Suryapet District Latest News
-
ప్రాధాన్యత క్రమంలో సమస్యలు పరిష్కరిస్తాం
కోదాడ : కోదాడ పట్టణంలో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని, పట్టణ ప్రజలు తమకు సహకరించాలని మున్సి పల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమబాబు కోరారు. కోదాడ అర్బన్ పార్కు దుస్థితిపై శనివారం ‘సాక్షి’ ప్రచురించిన కథనం ప్రజాప్రతినిధులతో పాటు అధికారులలో చలనం తీసు కొచ్చింది. ఈ వార్తను చూసిన కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ కుసుమబాబు ఉదయమే మున్సిపల్ అధికారలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆమె స్వయంగా రంగంలోకి దిగారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న 20 మంది కామాటీలతోపాటు మున్సిపల్ డీఈ, శానిటరీ ఇన్స్పెక్టర్లతో పార్కు వద్దకు చేరుకొని దగ్గరుండి శుభ్రం చేసే పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’కి పలువురు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 8వ వార్డు కౌన్సిలర్ రామినేని ఉదయశ్రీ, మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమబాబు -
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
చివ్వెంల : మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత అన్నారు. గృహహింస, వరకట్న మరణాలపై శనివారం చివ్వెంల మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో మహిళలకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండిన తర్వాత వివాహం చేయాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తల్లమళ్ల హస్సేన్, డీఎల్ఎస్ఏ నామినేటెడ్ సభ్యులు మధు, మమత, తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీఓ సంతోష్ కుమార్, ఎస్ఐ కనకరత్నం పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానంసూర్యాపేట టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో గ్యాస్ స్టవ్‌ల విక్రేతల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ అశోక్ శనివారం ఒక తెలిపారు. జిల్లాలో ఎంపిక చేయబడిన 140 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలకు మధ్యాహ్న భోజన పథకం కింద వంట చేయుటకు గ్యాస్ స్టవ్‌లను (సుమారు 50 కేజీల అన్నం, కూరగాయలు వండేందుకు ఇనుప గ్యాస్ పొయ్యి) సరఫరాకు ఆసక్తి గల సరఫరాదారులు తమ కొటేషన్లను జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఈ నెల 10వ తేదీలోపు సమర్పించాలని కోరారు.గోదావరి జలాల నిలిపివేతఅర్వపల్లి : యాసంగి సీజన్‌కుగాను జిల్లాకు ఆరు విడతలుగా వదిలిన గోదావరి జలాలను నిలిపివేశారు. చివరి విడతగా పది రోజుల నుంచి నీటిని వదిలిన అధికారులు శుక్రవారం రాత్రి బంద్ చేశారు. వరిచేలు 15 రోజుల్లో చేతికందే అవకాశం ఉన్నందున మరో విడత నీటిని అందించాలని రైతులు కోరుతున్నారు. ఓటర్ సవరణపై శిక్షణ ఇస్తాం భానుపురి (సూర్యాపేట) : ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ కార్యక్రమంపై సిబ్బందికి శిక్షణ ఇస్తామని అదనపు కలెక్టర్ కె.సీతారామారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు సూర్యనారాయణ, వేణుమాధవరావు, శ్రీనివా సులు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ సంతోష్ కిరణ్, సిబ్బంది పాల్గొన్నారు. శాంతి నెలకొల్పాలిసూర్యాపేట అర్బన్ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు చేస్తున్న యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పాలని వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు జిల్లా యుద్ధ వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో యుద్ధం వద్దు–ప్రపంచ శాంతి కావాలి. డౌన్ డౌన్ ట్రంప్, మోదీ అంటూ నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి, భద్రత మండలి జోక్యం చేసుకుని యుద్ధాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, తెలంగాణ జన సమితి రాష్ట్ర కార్యదర్శి ధర్మార్జున్, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి డేవిడ్ కుమార్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, డీటీఎఫ్ నాయకులు లింగయ్య, సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్ ఎల్.భద్రయ్య, టీపీటీఎఫ్ నేత వీరన్న, ముస్లిం మైనార్టీ నాయకులు కాలే హమ్మద్, అబ్దుల్లా, ఆయా పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఫిట్నెస్ నాయక్
ఆయన ఓ ప్రజాప్రతినిధి.. నిత్యం ప్రజాసేవలో బిజీగా ఉండే ఆయన ఎన్ని పనులున్నా.. రోజూ వ్యాయామం మిస్ చేయరు. వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవంటున్నారు ఎమ్మెల్సీ శంకర్‌నాయక్. కార్య కర్తలకు కూడా ఆయన ఇదే సూచిస్తారు.ఫ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ప్రత్యేక శ్రద్ధ ఫ సోషల్ మీడియాలో ఆయన ఫిట్నెస్ వీడియోలకు యూత్ ఫిదా ఫ మితాహారం, ఆరు గంటలు నిద్ర ఆయన హెల్త్ సీక్రెట్మిర్యాలగూడ : ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ రోజూ ఉదయం 5 గంటలకే నిద్ర లేస్తారు. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు. అక్కడ తొలుత జాగింగ్ చేస్తారు. 16 రకాల యోగాసనాలను వేస్తారు. ముఖ్యంగా వజ్రాసనం, కపాలభాతి వంటి ఆసనాలు వేస్తారు. తరువాత వెయిట్ లిఫ్టింగ్, డిప్స్తోపాటు వాలీబాల్, కబడ్డీ ఆడుతారు. చిన్నప్పటి నుంచే .. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌కు చిన్నప్పటి నుంచే క్రీడలతోపాటు వ్యాయామంపై ఆసక్తి. ఆయనతోపాటు ఇద్దరు కుమారులు సైతం నిత్యం వ్యాయామం చేస్తారు. శంకర్‌నాయక్ ఏదైనా పాఠశాలకు వెళ్లిన సందర్భంలో విద్యార్థులకు సైతం వ్యాయామం, శరీర దారుఢ్యానికి దోహదపడే అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఇటీవల ఆయన వ్యాయామం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చూసిన యువత.. ‘ఫిట్నెస్ నాయక్’ అని కితాబిస్తున్నారు. ఆహార నియమాలు ఇవే.. శంకర్‌నాయక్ ఉదయం అల్పాహారంగా జొన్న గటక, రాగి సంకటి తీసుకుంటారు. మధ్యాహ్నం మిత భోజనం, రాత్రి జొన్నరొట్టె మాత్రమే తీసుకుంటారు. మాంసాహారానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వరు. మద్యానికి, ధూమపానానికి దూరంగా ఉంటారు. నిత్యం ఆరుగంటలు తప్పకుండా నిద్రిస్తానని ఆహారం, నిద్ర నియమాలు పాటిస్తుండడంతో తాను ఆరోగ్యంగా ఉంటున్నానని చెబుతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలపై కూడా శంకర్‌నాయక్‌కు ఆసక్తి ఉంది. పాఠశాలలో చదివే రోజుల్లో నాటకాలు వేసేవారు. ఇటీవల శాసన సభ్యులు, శాసనమండలి సభ్యుల సాంస్కృతికోత్సవంలో కట్టప్ప వేషధారణ ప్రదర్శించి ఆకట్టుకున్నారు. ముఖ్యమంత్రితోపాటు మంత్రుల అభినందనలు అందుకున్నారు. -
రిటైర్డ్ ఉద్యోగుల సంఘాన్ని బలోపేతం చేద్దాం
భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో సభ్యత్వాలు అధికంగా చేయించి రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం బలోపేతానికి కార్యవర్గ సభ్యులంతా కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య కోరారు. శనివారం సూర్యాపేటలో జరిగిన ఆ సంఘం మండల నోడల్ యూనిట్ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత వైద్యంపై విధివిధానాల రూప కల్పన జరుగుతుందని, వారం పదిరోజుల్లో జీఓ విడుదల కానుందని తెలిపారు. పీఆర్సీ అమలుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు, ప్రధాన కార్యదర్శి దండా శ్యాంసుందర్‌రెడ్డి, కోశాధికారి హమీద్‌ఖాన్, మండల అధ్యక్షుడు సుదగాని నాగేశ్వర్రావు, కార్యదర్శి శనగల యాదగిరి, నాయకులు సుధాకర్, రవీందర్‌రెడ్డి, గాలి శ్రీనివాస్, దేవీరెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
● మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి సూర్యాపేట : బీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ బీమా చెక్కులతో పాటు 86 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వ బీమా రూ.2లక్షలు అందజేస్తున్న ఏకై క పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు కార్యకర్తలను కాపాడుకోవడంలో కేసీఆర్‌ను మించిన వారే లేరన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, ఆ పార్టీ నాయకులు అన్నపూర్ణ, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, సత్యనారాయణరెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. -
నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి
సూర్యాపేట టౌన్ : కోర్టుల సిబ్బందితో సమన్వయంగా ఉంటూ వివిధ కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేలా పోలీసులు అంకితభావంతో పనిచేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. శనివారం సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు విధులు, పెండింగ్ కేసుల్లో త్వరితగతిన పరిష్కారం తదితర అంశాలపై డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, కోర్టు డ్యూటీ పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తీవ్రమైన కేసుల్లో నిందితులను వెంటనే న్యాయస్థానాల్లో హాజరుపరిచి రిమాండ్ తరలించాలన్నారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఎలాంటి సమస్యలు వచ్చినా పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో శిక్షలు పడేలా చూడాలన్నారు. కక్షిదారులను సమన్వయం చేసి లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులను దస్త్రాలను, సమన్లు, వారెంట్లను పరిశీలించి పెండింగ్ కేసుల పరిష్కారానికి సంబంధించి పలు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ రవి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీనివాస్‌రెడ్డి, సీఐలు, కోర్టు డ్యూటీ సిబ్బంది పాల్గొన్నారు. ఫోన్ ద్వారా ఫిర్యాదు చేస్తే ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ బాధితులకు సౌలభ్యం కోసం ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు విధానాన్ని అమలు చేస్తున్నామని ఎస్పీ నరసింహ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు, బలహీన పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఈ విధానం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. వివిధ కేసులకు సంబంధించి పోలీస్ స్టేషన్‌కు రాలేని పరిస్థితుల్లో ఫోన్ ద్వారా సమాచారం అందిస్తే బాధితుల ఇంటి వద్దకే పోలీసులు వచ్చి ఫిర్యాదు స్వీకరించి అక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఎఫ్ఐఆర్ ప్రతిని అందజేస్తారని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి ఎస్పీ నరసింహ -
అధ్వానంగా అర్బన్‌పార్క్
ఫ రెండున్నర ఎకరాల్లో రూ. కోట్ల ఖర్చుతో ఏర్పాటు ఫ నిర్వహణ వదిలేయడంతో పచ్చదనం మాయం ఫ ఉన్న ఒక్క పార్క్‌నూ పట్టించుకోక పోవడంపై స్థానికుల విమర్శలు కోదాడ : కోదాడ పట్టణ ప్రజలు సేద తీరేందుకు ఏర్పాటు చేసిన ఏకై క పార్క్ అధ్వానంగా మారింది. రూ.2.5 కోట్లు ఖర్చు చేసి రెండున్నర ఎకరాల్లో అభివృద్ధి చేసిన కోదాడ అర్బన్ పార్క్ నిర్వహణలేక ఆనవాళ్లు కోల్పోతోంది. రెండు ఏళ్లుగా పార్కును మున్సిపల్ అధికారులు పట్టించుకోక పోవడంతో పచ్చదనం కోల్పోయి పిచ్చిమొక్కలకు నిలయంగా మారింది. పార్కులోని బెంచీలు, క్రీడా పరికరాలు, విద్యుత్ దీపాలు విరిగిపోయాయి. పార్కు దుస్థితిపై ఓ బాలిక సోషల్ మీడియాలో పెట్టిన రీల్ చర్చనీయాంశమైంది. రెండున్నర కోట్ల ఖర్చుతో.. కోదాడ పట్టణంలోని 8వ వార్డులో ఉత్తమ్‌పద్మావతి నగర్ లే అవుట్ కింద వచ్చిన రెండున్నర ఎకరాల స్థలంలో కోదాడ అర్బన్ పార్క్‌ను ఏర్పాటు చేశారు. 2019లో పార్కు అభివృద్ధికి టీయూఎఫ్ఐడీసీ నిధుల నుంచి కోటి రూపాయలు ఖర్చు చేసి వివిధ పనులు చేపట్టారు. 2023లో మరోసారి కోటిన్నర ఖర్చు చేసి పార్కును అభివృద్ధి చేశారు. పచ్చదనం కోసం మొక్కలను నాటడం, వాకింగ్ ట్రాక్, విద్యుత్ దీపాలు, మరుగుదొడ్లను నిర్మించారు. పిల్లలు ఆడుకోవడానికి ఆట వస్తువులను కూడ ఏర్పాటు చేశారు. కొద్దిరోజులకే శిథిలావస్థకు పార్క్‌లో ఏర్పాటు చేసిన ఆట వస్తువులు, బెంచీలు, డస్ట్బిన్లు నాసిరకానివి కావడంతో కొద్ది రోజులకే పాడైపోయాయి. నిర్వహణ లేక వాకింగ్ ట్రాక్ మీద పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. పార్కులో మొక్కలకు నీరు పెట్టడానికి ఎవ్వరూ లేకపోవడంతో అవన్నీ ఎండిపోయాయి. పార్క్‌లో ఉన్న బోర్ మోటారు సైతం తీసుకెళ్లారని స్ధానికులు అంటున్నారు. మరుగుదొడ్లు పూర్తిగా శిథిలావస్ధకు చేరడంతో పాటు వాటిలో సైతం పిచ్చిమొక్కలు, కంపచెట్లు పెరిగిపోయాయి. తలుపులు ధ్వంసమై వినియోగించుకునేందుకు వీలులేకుండా పోయాయి. చర్చనీయాంశమైన బాలిక రీల్ కోదాడ పట్టణంలోని ఓ పాఠశాలలో చదువుతున్న బాలిక అర్బన్ పార్క్ దుస్థితిపై రీల్ చేసి సామాజిక మాధ్యమంలో పెట్టింది. పార్కు దుస్థితిని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ, అధికారుల పనితీరు ఎండగడుతూ ఉన్న రీల్ ప్రస్తుతం కోదాడ పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అయినా కోదాడ మున్సిపల్ అధికారులు మాత్రం ఈ విషయమై స్పందించడం లేదు. పార్కులోని వాకింగ్ ట్రాక్ దుస్థితికోదాడ అర్బన్‌పార్క్ -
కేసుల దర్యాప్తు వేగవంతం : ఎస్పీ
సూర్యాపేట : కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, రికార్డుల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని ఎస్పీ కె.నరసింహ ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. రికార్డులు, ఫిర్యాదుల నిర్వహణను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదు దారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరపాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ప్రజా సమస్యలపై సమాచారం అందిన వెంటనే వేగంగా స్పందిస్తూ బాధితుల వద్ద నుంచి ఫిర్యాదులు తీసుకొని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. సామాజిక కార్యక్రమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సైబర్ మోసాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళల భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఆయన వెంట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఎస్ఐలు ఏడుకొండలు, ఐలయ్య, మహేందర్నాథ్, శివతేజ, సిబ్బంది ఉన్నారు. -
కొమురయ్య పోరాటం స్ఫూర్తిదాయకం
సూర్యాపేట : తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య పేదల కోసం చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బీసీ వెల్ఫేర్ అధికారి నర్సింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని కొమురయ్య చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. దొడ్డి కొమురయ్య ధైర్యం, త్యాగం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. రాజకీయ, సామాజిక రంగాల్లో అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన కొమురయ్య ఆశయ సాధనకు యువత కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీటీడీఓ శంకర్, వివిధ సంఘాల నాయకులు జుట్టుకొండ సత్యనారాయణ, డాక్టర్ రామ్మూర్తి, చిన్న శ్రీరాములు, వి.సత్యనారాయణ, హుస్సేన్, పి.గామయ్య పాల్గొన్నారు. -
ముక్త్యాల కెనాల్‌పై కొత్త వంతెన
కోదాడ : చిలుకూరు మండలం బేతవోలు రోడ్డులో ముక్త్యాల కాలువపై ఉన్న ఇరుకు వంతెన స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించనున్నారు. అందుకు ఇరిగేషన్ శాఖ నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరయ్యాయి. మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. వంతెన నిర్మిణం పూర్తయితే ఇన్ని రోజులు ఇరుకు వంతెనతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులకు ఊరట లభించనుంది. డబుల్ రోడ్డు వేసినా.. కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా బేతవోలు క్రాస్ రోడ్డు నుంచి బేతవోలు గ్రామం మీదుగా జెర్రిపోతులగూడెం వరకు రూ.16 కోట్లతో డబుల్ రోడ్డు వేశారు. కానీ ఈ మార్గంలో ఉన్న ఇరుకు వంతెన వద్ద మాత్రం సింగిల్ రోడ్డే ఉంది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వంతెనకు అటు, ఇటు డబుల్ లేన్ ఉండడంతో ఎదురుఎదురుగా వచ్చిన వాహనాలు ఒకేసారి వెళ్లలేక ఒక వాహనం వెళ్లేంత వరకు రెండోది నిలిచి పోవాల్సి వస్తోంది. రాత్రి సమయాల్లో రెండు వాహనాలు ఒకేసారి వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. బరాఖత్‌గూడెం వద్ద నిర్మాణం మునగాల మండలం బరాఖత్‌గూడెం నుంచి బేతవోలు రోడ్డులో ఉన్న ముక్త్యాల కాలువ 11.5 కిలోమీటర్ వద్ద కొత్త వంతెన నిర్మించనున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన కోటి రూపాయాలతో పాత వంతెనను తొలగించి ఆ ప్రాంతంలో కొత్తది నిర్మించనున్నారు. 29.28 మీటర్లు పొడవు, 7.5 మీటర్లు వెడల్పుతో కొత్త వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు. వంతెనకు రెండు వైపులా రక్షణ గోడను సైతం నిర్మించనున్నారు. తొలగనున్న ఇబ్బందులు ఇరుకు వంతెన స్థానంలో కొత్తది నిర్మించాలని ఈ ప్రాంత వాసులు పలుమార్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పద్మావతికి విన్నవించారు. దాంతో వారు ప్రత్యేక చొరవ తీసుకొని వెంతెన నిర్మాణానికి కోటి రూపాయాలు మంజూరు చేయించారు. వెంతెన పూర్తయితే బేతవోలు, జెర్రిపోతులగూడెం, ఆచార్యులగూడెం, చెన్నారిగూడెం, పోలేనిగూడెం, కొమ్ముబండ తండా, సీతరాంతండాతో పాటు విజయవాడ –హైదరాబాద్ జాతీయ రహదారి పైకి వెళ్లే వాహనదారుల ఇబ్బందులు తొలగనున్నాయి. ఫ రూ.కోటి విడుదల చేసిన ప్రభుత్వం ఫ వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి ఫ తీరనున్న ఇరుకు వంతెన కష్టాలుముక్త్యాల కాలువపై కొత్త వంతెన నిర్మాణానికి ఇరి గేషన్ శాఖ నుంచి కోటి రూపాయాలు మంజూరయ్యాయి. మరో వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.ఆ తరువాత పనులు ప్రారంభిస్తాము. వంతెన నిర్మాణం పూర్తియితే వాహనదారుల ఇబ్బందులు తొలగుతాయి. మానస, ఇరిగేషన్ ఏఈ, చిలుకూరు -
కాశీగూడెంలో మద్యపాన నిషేధం
ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండలంలోని కాశీగూడెం గ్రామ పంచాయతీలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని గురువారం ప్రజాపాలన గ్రామసభలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామంలో, గ్రామ పరిధిలో మద్యం అమ్మడం, కొనుగోలు చేయడం, తాగడం పూర్తిగా నిషేధమని, ఇందుకు గ్రామస్తులంతా కట్టుబడి ఉండాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని అతిక్రమిస్తే వారికి గ్రామస్థాయిలో చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. గ్రామ సర్పంచ్ ధర్మానాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభలో వార్డు సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. లక్ష్మీనరసింహుడికి నిత్య కల్యాణం మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. అంతకు ముందు ఆలయంలో స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. కల్యాణం అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ బి.జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే జరిమానా ఆత్మకూర్ (ఎస్)(సూర్యాపేట) : మండలంలోని ఏపూర్ గ్రామంలో భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ఇసుక అక్రమ రవాణాను నిలిపివేసేందుకు గ్రామస్తులు ఏకమయ్యారు. ఈ మేరకు గురువారం గ్రామ అభివృద్ధి కమిటీ తీర్మానం చేసింది. గ్రామ సమీపంలో ఉన్న ఏటి నుంచి కొందరు అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండడంతో గ్రామంలోని బోర్లు ఎండిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తే ట్రాక్టర్‌కు రూ.50వేలు, సహకరించిన వారికి రూ.10వేల జరిమానా విధించాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఇసుక రవాణా సమాచారం ఇచ్చిన వారికి రూ.10వేల పారితోషికం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సమావేశంలో గ్రామ సర్పంచ్ చంద్ర మోహన్, అభివృద్ధి కమిటీని సభ్యులు పాల్గొన్నారు. -
రూ.4 కోట్ల యంత్రం
శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026కోదాడ: పేదల సౌకర్యార్థం కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో ఆరు నెలల క్రితం రూ.4కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కానింగ్ మిషన్ నేటికీ మూలన పడి ఉంది. దీని నిర్వహణకు అవసరమైన ఇద్దరు రేడియాలజిస్టులు, ఇద్దరు టెక్నీషియన్లు నియమించడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపకపోవడంతో విలువైన యంత్రం ప్రజలకు ఉపయోగం లేకుండా పోయింది. సిటీస్కాన్ మిషన్ ప్రారంభించిన నాడు రూమ్‌కు వేసిన తాళం ఇప్పటికీ తీసిన దాఖలాలు లేవు. దీని నిర్వహణకు అవసరమైన సిబ్బందిని కేటాయించాలని వైద్యశాల నిర్వాహకులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా నియమాకం మాత్రం జరగడం లేదు. దీంతో పేదలు సిటీ స్కానింగ్ కోసం ఖమ్మం, సూర్యాపేటకు వెళ్లాల్సి వస్తోంది. ఆరు నెలలుగా తీయని తాళం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోదాడ ప్రభుత్వ వైద్యశాలను 30 పడకల నుంచి 100 పడకల స్థాయికి పెంచారు. నూతన భవన నిర్మాణానికి రూ.26 కోట్లు మంజూరు చేయడంతో ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గత సంవత్సరం ఆగస్టులో కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ రూ.4కోట్ల విలువైన సిటీ స్కానింగ్ మిషన్ మంజూరు చేసింది. దీనిని వైద్యశాలలో మూడు గదులను కూలగొట్టి కొత్తరూం నిర్మించి అందులో సిటీ స్కానింగ్ యంత్రం ఏర్పాటు చేశారు. కానీ దీని నిర్వహణకు అసరమైన ఇద్దరు రేడియాలజిస్టులు, ఇద్దరు టెక్నీషియన్లను మాత్రం నియమించలేదు. యంత్రం పనిచేస్తుందా.. గడిచిన ఆరు నెలలుగా కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సిటీ స్కానింగ్ మిషన్ ఏర్పాటు చేసిన గదిపైన మరో రెండు అంతస్తుల నిర్మాణం చేస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతుండడంతో దుమ్ము, ధూళి, సిమెంట్ గదిలోకి చేరి యంత్రం పాడైపోతుందేమోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించి సిటీస్కానింగ్ యంత్రాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని పట్టణ వాసులు కోరుతున్నారు.మహిళలను వేధిస్తే కేసులే : ఎస్పీచివ్వెంల(సూర్యాపేట) : మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం చివ్వెంల మండల పరిధిలోని జి.తిర్మలగిరి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆయన మాట్లాడారు. గ్రామాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యం కావాలన్నారు. అవసాన దశలో తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాలని, గంజాయి, డ్రగ్స్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. సామాజిక అంశాలు, భద్రతపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. జిల్లాలో పోలీస్ భరోసా కార్యక్రమం ద్వారా 300 గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రయాణ సమయంలో జాగ్రత్తగా వెళ్లాలని, మద్యం మత్తులో వాహనాలు నడపొద్దన్నారు. సైబర్‌నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరైనా వినియోగిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సీఐ రాజశేఖర్, ఎస్ఐ మహేశ్వర్, సర్పంచ్ నగేష్ పాల్గొన్నారు. కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో వృథాగా సిటీ స్కానింగ్ మిషన్ రేడియాలజిస్టులు, టెక్నీషియన్లను నియమించకపోవడంతో వినియోగంలోకి రాని యంత్రం -
ఫేస్ చూపిస్తేనే అటెండెన్స్
కోదాడ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఉన్నత విద్యా వ్యవస్థలో కీలక మార్పు చోటుచేసుకుంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో బయోమెట్రిక్ విధానం స్థానంలో ‘ముఖ గుర్తింపు హాజరు’ (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్) విధానాన్ని తీసుకువచ్చారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 11 ప్రభుత్వ, 2 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులతో పాటు అధ్యాపకులకు, నాన్ టీచింగ్ స్టాఫ్‌కు ఈ విధానం అమలు చేస్తున్నారు. దీంతో తరగతులకు డుమ్మా కొట్టడానికి వీలు లేకుండా పోతుంది. ఫైలెట్ ప్రాజెక్ట్‌గా మార్చి 15 నుంచి కొన్ని కళాశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తుండగా.. ఇది విజయవంతం కావడంతో అన్ని డిగ్రీ కళాశాలల్లో బుధవారం నుంచి అమలులోకి తెచ్చారు. ప్రత్యేక యాప్ రూపొందించిన విద్యాశాఖఇప్పటివరకు డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఈ విధానంలో మిషన్లు పనిచేయకపోవడం, కృత్రిమ వేలిముద్రలు వాడడం వంటివి చేస్తుండడంతో ఉన్నత విద్యాశాఖ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి హాజరు నమోదు చేసే ఎఫ్ఆర్సీ యాప్‌ను తీసుకువచ్చింది. ‘రెయింట్ ఏఐ సొల్యూషన్స్’ సంస్థ రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా ఈ ప్రక్రియ సాగుతోంది. అధ్యాపకులు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా తరగతి గదిలోనే నిమిషాల వ్యవధిలో వందలాది మంది విద్యార్థుల హాజరును నమోదు చేస్తున్నారు. ఒక్కసారి నమోదు అధ్యాపకులు, విద్యార్థులు ఒకసారి ఈ యాప్‌లో తమ పేరుతో పాటు ముఖాన్ని నమోదు చేసుకోవాలి. ఆ తరువాత యాప్ ద్వారా ప్రతిరోజు, ప్రతి పిరియడ్ హాజరు నమోదు చేయాల్సి ఉంటుంది. తరగతి గదిలో యాప్‌ను ఉపయోగించి ఒకేసారి వంద మంది విద్యార్థుల హాజరు తీసుకోవచ్చు. రెండు, మూడు నిమిషాల్లోనే ఈ విధానం పూర్తవుతుంది. కాగా.. కళాశాల లొకేషన్లో మాత్రమే ఈ యాప్ పనిచేస్తుంది. ఫోన్లో తీసుకున్న హాజరు నేరుగా ఉన్నత విద్యాశాఖ సర్వర్‌లో నమోదవుతుంది. దీని ద్వారా ఎంతమంది అధ్యాపకులు, విద్యార్థులు కళాశాలలకు వచ్చారు? ఎంతమంది డుమ్మా కొట్టారనే విషయం క్షణాల్లో తెలిసిపోతుంది. హాజరు పట్టిక అవసరం లేదుడిగ్రీ కళాశాలల్లో ముఖ గుర్తింపు హాజరు నమోదు చేస్తున్నందున అధ్యాపకులు ప్రత్యేకంగా హాజరు పట్టికలను ఉపయోగించాల్సిన అవసరం లేదని ఉన్నత విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులు రెండవ సెమిస్టర్లో, రెండవ సంవత్సరం విద్యార్థులు నాలుగో సెమిస్టర్లో ఉండగా.. వీరికి యాప్‌ను ఉపయోగించి హాజరు నమోదు చేస్తున్నారు. దీని ద్వారా విద్యార్థులను తరగతులకు హాజరయ్యేలా చూడడంతో పాటు 75 శాతం కంటే తక్కువ హాజరు ఉన్న విద్యార్థులకు ఉపకార వేతనాలు నిలిపివేయనున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు దుర్వినియోగం కాకుండా చెక్ పెట్టవచ్చని అధికారులు అంటున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అమల్లోకి వచ్చిన ఎఫ్ఆర్సీ విద్యార్థులతోపాటు అధ్యాపకులు, సిబ్బందికి తప్పనిసరి కళాశాల ప్రాంగణంలో ఉంటేనే పనిచేసేలా సాఫ్ట్వేర్ రూపకల్పనప్రైవేట్ కళాశాలలకు మినహాయింపుపై విమర్శలు జిల్లా వ్యాప్తంగా 50కి పైగా ప్రైవేట్ డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిలో సగానికిపైగా విద్యార్థులు తరగతులకు రాకుండా నేరుగా పరీక్షలకు హాజరవుతున్నారనే విమర్శలున్నాయి. అంతేకాకుండా కళాశాలలు కూడా అధ్యాపకులను నియమించకుండా కేవలం ఉపకార వేతనాల కోసమే కళాశాలలను నడుపుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో ఈ విధానం అమలు చేసి ప్రైవేట్ కళాశాలలను వదిలేస్తే తమకు అడ్మిషన్లు తగ్గిపోతాయని, ప్రైవేట్ కళాశాలల్లో కూడా ఎఫ్ఆర్సీ విధానం అమలు చేయాలని ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు పేర్కొంటున్నారు. -
సర్దార్ సర్వాయి పాపన్నకు నివాళి
సూర్యాపేట, సూర్యాపేటటౌన్ : సూర్యాపేటలో గురువారం జిల్లా గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ రామ్మూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వం జిల్లా కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను సాధించాలని కోరారు. కార్యక్రమంలో గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తలూరి యాదగిరి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు అల్లాడి సత్యనారాయణ గౌడ్, గోపగాని సుధాకర్ గౌడ్ గుణగంటి సురేందర్ గౌడ్, జిల్లా కార్యదర్శి వేణు సిద్ధార్థ్ గౌడ్, సూర్యాపేట డివిజన్ అధ్యక్షుడు లింగాల రవి, కార్యదర్శి సురభి శ్రీధర్ గౌడ్, తుంగతుర్తి డివిజన్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ గౌడ్, తండ అంజయ్య గౌడ్, బైరు విజయ్ గౌడ్, చిత్తలూరి రవీందర్ గౌడ్, ఉయ్యాల నర్సయ్య గౌడ్, పులుసు శ్రీనివాస్ గౌడ్, అంతటి వెంకన్న గౌడ్, బాలగాని కుమార్ గౌడ్ పాల్గొన్నారు. -
పూర్తిస్థాయిలో మూసీ ప్రక్షాళన చేపట్టాలి
నేరేడుచర్ల : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ నది ప్రక్షాళన పనులు కేవలం హైదరాబాద్ పట్టణానికే పరిమితం కాకుండా పూర్తిస్థాయిలో చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్లలోని అరిబండి భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని వాడపల్లి కృష్ణానదికి త్రివేణి సంగమం అని అక్కడి వరకు ప్రక్షాళన చేపట్టాలని పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్టులో ఇసుక మేటలు, మట్టితో పూడిక పేరుకుపోయిందని, దీనిని తొలగించి నీటి నిలువలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన షట్టర్లను మరమ్మతులు చేయించాలన్నారు. కాలువకు ఇరువైపులా సీసీ లైనింగ్ పనులు చేపట్టాలని, చివరి భూముల రైతులకు నీరు అందించాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు పారేపల్లి శేఖర్‌రావు, వీరేపల్లి వెంకటేశ్వర్లు, పల్లా వెంకట్‌రెడ్డి, అనంత్ ప్రకాశ్, నగేష్, రామ్మూర్తి, హుస్సేన్, సైదులు, వడిత్యనాయక్, వెంకటేశ్వర్లు తదితరులున్నారు. -
చట్టాలపై అవగాహన
చివ్వెంల(సూర్యాపేట) : మహిళలు చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఫర్హీన్ కౌసర్ అన్నారు. గృహహింస, వరకట్న మరణాలు వంటి నేరాలపై గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లకు అవగాహన కల్పించారు. లక్ష్మీనారసింహుడికి గరుడ వాహనసేవమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో గురువారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఎదుర్కోళ్ల మహోత్సవం జరిపించిన అనంతరం మాంగల్యధారణ పూర్తిగావించారు. స్వామి అమ్మవార్లను గరుడ వాహనంపై అధిష్టించి ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయంలో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. -
పారాక్వాట్ నిషేధం
ప్రభుత్వం పారాక్వాట్ గడ్డిమందుపై నిషేధం విధించింది. జిల్లాలో ఈ మందు నిల్వ చేయడం, వాడకం ఎవరూ చేయొద్దు. ప్రాణాంతకమైన ఈ మందుతో చాలా ఇబ్బందులు వస్తాయి. – శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భానుపురి (సూర్యాపేట) : గడ్డిమందు తాగి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగి పోతోంది. గడ్డిమందుకు విరుగుడు లేకపోవడంతో ఈ మందును ఏమాత్రం తీసుకున్నా మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలురకాల గడ్డిమందులు, అందులోనూ పారాక్వాట్ అనే మరో రకం గడ్డిమందుపై నిషేధం విధించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఈ మందు వాడకంపై నిషేధం విధిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటించింది. ఇప్పటికే జీవో 24జారీ చేశారు. నిషేధంతో పారాక్వాట్ వినియోగం, నిల్వలపై యంత్రాంగం దృష్టిసారించింది. జిల్లాలో కొద్దిమొత్తంలోనే వినియోగం జిల్లాలో ఈ పారాక్వాట్ వినియోగం కొద్దిమొత్తంలోనే ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఈ మందును మెట్టపంటల్లో కలుపు నివారణ కోసం వాడుతుంటారు. దీంతో గడ్డి జాతులకు చెందిన పలు రకాల కలుపు వెంటనే చనిపోతోంది. కూలీల ఖర్చు లేకుండా చాలామంది ఈ మందునే వాడుతున్నారు. అయితే తమ పంటలకు వాడుకోగా.. మిగిలిన మందును రైతులు మరోసారి వాడుకోవచ్చన్న ఉద్దేశంతో ఇళ్లు, పొలాల వద్దనే ఉంచుతున్నారు. అనుకోకుండా ఇంట్లో జరిగే చిన్నచిన్న తగా దాలకు క్షణికావేశంతో ఈ మందును తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడే ఘటనలు జిల్లాలో చాలా కాలంగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ఈ మందు వాడకంపై వివరాలు సేకరించగా జిల్లాలో ప్రతి సంవత్సరం దాదాపు 200 లీటర్ల గడ్డిమందును వాడుతున్నట్లు గుర్తించారు. ఈ ఒక్క పారాక్వాట్ గడ్డి మందు కాకుండా ఇతర గడ్డి మందులు తాగిన వారి పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని రైతులు, ప్రజలు అంటున్నారు. గడ్డి మందులు తాగితే మనిషి ఎక్కువకాలం బతకడం కష్టమేనని రైతులు చెప్పుకుంటున్నారు. వైద్యులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ మెట్టపంటల్లో కలుపు నివారణకు ఈ గడ్డిమందు వినియోగం ఫ జిల్లాలో ప్రతి సంవత్సరం 200 లీటర్ల వరకూ వాడకం ఫ నిషేధంతో వినియోగం, నిల్వలపై యంత్రాంగం దృష్టి -
ధాన్యం ధర తగ్గించి..
