Karnataka
-
మంగళూరులో హై అలర్ట్.. పోలీసుల కంట్రోల్లో సిటీ
బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. రౌడీ షీటర్ హత్య కారణంగా పోలీసుల హై అలర్ట్ ప్రకటించి.. నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మత ఘర్షణలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులను టార్గెట్ చేసిన బీజేపీ.. కాంగ్రెస్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పాలనలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిన్నదని ఆరోపిస్తున్నారు.వివరాల ప్రకారం.. మంగళూరులో రౌడీషీటర్ సుహాస్ శెట్టి హత్య తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. గురువారం రాత్రి స్నేహితులతో కలిసి కారులో వెళ్తున్న సుహాస్‌పై అటాక్ జరిగింది. నిన్న రాత్రి 8:30 గంటలకు సుహాస్ తన స్నేహితులతో కలిసి బాజ్‌పేలోని కిన్నికంబ్లాలో కారులో ప్రయాణిస్తున్నాడు. ఈ క్రమంలో ఆరుగురు ప్రత్యర్థులు కారును అడ్డగించి వాహనంపై దాడి చేశారు. అనంతరం, కారులోంచి సుహాస్ శెట్టిని బయటకు లాగి విచక్షణారహితంగా కత్తులతో, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ దాడి తర్వాత.. సుహాస్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సుహాస్ మరణించినట్టు వైద్యులు వెల్లడించారు.ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మత ఘర్షణలు జరగకుండా హై అలర్ట్ ప్రకటించారు. భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మంగళూరు ఏడీజీపీ హితేంద్ర మాట్లాడుతూ.. ‘సుహాస్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. పోస్ట్‌మార్టం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి నిందితులను గుర్తించాం. పోలీస్ బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి. మంగళూరు పౌరులు ప్రశాంతంగా ఉండాలి. ఎవరినీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఇది శాంతిభద్రతల వైఫల్యం కాదు’ అని అన్నారు.ఇదిలా ఉండగా.. సుహాస్ శెట్టిపై కనీసం ఐదు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. జూలై 2022లో బీజేపీ యువ మోర్చా నాయకుడు ప్రవీణ్ నెట్టారు హత్య జరిగిన కొద్ది రోజులకే సూరత్కల్లో 23 ఏళ్ల యువకుడు ఫాజిల్‌ను హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుల్లో ఒకడిగా ఉన్నాడు. ఫాజిల్ హత్యకు ప్రతీకారంగానే ప్రస్తుతం ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు.. సుహాస్ శెట్టి హత్య నేపథ్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని బీజేపీ నేతలు ఆరోపించారు. సుహాస్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, వీహెచ్‌పీ నేతలు.. మంగళూరులో బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో, మంగళూరులో పలుచోట్ల దుకాణాలను మూసివేశారు. బస్సు సర్వీసులను నిలిపివేశారు. *Murder accused Suhas Shetty killing at BajpeProhibitory orders imposed under Section 163 of the BNS in Mangaluru City Commissionerate limits between 6am on May 2 to 6am on May 6VHP has given bandh call in DK condemning murder @XpressBengaluru @ramupatil_TNIE @vinndz_TNIE pic.twitter.com/2QTIpMBy8H— Divya Cutinho_TNIE (@cutinha_divya) May 2, 2025 -
వంటికి యోగా మంచిదేగా
హొసపేటె: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పౌర సేవకులను స్వాగతిస్తూ హరిద్వార్‌కు చెందిన యోగా గురువు స్వామి పరమార్థ దేవ్‌జీ ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ యోగా శిక్షణ శిబిరం గురువారం నుంచి ప్రారంభించారు. ఇక్కడి మల్లిగె హోటల్ ప్రాంగణంలో ఉదయం 5.30 గంటలకు ప్రారంభమైన ప్రత్యేక యోగా శిబిరాన్ని పతంజలి యోగా పీఠం కేంద్ర ఇన్చార్జి, బాబా రామ్‌దేవ్ సన్నిహిత శిష్యుడు స్వామి పరమార్థ దేవ్‌జీ ప్రారంభించి మాట్లాడారు. కులం, మతం అనే తేడా లేకుండా అందరూ యోగా చేయవచ్చనే దైవిక సందేశం పంపారు. తరువాత స్వామీజీ పౌర కార్మికులను పిలిచి ప్రతి ఒక్కరికీ రుద్రాక్ష మాల వేసి, జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. పది మందికి పైగా కార్మికులను స్వాగతించిన తర్వాతే ప్రత్యేక యోగా శిబిరం ప్రారంభించారు. ఇలా కార్మిక దినోత్సవాన్ని అర్థవంతంగా జరుపుకున్నారు. నగరాలు, పట్టణాల పరిశుభ్రతకు పౌర కార్మికుల సేవలు అవసరమన్నారు. మన శరీరంలో స్వచ్ఛతకు యోగా అవసరమని స్వామీజీ పేర్కొన్నారు. నగరంలోని సేక్రెడ్ హార్ట్ కాథలిక్ చర్చి పూజారి ఫాదర్ భగవంత్ రాజ్, హంసాంబ శారదాశ్రమానికి చెందిన మాతాజీ ప్రబోధామయి పాల్గొన్నారు. హరిద్వార్ యోగా గురువు స్వామి పరమార్థ దేవ్‌జీ ప్రత్యేక ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ యోగా శిక్షణ శిబిరం -
ఘనంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం
హొసపేటె: సీఐటీయూ కార్యాలయం, శ్రామిక భవన్ ముందు గురువారం 139వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని జరిపారు. ప్రారంభంలో సీఐటీయూ తాలూకా నాయకుడు ఎం.గోపాల్ జెండాను ఎగుర వేశారు. జిల్లా సమన్వయకర్త కే.నాగరత్న మాట్లాడుతూ శ్రామికుల జీవితాలను కబళించే దిశలో కార్పొరేట్ పెట్టుబడిదారులకు సహాయం, సబ్సిడీలను అందిస్తున్నాయన్నారు. దేశాన్ని పాలించే ప్రభుత్వాల నుంచి రక్షణ లేదన్నారు. సీఐటీయూ కర్ణాటక రాష్ట్ర కార్యదర్శి ఎల్.మంజునాథ్ మాట్లాడుతూ మేడే కోసం ఎనిమిది గంటల పోరాటం చరిత్రను, దాని ద్వారా దేశంలో జరిగిన కార్మిక వర్గ ఉద్యమాన్ని ప్రస్తావించారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం 2015లో 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు కొత్త కోడ్లను అమలు చేయబోతోందని ఆయన ఆరోపించారు. 2015లో చర్చ లేకుండానే ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదించారన్నారు. ఇది అత్యంత ప్రజాస్వామ్య వ్యతిరేకం, కార్మిక వర్గాన్ని నిర్మూలించే ప్రయత్నం అన్నారు. ఈ నాలుగు సంకేతాలు శ్రామిక ప్రజల సంఘటిత హక్కులను హరించే ప్రయత్నం అని, బదులుగా కార్పొరేట్ పెట్టుబడిదారులకు లక్షల కోట్ల సబ్సిడీలను అందించి, శ్రామిక ప్రజల పన్నులు, ఆస్తులను ధనవంతులతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వేడుకల్లో వందలాది మంది శ్రామిక వర్గ కార్మికులు, ఇతర ఉద్యోగులు, స్నేహపూర్వక సంస్థల నాయకులు పాల్గొన్నారు. కార్మికుల త్యాగాల ఫలితమే మేడే కార్మికుల కృషి, త్యాగాల ఫలితంగా ఈ రోజు మనం కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని బీమా ఉద్యోగుల సంఘం నేత ప్రకాష్ అన్నారు. గురువారం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్మిక దినోత్సవాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశాభివృద్ధి కోసం కార్మికులు కష్టపడి పని చేస్తున్నారన్నారు. ఇండియన్ లైఫ్ ఇన్సూరెన్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ప్రతినిధి ఎల్.మంజునాథ్ మాట్లాడుతూ నేడు పాలిస్తున్న ప్రభుత్వాలు కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయన్నారు. పెట్టుబడిదారుల ప్రయోజనాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నాయన్నారు. కార్మికులకు ఎలాంటి సామాజిక, వేతన భద్రత కల్పించడంపై శ్రద్ధ చూపడం లేదన్నారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్ కార్పొరేషన్ ప్రతినిధుల సంఘం అధ్యక్షుడు సయ్యద్ బషీర్ అహ్మద్ మాట్లాడుతూ నేడు కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వాలు వారికి ఎలాంటి ప్రయోజనాలను అందించడం లేదని అన్నారు. కార్మికులు ఐక్యతతో పోరాడితే వారి శక్తి అనంతం. నేడు కార్మికులు తక్కువ వేతనాలకు, ఉద్యోగ భద్రత లేకపోవడం, శ్రమ విలువపై దృక్పఽథం లేకపోవడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ సందర్భంగా సంఘం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
శిథిలావస్థలో చారిత్రక కోట
రాయచూరు రూరల్: నగరంలోని పురాతన కాలం నాటి చారిత్రక కోట ఆనవాళ్లు వినాశపుటంచునకు చేరాయి. కేంద్ర బస్టాండ్ సమీపంలోని మక్కా దర్వాజ కోట పైభాగంలో పిచ్చి మొక్కలు మొలిచాయి. మరి కొన్ని చోట్ల కోట గోడలు బీటలు వారాయి. ఇంకో వైపు కొన్ని చోట్ల కోట గోడలు కూలిపోతున్నాయి. నిర్వహణ లోపం కారణంగా కోట గోడలు పతనావస్థలో ఉన్నాయి. కొండపై ఉన్న ఇనుప ఫిరంగుల(తోపులు) సంరక్షణపై అధికారులు నిర్లక్ష్యం వహించారు. సోలార్ విద్యుత్ ప్రసారం ఉన్నా చాలా ఏళ్లుగా దీపాలు వెలగడం లేదు. కొండపై బీరు, మద్యం సీసాలు, ప్లాస్టిక్ కవర్లు పడ్డాయి. కొండపై ఉన్న కోటను ఎక్కడానికి తగిన మెట్లు లేకపోవడంతో కొంత మంది ఆకతాయిలు కోట గోడలను, స్మారకాలను ధ్వంసం చేస్తున్నారు. పురావస్తు శాఖ అధికారులు రాయచూరులోని కోటవ స్మారకాల సంరక్షణ వైపు కన్నెత్తి చూడక పోవడంతో కోట ఆనవాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. శిథిలావస్థకు చేరుకోక మునుపే అభివృద్ధి పరచడానికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపించినా ఇంతవరకు ఉలుకు పలుకు లేదు. ఇకనైనా పురాతత్వ, పర్యాటక శాఖ అధికారులు సత్వరం మేల్కొని కొండపై భాగంలో ఉన్న కోట పైకి రోప్‌వే నిర్మించి పర్యాటక స్థలంగా అభివృద్ధి పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సంరక్షణపై అధికారుల దివ్య నిర్లక్ష్యం నిర్వహణ లోపం స్మారకాలకు శాపం -
బసవణ్ణ ఆదర్శాలు అనుసరణీయం
రాయచూరు రూరల్: బసవణ్ణ ఆదర్శాలను అలవర్చుకోవాలని హిందుస్తానీ శాసీ్త్రయ సంగీత గాయని పార్వతి అన్నారు. బుధవారం రాత్రి పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో కలా సంకుల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకొని బసవశ్రీ అవార్డు అందుకొని ఆమె మాట్లాడారు. ప్రపంచ మానవాళి అభ్యున్నతికి బసవణ్ణ పాటుపడ్డారన్నారు. సమాజంలో బడుగు వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన మహాన్ ప్రవక్తగా కొనియాడారు. జిల్లా జైల్ సూపరింటెండెంట్ అనిత, బసవరాజ్, చంద్రశేఖర్ పాటిల్, మారుతి, రేఖ, చెన్నబసవ, హనుమంతరాయ, బసవరాజ్, నిజాముద్దీన్, రేణుక, శృతి, లక్ష్మిపతి, విద్యానంద రెడ్డి, కృష్ణ, యంకప్ప తదితరులు పాల్గొన్నారు. ఈతకు వెళ్లి యువకుడి మృతి కెలమంగలం: ఈతకు వెళ్లి యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈఘటన డెంకణీకోట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకొంది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చామరాజ్నగర్ ప్రాంతానికి చెందిన పునీత్(28) రెండు రోజుల క్రితం డెంకణీకోట సమీపంలోని రంగసంద్రం గ్రామంలో నివాసముంటున్న బంధువుల ఇంటికెళ్లాడు. బుధవారం అదే ప్రాంతంలోని వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లాడు. అదుపు తప్పి నీటిలో మునిగి మృతి చెందాడు. డెంకణీకోట పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
వైభవంగా ఆది బసవేశ్వర రథోత్సవం
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా యరమరస్‌లో ఆది బసవేశ్వరస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. బుధవారం రాత్రి వందలాది మంది భక్తుల సమక్షంలో రథాన్ని లాగారు. యరమరస్‌లో వెలసిన ఆది బసవేశ్వర స్వామికి ప్రత్యేక పూజలను కిల్లే బృహన్మఠాధిపతి శాంత మల్ల, సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యులు నెరవేర్చారు. రథోత్సవంలో రాయచూరు, మాన్వి, సింధనూరు, కొప్పళ, బళ్లారిలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధరలు తగ్గించాలని పాదయాత్ర రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన పేదలు వినియోగించే వస్తువుల ధరలను తగ్గించాలని, కేంద్రం అమలు పరచదలచిన నాలుగు కార్మిక చట్టాలను ఉపసంహరించుకోవాలని సీపీఐ(ఎంఎల్) డిమాండ్ చేసింది. గురువారం గాంధీ సర్కిల్ వద్ద చేపట్టిన పాదయాత్రలో కార్యదర్శి వీరేష్ మాట్లాడారు. పంచ గ్యారెంటీలతో రాష్ట్ర ఖజానాను లూటీ చేసి విద్యుత్, బస్ చార్జీలు, పాల ధరలకు తోడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల సామాన్య ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని, కార్మిక చట్టాలను విరమించుకోవాలని ఒత్తిడి చేశారు. అసంఘటిత కార్మికులను ఆదుకోవాలి రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శరణ బసవ డిమాండ్ చేశారు. గురువారం సీఐటీయూ కార్యాలయంలో 138వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ప్రారంభించి ఆయన మాట్లాడారు. అసంఘటిత కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు. వేతనాలతో కూడిన సెలవులివ్వాలని, ప్రతి నెల రూ.7500 చొప్పున వేతనాన్ని బ్యాంక్ ఖాతాలో జమ చేయాలన్నారు. ఎస్‌యూసీఐ అభ్యర్థి వీరేష్ కార్మిక దినోత్సవాలను ఆచరించారు. ఈసందర్భంగా పద్మ, సులోచన, వరలక్ష్మి, మహేష్, చెన్నబసవలున్నారు. వక్ఫ్ బిల్లు వ్యతిరేకిస్తూ చీకటి రాత్రి రాయచూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ మైనార్టీలు ఆందోళన చేపట్టారు. బుధవారం రాత్రి జిల్లా అంతటా మైనార్టీలు ఇళ్లలో, దుఖాణాల్లో, హోటళ్లలో 15 నిమిషాల పాటు విద్యుత్ దీపాలు బంద్ చేసి చీకటి రాత్రి నిరసన తెలిపారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి పున పరిశీలించి మైనార్టీలకు జరిగే అన్యాయాలకు కేంద్రానిదే బాధ్యత అన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తున్న వక్ఫ్ బిల్లులో మార్పులు చేసి మైనార్టీల హక్కులను రక్షించాలన్నారు. వక్ఫ్ భూములు సర్కార్ పరం అయ్యే విధంగా చట్టాన్ని సవరించుకున్నారన్నారు. వేర్వేరు చోట్ల ఇద్దరు మృతి హోసూరు: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. సూళగిరి సమీపంలోని కరియసంద్రం గ్రామానికి చెందిన జనపిరెడ్డి కొడుకు సుబ్బునాయుడు(16) అదే ప్రాంతానికి చెందిన మిత్రుడు ప్రవీణ్‌కుమార్‌తో కలిసి బుధవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో సూళకుంట వైపు వెళ్తుండగా అదుపుతప్పి కింద పడ్డారు. ప్రమాదంలో తీవ్ర గాయాలేర్పడిన ఇరువురినీ క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఫలితంలేక సుబ్బునాయుడు మృతి చెందాడు. బేరికె పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. హోసూరు సమీపంలోని బీర్జేపల్లి గ్రామానికి చెందిన మంజునాథ్(44). ద్విచక్రవాహనంలో వెళ్తూ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. సేలం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉద్దనపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
తాళె బసాపుర తండాలో దాహం కేకలు
హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె తాలూకాలోని తాళె బసాపుర తండాలో తాగునీటి సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. ఖాళీ బిందెలతో క్యూలో నిలబడి ఉన్న మహిళలు గ్రామ పంచాయతీ సభ్యులను, అధికారులను నిత్యం శాపనార్థాలు పెడుతున్నా నీరు సరిగ్గా సరఫరా కావడం లేదని ఫిర్యాదు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రజలు తమ రోజువారీ పనులను వదిలిపెట్టి నీటి కోసం మాత్రమే ఎదురు చూస్తున్న దృశ్యాలు తాళె బసాపుర తండాలో కనిపించాయి. తాళె బసాపుర తండాలో తాగునీటి కోసం మహిళలు, పిల్లలు నానాపాట్లు పడుతున్నారు. తాలూకాలోనే అతి పెద్ద తండా తండాలో దాదాపు 3 వార్డులు, 800కి పైగా ఇళ్లు, దాదాపు 8 మంది గ్రామ పంచాయతీ సభ్యులు ఉన్నారు. ఈ తండా తాలూకాలోని తండాల్లో అతిపెద్దది. మూడు వార్డుల్లో రెండింటిలో కొళాయి నుంచి కొద్దిగా నీరు వస్తుంది. ఈ చుక్కల నీటి కోసం గ్రామస్తులు తమ సొంత పనులు వదులుకొని నీటి కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఇక్కడ గ్రామస్తులు ఇంకా మంచినీటి ఎద్దడితో నిత్యం నరకయాతన పడుతున్నారు. జిల్లా సరిహద్దుల్లో తుంగభద్ర జలాశయం ఉన్నా ప్రజలకు తాగునీటి సౌకర్యం కరువైంది. ఇప్పటికై నా ప్రజాప్రతినిధులు, అధికారులు తండాలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. పనులు మానుకొని నీటి కోసం పాట్లు పట్టించుకోని పాలకులు, అధికారులు -
ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి ●
● 5 మందికి తీవ్ర గాయాలు హొసపేటె: అతివేగంగా వస్తున్న ట్రాక్టర్ టైరు పేలడంతో అదుపు తప్పి బోల్తా పడటంతో స్థలంలోనే కార్మికుడు మృతి చెందగా మరో ఐదుగురికి గాయాలైన ఘటన విజయనగర జిల్లా కూడ్లిగిలో బుధవారం సాయంత్రం జరిగింది. జార్ఖండ్‌కు చెందిన జ్యోతిలాల్(35) అనే కూలీ ట్రాక్టర్ బోల్తా పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విండ్ ఫ్యాన్‌లో పని చేస్తున్న 14 మంది కార్మికులు పని ముగించుకొని పనిముట్లతో తిరిగి ఇంటి వైపు ట్రాక్టర్లో బయలుదేరారు. మార్గమధ్యంలో ఆకస్మికంగా ట్రాక్టర్ టైరు పేలడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జ్యోతిలాల్ అనే కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు కూడ్లిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కూడ్లిగి స్టేషన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. వేధింపులతో విసిగి బాలిక ఆత్మహత్య ● మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం ● రేపిస్ట్ సురేష్ అరెస్ట్, పోక్సో కేసు నమోదు సాక్షి,బళ్లారి: నిర్భయ ఘటన తర్వాత మహిళలు, బాలికలపై అత్యాచారాల అడ్డుకట్టకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కామాంధుల ఆగడాలు ఆగడం లేదు. మొన్న హుబ్లీలో చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన మరువక ముందే అదే తరహాలో మైనర్ బాలికను ఓ యువకుడు వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలోని సండూరు తాలూకాలో కలకలం రేపింది. కామవాంఛ తీర్చాలని నిత్యం వేధిస్తుండటంతో పాటు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి మైనర్ బాలిక(16)పై అత్యాచారం చేయడంతో సదరు బాలిక జీవితంపై విరక్తి చెంది డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. తనపై పక్కింటి అబ్బాయి సురేష్(25) అత్యాచారం చేశాడని, దీంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, తనను వేధింపులకు గురి చేసిన యువకుడిని కఠినంగా శిక్షించాలని డెత్‌నోట్‌లో రాసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి అత్యాచారానికి పాల్పడిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు తోరణగల్లు సబ్ఇన్స్పెక్టర్ తెలిపారు. హైడ్రాలిక్ మొబైల్ క్రేన్ చోరీ.. నిందితుని అరెస్టు హుబ్లీ: హైడ్రాలిక్ మొబైల్ క్రేన్‌ను చోరీ చేసుకొని పరారైన నిందితుడిని 72 గంటల్లో అరెస్ట్ చేసిన హుబ్లీ గ్రామీణ పోలీసులు అతడి నుంచి రూ.14 లక్షల విలువ చేసే క్రేన్‌ను జప్తు చేశారు. ఖానాపుర తాలూకా నందగడకు చెందిన సైఫుల్లా కమల్ సాహెబ్ ముల్లా అరెస్ట్ అయిన నిందితుడు. గత నెల 27న ఇక్కడి తారిహాళ పారిశ్రామికవాడలో పార్క్ చేసిన హైడ్రాలిక్ క్రేన్‌ను నిందితుడు చోరీ చేసి పరారయ్యాడు. ఘటనపై క్రేన్ యజమాని రఘునాథ కదం గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును తీవ్రంగా పరిగణించిన పోలీసులు బెళగావి, కోల్హాపుర, సతార, కారడతో పాటు ఉత్తర కన్నడ జిల్లాలో తీవ్రంగా గాలించి నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృతకృత్యులయ్యారు. ఈ కార్యాచరణలో సీఐ మురుగేశ చెన్నన్నవర, ఎస్ఐ ఎండీ పాటిల్, సిబ్బంది ఐహొళె, అబ్రార్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ బృందం దొంగను పట్టి బంధించిన కార్యాచరణపై జిల్లా ఎస్పీ డాక్టర్ గోపాల బ్యాకోడ, ఏఎస్పీ నారాయణ భరమని అభినందించారు. చిన్నారి కుటుంబాన్ని ఆదుకోవాలని ధర్నా హుబ్లీ: చిన్నారి హత్యాచారం కేసును ఖండిస్తూ ఆ చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని ధార్వాడ జిల్లాధికారి కార్యాలయం ఎదుట సమత సేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. శ్రీరామనగర్‌కు చెందిన చిన్నారిపై జరిగిన హత్యాచారంపై విద్యాగిరి పోలీస్ స్టేషన్ కేసు నమోదైన సంగతి విదితమేనన్నారు. సదరు చిన్నారి కుటుంబ రక్షణకు ప్రభుత్వం ముందుకు వచ్చి ఆ కుటుంబానికి సహాయం అందించాలన్నారు. ఆ చిన్నారి విద్యాభ్యాసానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కేసులో నిందితుడి ఆస్తులను జప్తు చేసి కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీరామనగర్‌లో కనీస వసతులు లేక ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇక్కడ వీధి దీపాలు, సరైన రోడ్లు నిర్మించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఆందోళనలో ఆ సంఘం ప్రముఖులు అరవింద, కృష్ణ, ఆనంద్, సతీష్, అంజాద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. -
రాఘవుడి సన్నిధిలో మాజీ సీఎం కుటుంబం
రాయచూరు రూరల్: మంత్రాలయ మఠంలో శ్రీగురు రాఘవేంద్ర స్వాముల దర్శనం కోసం మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం మంత్రాలయ మఠం ప్రాంగణంలో స్వామివారిని దర్శించుకొని భక్తిశ్రద్ధలతో దైవదర్శనం చేసుకున్నారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రిని పూర్ణకుంభ కలశాలతో స్వాగతించి వారిని ఘనంగా సన్మానించారు. ఎంపీ రాఘవేంద్ర, శాసన సభ్యుడు విజయేంద్ర పాల్గొన్నారు. వ్యక్తి దారుణ హత్య రాయచూరు రూరల్: నగరంలోని రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు వీరేష్(35) అనే వ్యక్తిని హత్య చేశారు. ఇందిరా నగర్లో నివాసముంటున్న వీరేష్‌ను మంగళవారం రాత్రి రైల్వేస్టేషన్ ప్రాంగణంలో పదునైన ఆయుధంతో కొట్టి చంపినట్లు పశ్చిమ స్టేషన్ పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శాంతవీర తెలిపారు. -
నేత్రపర్వంగా మహారథోత్సవం
మండ్య : విశ్వావసు సంవత్సరం 1008వ జయంత్యుత్సవం ముందు రోజైన గురువారం మండ్య జిల్లాలోని మేలుకోటెలో సామాజిక సామరస్య విప్లవకారుడు రామానుజాచార్యుల మహారథోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల నుంచి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. మహారథోత్సవ వేడుకల సందర్భంగా గురువారం తెల్లవారు జామునే ఆలయంలో ఆచార్యులకు యాత్రదాన అనంతరం వేద పారాయణం, మంగళ వాయిద్యాలతో ఒక ప్రకారంలో ఉత్సవం నిర్వహించారు. అనంతరం రామానుజాచార్యులకు ఎదురు సేవలో చెలువనారాయణ స్వామికి మహామంగళ హారతి ఇచ్చారు.రామానుజాచార్యుల వారికి మర్యాదల మధ్య ఉత్సవరథం మంటపం వద్దకు ఊరేగింపు నిర్వహించారు. మూడు ప్రదక్షణలు చేసిన అనంతరం ఉత్సవమూర్తిని రథం పైన ఏర్పాటు చేసి పూజలు చేశారు. 11.30 గంటల సమయంలో రథారోహణ చేసిన అనంతరం దివ్య ప్రబంధ పారాయణగోష్టి నిర్వహించారు. 12.30 గంటల సమయంలో మహారథోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు స్వామివారిని రథం పైన చూసి పునీతులయ్యారు. అనంతరం మహారథం మాడగుడి వీధి, రాజవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనం చెలువనారాయణ స్వామివారి దర్శనంతో పులకించిన వైనం -
శాకంబరిగా బనశంకరీదేవి
బనశంకరి: బెంగళూరు నగరవాసుల ఆరాధ్య దేవత బనశంకరీదేవి శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం వేకువజామున సుప్రభాతసేవ అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఏ.చంద్రమోహన్ బనశంకరీ మాతకు అభిషేకం, అర్చన చేపట్టారు. అనంతరం మూలవిరాట్‌ను వివిధ కాయగూరలతో అలంకరణచేపట్టి విశేషపూజలు నిర్వహించి మహా మంగళహారతి ఇచ్చారు. భక్తులు బనశంకరీదేవికి నిమ్మకాయల ప్రమిదలతో దీపారాధన చేసి మొక్కుబడులు తీర్చుకున్నారు. భక్తులకు తీర్తప్రసాదాలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. కులగణనపై రెండేళ్ల క్రితమే లేఖ రాశా శివాజీనగర: జన గణన, కుల గణనకు కాలపరిమితిని నిర్ధారించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన నగరంలో విలేకరులతో మాట్లాడారు. రెండు సంవత్సరాల క్రితమే జనగణనతో పాటు కుల గణన జరపాలని కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. అప్పట్లో నిరాకరించిన కేంద్రం ప్రస్తుతం కులగణనకు ముందుకు వచ్చిందన్నారు. ఇది మంచి పరిణామమన్నారు. తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నామన్నారు. అయితే జవహర్లాల్ నెహ్రూ కుల గణనను వ్యతిరేకించినట్లు బీజేపీ నేతలు అనవసరంగా వ్యాఖ్యలు చేయరాదన్నారు. జన్‌సంఘ్, ఆర్ఎస్ఎస్ స్థాపించిన నాటినుంచి రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూనే వచ్చాయన్నారు. బాలికపై లైంగిక దాడి దొడ్డబళ్లాపురం: ప్రేమ పేరుతో బాలికపై యువకుడు అత్యాచారం జరపగా మరో యువకుడు సైతం బాధితురాలిపై అకృత్యానికి పాల్పడ్డాడు. ఈ అమానుష సంఘటన గదగ్‌లో వెలుగు చూసింది. జిల్లా ఎస్పీ నేమగౌడ తెలిపిన వివరాల మేరకు...గత నెల 19న సమీర్ అనే యువకుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో వంచించి స్థానిక లాడ్జ్‌కు తీసికెళ్లి అత్యాచారం జరిపాడు. తరువాత సమీర్ తన స్నేహితుడు ఉమర్‌ను తీసికెళ్లి అత్యాచారం చేయించాడు. వీరిలో జాకీర్ హుసేన్ అనే మరో యువకుడు లాడ్జ్‌లో రూం తీసుకోవడానికి సహకరించాడు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒక నిందితుడిని అరెస్టు చేశారు.మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. దారి మధ్యలో బస్సు నిలిపి నమాజ్దొడ్డబళ్లాపురం: కేఎస్ ఆర్టీసీ డ్రైవర్ బస్సును దారి మధ్యలో నిలిపి నమాజ్ చేశారు. ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగించినట్లు ఆరోపిస్తూ అధికారులు ఆ డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించారు. ఏఆర్ ముల్లా అనే డ్రైవర్ హానగల్ నుంచి విశాలగడకు బస్సును తీసుకెళ్తూ దారి మధ్యలో బస్సు బస్సు నిలిపి సీట్లో నమాజ్ చేశాడు. ఈ దృశ్యాన్ని ఒక ప్రయాణి కుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. డ్రైవర్ చర్యలకు నెటిజన్లు తూర్పారబట్టారు. స్పందించిన అధికారులు ముల్లాను సస్పెండ్ చేశారు. దుండగుల హల్చల్ కృష్ణరాజపురం : బెంగళూరు నగరంలోని విద్యారణ్యపురంలో దుండగులు హల్చల్ చేశారు. మధు అనే వ్యక్తికి చెందిన ఈవెంట్ మేనేజ్మెంట్ కార్యాలయంపై రాత్రి సమయంలో దాడి చేశారు. మాస్కు ధరించిన సుమారు ఏడుమంది దుండగులు కార్యాలయ షెట్టర్ తొలగించి అందులోని వస్తు సామగ్రిని ధ్వంసం చేశారు. ఈ దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డు అయ్యాయి. ఘటనపై బాధితుడు గురువారం విద్యారణ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
బీర్ ప్రియులకు సర్కార్ షాక్
బనశంకరి: ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెల పూర్తయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బీర్ ప్రియులకు ధరలు పెంచుతూ షాక్ ఇచ్చింది. ప్రతి బాటిల్ బీరుపై రూ.10–20 ధర పెంచింది. బీరుపై ఏఈడీ పెంచడం ద్వారా పరోక్షంగా ఐఎంఎల్ విక్రయాలు పెంచడానికి సిద్ధమైంది. ఎకై ్సజ్ శాఖ నుంచి ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయంలో ఐఎంఎల్ అగ్రస్థానం కలిగి ఉంది. ఐఎంఎల్ విక్రయాలు పెరిగితే అధిక ఆదాయం వస్తుంది. ఈ కారణంతో ప్రభుత్వం బీరుపై అదనపు ఎకై ్సజ్ సుంకం (ఏఈడీ) శాతం పెంచాలని నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. ప్రజల నుంచి అభ్యంతరాలు తెలియజేయడానికి 7 రోజుల సమయం ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం బీరుపై ఏఈడీ ఉత్పత్తి వ్యయం 195 శాతం ఉంది. బ్రాండ్ బ్రాండ్‌కూ వ్యత్యాసం ప్రస్తుతం అదనపు ఎకై ్సజ్ సుంకం 205 శాతానికి పెంచినట్లు ఆదేశాల్లో ప్రస్తావించింది. ధర పెంపు బ్రాండ్ నుంచి బ్రాండ్‌కు వ్యత్యాసం ఉంది. ఆల్కహాల్ ప్రమాణం అధికంగా ఉండే బ్రాండ్లు బీర్లపై గణనీయంగా పెరగనుందని ఎకై ్సజ్ శాఖ అధికారులు తెలిపారు. మొత్తం రూ.10–20 ధర పెరిగే అవకాశం ఉంది. 2023 జూలైలో కాంగ్రెస్ ప్రభుత్వం అదనపు ఎకై ్సజ్ సుంకాన్ని 175 శాతం నుంచి 185 శాతానికి పెంచింది. అనంతరం 2025 జనవరి 20వ తేదీ బడ్జెట్‌కు ముందు మరోసారి ఏఈడీని సవరించింది. అదనపు ఎకై ్సజ్ సుంకాన్ని 185 నుంచి 195 శాతానికి అంటే ప్రతి బల్క్ లీటరుకు రూ.130 వరకు పెంచారు. ప్రస్తుతం ప్రభుత్వానికి మూడోసారి పన్ను(ట్యాక్స్) పెంచడానికి సిద్ధమైంది. మూల ఎకై ్సజ్ సుంకం సైతం సవరించారు. ఫ్లాట్ రేట్ బదులుగా ఆల్కహాల్ ప్రమాణం ఆధారంగా శ్రేణీకృత వ్యవస్థను పరిచయం చేశారు. 5 శాతం కంటే తక్కువ ఆల్కహాల్ ప్రమాణం కలిగిన బీరుకు ప్రతి బల్క్ లీటరుపై రూ.12 చొప్పున, 8 శాతం ఆల్కహాల్ బీరుపై రూ.20 చొప్పున ధర పెంచుతూ నిర్ణయించారు. ఆర్థిక ఏడాది ప్రారంభంలోనే ధర పెంపు 10 శాతానికి పైగా ఎకై ్సజ్ సుంకం విధింపు -
పాకిస్తాన్ జిందాబాద్ అంటే షూట్ చేయాలి
● శాసనమండలి సభ్యుడు ఎ.హెచ్.విశ్వనాథ్ మైసూరు : భారత దేశంలో ఉంటూ ఈ దేశం గాలి పీల్చుతూ పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన వారిని షూట్ చేయాలని శాసన మండలి సభ్యుడు ఎ.హెచ్.విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మైసూరులో మీడియాతో మాట్లాడారు. మన దేశంలో ఉంటూ శత్రు దేశమైన పాక్‌కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు 26 మందిని పొట్టన బెట్టుకున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదానికి ఊతం ఇస్తూ పాక్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన వారిని తుపాకులతో కాల్చివేయాలన్నారు. రాయర చిత్రం.. మంత్రముగ్ధంరాయచూరు రూరల్: మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వాముల మఠంలో శ్రీగురు రాఘవేంద్ర స్వాముల ఫొటోను భక్తిశ్రద్ధలతో భక్తులు ముగ్గులతో చిత్రీకరించారు. గురువారం మంత్రాలయ మఠం ప్రాంగణంలో మైసూరుకు చెందిన తొమ్మిది మంది కళాకారులు 41,346 చదరపు అడుగుల మేర 22 గంటల పాటు శ్రమించి 3 వేల కేజీల ముగ్గు పొడిని వినియోగించి భారీ ముగ్గు వేశారు. మైసూరుకు చెందిన పునీత్, లక్ష్మి, ఆదిత్య, సంప్రీత్, సంజయ్, రవిచంద్రన్, రాఘవ, మంజునాథ్, రాజు, మధు, అరవింద్, గిరీష్, కుమారస్వామిల శ్రమను పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ ప్రశంసించారు. మునిరత్నపై చార్జిషీట్‌కు స్పీకర్ అనుమతి కోరిన సిట్ యశవంతపుర: బీబీఎంపీ కాంట్రాక్టర్ చలువరాజును చంపుతానని బెదిరించిన కేసులో బెంగళూరు ఆర్ఆర్ నగర ఎమ్మెల్యే మునిరత్నపై అవినీతి నిరోధక చట్టం– 17(ఎ) ప్రకారం చార్జిషీట్ వేయటానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రత్యేక దర్యాప్తు దళం(ఎస్ఐటీ) విధానసభ సభాపతి యూటీ ఖాదర్‌కు మనవి చేసింది. బీబీఎంపీ మాజీ సభ్యుడు వేలు నాయ్కర్పై కుల నింద చేసిన కేసులో చార్జిషీట్ వేయటానికి ప్రభుత్వం అనుమతించింది. చెత్త తొలగింపునకు సంబంధించి కాంట్రాక్టర్ చలువరాజుపై మునిరత్న దౌర్జన్యం చేసి హత్య చేస్తానంటూ బెదిరించిన ఆరోపణలకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెత్త తొలగింపునకు ఆటోను తీసిస్తానని చెప్పి కాంట్రాక్టర్ వద్ద నుంచి రూ.20 లక్షలు డబ్బు తీసుకున్నట్లు ఎమ్మెల్యే మునిరత్నపై ఆరోపణలున్నాయి. ఇదే కాకుండా మాజీ కార్పొరేటర్ మంజుల భర్త నారాయణస్వామిని హనీట్రాప్‌కు యత్నించిన కేసులో మునిరత్నపై సాక్ష్యాధారాలు లేనందున ప్రజాప్రతినిధుల కోర్టులో సిట్ పోలీసులు బీ–రిపోర్ట్‌ను దాఖలు చేశారు. -
విహారయాత్ర విషాదాంతం
సాక్షి,బళ్లారి: వేసవి సెలవుల్లో స్నేహితులంతా కలిసి గోవాలో సేద తీరేందుకు వెళుతున్న సమయంలో మృత్యువు పంజా విసిరింది. చిత్రదుర్గ నగర శివార్లలోని సిబార గోశాల సమీపంలో గురువారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తమిళనాడు వాసులు మృతి చెందారు. ఆరు మందికి తీవ్ర గాయాలయ్యాయి. తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన కొందరు స్నేహితులు ఇన్నోవా కారులో గోవా పర్యటనకు బయల్దేరారు. చిత్రదుర్గ శివార్ల వద్దకు రాగానే కారు టైరు పగిలిపోవడంతో వాహనం బోల్తా పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న అర్జున్(28), సరవణ్(30), శ్రీధర్ (30) మృతి చెందగా మరో ఆరు మందికి గాయాలయ్యాయి. చిత్రదుర్గ గ్రామీణ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ముద్దురాజ్తో పాటు ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్స్ చేరుకుని క్షతగాత్రులను చిత్రదుర్గ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను కూడా అదే ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. కారు బోల్తా.. ముగ్గురు దుర్మరణం మృతులందరూ తమిళనాడు వాసులు ఆరుగురికి గాయాలు, ముగ్గురి పరిస్థితి ఆందోళనకరం -
పౌర కార్మికుల సేవలు పర్మినెంట్
శివాజీనగర: గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పౌర కార్మికుల సేవలను పర్మినెంట్ చేసినట్లు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి, డీసీఎం డీ.కే.శివకుమార్ అన్నారు. మేడేను పురస్కరించుకొని బెంగళూరులోని ప్యాలెస్ మైదానంలో గురువారం రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో కలిసి పౌర కార్మికులకు సేవా క్రమబద్దీకరణ నియామక పత్రాలు పంపిణీ చేశారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ మొత్తం 12,692 మంది పౌర కార్మికులకు పర్మనెంట్ నియామక పత్రాల పంపిణీ చేసినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పారిశుధ్య కార్మికులను పర్మనెంట్ చేయటం ద్వారా వారి బతుకుల్లో మార్పు తెచ్చి, సమాజంలో సమానత్వం తీసుకొచ్చే పని చేసిందన్నారు. సమాజం భద్రంగా ఉండేందుకు నాలుగు ఆధార స్థంభాలు ఉండాలి. అవి వ్యవసాయ, కార్మిక, సైనిక, ఉపాధ్యాయ స్తంభాలు. కార్మికులు ఈ సమాజపు ఆధారస్తంభం. తమ ప్రభుత్వం పౌర కార్మికులను దేవుడి బిడ్డలు, పరిశుభ్ర రాయబారులుగా భావిస్తోందన్నారు. మీరు సమాజపు ఆరోగ్యాన్ని కాపాడుతున్న వైద్యులు అని అన్నారు. మీ వల్లే బెంగళూరుకు అంతర్జాతీయ ఖ్యాతి మీరు బెంగళూరు నగరాన్ని సుందరంగా ఉంచి సేవలు చేసినందుకు ఈ నగరానికి ప్రపంచ స్థాయిలో పేరు వచ్చింది. ప్రపంచానికే పెద్ద సేవలు చేసే కార్మికుల రోజు ఇది అని డీసీఎం ప్రశంసించారు. పౌర కార్మికులు తమ పిల్లలను విద్యావంతులుగా, పెద్ద ఉద్యోగాన్ని అలంకరించేటట్లు చేయాలనేది తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. నేడు మీ జీవితాల్లో మార్పు అవుతున్న చాలా పవిత్రమైన దినం అని అన్నారు. మల్లికార్జున ఖర్గె సేవలు చారిత్రాత్మకం మల్లికార్జున ఖర్గే కార్మిక మంత్రిగా చేసిన పనులు దేశ చరిత్ర పుటల్లోకి చేరాయని. దేశ వ్యాప్తంగా ఈఎస్ఐ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలను ఆరంభించారని, అందువల్ల వారి ద్వారానే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని తీర్మానించినట్లు డీకే శివకుమార్ అన్నారు. పారిశుధ్య కార్మికుల అభివృద్ధి కోసం పాలికె బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించామన్నారు. ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా మిమ్మల్ని పర్మినెంట్ చేశామన్నారు. సింధుత్వ విషయంలో వివాదానికి గురైన కారణంగా కొందరికి పర్మినెంట్ కాలేదు. ఈ విషయంపై ప్రత్యేకంగాా బూత్ ఆరంభించి, మీ ఆధారాలను పరిశీలించి మీ అందరికీ న్యాయం చేస్తామని వాగ్దానం చేశారు. దశల వారీగా ఐపీడీ సాలప్ప నివేదిక అమలు ఐపీడీ సాలప్ప సమర్పించిన నివేదికను దశలవారీగా అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మీ పిల్లల భవిష్యత్ కోసం అనేక కార్యక్రమాలు రూపొందించి రూ.700 కోట్లు కేటాయించామన్నారు. రిటైర్డ్ అయినపుడు రూ.10 లక్షల సొమ్మును డిపాజిట్ చేసి రూ.6 వేల పింఛన్ లభించేటట్లు పథకం రూపొందించామన్నారు. 2017లో సిద్దరామయ్య ప్రభుత్వం నేరుగా 10 వేల మంది పారిశుధ్య కార్మికుల నియామకం చేపట్టిందని గుర్తు చేశారు. 2024–25వ సంవత్సర బడ్జెట్లో ఆరోగ్య బీమా ప్రకటించామని ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్‌సింగ్ సుర్జేవాల, మంత్రులు రామలింగారెడ్డి, కృష్ణభైరేగౌడ, రహీం ఖాన్, కే.హెచ్.మునియప్ప, హెచ్.సీ.మహాదేవప్ప, భైరతి సురేశ్, ఎమ్మెల్యేలు రిజ్వాన్ హర్షద్, ఎస్.టీ.సోమశేఖర్, ఆనేకల్ శివణ్ణ, ఎం.సీ.శ్రీనివాస్, ఎమ్మెల్సీ ఎస్.రవి, యూ.బీ.వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. 12,692 మందికి శాశ్వత సేవా నియామక పత్రాల పంపిణీ సీఎం సమక్షంలో అందజేసిన డిప్యూటీ సీఎం శివకుమార్ -
ఐదు ఫుల్ బాటిళ్లు కచ్చా తాగేసి.. విషాదం నింపిన పందెం
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే చెప్పే వైద్యులు.. పరిమితంగా తాగాలంటూ మరోవైపు సూచించడం ఆశ్చర్యం కలిగించేదే!. అయితే.. డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం ప్రపంచంలో ఏడాదిలో నమోదు అయ్యే మరణాల్లో 4.7 శాతం మరణాలు మద్యానికి సంబంధించినవే ఉంటున్నాయట. ఏడాదికి సుమారు 26 లక్షల మంది మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే..కర్ణాటకలోని కోలార్ జిల్లా ములబాగిల్‌లో ఘోరం జరిగింది. స్నేహితులతో రూ.10 వేల కోసం పందెం కాసిన ఓ యువకుడు 5 ఫుల్ బాటిళ్ల లిక్కర్‌ను.. అదీ నీరు కలపకుండా(కచ్చాగా) గడగడా తాగేశాడు. ఆపై తీవ్ర అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్నేహితులతో సిట్టింగ్ వేసిన టైంలో తాను ఐదు సీసాల మద్యాన్ని నీరు కలపకుండా తాగగలనని కార్తీక్ (21) అనే యువకుడు సవాల్ విసిరాడు. దానికి స్పందించిన స్నేహితులు.. అలా తాగితే రూ. 10 వేలు ఇస్తానని పందెం కాశారు. దీంతో.. కార్తీక్ ఐదు బాటిళ్ల మద్యాన్ని నీరు కలపకుండా గడగడా తాగేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని ములబాగిల్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కార్తీక్ ప్రాణాలు కోల్పోయాడు. కార్తీక్‌కు ఏడాది క్రితమే వివాహమైంది. అతడి భార్య ఎనిమిది రోజుల క్రితమే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.ఈ ఘటనపై సమాచారం అందుకున్న నాన్‌గలి పోలీసులు కార్తీక్ స్నేహితులు వెంకటరెడ్డి, సుబ్రమణి సహా ఆరుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పరారీలో మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. -
పెళ్లికి ముందే చెప్పా.. నాకు లవర్ ఉన్నాడని..
