
నాణ్యమైన ధాన్యం తీసుకురావాలి
చివ్వెంల(సూర్యాపేట) : కొనుగోలు కేంద్రాలకు రైతులు నాణ్యమైన ధాన్యం తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. శుక్రవారం చివ్వెంల మండల పరిధిలోని బీబీగూడెం గ్రామంలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు రైతులు అరబెట్టిన ధాన్యం తీసుకురావాలన్నారు. 17 శాతం తేమ ఉంటే ధాన్యం కొనుగోలు చేసి కాంటాలు వేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ సంతోష్‌కుమార్, నిర్వాహకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.