సాగర్ ఆయకట్టు ప్రాంతంలోని మిల్లర్లు ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తూ రైతులను ముంచుతున్నారు. గురువారం శ్రీ 2 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026చికెన్ షాపులు బంద్ భానుపురి (సూర్యాపేట) : చికెన్ షాపులకు కోళ్లు సరఫరా చేసే యజమానులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చికెన్ షాపుల యజమానుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం జిల్లావ్యాప్తంగా చికెన్ షాపుల యజ మానులు తమ షాపులను బంద్ చేశారు. జిల్లాకేంద్రంలో షాపుల యజమానులు స్వచ్ఛందంగా షాపులు మూసివేసి తమ నిరసన తెలిపారు. దీంతో చికెన్ షాపులు జనం లేక వెలవెలబోయి కనిపించాయి. ప్రజల ప్రాణాలకు భరోసా ఫోన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే బాధితుల వద్దకు వెళ్లి ఆస్పత్రికి చేరుస్తున్నారు 108 సిబ్బంది. - 8లోనేడు గ్రామసభలుభానుపురి (సూర్యాపేట) : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లావ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించనున్నారు. ఇందుకోసం గ్రామాల్లో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక అధికారుల సమక్షంలో ఈ సభలు జరగనున్నాయి. ఈ గ్రామసభల్లో ఆయా గ్రామాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి పేర్లను చదివి వినిపించనున్నారు. అలాగే గ్రామాభివృద్ధికి చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా లబ్ధిపొందుతున్న లబ్ధిదారుల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇవే కాకుండా కాంగ్రెస్ ప్రజాపాలన తీరుపై ప్రజల నుంచి సూచనలు, అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఇందుకోసం వార్డు సభ్యుల నుంచి ప్రతి పౌరుడిని ఈ గ్రామసభలో భాగస్వామ్యం చేసేలా ఇప్పటికే ప్రచారం చేశారు. ప్రజాప్రతినిధులకు ఆహ్వానాలు కూడా అందజేశారు.ఫ అంతటా ఏర్పాట్లు పూర్తి ఫ గ్రామాల అభివృద్ధిపై చర్చించనున్న అధికారులు -
ప్రతిఒక్కరూ బాధ్యతగా నడుచుకోవాలి
సూర్యాపేట : ప్రతిఒక్కరూ చట్ట పరిధిలో బాధ్యతగా నడుచుకోవాలని ఎస్పీ కె.నరసింహ అన్నా రు. బుధవారం సూర్యాపేటలోని ఎస్పీ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేశారు. జిల్లాలో ప్రజలు పోగొట్టుకున్న రూ.20 లక్షల విలువైనల 106 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి బాధితులకు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహ డబ్బులు కూడా కోల్పోతారన్నారు. ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR-పోర్టల్ (https-://www.ceir. gov.in)లో నమోదు చేసుకోవాలని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్, ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు. -
జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి
భానుపురి (సూర్యాపేట) : మహనీయుల జయంతి ఉత్సవాల్లో ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ కోరారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో బాబు జగ్జీవన్‌రామ్, బీఆర్.అంబేద్కర్ జయంతుల నేపథ్యంలో ఏర్పాట్లపై వివిధ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహనీయుల చరిత్ర అందరికీ తెలిసేలా విద్యా సంస్థల్లో వ్యాసచరచన పోటీలు నిర్వహించాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన–ప్రగతి ప్రణా ళిక 99 రోజుల కార్యక్రమం చేపట్టిందని అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించేందుకు గురువారం మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజం అంటే అన్ని వర్గాల ప్రజలు ఉంటారని, కులమతాలకు అతీకంగా ప్రజాప్రతినిధులు, నాయకులను ఈ గ్రామసభలకు ఆహ్వానించాలన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతులు, మరమ్మతులకు నిధులు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారులు దయానందరాణి, శంకర్, నరసింహారావు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
నేటి నుంచి మూడు నెలల రేషన్
భానుపురి (సూర్యాపేట) : రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటాను ఒకేసారి పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. బుధవారం నుంచి జిల్లా వ్యాప్తంగా పంపిణీ ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్‌ను ఈ నెలలోనే ఇవ్వనున్నారు. జిల్లాలో 3,55,057 రేషన్ కార్డు దారులకు ప్రతినెలా 6వేల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. మూడు నెలలకు 18వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. మొత్తం బియ్యాన్ని దుకాణాల్లో నిల్వ చేసే అవకాశం లేక పోవడంతో రెండు విడతలుగా ఇవ్వనున్నారు. అవి కూడా సన్న బియ్యమే అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం శ్రీ 1 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026- 8లోమట్టపల్లి ఆలయంలో నిత్యకల్యాణంమఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు, నిత్యకల్యాణం నిర్వహించారు. అదేవిధంగా క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి తమలపాకులతో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేసిన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్ర మంలో అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
మహిళల స్వావలంబనకు అడుగులు
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ భానుపురి (సూర్యాపేట) : ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతకు, స్వావలంబనకు బలమైన అడుగు అని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా 290 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేసిన సందర్భంగా మంగళవారం సూర్యాపేట ఆర్టీసీ బస్టాండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఉచిత బస్సు పథకం వల్ల మహిళలకు రూ.10వేల కోట్ల ఆదా అయ్యిందన్నారు. 2023 డిసెంబర్ 9న ప్రారంభమైన ఈ పథకం ద్వారా మహిళలు తమ రోజువారీ ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకుంటున్నట్లు తెలిపారు. అనంతరం మహాలక్ష్మి పథకం ద్వారా బస్సులో ప్రయాణించే మహిళలను సన్మానించారు. మున్సిపల్ చైర్పర్సన్ మోరి శెట్టి నివేదిత, సంక్షేమ అధికారి నరసింహారావు, ఆర్డీఓ వేణు మాధవరావు, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం సుచరిత, అడిషనల్ డీఆర్డీఓ సురేష్, సూర్యాపేట డిపో మేనేజర్ సునీత, కౌన్సిలర్ అరుణ పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలు ప్రజాపాలన – ప్రగతి నివేదిక కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లేలా కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభలపై మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వైద్య, పంచాయతీ రాజ్, మున్సిపల్, మైనింగ్ కార్య దర్శులు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మాట్లాడారు. -
పట్టాలెక్కేనా..
భానుపురి (సూర్యాపేట) : సాదా బైనామాల పరిష్కారానికి అనేక ఏళ్లుగా దరఖాస్తు దారులు ఎదురు చూస్తున్నారు. అనేక చిక్కుముడులు, అడ్డంకులతో వీటికి మోక్షం కలగడం లేదు. దాంతో కాగితాలపై రాసుకుని భూములు కొనుగోలు చేసిన రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం సాదాబైనామాల పరిష్కారానికి వేసిన ముందడుగు రైతుకు కాస్త ఊరట కలిగిస్తోంది. తమ సమస్య పరిష్కారానికి అడ్డంకులు తొలగినట్లేనని వారు భావిస్తున్నారు. ఇదే జరిగితే జిల్లాలో పెద్ద ఎత్తున భూ సమస్యలు తీరనున్నాయి. కాగితంపై రాసుకొని కొనుగోళ్లు.. గ్రామీణ ప్రాంతాల్లో పూర్వం చాలా వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేదు. కేవలం అమ్మిన, కొనుగోలు చేసిన రైతులు గ్రామ పెద్దల సమక్షంలో తెల్లకాగితాలపై రాసుకొనే భూములు విక్రయించే వారు. ఆ తరువాత వ్యవసాయ భూములకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడం ప్రారంభించడం, రుణాలు మాఫీ అవుతుండడంతో చాలామంది రైతులు భూముల రిజిస్ట్రేషన్ల వైపు మళ్లారు. మరి కొందరు రిజిస్ట్రేషన్ల కోసం డబ్బులు వెచ్చించాల్సి రావడంతో, ఆ మొత్తం వారి వద్ద లేకపోవడంతో అలాగే వదిలేశారు. ఈ క్రమంలోనే రైతుబంధు, రైతుభరోసా పథకాలు రావడంతో భూముల పంచాయతీలు మొదలయ్యాయి. 2020 అక్టోబర్‌లో ప్రభుత్వం ఈ సాదాబైనామా కింద భూములు కొనుగోలు చేసిన రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. దాంతో సూర్యాపేట జిల్లాలో 29,814 దరఖాస్తులు వచ్చాయి. కొత్త చట్టం వచ్చినా.. సాదాబైనామాల దరఖాస్తులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకునే సమయంలో పలు కోర్టు కేసుల కారణంగా నిలిచిపోయింది. కొంత కాలానికి కోర్టు చిక్కులు తొలిగిపోగా.. కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరించేందుకు కొత్తగా తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో పేర్కొన్న ఇరుపక్షాల అంగీకారం నిబంధనతో వాటిని పరిష్కరించే పరిస్థితి లేకుండా పోయింది. తాజాగా ఈ నిబంధనలో ప్రభుత్వం మార్పు చేసింది. కొనుగోలుదారు అందించే హామీ పత్రం (అఫిడవిట్)తో పరిష్కారం చూపాలని నిర్ణయించారు. ఫ సాదా బైనామాల పరిష్కారంలో అనేక చిక్కుముడులు ఫ దరఖాస్తులకు నేటికీ కలుగని మోక్షం ఫ జీఓలో సవరణతో దరఖాస్తుదారుల్లో చిగురిస్తున్న ఆశలు -
డ్రంకెన్ డ్రైవ్‌తోనే రోడ్డు ప్రమాదాలు
ఫ ఎస్పీ నరసింహ సూర్యాపేట : మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్పీ నరసింహ అన్నారు. ‘అరైవ్– అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు, పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ నుంచి కుడకుడ రోడ్డు వరకు స్థానిక ప్రజలకు, ఆటో, టాక్సీ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చాలన్నారు. వాహనాలు నడుపుతున్న సమయంలో రోడ్డుపై ఉన్న పరిస్థితులను అంచనా వేస్తూ, కాలినడకన వెళ్లే వారిని గమనిస్తూ ముందుకు సాగాలని సూచించారు. టాక్సీ, ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని, వాహనానికి సంబంధించి అనుమతి పత్రాలు వెంట ఉండాలన్నారు. వాహనాలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, డ్రైవర్ పక్కన ప్రయాణికులను కూర్చోబెట్టుకో వద్దని సూచించారు. పెద్ద వాహనాలు నడిపే సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోవడం సురక్షితమని, నిదానంగా వాహనాలను నడుపుతూ సురక్షితంగా గమ్యం చేరాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, పట్టణ ఎస్ఐలు ఏడుకొండలు, ఐలయ్య పాల్గొన్నారు. -
భానుపురి బడ్జెట్ రూ.107.30 కోట్లు
సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.107.30 కోట్ల అంచనా బడ్జెట్‌కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. సోమవారం జిల్లాకేంద్రంలోని రవి మహల్ ఫంక్షన్ హాల్లో సూర్యాపేట మున్సిపల్ 2025–26 ఆర్థిక సంవత్సరం సవరణ బడ్జెట్, 2026–27 ముసాయిదా బడ్జెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది మాట్లాడుతూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారుల భాగస్వామ్యంతోపాటు మున్సిపాలిటీ ఆదాయం పెంచడం ద్వారానే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అన్నిరకాల పన్నులు, అదనపు డిపాజిట్లు, ప్లాన్ గ్రాంట్, నాన్–ప్లాన్ గ్రాంట్, ఇతర అభివృద్ధి పనుల నిధులతో కలిపి మొత్తం రూ.107.30 కోట్లతో బడ్జెట్ రూపొందించామని వివరించారు. ఇందులోనే అన్ని రకాల ఖర్చులు (వేతనాలు), పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ చార్జీలు, రుణాల చెల్లింపులు, గ్రీన్ బడ్జెట్, ఇంజినీరింగ్ విభాగ నిర్వహణ, సాధారణ పరిపాలనకు కేటాయింపులు చేశామని ఆమె వివరించారు. అదనపు ఆదాయ వనరులను గుర్తించడం అత్యవసరమన్నారు. అక్రమ నిర్మాణాలను నియంత్రించడం, మున్సిపాలిటీ ఆస్తులను పరిరక్షించడం ద్వారా కూడా ఆదాయం పెంచుకోవచ్చని తెలిపారు. అనంతరం జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సి లర్లు తమ వార్డుల సమస్యలను చైర్పర్సన్, కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫిఉల్లా, కమిషనర్ సీహెచ్. హన్మంతరెడ్డి, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధంగా సమస్యలు పరిష్కరించాలి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో నెలకొన్న సమస్యలను ప్రణాళికాబద్ధంగా పరిష్కరించడం మున్సిపల్ పాలక మండలి బాధ్యత అని అన్నారు. బడ్జెట్ లక్ష్యాలకు అనుగుణంగా మున్సిపాలిటీ ఆదాయ వనరులను పెంచుకోవాలన్నారు. ఫ ఆమోదించిన మున్సిపల్ కౌన్సిల్ ఫ ఆదాయ వనరులు పెంచుకోవాలి : కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను అధికారులు నిర్లక్ష్యం చేయకుండా వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జెడ్పీ సీఈఓ శిరీష, రెవెన్యూ డివిజన్ అధికారి వేణుమాధవరావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జనగణనకు సిద్ధంగా ఉన్నాం జనగణనకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పేర్కొన్నారు. జనగణనకు సంబంధించి జనగణన రాష్ట్ర డైరెక్టర్ భారతి హోలికేరి సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హాజరై మాట్లాడారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
అడ్లూరు గ్రామసభలో తీవ్ర ఉద్రిక్తత
కోదాడరూరల్ : కోదాడ మండలం అడ్లూరులో సోమవారం నిర్వహించిన గ్రామసభ రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. గ్రామసభ ప్రారంభం కాగానే ఉప సర్పంచ్ ఉసిరికాయల శిరీష, కొందరు వార్డు సభ్యులు కలిసి ఇటీవల మంజూరైన నిధులతో గ్రామంలో ఎక్కడ పనిచేశారు, నిధులు ఎంత డ్రా చేశారని ప్రశ్నించారు. దీనిపై సర్పంచ్ గువ్వల శిరీష స్పందిస్తూ.. నిబంధనల ప్రకారమే పనులు చేశామని, పనులన్నింటికీ ఎంబీ రికార్డులు ఉన్నాయని, ఆ మేరకే నిధులు డ్రా చేశామని తెలిపారు. ఈ క్రమంలో మాటామాట పెరిగి రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కోదాడ రూరల్ పోలీసులు గ్రామానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా.. మొత్తం 10మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ గోపాల్‌రెడ్డి తెలిపారు. కర్రలతో దాడి చేసుకున్న రెండు వర్గాలు 10 మందిపై కేసు నమోదు -
కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు
సూర్యాపేట : ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి హెచ్చరించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట పట్టణం నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. గృహనిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కేవలం హుజూర్‌నగర్‌కే మంత్రిలా వ్యవహరిస్తున్నారని, జిల్లాలో ఇతర నియోజకవర్గాలను పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధి హామీని పాత పద్ధతిలోని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలన్నారు. అనంతరం కలెక్టరేట్లో కి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. కలెక్టర్ రాకపోవడంతో గేట్లు ఎక్కి దూకేందుకు ప్రయత్నించారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి, జిల్లేపల్లి నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, కందాల శంకర్‌రెడ్డి, మేకనబోయిన శేఖర్, దండ వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సంఘాల లెక్కలు చెప్పడంలేదని..
కట్టంగూర్ : సమభావన సంఘాలకు చెందిన లెక్కలను చెప్పకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆగ్రహించిన మహిళా సంఘాలు సభ్యులు విచారణకు వచ్చిన అధికారులతో పాటు సర్పంచ్‌ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించి తాళం వేశారు. ఈ సంఘటన కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు.. చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన వీబీకే నాగమణి మహిళా సంఘాలకు సంబంధించిన లెక్కలు చెప్పకపోవటంతో అనేకసార్లు ఉన్నతాధికారులకు మహిళా సంఘాలు సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై అధికారులు విచారణ కోసం అనేకసార్లు గ్రామానికి వెళ్లి లెక్కలు తేల్చకుండా వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించటం లేదు. ఇందులో భాగంగా సోమవారం ఏపీఎం డి. రాములు, సీసీ ప్రసాద్‌తో కలిసి చెర్వుఅన్నారం గ్రామ పంచాయతీకి విచారణ నిమిత్తం వెళ్లారు. గ్రామానికి వచ్చిన అధికారులు లెక్కలు చెప్పకుండా మరోసారి వాయిదా వేసినట్లు చెప్పడంతో ఆగ్రహించిన మహిళా సంఘాలు గ్రామ పంచాయతీకి తాళం వేసి మూడు గంటల పాటు అధికారులతో పాటు సర్పంచ్ చిలుముల సైదులును నిర్బంధించారు. మహిళలు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదు పత్రాలతో గ్రామ పంచాయతీ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ బంధం–2 అధ్యక్షురాలు గద్దపాటి రేణుక మాట్లాడుతూ.. తాను అధ్యక్షురాలిగా ఎన్నికై సంవత్సరం గడుస్తున్నా వీబీకే నాగమణి సంఘం లెక్కలు చూపించకుండా దాటవేస్తుందని, ఐకేపీ ధాన్యం కొనుగోలు నిర్వహణలో, సంఘం డిపాజిట్లలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. రాత్రయినా అధికారులను బయటకు పంపించకపోవటంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమభావన సంఘాల లెక్కలను క్లియర్ చేయిస్తామని హామీ ఇవ్వటంతో పంచాయతీ కార్యాలయం తాళం తీసి అధికారులను బయటకు పంపారు. మహిళా సంఘాల సభ్యుల ఆగ్రహం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులను బంధించిన సభ్యులు చెర్వుఅన్నారంలో ఘటన -
మహా శివుడికి సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహాశివుడికి ఇష్టమైన రోజు కావడంతో అర్చకులు విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు జరిపి, భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వతీ దేవి సేవను ఊరేగించారు. అదేవిధంగా యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కైంకర్యాలను అర్చకులు సంప్రదాయబద్ధంగా జరిపించారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
పెద్దవూర : గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతిచెందింది. ఈ ఘటన ఆదివారం రాత్రి పెద్దవూర మండలం ఉట్లపల్లి గ్రామంలో జరిగింది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండలం గేమ్యానాయక్ తండాకు చెందిన వడ్త్య తార(48) భర్తతో విడాకులు తీసుకుని అదే తండాలో తన తల్లి వద్ద ఉంటుంది. కొద్దిరోజులుగా ఉట్లపల్లి గ్రామానికి చెందిన బొజ్జ బుజ్జమ్మ ఇంటి వద్ద ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆదివారం ఉట్లపల్లిలో జరిగిన ఓ ఫంక్షన్‌కు వెళ్లిన తార మద్యం సేవించి గజ్జల లింగారెడ్డి ఇంటి సమీపంలో రోడ్డుపై నిద్రించింది. ఈ క్రమంలో రాత్రి గుర్తుతెలియని వాహనం రోడ్డుపై నిద్రించిన తారను ఢీకొట్టడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు మంగులాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వై. ప్రసాద్ తెలిపారు. -
సీఎంఆర్ ధాన్యం దిగుమతి చేసుకోం
భువనగిరిటౌన్ : 2025–26 రబీ సీజన్‌కు సంబంధించి సీఎంఆర్ ధాన్యాన్ని దిగుమతి చేసుకోబోమని యాదాద్రి భువనగిరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అసోసియేషన్ సభ్యులు జిల్లా అదనపు కలెక్టర్ వెంకారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. మిల్లుల్లో ఇప్పటికే భారీగా ధాన్యం నిల్వలు పేరుకుపోవడం, కొత్తగా వచ్చే ధాన్యాన్ని భద్రపరచడానికి తగినంత స్థలం లేకపోవడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని మిల్లర్లు తెలిపారు. ప్రస్తుతం 2024–25 రబీ కాలానికి సంబంధించి సుమారు 90,000 టన్నుల ధాన్యం మిల్లుల వద్దే నిల్వ ఉందని, అదేవిధంగా 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి మరో 2,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం రావాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఈ రెండు సీజన్లకు సంబంధించి రా రైస్ పెట్టాల్సి ఉన్నందున, నిల్వలు పెరిగిపోయి మిల్లుల్లో అడుగు పెట్టడానికి కూడా చోటు లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, పాత నిల్వలు పూర్తిగా డెలివరీ అయిన తర్వాతే కొత్త ధాన్యం దిగుమతి గురించి ఆలోచిస్తామని అసోసియేషన్ అధ్యక్షుడు మార్త వెంకటేశం, ప్రధాన కార్యదర్శి కోట మల్లారెడ్డి, కోశాధికారి గౌరిశెట్టి అశోక్ స్పష్టం చేశారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ నిర్ణయం -
రాచకొండ రిజర్వాయర్‌కు డీపీఆర్ సిద్ధం చేయాలి
సంస్థాన్ నారాయణపురం : సంస్థాన్ నారాయణపురం మండలానికి సాగు జలాలు అందించే రాచకొండ రిజర్వాయర్‌కు డీపీఆర్ సిద్ధం చేయాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. రాచకొండ రిజర్వాయర్ నిర్మించాలని సీపీఐ ఆధ్వర్యంలో సంస్థాన్ నారాయణపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం నిర్వహించిన మహాధర్నాలో రిటైర్డ్ ఇంజనీర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి నెల్లికంటి సత్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాలకులు మారినా ఎస్ఎల్బీసీ, డిండీ ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. డిండి ఎత్తిపోతల పథకం ఎత్తును 440 మీటర్లుగా నిర్ణయించడం అన్యాయమన్నారు. 436 మీటర్లుగా నిర్ణయించి దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగు జలాలు అందించాలన్నారు. రాష్ట్రంలో సాగు జాలలు అందని నియోజకవర్గం మునుగోడు ఒక్కటే అన్నారు. ఈ కార్యక్రమాంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, నాయకులు బచ్చనగోని గాలయ్య, పార్టీ మండల కార్యదర్శి దుబ్బక భాస్కర్, పల్లె శేఖర్‌రెడ్డి, కురుమిద్ద శ్రీనివాస్, చిలువేరు అంజయ్య, కలకొండ సంజీవ తదితరలున్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం -
ఫార్మాతో ఉజ్వల భవిష్యత్
నల్లగొండ టూటౌన్ : ఫార్మా రంగంతో ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. సోమవారం నల్లగొండలోని ఎంజీయూలో రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ–2026 అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రసాయనశాస్త్ర విభాగంలో ఉన్న ఆధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయ సదుపాయాలను విద్యార్థులు వినియోగించుకొని పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అహ్మద్ కమాల్, రామాచారి, వసంత, వై.ప్రశాంతి, జ్యోతి, డి.రమేష్, ఆర్.రూప, ఎస్.కళ్యాణి, ఎ.శ్రీధర్‌రావు, ఎ.తిరుపతయ్య పాల్గొన్నారు. -
బైక్‌ను ఢీకొట్టిన కారు.. ఒకరికి గాయాలు
తిప్పర్తి : బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన తిప్పర్తి మండల కేంద్రంలో సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని తిప్పలమ్మగూడెం గ్రామానికి చెందిన గోలి మాధవరెడ్డి బైక్‌పై ఇంటికి వెళ్తుండగా తిప్పర్తి మండల కేంద్రంలో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మాధవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణంపెద్దఅడిశర్లపల్లి : బైక్‌పై వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై పెద్దఅడిశర్లపల్లి మండలం చిల్కమర్రి గ్రామ స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. గుడిపల్లి ఎస్ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన మారుపాకుల చెన్నకేశవులు(29) బోర్వెల్ బండి నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం చెన్నకేశవులు బైక్‌పై అంగడిపేట నుంచి కొండమల్లేపల్లికి వెళ్తుండగా.. మార్గమధ్యలో చిల్కమర్రి గ్రామ స్టేజీ సమీపంలో తన బోర్వెల్ వాహనం కనిపించడంతో బైక్ ఆపి డ్రైవర్‌తో మాట్లాడాడు. అనంతరం బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి కారు వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నకేశవులు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని..హాలియా : బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండలం తానేదార్పల్లి గ్రామ బస్‌స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్లపల్లి అంజిరెడ్డి(23) బైక్‌పై గుర్రంపోడు నుంచి కొండమల్లేపల్లి వైపు వెళ్తుండగా.. తానేదార్పల్లి గ్రామ బస్‌స్టేజీ సమీపంలోకి రాగానే దేవరకొండ నుంచి నల్లగొండకు వెళ్తున్న పల్లెవెలుగు బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 వాహనంలో దేవరకొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి వడ్లపల్లి మణిపాల్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిఅడ్డగూడూరు : భార్య మృతితో మనోవేదనకు గురై పురుగుల మందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. సోమవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్డగూడూరు మండల పరిధిలోని బొడ్డుగూడెం గ్రామానికి చెందిన సూదిరెడ్డి రాంరెడ్డి(58) భార్య ఐదేళ్ల క్రితం మృతిచెందింది. అప్పటి నుంచి రాంరెడ్డి మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 15న పురుగుల మందు తాగి పొలం వద్ద పడి ఉండగా, అతడి కుమారుడు గమనించి సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. సోమవారం మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. -
మూడు నెలలుగా బడి మూసివేత
చందంపేట : నేరెడుగొమ్ము మండలంలోని పలుగుతండా గ్రామపంచాయతీ పరిధిలోని చెంచుకాలనీలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల మూడు నెలలుగా తెరుచుకోవడం లేదు. ఈ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు డిసెంబర్లో రాజీనామా చేశారు. అప్పటి నుంచి కొత్త ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో పాఠశాల మూతపడే ఉంది. ఈ పాఠశాలలో 15 మంది విద్యార్థులు చదువుతున్నారు. కొత్త ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో విద్యార్థులంతా ఇంటి వద్దే ఉంటున్నారు. కొంతమంది విద్యార్థులు పక్కనే ఉన్న పలుగుతండా ప్రాథమిక పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లి అక్కడ చదువుకుంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఐటీడీఏ అధికారులు వెంటనే స్పందించి పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని పలుగుతండా వాసులు కోరుతున్నారు. ఉపాధ్యాయురాలి రాజీనామా కొత్తవారి నియమించకపోవడంతో తెరుచుకోని స్కూల్ -
ఆశా వర్కర్లను ఉద్యోగులుగా గుర్తించాలి
సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించి, కనీస వేతనంగా నెలకు రూ.18 వేలు ఇవ్వాలని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఎన్.కవిత, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్ సెంటర్లో చేపట్టిన రాస్తారోకోలో వారు మాట్లాడారుఉ. ఆశా వర్కర్లకు పీఎఫ్, ఈఎస్ఐ, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. అన్యాయంగా తొలగించిన ఆశా వర్కర్ల వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్స్ జిల్లా నాయకురాలు రాధా భాగ్యలక్ష్మి, విజయ్ కుమారి, సైదమ్మ, ఉమా, హుస్సేనీ, సోమక్క, జ్యోతి, సుధా, సరస్వతి, అరుణ, సీత, జయమ్మ, సక్కుబాయి, బైనాబాయి, సీపీఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు, గౌరవ సలహాదారులు శ్యామల అశోక్ పాల్గొన్నారు. -
మొక్కల లక్ష్యం 44.36 లక్షలు
భానుపురి (సూర్యాపేట) : అటవీ విస్తీర్ణం పెంచేందుకు చేపట్టిన వన మహోత్సవానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. రానున్న వానాకాలం జిల్లావ్యాప్తంగా నాటేందుకు కావాల్సిన మొక్కల పెంపకానికి ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు 44.36 లక్షల మొక్కలు పెంచాలని టార్గెట్ విధించగా అన్ని మండలాల్లో ఉపాధి హామీ కూలీలతో అవసరమైన మొక్కల పెంపకం చేపడుతున్నారు. మండలాలకు లక్ష్యాలు కేటాయించి.. జిల్లాలోని 486 గ్రామపంచాయతీలకు గాను 485 వన నర్సరీలను ఏర్పాటు చేశారు. జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన లక్ష్యంలో ఆయా మండలాల వారీగా జిల్లా యంత్రాంగం మొక్కల పెంపకానికి లక్ష్యాలను కేటాయించారు. ఇందులో మూడు జాతులకు చెందిన పలు రకాల మొక్కలను పెంచనున్నారు. పెన్‌పహాడ్ మండలంలో అత్యధికంగా 2.89 లక్షలు, సూర్యాపేట మండలంలో 2.67 లక్షల మొక్కలు పెంచాల్సి ఉంది. పంచాయతీలకు సంరక్షణ బాధ్యత జిల్లాలో మొక్కల పెంపకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్నిచోట్ల మట్టిని జల్లెడ పట్టించి కవర్లలో నింపుతున్నారు. మరికొన్నిచోట్ల విత్తనాలను సైతం విత్తగా మొలకెత్తాయి. ప్రధానంగా నీడనిచ్చే మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కల్లో ఉండే పలు రకాలను పెంచుతున్నారు. వీటి సంరక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీలు చూస్తున్నాయి. ఏ గ్రామ పరిధిలో పెంచే మొక్కలను అక్కడే నాటేలా చూస్తున్నారు. ఫ వనమహోత్సవానికి సన్నద్ధమవుతున్న అధికారులు ఫ 485 వన నర్సరీల ఏర్పాటు ఫ ఉపాధిహామీ కూలీలతో ముమ్మరంగా మొక్కల పెంపకం -
రెండు గణితం ఎస్ఏ పోస్టులు మంజూరు చేయాలి
సూర్యాపేట : ప్రతి ఉన్నత పాఠశాలకు తప్పనిసరిగా రెండు గణితం ఎస్ఏ పోస్టులు మంజూరు చేయాలని, గణిత ల్యాబ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ మ్యాథమెటిక్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కందికొండ శ్రీనివాస్ కోరారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని కాకతీయ కాన్సెప్ట్ స్కూల్లో గణిత ఫోరం జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఎంఎఫ్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర పరిశీలకుడు కొరివి కృష్ణ, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి అడిగే సతీష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మండవ ఉపేందర్, ప్రధాన కార్యదర్శిగా జలగం పురుషోత్తం, ఆర్థిక కార్యదర్శిగా సురేందర్ రెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండా వెంకటేశ్వర్లు, టీఎంఎఫ్ మాజీ అధ్యక్షుడు నరేంద్ర స్వామి, మందాటి అశోక్, కోటేశ్వరరావు, కె.శ్యామ్ పాల్గొన్నారు. ఆర్య వైశ్యులు సమాజసేవకులుసూర్యాపేట : ఆర్యవైశ్యులు సమాజ సేవకులని, తాము జీవిస్తూనే పదిమందికి సహాయ సహకారాలు అందిస్తారని శ్రీ వాసవి సేవా సమితి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం తెలిపారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని కిరాణా ఫ్యాన్సీ భవన్లో శ్రీ వాసవి సేవా సమితి జిల్లా ప్రథమ సర్వసభ్య సమావేశాన్ని జిల్లా గౌరవ సలహాదారులు గోపారపు రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో శ్రీ వాసవి సేవా సమితి స్థాపించి అట్టడుగు వర్గాన ఉన్న ఆర్యవైశ్యులకు సేవలు అందిస్తోందన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహం, శివాజీ మహారాజ్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి దేవర శెట్టి నాగరాజు, కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్, మహంకాళి ప్రణీత్, సహాయ కార్యదర్శి కర్నాటి కృష్ణ, కోట శివ, వీరవెల్లి విజయ శంకర్ పాల్గొన్నారు. -
మట్టపల్లిలో నిత్య కల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామికి అర్చకులు విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లకు అభిషేకాలు , హోమశాలలో నిత్యహోమం చేపట్టారు. అనంతరం నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేశారు. తర్వాత విష్వక్సేనారాధన , పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ , మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. ఆలయంలో నీరా జన మంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ బి.జ్యోతి, ఆల య అర్చకులు రామాచార్యులు , పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు పాల్గొన్నారు. -
ప్రచండ భానుడు
సూర్యాపేటలో శనివారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుభానుపురి (సూర్యాపేట) : జిల్లావ్యాప్తంగా ఎండలు ముదురుతున్నాయి. వేసవి కాలం ప్రారంభమైన కొద్దిరోజులకే ఉష్ణోగ్రతలు పెరిగాయి. మూడు రోజులుగా జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలకు మించి ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ ఎండలు గతేడాదితో పోల్చితే ఎక్కువగానే ఉన్నాయి. ఈ సీజన్లో తొలిసారిగా శనివారం సూర్యాపేట పట్టణంలో 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో భానుపురి ఒక్కసారిగా భగ్గుమన్నది. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎండలు ముదరడంతో బోరుబావుల్లో జలాలు తగ్గిపోయి చాలావరకు పొలాలు ఎండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సాధారణానికి మించి.. జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు. కాగా ఏప్రిల్, మే మాసాల్లో ఈ ఎండల తీవ్రత మాత్రం అధికంగానే ఉంటుంది. రెండోవారం నుంచే 35 డిగ్రీలకు చేరుకుని ఆ తర్వాత 40 డిగ్రీలకు అటుఇటుగా నమోదవుతోంది. అయితే మార్చి మొదటి వారంలోనే సాధారణానికి మించి మూడు డిగ్రీలు అధికంగా 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ నెలంతా ఇదేవిధంగా ఎండల తీవ్రత ఉండగా.. శనివారం గతంలో ఎన్నడూ లేనివిధంగా 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రత నమోదైంది. 2025లో ఏప్రిల్ 7వ తేదీన 40.2 డిగ్రీలకు చేరగా.. ఈ వేసవిలో ముందుగానే శనివారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఎండలను చూసిన జనం బెంబేలెత్తి పోతున్నారు. ఉపశమనం కోసం.. వారం రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల కారణంగా మిరప తోటలు ఏరుతున్న వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు ఇబ్బంది పడుతున్నారు. నాలుగైదు రోజుల్లో రోజుకో డిగ్రీ చొప్పున ఉష్ణోగ్రతలు పెరగడంతో ఎండ తీవ్రత, ఉక్కపోతకు ఇళ్లల్లోనూ వృద్ధులు, చిన్నారులు ఉండలేని పరిస్థితి నెలకొంది. శనివారం ఉదయం 8గంటల వరకూ వాతావరణం చల్లబడి వర్షసూచన ఉన్నట్లు అనిపించినా.. మధ్యాహ్నం తర్వాత ఎండ తీవ్రత విపరీతంగా పెరిగింది. ఎండల తీవ్రత పెరగడం, రానున్న రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉండడంతో ప్రజలు ఉపశమనం పొందేందుకు ఇళ్లతో పాటు ఆఫీసుల్లో వేసవి నేస్తాలను సమకూర్చుకుంటున్నారు. ప్రధానంగా కూలర్లు, ఎయిర్ కండీషనర్ల (ఏసీ)ను రిపేర్ చేయించుకుంటున్నారు. 23 24 25 26 27 28ఫ ఈ సీజన్లో ఇదే అత్యధికం ఫ మూడురోజులుగా పెరిగిన ఎండ తీవ్రత ఫ గతేడాదితో పోల్చితే ముందుగానే భానుడి ప్రతాపంతేది -