విజయపుర(కర్ణాటక): వధువు మెడలో వరుడు తాళి కట్టే క్షణాల కోసం అందరూ ఎదురు చూస్తుండగా వరుడు మంటపం నుంచి లేచి పూలదండను విసిరేసి పెళ్లిని ఆపేశాడు. ఈ ఘటన చెన్నరాయపట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని దేవనహళ్లి తాలూకా బాలెపురలోని కల్యాణ మంటపంలో జరిగింది. యువతి మీద అనుమానంతో చివరి క్షణంలో వరుడు పెళ్లికి నిరాకరించాడు. వేణు అనే యువకుడు తన వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. గతంలో సదరు వధువు వేరే యువకుడితో ప్రేమాయాణం నడిపిందని ఆరోపించాడు. అయితే పెళ్లికి ముందే అన్ని విషయాలు వరుడికి చెప్పానని వధువు తెలిపింది. అప్పుడు అన్నింటికి సరేనని, రాత్రి రిసెప్షన్ కూడా చేసుకుని, సరిగ్గా మంటపానికి వచ్చేసరికి పెళ్లికి వరుడు నిరాకరించాడని వధువు కన్నీటి పర్యంతమయింది. దీంతో వధువరులు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమ వధువుకు న్యాయం చేయాలని ఆమె తరపు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. -
పురుషుల వేషాల్లో చోరీలకు
బనశంకరి: రాష్ట్రంలో అబలలపై లైంగిక వేధింపులు, అత్యాచారం, వరకట్న దాడులు వంటి అనేక రకాల నేరాలపై పోలీస్ స్టేషన్లలో వేలాది కేసులు నమోదు అవుతున్నాయి. కానీ శిక్ష పడుతున్న నిందితులు ఎంతమంది అనేది తెలుసుకుంటే నివ్వెరపోవడం ఖాయం. చాలా కేసుల్లో నిందితులు దర్జాగా బయటపడుతున్న దిగ్భ్రాంతికర విషయం వెలుగులోకి వచ్చింది. ● ప్రభుత్వం ఇచ్చిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 2023 నుంచి 2025 ఫిబ్రవరి వరకు 25,700 కేసులు నమోదయ్యాయి. ఇందులో 39 కేసుల్లో మాత్రమే శిక్ష విధించగా, 966 కేసులు వీగిపోయాయి. మిగతావి విచారణలో ఉన్నాయి. ● లైంగిక వేధింపులు, భార్యలపై భర్తల దాడులు, అధిక కట్న కోసం వేధింపులు కేసులు ఇందులో ఉన్నాయి. నిందితులు కొన్నాళ్లపాటు అరెస్టవుతారు, విడుదలయ్యాక ఏ భయమూ ఉండదు. ● 2023లో లైంగిక వేధింపుల కేసుల్లో 19 కేసుల్లో శిక్షలు పడగా, 400 కేసుల్లో ఫలితం లేదు. ● అత్యాచార కేసుల్లో ఒక్క శిక్ష పడకపోవడం విశేషం. పైగా 33 రేప్ కేసుల్లో నిందితులకు క్లీన్చిట్ లభించింది. ● భార్యలపై దాడులకు పాల్పడిన కేసుల్లో 241 కొట్టివేయగా, 7 కేసుల్లో మాత్రమే శిక్షపడింది. ● వరకట్నం వేధింపుల కేసుల్లో ఒకరికి శిక్షపడగా 167 కేసులు వీగిపోయాయి. 6 వరకట్న చావుల కేసుల్లోనూ ఆధారాలు లేవంటూ నిందితులు తప్పించుకున్నారు. ఈ ఏడాది ఒక్కటీ లేదు ● 2024 లైంగిక వేధింపులకు సంబంధించి 8 కేసుల్లో కోర్టు శిక్ష విధించింది. కానీ 57 కేసులు వీగిపోయాయి. క్రమంగా 7,1,11 కేసుల్లో నిందితులకు క్లీన్చిట్ లభించింది. భర్తల దౌర్జన్యాల కేసుల్లో నలుగురికి శిక్ష పడగా 43 కేసులను కొట్టేశారు. 2025లో ఇలాంటి కేసుల్లో ఇప్పటివరకు ఒక్క కేసులోనూ శిక్ష పడలేదు. నివారణ చర్యలు కోర్టుల్లో కేసులు వీగిపోతుండగా దీనిని అడ్డుకోవడానికి సర్కారు కొన్ని చర్యలు తీసుకుంటోంది. పోలీసులు మరింత పటిష్టంగా దర్యాప్తు చేయడానికి 206 సీన్ ఆఫ్ క్రైం (సోకో) అధికారులను అన్ని శాఖల్లో భర్తీచేసింది. సాక్ష్యాధారాలను సేకరించి కేసులో శిక్ష పడేలా చూడడమే వారి పని. పోలీసులు, న్యాయవాదుల మధ్య సమన్వయం, నిందితులు, సాక్షుల ట్రాకింగ్, ఇంకా పలు నూతన చర్యలను చేపట్టే పనిలో ఉంది. కారణాలు ఏమిటి? ● లైంగిక వేధిపులు, కట్న వేధింపులని కొందరు తప్పుడు కేసులు పెట్టడం ● ఆరోపణలు రుజువు చేసే సాక్ష్యాధారాలు లోపించడం ● కోర్టు విచారణకు ఫిర్యాదుదారులు, సాక్షులు గైర్హాజరు, నిందితుల పరారు తదితరాలు. సాఫీగా సాగాల్సిన సంసారంలో అలజడులు ఎన్నో బొమ్మనహళ్లి: విచిత్రమైన మహిళా దొంగల ఉదంతమిది. ఆటోలో తిరుగుతూ అనువైన ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న మహిళ, యువతిని బెంగళూరు బొమ్మనహళ్ళి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నీలోఫర్, షబ్రీన్ తాజ్ కాగా, వారు ఆటోల్లో పురుషుల వేషధారణలో సంచరిస్తూ డబ్బు బంగారాన్ని కొట్టేయడం విశేషం. నీలోఫర్, షబ్రీన్ తాజ్ కలిసి ఈజీ మనీ కోసం దొంగతనాల బాట పట్టారు. మార్చి 17వ తేదీన బొమ్మనహళ్ళిలో ఓ ఇంటి తాళం పగలగొట్టి చొరబడ్డారు. 130 గ్రాముల బంగారు నగలు, రూ. 3 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల్లో చిత్రాలు ఫిర్యాదు మేరకు బొమ్మనహళ్ళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల చిత్రాల ఆధారంగా ఇద్దరినీ పట్టుకున్నారు. ఆ చిత్రాల్లో వీరు ప్యాంటు, షర్టు ధరించి మగవారిలా కనిపించారు. చివరకు ఇద్దరూ మహిళలేనని ఖాకీలు తెలుసుకున్నారు. మైకోలేఔట్ ఠాణా పరిధిలో కూడా ఇదే రీతిలో చోరీ చేసినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నారు. వెండి, బంగారు సొత్తును డిజే హళ్ళి, ట్యానరీ రోడ్డులో ఉన్న బంగారు వ్యాపారులకు కుదువ పెట్టి డబ్బు తీసుకునేవారు. నీలోఫర్ వృత్తిరీత్యా దొంగ కాగా, షబ్రీన్తాజ్ని చోరీలకు ఒప్పించింది. నీలోఫర్ గతేడాది దొంగతనం కేసులో బాగలకుంటె పోలీసులకు చిక్కి జైలుకెళ్లింది. విడుదలయ్యాక పాత వృత్తిని వదల్లేదని పోలీసులు తెలిపారు. వేధింపులు, అత్యాచారం, హత్యలు, కట్నం కేసుల్లో నిందితులు కులాసా చాలా తక్కువగా శిక్షలు బెంగళూరులో అత్యధిక నేరాలు రెండేళ్లలో 39 కేసుల్లోనే ఖరారు కుమిలిపోతున్న బాధితులు ఇద్దరు మహిళా దొంగల వింత పంథా -
రూ.50 కోట్ల భూమి స్వాధీనం
మైసూరు: చాముండి బెట్టలోని చాముండేశ్వరి, ఆమె సోదరి ఉత్తనహళ్లి జ్వాలాముఖి త్రిపుర సుందరి దేవి ఆలయాలకు చెందిన ఆస్తులను సర్వే చేసిన అధికారులు కబ్జాలు జరిగినట్లు గుర్తించి ఆ స్థలంలోని ఆక్రమణలను తొలగించారు. చుట్టూ కంచె వేయించి రూ.50 కోట్ల విలువ చేసే స్థలాన్ని స్వాధీనంలోకి తీసుకుని రక్షించారు. ఆరు నెలలుగా ఆస్తుల దాఖలాలను పరిశీలించి, కబ్జాలను కనుగొన్నారు. ప్రైవేట్ వ్యక్తుల పాలైన భూమిని స్వాధీనపరచుకుని చుట్టూ కంచె వేసి ఆలయ భూమిగా నామఫలకం ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కబ్జాలను తొలగించే పనిలో ఉండగా అక్రమార్కుల్లో గుబులు ఏర్పడింది. ఉపకార వేతనాల స్కాంలో ఈడీ దాడి యశవంతపుర: కలబురగి ఎంఆర్ఎంసీ మెడికల్ కాలేజీలో స్కాలర్‌షిప్‌ని ఇప్పిస్తానని నమ్మించి మోసం చేసిన కేసులో కాంగ్రెస్ నాయకుడు హెచ్కెఈ సొసైటీ మాజీ అధ్యక్షుడు భీమాశంకర్ బిలగుండి ఇంటిపై ఈడీ అధికారులు బుధవారం దాడి చేశారు. ఎంఆర్ఎంసీ మెడికల్ కాలేజీలో స్కాలర్‌షిప్‌ల వ్యవహారంలో అనేక పత్రాలను సీజ్ చేశారు. 2018 నుంచి 2024 వరకు ఈ కాలేజీకి చెందిన హెచ్కెఈ సొసైటీకి ఆయన అధ్యక్షునిగా ఉన్నాడు. 7 వందల మంది ఎంబీబీఎస్ విద్యార్థుల ఉపకార వేతనాల డబ్బులను స్వాహా చేశారని ఆరోపణలున్నాయి. దీని విలువ రూ.80 కోట్లకుపైగా ఉంటుందని ఈడీ అధికారులు అంచనా వేశారు. ఇంటిలో నుంచి అనేక ఫైళ్లను సీజ్ చేసి తీసుకెళ్లారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై గవర్నర్ లేఖ శివాజీనగర: ఇటీవల అసెంబ్లీ సమావేశాలలో గొడవ చేసినందుకు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ యూటీ ఖాదర్ 6 నెలల పాటు సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్‌ని రద్దు చేయాలని బీజేపీ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. స్పీకర్‌కు, ఇటీవల గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్యకు లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ స్పందించారు. సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని గవర్నర్.. సీఎం సిద్దరామయ్య, స్పీకర్ ఖాదర్‌కు లేఖ రాశారు. ఆ ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్య కార్యక్రమాలలో పాల్గొనేలా చూడాలనే బీజేపీ వినతికి సానుకూలంగా స్పందిస్తున్నా, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని లేఖలో తెలిపారు. తీసుకొన్న చర్యలను తనకు తెలియజేయాలని కూడా గవర్నర్ సూచించారు. వైకుంఠవాసికి అక్షయ తృతీయ పూజలు బొమ్మనహళ్లి: అక్షయ తృతీయ సందర్భంగా బుధవారం బొమ్మనహళ్ళిలోని వివిధ దేవాలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. హెచ్ఎస్ఆర్ లేఔట్ అగరలో శ్రీనివాసుని ఆలయంలో స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. అర్చకులు చంద్రమౌళి ఆధ్వర్యంలో స్వామివారికి తెల్లవారుజామునే పంచామృతాలతో అభిషేకం జరిపి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను వివిధ పూలహారాలతో అలంకరించారు. పెద్దసంఖ్యలో తరలి వచ్చి భక్తులు స్వామివారిని దర్సించుకున్నారు. ప్రోటాన్ మెయిల్స్‌ను నిలిపివేయండి బనశంకరి: భారతదేశంలో ప్రోటాన్ మెయిల్స్ సేవలను పూర్తిగా నిలిపివేయడానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ సంస్థపై మరో సంస్థ దాఖలు చేసిన కేసును బుధవారం న్యాయమూర్తి ఎం.నాగప్రసన్న విచారణ జరిపారు. తగిన భద్రతా చర్యలు తీసుకునేవరకు ఈ వెబ్సైట్, ఇతర సేవలు నిలిపి వేయాలని ఆదేశించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రోటాన్ మెయిల్స్ సర్వర్లు భారతదేశం బయట నుంచి పనిచేస్తున్నాయి, ఇది భారతీయ చట్టాలకు విరుద్ధం. దుండగులు ప్రోటాన్ మెయిల్స్ ద్వారానే పాఠశాలలకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ను పంపిస్తున్నారు. అశ్లీల మెసేజ్‌లను పంపుతున్నారు. ప్రోటాన్ మెయిల్స్ వినియోగం భద్రతకు ప్రమాదమని గుర్తించి రష్యా, సౌదీ అరేబియా దేశాల్లో ఈ సేవలను పూర్తిగా నిషేధించారు అని పేర్కొన్నారు. -
●సంస్కరణల గురువు బసవన్న
శివాజీనగర: సమానత్వ ఉద్ధారకుడు, జగజ్యోతి బసవణ్ణ విశ్వగురు అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. బుధవారం బెంగళూరులో బసవేశ్వరుని 894వ జయంతి సందర్భంగా విధానసౌధ బసవేశ్వర సర్కిల్లో బసవన్న విగ్రహానికి నివాళులర్పించారు. బసవణ్ణ విశ్వగురువు. ఆయను సమాజంలో సంస్కరణలే కాదు, ప్రపంచంలో మార్పు తీసుకొచ్చారని అన్నారు. అటువంటి మహాత్మున్ని జ్ఞాపకం చేసుకోవటం ప్రతి ఒక కన్నడిగుడి, భారతీయుల కర్తవ్యమన్నారు. తరువాత బాగల్‌కోట జిల్లా కూడల సంగమలో జరిగిన వేడుకల్లో సీఎం, మంత్రులు పాల్గొన్నారు. పార్లమెంటు ఆవరణలో ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ఆవరణలో బసవేశ్వర విగ్రహానికి కన్నడ స్వామీజీలు, ఎంపీలు, నాయకులు అధికారులు పుష్పాంజలి ఘటించారు. బసవణ్ణ 12వ శతాబ్దంలోనే సమానత్వ సందేశాన్ని చాటిచెబుతూ, కష్టేఫలి సిద్ధాంతాన్ని బోధిస్తూ సమాజ నిర్మాణం కోసం శ్రమించారని పేర్కొన్నారు. బసవ జయ మృత్యుంజయ స్వామి పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఊరేగింపులు, కళా ప్రదర్శనలతో జయంతి ఉత్సవాలు జరిగాయి. ప్రధాని ట్వీట్ శ్రమయే స్వర్గమని ప్రపంచానికే సందేశమిచ్చిన శ్రమ యోగి, మహా మానవతావాది బసవేశ్వరుడు అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో కన్నడలో శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సేవలను కొనియాడారు. రాష్ట్రమంతటా ఘనంగా బసవేశ్వరుని జయంతి వేడుకలు కూడల సంగమలో సీఎం నివాళులు -
ఉన్నతాధికారిణి వేధింపులు.. అటవీ ఉద్యోగి ఆత్మహత్య
మైసూరు: తన చావుకు అసిస్టెంట్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ఏసీఎఫ్) మేడం కారణం అని డెత్‌నోట్ రాసిపెట్టి అటవీ వాచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మైసూరు జిల్లా సరగూరు తాలూకాలో జరిగింది. అటవీ వీక్షకుడు పీ.సురేష్ (34) ని ఏసీఎఫ్ అమృత మాయప్పనవర్ వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సురేష్ చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బెరంబాడి గ్రామ నివాసి. అటవీ సిబ్బందికి కేటాయించిన క్వార్టర్లలో ఉరి వేసుకోవడంతో కుళ్లిన స్థితిలో మృతదేహం లభించింది. సురేష్ చావుకు ఏసీఎఫ్ అమృత కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించారు. డెత్‌నోట్ ఉన్నా కడుపునొప్పిగా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడంలో ఉన్నతాధికారిణి హస్తం ఉందని వాపోయారు. న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరారు. ముంబై నుంచి పిలిపించి దంపతుల హత్య దొడ్డబళ్లాపురం: అక్రమ సంబంధం పగతో దంపతులను హత్య చేసిన సంఘటన బీదర్ జిల్లా బసవ కళ్యాణ తాలూకా కోహినూరు పహాడ వద్ద జరిగింది. జాఫరవాడి గ్రామ నివాసి రాజు కాంతప్ప (28), భార్య శారద (24) హత్యకు గురయ్యారు. యరండగి గ్రామానికి చెందిన దత్తాత్రేయ వాలె, తుకారాం నిందితులు. హతుడు రాజు, దత్తాత్రేయ సహోదరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని కక్షగట్టి అతనితో పాటు భార్యను కూడా చంపేశారని పోలీసులు చెబుతున్నారు. భార్యతో కలిసి రాజు ఇటీవలే కూలి పనుల కోసం ముంబైకి వెళ్లాడు. అయితే గ్రామంలో మాట్లాడాలని ఫోన్ చేసి రప్పించారు. నిర్జనప్రదేశానికి తీసికెళ్లి కత్తులతో నరికి చంపారు. దత్తాత్రేయ, ఇతని సహోదరి, తుకారాంలను అరెస్టు చేశారు. ప్రాణం తీసిన మొబైల్ కాల్ దొడ్డబళ్లాపురం: మొబైల్ఫోన్లో మాట్లాడుతూ రైలు పట్టాలు దాటుతున్న ఎంబీఏ విద్యార్థిని రైలు ఢీకొని మరణించిన సంఘటన దావణగెరె జిల్లా హరిహర రైల్వేస్టేషన్లో జరిగింది. బళ్లారికి చెందిన శ్రావణి (23) మైసూరులో ఎంబీఏ చదువుతోంది. హరిహరలో బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో వచ్చింది. మంగళవారం రాత్రి మైసూరుకు వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కు వచ్చి ఫోన్లో మాట్లాడుతూ పట్టాలు దాటుతూ ఉండగా, రైలు దూసుకొచ్చింది. ఢీకొనడంతో తీవ్ర గాయాలతో మరణించింది. మోదీ నియంతృత్వ వైఖరి: సీఎం యశవంతపుర: ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న మన్‌కీ బాత్‌లో ఏకపక్షంగా చెబుతూ ఆ మాటలను అందరూ వినాలనే ధోరణి మంచిదికాదని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. ఇది నియంతృత్వ వైఖరిగా కనిపిస్తోందన్నారు. బుధవారం కూడల సంగమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో చర్చించడం చూశాం, కానీ మోదీ వద్ద ఏదీ చర్చించే అవకాశం లేదని అన్నారు. నేను చెప్పింది మీరందరూ వినాలి అనే సర్వాధికార ధోరణి సమాజానికి మంచిదికాదని దుయ్యబట్టారు. కాగా, పాకిస్తాన్‌కు అనుకూలంగా ఎవరు మాట్లాడినా అది దేశద్రోహమని సిద్దరామయ్య తెలిపారు. పాకిస్తాన్‌కు అనుకూల పోస్టింగులు పెట్టిన 15 మందిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చెప్పారు. -
గొప్ప సంఘ సంస్కర్త బసవణ్ణ
సాక్షి, బళ్లారి: మహా మానవతావాది, గొప్ప సంఘ సంస్కర్త విశ్వగురు బసవణ్ణ అని పలువురు వక్తలు కొనియాడారు. బుధవారం బసవణ్ణ జయంతిని నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా కన్నుల పండువగా ఆచరించారు. జిల్లా యంత్రాంగం, వీరశైవ సమాజ ప్రముఖులు విశ్వగురు బసవణ్ణ విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు చేసి నివాళులు అర్పించారు. నగరంలోని మోతీ సర్కిల్ వద్ద వెలసిన బసవేశ్వర విగ్రహానికి పూజలు చేసిన అనంతరం వక్తలు మాట్లాడుతూ మహా మానవతావాది బసవేశ్వర ఆచార విచారాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందని కొనియాడారు. జిల్లాధికారి ప్రశాంత్‌కుమార్ మిశ్రా, ఎమ్మెల్యేలు నాగేంద్ర, నారా భరత్‌రెడ్డి, జిల్లా ఎస్పీ శోభారాణి, మేయర్ నందీష్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు నారా భరత్‌రెడ్డి, నాగేంద్ర తదితరులు నగరంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. రూ.1.5 కోట్లతో బసవణ్ణ విగ్రహం ఏర్పాటు నగరంలోని మోకా రోడ్డులోని కేఈబీ సర్కిల్‌ను బసవేశ్వర సర్కిల్‌గా నామకరణం చేస్తూ గుర్రం మీద బసవణ్ణ స్వారీ చేస్తున్న విధంగా రూ.1.5 కోట్లతో అద్భుతమైన విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యేలు నారా భరత్‌రెడ్డి, నాగేంద్ర, వీరశైవ సమాజ ప్రముఖులు భూమి పూజ చేశారు. అంతటా బసవ జయంతి విశ్వగురు బసవేశ్వరుని జయంతిని బుధవారం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో అంతటా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాజీ మంత్రి శ్రీరాములు ఆధ్వర్యంలో ఆయన నివాస గృహంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బసవణ్ణ విగ్రహానికి పూజలు చేసి బసవ జయంతిని ఆచరించారు. దళిత సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో బసవణ్ణ విగ్రహానికి లిడ్కర్ అధ్యక్షుడు ముండ్రిగి నాగరాజు పూలమాలలు వేశారు. అలాగే జేడీఎస్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లాధ్యక్షుడు మీనళ్లి తాయణ్ణ తదితరులు పాల్గొని బసవ జయంతిని ఆచరించారు. డీఎస్ఎస్ ఆధ్వర్యంలో, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఘనంగా బసవ జయంతిని ఆచరించారు. కులవివక్షపై బసవణ్ణ ఆనాడే గళమెత్తారు బళ్లారి రూరల్ : మహిళా అసమానత, కుల, మత వివక్షలపై బసవణ్ణ ఆనాడే గళమెత్తారని కన్నడ సంస్కృతి శాఖ రిటైర్డ్ ఏడీ డాక్టర్ చోరనూరు కొట్రప్ప తెలిపారు. బీఎంఆర్‌సీ వైద్యభవన్‌లో బుధవారం బసవణ్ణ జయంతిలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఫోరెన్సిక్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ రవిశంకర్, బీఎంఆర్‌సీ డీన్ డాక్టర్ గంగాధరగౌడ, ప్రిన్స్‌పాల్ డాక్టర్ మంజునాథ్, సూపరింటెండెంట్ డాక్టర్ ఇందుమతి, డాక్టర్ బసవరాజగౌడ, డాక్టర్ ఆదర్శ్, డాక్టర్ గడ్డి దివాకర్, డాక్టర్ రాజశేఖరగౌడ, డాక్టర్ ఎన్.కొట్రేశ్ తదితర వైద్యులు, జూనియర్ వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. బసవణ్ణ ఆదర్శాలు అనుసరణీయం రాయచూరు రూరల్: మహా మానవతావాది బసవణ్ణ ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అన్నారు. బుధవారం బసవేశ్వర సర్కిల్లో జరిగిన బసవణ్ణ 892వ జయంతిని పురస్కరించుకొని ఆయన ప్రతిమకు పూలమాలలు వేసి మాట్లాడారు. ప్రతిమకు శాంతమల్ల శివాచార్య స్వామీజీ, జిల్లాధికారి నితీష్, లోక్‌సభ సభ్యుడు కుమారనాయక్, శాసన సభ్యుడు శివరాజ పాటిల్, ఏఎస్పీ హరీష్, సమాజ అధ్యక్షుడు శరణ భూపాల్ నాడగౌడ తదితరులు పూలమాలలు వేశారు. సామూహిక వివాహాలు పేదలకు వరం హొసపేటె: సామూహిక వివాహాలు పేదలకు వరంలాంటివని విజయనగర జిల్లాధికారి దివాకర్ తెలిపారు. బుధవారం నగరంలో కొట్టూరు స్వామి మఠంలో బసవ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కొట్టూరు సంస్థాన మఠం జగద్గురు బసవలింగ మహాస్వామీజీ మాట్లాడుతూ ఈసారి సర్వధర్మ ఉచిత సామూహిక వివాహాలకు 18 జంటలు హాజరయ్యారన్నారు. అనంతరం వేద మంత్రాల సాక్షిగా పెళ్లిళ్లు జరిపించి నూతన జంటలను ఆశీర్వదించారు. అంతకు ముందు బసవేశ్వర సర్కిల్లోని బసవణ్ణ ప్రతిమకు పూలమాలలు వేశారు. అసిస్టెంట్ కమిషనర్ వివేక్, తహసీల్దార్ శృతి, డీఎస్పీ మంజునాథ్, వీరశైవ సమాజ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. విశ్వ గురు తత్వాలు ఆదర్శనీయం జయంతిలో పలువురు వక్తల వెల్లడి -
ఇంట్లోకి చొరబడి రౌడీషీటర్ హత్య
హుబ్లీ: హత్య కేసులో నిందితుడిగా జైలు శిక్ష అనుభవించి ఇంటికి వచ్చిన రౌడీషీటర్‌ను అతడి ఇంట్లోకి చొరబడి ప్రత్యర్థులు చాకులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన ధార్వాడ తాలూకా కొట్టూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన శంకరయ్య పంచయ్య మఠపతి అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. పాతకక్షలే ఈ హత్యకు కారణమని చెబుతున్నారు. రాత్రి శంకరయ్య ఇంటి ముందు కట్టపై కూర్చుండగా బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వారిని చూసి శంకరయ్య ఇంట్లోకి పరుగెత్తగా, దుండగులు కూడా ఇంట్లోకి చొరబడి ఉన్నఫళంగా అతనిపై దాడి చేశారు. ప్రతిఘటించినా దక్కని ఫలితం దీనిపై శంకరయ్య తీవ్రంగా ప్రతిఘటించినా ఫలితం దక్కలేదు. ఇష్టానుసారంగా చాకులతో పొడిచి పరారయ్యారు. తక్షణమే కుటుంబ సభ్యులు శంకరయ్యను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే 9కి పైగా కత్తిపోట్లు తగిలిన నేపథ్యంలో తీవ్రంగా రక్తస్రావమై మార్గమధ్యంలోనే శంకరయ్య మృతి చెందాడు. ఘటన స్థలానికి జిల్లా ఎస్పీ డాక్టర్ గోపాల్ బ్యాకోడ్, గ్రామీణ సీఐ సమీర్ ముల్లా చేరుకుని పరిశీలించారు. హత్య చేసిన దృశ్యాలు సదరు ఇంట్లోని సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. దీంతో పోలీసులు వాటి ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. అసభ్య సందేశం పంపిన మహిళపై కేసు నేకార నగర్లో ఓ మహిళ కేశ్వాపుర మహిళకు అసభ్యంగా ఫోన్ సందేశం పంపించి ప్రాణాలు తీస్తామని బెదిరించిన ఘటనపై కసబాపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సిద్దారూఢ మఠం నుంచి కేశ్వాపురకు ఆటోలో వెళుతూ అదే ప్రాంతానికి చెందిన మహిళకు పరిచయం అయిన నేకార నగర్ మహిళ మాటలతో పరిచయం చేసుకొని సదరు మహిళ ఫోన్ నెంబర్ తీసుకుంది. ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించిన ఆమె వాట్సాప్‌లో అసభ్య సందేశం పంపించింది. అలాగే కొందరు పురుషులకు ఆమె నెంబర్ ఇచ్చి అవమానం చేయడంతో పాటు ప్రాణాలు తీస్తానంటూ బెదిరించిందని బాధిత మహిళ కసబాపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. చాకులతో పొడిచి చంపిన ప్రత్యర్థులు పాతకక్షలతోనే హత్యగా అనుమానం -
కారు ఢీకొని వ్యక్తి మృతి
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా క్యాసనకెరె గ్రామం వద్ద జాతీయ రహదారి–50ని దాటుతుండగా మంగళవారం రాత్రి కారు ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని హగరిబొమ్మనహళ్లి తాలూకాలోని హొసకెరె గ్రామానికి చెందిన హెచ్.స్వామి(35)గా గుర్తించారు. తన భార్య స్వస్థలం కూడ్లిగి తాలూకాలోని ఐగళ మల్లాపుర వెళ్లడానికి స్వామి తన స్వగ్రామం నుంచి బస్సులో వచ్చాడు. క్యాసనకెరె క్రాసింగ్ వద్ద దిగి హైవే దాటుతుండగా, ఆయనను కారు ఢీకొట్టింది. ప్రమాద అనంతరం డ్రైవర్ కారు ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన స్వామి అక్కడికక్కడే తుది శ్వాస విడిచారు. ఎస్పీ శ్రీహరిబాబు, డీఎస్పీ మల్లేష్ దొడ్డమని, కానాహొసహళ్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిద్రం బిదరాణితో సహా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కూడ్లిగి ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. కానాహొసహళ్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కోటలను అభివృద్ధి చేయండి రాయచూరు రూరల్: నగరంలో చారిత్రక కోటల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు జిల్లాధికారి నితీష్‌కు సూచించారు. బుధవారం బసవేశ్వర సర్కిల్ వద్ద ఆయన అధికారులతో మాట్లాడారు. నగర పరిధిలోని కోటలలో పరిశుభ్రత కాపాడడం, వాటిని రక్షించడం, ఇతర అభివృద్ధి పనులు చేయించాలన్నారు. బస్టాండ్ వద్ద గల మక్కా దర్వాజ, నవరంగ్ దర్వాజ, ఇతర ప్రాచీన కోటల కట్టడాలను బలవర్దనం చేయడానికి నిధులు కేటాయిస్తామన్నారు. రూ.కోటితో పనులు మొదలు పెట్టాలని సూచించారు. మంత్రి వెంట నగరసభ కమిషనర్ జుబీన్ మహపాత్రో, ఏసీ గజానన బళి, ఏఎస్పీ హరీష్, నగరసభ అధ్యక్షురాలు నరసమ్మ, సభ్యులు జయన్న, రమేష్‌లున్నారు. -
బయల్పడిన పురాతన శిలాశాసనం
బళ్లారి రూరల్: దావణగెరె జిల్లా న్యామతి తాలూకా మాదాపురం చెరువులో బాదామి చాళుక్యల కాలం నాటి శిలాశాసనాలు లభ్యమైనట్లు కమలాపురం పురావస్తు శాఖ సంగ్రహాలయం, పారంపర్య శాఖ సంచాలకుడు డాక్టర్ ఆర్.శేజేశ్వర ఓ ప్రకటన ద్వారా తెలిపారు. మాదాపురంలోని చెరువులో స్థానికులు జేసీబీతో మట్టిని తవ్వుతుండగా శిలాశాసనాలు బయట పడ్డాయి. దీంతో పురావస్తు శాఖ సంగ్రహాలయం పారంపర్య శాఖ సంచాలకుడు ఆ ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. ఈ శిలాశాసనాలు క్రీస్తు పూర్వం 7వ శాతాబ్దం నాటి బాదామి చాళుక్య మొదటి విక్రమాదిత్య పాలన సాగించిన 654–681 కాలం నాటి శాసనాలుగా గుర్తించారు. ఈ శిలాశాసనం 5 అడుగుల ఎత్తుతో 17 వరుసల్లో పురాతన కన్నడ భాషలో ఉన్నట్లు తెలిపారు. ఆ కాలంలో ప్రజలు కట్టాల్సిన పన్ను రద్దు్, చెరువు నిర్మాణానికి భూమికి సంబంధించిన వివరాలు శాసనంలో ఉన్నట్లు తెలిపారు. శానసంలో 70 గ్రామాల పరిపాలన విభాగాన్ని పొందుపరిచినట్లు తెలిపారు. ఈ శాననం 1344 ఏళ్ల నాటి పురాతనమైనదిగా ఆయన గుర్తించారు. ఈ శాసనాన్ని ప్రొఫెసర్ శ్రీనివాస పాడిగర, రమేశ్ హిరేజంబూరు చదవగలిగారు. ఈ పరిశీలనలో క్షేత్ర కార్యదర్శి డాక్టర్ రవికుమార్ నవలగుంద సహకారం ఉన్నట్లు తెలిపారు. మాదాపుర గ్రామ మంజప్ప చుర్చిగుండి, పరిపాలనాధికారి విశ్వనాథ, గ్రామస్తులు భుజంగలకు పురావస్తు శాఖ అధికారి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి విక్రమాదిత్య కాలం నాటి శిలాశాసనంగా గుర్తింపు క్రీస్తుపూర్వం 7వ శతాబ్దపు శాసనంగా పురావస్తు శాఖ వెల్లడి -
నేత్రపర్వంగా దీపా మేళా తనారతి
రాయచూరు రూరల్: దక్షిణ భారత దీపా మేళా తనారతి కార్యక్రమం కళ్యాణ కర్ణాటకలో అత్యంత వైభవంగా ముగిసింది. మంగళవారం రాత్రి కలబుర్గి జిల్లా చిత్తాపుర తాలూకాలోని నాలవార కోరి సిద్దేశ్వర మఠంలో తోటేంద్ర శివాచార్య మహాస్వామీజీ ఆధ్వర్యంలో తనారతి నిర్వహించారు. భక్తుల కోరికలు తీర్చే ఇష్ట దైవంగా భావించే నాలవార కోరి సిద్దేశ్వర స్వామిగా భావించి భక్తులు తనారతి చేయడం ఆనవాయితీగా వస్తోంది. జంబునాథ ఆలయం రోడ్డుకు మరమ్మతులు హొసపేటె: జంబునాథ స్వామి ఆలయం వద్ద రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నందున బైకులు, కార్లు, లారీలు మొదలైన అన్ని రకాల వాహనాల సంచారం ఆ రోడ్డులో స్తంభింపజేశారు. ఈనేపథ్యంలో భక్తులు భక్తులు సహకరించాలని కార్యనిర్వహక అధికారులు తెలిపారు. ప్రజల సహకారంతో అభివృద్ధి సాకారం రాయచూరు రూరల్: తాలూకా సమగ్ర అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని విధాన పరిషత్ సభ్యుడు బసనగౌడ బాదర్లి పేర్కొన్నారు. బుధవారం సింధనూరు తాలూకాలో రూ.40 లక్షలతో చేపట్టనున్న మూడు హాస్టల్ భవనాల నిర్మాణానికి భూమిపూజ చేసి ఆయన మాట్లాడారు. తాలూకాను సుందరంగా తీర్చిదిద్దడానికి పాటుపడతామన్నారు. యూసఫ్, వీరేష్, హన్మంతు, శహబాజ్, చెన్నబసవ, చంద్రశేఖర్, ప్రశాంత్, సంతోష్, అమరేష్‌లున్నారు. బెళగావి ఘటనలో ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్ రాయచూరు రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య సోమవారం బెళగావిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సందర్భంగా బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శించారు. ఈనేపథ్యంలో పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రసంగానికి అడ్డు తగిలిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. బెళగావి ఉత్తర రేంజ్ ఐజీపీ చేతన్ిసింగ్ రాథోడ్ ఖడే బజార్ పోలీస్ కానిస్టేబుల్ బీ.ఏ.నౌకిడి, క్యాంప్ పోలీస్ కానిస్టేబుల్ మల్లప్ప హెడిగినాళలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆందోళన చేస్తున్న సమయంలో బీజేపీ మహిళా కార్యకర్తలను సభలోకి వెళ్లకుండా అడ్డుకోనందుకు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. బాలుడు అదృశ్యం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని హొసహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 15 ఏళ్ల వయస్సుగల వరుణ్ కుమార్(హొన్నూర్) అనే బాలుడు అదృశ్యమైనట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గోధుమ రంగు శరీరఛాయ, గుండ్రని ముఖం, 4.5 అడుగుల ఎత్తు కలిగి, నీలం రంగు చొక్కా, గోధుమ రంగు షార్ట్స్ ధరించి కన్నడలో మాట్లాడగలడని తెలిపారు. ఏప్రిల్ 27న బాలుడు ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండా పోయాడు. తప్పిపోయిన బాలుని గురించి సమాచారం తెలిసిన వారు హొసహళ్లి పోలీస్ స్టేషన్లో లేదా 8073276896కు సంప్రదించాలని పోలీస్ సబ్ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్ల అభివృద్ధికి పెద్దపీట రాయచూరు రూరల్: తాలూకాలో గ్రామీణ రోడ్ల అభివృద్ధి ప్రాముఖ్యత కల్పిస్తామని గ్రామీణ విధానసభ సభ్యుడు బసనగౌడ దద్దల్ పేర్కొన్నారు. బుధవారం రాయచూరు తాలూకాలోని కుర్డి, రాజోళి, జూకూరుల్లో రూ.కోటితో తారు రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో గ్రామీణ రహదారులకు మరింత ప్రాధాన్యత ఇస్తామన్నారు. -
మంటల్లో గడ్డివాము బుగ్గి
బళ్లారిటౌన్: నగరంలోని సంగనకల్లు రోడ్డులోని శృంగేరి శారదా మఠానికి వెళ్లే దారిలో బుధవారం సాయంత్రం హరీష్‌గౌడ అనే రైతు గేదెల కోసం నిల్వ చేసిన గడ్డివాముకు నిప్పంటుకుంది. శృంగేరి శారద మఠంలో పెళ్లి సందర్భంగా వధూవరులను తీసుకెళ్లే సమయంలో పేల్చిన టపాసు రవ్వలు గడ్డివాముపై పడటంతో నిప్పంటుకుంది. ఈ ప్రాంతంలో రెండు గడ్డివాములతో పాటు నాలుగైదు గేదెలు కూడా పశువుల శాలలో తలదాచుకుంటున్నాయి. అయితే స్థానికులంతా చేరి మంటలను ఆర్పడంతో పక్కనే ఉన్న మరో గడ్డివాము, పశువులు కూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాయి. మంటలు చెలరేగగానే అగ్నిమాపక దళానికి కూడా సమాచారాన్ని అందించారు. అయితే వాహనం వచ్చే లోపు మంటలు ఆర్పే ప్రక్రియలో స్థానికులు శ్రమించారు. కాగా బాధితుడు తన స్థలంలో గడ్డివామును వేసుకున్నా కూడా తమకు రక్షణ లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మే 3కు నేహా హత్య కేసు విచారణ వాయిదా హుబ్లీ: ఏడాది క్రితం బీవీబీ కళాశాల ఆవరణలో దారుణ హత్యకు గురైన విద్యార్థిని నేహా హిరేమఠ హత్య కేసు విచారణ హుబ్లీ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మంగళవారం చేపట్టింది. న్యాయమూర్తి పరమేశ్వర్ ప్రసన్న కేసు విచారణ వేశారు. సీఐడీ, నేహా హిరేమఠ తరపున సీనియర్ న్యాయవాది మహేష్ వైద్య వాదించారు. నిందితుడు ఫయాజ్ తరపున సీనియర్ న్యాయవాది జెడ్ఆర్ ముల్లా కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ తొలి రోజు కావడంతో న్యాయమూర్తి విచారణను మే 3కు వాయిదా వేశారు. కాగా నిందితుడు ఫయాజ్ను కూడా కోర్టులో హాజరు పరిచారు. -
