
మహిళల చదువుతోనే సమాజ అభివృద్ధి
తాళ్లగడ్డ (సూర్యాపేట) : మహిళల చదువుతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆనాడే ఫూలే గుర్తించారని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. సూర్యాపేట పట్టణంలో శుక్రవారం నిర్వహించిన మహాత్మా జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డితో కలిసి కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో విద్యతో గుర్తింపు లభిస్తుందని గుర్తించిన మొదటి వ్యక్తి ఫూలే అన్నారు. అస్పృశ్యత, లింగ వివక్షత నిర్మూలించేందుకు, వితంతువులకు పునర్వివాహం చేసేందుకు జ్యోతిబాఫూలే కృషి చేశారని అన్నారు. మహిళా సాధికారత లభిస్తే సమాజానికి ఆలంబనగా నిలుస్తారని నమ్మి భార్య సావిత్రిబాయి ఫూలే ను మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా తయారు చేశారని పేర్కొన్నారు. జిల్లాలో 13 ప్రాథమిక పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చదువు చెబుతున్నారని తెలిపారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్‌రెడ్డి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల ప్రజలను ఉన్నత స్థానానికి చేర్చేందుకు జ్యోతిబా ఫూలే ఎంతగానో కృషి చేశారని అన్నారు. అనంతరం బీసీ ఉద్యోగుల డైరీని కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్పీ నరసింహ, అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జిల్లా గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌్ వి.రామారావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్‌శ్రీనివాస్, బీసీ అభివృద్ధి అధికారి శ్రీనివాస్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్