కేసుల సత్వర పరిష్కారానికే లోక్ అదాలత్
చివ్వెంల(సూర్యాపేట) : పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసమే జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.లక్ష్మీశారద అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో పాల్గొని మాట్లాడారు. లోక్ అదాలత్‌లో పరిష్కారం చేసుకోవడం వల్ల స్నేహా పూర్వక వాతావరణం ఏర్పడుతుందని, ఇరువర్గాల వారు గెలిచిన వారు అవుతారన్నారు. ఒకసారి లోక్ అదాలత్‌లో పరిష్కారమైన కేసులపై అప్పీళ్లకు వేళ్లే అవకాశం ఉండదన్నారు. గత సంవత్సరం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ కానిస్టేబుల్ కుటుంబానికి శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ మంజూరు చేసిన రూ.కోటి 25లక్షల చెక్కు అందజేశారు. సూర్యాపేట జిల్లా కోర్టులో ఐదు బెంచీల ద్వారా నిర్వహించిన కేసుల్లో సివిల్, క్రిమినల్, బ్యాంకు, విద్యుత్, మోటర్ వెహికల్ యాక్టు, గృహ హింస మొత్తం 1849 కేసులు పరిష్కారమైనట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ఫర్హీన్ కౌసర్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి గోపు రజిత, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జీ ఎన్.అపూర్వ రవళి, రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జీ మంచాల మమత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కొంపల్లి లింగయ్య, ప్రధాన కార్యదర్శి రాజు, డీఎస్పీ ప్రసన్నకుమార్, సీనియర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. ఫ జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీశారద -
మట్టపల్లి క్షేత్రంలో చలువ పందిళ్లు
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆలయ పాలకవర్గం ఆధ్వర్యంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కొంత ముందుగా చలువ పందిళ్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. క్షేత్రంలోని రాజగోపురం నుంచి ఆలయంలోని ముఖమండపం, గర్భాలయం వరకు.. అదేవిధంగా శ్రీపార్వతీ రామలింగేశ్వరాలయంలో పూజలు చేసుకునే భక్తులకు అసౌకర్యం కలగకుండా పందిళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో భక్తులకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా మంచినీటి సౌకర్యం ఏర్పాటుకు కూడా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. -
నేడు బౌద్ధమత ప్రతినిధుల రాక
హాలియా : నాగార్జునసాగర్ తీరంలోని బుద్ధవనాన్ని శనివారం ఉదయం 22 దేశాల బౌద్ధమత ప్రతినిధులు సందర్శించనున్నారని బుద్ధవనం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బుద్ధవనం సమావేశ మందిరంలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ధ్యాన మందిరం, నాగార్జునకొండను సందర్శిస్తారని పేర్కొన్నారు. ఈ బృందంలో శ్రీలంక దేశ బౌద్ధమత సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హిణిడుమ సునీల్సెనేవి, వియత్నాం బౌద్ధ సంఘం ఉపాధ్యక్షుడు తిచ్నహత్, శ్రీలంక దేశపు ఉన్నతస్థాయి పీఠాధిపతి అగ్గరహేరాక సపమహాతేరో, సౌత్కోరియాగ్లోబల్ పీస్ అంబాసిడర్ మున్యోగ్ జోలతోపాటు పలుదేశాల బౌద్ధప్రతినిధులు ఉంటారని వెల్లడించారు. మట్టపల్లి ఆలయంలో నిత్య కల్యాణం మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శుక్రవారం స్వామివారికి విశేష పూజలు, నిత్య కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్ఫాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
కోదాడ పబ్లిక్ క్లబ్ కార్యవర్గం ఏకగ్రీవం
ఫ అధ్యక్ష, కార్యదర్శులుగా కత్రం సీతారాంరెడ్డి, పోటు రంగారావు కోదాడ : నెల రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపి, రెండుసార్లు వాయిదా పడిన కోదాడ పబ్లిక్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు చివరకు ఏకగ్రీవంతో ముగిశాయి. శుక్రవారం రాత్రి క్లబ్ కార్యవర్గాన్ని ఎంపిక చేయడానికి నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ 2026–28 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారని, వీరు ఆదివారం ప్రమాణ స్వీకారం చేస్తారని ఎన్నికల అధికారిగా నియమితులైన న్యాయవాది ఎస్ఆర్కె.మూర్తి క్లబ్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అధ్యక్షుడిగా కత్రం సీతారాంరెడ్డి, క్యార్యదర్శిగా విశ్రాంత ఉపాధ్యాయుడు పోటు రంగారావును ఎంపిక చేశారు. ఉపాధ్యక్షులుగా తోట రంగారావు, గుండపనేని వెంకట సత్యనారాయణరావు, సంయుక్త కార్యదర్శులుగా వంగవేటి గురునాథం, కోటమర్తి విద్యాసాగర్‌రావు, కార్యవర్గ సభ్యులుగా తమ్మనబోయిన రామయ్య, అమరనాయిని శేషగిరిరావు, సుంకర సత్యనారాయణ, మేకల ప్రతాప్, ముండ్రా రవికుమార్, ఇర్ల నాగమునీంధర్రెడ్డి, కుక్కడపు వెంకటేశ్వర్లు(బాబు)లను ఎంపిక చేశారు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేయడానికి సహకరించిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, మాజీ మంత్రి వీరేపల్లి లక్ష్మినారాయణ మాజీ ఎమ్మెల్యేలు వేనేపల్లి చందర్రావు, బొల్లం మల్లయ్యయాదవ్లకు ఐదుగురు కమిటీ సభ్యులు చింతకుంట్ల లక్ష్మినారాయణరెడ్డి, పి.సత్యబాబు, ఎం.పాండురంగారావు, వేనేపల్లి వెంకటయ్య, పార సీతయ్యలు కృతజ్ఞతలు తెలిపారు. -
దోచేస్తునా్నరు
ఖాతాలు అద్దెకు తీసుకునికోదాడ : సైబర్ నేరగాళ్లకు కోదాడ అడ్డాగా మారింది. ఈ నియోజకవర్గ పరిధిలోని మూడు గ్రామాలకు చెందిన పలువురు యువకులు కోదాడలోని మూడు బ్యాంకులలో కరెంట్ ఖాతాలను తెరిచి వాటిని మ్యూల్ ఖాతాలుగా మార్చారు. (ఖాతాలను ఇతరులకు అద్దెకు ఇవ్వడాన్ని మ్యూల్ ఖాతాలంటారు) వీటిని ఉపయోగించిన సైబర్ నేరగాళ్లు ఇతరుల ఖాతాలను డిజిటల్ అరెస్ట్ చేసి ఆ తరువాత ఆ ఖాతాల్లోని డబ్బులను కొల్లగొట్టి తాము అద్దెకు తీసుకున్న ఈ ఖాతాల్లోకి మరల్చడం వెంటనే వాటిని డ్రా చేసుకొని నేరానికి పాల్ప డుతున్నారు. సైబర్ నేరాలపై ఇటివల ప్రభుత్వం ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్’ పేరిట తనిఖీలు నిర్వహించగా కోదాడలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 116 ఖాతాలు, ఇండియన్ బ్యాంక్‌లో 37,సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 89 మ్యూల్ ఖాతాలను కనుగొన్నారు. పూర్తిస్ధాయిలో కోదాడ, పరిసర మండలాల్లోని బ్యాంకుల్లో తనిఖీలు నిర్వహిస్తే మరికొన్ని ఇలాంటి ఖాతాలు బయటపడే అవకాశం ఉందని పలువురు బ్యాంకు అధికారులే అంటున్నారు. ఈ మూడు బ్యాంకులలో 242 ఖాతాలు తెరిచిన వారు 1,271 సైబర్ నేరాలతో లింక్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ట్రేడింగ్ యాప్‌తో మొదలు పెట్టి.. కోదాడ నియోజకవర్గ పరిధిలోని నడిగూడెం మండలం వల్లాపురం, సిరిపురం, మునగాల మండలం ఆకుపాములలో రెండు సంవత్సరాలుగా కొంత మంది యువకులు బినాన్స్ అనే ప్రైవేట్ ట్రేడింగ్ యాప్ ద్వారా ట్రేడింగ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. వీరు దీని కోసం వీరు వల్లాపురం, సిరిపురం, ఆకుపాముల, అనంతగిరి, నడిగూడెం బ్యాంకులలో కరెంట్ ఖాతాలను తెరిచారు. ఆ తరువాత నెమ్మదిగా వీటిని మ్యూల్ ఖాతాలుగా మార్చి భారీగా కమీషన్ తీసుకోసాగారు. తమ బంధువులకు, మిత్రులకు ఈ ట్రేడింగ్, మ్యూల్ ఖాతాలను గురించి చెప్పడంతో వందల మంది ఈ విధంగా చేయసాగారు. విషయం తెలుసుకున్న పలు బ్యాంకులు వల్లాపురం, సిరిపుర, ఆకుపాముల గ్రామాలకు చెందిన వారికి ఖాతాలు ఇవ్వడానికి నిరాకరించడంతో వారంతా కోదాడలోని వ్యాపారం తక్కువగా ఉండే బ్యాంకులలో, కొత్తగా బ్రాంచీలు ఒపెన్ చేసే బ్యాంకులలో ఇలాంటి ఖాతాలను ఓపెన్ చేయడం ప్రారంభించారు. ఈ గ్రామాలకు చెందిన పలువురు సమీపంలో ఉన్న ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామలలో కూడా ఈ మ్యూల్ ఖాతాలను తెరిచారు. సైబర్ క్రైం పోలీసులు ఈ మూడు గ్రామాలలో పలు విడతలు సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నా వీరు మాత్రం మారడం లేదని ఆయా గ్రామాల పెద్దలు అంటున్నారు. ఇటీవల పోలీసులు కేసులు నమోదు చేయడంతో వీరు అజ్ఞాతంలోకి వెళ్లి న్యాయవాదుల ద్వారా రాష్ట్ర హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.కోదాడ నియోజకవర్గ పరిధిలోని వల్లాపురం, ఆకుపాముల, సిరిపురం గ్రామాలకు చెందిన 116 మంది కోదాడలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో కరెంట్ ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాల ద్వారా ఒక యాప్‌ను ఉపయోగించి ట్రేడింగ్ చేస్తూనే ఈ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు అద్దెకు ఇచ్చారు. ఇలా అద్దెకు ఇచ్చే ఖాతాలను మ్యూల్ ఖాతాలు అంటారు. ఈ ఖాతాలను ఉపయోగించి సైబర్ నేరగాళ్లు అమాయకుల ఖాతాలను డిజిటల్ అరెస్ట్ పేరుతో లూటీ చేశారు. ఇటీవల ఆపరేషన్ క్రాక్‌డౌన్ కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైం పోలీసులు చేసిన తనిఖీలలో ఈ బ్యాంకులో ఖాతాలు తెరిచిన 116 మంది తమ ఖాతాలను కమీషన్‌కు ఆశపడినేరస్తులకు అద్దెకు ఇవ్వడం ద్వారా 778 సైబర్ నేరాలు జరిగినట్లు సైబర్ క్రైం పోలీసులు నిర్ధారించారు.సైబర్ నేరాలకు అడ్డాగా కోదాడ రాష్ట్ర వ్యాప్తంగా 454 మ్యూల్ ఖాతాలు ఒక్క కోదాడలోనే 242 గుర్తింపు 1271 సైబర్ నేరాలతో సంబంధం ఆపరేషన్ క్రాక్‌డౌన్‌లో వెలుగు చూసిన అక్రమాలు37 కేసులు నమోదు చేశాం కోదాడ పరిసరప్రాంతాలకు చెందిన వారు కోదాడ బ్యాంక్‌లలో ఖాతా లను ఓపెన్ చేసి ఇతరులకు అద్దెకు ఇస్తున్నారు. దీనిపై నిఘా పెట్టి ఇటీవల తనిఖీలు చేశాం. అక్రమాలకు పాల్పడిన వారిపై 37 కేసులను నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశాం. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను అద్దెకు ఇస్తే తీవ్ర నేరంగా పరిగణించబడుతుంది. యువత తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. – శివశంకర్, కోదాడ పట్టణ సీఐ -
గోదావరి జలాలు విడుదల
ఫ వారబందీ విధానంలో ఇదే తుది విడత అర్వపల్లి : చివరి విడత గోదావరి జలాలను శుక్రవారం సాయంత్రం విడుదలయ్యాయి. ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం 5 తడులుగా గోదావరి జలాలను వదిలారు. 6వ తడిగా చివరి విడత శుక్రవారం విడుదల చేశారు. 1,333 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. వారబంధి విధానంలో వారం రోజులపాటు నీటిని సూర్యాపేట జిల్లాకు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ విడతతో షెడ్యూల్ ప్రకారం నీటి విడుదల పూర్తయినట్లు తెలిపారు. -
సూర్యాపేటలో జ్యోతిర్లింగ దర్శనం
సూర్యాపేట : జిల్లా కేంద్రంలోని రవి మహాల్లో సూర్యాపేట ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోమనాథ్ మూలవిరాట్ జ్యోతిర్లింగాన్ని గురువారం పెద్దఎత్తున భక్తులు దర్శించుకున్నారు. వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగి, భారతదేశంలోని జ్యోతిర్లింగాలలో మొదటిదైన సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయాన్ని గజని మహ్మద్ ధ్వంసం చేసిన తరువాత అందులోని మూలవిరాట్ జ్యోతిర్లింగాన్ని అగ్నిహోత్రి బ్రాహ్మణులు గోప్యంగా దాచి నేటి వరకు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ మూలవిరాట్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకునే అవకాశాన్ని సూర్యాపేట పట్టణ ప్రజలకు బ్రహ్మర్షి రిషి దేవవ్రత్జీ, సూర్యాపేట ఆర్ట్ ఆఫ్ లివింగ్ కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, చలమల్ల నరసింహ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యులు వంగవీటి రమేష్, బుద్ధ భిక్షపతి, సందీప్, బాణాల శ్రీనివాస్, రాధాకృష్ణ, నరేందర్ భరద్వాజ్, నాగరాజు పాల్గొన్నారు. -
బుద్ధవనం సందర్శించిన ప్రిన్సిపల్ సీసీఎఫ్
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్(పీసీసీఎఫ్) సి. సువర్ణ గురువారం కుటుంబ సమేతంగా సందర్శించారు. ముందుగా నెల్లికల్ వ్యూ పాయింట్‌ను వీక్షించారు. అనంతరం బుద్ధవనానికి చేరుకొని బుద్ధుని పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. మహాస్థూపంలోని ధ్యాన మందిరంలో బుద్ధ జ్యోతులను వెలిగించారు. ఈ సందర్భంగా బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర ఆమెను సత్కరించారు. టూరిజం గైడ్ సత్యనారాయణ బుద్ధవనం ప్రత్యేకతలను వివరించారు. ఆమె వెంట అమ్రాబాద్ అటవీ సీసీఎఫ్ సునీల్ హీరావత్, నల్లగొండ జిల్లా అటవీ అధికారి శాంతారామ్, సాగర్ డీఎఫ్ఓ సంగీత, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. నకిలీ బ్రాండ్లతో బియ్యం సరఫరా.. ఫ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన బ్రాండెడ్ బియ్యం వ్యాపారులు మిర్యాలగూడ అర్బన్ : నకిలీ బ్రాండ్ల పేరుతో వివిధ రాష్ట్రాలకు బియ్యం సరఫరా చేస్తూ బ్రాండెడ్ బియ్యం వ్యాపారులను బురిడీ కొట్టిస్తున్న మిర్యాలగూడ బియ్యం వ్యాపారి ఇంటిలో గురువారం ఢిల్లీ హైకోర్టు ప్రతినిధుల బృందం తనిఖీ చేసింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ బియ్యం వ్యాపారి చీదళ్ల గోపి కొన్నేళ్లుగా పలు రకాల బ్రాండ్ల పేరుతో కర్ణాటక, తమిళనాడుతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాలకు బియ్యం సరఫరా చేస్తున్నాడు. అయితే, తమకు సరఫరా చేస్తున్న బియ్యం నకిలీ బ్రాండ్లుగా గుర్తించిన పలువురు వ్యాపారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఫిర్యాదుపె స్పందించిన ఢిల్లీ హైకోర్టు ప్రత్యేకంగా అడ్వకేట్ జనరల్‌ను నియమించి తనిఖీలకు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం మిర్యాలగూడ వన్‌టౌన్ సీఐ నాగభూషణంను కలిసింది. స్థానిక రెడ్డీకాలనీలోని బియ్యం వ్యాపారి చీదళ్ల గోపి నివాసంతో పాటు మరికొన్నిచోట్ల తనిఖీలు చేశారు. అంతే కాకుండా గోపికి చెందిన పలు వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేసి నఖిలీ బ్రాండ్ల పేరుతో.. బియ్యం నింపే బస్తాలను ముద్రిస్తున్నారని గుర్తించారు. నకిలీ బ్రాండ్ల పేరుతో బియ్యం సరఫరా చేస్తున్న విషయం బయట పడటంతో మిర్యాలగూడ పట్టణంలో చర్చనీయాంశమైంది. -
అవగాహనతోనే విపత్తులను ఎదుర్కోవచ్చు
చౌటుప్పల్ : అనుకోకుండా సంభవించే విపత్తులను ఎదుర్కోవాలంటే ముందుగా అవగాహన అవసరమని ఉమ్మడి జిల్లా పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి, యాదాద్రి భువనగిరి జిల్లా అగ్నిమాపక అధికారి మధుసూదన్‌రావు, ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండర్ దామోదర్‌సింగ్, ఆర్డదో వెలమ శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెంలో గల దివీస్ పరిశ్రమలో విపత్తులను ఎదుర్కొనే అంశాలపై జిల్లా స్థాయి మాక్ డ్రిల్ నిర్వహించారు. రసాయన పరిశ్రమల్లో కెమికల్, గ్యాస్ లీకేజీలతో సంభవించే ప్రమాదాలను గుర్తించడం ఎలా.. గుర్తించాక స్పందించాల్సిన పద్ధతులను ప్రదర్శించారు. ప్రమాదాలు జరిగిన సమయంలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలో చూపించారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా ప్రమాదాలను ఎలా నియంత్రించాలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మనిషి నిజ జీవితంలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవగాహన ఉంటే నష్టనివారణ చాలా సులువు అవుతుందని తెలిపారు. జిల్లాలో విపత్తులు సంభవించినప్పుడు ఏదో రూపంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా కాపాడడంలో దివీస్ పరిశ్రమ కీలకపాత్ర పోషిస్తుందని అభినందించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ ఇన్స్పెక్టర్ జంగయ్య, దివీస్ పరిశ్రమ భద్రతా విభాగం జనరల్ మేనేజర్ బాలకిషోర్, పరిపాలనా విభాగం జనరల్ మేనేజర్ పెండ్యాల సుధాకర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధాకర్‌రావు, దివీస్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు ఎన్. సాంబశివరావు, ఎన్. విశ్వనాథ్, మేనేజర్లు ఉమామహేష్, రంగారావు, లైజన్ ఆఫీసర్ కిషోర్‌కుమార్‌చౌదరి, ప్రతినిధులు శివప్రసాద్, గోపి పాల్గొన్నారు. విపత్తుల నిర్వహణపై మాక్‌డ్రిల్ నిర్వహిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం ఫ పరిశ్రమల శాఖ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శ్రీదేవి ఫ చౌటుప్పల్ దివీస్ పరిశ్రమలో ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో మాక్‌డ్రిల్ -
సర్వీస్ రూల్స్ అమలు చేయాలి
నల్లగొండ : విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులకు ఏపీఎస్సీబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, 327 యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నల్లగొండలో డివిజన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 8న తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. మీటర్ రీడింగ్ కార్మికులు, కలెక్షన్ ఏజెంట్లు, ఎస్పీఎం వర్కర్లు, సెక్యూరిటీ గార్డులకు జీఓ నంబర్ 11 ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిట్టబోయిన లింగస్వామి యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, అవుట రవీందర్, పురం రాంబాబు, మైనం ఊషయ్య, చంద్రశేఖర్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, దుప్పలపల్లి రమేష్, బొజ్జ సహదేవ్, మేకల భిక్షమయ్య, పెరిక శేఖర్, విజయ్, ఉమాదేవి, రఫీయా, శైలజ, లింగారెడ్డి, భూషణం, ఆవుల పరమేష్, శ్రీపతి రమేష్, ఎస్కే ఖాన్, మురళి తదితరులు పాల్గొన్నారు. నీటి సమస్య పరిష్కరించాలని ఆందోళననల్లగొండ టూటౌన్: యూనివర్సిటీలో నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ హాస్టల్ ఆవరణలో ఏబీవీపీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ యూనివర్సిటీ అధ్యక్షుడు హనుమాన్ మాట్లాడుతూ.. నెల రోజులుగా హాస్టళ్లలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్నానం చేసేందుకు నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడిందన్నారు. యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న కొత్త భవన నిర్మాణాలకు నీటిని మళ్లించడం వల్లే ఈ సమస్య తలెత్తిందని ఆరోపించారు. యూనివర్సిటీ అధికారులు స్పందించి విద్యార్థులకు శాశ్వత పరిష్కారం చూపకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. -
అకమంగా ఇసుక రవాణా చేస్తే చర్యలు తప్పవు
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ హెచ్చరించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో ఎస్పీ నరసింహతో కలిసి పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఉన్నఆరు ఇసుక రిచ్‌లలో అక్రమంగా ఇసుక రవాణా చేసే వాహనాలు పట్టుబడితే బైండోవర్ కేసులు నమోదు చేసి జరిమానా విధించాలని ఆదేశించారు. ప్రతి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో ఇసుక అందించేందుకు ఆన్లైన్లో నమోదు చేయించాలన్నారు. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఒక మొబైల్ టీం ఏర్పాటు చేసి అక్రమంగా ఇసుక రవాణాను అడ్డుకోవాలన్నారు. జిల్లాలో 729 ఆమోదం పొందిన ఇసుక ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు అంటించాలని, సీసీ, ఏఎన్పీఆర్ కెమెరా పర్యవేక్షణతో పాటు ప్రతి సాండ్ టాక్సీ రీచ్‌లో 24 గంటల పర్యవేక్షణ కోసం హై–ఎండ్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. ఏదైనా అనధికార వాహనం కెమెరాలో గుర్తిస్తే ఆ వాహనాన్ని బ్లాక్ చేయాలన్నారు. సీసీ కెమెరాతో అమర్చబడిన మొబైల్ వాహనం ద్వారా రీచ్ పరిసర ప్రాంతాలలో నిరంతరం సంచరిస్తూ అక్రమ ఇసుక రవాణాను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. తహసీల్దార్లు వారానికి కనీసం రెండు సార్లు రీచ్‌లను సందర్శించాలని, ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడానికి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి ఇసుక సరఫరాకు మాన్యువల్ ఉండదని ఆన్ లైన్ ట్రాన్సిస్ట్ పాస్ సిస్టమ్ (ఓటీపీఎస్), మన ఇసుక వాహనం ద్వారా ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవాలని, గ్రామపంచాయతీ సెక్రటరీ ఇసుక ఎంత కావాలో నిర్ధారిస్తే, సంబంధిత తహసీల్దార్ పర్యవేక్షణలో ఆన్లైన్ ద్వారా నమోదు చేస్తారని కలెక్టర్ వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, రెవెన్యూ డివిజనల్ అధికారి వేణు మాధవరావు, మైనింగ్ ఏడీ విజయ రామారావు, డీపీఓ యాదగిరి, జిల్లా గ్రౌండ్ వాటర్ అధికారి బాలు పాల్గొన్నారు.బీఈడీ ఫలితాలు విడుదలనల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ ఒకటి, మూడవ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. మొదటి సెమిస్టర్లో 2,601 మందికి 1,982 మంది ఉత్తీర్ణత సాధించారు. 619 మంది ప్రమోటయ్యారు. మూడో సెమిస్టర్లో 2,713 మంది విద్యార్థులకు 2,440 మంది ఉత్తీర్ణులయ్యారు. 269 మందిప్రమోటయ్యారు. -
వడగళ్లు కాదు.. దూది పూలు
పెద్దవూర : పై ఫోటోను చూసి వేసవిలో రాళ్ల వర్షం కురిసిందా.. భూమిపై అంతా మంచు పేరుకుపోయిందా అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరబడినట్లే. పెద్దవూర మండలం బట్టుగూడెం గ్రామానికి చెందిన గుంటుక కృష్ణారెడ్డి గత వానాకాలం సీజన్లో తన చేనులో పత్తిని ఏరించాలనుకునే సమయానికి నవంబర్‌లో వరుసగా వర్షాలు కురిశాయి. దీంతో పత్తి చాలా వరకు రాలిపోయింది. వర్షాలు తగ్గాక పత్తి ఏరడానికి కూలీల కొరత ఏర్పడడంతో నేలపై రాలిపోయిన పత్తిని ఏరలేదు. ఐదు రోజుల క్రితం పత్తి కట్టెను తొలగించటంతో భూమిపై రాలిపోయిన పత్తి అంతా ఇలా తెల్లగా కనిపిస్తోంది. పెద్దవూర మండలంలోని చాలా వరకు పత్తి చేలలో ప్రస్తుతం ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. -
సైనిక లాంఛనాలతో జనార్దన్ అంత్యక్రియలు
నకిరేకల్ : స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ గుండెపోటుతో మృతిచెందిన మాజీ సైనికుడు బెల్లి జనార్దన్(49) అంత్యక్రియలు సోమవారం ఆయన స్వగ్రామం నకిరేకల్ మండలం పాలెంలో సైనిక లాంఛనాలతో జరిగాయి. ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా 31 ఎన్సీసీ బెటాలియన్ సైనికులు జనార్దన్ భౌతికకాయంపై త్రివర్ణ పతాకం, పూలమాలలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. నివాళులర్పించిన వారిలో రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ సభ్యుడు వర్రె వెంకటేశ్వర్లు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్, జిల్లా ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బండారి నర్సింహ, ఉపాధ్యక్షుడు కొమ్ము కోటేష్, సైనిక సంక్షేమ శాఖ అధికారులు భిక్షపతి, రాజు, దామోదర్, అంజాద్, నర్సింహ ఉన్నారు. -
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో నమ్మకం పెరిగింది
నకిరేకల్ : రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థతో పోలీసుల పట్ల ప్రజలకు నమ్మకం ఏర్పడిందని రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ సభ్యుడు వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. నకిరేకల్ పట్టణంలోని వైశ్య భవన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలు, పోలీసులకు మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయని అన్నారు. పోలీసులంటే భయం అనే భావన పోయిందన్నారు. అనేక సందర్భాల్లో ప్రజలు తమకు జరిగిన అన్యాయాన్ని ధైర్యంగా చెప్పుకునే అవకాశం కల్గిందన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ విజయవంతం కావాలంటే ప్రజలు కూడా సహకరించాలని కోరారు. చట్టాన్ని గౌరవించడంతో పాటు సమాజ శాంతి, భద్రత కోసం పనిచేయడం మనందరి బాధ్యత అన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడంలో రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ప్రతి పౌరుడు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రాష్ట్ర పోలీస్ ఫిర్యాదుల అథారిటీ సభ్యుడు వర్రె వెంకటేశ్వర్లు -
బైక్‌ను ఢీకొట్టిన ట్రాక్టర్.. బాలుడు మృతి
మిర్యాలగూడ అర్బన్ : తండ్రితో కలిసి బైక్‌పై స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న బాలుడిని ట్రాక్టర్ మృత్యువు రూపంలో వచ్చి కబలించింది. మిర్యాలగూడ వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామరచర్ల మండలం బెట్టెతండా గ్రామానికి చెందిన అజ్మీరా శ్రీను కుమారుడు చరణ్(11) మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. సోమవారం సాయంత్రం స్కూల్ ముగిసిన తర్వాత శ్రీను తన బైక్‌పై చరణ్‌ను తీసుకుని స్వగ్రామానికి వెళ్తుండగా.. ఈదులగూడ బైపాస్ రోడ్డు వద్ద ధాన్యం లోడుతో వచ్చిన ట్రాక్టర్ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ రోడ్డు పక్కకు పడిపోగా.. ట్రాక్టర్ ట్రాలీ టైరు చరణ్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు శ్రీనును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదిరెడ్డి తెలిపారు. రైలు ఢీకొని తెగిపడిన ప్రయాణికుడి కాలు మిర్యాలగూడ అర్బన్ : రైలు పట్టాలు దాటుతుండగా జారి కిందపడిన వ్యక్తి కాలు పైనుంచి రైలు వెళ్లడంతో కాలు తెగిపడింది. ఈ ఘటన మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగింది. రైల్వే ఏఎస్ఐ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని సీతారాంపురానికి చెందిన చేవూరి వెంకటాచారి గుంటూరుకు వెళ్లేందుకు గాను ఆదివారం అర్ధరాత్రి మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం పైకి వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా.. అదే సమయంలో నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ నల్లగొండ నుంచి వస్తోంది. రెండో ప్లాట్‌ఫాం వద్ద ఉన్న వెంకటాచారి రైలు వేగాన్ని గమనించకుండా ట్రాక్ దాటేందుకు ప్రయత్నించి జారిపడ్డాడు. దీంతో అతని ఎడమకాలు పైనుంచి రైలు వెళ్లడంతో పాదం వరకు తెగిపడింది. స్థానికులు గమనించి 108 వాహనంలో అతడిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘనటపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఏఎస్ఐ తెలిపారు. -
పంచాయతీ స్థలాన్ని విక్రయిస్తున్నారంటూ..
శాలిగౌరారం : మండలంలోని ఊట్కూరు గ్రామంలో గ్రామ పంచాయతీకి చెందిన స్థలాన్ని విక్రయించేందుకు సర్పంచ్ ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ ఉప సర్పంచ్ రంగు రాములు సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి అర్ధనగ్నంగా బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది వార్డు సభ్యులు, స్థానిక నాయకులతో కలిసి సర్పంచ్ శీలం అనితాశంకర్ కుమ్మకై ్క గ్రామ పంచాయతీకి చెందిన 363 చదరపు గజాల స్థలాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. స్థలాన్ని విక్రయించొద్దని, ఇతర అవసరాలకు వినియోగించాలని చెప్పినా వినిపించుకోవడం లేదన్నారు. విషయాన్ని మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ స్థలాన్ని కాపాడాలని కోరారు. ఈ విషయమై సర్పంచ్ శీలం అనితాశంకర్ను వివరణ కోరగా.. గ్రామ పంచాయతీ స్థలాన్ని అమ్మేందుకు తాను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. ఉప సర్పంచ్ రాములు దురుద్దేశంతో, రాజకీయ ఆధిపత్యం కోసం తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అయితే సర్పంచ్, ఉప సర్పంచ్‌లు ఇద్దరూ అధికార పార్టీకి చెందినవారే కావడం గమనార్హం. అర్ధనగ్నంగా ఉప సర్పంచ్ నిరసన -
చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
సూర్యాపేటటౌన్ : చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేటలోని అన్నాదురై నగర్‌కు చెందిన గుండె శ్రీకాంత్ పెయింటింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడిన శ్రీకాంత్ చోరీలకు పాల్పడుతున్నాడు. శనివారం రాత్రి సూర్యాపేటలోని సాయినగర్‌లో ఓ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి 3 తులాల బంగారం, సుమారు 20 తులాల వెండి వస్తువులు, రూ.1000 నగదు అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం శ్రీకాంత్‌ను పట్టుకొని విచారించగా.. పలు ఇళ్లలో చోరీలకు పాల్పడినట్లు నిజం ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి బంగారం, వెండి, నగదు రికవరీ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
కషాయాలతో తెగుళ్ల నివారణ సులభం
గరిడేపల్లి : రైతులు పంటల సాగులో రసాయన మందులు వాడటంతో ఖర్చులు పెరగడం, నేల సారం తగ్గిపోవడం, పంటలలో అవశేషాలు మిగలడం, పర్యావరణ కాలుష్యం వంటివి జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రకృతి వనరులతో అనేక కషాయాలు తయారు చేసుకుని ఉపయోగిస్తే మంచి ఫలితాలు వస్తాయని గడ్డిపల్లి కేవీకే సస్యరక్షణ శాస్త్రవేత్త డి. ఆదర్శ్ సూచిస్తున్నారు. రైతులే స్వయంగా తయారు చేసుకునే వివిధ రకాల కషాయాల గురించి ఆయన మాటల్లోనే.. ● వేప ఆకుల కషాయం : దీని తయారీ కోసం 5 కిలోల వేప ఆకులు, 10 లీటర్ల నీరు 24 గంటలు నీటిలో నానబెట్టి, మరిగించి వడకట్టాలి. వడకట్టిన కషాయాన్ని వరి, కూరగాయ పంటలపై పిచికారీ చేయడం వలన ఆకు తినే పురుగు, రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. ఇది పంటకు హాని చేయదు. ఖర్చు తక్కువ. ● దశపర్ణి కషాయం : 10 రకాల ఆకులు, 200 లీటర్ల నీరు, 2 నుంచి 3 లీటర్ల గోమూత్రం కలిపి 20–25 రోజులు నానబెట్టి వడకట్టాలి. ఈ కషాయాన్ని వివిధ రకాల పురుగులు, తెగుళ్ల నివారణకు ఉపయోగించుకోవచ్చు. ● మిరప, వెల్లుల్లి కషాయం : 500 గ్రాముల ఎండు మిరప, 250 గ్రాముల వెల్లుల్లిని నూరి నీటిలో 24 గంటలు ఉంచాలి. ఈ కషాయం పంటలపై పిచికారీ చేస్తే వేగంగా ఫలితం ఉంటుంది. ● గోమూత్ర, వేప కషాయం : 5 లీటర్ల గోమూత్రం, 5 లీటర్ల నీరు, కొన్ని వేప ఆకులు కలిపి 7 రోజులు నానబెట్టాలి. ఈ కషాయాన్ని ఫంగస్, తెగుళ్ల నివారణకు ఉపయోగించవచ్చు. పంట రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ● అల్లం–వెల్లుల్లి, మిరప కషాయం : అల్లం 250 గ్రాములు, వెల్లుల్లి 250 గ్రాములు, మిరప 250 గ్రాములు నూరి 24 గంటలు నీటిలో ఉంచాలి. ఈ కషాయం అన్నిరకాల రసం పీల్చే పురుగులను నాశనం చేస్తుంది. ఠి ఆవు పేడ ఆధారిత కషాయం : ఆవు పేడ 5 కిలోలు, నీరు కలిపి కొన్ని రోజులు పూతపోసి వడకట్టాలి. ఈ కషాయం పిచికారీ చేయడం వలన నేలలోని తెగుళ్లు నశించి, నేల సారవంతమవుతుంది. ● నీమాస్త్రం : వేప ఆకులు, గింజలు 5కిలోలు, ఆవు పేడ 5 కిలోలు, ఆవు మూత్రం 5 లీటర్లు, నీరు 100 లీటర్లు కలిపి 24 నుంచి 48 గంటలు పూతపోసి వడకట్టి స్ప్రే చేయాలి. వరి, పత్తి, కూరగాయల పంటల్లో తెల్ల దోమ, ఆకుతినే పురుగులు, చిన్న పురుగులు నశిస్తాయి. ● బ్రహ్మస్త్రం : వేప, రావి, బిల్వ, తులసి, సీతాఫలం వంటి 5 నుంచి 7 రకాల చేదు ఆకులు మొత్తం 10కిలోలు తీసుకుని 10 లీటర్ల ఆవు మూత్రంతో కలిసి 2 నుంచి 3 రోజులు పూతపోసి మరిగించి చల్లారిన తర్వాత వడకట్టాలి. ఈ కషాయాన్ని కాండం తొలిచే పురుగును నివారిస్తుంది. ● అగ్నియాస్త్రం : ఎండు మిరప కిలో, వెల్లుల్లి 500 గ్రాములు, పొగాకు 500 గ్రాములు, ఆవు మూత్రం 10 లీటర్లు, నీరు 100 లీటర్లు కలిపి 24 గంటలు పూతపోసి వడకట్టి ఉపయోగించాలి. తెల్లదోమ, ఆకులపై ఆశించే పురుగులను ఈ కషాయం నాశనం చేస్తుంది. జీవామృతం : ఆవు పేడ 10కిలోలు, ఆవు మూత్రం 10 లీటర్లు, బెల్లం 2 కిలోలు, శనగపిండి, పప్పు పిండి 2 కిలోలు, నీరు 200 లీటర్లు కలిపి 48గంటలు పూతపోసి నేలలో లేదా స్ప్రే రూపంలో ఉపయోగించాలి. ఈ కషాయం వలన నేల ఆరోగ్యం మెరుగుపడి సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది. పంట ఎదుగుదల వేగంగా ఉంటుంది. ఘన జీవామృతం : ఆవు పేడ 100 కిలోలు, ఆవు మూత్రం 5 నుంచి 10 లీటర్లు, బెల్లం 2 కిలోలు కలిపి ఎండబెట్టి గుళికలుగా తయారు చేయాలి. విత్తే ముందు లేదా నాటే సమయంలో నేలలో వేసుకోవచ్చు. దీని వలన నేల సారవంతం పెరుగుతుంది. వరి, ఇతర పంటలలో పురుగులు, తెగుళ్ల నియంత్రణకు ఈ కషాయాలు ఉపయోగపడతాయి. గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త ఆదర్శ్ సూచనలు -
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వినూత్న ప్రచారం
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త, తెలుగు పండితుడు రాచకొండ ప్రభాకర్ బ్రాహ్మణుడి వేషధారణలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సోమవారం పాత బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పించారు. ‘పరాభవనామ సంవత్సరంలో ఏ రాశికి చెందిన వారైనా గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు బానిసలైతే అవమానం, వ్యయం ఎక్కువ, రాజ్యపూజ్యం తక్కువ ఉంటుంది’ అంటూ అవగాహన కల్పించారు. యువత, ప్రజలు మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటే సమాజంలో రాజ్యపూజ్యం, గౌరవ మర్యాదలు పెరుగుతాయని, ఆదాయం పెరుగుతుందని, వ్యయం తగ్గుతుందన్నారు. అలాగే రోడ్డు భద్రత నియమాలు పాటించకపోతే తీవ్ర ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం వాటిల్లి కుటుంబాలకు తీరని శోకం మిగులుతుందన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ జీవితంలో ముందుకెళ్లాలని సూచించారు. -
‘టీ–ఫైబర్’ కనెక్షన్ ఏదీ..?