హక్కుల కమిషన్ తనిఖీ
హొసపేటె: కొప్పళ నగరంలోని జిల్లా స్టేడియంలోని ఇటీవల స్విమ్మింగ్ పూల్‌లో ఈతకు వెళ్లి బాలుడు మరణించిన సంఘటనపై కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు శేఖర్గౌడ జి.రహమత్నాళ సంఘటనా స్థలాన్ని తనిఖీ చేశారు. బాలుడి తల్లిదండ్రులను కలిసి తన సానుభూతిని తెలపడానికి ఆయన బాలుడి ఇంటికి కూడా వెళ్లారు. దీనిపై కొప్పళ టౌన్ పోలీస్ స్టేషన్లో 26న కేసును నమోదు చేశారు. వేసవి సెలవులు కావడంతో చాలా మంది ఈత నేర్చుకోవడానికి వస్తారు. స్విమ్మింగ్‌పూల్ వద్ద అందరికీ నాణ్యమైన లైఫ్ జాకెట్లు ఇవ్వాలని, తగినంత సంఖ్యలో లైఫ్‌గార్డ్‌లను నియమించాలని తదితర జాగ్రత్తలు తీసుకోక పోవడం ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని అధికారులకు సూచించారు. అభివృద్ధి పనులకు భూమిపూజ హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి నియోజకవర్గ సరిహద్దు ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం తాలూకాలోని గుడేకోటె, హొసహళ్లి ఫిర్కాల్లో రోడ్డు అభివృద్ధి, వంతెన నిర్మాణం వంటి వివిధ పనులకు భూమిపూజ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. మొళకాల్మూరు, చెళ్లకెరె, జగళూరు వంటి సరిహద్దు తాలూకాలను కలిపేలా అనేక రోడ్లకు ఏళ్ల తరబడి తారు వేయలేదన్నారు. దీంతో కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. వాటి అభివృద్ధికి ఒక డ్రైవ్ ప్రారంభిస్తామని అన్నారు. మొత్తం రూ.11 కోట్ల ఖర్చుతో రోడ్లు, వంతెనల నిర్మాణ పనులను చేపడతారన్నారు. బీడీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు తిప్పేస్వామి, మాజీ టీపీ సభ్యుడు పాపా నాయక్, ఇంజినీర్ షఫి, ఏపీఎంసీ అధ్యక్షుడు కురిహట్టి బోసయ్య, న్యాయవాది ఓంకారప్ప, రమేష్, మంజునాథ్, ఎమ్మెల్యే సన్నిహితుడు, జెడ్పీ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. కులగణనపై సర్కార్ తప్పుదోవ రాయచూరు రూరల్: కశ్మీర్లో పహల్గాం ఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌తో యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ వెల్లడించారు. బుధవారం బసవేశ్వర సర్కిల్ వద్ద విలేఖర్లతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు బీజేపీపై చేస్తున్న మోసపూరిత ప్రకటనలు, అవహేళనకరంగా వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. కులగణన విషయంలో ప్రభుత్వం ప్రజలను దారి తప్పిస్తుందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు ఎక్కడ దాచారో వెల్లడించాలన్నారు. రాష్ట్రంలో పాలన యంత్రాంగం పూర్తిగా స్తంభించి పోయిందన్నారు. నగరసభ సభ్యులు నాగరాజ్, శశిరాజ్, నేతలు రవీంద్ర, ఆంజనేయ, నరసింహులులున్నారు. -
నిజాయితీగా పనిచేయండి
● కొత్త ఉద్యోగులకు సీఎం సూచన శివాజీనగర: రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పాలనాధికారి ఉద్యోగాలను పూర్తిగా దశలవారీగా భర్తీ చేయనున్నట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు. మంగళవారం నగరంలో ఇటీవల ఉద్యోగ నియామకాల్లో ఎంపికై న 1000 మంది గ్రామ పరిపాలనాధికారులకు నియామక పత్రాలు అందజేశారు. అలాగే 4 వేల వీఏఓలకు ల్యాప్‌ట్యాప్, ఇతర ఉపకరణాలను పంపిణీ చేశారు. ఎలాంటి అవినీతికి అవకాశం కల్పించకుండా సక్రమంగా సేవలందించాలని పిలుపునిచ్చారు. త్వరలో 500 మంది పాలనాధికారుల నియామకం చేపడతామని చెప్పారు. ఉద్యోగులు జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఉండకుండా ఆయా గ్రామాల్లోనే ఉండాలి. రైతులకు సులభంగా అందుబాటులో ఉండాలి అని పలు సూచనలు చేశారు. ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పెద్ద పులి మృత్యువాత మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేటె బండీపుర పులి అభయారణ్యంలోని ఓంకార జోన్ శ్రీకంఠపుర గుడ్డలో మగ పులి కళేబరం కనిపించింది. అటవీ శాఖ సిబ్బంది గస్తీలో ఉండగా 8–9 ఏళ్ల వయస్సుగల పులి కళేబరం చూశారు. అది చనిపోయి కనీసం 8– 10 రోజులు అయినట్లు అంచనా వేశారు. అనంతరం అటవీ సిబ్బంది వలయ అటవీ అధికారి సతీష్ దృష్టికి ఈ విషయాన్ని తెచ్చారు. పులి మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదు. మరొక పులితో పోట్లాటలో మరణించిందా, లేదా ఏదైనా వ్యాధితో బాధపడుతూ చనిపోయిందా అనేది మరణోత్తర పరీక్ష ద్వారా వెలుగు చూడాల్సి ఉంది. జూన్ 15 వరకు బైక్ ట్యాక్సీ సేవలు బనశంకరి: ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీసేవలను రాష్ట్రంలో జూన్ 15 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి బీఎం.శ్యాంప్రసాద్ ధర్మాసనం ఈ మేరకు వెసులుబాటు ఇచ్చింది. సుమారు 6 లక్షలకు పైగా బైకు ట్యాక్సీల ద్వారా జీవనం సాగిస్తున్నారు, బైకు ట్యాక్సీలను రద్దు చేస్తే వారి ఉపాధి దెబ్బతింటుందని న్యాయవాదులు పేర్కొన్నారు. బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆటో, క్యాబ్ సంఘాలు కూడా ఇదే కోరుతున్నాయి. మహిళను బలిగొన్నఏనుగు యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా బెళ్లారె సమీపంలోని కొళ్తిగడ గ్రామం సీఆర్సీ కాలనీ సమీపంలో అడవి ఏనుగు దాడిలో మహిళ బలైంది. సెల్లమ్మ (65) అనే వృద్ధురాలిని మంగళవారం ఉదయం ఏనుగు కాళ్లతో తొక్కి చంపింది. ఆమె, ఇద్దరు మహిళా కార్మికులు రబ్బర్ చెట్లకు గాట్లు వేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఏనుగు వెంటాడి తరిమింది. ఇద్దరు మహిళలు తప్పించుకోగా, సెల్లమ్మను ఏనుగు తొక్కి హతమార్చింది. బెళ్లారె పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అటవీశాఖ అధికారులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు. కట్న వేధింపులతో ఆత్మహత్య మైసూరు: భర్త, అతని కుటుంబ సభ్యులు చేస్తున్న అదనపుకట్న వేధింపులకు విసిగి పోయిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన మైసూరులో జరిగింది. వివరాలు.. విద్యారణ్యపురం నివాసి వై.ప్రేరణకు బెంగళూరుకు చెందిన సు ఘోష్‌తో 2022లో పెళ్లయింది. వివాహ సమయంలో 250 గ్రాముల బంగారు, వెండి వస్తువులను వరకట్నంగా ఇచ్చారు. అయినా భర్త, అతని కుటుంబ సభ్యులు అదనపుకట్నం తేవాలని ఆమెను వేధింపులకు గురి చేసేవారు. శివరాత్రి రోజున ప్రేరణతో గొడవ పడి ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటారు. దీంతో ఆమె మైసూరులోని పుట్టింటికి వచ్చేసింది. ఇలా ఉండగా భర్త సుఘోష్ ఆమెకు ఫోన్ చేసి అదనపు కట్నం తేకుంటే నీవు నాకు అవసరం లేదని నిందించడంతో జీవితంపై విరక్తి చెందిన ప్రేరణ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఉరి వేసుకుంది. తమ అల్లుడు, అతని కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రేరణ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యారణ్యపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
కొత్త డీజీపీ ఎవరు?
బనశంకరి: రాష్ట్ర పోలీసు దళాలకు నూతన బాస్ ఎవరనేది తేలాల్సి ఉంది. ప్రస్తుత డీజీపీ అలోక్‌మోహన్ నేడు బుధవారం రిటైరవుతారు. సిద్దు ప్రభుత్వం నూతన డీజీపీ ఎంపికపై కసరత్తు చేస్తోంది. రేసులో సీఐడీ డీజీపీ డాక్టర్ ఎంఏ.సలీం, ఫైర్ చీఫ్ ప్రశాంత్‌కుమార్ ఠాకూర్ ముందంజలో ఉన్నారు. సలీం కన్నడిగ కాగా, ఠాకూర్ బిహారీ. సలీంకు చాన్స్ ఎక్కువగా ఉంది. బెంగళూరువాసి సలీం డీజీపీగా అలోక్‌మోహన్ 2023లో నియమితులయ్యారు. తనను మరో మూడునెలల పాటు డీజీపీగా పొడిగించాలని కోరుతూ అలోక్‌మోహన్ పంపిన లేఖకు సానుకూల స్పందన రాలేదు. సలీం 1993 బ్యాచ్ ఐపీఎస్ కాగా, ఠాకూర్ 1992 బ్యాచ్. వీరిద్దరి పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. సలీం బెంగళూరు చిక్కబాణావర కు చెందిన కర్ణాటక కేడర్ అధికారి. గతంలో ఉడుపి, హాసన్, మైసూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. బెంగళూరులో ట్రాఫిక్, శాంతిభద్రతలలోనూ నిర్వర్తించారు. ఠాకూర్‌కు సీనియారిటీ ఉండడంతో ఎవరికైనా పీఠం దక్కవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. దీంతో సిద్దరామయ్య సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఠాకూర్, సలీం మధ్య రేసు నేడు అలోక్‌మోహన్ రిటైర్మెంటు -
కాలువలో పడ్డ కారు
కేసీ కాలువలోకి పడ్డ కారు మండ్య: మండ్య జిల్లాలోని వీసీ కెనాల తరచూ దుర్ఘటనలకు కేంద్రబిందువు అవుతోంది. కార్లు, వాహనాలు పడిపోవడం, ఈతకు వెళ్లి మరణించడం పరిపాటిగా మారింది. తాజాగా కేఆర్ సాగర పరిధిలో ఉన్న విశ్వేశ్వరయ్య (వీసీ) కాలువలో కారు పడిపోయి తండ్రీ, ఇద్దరు పిల్లలు మరణించారు. మైసూరు జిల్లాలోణి కేఆర్ నగర తాలూకాలోని హెబ్బాలుకు చెందిన కుమార స్వామి (38), పిల్లలు అయిన అద్వైత్ (8), అక్షత (3)గా గుర్తించారు. పిల్లలతో కారులో బయల్దేరి వివరాలు.. ఏప్రిల్ 16వ తేదీన కుమారస్వామి బెంగళూరు నుంచి కెఆర్ నగరకు కారులో శాంట్రో కారులో బయల్దేరాడు. ఈయన బెంగళూరులో చిన్నపాటి ఉద్యోగం చేసేవాడు. భార్యకు ఫోన్ చేసి కేఆర్‌ఎస్‌లో ఉంటానని చెప్పాడు. కానీ ఇంటికి చేరుకోలేదు. భార్య మళ్లీ ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో కేఆర్సాగర పోలీసులకు మిస్సింగ్ అని ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చేపట్టారు. మంగళవారం వీసీ కెనాల్లో వెతగ్గా కారు కనిపించింది. కారులో తండ్రి పిల్లల మృతదేహాలు ఉన్నాయి. పోలీసులు, స్థానిక జనం కలిపి కారును తాళ్లతో కట్టి బయటకు లాగారు. మృతదేహాలను స్థానిక మార్చురీకి తరలించారు. ఇది ప్రమాదం కాదు, ఆత్మహత్యేనని అనుమానాలున్నాయి. భార్య, బంధువులు తీవ్రంగా విలపించారు. పోలీసులు విచారణ చేపట్టారు. తండ్రీ, ఇద్దరు పిల్లలు మృతి 16వ తేదీ నుంచి మిస్సింగ్ మండ్య జిల్లాలో మిస్టరీ ఘటన -
ఈదురు గాలులకు కరెంటు కష్టాలు
తుమకూరు: తుమకూరు జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు విధ్వంసం చోటుచేసుకుంది. అనేకచోట్ల కరెంటు స్తంభాలు నేలకూలడంతో ప్రజలు చీకట్లో విలవిలలాడారు. చిక్కనాయకనహళ్ళి, శిర, మధుగిరి, తుమకూరు, గుబ్బి, తిపటూరు తాలూకాలలో పోల్స్ పడిపోయి కరెంటు నిలిచిపోయింది. చాలాచోట్ల పిడుగులు పడ్డాయి. దాని వల్ల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిని లింగప్పనపాళ్య, కారెహళ్ళి, కంకెరె ప్రాంతాల్లో కరెంటు నిలిచిపోయింది. పలు పంచాయతీలలో 50 దాకా కరెంటు స్తంభాలు పడిపోయాయి. రాత్రి కావడంతో బెస్కాం సిబ్బంది కదలలేదు. మంగళవారం ఉదయం నుంచి పనులు చేపట్టగా మధ్యాహ్నానికి సరిచేశారు. తుమకూరు జిల్లాలో కూలిన స్తంభాలు -
కేజీఎఫ్ దొంగలకు సంకెళ్లు
కృష్ణరాజపురం: బెంగళూరులోని కృష్ణరాజపురం పోలీసులు కార్యాచరణ చేపట్టి కేజీఎఫ్‌కు చెందిన ఇద్దరు ఘరానా దొంగలను అరెస్టు చేశారు. కేజీఎఫ్‌లోని హుసేన్పాళ్యకు చెందిన అజ్జు అలియాస్ జ్ఞానప్రకాష్, ఇనుప రాడ్డు సాయంతో తాళాలను పగులగొట్టి ఇళ్ల చోరీలకు పాల్పడేవాడు. ఇతని కుటుంబ సభ్యులందరిదీ చోరీనే వృత్తి. అజ్జుతో పాటు కేజీఎఫ్‌కు చెందిన మరొక ప్రముఖ చోరుడు నరసింహులును కూడా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల సాయంతో పట్టుకున్నారు. వారి నుంచి రూ.40 లక్షల విలువ చేసే 400 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక కేజీ వెండిని స్వాధీనపరచుకున్నారు. కేఆర్ పురం పరిధిలో పలు ఇళ్లలో దొంగతనాలు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా దొంగల ఆచూకీ బయటపడింది. సీజ్ చేసిన నగలు -
రేపిస్టు అంత్యక్రియలకు కోర్టు ఆదేశం
హుబ్లీ: నగరంలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి పోలీస్ ఎన్‌కౌంటర్‌కు గురైన బిహార్‌కు చెందిన వలస కూలీ కార్మికుడు రితీశ్‌కుమార్ మృతదేహానికి అంతిమ సంస్కారాలు నెరవేర్చాలని కోర్టు ఆదేశించింది. దీంతో కేఎంసీ ఆస్పత్రి, సీఐడీ పోలీసు వర్గాలకు ఎంతో ఊరట లభించింది. ఈ క్రమంలో నిందితుడి స్వగ్రామం, కుటుంబ సభ్యులు ఎవరన్నది పోలీసులు ఇంత వరకు గుర్తించలేక పోయారు. ఈ నెల 13న రితీశ్‌కుమార్ చిన్నారిపై అత్యాచారం చేసి ఆమెను నిర్మాణ దశలో ఉన్న ఓ భవనపు మరుగుదొడ్డిలో హత్య చేసి పరారయ్యాడు. ఘటనపై స్థానికులు ఉద్రేకానికి గురై ఆక్రోశం వెళ్లగక్కి నిరసన ర్యాలీలు చేపట్టారు. దీంతో పోలీసులు ఘటన జరిగిన సాయంత్రమే నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు సేకరించే ఉద్దేశంతో అతడు ఉన్న నివాస స్థలం షెడ్ వద్దకు తీసుకెళ్లి వివరాలు తెలుసుకొనేందుకు ప్రయత్నించారు. తప్పించుకోబోతుండగా కాల్పులు ఈ క్రమంలో రాయనాళ బ్రిడ్జి వద్ద అతడు పోలీసులపై దాడి చేసి పరారు కావడానికి ప్రయత్నిస్తుండగా అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ అన్నపూర్ణ నిందితుడిని పారిపోవద్దంటూ రెండు సార్లు గాలిలో కాల్పులు జరిపి లొంగిపొమ్మని సూచించినా నిందితుడు పెడచెవిన పెట్టడంతో ఓ తూటా కాళ్ల పైన, మరో తూటా వెన్నుపై కాల్చడంతో నిందితుడు అక్కడే కుప్పకూలాడు. అతనిని చికిత్స కోసం తరలిస్తుండగా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆత్మరక్షణ కోసమే పోలీసులు నిందితుడిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మృతుడి శవానికి అంతిమ సంస్కారం చేయరాదు. చేస్తే సాక్ష్యాలు నాశనం అవుతాయని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో ప్రజాహిత వ్యాఖ్యం(రిట్) దాఖలు అయింది. ఇతడి పోస్టుమార్టం పరీక్ష జరిపి కోర్టు ఆదేశం కోసం కేఎంసీ ఆస్పత్రి వైద్యులు, సీఐడీ పోలీసులు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. దొరకని నిందితుడి కుటుంబ వివరాలు దీంతో గత 17, 18 రోజులుగా శవం కుళ్లిపోవడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సీఐడీ పోలీసులు శవం డీ కంపోజ్ అవుతుంది, దీన్ని మీ ఆధీనంలోకి తీసుకోవాలని ఆస్పత్రి వైద్యులకు లేఖ రాశారు. సీఐడీ పోలీసులు కూడా శవం సమాధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. శవం కుళ్లిపోతుందని కోర్టుకు విన్నవించారు. ఈ అన్ని విషయాలను సమగ్రంగా విచారించిన కోర్టు ఎట్టకేలకు నిందితుడి అంతిమ సంస్కారాలు నెరవేర్చడానికి అనుమతి ఇచ్చింది. దీంతో సీఐడీ, కేఎంసీ వర్గాలకు ఊరట కలిగింది. కాగా నిందితుడి ఎన్‌కౌంటర్‌కు ముందు తాను బిహార్‌లోని పట్నాకు చెందిన వాడని చెప్పుకున్నారు. భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నానన్నారు. దీంతో అతడి కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం ఎంతో ప్రయత్నించారు. రెండు మూడు బృందాలుగా బిహార్, యూపీ, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో ఎంత గాలించినా నిందితుడి కుటుంబ సభ్యుల వివరాలు తెలియరాలేదు. ఈనేపథ్యంలో మృతదేహానికి త్వరలో అంత్యక్రియలు చేపట్టనున్నట్లు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. కేఎంసీ ఆస్పత్రి, సీఐడీ పోలీసు వర్గాలకు ఊరట త్వరలో మృతదేహానికి అంతిమ సంస్కారాలకు ఏర్పాట్లు -
వక్ఫ్ చట్టానికి సవరణపై నిరసన
హుబ్లీ: కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్లుకు తెచ్చిన సవరణను వ్యతిరేకిస్తూ అఖిల భారత ముస్లిం వ్యక్తిగత న్యాయ మండలి నేతృత్వంలో బీదర్‌లో భారీ ఆందోళన ర్యాలీ చేపట్టారు. వేలాది మంది ముస్లింలతో ఈ ర్యాలీ జామియా మసీదు నుంచి ప్రారంభమై గవాన్ చౌక్ మీదుగా అంబేడ్కర్ సర్కిల్‌కు చేరింది. అక్కడ సమావేశమైన నేతలు మాట్లాడుతూ వక్ఫ్ చట్టానికి సవరణ రాజ్యాంగ సిద్ధాంతాలకు వ్యతిరేకం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ధార్మిక, సాంస్కృతిక హక్కులను కాలరాస్తోందన్నారు. ఈ చట్టాన్ని దేశంలోని కొన్ని సమాజాలు తిరస్కరిస్తున్నాయన్నారు. ఇస్లాం ధార్మిక విలువలు, సాంస్కృతిక స్వాతంత్య్రం, మత సామరస్యతపై తీరని దాడి అన్నారు. మైనార్టీల హక్కుల ఉల్లంఘన, ముస్లిం సమాజాన్ని బలహీన పరిచేందుకే కేంద్రం ఈ చట్టాన్ని తెచ్చిందన్నారు. వక్ఫ్ ఆస్తులను మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని ఈ సవరణ చేశారన్నారు. కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించారు. ఆ దాడిలో మృతి చెందిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం రాష్ట్రపతికి రాసిన వినతిపత్రాన్ని ఏడీసీ శివకుమార్‌కు అందజేశారు. -
యుగ పురుషుడు బసవణ్ణ
సాక్షి,బళ్లారి: విశ్వగురు బవసణ్ణ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని నిరూపించారు. మానవుడుగా పుట్టి దానవుడయ్యారు. ఆయన చిన్నప్పటి నుంచి నడిచిన దారి, పడిన కష్టాలు, చూపిన మార్గం ఆదర్శనీయమైంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న విధంగా బసవణ్ణ సామాన్యుడుగా జన్మించి, అసామాన్యుడుగా, దైవాంశ సంభూతుడుగా, కారణజన్ముడుగా కీర్తి పొంది, కర్ణాటకలోనే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచంలోనే పేరు గడించారంటే అతిశయోక్తి కాదు. 12వ శతాబ్దంలో 1134వ సంవత్సరంలో నాటి బీజాపూర్ జిల్లా బసవన బాగేవాడిలో జన్మించిన బసవేశ్వరుడు విశ్వగురు బసవణ్ణగా కీర్తి గడించారంటే ఆయన చిన్ననాటి నుంచి చేసిన సాధనలు, పడిన కష్టాలు కోకొల్లలు. సాక్షాత్తు శివస్వరూపుడుగా భావిస్తున్న బసవణ్ణ కర్ణాటకలోని మాదలాంబిక, మాదిరాజు అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. ఆయన బ్రాహ్మణ కులంలో జన్మించడంతో చిన్నప్పుడే ఉపనయనం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధపడటంతో ఆయన ఉపనయనాన్ని వ్యతిరేకించి ఇల్లు విడిచి వెళ్లిపోయారు. 8వ ఏటనే తల్లిదండ్రులకు దూరంగా వెళ్లి జీవించడం ప్రారంభించారు. కుల, మత బేధాలు పారదోలారు కర్ణాటక చరిత్రలోనే కాకుండా యావత్ భారత దేశ చరిత్రలోనే 12 శతాబ్దం సువర్ణాక్షరాలతో లిఖించదగిన కాలం. ఎందుకంటే అలనాడు కుల, మతాలు, వర్ణ వ్యవస్థలు, లింగభేదాలతో సమాజం అతలాకుతలమవుతున్న రోజుల్లో ధార్మిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవాలకు ఎదురొడ్డి నిలిచి సమసమాజ స్థాపన కోసం పాటుపడిన మహా యుగపురుషుడు విశ్వగురు బసవణ్ణ. కుల, మత, వర్గ, వర్ణ, అసమామానతలను రూపుమాపేందుకు, హిందూ సమాజంలో ఎన్నో సమూల మార్పులను తెచ్చారు. బిజ్జలుడి రాజ్యంలో చిరుద్యోగిగా చేరిన ఆయన అంచెలంచెలుగా మంత్రిగా ఎదిగారు. అప్పటి నుంచి సమాజోద్ధరణకు అద్భుత పాలన ప్రారంభించారు. వీరశైవ లింగాయత్ ధర్మానికి ఆయన బీజం వేశారు. లింగదీక్ష తీసుకుని శివున్ని ఆరాధించిన వారంతా ఒకే కులమని బోధించారు. సీ్త్ర, పురుషులు అన్న భేదభావాన్ని అప్పట్లోనే రూపుమాపేందుకు కృషి చేశారు. నేడు ప్రపంచ దేశాలు పార్లమెంట్లు, అసెంబ్లీలు స్థాపించుకుని పాలన చేస్తున్నారంటే అప్పట్లో బసవణ్ణ అనుభవ మంటపం ద్వారా అందరికి సమాన హక్కులు కల్పించి అభినవ పార్లమెంటు ద్వారా పాలన సాగించిన గొప్ప దార్శనికుడు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించాలని పోరాటం చేశారు. కాయకమే కై లాసం అని బోధించారు బసవణ్ణ తన ప్రవచనాలు, ఆధ్యాత్మిక బోధనలతో జనంలో చైతన్యం తీసుకుని వచ్చి అందరిని లింగ దీక్షను చేపట్టే విధంగా ప్రేరేపించి నిమ్న కులాల వారికి లింగదీక్ష ఇస్తూ వీరశైవులుగా మార్చారు. కాయకమే కై లాసమని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ జీవిస్తూ భక్తి మార్గం, ఆధ్యాత్మిక చింతనతో ముందుకెళ్లాలని బోధించారు. ఎన్నో అటు పోట్లు, కష్టాలు, చివరకు సమాజమే తన ఊపిరిగా భావించిన బసవణ్ణ 1196వ సంవత్సరంలో కూడలసంగమంలో శివైక్యం చెందారు. సమానత్వ భావాలకు పర్వాయ పదంగా కీర్తి గడించిన బసవణ్ణ జయంతిని బుధవారం బళ్లారితో పాటు కర్ణాటకలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వీరశైవ లింగాయత్‌లతో పాటు అన్ని కుల, మతాలకు చెందిన వారు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కూడల సంగమ ఆర్ట్ గ్యాలరీ అదుర్స్ రాయచూరు రూరల్: కూడల సంగమ క్షేత్రంలోని కళా సంగ్రహాలయం(ఆర్ట్ గ్యాలరీ) అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. కళా సంగ్రహాలయంలో ఉన్న చిత్రాలను చూడటానికి కనువిందు కలిగిస్తుంది. బాగల్కోటె జిల్లా హునగుంద తాలూకా కూడల సంగమ ప్రధాన రహదారిలో బసవ శరణుల కళా సంగ్రహాలయం కనబడుతుంది. ఎడమ వైపు బసవణ్ణ అనుచరుల చిత్రాలు ఉన్నాయి. సౌర మండలానికి సూర్యుడు కేంద్ర బిందువైతే బసవణ్ణ సూర్యోపాదిలో భూమి మీద తన కిరణాలను చూపిస్తూ వచనాలు రాసే భంగమ అందరి మనస్సు దోచుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన చిత్రాలు, శిల్పాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కళా సంగ్రహాలయాన్ని కూడల సంగమ అభివృద్ధి మండలి నుంచి ఎకరా భూమిలో 2011లో రూ.6 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. మహా మానవతావాది, మహోన్నతుడు నేడు విశ్వగురు బసవణ్ణ 892వ జయంతి -
దేశ సరిహద్దులను కాపాడుకోవాలి
రాయచూరు రూరల్: భక్తులు దేవాలయంలో దేవుడిని ఎలా పూజిస్తారో దేశ సరిహద్దులను కూడా అలానే కాపాడుకోవాలని సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య పేర్కొన్నారు. ఆయన సోమవారం సాయంత్రం నేతాజీ నగర్ సర్కిల్లో కొవ్వొత్తుల ర్యాలీకి శ్రీకారం చుట్టి మాట్లాడారు. శాంతికపోతంగా ఉన్న భారతదేశంలోని కశ్మీర్ హిందువుల మారణ హోమాలకు ఇస్లాం ఉగ్రవాదులు కారణమన్నారు. కశ్మీర్ ప్రాంతంలో బైసారన్, పహల్గాంల మధ్య దుండగులు జరిపిన కాల్పుల్లో దుర్మార్గులు దాడిలో హతులైన వారికి హిందూ హిత రక్షణ సమితి ఆధ్వర్యంలో సంతాపం వ్యక్తం చేఽశారు. చౌక్ వద్ద కాగడాలను పట్టుకొని అధ్యక్షుడు అనంద్ ఫడ్నీస్ మాట్లాడారు. కశ్మీర్‌లోని పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం లభించేలా చూడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక విచారణ చేపట్టి తప్పు చేిసిన వారికి ఉరిశిక్ష వేయాలన్నారు. ర్యాలీలో శాంతమల్ల శివాచార్య, వీర సంగమేష్ శివాచార్య, శంభు సోమనాథ శివాచార్య, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్, మాజీ ఎమ్మెల్సీ శంకరప్ప, లలిత, బండేష్, శంకర్‌రెడ్డి, రవీంద్ర కుమార్‌లున్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతులకు సంతాపం హిందూ హిత రక్షణ సమితి కొవ్వొత్తుల ర్యాలీ -
‘అమర ప్రేమి అరుణ్’కు స్పందన భేష్
బళ్లారిటౌన్: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25న విడుదలైన బళ్లారి చిత్ర నటులు నిర్మించిన అమర ప్రేమి అరుణ్ చిత్రానికి అపార స్పందన లభించినట్లు ఆ చిత్రం డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం పత్రికాభవనంలో సినిమా బృందంతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 సెంటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేశామన్నారు. విడుదలైన 5 రోజుల్లో రోజురోజుకు ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో బళ్లారి జిల్లాకు చెందిన బాష, భావనలు, సంభాషణలు, పాటలు స్థానికులకు సంప్రదాయ పద్ధతిలో ఉండేలా నిర్మించామన్నారు. తాను పలు చిత్రాలకు సంభాషణలు రాశానని, యోగరాజ్ భట్ దర్శకత్వంలో ధనకాయువను, కూర్మావతారం చిత్రాలకు సహాయ డైరెక్టర్‌గా పని చేశానన్నారు. ఆ అనుభవంతో బళ్లారి జిల్లాలో ఈ చిత్రాన్ని 54 రోజుల పాటు సంగనకల్లు, మించేరి, హలకుంది, సిరవార, దుర్గమ్మ దేవస్థానం, కాగె పార్క్, బళ్లారి కొండ వంటి లోకేషన్లలో చిత్రీకరించామన్నారు. తన తండ్రి నాగేంద్ర బళ్లారి నగరంలో ఏఎస్ఐగా పని చేశారని, తాను కూడా బళ్లారిలోనే ఇంజినీరింగ్ చదివినట్లు తెలిపారు. తన తండ్రి మరణానంతరం చిత్ర రంగంలోకి ప్రవేశించినట్లు తెలిపారు. మరిన్ని చిత్రాలను నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మంజమ్మ జోగతి కూడా జోగతి పాత్రను పోషించిందన్నారు. ఇక మండ్యకు చెందిన హరీష్ హీరోగా, బెంగళూరుకు చెందిన దీపిక ఆరాధ్య హీరోయిన్గా, సహ హీరోయిన్గా శృతి భట్, ధర్మణ్ణ తదితరులు నటించినట్లు తెలిపారు. సహాయక నిర్మాత మండ్య మంజు, ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు. -
అగ్నిమాపక కేంద్రానికి భూమిపూజ
రాయచూరు రూరల్: తాలూకా అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని విధానసభ సభ్యురాలు కరెమ్మ నాయక్ పేర్కొన్నారు. దేవదుర్గ తాలూకా అరకెరలో రూ.3 కోట్లతో నూతన అగ్నిమాపక కేంద్ర నిర్మాణానికి భూమిపూజ చేసి ఆమె మాట్లాడారు. భవిష్యత్తులో అరకెరలో పోలీస్ స్టేషన్, ఆస్పత్రుల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తాలూకాను అభివృద్ధి పరచడానికి పాటు పడతామన్నారు. అగ్నిమాపక అధికారులు మహేష్, తిమ్మారెడ్డి, రవీంద్ర, తహసీల్దార్ అమరేష్‌లున్నారు. అక్రమ పాఠశాలల రద్దుకు వినతి రాయచూరు రూరల్: జిల్లాలో అక్రమంగా నడుస్తున్న పాఠశాలలను రద్దు చేయాలని నమ్మ కర్ణాటక సేనె సంఘం జిల్లాధ్యక్షుడు కొండప్ప డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. విద్యార్థులను, పాలకులను వంచన చేస్తున్నారని ఆరోపించారు. మరుగుదొడ్లు లేకుండా ఉన్న పాఠశాలలు, అధికంగా డొనేషన్లు వసూలు చేస్తున్న, ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహిస్తున్న, అనుమతి లేకుండా నిర్వహిస్తున్న పాఠశాలలను, వేసవి శిబిరాలు, కోచింగ్, వసతి పాఠశాలలను నడిపిస్తున్న వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. దళితుల ఆశాజ్యోతి అంబేడ్కర్ రాయచూరు రూరల్ : సమాజంలో బడుగు, బలహీన, దళిత వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు అభిప్రాయ పడ్డారు. మంగళవారం మాన్వి తాలూకా జాగీర్ పన్నూరులో 133వ జయంతిని ప్రారంభించి మాట్లాడారు. బడుగు, బలహీన, దళితుల ఆశాజ్యోతి అని, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం జీవితాంతం పోరాటం చేసిన మహా యోధుడని, ప్రపంచ మేధావుల్లో ఒకరని, ఆశయ సాధనకు అందరం కృషి చేద్దామన్నారు. సమావేశంలో మాన్వి శాసన సభ్యుడు హంపయ్య నాయక్, శరణయ్య, శాంతప్ప, జయన్న, బాలస్వామి, రుద్రప్ప, సుభాష్‌లున్నారు. దాస సాహిత్యం సేవలు అద్వితీయం రాయచూరు రూరల్: సాహిత్య రంగానికి ప్రతి రూపం దాస సాహిత్యం అని ప్రధానోపాధ్యాయుడు మురళీధర్ కులకర్ణి పేర్కొన్నారు. మంగళవారం నందిని బీఈడీ కళాశాల ఆవరణలో తాలూకా కన్నడ సాహిత్య పరిషత్, కళాశాల ఆధ్వర్యంలో దత్తి ఉపన్యాస కార్యక్రమంలో మాట్లాడారు. కన్నడ సాహిత్యం ద్వారా కేవలం కన్నడ భాష, భూమి, నీటి కోసం ప్రయత్నిస్తే దాస సాహిత్యం మను ధర్మం, అన్యాయం, దౌర్జన్యం, అవినీతి, అసమానత, కుల మత భేదాలు లేకుండా మనమంతా ఒక్కటే అనే భావాన్ని పెంపొందించిందన్నారు. 64 మంది దాసులు సేవలు అందించారన్నారు. కార్యక్రమంలో కసాప అధ్యక్షుడు వెంకటేష్, ప్రిన్సిపాల్ అలీషా జోసెఫ్, వెంకటరావ్, వసుదేంద్ర, రావుత్ రావ్, విజయ రాజేంద్రలున్నారు. రూ.14 లక్షల బంగారు నగలు స్వాధీనం యశవంతపుర: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు కటకట్టాల్లోకి నెట్టారు. బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద మంగళవారం వివరాలు వెల్లడించారు. బొమ్మనహళ్లి జేబిపాళ్యలో చోరీకి పాల్పడిన డీజెహళ్లికి చెందిన శబ్రీన్ తాజ్, రామయ్య లేఔట్‌కు చెందిన నీలోఫర్(22)ను అరెస్ట్ చేసి రూ.11లక్షల విలువైన 130 గ్రాముల బంగారం, ఆటో స్వాధీనం చేసుకున్నారు. మైక్రోలేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో రెండు ఇళ్లలో జరిగిన చోరీలకు సంబంధించి బేగూరు పటేల్ లేఔట్‌కు చెందిన రాజుదాస్(39), పశ్చిమ బెంగాల్‌కు చెందిన బేగూరు జేబన్ సర్కార్(29)ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువైన 30 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. -
వడగళ్ల వానలు.. రాలిన పంటలు
రాయచూరు రూరల్: జిల్లాలో సోమవారం సాయంత్రం వడగళ్ల వానలు కురిశాయి. దేవదుర్గ, సిరవార, మస్కి, మాన్వి, లింగసూగూరు, రాయచూరు తాలూకా ఇడపనూరు, తలమారి, బూడిదపాడు, ఆత్కూరు, సంగంకుంటలో వానలు కురిశాయి. 150 మామిడి చెట్లకు ఉన్న మామిడి కాయలు, పిందలు రాలిపోయి పంటలు దెబ్బ తిన్నాయి. మామిడి పంట దెబ్బ తినడంతో ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని రైతులు కోరారు. గత మూడు రోజుల నుంచి పంట నష్టం అంచనా వేయడానికి ఏ ఒక్క అధికారి రాలేదని రైతు శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బీదర్ జిల్లాలో.. హుబ్లీ: బీదర్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. దీంతో భారీ వృక్షం నేలకూలడంతో ట్రాఫిక్‌కు తీవ్రంగా ఇబ్బంది కలిగిన ఘటన ఔరాద్ తాలూకా జోజన గ్రామం వద్ద చోటు చేసుకుంది. అకాల వర్షాలతో కొన్ని చెట్లు కూలి రోడ్డుపై అడ్డంగా పటడంతో సంతపూర్ నుంచి జోజన గ్రామం మధ్య ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో అల్లాడి పోయిన జిల్లా ప్రజలకు ఈ వర్షం కొంత సాంత్వన కలిగించింది. ఔరాద్, బీదర్, బసవకళ్యాణ, భాల్కి, కమలానగర తదితర చోట్ల భారీ వర్షాలు కురవడంతో ప్రజలు, ముఖ్యంగా రైతన్నలు హర్షం వ్యక్తం చేశారు. నష్టాల బాటలో ఉద్యాన రైతులు పరిహారం కోసం ఎదురుచూపులు -
సెల్‌ఫోన్ చూడొద్దంటావా?
