయి. ముందుగా ఆలయంలో శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు, హోమం జరిపారు. అనంతరం విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంభనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో నిత్యకల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
‘యువతేజం’ జాబ్‌మేళాకు విశేష స్పందన
రామగిరి(నల్లగొండ): నల్లగొండ పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన యువతేజం మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించిన ఈ జాబ్‌మేళాకు నిరుద్యోగులు భారీగా హాజరయ్యారు. యువత చెడు మార్గంలో వెళ్లకుండా ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతో నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.రూ.40వేల వేతనంతో ఉద్యోగం వచ్చిందిమాది నల్లగొండ మండలం వెలుగుపల్లి గ్రామం. మాది వ్యవసాయం కుటుంబం. మా అమ్మనాన్న కష్టపడి వ్యవసాయం చేసి నన్ను చదివించారు. ప్రస్తుతం జీఎన్ఎం(నర్సింగ్ కోర్సు) ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు హాజరయ్యాను. నెలకు రూ.40వేల వేతనంలో హోమ్‌కేర్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది. – కందుకూరి సోని, వెలుగుపల్లి, నల్లగొండ మండలం పోలీసు శాఖకు ధన్యవాదాలునేను 2013లో బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేశాను. మా నాన్న ప్రైవేట్ స్కూల్లో అటెండర్‌గా పనిచేస్తారు. ఈ జాబ్‌మేళా గురించి తెలుసుకుని హాజరయ్యాను. పలు కంపెనీలు నిర్వహించిన ఇంటర్వ్యూలకు హాజరై కాగా.. రూ.45 వేల వేతనంతో పీహెచ్సీ సొసైటీ హోమ్‌కేర్ సర్వీస్‌లో జాబ్ వచ్చింది. ఈ అవకాశం కల్పించిన పోలీసు శాఖ వారికి ధన్యవాదాలు. – ఉప్పుల ఉదశ్రీ, నల్లగొండజాబ్ చేస్తూ చదువుకుంటాఇటీవల ఇంటర్ పూర్తి చేశాను. జాబ్‌మేళాలో ప్రైవేట్ కంపెనీలో రూ.16 వేల వేతనంతో జాబ్ వచ్చింది. ఈ జాబ్ ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుని ఉన్నత చదువులు చదివి ఇంకా మంచి ఉద్యోగం సంపాదిస్తాను. – నారగోని శివాని, చిన్న సూరారంఉద్యోగ కల నెరవేరిందిడిగ్రీ పూర్తిచేసి ఖాళీగా ఉన్నాను. ఉద్యోగం లేక అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను. పోలీసు శాఖ వారు ఏర్పాటు చేసిన జాబ్‌మేళా అవకాశాన్ని చూపింది. నెలకు రూ.14వేలు జీతంతో ప్రైవేట్ కార్ షోరూం నందు జాబ్ లభించింది. నా ఉద్యోగ కల నెరవేరింది. – ఆర్. మోహన్, నల్లగొండ భారీగా హాజరైన నిరుద్యోగులు -
మానసిక ఒత్తిడితో కార్మికుడి ఆత్మహత్య
చౌటుప్పల్ రూరల్: మానసిక ఒత్తిడితో ఉరేసుకుని కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం పసూనూరు గ్రామానికి చెందిన షేక్ సయ్యద్(50) కుటుంబంతో కలిసి జీవనోపాధి కోసం చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామానికి వలస వచ్చి అద్దె ఇంట్లో నివాసముంటున్నాడు. గత 20ఏళ్లుగా భూదాన్‌పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ పరిధిలోని ఓ పరిశ్రమలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. ఇటీవల పరిశ్రమ యాజమాన్యం పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు పెంచింది. కానీ సయ్యద్‌కు మాత్రం జీతం పెంచలేదు. దీంతో కొద్దిరోజులుగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు. శుక్రవారం పరిశ్రమకు వెళ్లిన సయ్యద్ తనకంటే జూనియర్లకు జీతం పెంచి తనకు ఎందుకు పెంచలేదని పరిశ్రమ యాజమాన్యాన్ని అడిగాడు. ‘ఇక్కడ పనిచేస్తే చెయ్.. లేదంటే వెళ్లిపో’ అని పరిశ్రమ యాజమాన్యం అనడంతో ఇంటికి వచ్చి జరిగిన విషయాన్ని భార్యతో చెప్పి బాధపడ్డాడు. సొంతూరికి వెళ్దామని, సామాను సర్దమని భార్యకు చెప్పాడు. శుక్రవారం రాత్రి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రించిన సయ్యద్ అర్ధరాత్రి మరొక గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం సయ్యద్ కుమార్తె నిద్ర లేచి చూడగానే తండ్రి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో తల్లికి చెప్పింది. చుట్టుపక్కల వారు వచ్చి సయ్యద్‌ను కిందికి దించగా అప్పటికే మృతిచెందాడు. తన చావుకు కంపెనీ యాజమాన్యం మరియు శేఖర్ అనే వ్యక్తి కారణమని రాసిన లెటర్ లభ్యమైంది. మృతుడి భార్య షేక్ జానిబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా వైద్య సేవలు
నల్లగొండ టౌన్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పేద ప్రజలకు కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రూ.23.75 కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్‌ను శనివారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఏడాది కాలంలో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన వసతులు కల్పిస్తామన్నారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో లివర్, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 16 నెలల్లోనే రూ.22కోట్ల విలువైన ఎల్ఓసీలు పేద ప్రజలకు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద పట్టణాల్లో నల్లగొండ ఒకటని, నల్లగొండ జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అన్నిరకాల వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ, నీలోఫర్ ఆస్పత్రుల తర్వాత ఎక్కువ ప్రసవాలు నల్లగొండలో జరుగుతున్నాయన్నారు. నల్లగొండ జిల్లాలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారి, నార్కట్‌పల్లి–అద్దంకి రహదారి ఉండటంతో క్రిటికల్ కేర్ యూనిట్ అవసరమని, సంవత్సర కాలంలోనే క్రిటికల్ కేర్ యూనిట్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. నల్లగొండ ప్రభుత్వ వైద్య కళాశాలకు మరో 3 కోర్సులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ అరుణకుమారి, డీఎంహెచ్ఓ పుట్ల శ్రీనివాస్, వేణుగోపాల్‌రెడ్డి, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైద్యులు పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి -
కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో అగ్నిప్రమాదం
● పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు దగ్ధంకోదాడరూరల్ : కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్‌కు ఆనుకొని ఉన్న వీధిలో గుర్తుతెలియని వ్యక్తులు చెత్తకు నిప్పుపెట్టారు. ఆ నిప్పు గాలికి పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ ఆవరణలో పడడంతో రాలిన చెట్ల ఆకులకు అంటుకొని మంటలు చెలరేగాయి. దీంతో స్టేషన్ ఆవరణలో ఉంచిన పలు కేసుల్లో సీజ్ చేసిన మూడు ఆటోలు, కారు, టాటా ఏస్ వాహనం, స్కార్పియో వాహనానికి మంటలు అంటుకొని దగ్ధమాయ్యయి. స్థానికులు, పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిమాపక సిబ్బంది రావడం ఏమాత్రం ఆలస్యమైనా పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న పెట్రోల్ బంక్‌కు నిప్పంటుకొని పెను ప్రమాదం జరిగేదని స్థానికులు పేర్కొన్నారు. -
నాడు కళకళ.. నేడు వెలవెల
అద్దెకిస్తే వినియోగంలోకి వస్తుందిరంగనాథ రంగశాలను అద్దెకిస్తే వినియోగంలోకి వస్తుంది. ప్రాజెక్టు అధికారులు సమయానుకూలంగా సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా ఉంటాయి. – శివ, స్థానిక వ్యాపారిసాగర్లో థియేటర్ లేదుసాగర్లో ఒకప్పుడు మూడు సినిమా థియేటర్లు ఉండేవి. నేడు ఒక్కటి కూడా లేదు. వారాంతంలో సినిమాలు చూసేందుకు స్థానికులు సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. రంగనాథ రంగశాలను లీజుకు తీసుకుని మినీ సినిమా థియేటర్‌గా రూపొందిస్తే పూర్వ వైభవం వస్తుంది. – భాస్కర్, ఉపాధ్యాయుడునాగార్జునసాగర్: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో వేలాది మంది కార్మికులు, ఉద్యోగులు, ఇంజనీర్లు తమ శ్రమను మర్చిపోయి ఆనందంగా గడిపేందుకు హిల్‌కాలనీలో రంగనాథ రంగశాలను నిర్మించారు. ఇందులో నిత్యం నాటకాలు ప్రదర్శించేవారు. అలనాటి సినిమా తారలు నూతన్‌ప్రసాద్, సావిత్రి, రేలంగి, జగ్గారావు, రాజనాల వంటి వారు రంగనాథ రంగశాలలో స్టేజీపై నాటకాలు వేశారని అప్పటి ఉద్యోగులు చెబుతుంటారు. సాగర్ ప్రాజెక్టును సందర్శించేందుకు వచ్చే ఉన్నతాధికారులు, విదేశీయులు సైతం ఇందులో వేసే నాటకాలు చూసి అబ్బుర పడేవారని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌లో సినిమా థియేటర్లు వచ్చాక రంగనాథ రంగశాలలో నాటకాలు ప్రదర్శన ఆగిపోయాయి. కొంతకాలం సమావేశాలకు వినియోగం ఆ తర్వాత కొంతకాలం వరకు రంగనాథ రంగశాలను సమావేశాలు నిర్వహించేందుకు వినియోగించారు. గత కృష్ణా పుష్కరాల సమయంలో భక్తులు సేద తీరేందుకు గాను రూ.50లక్షలు ఖర్చు చేసి విద్యుత్ సౌకర్యం, ఫ్లోరింగ్, వాష్‌రూమ్స్, ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుతం నిర్వహణ లేక రంగనాథ రంగశాల ఆవరణలో కంపచెట్లు మొలిచాయి. బస్టాండ్‌కు సమీపంలో ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. విద్యుత్ బోర్డులు, ఫ్యాన్లు చోరీకి గురయ్యాయి. నాగార్జునసాగర్‌లో గతంలో మూడు సినిమా థియేటర్లు ఉండేవి. నేడు ఒక్క థియేటర్ కూడా లేదు. స్థానికులు సినిమా చూడాలంటే హాలియా, మాచర్ల, మిర్యాలగూడకు వెళ్తుంటారు. రంగనాథ రంగశాలను అద్దెకిస్తే మినీ థియేటర్‌గా ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే, చీఫ్ ఇంజనీర్‌కు సినిమా థియేటర్ల నిర్వహణలో అనుభవం కలవారు దరఖాస్తు చేశారు. కానీ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. దీనిని అద్దెకిస్తే ప్రాజెక్టు అధికారులు సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుంటుందని స్థానికులు అంటున్నారు. శిథిలావస్థలో నాగార్జునసాగర్‌లోని రంగనాథ రంగశాల అద్దెకిచ్చి మినీ థియేటర్‌గా అభివృద్ధి చేయాలంటున్న స్థానికులు -
కాంగ్రెస్ పార్టీ వైఫల్యంతోనే వక్ఫ్ బిల్లుకు ఆమోదం
వలిగొండ: కాంగ్రెస్ పార్టీ వైఫల్యంతోనే వక్ఫ్(సవరణ)–2025 బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వలిగొండ మండలం ఎదుళ్లగూడెం గ్రామానికి చెందిన నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ గూడూరు మోహన్‌రెడ్డి సంతాప సభను శనివారం టేకులసోమారం సమీపంలోని ఫంక్షన్హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి కల్వకుంట్ల కవిత హాజరై మోహన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ముస్లిం మైనార్టీల పట్ల చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. వక్ఫ్(సవరణ)–2025 బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో లోక్‌సభలో రాహుల్ గాంధీ నోరు మెదపలేదని, ప్రియాంక గాంధీకి లోక్‌సభకు రావడానికి కూడా తీరిక లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడుతుందని తెలిపారు. అనంతరం టేకులసోమారం గ్రామానికి చెందిన పనుమటి జంగారెడ్డికి చెందిన ఎండిన పంట పొలాలను ఆమె పరిశీలించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువుకాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోస పట్టదని, పంటలు ఎండిపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఎస్ఈ గూడూరు మోహన్‌రెడ్డి తన సొంత డబ్బుతో పాటు భూమిని కూడా దానమిచ్చి శ్రీవెంకటేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి 600 ఎకరాలకు సాగునీరందించి రైతులకు ఎంతో మేలు చేశారని ఆమె కొనియాడారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఈఈలు శ్యాంసుందర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సత్తిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుమ్మ వెంకట్‌రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్‌గౌడ్, పనుమటి మమతానరేందర్‌రెడ్డి, డేగల పాండరి, ఎండీ అఫ్రోజ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆలయంలో పూజలు..భువనగిరిటౌన్: భువనగిరి మండలం నందనంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత శనివారం పూజలు చేశారు. వలిగొండ వెళ్తున్న ఆమెకు భువనగిరి వద్ద మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి మాజీ కన్వీనర్ అమరేందర్ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత -
బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తొండ గ్రామ వాసి
తిరుమలగిరి : హైదరాబాద్ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తిరుమలగిరి మండలం తొండ గ్రామానికి చెందిన నెమురుగొమ్ముల గౌతమ్‌రావు పేరును శుక్రవారం ఖరారు చేశారు. ప్రస్తుతం గౌతమ్‌రావు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. విజ్ఞాన భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చైర్మన్‌గా ఉన్నారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనున్నది. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్‌రావును నిర్ణయించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైభవంగా శ్రీలక్ష్మీనరసింహ స్వామి కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్య లక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణతంతులో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ నిర్వహించారు. అదేవిధంగా శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఊరేగించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్ కుమార్, అర్చకులు పాల్గొన్నారు. -
అవకతవకలు లేకుండా సన్నబియ్యం పంపిణీ
భానుపురి (సూర్యాపేట): జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవకతవకలు లేకుండా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో సన్నబియ్యం పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్ నుంచి కలెక్టర్ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరై మాట్లాడారు. జిల్లాలో ఉన్న 610 రేషన్ షాపులకు 3800 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం తరలించి ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించామని, ఎక్కడా అవకతవకలు లేకుండా సక్రమంగా నిర్ణీత సమయంలో రవాణా చేసేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్, పౌరసరఫరాల అధికారులు, చౌక ధరల దుకాణ యజమానులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ రాంబాబు, పౌరసరఫరాల శాఖ అధికారి రాజేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ ప్రసాద్ తదితరులున్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ప్రజల్లో చైతన్యానికే పోలీస్ ప్రజా భరోసా
అర్వపల్లి: ప్రజలను చైతన్యం చేసేందుకే పోలీస్ ప్రజా భరోసా లక్ష్యమని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం అర్వపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో సామాజిక అంశాలు, చట్టాలపై ప్రతి బుధవారం సమావేశం నిర్వహిస్తూ పోలీస్ ప్రజా భరోసా ద్వారా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ప్రతి బుధవారం ఒక గ్రామాన్ని ఎంచుకొని పోలీస్ అధికారులు పాల్గొనేలా సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తాను కూడా ప్రతివారం ఒక గ్రామాన్ని సందర్శిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారధి, నాగారం సీఐ రఘువీర్‌రెడ్డి, ఎస్ఐ బాలకృష్ణ, ఏఎస్ఐలు రామకోటి, రాములు పాల్గొన్నారు. ప్రతి గ్రామ చరిత్ర పోలీసు రికార్డుల్లో నమోదు తుంగతుర్తి: ప్రతి గ్రామ చరిత్ర పోలీసు రికార్డుల్లో నమోదు చేయబడి ఉంటుందని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి పోలీస్ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. పౌరులు చట్టానికి లోబడి నడుచుకోవాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని, శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు. అనంతరం రికార్డులను పరిశీలించి పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట డీఎస్పీ పార్థసారధి, ఎస్సై క్రాంతి కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.ఫ ఎస్పీ నరసింహ -
చెడు వ్యసనాలకు బానిస కావొద్దు
నేరేడుచర్ల: విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు బానిస కావొద్దని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీఎస్పీ భిక్షపతి అన్నారు. శుక్రవారం నేరేడుచర్లలోని న్యూ అరబిందో డిగ్రీ, స్పందన జూనియర్ కళాశాలలో డ్రగ్స్‌పై అవగాహనకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. జూన్ 16న యాంటీ నార్కోటిక్ డే సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాలు– వాటి అనర్థాలపై అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ కట్ట ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ప్రిన్సిపాల్ యడవల్లి వెంకట్‌రెడ్డి, కానిస్టేబుల్ స్వామి తదితరులున్నారు. -
జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తా
సూర్యాపేటటౌన్ : రాష్ట్రంలోని వైద్య కళాశాలలను పటిష్టవంతంగా తీర్చిదిద్దుతామని, సూర్యాపేట మెడికల్ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తానని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సూర్యాపేట మెడికల్ కళాశాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. కళాశాల నిర్వాహకుల అభ్యర్థన మేరకు కళాశాల ప్రాంగణంలో 1000 సీట్లతో కూడిన ఆడిటోరియం నిర్మాణానికి శ్రీకోటి రూపాయలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా విద్యార్థుల సౌకర్యార్థం రెండు బస్సులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. సమాజానికి వైద్య సేవలు అందించడంలో వైద్య విద్యార్థుల పాత్ర కీలకంగా ఉందన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న విద్యార్థులను ఆయన అభినందించారు. ప్రజల ఆరోగ్య బాధ్యత వైద్య విద్యార్థుల భుజస్కందాలపై ఉందనే విషయాన్ని విస్మరించకూడదన్నారు. ఈ సందర్భంగా 2019–2025లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన మొదటి బ్యాచ్ 150 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెడల్స్ అందజేశారు. అద్బుతమైన మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మించుకున్నాం సూర్యాపేటలో అద్భుతమైన ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనాన్ని నిర్మించుకున్నామని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆనాడు మెడికల్ కాలేజీ అనగానే వెంటనే ఎగ్జిబిషన్ సొసైటీతో మాట్లాడి అనుమతి తీసుకున్నామని, విద్యార్థులు ఒక్క ఇయర్ కూడా నష్టపోకూడదని 2019 లోనే ప్రారంభించుకున్నామని తెలిపారు. కరోనా సమయంలో అద్భుతమైన సేవలు అందించిన ఘనత మన మెడికల్ కళాశాలకే దక్కిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మందుల సామేలు, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, ప్రిన్సిపాల్ జయలత, కేఎన్ఆర్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ నందకుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫ సూర్యాపేట మెడికల్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి ఫ ఆడిటోరియం నిర్మాణానికి రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటన ఫ ప్రభుత్వ మెడికల్ కళాశాల స్నాతకోత్సవంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చాలా ఆనందంగా ఉంది సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్నా. నాలుగేళ్లు కష్టపడి చదివి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. సర్టిఫికెట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. పీజీ పూర్తి చేసి రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు పాటుపడతా. – అనిల్‌కుమార్ యాదవ్, కూకట్పల్లి అదృష్టంగా భావిస్తున్నా సూర్యాపేట మెడికల్ కళాశాల ప్రారంభం మొదటి బ్యాచ్ 2019లో చేరాను. ఎంబీబీఎస్ పూర్తి చేసుకోవడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. పీజీ చేసి మంచి సర్జన్ అవుతా. పేద వారికి నాణ్యమైన వైద్యం అందించి మన్ననలు పొందుతా. – రామటెంకి విజయ్, మంచిర్యాల చాలా గర్వంగా ఉంది ఎంబీబీఎస్ పూర్తి చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. కళాశాలలో అన్ని వసతులు ఉన్నాయి. ప్రొఫెసర్లు మంచి నాణ్యమైన విద్యనందించారు. మెరుగైన వైద్య సేవలందించి మంచి పేరు తెచ్చుకుంటా. – ప్రతిమ, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంవైద్య వృత్తి ఎంతో పవిత్రమైంది స్నాతకోత్సవంలో ఎమ్మెల్యే మందుల సామేల్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి చాలా పవిత్రమైందని అన్నారు. ఉస్మానియా మెడికల్ కళాశాల, గాంధీ మెడికల్ కళాశాలలో ఎంతోమంది పట్టభద్రులు బయటకి వెళ్లారని, ఇప్పుడు సూర్యాపేట మెడికల్ కాలేజీలో సుమారు 150 మంది విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తిచేసుకుని వెళ్లడం గొప్ప విషయమన్నారు. ఈ విజయం అందించిన అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. -
‘పాలిటెక్నిక్’ పిలుస్తోంది
తిరుమలగిరి (తుంగతుర్తి): పదవ తరగతి తరువాత సాంకేతిక విభాగాల్లో డిప్లొమా కోర్సులు చేసేందుకు విద్యార్థులకు పాలిటెక్నిక్ కళాశాలలు దన్నుగా నిలుస్తున్నాయి. వీటిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రస్తుతం 2025–26 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కోర్సుల్లో అడ్మిషన్లకు ప్రవేశ పరీక్ష (పాలిసెట్) దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులంతా దరఖాస్తులు చేసుకోవచ్చు. రెండు కళాశాలల్లో 300 సీట్లు జిల్లా వ్యాప్తంగా సుమారు 12 వేల మంది విద్యార్థులు పదవ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్నారు. వీరంతా పాలిసెట్ రాసేందుకు అర్హత ఉంటుంది. తుంగుతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, సూర్యాపేట నియోజకవర్గంలోని సూర్యాపేటలో ఒక్కొక్కటి చొప్పున రెండు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. తిరుమలగిరి పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా మెకానికల్ ఇంజనీరింగ్‌లో 60 సీట్లు, డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్‌లో 60 సీట్లు, సూర్యాపేట కళాశాలలో డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్‌లో 60, డిప్లొమా కంప్యూటర్లో 60 సీట్లు, ఈసీఈలో 60 చొప్పున రెండు కళాశాలల్లో మొత్తం 300 సీట్లు ఉన్నాయి. పాలిసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. పాలిసెట్‌లో సాధించిన మార్కులు, పదవ తరగతిలో వచ్చిన జీపీఏ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. పాలిటెక్నిక్ కళాశాలల్లో హాస్టల్ వసతి కూడా ఉంది. కోర్సు తరువాత ఉద్యోగ అవకాశాలు పాలిటెక్నిక్‌లో మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్స్ కోర్సులు పూర్తి చేసే వారికి వివిధ పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్, ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, ఏయిర్ లైన్స్, ట్రాన్స్‌పోర్టు గనులు, ఇండియన్ ఆర్మీ, నావి, ఆర్టీసీ, ట్రాన్స్‌కో, జెన్కో, బీహెచ్ఈఎల్, బీడీఎల్, బీఎస్ఎన్ఎల్ మొదలైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిసెట్ ద్వారా పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లు సాధించవచ్చు. ఈ కళాశాలలో నాణ్యమైన టెక్నికల్ విద్య అందుతుంది. భవిష్యత్తులో మంచి ఉపాధి అవకాశాలు పొందవచ్చు. పాలిసెట్‌కు అప్లయ్ చేయడానికి ఏప్రిల్ 21వ తేదీ వరకు చివరి గడువు ఉంది. – సత్తయ్య, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్, తిరుమలగిరి ఫ ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం ఫ ఆఖరు తేది ఏప్రిల్ 21 ఫ మే 13న పాలిసెట్ ఫ ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులు రూ.500 ఫీజు ఫ జిల్లాలో రెండు కళాశాలలు -
పత్తి రైతుపై విత్తన భారం!