రామన్నపేట : అతి తక్కువ ఖర్చుతో ప్రతి పల్లెకూ హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీ–ఫైబర్ ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. లాభాపేక్ష లేకుండా సామాన్యులకు ఒకే కనెక్షన్ ద్వారా ఫోన్, ఇంటర్నెట్, ఓటీటీ, టీవీ సేవలను అందించాలని రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. నేటికీ క్షేత్రస్థాయిలో కనెక్షన్లు ఇవ్వకపోవడంతో టీ–ఫైబర్ సేవలు పల్లె ప్రజలకు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి. టీ–ఫైబర్‌నెట్ గ్రిడ్‌తో ప్రయోజనాలుభారత్ నెట్ ప్రాజెక్టులో భాగంగా వస్తున్న ఈ సేవలతో గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. మల్టీపర్పస్ కనెక్షన్ : ఒకే కనెక్షన్‌తో ఫోన్, ఇంటర్నెట్, టీవీ మరియు ఓటీటీ సేవలు పొందవచ్చు. స్మార్ట్ టీవీగా మార్పు : ప్రత్యేక సెటాప్‌బాక్స్ ద్వారా సాధారణ టీవీలను కూడా కంప్యూటర్లుగా మార్చుకోవచ్చు. కీబోర్డు, మౌస్ ఉంటే చాలు, ప్రత్యేకంగా కంప్యూటర్ కొనాల్సిన పనిలేదు. విద్యా సేవలు : విద్యార్థులు తమ ఐడీల ద్వారా గూగుల్ క్లాస్‌లు వినడం, హోంవర్క్ చేయడం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చు. వేగవంతమైన ఇంటర్నెట్ : ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వాడటంతో ఇంటర్నెట్ వేగం ఎక్కువగా ఉంటుంది. భూగర్భ కేబుల్ వేసినా..జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొదటి దశ కింద రెండేళ్ల క్రితమే లక్షలు ఖర్చు చేసి టీ–ఫైబర్ సెట్లను అమర్చారు. వీటికి విద్యుత్ సరఫరా కోసం ఖరీదైన సోలార్ ప్యానళ్లను కూడా బిగించారు. భూగర్భ కేబుళ్లు వేసి పాఠశాలలు, అంగన్వాడీలు, పీహెచ్‌సీలకు అనుసంధానం చేసినా ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు. ప్రస్తుత పరిస్థితి ఇలా..కొన్నిచోట్ల రైతు వేదికలకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన కార్యాలయాల్లో పరికరాలన్నీ దుమ్ము పట్టిపోతున్నాయి. సిరిపురం వంటి గ్రామాల్లో ఇవి కేవలం అలంకారప్రాయంగా మారాయి. పేపర్ లెస్ సేవలకు ఆటంకంటీ–ఫైబర్ కనెక్షన్లు అందుబాటులోకి వస్తే ప్రభుత్వ కార్యాలయాల్లో, పంచాయతీల్లో కాగితరహిత (పేపర్ లెస్) పాలన సాధ్యమవుతుంది. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా పనులు త్వరగా పూర్తవుతాయి. ఏప్రిల్ తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్షన్లు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తున్నప్పటికీ, ఈ సేవలు ఎప్పుడు అందుతాయనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉందని సంబంధిత ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. పరికరాలు అమర్చి రెండేళ్లు అలంకారప్రాయంగా సోలార్ ప్యానళ్లు పంచాయతీల్లో ఇంటర్నెట్ సేవలకు తప్పని నిరీక్షణ ప్రభుత్వ కార్యాలయాలకూ కనెక్షన్లు శూన్యం -
నాలుగు రోజుల్లో దర్యాప్తు పూర్తవుతుంది
కోదాడ: అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన రిమాండ్ ఖైదీ కర్ల రాజేష్ కేసు దర్యాప్తు నాలుగు రోజుల్లో పూర్తవుతుందని ప్రత్యేక దర్యాప్తు అధికారి రవి తెలిపారు. సోమవారం కోదాడకు వచ్చిన ఆయన మృతుడి తల్లి కర్ల లలితమ్మను అడిగి వివరాలు సేకరించారు. రాజేష్‌కు పోలీసులు వేసినట్లుగా చెబుతున్న ఇంజెక్షన్‌ను ఆయన స్వాధీనం చేసుకున్నారు. నిష్పక్షపాతంగా కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నత్తనడకగా విచారణ : మంద కృష్ణమాదిగ రాజేష్ మృతి కేసు దర్యాప్తును నత్తనడకన చేస్తున్నారని, బాధ్యులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. సోమవారం రాజేష్ ఇంటికి ప్రత్యేక దర్యాప్తు అధికారి వస్తున్నారని తెలుసుకున్న ఆయన కోదాడకు వచ్చారు. రాజేష్ తల్లి, దర్యాప్తు అధికారితో మాట్లాడిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉండగా.. అప్పటి డీఎస్పీ, ప్రస్తుత డీఎస్పీ, జిల్లా ఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. నాలుగైదు రోజుల్లో కేసు దర్యాప్తు పూర్తికాకపోతే ఉద్యమిస్తామన్నారు. ఆయన వెంట ఏపూరి రాజు, నాగరాజు తదితరులు ఉన్నారు. కర్ల రాజేష్ మృతి కేసు ప్రత్యేక దర్యాప్తు అధికారి రవి -
సూర్యక్షేత్రంలో వైభవంగా పూజలు
అర్వపల్లి: జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలోని అఖండజ్యోతి స్వరూప సూర్యనారాయణస్వామి క్షేత్రంలో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఉషాపద్మిని ఛాయాసమేత సూర్యనారాయణస్వామిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు జరిపారు. అనంతరం యజ్ఞశాలలో మహాసౌరహోమాన్ని నిర్వహించారు. అలాగే క్షేత్రం ఆవరణలోని కార్యసిద్ధి వీరహనుమాన్, శ్రీరామకోటి స్థూపాలను కూడా భక్తులు దర్శించుకున్నారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి అన్నప్రసాద వితరణ జరి పారు. కార్యక్రమంలో క్షేత్ర వ్యవస్థాపకురాలు కాకులారపు రజితజనార్దన్, గణపురం నరేష్, ఇంద్రారెడ్డి, యాదగిరి, అర్చకులు భీంపాండే, అంకిత్‌పాండే, శ్రీరాంపాండే పాల్గొన్నారు. 24న కలెక్టరేట్ ఎదుట నిరసనసూర్యాపేటటౌన్ : ఈ నెల 24న కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాని కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల వీరన్న తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. విద్యారంగానికి బడ్జెట్లో కనీసం 20 శాతం నిధులు కేటాయించలేదని విమర్శించారు. పీఆర్సీ ఫిట్మెంట్ వెంటనే ప్రకటించి బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు యాకయ్య, సుభాని, రమేష్, లాలయ్య, హనుమంత్, మల్లికార్జున్, సాల్మన్, మహేష్, మధు కుమార్, మహేందర్, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, నర్సయ్య, రవి కుమార్ పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి
సూర్యాపేటటౌన్ : అతి కొద్దిమంది ధనవంతుల కోసం విదేశీ విద్యాలయాలను ఆహ్వానించడం కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల పేద విద్యార్థులకు నాణ్యమైన సమానమైన విద్యను అందించడానికి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంపై దృష్టి సాధించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.సోమయ్య డిమాండ్ చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని యూటీఎఫ్ భవన్లో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అనే ఆకర్షణీయమైన పేర్లతో ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్యను కొందరికే పరిమితం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో విదేశీ పాఠశాలల ఏర్పాటు కోసం ఆయా యాజమాన్యాలతో ప్రభుత్వ అధికారులు చర్చలు జరిపి ఆహ్వానించడం విస్మయం కలిగిస్తోందని తెలిపారు. టీఎస్ యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్.రాములు మాట్లాడుతూ జీవో 25ను సవరించి ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు, 50 మంది విద్యార్థులు దాటిన ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడి పోస్టు, తరగతికొక టీచర్‌ను నియమించాలని సూచించారు. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ జె.యాకయ్య, పి.శ్రీనివాసరెడ్డి, కె.అరుణ భారతి, జి. వెంకటయ్య ఆర్.దామోదర్, ఎన్.నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
మట్టపల్లిలో విశేష పూజలు
మఠంపల్లి: ప్రసిద్ధి గాంచిన మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి ఆదివారం అర్చకులు విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అభిషేకాలు , హోమశాలలో నిత్యహోమం నిర్వహించారు. అనంతరం నిత్య కల్యాణంలో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం , రక్షాబంధనం, మధుఫర్కపూజ , మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్పాలతో మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈఓ బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు , పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. -
అట్టహాసంగా బహుమతుల ప్రదానోత్సవం
ఫ ముఖ్య అతిథులుగా హాజరైన గవర్నర్ శివ ప్రతాప్శుక్లా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ భువనగిరిటౌన్ : పీఎం సంసద్ పోటీల్లో విజేతలకు ఆదివారం భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బహుమతుల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ శివ ప్రతాప్శుక్లా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి ఎస్పీ అక్షాంశ్‌యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు గౌరవ వందనం చేశారు. పోలీసులు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేశారు. గవర్నర్, కేంద్ర మంత్రికి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు స్వాగతం పలికారు. కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ జగన్మోహన్ప్రసాద్, జిల్లా అధికారులు ఉన్నారు. -
శ్రీరామయ్య జీవితం స్ఫూర్తిదాయకం
నేరేడుచర్ల : కమ్య్టూనిస్టు ఆశయాల కోసం తుది శ్వాస విడిచేంత వరకు కొనసాగిన గొప్పనేత శ్రీరామయ్య అని, ఆయన జీవితం నేటి కమ్యూనిస్టులకు స్ఫూర్తి దాయకం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. ఆదివారం నేరేడుచర్ల మండలం మూడారం గ్రామంలో శ్రీరామయ్య భౌతికకాయానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ చిన్న వయస్సు నుంచే భూమి కోసం, భూక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. నిత్యం ప్రజల కోసం, హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడారని కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, మహిళా సంఘం రాష్ట్ర నేత మల్లు లక్ష్మి మాట్లాడుతూ శ్రీరామయ్య మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటన్నారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు, నాయకులు పారేపల్లి శేఖర్‌రావు, కోదమగుండ్ల నగేష్, అనంత్ ప్రకాశ్, సిరికొండ శ్రీను, పోశనబోయిన హుస్సెన్, మర్రి నాగేశ్వర్రావు, కట్ట మధు బాబు, నాగ సైదులు, శ్రీధర్, బాబురావు,. రాణమ్మ, జానకిరాములు, రామ్మూర్తి, హఫీజ్, నర్సింహ్మ, పాతూరి శ్రీనివాస్‌రావు తదితరులు ఉన్నారు.ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ -
పదవికి వన్నె తెచ్చేలా పనిచేయాలి
సాక్షి, యాదాద్రి: పార్టీ ఇచ్చిన పదవిని గౌరవంగా భావించి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని, కష్టపడి పనిచేస్తే ఫలితం ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ డీసీసీ కార్యవర్గ సభ్యులకు పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలోని వివేరా హోటల్లో డీసీసీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య అధ్యక్షతన డీసీసీ నూతన కార్యవర్గ సభ్యులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ.. పదవి వచ్చిన వారు పార్టీ అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు. పదవులు రానివారు నిరుత్సాహ పడొద్దని వారికి మరిన్ని అవకాశాలు ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అందరిని సమానంగా చూస్తుందన్నారు. బీర్ల ఐలయ్య మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తి చేసుకున్న మండలం, గ్రామ శాఖల పదవుల్లో కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు. మరికొందరికి నామినేటేడ్ పదవులు రానున్నాయన్నారు. పదవులు రాని వారు నిరాశ చెందొద్దన్నారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్తులో ప్రజల ఆదరణ పొందాలంటే నిరంతం వారి మధ్యన ఉండి పనిచేస్తే రెండోసారి గెలిచే అవకాశం ఉంటుందన్నారు. ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్‌లు మాట్లాడుతూ.. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. ముందుగా జాతీయపతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను, ఎమ్మెల్యేలను పలువురు నాయకులు సన్మానించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ, గ్రంథాలయ చైర్మన్ అవేస్ చిస్తీ, మున్సిపల్ చైర్పర్సన్లు తంగెళ్లపల్లి వాణి రవికుమార్, బీజన బాలమణి భాస్కర్, సంజీవరెడ్డి, పల్లె శ్రీనివాస్‌గౌడ్, పోత్నక్ ప్రమోద్‌కుమార్, ఉపేందర్‌రెడ్డి, మంజుల, శ్రీనివాసరావు, అనిల్‌కుమార్, బాల్‌రాజ్, వెంకటేశ్, సత్తిరెడ్డి, వేణుగౌడ్, పింగల్‌రెడ్డి పాల్గొన్నారు. ఫ పదవులు రాని వారు నిరుత్సాహ పడొద్దు ఫ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ -
డిండి ప్రాజెక్టు నిర్మాణంలో వివక్ష తగదు
నల్లగొండ టౌన్ : డిండి ప్రాజెక్టు నిర్మాణంలో వివక్ష తగదని సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డిండి ప్రాజెక్టు విషయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ, కొంతమంది ఇంజనీర్లు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏదుల రిజర్వాయర్‌లో నీటిమట్టం 440 మీటర్ల నుంచి 436.70 మీటర్లకు తగ్గిన తర్వాత 1,500 క్యూసెక్కుల నీరు కూడా కేవలం 56 రోజులపాటు మాత్రమే డిండికి అందే పరిస్థితి ఉంటుందన్నారు. దీని వల్ల ప్రభుత్వం నిర్ణయించిన 30 టీఎంసీలకు బదులుగా కేవలం 7 టీఎంసీల నీరు మాత్రమే జిల్లాకు వస్తుందన్నారు. ఏప్రిల్ 1, 2 తేదీల్లో ఎస్ఎల్బీసీ టన్నెల్, ఏదుల రిజర్వాయర్‌ను సీపీఐ ఆద్వర్యంలో సందర్శిస్తామన్నారు. ఏప్రిల్ 5న నల్లగొండ జిల్లా కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ జిల్లాలో భూగర్భ జలాలు తగ్గి పంటలు ఎండిపోతున్నాయని, ఎండిన పంటలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, నష్టం పరిహారం అందేలా చూడాలన్నారు. సమావేశంలో బొల్గూరి నర్సింహ, పల్లా నరసింహారెడ్డి, పల్లా దేవేందర్‌రెడ్డి, లోడంగి శ్రవణ్‌కుమార్, ఉజ్జిని యాదగిరిరావు, పబ్బు వీరస్వామి, ఆర్.అంజచారి, బంటు వెంకటేశ్వర్లు, గురిజ రామచంద్రం, నలపరాజు రామలింగయ్య, టి.వెంకటేశ్వర్లు, తుమ్ము బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కట్టెల పొయ్యితో కుస్తీ !
కోదాడ : వంటగ్యాస్ కొరతతో కోదాడలోని ఓ హోటల్ యజమాని కట్టెల పొయ్యితో వంటకాలు చేయడం మొదలుపెట్టారు. గతంలో వంట చెరకు క్వింటా రూ.700 ఉండగా ప్రస్తుతం వీటి ధర కూడా వెయ్యి రూపాయలకు చేరింది.శ్రీలక్ష్మీనరసింహుడికి విశేష పూజలుమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లకు అభిషేకాలు, నిత్యహోమం జరిపించారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి నిత్య కల్యాణం వైభవంగా చేశారు. ఆలయంలో నీరాజన మంత్రపుష్పాలతో మహా నివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలోఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు తూమాటి రామాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
దోచుకుని పంచుకునేందుకే బడ్జెట్
ఫ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శ సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడీ చేశారు తప్ప ప్రజలకు మేలు చేసేలా బడ్జెట్ లేదని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. శనివారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ నమాట్లాడారు. రియల్ ఎస్టేట్, ఫ్యూచర్ సిటీ పేరుతో కమీషన్లు తీసుకునేందుకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని అన్నారు. వ్యవసాయానికి, పేద బడుగు బలహీన వర్గాలతో పాటు యువత ఉపాధి కల్పనకు నిధులు కేటాయించలేదని, ఏ వర్గానికి కూడా ఈ బడ్జెట్ న్యాయం చేయలేదన్నారు. ముఖ్యంగా ఆరు గ్యారంటీలకు కూడా నిధులు లేవన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని, బడ్జెట్లో బీసీలకు ఏటా 20వేల కోట్లు కేటాయిస్తామని చెప్పి మూడు బడ్జెట్లకు రూ.12వేల కోట్లు పెట్టి చేతులు దులుపుకుందన్నారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్ళు అయిందని, ఇక ఉన్నది రెండు బడ్జెట్లు కాబట్టి వచ్చినవన్నీ దోచుకుందాం పంచుకుందాం అన్న రీతిలో ప్రభుత్వం పని చేస్తుందని విమర్శించారు. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నాయకులు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, తూడి నర్సింహారావు, ఆకుల లవకుశ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. -
జీడీడీపీలో మెరుగు
స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జీడీడీపీ)లో సూర్యాపేట 9వ స్థానం 2025 డిసెంబర్ 22వ తేదీ నాటికి రాష్ట్రవ్యాప్తంగా చూస్తే చిన్న తరహ పరిశ్రమల్లో నల్లగొండ నాలుగో స్థానంలో నిలిచింది. 2,38,879 చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలతో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా, 64,723 పరిశ్రమలతో నల్లగొండ నాలుగో స్థానంలో నిలిచింది. 38,113 పరిశ్రమలతో సూర్యాపేట 10వ స్థానంలో ఉండగా, 25,469 పరిశ్రమలతో యాదాద్రి భువనగిరి జిల్లా 17వ స్థానంలో ఉంది. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు పారిశ్రామిక వర్గాలు ఆసక్తి చూపుతున్నాయి. ఇక్కడ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రై జెస్ (ఎంఎస్ఎంఈ) వద్ద, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఉద్యమ్ పోర్టల్లోనూ ఔత్సాహికులు వివిధ రకాల ఉత్పత్తి యూనిట్లను నెలకొల్పేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2026 వెల్లడించింది. పారిశ్రామికరంగంతో పాటు వివిధ రంగాల్లో ఉమ్మడి నల్లగొండ ఏ స్థానంలో ఉందన్న విషయాలను ఈ సర్వేలో ప్రభుత్వం వివరించింది. స్థూల జిల్లా దేశీయోత్పత్తిలో (జీడీడీపీ) రాష్ట్రంలోనే నల్లగొండ ఐదో స్థానంలో ఉండగా, సూర్యాపేట 9వ స్థానంలో, యాదాద్రి జిల్లా 14వ స్థానంలో ఉన్నాయి. యాదాద్రి, సూర్యాపేటతో పోలిస్తే నల్లగొండ ముందువరుసలో ఉంది. నల్లగొండలో రూ.64,219 కోట్లు, సూర్యాపేటలో రూ.38,865 కోట్లు, యాదాద్రిలో రూ.30,924 కోట్లుగా జీడీడీపీ నమోదైంది. తలసరి ఆదాయంలో నల్లగొండ, సూర్యాపేటతో పోల్చితే యాదాద్రి జిల్లా ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తలసరి ఆదాయంలో యాదాద్రి జిల్లా 8వ స్థానంలో ఉండగా, నల్లగొండ జిల్లా 9వ స్థానంలో, సూర్యాపేట జిల్లా 14వ స్థానంలో ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో సగటున ప్రతి వ్యక్తి ఆదాయం రూ.3,35,264 కాగా, నల్లగొండలో రూ.3,30,216గా నమోదైంది. సూర్యాపేట జిల్లాలో 2,96,429గా నమోదైంది. జిల్లాలోని భౌగోళిక ప్రాంతాల్లో అత్యధికంగా అటవీ విస్తీర్ణం రాష్ట్రంలోని ములుగు జిల్లాలోనే 64.64 శాతం ఉంది. ఇక యాదాద్రి జిల్లాలో 9.66 శాతం, నల్లగొండలో 9.57 శాతం, సూర్యాపేటలో 4.67 శాతం అటవీ విస్తీర్ణం ఉన్నట్లు ఇండియన్ ఫారెస్ట్ సర్వే –2023 వెల్లడించింది. రాష్ట్రంలోనే అత్యధిక రేషన్ షాపులు నల్లగొండ జిల్లాలోనే ఉన్నాయి. ఇక్కడ 1051 రేషన్ షాపులు ఉండగా, 5,38,650 రేషన్ కార్డులు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో 611 రేషన్ షాపులు ఉండగా, 3,69,926 కార్డులు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో 515 రేషన్ దుకాణాలు ఉండగా, 2,50,292 రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేసే ఎస్సీ, ఎస్టీలకు ఉమ్మడి జిల్లాలోనే చాలా తక్కువ భూములు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో సగటున 5,30,742 మంది చేతుల్లో (ఇండివిడ్యువల్స్) 5,14,402.40 ఎకరాలు ఉండగా, సూర్యాపేటలో 2,86,897 మంది చేతుల్లో 2,64,521.06 ఎకరాల భూమి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 2,33,535 మంది చేతుల్లో 2,32,250.67 ఎకరాలు ఉంది. అందులో నల్లగొండలో వ్యవసాయం చేసే 66,876 మంది ఎస్సీల చేతుల్లో 42,125 ఎకరాలు ఉండగా, 75,264 మంది ఎస్టీల చేతుల్లో 58,186 ఎకరాలే ఉంది. సూర్యాపేట జిల్లాలో 29,970 మంది వ్యవసాయం చేసే ఎస్సీల చేతుల్లో 16,159 ఎకరాలు ఉండగా, 43,713 మంది ఎస్టీల చేతుల్లో 31,968 ఎకరాల భూమి మాత్రమే ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 28,223 మంది ఎస్సీలకు 16,487 ఎకరాలు, 14,542 మంది ఎస్టీల చేతుల్లో 9542 ఎకరాలు మాత్రమే ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ వరకు వర్షపాతంలో వ్యత్యాసం నమోదవుతోంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 76 శాతం వ్యత్యాసం నమోదైంది. నల్లగొండ జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 44 శాతం వ్యత్యాసం ఉండగా, సూర్యాపేటలో 30 శాతం వ్యత్యాసం నమోదైంది. ఫ పరిశ్రమల్లో పది.. తలసరి ఆదాయంలో 14వ స్థానం ఫ ఎస్సీ, ఎస్టీల చేతిలో ఉన్న భూమి తక్కువే ఫ పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్న ఔత్సాహికులు సోషియో ఎకనామిక్ ఔట్లుక్–2026 వెల్లడి -
నేడు గవర్నర్, కేంద్ర మంత్రి రాక
భువనగిరిటౌన్ : పీఎం సంసద్ క్రీడా పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేసేందుకు ఆదివారం భువనగిరి పట్టణానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, కేంద్ర సహాయ మంత్రి బీఎల్ వర్మ రానున్నారు. ఇందుకు గాను భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చేస్తున్న వేదిక ఏర్పాట్లను శనివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్ గౌడ్, నాయకులు పాశం భాస్కర్, పడమటి జగన్మోహన్ రెడ్డి, చందా మహేంద్గుప్తా తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా సినీ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ బృందంతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని వారు తెలిపారు. -
ఫూలే, జగ్జీవన్‌రామ్ చూపిన మార్గాలే దిక్సూచి
తుంగతుర్తి : మహాత్మా జ్యోతిబాఫూలే, జగ్జీవన్‌రామ్ చూపిన మార్గాలే మనకు దిక్సూచి అని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జ్యోతిబాఫూలే విగ్రహావిష్కరణ, బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహనీయుల ఆలోచనలు ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని అన్నారు. సమాజంలో ఐక్యతను పెంపొందించాలని పిలుపునిచ్చారు. జ్యోతిబాఫూలే మహిళా విద్య, కులవ్యవస్థ నిర్మూలనలో కీలక పాత్ర పోషించగా, బాబూ జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. అనంతరం అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడోత్సవాలను, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న, గ్రామ సర్పంచ్ చిలకల మంజుల వెంకన్న, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, అరుంధతి యువజన సంఘం అధ్యక్షుడు చింతకుంట్ల పరమేష్, చింతకుంట్ల మిట్టల్, ఉప సర్పంచ్ శ్రీకాంత్, మాజీ ఎంపీటీసీ కేతిరెడ్డి లతా విజయకుమార్ రెడ్డి, కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, పాశం అజయ్ కుమార్, గౌరవాధ్యక్షుడు చింతకుంట్ల వెంకన్న(బిల్డర్), మందుల నరేష్, చింతకుంట్ల పరమేష్ (బాబు), సభ్యులు మందుల పరమేష్, చింతకుంట్ల సైదులు, మాచర్ల ఉపేందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు రేగటి రవి, సుంకరి జనార్దన్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. ఫ ఎమ్మెల్యే మందుల సామేల్ -
గ్రామీణ రహదారులకు మహర్దశ
బడ్జెట్లో పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించింది. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్లు రూపుదిద్దుకోనున్నాయి. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో గ్రామాలను కలుపుతూ ఉండే లింక్ రహదారులు ఇంకా అస్తవ్యస్తంగానే ఉన్నాయి. ఈ బడ్జెట్లో కేటాయించినట్లుగా నిధులు విడుదల చేస్తే ఈ రహదారులన్నీ బాగుపడి రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాయితీలపై రుణా లను మంజూరు చేసేందుకు గతేడాది ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా.. ఆయా వర్గాల నుంచి దాదాపు 22వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే నిధులను మాత్రం ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో దరఖాస్తులకు మోక్షం కలగలేదు. ఈ బడ్జెట్లో సుమారుగా రూ.6వేల కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించడంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురించాయి. -
మక్క సాగుపై మక్కువ
మేళ్లచెరువు : ఖరీప్‌లో సాగుచేసిన పత్తి, కంది, పెసర వంటి పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు ఈ యాసంగి సీజన్లో మొక్కజొన్న పంటపై దృష్టి సారించారు. తక్కువ నీరు అవసరమయ్యే మొక్కజొన్నను ఎంచుకున్నారు. ప్రస్తుతం మేళ్లచెరువు మండల వ్యాప్తంగా సుమారు 1020 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేస్తున్నారు. తక్కువ రోజుల్లోనే దిగుబడి వచ్చే విత్తనాలను ఎంచుకున్నారు. కేవలం మూడు నెలల్లోనే పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. మొక్కజొన్నకు మార్కెట్లో మంచి ధర లభిస్తుండడంతో సాగు విస్తీర్ణం పెరగడానికి ప్రధాన కారణమైంది. ధర ఆశాజనకం..బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం క్వింటాకు 2,100 రూపాయల నుంచి 2,400 రూపాయల వరకు ధర లభిస్తుంది. పెట్టుబడి తక్కువగా ఉండి, గిట్టుబాటు ధర ఆశాజనకంగా ఉండడంతో రైతులు మొక్కజొన్నసాగు ద్వారా ఆర్థిక కష్టాల నుంచి బయటపడతామని ఆశిస్తున్నారు. మొక్కజొన్న సాగుకు వ్యయం ఇతర పంటలతో పోలిస్తే చాలా తక్కవ. ఎకరాకు కేవలం రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. తెగుళ్ల బెడద మొక్కజొన్నకు నామమాత్రంగానే ఉండడంతో పురుగుమందుల ఖర్చు కూడా తగ్గుతుంది. అంతేకాకుండా పంట దిగుబడి కూడా ఎకరాకు 25 క్వింటాళ్ల నుంచి 35 క్వింటాళ్ల వరకు వస్తుండడంతో రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు.ఫ తక్కువ పెట్టుబడి.. మెరుగైన దిగుబడి ఫ గిట్టుబాటు ధర లభిస్తుండడంతో రైతుల ఆసక్తి -
సమతుల్యంగా ఉంది
కోదాడ : రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన రాష్ట్ర బడ్జెట్ సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ సమతుల్యంగా ఉంది. వ్యవసాయం, సాగునీటి రంగాలతో పాటు గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత నిచ్చారు. విద్యారంగానికి 8.22 శాతం మాత్రమే నిధులు కేటాయించారు. ఇది 10 శాతం వరకు పెంచాల్సిన అవసరం ఉంది. ప్రీప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు బ్రేక్‌ఫాస్ట్, ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం ఆహ్వానించదగిన పరిణామం. ఉద్యోగులకు, పెన్షనర్లకు డిజిటల్ ఆరోగ్య కార్డులు, ద్యివాంగ విద్యార్థులకు వాహనాలు ఇస్తామనడం మంచి నిర్ణయం. – బడుగుల సైదులు, ఆర్థిక విశ్లేషకుడు, కోదాడ -
పెన్షన్లకు మోక్షం..