కర్ణాటక: మొబైల్ ఫోన్ ఎక్కువ వాడొద్దని చెప్పిన భర్తపై భార్య కత్తితో దాడిచేసింది. ఈ ఘటన విజయపురలోని హాలకుంటె నగరంలో చోటు చేసుకుంది. గ్రామంలో అజిత్ రాథోడ్, తేజు రాథోడ్ దంపతులు నివాసం ఉంటున్నారు. తేజు రాథోడ్ నిత్యం సెల్‌ఫోన్ చూస్తుండేది. గమనించిన భర్త మందలించాడు. దీంతో అతనిపై కోపం పెంచుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో భర్త గాఢ నిద్రలో ఉండగా మెడ భాగంలో కత్తితో దాడి చేసింది. బాధితుడి కేకలు విన్న కుటుంబ సభ్యులు ఆయన్ను బీఎల్‌డీఈ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆదర్శనగర్ పోలీసులు తేజు రాథోడ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. చోరీ సొత్తు అప్పగింత రాయచూరు రూరల్: ఆటోలో మరచిపోయిన నగలను పోలసులు రికవరీ చేసి సొంతదారులకు అప్పగించారు. శక్తినగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 22 న బస్టాండ్ నుంచి తీన్‌కందిల్ వరకు ఓ మహిళ అటోలో ప్రయాణించిన సమయంలో సంచి మరచిపోయింది. అందులో బంగారు నగలు ఉన్నాయి. దీంతో బాధితురాలు సదర బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టి ఆటోను గుర్తించి రూ.2 లక్షల విలువ చేసే బంగారు, వెండి నగలను రికవరీ చేశారు. ఆ సొత్తును ఎస్పీ సొంతదారుకు అప్పగించారు. డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, ఎస్ఐ నరమమ్మ పాల్గొన్నారు. -
రూ.15 వేల కోసం మహిళ హత్య
యశవంతపుర(కర్ణాటక): కొందరు పెడదారి పడుతూ పిల్లలను కూడా పాడు చేస్తున్నారు. తీసుకున్న అప్పును ఎగ్గొట్టడం కోసం ఏకంగా ఓ మహిళను హత్య చేసింది మరో మహిళ. ఇందుకు కొడుకు, కూతురు సహకారం కూడా తీసుకుంది. ఫలితంగా ముగ్గురూ కటకటాలు లెక్కిస్తున్నారు. ఈ దారుణం బెళగావి నగరంలో చోటుచేసుకుంది. దృశ్యం తరహాలో వివరాలు.. బెళగావి నగరంలోని లక్ష్మీనగరలో ఓ అపార్ట్మెంట్లో ఈ నెల 21న రాత్రి అంజనా దడ్డీకర్ (49) అనే మహిళను గొంతు పిసికి హత్య చేశారు. మంగళసూత్రం, బంగారు నగలను కూడా హంతకులు ఎత్తుకెళ్లారు. అంజన కూతురు అక్షత ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన క్యాంప్ ఏరియా పోలీసులు జ్యోతి బాందేకర్, ఆమె కూతురు సుహాని (19), మైనర్ కొడుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించారు. దృశ్యం సినిమాలో మాదిరిగా నిందితులు కుట్ర పన్నారు. హత్య జరిగిన రోజున తాము ఊళ్లోనే లేమని పోలీసులతో బుకాయించారు. అయితే ఫోన్ కాల్స్, సీసీ కెమెరా దృశ్యాలు, వేలిముద్రలతో నేరం బయటపడింది. తలపై బాది.. అంజనా దడ్డీకర్, జ్యోతి స్నేహితులు. ఆమె నుంచి జ్యోతి రూ.15 వేలు అప్పు తీసుకుంది. డబ్బులు వాపస్ ఇవ్వాలని అంజనా అడుగుతోంది. డబ్బు ఇవ్వడం ఇష్టం లేని జ్యోతి, కూతురు హత్యకు కుట్ర పన్నారు. కొడుకుతో కలిసి ఆ రోజు ఆమె ఫ్లాటుకు వెళ్లారు. ఆమెతో మాట్లాడుతూ తలపై బాది, గొంతు పిసికి చంపి మంగళసూత్రం, దొరికిన బంగారు నగలతో ఉడాయించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు బంగారు నగలు, బైక్, మొబైల్ఫోన్లు తదితరాలను స్వాధీనం చేసుకున్నారు. -
తాగునీటి కోసం నిరసన
రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు, మంత్రులు ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా స్పందించక పోవడాన్ని సీఐటీయూ ఖండించింది. సోమవారం యాపలదిన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలు, గ్రామస్థులు ఖాళీబిందెలతో నిరసన వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం తాగునీటిని వదిలిన తర్వాత ఇంతవరకు మళ్లీ వదలక పోవడంతో అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్నికల నిబంధనలను రాజకీయ నాయకులు ఉల్లంఘించరాదనే నెపంతో అధికారులు తాగునీరు అందించడంలో నిర్లక్ష్యం వహించడాన్ని ఖండిస్తూ సీఐటీయూ సంచాలకుడు వీరేష్ అధికారికి వినతిపత్రం సమర్పించారు. యువకుడి ఆత్మహత్య హుబ్లీ: ఓ యువకుడు దేవరగుడిహాళ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై వంతెన పైనుంచి పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇక్కడి హెగ్గేరి జగదీశ్ నగర్ నివాసి అవినాష్ మోదీ (21) ఆత్మహత్య చేసుకున్న యువకుడు. ఆత్మహత్యకు ప్రేమ వైఫల్యమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా ఘటన స్థలానికి పాత హుబ్లీ పోలీసులు వెళ్లి పరిశీలించి మృతదేహాన్ని స్వాధీనపరచుకుని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గోవుల తరలింపు వాహనం పట్టివేత హుబ్లీ: ధార్వాడ వద్ద జాతీయ రహదారిలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని శ్రీరామ సేన చీఫ్ ప్రమోద్ ముతాలిక్ అడ్డుకొని పోలీసులకు అప్పగించారు. ధార్వాడ గరగ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్రమ గోవుల రవాణా ఎక్కువైన నేపథ్యంలో ఈ దాడి జరిగింది. రికార్డులను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రమోద్ ముతాలిక్ పోలీసులను డిమాండ్ చేశారు. స్థానికులు, శ్రీరామసేన కార్యకర్తలు సదరు రహదారిలో గోవులను అక్రమంగా తరలిస్తుండగా సదరు వాహనాన్ని అడ్డుకొని పరిశీలించారు. సరైన దాఖలు లేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. వీధి కుక్కల దాడిలో ఆవు దూడ మృతిహొసపేటె: గంగావతి నగరంలోని జయనగర్ ప్రాంతంలో 8 నెలల వయస్సు కలిగిన ఆవు దూడను వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. వీధిలో ఉన్న ఆవులు, దూడలపై వీధి కుక్కలు గుంపుగా దాడి చేశాయి. ఇందులో 8 నెలల వయస్సు ఉన్న ఆవు దూడ గాయపడి చనిపోయింది. కాగా జయనగర, సత్యనారాయణ పేట, సిద్దికేరి, సిద్దాపుర వీధి సహా వివిధ ప్రాంతాల్లో వీధి కుక్కలు విపరీతంగా సంచరిస్తున్నాయి. అవి పిల్లలపై దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వీధి కుక్కలను నియంత్రించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నా నగరసభ కౌన్సిలర్లు తగిన చర్యలు తీసుకోవడం లేదని నగర ప్రజలు ఆరోపించారు. నాటి అనుభవ మంటపమే నేటి పార్లమెంట్రాయచూరు రూరల్: 12వ శతాబ్దంలో శరణుల సమయంలో ఉన్న నాటి అనుభవ మంటపం ఆధారంగానే నేడు పార్లమెంట్ నడుస్తోందని పత్రికా సంపాదకుడు అంబన్న పేర్కొన్నారు. ఆదివారం రాత్రి నగరంలోని మారతి నగర్లో అభయఅంజినేయ్యస్వా మి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. సాహిత్య రంగంలో ఉన్న వచనాలు, దాస సాహిత్యాలు మనందరినీ నడిపించే బాటలో ఉన్నామన్నారు. అనుభవ మంటపంలో శూన్య సింహాసనంలో అల్లమప్రభు దేవుని అధ్యక్షతన బసవేశ్వరుడి మార్గదర్శనంలో వచనాలు వివరించారు. సమాజంలో మౌఢ్యాలను, కట్టుబాట్లను, కందాచారాలను విమర్శించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హొన్నూరప్ప, షణ్మకప్ప, బసవరాజ్, మల్లికార్జున, శ్రీనివాస్, పూర్ణిమ, శివప్పలున్నారు. -
పర్యాటకులపై ఉగ్రదాడికి ఖండన
కోలారు: కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై కాల్పులు జరిపి 26 మందిని హత్య చేయడాన్ని ఖండిస్తూ సోమవారం న్యాయవాదులు విధులను బహిష్కరించి, ఎర్ర బ్యాడ్జీలు ధరించి కోర్టు ప్రాంగణం నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీకి ముందు ఘటనలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మునేగౌడ మాట్లాడుతూ శాంతిప్రియులైన భారతీయులపై ఉగ్రవాదులు జరిపిన దాడి ఖండనీయమన్నారు. ఉగ్రవాదులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం కశ్మీర్లో 370 ఆర్టికల్‌ను తొలగించి కశ్మీర్ భారతదేశ అవిభాజ్య అంగమని తెలియజేసిందన్నారు. ర్యాలీలో కార్యదర్శి భైరారెడ్డి, ఉపాధ్యక్షుడు రవీంద్రబాబు, కోశాధికారి నవీన్, కె వి శంకరప్ప, బిసప్పగౌడ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదుల బైక్ ర్యాలీ ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన -
కులాల మధ్య చిచ్చుపై పోరాడదాం
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వానికి వెనుక బడిన వర్గాల జనాభాపై నివేదించిన నివేదికల్లో వీరశైవ లింగాయతుల జనాభా గణాంకాలను తగ్గించి కులాల విభజనకు యత్నించడాన్ని ఎలెబిచ్చాలి, మటమారి మఠాధిపతి వీరభద్ర శివాచార్యులు తప్పుబట్టారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళన, జిల్లా వీరశైవ సమాజం చేపట్టిన పాదయాత్ర, విశ్వగర్జన సభలో ఆయన మాట్లాడారు. గతంలో 27 శాతంగా ఉన్న జనాభాను కేవలం 11 శాతం మాత్రమే వీరశైవ లింగాయతులు ఉన్నట్లు నివేదికలో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో కులగణన పేరుతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పదవిని కాపాడుకోవడానికి కుట్ర చేశారన్నారు. రాజకీయ లబ్ధి కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తోడు పదవిని రక్షించుకోవడానికి నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. కులగణనలో సరైన గణాంకాలు లేవన్నారు. తప్పుల తడకగా నివేదిక అందించారన్నారు. ఏనాడూ ఏ అధికారి కూడా కులగణన సమీక్షకు హాజరు కాలేదన్నారు. కాంతరాజ్ నివేదికను ఉపసంహరించుకోవాలని కోరుతూ జిల్లాధికారి నితీష్‌కు వినతిపత్రం సమర్పించారు. ర్యాలీలో కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు, అభినవ రాచోటి శివాచార్యులు, బూది బసవ శివాచార్యులు, పంచాక్షరి, గురుమూర్తి, మహాలింగ, విరుపాక్ష పండితారాధ్య, వీర సంగమేశ్వర, శంభు సోమనాథ, శంభులింగ, పంపాపతి, కేంద్ర మాజీ మంత్రి బసవరాజ పాటిల్ అన్వరి, శాసన సభ్యులు బసనగౌడ, శివరాజ్ పాటిల్, శఽరణేగౌడ, అధ్యక్షుడు శరణు భూపాల్ నాడగౌడ, వెంకట్రావ్ నాడగౌడ, బసన గౌడ, చంద్రశేఖర్, షణ్ముకప్ప, వీరభద్ర, మల్లికార్జున, విజయ్ కుమార్‌లున్నారు. కాంతరాజ్ నివేదికను తిరస్కరించాలి విశ్వగర్జన సభలో వీరశైవుల పిలుపు -
మెట్రో రైలులో భోజనం.. రూ.500 జరిమానా
దొడ్డబళ్లాపురం: నమ్మ మెట్రో ట్రైన్లో భోజనం తిన్నందుకు మహిళ రూ.500 జరిమానా కట్టాల్సి వచ్చింది. మెట్రో నిబంధనల్లో పేర్కొనని ఆహారం తీసుకోవడం నిషిద్ధమని, జరిమానా వర్తిస్తుందని ,మెట్రో తెలిపింది. ఇందుకు విరుద్ధంగా మెట్రోలో భోజనం చేసిన ఒక మహిళకు రూ.500 జరిమానా విధించినట్టు పేర్కొంది. మాదావర మెట్రో స్టేషన్ నుంచి మాగడి రోడ్డు మెట్రో స్టేషన్ వరకూ ప్రయాణించిన మహిళ మెట్రోలో క్యారియర్తీసి భోజనం ఆరగించింది. ఇది గుర్తించి జరిమానా వేశారు. రైలులో చిన్న చిన్న స్నాక్స్ తప్పించి టిఫిన్లు, భోజనాలు వంటివి చేయరాదని, అలాగే గుట్కా, సిగరెట్ వంటివి సేవించరాదని తెలిపారు.భార్యా హంతకునికి జీవితఖైదు మైసూరు: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్తకు జీవిత ఖైదును విధిస్తూ మైసూరు 5వ అదనపు జిల్లా కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. పిరియా పట్టణ తాలూకాలోని భూదితిట్టు గ్రామానికి చెందిన స్వామినాయక నిందితుడు. సౌమ్యా అనే యువతిని స్వామినాయక్ 7 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆరేళ్లపాటు ఇల్లరికం ఉన్నాడు, ఏడాది కిందట తన ఊరికి వచ్చి అద్దె ఇంటిలో కాపురం పెట్టాడు. భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకుని తరచూ గొడవపడేవాడు. 2022 ఆగస్టులో అతని అత్త మహాదేవి కుమార్తె– అల్లుని ఇంటికి వచ్చింది. గొడవ పడవద్దని బుద్ధిమాటలు చెప్పి వెళ్లింది. మరుసటి రోజునే స్వామినాయక భార్యను తీవ్రంగా కొట్టి దిండుతో ఊపిరాడకుండా చేసి చంపాడు. పిరియా పట్టణ పోలీసులు నిందితున్ని అరెస్టు చేశారు. మైసూరు కోర్టులో కేసు సాగుతోంది. నేరం రుజువు కావడంతో గురురాజ్ ఈ మేరకు తీర్పు చెప్పారు. వాలీబాల్ ఆటగాడు.. వల వేయడమే పని ● బెళ్తంగడిలో అకృత్యాలు యశవంతపుర: వాలీబాల్ నేర్పే నేపంతో విద్యార్థినులను లోబర్చుకుని లైంగిక అకృత్యాలకు పాల్పడుతున్న కామాంధుడు ఎట్టకేలకు కటకటాల పాలయ్యాడు. దక్షిణకన్నడ జిల్లా కార్కళకు చెందిన సయ్యద్ నిందితుడు. బెళ్తంగడిలోని ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. వాలీబాల్ ఆటగాడు కావడంతో విద్యార్థినులకు శిక్షణ పేరుతో వలలో వేసుకుని సన్నిహితంగా మెలిగేవాడు. అలా పెద్దసంఖ్యలో బాలికలను, యువతులను లోబర్చుకుని ఆ ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. వాటిని అడ్డుపెట్టుకుని మరింతగా వేధించేవాడు. తనకు లొంగని అమ్మాయిలకు అశ్లీల చిత్రాలను పంపేవాడు. కొన్ని వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది బెళ్తంగడిలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో హిందూసంఘాల కార్యకర్తలు సయ్యద్‌ను పట్టుకుని మందలించారు. అతని మొబైల్‌ను తీసుకుని పరిశీలించగా వందల వీడియోలు, ఫోటోలు బయటపడడంతో అలజడి రేగింది. అతనికి దేహశుద్ధి చేసి బెళ్తంగడి పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. తాళి, జంధ్యంతోనే పరీక్షకు శివాజీనగర: రైల్వే నియామక మండలిలో నర్సింగ్ సూపరింటెండెంట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల మంగళసూత్రం, జంధ్యంలను తొలగించరాదని రైల్వే శాఖ సహాయమంత్రి వీ.సోమణ్ణ అధికారులకు సూచించారు. ఈ నెల 28, 29, 30 తేదీల్లో రైల్వే శాఖ నర్సింగ్ సూపర్డెంట్ ఉద్యోగానికి పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల సీఈటీ పరీక్షల్లో జంధ్యం తీసివేయించడంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నారు. -
హుబ్లీలో మత్తు ముప్పు.. పోలీసుల పైఎత్తు
హుబ్లీ: మత్తు పదార్థాలు లేని జంట నగరాలుగా హుబ్లీ ధార్వాడలను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో గత 9 నెలలుగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ ఫలితంగా జంట నగరాల్లో డ్రగ్స్ పెడ్లర్ల సంఖ్య తగ్గింది. అయితే నిరంతరం కార్యాచరణ చేపట్టి తగిన జాగృతి కల్పించినా ఇప్పటి వరకు జంట నగరాలను మత్తు పదార్థాల రహితంగా తీర్చిదిద్దడానికి సాధ్యం కావడం లేదు. జంట నగరాల్లో 2025లో నిర్వహించిన ప్రత్యేక కార్యాచరణలో క్రియాశీలకంగా ఉన్న 45 మంది డ్రగ్స్ పెడ్లర్ల గుట్టు రట్టు చేసి వారికి వ్యతిరేకంగా కఠినమైన కేసులు నమోదు చేసి చర్యలు తీసుకున్నారు. గతంలో 2023లో 100 మందికి పైగా పెడ్లర్లు, 2024లో 150 మందికి పైగా పెడ్లర్లు క్రియాశీలకంగా ఉన్నట్లు పోలీసుల రికార్డులు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు పెడ్లర్ల సంఖ్య తగ్గుముఖం పట్టిన జంట నగరాల్లో గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలు యఽథేచ్చగా వాడకం జరిగిపోతుందని జంట నగరాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో డ్రగ్స్ ముఠా అంతు చూడటానికి సంకల్పం చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హత్యాచారం తర్వాత పెరిగిన డిమాండ్ ఇటీవల హుబ్లీలో 5 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసు తర్వాత ఇలాంటి డిమాండ్ స్థానికుల నుంచి గట్టిగా వినబడుతోంది. అదే విధంగా డ్రగ్స్ ముఠాను కూకటి వేళ్లతో పెకలించక పోతే జంట నగరాల్లో నేరాల కృత్యాలు జరుగుతూనే ఉంటాయి. దీంతో డ్రగ్స్ విక్రయదారుల పీచం అణచాలని ప్రజాప్రతినిధులు కూడా చిన్నారి హత్యాచారం తర్వాత డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి చర్చిస్తామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా జంట నగరాల పోలీస్ కమిషనర్‌గా శశికుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్‌కు విరుద్దంగా ప్రత్యేక కార్యాచరణతో పాటు సినీనటులు ఉపేంద్ర, శివరాజ్ కుమార్ సారథ్యంలో జాగృతి అభియాన్ చేపట్టారు. స్వయాన పోలీస్ కమిషనర్ నేతృత్వంలో 9 నెలల గడువులో నిర్వహించిన 5 ప్రత్యేక కార్యాచరణల్లో 1000 మందికి పైగా వినియోగదారులను గుర్తించారు. అంతేగాక వారికి వ్యతిరేకంగా 200లకు పైగా కేసులు దాఖలు చేసి తగిన చర్యలు తీసుకున్నారు. 505 మంది కస్టమర్లకు వైద్య పరీక్షలు తొలి కార్యాచరణలో 65 శాతం వినియోగదారుల ఆచూకీని గుర్తించారు. అనంతరం జరిగిన డ్రగ్స్‌లో 20 నుంచి 25 శాతం వినియోగదారులను గుర్తించారు. అదే విధంగా నిర్ధిష్టంగా పెడ్లర్ల నుంచి సేకరించిన సమాచారం మేరకు 505 మంది వినియోగదారులను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వీరిలో 197 మంది డ్రగ్స్ వాడుతున్నట్లుగా తేలింది. వీరికి వ్యతిరేకంగా 46 కేసులు దాఖలు చేసి చర్యలు కూడా చేపట్టారు. ఇలా వివిధ రకాలుగా కఠిన చర్యలు చేపట్టిన నేపథ్యంలోను వినియోగదారుల సంఖ్య యథావిధంగా కొనసాగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. ఇది పోలీస్ వర్గాల్లో తీరని అసంతృప్తికి, తలనొప్పికి దారి తీస్తోంది. ఉక్కుపాదంతో డ్రగ్స్ వినియోగదారులు, విక్రేతలపై డేగకళ్ల పహరాతో పోలీస్ శాఖ సదా అప్రమత్తతతో మెలుగుతోంది. అయితే డ్రగ్స్ ముఠాను వెంటాడి కూకటివేళ్లతో పెకలించడానికి సాధ్యం కావడం లేదు. దీంతో సులభంగానే గంజాయి ఎండీఎంఏ తదితర రకరకాల మత్తు పదార్థాల రవాణా సాగుతోంది. 9 నెలల పాటు ప్రత్యేక కార్యాచరణ తగ్గుముఖం పట్టిన పెడ్లర్ల సంఖ్య అయినా నిర్మూలన కాని డ్రగ్స్ ముఠా మరింత పటిష్ట కార్యాచరణకు పిలుపు దీంతో దీన్ని అరికట్టే దిశలో పోలీస్ శాఖ మరింత పటిష్ట కార్యాచరణ పథకానికి సన్నద్ధం కావాలని స్థానికులు ముక్తకంఠంతో కోరుతున్నారు. నగర డీసీపీ మహాలింగ నందగావి స్పందిస్తూ ప్రత్యేక కార్యాచరణ ఫలితంగా డ్రగ్స్ విక్రేత సంఖ్య తగ్గుముఖం పట్టినందున వాడకందారుల సంఖ్య కూడా తగ్గింది. డ్రగ్స్ పెడ్లర్ల ముఠా ఆచూకీకి వివిధ కోణాలలో పని చేస్తున్నాం. ఆ విధంగా డ్రగ్స్ లేని జంట నగరాలుగా హుబ్లీ ధార్వాడలను తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ అవిరళ కృషి చేస్తోందన్నారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా జరిగిన 5 ప్రత్యేక కార్యాచరణల్లో 20 నుంచి 35 ఏళ్ల యువకులే డ్రగ్స్ వాడుతుండటం ఎక్కువగా కనిపిస్తోంది. వీరిలో విద్యార్థులు కూడా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో కుటుంబ సమక్షంలో మానసిక వైద్య నిపుణులతో కౌన్సిలింగ్ నిర్వహించి మత్తు పదార్థాల వాడకం నుంచి విముక్తి కల్పించే ప్రయత్నాలు జంట నగరాల కమిషనరేట్ నిరంతరంగా చేపడుతోంది. వీరిలో పలువురు వాడకం దారులు వాటి నుంచి విముక్తులు అయినట్లుగా కూడా తెలుస్తోంది. ఇది కాస్తంత ఊరటను ఇచ్చే విషయమే. -
పహల్గాం దాడిపై నిరసన
హొసపేటె: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ ఏబీవీపీ సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. నగరంలోని శంకర్ ఆనంద్‌సింగ్ కళాశాల నుంచి పునీత్ రాజ్‌కుమార్ సర్కిల్ వరకు వందలాది మంది విద్యార్థులు నిరసన తెలిపారు. ఆ తర్వాత వారు అప్పు సర్కిల్ వద్ద మానవహారంగా ఏర్పడి ఉగ్రవాద దాడిని ఖండించారు. అనంతరం ఏబీవీపీ నిరసన తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంది. తీవ్రవాదుల కాల్పులు జరపడం ఖండనీయం. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదులు ఎప్పుడూ ముందుకు వచ్చి పోరాడలేదు. వారు వెనుక నుంచి వచ్చి దొడ్డిదారిన ప్రజలను చంపుతున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే ఈ విషయమై దాయాది దేశానికి చాలా ఘాటుగా దౌత్యపరమైన ప్రతిస్పందనను ఇచ్చారన్నారు. పహల్గాం మృతులకు ఘన నివాళిహుబ్లీ: పహల్గాంలో ఉగ్రవాదుల ఉన్మాద చర్యకు మృతులైన 26 మంది పర్యాటకుల ఆత్మశాంతిని కోరుతూ దాజిబానపేట శ్రీతుళజా భవాని దేవస్థానంలో కొవ్వొత్తులను వెలిగించి ఘనంగా నివాళి అర్పించారు. ఎస్ఎస్కే సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ వారికి తగిన గుణపాఠం నేర్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సమాజ ప్రముఖులు మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడి అమానుషం అన్నారు. ఉగ్రవాదం భారతీయులను ఎన్నటికీ భయపెట్టలేదన్నారు. ఇలాంటి దాడులకు పాల్పడే దుష్టులకు వ్యతిరేకంగా పోరాడే ఉక్కు సంకల్పం భారతీయులకు ఉందన్నారు. కార్యక్రమంలో ప్రముఖులు అశోక్ కాట్వే, విఠల లద్వా, నాగేష్ కలబుర్గి, హనుమంత, నిరంజన, నారాయణ జరా తరగర, వెంకటేష్ కాట్వే, ప్రకాష్ బురబురే, సంజయ్, రాజు, మిథున్ చవాన్ తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ -
కశ్మీర్ ఉగ్రవాదులు ఏమైనా మాట్లాడారా?