భానుపురి: పత్తి రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. విత్తనాలు నాటింది మొదలు పత్తి దిగుబడి చేతికొచ్చి అమ్మేదాకా ఇబ్బందులే ఎదురవుతున్నాయి. రానున్న వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే పత్తి విత్తనాల కంపెనీలు విత్తన ధరలను పెంంచేశాయి. దీంతో రైతులపై ఆర్థిక భారం మరింత పెరగనుంది. ఫలితంగా ఇప్పటికే ఏటేటా తగ్గుతూ వస్తున్న పత్తి సాగువైపు ఈసారి రైతులు మొగ్గు చూపుతారా..అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ధరలు ఏటా పెంచుతుండగా నకిలీ విత్తనాల బెడద రైతులను తీవ్రంగా నష్టాల పాలుచేస్తోంది. ఏటేటా పెరుగుతున్న విత్తన ధరలు రైతులకు ఏటేటా పత్తి సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. సాగు ఖర్చులతోపాటు విత్తనాలు, పురుగు మందులకు రూ.వేల్లో పెట్టుబడులు పెడుతున్నారు. దీనికి తోడుగా కూలీల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ఎకరానికి రూ.10 నుంచి రూ.12వేల వరకు కలుపుతీత కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. విత్తన కంపెనీలు ఏటా ధరలు పెంచుతుండడంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. బీటీ పత్తి విత్తనాల ధర ఆరేళ్లుగా పెరుగుతూనే ఉన్నాయి. 2019లో పత్తి ప్యాకెట్ ధర రూ.710 ఉండగా ప్రస్తుతం రూ.901కు చేరింది. ఎకరాకు మూడు ప్యాకెట్లు అవసరం జిల్లాలో వరి తర్వాత పత్తి సాగే అధికంగా ఉంటుంది. 8ఏళ్ల క్రితం దాదాపు 2 లక్షల ఎకరాల వరకు పత్తి సాగు ఉండేది. కొన్నేళ్లుగా కాలం కలిసి రావడం, ఎస్సారెస్సీ నీళ్లు జిల్లాకు అందుతుండడంతో రైతులు వరిసాగు వైపు మళ్లుతున్నారు. దీనికితోడు పత్తి ధర అంతంత మాత్రంగానే ఉంటుండడంతో ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతోంది. గత వానాకాలంలో జిల్లాలో 80వేల ఎకరాల వరకు పత్తి సాగు జరిగింది. ఎకరాకు మూడు ప్యాకెట్ల చొప్పున విత్తనాలను విత్తుకోవాల్సి ఉండగా జిల్లాలో 2.40 లక్షల ప్యాకెట్ల పత్తి ప్యాకెట్లు అవసరమవుతాయి. ఒక్కో ప్యాకెట్ 475 గ్రాములు ఉంటుండగా ఇందులో 450 గ్రాముల బీటీ, 25 గ్రాముల నాన్‌బీటీ విత్తనాలు ఉంటాయి. రైతులు పూర్తిగా బీటీ విత్తనాలే వాడుకుంటారు. పెట్టుబడులు అధికమవుతున్నాయి పత్తి విత్తనాల కొనుగోలు నుంచి చేతికొచ్చిన పంట అమ్మకం దాకా రైతుల చేతిలో ఏదీ ఉండడం లేదు. ఏటా విత్తన ధరలను కంపెనీలు పెంచుతున్నాయి. ఇతరత్రా ఖర్చులు అధికంగానే పెరుగుతుండడంతో పత్తి సాగు చేసే పరిస్థితి లేదు. – గుద్దేటి జాన్‌రెడ్డి, రైతు, ఆత్మకూర్(ఎస్) ధరలను తగ్గించాలి పత్తి విత్తనాల ధరలను ఏటా పెంచుతుండంతో రైతులపై ఆర్థిక భారం పడుతోంది. పెంచిన ధరలను కంపెనీలు వెంటనే తగ్గించాలి. లేదంటే ప్రభుత్వం పత్తి విత్తనాలపై రాయితీ ఇవ్వాలి. పత్తి సాగు చేస్తే పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్థితి లేదు. – ఉప్పుల మల్లయ్య, రైతు, ఆత్మకూర్(ఎస్) పత్తి విత్తన ప్యాకెట్ల ధరలు పెంచిన కంపెనీలు ఫ ఇప్పటికే అధిక పెట్టుబడులతో కుదేలవుతున్న రైతాంగం ఫ దిగుబడులు సైతం తగ్గి ఆర్థికంగా నష్టపోతున్న వైనం ఫ జిల్లాలో ఏటా 80వేల ఎకరాల్లో పత్తిసాగుపత్తి విత్తన ప్యాకెట్ల ధరలు ఇలా.. (రూపాయల్లో..) 2019 710 2020 730 2021 767 2022 810 2022 853 2023 864 2024 864 2025 901 -
గోదావరి జలాల పెంపు
అర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు అదనంగా మరో విడత గోదావరి జలాలను బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తొలిరోజు 1000 క్యూసెక్కుల నీటిని వదలగా గురువారం 1,325 క్యూసెక్కులకు పెంచారు. మూడో సారి శుక్రవారం 1,510 క్యూసెక్కులకు పెంచినట్లు బయ్యన్నవాగు డీఈఈ సత్యనారాయణ తెలిపారు. ఈ నీటిని 69,70,71 డిస్ట్రిబ్యూటర్లకు వదులుతున్నట్లు పేర్కొన్నారు. నీళ్లు చివరి భూములకు చేరడానికే పెంచినట్లు తెలిపారు. రైతులు కాలువలకు గండ్లు పెట్టకుండా, నష్టం కలిగించకుండా గోదావరి జలాలను వాడుకోవాలని సూచించారు. తోటివారితో ప్రేమ పూర్వకంగా ఉండాలి మఠంపల్లి: క్రైస్తవులంతా తోటి వారితో ప్రేమ పూర్వకంగా జీవించాలని నల్లగొండ మేత్రాసన పీఠాధిపతి (బిషప్) కరణం ధమన్‌కుమార్ అన్నారు. శుక్రవారం మఠంపల్లిలోని శుభవార్త చర్చిలో జూబ్లీ ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై దివ్యబలిపూజ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ.. 2025 సంవత్సరాన్ని జూబ్లీగా పోపు ప్రకటించారని తెలిపారు. గతనెల 5నుంచి ఈనెల 18న జరగనున్న గుడ్‌ఫ్రైడే వరకు ఉపవాస దీక్షల్లో ఉన్న క్రైస్తవులకు అత్యంత విలువైన కాలమని పేర్కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విచారణ గురువులు, చర్చి కమిటీ పెద్దలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో రెవరెండ్ ఫాదర్లు మార్టిన్, బాల, సాగర్, చిన్నపరెడ్డి, క్రీస్తురాజు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్‌కు రెండు రోజులు సెలవుతిరుమలగిరి: తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు శనివారం మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావ్ జయంతి, ఆది వారం వారాంతం సందర్భంగా రెండు రోజులు మార్కెట్‌కు సెలవు ఉంటుందని వ్యవసాయ మార్కెట్ ఇన్చార్జ్ కార్యదర్శి సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని తీసుకురావొద్దని కోరారు. తిరిగి వ్యవసాయ మార్కెట్ సోమవారం యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. సీఎంఆర్ ఇచ్చిన మిల్లర్లకే ధాన్యం కేటాయింపుభానుపురి (సూర్యాపేట): సీఎంఆర్ బకాయి పూర్తి చేసిన మిల్లర్లకే 2024– 25 రబీ సీజన్ ధాన్యం కేటాయించనున్నట్లు అదనపు కలెక్టర్ రాంబాబు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సివిల్ సప్లయ్ అధికారులు, మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022–23 రబీ సీజన్, 2024–25 ఖరీఫ్ సీజన్ సీఎంఆర్ బకాయిలను త్వరగా పూర్తి చేయాలన్నారు. బ్యాంకు గ్యారంటీ ఉన్న మిల్లర్లకు మాత్రమే 2024–25 ఖరీఫ్ సీజన్ ధాన్యం కేటాయిస్తామని, వేలం వేసిన ధాన్యం బకాయిలు కూడా త్వరగా చెల్లించాలన్నారు. మిల్లులకు వచ్చిన ధాన్యం పెండింగ్ ఉంచకుండా వెంటనే దిగుమతి చేసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రాజేశ్వర్, డీఎం ప్రసాద్, ఏఎస్ఓ శ్రీనివాసరెడ్డి, డీటీలు, మిల్లర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
‘ఇక్కడ ఇద్దరు మంత్రులున్నా ఏం లాభం?’
నల్లగొండ జిల్లా : జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా ఏం లాభమని విమర్శించారు బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు ఎమ్మెల్యేలు.. మంత్రులుగా ఉండి కూడా ధాన్యం కొనుగోళ్లపై సమీక్షలు జరపలేదని తప్పుబట్టారు. నల్లగొండ బీఆర్ఎస్ కార్యాలయంలో జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘ రైతులు అన్ని విషయాల్లో మోసపోయారు. రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగొళ్లు లేవు. మంత్రులు కమిషన్ లు తింటూ దళారులకు అమ్ముడుపోయారు. జిల్లాలో ధాన్యానికి మద్దతు ధర రావడం లేదు. నల్లగొండ లో ఓ మంత్రికి సోయి లేదు. కమీషన్లు దందాలో నిమగ్నమయ్యాడు. ప్రశ్నిస్తే వారిపై కేసులు పెట్టి భయపెడుతున్నారు. మంత్రులు హెలికాప్టర్లలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నిబంధనలు ప్రకారం నడుచుకోవాలి కానీ కాంగ్రెస్ కార్యకర్తలగా మాట్లాడొద్దు’ అని సూచించారు జగదీష్ రెడ్డి. -
దొడ్డి కొమురయ్య జీవితం.. స్ఫూర్తిదాయకం
భానుపురి: నిజాం ప్రభువుల అరాచక పాలన, భూస్వాములు, పెత్తందారులను ఎదురించి తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, అమరుల త్యాగాలు వెలకట్టలేనివని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొమురయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ.అప్పారావు, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ నాయక్, డీడబ్ల్యూఓ నరసింహారావు, సంక్షేమ అధికారులు లత, శంకర్, జగదీశ్వర్‌రెడ్డి, వివిధ కుల సంఘాల ప్రతినిధులు వజ్జే వీరయ్య, డాక్టర్ రామ్మూర్తి, పోలెబోయిన నర్సయ్య, పుల్లయ్య, అధికారులు పాల్గొన్నారు. ఫ అదనపు కలెక్టర్ రాంబాబు -
‘రాజీవ్ యువ వికాసం’ గడువు పొడిగింపు
భానుపురి: రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జగదీశ్వర్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు పొడిగించిన తేదీలోగా ఆన్లైన్ వెబ్సైట్ పోర్టల్/ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏదైనా సందేహాలు ఉంటే జిల్లా మైనార్టీ సంక్షేమ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ 08684 231023, 9492611057 నంబర్లను కార్యాలయ వేళల్లో సంప్రదించాలని కోరారు. గోదావరి జలాలు పెంపుఅర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు అదనంగా మరో విడత గోదావరి జలాలను బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తొలి రోజు 1000 క్యూసెక్కుల నీటిని వదలగా గురువారం 1,325 క్యూసెక్కులకు పెంచారు. ఇందులో 69 డీబీఎంకు 500 క్యూసెక్కులు, 70 డీబీఎంకు 25 క్యూసెక్కులు, 71 డీబీఎంకు 800 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నట్లు బయ్యన్నవాగు డీఈఈ ఎం.సత్యనారాయణ తెలిపారు. రైతులు కాలువలకు గండ్లు పెట్టి నష్టం కలిగించకుండా గోదావరి జలాలను వాడుకోవాలని సూచించారు. వైభవంగా నారసింహుడి కల్యాణంమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో గురువారం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషే కాలు, హోమం జరిపారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల కల్యాణం జరిపి ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఊరేగించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. ఆస్తిపన్ను వసూళ్లలో నేరేడుచర్లకు ప్రథమ స్థానంనేరేడుచర్ల: గడిచిన ఆర్థిక సంవత్సరం (2024–25)కు సంబంధించి మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లలో జిల్లాలోనే నేరేడుచర్లకు ప్రథ మ స్థానాన్ని దక్కింది. మొత్తం 80.45 శాతం పన్ను వసూలు చేసి మిగతా మున్సిపాలిటీల కంటే ముందంజలో నిలిచింది. ఇందుకు కృషిచేసిన నేరేడుచర్ల మున్సిపల్ కమిషనర్ యడవల్లి అశోక్‌రెడ్డిని అభినందిస్తూ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ ఆడ్మినిస్ట్రేషన్ శ్రీదేవి గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఆస్తిపన్ను వసూలు చేసిన అధికారుల, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
48 గంటల్లోనే ధాన్యం డబ్బులు జమ చేస్తాం
భానుపురి: ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో యాసంగి (2024–25) ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం వడ్లకు మద్దతు ధర రూ.2,320తోపాటు క్వింటాపై రూ.500 బోనస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు. జిల్లాలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 127, ఐకేపీ ఆధ్వర్యంలో 137, మెప్మా ఆధ్వర్యంలో 12, ఎఫ్‌పీఓ 10, మొత్తం 286 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ వీవీ.అప్పారావు, మార్కెటింగ్ అధికారి నాగేశ్వరశర్మ, జిల్లా సహకార అధికారి పద్మ, మెప్మా పీడీ రేణుక, ఏఎస్ఓ శ్రీనివాస్‌రెడ్డి, ఏడీ ఎం.బెనర్జీ, పీఏసీఎస్ అధికారులు, ఐకేపీ నిర్వాహకులు, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. -
పెండింగ్ పనులు త్వరగా పూర్తిచేయాలి
హుజూర్నగర్, హుజూర్నగర్ రూరల్: కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని జలసౌదలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు చెందిన వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్, రోడ్లు, కాలువ లైనింగ్ పనులను మూడె నెలల్లో పూర్తిచేయాలన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పనుల డిజైన్లను అధికారులు తమ ఇష్టానుసారం మార్చవద్దన్నారు. కొత్త మండలాలకు మంజూరైన ప్రభుత్వ భవనాలను వెంటనే పూర్తిచేయాలని చెప్పారు. ఎవరైనా చెరువులు, ఎన్ఎస్పీ కాలువల స్థలాల ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. మేళ్లచెరువులో ఎన్నెస్పీ కాలవపై మూడు చోట్ల ఉన్న బ్రిడ్జీలను వెంటనే నిర్మించాలన్నారు. హుజూర్‌నగర్‌కు నూతనంగా మంజూరైన అగ్రికల్చర్ కళాశాలకు 100 ఎకరాలు, కోదాడలో జవహర్ నవోదయ విద్యాలయానికి 25 ఎకరాల స్థలం అవసరం ఉందని అధికారులు దానిని సేకరించాలని సూచించారు. ఆయా పనులను వారం రోజుల్లో పరిశీలిస్తానని మంత్రి తెలిపారు. హుజూర్నగర్ నియోజకవర్గానికి రూ.1,15,701.94 కోట్లు, కోదాడ నియోజకవర్గానికి రూ.51,999.81 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. వీటిని విధధ శాఖలకు సంబంధించిన పనులకు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నీటిపారుదల స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్, ఆర్ అండ్ ఆర్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఈఎన్సీ అనిల్, సీఈ రమేష్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
యువ న్యాయవాదులు వృత్తినైపుణ్యం సాధించాలి
చివ్వెంల: యువ న్యాయవాదులు వృత్తిలో నైపుణ్యం సాధించాలని జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి ఎం.శ్యామ్శ్రీ అన్నారు. యువ న్యాయవాదులకు చేయూత నందించాలనే ఉద్దేశంతో గురువారం సూర్యాపేట జిల్లా కోర్టులో సీనియర్ న్యాయవాదులు పొదిల ప్రదీప్‌కుమార్, గోండ్రాల అశోక్ బహూకరించిన మూడు కంప్యూటర్లు, మూడు ప్రింటర్లను జిల్లా ఇన్చార్జి ప్రధాన జడ్జి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జూనియర్లకు సహకారం అందిస్తున్న సీనియర్ న్యాయవాదులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువ న్యాయవాదులు వాటిని సద్విని యోగం చేసుకోవాలన్నారు. కంప్యూటర్లు అందబాటులో ఉండటం వల్ల తమ పిటిషన్లను త్వరగా తయారు చేసుకుని కోర్టులో వేసుకోవచ్చని సూచించారు. దీంతో సమయం వృథాకాకుండా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా దాతలను యువ న్యాయవాదుల సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి అపూర్వ రవళి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఫ జిల్లా ఇన్చార్జి ప్రధాన న్యాయమూర్తి శ్యామ్శ్రీ -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం చేసి తులసీ దళాలతో అర్చించారు. ఇక ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో అష్టోత్తర పూజలు తదితర పూజలు నిర్వహించారు. సాయంత్రం వెండి జోడు సేవలను ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకోవాలి
భానుపురి: సమాజంలోని అన్యాయాలపై ధైర్యంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి మాట్లాడారు. సామాజిక న్యాయం కోసం పాపన్న చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జెడ్పీ సీఈఓ అప్పారావు, సంక్షేమ అధికారులు శ్రీనివాస్ నాయక్, శంకర్, లత, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పొలాల వద్దకు ‘ఉపాధి’ బాటలు
నాగారం: గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు తమ పంట పొలాలకు వద్దకు వెళ్లేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మట్టి రోడ్లు నిర్మిస్తున్నారు. జిల్లాలోని 23 మండలాల్లో 1,786 రోడ్లు మంజూరుకాగా, ప్రస్తుతం 627 రోడ్ల పనులు కొనసాగుతున్నాయి. ఆయా పనులకు రూ.119 కోట్లు మంజూరు కాగా ఇందులో రూ.48.60 కోట్ల పనులు పూర్తి చేశారు. మిగతా పనులు మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాల్సి ఉంది. కానీ పనుల్లో జాప్యం వల్ల పూర్తికాని పనులను రీ షెడ్యూల్ చేసి ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేసేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ప్రణాళికా సిద్ధం చేశారు. తీరనున్న అవస్థలు వర్షాకాలంలో రైతులు తమ పంట పొలాలకు వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. ప్రతి మండలంలో కనీసం 2 కి.మీ. నుంచి 5 కి.మీ. దూరం మట్టి రోడ్డు నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఈ పనుల్లో కూలీలకు 60 శాతం, 40 శాతం మెటీరియల్‌కు ఖర్చు చేస్తున్నారు. కిలోమీటర్ దూరం రోడ్డు నిర్మాణానికి దాదాపు రూ.2 లక్షలు కూలీలకు, రూ.1.10 లక్షలు మెటీరియల్ కింద వ్యయం చేసే అవకాశముంది. కూలీలు కందకాలు తవ్వి రోడ్డుపై మట్టి పోస్తుండగా, గుంతలు నింపేందుకు ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాల నుంచి మొరాన్ని తరలించి చదును చేయనున్నారు. ఊపందుకున్న ఉపాధి పనులు.. జిల్లాలో ఉపాధి హామీ పనులు ఊపందుకుంటున్నాయి. జిల్లాలోని 475 గ్రామ పంచాయతీలు ఉండగా ఇప్పటికే ఉపాధిహామీ పనులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 2.62లక్షల జాబ్‌కార్డులు ఉండగా, వీటి పరిధిలో 5.70 లక్షల మంది కూలీలుగా నమోదై ఉన్నారు. కాగా వీరిలో ప్రస్తుతం పనులకు వెళ్తున్న కూలీలు 37,775గా ఉన్నారు. వచ్చే ఏప్రిల్, మే నెలల్లో ఈ సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రస్తుతం ఇంకుడు గుంతలు, పశువుల షెడ్ల నిర్మాణం, కోళ్ల షెడ్లు, నీటి తొట్లు, నీటి నిల్వ వసతులు, నర్సరీల ఏర్పాటు, చెక్ డ్యామ్‌లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పంట పొలాలకు రోడ్ల అనుసంధానం, నీటికుంటల నిర్మాణం, వనమహోత్సవంలో పండ్ల తోటల పెంపకం, నర్సరీల్లో మొక్కల సంరక్షణ పనులు చేపడుతున్నారు. 2 నుంచి 5 కిలోమీటర్ల వరకు మట్టి రోడ్లు నిర్మించేలా చర్యలు పురోగతిలో 627 రోడ్ల పనులు మిగిలిన పనులు ఏప్రిల్‌లోగా పూర్తిచేసేందుకు ప్రణాళిక రైతులకు ప్రయోజనకరం ఉపాధి హామీ పథకం ద్వారా పొలాల వద్దకు వెళ్లేందుకు నిర్మిస్తున్న మట్టి రోడ్లతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. కూలీలకు కూడా ఉపాధి లభిస్తుంది. పనుల కోసం కేటాయించిన నిధుల్లో 60 శాతం కూలీలకు, 40 శాతం మెటీరియల్ కింద ఖర్చు చేయనున్నాం. – వీవీ.అప్పారావు, డీఆర్డీఓ, సూర్యాపేట -
గోదావరి జలాలు విడుదల
అర్వపల్లి: వరి పొలాలు ఎండిపోతుండడంతో రైతుల విన్నపం మేరకు నీటి పారుదల శాఖ అధికారులు బుధవారం జనగామ జిల్లా బయ్యన్నవాగు నుంచి జిల్లాకు వెయ్యి క్యూసెక్కుల గోదావరి జలాలను విడుదల చేశారు. అయితే ఈ యాసంగి సీజన్‌కుగాను షెడ్యూల్ ప్రకారం ఇప్పటికే ఆరు విడుతలుగా నీటిని వదిలారు. షెడ్యూల్ పూర్తికావడంతో గత నెల 24న జిల్లాకు నీటిని నిలిపివేశారు. దీంతో నీరు సాలక వరిచేలు ఎండిపోతున్నాయి. మరో పది రోజుల్లో వరి పంటలు చేతికందుతాయని, మరో విడత నీరు అందించాలని అధికారులకు రైతులు విన్నవించడంతో నీటిని వదిలారు. వదిలిన వెయ్యి క్యూసెక్కుల నీటిలో 69 డీబీఎంకు 300, 70డీబీఎంకు 50, 71డీబీఎంకు 630 క్యూసెక్కుల చొప్పున నీటిని ఇస్తున్నారు. రైతులు ఈ నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని నీటిపారుదల శాఖ డీఈఈ ఎం.సత్యనారాయణ కోరారు. -
రోడ్డును ఆక్రమించి పక్కా నిర్మాణం
కోదాడ: పట్టణంలో రోడ్డు ఆక్రమణలు తొలగించాలని ప్రజలు కోరుతుంటే.. కొందరు మాత్రం ప్రధాన రహదారినే ఆక్రమించి పక్కా నిర్మాణాలు చేపడుతున్నారు. కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి ముందు మురుగు కాలువ మీద కొందరు చిన్న డబ్బాకొట్లను ఏర్పాటు చేసి వాటిని అద్దెకు ఇస్తున్నారు. ఇటీవల మురుగు కాలువలో పూడిక తీయడానికి కాలువపై ఉన్న డబ్బాకొట్లను మున్సిపల్ యంత్రాంగం తొలగించింది. పూడిక తీసిన తరువాత కొందరు చిన్న డబ్బాకొట్ల స్థానంలో మురుగుకాలువ దాటి దాదాపు 10 అడుగుల మేర ప్రధాన రహదారి మార్జిన్ ఆక్రమించి పక్కా నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిపోయే రోగులు, వారి బంధువుల వాహనాల పార్కింగ్‌కు స్థలం లేక ఇబ్బంది తీవ్ర పడుతున్నారు. రోడ్డు ఆక్రమించి పక్కా నిర్మాణం చేపడుతున్నా ఇటు, మున్సిపల్, అటు ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోకపోవడంపై పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
ముగిసిన పదో తరగతి పరీక్షలు
సూర్యాపేట టౌన్: గతనెల 21న ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు బుధవారం ముగిశాయి. జిల్లాలో మొత్తం 67 కేంద్రాల్లో ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు ఒక్కో పరీక్ష నిర్వహించారు. చివరి రోజు సోషల్ స్టడీస్ పరీక్షకు 11,912 మంది రెగ్యులర్ విద్యార్థులకు గాను 11,885 మంది హాజరు కాగా, 27 మంది గైర్హాజరయ్యారు. 11 మంది ప్రైవేట్ విద్యార్థులకు గాను 8 మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను బుధవారం స్టేట్ ప్రాజెక్టు అడిషనల్ డైరెక్టర్, సమగ్ర శిక్ష అధికారి రాధారెడ్డితోపాటు నాలుగు స్క్వాడ్ బృందాలు, డీఈఓ తనిఖీ చేశారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని డీఈఓ అశోక్ తెలిపారు. అలాగే గురువారం ఒకేషనల్ విద్యార్థులకు 13 సెంటర్లలో పరీక్ష జరుగుతుందని చెప్పారు. ప్రజా భద్రత కోసమే పోలీస్ వ్యవస్థచివ్వెంల: ప్రజా భద్రత కోసమే పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందని జిల్లా అదనపు ఎస్పీ ఏఆర్.జనార్దన్ అన్నారు. బుధవారం రాత్రి చివ్వెలం మండలం ఎంజీనగర్ తండాలో నిర్వహించిన పోలీస్ ప్రజా భద్రత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లో అల్లర్లు, సమస్యలు సృష్టించే వారిని బైండోవర్ చేస్తామన్నారు. యువత బెట్టింగ్‌లు పెట్టి అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌లు మహేశ్వర్, కనకరత్నం, గ్రామ పోలీస్ అధికారి ఎం.సురేష్, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సూర్యాపేట డీఎస్పీగా పార్థసారథిసూర్యాపేట టౌన్: సూర్యాపేట డీఎస్పీ పార్థసారథిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఆయన డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన ప్రస్తుతం వరంగల్ ఎస్బీ ఏసీపీగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. కాగా ఇక్కడ పనిచేసిన డీఎస్పీ రవి ఇటీవల డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. వైభవంగా గరుడ వాహనసేవమఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో బుధవారం నిత్యారాధనలు కొనసాగాయి. శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై ఊరేగించారు. ఆ తర్వాత భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఇక..‘పోలీస్ ప్రజా భరోసా’
