
రాష్ట్ర ప్లినరీని విజయవంతం చేయాలి
భానుపురి (సూర్యాపేట): తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 21న సికింద్రాబాద్‌లో జరిగే రాష్ట్ర ప్లీనరీని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం దక్షిణ తెలంగాణ కోఆర్డినేటర్ అనంతుల మధు కోరారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల చైతన్య బస్సు యాత్ర వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతుల మధు మాట్లాడుతూ.. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అలుపెరుగని పోరాటం చేస్తుందని తెలిపారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారుల అంశం చేర్చిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీను వాస్, తెలంగాణ ఉద్యకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిళ్ల విప్లవ్ కుమార్, రాష్ట్ర నాయకులు పడిదల ప్రసాద్, తెలంగాణ ఉద్యమ నాయకులు పంతం యాకయ్య, బాసిపంగు సునీల్, ఎండీ మజహార్, యాతకుల సునీల్, అంజయ్య, భారీ ఖాన్, దుర్గయ్య, నాగేశ్వర్ రావు, రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి, విరస్వామి, జ్యోతి రెడ్డి, గగన్ కుమార్, జానికి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీ ఎన్నిక
అనంతగిరి: వ్యవసాయ కార్మిక సంఽఘం జిల్లా నూతన అధ్యక్షుడిగా రెమిడాల రాజు, ప్రధాన కార్యదర్శిగా దూళిపాళ్ల ధనుంజయ నాయుడు ఎన్నికయ్యారు. శనివారం అనంతగిరిలో జరిగిన వ్యవసాయ కార్మికసంఘం నాల్గవ జిల్లా మహాసభలో వ్యవసాయ కార్మిక సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. తమ నియామకానికి సహకరించిన వ్యవసాయ కార్మికసంఘం రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య, సీపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గన్నా చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, బద్దం కృష్ణారెడ్డి, హనుమంతరావుకు ఆదివారం వారు కృతజ్ఞతలు తెలిపారు.
వైభవంగా
నారసింహుని కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అర్చనలు చేశారు. హోమం, మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. ఎదుర్కోళ్ల మహోవత్సవం అనంతరం స్వామివారి కల్యాణం జరిపించారు. అదేవిధంగా గరుడవాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామిఅమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. ఆలయ ప్రవేశం తరువాత మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్‌కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్‌కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి పాల్గొన్నారు.

రాష్ట్ర ప్లినరీని విజయవంతం చేయాలి