బనశంకరి: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బెంగళూరువాసి భరత్ భూషణ్ ఇంటికి సోమవారం ఎన్ఐఏ అధికారులు వచ్చారు. దాడికి ప్రత్యక్ష సాక్షి అయిన ఆయన సతీమణి సుజాత, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నగరంలోని మత్తికెరెలోని ఇంటికి వెళ్లి కశ్మీర్ దాడి గురించి సమాచారం తీసుకున్నారు. కొందరు ఉగ్రవాదుల ఫోటోలను చూపించి వివరాలు అడిగారు. ఏ ట్రావెల్ ఏజెన్సీ నుంచి కశ్మీర్ టూర్‌ని బుక్ చేసుకున్నారు అని తెలుసుకున్నారు. కశ్మీరులో ఎక్కడ ఉన్నారు, ఎంత సమయానికి పహల్గాంకి వెళ్లారు, ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు, ఏ భాష మాట్లాడారు అనే సమాచారాన్ని సేకరించారు. సుమారు 12 గంటల పాటు భరత్‌భూషణ్ నివాసంలోనే ఎన్ఐఏ అధికారులు ఉండడం గమనార్హం. ఉగ్రవాదులు చంపేముందు భరత్‌భూషణ్‌తో ఏమైనా మాట్లాడారా, మీతో ఏమైనా మాట్లాడారా, హంతకుల ముఖ కవలికలు గుర్తు ఉన్నాయా, ముఖాలు ఎలా ఉన్నాయి, ముఖాలపై ఏవైనా గుర్తులు ఉన్నాయా అని సుజాతను ప్రశ్నలు అడిగారు. సుమారు 14 మందికి పైగా అనుమానితులు ఫోటోలను చూపించి వీరిలో ఆ టెర్రరిస్టులు ఎవరైనా ఉన్నారా అనేది అడిగారు. అన్నింటినీ ల్యాప్‌టాప్, పుస్తకాలలో నమోదు చేసుకున్నారు. శివమొగ్గలోని మంజునాథరావ్ ఇంటికి వెళ్లి ఇదే మాదిరి విచారణ చేయనున్నారు. భరత్‌భూషణ్ ఇంటికి ఎన్ఐఏ అధికారులు భార్య సుజాత నుంచి సమాచార సేకరణ -
బాలుని కుటుంబానికి పరామర్శ
హొసపేటె: కొప్పళ జిల్లా స్టేడియంలోని ఈత కొలనులో ఇటీవల మరణించిన బాలుడి ఇంటికి సోమవారం జిల్లా కలెక్టర్ నళిన్ అతుల్ వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొప్పళ తాలూకా ఇంద్రగి గ్రామానికి చెందిన రామప్ప ఎలెగార్ కుమారుడు ఇంద్రేష్(17) తన స్నేహితులతో కలిసి కొప్పళ జిల్లా స్టేడియంకు వెళ్లి స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతుండగా మునిగిపోయాడు. యువజన సాధికార, క్రీడా శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విఠల జబాగౌడర్, మృతుడి తండ్రి రామప్ప ఎలెగార్, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. స్థల వివాదంతో వ్యక్తి హత్య హుబ్లీ: స్థలం వివాదం నేపథ్యంలో ఓ వ్యక్తిని చాకుతో పొడిచి చంపిన ఘటన ధార్వాడ తాలూకా అమ్మినబావిలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన పరశప్ప శంక్రప్ప హాదిమని(56) హతుడు. అదే గ్రామానికి చెందిన ద్యామప్ప కాళప్ప బడిగేరను నిందితుడిగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి పక్కన స్థలం గురించి ఆదివారం రాత్రి జరిగిన గొడవ వికోపానికి దారి తీయడంతో నిందితుడు ద్యామప్ప చాకుతో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పరశప్పను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. నిందితుడు ద్యామప్ప పరారయ్యాడు. ఘటన స్థలానికి జిల్లా ఎస్పీ డాక్టర్ గోపాల బ్యాకోడ, డీఎస్పీ నాగరాజ్ వెళ్లి పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్టు చేపట్టినట్లు ధార్వాడ గ్రామీణ పోలీసు స్టేషన్ సీఐ ఎస్ఎస్ కమతగి తెలిపారు. మసీదుల్లో ఇమాంలను తొలగించండి రాయచూరు రూరల్: నగరంలోని మసీదుల్లో అక్రమాలకు పాల్పడుతున్న ఇమాంలను తొలగించాలిని సామాజిక కార్యకర్త ఖాజావలి డిమాండ్ చేశారు. సోమవారం వక్ఫ్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. లోహరవాడిలో ఉన్న మజీద్ ఏ బీబీ హలీమా ఇమాంలు ముబుల్లిగ్, జాఫర్ ఖాన్‌లను తొలగించాలన్నారు. ఇమాంలు ముబుల్లిగ్, జాఫర్ ఖాన్లు మసీదులో ఉన్న సమాధులను తొలగించారని, ఇష్టమొచ్చినట్లు మసీదు కార్యకలాపాలను నిర్వహిస్తూ అసభ్యంగా ప్రవర్తించే వారిపై చర్యలు చేపట్టి వారిని తొలగించాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు వక్ఫ్ అధికారి ద్వారా వినతిపత్రం సమర్పించారు. హైకోర్టు పీఠంలో ప్రత్యేక లోక్ అదాలత్ హుబ్లీ: ధార్వాడ హైకోర్టు పీఠంలో సీనియర్ న్యాయమూర్తి ఎస్జీ పండిట్ నేతృత్వంలో ప్రత్యేక లోక్ అదాలత్ చేపట్టారు. న్యాయమూర్తి ఈఎస్ ఇంద్రేష్, సీ.శ్రీషానంద, సీఎం పూణచ్చ, బీ.బసవరాజ, ఉమేష్ ఎం అడిగ, సభ్యులు గోపాల్ బీ. పాటిల్, సాజిదా గుడదాళ, రాకేష్ బిల్వా, వీపీ వడవి, శ్రీలక్ష్మి పూర్లి, శైల బెళ్లికట్టి నేతృత్వంలో మొత్తం 6 పీఠాలు ఏర్పాటు చేశారు. లోక్ అదాలత్‌లో ప్రమాద పరిహార కేసులతో పాటు ప్రత్యేకించి చెక్ బౌన్స్ కేసులు, 43 రిట్ పిటిషన్లు, సివిల్ రెండు, 5 రిట్ అర్జీలు, గత కొన్నేళ్లుగా పరిష్కారం కాని కేసులను పరిష్కరించారు. అదాలత్‌లో మొత్తం 1274 కేసులను విచారించి 173 కేసులను పరిష్కరించినట్లు హైకోర్టు న్యాయసేవా సమితి ధార్వాడ పీఠం కార్యదర్శి, అదనపు ప్రాసిక్యూటర్ జెరాల్డ్ రుడాల్ఫ్ మెండోన్స ఓ ప్రకటనలో తెలిపారు. మలేరియా నిర్మూలన జాగృతి జాతాకు శ్రీకారంరాయచూరు రూరల్: జిల్లాలో మలేరియా వ్యాధి నిర్మూలనకు సహకరించాలని జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారి సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. ఆయన సోమవారం జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ అధికారి కార్యాలయం ఆవరణలో ప్రపంచ మలేరియా దినోత్సవ జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మలేరియా వ్యాధి వ్యాప్తి, పరిణామాల గురించి అవగాహన పెంచుకుని నియంత్రణకు ముందుకు రావాలన్నారు. అభివృద్ధి పనుల పరిశీలన కోలారు : నగరంలో రూ.75 లక్షల వ్యయంతో నిర్వహిస్తున్న కోలారమ్మ దేవి ఆలయ రోడ్డు అభివృద్ధి పనులను జిల్లాధికారి డాక్టర్ ఎంఆర్ రవి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వారం రోజుల్లోగా రోడ్డు అభివృద్ధి పనులను నాణ్యతగా పూర్తి చేయాలని నగరసభ అధికారులకు సూచించారు. కోలారమ్మ దేవాలయం ముందు ఎలాంటి కుల భేదం లేకుండా ప్రతి ఒక్కరూ దేవాలయంలోకి ప్రవేశించవచ్చనే నామఫలకం వేయించాలన్నారు. కోలారమ్మ దేవాలయ ప్రాంగణంలో స్వచ్చతను కాపాడాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని సౌకర్యాలను అందించాలన్నారు. నగరసభ కమిషనర్ ప్రసాద్, దేవదాయ శాఖ తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
మే 5 నుంచి సర్వే ప్రక్రియ షురూ
రాయచూరు రూరల్: మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో సామాజిక న్యాయం ప్రకారం మాదిగ సముదాయాలకు 8 శాతం రిజర్వేషన్ కల్పించాలని మాదిగ ఐక్యత సంచాలకుడు రాజు డిమాండ్ చేశారు. సోమవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ వర్గీకరణ చేసే దిశలో సమీక్షకు ఆదేశాలు జారీ చేసిందన్నారు. మే 5 నుంచి ఇంటింటికీ అధికారులు సర్వేకు వచ్చినప్పుడు మాదిగ అని జాబితాలో రాయించాలన్నారు. ఈ విషయంపై 1వ తేదీ నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సంచరించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామన్నారు. -
ఉడత బెదిరింపులకు బెదిరిపోం
శివాజీనగర: బీజేపీ– ఆర్ఎస్ఎస్ ఉడత బెదరింపులకు బెదిరిపోం, ఎదుర్కొనే శక్తి నాకు, మా కార్యకర్తలకు ఉందని సీఎం సిద్దరామయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం వల్లనే ధరల పెరుగుదల, దేశ వ్యతిరేక పరిపాలన ఖండన పేరుతో సోమవారం బెళగావిలో కాంగ్రెస్ బృహత్ సభను జరిపింది. ఈ సభను సీఎం ప్రారంభించి మాట్లాడారు. గత 10 సంవత్సరాల నుంచి నిరంతరం ధరలు పెరుగుతున్నాయి. భారతీయులు అలాగే బతుకును లాగుతున్నారు. భారతీయ సమాజాన్ని ఛిన్నాభిన్నం చేస్తూ ప్రజాద్రోహానికి పాల్పడటం మినహాయిస్తే కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో చూపించాలని డిమాండ్ చేశారు. భారతీయులు బ్రిటీష్‌వారిపై పోరాడి ప్రాణత్యాగం చేసినప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎక్కడ ఉన్నాయని అన్నారు. ఇటీవల కశ్మీర్లో అమాయకులైన భారతీయులను, కర్ణాటకకు చెందిన ముగ్గురిని ఉగ్రవాదులు దర్జాగా వచ్చి తుపాకులతో హత్య చేసి వెళ్లారు కదా, ఇది కేంద్ర ప్రభుత్వ లోపం కాదా? భారతీయులకు భద్రత కల్పించటంలో విఫలం కావడాన్ని భారతీయులు ప్రశ్నించరాదా? ప్రశ్నిస్తే అడ్డు చెబుతారా అని ధ్వజమెత్తారు. మన్మోహన్సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అత్యంత ధనవంతులపై 32 శాతం ట్యాక్స్ ఉండేది. మోదీ వచ్చిన తరువాత 25 శాతానికి తగ్గించారు. పేదలు, మధ్యతరగతి వర్గంపై పన్నులను పెంచారు. సిగ్గు లేదా మీకు. పేదల, మధ్యతరగతి వర్గాల వ్యతిరేక బీజేపీ పరిపాలనను మేము ప్రశ్నించరాదా? భారతీయులను నిరంతరం అబద్ధాలతో మభ్యపెడుతారా. వాస్తవం చెప్పండని దుయ్యబట్టారు. తమకు బీజేపీ–ఆర్ఎస్ఎస్ను ఎదుర్కొనే శక్తి ఉందన్నారు. బీజేపీ మహిళా కార్యకర్తల హల్చల్ బెళగావిలో సీపీఎడ్ మైదానంలో కాంగ్రెస్ సమావేశంలో కలకలం ఏర్పడింది. సిద్దరామయ్య ప్రసంగించే సమయంలో హైడ్రామా సాగింది. కొందరు బీజేపీ కార్యకర్తలు అడ్డగించేందుకు యత్నించారు. సిద్దరామయ్య మాట్లాడడం ఆరంభించగానే సభలో వెనుక కాంగ్రెస్ కార్యకర్తల్లా కూర్చొన్న బీజేపీ మహిళా కార్యకర్తలు నల్ల జెండాలను ప్రదర్శించి, రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. వేదిక వైపు దూసుకువచ్చారు. ఈ సమయంలో అరుపులు, కేకలతో గందరగోళం నెలకొంది. సీఎం సిద్దరామయ్య కొంతసేపు తన ప్రసంగాన్ని నిలిపివేసి, బెళగావి ఎస్పీ ఎవరు? పోలీసులు ఏమి చేస్తున్నారు? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పోలీసు అధికారిని చెంప మీద కొట్టబోయారు. బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ సమావేశానికి వచ్చి అడ్డగిస్తున్నా మౌనంగా కూర్చొన్నారా? అందరినీ బయటికి పంపాలని మండిపడ్డారు. బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు, పోలీసులు బయటకు లాక్కెళ్లారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్పై సీఎం సిద్దు ధ్వజం బెళగావిలో ధరల వ్యతిరేక సభ కాషాయ కార్యకర్తల అలజడి పోలీసులపై సీఎం ఆగ్రహం -
మూడు జిల్లాల్లో వర్ష బీభత్సం
రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటకలోని మూడు జిల్లాల్లో ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వానలు బీభత్సవం సృష్టించాయి. రాయచూరు జిల్లా గుడదిన్నిలో సాయణ్ణ(55), లక్ష్మమ్మ(70) పిడుగుపాటుకు గురై మరణించారు. దేవదుర్గ తాలూకా నాగడదిన్ని, సిరవార, మస్కి తాలూకా మెదికినాళ, మాన్వి తాలూకా కాతరకి, లింగసూగూరు తాలూకా పామనకల్లూరు, రాయచూరు తాలూకా యరగేర, గుంజళ్లి, బూడిదపాడు, ఆత్కూరు, సంగంకుంట, యాదగిరి జిల్లా శహాపుర, కలబుర్గి జిల్లా కమలాపురల్లో భారీ వర్షాలు కురిశాయి. వరి, మిరప, మామిడి పంటలు దెబ్బ తిన్నాయి. ఆత్కూరు, బూడిదపాడులో 150 మామిడి చెట్లు, ఽశహాపురలో వెయ్యి ఎకరాల్లో మిరప పంట, 4500 ఎకరాల్లో వరి పైరు నాశనమైంది. 450 ఎకరాల్లో సాగు చేసిన అరటిపంటకు నష్టం వాటిల్లింది. ఇద్దరు దుర్మరణం పంటలకు భారీ నష్టం లేచి పోయిన టిన్ షెడ్లు -
రంగస్థలానికి పుట్టినిల్లు బళ్లారి
బళ్లారిటౌన్: రంగస్థల కళకు పుట్టినిల్లు బళ్లారి జిల్లా అని కలబుర్గి రంగాయణ డైరెక్టర్ డాక్టర్ సుజాత జంగమశెట్టి పేర్కొన్నారు. సోమవారం సాంస్కృతిక సముచ్ఛయ భవనంలో ఏర్పాటు చేసిన సమాలోచన కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. కలబుర్గి రంగాయణ కళ్యాణ కర్ణాటకలో 7 జిల్లాల పరిధిని కలిగి ఉందన్నారు. ఈ జిల్లాల్లో పూర్వం నుంచి వస్తున్న రంగస్థల కళలను కాపాడుకోవాలన్నారు. జిల్లాలో జోళదరాశి దొడ్డనగౌడ, బళ్లారి రాఘవ, బెళగల్ ఈరణ్ణ, సుభద్రమ్మ మన్సూర్ లాంటి అనేక మహా కళాకారులు కళా రంగానికి చేసిన సేవలు అపారం అని కొనియాడారు. పాఠశాల, కళాశాలల్లోను నాటక రంగంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలకు పాఠశాల దశ నుంచి కళలపై ఆసక్తి పెంపొందించాలన్నారు. ఈ ప్రాంతంలో బయలాట, దొడ్డాట, తోలుబొమ్మలాట కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇందులో లింగత్వ అల్పసంఖ్యాతులు కూడా ఆసక్తి చూపాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో మరాఠి, తెలుగు భాషల రంగస్థల కళాకారులతో జత కలిసి నాటక శిబిరాలను చేపడుతున్నట్లు తెలిపారు. కన్నడ సాంస్కృతిక శాఖ ఏడీ నాగరాజ్, ఇతర కళాకారులు పాల్గొన్నారు. -
పోలీస్ అధికారితో అలా.. సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఓ పోలీస్ అధికారిపై చెయ్యేత్తి కొట్టబోయారు. అదీ పెద్ద పెద్ద నేతలు పాల్గొన్న ఓ పబ్లిక్ మీటింగ్‌లో. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుండగా.. ప్రతిపక్షాలే కాదు సామాన్యులు సైతం మండిపడుతున్నారు.సోమవారం బెలగావిలో సంవిధాన్ బచావో & ధరల వ్యతిరేకల నిరసన ప్రదర్శన జరిగింది. అయితే ఆ సమయంలో బీజేపీకి చెందిన కొందరు అక్కడికి చేరుకుని నల్ల జెండాలు, కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఫ్లకార్డులతో నిరసన నినాదాలు చేశారు. దీంతో ఆయన సహనం కోల్పోయారు. ‘‘ఏయ్ ఎవరు మీరు? నోరు మూయండి’’ అంటూ గట్టిగా అరిచారాయన.అయినా కూడా వాళ్లు శాంతించకపోవడంతో.. అక్కడే ఉన్న ఏఎస్పీ నారాయణ్ భరమణిని దగ్గరకు పిలిచారు. ‘‘ఏయ్.. ఎవరు ఇక్కడ ఎస్పీ? ఏం చేస్తున్నావ్? అంటూ చెయ్యేత్తి కొట్టబోయారు. అయితే ఆ అధికారి వెనక్కి వెళ్లగా.. సీఎం కూడా తేరుకుని చెయ్యిని వెనక్కి లాక్కున్నారు. ‘‘ఏం చేస్తున్నారయ్యా మీరంతా? వాళ్లంతా ఇక్కడి దాకా ఎలా రాగలిగారు?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన.#Karnataka Chief Minister #Siddaramaiah lost his temper and raised his hand to slap a senior police officer while he was addressing a Congress rally against the Centre's policies in #Belagavi on Monday.🔗https://t.co/kkeaADaLnu@XpressBengaluru pic.twitter.com/pTntV5QZrN— The New Indian Express (@NewIndianXpress) April 28, 2025ఈ వీడియో కన్నడనాట దుమారం రేపింది. అధికారం శాశ్వతం కాదని.. తమరు ఐదేళ్లు అధికారంలో ఉంటారని.. కానీ ఆ అధికారి 60 ఏళ్లు వచ్చే దాకా డ్యూటీలో ఉంటారంటూ జేడీఎస్ ట్వీట్ చేసింది. ఇక.. బీజేపీ ఆ అధికారికి సీఎం సిద్ధరామయ్య క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేసింది. మరోవైపు.. కొందరు నెటిజన్లు సైతం సిద్ధరామయ్య తీరు తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. -
పరిసరాల శుభ్రతతో మలేరియాకు అడ్డుకట్ట
హొసపేటె: ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే మలేరియాను నివారించవచ్చని కూడ్లిగి టీహెచ్ఓ ప్రతీప్‌కుమార్ అన్నారు. ప్రపంచ మలేరియా దినోత్సవ సందర్భంగా విజయనగరం జిల్లా కూడ్లిగి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పతి ఆవరణలో ఏర్పాటు చేసిన అవగాహన జాతాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనాఫిలిస్ జాతికి చెందిన ఆడ దోమల ద్వారా సంక్రమించే వ్యాధి మలేరియా అని, దీని గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవం, దోమ తెరలు వినియోగించడం ద్వారా మలేరియాకు దూరంగా ఉండచవ్చన్నారు. అనంతరం రాఘవేంద్ర పారామెడికల్ విద్యార్థులు ప్రధాన వీధుల్లో ర్యాలీగా వెళ్లి మలేరియా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. చిత్రలేఖనాల ద్వారా అవగాహన కల్పించారు. సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్లు జగదీష్, వహాబ్, గురుమూర్తి, హెల్త్ ఇన్స్పెక్టర్ కే.సునీత, మహేష్, మలేరియా సూపర్ వైజర్ కొట్రేష్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నదాతలను ముంచిన అకాల వర్షం
సాక్షి,బళ్లారి: అకాల వర్షం అన్నదాతను కోలుకోలేని దెబ్బతీసింది. చేతికందివచ్చిన పంట వర్షార్పణ అయ్యింది. జిల్లాలోని సిరుగుప్ప, కంప్లి, విజయనగర జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం రాత్రి, ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో పంటలకు తీరని నష్టం వాటిల్లింది. తుంగభద్ర ఆయకట్టు కింద రబీలో సాగైన వరి పంట నేలకొరిగింది. దాదాపు 75శాతం మేర వరి కోతలు జరిగాయి. రైతులు వరిధాన్యాన్ని పొలాల్లోనే కుప్పలుగా వేసి ఆరబెట్టారు. మార్కెట్‌కు తరలించాల్సిన సమయంలో వర్షం కురవడంతో ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. వడగండ్ల ధాటికి వడ్లు నేలరాలాయి. పొలాల్లో ఎటు చూసినా వడ్లు కుప్పలుగా కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఆరటి తోటలు కూడా కుప్పకూలిపోయాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి కంటికి రెప్పలా కపాడుకున్న పంటలు కళ్లెదుటే వర్షార్పణం కావడంతో అన్నదాత కన్నీరు పెట్టారు. ప్రభుత్వం పంటనష్టం అంచనా వేసి పరిహారం అందించాలని కోరుతున్నారు. రాయచూరులో భారీ వర్షం రాయచూరురూరల్: ఎండలతో సతమతమవుతున్న రాయచూరు వాసులకు ఊరట కలిగించేలా రాయచూరు నగరంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షానికి నగరంలోని రహదారులు జలమయం అయ్యాయి. మురుగు కాలువలు పొంగి ప్రవహించాయి. కూర గాయల మార్కెట్, బంగీకుంట, మచ్చి బజార్, బైరూన్ కిల్లా ప్రాంతాల్లో వర్షం నీరు ఇళ్లలోకి పోటెత్తింది. ఏపీఎంసీలో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు తడిసిపోయాయ. గుంజహళిలో వడగండ్ల వర్షం కురిసింది. పెనుగాలులతో గంట పాటు విద్యుత్ సరఫరాలో నిలిచిపోయింది. వారం రోజలుగా వేసవి ఎండల తీవ్రత పెరిగింది. రోజూ 40 డిగ్రీలసెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అవుతుండటంతో ప్రజలు తల్లడిల్లి పోయారు. ప్రస్తుతం గంటపాటు వర్షం పడటంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఈదురుగాలులు, వడగండ్ల వర్షం పలు గ్రామాల్లో నెలకొరిగిన వరిపంట నేలపాలైన అరటిపంటలు -
యువత ఉద్యోగ దాతలుగా ఎదగాలి
హుబ్లీ: యువత ఉద్యోగం సంపాదించడానికి బదులుగా స్వంతంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ దాతలు కావాలని ఎమ్మెల్యే మహేష్ టెంగినకాయి, ఎమ్మెల్యే ఎంఆర్ పాటిల్‌లు సూచించారు. హుబ్లీ రోటరీ క్లబ్, ఉద్యోగ జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో కేఎల్ఈ సంస్థ సీసీ జాబిన్ సైన్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉద్యోగ మేళాను వారు ప్రారంభించి మాట్లాడారు. డిగ్రీ పూర్తి అయ్యాక విద్యార్థులు ఉద్యోగ సాధనకు ఎంతో ఎంతో శ్రమ పడుతారన్నారు. దొరికిన ఉద్యోగం తీసుకొని అక్కడే నైపుణ్యాన్ని సాధించి ఇతర కంపెనీలలో ఉన్నత ఉద్యోగాలకు కృషి చేస్తుంటారన్నారు. అయితే స్వతహాగా పరిశ్రమలు ఏర్పాటు చేసి మరికొందరికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలన్నారు.మేళా నిర్వహకులు ఎమ్మెల్సీ ఫ్రొసిసర్ ఎస్వీ సంకనూరు మాట్లాడుతూ గదగ, ధార్వాడ, హావేరిలలో ఉద్యోగ మేళ ఏర్పాటు చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాను. ఆ మేరకు గత 10 ఏళ్ల నుంచి ఉద్యోగ మేళాలు ఏర్పాటు చేస్తున్నానన్నారు. కెనరా బ్యాంక్ ప్రాంతీయ చీఫ్ నజల్ సమీర్, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ మంజునాథ హొసమని, కేఎల్ఈ సంస్థ డైరెక్టర్ శంక్రన్న మునవళ్లి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు బాపుగౌడ పాటిల్, కార్యదర్శి ఏవీ సంకనూర, ప్రిన్సిపల్ డాక్టర్.సంధ్య కులకర్ణి, తదితరులు పాల్గొన్నారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
రాయచూరురూరల్: సదర్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటలో కొండపై ఉన్న ఆలయంలో శనివారం రాత్రి దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా విగ్రహాలను ధ్వంసం చేశారు. కొన్ని కట్టడాలను తొలగించారని సీఐ ఉమేష్ తెలిపారు. శబ్దాలు విన్న స్థానికులు అప్రమత్తం కావడంతో దుండగులు ఉడాయించారేని తెలిపారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గనుల శాఖ అధికారిణిపై సస్పెన్షన్ వేటు రాయచూరు రూరల్: జిల్లాగనుల శాఖాధికారిణి పుష్పాను సస్పెండ్ చేస్తు జిల్లాధికారి నీతీష్ అదేశాలు జారీ చేశారు. గత నెలలో మాన్వి తాలూకా చీకల పర్విలో అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న టిప్పర్లు, జేసీబీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే జిల్లా గనుల శాఖాధికారిణి పుష్పా తనకు ఏమీ తెలియనట్లు మౌనంగా ఉండిపోయారని, కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదని ఆరోపణలు వచ్చాయి. అక్రమ రవాణా, తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా సదరు అధికారిణి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని నిర్ధారించి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సెల్‌ఫోన్ చూడొద్దంటావా? ●● భర్త నిద్రలో ఉండగా కత్తితో పొడిచిన భార్య హుబ్లీ: మొబైల్ ఫోన్ ఎక్కువ వాడొద్దని చెప్పినభర్తపై భార్య కత్తితో దాడిచేసింది. ఈ ఘటన విజయపురలోని హాలకుంటె నగరంలో చోటు చేసుకుంది. గ్రామంలో అజిత్ రాథోడ్, తేజు రాథోడ్ దంపతులు నివాసం ఉంటున్నారు. తేజు రాథోడ్ నిత్యం సెల్‌ఫోన్ చూస్తుండేది. గమనించిన భర్త మందలించాడు. దీంతో అతనిపై కోపం పెంచుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో భర్త గాఢ నిద్రలో ఉండగా మెడ భాగంలో కత్తితో దాడి చేసింది. బాధితుడి కేకలు విన్న కుటుంబ సభ్యులు ఆయన్ను బీఎల్‌డీఈ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆదర్శనగర్ పోలీసులు తేజు రాథోడ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. చోరీ సొత్తు అప్పగింత రాయచూరు రూరల్: ఆటోలో మరచిపోయిన నగలను పోలసులు రికవరీ చేసి సొంతదారులకు అప్పగించారు. శక్తినగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 22 న బస్టాండ్ నుంచి తీన్‌కందిల్ వరకు ఓ మహిళ అటోలో ప్రయాణించిన సమయంలో సంచి మరచిపోయింది. అందులో బంగారు నగలు ఉన్నాయి. దీంతో బాధితురాలు సదర బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టి ఆటోను గుర్తించి రూ.2 లక్షల విలువ చేసే బంగారు, వెండి నగలను రికవరీ చేశారు. ఆ సొత్తును ఎస్పీ సొంతదారుకు అప్పగించారు. డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, ఎస్ఐ నరమమ్మ పాల్గొన్నారు. పీఏబీఆర్‌లో తగ్గిపోయిన నీటిమట్టం కూడేరు: కూడేరు మండలం పెన్నహోబిళం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పీఏబీఆర్ డ్యాం)లో ఇన్‌ఫ్లో లేక అవుట్ ప్లో ఉండడంతో నీటి మట్టం బాగా తగ్గి పోయింది. ఆదివారం నాటికి పీఏబీఆర్ డ్యాంలో 2.62 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్ అధికార వర్గాలు వెల్లడించాయి. జలాశయం వద్ద ఏర్పాటైన అనంతపురం, సత్యసాయి, ఉరవకొండ తాగునీటి ప్రాజెక్ట్‌లకు రోజుకు సుమారు 40 క్యూసెక్కులు వరకు నీటిని సరఫరా చేస్తున్నారు. లీకేజీ, నీటి ఆవిరి రూపంలో సుమారు 60 క్యూసెక్కులు వరకు బయటకు వెళుతోంది. వేసవిలో తాగునీటి ప్రాజెక్టులకు నీటి కొరత ఉండదని అధికార వర్గాలు తెలిపాయి. -
మిర్చి నిల్వకు శీతల గోదాముల కొరత
రాయచూరు రూరల్: ఎండు మిర్చి అన్నదాతను కన్నీరు పెట్టిస్తోంది. మార్కెట్‌కు తీసుకెళ్తే ఆశించిన ధరలు ఉండవు. నిల్వ చేద్దామంటే శీతల గోదాముల కొరత, పొలాలు, ఇళ్ల వద్ద నిల్వ చేసుకుంటే వర్షాలకు పంట తడిసిపోతుందనే భయం. ఇలా మిర్చి రైతు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నాడు. రాయచూరు, యాదగిరి, విజయపుర, బాగల్ కోటె, గదగ్, కొప్పల్ జిల్లాల్లో మిర్చి పంట లక్షల ఎకరాల్లో సాగైంది. రెండేళ్ల క్రితం మిరప మంచి ధర పలికింది. దీంతో రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపారు.అయితే గత ఏడాది నుంచి ధరలు పతనం అయ్యాయి. దీంతో చోలా మంది రైతులు మిర్చిని గోదాముల్లో నిల్వ చేశారు. ఈక్రమంలో ఈ ఏడాది సాగైన మిర్చి పంట నిల్వ చేసేందుకు గోదాముల కొరత ఏర్పడింది. మరో వైపు యజమానులు గోదాముల అద్దె పెంచారు. దీంతో మిర్చిని ఎక్కడ నిల్వ చేయాలో తెలియక అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏ గోదాము వద్దకు వెళ్లినా స్థలం లేదని చెబుతున్నారు. గత్యంతరం లేక పొలాల వద్ద మిర్చిని రాసులుగా పోసి ప్లాస్టిక్ తారపాళ్లు కప్పి పంటను కాపాడుకుంటున్నారు. అయితే పెనుగాలు, వడగండ్ల వర్షాలు కురిస్తే మిర్చి మొత్తం తడిసిపోయి కాయలు నల్లరంగులో మారుతుంది. అలాంటి పంటను కొనేందుకు వ్యాపారులు ముందుకురారు. వచ్చినా తక్కువ ధరకు అడుగుతారు. ప్రభుత్వం అవసరమైన మేర గోదాములు నిర్మించి ఉంటే ఈ పరిస్థితి తలెత్తెది కాదు. ఇదిలా ఉండగా గతంలో కోల్డ్ స్టోరేజలో బస్తాకు రూ.30 అద్దె ఉండగా నేడు రూ.వందకు పెంచారు. అసలు ధరలే పడిపోగా అద్దెలు పెంచడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకొని శీతల గోదాములు ఏర్పాటు చేయాలని, అద్దెలు తగ్గించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అద్దె ధరలు పెంచిన యజమానులు పొలాల వద్దనే మిరప నిల్వలు వర్షాలతో తడిసి అన్నదాతలకు నష్టాల -
వెలుగు చూసిన పాలెగార్ల శాసనం
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా సరిహద్దు గ్రామమైన నుంకనహళ్లిలో గూడేకోటే చివరి గవర్నర్ ఇమ్మడి బొమ్మల నాయక, ముమ్మడి బొమ్మల నాయకకు సంబంధించిన శాసనం వెలుగు చూసినట్లు చరిత్ర అధ్యాపకుడు హెచ్ఎం.తిప్పేష్ తెలిపారు. నుంకనహళ్లి లోయలో తూర్పు ముఖంగా ఉన్న ఒక రాతిపై 15 పంక్తులలో ఇమ్మడి బొమ్మల, గుడేకోటే చివరి గవర్నర్ అని రాసి ఉందని పేర్కొన్నారు. 1833లో భట్టార్ సత్యప్ప కుమారుడు మచ్చగిరికి చేసిన భూ దానం ఇందులో పేర్కొనబడిందన్నారు. రాజు ఆజ్ఞను ధిక్కరిస్తే తల్లిని ధిక్కరించినట్లే, బ్రాహ్మణుడిని ధిక్కరిస్తే ఆవును చంపినట్లే శిక్షించబడతావు అని శాసనంలో ఉందన్నారు. అదేవిధంగా శాసనంలో గాడిద చిత్రం ఉందని, ఇది ఒక శాపానికి సంబంధించిన చిహ్నమన్నారు. మొళకాల్మూర్ ప్రభుత్వ ఫస్ట్ గ్రేడ్ కళాశాల చరిత్ర ప్రొఫెసర్ యోగానంద, మిథిక్ సొసైటీ శాసన నిపుణుడు శశికుమార్ నాయక్, పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ షెజేశ్వర్, అసిస్టెంట్ ఆర్కియాలజిస్ట్ ఆర్.మంజన. చరిత్ర విద్యార్థులు, స్థానికుల సహకారంతో ఈ శాసనాన్ని గుర్తించినట్లు తెలిపారు. -
శాంతికి విఘాతం కలిగించే ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి
హొసపేటె: పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని అంజుమాన్ ఖిద్దత్ ఇస్లాం సమితి, ముస్లిం సమాజం తీవ్రంగా ఖండించింది. హోస్పేట్‌కు చెందిన అంజుమాన్ ఖిద్మత్ ఇస్లాం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నగరంలోని జైభీమ్ సర్కిల్లో కొవ్వొత్తులు వెలిగించి పహల్గాం మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. కమిటీ అధ్యక్షులు హెచ్ఎన్ మొహమ్మద్ ఇమామ్ నియాజీ మాట్లాడుతూ భారతదేశం అన్ని మతాలకు, అన్ని జాతులకు వెలుగునిచ్చే ఒక వనం లాంటిదన్నారు. శాంతికి విఘాతం కలిగించే ఉగ్రవాదులను శిక్షించాలన్నారు. భారతదేశంలో హిందువులు, ముస్లింలు సామరస్యంగా జీవిస్తున్నారన్నారు. ఉగ్రవాద వ్యాప్తిని అరికట్టడానికి కేంద్రం కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. నాయకులు నజీమ్, ఫజ్లుల్లా, రెహ్మత్, వాఖ్ బోర్డు జిల్లా అధ్యక్షుడు దాదాఫీర్ బావు, అంజుమాన్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎంఎం, ఫిరోజ్‌ఖాన్, తదితరులు పాల్గొన్నారు. -
ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి
రాయచూరు రూరల్: కశ్మీర్‌లోని పహల్గాంలో కాల్పులు జరిపి అమాయకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని యరగేర వాసులు డిమాండ్ చేశారు. ఉగ్రదాడిలో అసువులబాసిన వారి ఆత్మశాంతి కోసం శనివారం రాత్రి భజరంగి, యరగేరి గ్రామస్తులు ప్రజలు కొవ్వొత్తులతో ర్యాలీ న్విహించారు. మృతులకు సంతాపం సూచకంగారెండు నిమిషాల మౌనం పాటించారు. భజరంగి అధ్యక్షుడు పవన్ మాట్లాడారు. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం లభించేలా చూడాలన్నారు. కేంద్రం సర్కార్ ఈ వి షయంలో ప్రత్యేక విచారణ చేపట్టి తప్పు చేిసిన వారికి ఊరి శిక్షలు వేయలన్నారు. ర్యాలీలో సంతోష్ రెడ్డి, రాము, ఉదయ్ కుమార్, ఆకాష్ రెడ్డి, ప్రవీణ కుమార్ పాల్గొన్నారు. -
వ్యక్తి అదృశ్యంపై ఫిర్యాదు
హుబ్లీ: ఇంటి నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఈఘటన ధార్వాడ కామనకట్టి పంచకచేరి వీధిలో జరిగింది. ధార్వాడ తాలూకా చిక్కమల్లిగవాడ గ్రామానికి చెందిన కల్లప్ప గూళాప్ప కలయ్యనవర (59) పంచకచేరి వీధిలో ఉంటున్నాడు. ఈయన ఈనెల 13న ఇంటినుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పలు ప్రాంతాల్లో గాలించినా జాడ కనిపించలేదు. దీంతో భార్య గంగుకల్లయ్య ధార్వాడ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కన్నడ, హిందీ, మరాఠీ బాష తెలిసిన తన భర్త ఆచూకీ తెలిసిన వారు టౌన్ పోలీస్ స్టేషన్ నంబర్ 08362233512, లేక పోలీస్ కంట్రోల్ రూంలో తెలియజేయాలని ఆమెతో పాటు పోలీసులు ఓ ప్రకటనలో కోరారు. బస్సు ఢీకొని బైకిస్టు మృతి హుబ్లీ: తాలూకాలోని కుసుగల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాలూకాలోని ఇంగళహళ్లి గ్రామానికి చెందిన రవిబాళెకాయి (32) అనే వ్యక్తి మృతి చెందాడు. ఇతను బైక్‌లో వెళ్తుండగా బస్సు ఢీకొనడంతో ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఘటన స్థలాన్ని హుబ్లీ గ్రామీణ పోలీసులు వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. రవి బాళెకాయి మృతికి మాజీ మంత్రి శంకర్ పాటిల్ మునేనకొప్ప సంతాపం వ్యక్తం చేశారు. సభ్యుడిగా నియామకం రాయచూరు రూరల్: హెమిస్పియర్ ప్రాపర్టీస్ ఇండియా లిమిటెడ్ సభ్యుడిగా గీరీష్ కనకవీడును నియమిస్తు కేంద్ర సర్కార్ అదేశాలు జారీ చేసింది. మూడేళ్లుగా ఈ పదవిలో కొనసాగుతున్న గీరీస్ మరో మూడేళ్ల పాటు కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కన్నడ భాషకు ప్రోత్సాహం ఇవ్వాలి రాయచూరురూరల్: కన్నడ భాషకు ప్రోత్సాహం ఇవ్వాలని గంగాధరప్ప పిలుపు ఇచ్చారు. సరస్వతి దాసప్ప శైణీ ప్రతిష్టాన, కలాకుంచ సాంస్కతిక వేదిక ఆధ్వర్యంలో అదివారం దావణగేరలోని చెన్నగిరి విరూపాక్షప్ప కల్యాణ మంటపంలో జరిగిన సరస్వతి సాధక సిరిజాతీయస్థాయి అవార్డుల పంపిణీలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటికీ తెలుగు, కన్నడ భాషలను కలిపి మాట్లడుతున్నారన్నారు. కన్నడ భాషను పరిరక్షించి భావితరాలకు అందించాలన్నారు. రాష్ట్ర సుగమ సంగీత సంస్థ అధ్యక్షుడు నాగరాజ్, నాగరత్న, సంగీత, అశా అడిగి, జ్యోతి గణేష్ శైణై, మంజునాథ్, సాలిగ్రామ గణేష్ శైణై, రాఘవేంద్ర, ఉమేష్ పాల్గొన్నారు. ఈత కొలనుల్లో సందడి సాక్షి, బళ్లారి: వేసవి సెలవులు రావడంతో నగరంలో విద్యార్థులు, యువతతో స్విమ్మింగ్‌పూల్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్మిమ్మింగ్‌పూల్స్ రద్దీగా ఉంటున్నాయి. నగరంతో పాటు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభుత్వ,ప్రైవేటు వారు ఏర్పాటు చేసిన స్విమ్మింగ్‌పూల్స్ ఉన్నాయి. ఫీజు చెల్లించి పూల్‌లో జలకాలు ఆడవచ్చు. దీంతో పాటు ఈత నేర్పే కోచ్‌లకు కూడా గిరాకీ పెరిగింది. ఈత అనేది అందరూ నేర్చుకోవాలని, ఆరోగ్యానికి, ప్రాణరక్షణకు ఎంతో అవసరమని తెలిపారు. 10 రోజుల్లో ఈత పూర్తిగా నేర్చుకోవచ్చునని,ఈత,నీరు అంటే భయం తొలగిపోతుందని చెప్పారు. కేంద్ర భద్రతా దళం వైఫల్యంతోనే ఉగ్రదాడులు రాయచూరురూరల్: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడులకు కేంద్ర భద్రతా దళం వైఫల్యమే ప్రధాన కారణమని మాజీ ఎంపీ ఉగ్రప్ప ఆరోపించారు. అ దివారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. కశ్మీరుకు 200 కేజీల్ ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాం ఎక్కడినుంచి వచ్చిందన్నారు. దేశ ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రధాని విఫలమయ్యారన్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
కస్తూరిరంగన్‌కు తుది వీడ్కోలు
సాక్షి, బెంగళూరు/శివాజీనగర: భారత అంతరిక్ష దిగ్గజం, ఇస్రో మాజీ అధ్యక్షుడు డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ (84)కు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు పలికారు. వయోభారంతో ఆయన శుక్రవారం బెంగళూరులోని నివాసంలో కన్నుమూయడం తెలిసిందే. ఆయన పార్దివ శరీరాన్ని రామన్ రీసెర్చ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. ఆదివారం కర్ణాటక గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్, మాజీ సీఎం యడియూరప్ప, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇస్రో మాజీ అధ్యక్షులు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం హెబ్బాళలోని విద్యుత్ దహన వాటికలో అంత్య క్రియలను పూర్తిచేశారు. -
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’