చేయూత పెన్షన్ పథకం కింద.. సాధారణ పెన్షన్లు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.4వేల చొప్పున అందిస్తున్నారు. చివరిసారిగా 2022లో కొత్త పెన్షన్లను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లుగా పెన్షన్ల మంజూరు, పెన్షన్ల పెంపు లేకుండా పోయింది. ఈ బడ్జెట్లో పెన్షన్ల పెంపు రూ.500 వరకు ఉంటుందని ప్రచారం జరిగినా ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేదు. కానీ కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని నిర్ణయించగా.. జిల్లాలో సుమారుగా 15వేలకు మందికి లబ్ధి చేకూరనుంది. ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంత కానుంది. ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు రూ.7,430 కోట్లు కేటాయించింది. ఇందులో ఇందిరమ్మ ఇళ్ల కోసమే దాదాపు రూ.5500 కోట్లు ఉన్నాయి. ఈ క్రమంలో జిల్లాలో వివిధ దశల్లో ఉన్న 5,400 ఇళ్లకు బిల్లుల చెల్లింపు జరగనుంది. నిర్మాణాలు వేగంగా పూర్తి కానున్నాయి. ఇక రెండోవిడత ఇందిరమ్మ ఇళ్ల ప్రస్తావన లేకపోవడంతో ఈ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు నిరాశ చెందారు. -
వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : డీఎంహెచ్ఓ
మునగాల : ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా పోగ్రాం ఆఫీసర్ ప్రసీద్కుమార్, మండల వైద్యాధికారి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్యశిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ శిబిరంలో 230మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి రవీందర్ తెలిపారు. వైద్య శిబిరాన్ని సర్పంచ్ నల్లపాటి ప్రమీల ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.సరిత, ఎంపీడీఓ కె.రమేష్‌దీనదయాళ్, సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, ఉపసర్పంచ్ కాసర్ల వెంకట్, రిటైర్డ్ ఎంఈఓ ఓరుగంటి రవి, డాక్టర్ మణికుమారి, రేఖ, బడుగుల యశ్వంత్, రంజిత్ కుమార్, రాజు, రవీందర్, పుష్ప పాల్గొన్నారు.సబ్‌స్టేషన్ నిర్మాణానికి స్థల పరిశీలనగరిడేపల్లి : మండలంలోని రాయినిగూడెం శివారులో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణానికి కేటాయించిన ప్రభుత్వ స్థలాన్ని సూర్యాపేట ఎస్ఈ శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రాయినిగూడెం, ముత్యాలనగర్, కాల్వపల్లి, సర్వారం, కాచవారిగూడెం, లింగగిరి గ్రామాల్లో లోవోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు 33/11కేవీ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ గుండు రామాంజిగౌడ్, ఏఈ గన్న సాయికృష్ణ, పంచాయతీ కార్యదర్శి సునీత, ఏఎల్ఎం రాజు తదితరులు పాల్గొన్నారు.నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలో వివిధ పనుల కోసం గతేడాది కంటే ఈసారి బడ్జెట్‌ను తగ్గించింది. గతేడాది బడ్జెట్లో రూ. 297.95 కోట్లను ఇచ్చిన ప్రభుత్వం ఈసారి దానిని రూ.195.85 కోట్లకే పరిమితం చేసింది. ఆ నిధులతో డ్యాం సంబంధిత, ప్రధాన పనులు, కాలువలు, డిస్ట్రిబ్యూటరీల పనులను చేపట్టాల్సి ఉంది. నాగార్జునసాగర్ కింద గతంలో మంజూరు చేసిన దాదాపు 15 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన పనులను బడ్జెట్లో ప్రస్తావించలేదు. ఇక మూసీకి గతేడాది రూ. 50 కోట్లు కేటాయించగా, ఈసారి రూ.30.15 కోట్లకే పరిమితం చేసింది. జిల్లాలో ఉన్న శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు (ఎస్ఆర్ఎస్పీ) స్టేజ్–2 కాలువల విస్తరణ, అభివృద్ధి పనుల్లో వేగం పుంజుకోనుంది. దీంతో జిల్లాలోని చివరి ఆయకట్టు వరకు సాగునీటిని అందించేలా చర్యలు చేపట్టనుంది. అందుకే ఈసారి బడ్జెట్లో ఈ పనులకు గతేడాది కంటే భారీగా పెంచింది. జిల్లాలో దీనికోసం గతేడాది రూ.34.01 కోట్లు మాత్రమే ఇచ్చిన ప్రభుత్వం ఈసారి రూ. 276.86 కోట్లు కేటాయించింది. దాదాపు రూ. 242.85 కోట్లు అదనంగా ఇచ్చింది. కాలువుల, డిస్ట్రిబ్యూటరీల కోసమే ఈ నిధులను కేటాయించింది. -
మట్టపల్లి ఆలయంలో నిత్య కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నిత్య కల్యాణం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు శ్రీస్వామి అమ్మవార్లకు అభిషేకం, ఎదుర్కోళ్ల మహోత్సవం, విష్వక్సేనారాదన, పుణ్యాహవచనం, రక్షాబంధనం నిర్వహించారు. మాంగల్యధారణ తంతు కనులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు పాల్గొన్నారు. -
త్యాగాలకు ప్రతీక రంజాన్
సూర్యాపేటటౌన్ : రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లింలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షలు పలించాలని, త్యాగా లకు, మతసామరస్యానికి ప్రతీక రంజాన్ అని పేర్కొన్నారు. తెలంగాణాలో కుల, మతాల ఐక్యతను పెంచిన ఘనత కేసీఆర్‌ది అని, ఆయన హయాంలోనే పండుగల ప్రాధాన్యత పెంచుకున్నామని, అన్ని మతాల ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.ప్రమాద స్థలాల పరిశీలనతిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ కె.నరసింహ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులను, తిరుమలగిరి క్రాస్ రోడ్డులో రోడ్డు ప్రమాద స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యత తీర్చేందుకు ఆపరేషన్ రోప్ అనే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. వాహనదారులు ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని కోరారు. వ్యాపారులు రోడ్డు ఆక్రమించడం వల్ల ప్రజలు ప్రమాదాల బారిన పడతారని తెలిపారు. అరైవ్, అలైవ్ రోడ్డు భద్రత కార్యాచరణ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజలను చైతన్యం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. -
2,38,464 కుటుంబాలకు ధీమా
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొనసాగుతున్న సంక్షేమ పధకాలకు తోడుగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది. ఇందులో కుటుంబ పెద్ద ఏదైనా కారణంతో మృతిచెందితే రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నారు. ఈ పథకం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట జిల్లాలో 2,38,464 కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ ఫాస్ట్ స్కీంను ప్రభుత్వం అమలు చేయనుంది. విద్యార్థులకు వారంలో మూడు రోజుల పాటు పాలు, మరో మూడు రోజులు రాగి జావ ఇవ్వనున్నారు. అలాగే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని సైతం అమలు చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు కానుండగా.. జిల్లాలో 2వేల మందికి పైగా ఇంటర్ విద్యార్థుల ఆకలి తీరనుంది. -
జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సీతారాంరెడ్డి
మఠంపల్లి: మఠంపల్లి మండల కేంద్రానికి చెందిన మన్నెం వెంకటరెడ్డి, సరోజనమ్మ దంపతుల పెద్దకుమారుడు వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) మన్నెం సీతారాంరెడ్డి ఆలిండియా సివిల్ సర్వీసెస్ వాలీబాల్ క్రీడాపోటీలకు (నేషనల్ గేమ్స్) తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికయ్యారు. గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈనెల 20 నుంచి 25వరకు న్యూఢిల్లీలో జరగనున్న వాలీబాల్ పోటీల్లో రాష్ట్రం తరుపున ఆడనున్నారు. ప్రస్తుతం ఆయన చిలుకూరు మండలం పాలెఅన్నారం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వాలీబాల్ క్రీడలో శిక్షణ ఇస్తున్నారు. -
స్టాఫ్ నర్స్ ఉద్యోగాల పేరిట మోసం
సూర్యాపేటటౌన్ : స్టాఫ్ నర్సుల ఉద్యోగాల పేరుతో మోసం చేసిన వ్యక్తిని సూర్యాపేట పట్టణ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణ సీఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్యాల రఘురాం అనే వ్యక్తి క్రీడల ఈవెంట్స్ నిర్వహిస్తున్నాడు. తనకు పెద్ద నాయకులతో పరిచయాలు ఉన్నాయని ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానని బాధితుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఇలా హైదరాబాద్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్‌లో ఉద్యోగం చేస్తున్న వాణి అనే మహిళతో కలిసి మోసాలకు పాల్పడుతున్నాడు. సూర్యాపేట జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన సుమారు 60 మంది బాధితుల నుండి రూ. కోటి 85 లక్షల వరకు వసూలు చేసి వారికి ఉద్యోగాలు ఇప్పించకుండా మోసం చేశాడు. ఈక్రమంలో పట్టణంలోని జమ్మిగడ్డ ప్రాంతానికి చెందిన మహిళ హైదరాబాద్‌లో స్టాఫ్ నర్సుగా ఉద్యోగం చేస్తుండగా హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బదిలీ చేయించడానికి గాను రూ.20 లక్షలు రఘురాం తీసుకున్నాడు. ఆ మహిళ గతంలో నర్సింగ్ కళాశాలలో కొంతమందికి రఘురాంను పరిచయం చేసింది. ఇలా అతడు హైదరాబాద్ కు చెందిన వాణితో కలిసి నకిలీ నియామక పత్రాలను చూపి బాధితుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేశాడు. జమ్మిగడ్డకు చెందిన బాధితురాలు ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు దుగ్యాల రఘురాంను శుక్రవారం మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామంలో అతని ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చగా 14రోజుల రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు. నిందితుని నుంచి నకిలీ జాబ్ సర్టిఫికెట్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మోసం చేసిన డబ్బులతో జల్సాలు చేసినట్లు, రూ.30 లక్షల విలువైన ప్లాట్, రూ.30 లక్షల విలువైన కారు కొనుగోలు చేసినట్లు సీఐ తెలిపారు. 60 మంది బాధితుల నుంచి రూ.కోటి 85లక్షల వసూలు నిందితుడి అరెస్టు, రిమాండ్ -
రైతుల విశ్వాసాన్ని కోల్పోయిన కాంగ్రెస్
నకిరేకల్ : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను విస్మరించి, వారి విశ్వాసాన్ని కోల్పోయిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆరోపించారు. శుక్రవారం నకిరేకల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుబంధు ఇస్తామని మభ్యపెడుతున్నారే తప్ప రైతుల ఖాతాలో జమ చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలు, పండుగల ముందు సీఎం రేవంత్‌రెడ్డి బోగస్ మాటలు తప్ప రైతుబంధును పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఏకకాలంలో రైతులందరికీ రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నరకం ధాన్యం పండించిన రైతులకు బోనస్ ఇస్తానని మాటలు తప్ప అవి ఇచ్చిన దాఖాలాలే లేవన్నారు. సకాలంలో యూరియా ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. వరి కోతలు దగ్గర పడుతున్న సమయంలో కరెంటు కోతలు, లోవోల్టేజీ సమస్యలు వస్తున్నా సరి చేయడం లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో మహిళా సంఘాలకు కేటాయించకుండా అధికార పార్టీ కార్యకర్తలకు కేటాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఐకేపీ కేంద్రాలు ఎత్తి వేసి కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పగించారని విమర్శించారు. అధికారులు పునఃపరిశీలన చేసి కేంద్రాలను ఐకేపీకి కేటాయించాలని కోరారు. సమావేశంలో మార్కెట్, మున్సి పల్ మాజీ చైర్మన్లు కొప్పుల ప్రదీప్‌రెడ్డి, రాచకొడ శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అద్యక్షులు ప్రగడపు నవీన్‌రావు, మారం వెంకట్‌రెడ్డి, సర్పంచులు గోర్ల వీరయ్య, బంటు రవి, సైదిరెడ్డి, నాయకులు పెండెం సదానందం, సోమ యాదగిరి, సామ శ్రీనివాస్‌రెడ్డి, గుర్రం గణేష్, పల్లె విజయ్, దైద పరమేషం, యానాల లింగారెడ్డి పాల్గొన్నారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య -
‘లవ్‌వాలా’ సినిమా డైరెక్టర్ అడ్లూరు వాసి
శాలిగౌరారం: మండలంలోని అడ్లూరు గ్రామానికి చెందిన దేశెట్టి రంజిత్‌కుమార్ డైరెక్టర్‌గా తొలి సినిమాను తీస్తున్నారు. అందుకు సంబంధించి శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లోగల కాకతీయహిల్స్లోని శ్రీవేంకటేశ్వర దేవాలయంలో పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి ప్రముఖ సినీ దర్శకులు బుచ్చిబాబు, కొరటాల శివ హాజరయ్యారు. మల్టీమీడియాలో ఎడిటింగ్ స్పెషలైజేషన్‌తో 2009లో డిగ్రీ విద్యను పూర్తిచేసిన రంజిత్‌కుమార్ గత 15 సంవత్సరాలుగా అనేక సినిమాలకు సహదర్శకుడిగా పనిచేశారు. స్వాన్ ఎంటర్టైన్మెంట్, శుభకరి ప్రొడక్షన్ సంయుక్త నిర్మాణంలో రవీంద్రతేజ్, ఆరియామోడీ నటీనటులుగా ‘లవ్‌వాలా’ అనే సినిమాకు రంజిత్‌కుమార్ దర్శకుడిగా తన మొదటి సినిమాను తీస్తున్నారు. రంజిత్‌కుమార్ తండ్రి జనార్దన్ అడ్లూరు గ్రామపంచాయతీలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండగా, తల్లి భద్రమ్మ గృహిణి. రంజిత్‌కుమార్ సినిమా డైరెక్టర్ కావడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
‘యూనిటీ’కి గద్దర్ అవార్డు
● కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా డాక్యుమెంటరీ తీసిన భూదాన్‌పోచంపల్లి వాసి ● డిప్యూటీ సీఎం చేతులమీదుగా అవార్డు అందుకున్న దర్శకుడు, నిర్మాతభూదాన్పోచంపల్లి, చౌటుప్పల్ : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ మలి ఉద్యమనేత, మాజీ మంత్రి దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్ర ఆధారంగా భూదాన్‌పోచంపల్లికి యువ దర్శకుడు బడుగు విజయ్‌కుమార్ దర్శకత్వంలో, చౌటుప్పల్‌కు చెందిన చిత్ర నిర్మాత ధనుంజయ్య రూపొందించిన ‘యూనిటీ’ ది మ్యాన్ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్యుమెంటరీకి గద్దర్ అవార్డు–2026 దక్కింది. ఈమేరకు గురువారం రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్‌రాజు చేతుల మీదుగా దర్శకుడు బడుగు విజయ్‌కుమార్ అవార్డు, రూ.5లక్షల నగదు అందించి ఘనంగా సత్కరించారు. బాధ్యతను పెంచింది దర్శకుడు విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. గద్దర్ ఫిల్మ్ అవార్డు మరింత బాధ్యతను పెంచిందన్నారు. చిత్ర విజయంలో అండగా నిలిచిన నిర్మాత చిరందాస్ శ్రీకాంత్, ధనుంజయ్య, చిత్రంలో ప్రధానపాత్ర పోషించిన మైమ్ మధు, సాంకేతిక బృందానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర నిర్మాత చిరందాసు ధనుంజయ్య మాట్లాడుతూ.. తాము రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రానికి అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో ఇప్పటికే 12 అవార్డులు లభించాయని తెలిపారు. కాగా.. పోచంపల్లి వాసి రాష్ట్రస్థాయిలో గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకోవడం పట్ల పోచంపల్లి మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, భారత లవకుమార్, కొండా లక్ష్మణ్‌బాపూజీ గ్లోబల్ ఫెడరేషన్ చైర్మన్, అడ్వకేట్ రాపోలు జ్ఞానేశ్వర్, ఎంఏ షరీఫ్, కార్టూనిస్ట్ దయానంద్, రామకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. -
అన్న ప్రసాదానికి రూ.6 లక్షల విరాళం
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భక్తులకు నిత్యం అందించే అన్న ప్రసాదానికి హైదరాబాద్‌కు చెందిన పాలమూరు సీడ్స్ నిర్వాహకులు సుదర్శన్‌రెడ్డి రూ.6లక్షల విరాళం అందజేశారు. శుక్రవారం సుదర్శన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ భవాని శంకర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి రూ.6లక్షల చెక్కు, డీడీలను అందించారు. విరాళాన్ని అన్న ప్రసాద కేంద్రంతో భక్తులకు నిత్య అన్నదానం కోసం ఖర్చు చేయాలని కోరారు. గంజాయి పట్టివేత సూర్యాపేటటౌన్ : గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి నాలుగు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు. శుక్రవారం సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు వివరాలు వెల్లడించారు. ఎస్ఐ ఐలయ్య, సిబ్బంది, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం సోదాలు నిర్వహించి అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు తెలిపారు. వారి వద్ద ఉన్న 4 కేజీల గంజాయి పట్టుకున్నట్లు చెప్పారు. నిందితులను సూర్యాపేట పట్టణంలోని భగత్ సింగ్ నగర్‌కు చెందిన మోతె రామకిషన్, శ్రీనివాస కాలనీకి చెందిన మామిడాల రితిన్, రాజనాయక్ తండాకు చెందిన లూనావత్ వెంకటేష్‌లుగా గుర్తించి విచారించినట్లు తెలిపారు. మోతె రామకిషన్ సీలేరు ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి తీసుకుస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల తీసుకొచ్చిన గంజాయిని సూర్యాపేటలో విక్రయించడానికి సూర్యాపేట పట్టణంలోని కొత్త వ్యవసాయ మార్కెట్ వద్దకు గంజాయితో రాగా.. ఈ ముగ్గురిని పట్టుకున్నట్లు పేర్కొన్నారు. వారి నుంచి రెండు బైక్‌లు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. కోతుల దాడిలో ఇద్దరికి గాయాలు అర్వపల్లి: కోతుల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈఘటన అర్వపల్లిలో పోలీస్‌స్టేషన్ రోడ్డులోని జెడ్పీహెచ్ఎస్ సమీ పంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అర్వపల్లిలో తాడూరి యాదగిరి కుమారుడు మనువర్మ, పురంశెట్టి తన్వికసాయి ఇద్దరు కలిసి ఆడుకుంటుండగా సమీపంలో ఉన్న కోతులు ఒక్కసారిగా వచ్చి దాడి చేశారు. దీంతో వారికి గాయాలయ్యాయి. చిన్నారులను వారి తల్లిదండ్రులు స్థానిక పీహెచ్‌సీకి తీసుకెళ్లి వైద్య చికిత్స చేయించారు. -
ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య
దేవరకొండ: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యవసాయ కూలీ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప డిన సంఘటన దేవరకొండ మండలం తాటికోల్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. సీఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన హన్మంతు తిరుపతి(45) గ్రామంలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబంతో కలిసి జీవనం కొనసాగిస్తున్నాడు. తిరుపతి కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. శుక్రవారం ఎప్పటిలాగానే పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే గల ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన చుట్టుపక్కల వారు కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంతిప్పర్తి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన తిప్పర్తి మండలంలోని గడ్డికొండారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వీరమళ్ల చంద్రయ్య(55) ఓ వ్యక్తికి సంబంధించిన తోటలో కాపలాగా పనిచేస్తున్నాడు. శుక్రవారం తోటలో పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. పడిపోయి ఉండడంతో కుటుంబసభ్యులు గమనించి 108కు సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం చంద్రయ్యను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు. మహిళ అదృశ్యంనల్లగొండ: నల్లగొండలోని అన్సారీ కాలనీకి చెందిన వివాహిత అదృశ్యమైంది. ఈమేరకు కుటుంబసభ్యులు శుక్రవారం నల్లగొండ టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అన్సారీ కాలనీకి చెందిన బోధ (45) తాను నందిగామకు వెళ్తున్నానని తన కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లింది. కుటుంబ సభ్యులు ఆరా తీయగా ఆమె నందిగామకు చేరుకోలేదని తెలిసింది. ఈమేరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బోధ ఆచూకీ తెలిసిన వారు టూటౌన్ ఎస్ఐ 87126 70176కు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు. -
గడ్డి మందు పిచికారీతో పంట ధ్వంసం
నేరేడుచర్ల : పంట పొలానికి గడ్డి మందు పిచికారీ చేయడంతో ఐదెకరాల వరి పొలం పూర్తిగా ఎండిపోయింది. దీంతో రూ.5లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. నేరేడుచర్ల మండలం దాచారం గ్రామానికి చెందిన పేర్వాల శ్రీదేవి 2003లో ఐదెకరాలు భూమిని కొనుగోలు చేసుకొని సాగు చేసుకుంటుంది. 2018లో ధరణిలో ఆమెకు తెలియకుండా మరో వ్యక్తి పట్టా మార్పు చేసుకోవడంతో కోర్టును ఆశ్రయించింది. 2025లో ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో తిరిగి భూమిని సాగు చేసుకుంటుంది. కోర్టు తీర్పు ఆధారంగా ఆమెకు కొత్త పాస్‌బుక్ వచ్చింది. ఈక్రమంలో కోట్ల సునిత, కోట్ల వెంకట్‌రెడ్డితో పాటు మరికొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఈనెల 16న తన వరి పొలానికి గడ్డిమందు పిచికారీ చేయడంతో తన ఐదు ఎకరాల వరి పొలం పూర్తిగా ఎండిపోయిందని పేర్వాల శ్రీదేవి వాపోయింది. గురువారం రాత్రి పొలంలోని స్టార్టర్‌ను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారని తెలిపింది. దీంతో శుక్రవారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్‌నాయక్ తెలిపారు. -
పాడి పశువుల ఎంపికలో జాగ్రత్తలు అవసరం
పెద్దవూర: రైతులు, పాడి పశువుల నిర్వాహకులు మేలు జాతి పశువుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పెద్దవూర మండల పశువైద్యాధికారి డాక్టర్ నులక నాగార్జున్‌రెడ్డి తెలిపారు. పశువు శరీర లక్షణాలు, పశువు వంశావళి, సంతతి, పశువు ఉత్పత్తి సామర్థ్యం వంటి విషయాలపై అవగాహనతో పశువులను కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. పశు సంతతి గుర్తించాలిపశువుల యజమానులు పశువు ఉత్పత్తి సామర్థ్యం, పాల ఉత్పత్తి, ఆరోగ్య చరిత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వీటిని బట్టి సంతానం సామర్థ్యం అంచనా వేయొచ్చు. పశువులకు సంబంధించిన ఇలాంటి వివరాలు పెద్ద పెద్ద ఫారాలు, ప్రభుత్వ ఫారాలలో మాత్రమే లభ్యమవుతుంది. సంతల్లో అమ్మే రైతుల దగ్గర ఇలాంటి రికార్డులు లభించవు. కావున పశువు శరీర లక్షణాలను బట్టి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పశువుల గరిష్ట స్థాయి పాల దిగుబడి పశువు ఈనిన 40–60 రోజుల లోపల ఉంటుంది. గరిష్ట స్థాయికి త్వరగా చేరి, గరిష్ట స్థాయిలో ఎక్కువ రోజుల్లో పాల దిగుబడి ఇవ్వగలిగిన పశువులే లాభదాయకంగా ఉంటాయి. మేలు జాతి పశువుల శరీర లక్షణాలుపాడి పశువులు నిండుగా, చురుకుగా ఉండాలి. సులువుగా ఉండాలి కానీ ఎద్దులాగా బాగా కండపట్టి ఉండకూడదు. శరీర అంగ సౌష్టవం త్రికోణాకారం కలిగి ఉండటంతో పాటు చర్మం పలుచగా, మృదువుగా ఉండాలి. లాగితే ముడత సులువుగా రావాలి. వదిలితే యథాస్థానంలో ఉండాలి. తేలికగా నడవగలిగి సులువుగా కూర్చుని లేవాలి. కళ్లు చురుకుగా విశాలంగా ఉండి ముట్టె చెమ్మగిల్లి ఉండాలి. ఇలాంటి లక్షణాలతో పాటు మరికొన్ని లక్షణాలను కలిగి ఉండాలి. మెడ పొట్టిగాను, సన్నగాను, ఉండి ఛాతీ భాగం విశాలంగా ఉండాలి. డొక్కలు నిండుగాను, కడుపు పెద్దదిగాను, పక్కటెముకలు బాగా వంచిన విల్లు ఆకారంలో ఉండాలి. పశువుల పిరుదుల భాగం వెనుక వైపు పొంగి ఉంటే సులభంగా ఈనగలదని గ్రహించాలి. అంతేకాకుండా కాళ్లు దృఢంగా ఉండి కాలి గిట్టలు వెడల్పుగా, గుండ్రంగా ఒక దానికి ఒకటి దగ్గరగా ఉండాలి. పొదుగు లక్షణాలుపశువు పొదుగు సాగి వేలాడకూడదు. బాగా విస్తరించి శరీరానికి హత్తుకుని ఉండాలి. 18 అంగుళాల పైనే ఉండాలి. చనుకట్ల పొదుగు మీద సమానంగా అమరి ఉండటంతో పాటు పొదుగు ఇరువైపులా రక్తనాళాలు స్పష్టంగా కనిపించాలి. ఎక్కువ వంకర్లు తిరిగి ఉంటే పాలను ఎక్కువగా ఇవ్వగలవని గుర్తించాలి. పశువుల కొనుగోలులో గుర్తుంచుకోవాల్సిన విషయాలుఅక్టోబర్, నవంబర్ మాసాలు పాడి పశువులను కొనటానికి అనువైన నెలలు. పశువు ఈనిన తర్వాత నెలా, నెలా పదిహేను రోజుల లోపల అత్యధికంగా పాల దిగుబడిని ఇస్తుంది. కావున ఈనిన నెలలోపు పశువులనే ఖరీదు చేయాలి. పశువుల మొదటి 5 ఈతల్లో గరిష్ట స్థాయి పాల దిగుబడిని ఇస్తాయి. కావున మొదటి ఈత, రెండవ ఈత పశువులను మాత్రమే కొనుగోలు చేయాలి. దురలవాట్లు లేని పశువులను కొనుగోలు చేయాలి. ముర్రా గేదె సరాసరి 10–12 లీటర్లు, గ్రేడెడ్ ముర్రా గేదె అయితే 6–7 లీటర్ల పాలు ఇస్తే గిట్టుబాటు అవుతుంది. బెదరకుండా మచ్చికగా ఉండి మన వాతావరణానికి అలవాటు పడే పశువులను కొనుగోలు చేయటంతో పాటు ఎవరు పితికినా పాలిచ్చే పశువులను ఎంపిక చేసుకోవాలి. దీంతో పాటు పాలధారలు నిండుగా బలంగా వెలుపలికి రావాలి. చూడాల్సిన అంశాలు● జాతి లక్షణాలు, పశువు శరీర లక్షణాలు, బరువు, కొలతలు గమనించాలి. ● తండ్రి వారసత్వం, తల్లి వారసత్వం, దిగుబడి శక్తి, పునరుత్పత్తి శక్తి, గతంలో పుట్టిన దూడల శక్తి. ● పశువు ఆరోగ్య పరిస్థితి, వయస్సు, ఎన్ని ఈతలు ఈనినది, దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉందా లేదా గమనించాలి. ● పళ్లు శుభ్రంగా ఉన్నాయా, కాళ్లు, డెక్కల్లో బెణుకులు, విరుగుడు ఉందా లేదా చూసుకోవాలి. ● చూపు సరిగా ఉందా, వట్టిదా, చూడిదా, పాడిదా గమనించాలి. ● పాడిడైతే ఎన్ని రోజుల క్రితం ఈనినది, దిగుబడి వివరాలు వెన్నశాతం తెలుసుకోవాలి. ● చూడిదైతే చూడి ఎన్ని నెలలు, ఏ ఆబోతుతో కలిపారనేది తెలుసుకోవాలి. ● వట్టిదైతే ఎదకు వచ్చిందా, ఎన్నిసార్లు, ఎద నిలువలేదా, చివరిసారి వచ్చిన తేదీ, వైద్యం చేయించారా అనేది తెలుసుకోవాలి. ఈ లక్షణాలు ఉంటే పశువులను కొనకూడదు● తక్కువ పెరుగుదల (వయస్సుతో పోల్చితే) ● ఆలస్యంగా ఎదకు రావడం, ఎదకు రాకపోవడం ● ఈతకు, ఈతకు మధ్య హెచ్చుకాలం, నయంకాని దీర్ఘవ్యాధులు ● మెయ్యదిగుట, పాలు తక్కువ ఇచ్చుట, దూడ లేకపోతే పాలు ఇవ్వకపోవడం.పశువుల బరువు తెలుసుకోవడం పశువుల బరువును తెలుసుకుంటే వాటికి ఇవ్వాల్సిన మేతలు, దాణాలు, మందులు, సరైన మోతాదులో ఇవ్వొచ్చు. కాటాలో కాని, వేబ్రిడ్జి మీద కాని తూకం వేయడం వలన బరువు స్పష్టంగా తెలుస్తుంది. ఎల్జీ2బై 660. ఈ సూత్రం ఆధారంగా పశువు పొడవు, ఛాతీ భాగం, చుట్టు కొలతను బట్టి బరువు తెలుసుకోవచ్చు. ఎల్ అనగా పశువు ముందు జబ్బ పాయింట్ నుంచి వెనుక తొడల వరకు పొడవు అంగుళాల్లో. జీ అంటే పాడి పశువు ఛాతి చుట్టుకొలత అంగుళాల్లో. ఇది అన్ని పశువులకు అన్ని వయసుల్లో సుమారుగా సరిపోతుంది. పెద్దవూర మండల పశువైద్యాధికారి నాగార్జున్‌రెడ్డి సూచనలు -
ఆటోను ఢీ కొట్టిన కారు
మరిపెడ రూరల్: ఆటోను కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఆరుగురికి గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని పురుషోత్తమాయగూడెం శివారు సీతారాంపురం స్టేజీ వద్ద మహబూబాబాద్–సూర్యాపేట 365 జాతీయ రహదారిపై శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పురుషోత్తమాయగూడెం గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ కుటుంబం ఓ శుభకార్యం నిమిత్తం ఆటోలో మహబూబాబాద్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో సీతారాంతండా స్టేజీ సమీపంలో మహబూబాబాద్ నుంచి అతివేగంగా వస్తున్న కారు ఆటోను ఎదురుగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న రామస్వామి వెంకన్న (55) మృతి చెందగా, మరో ఆరుగురు.. పిట్టల శ్రీనివాస్, పిట్టల పద్మ, గాలి గిరి, గాలి అరుణ, కేసరి శేషమ్మ, ఆటో డ్రైవర్ రవీందర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో పిట్టల పద్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డవారిలో ఐదుగురిని మానుకోటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి, ఇద్దరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయంగా ఉన్న పిట్టల పద్మను ఖమ్మం ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతుడు రామస్వామి వెంకన్నది సూర్యాపేట కాగా, శుభకార్యానికి బంధువుల ఇంటికి వచ్చి మృత్యువాత పడ్డాడు. మరిపెడ పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. కారు డ్రైవర్ యాస రవి, చంద్రారెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ● ఒకరి మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు -
నెలాఖరు నుంచి..
భానుపురి (సూర్యాపేట) : యాసంగి సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నాహాలు మొదలు పెట్టారు. జిల్లాలో సాగైన వరి ఎంత.. ఎంత దిగుబడి రానుంది.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎంత ధాన్యం వస్తుంది.. ఈ మేరకు ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉందన్న అంచనాలతో జిల్లా యంత్రాంగం కొనుగోళ్లకు సిద్ధమవుతోంది. మరో పది రోజుల్లో వరి కోతలు ఊపందుకోనుండడంతో ఈ నెలాఖరు నాటికి ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించే అవకాశం ఉంది. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 4.82 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఇందులో సన్నాలు 2 లక్షల ఎకరాల వరకు ఉండనుంది. మిగతాది దొడ్డు రకం ఉండగా.. మొత్తంగా ధాన్యం దిగుబడి దాదాపు 8 నుంచి 9 లక్షల మెట్రిక్ టన్నులు వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 335 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. గతంలో మాదిరిగానే సన్నరకం ధాన్యానికి, దొడ్డురకం ధాన్యానికి వేర్వేరుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఏ ప్రాంతంలో మొదటగా వరి కోతలు ప్రారంభం కానున్నాయి.. అక్కడ సాగైన వరి ఏ రకం.. అన్న ఆధారంగా కొనుగోలు కేంద్రాలను నెలకొల్పనున్నారు. ఇందులో ఏ శాఖ నుంచి ఎన్ని సెంటర్లు నడపనున్నాయని.. ఎక్కడ అన్నది క్షేత్ర స్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. మిల్లుల కేటాయింపు నుంచి రవాణా దాకా..యాసంగి ధాన్యం కేటాయింపుల కోసం మిల్లుల గుర్తింపు ప్రక్రియను సైతం అధికారులు చేపట్టారు. బ్యాంకు గ్యారెంటీలు, అగ్రిమెంట్ సమర్పించిన మిల్లులకే ఈ సీజన్లో ధాన్యం కేటాయించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యాన్ని రవాణా చేసేందుకు కావాల్సిన వాహనాలకు టెండర్ల ప్రక్రియను చేపట్టారు. దీంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులోనూ మండల స్థాయి కమిటీ ఇచ్చే సిఫారసుల మేరకు ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో రైతుల డిమాండ్ మేరకు కేంద్రాలను నెలకొల్పే అవకాశం ఉంటుంది. రైతులకు రవాణా చార్జీలు సైతం తగ్గి.. అందుబాటులో సెంటర్లు ఉండనున్నాయి. ఇక గన్నీ బ్యాగులను మిల్లర్ల నుంచి సేకరించి కేంద్రాల ప్రారంభం నాటికి సిద్ధం చేయనున్నారు. దాదాపు కోటి ఐదు లక్షల మేర గన్నీ బ్యాగులు ఈ సీజన్లో అవసరవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.యాసంగి వరి సాగు విస్తీర్ణం 04.82 లక్షల ఎకరాలు ధాన్యం దిగుబడి అంచనా 9 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ కొనుగోలు లక్ష్యం 4.10 లక్షల మెట్రిక్ టన్నులు ఫ యాసంగి ధాన్యం సేకరణకు సన్నాహాలు ఫ 4.10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని లక్ష్యం ఫ గన్నీ బ్యాగులు, ఇతరత్రా సౌకర్యాల కల్పనకు కార్యాచరణ -
గోదావరి జలాల నిలిపివేత
ఫ మళ్లీ 27 నుంచి వదలనున్న అధికారులు అర్వపల్లి : యాసంగి సీజన్‌కుగాను వారబందీ విధానంలో 5వ తడిగా విడుదల చేసిన గోదావరి జలాలను గురువారం నిలిపివేశారు. ఈసారి వారబందీ విధానంలో మూడురోజులపాటు అదనంగా వదిలారు. తిరిగి వారబందీ విధానంలో 6వతడి చివరి విడతగా ఈ నెల 27 నుంచి వదలనున్నట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. మట్టపల్లిలో గరుడ వాహన సేవ మఠంపల్లి : మట్టపల్లి దేవాలయంలో గురువారం గరుడవాహన సేవను ఊరేగించారు. అంతకుముందు శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి శ్రీ రాజ్యలక్ష్మీ, చెంచులక్ష్మీ అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ ఆంజనేయ స్వామికి శ్రీ గోదాదేవి అమ్మవారికి విశేష పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు మట్టపల్లిరావు, విజయ్ కుమార్, ఈఓ జ్యోతి, అర్చకులు పాల్గొన్నారు. యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెలుగు నూతన సంవత్సరం ఉగాది కావడంతో గురువారం వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు విశేషంగా సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలం కారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యా లను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు చేశారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో శ్రీస్వామి అమ్మవార్ల సేవలను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సమాజ సేవతోనే గుర్తింపు చిట్యాల : సమాజ సేవతోనే గుర్తింపు లభిస్తుందని రిటైర్డ్ జడ్జి జస్టిస్ కుకుడాల లక్ష్మణ్ అన్నారు. ప్రమోద సాహితీ సంస్థ ఆధ్వర్యంలో చిట్యాలలో గురువారం రాత్రి ఉగాది కవి సమ్మేళనం నిర్వహించారు. అనంతరం వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన దాసరి శ్రీరాములు(విద్యారంగం), డాక్టర్ మూడ సుదర్శన్ (వైద్యరంగం), యేళ్ల భయ్యన్న(జర్నలిజం), కొంతం సత్తిరెడ్డి(వ్యవసాయం)లకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రమోద సాహితీ సంస్థ అధ్యక్షుడు కందిమళ్ల కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీతారమేష్, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మీ సైదులు, ఏఎంసీ చైర్మన్ వినోదమోహన్‌రెడ్డి, శ్రీకనకదుర్గా ఆలయ చైర్మన్ ఆంజనేయులు, సాహితీ సంస్థ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ పాల్గొన్నారు. -
దివ్యాంగుల నిరసన
చివ్వెంల(సూర్యాపేట) : వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికుల పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ గురువారం భారత వికలాంగ హక్కుల పరిరక్షణ సమితి (బీవీహెఓచ్పీఎస్) ఆధ్వర్యంలో చివ్వెంల మండల పరిధిలోని గుంపుల గ్రామంలో పచ్చిగడ్డి తింటూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నూతన పెన్షన్లు పంపిణీ చేయాలని, లేనియెడల ఈ నూతన సంవత్సరం నుంచే రేవంత్ రెడ్డి సర్కార్‌కు ‘పరాభవం’ తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరి ఈదయ్యబాబు, మున్న మధుసూదన్, పిట్ట వెంకట్‌రెడ్డి, మున్న మల్లయ్య, ఖాదర్, రత్తమ్మ, ఇమాంబీ, వెంకటమ్మ, సత్యం, పాషా, నారయణ, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ప్రభుత్వ భవనాలకు మోక్షమెప్పుడో..