సూర్యాపేట టౌన్: గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరినీ సన్మార్గంలో నడిపించాలనే లక్ష్యంతో జిల్లా ఎస్పీ నరసింహ పోలీస్ ప్రజా భరోసా పేరుతో బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామాల్లో ప్రతి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సామాజిక అంశాలు, చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రతి బుధవారం ఒక గ్రామాన్ని ఎంచుకొని.. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిది సర్కిళ్లు ఉండగా అందులో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో డీఎస్సీ, సీఐ, ఎస్ఐలు అందుబాటులో ఉండేలా చూస్తూ ప్రతి బుధవారం పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గ్రామ పోలీస్ అధికారి పనిచేస్తారు. అలాగే ఎస్పీ కూడా ప్రతివారం ఏదో ఒక గ్రామంలో ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అవగాహన కల్పించే అంశాలు ఇవే.. ● ప్రతిఒక్కరూ చట్టానికి లోబడి నడుచుకునేలా చట్టాల గురించి తెలపడం. ● పోలీసులు మీ భద్రత కోసం ఉన్నారని, ఇతరుల ఆస్తులపై దాడులు చేయవద్దని వివరించుట. ● సమాజంలో అవగాహన లోపం వల్ల నేరాలకు పాల్పడి జీవితాలను జైలుపాలు చేసుకోవద్దు అనే విషయాలను తెలుపుట. ● గ్రామాల్లో అలజడి వాతావరణం, సమస్యలు సృష్టించే వారిలో మార్పు తీసుకురావడం. ● సామాజిక సమస్యలను గుర్తించి వాటిని నిర్మూలించడం కోసం, తద్వారా గ్రామాల్లో శాంతియుత వాతావరణం కల్పించుట. ● సమస్యాత్మక గ్రామంగా పోలీస్ రికార్డ్‌లో ఒకసారి పేరు నమోదైతే ఎప్పటికీ అలాగే నిలిచిపోతుందని అవగాహన పర్చుట. ● ఒక వ్యక్తిపై రౌడీ షీటర్, సస్పెక్ట్ షీటర్‌గా పోలీస్ రికార్డ్‌లో నమోదైతే జీవితకాలం ముద్ర అలాగే ఉంటుందని వివరించుట. ● మహిళలను గౌరవించాలి, మహిళలు, పిల్లలను వే దిస్తే కేసులు నమోదు చేసి జీవితకాలం శిక్షలు పడేలా పోలీసు దర్యాప్తు ఉంటుందని వివరించుట. ● అపరిచితులు ఫోన్, సోషల్ మీడియా ద్వారా, మెసేజ్ ల ద్వారా తెలిపితే నమ్మి అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్పడం. ● బెట్టింగ్‌లు పెట్టవద్దని పేర్కొనడం. ● రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, మద్యం తాగి వాహనాలు నడపొద్దు, పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని సూచించడం. ● గంజాయి లాంటి మాదకద్రవ్యాలు గ్రామాల్లోకి రానివ్వద్దని, ఎవరైనా డ్రగ్స్‌కు అలవాటు పడితే పోలీసులకు సమాచారం ఇవ్వడంతోపాటు ఇతర సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఫ ప్రతిఒక్కరినీ సన్మార్గంలో నడిపించడమే లక్ష్యం ఫ గొడవలు సృష్టించే వారిపై పక్కా నిఘా ఫ ప్రత్యేక కార్యక్రమానికి ఎస్పీ నరసింహ శ్రీకారం ఫ గ్రామాల్లో ప్రతి బుధవారం కార్యక్రమంయువతలో మార్పు కోసమే : ఎస్పీ నరసింహ గ్రామాల్లోని యువత చెడుమార్గంలో వెళ్లకుండా వారు సన్మార్గంలో వెళ్లేలా మార్పుతేవడం కోసమే పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం ప్రారంభించామని ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం ఆయన జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నేరాల్లో చిక్కుకోవడం వల్ల యువత భవిష్యత్తులో ఉద్యోగాలు పొందే, విదేశాలకు వెళ్లే, పైచదువుల విషయంలో సమస్యలు వస్తాయన్నారు. ఏ వ్యక్తిపై అయినా ఒకసారి రౌడీ షీట్, సస్పెక్ట్ షీట్ లాంటిది నమోదైతే జీవితాంతం ఆ మచ్చ అలాగే ఉంటుందని తెలిపారు. సైబర్ మోసాల బారిన పడి డబ్బు పోగొట్టుకుంటున్న, మత్తు పదార్థాలకు బానిసలై యువత మంచి భవిష్యత్తును కోల్పోవడం వంటి అంశాలపై ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తామన్నారు. -
అర్జీదారులకు ఇబ్బందుల్లేకుండా చూడాలి
భానుపురి: రాజీవ్ యువ వికాసం దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, డీపీఎంలు, ఏపీఓలు, ఇతర అధికారులతో రాజీవ్ యువ వికాస పథకం అమలు, ఎంజీఎన్ఆర్ఈజీఎస్, పెన్షన్లు, సెర్ఫ్, ఇందిరమ్మ ఇళ్లు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సోలార్ విలేజ్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మునగాల మండలం ఎంపీఓ దార శ్రీనివాసరావు అకాల మరణంపై కలెక్టర్ సానుభూతిని వ్యక్తం చేసి ప్రభుత్వం తరఫున అతని కుటుంబానికి పూర్తి సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాస పథకం ద్వారా జిల్లాలో అర్హులైన నిరుద్యోగ యువతీయువకులకు యూనిట్లు అందేలా చూడాలన్నారు. ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయడంతో పాటు సలహాలు సూచనల కోసం సిబ్బందిని నియమించాలని సూచించారు. జిల్లాకు మంజూరైన 4,549 ఇందిరమ్మ ఇళ్లను ఎంపీడీఓలు, హౌసింగ్ అధికారులు సమన్వయంతో అర్హత ఉన్నవారికి మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. 5వేలకు మించి జనాభా ఉన్న గ్రామాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఆర్డీఓ వీవీ.అప్పారావు, ఎంపీడీఓలు, డీపీఎంలు, ఏపీఎంలు పాల్గొన్నారు. 1.24 లక్షల మంది లబ్ధిదారులకు సన్న బియ్యంప్రతిఒక్కరూ రోజు సన్న బియ్యం బువ్వ తినాలన్న ఆకాంక్షతో ప్రభుత్వం చేపట్టిన సన్నబియ్యం పథకంలో భాగంగా రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా 1.24 లక్షల మంది లబ్ధిదారులకు 2,500 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేసినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని 14వ నంబర్ రేషన్ షాపును అదనపు కలెక్టర్ పి.రాంబాబుతో కలిసి ఆయన సందర్శించారు. సన్న బియ్యం నాణ్యతపై ఆరా తీశారు. అనంతరం షాపులో ఉన్న స్టాక్, బియ్యం నాణ్యత, ఈ–పాస్ మిషన్‌లో జరుగుతున్న లావాదేవీలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కలెక్టర్ వెంట డీటీ నాగలక్ష్మి, రేషన్ డీలర్ అన్నపూర్ణ తదితరులు ఉన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
నేడు గోదావరి జలాల విడుదల
ఫ నాలుగు రోజుల పాటు సరఫరా అర్వపల్లి: జిల్లావ్యాప్తంగా ఎస్సారెస్పీ రెండోదశ కింద 2.50 లక్షల ఎకరాల వరి సాగవుతోంది. యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లాకు గోదావరి జలాల విడుదల షెడ్యూల్ ప్రకారం పూర్తయింది. కానీ వరి పంట చేతికందే దశలో నీటి సరఫరా నిలిచిపోవడంతో చేలు ఎండిపోతున్నాయి. కనీసం మరో విడత అయినా నీటిని వదిలి ఎండిపోతున్న పొలాలను కొంతవరకై నా కాపాడాలని అన్నదాతలు ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులకు మొరపెట్టుకున్నారు. దీంతో జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ఎల్ఎండీ అధికారులపై తీవ్ర వత్తిడి తెచ్చి ఒప్పించి ఎట్టకేలకు కనీసం నాలుగు రోజులు నీటిని ఇవ్వాలని కోరగా అంగీకరించారు. ఎల్ఎండీ నుంచి రెండో దశకు నీటిని మంగళవారం వదిలారు. అయితే ఈ నీళ్లు బయ్యన్నవాగుకు చేరాక బుధవారం మధ్యాహ్నం బయ్యన్నవాగు నుంచి సూర్యాపేట జిల్లాకు విడుదల చేయనున్నట్లు డీఈఈ ఎం.సత్యనారాయణ తెలిపారు. శ్రీలక్ష్మీనృసింహుని నిత్య కల్యాణంమఠంపల్లి: ప్రసిద్ధిగాంచిన మట్టపల్లి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహుని నిత్య కల్యాణం మంగళవారం అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీస్వామివారికి విశేష పూజలు, అర్చనలు గావించారు. అదేవిధంగా నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. అదేవిధంగా క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. విద్య, వైద్యం ఉచితంగా అందించాలిచిలుకూరు : పేద ప్రజలకు విద్య, వైద్యం ఉచితంగా అందించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం చిలుకూరు మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో సీపీఐ మహాసభలను ప్రారంభించి మాట్లాడారు. పాలకులకు కార్పొరేట్ శక్తులపై ఉన్న ప్రేమ సామాన్య ప్రజలపై లేదని ఆరోపించారు. అనంతరం ఆ గ్రామ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా మూడోసారి కందుకూరి శ్రీను, సహాయ కార్యదర్శిగా కాటూరు బజారు, ఎరగాని వెంకన్న ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా అద్యక్షుడు దొడ్డా వెంకటయ్య, కీసర కొండలు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల నిర్బంధాన్ని ఖండిస్తున్నాం సూర్యాపేట అర్బన్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ, సీపీఎం నాయకులపై పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తూ ఈ నెల 2న సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఫణిగిరి బౌద్ధ క్షేత్రం వద్ద భీమ్ దీక్ష నాగారం : మహనీయుల ఆశయాలు సాధించేందుకు ప్రతిఒక్కరూ భీమ్ దీక్షలో భాగస్వాములు కావాలని బీఎస్పీ జిల్లా ఇన్చార్జ్ ఎర్ర రాంబాబు కోరారు. బుధవారం నాగారం మండల పరిధిలోని ఫణిగిరి బౌద్ధక్షేత్రం వద్ద స్వేరో కార్యకర్తలు మిరియాల మధు, మాచర్ల సైదులు భీమ్ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో రాంబాబు పాల్గొని మాట్లాడుతూ ప్రతి ఏడాది మార్చి 15న సాహెబ్ కాన్షీరామ్ జయంతి నుంచి భీమ్ దీక్ష ప్రారంభమై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున దీక్ష ముగుస్తుందని తెలిపారు. మహనీయులను స్మరించుకుంటూ వారి ఆశయాలను సాధించడం కోసం భీమ్ దీక్ష చేపడుతున్నామన్నారు. ఈ దీక్షలో స్వేరో సభ్యులు చుక్క సురేష్, వడ్డేపల్లి భాష, ఎర్ర రమేష్, మామిడి రాంబాబు, ఎర్ర పరశురాం, ఎర్ర రఘు తదితరులు పాల్గొన్నారు. -
హెచ్‌సీయూ భూముల వేలం విరమించుకోవాలి
సూర్యాపేట : హెచ్‌సీయూ భూముల వేలాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్, కో కన్వీనర్లు ఎల్.భద్రయ్య, రేపాక లింగయ్య, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్, టీపీటీఎఫ్, డీటీఎఫ్ నాయకులు ఆర్.రామనర్సయ్య, పబ్బతి వెంకటేశ్వర్లు, పి.వీరన్న, కె.వేణు, సుభాని, వెంకటేశ్వర్లు, యాకయ్య, వెంకటయ్య, రవికుమార్, యోగానంద్, సింహాద్రి, వెంకన్న, సైదులు, శ్రీనివాస్, వెంకటరెడ్డి, రాంబాబు, రమాదేవి, అబ్దుల్ కరీం, వెంకట్‌యాదవ్, అశోక్‌రెడ్డి, నర్సింహారావు, హస్సేన్, రమణ తదితరులు పాల్గొన్నారు. -
వేసవి క్రీడా శిబిరాలకు వేళాయే
హుజూర్నగర్ : గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాల్లాంటి క్రీడాకారులను వెలికితీసి వారికి తర్ఫీదు ఇచ్చి అత్యుత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, జిల్లా క్రీడల శాఖ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీ వరకు వేసవి శిక్షణ శిబిరాలను నిర్వహించాలని తలపెట్టారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు, జాతీయ స్థాయి క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. జిల్లాలో 10 క్రీడా శిబిరాలు.. క్రీడా శిబిరాల నిర్వహణ కోసం ప్రభుత్వం జిల్లాకు నిధులు కేటాయించనుంది. క్రీడా సామగ్రి కొనుగోలుకు నిధులతోపాటు, శిక్షకులకు ఒక్కొక్కరికి నెలకు రూ.4 వేల చొప్పున గౌరవ వేతనం అందజేయనుంది. ఇందుకోసం సూర్యాపేట జిల్లాలో 10 శిబిరాలకు రూ 4 వేల చొప్పున రూ.40 వేలు, నిర్వహణ ఖర్చు, ప్రథమ చికిత్స కిట్ల కొనుగోలుకు నిధులు ఇవ్వనున్నారు. శిబిరాల నిర్వహణకు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనుండగా, యువజన, క్రీడల శాఖ అధికారి శిబిరాల నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించనున్నారు. ఈ శిబిరాల ఏర్పాటుకు దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 2న చివరి తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. 14 ఏళ్లలోపు బాల, బాలికలకు మాత్రమే.. పూర్తిగా గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు వివిధ ఆటల్లో శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ఈ శిబిరంలో చేరడానికి 14 ఏళ్లలోపు బాలబాలికలు మాత్రమే అర్హులు. జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఈ వేసవి క్రీడాశిబిరాలను సద్విని యోగం చేసుకుని ఆయా క్రీడల్లో మెళకువలు నేర్చుకునేందుకు ఇది మంచి అవకాశం. ఫ దరఖాస్తులకు నేడు చివరి తేదీ ఫ జిల్లాలో 10 శిబిరాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం ఫ మే 1 నుంచి క్రీడాకారులకు శిక్షణ జిల్లా కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలి ఆసక్తి గల శిక్షకులు నిర్వహించే క్రీడలు, ప్రదేశం, గ్రామం, సెల్ నంబర్ తదితర వివరాలతో కూడిన దరఖాస్తులను కలెక్టరేట్లోని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కార్యాలయంలో అందజేయాలి. ఈ నెల 2వ తేదీ సాయంత్రం వరకు దరఖాస్తు చేయవచ్చు. –జి.రాంచందర్‌రావు, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి, సూర్యాపేట -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా
నేరేడుచర్ల : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు బీజేపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెడతారా అని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. మంగళవారం నేరేడుచర్ల బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం రూ.40 భరిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీలో రూ.10 మాత్రమే ఖర్చు చేస్తూ గొప్పలు చెప్పుకుంటోందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. స మావేశంలో బాల వెంకటేశ్వర్లు, తాళ్ల నరేందర్‌రెడ్డి, నాగిరెడ్డి, వీరబాబు, నర్రినాయక్, లాజర్, విజయభాస్కర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, శంకర్‌రెడ్డి, నాగయ్య, రామ్మూర్తి పాల్గొన్నారు. ఫ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి -
సైబర్ మోసాలపై అప్రమత్తత అవసరం
గ్రామ పోలీసు అధికారి వ్యవస్థ బలోపేతం చేయాలి సూర్యాపేటటౌన్ : పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను బలోపేతం చేసేలా ప్రణాళిక రూపొందించామని ఎస్పీ కె.నరసింహ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి బుధవారం పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలు గుర్తించడం, చట్టాలు, భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం, సమస్యలు సృష్టించే వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా నేరాలను అదుపుచేయడమే ఈ కార్యక్రమంలో ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జనార్దన్ రెడ్డి, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మట్టయ్య, ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, సీఐలు చరమంద రాజు, రజిత, శివశంకర్, రాజశేఖర్, వీర రాఘవులు, రామకృష్ణారెడ్డి, రఘువీర్‌రెడ్డి, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ హరిబాబు, సైబర్ సెక్యూరిటీ సీఐ లక్ష్మీనారాయణ, ఆర్ఐ నారాయణ రాజు, ఎస్ఐలు పాల్గొన్నారు. పోలీసులకు రివార్డు సూర్యాపేటటౌన్ : కోదాడ పట్టణంలో 2023 సంవత్సరం నవంబర్ నెలలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్నవారిని అరెస్టు చేసి రూ.68 వేలు సీజ్ చేసి వారిని కోర్టులో హాజరుపరిచారు. సీజ్ చేసి కోర్టుకు పంపిన రూ.68 వేలలో రూ.34 వేలను పోలీసులకు రివార్డ్‌గా ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. కాగా ఆ సమయంలో పనిచేసిన సీఐ రాము, ఎస్ఐ రామాంజనేయులు, కానిస్టేబుళ్లు ఆంజనేయులు, సతీష్, వెంకటేశ్వర్లు, శ్రీనులకు రివార్డ్ నగదును ఎస్పీ నరసింహ మంగళవారం అందజేశారు.సూర్యాపేటటౌన్ : సైబర్ నేరగాళ్లు అత్యాశ చూపి అందినంత దండుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్లు, క్యూర్ కోడ్స్, లింక్‌లు పంపి క్లిక్ చేయాలని, బహుమతులు వచ్చాయని, ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతా సరిచూసుకోవాలని చెప్పి డబ్బులు కాజేస్తున్నారు. అప్రమత్తతతో సైబర్ నేరాలను అరికట్టవచ్చని అంటున్నారు ఎస్పీ కే నరసింహ. ప్రజలు సైబర్ నేరగాళ్ల మోసాల బారిన పడకుండా సలహాలు, సూచనలు ఆయన మాటల్లోనే.. మోసాలు ఇలా.. ● కాల్ సెంటర్లు, సైబర్‌క్రైం పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), సీబీఐ అధికారులమంటూ ఫోన్ చేస్తారు. ● బ్యాంక్ ఉద్యోగి అని చెప్పి ఖాతాదారుడికి ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు, ఆధార్‌కార్డు, పాన్ కార్డు లాంటి వివరాలు అడుగుతారు. ● తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయి అని ఆశపెడతారు. ● ఫోన్‌కు, మెయిల్‌కు, సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సప్, ఇన్‌స్ట్రాగాంలలో మెసేజ్‌లు, బ్లూ లింక్ పంపుతారు. ● బహుమతులు వచ్చాయని, తక్కువ రేటుకు వస్తువులు వాహనాలు ఉన్నాయని, మంచి ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్‌కు ఫీజు కట్టాలి అని చెబుతారు. ● మీ పిల్లలు డ్రగ్స్ కేసులో, అక్రమ రవాణా కేసుల్లో ఇరుకున్నారని, కేసుల నుంచి తప్పిస్తాం అంటూ కస్టమ్స్, సీఐడీ, ఈడీ, సైబర్ క్రైం పోలీసు అధికారులం అంటూ బెదిరింపులకు గురి చేస్తారు సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే.. ● లోన్ యాప్‌లకు దూరంగా ఉండాలి. ● సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయినా, మీ డబ్బు పోగొట్టుకున్నా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి ● కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్‌లో వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి. ● అపరిచిత నంబర్ల నుంచి ఫేస్బుక్, వాట్సప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్‌కు స్పందించవద్దు. ● లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్‌ను నమ్మవద్దు. ● పాస్వర్డ్, ఓటీపీ వివరాలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు. ● బ్యాంక్‌లో వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తాం అంటే ఎవ్వరికీ ఆధార్, బ్యాంక్ ఖాతా లాంటివి చెప్పవద్దు. ● సైబర్ నేరం జరిగిన మొదటి గంటలోనే (గోల్డెన్ అవర్) ఫిర్యాదు చేయడం ద్వారా స్కామర్ అకౌంట్‌ను ఫ్రీజ్ చేసి పోయిన డబ్బు రికవరీ చేయడం సులభం అవుతుంది. ఫ లింక్ క్లిక్ చేస్తే బ్యాంక్ ఖాతా ఖాళీ ఫ ఎస్పీ నరసింహ -
ఇది మామూలు పథకం కాదు: సీఎం రేవంత్
సూర్యాపేట జిల్లా: శ్రీమంతుడు తినే సన్నబియ్యం పేదవాడు తినాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్ సభలో సన్నబియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం.. అనంతరం మాట్లాడారు. ఈ సన్న బియ్యం పథకం మామూలు పథకం కాదన్నారు. సాయుధ రైతాంగం, ఇందిరా గాంధీ రోటీ కప్డా ఔర్ మకాన్ తర్వాత అంతటి గొప్ప పథకం సన్నబియ్యం పథకమన్నారు. ఉగాది నాడు పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. సీఎం రేవంత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..‘నల్లగొండ ప్రాంతం చైతన్యానికి మారుపేరు. 25 లక్షల ఎకరాల భూములను ఇందిరా గాంధీ పేదలకు పంచిపెట్టింది ఇప్పటికీ ఇళ్లలో దేవుడు ఫోటో పక్కన ఇందిరా గాంధీ ఫోటో పెట్టుకుంటున్నారు. రూ. 1.90 కే బియ్యం పథకం తీసుకొచ్చారు. 1957 లోనే నెహ్రూ హయాంలో పీడీఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వం 21 వేల కోట్ల ధాన్యాన్ని మిల్లర్లకి కట్టబెట్టారు. మిల్లర్లు పీడీఎస్ బియ్యం రిసైక్లింగ్ చేస్తున్నారు. 10 వేల కోట్ల రూపాయల దొడ్డుబియ్యం మిల్లర్లు, దళారుల చేతుల్లోకి వెళ్తోంది. ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోల సన్నబియ్యంఅందుకే సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టి ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోలు ఇవ్వాలని ఆలోచన చేశాం. దేశంలోనే తొలిసారి సన్నబియ్యం ఇస్తున్నాం. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి పదేళ్లు సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని బెదిరించిండు. ఆయన ఫాంహౌస్ లో వెయ్యి ఎకరాల్లో వరి వేశాడు. ఆ ధాన్యాన్ని 4500 రూపాయలకు క్వింటాల్ చొప్పున కావేరి సీడ్స్ కొనుగోలు చేసింది. సన్నధాన్యం పండిస్తే క్వింటాల్ కి ఐదు వందలు బోనస్ ఇస్తున్నాం. అత్యధికంగా సన్నధాన్యం పండించేది నల్లగొండ రైతులే. అత్యధికంగా రైతు రుణమాఫీ పొందింది నల్లగొండ రైతులేఈ పథకం రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయడుసన్నబియ్యం పథకం రద్దు చేసే ధైర్యం భవిష్యత్తులో ఏ సీఎం చేయడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పదేళ్లు కేసీఆర్ పట్టించుకోలేదు. సంవత్సరానికి కిలోమీటర్ చొప్పున తవ్వినా టన్నెల్ పూర్తయి 3.30 లక్షల ఎకరాలకు నీరు అందేది. నల్లగొండ జిల్లా ప్రజలపై కోపంతోనే టన్నెల్ ను పూర్తి చేయలేదు. ఉత్తమ్ నాయకత్వంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మూడేళ్లలో కుప్పకూలింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఎనిమిదో వింత కాదు. ప్రపంచంలో ఏకైక వింత. మూడేళ్లలో లక్ష కోట్లు మింగినందుకు మిమ్మల్ని ఉరేసినా తప్పులేదు. కాళేశ్వరం కుప్పకూలిపోయినా 1.56 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించాం. మా ఆలోచనలో లోపం లేదు. ప్రజా సేవ చేయడానికే నేను వచ్చా . 2006 లో జెడ్పీటీసీ గా రాజకీయం మొదలుపెట్టి ఈనాడు సీఎంగా ఉన్నా. శకునం పలికే బల్లి కుడితిలో పడినట్లు అయింది బీఆర్ఎస్ పరిస్థితి. నాకు కేసీఆర్ కు నందికి పందికి ఉన్న పోలిక ఉందినాకు కేసీఆర్‌తో పోలిక ఏంటి?నాతో నీకు పోలిక ఏంటి కేసీఆర్. పదేళ్లలో కేసీఆర్ 16 వేల కోట్ల రుణమాఫీ చేస్తే అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 20 వేల కోట్ల రుణమాఫీ చేశాం . కేసీఆర్ ఎగ్గొట్టిన 7625 కోట్లను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వేశాం త్వరలోనే రైతు భరోసా పూర్తిస్థాయిలో ఇస్తాం. రైతు భరోసా కింద ఏడాదికి 20 వేల కోట్లి పంపిణీ చేస్తాం. ఇవ్వాల్టికి రుణమాఫీ, రైతు భరోసా మొత్తం 33 వేల కోట్లు రైతులకు చెల్లించాంపదేళ్లలో తెలంగాణను నంబర్ వన్ చేస్తారైతుల గుండెళ్లో ఇందిర, సోనియా పేరు శాశ్వతంగా ఉండేలా చేశాం. గతంలో క్వింటాల్ కు పది కిలోల ధాన్యం తరుగు తీసేవారు. ఈనాడు ఆ పరిస్థితి లేదు. హుజూర్ నగర్ కు అగ్రికల్చర్ కాలేజ్ ఇస్తాం. మిర్యాలగూడ, దేవరకొండ కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తాం. కాళ్లల్లో కట్టెబెట్టి పడేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. వాళ్ల కళ్లలో కారం కొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లలో దేశంలో తెలంగాణను నంబర్ వన్ గా ఉండేలా చూస్తా’ అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు. -
సర్వేయర్ల మాయాజాలం!