బెంగళూరు: పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదని. భారత్ శాంతిప్రియ దేశం. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడానికి దేశ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్ శాఖల వైఫల్యమే కారణమని సిద్దరామయ్య ఆరోపించారు. వేలాది మంది పర్యాటకులు సంచరించే స్థలంలో వారికి తగిన భద్రతను కల్పించాల్సిందన్నారు. ఆ భద్రత లేనందునే ఈ ఘోరం జరిగిందన్నారు. భద్రత ఉందనుకొని ప్రజలు కశ్మీరుకు వెళ్లి మృత్యువాత పడ్డారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణాలను వెనక్కు తెచ్చివ్వగలరా అని ప్రధాని మోదీని విమర్శించారు. సిద్ధరామయ్య.మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’దీనిపై కర్ణాటక బీజేపీ తీవ్రంగా మండిపడింది. పాకిస్తాన్ లో , పాకిస్తాన్ బోర్డర్ లో సిద్ధరామయ్య పేరు మారుమ్రోగుతోంది. ‘ మీరు పాకిస్తాన్ రత్న’ కర్ణాటక బీజేపీ ధ్వజమెత్తింది. మన దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గురించి ప్రస్తావించిన బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రన్... పాకిస్తాన్ కు అనుకూలంగా సింధు జల ఒప్పందంపై సంతకం చేసినప్పుడు పాకిస్తాన్ చాలా సంతోషం ఉంది. కాబట్టే అప్పుడు రావల్పిండి వీధ/ల్లో నెహ్రూను ఓపెన్ జీప్ లో తీసుకెళ్లారు. పాకిస్తాన్ లో ఓపెన్ జీప్ లో తిప్పబడే భారత దేశ తదుపరి రాజకీయ నేత మీరు అవుతారా సిద్ధరామయ్య అవుతారా? అని ప్రశ్నించారు బీజేపీ చీఫ్‌ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప విమర్శించారు. ‘ మనదేశం అంతా ఒక్కటిగా ఉండాల్సిన సమయంలో ఈ తరహ మాటాలేమిటి.. అసలు వాస్తవ పరిస్థితులు ఏమిటో అర్ధం చేసుకోవాలి. మీకు సీఎంగా ఇచ్చే ఫేర్ వెల్ పార్టీ కాదు ఇది. మీ వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరమే. మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు యడ్యురప్ప. -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
మండ్య: వేసవి అధిక ఉష్ణోగ్రతలా, లేక యాంత్రిక లోపాలా తెలియదు కానీ వాహనాలు రోడ్డుపై తగలబడిపోతున్నాయి. ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటన మండ్య జిల్లాలోని నాగమంగళ తాలూకాలోని బెంగళూరు– మంగళూరు హైవేలో కదబహళ్ళి టోల్ గేట్ వద్ద శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఉడుపి నుంచి బెంగళూరు వైపు వెళుతున్న రేష్మా ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. పసిగట్టిన డ్రైవర్ బస్సును నిలిపి ప్రయాణికులను హెచ్చరించాడు. 20 మంది ప్రయాణికులు ఉండగా అందరూ దిగిపోతున్న సమయంలో మంటలు పూర్తిగా వ్యాపించాయి. నిమిషాల్లోనే బస్సు కాలిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. స్థానిక ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను అదుపు చేశారు. బిండిగనవిళె పోలీసులు కేసు నమోదు చేశారు. బూడిదైన కారు దొడ్డబళ్లాపురం: వెళుతున్న కారులో మంటలు చెలరేగి నడిరోడ్డులో కాలిబూడిదైన సంఘటన గదగ్ శివారులో చోటుచేసుకుంది. ఈరన్న అనే వ్యక్తి కుటుంబంతో కలిసి మారుతి బ్రిజా కారులో వెళ్తుండగా ఇంజిన్ భాగం నుంచి అగ్నికీలలు చెలరేగాయి. కారును నిలిపివేసి ఉన్నవారంతా దిగి దూరంగా పరిగెత్తి ప్రాణాలు దక్కించుకున్నారు. క్షణాల్లో కారు పూర్తిగా కాలిపోయింది. గదగ్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మండ్య జిల్లాలో ప్రమాదం -
పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు
మైసూరు: పాకిస్తాన్‌తో యుద్ధం వద్దు, బదులుగా దేశ భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంపొందించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. శనివారం మైసూరులోని తమ నివాసం ముందు, తరువాత పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదు. భారత్ శాంతిప్రియ దేశం. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడానికి దేశ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్ శాఖల వైఫల్యమే కారణమని సిద్దరామయ్య ఆరోపించారు. వేలాది మంది పర్యాటకులు సంచరించే స్థలంలో వారికి తగిన భద్రతను కల్పించాల్సిందన్నారు. ఆ భద్రత లేనందునే ఈ ఘోరం జరిగిందన్నారు. కశ్మీరు భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజల నెత్తిన టోపీ పెట్టిందని ఎద్దేవా చేశారు. భద్రత ఉందనుకొని ప్రజలు కశ్మీరుకు వెళ్లి మృత్యువాత పడ్డారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణాలను వెనక్కు తెచ్చివ్వగలరా అని ప్రధాని మోదీపై మండిపడ్డారు. పాకిస్తానీలను సాగనంపాల్సిందే రాష్ట్రంలో ఎంత మంది పాకిస్తానీయులు ఉన్నారో వివరాలు సేకరించి త్వరలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని సీఎం అన్నారు. పాకిస్తానీయులను దేశం నుంచి పంపించేయాలనే కేంద్ర ప్రభుత్వ చర్యకు తమ మద్దతు ఉందని చెప్పారు. గ్యారంటీలను ఆపం ఎట్టి పరిస్థితుల్లోనూ గ్యారంటీ పథకాలను ఆపబోమని, వాటితో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని సీఎం అన్నారు. జిల్లాలోని పిరియాపట్టణలోని తాలూకా క్రీడాంగణంలో ఏర్పాటు చేసిన రూ.439 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం గావించారు. కశ్మీర్ దాడి కేంద్ర నిఘా వైఫల్యమే సీఎం సిద్దరామయ్య ధ్వజం -
ఈడీ అదుపులో ఐశ్వర్యగౌడ
బనశంకరి: బంగారం, నగదు చీటింగ్ కేసుల్లో నిందితురాలు ఐశ్వర్యగౌడ నివాసాల్లో ఈడీ అధికారులు జరిపిన సోదాల్లో పలు సాక్ష్యాధారాలు, డిజిటల్ పరికరాలతో పాటు రూ.2.25 కోట్ల నగదు పట్టుబడింది. దీనిపై ఆమెను ప్రశ్నించగా సరైన సంజాయిషీ ఇవ్వకపోవడంతో విచారణ చేపట్టడానికి అరెస్ట్ చేశారు. ఐశ్వర్యగౌడను బెంగళూరు ప్రత్యేక ఆర్థిక విభాగం కోర్టులో హాజరుపరచగా 14 రోజులు కస్టడీకి కోర్టు ఆదేశించిందని ఈడీ అధికారులు తెలిపారు. మాజీ ఎంపీ డీకే.సురేశ్ సోదరినంటూ చెప్పుకుని పలు బంగారం షాపుల నుంచి కోట్లాది రూపాయల విలువచేసే బంగారు నగలను తీసుకుని నగదు ఎగ్గొట్టినట్లు కేసులున్నాయి. ఐశ్వర్యగౌడను ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. సైకో అరెస్టు ● యువతి, స్నేహితునిపై దాడి బనశంకరి: ప్రేమించాలని వేధించి యువతి, ఆమె స్నేహితునిపై దాడి చేసిన సైకో ని నగరంలో బనశంకరి పోలీసులు అరెస్ట్‌చేశారు. 21 ఏళ్ల యువతి, ఆమె స్నేహితునిపై ఈ నెల 8వ తేదీన దేవేగౌడ పెట్రోల్‌బంక్ వద్ద కట్టర్‌తో దాడికి పాల్పడిన శ్రీకాంత్ (45) నిందితుడు. కమలానగరలో శ్రీకాంత్ నివాసంలో సదరు వివాహిత యువతి ఏడాదిపాటు అద్దెకు ఉండింది. వివాహితుడైన శ్రీకాంత్ తనను ప్రేమించాలని ఆమెను సతాయించేవాడు. దీంతో యువతి తన భర్తకు చెప్పి బసవేశ్వరనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసిన పోలీసులు శ్రీకాంత్ ను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. యువతి ఇంటిని ఖాళీ చేసి కురబరహళ్లిలో చేరింది. మూడు నెలల నుంచి శ్రీకాంత్ యువతిని వెంబడించి ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లేవాడు. 8వ తేదీన పెట్రోల్ బంక్ వద్ద బస్టాప్‌లో ఆమె స్నేహితునితో కూర్చుని ఉంది. శ్రీకాంత్ వెళ్లి అతన్ని ప్రేమిస్తున్నావా అని యువతి, ఆమె స్నేహితుని చెంపలపై కొట్టాడు. కటర్‌తో ఇద్దరి ముఖంపై దాడిచేసి ఉడాయించాడు. పోలీసులు శనివారం శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. సిద్దు సీఎం.. కర్ణాటక దౌర్భాగ్యం ● అశోక్ మండిపాటు శివాజీనగర: పాకిస్తాన్‌తో యుద్ధం అనివార్యం కాదన్న సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యల మీద బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ మండిపడ్డారు. సిద్దరామయ్య ముస్లిం ఓట్ల గురించి ఆలోచిస్తున్నారు, అలాగైతే దాడుల్లో చనిపోయినవారి ప్రాణానికి విలువ లేదా? దేశానికి ఏమైనా ఫర్వాలేదు, ఓట్లు వస్తే చాలు అనే మనస్తత్వం ఆయనది అని ధ్వజమెత్తారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న, రెండుసార్లు సీఎం అయిన సీఎం సిద్దరామయ్యకు ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలనే కనీస పరిజ్ఞానం లేకపోవటం కర్ణాటక దౌర్భాగ్యం అని దుయ్యబట్టారు. పాక్ ఉగ్రవాదుల దాడి భారతదేశ సార్వభౌమత్వానికి, గౌరవానికి సవాల్‌గా మారిందన్నారు. ఇటువంటి సమయాలలో పార్టీలకతీతంగా ఉద్యమించాలన్నారు. రాష్ట్రంలో వేల సంఖ్యలో బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, పాకిస్తానీ అక్రమ వలసదారులు దర్జాగా తిరుగుతున్నారు. ముందు వారిని గుర్తించి, ఇక్కడి నుండి వెళ్లగొట్టి కన్నడిగుల క్షేమాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. సంబంధం లేని అంశాలపై జోక్యం చేసుకోవద్దని మండిపడ్డారు. ఎమ్మెల్యే కొడుకుచే టోల్‌గేటు ధ్వంసం రాయచూరు రూరల్: మా అమ్మ చెబితే పట్టించుకోరా, మీకెంత ధైర్యం అని రాయచూరు– దేవదుర్గ మధ్యనున్న టోల్ గేట్‌ను ఎమ్మెల్యే కుమారుడు ధ్వంసం చేశాడు. వివరాలు... కాకర వద్ద గల టోల్గేట్ ఉండగా, వాహనదారులు టోల్ ఫీజులను చెల్లించడం కష్టంగా ఉందని, దానిని తొలగించాలని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్ హైవే అధికారులకు సూచించారు. టోల్ గేట్‌ను తీసివేయడం కుదరదని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఎమ్మెల్యే పుత్రుడు సంతోష్ నాయక్, ఆమె సోదరుడు తిమ్మారెడ్డి నాయక్‌ల ఆధ్వర్యంలో యువకులు టోల్ గేట్ ఆఫీసు, అందులోని కంప్యూటర్లు, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని అధికారి నవీన్ కుమార్ గబ్బూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసుల కేసు నమోదు చేశారు. -
ఏటీఎం బందిపోట్లపై కాల్పులు
యశవంతపుర: కలబుర్గి నగరంలో కాకడె సర్కిల్లోని ఎటీఎంను దోచుకొని పరారైన నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి బంధించారు. నిందితులు తస్లీం (28), షరీఫ్ (22) గాయపడ్డారు. వీరి స్వస్థలం హరియానా కాగా దేశమంతటా తిరుగుతూ నగదు దొంగతనాలకు పాల్పడేవారు. శనివారం ఉదయం బేలూరు క్రాస్ సమీపంలో నిందితులు కారుతో ఉన్నట్లు తెలిసి సబ్ అర్బన్ స్టేషన్ సీఐ సంతోష్ తట్టెపల్లి, ఎస్ఐ బసవరాజు వెళ్లి నిందితులు లొంగిపోవాలని హెచ్చరించారు. అయితే నిందితులు చాకుతో దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపి పట్టుకున్నారు. వారితో కలిసి కారులో ఉన్న మరో ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ నెల 9న రూ.20 లక్షల లూటీ ఏటీఎంలను దోచుకెళ్లడంలో ఈ ముఠా ఆరితేరినది. ఈ నెల 9న గ్యాస్ కట్టర్‌ను ఉపయోగించి కాకడె సర్కల్‌కు సమీపంలోని ఎస్బీఎం ఏటీఎంను బద్దలు గొట్టి రూ. 20 లక్షల డబ్బును దోచుకెళ్లారు. అప్పటినుంచి పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ఇంతలో మరో ఏటీఎంను లూటీ చేయాలని నగరానికి వచ్చారని పోలీసు కమిషనర్ శరణప్ప తెలిపారు. కాల్పుల్లో గాయాలైన నిందితులు షరీఫ్, తస్లీంలను జిమ్స్ ట్రామా కేర్ సెంటర్లో చేర్చి చికిత్సలు అందిస్తున్నారు. దాడిలో మంజు, ఫిరోజ్, రాజ్‌కుమార్ అనే పోలీసులకు కూడా రక్తగాయాలు కాగా ఆస్పత్రిలో చేరారు. తస్లీంపై గతంలో వివిధ పోలీసుస్టేషన్లలో 8 కేసులు, షరీఫ్‌పై 3 కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. కలబుర్గిలో కలకలం ఇద్దరు దొంగలకు, ముగ్గురు పోలీసులకు గాయాలు -
రన్య రావుచే 100 కేజీల పసిడి స్మగ్లింగ్
బనశంకరి: మార్చి 3వ తేదీన రాత్రి దుబాయ్ నుంచి రూ.17 కోట్ల విలువచేసే 14 కిలోల బంగారం స్మగ్లింగ్ చేసిన కేసులో నటీనటులు రన్యరావ్, కొండూరు తరుణ్ రాజు కు హైకోర్టు బెయిల్ నిరాకరించింది. రన్యరావ్, ఆమె స్నేహితుడు బెయిల్ పిటిషన్‌పై శనివారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి ఎస్.విశ్వజిత్శెట్టి ధర్మాసనం బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించారు. ఆమెను డీఆర్ఐ అరెస్టు చేసి విచారించి, తరువాత తరుణ్‌రాజును నిర్బంధించడం తెలిసిందే. ప్రస్తుతం వారు పరప్పన జైలులో రిమాండులో ఉన్నారు. కేసు వాదనల్లో డీఆర్ఐ పలు కొత్త అంశాలను బయటపెట్టింది. రన్య సుమారు 100 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేసినట్లు గుర్తించామని తెలిపింది. సాక్ష్యాలు లభించాయి రన్య అరెస్ట్ అక్రమమని, బెయిల్ మంజూరు చేయాలని, అధికారులు కస్టమ్స్ నిబంధనలను పూర్తిగా అతిక్రమించారని ఆమె న్యాయవాది వాదించారు. దీనికి అభ్యంతరం వ్యక్తం చేసిన డీఆర్ఐ తరఫు న్యాయవాదులు రన్యరావు దుబాయ్ నుంచి బంగారం తీసుకొచ్చి తరుణ్రాజుకు ఇవ్వగా, అతడు సాహిల్ జైన్ అనే వ్యాపారికి అప్పగించాడని తెలిపారు. రన్య 100 కిలోల బంగారం అక్రమ రవాణా చేసినట్లు సాక్ష్యాలు లభించాయని, కేసు ఇంకా దర్యాప్తు దశలో ఉందని, రన్యరావు, తరుణ్‌రాజును మరింతగా విచారించాలని కింది కోర్టుకు మనవి చేశామని తెలిపారు. ఇద్దరు కలిసి 31 సార్లు దుబాయికి వెళ్లారని, 25వ సారి ఒకేరోజు దుబాయ్‌కి కి వెళ్లి వచ్చారని పేర్కొన్నారు. రన్యరావుకు పోలీసు భద్రతను ఎందుకు ఇచ్చారు అనేది విచారిస్తున్నామని, ఈ దశలో బెయిల్ ఇవ్వరాదని విన్నవించారు. ఇరువర్గాల వాదనలను ఆలకించి జడ్జి, బెయిలును నిరాకరించారు. హైకోర్టులో డీఆర్ఐ వాదనలు రన్య, తరుణ్రాజుకు బెయిలు తిరస్కృతి -
కలబుర్గిలో ఐదుగురు పాకిస్తానీలు
యశవంతపుర: కలబుర్గి లో ఐదుమంది పాకిస్తాన్ పౌరులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. నగరంలోని అశోక్‌నగర ఠాణా పరిధిలో వీరు నివాసం ఉన్నట్లు తెలిసి పోలీసులు విచారణ చేపట్టారు. కలబుర్గిలోనే 9 మంది నివాసం ఉన్నట్లు తేలిందని పోలీసు కమిషనర్ శరణప్ప విలేకర్లకు తెలిపారు. వీరిలో ఇద్దరు దీర్ఘకాల వీసాపై ఉండగా, మిగిలినవారు విజిటర్ వీసాపై వచ్చి మకాం వేసినవారని చెప్పారు. భారత్‌కు వచ్చిన మరో ఇద్దరు అమెరికాకు వెళ్లిపోయారన్నారు. ఉగ్రవాద దాడులు, కేంద్ర ప్రభుత్వం ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీలను గుర్తించి వారి దేశానికి పంపించవలసి ఉంది. రిక్కీ గన్‌మ్యాన్ అరెస్టు దొడ్డబళ్లాపురం: రిక్కీ రై పై కాల్పుల ఘటనలో పోలీసులు గన్‌మెన్ మోనప్ప విఠల్ ను అరెస్టు చేసారు. విఠల్‌ను అరెస్టు చేసిన పోలీసులు రామనగర జేఎంఎఫ్‌సీ కోర్టులో హాజరుపరచగా విచారణ కోసం 10 రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశించింది. ఏప్రిల్ 22న విఠల్‌ను స్టేషన్ తీసుకువచ్చి విచారించగా పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో పాటు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విఠల్ కోలుకున్నాక అరెస్టు చేయడం జరిగింది. అతని వద్ద ఉన్న గన్ స్వాధీనం చేసుకుని పరీక్షించగా బుల్లెట్ల లెక్కలో తేడా కనిపించింది. రిక్కీ రై వద్ద ఉన్న గన్మెన్ల నుంచి మొత్తం 7 గన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎవరి గన్ నుండి ఫైరింగ్ జరిగింది అని కనుక్కునేందుకు ల్యాబ్‌కు తరలించారు. -
హత్య కేసులో జైలుశిక్ష
కెలమంగలం: వివాహేతర సంబంధం గొడవతో వ్యక్తిని హత్య చేసిన ఘటనలో ఆరుమందికి జైలు శిక్ష విధిస్తూ హోసూరు కోర్టులో తీర్పునిచ్చారు. వివరాల మేరకు డెంకణీకోట తాలూకా కెలమంగలం సమీపంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన రాజ (38). ఇతని భార్య పచ్చియమ్మ (30). వీరి బంధువు ధర్మపురి జిల్లా ఎర్రపట్టి గ్రామానికి చెందిన విజి (19). విజితో పచ్చియమ్మకు వివాహేతర సంబంధం ఉండేది. విషయం తెలుసుకొన్న రాజ గత 2016లో బంధువులు ముత్తప్ప (55), మురుగేష్ (24), జగధీష్ (21), ముత్తు (23), మల్లేష్ (21), పొన్నుస్వామి (27)తో కలిసి విజిని హత్య చేశారు. ఈ ఘటనపై కెలమంగలం పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణ హోసూరు కోర్టులో జరుగుతూ వచ్చింది. నిందితులు ముత్తప్ప, జగదీష్‌లు గతంలో చనిపోయారు. నేరం రుజువు కావడంతో మిగతా 6 మందికి జీవితఖైదును విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
తొలి ప్రయత్నంలోనే సివిల్స్ విజేత
హుబ్లీ: నగరంలోని అక్షయ కాలనీ నివాసి డాక్టర్ ఇషికాసింగ్ తన తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ పరీక్షల్లో 206వ ర్యాంక్ సాధించడం ద్వారా జిల్లాకు, రాష్ట్రానికి ఎనలేని కీర్తిని తెచ్చి పెట్టారు. రాజనగర కేంద్రీయ విద్యాలయంలో ఎస్ఎస్ఎల్సీ, గ్లోబల్ పీయూ సైన్స్ కళాశాలలో చదివిన ఇషికా 2023లో కేఎంసీ ఆస్పత్రిలో డిస్టింక్షన్‌తో ఎంబీబీఎస్ ఉత్తీర్ణురాలయ్యారు. ఇక యూపీఎస్సీ పరీక్ష కోసం ఏడాది పాటు మాత్రమే ఆన్లైన్లో సదరు పరీక్షకు శిక్షణ తీసుకున్నారు. దీంతో తొలి ప్రయత్నంలోనే విజేతగా నిలిచారు. ఈమె తండ్రి రాజేష్‌సింగ్ వ్యాపారవేత్త కాగా తల్లి కిరణ్‌సింగ్ హిందీ లెక్చరర్. ఈ సందర్భంగా పీయూఎస్సీ విజేత డాక్టర్ ఇషికాసింగ్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, సోదరుడు రిషిత్ సింగ్ ఆశయం, ప్రోత్సాహం వల్ల తాను ఈ స్థాయికి చేరానన్నారు. తాను ఐఎఫ్ఎస్ లేదా ఐఏఎస్ కావాలని కల కన్నానన్నారు. ఈ రెండింటిలో ఏది వచ్చినా తనకు సంతోషమేనన్నారు. యూపీఎస్సీ సాధనకు నిరంతర అధ్యయనం అవసరం అన్నారు. కోచింగ్ ఉన్నా మన అధ్యయనంపై సదా జాగరూకతతో ఉండాలన్నారు. ప్రశ్న పత్రికల అవలోకనం, ఎప్పటికప్పుడు పరీక్షలను ఎదుర్కోవడం ఎలా అన్నది అలవరుచుకోవాలన్నారు. దీంతో మనలోని దౌర్భల్యాలు తెలుస్తాయి. సానుకూల దృక్పథం ఏర్పడుతుందన్నారు. యూపీఎస్సీ ఆశావహులు ఈ విషయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. హుబ్లీ డాక్టర్‌ను వరించిన 206వ ర్యాంక్ -
కన్నడలో మాట్లాడమన్నందుకు ప్రయాణికునిపై దాడి
సాక్షి,బళ్లారి: ఇటీవల కర్ణాటకలో పలు జిల్లాల్లో కన్నడలో మాట్లాడమన్నందుకు దాడులు జరుగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బెళగావి జిల్లాలో బస్సు కండక్టర్‌పై మరాఠీయులు దాడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హంపీ ఎక్స్‌ప్రెస్ రైలులో అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. మైసూరు నుంచి బయలుదేరిన హంపీ ఎక్స్‌ప్రెస్ రైలులో యలహంక సమీపంలో టికెట్ కలెక్టర్ ప్రయాణికుని వద్దకు వచ్చి టికెట్ అడిగారు. మహమ్మద్ బాషా అనే ప్రయాణికుడిని హిందీ, ఇంగ్లిష్‌లో టికెట్ అడిగినందుకు కన్నడలో మాట్లాడాలని సూచించడంతో మాటామాటా పెరిగింది. టికెట్ కలెక్టర్‌కు కోపం రావడంతో ప్రయాణికుడిపై దాడి చేయడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కొప్పళలో ఆందోళన చేసి కర్ణాటకలో కన్నడలో మాట్లాడమని చెప్పడం తప్పా? అని ఆందోళనకారులు ప్రశ్నించారు. సైకిల్ ఇవ్వనందుకు చిన్నారి ఆత్మహత్య సాక్షి,బళ్లారి: ప్రతి రోజు కలిసి ఆడుకుంటూ ఆనందంగా గడిపే ఇద్దరు చిన్నారుల్లో ఒక చిన్నారి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. చిత్రదుర్గ జిల్లా హిరియూరు పోలీసు స్టేషన్ పరిధిలో గోపాల్, రుద్రమ్మ దంపతుల కుమార్తె స్పందన (11) తన స్నేహితురాలు ఆడుకునేందుకు సైకిల్ ఇవ్వలేదని మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై హిరియూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తి అదృశ్యం హుబ్లీ: జిల్లాలోని కలఘటిగి పట్టణంలోని అక్కివీధి నివాసి బాహుబలి వసుపాల ఉపాధ్యే (59) అనే వ్యక్తి పనికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఈ ఘటనపై బంధువులు కలఘటిగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు సమీపంలోని పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని కలఘటిగి పోలీసులు ఓ ప్రకటనలో కోరారు. నిందితుల అరెస్ట్‌కు డిమాండ్ రాయచూరు రూరల్: వ్యక్తి హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని వాల్మీకి సంఘం నాయకుడు వెంకటేష్ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. గవిగట్టలోని తన భార్యను పిలుచుకు రావడానికి సిరవార తాలూకా హొక్రాణి నుంచి గత నెల 13న వెళ్లిన గూళప్ప అనే వ్యక్తిని భార్య తరపు బంధువులు చితక బాదడంతో అక్కడికక్కడే మరణించాడన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి నెల రోజులు గడుస్తున్నా అరెస్ట్ చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆయన ఆరోపించారు. తాగునీటి సరఫరా కోసం ధర్నా హుబ్లీ: ఽదార్వాడ నగరంలోని వార్డుల్లో సజావుగా తాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ హుబ్లీ ధార్వాడ నగర పాలక సంస్థ బీజేపీ కార్పొరేటర్లు ధార్వాడలో ఆందోళన చేపట్టారు. జిల్లా పంచాయతీ కార్యాలయ ఆవరణలో ధర్నా చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం, హెస్కాం, ఎల్ఎన్టీ కంపెనీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేటర్ శివు హిరేమఠ మాట్లాడుతూ ఇంతకు ముందు నీటిని రెండు రోజులకు ఓ మారు వదిలేవారు. ఇప్పుడేమో 7, 8 రోజులు గడిచినా తాగునీరు సరఫరా కావడం లేదని ఆరోపించారు. ఈ విషయమై ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా నీటిని సరఫరా చేయలేదు. సవదత్తి జాక్వెల్లో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. అందుకే నీటి సరఫరా సక్రమంగా కావడం లేదని ఎన్ఎన్టీ కంపెనీ వారు సాకులను చూపుతున్నారని అన్నారు. కొన్ని వార్డుల్లో 24 గంటలు నీటి సరఫరా వసతి ఉన్నా సజావుగా నీరు రావడం లేదు. అధికారులు సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నారన్నారు. తక్షణమే నీటి సరఫరాకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడికి వచ్చిన జిల్లా ఇన్చార్జి మంత్రి సంతోష్‌లాడ్ వినతిపత్రాన్ని స్వీకరించి తక్షణమే నీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అన్ని వార్డుల్లో సజావుగా నీటి సరఫరా కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్లు సురేష్ బేదర, శంకర సేళకే, జ్యోతి పాటిల్, లక్ష్మీ హిండసగేరి, సీబీ కోటబాగి, నీలవ్వ అరవళద తదితరులు పాల్గొన్నారు. -
బాదామి పుష్కరిణి.. నిత్య జలతరంగిణి
రాయచూరు రూరల్: వందలాది సంవత్సరాల నుంచి నీరు ఎండిన దాఖలాలు లేవు. ఉత్తర కర్ణాటకలోని బాదామిలో నిత్యం జలతరంగంతో కళకళలాడుతున్న పుష్కరిణి అందరినీ ఆకట్టుకుంటోంది. మహాకోటేశ్వర పుణ్య తీర్థంలో ఎల్లప్పుడూ జలం ఊరుతూనే ఉంటుంది. చాళుక్య రాజులు నిర్మించిన చారిత్రక పుణ్యక్షేత్రాల్లో ఒకటైన మహాకోటేశ్వర పుణ్యతీర్థం చెప్పుకోదగింది. మహాకోటేశ్వర ఆలయంలో రెండు పుణ్య స్నానాలు ఆచరించే తీర్థాలున్నాయి. వానల కొరత కారణంగా తాలూకాలోని చెరువులు, బావులు ఎండినా బాదామి బనశంకరిలోని రెండు పుష్కరిణిల్లో నీరు అందుబాటులో ఉన్నాయి. ఆరో శతాబ్దంలో చాళుక్య దొరలు మహాకోటేశ్వర, మల్లికార్జున ఆలయం పరిధిలో రెండు పుణ్య స్నానాలు ఆచరించడానికి పుష్కరిణిలను ఏర్పాటు చేశారు. విష్ణు పుష్కరిణిలో భూగర్భ జలం నిరంతరం ఊరుతుంది. 8 అడుగుల పొడవు, ఐదు అడుగుల వెడల్పు ఉన్న ఈ పుష్కరిణిలో ఉత్తర దిక్కున చతుర్మఖ బ్రహ్మ దేవాలయం, వాయువ్య దిక్కున ఈశ్వరుడి విగ్రహాలను ఈత కొడుతూ వెళ్లి దర్శనం చేసుకుని రావాల్సి ఉంటుంది. చిన్న పుష్కరిణిని కాశీ హొండ అంటారు. చిన్న పుష్కరిణిలో పుణ్యస్నానమాచరించి అనంతరం విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి మహాకోటేశ్వర, మల్లికార్జున ఆలయంలో దర్శనాలు చేసుకుంటారు. చిన్న పుష్కరిణి కాశీ హొండలో ఆరు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పున నీరు పైకి ఎగజిమ్ముతాయి. ఆ నీటిని రైతులు కాలువ ద్వారా వినియోగించుకొని చెరుకు, అరటి, కొబ్బరి, వక్క, మామిడి, నిమ్మ, వేరుశనగ, ఇతర పంటలను పండిస్తారు. ఎల్లప్పుడూ ఊరుతున్న జలం నీరు ఎండిన దాఖలాలు లేవు -
పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం
రాయచూరు రూరల్: జమ్మూకశ్మీర్‌లోని బైసారన్, పహల్గాంల మధ్య మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారికి కాంగ్రెస్, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులను వెలిగించి సంతాప ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం రాత్రి అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో కేపీసీసీ కార్యాధ్యక్షుడు, ఎమ్మెల్సీ వసంత కుమార్, రవి, విశ్వ హిందూ పరిషత్, భజరంగ దళ్ సంచాలకులు మునిరెడ్డి మాట్లాడారు. కశ్మీర్‌లోని పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర ప్రభుత్వం న్యాయం లభించేలా చూడాలన్నారు. ఈ విషయంలో ప్రత్యేక విచారణ చేపట్టి నిందితులకు ఉరిశిక్ష వేయాలన్నారు. తీన్ కందిల్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీ చేశారు. ర్యాలీలో శ్రీనివాసరెడ్డి, శాలం, రజాక్ ఉస్తాద్, బసవరాజ్ పాటిల్ ఇటగి, రాజశేఖర్ రామస్వామి, ప్రేమలతలున్నారు. ఉగ్రవాదులను అంతం చేయాలి హొసపేటె: ఉగ్రదాడిని ఖండిస్తూ పునీత్‌కుమార్ సర్కిల్లో సీపీఐ(ఎం) తాలూకా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యదర్శి ఎన్.యల్లాలింగ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉగ్రవాదుల నిర్మూలనకు భారత కమ్యూనిస్ట్ పార్టీ(మార్క్సిస్ట్) పూర్తి మద్దతు ప్రకటించిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం సంకుచితంగా ఉండకూడదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కశ్మీర్‌లోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చొరవ తీసుకోవాలన్నారు. పర్యాటకుల కుటుంబాలు చెప్పినట్లుగా అక్కడి ముస్లిం సమాజం రక్షణ కోసం నిలుస్తోందన్నారు. ఈ విషయంలో మత ఘర్షణలను నివారించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. తన భార్య, పిల్లల ముందే తనను కాల్చి చంపిన ఉగ్రవాదులను ఎప్పటికీ క్షమించరాదన్నారు. కానీ దేశంలోకి చొరబాట్ల గురించి కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా సమాచారం ఉందా? అక్కడ రక్షణ దళ అధికారులను ఎందుకు మోహరించలేదు? అని ఆయన ప్రశ్నించారు. పార్టీ నేతలు ఏ.కరుణానిధి, జంబయ్య నాయక్, బిసాటి మహేష్, యల్లమ్మ, సిద్దలింగప్ప, ఉమామహేశ్వర, ఈడిగర మంజునాథ, వి.స్వామి తదితరులు పాల్గొన్నారు. -
మలేరియా నివారణపై జాగృతి జాతా
హొసపేటె: జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రపంచ మలేరియా దినోత్సవంపై జాగృతి జాతాను నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లా ఆర్సీహెచ్ఓ అధికారి డాక్టర్ జంబయ్య నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఇళ్ల చుట్టూ ఉన్న ప్రాంతాల్లో పరిశుభ్రతను పాటించాలన్నారు. దోమ కాటుకు వ్యతిరేకంగా నివారణ చర్యలుగా దోమతెరలు, వేప పొగను ఉపయోగించాలని సూచించారు. దోమల బెడదను అరికట్టి మలేరియా వ్యాధి సోకకుండా కాపాడుకోవాలని కోరారు. అదే విధంగా నీరు నిల్వ చేయకుండా చూసుకోవాలన్నారు. అనంతరం ర్యాలీని ఆస్పత్రి ఆవరణ నుంచి ప్రారంభించి ప్రముఖ వీధుల గుండా బయలుదేరి అంబేడ్కర్ సర్కిల్ వరకు చేపట్టారు. జిల్లా ఆరోగ్య విద్యాధికారి ఎం.దొడ్డమని, వైద్యులు సతీష్, బసవరాజ్, జిల్లా ఆరోగ్య ఇన్స్పెక్టర్ ఎం.ధర్మనగౌడ, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ అధికారులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. మలేరియాను పారదోలదాం రాయచూరు రూరల్: జిల్లాలో మలేరియా వ్యాధి నియంత్రణకు సహకరించాలని జిల్లా ఆరోగ్య కుటుంబ సంక్షేమ నోడల్ అధికారిణి సంధ్య పిలుపునిచ్చారు. ఆమె రాగిమానుగడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ప్రపంచ మలేరియా దినోత్సవ జాతాకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మలేరియా వ్యాధి గురించి అవగాహన పెంచుకుని దాని నియంత్రణకు ముందుకు రావాలన్నారు. -
ఆర్థిక సంక్షోభంలో ప్రపంచ దేశాలు
బళ్లారిటౌన్: ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని ఎస్‌యూసీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కే.సోమశేఖర్ పేర్కొన్నారు. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ 78వ సంస్థాపన దినోత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. భారతదేశం కూడా పలు సంక్షోభాలను ఎదుర్కొందన్నారు. కమ్యూనిస్ట్‌లు, మార్కిస్ట్‌లు ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాలను తమ జీవితంలో అలవరుచుకోవాలన్నారు. ఈ సిద్ధాంతాన్ని కామ్రేడ్ శివదాస్ ఘోష్ ప్రతిపాదించేవారని గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా మతతత్వ పెట్టుబడిదారుల నియమాలను పాటిస్తోందన్నారు. కార్మికులు, రైతుల హక్కులపై దాడులు చేస్తోందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టుబడిదారుల పరంగా ఉందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నియమాలను పాటిస్తూ ధరల పెంపుతో పేదలు, సామాన్య వర్గాల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, జిల్లా సమితి సభ్యులు మంజుల, ఏ.దేవదాసు, సోమశేఖర్‌గౌడ, ప్రమోద్, శాంత, గోవింద, ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనుల పరిశీలన
రాయచూరు రూరల్: నగరంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను నగరసభ సభ్యులతో కలిసి కాంగ్రెస్ నేత రవి బోసురాజు పరిశీలించారు. శనివారం కేఈబీ కాలనీలో నగరసభ సభ్యులు జయన్న, రమేష్, దరూరు బసవరాజ్, శ్రీనివాసరెడ్డి పర్యటించి జరుగుతున్న పనులను తిలకించారు. త్వరితగతిన పనులు ముగించాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. అదే విధంగా 9, 10, 11వ వార్డుల్లో పర్యటించి అధ్వానంగా మారిన మురుగు కాలువలు, రహదారులను పరిశీలించారు. గుండెపోటుతో పురసభ అధికారి మృతి సాక్షి,బళ్లారి: లంచం తీసుకుంటూ పట్టుబడిన పురసభ ముఖ్యాధికారి గుండెపోటుతో మృతి చెందిన ఘటన చిత్రదుర్గ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు.. చిత్రదుర్గ జిల్లా హొసదుర్గ తాలూకా పురసభ ముఖ్యాధికారి తిమ్మరాజు అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. మృతుడు ఈనెల 20న లంచం తీసుకుంటున్న కేసులో అరెస్ట్ అయ్యారు. బీ ఖాతా చేసేందుకు రూ.50 వేలు లంచం తీసుకుంటుండటంతో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జైలులో ఉన్న తిమ్మరాజు గుండెపోటుతో మరణించారు. ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి ●● ఇద్దరి పరిస్థితి విషమం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని బణవికల్లు గ్రామ సమీపంలోని 50వ నంబరు జాతీయ రహదారిపై రాళ్లతో నిండిన ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని ఖాదర్ బాషా(32)గా గుర్తించారు. కొప్పళ జిల్లాలోని హర్లాపుర గ్రామం నుంచి దావణగెరె జిల్లాలోని డొణేహళ్లి గ్రామానికి రాతి స్తంభాలను ట్రాక్టర్ తీసుకెళ్తోంది. ఈ సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ట్రాక్టర్ బోల్తా పడింది. ట్రాక్టర్ ట్రాలీలో బండలపై కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై రాళ్లు పడటంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలంలో హైవే సహాయ బృందం, టోల్ సిబ్బంది, కానాహొసహళ్లి పీఎస్ఐ సిద్రామ క్షతగాత్రులకు సహాయ చర్యలు చేపట్టి వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కానాహొసహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. కాటికాపరుల నిరసన రాయచూరు రూరల్: శ్మశానంలో విధులు నిర్వహించే కాటికాపరులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కాటికాపరుల సంఘం డిమాండ్ చేసింది. శనివారం రాయచూరు తాలూకా శాఖవాది గ్రామపంచాయతి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు వీరేష్ మాట్లాడారు. శ్మశానంలో విధులు నిర్వహించే కాటికాపరులకు పంచాయితీల నుంచి పరికరాలు, దుస్తులు, షూ, సాక్సులు, చేతులకు గ్లౌజ్‌లు, ఇతర పరికరాలను అందించకుండా నిర్లక్ష్యం వహించడం తగదన్నారు. త్వరితగతిన కాటికాపరులకు మౌలిక సౌకర్యాలు కల్పించాలని కోరుతూ గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారికి వినతిపత్రం సమర్పించారు. ప్రతి కోర్ ఇంజినీర్‌కు ఉద్యోగావకాశాలు హొసపేటె: ప్రతి కోర్ ఇంజినీర్ కోసం 30 ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తున్నాయి. కానీ విద్యార్థులు తమ ఇంజినీరింగ్ విద్య ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవాలని ధార్వాడ గ్లోబల్ ఇన్ఫోటెక్ టెక్నికల్ డైరెక్టర్ అనిల్ ఘాస్టే అభిప్రాయపడ్డారు. శుక్రవారం హొసపేటె ప్రౌఢదేవరాయ సాంకేతిక విద్యా కళాశాలలో మెకానికల్ విభాగం ద్వారా ఐక్యూఏసీ సహకారంతో కళాశాల అబ్దుల్ కలాం సెమినార్ హాలులో ఏర్పాటు చేసిన ఐదు రోజుల ఆటో డెస్క్ ప్యూజన్–360పై వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేవలం సాఫ్ట్వేర్లు మీరు నేర్చుకుంటే వారు నిజమైన ఇంజినీరు కాదు, ఇంజినీరింగ్ ప్రాథమిక సూత్రాలను తెలుసుకోవడం, ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను నేర్చుకోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పారిశ్రామిక రంగంలో కోర్ ఇంజినీర్ల ఉద్యోగాలకు ఐదు రెట్ల డిమాండ్ ఉందన్నారు. బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్(బీఐఎం) పరిశ్రమలో మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ నిపుణుల కోసం ఒకటిన్నర లక్షల ఉద్యోగ అవకాశాలు ఎదురు చూస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రోహిత్, ఉపన్యాసకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వంచన, బెట్టింగ్ కేసుల్లో ఇద్దరి అరెస్ట్
కోలారు : వేర్వేరు కేసుల్లో నాగేంద్ర ప్రసాద్, సయ్యద్ సాధిక్ అనే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కోలారుకు చెందిన నాగేంద్ర ప్రసాద్ ఇదే నగరంలోని కారంజికట్టకు చెందిన వెంకటాచలపతిని సంప్రదించి తక్కువ ధరకు ఇంటి నివేశసం ఇప్పిస్తానని నమ్మ బలికి రూ. 50 లక్షలు తీసుకున్నాడు. స్థలం ఇప్పించకపోవడంతో నగదు వెనక్కు ఇవ్వాలని వెంకటాచలపతి డిమాండ్ చేశాడు. దీంతో నాగేంద్ర ప్రసాద్ తాళం వేసిన పాత ట్రంకు పెట్టెను ఇచ్చి అందులో డబ్బు, బంగారం ఉందని నమ్మించాడు. దానిని తెరిస్తే ఈడి, లోకాయుక్త దాడులు చేస్తారని భయ పెట్టాడు. అయితే ఇదంతా మోసం అని తెలుసుకున్న వెంకటాచలపతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నాగేంద్ర ప్రసాద్‌ను అరెస్టు చేశారు. క్రికెట్ బెట్టింగ్దారుడి పట్టివేత ముళబాగిలు పట్టణంలోని నూగల బండ నివాసి సయ్యద్ సాదిక్ అనే వ్యక్తి ఆన్లైన్ ద్వారా ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా ముళబాగిలు సీఈఎన్ పోలీసులు దాడి చేశారు. అతని వద్దనుంచి రెండు మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలో ఉన్న 32 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
తనకు తానే కాల్పులు జరుపుకున్న రిక్కీరై!