కోదాడరూరల్ : మండలంలో పలు ప్రభుత్వ భవన నిర్మాణాలు ఏళ్లుగా అసంపూర్తిగానే మిగిలి ఉన్నాయి. ఏళ్ల తరబడి భవనాల పనులు ఆగుతూ.. సాగుతూ నత్తనడకన సాగుతున్నాయి. కోదాడ ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్‌తో పాటు గణవపరం, తొగర్రాయి, దోరకుంట, నల్లబండగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పనులు ముందుకు సాగడం లేదు. ఎనిమిదేళ్లైనా అసంపూర్తిగా.. కోదాడ పట్టణ పరిధిలోని కొమరబండ కేఎల్ఆర్ కాలనీ వద్ద ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ భవనం నిర్మాణానికి రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించారు. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.42 లక్షల నిధులు మంజూరు చేసింది. 2018లో నాటి అధికారులు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ పనులు చేపట్టిన మూడు నెలలకే బేస్మెంట్ వరకు చేపట్టిన పనులకు నిధులు విడుదల కావడం లేదని నిలిపివేశాడు. ఆరేళ్ల తర్వాత 2024 లో నిధులు విడుదల కావడంతో స్లాబ్ వేశాడు. ఆ తర్వాత మళ్లీ నిధులు విడుదల రాలేదని పనులు ఆపాడు. ఎనిమిదేళ్లైనా భవన నిర్మాణం పూర్తికాలేదు. దీంతో అద్దె భవనంలో స్టేషన్ స్టేషన్‌ను కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. ఎకై ్సజ్ సిబ్బంది, వివిధ పనుల నిమిత్తం స్టేషన్‌కు వస్తున్న ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెటీరియల్ ఖర్చులు పెరిగాయని.. మండలంలోని గణపవరం, తొగర్రాయి, దోరకుంట, నల్లబండగూడెంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల నూతన భవనాల నిర్మాణాలకు 2022లో ఒక్కో భవనానికి జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద రూ. 15 లక్షలు మంజూరయ్యాయి. అదే సంవత్సరంలో అధికారులు, నాటి పాలకులు శంకుస్థాపన చేశారు. ఆయా చోట్ల పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు వెంటన పనులు ప్రారంభించారు. కానీ నిధులు విడుదల కావడం లేదని బెస్మెంట్ లెవల్లోనే పనులు నిలిపివేశాడు. ఆ తర్వాత చేసిన పనులకు నిధులు విడుదలైన తర్వాత పనులు ప్రారంభించి స్లాబ్ వేసి గోడలు కట్టి ప్లాస్టింగ్ పనులను సగం వరకు చేపట్టి వదిలేశారు. పనులకు సంబంధించి మెటీరియల్ ఖర్చులు పెరిగాయని మరికొంత నిధులు అదనంగా మంజూరు చేయిస్తేనే పనులు పూర్తవుతాయని కాంట్రాక్టర్లు చెప్పడంతో ఆ నాలుగు భవనాలు గత నాలుగేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. దీంతో గణపవరంలో పంచాయతీ భవనంలోని ఓ గదిలో, తొగర్రాయిలో ఓ అద్దె భవనంలో, దోరకుంటలో పురాతన భవనంలో, నల్లబండగూడెంలో ఓ ప్రభుత్వ భవనంలో ఓ గదిని తీసుకొని వైద్యసిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు కలుగజేసుకొని నిలిచిపోయిన ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను పూర్తిచేయాలని ఆయా గ్రామాల ప్రజులు, సిబ్బంది కోరుతున్నారు.ఫ ఎనిమిదేళ్లైనా పూర్తికాని ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ నిర్మాణం ఫ అసంపూర్తిగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు -
నూనెల ధరలు సలసల..
ఫ కిలో రూ.170కి చేరిన పల్లీ, సన్‌ఫ్లవర్ ఆయిల్ ఫ గత నెల కంటే రూ.20 నుంచి రూ.30 పెరుగుదల ఫ యుద్ధం సాకుతో సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు ఫ ఆందోళనలో సామాన్య ప్రజలునల్లగొండ టౌన్ : నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన వంట నూనెల ధరలు ౖపైపెకి ఎగబాకుతున్నాయి. గత నెలలో ఉన్న ధర కంటే ప్రస్తుతం కిలో ప్యాకెట్‌పై రూ.30 పెరిగింది. దాదాపు 20 రోజుల క్రితమే పామాయిల్, ప్రీడమ్ ఆయిల్, పల్లీ నూనె ధరలన్నీ పెరిగి పోయాయి. ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపి హోల్‌సేల్, రిటేల్ వ్యాపారులు వంట నూనెల ధరలను పెంచేస్తున్నారు. ఈ క్రమంలో హోల్‌సేల్ వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ ధరను పెంచుతూ పోతున్నారు. జిల్లా అంతటా వంట నూనెల పరిస్థితి ఇలాగే ఉంది. హోల్‌సేల్ డీలర్లు సిండికేట్‌గా మారి..గత నెలలో పామాయిల్ కిలో ప్యాకెట్ ధర రూ.130 ఉండగా ప్రస్తుతం రూ.140కి చేరింది. ప్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ గత నెలలో కిలో రూ.140 ఉండగా ప్రస్తుతం రూ.170 అయ్యింది. వేరుశగన (పల్లీ) నూనె గతంలో రూ.150 ఉండగా ప్రస్తుతం రూ.170కి చేరింది. హోల్‌సేల్ డీలర్లు సిండికేట్‌గా ఏర్పడి యుద్ధాన్ని సాకుగా చూపుతూ నూనెల ధరలు పెంచుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంట నూనెల ధరలు నియంత్రించాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో హోల్‌సేల్ వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం శుభాకార్యాల సీజన్ కావడంతో పాటు ఉగాది, రంజాన్ పండుగల నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరగడంతో వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.వంట నూనె ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అన్ని రకాల నూనెలు గత నెల కంటే రూ.20 నుంచి రూ.30 వరకు పెరిగిపోయి కొనలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి వంట నూనెల ధరలను తగ్గించాలి. – ఆండాలు, గృహిణి, శివాజీనగర్, నల్లగొండ -
బత్తాయి ధర మందగమనం
గుర్రంపోడు : బత్తాయి రైతుకు సీజన్ ఆరంభంలోనే కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. వ్యాపారం పుంజుకునే ప్రస్తుతం తరుణంలో ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయిల్ యుద్ధం చేస్తుండడం, ఈ నెలలో ఉగాది, రంజాన్ పండుగలు రావడంతో మార్కెట్‌పై ప్రభావం పడింది. దీంతో ప్రస్తుత వేసవిలో బత్తాయి ధర పెరగకపోగా కోతలు నిలిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధారణంగా బత్తాయి, నిమ్మ కాయలకు అంతగా విదేశీ ఎగుమతులు ఉండవు. ఎగుమతులకు అవసరమయ్యే లారీల కొరత కారణంగా మార్కెట్ స్తంభించింది. సొంత ప్రాంతాలకు వెళ్లిన లారీలుఢిల్లీ పరిసర ప్రాంతాల లారీల డైవర్లు హోలీ పండుగకు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయి ఇంకా తిరిగా రాలేదు. ఈసారి కురిసిన అధిక వర్షాలకు కశ్మీర్లో ఆపిల్ పంట దెబ్బతినడంతో విదేశీ దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చింది. యుద్ధ ప్రభావం వల్ల విదేశాల నుంచి విమానాల ద్వారా ఆపిల్, ఇతర పండ్ల దిగుమతులు నిలిచిపోయాయి. దీంతో లారీలకు కిరాయిలు దొరకక అక్కడే నిలిచిపోవడంతో ఇక్కడ లారీల కొరత ఏర్పడింది. రంజాన్ పండుగ కారణంగా కూలీల కొరత, మార్కెట్లో క్రయవిక్రయాల్లో మందగమనం నెలకొంది. కత్తెర పంట కోతలోనూ జాప్యంబత్తాయి కత్తెర దిగుబడులు సాధారణంగా మార్చి నెల నుంచి ప్రారంభమమవుతాయి. ఇప్పటికీ కొన్నిచోట్ల కత్తెర ముందు సీజన్ కాయల కోతలు పూర్తికాలేదు. ఆ కాయలకు కత్తెర దిగుబడుల్లో కలిసి అధిక ధర వస్తుందని ఆశిస్తున్నా కోయడంలో జాప్యం జరిగి కాయలు రాలిపోతున్నాయి. ఇప్పటికే రేటు కుదుర్చుకున్న వ్యాపారులు పలు కారణాల వల్ల కాయలు కోయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలేని కత్తెర పంట ఫ వరుస పండుగలు.. లారీల కొరతే కారణం ఫ యుద్ధ ప్రభావంతో నిలిచిన ఎగుమతులు -
మరో ఇద్దరికి విప్ హోదా
సాక్షి ప్రతినిది, నల్లగొండ : శాసన సభ, శాసన మండలిలో పలువురి సభ్యులకు విప్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు. శాసన మండలిలో ప్రభుత్వ విప్‌గా తుంగతుర్తికి చెందిన ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌కు, అసెంబ్లీలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు విప్ హోదా దక్కింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్‌గా కొనసాగుతున్నారు. తాజాగా మరో ఇద్దరికి విప్ హోదా వచ్చింది. వేముల వీరేశం, అద్దంకి దయాకర్‌కు ప్రభుత్వ విప్ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ఇప్పటికే ఆలేరు ఎమ్మెల్యే ఐలయ్యకు విప్ హోదా -
ఉగాది.. ప్రత్యేకం
● మోత్కూరులో ఏటా కొనసాగుతున్న సంప్రదాయం ● నేడు బోనాలు, ఎడ్ల బండ్లతో నూతన తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలకనున్న ప్రజలుమోత్కూరు: ఉగాది పండుగను ఏటా మోత్కూరు పట్టణంలో ప్రజలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. డప్పు చప్పుళ్లు.. పూనకాలతో వీధి వీధి నుంచి బయలుదేరే బోనాలు ఓ పక్క.. రంగు రంగుల పూలు, కాగితాలు, కొబ్బరి మట్టలతో అలంకరించిన ఎడ్ల బండ్లు, కార్లు, ట్రాక్టర్లు మరో పక్క వేగంగా పరుగెత్తుతుండగా నూతన తెలుగు సంవత్సరాదికి స్వాగతం పలకడం చాలా కాలంగా వస్తున్న ఆచారం.తెలుగు నూతన సంవత్సరం మొదటి రోజైన ఉగాది పండుగకు ఎక్కడున్నా మోత్కూరుకు వెళ్లాల్సిందేనని స్థానిక ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా మోత్కూరులో విభిన్న రీతిలో ఉగాది పండుగ జరుపుకుంటారు. పూర్వ కాలంలో ఇక్కడ వేసవిలో మశూచి సోకి పలువురు చనిపోయే వారు. దీంతో గ్రామంలో కొలువై ఉన్న ముత్యాలమ్మ తల్లి ఆగ్రహానికి గురయ్యారని గ్రామస్తులు భావించారు. ఉగాది పండుగ రోజున అమ్మ వారికి ఊరు ఊరంతా డప్పు చప్పుళ్లతో బోనాలు సమర్పించి, జంతువులను బలిఇచ్చి శాంతింపజేయడంతో మశూచి మాయమైనట్లు పలువురు పెద్దలు తెలిపారు. నాటి నుంచి ఇప్పటి వరకు అదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. మహిళలు నూతన వస్త్రాలు ధరించి బోనాలతో పట్టణంలో ప్రదర్శన నిర్వహిస్తారు. ఎడ్ల బండ్లకు ఆకు పచ్చని కొబ్బరి మట్టలు, మామిడి తోరణాలు కట్టి ఊరేగింస్తారు. ఎడ్ల బండ్లు, బోనాలతో ప్రదర్శన నిర్వహించిన అనంతరం స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రదర్శనలు చేయిస్తారు. అనంతరం స్థానిక చెరువు కట్టపై కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి, అంగడి బజార్లో ఉన్న చిన్న ముత్యాలమ్మ తల్లి ఆలయాలకు ఊరేగింపుగా వెళ్లి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ద్విచక్ర వాహనదారులు, యువకులు ఆనందోత్సాహాలతో విన్యాసాలు ప్రదర్శిస్తారు. -
నిషేధంపై ఆగ్రహం
ఫ అసెంబ్లీలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదాద్రిభువనగిరి జిల్లాలో నిషేధిత జాబితాలో చేర్చిన ఇళ్లు, నివేశన స్థలాలను తొలగించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం శాసనసభలో ప్రఽశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 39400 ఇళ్లను రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22 ఏలో చేర్చారన్నారు. దీంతో ఆయా ఇళ్లు క్రయ విక్రయాలు నిలిచిపోయాయన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్లు, ఇళ్ల స్థలాలు నిషేధిత జాబితాలో చేర్చారన్నారు. ప్రభుత్వం వెంటనే పేదల ఇళ్లు, ఇళ్ల స్థలాలను నిషేధిత జాబితానుంచి తొలగించి పేదలకు భరోసా కల్పించాలని కోరారు. ఈ నిషేధిత జాబితాపై ప్రజలకు తప్పుడు సంకేతాలిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులపై క్రిమినల్ కేసులునమోదు చేయాలని ఐలయ్య కోరారు. సాక్షి, యాదాద్రి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 22–ఏ నిషేధిత ఆస్తుల జాబితా జిల్లాలో చిచ్చురేపుతోంది. నిషేధిత జాబితాలో చేర్చిన నివేశన స్థలాలు, ఇళ్లను తొలగించాలన్న డిమాండ్ తీవ్రమవుతోంది. దీనిని ఇటు అధికార పార్టీ, అటు ప్రతిపక్షాలు సవాల్‌గా తీసుకొని ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్, బీజేపీలు క్షేత్రస్థాయిలో పోరాడుతుండగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఈఅంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తారు. జాబి తానుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని కోరారు. భారీగా నిషేధిత ఆస్తులు జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలోని 319 రెవెన్యూ గ్రామాలు, 422 గ్రామ పంచాయతీల్లో నిషేధిత జాబితాను రూపొందించారు. ఇందులో మొత్తం 39,468 ఇళ్లు, 28,549 ఎకరాల వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చట్టం, 1908లోని సెక్షన్ 22 ఏ పీవోటీ చట్టంలో చేర్చారు. మొత్తం 2,450 సర్వే నంబర్లలో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. వీటితో పాటు సీఐడీ, సిట్, ఏసీబీ కేసుల్లో ఉన్న 258 ఎకరాలు, ఇతర ప్రభుత్వ స్థలాలు 964 ఎకరాలను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో క్రయవిక్రయాలు నిలిచిపోయి, ఆస్తుల విలువలు తగ్గడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కలెక్టర్‌కు వినతి నిషేధిత జాబితా నుంచి పేదల పేర్లు తొలగించాలని కోరుతూ ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత ఆధ్వర్యంలో బుధవారం యాదాద్రి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతిపత్రం అందజేసింది. ఆలేరులోని సర్వే నంబర్లు 7, 46, 526, 589, 961, 1019, 1026, 1044, 1106, 1115తోపాటు, ఆలేరు మండలంలోని తొమ్మిది గ్రామాలలో తెచ్చిన రిజిస్ట్రేషన్ చట్టం, 1908 లోని సెక్షన్ 22ఏ కింద భూములను నిషేధిత ఆస్తుల రిజిస్టర్లో చేర్చడాన్ని రద్దు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నారని, ఆ ఇళ్లకు విద్యుత్, తాగునీటి కనెక్షన్లు ఉన్నాయని, హౌస్ టాక్స్, నీటి బిల్లులు, విద్యుత్ బిల్లులు క్రమంగా చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ జాబితా నుంచి తొలగించాలని కోరింది.కలెక్టర్ అనురాగ్ జయంతికి వినతిపత్రం ఇస్తున్న మాజీ ఎమ్మెల్యే సునిత, బీఆర్ఎస్ ప్రతినిధులుఫ నిషేధిత జాబితా నుంచి పేదల ఇళ్లు, స్థలాలు తొలగించాల్సిందే ఫ క్షేత్రస్థాయిలో పోరుబాటపట్టిన బీఆర్ఎస్, బీజేపీ ఫ అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన విప్ బీర్ల ఐలయ్య ఫ కలెక్టర్‌కు విన్నవించిన మాజీ ఎమ్మెల్యే సునీత -
దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవు
నల్లగొండ టూటౌన్ : చండూరులో బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేయడం దుర్మార్గమని, మరోసారి దాడులు చేస్తే ప్రతిదాడులు తప్పవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు హెచ్చరించారు. బుధవారం నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. చండూరులో మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేసిన తమ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు కుట్రపూరితంగా దాడులు చేస్తుంటే పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఆరోపించారు. దాడి చేసిన వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. మనోహర్‌రెడ్డి, కిసాన్‌మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, పిల్లి రామరాజుయాదవ్ తదితరులు ఉన్నారు. డ్రగ్స్‌పై సిట్‌తో ఒరిగేదేమీ లేదుహైదరాబాద్ శివారులోని మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో నిర్వహించిన డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. డ్రగ్స్ నిర్మూలిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినవన్నీ ఉత్తమాటలే అని అన్నారు. మాజీ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌కు డ్రగ్స్‌కు ఎలా వచ్చాయో తేల్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డ్రగ్స్ పార్టీలో నాయకులే పాల్గొనడటం బాధాకరమన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ బ్రాహ్మణ సమాజంపై విషం కక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు -
సూర్యాపేట
అక్రమ రవాణాపై పటిష్ట నిఘాగురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026సూర్యాపేటటౌన్ : అక్రమ రవాణా, అసాంఘిక చర్యలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డితో కలిసి జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ పోలీసు అధికారుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సామాజిక రక్షణ, శాంతి భద్రతల అంశాలు, చట్టాల అమలు, సామాజిక భద్రతలో పౌరుల బాధ్యత, రోడ్డు ప్రమాదాల నివారణ, యువత భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్ పాల్గొన్నారు. సోదరభావంతో నిర్వహించుకోవాలి ఉగాది, రంజాన్ పండుగను ప్రజలందరూ సోదరభావంతో నిర్వహించుకోవాలని ఎస్పీ నరసింహ కోరారు. జిల్లా ప్రజలకు పోలీస్ శాఖ తరపున ఎస్పీ నరసింహ బుధవారం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. భానుపురి (సూర్యాపేట) : వేసవి తాగునీటి ప్రణాళికలు ఖరారయ్యాయి. రానున్న మూడు నెలల పాటు ప్రజలకు మంచినీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. జిల్లా యంత్రాంగం గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి మాసంలోనే ప్రణాళికలను రూపొందించే పనిలో పడింది. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మిషన్ భగీరథ అధికారులు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో తాగునీటి వనరుల వివరాలను సర్వే ఆధారంగా నమోదు చేసుకున్నారు. ఈ మేరకు 2,662 పనులకు గాను రూ.6.46 కోట్లు అవసరమవుతాయని భావించి తాగునీటి ప్రణాళిక తయారు చేశారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు, 836 ఆవాసాలు ఉన్నాయి. దాదాపు 2.28 లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. ఏటా గ్రామాల్లో వేసవి కాలంలో మంచినీటి సమస్య తలెత్తుతోంది. దీన్ని నివారించేందుకు గాను వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. తాగునీటి వనరుల మరమ్మతులకు పంచాయతీ నిధులనే వెచ్చించనున్నారు. ఇందుకు రూ.6.42 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఆయా గ్రామాల్లో సింగిల్, త్రీఫేజ్ మోటార్లకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావడంతో పాటు నీరు తక్కువగా పోస్తున్న బోరు బావులకు ప్రెషింగ్ చేయించాలని నిర్ణయించారు. గ్రామాల్లో పైపులైన్ల లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేయించాలని ప్రణాళికలో పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని చేతి బోర్లను కూడా బాగుచేయించాలని ప్రతిపాదనలు పంపించారు. అవసరాన్ని బట్టి అద్దె బోర్లుఆయా గ్రామాల్లో అవసరమైన చోట అద్దె బోర్లను మాట్లాడుకోవాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం యాసంగి పంటల సాగుకు నీటి అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. మరో నెల తర్వాత పంటలు కోత దశకు వస్తాయి. అప్పుడు నీటి అవసరం తగ్గుతుంది. భూగర్భజలాలపై ఒత్తిడి తగ్గుతుంది. ఈ సమయంలో రైతుల నుంచి అద్దె బోర్లను మాట్లాడుకోవాలని నిర్ణయించారు. ఈ ప్రణాళిక మేరకు అన్నిరకాల సామాగ్రిని కొనుగోలు చేయడంతో పాటు రైతుల నుంచి అద్దె బోర్లు తీసుకుని ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గుర్తించిన పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు.కోదాడ: వాయిదా పడిన కోదాడ పబ్లిక్‌క్లబ్ ఎన్నికలు తిరిగి ఈ నెల 29న నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న న్యాయవాది ఎస్ఆర్కే మూర్తి బుధవారం క్లబ్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఈ నెల 24వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు సమయం ఉందని తెలిపారు. 25న పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తామని, 29వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరిపి వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని ఆయన వివరించారు. సభ్యులు సకాలంలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.సర్వేలో గుర్తించిన అంశాలుసమస్య ప్రాంతాలు నిధులు(రూ.లలో)చేతిపంపు రిపేర్లు 420 1.07 కోట్లు సింగిల్ ఫేజ్ బోరు మోటార్లు 23 12.50 లక్షలు త్రీ ఫేజ్ బోరు మోటార్లు 83 55.09 లక్షలు పైప్‌లైన్ లీకేజీలు 488 1.29 కోట్లు నీటిట్యాంకుల మరమ్మతులు 188 56.76 లక్షలు ఇంటినల్లాలు బిగించాల్సింది 1460 2.85 కోట్లు మొత్తం 2662 6.46 కోట్లు -
పశుపోషణపై రైతులకు అవగాహన
పెన్‌పహాడ్ : పశు సంపదతో రైతులు లాభాలు పొందవచ్చని జిల్లా పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు బి.వెంకన్న అన్నారు. బుధవారం పెన్‌పహాడ్ మండల పరిధిలోని జల్మాలకుంట, గూడెపుకుంట తండాల్లో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సౌజన్యంతో పశువైద్య, పశు సంవర్థక శాఖ ఆధ్వర్యంలో పాడి రైతులకు లాభసాటి పశు పోషణ, పాడిలో అవలంభించాల్సిన ఆధునిక పద్ధతులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జామానాయక్, పశువైద్యాధికారి యర్రంశెట్టి కిరణ్‌కుమార్, అనంతుల వెంకన్న, జయసుధ, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
సేంద్రియ పద్ధతిలో సాగుతో లాభాలు
పెద్దవూర : బత్తాయి రైతులు సేంద్రియ సాగుతో లాభాల బాట పట్టవచ్చని రిటైర్డ్ వ్యవసాయ శాస్త్రవేత్త ఆరీఫ్‌ఖాన్ తెలిపారు. బుధవారం పెద్దవూర మండలం పర్వేదుల రైతు వేదికలో బత్తాయి సాగుపై రైతులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విచ్చలవిడిగా రసాయన మందులు, ఎరువులు వాడటం వలన భూమిలో సారం తగ్గి, సాగు ఖర్చులు పెరిగి, సరైన దిగుబడి రాక బత్తాయి రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిని అదిగమించేందుకు ప్రతి రైతు సేంద్రియ పద్ధతిలో బత్తాయి సాగు చేయాలని కోరారు. ముఖ్యంగా జీవ ఎరువులైన ట్రైకోడెర్మా విరిడి, సూడోమొనాస్, పిఎస్బి, కెఎస్బి, వేస్ట్ కంపోజర్ తదితర కల్చర్లను క్షేత్రస్థాయిలోనే తయారు చేసుకుని బత్తాయి తోటలకు వాడుకోవాలని సూచించారు. దీంతో భూమిలో మేలైన బ్యాక్టీరియా పెరిగి మొక్కలకు చీడపీడలను తట్టుకునే శక్తి వస్తుందని తెలిపారు. అనంతరం అనుముల క్లస్టర్ ఉద్యానవన అధికారి కె. మురళి మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన బత్తాయి మొక్కలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఉద్యానశాఖ ద్వారా అందిస్తున్న పథకాలను రైతులకు వివరించారు. మండల వ్యవసాయాధికారి సందీప్‌రెడ్డి మట్లాడుతూ.. రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం కూరగాయలు సాగు చేసే రైతులకు వెజిటెబుల్ మినీ కిట్స్ అందజేశారు. సమీపంలోని బత్తాయి తోటలోకి వెళ్లి బత్తాయి చెట్లకు వచ్చిన తెగుళ్లను పరిశీలించి, వాటి నివారణకు పలు సూచనలు చేశారు. పెద్దవూరలో మిట్టపల్లి శ్రీనివాస్ సమీకృత సేంద్రీయ పద్ధతిలో సాగుచేస్తున్న ఆయిల్ ఫామ్, మునగ, పుచ్చ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎరీస్ కంపెనీ ప్రతినిధి నాగేశ్వర్రావు, బత్తాయి అభ్యుదయ రైతు కట్టెబోయిన శ్రీనివాస్‌యాదవ్, ఉద్యాన విస్తరణ అధికారులు రాంప్రసాద్, జనార్దన్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారులు రవిచందర్, దేవ, రైతులు పాల్గొన్నారు. రైతులకు అవగాహన కల్పించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు -
కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలి : మంత్రి ఉత్తమ్
హుజూర్నగర్ : పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలకు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సంవత్సర ఆరంభాన్ని సూచించే ముఖ్యమైన పండుగ ఉగాది అని పేర్కొన్నారు. కొత్త ఆశలు, లక్ష్యాలతో ముందుకు సాగాలని తెలిపారు. రైతులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏడాది పంటలు సమృద్ధిగా పండాలని, రైతులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. -
పథకాలతో ఆర్థికంగా ఎదగాలి
● కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్భానుపురి (సూర్యాపేట) : షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి కల్పన కింద 2025– 26 ఆర్థిక సంవత్సరానికి రాయితీలపై అందించే పథకాలను పొంది ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. బుధవారం కలెక్టర్‌లో షెడ్యూల్డ్ కులాల కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, ట్రాన్స్పోర్ట్, విద్యుత్, బ్యాంకర్లతో కలెక్టర్ వెబ్ఎక్స్ మీటింగ్ నిర్వహించారు. ఎస్సీ యువత నుంచి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు. అర్హులైన షెడ్యూల్డ్ కులాల నిరుద్యోగ యువతీ, యువకులు ఈనెల 24వ తేదీలోగా http://tgobmms.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, కార్యనిర్వాహక సంచాలకులు దయారాణి, జిల్లా ట్రాన్స్‌ఫోర్ట్ అధికారి జయప్రకాశ్‌రెడ్డి, ఎల్డీఎం ఎంవీఎన్ ప్రసాద్, ఎలక్ట్రికల్ ఏడీ అశోక్ వ్యవసాయ శాఖ అధికారి ప్రణవి పాల్గొన్నారు. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలి : కలెక్టర్ ఉగాది పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆకాంక్షించారు. గురువారం ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు బుధవారం ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని వేడుకలను నిర్వహించాలని పేర్కొన్నారు. -
ఇరాన్‌పై యుద్ధాన్ని ఆపాలి
● సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు సూర్యాపేట : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ఆపాలని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఇరాన్‌పై యుద్ధం మూలంగా దేశంలో గ్యాస్ కొరత ఏర్పడిందన్నారు. ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోయి రాబోయే రోజుల్లో చమురు, డీజిల్, పెట్రోల్ దొరకకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. బుధవారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం నాలుగవ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని విజయ్ కన్వెన్షన్ హాల్లో సీపీఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ‘ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు – దాని పర్యవసానాలు’ అంశంపై జరిగిన సెమినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌పై 60 రూపాయలు పెంచిందని, మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాల కన్నా ఇరాన్‌పై యుద్ధానికే ప్రాధాన్యత ఇస్తుందని విమర్శించారు. ఖనిజాలు, సహజ వనరులపై, ఆయిల్ నిల్వలపై కన్నేసిన అమెరికా.. ఇరాన్‌ను ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకొని అక్కడున్న ఆయిల్ నిల్వలను కొల్లగొట్టాలనే దురుద్దేశంతోటే ఇజ్రాయిల్‌తో కలిసి దాడులకు పాల్పడిందన్నారు. ఇజ్రాయిల్, అమెరికా కలిసి పాలస్తీనాను స్మశానంగా మార్చాయని, ఇప్పుడు ఇరాన్‌పై గురిపెట్టాయన్నారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం యుద్ధాలు చేసి సాధారణ ప్రజలను హతమార్చడం అన్యాయమని పేర్కొన్నారు. ఎంతో కాలంగా భారతదేశానికి మిత్ర దేశంగా కొనసాగుతున్న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడి చేసినా భారత ప్రభుత్వం నోరు మెదపకుండా ఉండడం అన్యాయమన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వీరనారి మల్లు స్వరాజ్యం జీవితం స్ఫూర్తిదాయకమన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, పారేపల్లి శేఖర్‌రావు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి తదితరులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే నూతనకల్: భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు భూముల రీసర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా సహాయ సంచాలకుడు, సర్వే, ల్యాండ్ రికార్డుల అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం నూతనకల్ మండల పరిధిలోని యడవెల్లి, పెద నెమిల గ్రామాల్లో భూ భారతి భూముల రీసర్వే కార్యక్రమంపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఎం. శ్రీనివాసరావు, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ ప్రకాష్, సర్పంచ్‌లు చురుకంటి లావణ్య మధుసూదన్‌రెడ్డి, జటంగి సరితకృష్ణ, ఆర్ఐ హాసన్ పాల్గొన్నారు. -
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. బుధవారం వేకువ జామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు భక్తులచే జరిపించారు. సాయంత్రం వేళ ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవను ఊరేగించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. -
చెర్వుగట్టులో ఘనంగా లక్షపుష్పార్చన
నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా బుధవారం రాత్రి ఆలయ ప్రధాన అర్చకుడు పోతులపాటి రామలింగేశ్వరశర్మ ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు లక్షపుష్పార్చన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భగుడిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ ప్రాంతాల నంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఈఓ మోహన్‌బాబు భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్ఐ విష్ణుమూర్తి బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చూశారు. ఈ పూజల్లో అర్చకులు సతీష్‌శర్మ, సురేష్‌శర్మ, శ్రీకాంత్‌శర్మ పాల్గొన్నారు. -
శ్రీలక్ష్మీనరసింహునికి విశేష పూజలు
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి నిత్య కల్యాణంలో భాగంగా బుధవారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్లు, కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఈవో బి.జ్యోతి, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు, ఫణిభూషణ మంగాచార్యులు, తదితరులు పాల్గొన్నారు. -
మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
హుజూర్నగర్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చేవెళ్ల డిక్లరేషన్‌లో మాదిగలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎమ్మార్పీఎస్ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షుడు చింతా బాబు, ఎమ్మార్పీఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పల్లేటి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. బుధవారం హుజూర్‌నగర్‌లో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రావూరి విజయభాస్కర్ ఆధ్వర్యంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఈనెల 30న హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద నిర్వహించే నిరాహార దీక్షకు సంబంధించిన కరపత్రాలను వారు ఆవిష్కరించారు. అనంతరం చింతా బాబు మాట్లాడుతూ.. ఈ నిరాహార దీక్షకు ఎమ్మార్పీఎస్ నాయకులు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దుబ్బ రమేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేళ్లచెరువు ముక్కంటి, జిల్లా యువసేన అధ్యక్షులు బి. నాగరాజు, ఎం. వెంకటయ్య, పి. కాటమయ్య, కే. నాగేశ్వరరావు, రాము, సైదులు, రవీందర్ పాల్గొన్నారు. -
జూదరుల అరెస్ట్
మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ మండలం దొండవారిగూడెం గ్రామ శివారులో పేకాట స్థావరంపై సోమవారం రాత్రి పోలీసులు దాడి చేసి 8 మంది జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదు, 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ మల్లికంటి లక్ష్మయ్య తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పెండింగ్ ఎక్స్‌గ్రేషియా చెల్లించాలినల్లగొండ టౌన్ : గీత కార్మికులకు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఎక్స్‌గ్రేషియాను వెంటనే చెల్లించాలని గీత పనివారల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పబ్బు వీరస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఎకై ్సజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గీత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై మాజీ ఎంపీ ధర్మభిక్షం విగ్రహం ఏర్పాటు చేయాలని, గీత వృత్తికి నష్టం కలిగిస్తున్న మద్యం బెల్టు షాపులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బొడిగె సైదులు, సురిగి చలపతి, పుల్లయ్య, లాలు, పల్లె శంకర్, జోగు సురేందర్, మాదగోని మల్లయ్య, దేవేందర్, లెనిన్, గంగాదేవి, గ్యాలయ్య పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వలస కూలీ మృతి పెద్దవూర: రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీని కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన పెద్దవూర మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగింది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మయూర్భాంజ్ జిల్లాకు చెందిన రామ్‌రే ఎంబర్రం(23) రెండు నెలలుగా పెద్దవూర మండల కేంద్రంలోని కార్తికేయ టెక్స్టైల్ కాటన్ మిల్లులో కూలీగా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి కాటన్ మిల్లు నుంచి తన స్నేహితులైన రూపానాయక్, మంజు పూర్తిలతో కలిసి కూరగాయలు కొనుగోలు చేయడానికి జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారి వెంట పెద్దవూర మండల కేంద్రానికి నడుచుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో కొండమలేపల్లి వైపు నుంచి పెద్దవూర వైపు అతివేగంగా వస్తున్న కారు రామ్‌రే ఎంబర్రంను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో రామ్‌రే ఎంబర్రం ఎగిరి రోడ్డు పక్కన పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువు డుంబీ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వై. ప్రసాద్ తెలిపారు. -
అధిక వడ్డీ పేరిట మోసగించిన వ్యక్తుల అరెస్టు
పెద్దవూర : అధిక వడ్డీ ఆశచూపి పలువురిని మోసగించిన నలుగురు వ్యక్తులను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ బి. శ్రీనునాయక్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. డిండి మండలం హాజ్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని జాల్‌తండాకు చెందిన వడ్త్య భీమా అధిక వడ్డీ ఇస్తానని చెప్పి తన వద్ద డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసగించాడని పెద్దవూర మండలంలోని పాల్తీతండాకు చెందిన పాల్తి కోటేష్ ఈ నెల 7న పెద్దవూర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం వడ్త్య భీమాతో పాటు దేవరకొండ మండలం కొండభీమనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజానగర్తండాకు చెందిన నేనావత్ రమేష్, డిండి మండలం హజ్యతండా గ్రామ పంచాయతీ పరిధిలోని జాల్‌తండాకు చెందిన ఆంగోతు సురేష్, రాత్లావత్ గణేష్‌ను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. లక్షల రూపాయలు సేకరించి పరారీ.. అయితే వడ్త్య భీమా, అతడి సహచరులు శేఖర్‌బాబు (డైరెక్టర్), నేనావత్ రమేష్(అకౌంటెంట్), ఆంగోతు సురేష్(సహాయకుడు) తదితరులు కలిసి హైదరాబాద్‌లో ఎస్బీవీ గ్రీన్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్, బీకాయిన్ వరల్డ్ డెవలపర్స్ పేర్లతో నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ వెబ్సైట్లు ఏర్పాటు చేశారని సీఐ పేర్కొన్నారు. పెట్టుబడులపై అధిక వడ్డీ, డబ్బు డబుల్ అవుతుందని నమ్మబలికి అమాయక ప్రజలను మోసగించినట్లు తెలిపారు. ఫిర్యాదుదారుడు పాల్తీ కోటేష్ నుంచి రూ.1,94,50,000తో పాటు అదే గ్రామానికి చెందిన మరికొంత మంది నుంచి కూడా లక్షల రూపాయలు సేకరించినట్లు వివరించారు. అనంతరం కంపెనీలను మూసివేసి, సెల్ఫోన్లు స్విచ్చాఫ్ చేసి పరారయ్యారని పేర్కొన్నారు. తమ విచారణలో నిందితులు కుట్రపూరితంగానే నకిలీ సంస్థలను ఏర్పాటు చేసి ప్రజలకు అధిక వడ్డీ ఆశచూపి మోసం చేసినట్లు తేలిందని సీఐ తెలిపారు. మొదట కొంతమందికి వడ్డీ చెల్లించి నమ్మకం కలిగించి, అనంతరం పెద్దఎత్తున పెట్టుబడులు సేకరించినట్లు నిందితులు అంగీకరించారని పేర్కొన్నారు. ఈవిధంగా చందంపేట, పెద్దఅడిశర్లపల్లి, నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి తదితర మండలాలకు చెందిన అనేక మంది నుంచి సుమారు రూ.40 కోట్ల వరకు సేకరించినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. ఇలా సేకరించిన డబ్బులతో భూములు కొనుగోలు చేసి, ఆన్లైన్ ట్రేడింగ్ చేసి నష్టపోయినట్లు తమ విచారణలో తేలిందన్నారు. నిందితుల నుంచి నాలుగు సెల్ఫోన్లు, ఒక పెన్‌డ్రైవ్, భూములకు సంబందించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసంప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. -
ఇసుక అక్రమ నిల్వలపై దాడులు
అనంతగిరి : మండల పరిధిలోని పాలారం గ్రామంలో కొందరు వ్యక్తులు ఇసుక అక్రమంగా నిల్వ చేసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచరం అందడంతో రెవెన్యూ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మూడు వేర్వేరు చోట్ల అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్‌లను గుర్తించారు. సుమారు 43 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకుని పంచాయతీ కార్యదర్శికి అప్పగించినట్లు తహసీల్దార్ కె. హిమబిందు పేర్కొన్నారు. కాగా.. ఇసుక డంప్ చేసిన వ్యక్తులు ఎవరనేది తెలియలేదని ఆమె తెలిపారు. ఈ దాడుల్లో ఆర్ఐ వెంకటనగేష్, సిబ్బంది పాల్గొన్నారు. 43 ట్రాక్టర్ల ఇసుక సీజ్ చేసిన రెవెన్యూ అధికారులు -
మారిషస్ పర్యటనలో పటేల్ రమేష్‌రెడ్డి
భానుపురి (సూర్యాపేట) : రాష్ట్రంలో పర్యాటకం, వ్యవసాయంలో ఆధునాతన సాంకేతిక వినియోగం కోసం మారిషస్ దేశంతో కలిసి పనిచేసేందుకు గాను రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి, అగ్రికల్చర్ కమిషన్ సభ్యురాలు భవానిరెడ్డితో కలిసి మంగళవారం మారిషస్ పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా మారిషన్ ప్రధాని ధరం గోకుల్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణలో పర్యాటకరంగ అభివృద్ధి, వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికత వినియోగం, పెట్టుబడుల అవకాశాలు, పరస్పర సహకారంతో చేపట్ట గల ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సమావేశంలో మారిషస్ తెలుగు మహాసభ అధ్యక్షులు హెవిన్ గురయ్య, సమన్వయ కర్త విశ్వకర్మ రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
వేసవిలో ఆయిల్‌పామ్ సాగులో జాగ్రత్తలు
● ఎదిగిన ఆయిల్‌పామ్ తోటలకు నెలకు ఎకరాకు 5 కిలోల యూరియా, 3 కిలోల డీఏపీ, 5 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 2.5 కిలోల మెగ్నీషియం సల్ఫేట్‌ను, ఒక కిలో బోరాక్స్‌ను విడివిడిగా నీటిలో కరిగించి ఫర్టిగేషన్ ద్వారా మొక్కలకు అందించాలి. ఇలా చేయడం వలన సమయం, ఎరువుల ఖర్చు ఆదా చేయవచ్చు. ● ఆయిల్‌పామ్ తోటల్లో ఎక్కువగా పోషక లోపాలు కనిపించినట్లైతే మట్టి, పత్ర విశ్లేషణ కొరకు నమూనాలను సిఫార్సు చేసిన రీతిలో సేకరించి విశ్లేషణ కొరకు పంపాలి.పెద్దవూర : రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని రైతులకు సబ్సిడీపై మొక్కలు అందించడంతో రైతులు ఆయిల్‌పామ్ అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఆయిల్‌పామ్ సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సలహాలు, సూచనలు అందించేందుకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. వేసవిలో సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే పంట దిగుబడిలో తగ్గి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అనుముల క్లస్టర్ ఉద్యానవన అధికారి మురళి తెలిపారు. ఏప్రిల్, మే నెలల్లో అధిక ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఆయిల్‌పామ్ రైతులు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచిస్తున్నారు. ● ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయస్సు ఉన్న ఆయిల్‌పామ్ తోటల్లో మొక్కకు మూడు అడుగుల దూరంలో జనుము, పచ్చిరొట్ట ఎరువు పంటగా నాటుకోవాలి. జనుము పూతకు వచ్చిన వెంటనే చిన్నచిన్న ముక్కలుగా కోసి పాదులో చుట్టూ వేయాలి. ● ప్రతి మొక్కకు రెండువైపులా ఒక్కో మైక్రోజెట్(30 లేదా 40 లీటర్లు డిశ్చార్జ్ అయ్యేవి) అమర్చుకోవాలి. ● వేసవిలో చిన్న మొక్కలకు రోజుకు 150–165 లీటర్ల నీటిని అందించాలి. చెట్టుకు ఇరుపక్కల జెట్‌కు గంటకు 40 లీటర్ల సరఫరా సామర్థ్యం ఉన్నట్లైతే రోజుకు రెండు గంటలు నీరు అందించాలి. ఎదిగిన ఆయిల్ఫామ్ తోటల్లో వేసవి కాలంలో ప్రతి చెట్టుకు రోజుకు 250–330 లీటర్ల నీటిని అందించాలి. ● మూడేళ్ల లోపు ఉన్న మొక్కల్లోని పూగుత్తులను ప్రతి నెల అబ్లెషన్ సాధనంతో రెండుసార్లు తొలగించాలి. ● అవసరం మేరకు మాత్రమే (అన్ని చెట్లు కాకుండా) ఎండిన, విరిగిన లేదా చీడపీడలు ఆశించిన ఆకులను మాత్రమే తొలగించాలి. ● ఆయిల్‌పామ్ తోటలలో అంతర పంటలు వేసినట్లయితే ఆయిల్‌పామ్ మొక్కలతో పాటు అంతర పంటలకు కూడా సిఫారసు మేరకు నీరు తప్పనిసరిగా అందేలా చూసుకోవాలి. ● ఆయిల్‌పామ్ రైతులకిచ్చిన డైరీలలో సిఫారసు చేసిన పద్ధతిలో పోషకాలను తప్పనిసరిగా అందించి అట్టి వివరాలను డైరీలలో నమోదు చేయాలి. ● ఎదిగిన ఆయిల్‌పామ్ తోటల్లో గెలలు కోసిన తర్వాత ముక్కలు చేసిన ఆయిల్‌పామ్ ఆకులను, మగ పూల గుత్తులను, మొక్కజొన్న చొప్పను, ఖాళీ అయిన ఆయిల్‌పామ్ గెలలను, పాదుల్లో మల్చింగ్గా పరచాలి. ● ఆయిల్‌పామ్ తోటల్లో పక్వానికి వచ్చిన ప్రతి గెలను, అల్యూమినియం కడ్డీ లేదా కత్తితో కోయాలి. -
ట్రిపుల్ ఐటీ పిలుస్తోంది
దరఖాస్తులు ప్రారంభం : 2026 మార్చి 18చివరి తేదీ : 2026 మే 10ఎంపిక జాబితా ప్రకటన : 2026 మే 30మొదటి విడత కౌన్సిలింగ్ : 2026 జూన్ 05పెద్దవూర : తెలంగాణలోని బాసర, మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. బాసర ట్రిపుల్ ఐటీలో 1500 సీట్లు, మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలో 180 సీట్లు కేటాయించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లో ఆరేళ్ల బీటెక్ సమీకృత కోర్సులో చేరేందుకు www.rgukt.ac.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.450, ఓసీ, బీసీ విద్యార్థులు రూ.500, ఇతర రాష్ట్రాల విద్యార్థులు రూ.1500, ఎన్ఆర్ఐ విద్యార్థులు 100 యూఎస్ డాలర్లు ప్రవేశ రుసుం చెల్లించాలి. రిజర్వేషన్లు ఇలా.. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6, బీసీ–ఎ 7, బీసీ–బి 10, బీసీ–సి 1, బీసీ–డి 7శాతం, బీసీ–ఈ 4 శాతం, ప్రత్యేక కేటగిరీలో దివ్యాంగులకు 3 శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం, సైనికోద్యోగుల పిల్లలకు 2, ఎన్సీసీ విద్యార్థులకు 1, స్పోర్ట్స్ కోటా కింద 0.5 శాతం సీట్లు భర్తీ చేస్తారు. వేరే రాష్ట్రాల వారికి, భారతీయ పౌరసత్వం కలిగిన అంతర్జాతీయ విద్యార్థులకు, గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పిల్లలకు అదనపు సీట్లు కేటాయిస్తారు. అన్ని విభాగాల్లో బాలికలకు 33.33శాతం రిజర్వేషన్ ఉంటుంది. ప్రవేశ విధానం.. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ పద్ధతిలో ప్రవేశాలు కల్పిస్తారు. ప్రభుత్వం, నాన్ రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇతర జెడ్పీహెచ్ఎస్లలో చదివిన విద్యార్థులకు 4 శాతం మార్కులు(ప్రతి సబ్జెక్టుకు 4 మార్కులు మొత్తం 24 మార్కులు) విద్యార్థికి వచ్చిన పదో తరగతి మార్కులకు కలిపి ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పిస్తారు. మార్కులు సమానమైతే.. ఒక వేళ పదో తరగతిలో విద్యార్థులకు సమాన మార్కులు వస్తే మొదట గణితం, తర్వాత జనరల్ సైన్స్, ఆ తర్వాత ఇంగ్లిష్, సోషల్ స్టడీస్‌లో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. ఇవన్నీ కూడా సమానంగా ఉంటే ఫస్ట్ లాంగ్వేజీలో వచ్చిన మార్కులను పరిగణలోకి తీసుకుంటారు. అయినా కూడా మార్కులు సమానమైతే విద్యార్థి పుట్టిన తేదీ ప్రకారం పెద్ద వయస్సు ఉన్నవారికి అవకాశం ఇస్తారు. ఇవీ సమానంగా ఉంటే హాల్‌టికెట్ నంబర్‌ను పరిగణలోకి తీసుకుని ఫైనల్ లిస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఫీజుల వివరాలు.. ● మొదటి రెండేళ్లు ఏడాదికి రూ.36వేలు, ఆ తర్వాత నాలుగేళ్లు ఏడాదికి రూ.40వేల చొప్పున చెల్లించాలి. ● ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి అర్హులైలే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ● ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాల్లో పనిచేసే వారి పిల్లలు ఏడాదికి రూ.1.37 లక్షలు, ఎన్నారై విద్యార్థులు రూ.3,01,000 ట్యూషన్ ఫీజు చెల్లించాలి. అన్నీ ఉచితమే.. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వమే అన్నీ ఉచితంగా అందజేస్తుంది. ల్యాప్‌టాప్, మూడు జతల షూ, హాస్టల్లో అవరమైన వస్తువులను ప్రభుత్వమే సమకూర్చుతుంది. బాసర, మహబూబ్‌నగర్ క్యాంపస్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ మే 10వ తేదీ వరకు అవకాశం పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు సువర్ణావకాశంఅర్హతలు ఇవీ..2026లో నిర్వహించిన ఎస్ఎస్సీ, తత్సమాన పరీక్షల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలలో రెగ్యులర్‌గా ఉత్తీర్ణులై ఉండాలి. 2025 డిసెంబర్ 31 నాటికి 18 ఏళ్లు నిండకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 21 ఏళ్లు నిండకూడదు. బాసర, మహబూబ్‌నగర్ ట్రిపుల్ ఐటీలలో మొత్తం 1680(1500+180) సీట్లకు గాను 85శాతం సీట్లు తెలంగాణ వాసులకే కేటాయించారు. మిగతా 15శాతం సీట్లు ఓపెన్ కేటగిరీలో ఇతర రాష్ట్రాల మెరిట్ విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. -
యువకుడి దారుణ హత్య
శాలిగౌరారం : రాత్రి సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పెర్కకొండారం గ్రామ సమీపంలో 365 నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగింది. మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శాలిగౌరారం మండలం వంగమర్తి గ్రామానికి చెందిన మల్లెపాక స్వామి, సైదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. చాలా ఏళ్ల క్రితమే స్వామి మృతిచెందడంతో సైదమ్మే పిల్లలను పెంచి పెద్దచేసింది. పెద్ద కుమారుడికి, కుమార్తెకు వివాహాలు చేసింది. చిన్న కుమారుడు శ్రీకాంత్(29)కు వివాహం కాలేదు. శ్రీకాంత్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీకాంత్ తిరిగి రాలేదు. అయితే మంగళవారం తెల్లవారుజామున పెర్కకొండారం గ్రామ సమీపంలో 365వ నంబర్ జాతీయ రహదారిపై శ్రీకాంత్ రక్తపుమడుగులో పడి ఉండటం గమనించిన స్థానిక రైతులు దగ్గరకు వెళ్లి చూడగా అప్పటికే అతడు మృతిచెందాడు. వెంటనే విషయాన్ని వంగమర్తి గ్రామస్తులకు చెప్పి పోలీసులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీ లించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సీఐ హరిబాబు నకిరేకల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. తన కుమారుడికి పెర్కకొండారం గ్రామానికి చెందిన ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఉందని, ఆమె తన కుమారుడిని రాత్రి సమయంలో పిలిపించి హత్యకు పాల్పడిందని మృతుడి తల్లి సైదమ్మ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సైదులు తెలిపారు. శరీరంపై దెబ్బలు.. తలపై నరికిన ఆనవాళ్లు శ్రీకాంత్ శరీరంపై బలంగా కొట్టిన దెబ్బలు ఉండడంతో పాటు తల వెనుక భాగంలో రెండు చోట్ల పదునైన ఆయుధంతో నరికిన గాయాలు ఉన్నాయి. దీంతో శ్రీకాంత్‌ను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భావిస్తున్నారు. పోలీసుల అదుపులో వివాహిత..?శ్రీకాంత్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెర్కకొండారం గ్రామానికి చెందిన వివాహితను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. మృతుడి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. వివాహేతర సంబంధమే కారణమంటున్న మృతుడి కుటుంబ సభ్యులు శాలిగౌరారం మండలం పెర్కకొండారం సమీపంలో ఘటన -
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
చౌటుప్పల్ : మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ ఊర చెరువులో మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని పరిశీలించగా ఎలాంటి గాయాలు లేవని సీఐ పేర్కొన్నారు. మృతుడి వయస్సు 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉంటుందని తెలిపారు. మృతదేహాన్ని చౌటుప్పల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ కారోబార్ పర్వతం శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన 87126 62744, 87125 53699 నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. -
సమగ్ర వ్యవసాయంపై రైతులకు అవగాహన
మిర్యాలగూడ : దామరచర్ల రైతు వేదికలో ఆత్మ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వి. శ్రీధర్ సమగ్ర వ్యవసాయం, తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. రైతులు పంటల సాగుతో పాటు పాడి, కోళ్లు, చేపలు, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ రంగాలను చేపట్టినట్లయితే అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. అంతేకాకుండా రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుందని, కుటుంబ సభ్యులకు ఉపాధి లభిస్తుందని, ఒక దాని వ్యర్థం మరొకదానికి ఆహారంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఓ రుషేంద్రమణి, హార్టికల్చర్ ఆఫీసర్ నసీమా, ఆత్మ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గాజుల శ్రీనివాస్, బీటీఎం గిరి, ఏటీఎం కృష్ణ, ఏఈఓలు పార్వతి, ప్రియాంక, రైతులు మల్లేష్, బాలు, నగేష్, ధనలక్ష్మి, సర్పంచ్ మంగ్తా, ఉప సర్పంచ్ గాలి ప్రియాంక పాల్గొన్నారు. -
60 కిలోల గంజాయి పట్టివేత
రామన్నపేట : ఒడిశా నుండి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న నలుగురిని చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద మంగళవారం ఎకై ్సజ్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి 60కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు రామన్నపేట, మోత్కూరు సీఐలు ఆర్. బాలాజీనాయక్, కె. రవిచంద్రారెడ్డి తమ సిబ్బందితో పంతంగి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ ఆటోను తనిఖీ చేయగా 6.685 కిలోల ఎండు గంజాయి లభించింది. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఒడిశాలోని బరంపురం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లు వెల్లడించారు. గంజాయితో పాటు ఆటో, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన గంగాబాయ్ పాండురంగ చౌహాన్, కమల్ అర్జున్ మోహితే, విజయ్ అసరం గోరపడే, నల్లగొండకు చెందిన పల్లపుదాసు వేణుకుమార్‌ను అదుపులోకి తీసుకోని రామన్నపేట ఎకై ్సజ్ కార్యాలయాలని తరలించారు. ఈ తనిఖీల్లో ఎస్ఐలు ఎన్. శంకర్, బి. శివకృష్ణ, పి. సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.25లక్షల వరకు ఉంటుందని ఎకై ్సజ్ అధికారులు తెలిపారు. నలుగురి అరెస్ట్ -
భార్యను కత్తితో పొడిచిన భర్తకు రిమాండ్
ఆత్మకూరు(ఎం) : భార్యను కత్తితో పొడిచిన భర్తను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వివరాలు. ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి చెందిన దేవికి, మహబూబాబాద్ జిల్లా కంబాలపల్లి గ్రామానికి చెందిన వెంపటి మహేష్‌తో 2012లో వివాహం జరిగింది. వీరు బీబీనగర్‌లో ఉంటూ తాపీ మేసీ్త్ర పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే దేవి మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని మహేష్ అనుమానం పెంచుకోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల దేవి తన పుట్టిల్లు ఆత్మకూరు(ఎం)కు వచ్చింది. దేవిని తీసుకెళ్లడానికి మహేష్ సోమవారం ఆత్మకూరు(ఎం)కు వచ్చాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడగా.. మహేష్ కొబ్బరి బొండాలు కొట్టే కత్తితో దేవిని విచక్షణారహితంగా పొడిచాడు. దేవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మంగళవారం మహేష్‌ను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ హనుమంతు తెలిపారు. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దేవి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. యువకుడి అదృశ్యం మునుగోడు : కుటుంబ సభ్యులపై అలిగి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువకుడు తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మునుగోడు మండలం ఇప్పర్తి గ్రామానికి చెందిన బొజ్జ వంశీ మంగళవారం కుటుంబ సభ్యులపై అలిగి ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. వంశీ ఆచూకీ తెలిస్తే 99120 68559, 95050 02559 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరారు. డీసీఎం బోల్తా.. డ్రైవర్ మృతి లింగాలఘణపురం : డీసీఎం బోల్తా పడి డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం జనగామ జిల్లా లింగాలఘణపురం మండలంలోని కుందారం –పాలకుర్తి రోడ్డులో చీటూరు సమీపంలో అప్పిరెడ్డిపల్లి గ్రామ మలుపు వద్ద చోటు చేసుకుంది. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరికి చెందిన డ్రైవర్ మహ్మద్ జహీర్ (55) డీసీఎంలో మొక్కజొన్న లోడ్‌తో పాలకుర్తి నుంచి జనగామ వైపునకు వస్తున్నాడు. ఈ క్రమంలో చీటూరు సమీపంలోని అప్పిరెడ్డిపల్లి మలుపు వద్ద డీసీఎం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయడిన మహ్మద్ జహీర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు -
లారీ, ఆర్టీసీ బస్సు ఢీ.. పలువురికి గాయాలు
తిరుమలగిరి (తుంగతుర్తి) : లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం వద్ద శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తిరుమలగిరికి వస్తుండగా.. తిరుమలగిరి నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న లారీ వెలిశాల వద్ద బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ సంతోష్‌గౌడ్‌కు కడుపులో గాయాలయ్యాయి. ప్రయాణికురాలు బోళ్ల అంజమ్మకు చెయ్యి విరిగింది. మరో పది మందికి గాయాలు కావడంతో వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ దీపక్ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో స్థానికులు అతడిని అతికష్టం మీద బయటకు తీయగా.. అతడి కుడి కాలు విరిగింది. ఘటనా స్థలాన్ని ఎస్ఐ వెంకట్‌రెడ్డి సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వృద్ధాప్యం.. ఉల్లాసం
ఫ వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రంలో సీనియర్ సిటిజన్ల ఆటవిడుపు ఫ క్యారం, చెస్ ఆడుతూ కాలక్షేపం నల్లగొండ టౌన్ : నల్లగొండ జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ భవన్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వయోవృద్ధుల విజ్ఞాన, వినోద కేంద్రం (ప్రణమ్ డే కేర్ సెంటర్) 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆటవిడుపుగా మారింది. ఈ సెంటర్‌ను జనవరి 12న ప్రారంభించగా.. కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులే కాకుండా 60 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ ఈ సెంటర్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సేద తీరవచ్చు. ఇంట్లో ఉండలేక ఇబ్బందులు పడే వయోవృద్ధులు ఈ కేంద్రానికి వచ్చి వార్తాపత్రికలు చదువుకోవడంతో పాటు క్యారం, చెస్ ఆటలు ఆడుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ యోగా, ఆరోగ్య శిబిరాలను కూడా నిర్వహిస్తారు. ఇక్కడకు వచ్చే వయోవృద్ధులకు ఈ సెంటర్ నిర్వాహకులు ఉచితంగా టీ, స్నాక్స్ అందజేస్తారు. ప్రతిరోజు సుమారు 50 మంది వరకు వయోవృద్ధులు ఈ సెంటర్‌కు వచ్చి కాలక్షేపం చేయడంతో పాటు వివిధ ఆటలు ఆడుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. -
ఇరువురి మధ్య ఘర్షణ.. కేసు నమోదు
భువనగిరి : మండల పరిధిలోని జమ్మాపురం గ్రామంలో శనివారం ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా.. ఇరువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అనిల్‌కుమార్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ లూర్థయ్య, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మాదాను మొహిజు వ్యక్తిగత కక్షలతో శనివారం ఘర్షణకు దిగారు. దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోగా.. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి చౌటుప్పల్ : బైక్‌పై వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండల పరిధిలోని దండుమల్కాపురం గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన వీరబోయిన కమలహాసన్ యాదవ్(28) హైదరాబాద్‌లోని కాచిగూడలో నివాసముంటూ ఓ ఆస్పత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నాడు. శనివారం స్వగ్రామానికి వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివా రులోని చెరువుకట్ట సమీపంలోకి రాగానే వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కమలహాసన్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలసుకున్న పోలీసుల ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తాళం వేసిన ఇంట్లో చోరీకోదాడరూరల్ : తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన బి. బాబుకి ఆరోగ్యం బాగోలేకపోవడంతో చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు వెళ్లాడు. ఇది గమనించిన గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో దాచిన రూ.70వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. -
నలుగురు దొంగల అరెస్ట్
సూర్యాపేటటౌన్ : చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం సూర్యాపేట ఎస్పీ నరసింహ విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడలోని రాజీవ్‌నగర్‌కు చెందిన కంచుకొమ్ముల సంతోష్, కంచుకొమ్ముల గణేష్, కంచుకొమ్ముల సాయికిరణ్, సూర్యాపేటకు చెందిన షేక్ నస్రీన్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. వీరు ఆటోలను దొంగిలించి అదే ఆటోలో ప్రయాణిస్తూ ఒంటరిగా ప్రయాణిస్తున్న వృద్ధ మహిళలను బెదిరించి ఆభరణాలు ఎత్తుకెళ్లడంతో పాటు రాత్రివేళ తాళాలు వేసిన ఇళ్లలో చోరీలు చేస్తుండేవారు. ఈ నెల 6న ఆత్మకూరు(ఎస్) మండలం కోటినాయక్‌తండా శివారులో ఓ వృద్ధురాలిని వీరు ఆటోలో ఎక్కించుకుని కొంతదూరం తీసుకెళ్లి ఆమెను బెదిరించి ఆమె మెడలోని వెండి గొలుసు లాక్కోని పారిపోయారు. బాధితురాలు ఈ నెల 10న ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఉదయం ఆత్మకూరు(ఎస్) మండలం ఎనుబాముల గ్రామ స్టేజీ వద్ద సీసీఎస్ ఇన్స్పెక్టర్, ఆత్మకూరు ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. వీరి నలుగురితో పాటు మరో బాలుడు ఆటోలో నెమ్మికల్ వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా సూర్యాపేట జిల్లాలోని మునగాల, సూర్యాపేట టౌన్, కోదాడ టౌన్, మేళ్లచెరువు, నల్లగొండ జిల్లాలోని తిప్పర్తి, ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల, హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడినట్లు నిజం ఒప్పుకున్నారు. వారి నుంచి 18 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, 3 ఆటోలు, ట్యాబ్, ల్యాప్‌టాప్, బైక్, టీవీ, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఫ 18 గ్రాముల బంగారం, 1.5 కేజీల వెండి, మూడు ఆటోలు, బైక్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫ వివరాలు వెల్లడించిన సూర్యాపేట ఎస్పీ నరసింహ -
గ్యాస్ కొరతపై ఆర్డీఓ సమీక్ష
మోత్కూరు : మోత్కూరులో గ్యాస్ సిలిండర్ల కోసం బారులు తీరిన వినియోగదారుల అంశంపై ‘వంటింటి యుద్ధం’ శీర్షికతో సాక్షిలో ప్రచురితమైన ఫొటో స్టోరీకి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి స్పందించారు. ఆర్డీవోను క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలని ఆదేశించడంతో శనివారం ఆర్డీఓ మోత్కూరుకు చేరుకొని తహసిల్దార్ కార్యాలయంలో వంట గ్యాస్ సిలిండర్లపై సమీక్షించారు. అనంతరం ఆర్డీవో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వంట గ్యాస్ సిలిండర్ల కొరత అపోహ మాత్రమేనని, సరిపడు నిల్వలు ఉన్నాయని తెలిపారు. భువనగిరి జిల్లాలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ కోసం 20 ఏజెన్సీలు ఉన్నాయని, వాటిల్లో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాలలో 45 రోజులకు ఒకసారి గ్యాస్ సిలిండర్లు డెలివరి చేయబడతాయని తెలిపారు. బుకింగ్ చేసుకున్న వారికి కచ్చితంగా డెలివరి చేస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యార్థి వసతి గృహాలు, పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలకు ఎలాంటి కొరత లేకుండా గ్యాస్ సిలిండర్లను అందజేస్తున్నామని తెలిపారు. మరణించినా.. ఐదుగురికి ప్రాణదానంవేములపల్లి : వేములపల్లి మండల కేంద్రానికి చెందిన మల్లికంటి వెంకటయ్య(52) మరణానంతరం తన అవయవాలను దానం చేసి ఐదుగురికి ప్రాణదానం చేశారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటయ్య ఈ నెల 8న ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంకటయ్యను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. శుక్రవారం ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ వెంకటయ్య భార్య ఎల్లమ్మ, కుమారుడు సురేష్ సామాజిక బాధ్యతతో ఆయన అవయవాలు దానం చేయడానికి ముందుకొచ్చారు. వెంకటయ్య నుంచి సేకరించిన రెండు కిడ్నీలను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి, కళ్లను సరోజినీదేవి కంటి ఆస్పత్రికి, కాలేయాన్ని అపోలో ఆస్పత్రికి దానం చేశారు. వెంకటయ్య కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని గ్రామస్తులు, ఆస్పత్రి సిబ్బంది అభినందించారు. రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి తిప్పర్తి : కాలినడకన వెళ్తున్న మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన ఘటన తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామ సమీపంలో శనివారం జరిగింది. తిప్పర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండూరు పట్టణానికి చెందిన జొర్రిగల జ్ఞానేశ్వరి(38) శివుడి దీక్షలో భాగంగా చండూరు నుంచి వాడపల్లిలోని గుడికి కాలినడకన బయల్దేరింది. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను శనివారం తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో జ్ఞానేశ్వరి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి అన్న జొర్రిగల వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఏఎస్ఐ లింగయ్య తెలిపారు. మృతురాలికి వివాహం కాలేదు. -
దర్శనానికి మూడు గంటలకు పైనే..