కలెక్టర్‌కు రిపోర్టు ఇచ్చాం.. ప్రస్తుతం 30 పడకల వైద్యశాల ఆవరణలోనే వంద పడకల వైద్యశాల నిర్మించాలని నిర్ణయిచండంతో ఎంత స్థంలం ఉందనే విషయంపై కలెక్టర్ ఆదేశాలతో ఉన్నతాధికారుల సమక్షంలో సర్వే చేశాం. కాంపౌండ్‌లోపల 1.25 ఎకరాలు మాత్రమే ఉందని తేలింది. ఇది వైద్యశాల నిర్మాణానికి సరిపోతుందని కలెక్టర్‌కు నివేదిక ఇచ్చాం. – సూర్యనారాయణ, ఆర్డీఓ కోదాడ ఫ కోదాడలో వంద పడకల ఆసుపత్రికి శాపంగా మారిన స్థల సర్వేలు ఫ ఒకే స్థలంపై పది రకాల రిపోర్టులు ఫ వాస్తవాలను దాచి కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న వైనం ఫ జిల్లా కలెక్టర్ ఆదేశంతో మళ్లీ సర్వే కోదాడ: కోదాడ పట్టణంలో వంద పడకల వైద్యశాల నిర్మాణానికి ప్రభుత్వ సర్వేయర్ల తీరు శాపంగా మారింది. దాత ఇచ్చిన స్థలం విషయంలో ఆయన వారసులు వేసిన కేసులకు విడతకు ఒక రకంగా సర్వే చేసి కొలతలు ఇస్తుండడంతో వంద పడకల వైద్యశాల నిర్మాణానికి ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. తాజాగా నెల రోజుల క్రితం ఐదుగురు అధికారుల బృందం వైద్యశాల స్థలాన్ని సర్వే చేయగా దాత ఇచ్చిన దానికంటే తక్కువగా ఉందని రిపోర్టు ఇచ్చింది. దీంతో దాత ఇచ్చిన స్థలాన్ని పూర్తిస్థాయిలో ఎంజాయ్మెంట్ సర్వే చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించడంతో రెండు రోజులుగా అధికారులు మళ్లీ సర్వే చేస్తున్నారు. ఇచ్చింది రెండెకరాలైతే.. ఉన్నది 1.25 ఎకరాలు మాత్రమే.. కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు 1963లో దానపత్రం ద్వారా కోదాడకు చెందిన నాగుబండ పద్మయ్య సర్వే నంబర్ 149లో రెండు ఎకరాల భూమిని రాసి ఇచ్చారు. వైద్యశాలకు తూర్పు వైపు అప్పటికే ఉన్న డొంక రోడ్డును 30 అడుగుల రోడ్డుగా, పడమర వైపు ఎన్ఎస్పీ–వైద్యశాల మధ్య 30 అడుగుల రోడ్డును తీశారు. తూర్పు రోడ్డు నుంచి సర్వే నంబర్ 149లో మిగిలిన భూమిలోకి వెళ్లడానికి దారిగా దాత వారసులే ఉపయోగించుకోవడంతోపాటు తమ భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముకున్నారు. తాజాగా కోదాడ 30 పడకల వైద్యశాలను వంద పడకల వైద్యశాలగా మార్చి నూతన భవన నిర్మించాలని నిర్ణయించారు. దీని కోసం ఇటీవల ఐదుగురు అధికారులు స్థలాన్ని కొలిచారు. కాంపౌండ్ లోపల కేవలం 1.25 ఎకరాలు మాత్రమే ఉందని తేల్చారు. మిగతా 15 గుంటలు ఏమైందో పట్టించుకోకుండా ఉన్న స్థలంలోనే వైద్యశాల కట్టొచ్చని సలహా ఇచ్చారు. ఆక్రమించి కాంపౌండ్ వాల్ నిర్మించారని కేసు 2002–03లో తన స్థలాన్ని వైద్యశాల అధికారులు 23 గుంటలు ఆక్రమించి కాంపౌండ్ వాల్ పెట్టుకున్నారని దాత వారసుడు రాష్ట్ర హైకోర్టులో కేసు వేశారు. కాంపౌండ్ లోపల కొలిచి ఎక్కువ ఉంటే ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాంపౌండ్ లోపల కొలవాల్సి ఉన్నా.. రోడ్డును కూడా వైద్యశాల స్థలంగా కొలిచి 530 గజాలు ఎక్కువ ఉందని తేల్చి కోర్టు ఆదేశాలతో దాన్ని దాత వారసుడికి ఇచ్చారు. దీనిపై వైద్య విధాన పరిషత్ కమిషనర్ జిల్లా కలెక్టర్‌కు డీవో లెటర్ రాశారు. వైద్యశాల కాంపౌండ్ లోపల రెండెకరాలకు 10 గుంటలు తక్కువగా ఉందని చెప్పారు. దీంతో కలెక్టర్ స్పందించి మరోసారి సర్వే చేయించారు. 10 గుంటలు తక్కువగా ఉండడంతో గతంలో ఇచ్చిన 530గజాలప్రొసీడింగ్స్ను రద్దు చేశారు. తాను లేకుండా కొలిచారని మరో కేసు రెండోసారి స్థలం కొలిచినప్పుడు తాను లేనని అందువల్ల మరోసారి స్థలాన్ని కొలవాలని దాత వారసుడు కోర్టుకు వెల్లడంతో 2012లో స్థలాన్ని కొలిచిన సర్వేయర్లు ఈ సారి రెండెకరాలకు 565 గజాలు ఎక్కువ ఉందని తేల్చారు. దీంతో అప్పటి అధికారులు 500 గజాలు ఇస్తాం.. కేసులన్నీ వెనక్కితీసుకోవాలని దాత వారసుడితో ఒప్పందం కుదుర్చుకొని అతడికి వైద్యశాల కాంపౌండ్ లోపల 500 గజాలు ఇచ్చారు. వాస్తవానికి వైద్యశాల తూర్పువైపు రోడ్డు తనదేనని గతంలో సూర్యాపేట సబ్‌కోర్టులో కేసు వేసిన దాత వారసుడు ఈ కేసులో ఓడిపోవడంతో పాటు తప్పుడు కేసు వేసినందుకు కోర్టు జరిమానా విధించింది. దీన్ని దాచి ఉన్నత న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించి వైద్యశాల స్థలాన్ని దొడ్డిదారిన కాజేశారని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే గతంలోనే రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తిపడి దాత వారసులకు ఇక్కడ భూమి ఉందని తప్పుడు పాసుపుస్తకాలు జారీ చేయడంతో వాటిని అడ్డుపెట్టుకొని ప్రభుత్వ స్థలాన్ని కాజేయడానికి వారసులు పది సార్లు కోర్టులో 20 రకాల కేసులు వేశారు. -
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవు : ఎస్పీ
సూర్యాపేట టౌన్: వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె.నరసింహ హెచ్చరించారు. శుక్రవారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ సిబ్బందికి ట్రాఫిక్ నియంత్రణ, వాహనాలు, డ్రంకన్ డ్రైవ్ తనిఖీల సమయంలో వాడే భద్రతా సామగ్రి, బ్రీత్ అనలైజర్ పరికరాలు అందజేసి మాట్లాడారు. అనంతరం జిల్లా హోంగార్డ్ ఆర్గనైజేషన్‌లో పనిచేస్తూ అనారోగ్య కారణంగా వైద్యం చేయించుకున్న ఇద్దరికి మెడికల్ రీయింబర్స్ మెంట్ కింద చెక్కువలు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, సీఐ వీరరాఘవులు, ఆర్ఐ నారాయణరాజు, ఎస్ఐలు సాయిరామ్, బాలునాయక్, మహేశ్వర్ పాల్గొన్నారు. -
మట్టపల్లి హుండీ ఆదాయం రూ.6.34లక్షలు
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలోని హుండీలను గురువారం సహాయ కమిషనర్ కె.భాస్కర్, ఆలయ ధర్మకర్తలు, ఎండోమెంట్ అధికారుల పర్యవేక్షణలో ఆలయ ప్రాంగణంలో లెక్కించారు. ఫిబ్రవరి 14నుంచి మార్చి 26వరకు 41 రోజులకు గాను రెగ్యులర్ హుండీల ద్వారా రూ.6,04,125ు, అన్నదానం హుండీ ద్వారా రూ.30,370తో కలిపి మొత్తం రూ.6,34,495 ఆదాయం సమకూరినట్టు ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్ తెలిపారు. ముందుగా ఆయలంలో స్వామివారి నిత్యకల్యాణాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు, అర్చకులు, శ్రీసాయి సేవాసంఘం ప్రతినిధులు, పాల్గొన్నారు. -
పల్లెలకు పాలనాధికారులు
జీపీఓ పేరుతో కొత్త పోస్టులు మంజూరుజీపీఓ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానంగ్రామ పాలనాధికారి పోస్టుల నియామకాల కోసం పూర్వ వీఆర్ఏ వీఆర్ఓ తిరిగి మాతృసంస్థకు వచ్చేందుకు ఆసక్తి ఉన్నవారి నుంచి ఈ ఏడాది జనవరిలోనే దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం ఆహ్వానించింది. దీంతో 297 మంది జీపీఓ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో వీఆర్ఏలు 159, వీఆర్ఓలు 138 మంది ఉన్నారు. అయితే జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీలు ఉన్నాయో.. ఎంత మందిని నియమిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు.● రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి కొత్త సిబ్బంది ● నియామకానికి జనవరి నుంచే దరఖాస్తుల ఆహ్వానం ● పూర్వ వీఆర్ఓలు, వీఆర్ఏలకు అవకాశంనాగారం: గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ పటిష్టానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రామీణ ప్రజలకు రెవెన్యూ సేవలు అందించేలా గ్రామ పాలనాధికారి(జీపీఓ) పేరుతో ఉద్యోగులను నియమించేందుకు సిద్ధమైంది. ఇది వరకు గ్రామాల్లో సేవలందించిన వీఆర్ఓ, వీఆర్ఏల వ్యవస్థను గత ప్రభుత్వం రద్దు చేసి వారిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యవస్థ రద్దయ్యాక.. రెవెన్యూ పరంగా గ్రామాల్లో భూ సమస్యలు, సంక్షేమ పథకాల అర్హుల గుర్తింపు, ఇతర సర్వేలకు ఇబ్బందిగా మారింది. ఇది గమనించిన ప్రభుత్వం గ్రామాల్లో సేవల కోసం ఉద్యోగులు ఉండాలని భావించి కొత్త పోస్టులకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా..అయితే గత ప్రభుత్వ హయాంలో ఇతర శాఖల్లో వీఆర్ఓలు, వీఆర్ఏలను సర్దుబాటు చేశారు. ఇందులో 2022 ఆగస్టులో అప్పటి ప్రభుత్వం 207 మంది వీఆర్ఓలు రెవెన్యూతో పాటు 37 శాఖల్లో, 2023 ఆగస్టులో వీఆర్ఏలు 416 మందిని ఎనిమిది శాఖల్లో సర్దుబాటు చేశారు. దీంతో గ్రామాల్లో భూ సర్వేలు, భూమి హక్కులు, విద్యార్హత ధ్రువపత్రాల జారీ, విచారణలు, సంక్షేమ పథకాల అర్హుల గుర్తింపు, విపత్తుల సమాచారం అందజేయడం, తదితర వాటిపై ప్రభావం చూపింది. ఫలితంగా కొన్నింటిని పంచాయతీ కార్యదర్శులతో చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచేలా ఆర్థిక శాఖ జీపీఓ పోస్టులు మంజూరు చేసింది. జిల్లాలో 475 గ్రామ పంచాయతీలు ఉండగా వీటితో 279 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. వీటిల్లో వీఆర్ఓలు, వీఆర్ఏలు తిరిగి జీపీఓలుగా నియమించాలని నిర్ణయించింది. కాగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓని నియమిస్తారా? అనేది ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది.గతంలో ఉన్న గ్రామ రెవెన్యూ సిబ్బంది ఇలా.. వీఆర్ఓలు 207 వీఆర్ఏలు 416 జీపీఓ పోస్టులకు అందిన దరఖాస్తులు 297ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తేనే.. గ్రామ పాలనాధికారి (జీపీఓ) నియామకాలపై ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. జీపీఓల అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. వీరి నియామకాల గురించి ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వేస్తే నియామకాల ప్రక్రియ ప్రారంభిస్తాం. – రాంబాబు, జిల్లా అదనపు కలెక్టర్, సూర్యాపేట -
తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలి
పాలకవీడు: ప్రస్తుత వేసవిలో గ్రామాల్లోని ప్రజలకు తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని డీఆర్డీఓ అప్పారావు ఆదేశించారు. పాలకవీడు మండల కేంద్రలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెటంట్లతో తాగునీరు సమస్యలు, ఉపాధి పనులపై గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉపాధి హామీ పనుల్లో పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హత ఉండి అడిగిన ప్రతి కూలీకి ఉపాధి పనులు కల్పించాలన్నారు. ఉపాధి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించకుండా కార్యాలయాల్లో కూర్చుని రికార్డుల్లో నమోదు చేయడడం లాంటివి చేయొద్దన్నారు. నర్సరీల్లో గ్రీన్ నెట్ ఏర్పాటు చేసుకోవాలని, క్రమం తప్పక మొక్కలకు నీరందించాని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ లక్ష్మి, ఏపీఓ రాజు, కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల పక్షాన పోరాడుతాంచిలుకూరు: ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతామని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం చిలుకూరు మండల కేంద్రంలోని సీపీఐ భవన్లో జరిగిన ఆ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 1న నారాయణపురం గ్రామ శాఖ మహాసభతో ప్రారంభంకానున్న జిల్లా మహాసభలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి మండవ వెంకటేశ్వర్లు, నాయకులు సాహెబ్ అలీ, కె.వెంకటయ్య, రెమిడాల రాజు, పిల్లుట్ల కనకయ్య, దొడ్డా నాగేశ్వరరావు పాల్గొన్నారు. వ్యవసాయ కళాశాల నిర్మాణానికి స్థల పరిశీలన మఠంపల్లి: మండలంలోని రఘునాథపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 247లో ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న వ్యవసాయ కళాశాల నిర్మాణానికి గురువారం జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు స్థానిక వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రఘునాథపాలెం వద్ద వ్యవసాయ కళాశాల నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించిందని, దీంట్లో భాగంగా స్థల పరిశీలన చేశామని నివేదిక అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ నరేష్, తహసీల్దార్ మంగా, ఏడీఏ రవినాయక్, ఏఓ బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు నేత్రపర్వంగా నిర్వహించారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామివారికి మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలో స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు అభిషేకం చేసి తులసీదళాలతో అర్చించారు. అనంతరం ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖ మండపంలో ఉత్సవమూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. ఆయా వేడుకల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం స్వామివారికి శయనోత్సవం చేసి ఆలయ ద్వారబంధనం చేశారు. -
ఆడిటింగ్ పేరుతో అడ్డగోలుగా వసూళ్లు!
కోదాడ: మున్సిపాలిటీల్లోని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో గడిచిన రెండు నెలలుగా ఆడిటింగ్ పేరుతో అధికారులు అడ్డగోలుగా రిసోర్స్ పర్సన్ల(ఆర్పీల) నుంచి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదు మున్సిపాలిటీల్లో సుమారుగా 3,825 సమభావన సంఘాలున్నాయి. ప్రతి 15 సంఘాలకు ఒక ఆర్పీ చొప్పున 255 మంది ఉన్నారు. మహిళా సంఘాలకు లోన్లు ఇప్పించడం, ప్రభుత్వ పథకాలను సభ్యులకు అందేటట్టు చూడడం ఆర్పీల బాధ్యత. దీనికోసం ప్రతినెలా వీరికి రూ.6వేల వరకు గౌరవ వేతనం ఇస్తుంటారు. ప్రతిఏటా ఆర్పీలు తమ పరిధిలో కార్యకలాపాలకు సంబంధించి ఆడిటింగ్ చేయించుకోవాలి. కానీ ఇక్కడే వసూళ్ల తంతు మొదలవుతోంది. ఫోన్ పే, గూగుల్ పే ద్వారా చెల్లింపులు..జిల్లాలో ఈ ఏడాది జనవరి 20 తరువాత ఆడిటింగ్ మొదలైంది. దీన్ని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించారు. వారు ఆయా మున్సిపాలిటీలకు వెళ్లి అక్కడ ఉన్న ఆర్పీల రికార్డులను ఆడిటింగ్ చేయాలి. ఇంత వరకు బాగానేఉన్నా ఇక్కడే అసలు కథ మొదలైంది. ఆడిటింగ్ కోసం ప్రతి ఆర్పీ రూ.1,600 ఆడిటింగ్‌కు వచ్చిన వారికి ఇవ్వాలని షరుతు పెట్టారు. దీంతో పలువురు ఆర్పీలు ఈ డబ్బును ఫోన్‌పే, గుగూల్ పే ద్వారా చెల్లించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో జిల్లా స్థాయి అధికారి ఒకరు తమను బెదిరిస్తున్నట్లు ఆర్పీలు వాపోతున్నారు. తమకు ఇచ్చేది అరకొర వేతనాలు, అవికూడా సక్రమంగా ఇవ్వడం లేదని అలాంటిది తమ నుంచి ఇలా వసూలు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఈసారి తమ నుంచి వసూలు చేసిన దాదాపు రూ.4లక్షలకుపైగా డబ్బుల విషయంపై ఉన్నాధికారులు విచారణ జరపాలని పలువురు ఆర్పీలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మెప్మాలో అవినీతి బాగోతం ఒక్కో ఆర్పీల నుంచి రూ.1,600 వరకు 255 మంది నుంచి రూ.4 లక్షలు వసూలు కలెక్టర్‌కు ఆర్పీలు ఫిర్యాదు చేసినట్టు సమాచారంమెప్మా ఇన్చార్జి పీడీ ఏమంటున్నారంటే.. ఈ విషయమై జిల్లా మెప్మా ఇన్చార్జి పీడీని వివరణ కోరగా తనను కొందరు టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. రోజుకొకరు ఫోన్ చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని, తాను వైద్యశాలలో ఉన్నానని తరువాత ఫోన్ చేస్తానని ఫోన్ కట్ చేశారు. -
ఎస్‌హెచ్‌జీలు.. విలీనం
హుజూర్నగర్: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీలు) ఒకే గొడుగు కిందకు రానున్నాయి. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మహిళా సంఘాలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్), మున్సిపల్ ప్రాంతాల్లోని సంఘాలు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఈ రెండు విభాగాలకు చెందిన సంఘాలన్నింటినీఒకే గొడుగు కిందకు తీసుకుని రావాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మెప్మాను సెర్ప్‌లో విలీనం చేయడంతో పాటు ఉద్యోగులను డీఆర్డీఏ పరిధిలోకి తీసుకురానున్నారు. డీఆర్డీఓ పర్యవేక్షణలో..ప్రస్తుతం మెప్మా ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు. మున్సిపాలిటీలలో మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీలు, సీ్త్రనిధి రుణాలు ఇప్పించడంతో పాటు ఇందిరా మహిళాశక్తి అమలులో ఈ సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారు. సెర్ప్‌లో విలీనమైతే వీరంతా ఇక నుంచి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (డీఆర్డీఓ) పర్యవేక్షణలో పనిచేయాల్సి ఉంటుంది. ఏ సర్వే చేపట్టినా మెప్మా ఆర్పీలకే బాధ్యతలుమున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వం ఏ సర్వే చేపట్టినా మెప్మా ఆర్పీలకే ఆ బాధ్యతలు అప్పగించేవారు. ఓటర్ల జాబితా సవరణ, ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై విచారణ తదితర పనులకు మెప్మా ఆర్పీల సేవలను వినియోగించుకునే వారు. వీరిని సెర్ప్‌లో విలీనం చేస్తే మున్సిపాలిటీల్లో ప్రభుత్వం నిర్వహించే వివిధ రకాల సర్వేలకు ఇబ్బందులు కలిగే అవకాశం లేకపోలేదు. అయితే ఇప్పుడున్న టీఎంసీలు, సీఓలు, ఆర్పీలను డీఆర్డీఏ కిందకు తెస్తారా లేక మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలోనే ఉంచుతారా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మెప్మా, సెర్ప్‌లను ఒకే గొడుగు కిందకు తేవాలని ప్రభుత్వం నిర్ణయం ఇక.. అన్ని గ్రూప్‌లు డీఆర్డీఏ పరిధిలోకి.. జిల్లాలో మొత్తం స్వయం సహాయక సంఘాలు 23,345స్వయం సహాయక సంఘాల వివరాలు మండలాల్లో 17,940మున్సిపాలిటీల్లో 5,405 మొత్తం సభ్యులు 2,38,33123 మండలాల్లో వీఓలు 579ఉత్తర్వులు రావాల్సి ఉంది సెర్ప్, మెప్మా విలీనానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఆదేశాల మేరకు కార్యాచరణ రూపొందించి అమలు చేస్తాం. – రేణుక, మెప్మా, ఇన్చార్జి పీడీ, సూర్యాపేట -
అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవు
పెన్‌పహాడ్: ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష అన్నారు. గురువారం పెన్‌పహాడ్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన 15వ విడత సామాజిక తనిఖీలో ఆమె మాట్లాడారు. మండలంలోని 29 గ్రామ పంచాయతీల పరిధిలో 2023–24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన వివిధ పనులపై గ్రామస్థాయిలో నిర్వహించిన సామాజిక తనిఖీ నివేదికలపై ఓపెన్ ఫోరంలో చర్చించారు. ఇప్పటి వరకు వివిధ పనులకు సంబంధించి రూ.8,9,6,364 ఖర్చు చేసినట్లు తెలిపారు. పలు గ్రామాల్లో కొలతల్లో తేడాలు, మస్టర్లలో పేర్లు కొట్టివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లకు రూ.1.39లక్షలు రీకవరీకి ఆదేశించినట్లు తెలిపారు. అక్రమాలకు పాల్పడిన పలువురు సిబ్బందికి రూ.39వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి ఆశాకుమారి, అంబుడ్స్‌మెన్ లచ్చిరాంనాయక్, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏపీఓ రవి, పీఏసీఎస్ చైర్మన్ వెన్న సీతారాంరెడ్డి, ఈసీ మహేష్, ఎస్ఆర్పీ సాయిలు, టీఏలు తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ డిప్యూటీ సీఈఓ శిరీష -
తేనెటీగల పెంపకంతో అదనపు ఆదాయం
భానుపురి: తేనెటీగల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సునీత అన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో నేషనల్ బి బోర్డు ఆధ్వర్యంలో శాసీ్త్రయ తేనెటీగల పెంపకంపైవ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సదస్సులో ఆమె మాట్లాడారు. ఉద్యాన పంటలైన నువ్వులు, ఆవాలు, కుసుమ కంది, పొలాల్లో తేనెటీగల పెట్టెలను అమర్చి లాభాలను పొందవచ్చని తెలిపారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా వీటిని పెంచొచ్చని, తద్వారా వినియోగదారులకు స్థానికంగా తక్కువ ధరకు స్వచ్ఛమైన నాణ్యమైన తేనె దొరుకుతుందన్నారు. ఈ సదస్సులో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రజనీకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారి నాగయ్య, ఉద్యాన శాఖ అధికారులు, ఏడీఏలు, సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సునీత -
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
భానుపురి : హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి విమర్శించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని, ఎస్సారెస్పీ పరిధిలో ఎండిపోయిన వరి పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకొనిపోయేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ వెంటనే రావాలని సమస్యలు పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. అనంతరం వినతి పత్రాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు పాల్గొన్నారు.ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి -
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ
చివ్వెంల(సూర్యాపేట) : సూర్యాపేట బార్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో నామినేష్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. పలు పదవులకు వేసిన నామినేషన్లను కొందరు బుధవారం ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో ఉన్నవారి వివరాలను ఎన్నికల అధికారి గూడూరి శ్రీనివాస్ వెల్లడించారు. అధ్యక్ష పదవికి ఇద్దరు, ప్రధాన కార్యదర్శి పదవికి ఇద్దరు, ఉపాధ్యక్ష పదవికి ఇద్దరు, జాయింట్ సెక్రటరీకి ఇద్దరు, కోశాఽధికారికి ఇద్దరు, లైబ్రరీ సెక్రటరీకి ఇద్దరు, గేమ్స్ అండ్ కల్చరల్ పదవికి ఇద్దరు, ఈసీ సభ్యుల పదవులకు తొమ్మిది మంది పోటీలో ఉన్నట్లు వివరించారు. ఈనెల 29న ఉదయం 10 గంటల నుంచి మఽఽధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం ఫలితాలు వెలడించనున్నట్లు చెప్పారు. మహిళలను వేధిస్తే శిక్ష తప్పదు సూర్యాపేటటౌన్ : మహిళలను వేధిస్తే శిక్ష తప్పదని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహిళా భరోసా సెంటర్, షీ టీమ్స్ కార్యాలయాలను సందర్శించి రికార్డులను పరిశీలించి మాట్లాడారు. మహిళలు, బాలలను ఎవరైనా వేధిస్తే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు. వేధింపులకు, దాడులకు గురైన వారికి భరోసా, ధైర్యం కల్పించాలన్నారు. షీ టీమ్స్, భరోసా సెంటర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మహిళలు, పిల్లల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, కౌన్సిలింగ్ నిర్వహణ, అవగాహన కార్యక్రమాలను పరిశీలించి సిబ్బందికి సలహాలు సూచనలు చేశారు.జిల్లాలో పని చేస్తున్న తీరును భరోసా సెంటర్ సిబ్బంది, షీ టీమ్స్ సిబ్బంది వివరించారు. ఎస్పీ వెంట భరోసా సెంటర్ ఎస్ఐ మౌనిక, షీ టీమ్స్ ఎస్ఐ నీలిమ, సిబ్బంది ఉన్నారు. నేడు హుజూర్‌నగర్‌కు మంత్రి ఉత్తమ్ రాక హుజూర్నగర్ : రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్‌రెడ్డి గురువారం హుజూర్‌నగర్‌కు రానున్నారు. పట్టణ పరిధిలోని కౌండిన్య ఫంక్షన్ హాల్లో ఉదయం 9 గంటలకు నిర్వహించే హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశానికి మంత్రి హాజరవుతారు. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేయాల్సిన ఏర్పాట్లపై ఈ సమావేశంలో నాయకులతో చర్చించనున్నట్లు మంత్రి పీఆర్ఓ వెంకట్‌రెడ్డి తెలిపారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా సంరక్షించాలిఅర్వపల్లి: వేసవిలో మొక్కలు ఎండిపోకుండా నిర్వాహకులు తగు సంరక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి కోరారు. జాజిరెడ్డిగూడెం మండలంలోని రామన్నగూడెం వననర్సరీని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా నర్సరీల్లో మొక్కలు ఏపుగా ఎదుగుతున్నాయని చెప్పారు. వర్షాలు పడ్డాక మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపి, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, బైరబోయిన నర్సయ్య పాల్గొన్నారు. మట్టపల్లిలో నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత లక్ష్మీనృసింహుని నిత్యకల్యాణాన్ని బుధవారం అర్చకులు వేదమంత్రాలతో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీస్వామివారికి విశేష పూజలు, అర్చనలు చేశారు. నిత్యహోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం ఎదుర్కోళ్ల మహోత్సవం నిర్వహించారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణతో కల్యాణ తంతు ముగించారు. -
ఇది.. కాంగ్రెస్ తెచ్చిన కరువు
చివ్వెంల(సూర్యాపేట) : కాలం తెచ్చిన కరువు కాదు.. మూమ్మాటికీ ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. బుధవారం చివ్వెంల మండల పరిధిలోని మొగ్గయ్యగూడెంలో ఎండిన పంట పొలాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. రైతుల ఉసురు తీస్తూ, రాక్షసానందం పొందుతున్నారన్నారు. దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం మూడే కాంగ్రెస్ సిద్ధాంతాలని వ్యాఖ్యానించారు. పది సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్న రైతాంగాన్ని, మళ్లీ కన్నీరు పాలు చేసిన పాపం కాంగ్రెస్ దే అని ఆరోపించారు. పొట్టకొచ్చిన పంటలను నీళ్లులేక పశువులకు అమ్ముకునే పరిస్థితితీసుకొచ్చారని మండిపడ్డారు. ఎడాదిన్నర కాకముందే అన్ని రంగాల్లో ఇంత నిర్లక్ష్యమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రారంభించిన తర్వాత ఒక్క ఎకరం కూడా ఎండి పోలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రెండుసార్లు యాసంగి పంటలు ఎండిపోయాయన్నారు. కాళేశ్వరం నీరు కాకుండా ఎస్సారెస్పీ నీళ్లు అయితే ఇప్పుడు పంటలు ఎందుకు ఎండిపోతున్నాయో మంత్రులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మళ్లీ కాళేశ్వరం తమకు అప్పగిస్తే ఒక్క ఎకరం ఎండిపోకుండా చూస్తామన్నారు. ఎండి పోయిన పంట పొలాలు, రైతన్నల గురించి ఒక్క మంత్రి కూడా మాట్లాడకపోవడం సిగ్గు చేటన్నారు. దావత్‌లకు పోవడానికి హెలికాప్టర్లు దోరుకుతున్నాయి గానీ, ఎండిన పొలాలను పరిశీలించడానికి సమయం దొరకట్లేదని పేర్కొన్నారు. ఎండి పొలాలను, రైతన్నల కష్టాలను ఎక్కిరించడానికి సీఎం జిల్లా కు వస్తున్నట్లు ఉందని అన్నారు. సీఎం రేవంత్, కాంగ్రెస్ చేసిన మోసానికి రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారని ఆరోపించారు. వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదన్నారు. మంత్రులకు శాఖల గురించి అర్థంకాక పోతే అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. కేసీఆర్ ముందుచూపుతో అద్భుత ప్రణాళికతో రాష్ట్రాన్ని ప్రపంచానికే ఆదర్శంగా తిర్చి దిద్దాడని అన్నారు. కనీసం ఒక్క తడైనా నీరు అందిస్తే కొంతమంది రైతులన్నా అప్పుల బారిన పడకుండా ఉంటారన్నారు. స్థానిక మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పందించి ఇంకొక్క తడి నీరు ఇవ్వాలని కోరారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు జూలకంటి జీవన్ రెడ్డి, జిల్లా, మండల నాయకులు ఉన్నారు.ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి -
ఎల్ఆర్ఎస్కు దూరం