కర్ణాటక: పారిశ్రామికవేత్త రిక్కీరైపై జరిగిన కాల్పుల ఘటన మలుపు తిరిగింది. ఆయన తనంటత తానే కాల్పులు జరుపుకున్నారని కాల్పుల వ్యవహారంలో అరెస్ట్ అయిన మాజీ గన్‌మెన్ మన్నప్ప విఠల్ వాంగ్మూలం ఇచ్చారు. కాల్పులకు పాల్పడ్డారనే అనుమానంతో మన్నప్పవిఠల్ను బిడది పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతన్ని రామనగర కోర్టులో హాజరుపరిచి 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు.తమదైనశైలిలో విచారణ చేపట్టగా రిక్కీరై తనంతటతానే కాల్పులు జరుపుకున్నట్లు మన్నప్ప విఠల్ వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో రిక్కీరై షూటౌట్ కాల్పుల ఘటనపై నాటకం ఆడినట్లు అనుమానం మరితం బలపడినట్లైంది. మాజీ డాన్ దివంగత ముత్తప్పరై చిన్నకుమారుడు పారిశ్రామికవేత్త రిక్కీ రైపై ఈనెల 18వ తేదీ రాత్రి 11.30 సమయంలో కారులో బెంగళూరుకు వెళ్తుండగా బిడది వద్ద ఆయనపై ఫైరింగ్ జరిగింది. రిక్కీరై ముక్కు, చేతులకు గాయాలయ్యాయి. అనంతరం అతడిని బెంగళూరు హెచ్ఏఎల్ రోడ్డులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులకు షూటౌట్ జరిగిన స్థలంలో లభించిన బుల్లెట్, విఠల్ వద్ద ఉన్న గన్లోనిదని తేలింది. పోలీసులు ఇతడి గన్ను స్వాదీనం చేసుకుని ఎప్ఎస్ఎల్ ల్యాబోరేటరీకి పంపించారు. ముత్తప్పరై వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్న విఠల్.. రిక్కీ రై వద్దనే పనిచేసేవాడు. ఆరోగ్యం సరిగాలేనందున ఆ ఉద్యోగం వదిలిపెట్టి ఇంటివద్ద సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. ముత్తప్పరై చనిపోకముందు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. కానీ రిక్కీ రై సైట్ ఇవ్వడానికి నిరాకరించారు. ఈ కారణంతో మన్నప్పవిఠల్ కోపంతో ఉండవచ్చని అనుమానం వ్యక్తమైంది. రిక్కీరై గన్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదులో ముగ్గురు పేర్లు ఉండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసులో ఉన్న పాత్ర ధ్రువీకరించడానికి ఎలాంటి సాక్ష్యాలు కనబడకపోవడంతో ఎవరినీ అరెస్ట్ చేయలేదు. ముత్తప్పరై మాజీ సహచరుడు, మొదటి ఆరోపి రాకేశ్మల్లి, మూడో ఆరోపి నితీశ్శెట్టిని విచారణ చేపట్టి పోలీసులు వదిలిపెట్టారు. రెండో ఆరోపి ముత్తప్పరై రెండో భార్య అనురాధ విదేశాల్లో ఉన్నారు. -
ప్రతిరోజు 2 వేల కొత్త వాహనాలు రోడ్లపైకి
బెంగళూరు దేశంలోనే శరవేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య పెరుగుతోంది. ప్రతిరోజు సుమారు 2 వేల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తుండటంతో మళ్లీ నగరంలో వాహనాల సంఖ్య 1.25 కోట్లకు చేరుకుంది. ప్రపంచంలోనే నత్తనడక సంచార రద్దీ కలిగిన నగరాల్లో బెంగళూరు రెండో స్థానంలో ఉంది. నగరవాసులు తమ ప్రయాణ సమయంలో సగానికి పైగా సమయం ట్రాఫిక్ సిగ్నల్స్‌తో వాహనాల రద్దీలో కోల్పోతున్నారు. దీంతో పాటు నగరవాసులు ఏడాదికి 260 గంటలు రోడ్లలోనే గడిపే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో తక్కువ ధరకు ఢిల్లీలో లభించే వేలాది వాహనాలు బెంగళూరు రోడ్లపైకి వస్తే ఇక్కడ పరిస్థితి ఊహించుకుంటేనే భయం వేస్తోంది. -
వారేమైనా అంత నిజాయితీపరులా?
మైసూరు: బీజేపీ నాయకులపై ఎందుకు ఈడీ అధికారులు దాడి చేయడం లేదు, వారేమైనా అంత నిజాయితీపరులా? అని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈడీపై మండిపడ్డారు. శుక్రవారం చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలెమహదేశ్వర బెట్టలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేయడం కేవలం రాజకీయ కుట్ర అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఈడీ అధికారులు కాంగ్రెస్ నాయకుల ఇళ్లపైన, ఎమ్మెల్యేల పైన దాడి చేస్తున్నారని విరుచుకు పడ్డారు. ఎమ్మెల్యే వినయ్ కులకర్ణి ఇంటిపై కేంద్రం ఒత్తిడి మేరకే దాడి జరిగిందని ఆరోపించారు. నా అధికారం మరింత పదిలం చామరాజనగర జిల్లాకు ముఖ్యమంత్రిగా వస్తే అధికారం కోల్పోతారనే పుకార్లు, అనేక మూఢనమ్మకాలు కూడా ఉన్నాయన్నారు. కాని తాను చామరాజనగరకు వచ్చిన ప్రతిసారి తన అధికారం మరింత బలపడుతోందని అన్నారు. సీఎం అయిన తర్వాత 20 సార్లకు పైగా చామరాజనగరకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. అయినా తన అధికారం మరింత పదిలమైంది తప్ప ఇబ్బందులు కలుగలేదన్నారు. తాను రెండోసారి ముఖ్యమంత్రిని కూడా అయ్యానన్నారు. మలెమహాదేశ్వరునికి వెండిరథ సేవ, పూజ చేశానన్నారు. గురువారం రాత్రి ఇక్కడ బస చేసి శుక్రవారం తెల్లవారు జామున మలెమహదేశ్వర స్వామి సన్నిధిలో పూజలు చేసిన తర్వాత స్వామి వెండిరథ పూజలో పాల్గొన్నానన్నారు. ప్రజలు తనకు కానుకగా ఇచ్చిన వెండిని వెండి రథ సేవకు సమర్పించానన్నారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మండిపాటు మలెమహదేశ్వరునికి సీఎం వెండిరథ సేవ చిన్నారికి నామకరణం చేసిన ముఖ్యమంత్రి -
కావేరి హారతికి రూ.92 కోట్లు
మండ్య : దక్షిణ గంగగా ప్రసిద్ధి చెందిన కావేరి హారతికి సుమారు రూ.92 కోట్లను ప్రత్యేక పథకంలో మంజూరు చేశామని, దీనికి మంత్రి మండలిలో ఆమోదం తెలిపి నిర్ణయం తీసుకున్నామని, త్వరలో ప్రత్యేక సమితిని ఏర్పాటు చేస్తామని ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్ అన్నారు. మండ్యలోని కేఆర్ఎస్కు వచ్చి జలాశయం వద్ద నడుస్తూ పరిశీలించిన అనంతరం అధికారులతో నిర్వహించిన సమావేశం, అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కావేరి హారతి కర్ణాటక రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తుందన్నారు. కేరళ, తమిళనాడుకు చెందిన ప్రజలు కూడా వచ్చి కావేరి పూజలో పాల్గొనవచ్చన్నారు. కావేరి హారతిని ఒకేసారి సుమారు 10 వేల మంది పాల్గొని చూసే ఆవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎన్ని రోజులు హారతి ఇవ్వాలి అనేది రాబోయే రోజుల్లో బెంగళూరులో అధికారులతో జరిగే సమావేశంలో నిర్ణయిస్తామని అన్నారు. కావేరి హారతి కార్యక్రమానికి వచ్చె ప్రజలు కార్యక్రమం మొత్తం ముగిసే వరకు ఉండి అనంతరం వారు వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఇందు కోసం రెవిన్యూ, దేవదాయ, పర్యాటక, నీటిపారుదల, బెస్కాంతో పాటు ఇతర అనేక శాఖల అధికారులతో కూడిన సమితిని ఏర్పాటు చేసి మరో రెండు మూడు రోజుల్లో నమూనా మొత్తం సిద్ధం చేస్తామన్నారు. కేఆర్ఎస్, బృందావనం అభివృద్ధి కోసం ఇప్పటికే టెండర్ పిలిచామన్నారు. కేఆర్ఎస్ పరిధిలోని సుమారు 4 పంచాయతీల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకం అమలు చేస్తామన్నారు. డీసీఎం డీ.కే.శివకుమార్ -
విహారయాత్రలో విషాదం
● ఇద్దరు వైద్య విద్యార్థినుల మృతి ● ఉత్తర కన్నడ జిల్లాలో ఘోరం యశవంతపుర: విహారయాత్రకు వెళ్లిన ఇద్దరు తమిళనాడుకు చెందిన మెడికల్ విద్యార్థులు సముద్రంలో మునిగి మృత్యువాత పడ్డారు. ఉత్తర కన్నడ జిల్లా గోకర్ణ వద్ద మెడికల్ విద్యార్థులు కాంజిమోళి, సింధుజా మృతి చెందారు. విద్యార్థులను రక్షించటానికి స్థానికులు అనేక ప్రయత్నాలు చేశారు. జోరుగా అలలు రావటంతో రక్షించటానికి సాధ్యం కాలేదు. మృతులు తమిళనాడులోని తిరుచ్చి మెడికల్ కాలేజీలో చివరి సంవత్సరం మెడిసిన్ చదువుతున్నట్లు తెలిసింది. అనంతరం తీర రక్షణ దళం గాలించి మృతదేహాలను వెలికి తీశారు. గోకర్ణ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాలకు పోస్టుమార్టం చేయించారు. సీసీబీ పోలీసుల కస్టడీకి ఓంప్రకాష్ సతీమణి బనశంకరి: విశ్రాంత డీజీపీ ఓంప్రకాష్ హత్యకేసులో కటకటాల పాలైన ఆయన సతీమణి పల్లవిని సీసీబీ పోలీసులు 7 రోజుల కస్టడీకి తీసుకున్నారు. పల్లవిని మే 3 తేదీవరకు కస్టడీకి ఇవ్వాలని ఓంప్రకాష్ హత్యకేసు దర్యాప్తు చేపడుతున్న సీసీబీ ఏసీపీ దర్మేంద్ర నేతృత్వంలోని బృందం బెంగళూరు 39 ఏసీఎంఎంకోర్టుకు విన్నవించింది. దీంతో పల్లవిని 7 రోజులు కస్టడీకి ఆదేశిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ఓంప్రకాష్ హత్యకేసులో ఏ2 ఆరోపిగా ఉన్న కుమార్తె కృతి మానసిక అస్వస్థతకు గురికావడంతో నిమ్హాన్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఒకే నెలలో శ్రీకంఠేశ్వరునికి రూ.2.59 కోట్ల కానుకలు మైసూరు: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన నంజనగూడులో వెలిసిన శ్రీకంఠేశ్వర స్వామి వారి సన్నిధిలోని హుండీల్లో భక్తుల నుంచి వచ్చిన కానుకలను శుక్రవారం లెక్కించారు. నెల రోజుల వ్యవధిలో స్వామివారికి నగదు, బంగారం, వెండి, విదేశీ కరెన్సీతో పాటు సుమారు రూ.2.59 కోట్లు కానుకలుగా వచ్చాయి. శ్రీకంఠేశ్వర స్వామి ఆలయంలో ఉన్న దాసోహ భవనంలో ఆలయ సిబ్బంది, బ్యాంకు అధికారులు కలిసి సీసీ టీవీ కెమెరాల పకడ్బందీ నిఘా మధ్య హుండీల్లోని కానుకలను లెక్కించారు. ఆలయ హుండీల్లో 2 కోట్ల 59 లక్షల 46 వేల 79 రూపాయల నగదు, 103 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారం, 3 కిలోల 300 గ్రాముల వెండితో పాటు అరబ్ ఎమిరేట్స్ 15, యూరో 1, సౌదీ అరేబియా 1, మలేషియా 1, కెనడా డాలర్ 1, ఒమన్ 2, ఇంగ్లండ్ పౌండ్లు 2, అమెరికా డాలర్ 1తో కలిపి మొత్తం 24 కరెన్సీ నోట్లు స్వామివారికి కానుకగా లభించాయని ఆలయ ఈఓ జగదీష్ కుమార్ తెలిపారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఎవరు అడిగారు? ● స్మార్ట్‌మీటర్ల ధరకు సంబంధించి ప్రభుత్వంపై హైకోర్టు మండిపాటు బనశంకరి: కొత్తగా నిర్మించిన ఇంటికి స్మార్ట్‌మీటరు అమర్చుకోవాలని డిమాండ్ చేసిన బెస్కాం ఇచ్చిన లేఖపై స్టే ఇచ్చిన హైకోర్టు స్మార్ట్ మీటర్లు ధర నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వంపై మండిపడింది. స్మార్ట్‌మీటరు అమర్చుకోవాలని డిమాండ్ చేస్తూ దొడ్డబళ్లాపుర అసిస్టెంట్ ఇంజినీర్ జయలక్ష్మి ఇచ్చిన లేఖను ప్రశ్నిస్తూ వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి ఎం.నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం లేఖపై స్టే ఇచ్చింది. అంతేగాక ప్రభుత్వం తరపు న్యాయవాదిని ఉద్దేశిస్తూ హైకోర్టు ధర్మాసనం వీటన్నింటికీ ఉచిత గ్యారంటీలతో తలెత్తే సమస్యలపై ప్రశ్నించింది. ఉచితంగా విద్యుత్ కావాలని ఎవరు అడిగారు. పేదలకు ఒక్కసారిగా ఈవిధంగా ధర పెంచితే ఎక్కడికి వెళ్లాలి. అందరూ అధిక మొత్తంలో డబ్బులిచ్చి స్మార్ట్‌మీటర్లు అమర్చుకోవాలంటే పేదలు ఏం చేయాలంటూ ప్రశ్నించింది. వాదప్రతివాదనలు ఆలకించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వం, బెస్కాం తరఫున న్యాయవాదికి నోటీస్ జారీ చేసి విచారణ జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. -
అలరిస్తున్న పెయింటింగ్స్ ప్రదర్శన
బనశంకరి: మలెనాడుకు చెందిన వర్ధమాన కళాకారుడు కోటెగద్దె రవి గీసిన పెయింటింగ్స్ ఆహుతులను ఆకట్టుకున్నాయి. బనశంకరి రెండోస్టేజ్ పెడలిటస్ ఆర్ట్ గ్యాలరీలో స్పిరిచువల్ జర్నీ ఆఫ్ ఇండియా పేరుతో విభిన్న రకాల పెయింటింగ్స్ ప్రదర్శన నగరవాసులకు కనువిందు చేస్తోంది. ఆధ్యాత్మికతను ఇతివృత్తంగా చేసుకుని కళాకారుడు కోటెగద్దె రవి తమ మనసులోని భావాలను కుంచె ద్వారా నవ్యమైన చిత్రాలకు జీవం పోశారు. పతంజలి మహర్షి, మధ్వాచార్యులు, రామానుజాచార్య, బసవణ్ణ, అక్కమహాదేవి, అల్లమప్రభు, ధన్వంతరి తదితరుల పెయింటింగ్స్ ను ఎంతో అద్భుతంగా గీశారు. అంతేగాక సెమి అబ్స్ట్రాట్ స్టైల్ పెయింటింగ్‌ను నవ్యంగా గీశారు. భారతదేశంలో ఆధ్యాత్మికత కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తుల పెయింటింగ్స్ ను తనదైన శైలిలో రూపకల్పన చేశారు. -
పొలంలో యువకుడి దారుణ హత్య
సాక్షి,బళ్లారి: పొలంలో పని చేస్తున్న ఓ యువకుడిని వేటకొడవళ్లతో నరికి దారుణంగా హత్య చేసిన ఘటన శుక్రవారం కలబుర్గి జిల్లా ఆళంద తాలూకా నరోణలో జరిగింది. గ్రామ సమీపంలోని పొలంలో ఉన్న చెన్నవీర(26) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పారిపోయారు. సమాచారం తెలిసిన వెంటనే నరోణ పోలీసులు హుటాహుటిన చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టంకు ఆస్పత్రికి తరలించారు. కలబుర్గిలో కలకలం రేపిన ఈ ఘటనపై అక్కడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పిస్తోల్‌తో కాల్చుకుని యువకుడు బలవన్మరణం సాక్షి,బళ్లారి: తండ్రి వద్ద ఉన్న లైసెన్స్డ్ తుపాకీతో తలకు కాల్చుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం విజయపుర నగరంలో జరిగింది. అక్కడి శికారిఖానాలో నివాసం ఉంటున్న మాజీ కార్పొరేటర్ ప్రకాష్ మీర్జా కుమారుడు ఆశారాం మీర్జా(22) అనే యువకుడు తన తండ్రి లైసెన్స్డ్ తుపాకీని తీసుకుని బెడ్రూంలో తలలోని కణతకు కాల్చుకుని కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడి ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. తుపాకీతో యువకుడు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలియగానే డీఎస్పీ, సీఐ, ఎస్ఐ తదితరులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి హుబ్లీ: హుబ్లీ తాలూకా ఇంగళహళ్లి గ్రామంలో ఓ మహిళ శవంగా లభ్యమైన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లాలోని కుందగోళకు చెందిన పుష్పా బిళేబాల(30)ను మృతురాలిగా గుర్తించారు. మహిళ భర్త రామజ్జ గురువారం కుందగోళ నుంచి తాలూకాలోని జుండూర గ్రామానికి పెళ్లి కార్యం కోసం భార్యను తీసుకెళ్లి ఇంగళహళ్లిలో వదిలి వచ్చాడు. సాయంత్రం భారీగా వర్షం పడటంతో పిడుగు పడి మృతి చెంది ఉండవచ్చని ఆ మహిళ తండ్రి విరుపాక్షప్ప దయన్నవర హుబ్లీ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాగులో వృద్ధురాలి మృతదేహం కాగా మరో ఘటనలో ఓ వృద్ధురాలి శవం నగరంలోని నారాయణ చోప దగ్గర కర్కివాగులో లభించింది. సుమారు 60 ఏళ్ల వయస్సు ఉన్న ఈమె గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలతో కర్కివాగు వరద ప్రవాహంలో శవం కొట్టుకొచ్చింది. ఈమె ఆచూకీ లభించలేదు. శవాన్ని కేఎంసీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొన్నట్లు కసబాపేట పోలీసులు తెలిపారు. డిపో మేనేజర్ వేధింపులతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం రాయచూరు రూరల్: ఆర్టీసీ డిపో మేనేజర్ వేధింపులను భరించలేక ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన గురువారం రాత్రి రాయచూరు జిల్లా లింగసూగూరు ఆర్టీసీ డిపోలో జరిగింది. వివరాలు.. లింగసూగూరు ఆర్టీసీ డిపోలో హైదరాబాద్ వెళ్లి వచ్చే బస్సుకు అబ్దుల్ శిరూరు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి కండీషన్ లేని పాత బస్‌ను అప్పగించి బలవంతంగా అదే డ్యూటీని వేసి అదే బస్సుకు వెళ్లాలని డిపో మేనేజర్ రాహుల్ హునసూరే సూచించాడు. పైగా కిలోమీటర్ పర్ లీటర్(కేఏంపీఎల్)ను తేవాలని ఒత్తిడి చేయడమేగాక నానా విధాలుగా వేధిస్తుండటంతో పాటు మానసికంగా బెదిరిస్తున్నాడని సమాచారం. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగడంతో మనస్తాపం చెందిన అబ్దుల్ శిరూరు డిపో మేనేజర్ ముందే విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. అతనిని సహోద్యోగులు గమనించి వెంటనే ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతున్నాడు. నరేగ పనులపై పర్యవేక్షణరాయచూరు రూరల్: జిల్లాలో నిర్వహిస్తున్న నరేగ పనులపై పర్యవేక్షణకు కేంద్ర బృందం పలు ప్రాంతాల్లో పర్యటించింది. శుక్రవారం మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకంలో జరుగుతున్న పనులపై పరిశీలిస్తున్న నేపథ్యంలో జెడ్పీ ప్రణాళికాధికారి శరణ బసవ, శివశంకర్, అవనేంద్ర కుమార్ పీడీఓ, కార్యదర్శులపై మస్కి తాలూకా పామన కల్లూరు, చించిరమడిలో దాడులు చేశారు. కవితాళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. -
ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకలించాలి
సాక్షి,బళ్లారి: జమ్ముకశ్మీరులోని పహల్గాంలో జరిగిన మారణహోమాన్ని ఖండిస్తూ ముస్లింలు పెద్ద ఎత్తున నగరంలో నిరసన, మౌన ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం నగరంలోని ముస్లిం మత పెద్దలు, గురువులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి ఉగ్రవాదుల తీరుపై మండిపడ్డారు. హత్యలు చేయమని ఏ ధర్మం(మతం)లోను బోధించలేదన్నారు. అలాంటిది దేశంలో హింసను రేకెత్తిస్తున్న ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించాలన్నారు. ప్రధాని, కేబినెట్ మంత్రులు ఈ విషయంలో తీసుకునే ఎలాంటి నిర్ణయానికై నా తామందరం కలిసికట్టుగా మద్దతు ఇస్తామన్నారు. దేశంలో శాంతిని కాపాడానికి, దేశంలో ఉగ్రవాదుల ఏరివేతకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. కశ్మీరులో జరిగిన హింస యావత్ ముస్లిం సమాజాన్ని కూడా కలిిచి వేసిందన్నారు. అమాయకులను దారుణంగా హత్య చేయడం ఎంత వరకు సమంజసం అన్నారు. పార్టీలకు, మతాలకు అతీతంగా దారుణాలను ఖండిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా తాము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. దాదాపు 30 మంది మరణానికి కారకులైన ఉగ్రవాదులను తుడిచిపెట్టాలని అన్నారు. మన భారతదేశం కొట్టే దెబ్బకు వారి గుండెల్లో వణుకు పుట్టాలన్నారు. దేశంలో, ప్రపంచంలోని ఉగ్రవాదులందరికి ఒక హెచ్చరిక చేయాలన్నారు. అనంతరం జిల్లాధికారి ద్వారా కేంద్రానికి వినతిపత్రం సమర్పించారు. మాజీ బుడా అధ్యక్షుడు హుమయూన్‌ఖాన్, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, ముస్లిం నేతలు పాల్గొన్నారు. పహల్గాం దాడిపై కాంగ్రెస్ నిరసన జమ్ముకశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై విక్షణారహితంగా కాల్పులు జరిపి మారణహోమాన్ని సృష్టించిన ఉగ్రవాదుల హింసను ఖండిస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. శుక్రవారం నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి నగరంలోని గాంధీ విగ్రహం నుంచి రాయల్ సర్కిల్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపివేయాల్సిందేనని నేతలు సూచించారు. ఉగ్రవాదం ప్రమాదకరమైందని, అణిచివేసేందుకు కేంద్రం గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అమాయకులైన పర్యాటకులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల నామరూపాల్లేకుండా చేయాలన్నారు. ఇది ఉగ్రవాదుల పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఆలస్యం చేయకుండా ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం అసన్నమైందన్నారు. కార్యక్రమంలో మేయర్ ముల్లంగి నందీశ్, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కోనంకి రామప్ప, చానాళ్ వేఖర్తో పాటు కార్పొరేటర్ రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. పహల్గాం ఉగ్రదాడిపై ఆందోళన ఇటీవల కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి, మారణహోమాన్ని ఖండిస్తూ శుక్రవారం కలబుర్గిలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. భజరంగదళ్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నగరంలో పాకిస్థాన్ జెండాలు, స్టిక్కర్లను నేలపై అతికించి నిరసన తెలియజేయడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరంలోని ప్రధాన రహదారుల్లో పాకిస్థాన్‌కు విరుద్ధంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. హిందువులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకలించి వేయాలన్నారు. ఉగ్రవాదం తుదముట్టించాలని, వారి మూలాలు వెతికి పట్టుకుని తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా పాకిస్థాన్ జెండాలు, స్టిక్కర్లకు అతికించినందుకు భజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు మాట్లాడుతూ ఆందోళనకారులు పాకిస్థాన్ జెండాలను నేలపై, స్టిక్కర్లను గోడలకు అతికించి నిరసన తెలుపుతామని ముందుగా తమకు తెలియజేయలేదన్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. భజరంగ్‌దళ్ కార్యకర్తలను అరెస్ట్ చేయడంతో జనం రోడ్లపైకి వచ్చి మరింత నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు వారిని విచారణ చేసి విడిచి పెట్టారు. ఉగ్రవాదులను నిర్దాక్షిణ్యంగా శిక్షించండి హత్యలు చేయమని ఏ ధర్మమూ చెప్పదు కశ్మీరు ఘటనపై ముస్లిం నేతల డిమాండ్ -
పగిలిన పైపులు.. నీటికి తిప్పలు
రాయచూరు రూరల్: నగరంలో తాగునీటి కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలంలో తాగునీటి సమస్య నివారణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పాలకులు చెబుతుండగా మరో వైపు నీటి ఎద్దడి అధికమైంది. అధికారులు మౌనం వహిసున్నారు. జలనిర్మల పథకం కింద రూ.100 కోట్లు కేటాయించారు. అయినా పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య అధిక మైంది. నగరసభ తాగునీటి ఎద్దడి సమస్య నివారణ విషయంలో తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. గురువారం తాలూకాలోని వడ్లూరు పారిశ్రామిక కేంద్రం వద్ద నీటి పైపులు పగిలి 20 అడుగుల మేర నీరు ఎగసి పడి వృథా అయ్యాయి. ప్రజలు మాత్రం నీటిని ట్యాంకర్ల ద్వారా పొందాల్సి వస్తోంది. గత రెండు రోజుల నుంచి నీరు రాక విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. నీటిని సరఫరా చేసే పైపులు పగిలి పోవడంతో మరమ్మతు పనుల చేపట్టడంలో నగరసభ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికై నా నగరసభ అధికారులు తగిన చర్యలు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. వారం రోజులుగా సరఫరా కాని తాగునీరు వడ్లూరు వద్ద పగిలిన నీటి పైపు లైన్ మరో రెండు రోజులు నీటి సరఫరా లేదు -
మధుమేహంపై అవగాహన కల్గిస్తాం
రాయచూరు రూరల్: మధుమేహ వ్యాధిపై పాఠశాల స్థాయిలో పిల్లలకు అవగాహన కల్గింపనున్నట్లు రిసెర్చి సొసైటీ స్టడీ ఆఫ్ డయాబిటీస్ ఆఫ్ ఇండియా కర్ణాటక(ఆర్ఎస్ఎస్డీఐ) చాప్టర్ అధ్చక్షుడు డాక్టర్ బసవరాజ్ పాటిల్ వెల్లడించారు. శుక్రవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. నేటి ఆధునిక యుగంలో జీవన విధానంలో, ఆహార పదార్థాల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా మధుమేహ వ్యాధి వ్యాపిస్తోందన్నారు. భవిష్యత్తులో 9, 10, 11, 12వ తరగతులు విద్యనభ్యశించే విద్యార్థులకు మధుమేహ వ్యాధిపై ముమ్మర ప్రచారం చేపడుతామన్నారు. ఈ విషయంలో శనివారం రిమ్స్‌లో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. శిబిరాన్ని రిమ్స్ డీన్ రమేష్, భారతీయ వైద్యకీయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చినివాలర్, హరి ప్రసాద్, నేహా, మంజునాథ్, సంజీవ్చెట్టి, మనోహర్, కార్తీక్ పాల్గొంటారన్నారు. మహాలింగ, రామకృష్ణ ఎస్ఎస్ రెడ్డి, నాగభూషణ్, తదితరులు పాల్గొన్నారు. -
ద్రాక్ష సాగు.. లాభాలు బాగు
సాక్షి,బళ్లారి: ఈసారి మామిడి తోటలు ఉన్న రైతులకు నష్టాలు వస్తుండటంతో పాటు కర్బూజా, పుచ్చకాయ, అరటి తదితర పండ్ల తోటలు సాగు చేసిన రైతులు కూడా పెట్టుబడులతో సరిపెట్టుకునే పరిస్థితి నెలకొంది. అయితే ద్రాక్ష తోటలు సాగు చేసిన రైతులకు మార్కెట్లో ఽద్రాక్ష ధరలు పెరగడంతో పాటు నిలకడగా ఒకే రకమైన ధర కొనసాగుతుండడంతో గత మూడేళ్లతో పోలిస్తే, ఈ ఏడాది ద్రాక్ష సాగు చేసిన రైతులు లాభాలు గడిస్తున్నారు. ద్రాక్ష తోటల సాగుకు పెట్టిన పేరుగా నిలిచిన ఒక్క విజయపురలో దాదాపు ఒక లక్ష ఎకరాల్లో ద్రాక్ష సాగు చేసి రైతులు అక్కడ నుంచి దేశ, విదేశాలకు తాజా ద్రాక్షతో పాటు, ఎండు ద్రాక్షను తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. అలాగే ఉత్తర కర్ణాటక పరిధిలోని బెళగావిలో దాదాపు 35 వేల ఎకరాలు, బాగల్కోటె జిల్లాలో దాదాపు 40 వేల ఎకరాల్లో ద్రాక్షను సాగు చేస్తుండగా, బళ్లారి, గదగ్, విజయనగర, కొప్పళ తదితర జిల్లాల్లో అక్కడక్కడ ద్రాక్ష సాగు చేశారు. వివిధ జిల్లాల్లో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో ద్రాక్ష సాగు చేసిన రైతులు ఈసారి అధిక లాభాలు గడించి ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఎండ వేడిమికి అల్లాడుతున్న ప్రజలకు రుచికరమైన, ఎంతో తియ్యనైన ద్రాక్షను పండించి మేలు చేస్తున్నారు. తాజా ద్రాక్షతో ఎండుద్రాక్ష తయారీ విజయపుర జిల్లాలో విస్తారంగా సాగు చేసిన ద్రాక్ష రైతులు తాజా పచ్చిద్రాక్షతో ఎండు ద్రాక్షను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. ప్రస్తుతం తాజా పచ్చి ద్రాక్ష ధర బహిరంగ మార్కెట్లో కిలో రూ.60ల నుంచి రూ.100ల వరకు పలుకుతుందంటే రైతుల వద్ద ద్రాక్ష పొలాల్లో రూ.40 నుంచి రూ.50లకు కొనుగోలు చేస్తుండటంతో రైతులు మంచి లాభాలు గడించేందుకు వీలవుతోందని చెప్పవచ్చు. మూడేళ్ల నుంచి ద్రాక్ష రైతులు పెట్టుబడులతోనే సరిపెట్టుకుని ఆర్థికంగా నష్టపోయిన తరుణంలో ఈసారి అనూహ్య పరిణామాలతో ద్రాక్ష పంట సాగు చేసిన రైతులకు మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో రైతులతో పాటు వారి వద్ద పని చేసే వ్యవసాయ కూలీలకు కూడా చేతినిండా పని దొరుకుతూ ఆనందంగా ఉంటున్నారు. ఒక్క రైతులే కాదు వ్యవసాయ కూలీలు, మార్కెట్లో వ్యాపారులు, చిరు వ్యాపారులు కూడా ద్రాక్ష అమ్మకాల వల్ల లబ్ధి పొందుతున్నారు. తాజా పచ్చి ద్రాక్షతో పాటు ఎండు ద్రాక్ష తయారు చేస్తూ ఈ ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎండు ద్రాక్ష తయారు చేయడంలో కూడా విజయపుర జిల్లాకే అగ్రస్థానం దక్కింది. ఎండుద్రాక్షతో లాభాలు మెండు ఇక్కడ దాదాపు లక్ష ఎకరాల్లో ద్రాక్ష సాగు చేస్తుండగా, అందులో దాదాపు 80 శాతం ద్రాక్షను ఎండు ద్రాక్షగా మారుస్తున్నారు. తాజా పచ్చి ద్రాక్ష వల్ల ఒక కేజీకి రైతులకు రూ.50లు ధర లభిస్తుండగా, ఎండు ద్రాక్ష వల్ల మరింత లాభాలు అందుతున్నాయి. ఎండు ద్రాక్ష తయారీకి యంత్రాలు, అది కూడా ఒక రకమైన పరిశ్రమగా మార్చుకుని రైతులు రెండు విధాలుగా లాభాలు గడిస్తున్నారు. దాదాపు నాలుగు కేజీల తాజా పచ్చి ద్రాక్షను ప్రాసెసింగ్ చేసి, ఎండబెట్టి రుచికరమైన ఎండు ద్రాక్షిని తయారు చేస్తున్నారు. విజయపుర జిల్లాతో పాటు కర్ణాటకలో బెళగావి, బాగల్కోటె జిల్లాల్లో ఎండుద్రాక్షిని తయారీ చేస్తున్నారు. ఇక్కడ ఎండు ద్రాక్షతో పాటు వైన్ తయారీకి ఉపయోగించే రుచికరమైన ద్రాక్షను పండిస్తుండటంతో వైన్ తయారు చేసే కంపెనీలు ద్రాక్ష రైతులతో కొనుగోలు చేస్తున్నారు. వైన్ తయారీకి తాజా నల్లద్రాక్షకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈసారి అన్ని రకాల వైరెటీ ద్రాక్షలకు మంచి ధరే పలుకుతుందని, దీంతో వైన్ తయారీ చేసేందుకు ఉపయోగించే ద్రాక్షకు కూడా మరింత గిరాకీ లభిస్తోందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది పెట్టుబడులు పోను ఒక ఎకరాకు దాదాపు రూ.2లక్షలకు పైగా ఆదాయం లభిస్తోందన్నారు. అధిక లాభాలు గడిస్తున్న విజయపుర రైతులు మూడేళ్ల తర్వాత మంచి లాభాలపై ఆనందం రూ.8 కోట్ల వరకు లావాదేవీలు జరిపిన వైనం -
కాలువలోకి ట్రాక్టర్ బోల్తా.. ఒకరు దుర్మరణం
రాయచూరు రూరల్: కూలి పనులు ముగించుకొని వ్యవసాయ కూలీలు ఇంటికెళుతుండగా ట్రాక్టర్ అదుపు తప్పి కాలువలోకి బోల్తా పడ్డ ఘటనలో ఒకరు మరణించగా, ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాయచూరు జిల్లాలో గురువారం సాయంత్రం మస్కి తాలూకా హాలాపూర్ వద్ద జరిగింది. ప్రతి రోజు ట్రాక్టర్లో 15–20 మంది దాకా వ్యవసాయ కూలీలను తీసుకెళ్లి పనులు ముగిసిన తర్వాత అదే వాహనంలో తిరిగి వచ్చేవారు. డ్రైవర్ నిర్లక్ష్యంతో ట్రాక్టర్ అదుపు తప్పి తుంగభద్ర కాలువలోకి పడిపోయింది. ఈ ఘటనలో అంబమ్మ(46) అనే మహిళ అక్కడికక్కడే మరణించింది. గాయపడిన ఆరుగురు కూలీలను చికిత్స కోసం కవితాళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేష్ నాయక్ తెలిపారు. ఆరుగురికి తీవ్ర గాయాలు మస్కి తాలూకాలో ఘటన -
క్రమశిక్షణకు శిబిరాలు దోహదం
రాయచూరు రూరల్: విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవడేందుకు వేసవి శిబిరాలు దోహదపడతాయని హైదరాబాద్ కర్ణాటక ఆందోళన సమితి అధ్యక్షుడు రజాక్ ఉస్తాద్ పేర్కొన్నారు. గురువారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో రంగ కనసు చిణ్ణర చిలిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాలూకాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు పెయింటింగ్, పాటలు పాడటం, కథలు చెప్పడం, చిత్రలేఖనం, సంస్కృతి, సంస్కారం, ఆచార, విచారాలు, సంప్రదాయాలపై అవగాహనకు క్రమశిక్షణ సోపానమన్నారు. నేటి సమాజానికి ప్రతిరూపం విప్లవ సాహిత్యం రాయచూరు రూరల్: నేటి సమాజంలో సాహిత్యానికి ప్రతిరూపం విప్లవ సాహిత్యమని ఎంపీ ప్రకాష్ కళాశాల అధికారి మల్లన గౌడ పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీ ప్రకాష్ కళాశాల ఆవరణలో తాలూకా కన్నడ సాహిత్య పరిషత్, సేవా ఎంపీ ప్రకాష్ కళాశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దత్తి ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కన్నడ సాహిత్యం కేవలం కన్నడ భాష, భూమి, జలం కోసం ప్రయత్నిస్తే విప్లవ సాహిత్యం మను ధర్మం, అన్యాయం, దౌర్జన్యం, అవినీతి, అసమానత, కుల మత తేడాలు లేకుండా మనమంతా ఒక్కటే అనే భావాలను గురించి వివరించిందన్నారు. కార్యక్రమంలో కసాప అధ్యక్షుడు వెంకటేష్, రేఖ, శివ శంకర్, పరశురామ్, రాజశ్రీ, రూప, బసవరాజ్ మల్లికార్జున, అక్షయ్, ప్రాణేష్లున్నారు. కోటల సంరక్షణకు ప్రణాళిక రచించండి రాయచూరు రూరల్: నగరంలోని చారిత్రక కోటల సంరక్షణ, నవీకరణకు పథకం రూపొందించాలని జిల్లాధికారి నితీష్ కార్పొరేషన్ కమిషనర్ జుబిన్ మహాపాత్రోకు సూచించారు. నగరంలోని మక్కా దర్వాజ, కాటే దర్వాజలను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. అవసానపు అంచున వున్న కోటలను అభివృద్ధి పరచడానికి తోడు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి అవకాశం కల్పించాలన్నారు. కోట బయట, లోపల, పైభాగాల్లో పర్యటించి స్వచ్ఛతకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. ఆయన వెంట అధికారులు రాజేంద్ర, ఈరణ్ణ బిరాదార్, మహేష్లున్నారు. -
ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ కన్నుమూత