యాదగిరిగుట్ట : ఇంటర్ పరీక్షలు ముగియడంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు శని వారం భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, శివాలయం, లక్ష్మీ పుష్కరిణి, కల్యాణ కట్ట, సత్యనారాయణస్వామి వ్రత మండపాలు భక్తులతో సందడిగా మారాయి. స్వామివారి ధర్మ దర్శనానికి 3గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టింది. స్వామివారిని 40వేల మంది దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో నిత్యాదాయం రూ.34,24,189 వచ్చి నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఫ యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ -
బుద్ధవనం సందర్శించిన బుద్ధిస్ట్ స్కాలర్లు
నాగార్జునసాగర్ : సాగర్‌లోని బుద్ధవనాన్ని శనివారం ఏపీలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో బౌద్ధంపై పీహెచ్డీ చేస్తున్న మయన్మార్‌తో పాటు పలు దేశాలకు చెందిన బుద్ధిస్ట్ స్కాలర్లు సందర్శించారు. బుద్ధచరిత వనంలోని గౌతమ బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం బుద్ధచరితవనం, జాతక వనం, ధ్యాన వనం, స్థూప వనం సందర్శించారు. మహాస్థూపంలోని సమావేశ మందిరంలో బుద్ధవనం లఘుచిత్రాన్ని వీక్షించారు. ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. అష్ట బుద్ధుల వద్ధ బుద్ధజ్యోతి వెలిగించి హారతి ఇచ్చారు. అదేవిధంగా నాగార్జునకొండకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయం బౌద్ధ అధ్యయన విభాగం పూర్వ విద్యార్థి, బుద్ధవనం ఎస్టేట్ మేనేజర్ రవిచంద్ర, ప్రశాంత్, బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, బుద్ధభూమి, బౌద్ధమాస పత్రిక అధ్యక్షుడు, ఎడిటర్ సీతారామయ్య, స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ పాల్గొన్నారు. -
బాధితుడి వద్దకే వెళ్లి కేసు నమోదు
గరిడేపల్లి : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమంలో భాగంగా శనివారం పోలీసులే ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలంసర్వారం గ్రామానికి చెందిన కాంతయ్య రెండు రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కీతవారిగూడెం గ్రామం వద్ద మరో బైక్‌ను ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన కాంతయ్యను పోలీసులు హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంతయ్య వద్ధకే పోలీసులు వెళ్లి అతడిచ్చిన ఫిర్యాదు స్వీకరించి అక్కడికక్కడే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం ఎఫ్ఐఆర్ కాపీని కాంతయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎఫ్ఐఆర్ ఎట్ డోర్ స్టెప్ కార్యక్రమం ద్వారా బాధితులకు సత్వర పోలీసు సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్ఐ తెలిపారు. -
పురాతన శివాలయాన్ని కాపాడుకోవాలి
మిర్యాలగూడ : దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులో నందిబోడు పైన గల కాకతీయుల కాలం(13వ శతాబ్దం) నాటి శివాలయం శిథిలావస్థలకు చేరుకుందని, దానిని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శనివారం ఆయన బొత్తలపాలెం గ్రామాన్ని సందర్శించి నందిబోడు పైన గల శివాలయాన్ని, భిన్నమైన శివలింగం, నంది, చెన్నకేశవ శిల్పాలను పరిశీలించారు. శివాలయం గోడలు పడిపోయాయని, ఆలయ వెనుక నిర్మించిన తాత్కాలిక రేకుల షెడ్డు కింద కాకతీయుల కాలం నాటి శివలింగం, పానపట్టం, ముట్టె, చెవులు, భిన్నమైన నంది, తల, కాళ్లు లేని శ్రీదేవి, భూదేవి సహిత చెన్నకేశవ విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. ఇవి బొత్తలపాలెం గ్రామ చరిత్రకు ఆనవాళ్లని, వాటిని కాపాడుకుని భవిష్యత్తు తరాలకు అందించాలని ఆయన గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట సర్పంచ్ ఇంజం నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ నర్సింగ్ అనిల్, నాయకులు పడిగపాటి శ్రీనివాస్‌రెడ్డి, వీరారెడ్డి, రవీందర్‌రెడ్డి, కందుల భిక్షారెడ్డి తదితరులు ఉన్నారు. ఫ పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి -
పదో తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలు
ఫ పరీక్ష కేంద్రానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఢీకొట్టిన ఆటో వలిగొండ : పదో తరగతి పరీక్ష రాసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న విద్యార్థిని ఆటో ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామ సమీపంలో శనివారం జరిగింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం పహిల్వాన్‌పురం గ్రామానికి చెందిన వనగంటి శివరాం స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. శనివారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభంకావడంతో తెలుగు పరీక్ష రాసేందుకు అతడు వలిగొండలోని పరీక్ష కేంద్రానికి ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. మార్గమధ్యలో రెడ్లరేపాక గ్రామ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆటో ద్విచక్ర వాహనానని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శివరాంను స్థానికులు 108 వాహనంలో భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సహాయకురాలితో ‘పది’ పరీక్షకు హాజరుమిర్యాలగూడ : మండలంలోని యాద్గార్పల్లి జెడ్పీహెచ్ఎస్ పదో తరగతి విద్యార్థిని వెన్నెలకు పుట్టుకతోనే పోలియో వలన కాళ్లు, చేతులు సరిగా పనిచేయవు. దీంతో ఆమె పదో తరగతి పరీక్షలు రాసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి అనుమతితో అదే పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినిని సహాయకురాలి(స్క్రైబ్)గా నియమించారు. శనివారం వెన్నెల సహాయకురాలి సహాయంతో మిర్యాలగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి వచ్చి తెలుగు పరీక్ష రాసింది. పదో తరగతి పరీక్షల్లో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వెన్నెలతో కలిపి 13 మంది విద్యార్థులకు స్క్రైబ్‌లను అనుమతించారు. పదో తరగతిలో మొత్తం ఏడు పరీక్షలు రాయాల్సి ఉండగా.. ఇలాంటి వారికి ఏదో ఒక పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. వెన్నెలకు ఇంగ్లిష్ పరీక్ష నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలిసింది. -
ఎండుతున్న ఆశలు
భానుపురి (సూర్యాపేట) : ముదిరిన ఎండలు, అడుగంటుతున్న జలాలు, మొదలైన కరెంటు కష్టాలతో జిల్లా రైతాంగం తిప్పలు పడుతోంది. ప్రధానంగా వరి పంట ఎండుతోంది. చివరి దశలో ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో ఎస్సారెస్పీ నీటిని నమ్ముకుని చాలావరకు సాగు చేసిన పొలాలు కూడా ఎండిపోయాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే మరో వారం రోజుల్లో మరిన్ని పొలాలు ఎండిపోనున్నాయి. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంట చేతికి రాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 4.82లక్షల ఎకరాల్లో వరి సాగు జిల్లావ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో 4.86 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. ఇందులో వరి సాగే 4.82 లక్షల ఎకరాలు ఉంది. సాగర్, మూసీ ఆయకట్టుతో పాటు ఎస్సారెస్సీ రెండోదశకు నీటిని విడుదల చేశారు. అలాగే బోరుబావుల కింద రైతులు వరినే అధికంగా సాగు చేశారు. ఆరుతడి పంటలు రైతులు పెద్దగా సాగు చేయలేదు. ప్రాజెక్టుల నుంచి నీళ్లు వస్తాయని, బోరుబావుల్లో నీరు సమృద్ధిగానే ఉండడంతో మొదట్లో పెద్దగా సమస్యలు రాలేదు. అయితే ఫిబ్రవరి చివరి వారం నుంచి వరి సాగు చేసిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. వరి పంటకు నీటి వాడకం పెరగడమే ఇందుకు కారణం. భూగర్భ జలాలు కూడా వేగంగా పడిపోయి బోరుబావులు సగానికి తగ్గాయి. సాగుకు కరెంట్ కష్టాలు రైతాంగానికి కరెంటు కష్టాలు మొదలయ్యాయి. గతంలో 15 గంటలకు పైగానే వ్యవసాయానికి కరెంటు అందగా.. ప్రస్తుతం ఒకట్రెండు గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యుత్ వినియోగం కాస్త పెరగడంతో ఓవర్‌లోడ్ కారణంగా తరచూ ట్రాన్స్ఫార్మర్లు ఫీజులు కొట్టివేస్తున్నాయి. దీంతో రైతులు సాగు చేసిన వరి పొలాలకు నీటిని అందించడం గగనంగా మారింది. దీనికి తోడుగా చాలామంది రైతులు బోర్లు వేసినా కరెంటు డీడీలు కట్టకుండానే ట్రాన్స్ఫార్మర్కు కనెక్షన్ ఇచ్చి నడిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి చాలాచోట్ల ఉండడంతో ఓవర్‌లోడ్ కారణంగా గంటకోసారి ఫీజులు పోవడంతో రైతులు తిప్పలు పడుతున్నారు. ఫ ఎండల తీవ్రతకు అడుగంటుతున్న భూగర్భ జలాలు ఫ కరెంట్ కోతలతో నీరందక ఎండిపోతున్న వరి చేలు ఫ చివరి దశలో ఉన్న వరి పంట దక్కకుండా పోతుండడంతో ఆవేదన చెందుతున్న రైతులు సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో వరి పంట అధికంగా ఎండిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ బోరుబావులతో పాటు ఎస్సారెస్పీ రెండోదశ నీళ్లు వస్తాయన్న ఆశతో చాలామంది రైతులు వరి సాగు చేశారు. కరెంటు ఇబ్బందులు, ఎండలు ఉన్నప్పటికీ ఈ నీళ్లు వస్తే తమకు కొంత ఆసరాగా ఉంటుందని భావించినా.. ఆయకట్టు రైతాంగాన్ని జిల్లా యంత్రాంగం మర్చిపోయినట్లుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం మేజర్ కాలువలను దాటలేని పరిస్థితి ఉన్నప్పటికీ నీటి సరఫరాలో మిన్నకుండిపోవడం గమనార్హం. గతంలో ఆయకట్టు భూములకు నీళ్లు అందగా.. చెరువులు, కుంటల్లోకి నీళ్లు వెళ్లాయి. ప్రస్తుతం ఎండలతో పాటు కరెంటు కోతలు, ఎస్సారెస్పీ నీళ్లు రాకుండా పోతే దాదాపు 10వేల ఎకరాలకు పైగా వరి పంట ఎండిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
నిమ్మ.. బస్తా రూ.2500
నేను రెండు ఎకరాల్లో నిమ్మ సాగు చేశాను. వంద చెట్లు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో నిమ్మకు మంచి ధర ఉన్నప్పటికీ దిగుబడులు రాకపోవడంతో నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. నాకున్న వంద చెట్లకు గాను ఈ సీజన్లో 100 బస్తాల దిగుబడులు రావాల్సి ఉండగా 20 బస్తాలకు మించి రాలేదు. దీర్ఘకాలిక పంట అయిన నిమ్మకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిలడక ధరను నిర్ణయించి కొనుగోలు చేయాలి. – యానాల శ్రీనివాస్‌రెడ్డి, నిమ్మ రైతు నెల్లిబండ, నకిరేకల్ మండలం నకిరేకల్ : నిమ్మకాయల రేటు ఒక్కసారిగా పెరిగింది. వేసవికాలం ప్రారంభం కావడంతో నిమ్మకాయలను ప్రజలు ఎక్కవగా వాడుతుండడంతో నిమ్మకు మంచి ధర వస్తోంది.. తెలంగాణలో ఏకై క నిమ్మ మార్కెట్ ఉన్న నకిరేకల్‌లో రోజూ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు నిమ్మ వ్యాపారం సాగుతుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చైన్నె, కలకత్తా ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం నకిరేకల్మార్కెట్లో నిమ్మ బస్తా (23 కేజీల టిక్కి) రూ.2000 నుంచి రూ.2500 పలుకుతోంది. కానీ నిమ్మ తోటలను తెగులు ఆశించడంతో దిగుబడి తగ్గింది. ఇప్పుడు రేటు పెరిగినా రైతులకు ప్రయోజనం ఉండడం లేదు. ఉమ్మడి జిల్లాలో 30 వేల ఎకరాల్లో సాగు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూమారు 30 వేల ఎకారాల్లో నిమ్మ తోటలు సాగువుతున్నాయి. దాదాపు 20 వేల రైతు, కౌలుదారు కుటుంబాలు నిమ్మ తోటలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ ఏడాది వర్షాలు, మంచుతో పాటు చెట్లకు ఎర్ర తెగులు వ్యాపించాయి. దీంతో నిమ్మ చెట్లపైన పూత రాలిపోవడంతోపాటు పిందె కూడా లేకపోవడంతో దిగుబడులు తగ్గిపోయాయి. ఏటా మార్చి నుంచి మే వరకు నిమ్మకు మొదటి విడత మంచి సీజన్ ఆ తరువాత ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు రెండో విడత సీజన్ ఉంటుంది. ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే నిమ్మ ధరలు పెరుగుతున్నప్పటికీ రైతులకు లాభం లేకుండా పోయింది. ప్రసుత్తం మార్కెట్ వచ్చేది 5 వేల బస్తాలే.. రెండు నెలల క్రితం నకిరేకల్ మార్కెట్‌కు రోజూ 10 వేల నుంచి 15 వేల బస్తాల దిగుమతులు వచ్చేవి. అప్పట్లో బస్తా ధర రూ.500 నుంచి రూ.700 ధర పలికింది. ఇప్పుడు 5 వేల బస్తాలకు మించి నిమ్మ దిగుమతులు రావడం లేదు. ప్రస్తుతం బస్తా నిమ్మకాయల ధర రూ.2000 నుంచి రూ.2500 వరకు పలుకుతోంది. మార్కెట్లో నిమ్మకు మంచి ధర ఉన్నప్పటికీ దిగుబడులు రాకపోడంతో తోటలు సాగు చేసిన రైతులు దిగాలు చెందుతున్నారు. గతంలో ఒక్క చెట్టు నుంచి 3 నుంచి 4 బస్తాల దిగుబడులు రాగా.. ప్రస్తుతం ఒక్క బస్తాకు మించి రావడం లేదని నిమ్మ రైతులు వాపోతున్నారు. వేసవి నేపథ్యంలో భారీగా పెరిగిన నిమ్మ ధర ఫ వాతావరణం అనుకూలించక తగ్గిన దిగుబడులు ఫ ధర పెరిగినా రైతులకు దక్కని ప్రయోజనం -
అమెరికాకు వత్తాసు పలకడం సిగ్గుచేటు
సూర్యాపేట అర్బన్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ప్రపంచ దేశాలపై గుత్తాధిపత్యం కోసం అమెరికా చేస్తున్న కుట్రలో భాగమేనని, దానికి మోదీ సర్కార్ వత్తాసు పలకడం సిగ్గుచేటని టీయూసీఐ జాతీయ ఉపాధ్యక్షుడు వనమాల కృష్ణ అన్నారు. ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర శిక్షణ తరగతులు శనివారం సూర్యాపేటలో కే సూర్యం అధ్యక్షతన ప్రారంభించారు. ఈ సందర్భంగా వనమాల కృష్ణ మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తోందని ఆరోపించారు. అదానీ, అంబానీలకు ఏజెంట్ గా వ్యవహరిస్తున్నదని, కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేసేలా ఉన్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్, రాజన్న, రామయ్య, హన్మేష్, వెంకటేష్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముత్తెన్న, యాకుబ్ షావలి, ప్రవీణ్ రాష్ట్ర కోశాధికారి కిరణ్, రాష్ట్ర నాయకులు రాజేశ్వర్, సుధాకర్, రాము, మధుసూదన్, పుల్లన్న, నరసింహ, రామ్ లక్ష్మణ్, సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గొడ్డలి నర్సన్న, సయ్యద్ హుస్సేన్, లింగన్న తదితరులు పాల్గొన్నారు. -
మొదటి రోజు 12,342 మంది హాజరు
ఫ ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు సూర్యాపేటటౌన్ : పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కావడంతో విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. జిల్లాలో మొత్తం 69 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష కొనసాగింది. మొదటి రోజు తెలుగు పరీక్షకు 12355 మంది విద్యార్థులకు 12342 మంది హాజరయ్యారు. 13 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. తొమ్మిది మంది ప్రైవేట్ విద్యార్థులకు ఆరుగురు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్, అడిషనల్ కలెక్టర్, డీఈఓ తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల పరిశీలన పదో తరగతి పరీక్షలకు సంబంధించి జిల్లా కేంద్రంలోని పలు కేంద్రాలను ఎస్పీ నరసింహ పరిశీలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లు, పరీక్షా సరళిని పరిశీలించి విధులు నిర్వహిస్తున్న ఎగ్జామినేషన్ సెంటర్ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి సూచనలు చేశారు. విద్యార్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ నరసింహ -
నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి
సూర్యాపేట అర్బన్: ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం పోరాడుతున్న నిరుద్యోగ యువతపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు ప్రయోగిస్తున్న అక్రమ నిర్బంధాన్ని ఆపాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) రాష్ట్ర కోశాధికారి రవి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని చండ్ర పుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తానని చెప్పి నేటి వరకు ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. సమావేశంలో పీవైఎల్ జిల్లా అధ్యక్షుడు నల్గొండ నాగయ్య, జిల్లా సహాయ కార్యదర్శి వీరబోయిన రమేష్, కోశాధికారి బండి రవి తదితరులు పాల్గొన్నారు. -
వర్గరహిత సమాజాన్ని నిర్మించేది మార్క్సిజమే
సూర్యాపేట అర్బన్: దోపిడీ నుంచి కార్మిక వర్గం విముక్తి చెందాలంటే పెట్టుబడిదారీ వ్యవస్థ రద్దవ్వాలని, సోషలిస్ట్ సమాజాన్ని నిర్మించాలని చెప్పిన సిద్ధాంతకర్త కార్ల్‌మార్క్స్ అని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగారావు అన్నారు. సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన కార్ల్‌మార్క్స్ వర్ధంతిలో ఆయన మాట్లాడారు. ఉన్నవారే లాభాల పేరుతో అనుభవిస్తున్నారని , కార్మిక వర్గం శ్రమజీవులుగా, దోపిడీకి గురయ్యే వారుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపద సృష్టికి కారణం శ్రమజీవులే అన్నారు. శ్రమ దోపిడీ విముక్తి సిద్ధాంతాన్ని మార్క్స్ తన పెట్టుబడి గ్రంథం ద్వారా సమాజం ముందు పెట్టారన్నారు. కార్యక్రమంలో సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, టీయూసీఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కే సూర్యం, ఎస్ఎల్ పద్మ, జాతీయ ఉపాధ్యక్షుడు కృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరేందర్, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, సీపీఐ(ఎం.ఎల్) మాస్‌లైన్ పార్టీ జిల్లా నాయకుడు పేర్ల నాగయ్య, సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసయ్య పాల్గొన్నారు. -
అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలి
భానుపురి (సూర్యాపేట) : కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ హైదరాబాద్ 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శనివారం ప్రకటనలో తెలిపారు. హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా కోర్సుకు సంబంధించి 6 సెమిస్టర్లు ఉంటాయని, మొత్తం సీట్లు 60 ఉన్నాయని పేర్కొన్నారు. 10వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణులై ఉండాలని, ప్రవేశం పూర్తిగా 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఉంటుందని తెలిపారు. 10+2 పూర్తి చేసిన వారు నేరుగా రెండో సంవత్సరంలో చేరవచ్చని, గరిష్టంగా 23 ఏళ్లు ఉండాలని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 25 ఏళ్ల అర్హత ఉండాలని తెలిపారు. ఎంపికై న ప్రతి విద్యార్థికి నెలకు రూ. 2,500 స్టైఫండ్ తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు klbiiht.telangana.gov.in, ఈమెయిల్ iihthyderabad@gmail.com, 040–29367009 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. దరఖాస్తుల స్వీకరణభానుపురి (సూర్యాపేట) : 2025–26 సంవత్సరానికి షెడ్యూల్డ్ కులాల కార్యాచరణ ప్రణాళిక ను ప్రభుత్వం ఆమోదించిందని, వివిధ పథకాలు నెలకొల్పేందుకు ఆర్థిక సాయం నిమిత్తం అర్హులైన షెడ్యూల్డ్ కులాల వారు ఆన్లైన్ ద్వారా http://tgobmms.cgg.gov.in/ దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాచరణ ప్రణాళిక ద్వారా రూ.50 వేల నుంచి రూ.లక్ష యూనిట్లకు (90) శాతం సబ్సిడీ, రూ.లక్ష నుంచి రూ.2లక్షల యూనిట్లకు (80) శాతం సబ్సిడీ, రూ.2లక్షల నుంచి రూ.4 లక్షల వరకు విలువ చేసే యూనిట్లకు (70) శాతం సబ్సిడీ, రూ.4లక్షలకు పైచిలుకు విలువ చేసే యూనిట్లకు (60) శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ.5 లక్షలు) ఉంటుందని తెలిపారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలకు (100) శాతం సబ్సిడీ వర్తిస్తుందని వివరించారు. మిగిలిన శాతం బ్యాంక్ లోన్ ద్వారా పొందాలని పేర్కొన్నారు. విశేషంగా లక్ష్మీనారసింహుడి నిత్యకల్యాణంమఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామికి, శ్రీఆంజనేయస్వామి, గోదాదేవి అమ్మవారికి శనివారం ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజామునే కృష్ణానదిలో పుణ్యస్నాణాలు ఆచరించి స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయంలో ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, నిత్యహోమం జరిపించారు. నిత్య కల్యాణంలో భాగంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం రక్తిగట్టించారు. అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి సూర్యాపేటటౌన్ : వచ్చే బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి బడ్జెట్ లో 30 శాతం నిధులు కేటాయించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, కానీ కేటాయించింది మాత్రం 7 శాతం లోపే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెరగాలంటే బడ్జెట్ పెంచాలన్నారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, సుదర్శన్, వెంకటయ్య, దేవేందర్, షేక్ ఉమర్, నాగన్న పాల్గొన్నారు. -
రిటైర్డ్ ఉద్యోగులు సమాజసేవలో పాల్గొనాలి
మునగాల: రిటైర్డ్ ఉద్యోగులు సమాజసేవలో పాల్గొనాలని ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పేరి వెంకటరెడ్డి కోరారు. శనివారం మునగాల మండల కేంద్రంలో ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం మునగాల యూనిట్ ఆధ్వర్యంలో రూ.40లక్షల వ్యయంతో నిర్మించిన భవనాన్ని ఆయన రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మునగాల యూనిట్ అధ్యక్షుడు శాకమూడి అప్పారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఈనెల చివరి నాటికి ఈహెచ్ఎస్ కార్డులు ఇప్పించే బాధ్యత చేపడతానని హామీ ఇచ్చారు. రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని మంచి భావజాలాన్ని ప్రజల్లో కలిగించేందుకు నడుం బిగించాలని ఆకాంక్షించారు. మునగాలలో భవన నిర్మాణానికి రూ.10లక్షల విరాళాన్ని అందజేసిన విశ్రాంత ఉపాధ్యాయురాలు లక్ష్మి తులిసమ్మను అభినందించి పూలమాల, శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ లింగయ్య, అసొసియేట్ ప్రెసిడెంట్ రావెళ్ల సీతరామయ్య, పత్రికా సంపాదకుడు శరత్‌బాబు, రాష్ట్ర సెక్రటరీ అక్కిరాజు లక్ష్మీనరసింహారావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బొల్లు రాంబాబు, శ్యాంసుందర్ రెడ్డి, మండల బాధ్యులు, వివిధ మండలాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఫ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరెడ్డి -
సౌండ్ బాక్స్‌లు పెడితే కేసులే..
అర్వపల్లి : జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెం, నాగారం మండలం పేరబోయినగూడెంలలో మూసీనది ఇసుక క్వారీల నుంచి ప్రతిరోజు దాదాపు 500 ట్రాక్టర్ల ద్వారా ఇసుక సరఫరా జరుగుతోంది. ఇక్కడి క్వారీల నుంచి సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు ఇసుక సరఫరా చేస్తున్నారు. ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్లకు సౌండ్ బాక్స్‌లు ఏర్పాటు చేయడం, అతివేగంగా నడపడం, కొన్ని ట్రాక్టర్లకు సరైన పత్రాలు లేకపోవడం, రోడ్డు నిబంధనలు పాటించకపోవడం మూలంగా పలు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో నాగారం సీఐ నాగేఽశ్వరరావు, అర్వపల్లి ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాక్టర్ల సౌండ్‌బాక్స్‌లను తొలగించి డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కొన్ని ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లను అంటించారు. ట్రాక్టర్ డ్రైవర్లు రోడ్డు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రాత్రి వేళల్లో ప్రమాదాలు జరగకుండా ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు వేసుకోవాలన్నారు. -
నేటి నుంచి పది పరీక్షలు
69 కేంద్రాలు.. 12,403 మంది విద్యార్థులుసూర్యాపేట టౌన్ : పదో తరగతి వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు జిల్లాలో 69 కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం జిల్లాలోని పరీక్ష కేంద్రాల్లో సిబ్బంది విద్యార్థుల హాల్ టికెట్ నంబర్లు వేశారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కానుండగా ఐదు నిమిషాలు(9.35గంటల) వరకు హాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత అనుమతించరు. జిల్లాలో 357 పాఠశాలలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు 357 ఉన్నాయి. వీటిలో 12,403 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. మొత్తం ఆరు సబ్జెక్టులకు ఏడు పరీక్షలు జరగనున్నాయి. ఐదు పరీక్షలు ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష జరగుతాయి. భౌతిక, జీవశాస్త్రం రెండు పేపర్లు ఉదయం 9.30గంటల నుంచి 11.30గంటల వరకు ఉంటాయి. ఫీజు చెల్లించలేదని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకున్నా.. విద్యార్థులకు ఇచ్చిన హాల్ టికెట్లను పోగొట్టుకున్నా బీఎస్ఈ తెలంగాణ వెబ్సైట్లో విద్యార్థుల పుట్టిన తేదీ నమోదుచేసి హాల్ టికెట్ పొందవచ్చు. పకడ్బందీగా పరీక్షల నిర్వహణ.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఆయా సెంటర్లకు సీఎస్, డీఓలతో పాటు ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక సిట్టింగ్ స్క్వాడ్‌ను నియమించారు. నాలుగు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి 20మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలెటర్‌ను నియమించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఉంటుంది. సీసీ కెమెరాల నిఘాలో సంబంధిత సీఎస్, డీఓలు ప్రశ్నపత్రాల సీల్ తీసి, పరీక్ష ముగిసిన తర్వాత అదే చోట జవాబు పత్రాలను సీల్ చేసి తపాలా కార్యాలయం ద్వారా కేటాయించిన చిరునామాకు రిజిస్టర్ పోస్ట్ చేయనున్నారు. -
ఇంటర్ ముగిసింది
సూర్యాపేట టౌన్ : ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఫిబ్రవరి 26 న పరీక్షలు ప్రారంభమయ్యాయి. చివరి రోజు జరిగిన పరీక్షలకు మొత్తం 7,224 మంది విద్యార్థులకు 6,951 మంది హాజరు కాగా 273 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విభాగంలో 5,960 మందికి 5,800 మంది హాజరు కాగా 160 గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ విభాగంలో 1,264 మందికి 1,151 మంది హాజరు కాగా 113 మంది హాజరు కాలేదని డీఐఈఓ భానునాయక్ తెలిపారు. కాగా పరీక్షలు ముగియడంతో హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో బస్టాండ్లు, ఆటో స్టాండ్లు సందడిగా కనిపించాయి. -
గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదు
భానుపురి(సూర్యాపేట) : జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు ఆందోళన చెందొద్దని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్లో గ్యాస్ ఏజెన్సీలు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 4,15,509 డొమెస్టిక్ కనెక్షన్లు ఉన్నాయని, ప్రస్తుతం 17,647 డొమెస్టిక్ సిలిండర్లు, 552 కమర్షియల్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. గ్యాస్ బుక్ చేసుకున్న రెండు మూడు రోజుల్లోనే వినియోగదారులకు డెలివరీ చేస్తున్నట్లు వివరించారు. కమర్షియల్ సరఫరాలో ఏర్పడిన కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్‌ను ఎవరైనా కమర్షియల్‌గా వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు ఆందోళనకు గురై అనవసరంగా గ్యాస్ బుక్ చేసుకోవద్దని కోరారు. సీనియారిటీ ప్రకారం ఏజెన్సీలు గ్యాస్‌ను సరఫరా చేయడం జరుగుతుందన్నారు. గ్యాస్ బుకింగ్‌కు సంబంధించి సర్వర్ సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయమై సంబంధిత గ్యాస్ ఏజెన్సీలతో మాట్లాడామని, త్వరలోనే సర్వర్ సమస్య పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు, జిల్లా మేనేజర్ రాము పాల్గొన్నారు. గ్యాస్ సరఫరాను పర్యవేక్షిస్తున్నాం గ్యాస్ సిలిండర్ సరఫరాపై మానిటరింగ్ కమిటీ ద్వారా పర్యవేక్షిస్తున్నామని, వినియోగదారులకు గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయీస్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ మాట్లాడారు. కమర్షియల్ సప్లయ్ కొరత నేపథ్యంలో డొమెస్టిక్ సిలిండర్లు పక్కదారి పట్టకుండా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. డొమెస్టిక్ సిలిండర్ల వినియోగంపై గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని వివరించారు. అలాగే జిల్లాలోని సాగునీటి అవసరాల కోసం సాగర్, మూసీ, ఎస్సారెస్పీ స్టేజ్–2 నుంచి నీటిని విడుదల చేస్తామన్నారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ సీతారామారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి నాగేశ్వరశర్మ, జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్‌బాబు, డీఎం రాము తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ -
గోదావరి జలాల పెంపు
అర్వపల్లి : గోదావరి జలాలను 1200 క్యూసెక్కుల నుంచి 1600 క్యూసెక్కులకు పెంచినట్లు జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, బయ్యన్నవాగు ఏఈ చంద్రశేఖర్ తెలిపారు. చివరి భూములకు నీటిని అందించడానికి పెంచినట్లు చెప్పారు. రైతులు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని కోరారు. కల్తీ నూనె దందాపై కదిలిన యంత్రాంగం కోదాడ: పట్టణంలో కల్తీ నూనె దందాపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు విచారణ ప్రారంభించారు. శుక్రవారం ఉదయం కోదాడకు వచ్చిన అధికారులు స్తానికి పోలీస్ అధికారులతో కలిసి.. అయిల్ ట్యాంకర్ నుంచి నమూనాలు తీసుకున్నారు. పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. లారీలో రవాణా అవుతున్నది రైస్‌బ్రాన్ అయిల్‌గా గుర్తించామని, లారీ డ్రైవర్ అక్రమంగా ట్యాంకర్ సీలు తొలగించి చిన్న డబ్బాలలో నింపి ఆటోలో తరలిస్తున్నట్లు గుర్తించామని, కోదాడలో దీన్ని ఎవరి వద్దకు తరలిస్తున్నారన్న విషయం తేలాల్సి ఉందన్నారు. ట్యాంకర్‌కు లైసెన్స్ ఉన్నప్పటికి రవాణా సమయంలో సీల్ పటిష్టంగా లేకపోవడాన్ని గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. ల్యాబ్ నుంచి రిపోర్టు వచ్చిన తరువాత నూనెలో కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట పుడ్ సేప్టీ అధికారి బి.ప్రభాకర్ తెలిపారు. సమర్థవంతంగా సేవలందించాలిసూర్యాపేటటౌన్ : గర్భిణులు, తల్లులకు ఆరోగ్య కార్యకర్తలు సమర్థవంతంగా సేవలందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ సూచించారు. జిల్లాలో పనిచేస్తున్న 301 మంది ఆరోగ్య కార్యకర్తలకు శుక్రవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫీల్డ్ స్థాయి ఆరోగ్య సిబ్బంది.. గర్భిణుల నమోదు, ప్రసవానికి ముందు పరీక్షలు, శిశు టీకాలు, నవజాత శిశు సంరక్షణపై మరింత శ్రద్ధ వహించాలన్నారు. ఈ శిక్షణ ద్వారా తల్లి, శిశు ఆరోగ్య సేవలు గ్రామ స్థాయిలో మరింత మెరుగుపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాజియా తబస్సుమ్, జిల్లా శిక్షణ నిర్వహణ అధికారి డాక్టర్ శ్రీశైలం పాల్గొన్నారు. శ్రీలక్ష్మీనరసింహునికి నిత్య కల్యాణంమఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారికి శుక్రవారం విశేషంగా ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. నిత్య కళ్యాణంలో భాగంగా ఆలయంలో శ్రీస్వామి అమ్మవార్లను అలంకరించి ఎదుర్కోళ్లు, కల్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్‌కుమార్, ఆలయ అర్చకులు అద్దేపల్లి లక్ష్మణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహ మూర్తి, ఆంజనేయాచార్యులు పాల్గొన్నారు. -
సుధా బ్యాంకుకు పురస్కారం.. గర్వకారణం
సూర్యాపేట : అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ.. సుధా బ్యాంకుకు ఫైవ్ స్టార్ రేటింగ్ పురస్కారం ప్రదానం చేయడం తెలంగాణకే గర్వకారణమని ప్రముఖ మోటివేషనల్ ట్రైనర్ ఆకెళ్ల రాఘవేంద్ర అన్నారు. శుక్రవారం సూర్యాపేటలోని త్రివేణి ఫంక్షన్ హాల్లో సుధా బ్యాంకు 52వ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సుధా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ పర్యవేక్షణలో కొనసాగుతున్న సుధా బ్యాంకు అగ్రశ్రేణి బ్యాంకుగా ఎదగాలని ఆకాంక్షించారు. బ్యాంకు చైర్మన్ మీలా మహదేవ్ అధ్యక్షతన జరిగిన ఈ సర్వసభ్య సమావేశానికి బ్యాంకు పాలకవర్గ సభ్యులు, బ్యాంకు మేనేజ్మెంట్ బోర్డ్ సభ్యులు వైస్ చైర్మన్ కక్కిరేణిచంద్రశేఖర్, డైరెక్టర్స్ ఏపూరి శ్రవణ్‌కుమార్, డాక్టర్ మీలా సందీప్, అప్పం శ్రీనివాస్ తోట శ్యాంప్రసాద్, డాక్టర్ మిన్న విజయలక్ష్మి, అనంతుల శారద, బాణావత్ సుజాత, స్వామి వెంకటేశ్వర్లు ఇరుకుల్లా చెన్నకేశవ రావు వెంపటి వెంకటరమణ, రింగు లక్ష్మీనారాయణ, భువనగిరి భాస్కర్, గండూరి శంకర్, పెద్దిరెడ్డి రాజా తదితరులు పాల్గొన్నారు. -
వంట నూనె అక్రమ దందా!
కోదాడ: కోదాడ కేంద్రంగా వంట నూనె అక్రమ దందా సాగుతోంది. రెండు రోజుల క్రితం విజయవాడ– హైదరాబాద్ రోడ్డుపై ఆయిల్ ట్యాంకర్ నుంచి నూనె తీసి డబ్బాల్లో నింపి ఆటోల్లో తరలిస్తుండగా స్ధానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించడంతో ఈ వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం ఆయిల్ ట్యాంకర్‌తో పాటు నూనెను తరలిస్తున్న ఆటో పోలీసుల అదుపులో ఉన్నాయి. వీటిపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ట్యాంకర్ల సీల్ తీసి 20 లీటర్ల డబ్బాల ద్వారా తరలింపు విజయవాడ నుంచి కోదాడ మీదుగా ప్రతిరోజు హైదరాబాద్‌కు వంటల్లో వాడే నూనెను ట్యాంకర్లలో తరలిస్తుంటారు. ఈ క్రమంలో కోదాడలోని ఓ నూనె డిపో వ్యాపారి ట్యాంకర్ల డ్రైవర్లతో కుమ్మకై ్క ప్రతిరోజు కోదాడ బైపాస్ వద్ద, సమీపంలోని వెంచర్లలో ఈ ట్యాంకర్లను నిలిపి వాటికి వేసిన సీల్ తీసి ఆయిల్‌ను 20 లీటర్ల డబ్బాల్లో నింపుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆయిల్‌ను ఆటోల్లో డిపోకు తరలించి అక్కడ ఇతర నూనెలు కలిపి కల్తీ చేసి, వివిధ హోటళ్లు, రెస్టారెంట్లకు నేరుగా సరఫరా చేస్తున్నారని సమాచారం. మార్కెట్లో ధర ఉన్న సన్‌ప్లవర్, రైస్‌బ్రాన్, పామాయిల్‌ను ఇలా తక్కువ రేట్‌కు డ్రైవర్ల వద్ద కొనుగోలు చేసి ఇతర నూనెల్లో కలిపి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. కోదాడ కేంద్రంగా సంవత్సరాల తరబడి వంట నూనె అక్రమ దందా జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయిల్ డిపోల్లో లూజ్ ఆయిల్ అమ్మకూడదు. కానీ కోదాడలో మాత్రం లూజ్ ఆయిల్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తూనికల కొలతల శాఖ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవని పట్టణవాసులు అంటున్నారు. పట్టణంలోని పలు హోటళ్లకు ఈ కల్తీ నూనెను సరఫరా చేస్తుండడంతో ప్రజల ఆరోగ్యాలు గాలిలో దీపంలా మారాయని పేర్కొంటున్నారు. ఈ కల్తీ దందాపై పూర్తిస్థాయిలో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. ఫ ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లతో వంట నూనె డిపో వ్యాపారుల కుమ్మక్కు ఫ ట్యాంకర్ల నుంచి ఆయిల్ తీసి ఆటోల్లో డిపోకు తరలింపు ఫ ఈ నూనెను నేరుగా హోటళ్లకు సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులు ఫ ఇటీవల ఆయిల్ రవాణా చేస్తుండగా స్థానికులు పట్టుకోవడంతో బయటపడిన వ్యవహారం -
ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలి
భానుపురి (సూర్యాపేట) : ప్రజాప్రతినిధులు ప్రజల మన్ననలు పొందేలా పనిచేయాలని రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా సూర్యాపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో సర్పంచులు, మున్సిపల్ చైర్పర్సన్లు, వార్డు కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ తేజస్‌నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. వేసవిలో తాగునీటి సమస్య రాకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేయాలన్నారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను తుంగతుర్తి నియోజకవర్గానికి తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయని తెలిపారు. మార్చి 6 నుంచి ప్రారంభించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని జూన్ 12 వరకు 99 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు అవి చేరేలా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 148 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని, రైతుల నుంచి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.20వేల కోట్లు చెల్లించామన్నారు. కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్ సీతారామారావు, జెడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, సీపీఓ కిషన్, డీవైఎస్ఓ వెంకటరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. హుజూర్నగర్ : హుజూర్‌నగర్‌లోని మోడల్ హౌసింగ్ కాలనీని అన్ని హంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం మున్సిపాలిటీ పరిధిలోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో నిర్మిస్తున్న 2,160 ఇందిరమ్మ ఇళ్ల మోడల్ హౌసింగ్ కాలనీని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా హిళ్ల బ్లాక్‌లు, అంతర్గత రోడ్లు, సభాస్థలి, మొక్కలు, పార్కింగ్ స్థలాన్ని పరిశీలించారు. మంత్రి వెంట హౌసింగ్ పీడీ సిద్ధార్థ, హార్టికల్చర్ పీడీ నాగయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, మిషన్ భగీరథ ఈఈ కరుణాకర్ రెడ్డి, విద్యుత్ డీఈ వెంకట కిష్టయ్య, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ కవిత, మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లిఖార్జున్ రావు తదితరులున్నారు. ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి -
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
హుజూర్నగర్ : మహిళలు విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ తదితర అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు బొల్లు రాంబాబు అన్నారు. గురువారం హుజూర్‌నగర్‌లోని ప్రభుత్వ పెన్షనర్ల కార్యాలయంలో పెన్షనర్ ఎస్.రాధాదుర్గా అధ్యక్షతన నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సమాజంలో మహిళలకు మరింత గౌరవం పెరగాలన్నారు. మహిళల పట్ల అక్కడక్కడ చూపుతున్న వివక్షను రూపుమాపాలని కోరారు. మహిళల సాధికారతకు పురుషులు సహకరించాలన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించినప్పుడే వివక్ష రూపుమాపబడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తొలుత మహిళా పెన్షనర్లు జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేశారు. నకార విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం మహిళా పెన్షనర్లను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా పెన్షనర్ల సంఘం ఉపాధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మహిళా పెన్షనర్లు ఎస్.లలిత, టి.విజయ మేరీ, చెన్న సౌభాగ్య, ఏ.సుధారాణి, బి.రామలక్ష్మి, థెరిసా, శ్రీలత, అంకతి అప్పయ్య, రఘునాథ్, వెంకటేశ్వర్లు, చంద్రశేఖర్, ఎంఎస్ఎన్ రాజు, సైదులు, లక్ష్మయ్య, చంద్రయ్య, దేవదానం పాల్గొన్నారు.