సూర్యాపేట : ఎల్ఆర్ఎస్(లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీం) ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ రుసుములపై 25శాతం రాయితీ ఇచ్చినా ప్లాట్ల యజమానులు క్రమబద్ధీకరణ చేయించుకోవడానికి ముందుకురావడం లేదు. ప్రతి మున్సిపాలిటీలో వేలల్లో దరఖాస్తులు రాగా పరిష్కారం అవుతున్నవి వందల్లో ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఐదు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 65,153 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు ఫీజు చెల్లించినవారి సంఖ్య 5.34శాతం మాత్రమే. ఈ నెలాఖరుతో ఫీజు రాయితీ గడువు ముగియనుంది. ఐదు మున్సిపాలిటీల్లో 65,153 దరఖాస్తులు.. జిల్లాలో సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీల కౌంటర్ల వద్ద బారులుదీరి రూ.1000 చెల్లించి ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారు. 2020 అక్టోబర్ 15 వరకే దరఖాస్తులు స్వీకరించి ఆపేశారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 65,153 దరఖాస్తులు వచ్చాయి. నాటి నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఆయా మున్సిపాలిటీల్లో వెబ్సైట్లో పెండింగ్‌లోనే ఉంటూ వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్లాట్ల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించడంతో ఎల్ఆర్ఎస్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. అధికారిక గణాంకాల ప్రకారం ఈ నెల 25వ తేదీ వరకు 3,480 దరఖాస్తులు మాత్రమే పరిశీలించి డాక్యుమెంట్లు, మార్కెట్ ధర ప్రకారం రుసుం తీసుకుని ఎల్ఆర్ఎస్ ధ్రువపత్రాలు జారీ చేశారు. వీటి ద్వారా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల ద్వారా రూ.15.92కోట్ల ఆదాయం వచ్చింది. ఇంకా 61,673 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అవగాహన కల్పించడంలో విఫలం క్రమబద్ధీకరణ ఇంటి అనుమతి కోసమేనని, ఈ మాత్రం దానికి ఎస్ఆర్ఎస్ అవసరమేంటనే అపోహ చాలా మందిలో ఉంది. ప్లాట్లు క్రమబద్ధీకరించుకుంటే చట్టబద్ధత ఉంటుందని, అలాంటి వాటికే మార్కెట్లో విలువ పెరుగుతుందని, బ్యాంకులు ఇళ్ల నిర్మాణానికి రుణాలు ఇస్తాయన్న విషయాన్ని గుర్తించడం లేదు. ఈ కోణంలో రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు అవగాహన కల్పించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. నిషేధిత జాబితాలోని భూములకు వర్తించదు మున్సిపల్ పరిధిలోని బఫర్, ఎఫ్టీఎల్, కుంటలు, చెరువులు, ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితాలో ఉన్న భూములకు ఎల్ఆర్ఎస్ వర్తించదని అధికారులు చెబుతున్నారు. ఒకవేిళ వీటి పరిధిలో భూములు ఉంటే గతంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నప్పటికీ క్రమబద్ధీకరణ చేయకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తుదారులు ఎల్ఆర్ఎస్కు పూర్తి ఫీజు చెల్లించినా క్షేత్ర స్థాయి విచారణ అనంతరం తిరస్కరించడంతో పాటు చెల్లించిన ఫీజులో 10శాతం కట్ చేసుకొని మిగతా డబ్బులు మాత్రమే దరఖాస్తుదారులకు చెల్లిస్తారు. అవకాశం సద్వినియోగం చేసుకోవాలి ఎల్ఆర్ఎస్ కోసం గతంలో రూ.వెయ్యి చెల్లించిన వారు ఈనెల 31వ తేదీ లోపు ఫీజు చెల్లించి 25శాతం మినహాయింపు పొందాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎల్ఆర్ఎస్ చేయించుకోకపోతే తర్వాత ఇబ్బందులు పడతారు. వెబ్సైట్లో కూడా లాగిన్ అయి కూడా ఫీజు చెల్లించుకోవచ్చు. – బి.శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్, సూర్యాపేట అవగాహన లోపం.. క్రమబద్ధీకరణపై అనాసక్తి ఫ ప్లాట్ల రెగ్యులరైజేషన్‌కు ముందుకురాని యజమానులు ఫ 65,153 దరఖాస్తుల్లో 3,480 మాత్రమే పరిష్కారం ఫ 31వ తేదీతో ముగియనున్న 25శాతం రాయితీ గడువుమున్సిపాలిటీ వచ్చిన పరిష్కారమైనవి ఆదాయం పెండింగ్ దరఖాస్తులు (రూ.కోట్లలో)సూర్యాపేట 35,465 1845 9.30 33620 నేరేడుచర్ల 3131 79 0.26 3,052 హుజూర్నగర్ 4414 184 0.58 4,230 తిరుమలగిరి 6023 157 0.29 5,866 కోదాడ 16120 1215 5.49 14,905 -
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా సీఎం సభ ఏర్పాట్లు
హుజూర్నగర్ : ఉగాది నాడు హుజూర్‌నగర్‌లో జరిగే సీఎం సభకు ట్రాఫిక్ సమస్యల తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. హుజూర్నగర్ పట్టణంలో జరుగుతున్న సీఎం సభా ఏర్పాట్లను ఎస్పీ నరసింహతో కలిసి బుధవారం ఆయన పరిశీలించారు. సభాస్థలి, సభికుల ప్రాంగణం, బారికేడ్లు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించి కాంట్రాక్టర్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, ము న్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, విద్యుత్ డీఈ వెంకట కిష్టయ్య, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, సీఐ చరమంద రాజు, తహసీ ల్దార్ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. పండుగవాతావరణంలో పంపిణీ చేయాలి భానుపురి (సూర్యాపేట): రేషన్ షాపుల్లో ఏప్రిల్ 1 నుంచి పండుగ వాతావరణంలో సన్నబియ్యం పంపిణీ చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ లో సన్న బియ్యం పంపిణీపై రేషన్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు తో కలిసిమాట్లాడారు. ఉగాది రోజు సీఎం రేవంత్ రెడ్డి హుజూర్ నగర్లో సన్న బియ్యం పంపిణీని ప్రారంభిస్తారని తెలిపారు. సమావేశంలో డీఎస్ఓ రాజేశ్వర్, సివిల్‌సప్లయ్ డీఎం ప్రసాద్ పాల్గొన్నారు.దరఖాస్తులు పరిశీలించి మంజూరు చేయాలి భానుపురి (సూర్యాపేట) : నూతన పరిశ్రమలకు పెట్టిన దరఖాస్తులను పరిశీలించి మంజూరు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డిజి టల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ స్కీం ద్వారా నిరుద్యోగులు మొబైల్ యాప్ లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీపీఓ యాదగిరి, ప్రకా ష్ రెడ్డి, రామకృష్ణ, సంతోష, యాదగిరి, బాపూ జీ, శ్రీనివాస్ నాయక్, శంకర్ పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
అంగన్వాడీలకు పక్కా భవనాలు
నాగారం : అంగన్వాడీ కేంద్రాలకు పక్కా భవనాలు సమకూరనున్నాయి. మొదటి విడతలో జిల్లాకు 69 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు మంజురయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం అరకొర వసతులు, అద్దె భవనాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. దీంతో చిన్నారులు, గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పక్కాభవనాల నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉపాధి హామీ నుంచి కొన్ని నిధులు మంజూరు చేసింది. ఒక్కో భవనానికిరూ.12 లక్షల చొప్పున ప్రతిపాదనలు జిల్లా వ్యాప్తంగా 23 మండలాల పరిధిలో మొత్తం ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిఽధిలో 1,209 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో మూడేళ్లలోపు చిన్నారులు 25,139 మంది, 3 నుంచి 6ఏళ్లలోపు చిన్నారులు 14,819 మంది నమోదై ఉన్నారు. అయితే మొత్తం కేంద్రాల్లో 306 కేంద్రాలకు సొంత భవనాలుండగా, 451 కేంద్రాలు సమీప పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. ఇక 452 కేంద్రాలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. తాజా ఆదేశాల ప్రకారం జిల్లాలో మొదటి విడతగా 69 భవనాల నిర్మాణం చేపట్టన్నారు. ఇందుకోసం ఒక్కో భవనానికి రూ.12లక్షలు ప్రతిపాదించారు. వీటిలో ఉపాధి హామీ పథకం నుంచి రూ.8.50 లక్షలు ప్రస్తుతం మంజూరయ్యాయి. 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.2 లక్షలు, సొంత శాఖ లేదా కలెక్టర్ నుంచి రూ.1.50 లక్షల చొప్పున నిధులు రావాల్సి ఉంది. పూర్తిస్థాయిలో నిధులు రాగానే పనులు జిల్లాకు 69 అంగన్ వాడీ కేంద్రాలకు సొంత భవనాలు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఉపాధిహామీ పథకం నుంచి నిధులు వచ్చాయి. పూర్తిస్థాయిలో నిధులు మంజూరుకాగానే భవనాల నిర్మాణ పనులను ప్రారంభిస్తాం. –నర్సింహారావు, జిల్లా సంక్షేమ అధికారి, సూర్యాపేట. ఫ మొదటి విడతగా 69 కేంద్రాలకు సొంతభవనాలు ఫ ఒక్కోభవనానికి రూ.12లక్షల చొప్పున ప్రతిపాదనలు ఫ ప్రస్తుతం ఉపాధి నిధులు రూ.8.50 లక్షల చొప్పున మంజూరు -
ఘనంగా సహస్రకలశాభిషేకం
మేళ్లచెరువు : మేళ్లచెరువు మండల కేంద్రంలోని మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో నిర్వహిస్తున్న శ్రీదేవిభూదేవి శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సహస్రకలశాభిషేక మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామి పర్యవేక్షణలో వెయ్యిన్నొకటి (1001) కలశాలతో సుగంధ ద్రవ్యాలు, కర్పూరం, పంచామృతంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఈ నెల 19 న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు మంగళవారం ముగిసినట్లు పేర్కొన్నారు. అనంతరం జీయర్‌స్వామి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి సారిగా ఏకోత్తర సహస్ర అభిషేక మహోత్సవం నిర్వహించారని ఈ అభిషేక తీర్థం ఎన్నో గొప్పఫలితాలు ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, మునగాల రామ్మోహనరావు, అరుణ దంపతులు, జూపల్లి వినోద్‌రావు, భార్గవి దంపతులు, రంజిత్‌రావు, యూనిట్ హెడ్ శ్రీనివాసరావు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
సీఎం సభకు పటిష్ట ఏర్పాట్లు
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సీఎం సభాస్థలిని పరిశీలించిన పౌరసరఫరాల శాఖ జాయింట్ సెక్రటరీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుజూర్నగర్ పర్యటన నేపథ్యలో స్థానికంగా జరుగుతున్న ఏర్పాట్లను పౌరసరఫరాల శాఖ జాయింట్ సెక్రటరీ ప్రియాంక ఆలా మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆమెకు సభా ప్రాంగణం, హెలిపాడ్‌ను చూపించి వాటి గురించి వివరించారు. అంతకు ముందు కలెక్టర్ ఆమెకు ఆర్అండ్బీ బంగ్లా వద్ద పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. -
4.07 టన్నుల సేకరణ లక్ష్యం
ధాన్యం కొనుగోలుకు సన్నద్ధమవుతున్న యంత్రాంగం లక్షలసూర్యాపేట : జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని ముందుగానే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేలా సిద్ధమవుతున్నారు. ఏప్రిల్ మొదటి వారంలోనే కొనుగోళ్లు ప్రారంభించేలా సివిల్ సప్లయ్ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. వేసవి కాలం కావడంతో తేమ శాతంతో ఇబ్బంది ఉండదని, వరి కోసిన వెంటనే ధాన్యం కొంటామని అధికారులు చెబుతున్నారు. 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ యాసంగి సీజన్లో జిల్లావ్యాప్తంగా 4,73,739 ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ఇందులో సన్నరకం 2,63,250 ఎకరాలకు గాను 6,58,125 మెట్రిక్ టన్నుల దిగుబడి, దొడ్డురకం 2,10,489 ఎకరాలకు గాను 5,47,271 మెట్రిక్ టన్నులు.. మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రానుంది. ఇందులో స్థానిక అవసరాలకు 98,718, విత్తనాలకు 1600 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ వ్యాపారులకు మరో 6,97,142 మెట్రిక్ టన్నులు విక్రయించవచ్చని, అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు సెంటర్లకు దాదాపు 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు సివిల్ సప్లయ్ అధికారులకు ప్రతిపాదనలు పంపారు. ఈ నేపథ్యంలోనే ఎన్ని సెంటర్లను ప్రారంభించాల్సి ఉంటుంది..? పీఏసీఎస్, ఐకేపీ, డీసీఎంఎస్, ఇతరుల ద్వారా ఎన్ని కొనుగోలు కేంద్రాలను నెలకొల్పాల్సి ఉంటుందోనన్న కసరత్తును రెండుమూడు రోజుల్లోనే పూర్తి చేయనున్నారు. బోనస్ కారణంగా జిల్లాలో రైతులు సన్నరకాలను కూడా బాగానే సాగు చేయడంతో వీటికోసం వేరుగానే సెంటర్లను నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నారు. అందుబాటులో 25 లక్షల గన్నీబ్యాగులు గత యాసంగిలో ప్రారంభించినట్లుగానే ఏప్రిల్ మొదటి వారంలోనే సెంటర్లను ప్రారంభించనున్నారు. 4.07 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు గాను దాదాపు 75 లక్షల గన్నీబ్యాగులు అవసరం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇప్పటికే 25 లక్షల గన్నీబ్యాగులు సిద్ధంగా ఉండగా.. కొనుగోళ్లు ప్రారంభమయ్యే నాటికి మరో 10 లక్షలు గన్నీబ్యాగులను సేకరించనున్నారు. మిగతావాటిని విడతల వారీగా ఎలాంటి కొరత లేకుండా సేకరించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే యాసంగి సీజన్ కావడంతో అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ఉండేలా టార్పాలిన్లు సైతం అందుబాటులో ఉంచనున్నారు. ఇక ప్యాడీ క్లీనర్లు, తేమ కొలిచే యంత్రాలు, వేయింగ్ మిషన్లు సిద్ధం చేశారు.ఫ కొనుగోళ్ల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం ఫ ఇంకా ఖరారు కాని కేంద్రాలు ఫ వచ్చే నెల మొదటివారం నుంచి కొనుగోళ్లు ధాన్యం కొనుగోలు వివరాలు సాగు విస్తీర్ణం 4,73,739 ఎకరాలు దిగుబడి అంచనా 12 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు లక్ష్యం 4.07 లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సిన గన్నీ బ్యాగులు 75 లక్షలు అందుబాటులో ఉన్నవి: 25 లక్షలు కొనుగోళ్లకు సిద్ధమవుతున్నాం యాసంగి ధాన్యం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఏప్రిల్ మొదటి వారంలో కొనుగోళ్లు ప్రారంభిలా ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యవసాయ అధికారుల దిగుబడి అంచనాలకు అనుగుణంగా త్వరలోనే ఎన్ని సెంటర్లు ప్రారంభించాలో తేలుస్తాం. కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరిస్తాం. – ప్రసాద్, సివిల్ సప్లయ్ డీఎం -
ముస్లింల ఉపవాస దీక్షలు ఫలించాలి
సూర్యాపేటటౌన్ : పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు చేసే కఠోర ఉపవాస దీక్షలు ఫలించాలని, ఆ అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సూర్యాపేటట జిల్లా కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందడుగు వేసి అన్ని పండుగలను గౌరవించారన్నారు. తెలంగాణలో గంగ జమున తహజీబ్ లా ఒకరి పండుగలను మరొకరు గౌరవించే విధానం రావాలన్నారు. అందులో భాగంగానే దసరాకు బతుకమ్మ చీరలు, క్రిస్మస్కు ప్రేమవిందు, ముస్లింలకు ఇఫ్తార్ విందులు, తోఫాలను అందజేసి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అద్భుతమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని కొనసాగిస్తూ ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ముస్లింలందరూ ప్రశాంత వాతావరణంలో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరారు. ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, ముస్లింలు తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి -
తుంగతుర్తి సీఐపై వేటు
నూతనకల్: నూతనకల్ మండలం మిర్యాల గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసుతో పాటు గ్రామంలో జరిగిన వివిధ సంఘటనలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన తుంగతుర్తి సీఐ శ్రీనివాస్ నాయక్‌పై మంగళవారం బదిలీ వేటు పడింది. రాష్ట్ర మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ ఆదేశాల మేరకు ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేశారు. హత్యకేసు విషయాన్ని పసిగట్టలేకపోవడంతో స్థానిక డీఎస్పీ రవి, ఎస్ఐ మహేంద్రనాథ్‌లకు మెమోలు జారీ చేశారు. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతఅర్వపల్లి: నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అదనపు కలెక్టర్ రాంబాబు పేర్కొన్నారు. జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన వాటర్‌షెడ్ యాత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. పాఠశాల ఎదుట మొక్కలు నాటారు. రుణాలపై మహిళలు పొందిన కుట్టుమిషన్లు పరిశీలించారు. వాటర్‌షెడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న అధికారులు, రైతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ అప్పారావు, వాటర్‌షెడ్ ప్రాజెక్టు అధికారి వినయ్భార్గవ్, ఎంపీడీఓ టి.గోపి, ఎంఈఓ బి.బాలునాయక్, ఏపీఓ ఉపేందర్, ఏపీఎం మల్లేష్, వాటర్‌షెడ్ మండల ఇన్చార్జి డి.రవీందర్, ఈసీ నగేష్, గిర్దావర్ వెంకట్‌రెడ్డి, సీసీ నగేష్, హెచ్ఎంలు కుంభం ప్రభాకర్, జి.చంద్రారెడ్డి, వాటర్‌షెడ్ కమిటీ సభ్యులు కందుల తిరుమలరావు, పెద్దరాములు, జీడి పద్మ, నాగమ్మ పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్ ముట్టడిసూర్యాపేటఅర్బన్ : ప్రజా, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌ను ముట్టడించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలనలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని పేర్కొన్నారు. ఎస్సారెస్పీ కాల్వ పరిధిలోని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో చాలా గ్రామాల్లో వరి పంట పూర్తిగా ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని కోరారు. విధుల నిర్వహణలో అలసత్వం వహించొద్దునాగారం : పంచాయతీ కార్యదర్శులు విధుల నిర్వహణలో అలసత్వం వహించవద్దని జిల్లా పంచాయతీ అధికారి యాదగిరి ఆదేశించారు. నాగారం మండలంలోని నాగారంబంగ్లా గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. గ్రామాల్లో ఈనెలాఖరులోగా వందశాతం ఇంటి పన్ను వసూలు చేయాలని సూచించారు. వేసవిలో వన నర్సరీలను సంరక్షించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఉపాధి పనులు కల్పించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచుతూ, పనిలో నాణ్యతను పాటించాలన్నారు. జాబ్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 100 రోజులు ఉపాధి పనులు కల్పించాలని ఆదేశించారు. అనంతరం గ్రామంలోని వన నర్సరీ, ఉపాధి పనులు, శ్మశాన వాటికను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ కె.మారయ్య, పంచాయతీ కార్యదర్శి అరుణ్ ఉన్నారు. గోదావరి జలాలు నిలిపివేతఅర్వపల్లి: యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు వారబందీ విధానంలో విడుదల చేస్తున్న గోదావరి జలాలను మంగళవారం మధ్యాహ్నం నిలిపివేశారు. ఈ సీజన్‌కుగాను జనవరి 1 నుంచి జిల్లాకు నీటిని పునరుద్ధరించారు. వారబందీ విధానంలో ఇప్పటి వరకు నీటిని వదిలారు. మొత్తం ఈసీజన్లో ఆరు విడతల్లో నీటిని వదిలారు. చివరి విడతగా ఈనెల 17 నుంచి నీటిని ఇచ్చారు. కాగా వరి పొలాలు మరో 15 రోజుల్లో చేతికందనున్నాయని అప్పటి వరకు నీటిని విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. -
అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు
ఫ ఎస్పీ నరసింహ సూర్యాపేటటౌన్ : మానవతప్పిదాలు, నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేట రూరల్ పరిధిలోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల బ్లాక్ స్పాట్లను మంగళవారం రాత్రి ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, నిత్యం ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో లోపాలను గుర్తించి సవరించాలని అధికారులను ఆదేశించారు. ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తూ నిబంధనలను అతిక్రమించే వాహనదారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. చాలామంది రోడ్డు ప్రమాదాల బారిన పడి అర్ధంతరంగా చనిపోతున్నారన్నారు. జాతీయ రహదారి వెంట ఉండే గ్రామాల ప్రజలు, వ్యవసాయ పనులకు వెళ్లే వారు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని, బైక్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, సీటు బెల్ట్ విధిగా పెట్టుకోవాలన్నారు. ఆయన వెంట సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్, సిబ్బంది ఉన్నారు. -
వెంటాడి వేటాడి..తండ్రిని చంపించిన కన్న కూతురు
సూర్యాపేటటౌన్: గ్రామంలో ఆధిపత్యం కోసం మామను అతికిరాతంగా హత్య చేయించాడు సొంత అల్లుడు. నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలో హత్యకు గురైన మాజీ సర్పంచ్ మెంచు చక్రయ్యగౌడ్ హత్య కేసులో 13 మంది నిందితులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నరసింహ విలేకరులకు వెల్ల డించారు. చక్రయ్యగౌడ్ ఆధిపత్యం సహించలేక..మెంచు చక్రయ్యగౌడ్ గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతూ గ్రామ సర్పంచ్‌గా కూడా పనిచేశాడు. అతడికి ఐదుగురు కుమార్తెలు సంతానం. తన మూడో కుమార్తె కనకటి సునీతను కూడా సర్పంచ్‌గా, మూడో అల్లుడు కనకటి వెంకన్నను పీఏఏసీఎస్ చైర్మన్‌గా చేశాడు. అల్లుడు కనకటి వెంకన్న పీఏసీఎస్ చైర్మన్ అయిన్నప్పటి నుంచి నూతనకల్ మండలంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం ఉండటం వెంకన్న వర్గీయులు సహించలేకపోయారు. చక్రయ్యగౌడ్కు వ్యతిరేకంగా వెంకన్న వర్గీయులు ఒక గ్రూపుగా ఏర్పడడంతో వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2023లో చక్రయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2024లో కనకటి వెంకన్న కూడా కాంగ్రెస్‌లోకి వచ్చాడు. అయినప్పటికీ గ్రామంలో చక్రయ్యగౌడ్ ఆధిపత్యం కొనసాగుతోంది. దీంతో ఎలాగైనా మామ చక్రయ్యగౌడ్ను అడ్డు తొలగించుకోవాలని కనకటి వెంకన్న నిర్ణయించుకున్నాడు.బొడ్రాయి మహోత్సవంలో హత్యకు పథకం.. ఈ నెల 13న మిర్యాల గ్రామంలో బొడ్రాయి మహోత్సవం జరిగింది. గతంలో కనకటి వెంకన్న ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరిగేవి, చక్రయ్యగౌడ్ ఈసారి ఉత్సవాలను తన ఆధ్వర్యంలో జరపాలని బహిరంగంగా ప్రకటించడంతో వెంకన్న తట్టుకోలేకపోయాడు. దీంతో ఎలాగైనా చక్రయ్యగౌడ్ను హత్య చేయాలని తన వర్గీయులను కొంతమందిని వెంకన్న పురమాయించాడు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం చక్రయ్యగౌడ్ తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తుండగా.. అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్య, ఐదో అల్లుడు కనకటి లింగయ్యతో పాటు వెంకన్న అనుచరులైన కనకటి శ్రవణ్, కనకటి శ్రీకాంత్, గంధసిరి వెంకటేష్, పెద్దింటి మధు, పెద్దింటి గణేష్ అడ్డగించి మారణాయుధాలు, వెదురు కరల్రతో చక్రయ్యగౌడ్పై దాడి చేసి హత్య చేశారు. ఇదంతా దూరంగా నుంచి గమనిస్తున్న వెంకన్న చక్రయ్యగౌడ్పై దాడి జరిగగానే అతడు చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి అందరూ పారిపోయారు. ఈ హత్యపై నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోమవారం ఉదయం తుంగతుర్తి పరిధిలో వాహనాల తనిఖీల్లో భాగంగా.. చక్రయ్యగౌడ్ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న అతడి మొదటి అల్లుడు కనకటి ఉప్పలయ్యతో పాటు హత్యకు కుట్ర పన్నిన మూడో అల్లుడు కనకటి వెంకన్న, వెంకన్న భార్య సునీత, మొదటి కుమార్తె కనకటి స్వరూప, ఐదో కుమార్తె కనకటి కల్యాణితో పాటు దిండిగల నగేశ్, జక్కి పరమేష్, మన్నెం రమేశ్, కనకటి వెంకన్న అలియాస్ మొండి వెంకన్న, కనకటి శ్రావ్య, కనకటి/వర్దెల్లి అనూష, జక్కి స్వప్న, భారీ సతీష్ రెండు కార్లలో వెళ్తుండగా పోలీసులు అదపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా.. చక్రయ్యగౌడ్ను హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రెండు కార్లు, ఒక కర్ర, 10 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మొత్తం 42 మందిపై కేసు నమోదైందని, దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలిపారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొన్న ఏడుగురు నిందితుల్లో కనకటి ఉప్పలయ్య మినహా మిగతా ఆరుగురు గతంలోనే కోర్టులో లొంగిపోయినట్లు సమాచారం.కస్టడీ పిటీషన్ వేసి దర్యాప్తు చేస్తాంఈ హత్య కేసులో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న ఎవరినీ వదిలిపెట్టకుండా కచ్చితమైన ఆధారాలు సేకరిస్తూ దర్యాప్తు పారదర్శకంగా చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కస్టడీ పిటిషన్ వేసి నిందితులను కస్టడీలోకి తీసుకుని దర్యాప్తు చేస్తామన్నారు. నిందితులను పట్టుకున్న పోలీసులకు ఎస్పీ రివార్డు అందజేశారు. ఈ కేసు ఛేదించిన సూర్యాపేట డీఎస్పీ రవి, సీఐ డి. శ్రీను, ఎస్ఐలు మహేంద్రనాథ్, ఎం. వీరయ్య, ఆర్. క్రాంతికుమార్‌ను ఎస్పీ అభినందించారు. -
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి
భానుపురి (సూర్యాపేట) : అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి మాట్లాడారు. జిల్లా అధికారులందరూ ప్రజా సమస్యలను తీర్చడంలో మంచిగా విధులు నిర్వహిస్తున్నారని, ఎల్లప్పుడూ ఇదే ఒరవడిని కొనసాగించాలన్నారు.ప్రజావాణిలో భూ సమస్యలకు సంబంధించి 22 దరఖాస్తులు, డీఆర్డీఏ 9, పంచాయతీ రాజ్ శాఖ 6, ఇతర శాఖలు 21ఽ దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు. అంతకుముందు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 7 నుంచి మార్చి 17 వరకు జరిగిన 100 రోజుల కార్యక్రమంలో 1,13,961 మందికి స్క్రీనింగ్ టెస్ట్‌లు చేశామని, అందులో 17,838 మందిని అనుమానితులుగా గుర్తించి పరీక్షలు చేశామన్నారు. వీరిలో 491 మంది టీబీ రోగులను గుర్తించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ వీవీ అప్పారావు, డీఎంహెచ్ఓ అశోక్, డీపీఓ యాదయ్య, డీఈఓ అశోక్, సీపీఓ కిషన్, సంక్షేమ అధికారులు లత, శంకర్, జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
కనుల పండువగా చక్రస్నానం
మేళ్లచెరువు : మేళ్లచెరువులోని మైహోమ్ సిమెంట్ పరిశ్రమలో కొనసాగుతున్న శ్రీదేవిభూదేవి శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం కనుల పండువగా చక్రస్నానం నిర్వహించారు. త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జీయర్‌స్వామి పర్యవేక్షణలో మహాపూర్ణాహుతి, శ్రీ చక్రతీర్థం, పుష్పయాగం, దేవతలకు వీడ్కోలు పర్వాలు చేపట్టారు. ఉదయం యాగశాలలో పూర్ణాహుతి సందర్భంగా దేవతలను సుగంధ ద్రవ్యాలతో ఆరాధించి పట్టు వస్త్రాలతో ఆవాహన చేసి నెయ్యితో అగ్ని భగవానుడికి సమర్పించారు. విశ్వశాంతికోసం మహపూర్ణాహుతి నిర్వహించినట్లు జీయర్‌స్వామి తెలిపారు. అనంతరం శ్రీచక్ర ఆళ్వారుడికి పూజలు నిర్వహించి అనంతరం దేవతామూర్తులను ఊరేగిస్తూ రంగులు చల్లుకుంటూ పుష్కరిణి వద్దకు చేరుకొని చక్రస్నానం వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, శ్రీకుమారి దంపతులు, మునగాల రామ్మోహనరావు, అరుణ దంపతులు, జూపల్లి వినోద్‌రావు, భార్గవి దంపతులు, రంజిత్‌రావు, చంద్రశేఖరపాండే, భారత చీఫ్‌విజిలెన్స్ మాజీ ఆఫీసర్ కె.వి.చౌదరి, కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డి, ఎస్ఐ పరమేష్, యూనిట్ హెడ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవికి లైన్ క్లియర్ అయినట్లు తెలిసింది. దీంతో జిల్లాకు మరో మంత్రి పదవి దక్కబోతోంది. మంత్రివర్గ విస్తరణపై సోమవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, భారీ నీటి పారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారు. ఇందులో రాజగోపాల్‌రెడ్డికి మంత్రి ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవితోపాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు. అయితే, వివిధ కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌కు కూడా మంత్రి పదవి వస్తుందన్న నమ్మకంతో ఆయన అనుచరులు ఉన్నారు. అయితే, రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇవ్వబోతున్నందున బాలు నాయక్‌కు డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవులు ఉండగా, మూడో మంత్రి పదవి రాజగోపాల్‌రెడ్డికి దక్కనుంది. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఫ ఉమ్మడి జిల్లాకు మూడో మంత్రి ఫ బాలునాయక్‌కు డిప్యూటీ స్పీకర్ ఫ ఢిల్లీ చర్చల్లో దాదాపుగా ఖరారు -
15 రోజులు నీళ్లిస్తేనే..
ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టులో పంటలు చేతికొచ్చే అవకాశం మరో తడి నీటిని అందించాలి మాకు నీరందడం ఆలస్యమైంది. దీంతో నాట్లు ఆలస్యంగా పడ్డాయి. మరో తడి నీటిని ఇస్తేనే పొలం చేతికి వస్తుంది. అధికారులు స్పందించి నీటి షెడ్యూల్‌ను మరో వారం, పదిరోజులు పొడిగించాలి. లేదంటే సగంపంట కూడా చేతికి రానట్లుంది. – ధరావత్ చాంప్లా,లక్ష్మీనాయక్‌తండా, చివ్వెంల మండలం ఇదే చివరి తడి షెడ్యూల్ ప్రకారం జిల్లాకు ఇదే చివరి తడి. నీటి విడుదలను పొడిగించే అవకాశం లేదు. ఉన్నతాధికారులకు మాత్రం సమాచారం ఇచ్చాం. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతాంగానికి నీటి విడుదల ఉంటుంది. – శివధర్మతేజ, ఎస్సారెస్పీ ఎస్ఈభానుపురి (సూర్యాపేట) : సూర్యాపేట జిల్లాకు మరో 15 రోజుల పాటు ఎస్సారెస్పీ నీటిని విడుదల చేస్తేనే పంటలు పూర్తిస్థాయిలో చేతికి వచ్చే అవకాశముంది. ఎస్సారెస్పీ రెండో దశ ఆయకట్టుకు వారబందీ విధానంలో నీటిని తక్కువ మొత్తంలో నీటిని వదులుతుండడంతో చాలామంది భూములు సాగు చేయలేదు. ప్రధాన కాలువల వెంట, వాటిని ఆనుకొని ఉన్న పొలాలకు సైతం ఆలస్యంగా నీరు అందడంతో కొంత వెనుకకు నాట్లు వేశారు. ప్రసుతం ఈ పొలాలు ఈతదశలో ఉన్నాయి. వీటికి మరో 15 రోజుల పాటు నీటిని అందిస్తేనే తాలు లేకుండా చేతికి వచ్చే అవకాశముంది. అయితే సోమవారంతో ప్రభుత్వం ప్రకటించిన నీటి షెడ్యూల్ ముగిసింది. వారబందీ విధానంలో.. జిల్లాలో యాసంగి పంటల సాగునిమిత్తం ఎస్సారెస్పీ రెండోదశకు జనవరి 1న నీటిని విడుదల చేశారు. వారబందీ విధానంలో మార్చి 31వరకు ఆరు తడులకు ఇవ్వనున్నట్లు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. దీంతో ఆత్మకూర్ మండలంలో 18వేలు, చివ్వెంలలో 15,200 , పెన్‌పహాడ్‌లో 9,456, సూర్యాపేటలో 10వేలు, జాజిరెడ్డిగూడెంలో 16వేలు, మద్దిరాలలో 8,653 , నాగారంలో 8వేలు, నూతనకల్‌లో 4,500 , తిరుమలగిరిలో 3,360 , తుంగతుర్తిలో 14,208 ఎకరాల్లో వరి వేశారు. ఇందులో ఇప్పటికే 4వేలకు పైగా ఎకరాలు ఎండిపోయింది. ఎండలు ముదిరి.. వాడకం పెరిగి.. జిల్లాలో బోరుబావుల కింద సాగైన వరి పొలాలు కొన్ని కోతదశకు వచ్చాయి. అక్కడక్కడ రైతులు కోతకోసి వడ్లను మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇక ఎస్సారెస్సీ ఆయకట్టుకు జనవరి 1నుంచి నీటి విడుదల చేయగా.. ఫిబ్రవరి వరకు కూడా కొందరు నాట్లు వేశారు. దీంతో కొన్ని పొలాలు ఈ తడితో బయటపడ నుండగా.. మరికొన్ని పొలాలకు మరో తడి కావాల్సి ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఎండలు ముదిరి నీటి వాడకం పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు విడుదల చేసే నీళ్లు చివరి వరకు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారంతో షెడ్యూల్ ముగియనుండడంతో చివరి తడిని అందించాలన్న తపనతో రైతులు కాలువ వద్దకు వచ్చి జగడాలు పెట్టుకోవాల్సి వస్తోంది.ఫ జిల్లాకు సోమవారంతో ముగిసిన నీటి విడుదల గడువు ఫ పలుచోట్ల నీళ్లను మళ్లించుకునేందుకు జగడాలు ఫ ఆందోళనలో రైతాంగం -
లక్ష్యం సాధించే వరకు..
లక్ష్యాన్ని సాధించే వరకు విశ్రమించొద్దని గ్రూప్–2 స్టేట్ టాపర్ హర్షవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. - 8లోఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళా రైతు గుండెపునేని లక్ష్మీదామోదర్రావు. ఈమెది మోతె మండలం రావిపహాడ్. ఈమెకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా గతేడాది రెండెకరాల్లో మిర్చి సాగు చేసింది. దీనికోసం రూ.2.50లక్షలు పెట్టుబడి పెట్టింది. మొత్తం 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.20వేలకుపైనే ధర పలకడంతో మొత్తం రూ.6లక్షలు వచ్చాయి. కూలీలకు, పెట్టుబడి ఖర్చులు పోను లాభసాటిగానే ఉంది. కానీ, ఈ సంవత్సరం ఎకరంన్నర సాగు చేయగా రూ.2.35 లక్షల వరకు పెట్టుబడి పెట్టింది. ఇప్పటివరకు ఎనిమిది క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చింది. క్వింటాకు రూ.13వేల చొప్పున అంతా అమ్మినా రూ.లక్షపైచిలుకే వస్తాయి. ఈ సంవత్సరం పెట్టుబడి కూడా వెళ్లే పరిస్థితి లేదని ఆమె వాపోయింది. ఇదీ ఈమె ఒక్కామెదే కాదు జిల్లా వ్యాప్తంగా మిర్చి సాగుచేసిన రైతులందరి పరిస్థితి.ప్రస్తుతం ధర రూ.13 వేలు -
సగం వరకు తాలుకాయలే..
ఈ సంవత్సరం మిర్చిపంట సాగు చేయడం దండుగలా మారింది. పెట్టుబడితోపాటు కూలీల ఖర్చులు పెరిగాయి. దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. పండిన పంటలో సగానికిపైగా తాలుకాయలు వస్తున్నాయి. తాలుకాయలకు సగం ధర కూడా రాదు. దీంతో పూర్తిగా నష్టపోవాల్సి వస్తోంది. – బానోతు రోజా, సండ్రల్తండా, ఆత్మకూర్(ఎస్) మండలం ఆటో చార్జీలు భరించాల్సి వస్తోంది ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని మిర్చిసాగు చేశాను. పె ట్టుబడులు విపరీతంగా పెరి గాయి. గతంలో ఎకరం పంటను ఏరడానికి 50మంది కూలీలు సరిపోయే వారు. ప్ర స్తుతం 70మంది అవసరం అవుతున్నారు. స్థానికంగా కూలీలు దొరక్క వేరే గ్రామాల నుంచి తీసుకురావడానికి ఆటో చార్జీలు భరించాల్సి వస్తోంది. –ఆడెపు ఉప్పయ్య, శెట్టిగూడెం, ఆత్మకూర్(ఎస్) మండలం -
బాధితులకు అండగా ఉంటాం : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ బాధితులకు అండగా ఉంటామని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా పలువురు బాధితులు ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా వారి ఫిర్యాదులను పరిశీలించారు. ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని, ప్రతి అంశాన్ని చట్ట పరిధిలో పరిష్కరించడంలో, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. పదో తరగతి పరీక్షకు 28 మంది గైర్హాజరు సూర్యాపేటటౌన్ : పదో తరగతి పబ్లిక్ పరీక్షలు కొనసాగుతున్నాయి. సోమవారం మూడో రోజు 67 కేంద్రాల్లో ఇంగ్లిష్ పరీక్ష నిర్వహించారు. మొత్తం 11,997 మంది విద్యార్థులకు గాను 11,871 మంది హాజరు కాగా 26 మంది గైర్హాజరైనట్లు డీఈఓ అశోక్ తెలిపారు. నలుగురు ప్రైవేట్ విద్యార్థులకు గాను ఇద్దరు హాజరు కాగా ఇద్దరు విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను స్టేట్ ప్రాజెక్టు అడిషనల్ డైరెక్టర్, సమగ్ర శిక్షా అధికారి రాధారెడ్డి తనిఖీ చేశారు. అలాగే స్క్వాడ్ బృందాలను పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్టు డీఈఓ తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అధ్యయనం గరిడేపల్లి : జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణకు అధ్యయనం చేస్తున్నట్లు జిల్లా రోడ్డు రవాణాశాఖ అధికారి సురేష్‌రెడ్డి వెల్లడించారు. జాతీయ రహదారి 167పై తరచూ ప్రమాదాలు జరిగే గరిడేపల్లి మండలంలోని అప్పన్నపేట స్టేజీ, అబ్బిరెడ్డిగూడెం క్రాస్ రోడ్డు వద్ద గల ప్రాంతాలను ఆయన నేషనల్ హైవే ఏఈ నవీన్, ఎస్ఐ చలికంటి నరేష్‌తో కలిసి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదాలకు దారి తీస్తున్న ప్రధాన కారణాలను వారు అధ్యయనం చేశారు. అతి వేగం, అశ్రద్ధగా వాహనాలు నడపడం, రహదారి మలుపులు, ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడం వంటి అంశాలను విశ్లేషించారు. వాహనదారులకు అవగాహన కల్పించడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, రహదారి సరిగా కనిపించేలా లైటింగ్ ఏర్పాట్లు చేయడం, వేగ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సీపీఐ బలోపేతానికి కృషి చేయాలి భానుపురి (సూర్యాపేట) : సీపీఐ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలని పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేట జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో పట్టణ, మండల కౌన్సిల్ సమావేశాన్ని జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీగా ఎన్నికై న నెల్లికంటి సత్యంను ఘనంగా సన్మానించారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ మునుగోడు ప్రాంతానికి చెందిన సీపీఐ నాయకుడు నెల్లికంటి సత్యంను ఎమ్మెల్సీగా ఎంపిక చేయడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికై న నెల్లికంటి సత్యం, బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఉస్తేల సృజన, దొడ్డా నారాయణరావు, కేవీఎల్, అనంతుల మల్లేశ్వరి, రాములు, ధనుంజయ నాయుడు, నారాయణరెడ్డి, యాదగిరి, వెంకటేశ్వర్లు, శ్రీను, వెంకటేశ్వర్లు, కృష్ణారెడ్డి, హనుమంతరావు, గుండు వెంకటేశ్వర్లు, బూర వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
తడిసి మోపెడవుతున్న ఖర్చులు
ఈ సంవత్సరం మిర్చి రైతులకు మందులు, కూలీలకు ఇచ్చే కూలి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో ఒకటికి నాలుగు సార్లు మందులు పిచికారీ చేయాల్సి వచ్చింది. దీంతో గతంలో ఎకరాకు రూ.10వేలు ఖర్చు పెట్టాల్సి ఉండగా ఈసారి రూ.20వేలుపైనే ఖర్చు పెట్టారు. గతంలో ఎకరం మిర్చి ఏరడానికి 50 మంది కూలీలు అవసరం ఉండగా.. ఇప్పుడు 70 మంది కూలీలు అవసరమవుతున్నారు. దీంతో 20మంది కూలీల ఖర్చు పెరిగింది. గతంలో వచ్చిన దిగుబడి ఈసారి రాకపోవడంతోపాటు పెట్టుబడి పెరిగిందని రైతులు వాపోతున్నారు. -
నష్టాల ఘాటు!
నీరందక తాలుగా మారిన మిరపకాయలుమంగళవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2025మొత్తం సాగు 16,000 తాలుకాయలే అధికం.. గతేడాది క్వింటా ధరరూ.20 వేలపైచిలుకుఫ నీటి కొరత, తెగుళ్లతో తగ్గిన దిగుబడి ఫ గతేడాది కంటే పెరిగిన పెట్టుబడి ఫ ఈ సారి అందని గిట్టుబాటు ధర న్యూస్‌రీల్ -
అవగాహనతోనే ‘క్షయ’ అంతం
బాధితులకు ప్రత్యేక చికిత్స జిల్లాలో క్షయ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వ్యాధి సోకిన వారికి ఆరు నెలల పాటు ఉచితంగా ప్రత్యేక చికిత్స అందిస్తూ.. మందులు పంపిణీ చేస్తున్నాం. క్షయ వ్యాధి వ్యాప్తి చెందకుండా బాధిత కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం. త్వరలో పెద్దలకు కూడా బీసీజీ టీకాలు వేస్తాం. – డాక్టర్ నజియా, క్షయ నిర్మూలన అధికారి ఫ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే మేలు ఫ మూడు వారాలకు మించి దగ్గు ఉంటే టెస్ట్ తప్పనిసరి ఫ వ్యాధి నిర్ధారణ అయితే ఆరు నెలల పాటు చికిత్స ఫ గ్రామాల్లో ముగిసిన ప్రత్యేక శిబిరాలు ఫ నేడు ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం తిరుమలగిరి (తుంగతుర్తి): అవగాహనతోనే క్షయ వ్యాధిని అంతం చేయవచ్చని ప్రభుత్వం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తోంది. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ద్వారా గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించి క్షయవ్యాధి బాధితులను గుర్తిస్తున్నారు. వ్యాధిగ్రస్తులు సకాలంలో మందులు వాడక పోవడంతో ఇతరులకు సోకే ప్రమాదం ఉందని అవగాహన కల్పిస్తున్నారు. బాధితులకు మందులు అందజేస్తూ వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తున్నారు. ప్రతిఏటా మార్చి 24న ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. వంద రోజుల ప్రోగ్రామ్ పూర్తి జిల్లాలోని 23 మండలాల్లో క్షయ వ్యాధి నిర్మూలనకు వంద రోజుల ప్రోగ్రామ్‌ను డిసెంబర్ 7 నుంచి ఈనెల 18వ తేదీ వరకు అమలు చేశారు. ఇందులో భాగంగా క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. క్షయ లక్షణాలు ఉన్నవారిని గుర్తించా రు. అనంతరం వారిని జిల్లా ఆసుపత్రిలో సిబినాట్ యంత్రంతో తెమడ పరీక్షలు, ఎక్స్‌రే ఆధారంగా వ్యాధిగ్రస్తులుగా నిర్ధారిస్తున్నారు. పరీక్షల ఆధారంగా వ్యాధి నిర్ధారణ జరిగితే బాధితులకు ఆరు నెలల నుంచి రెండేళ్ల వరకు చికిత్స అందిస్తారు. 1.05 లక్షల మందికి ప్రాథమిక పరీక్షలు జిల్లాలో ఇప్పటి వరకు 1.05 లక్షల మందికి ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఇందులో 8వేల మందికి ఎక్స్ రే తీసి 475 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఉచితంగా పౌష్టికాహారం కూడా పంపిణీ చేస్తున్నారు. బీసీజీ టీకాలు పెద్దలకు కూడా వేయడానికి ఇప్పటికే అర్హులను గుర్తించి ఆన్లైన్ చేశారు. క్షయ లక్షణాలు, నివారణ చర్యలు మూడు వారాలకు మించి దగ్గు ఉండడం, దగ్గినప్పుడు రక్తం లేదా తెమడ (కఫం) పడడం, చాతీలో నొప్పి రావడం, రాత్రిపూట చెమటలు పట్టడం, అధిక ఉష్ణోగ్రతతో జ్వరం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, ఆయాసంగా ఉండి అనారోగ్యంగా అనిపించడం వంటివి క్షయ వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. వ్యాధివ్యాప్తి చెందకుండా చేతులను తరచూ శుభ్రంగా కడగాలి. దగ్గినప్పుడు మోచేయి లేదా రుమాలును నోటికి అడ్డంగా పెట్టాలి. వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండాలి. -
సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం
హుజూర్నగర్, పాలకవీడు: ఉమ్మడి జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పాలకవీడు మండలం జాన్‌పహాడ్ దర్గా వద్ద నిర్వహించిన కందూరు కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు హాజరయ్యారు. అనంతరం స్థానిక డక్కన్ సిమెంట్ పరిశ్రమ అతిథి గృహంలో రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి వెంకట్‌రెడ్డితో కలిసి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ, డిండి, నెల్లికల్లు, నాగార్జునసాగర్ ఎడుమ కాల్వ, ఏఎంఆర్‌కు మరమ్మతులు చేయిస్తామని అన్నారు. గంధమల్ల ప్రాజెక్టుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని ప్రజాపాలనతో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని మంత్రి చెప్పారు. రోడ్ల అభివృద్ధిలో నంబర్ వన్‌గా ఉంచుతాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిరోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధిలో ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలో నంబర్ వన్‌గా ఉంచుతామని అన్నారు. రూ.వెయ్యి కోట్లతో రైల్వే బ్రిడ్జ్‌లు, రూ.140 కోట్లతో దామరచర్ల వద్ద బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్ర మంత్రి అనుమతి ఇచ్చారన్నారు. బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా గత ప్రభుత్వం పదేళ్లు పెండింగ్‌లో ఉంచిందని, మేము అధికారంలోకి రాగానే పూర్తిచేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించామన్నారు. దేవాదుల ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామన్నారు. దక్షిణ తెలంగాణలో 36 అసెంబ్లీ సీట్లకు కాంగ్రెస్ 32 గెలిచిందని..ప్రజలు మావైపు ఉన్నారనేందుకు ఇది నిదర్శనమన్నారు. ఇవన్నీ తెలియకుండా బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. పదేళ్లు అధికారం ఇస్తే ఏమీ చేయని వారు పన్నెండు నెలలకే కొంపలు మునిగినట్లు మామీద పడుతున్నారని ఎద్దేవా చేశారు. రెండేళ్లలో అన్ని రోడ్లు బీటీగా మారుస్తామని, ఏప్రిల్ రెండవ వారంలో టెండర్లు పిలువనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వివరించారు. జాతీయ రహదారులను సైతం విస్తరించేలా కృషి చేస్తున్నామన్నారు. తొలుత హెలిపాడ్ వద్ద మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలకు కలెక్టర్, అదనపు కలెక్టర్లు స్వాగతం పలికారు. సమావేశంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతిరెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, జైవీర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మందుల సామేలు, వేముల వీరేశం, బాలునాయక్, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, పాడి అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్, సీపీఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం, భూక్యాగోపాల్, మాళోతు మోతీలాల్, సుబ్బారావు పాల్గొన్నారు. ఫ ప్రజా పాలనతో విప్లవాత్మక మార్పులు ఫ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫ జాన్‌పహాడ్ పరిధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ధి పనులపై సమీక్ష -
క్రమబద్ధీకరణకు నిరీక్షణ!
మఠంపల్లి: జిల్లాలోని 23 మండల పరిషత్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సుమారు 70 మంది కంప్యూటర్ ఆపరేటర్లు తమ సర్వీస్ క్రమబద్ధీకరణకు ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని కొంతకాలంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా.. పాలకులు చేస్తామని చెబుతున్నారే తప్ప ఫలితం ఉండడం లేదని ఆపరేటర్లు వాపోతున్నారు. పదేళ్ల నుంచి విధులు.. జిల్లాలోని 23 మండల పరిషత్ కార్యాలయాల్లో 2015 సంవత్సరం నుంచి ఒక్కో కార్యాలయంలో ముగ్గురు చొప్పున 70 మంది ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరంతా ప్రారంభంలో రూ.6వేల వేతనంతో విధుల్లో చేరారు. కాగా వీరి వేతనాన్ని మధ్యలో మూడు పర్యాయాలుగా మొదటిసారి రూ.8వేలుగా, తర్వాత రూ.12వేలుగా, రూ.17,500గా పెంచిన రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నేరుగా రూ.22,500లకు పెంచింది. దీంతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ఆపరేటర్లు ఎంతో సంతోషించారు. అయినప్పటికీ వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అయితే ఎవరూ ఊహించని రీతిలో ప్రభుత్వం కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలను రూ.22,500 నుంచి రూ.19,500కు తగ్గించింది. ఉద్యోగుల వేతనాలు పెంచాల్సింది పోయి తగ్గించడం పట్ల కంప్యూటర్ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకౌంట్లు సేకరించి.. ఇదిలా ఉంటే కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాలను మూడు మాసాల క్రితం గ్రీన్‌చానల్ అనే పద్ధతి ద్వారా నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం బ్యాంకు అకౌంట్లు సేకరించింది. కానీ జిల్లా వాప్తంగా ఆపరేటర్లకు టీఎస్‌బీపాస్ ద్వారా ఒకనెల వేతనం ఇచ్చారు. ఇంకా కొన్ని మండలాల్లో ఆపరేటర్లకు పెండింగ్ వేతనాలు అందాల్సి ఉంది. ఏ కార్యాలయంలోనైనా ఉద్యోగులు ప్రతిరోజూ ఉదయం 10గంటలకు వచ్చి సాయంత్రం 5గంటలకు ఇంటికి వెళతారు. కానీ ప్రభుత్వం తమతో ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ప్రజాపాలన దరఖాస్తులు, ఓటర్ల జాబితా తదితర సర్వేలు ఆన్లైన్ చేయిస్తూ ఒక్కోసారి అర్ధరాత్రి వరకు పనులు చేయించుకుంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రకాల పనులు చేస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి తమకు కనీస వేతనం అందించాలని కంప్యూటర్ ఆపరేటర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఫ ఎంపీడీఓ ఆఫీసుల్లో పదేళ్లుగా విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు ఫ మధ్యలో వేతనం పెంచి తగ్గించడంపై ఆవేదన ఫ పెండింగ్ వేతనాలు కూడా అందించని ప్రభుత్వం ఫ జిల్లాలో 70 మంది సిబ్బంది -
ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలి
భానుపురి: రాష్ట్ర ప్రభుత్వం టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లను నెరవేరేలా కృషిచేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ కోరారు. ఆదివారం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ తరఫున ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు జి.ఏకాంబరం బెల్లి నర్సయ్య, జక్కుల వెంకటేశ్వర్లు జి.వెంకన్న ఎ.శ్రీవర్ధన్రాజు పాల్గొన్నారు. -
ఉగాదికి సన్న బియ్యం
ఫ సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానున్న పథకం ఫ రేషన్‌కార్డుదారులందరికీ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు ఫ ఇప్పటికే మూడు నెలలకు సరిపడా సీఎంఆర్ సేకరణ ఫ సందిగ్ధంలో కొత్త రేషన్కార్డుదారులుప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణీ చేస్తాం ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రేషన్‌కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇందిస్తాం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే మిల్లర్ల నుంచి 14వేల మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌గా తీసుకున్నాం. మండల స్థాయి స్టాక్ పాయింట్లకు అక్కడి నుంచి రేషన్‌దుకాణాలకు సరఫరా చేసి ఏప్రిల్ నుంచి అందిస్తాం. – ప్రసాద్, సివిల్ సప్లయ్ డీఎం, సూర్యాపేట భానుపురి (సూర్యాపేట): రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సన్న బియ్యం ఇవ్వాలని నిర్ణయించింది. రెండు రోజుల క్రితం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లా పర్యటలో మాట్లాడుతూ వచ్చేనెల నుంచి సన్నబియ్యం ఇస్తామని చెప్పడంతో పేదల్లో ఆనందం నెలకొంది. సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఉగాది పర్వదినాన హుజూర్‌నగర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పారరంభించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చకచకా చేసేస్తున్నారు. దొడ్డు బియ్యం బ్లాక్ మార్కెట్‌కు.. జిల్లాలో 3,24,158 రేషన్‌కార్డులు ఉండగా 610 రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం నెలనెలా రేషన్ అందిస్తోంది. ఇప్పటి వరకు నెలకు సుమారుగా 5వేల మెట్రిక్ టన్నుల దొడ్డుబియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తుండగా.. ఈ బియ్యం తినలేక చాలామంది కిలో రూ.10 చొప్పున ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. అవే బియ్యం తిరిగి దళారుల ద్వారా మిల్లర్లు తమ కోటా సీఎంఆర్‌కు ఇస్తున్నారు. ఈ విధంగా ప్రభుత్వం అందించే దొడ్డురకం బియ్యం బ్లాక్ మార్కెట్‌కే చేరుతుండడంతో లబ్ధిదారులకు ప్రయోజనం లేకుండా పోతోంది. ఇచ్చిన హామీ మేరకు.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ 6కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఈ వానాకాలంలో సన్నరకం వడ్ల సాగును పెంచేందుకు బోనస్ చెల్లించింది. ఈ వానాకాలంలో రైతుల నుంచి సేకరించిన సన్నరకం వడ్లను రెండుమాసాలుగా మర ఆడించి మిల్లర్ల ద్వారా పౌరసరఫరాల శాఖ సేకరిస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో 14వేల మెట్రిక్ టన్నుల సన్నరకం బియ్యం నిల్వలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న రేషన్‌దారులకు నెలకు 5వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం ఉండగా.. ప్రస్తుత నిల్వలు 3నెలలకు సరిపడా ఉన్నాయి. అయితే జిల్లాలో నూతన రేషన్ కార్డులకు మాత్రం ఈ సన్నబియ్యం అందుతాయా లేదా అన్నది సందిగ్ధత నెలకొంది. అలాగే ఇప్పటికే రేషన్‌కార్డులు ఉండి పిల్లల పేర్లను చేర్పించిన దాదాపు 52వేల దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉన్నాయి. పిల్లల పేర్ల కోసం వచ్చిన దరఖాస్తులకై నా ఈ నెల చివరి నాటికి మోక్షం కల్పించి సన్నబియ్యం అందిస్తారా.. లేదా అనేది వేచిచూడాల్సిందే. రేషన్ దుకాణాలు 610రేషన్‌కార్డులు 3,24,158ప్రతినెలా ఇచ్చే బియ్యం 5 వేలమెట్రిక్ టన్నులు ప్రస్తుతం బియ్యం నిల్వలు 14వేల మెట్రిక్ టన్నులు -
సీఎం సభా ఏర్పాట్లు పక్కాగా ఉండాలి
ఉగాది పర్వదినాన సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా హుజూర్‌నగర్‌లో రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం సందర్భంగా నిర్వహించే సభా ఏర్పాట్లు పక్కాగా ఉండాలని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం హుజూర్నగర్ పట్టణంలోని ఫణిగిరి గుట్టకు వెళ్లే రోడ్డులో సీఎం సభా ప్రాంగణ ఏర్పాటుకు మంత్రి జిల్లా అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం సభ ఏర్పాట్లపై జిల్లా అధికారులలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీకి ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టామన్నారు. సమావేశంలో కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, ఇరిగేషన్ సీఈ రమేష్‌బాబు, ఆర్టీసీ ఆర్ఎం జానిరెడ్డి, డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి, సీఐ చరమందరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, యరగాని నాగన్న, లక్ష్మీనారాయణరెడ్డి, తన్నీరు మల్లిఖార్జున్, కోతి సంపత్‌రెడ్డి, శివరాంయాదవ్, ఆదెర్ల శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. -
క్రికెట్ బెట్టింగ్‌ల జోలికి వెళ్లొద్దు : ఎస్పీ
