
పెంచిన గ్యాస్ ధర తగ్గించాలి
సూర్యాపేట అర్బన్ : కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గ్యాస్ ధర పెంపునకు నిరసనగా సీపీఐ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో బుధవారం సూర్యాపేట పట్టణంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి పేద ప్రజల పై భారం మోపిందన్నారు. కార్యక్రమంలో అనంతుల మల్లేశ్వరి, కొప్పోజు సూర్యనారాయణ, దొడ్డ వెంకటయ్య, బూర వెంకటేశ్వర్లు, చామల అశోక్ కుమార్, ఖమ్మంపాటి రాము, రేగట్టి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.