సూర్యాపేట టౌన్: ఐపీఎల్ క్రికెట్ సీజన్ ప్రారంభమైనందున యువత బెట్టింగ్‌లు వేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరూ కూడా క్రికెట్ బెట్టింగ్‌లు పెట్టవద్దని పేర్కొన్నారు. బెట్టింగ్‌లు పెట్టి నష్టోయి ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాలను రోడ్డు పాలు చేయొద్దని పేర్కొన్నారు. బెట్టింగ్ ముఠాల నుంచి బెదిరింపులు వస్తాయని, జీవితం విచ్ఛిన్నం అవుతుందని తెలిపారు. ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తి అయ్యాయని, విద్యార్థులు సెలవుల దృష్ట్యా ఖాళీగా ఉంటారని, ఒక్కపూట బడులతో మిగతా చిన్నారులు కూడా ఇళ్ల వద్ద ఉంటారని వారి పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. అవసరానికి మించి విద్యార్థులకు డబ్బులు సమకూర్చవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ మ్యాచులు ప్రారంభం అయ్యాక మీ పిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పులు కనబడితే వెంటనే కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు. ఎస్సారెస్పీ 11ఆర్ మైనర్‌కు మరమ్మతులు అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం శివారు కుడితిగుట్ట వద్ద గండి పడిన ఎస్సారెస్పీ 11ఆర్ మైనర్ కాలువకు ఆదివారం నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతులు చేయించారు. ఎస్సారెస్పీ 11ఆర్ మైనర్‌కు గండి శీర్షికన ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. నీటిపారుదల శాఖ ఏఈ హరిస్వరూప్ వెంటనే గండిపడిన చోటకు వెళ్లి పరిశీలించారు. మట్టిపోయించి తాత్కాలిక మరమ్మతులు చేయించారు. దీంతో నీళ్లు వృథాగా పోవడం ఆగాయి. ఇందుకు కృషిచేసిన ‘సాక్షి’కి, అధికారులకు రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మట్టపల్లిలో నిత్యారాధనలు మఠంపల్లి: మట్టపల్లి క్షేత్రంలో ఆదివారం విశేష పూజలు, నిత్యారాధనలు కొనసాగాయి. అనంతరం శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి వారిని వధూవరులుగా అలంకరించి ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. ఆ తర్వాత విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మదుఫర్కపూజ, తలంబ్రాలతో అర్చకులు నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. నారసింహుడికి సంప్రదాయ పూజలుయాదగిరిగుట్ట రూరల్: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ఆదివారం సంప్రదాయ పూజలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు మేల్కొలుపులో భాగంగా స్వయంభూవులకు సుప్రభాత సేవ చేపట్టారు. ఆ తర్వాత స్వామి, అమ్మవార్లకు ఆరాధన, నిజాభిషేకం, అర్చన సేవలు గావించారు. ఇక ఆలయ ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరం, ప్రాకార మండపాల్లో శ్రీ సుదర్శన నారసింహాహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, వేద ఆశీర్వచనం, తదితర కై ంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవలను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి శయనోత్సవం జరిపించి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు. -
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో ధర్మదర్శనానికి సుమారు రెండు గంటల సమయం, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారికి నిత్యాదాయం రూ.49,28,666 సమకూరిందని ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు. విద్యుదాఘాతంతో రైతు మృతిమద్దిరాల: విద్యుదాఘాతానికి గురైన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం చిన్ననెమిలా గ్రామానికి చెందిన యాట సైదులు(51) తన వ్యవసాయ పొలం వద్ద శనివారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ కల్వల శ్రీనివాస్ తెలిపారు. మృతుడి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
ఎన్నికల్లో ఇచ్చినహామీలను అమలు చేయాలి
రామన్నపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఆదివారం రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో సీపీఎం మండలశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాచైతన్య పాదయాత్ర ప్రారంభ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా కేంద్ర ప్రభుత్వం యేటా రెండు కోట్ల ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఎన్నికల వాగ్దానాలను ఎలా అమలు చేస్తాయాని ప్రశ్నించారు. డ్రైపోర్ట్ పేరుతో రైతులను మభ్యపెట్టి కొనుగోలు చేసిన భూముల్లో కాలుష్యకారక పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. డీలిమిటేషన్లో భాగంగా రామన్నపేట అసెంబ్లీ నియోజకవర్గంను పునరుద్ధరించాలని, రామన్నపేట ఆస్పత్రి స్థాయిని వంద పడకలకు పెంచాలని, ధర్మారెడ్డిపల్లి, పిల్లాయిపల్లి కాలువలను పూర్తిచేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఇరవై ఏళ్లుగా కాలువల పనులు కాంట్రాక్టర్లకు వరప్రదాయినిగా మారాయని ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలను పరిష్కరించే వరకు పార్టీ పోరాడుతుందని తెలిపారు. పాదయాత్రకు పార్టీలకతీతంగా సంఘీభావం తెలపాలని కోరారు. పాదయాత్రలో భాగంగా సీపీఎం నాయకులు ప్రతిపాదిత అంబుజా సిమెంట్ పరిశ్రమ గేటు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో ఎండిన వరి పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ్య, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, జెల్లెల పెంటయ్య, బూర్గు కృష్ణారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, పాదయాత్ర బృందం సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, బోయిని ఆనంద్, కందుల హన్మంత్, గన్నెబోయిన విజయభాస్కర్, వేముల సైదులు, గొరిగె సోములు, బొడిగె రజిత, మేడి గణేష్, కొమ్ము అంజమ్మ, శానగొండ రాము తదితరులు పాల్గొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
రూ.230.84 కోట్లకు చేరుకున్న డిపాజిట్లు
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డిపాజిట్లు రూ.230.84 కోట్లకు చేరుకొందని బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్ అన్నారు. ఆదివారం పోచంపల్లి పట్టణ కేంద్రంలోని చేనేత టై అండ్ డై భవనంలో బ్యాంక్ 50వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2025–26 ఆర్థిక సంవత్సరం అంచనా బడ్జెట్‌ను ఆమోదించారు. అలాగే బ్యాంకు ఆర్థిక పరిస్థితి, వాయిదా మీరిన బాకీలపై నివేదిక చదివి వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్యాంక్ ద్వారా ఇప్పటి వరకు రైతులు, వ్యాపారులు, ప్రజలకు రూ.164.08 కోట్ల మేర రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. ప్రస్తుతం 10 బ్రాంచ్‌ల ద్వారా బ్యాంక్ సేవలందిస్తున్నామని, త్వరలో రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, కల్వకుర్తిలో నూతన బ్రాంచ్‌లను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా మరో 8 బ్రాంచ్‌లకు ఆర్బీఐ అనుమతులు ఇచ్చిందని తెలిపారు. ఖాతాదారులకు నాణ్యమైన సేవలందిస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ సీత శ్రీనివాస్, వైస్ చైర్మన్ భారత రాజేంద్రప్రసాద్, డైరెక్టర్లు కర్నాటి వెంకటబాలసుబ్రహ్మణ్యం, ఏలే హరిశంకర్, సూరెపల్లి రమేశ్, రాపోలు వేణు, గుండు కావ్య, కర్నాటి భార్గవి, కొండమడుగు ఎల్లస్వామి, బిట్టు భాస్కర్, మక్తాల నర్సింహ, సీత హరినాథ్, సీత సత్యనారాయణ, రంగయ్య, కుడికాల బాల్‌నర్సింహ, సిద్దిరాములు, కొండ శంకరయ్య, భోగ విష్ణు, బండి యాదగిరి, సీనియర్ మేనేజర్ రాచకొండ మధుసూదన్, మేనేజర్ రచ్చ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ తడక రమేశ్ -
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది
ఆత్మకూర్(ఎస్): కాంగ్రెస్ ప్రభుత్వం చేయని రుణమాఫీ చేసినట్లుగా గొప్పలు చెప్పుకుంటూ రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆత్మకూర్(ఎస్) మండల పరిధిలోని పాత సూర్యాపేటలో మాజీ సర్పంచ్ పొన్నాల సంజీవరెడ్డి విగ్రహాన్ని ఆయనఆవిష్కరించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అబద్ధాలు చెబుతుందని విమర్శించారు. అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ రైతు సమస్యలపై ప్రశ్నిస్తుంటే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం దుర్మార్గమన్నారు. బ్యాంకులు చెప్పిన దానికి, కేబినెట్, బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పేసరికి 30 శాతం రుణమాఫీ కూడా కాలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ఎత్తేస్తున్నారని, మంత్రులు సంక్షేమం మరిచి జేబులు నింపుకుంటున్నారని, అసమర్ధ ప్రభుత్వాన్ని ఎలా భరించాలని ప్రజలు ఆవేదన పడుతున్నారని అన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ విషయంలో కుట్రలు చేస్తోందని, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని, డీలిమిటేషన్ విషయంలో బీజేపీ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లో సాగనీయమని, తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తూడి నరసింహారావు, నాయకులు గోపగాని వెంకటనారాయణగౌడ్, నిమ్మల శ్రీనివాస్, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, ముద్దం కృష్ణారెడ్డి, బత్తుల ప్రసాద్, పన్నాల అలివేల, కసగాని బ్రహ్మం, జీడి భఇక్షం, ముద్దం మధుసూదన్‌రెడ్డి, గోపగాని మల్లయ్య తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి -
పిడుగుపాటుతో రెండు ఆవులు మృతి
దేవరకొండ: పిడుగు పడి రెండు ఆవులు మృతి చెందాయి. దేవరకొండ మండలం కాసారం గ్రామానికి చెందిన రైతు అబ్బనోని నాగయ్య తనకున్న రెండు పాడి ఆవులను శనివారం రాత్రి తన వ్యవసాయ బావి వద్ద చెట్టుకు కట్టేసి ఉంచాడు. రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆ సమయంలో పిడుగు పడి రెండు ఆవులు మృతిచెందాయి. ఆవుల విలువ రూ.1.20లక్షలు ఉంటుందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు. నకిలీ కరెన్సీ నోట్ల చలామణినడిగూడెం: నడిగూడెం మండల కేంద్రంలో నకిలీ రూ.100 నోట్లు చలామణి అవుతున్నాయని చిరు వ్యాపారులు ఆరోపిస్తున్నారు. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన కరెన్సీ నోట్లు నీటితో తడిస్తే మరకలు పడవని, కానీ తమ వద్దకు వచ్చిన కొన్ని రూ.100 నోట్లపై నీటితో తడిస్తే ఏర్పడిన మరకలు ఉన్నట్లు చిరు వ్యాపారులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి నకిలీ నోట్లు చలామణి కాకుండా చూడాలంటున్నారు. చెరువులో మునిగి యువకుడి మృతి తిరుమలగిరి: చెరువులో మునిగి యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధి అనంతారంలో ఆదివారం సాయంత్రం జరిగింది. అనంతారం గ్రామానికి చెందిన శీల శ్రీకాంత్(28) గేదెలను మేపడానికి గ్రామ పరిధిలోని పెద్ద చెరువు దగ్గరకి వెళ్లాడు. గేదెలు చెరువులోకి వెళ్లడంతో వాటిని బయట తోలుకురావడానికి చెరువులోకి వెళ్లి ఈత రాకపోవడంతో నీట మునిగి మృతిచెందాడు. మృతుడికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. వైజాగ్ కాలనీలో ఈతకు వెళ్లి.. చందంపేట: నేరేడుగొమ్ము మండలం కాచరాజుపల్లి సమీపంలోని పుష్కర ఘాటు వద్ద నీట మునిగి హైదరాబాద్‌లోని బోడుప్పల్కి చెందిన శ్రీరామోజు ఉదయ్‌కిరణ్(22) మృతిచెందాడు. శనివారం నలుగురు స్నేహితులతో కలిసి వైజాగ్ కాలనీకి వచ్చిన ఉదయ్‌కిరణ్ ఆదివారం ఉదయం కాచరాజుపల్లి పుష్కర ఘాటు వద్ద ఈతకు వెళ్లి నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి తండ్రి రాజేష్ కన్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు నేరేడుగొమ్ము ఎస్ఐ సతీష్ తెలిపారు. రైతులను ఢీకొట్టిన లారీ● ఒకరికి తీవ్ర గాయాలు మిర్యాలగూడ అర్బన్: ధాధాన్యం అమ్మకానికి వచ్చిన రైతులు రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణలో ఆర్టీఓ కార్యాలయం సమీపంలో ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు.. దామరచర్ల మండలం కేశవాపురం గ్రామానికి చెందిన రైతులు జానకిరాములు, బచ్చు శ్రీను ట్రాక్టర్లో ధాన్యం లోడుతో మిర్యాలగూడ పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం సమీపంలో గల రైస్ మిల్లు వద్ద నార్కట్‌పల్లి–అద్దంకి రహదారిపై నిలిపారు. హోటల్లో భోజనం చేసిన అనంతరం రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన లారీ వారిద్దరిని ఢీకొట్టింది. జానకిరాములుకు తీవ్ర గాయాలు కాగా, బచ్చు శ్రీనుకు స్వల్ప గాయాలయ్యాయి. అంబులెన్స్‌లో వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. జానకిరాములు పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మిర్యాలగూడ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మల్చింగ్ పద్ధతిలో సాగు.. లాభాలు బాగు
తీసుకోవాల్సిన జాగ్రత్తలుమల్చింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి. భౌగోళిక పరిస్థితులను, నేల స్వభావాన్ని బట్టి మల్చింగ్ చేసుకోవాలి. మల్చింగ్‌తో పాటు సూక్ష్మనీటి పద్ధతులను అవలంబిస్తే నీటి వనరులు వృథాకాకుండా సమర్ధవంతంగా ఉపయోగించుకోవచ్చు. సాగు చేసే పంటలను బట్టి మల్చింగ్ను ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కువ విస్తీర్ణంలో మల్చింగ్ను చేయదలిస్తే అందుబాటులో ఉండే వనరులను మల్చింగ్ పదార్ధాలుగా ఉపయోగించడం మేలు. నడిగూడెం: ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి కారణంగా పంటల సాగుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు అంటున్నారు. బోర్లు, బావుల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న నీటిని సమర్ధవంతంగా ఉపయోగించి పంటలను సాగు చేసేందుకు మల్చింగ్ పద్ధతి తోడ్పడుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భజలాలు అడుగంటిపోవడం వల్ల ఉద్యానవన పంటలకు సరిపడేంత నీటిని అందించడం రైతులకు తలకు మించిన భారంగా మారింది. దీని నుంచి బయట పడేందుకు రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులను పాటించినట్లయితే అందుబాటులో ఉన్న నీటి వనరులను ఉపయోగించుకొని పంటలను సమర్ధవంతంగా సాగు చేసుకోవచ్చని సీనియర్ హార్టికల్చర్ కన్సల్టెంట్ సుందరి సురేష్‌కుమార్ చెబుతున్నారు. మల్చింగ్ అంటే ఏమిటి.. సారవంతమైన మట్టిని పట్టి ఉంచడంతో పాటు నేలలోని తేమను ఎక్కువ కాలం ఉంచేలా మొక్క చుట్టూ పలు రకాలైన పదార్ధాలను పరచి ఉంచడాన్నే మల్చింగ్ అంటారు. దీని వలన తేమ ఆవిరైపోకుండా మొక్క చుట్టూ ఎక్కువ కాలం ఉంటుంది. మల్చింగ్‌కు ప్లాస్టిక్ పట్టాలతో పాటు కాగితపు ముక్కలు, సేంద్రియ పదార్ధాలు, వరి గడ్డి, వ్యవసాయ వ్యర్ధాలు తదితర వాటిని ఉపయోగిస్తారు. మల్చింగ్ విధానంతో లాభాలు పంట కాలంలో మల్చింగ్ చేయడం వలన నేలలోని తేమ ఆవిరి కాకుండా ఎక్కువ రోజులు మొక్క మొదలు భాగంలో ఉంటుంది. తేమను పరిరక్షించడమే కాకుండా ఉష్ణోగ్రత వ్యత్యాసాల వలన నేల భౌతిక స్థితి దెబ్బతినకుండా ఉంటుంది. నేలలోని సారవంతాన్ని కాపాడటంలో ఈ మల్చింగ్ ప్రధాన పాత్ర వహిస్తుంది. పంటలు సాగు చేయని కాలంలో సారవంతమైన మట్టిని కప్పి ఉంచుతుంది. మొక్కల మధ్య మల్చింగ్ పదార్ధాలు ఉండడం వలన కలుపును బాగా నియంత్రిస్తుంది. దీని వలన పోషకాలన్నీ మొక్కలు తీసుకొనేందుకు వీలుంటుంది. నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. నేలలో పోషకాల స్థాయి కూడా సహజ సిద్ధంగా పెరుగుతుంది. ఈ మల్చింగ్ విధానాన్ని దీర్ఘకాలంగా చేస్తే పంటల్లో గణనీయమైన పెరుగుదలతో పాటు చీడపీడలను సమర్ధవంతంగా తట్టుకొనే శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా పంటల ఉత్పాదనలో కూడా మెరుగుదల కన్పిస్తుంది. -
మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం కృషిచేస్తోంది
కోదాడ: ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతర కృషిచేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కోదాడకు చెందిన రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండీ జబ్బార్ నివాసంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి పాల్గొని మాట్లాడారు. రెండు దశాబ్దాలుగా కోదాడ, హుజూర్నగర్ ప్రాంతాలకు చెందిన మైనార్టీల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్లు తెలిపారు. కోదాడలో ఈద్గా అభివృద్ధికి నిధులు మంజూరు చేయంచానని పేర్కొన్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఇఫ్తార్ విందులో పాల్గొని ముస్లింలకు స్వయంగా వడ్డించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్, చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, ఏర్నేని బాబు, పారా సీతయ్య, అల్తాఫ్ హుస్సేన్, మునావర్, కందుల కోటేశ్వరరావు, బాగ్దాద్, బాజాన్, కేఎల్ఎన్. ప్రసాద్, ఈదుల కృష్ణయ్య, రామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి -
లీలావతికి సీ్త్రశక్తి జాతీయ పురస్కారం
హుజూర్‌నగర్‌రూరల్: హుజూర్నగర్ మండలం గోపాలపురం గ్రామానికి చెందిన విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర అధ్యక్షురాలు చీకూరి లీలావతికి సీ్త్రశక్తి జాతీయ పురస్కారం లభించింది. ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా లీలావతి చేసిన పలు సేవా కార్యక్రమాలను గుర్తించి ఆమెకు సీ్త్రశక్తి జాతీయ పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మీనగ గోపిబోయ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా అశ్వవాహన సేవమేళ్లచెరువు: మేళ్లచెరువు మండల కేంద్రం పరిధిలోని మైహోం సిమెంట్ పరిశ్రమలో గల శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి 27వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఐదో రోజు తిరువీధి ఉత్సవం, అశ్వవాహన సేవ, దోపోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో త్రిదండి రామానుజ చినజీయర్ స్వావి, మైహోం గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు,శ్రీకుమారి దంపతులు, మునగాల రామ్మోహన్రావు,అరుణ దంపతులు, యూనిట్ హెడ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యభువనగిరి: చేయని తప్పుకు నింద మోపారని మనస్తాపానికి గురైన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భువనగిరి మండలం తుక్కాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కాపురం గ్రామానికి చెందిన ఎలకొండ సంజీవరెడ్డి కుమారుడు నవీన్‌రెడ్డి(45) సంజీవరెడ్డి సోదురుడి బావి వద్ద పైపులైన్ పగులగొట్టాడని శనివారం గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టారు. తాను పైపులైన్ పగులగొట్టలేదని నవీన్‌రెడ్డి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన నవీన్‌రెడ్డి ఆదివారం తెల్లవారుజామున తన బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఏ తప్పు చేయలేదని, తన బంధువులు తప్పుడు ఆరోపణ చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని తన ఫోన్‌తో మెసేజ్ పెట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్‌కుమార్ తెలిపారు. -
ఫాంపాండ్‌లో మునిగి ఇద్దరు యువకులు మృతి
చిట్యాల: ఫాంపాండ్‌లో మునిగి ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన చిట్యాల మండలం ఏపూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివారం జరిగింది. చిట్యాల ఎస్ఐ ఎన్. ధర్మా తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మేస్త్రీ పనిచేసే నలపరాజు రాములు కుమారుడు నవీన్‌కుమార్(23), రసూల్పూర్ గ్రామానికి చెందిన హోంగార్డు చింతపల్లి లింగరాజు కుమారుడు రాఘవేంద్ర(20), నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లి గ్రామానికి చెందిన కడెం తరుణ్ స్నేహితులు. వీరు ముగ్గురు నల్లగొండలోని మార్కోని ఐటీఐ కాలేజీలో చదువుకున్నారు. ఐటీఐ పూర్తయిన తర్వాత ఏడాది క్రితం వీరు ముగ్గురు కలిసి చిట్యాల మండలం ఏపూరు గ్రామ పంచాయతీ పరిధిలోని డీఈసీ పరిశ్రమలో ఎలక్ట్రికల్ విభాగంలో అప్రెంటిస్‌గా చేరారు. అప్రెంటిస్ పూర్తిచేసి అదే పరిశ్రమలోని ఎలక్ట్రికల్ ప్యానెల్ మోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ విభాగంలో ఉద్యోగాలు చేస్తున్నారు. శనివారం రాత్రి వరకు పరిశ్రమలో విధులు నిర్వహించిన వీరు రాత్రి పరిశ్రమలో ఉండిపోయారు. ఫాంపాండ్లోకి దిగి.. సెలవు రోజు కావడంతో ఆదివారం కూడా పరిశ్రమలోనే ఉన్న నవీన్‌కుమార్, రాఘవేంద్ర, తరుణ్ మధ్యాహ్నం 12గంటల సమయంలో పరిశ్రమ ఆవరణలోని ఓ చివరలో నిర్వహిస్తున్న గోశాల సమీపంలో నీటి అవసరాల కోసం తీసిన ఫాంపాండ్ వద్దకు చేరుకున్నారు. మొదట నవీన్‌కుమార్ ఫాంపాండ్లోకి ఒకస్కారిగా దూకాడు. వెంటనే ఈత రాకపోయినప్పటికీ రాఘవేంద్ర ఫాంపాండ్లోకి దూకి నవీన్‌కుమార్‌ను పట్టుకున్నాడు. ఇద్దరు నీటిలో మునిగిపోతుండటంతో ఒడ్డున ఉన్న తరుణ్ తన షర్ట్‌తో వారిద్దరిని బయటికి లాగే ప్రయత్నం చేయగా.. ఇతడు కూడా ఫాంపాండ్లోకి జారి పడిపోబోయాడు. తరుణ్ తేరుకుని ఫాంపాండ్ చివరలో దొరికిన ప్లాస్టిక్ పట్టా అంచును పట్టుకుని బయటికి వచ్చి.. కొద్ది దూరంలో ఉన్న ఇతర కార్మికులకు విషయం తెలియజేశాడు. వారు వచ్చి నీటిలో మునిగిపోతున్న నవీన్‌కుమార్, రాఘవేంద్రను బయటికి తీయగా.. అప్పటికే వారిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే నార్కట్‌పల్లిలోని కామినేని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుల కుటుంబాలకు డీఈసీ పరిశ్రమ యజమాన్యం తగిన పరిహారం అందించి ఆదుకోవాలని బందువులు కోరుతున్నారు. ప్రాణాలతో బయటపడిన మరో యువకుడు చిట్యాల మండలం ఏపూరు గ్రామ పరిధిలోని డీఈసీ పరిశ్రమలో ఘటన -
ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలు ప్రకటించాలి
సూర్యాపేటటౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డీఏలను వెంటనే ప్రకటించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ ప్రభుత్వాన్ని చేశారు. టీఎస్ యూటీఎఫ్ సూర్యాపేట జిల్లా కమిటీ సమావేశాన్ని ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు ఎన్. సోమయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న సప్లమెంటరీ బిల్లులను మార్చి నెల చివరి నాటికి చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు, ప్రాథమిక విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు గాను మండల కేంద్రాలు, మేజర్ గ్రామ పంచాయతీల్లోని ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేసి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని కోరారు. ప్రతి తరగతికి 20 మంది విద్యార్థులు, ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండేలా, ప్రధానోపాధ్యాయులు అదనంగా ఉండేలా తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను నిర్వహించాలన్నారు. డిటెన్షన్ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయకూడదని సూచించారు. కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్‌కుమార్, అరుణభారతి, జి. వెంకటయ్య, నాగేశ్వరరావు, బి. ఆడం, బి. రమేష్, డి. శ్రీనివాసాచారి, ఎన్. వెంకటేశ్వర్లు, ఆర్. శీనయ్య, అభినవ్, ఆర్. శ్రీను, పి. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కుటుంబాన్ని చిదిమేసిన నిర్లక్ష్యం
చివ్వెంల (సూర్యాపేట): బంధువులందరితో కలిసి సంతోషంగా ఉప్పలమ్మ పండుగ జరుపుకున్నారు.. పిల్లాపాపలతో కలిసి ఉల్లాసంగా గడిపారు. వారి సంతోషాన్ని చూసి మృత్యువుకు కన్నుకుట్టిందేమో.. కుటుంబాన్ని మొత్తం ఒకేసారి కబలించింది. బంధువుల ఇంట్లో పండుగకు వెళ్లి తిరుగు ప్రయాణమైన ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైంది. తీవ్ర గాయాలపాలైన ఓ బాలుడు అనాథగా మిగిలాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామ శివారులో సూర్యాపేట–ఖమ్మం రహదారిపై ఆదివారం జరిగింది. నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్‌తో.. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కంటయపాలెం గ్రామానికి చెందిన గడ్డం రవీందర్ (34) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య రేణుక (29), కుమార్తె రిషిత (7), కుమారుడు రిషిక్రిష్ణ ఉన్నారు. ఆదివారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం కోటపహాడ్ గ్రామంలో రేణుక మేనమామ కోతి జనార్ధన్ ఇంట్లో ఉప్పలమ్మ పండుగ కోసం రవీందర్ కుటుంబంతో కలిసి కారులో హైదరాబాద్ నుంచి కోటపహాడ్‌కు వచ్చాడు. పండుగ ముగిసిన అనంతరం ఆదివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో పాటు అతడి బావమరిది గంధం మధు, అతడి కుమార్తె సాన్విక, కుమారులు గగన్ చందర్, మల్లికార్జున్, అర్వపల్లి మండలం పర్సాయిపల్లి గ్రామానికి చెందిన రవీందర్ బంధువు కడారి పుష్ప, ఆమె కుమారులు హర్షిత్, జాగ్విన్ కలిసి కారులో హైదరాబాద్‌కు బయల్దేరారు. కారు బీబీగూడెం గ్రామ శివారులోకి రాగానే సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న వీరి కారును బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారు డ్రైవింగ్ చేస్తున్న రవీందర్, అతడి భార్య రేణుక, కుమార్తె రిషిత అక్కడికక్కడే మృతిచెందారు. రవీందర్ కుమారుడు రిషిక్రిష్ణతోపాటు మరో ఇద్దరు చిన్నారులు హర్షిత్, గగన్ చందర్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. రవీందర్, రేణుక తలలు ఛిద్రం కావడంతో పోస్టుమార్టం సోమవారం చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఒక్కపూట ఉండమన్నా ఉండలే.. ఒక్కపూట ఉండి వెళ్లమని చెప్పినా వినకుండా హైదరాబాద్‌కు బయల్దేరిన అరగంట లోపే తమవారి మరణవార్త తెలియడంతో మృతుల బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఒక్కపూట గ్రామంలో ఆగినా ఈ ఘోర ప్రమాదం తప్పేదని వాపోయారు. -
Suryapet: ఘెర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
సూర్యాపేట జిల్లా: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. చివ్వెంల మండలం బీబీ గూడెం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంలో మరణించి వారిలో ముగ్గురిని గడ్డం రవి, గడ్డం రేణుకు, గడ్డం రీతులుగా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. కారు నుజ్జు నుజ్జు కావడంతో వీరు స్పాట్ లో మరణించారు. గడ్డం రవి, ఇతర బంధువులు కలిసి మోతె మండలం కోటపహాడ్ లో శుభకార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. బస్సును కారు బలంగా ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతిహనుమకొండ జిల్లా హసన్పర్లి మండలం చెరువు కట్ట వద్ద మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ లారీ ఢీ కొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడక్కడే దుర్మరణం చెందారు. మృతులు సీతం పేటకు చెందిన మహేష్, పవన్ లుగా గుర్తించారు పోలీసులు. -
‘ఎస్ఎల్బీసీ టన్నెల్ స్టార్టింగ్.. ఎండింగ్ ఎక్కడ ఉందో తెలుసా?’
సాక్షి, సూర్యాపేట జిల్లా: కేటీఆర్ ఓ పిలగాడంటూ వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. పదేళ్లు దక్షిణ తెలంగాణను కేసీఆర్ ముంచాడని.. కేటీఆర్‌కు జిల్లాకు వచ్చే హక్కే లేదంటూ వ్యాఖ్యానించారు. పాలకవీడు మండలం జానపహాడ్ లో మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి మీడియా సమావేశంలో నిర్వహించారు.ఈ సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ టన్నెల్ స్టార్టింగ్.. ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉందో జగదీష్ రెడ్డికి తెలుసా అంటూ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు జిల్లా పరిషత్‌లను గెలుస్తాం. ఎస్ఎల్బీసీ సొరంగాన్ని వైఎస్సార్ చొరవతో ప్రారంభించుకున్నాం. ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోవడం బాధాకరం. ఎస్ఎల్బీసీ సొరంగంపై రేపు(సోమవారం) సీఎం సమీక్షించనున్నారు. 85 శాతం పూర్తయిన బ్రాహ్మణ వెల్లంలను కేసీఆర్ పూర్తి చేయలేదు’’ అని కోమటిరెడ్డి పేర్కొన్నారు.ఉత్తమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 30న ఉగాది నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తున్నామని.. సీఎం చేతుల మీదుగా హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి పథకాన్ని ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. 80 శాతం ప్రజలు రేషన్ బియ్యాన్ని తినడం లేదు. రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు అమ్ముకుంటున్నారు. తెలంగాణలో 84 శాతానికి సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నాం’’ అని ఉత్తమ్ తెలిపారు. -
యూట్యూబర్ సన్నీయాదవ్‌పై లుకౌట్ నోటీసులు
సాక్షి, సూర్యాపేట జిల్లా: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పోలీసులు పట్టు బిగిస్తున్నారు. యూట్యూబర్ సన్నీయాదవ్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సన్నీ యాదవ్‌పై నూతనకల్ పీఎస్‌లో కేసు నమోదైంది. యూట్యూబ్ వీడియోలతో బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేస్తున్న సన్నీయాదవ్‌పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి సూర్యాపేట జిల్లా ఎస్పీ సోషల్ మీడియా ఖాతాకు ట్యాగ్ చేసిన సంగతి తెలిసిందే.ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టిన సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు.. సన్నీ యాదవ్ కోసం గాలిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రానికి చెందిన సన్నీ యాదవ్ సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి. అయితే, లండన్‌లో ఉన్న అతనిపై సూర్యాపేట జిల్లా సైబర్ క్రైం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. -
నల్లగొండ కలెక్టరేట్ ఎదుట వీఓఏల ధర్నా
నల్లగొండ టౌన్ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రూ.20 వేల వేతనం అమలు చేయాలని వీఓఏల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. వివిధ కారణాలతో తొలగించిన వీఓఏలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డికి వినతిపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో చిలుముల దుర్గయ్య, సులోచన, పోలె సత్యనారాయణ, కె.చంద్రకళ పాల్గొన్నారు. -
మోదీ పాలనలో దేశం తిరోగమనం
భానుపురి (సూర్యాపేట): ప్రధాని నరేంద్రమోదీ పాలనలో దేశం తిరోగమనం వైపు పయనిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. శుక్రవారం సూర్యాపేటలో పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కమిటీ, మండల కార్యదర్శుల సంయుక్త సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలో మూడో సారి అధికారంలోకి వచ్చిన మోదీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ కార్పొరేట్ శక్తులకు ప్రయోజనాలు చేకూర్చేలా పాలన కొనసాగిస్తున్నారన్నారు. బీజేపీయేతర రాష్ట్రాలపై కక్షగట్టి అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు ఇవ్వకుండా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రతిష్టపాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రాల హక్కులను హరించి వేస్తూ కేంద్రమే పెత్తనం చేయాలని చూస్తోందన్నారు. పెరుగుతున్న ధరలను, నిరుద్యోగాన్ని అదుపు చేయడంలో కేంద్రం పూర్తిగా వైఫలమైందన్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలపై హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తుందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో డీలిమిటేషన్ పేరుతో పార్లమెంట్ సీట్ల సంఖ్యను కుదించే ఆలోచనను విరమించుకోవాలన్నారు. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉండి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రాబట్టకుండా ఉత్సవ విగ్రహాలుగా మిగిలారని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు మేకనబోయిన శేఖర్, వేల్పుల వెంకన్న, జె.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ఫ సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి -
టెన్త్ ప్రశ్నపత్రం లీక్‌పై గోప్యంగా విచారణ
నకిరేకల్, శాలిగౌరారం : పదో తరగతి పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలు ప్రారంభమైన 15 నిముషాలకే తెలుగు ప్రశ్నపత్రం లీకై ంది. లీకై న ప్రశ్నాపత్రం ఏకంగా శాలిగౌరారానికి చెందిన పలువురి యువకుల వ్యక్తిగత వాట్సాప్‌లలో చక్కర్లు కొట్టడంతో యువకులు ఆ ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు సంబంధించిన జవాబులను టెస్ట్‌పేపర్‌లోని నుంచి చించి వాటిని ఒకే పేపర్లో వచ్చేవిధంగా జిరాక్స్‌లు తీసి స్థానిక పరీక్ష కేంద్రాల్లోకి పంపించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద హల్చల్ చేశారు. టెన్త్ తెలుగు పేపర్ లీకై న విషయం శాలిగౌరారంలో వెలుగులోకి రావడంతో అధికారులు మండలకేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు చేరుకుని ప్రశ్నాపత్రం లీకై న సంఘటనపై గోప్యంగా విచారణ జరిపారు. మండలకేంద్రంలోని పరీక్ష కేంద్రాలకు నల్లగొండ ఆర్డీఓ అశోక్‌రెడ్డి, శాలిగౌరారం సీఐ కొండల్‌రెడ్డి, తహశీసీల్దార్ యాదగిరి, ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఎంఈఓ సైదులు చేరుకొని విచారణ జరిపారు. అనంతరం నకిరేకల్‌కు చేరుకొని నకిరేకల్‌లోని గురుకుల పాఠశాల పరీక్ష కేంద్రాన్ని నల్లగొండ ఆర్డీఓతో పాటు డీఈఓ భిక్షపతి, తహసీల్దార్ జమురుద్దీన్, ఎంఈఓ నాగయ్య విచారణ జరిపారు. గుర్తుతెలియని వ్యక్తి వచ్చి పరీక్ష కేంద్రంలోని విద్యార్థిని నుంచి ప్రశ్నపత్రం ఫొటో తీసుకొని వెళ్లినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న ముగ్గురు ఇనిజిలెటర్లను విధుల్లోనుంచి రిలీవ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు, సిబ్బందిపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. చీఫ్ సూపరింటెండెంట్‌ను, డిపార్ట్మెంటల్ ఆఫీసర్‌ను పరీక్ష విధుల నుంచి తొలగించింది. ఒక ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది. 45 నిమిషాలు ఆలస్యంగా విద్యార్థులు బయటకు.. పరీక్ష సమయం 12.30 గంటలకు ముగిసినప్పటికీ అధికారులు శాలిగౌరారంలోని పరీక్ష కేంద్రాల్లో ప్రశ్నాపత్రం లీకై న సంఘటనపై విచారణ జరుపడంతో 1.15 గంటలకు విద్యార్థులను బయటికి పంపారు. లీకై న పేపర్ ఫొటోతో పరీక్ష కేంద్రాల్లో క్షుణ్ణంగా విచారణ జరిపారు. వాట్సప్‌లో లీకై న పేపర్ సీరియల్ నెంబర్‌ను, మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రాల్లోని పేపర్ సీరియల్ నంబర్లను సరి చూశారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసిన తర్వాతా ఉన్నతాధికారుల ఆదేశంతో విద్యార్థులను బయటకు పంపిచారు. -
ఉమ్మడి జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్న మిస్‌వరల్డ్ పోటీదారులు
ఇటీవలే యాదగిరి క్షేత్రాన్ని సందర్శించిన మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా ఇటీవల యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని మిస్ వరల్డ్ –2024 క్రిస్టినా పిస్కోవా సందర్శించారు. ఆలయం అద్భుతమని కొనియాడారు. వాస్తు శిల్పం, ప్రశాంతమైన పరిసరాలు, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కోసం యాదగిరి క్షేత్రాన్ని తప్పనిసరిగా సందర్శించాల్సిన ప్రదేశమని ఆమె పేర్కొన్నారు. ఆమె ప్రకటనతో మే 15న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందెగత్తెలంతా యాదగిరి క్షేత్ర సందర్శనకు వచ్చి, ఆధ్యాత్మిక అనుభూతిని పొందనున్నారు. ఫ మే 12న నాగార్జునసాగర్‌కు, 15న పోచంపల్లి, యాదగిరిగుట్టకు రానున్న ప్రపంచ సుందరీమణులు ఫ ఇక్కడి ప్రాంతాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చేలా తెలంగాణ పర్యాటకశాఖ ప్రణాళికవిజయ విహార్‌లో విడిది ప్రపంచదేశాల బౌద్ధులను ఆకర్షించేందుకు నాగార్జునసాగర్‌లోని కృష్ణానది తీరంలోని బుద్దవనాన్ని ప్రపంచ అందెగత్తెలు మే 12న సందర్శనున్నారు. బౌద్దుల చరిత్ర, ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని వారు తెలుసుకోనున్నారు. వారికి ఇక్కడి బౌద్ధసంస్కృతిని పరిచయం చేయడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా గుర్తింపు దక్కేలా తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. మిస్‌వరల్డ్ పోటీదారులు సాగర్‌లో ఇక్కడ విడిది చేయడానికి గాను విజయవిహార్లోని గదులను ఆధునీకరిస్తున్నారు. రూ.5 కోట్ల వ్యయంతో అన్ని హంగులు కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆయా పనులు ప్రారంభించారు. వారి విడిదికి సకల హంగులు కల్పిస్తూ.. విజయ విహార్ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. వీరి పర్యటన నేపథ్యంలో శనివారం తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ, నల్లగొండ కలెక్టర్, ఉన్నతాధికారులు నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 18న యాదగిరి క్షేత్రంలో క్రిస్టినా పిస్కోవా మే 15వ తేదీనే అందాల భామలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12గంటల నుంచి 2 గంటల వరకు ఇక్కడ గడపనున్నారు. వారు 15వ తేదీన హైదరాబాద్ నుంచి నేరుగా యాదగిరికొండకు దిగువన ఉన్న ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకుని.. అక్కడి నుంచి యాదగిరి క్షేత్రానికి వస్తారు. విష్ణు పుష్కరిణిలో సంకల్ప పూజలు చేసి, ప్రధానాలయం సమీపంలో ఉన్న అఖండ దీపారాధన పూజల్లో పాల్గొంటారు. శ్రీస్వామి వారి దర్శనం తర్వాత ప్రధానాలయ పునః నిర్మాణాన్ని మిస్ వరల్డ్ పోటీ దారులు పరిశీలించి, ఇక్కడే ఒక డాక్యుమెంటరీ సైతం చేయనున్నట్లు తెలుస్తోంది. మిస్ వరల్డ్ పోటీదారులతో యాదగిరిక్షేత్ర వైభవం ప్రపంచ స్థాయికి వెళ్లనుంది. ఆధ్యాత్మిక నగరికి.. -
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా
సూర్యాపేట టౌన్: సోషల్ మీడియాపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా పెట్టిందని ఎస్పీ నరసింహ అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ విభాగాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సైబర్ సెక్యూరిటీ సెల్, ఐటీ సెల్, కమాండర్ కంట్రోల్ సెంటర్, సోషల్ మీడియా మానిటరింగ్ యూ నిట్లను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, మానిటరింగ్ యూనిట్లను బలోపేతం చేశామన్నారు. సామాజిక మాధ్యమాలపై జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. చాలా మంది యువత, ప్రజలు అవగాహన లేకుండా సోషల్ మీడియాలో అనవసరంగా అసభ్యకర పోస్టులు, ఇతరులను కించపరిచేలా సమాచారం పంపిస్తున్నారని, ఇలాంటివి చట్టరీత్యా నేరమన్నారు. సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పుడు పోస్టులు పెడితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనే అంశాలపై ప్రతిఒక్క రూ కలిగి ఉండాలన్నారు. ఆయన వెంట ఏఆర్ఎస్పీ జనార్దన్‌రెడ్డి, ఆర్ఐ నర్సింహ, సిబ్బంది ఉన్నారు. ఫ ఎస్పీ నరసింహ -
తొలి రోజు 11,882 మంది హాజరు
సూర్యాపేట టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 67 కేంద్రాల్లో మొదటి రోజు తెలుగు పరీక్ష నిర్వహించారు. మొత్తం 11,904 మంది విద్యార్థులకు గాను 11,882 మంది హాజరు కాగా 22 మంది గైర్హాజరయ్యారు. ఇందులో 11 మంది ప్రైవేట్ విద్యార్థులకు ఎనిమిది మంది హాజరు కాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. విద్యార్థులకు ఈ ఏడాది అడిషనల్ పేపర్లకు బదులుగా 24పేజీల ఆన్సర్ బుక్‌లెట్‌ను ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పలు పరీక్ష కేంద్రాలను అదనపు కలెక్టర్ రాంబాబు, ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. అలాగే నాలుగు స్క్వాడ్ బృందాలు పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని ఎస్పీ పోలీస్ అధికారులను ఆదేశించారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభం ఫ జిల్లా వ్యాప్తంగా 22 మంది విద్యార్థులు గైర్హాజరు ఫ పలు కేంద్రాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్, ఎస్పీ -
జూన్ నాటికి యూనిఫామ్ అందించాలి
భానుపురి (సూర్యాపేట): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జూన్ నాటికి యూనిఫామ్ తయారీ పూర్తిచేసి అందించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీడబ్ల్యూఓ నరసింహారావు, డీఈఓ అశోక్, సంక్షేమ అధికారులు శంకర్, శ్రీనివాస్ నాయక్, లత, డీపీఎం ఆంజనేయులు పాల్గొన్నారు. జిల్లాలో 1,853 మందికి ప్రొసీడింగ్స్ ఎల్ఆర్ఎస్–2020 స్కీమ్ క్రింద ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 1,853 మందికి ప్రొసీడింగ్స్లు ఇచ్చామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి మున్సిపల్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ దానకిశోర్ అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో మొత్తం 58,990 దరఖాస్తులు అందగా 2,569 మంది రూ.12కోట్ల చెల్లించారని తెలిపారు. ఇందులో 1.853 మందికి ప్రొసీడింగ్స్ అందించామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్‌న్స్‌లో అదనపు కలెక్టర్ పి.రాంబాబు, కమిషనర్ శ్రీనివాస్, డీపీఓ యాదయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
బడే భాయ్.. చోటే భాయ్ ఇద్దరూ ఒక్కటే!
సూర్యాపేట: కేంద్రంలో బడేభాయ్ మోదీ, రాష్ట్రంలో చోటే భాయ్ రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఒక్కటేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించదని, రేవంత్ అవినీతిని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని మండిపడ్డారు. ఢిల్లీకి మూటలు పంపి పదవులు కాపాడుకునే ధ్యాస తప్ప సీఎం రేవంత్‌రెడ్డికి మరొకటి లేదని ధ్వజమెత్తారు.ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభ కోసం గురువారం సూర్యాపేటలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించే వరంగల్ సభకు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేవంత్‌కు పర్సంటేజీలపైనే దృష్టి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డికి పర్సనాలిటీ పెంచుకోవడం మీద కంటే పర్సంటేజీలు పెంచుకోవడం మీదనే ఎక్కువ ఆసక్తి ఉందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రేవంత్ పాపమే రైతన్నకు శాపంలా మారిందన్నారు. రైతులకు రావాల్సిన రూ.37 వేల కోట్లు ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాం«దీ, మల్లికార్జున ఖర్గే ఖాతాల్లో టింగు టింగు అంటూ పడుతున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్కు అధికారం మాత్రమే పోయిందని, ప్రజల్లో అభిమానం మాత్రం అలాగే ఉందని చెప్పారు.చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, గాడిదని చూస్తేనే కదా గుర్రం విలువ తెలిసేది.. అలాగే కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసి వచ్చిందన్నారు. సమావేశానికి ముందు సూర్యాపేటలో పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ర్యాలీలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
లాంగెస్ట్ రోడ్ నెట్‌వర్క్‌లో రెండో స్థానంలో నల్లగొండ
రాష్ట్రంలో అత్యధిక దూరం రోడ్ నెట్వర్క్ కలిగిన జిల్లాల్లో రంగారెడ్డి ప్రథమ స్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 1,11,775.56 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ ఉండగా, రంగారెడ్డిలో 7,932.14 కిలోమీటర్లు ఉంది. నల్లగొండలో 7,766.92 కిలోమీటర్లు ఉంది. కీలకమైన రోడ్డు డెవలప్మెంట్ ప్రాజెక్టుల్లో నల్లగొండను ఒకటిగా తీసుకుంది. లతీఫ్ సాహెబ్ గుట్ట – బ్రహ్మంగారిమఠం, శివాలయం వరకు రూ.140 ఘాట్ రోడ్డును నిర్మించబోతోంది. రూ.236 కోట్లతో యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ నుంచి నార్కట్‌పల్లి అద్దంకి హైవేకు లింక్ చేస్తూ సీసీరోడ్డు వేస్తోంది. -
దేశానికి కేసీఆరే దిక్సూచి
ఫ గుంటకండ్ల జగదీష్‌రెడ్డి దేశానికి దిక్సూచిలా కేసీఆర్ నిలుస్తారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ వెనుకబాటును చూసి చలించి గులాబీ జెండా ఎత్తారని, ఒక్కడిగా బయలుదేరి నేడు సముద్రంలా మారారని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం వెనుకబాటుకు గురవుతోందని, ఇక్కడ ఆయన శిష్యుడు రేవంత్ అదే బాటలో పయనిస్తున్నాడని ఆరోపించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ వచ్చే నెల 27న జరిగే వరంగల్ బహిరంగ సభకు భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు తరలిరావాలన్నారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల కోసం పార్టీ పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేసి దేశం మొత్తం చూసేలా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని అన్నారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న మంత్రి రెండు నియోజకవర్గాలకే మంత్రి అని, ఆయన రావాలంటే హెలికాప్టర్ ఉండాలన్నారు. హెలికాప్టర్ లేనిది ఆ మంత్రి ఎక్కడకి పోరని విమర్శించారు. అంతకు ముందు జనగామ క్రాస్‌రోడ్డు నుంచి పార్టీ కార్యాలయం వరకు కేటీఆర్‌కు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కరరావు, రవీంద్రకుమార్, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, సోమా భరత్‌కుమార్, తిప్పన విజయసింహారెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, చెరుకు సుధాకర్, గుజ్జా దీపిక, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, వై.వెంకటేశ్వర్లు, మారిపెద్ది శ్రీనివాస్‌గౌడ్, పెరుమాళ్ల అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు
సూర్యాపేటటౌన్ : ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం ముగిశాయి. ఈ నెల 6వ తేదీ నుంచి 32 కేంద్రాల్లో ప్రారంభమైన ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో పరిసమాప్తం అయ్యాయి.చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించారు. జనరల్ విభాగంలో మొత్తం 6,082 మంది విద్యార్థులకు గాను 5,893 మంది హాజరు కాగా 189 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 1,184 మంది విద్యార్థులకు గాను 1,084 మంది హాజరు కాగా 100 మంది గైర్హాజరయ్యారు. పలు సెంటర్లలో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతూ 11 మంది విద్యార్థులు బోర్డు స్క్వాడ్‌కు దొరకడంతో వారిని డీబార్ చేసినట్టు డీఐఈఓ భానునాయక్ తెలిపారు. గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలి సూర్యాపేట : సూర్యాపేట మండలం కేసారం–2 వద్ద గల డబుల్ బెడ్రూం ఇళ్లను ఏప్రిల్ రెండో వారంలోగా గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సూచించారు. గురువారం కేసారం–2 వద్ద కొనసాగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. 480 ఇళ్ల పనులను 20 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట ఆర్డీఓ వేణుమాధవ్, తహసీల్దార్ శ్యాంసుందర్ రెడ్డి, ఆర్అండ్బీ డీఈ పవన్ కుమార్ పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా రేఖ అర్వపల్లి: మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా జాజిరెడ్డిగూడెం మండలం అడివెంల గ్రామానికి చెందిన డాక్టర్ బోయలపల్లి రేఖ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని గురువారం హైదరాబాద్‌లో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు నుంచి అందుకున్నారు. కాగా రేఖ ఇప్పటికే రేఖ చారిటబుల్ ఫౌండేషన్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రేఖ మాట్లాడుతూ తన నియామకానికి కృషి చేసిన జాతీయ అధ్యక్షురాలు అల్క లాంబ, రాష్ట్ర అధ్యక్షురాలు సునితారావులకు కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి జలాలు మరింత పెంపుఅర్వపల్లి: యాసంగి సీజన్‌కు చివరి విడతగా జిల్లాకు విడుదల చేస్తున్న గోదావరి జలాలను మరింత పెంచారు. 1,429క్యూసెక్కులు వస్తుండగా వాటిని 1,650 క్యూసెక్కులకు పెంచారు. ఇందులో 69డీబీఎంకు 500, 70డీబీఎంకు 70, 71 డీబీఎంకు 1,080 క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతున్నట్లు నీటి పారుదలశాఖ డీఈఈ ఎం. సత్యనారాయణ తెలిపారు. -
సాగర్ డ్యాం సందర్శించిన సీఈ
సాగర్ డ్యాం ఎడమ వైపున అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జిల్లా చీఫ్ ఇంజనీర్ అజయ్‌కుమార్ సందర్శించారు. బడ్జెట్ అన్ని వర్గాలకు అనుకూలం రాష్ట్ర బడ్జెట్ చరిత్రలో నిలిచిపోతుందని, అన్ని వర్గాలకు ఆమోదయోగ్యం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. - IIలోటీఎస్ ఐపాస్ ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి పరిశ్రమలు ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఐదో స్థానంలో యాదాద్రి భువనగిరి జిల్లా నిలువగా, నల్లగొండ 12వ స్థానంలో నిలిచింది. సూర్యాపేట 23వ స్థానంలో నిలిచింది. యాదాద్రి జిల్లాలో 1032 పరిశ్రమలు ఏర్పాటు ద్వారా రూ.5598 కోట్ల పెట్టుబడులు రాగా, 34,876 మందికి ఉపాధి లభించింది. నల్లగొండ జిల్లాలో 693 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.4344 కోట్ల పెట్టుబడులు రాగా, 17,220 మందికి ఉపాధి లభించింది. సూర్యాపేట జిల్లాలో 330 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.5207 కోట్ల పెట్టుబడులు లభించగా, 10,439 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఒక్క సంవత్సరంలోనే..2024–25 ఆర్థిక సంవత్సరంలో యాదాద్రి జిల్లాలో 93 కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాగా రూ.222 కోట్ల పెట్టుబడులు వచ్చి 1666 మందికి ఉపాది లభించింది. నల్లగొండలో 56 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.955 కోట్ల పెట్టుబడులు రాగా, 2053 మందికి ఉపాధి లభించింది. సూర్యాపేట జిల్లాలో 26 పరిశ్రమల ఏర్పాటు ద్వారా రూ.67 కోట్లు రాగా, 516 మందికి ఉపాధి లభించింది. విద్యుత్ కనెక్షన్లలో టాప్ పరిశ్రమల ద్వారా యాదాద్రికి రూ.5598 కోట్ల పెట్టుబడులు -
కేసీఆర్ లేకపోతే తెలంగాణే లేదు
14 ఏళ్లు పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించారు ఫ బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి జిల్లాలో 2.5లక్షల ఎకరాలకు సాగునీరిచ్చాం ఫ ఇప్పుడు ఇక్కడ నీళ్ల మంత్రి ఉన్నా చుక్కనీరు తేలేకపోతుండు ఫ సూర్యాపేటలో సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ వరంగల్ సభకు భారీగా తరలిరావాలని పిలుపుసూర్యాపేటటౌన్ : ‘కేసీఆర్.. పార్టీ పెట్టి సునామీ సృష్టించారు... కేసీఆరే లేకపోతే తెలంగాణ లేదు.. ఇప్పుడు పదవులు అనుభవిస్తున్న వారికి ఆ పదవులే రాకపోయేవి’ అని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఏప్రిల్ 27న వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభ విజయవంతానికి గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, మరో వైపు చంద్రబాబు లాంటి వారి సవాళ్ల మధ్య కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం సాహసం చేసి పార్టీ పెట్టారన్నారు. 14 ఏళ్లు సుదీర్ఘపోరాటం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారన్నారు. కేసీఆర్ మోకాలు ఎత్తుకు కూడా సరిపోని వాళ్లు ఆయన గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2.5లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే.. ఇప్పుడు ఇక్కడ నీళ్ల మంత్రి ఉన్నా చుక్కనీరు తేలేకపోతున్నారని, దీంతో పంటలు ఎండిపోయి రైతులు గోసపడుతున్నారన్నారు. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చాపల కూర చేయించుకొని తింటున్నాడని విమర్శించారు. స్పీకర్ పదవికి కుల, మత పట్టింపులు ఉండవని, స్పీకర్ పదవి అంటే బీఆర్ఎస్కు ఎంతో గౌరవమని, ప్రసాద్ కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో తమ పాత్ర కూడా ఉందన్నారు. శాసనసభ మన అందరిదీ అన్న జగదీష్‌రెడ్డిని సస్పెండ్ చేశారని, గాంధీభవన్ లెక్క సభను నడుపుతున్నారని అన్న అక్బరుద్దీన్ ఒవైసీ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఈ నెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు ఒక్కొక్క గ్రామం నుంచి బండ్లు కట్టుకుని తరలిరావాలని కోరారు. ఈ సభ చూస్తే కాంగ్రెస్, బీజేపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలన్నారు. వరంగల్ బహిరంగ సభ తర్వాత వెంటనే సభ్యత్వ నమోదుతోపాటు గ్రామ మండల కమిటీలు ఏర్పాటు చేసుకుందామన్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటాలు చేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ ఏడాదిని పోరాట నామ సంవత్సరంగా పిలుచుకుందామని అన్నారు. -
ఎగుమతుల్లో ఆరో స్థానంలో యాదాద్రి జిల్లా
సరుకుల ఎగుమతుల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆరో స్థానంలో నిలువగా, మెదక్ ఏడో స్థానంలో, నల్లగొండ 8వ స్థానంలో నిలిచింది. 41.42 శాతం ఎగుమతులతో మొదటి స్థానంలో రంగారెడ్డి, 17.60 శాతంతో రెండో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల నిలిచాయి. 15.42 శాతం ఎగుమతులతో సంగారెడ్డి మూడో స్థానంలో, 13.51 శాతంతో హైదరాబాద్ నాలుగో స్థానంలో, 2.82 శాతంతో మహబూబ్‌నగర్ ఐదో స్థానంలో నిలిచాయి. 2.04 శాతంతో యాదాద్రి భువనగిరి ఆరో స్థానంలో నిలువగా, 1.38 శాతంతో మెదక్ ఏడో స్థానంలో, 1.07 శాతం ఎగుమతులతో నల్లగొండ 8వ స్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి అయ్యే ఎగుమతుల్లో ఈ జిల్లాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. -
‘భూమికి మూడు ఫీట్లు లేరుగాని.. అసెంబ్లీలో తెగ మాట్లాడేస్తున్నారు’
సాక్షి,సూర్యాపేట జిల్లా: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.కేసీఆరే మరోసారి సీఎం అవుతారు. భూమికి మూడు ఫీట్లు లేని వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు.గ్రామ సింహాలు కూడా సింహాల్లా మాట్లాడుతున్నాయి. కేసీఆరే లేకపోతే తెలంగాణనే లేదనేది అక్షర సత్యం. మూడు పాత్రల్లో విజయవంతం అయిన ఏకైక పార్టీ బీఆర్ఎస్.తెలంగాణ ప్రజల గుండె ధైర్యం బీఆర్ఎస్ పార్టీ.బీఆర్ఎస్ అధికారంలో రావాలని కోరుకునేది ప్రజల కోసమే. రేవంత్ రెడ్డి పర్సనాలిటీ పెంచుకునే పనికాకుండా పర్సంటేజీలు పెంచుకునే పనిలో ఉన్నారని దుయ్యబట్టారు.