బెంగళూరు, సాక్షి: ప్రముఖ శాస్త్రవేత్త, ఇస్రో మాజీ ఛైర్మన్ డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కస్తూరి రంగన్ గతంలో జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఈయన పూర్తి పేరు కృష్ణస్వామి కస్తూరిరంగన్(Krishnaswamy Kasturirangan). కేరళ ఎర్నాకులంలో కస్తూరిరంగన్ జన్మించారు. ఈయనది విద్యావంతుల కుటుంబం. ముంబై యూనివర్సిటీలో ఫిజిక్స్‌లో మాస్టర్స్ చేసిన రంగన్.. అహ్మదాబాద్ ఫిజికల్ రీసెర్చ్ లాబోరేటరీ నుంచి 1971లో డాక్టరేట్ అందుకున్నారు. ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ మీద 240 పేజీల థియరీని సమర్పించారాయన. 1994 నుంచి 2003 దాకా.. తొమ్మిదేళ్లపాటు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)కి ఆయన చైర్మన్‌గా పని చేశారు. 2003-09 మధ్య రాజ్యసభ సభ్యుడిగానూ ఉన్నారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్‌కు డైరెక్టర్‌గా పనిచేశారు. మోదీ సర్కార్ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ముసాయిదా కమిటీకి కస్తూరి రంగన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్‌తో సత్కరించింది. మొత్తం 27 యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారాయన. ఇస్రో శాస్త్రవేత్త నంబీ నారాయణన్ మీద దేశద్రోహం ఆరోపణలు వచ్చిప్పుడు ఇస్రో చైర్మన్‌గా ఉంది కస్తూరి రంగనే. 1969లో లక్ష్మిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. రంగన్ భార్య 1991లో కన్నుమూశారు. -
అశ్రుతర్పణం
శివమొగ్గ(కర్ణాటక): జమ్ముకాశ్మీర్ విహారయాత్రకు వెళ్లి ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలైన శివమొగ్గ నగరవాసి మంజునాథరావు, బెంగళూరు మత్తికెరెవాసి భరత్ భూషణ్‌లకు బంధుమిత్రులు, ప్రజలు కన్నీటి నివాళులర్పించారు. వారి భౌతికకాయాలు గురువారం ఉదయం బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరాయి. అక్కడ కుటుంబసభ్యులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. అధికారులు ప్రత్యేక వాహనాల్లో వారి స్వస్థలాలకు పంపించారు. శివమొగ్గలో మంజునాథరావు భౌతిక కాయానికి గురువారం మధ్యాహ్నం రోటరీ చితాగారంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. బెంగళూరు నుంచి పార్థివ దేహాన్ని అంబులెన్స్ ద్వారా నగరానికి తీసుకొచ్చారు. నగరంలోని హొళె బస్టాండ్ సమీపం నుంచి బైక్ ర్యాలీ, ఊరేగింపు ద్వారా పార్థివ దేహాన్ని విజయనగర బడావణెలోని నివాసానికి తరలించారు. మంజునాథరావు పార్థివ దేహం ఆయన నివాసానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. అంతిమ దర్శనానికి జనం పోటెత్తారు. తరువాత ప్రధాన రోడ్ల గుండా ఊరేగింపుగా అంత్యక్రియలకు తరలించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, జిల్లా మంత్రి మధు బంగారప్ప, ఎంపీ బీవై రాఘవేంద్ర తదితర ప్రముఖులు నివాళులర్పించారు. హిందూ సంఘాల కార్యకర్తలు బైక్ ర్యాలీ జరిపారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దిష్టి బొమ్మలను జేసీబీకి ఉరివేసి ఆక్రోశం వ్యక్తం చేశారు. భరత్ భూషణ్ ఇంటికి గవర్నర్, సీఎం కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద పైశాచిక కృత్యానికి బలైన కన్నడిగుడు భరత్ భూషణ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బెంగళూరు మత్తికెరెలో ఉన్న భరత్ భూషణ్ ఇంటికి ఉదయం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. భార్య డా.సుజాత, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాశ్మీర్ టూర్ నుంచి కొడుకు సంతోషంగా వెనుతిరిగి వస్తాడని నిరీక్షించిన తల్లి కుమారుని మృతదేహం ముందు శోకసంద్రంలో మునిగిపోయింది. అన్ని పారీ్టల ప్రముఖులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. భౌతికకాయాన్ని ఊరేగింపుగా తరలించి విద్యుత్ చితాగారంలో దహనక్రియలు పూర్తిచేశారు. -
వికటించిన ప్రేమపెళ్లి
కర్ణాటక: ప్రేమించి కులాంతర వివాహం చేసుకొన్న ఓ యువతి.. నిండు గర్భిణిగా ఉండి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం రాయచూరు జిల్లా సింధనూరు గ్రామీణలో చోటు చేసుకుంది. వివరాలు.. తాలూకాలోని బూదిహాల్కు చెందిన యువకుడు నాగరాజు బ్రతుకుతెరువు కోసం బెంగళూరులో పని చేయడానికి వెళ్లాడు. అక్కడ పనిచేసే దుకాణ యజమాని కూతురు, చామరాజనగర జిల్లా కొళ్లేగాళకు చెందిన పల్లవి అలియాస్ అనుపమతో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. కట్న వేధింపులు పెరిగి సుమారు ఏడాది కిందట గంగావతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. పల్లవి తొమ్మిది నెలల గర్భిణి. పల్లవి అగ్రవర్ణురాలు కాగా, నాగరాజ్‌ది మరో కులం. ఈ నేపథ్యంలో కుటుంబ కలహాలు, కట్న వేధింపులు మొదలయ్యాయి. ప్రేమ కోసం అందరినీ వదులుకుని వస్తే జీవితం తలకిందులైందని పల్లవి ఆక్రోశించింది. గురువారం బూదిహాల్లో భర్త ఇంట్లోనే ఉరివేసుకుంది. ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ తలవార్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గొడవలు జరగకుండా బూదిహాళలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భర్త నాగరాజ్, అతని తల్లిదండ్రులను అరెస్ట్ చేశామని సిఐ వీరారెడ్డి తెలిపారు. -
అశ్రుతర్పణం
శుక్రవారం శ్రీ 25 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025శివమొగ్గ/ శివాజీనగర: జమ్ముకశ్మీర్ విహారయాత్రకు వెళ్లి ఉగ్రవాదుల తుపాకీ గుళ్లకు బలైన శివమొగ్గ నగరవాసి మంజునాథరావు, బెంగళూరు మత్తికెరెవాసి భరత్ భూషణ్‌లకు బంధుమిత్రులు, ప్రజలు కన్నీటి నివాళులర్పించారు. వారి భౌతికకాయాలు గురువారం ఉదయం బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరాయి. అక్కడ కుటుంబసభ్యులు, ప్రముఖులు శ్రద్ధాంజలి ఘటించారు. అధికారులు ప్రత్యేక వాహనాల్లో వారి స్వస్థలాలకు పంపించారు. శివమొగ్గలో మంజునాథరావు భౌతిక కాయానికి గురువారం మధ్యాహ్నం రోటరీ చితాగారంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. బెంగళూరు నుంచి పార్థివ దేహాన్ని అంబులెన్స్ ద్వారా నగరానికి తీసుకొచ్చారు. నగరంలోని హొళె బస్టాండ్ సమీపం నుంచి బైక్ ర్యాలీ, ఊరేగింపు ద్వారా పార్థివ దేహాన్ని విజయనగర బడావణెలోని నివాసానికి తరలించారు. మంజునాథరావు పార్థివదేహం ఆయన నివాసానికి చేరుకోగానే కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. అంతిమ దర్శనానికి జనం పోటెత్తారు. తరువాత ప్రధాన రోడ్ల గుండా ఊరేగింపుగా అంత్యక్రియలకు తరలించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, జిల్లా మంత్రి మధు బంగారప్ప, ఎంపీ బీవై రాఘవేంద్ర తదితర ప్రముఖులు నివాళులర్పించారు. హిందూ సంఘాల కార్యకర్తలు బైక్ ర్యాలీ జరిపారు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మలను జేసీబీకి ఉరివేసి ఆక్రోశం వ్యక్తం చేశారు. కశ్మీర్లో బలైన ఇద్దరు కన్నడిగుల మృతదేహాల తరలింపు బెంగళూరు, శివమొగ్గలో శోకసంద్రం గవర్నర్, సీఎం సహా ప్రముఖుల నివాళులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పాక్ ముష్కరుల అకృత్యంపై జనాగ్రహం -
అభివృద్ధి, పాలనా వికేంద్రీకరణ
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకాలోని మలె మహదేశ్వర బెట్టలో గురువారం సీఎం సిద్దరామయ్య అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి దృష్ట్యా బెంగళూరు కేంద్రిత పాలనకు బదులుగా కర్ణాటక అంతటా పాలనా వికేంద్రీకరణ మోడల్‌ను అలవరచుకోవాలని ఉద్దేశించారు. అందువల్లే కళ్యాణ కర్ణాటక విమోచన దినోత్సవం రోజున కలబురగిలో కేబినెట్ భేటీ నిర్వహించి ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశామన్నారు. ఈ దఫా మైసూరు ప్రగతి సాధన దిశగా మలెమహదేశ్వర బెట్టలో కేబినెట్ భేటీ నిర్వహించి 82కు పైగా అంశాలపై చర్చించినట్లు తెలిపారు. మొదట జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించినవారి గౌరవార్థం సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత చర్చ ఆరంభమైంది. చిన్న నీటిపారుదల, జలవనరుల శాఖల ద్వారా 29 పనులను రూ.1,787 కోట్ల వ్యయంతో చేపట్టాలని తీర్మానించారు. దీంతో మైసూరు రెవెన్యూ విభాగంలోని జిల్లాల్లో జలాశయాలు, చెరువులు, కాలువల అభివృద్ధితో ఈ ప్రాంతంలో నీటిపారుదల కార్యకలాపాలను సమగ్రంగా చేపట్టేందుకు వీలవుతుంది. పరోక్షంగా మనిషి, ఏనుగుల దాడులను అరికట్టేందుకు రూ.210.2 కోట్లను కేటాయించారు. ఈ ప్రాంత నగరాల్లో ప్రజలకు మంచినీటి పథకాల కోసం నగరాభివృద్ధి శాఖ నుంచి రూ.315 కోట్ల నిధులతో రక్షిత మంచినీటిని సరఫరా చేయాలని తీర్మానించారు. మైసూరు, చామరాజనగర జిల్లాల ప్రజల ఆరోగ్య రక్షణకు రూ.228 కోట్లను కేటాయించాలని నిర్ణయించారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో పర్యాటక రంగ అభివృద్ధికి రూ.300 కోట్లను కేటాయించాలని తీర్మానించారు. చామరాజనగర జిల్లా కొళ్లెగాల తాలూకా చిక్కకల్లూరులో మంటెస్వామి, రాచప్పాజి, సిద్దప్పాజి క్షేత్రాల అభివృద్ధి ప్రాధికార ఏర్పాటు చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయించారు. మైసూరు ఎయిర్‌పోర్టు అప్‌గ్రేడ్ మైసూరులోని ఇలవాలలో అంతర్జాతీయ స్థాయి క్రీడాంగణం నిర్మాణం, రన్‌వే విస్తరణతో పాటు మైసూరు విమానాశ్రయాన్ని అప్‌గ్రేడ్ చేయాలని తీర్మానించారు. ఈ జిల్లాల్లో గిరిజనులు నివసించే ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలతో సహా మౌలిక సౌకర్యాలను అభివృద్ధి పరచాలని నిర్ణయించారు. ఈ నిర్ణయాలను సత్వరం కార్యరూపానికి తెస్తామని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీతో పుణ్యక్షేత్రంలో అధికారుల హడావుడి నెలకొంది. ఆ దిశగా వివిధ జిల్లాల్లో కేబినెట్ భేటీలు మలె మహదేశ్వర బెట్టలో మంత్రివర్గ సమావేశం ఆ ప్రాంత ప్రగతికి పలు నిర్ణయాలు -
రాజ్‌కుమార్ జయంతి వేడుకలు
యశవంతపుర: కన్నడ వర నట, కంఠీరవ రాజ్‌కుమార్ 96వ జయంతి వేడుకలు బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి. నగరంలోని కంఠీరవ స్టూడియోలో ఆయన సమాధికి తనయుడు శివరాజ్‌కుమార్ దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన కన్నుమూసి 19 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని అభిమానులు నివాళులు అర్పించారు. పలు జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో వచ్చి దర్శించుకున్నారు. రంఠీరవకు నివాళులు తుమకూరు: తుమకూరు నగరంలోని ఎస్ఎస్పురం మెయిన్ రోడ్డులో ఉన్న మయూర వేదిక ఆధ్వర్యంలో పద్మభూషణ్ డాక్టర్.రాజ్‌కుమార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. -
ఐశ్వర్యగౌడకు ఈడీ షాక్
బనశంకరి: ఈడీ అధికారులు గురువారం బెంగళూరులో పలుచోట్ల ఆకస్మిక దాడులను జరిపారు. మాజీ ఎంపీ డీకే.సురేశ్ సోదరినంటూ పలు నగల షోరూంల నుంచి భారీగా బంగారు నగలు కొట్టేసిన కేసులో నిందితురాలు ఐశ్వర్యగౌడకు చెందిన బెంగళూరు, మండ్య నివాసాలపై ఈడీ అధికారులు దాడిచేశారు. మండ్య జిల్లా మళవళ్లి తాలూకా కిరుగావలు గ్రామంలోని ఇల్లు, బెంగళూరులోని ఇళ్లలో సోదాలు జరిపి ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బంగారు షాపు యజమాని ఆడియో, వీడియోలతో సహా ఆమైపె ఈడీకి ఫిర్యాదులు చేశాడు. రూ.9.82 కోట్ల విలువచేసే 14 కిలోల 660 గ్రాముల బంగారు ఆభరణాలు తీసుకుని డబ్బు ఇవ్వలేదని చంద్రాలేఔట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంటిపై ధార్వాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. బెంగళూరులోని డాలర్స్ కాలనీలోని ఆయన నివాసంలో తనిఖీలు చేశారు. వినయ్ కులకర్ణి జిల్లాలో ఓ జడ్పీ సభ్యుని హత్య కేసులో నిందితునిగా ఉన్నారు. ఆయనపై పలు ఫిర్యాదులు రావడంతో ఈడీ దాడి చేసినట్లు తెలిసింది. మండ్య, బెంగళూరు ఇళ్లలో సోదాలు -
నేత్రపర్వంగా తిరునక్షత్రం
మండ్య: జిల్లాలోని మేలుకోటెలో సమానత్వ హరికారులు అయిన రామానుజాచార్యుల 1008వ తిరునక్షత్ర మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. 10 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మొదటిరోజు గురువారం రామానుజాచార్యుల విగ్రహానికి విశేష అలంకారం, సర్వభూపాల వాహనోత్సవం కనులవిందుగా జరిగింది. శుక్రవారం హంస వాహనోత్సవం సాగుతుంది. రోజూ ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు వివిధ వాహన సేవలు ఆలయ ప్రాంగణంలో జరుగుతాయి. రూ.17 వేల కోట్ల స్కాంపై లేఖ బనశంకరి: అమృత్ యోజన పథకం అమలు పేరుతో రూ.17 వేల కోట్ల నిధులను ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యే దుర్వినియోగానికి పాల్పడ్డారని, దీనిపై ప్రధానమంత్రి, కేంద్ర గృహ నిర్మాణ నగరాభివృద్ధి శాఖమంత్రికి 7,281 పేజీలతో ఆధారాల సమేతంగా ఫిర్యాదు చేసినట్లు బీజేపీ నేత ఎన్ఆర్.రమేశ్ చెప్పారు. ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కేంద్రం రాష్ట్ర నగరాభివృద్ధి శాఖ కార్యదర్శికి లేఖ రాసిందని తెలిపారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడం సంబంధించి వారంలోగా నివేదిక అందించాలని ఆదేశించిందని చెప్పారు. బీజేపీ ఐటీ సెల్‌పై కేసు శివాజీనగర: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మీద బీజేపీ నేతలు చేసిన పోస్టింగ్ గురించి బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినపుడల్లా ఉగ్రవాదుల దాడి జరుగుతోంది అని కర్ణాటక బీజేపీ ఐటీ సెల్ పోస్ట్ చేసినట్లు ఆరోపించారు. ఇది రాహుల్‌గాంధీ మీద తప్పుడు ప్రచారం చేసేలా ఉందని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక బీజేపీ ఐటీ సెల్ మీద ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది. బస్సులో కండక్టర్ వెకిలి చేష్టలు యశవంతపుర: మంగళూరు నగరంలోని ముడిపు–స్టేట్‌బ్యాంక్ మార్గంలో యువతిని లైంగికంగా వేధించిన కేఎస్ ఆర్టీసీ కండక్టర్‌ను మంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. బాగలకోటకు చెందిన కండక్టర్ ప్రదీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 22న ముడిపు నుంచి స్టేట్ బ్యాంక్‌కు వెళుతున్న బస్సులో యువతి ఎక్కి నిద్రమత్తులోకి జారిపోయింది. ఆ సమయంలో యువతిని కండక్టర్ అసభ్యంగా తాకుతూ ఉండగా ఓ ప్రయాణికుడు వీడియో తీసి సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశాడు. దీనిని గమనించిన నెటిజన్లు కండక్టర్ మీద మండిపడ్డారు. ఆర్టీసీ ఉన్నతాధికారులు ప్రదీప్‌ను సస్పెండ్ చేయగా, పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. బైక్‌ను ట్రాక్టర్ ఢీ, తండ్రీ పిల్లలకు గాయాలు చింతామణి: బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. చింతామణి పట్టణంలోని తాలూకాఫీసు పక్కన గురువారం ఈ ప్రమాదం జరిగింది. శాంతినగరకు చెందిన సుబ్రమణి, కుమారుడు ధనుష్‌కుమార్, కూతురు శ్రావణి బైక్‌లో వెళుతుండగా ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొనింది. తండ్రి సుబ్రమణికి తీవ్రగాయాలు కావడంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స నిర్వహించి కోలారు ఆస్పత్రికి తరలించారు. చిన్నారులకు ఓ మోస్తరుగా గాయాలు తగిలాయి. పట్టణంలో లారీలు, ట్రాక్టర్లు ఇష్టానుసారం సంచరిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని, పోలీసులు నివారణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేశారు. మారెమ్మదేవికి నువ్వుల అలంకారం బొమ్మనహళ్లి: బొమ్మనహళ్ళి నియోజకవర్గం పరంగిపాళ్యలో వెలసిన గ్రామదేవత మారెమ్మదేవి అమ్మవారికి గురువారం నల్ల నువ్వులతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అమ్మవారికి మహా మంగళహారతి ఇచ్చి భక్తులకు దర్శనం కల్పించారు. -
95 మంది దొడ్డవాసులు క్షేమం
దొడ్డబళ్లాపురం: దొడ్డ తాలూకాలోని పలు గ్రామాల నుంచి మొత్తం 95 మంది కశ్మీర్‌కు టూర్క వెళ్లిన వారు సురక్షితంగా తిరుగు ప్రయాణమయ్యారు. వీరందరూ పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో టూరిస్ట్ స్థలాలు చూసి శ్రీనగర్‌కు బయలుదేరారు. అక్కడ వారంతా విడిది చేయబోయే హోటల్ ఉగ్రవాదులు దాడి చేసిన ప్రాంతానికి దగ్గరలోనే ఉంది. సకాలంలో పహల్గాంకి చేరుకుని ఉంటే మారణహోం సాగిన బైసరన్‌కు వెళ్లేవారు. అయితే కశ్మీర్‌కు వెళ్తుండగా దారిలో ఒకచోట కొండచరియలు విరిగి పడడంతో ప్లాన్ మారింది. జమ్ములోని వైష్ణోదేవి ఆలయ దర్శనం చేసుకుని కులు మనాలికి వెళ్లిపోయామని తెలిపారు. 180 మంది క్షేమంగా రాక దొడ్డబళ్లాపురం: కశ్మీర్లో చిక్కుకున్న 180 మంది కర్ణాటక వాసులు గురువారం ఉదయం ప్రత్యేక విమానాల ద్వారా కెంపేగౌడ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి తమ తమ ఊర్లకు వెళ్లిపోయారు. ఉగ్రవాదులను అంతం చేయాలి: సీఎం మైసూరు: ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా, ఏ మతానికి చెందినవారైనా, తుదముట్టించాలని, ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వం చోటివ్వరాదని సీఎం సిద్దరామయ్య అన్నారు. చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలెమహదేశ్వర బెట్టలో విలేకరులతో మాట్లాడారు. గతంలో పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అప్పటినుంచి విశ్రమించకుండా ఉండాల్సిందన్నారు. ఇప్పుడు కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడిలో అమాయకులు బలైన ఘటనకు కేంద్ర ఇంటెలిజెన్స్ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఈ ఘటన అత్యంత అమానుషం, హేయం అన్నారు. మరోవైపు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా గురువారం సాయంత్రం పలు చోట్ల కాగాడాల ప్రదర్శనలు జరిగాయి. -
విలక్షణ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్
బళ్లారి టౌన్: తన అసాధారణ నటనతో విలక్షణ నటుడుగా డాక్టర్ రాజ్‌కుమార్ గుర్తింపు పొందారని అతిథులు పేర్కొన్నారు. గురువారం రాజ్‌కుమార్ ఉద్యానవనంలో నిర్వహించిన డాక్టర్ రాజ్‌కుమార్ జయంతిని అదనపు జిల్లాధికారి మహమ్మద్ జుబేర్ ప్రారంభించి రాజ్‌కుమార్ శిలావిగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. జాతీయ స్థాయిలో కన్నడ నాడుపై భాషాభిమానం పెంపొందించారన్నారు. తనదైన శైలి నటనతో మంచి చిత్రాల్లో నటించి అపార సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారని గుర్తు చేశారు. కళ్యాణ కర్ణాటక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సిరిగేరి పన్నారాజు మాట్లాడుతూ రాజ్‌కుమార్ జయంతిని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అభినందనీయం అని కొనియాడారు. ఏసీ పీ.ప్రమోద్, సమాచార శాఖ అసిస్టెంట్ వీసీ గురురాజ్, వీవీ సంఘం నేతలు బీ.బసవరాజు, కే.ఎర్రిస్వామి, పీ.గాదెప్ప, చంద్రశేఖర్ ఆచార్య, రసూల్ సాబ్, వివిధ కన్నడ పర సంఘాల పదాధికారులు, అభిమానులు పాల్గొన్నారు. రాజ్‌కుమార్ జీవితం ఆదర్శప్రాయం హొసపేటె: నేల, నీరు, కన్నడ భాషాభివృద్ధికి అగ్రగామిగా నిలిచిన కన్నడ ప్రసిద్ధ సినీ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ జీవితశైలి ఆదర్శప్రాయమని అదనపు డిప్యూటీ కమిషనర్ ఈ.బాలకృష్ణప్ప తెలిపారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ రాజ్‌కుమార్ 97వ జయంతిలో ఆయన పాల్గొని డాక్టర్ రాజ్‌కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. ఉత్తమ వ్యక్తిత్వం, వినయానికి ఆదర్శవంతమైన వ్యక్తి రాజ్‌కుమార్ అని అన్నారు. ఆయన కర్ణాటక కళాకారుల సంఘాన్ని స్థాపించి కళాకారుల సంక్షేమాన్ని ప్రోత్సహించారన్నారు. తన అభిమానులను దేవుళ్లుగా పిలిచారన్నారు. ఆయన సినిమాలన్ని సామాజిక పరివర్తనకు దోహదపడేవేనన్నారు. వారి జీవనశైలి, సరళత, వినయం నేటి యువత అలవర్చుకోవాలన్నారు. జిల్లాధికారి కార్యాలయ అధికారులు స్నేహలత, ప్రియదర్శిని, సిబ్బంది శరణప్ప హళ్లికేరి, సమాచార శాఖ సిబ్బంది, రామాంజినేయులు, అశోక ఉప్పార్, కృష్ణ స్వామి, తాయేష్, కిషోర్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాయచూరులో... రాయచూరు రూరల్: కన్నడ మేరు నటుడు డాక్టర్ రాజ్ కుమార్ జయంతిని ఘనంగా ఆచరించారు. గురువారం కన్నడ భవనంలో ఏర్పాటు చేసిన జయంతిని తహసీల్దార్ సురేష్ వర్మ ప్రారంభించి మాట్లాడారు. కన్నడ భాష, నేల, నీటి కోసం సినిమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన మహా నటుడని కొనియాడారు. కార్యక్రమంలో వార్త సమాచార శాఖాధికారి గవిసిద్దప్ప, లింగరాజ్, దండెప్ప బిరాదార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. జయంతి కార్యక్రమంలో అతిథులు -
భరత్ భూషణ్ ఇంటికి గవర్నర్, సీఎం
కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద పైశాచిక కృత్యానికి బలైన కన్నడిగుడు భరత్ భూషణ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బెంగళూరు మత్తికెరెలో ఉన్న భరత్ భూషణ్ ఇంటికి ఉదయం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. భార్య డా.సుజాత, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కశ్మీర్ టూర్ నుంచి కొడుకు సంతోషంగా వెనుతిరిగి వస్తాడని నిరీక్షించిన తల్లి కుమారుని మృతదేహం ముందు శోకసంద్రంలో మునిగిపోయింది. అన్ని పార్టీల ప్రముఖులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. భౌతికకాయాన్ని ఊరేగింపుగా తరలించి విద్యుత్ చితాగారంలో దహనక్రియలు పూర్తిచేశారు. -
సీ్త్రలకూ సమాన హక్కులు అవసరం
రాయచూరు రూరల్: సదృఢ సమాజ నిర్మాణం కోసం పురుషులతో సీ్త్రలకు కూడా సమాన హక్కులు అవసరమని దేవదుర్గ శాసన సభ్యురాలు కరెమ్మ నాయక్, కిల్లె బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య పేర్కొన్నారు. బుధవారం పండిత సిద్దరామ జంబలదిన్ని రంగమందిరంలో ఏర్పాటు చేసిన అఖిల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. మహిళల హక్కులు, విధులు, సమానత్వం, విద్య, సామాజిక, ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు వీలుందన్నారు. మహిళల స్వేచ్ఛకు హద్దులు ఉండాలన్నారు. జిల్లాలోని 85 మంది మహిళా ఉద్యోగుల పదాధికారుల పదగ్రహణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు రోశని గౌడ, మహిళా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లాధ్యక్షురాలు విజయలక్ష్మి పాటిల్, సభ్యులు గంగమ్మ, సంగమ్మ, పార్వతి, వాణిశ్రీ తోటమ్మ, ఈరమ్మ, శ్రీదేవిలున్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూ నిరసన రాయచూరు రూరల్: జమ్మూకశ్మీర్‌లో బైసారన్, పహల్గాంల మధ్య ఉగ్రవాదులు జరిపిన దాడి ఖండనీయమని హరిహర సేవా ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. గురువారం సిరవారలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు రమేష్ మాట్లాడారు. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం లభించేలా చూడాలన్నారు. ఈ విషయంలో ప్రత్యేక విచారణ చేపట్టి తప్పు చేిసిన వారికి ఉరిశిక్ష వేయాలని ఒత్తిడి చేశారు. బ్రాహ్మణ విద్యార్థులకు జంధ్యం విషయంలో జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ రాష్ట్ర గవర్నర్‌కు తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఎస్‌యూసీఐ సంస్థాపక దినోత్సవం రాయచూరు రూరల్: నగరంలో ఎస్‌యూసీఐ సంస్థాపక దినోత్సవం, ప్రజా వ్యతిరేక దినోత్సవాలను ఆచరించారు. బుధవారం నగరంలోని జవహర్ నగర్ కాలనీ కార్యాలయం వద్ద శివదాస్ ఘోష్ జయంతి, ఎస్‌యూసీఐ 78వ సంస్థాపక దినోత్సవాలను నిర్వహించారు. బీజేపీ, జేడీఎస్‌ల వల్లే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం, ఏపీఎంసీ, కార్మిక, విద్యుత్, కార్పొరెట్ చట్టాలను జారీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కులగణన పేరుతో కులాల మధ్య చిచ్చుపెట్టడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంపై నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వీరేష్, చెన్నబసవ, అయ్యాళప్ప, వినోద్ కుమార్, బసవరాజ్, సరోజ, పీర్ సాబ్, నందగోపాల్, హేమంత్, అమోఘ, మహేష్లున్నారు. కశ్మీర్ మృతులకు సంతాపం రాయచూరు రూరల్: జమ్మూకశ్మీర్‌లోని బైసారన్, పహల్గాంల మధ్య మంగళవారం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించిన వారికి బీజేపీ ఆధ్వర్యంలో సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర మాట్లాడారు. కశ్మీర్‌లోని పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారికి న్యాయం లభించేలా చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక విచారణ చేపట్టి తప్పు చేిసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. నరసాపుర– బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు సేవలు హుబ్లీ: వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నరసాపుర– బెంగళూరు సర్ ఎం విశ్వేశ్వరయ్య టర్మినల్ స్టేషన్ల మధ్య సంచరించే వీక్లీ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లను వచ్చే నెల 9 నుంచి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ రైలు సేవలు మే 9 నుంచి జూన్ 27 వరకు, అలాగే మరో రైలును మే 10 నుంచి జూన్ 28 వరకు రాకపోకలను సాగిస్తాయని తెలిపారు. ఈ రైళ్ల రాకపోకల సమయాల్లో ఎటువంటి మార్పు ఉండదు. రైలు (సంఖ్య..02811) యలహంక జంక్షన్‌కు రాత్రి 11.18 గంటలకు చేరుకొని 11.20 కు బయలుదేరుతుంది. అలాగే రైలు (సంఖ్య..02812) యలహంక జంక్షన్‌కు ఉదయం 4.50 గంటలకు చేరుకొని 4.52 గంటలకు బయలుదేరి వెళ్లనుందని రైల్వే శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
హుబ్లీ: ధార్వాడ జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. లారీ ఢీకొని రోడ్డు దాటుతున్న యువకుడు స్థలంలోనే మృతి చెందిన ఘటన ధార్వాడ తాలూకా నరేంద్ర క్రాస్ వద్ద చోటు చేసుకుంది. మృతుడిని నవలగుందకు చెందిన బసవరాజ మహదేవప్ప పల్లెద(19) అనే యువకుడిగా గుర్తించారు. బసవరాజ్ రోడ్డు దాటుతున్న వేళ లారీ ఢీకొన్నట్లు ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అలాగే మరో ఘటనలో ఆటోను గూడ్స్ లారీ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ధార్వాడ తాలూకా తళవాయి, కనకూరల మధ్య రోడ్డులో బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. మృతి చెందిన యువకుడిని హుబ్లీ తాలూకా అంచటగేరి గ్రామానికి చెందిన ప్రకాష్ భీమప్ప వాలికార్ (23)గా గుర్తించారు. ఆటో రిక్షాలో యల్లమ్మనగుడ్డ సన్నిధికి వెళ్లి తిరిగి వస్తుండగా మినీ గూడ్స్ లారీ ఆటోను ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన ప్రకాష్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు వదిలాడు. అలాగే ఆటోలో ఉన్న మరో ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డారు. వీరిని ధార్వాడ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. ధార్వాడ గ్రామీణ పోలీసులు కేసు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు హుబ్లీ: ఽదార్వాడ శ్రీరామనగర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఆరోపణలపై ఓ వ్యక్తికి వ్యతిరేకంగా పోక్సో కేసు నమోదైంది. మత్తు పదార్థాలను కొనుగోలు చేసి విక్రయిస్తున్న కడేదప్ప శృంగేరి(52) అనే వ్యక్తి పదేళ్ల బాలికను మాయమాటలతో మభ్య పెట్టి గోడౌన్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఘటనపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ముఖ్యాధికారిపై సస్పెన్షన్ వేటు హొసపేటె: హొసపేటె తాలూకా మరియమ్మనహళ్లి పట్టణ పంచాయతీ ముఖ్యాధికారి ఖాజా మొహిద్దీన్ను ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందిన నేపథ్యంలో విధుల నుంచి సస్పెండ్ చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ డైరెక్టర్ ప్రభులింగ కావలికట్టి ఉత్తర్వులు జారీ చేశారు. అసలు యజమానులకు తెలియకుండా కృత్రిమ పత్రాల సృష్టి, ఆస్తి అకౌంటింగ్, పురావస్తు శాఖ బావి స్థలాల సీల్ చేయడం, అండర్ రైట్ చేసిన అనేక ప్రభుత్వ ఆస్తులకు నకిలీ పత్రాలను సృష్టించడం ద్వారా ఆయన ప్రభుత్వాన్ని మోసం చేశారని తేలడంతో శాఖాపరమైన విచారణను రిజర్వ్ చేసి, తక్షణమే ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేశారు. మురుగు కాలువలో నవజాత శిశువు మృతదేహం హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకా చంద్రశేఖరపుర గ్రామంలో మురుగు కాలువలో నవజాత శిశువు మృతదేహం బుధవారం సాయంత్రం లభించింది. ఎవరో మహిళ కాన్పు సమయంలో మగబిడ్డ చనిపోయాడనే విషయాన్ని దాచి పెట్టే ప్రయత్నంలో శిశువు మృతదేహాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. స్థానికులు కాలువలో ఒక శిశువు మృతదేహం ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. గుడేకోటె పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం రాయచూరు రూరల్: కలబుర్గి జిల్లాలోని అఫ్జల్‌పుర తాలూకా కె.గబ్బూరు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలైన ఘటన చోటు చేసుకుంది. మృతులను కలబుర్గిలోని మిల్లత్ కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు. కలబుర్గి నుంచి మహారాష్ట్ర సరిహద్దులోని హైదర్ దర్గాకు బంధువులతో కలిసి టవేరా వాహనంలో బయలు దేరారు. గబ్బూరు వద్ద వాహనానికి అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోగా కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అయిషా(70), అజ్మీర్(30), జైనబ్(2)లు మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలను పంచనామా కోసం కలబుర్గిలోని జిమ్స్‌కు తరలించారు. దేవల గాణగాపుర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామాల్లో ఇళ్ల పంపిణీకి డిమాండ్రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ పథకం(పీఎంజీఎస్‌వై)లో ఇళ్లు పంపిణీ చేయాలని నమ్మ కర్ణాటక సేనె సంఘం జిల్లాధ్యక్షుడు కొండప్ప డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అధికారులు ఇష్టానుసారంగా ఉన్న వారికే ఇళ్లను కేటాయిస్తున్నారని ఆరోపించారు. జీపీఎస్‌ను చేయడానికి అధికారులు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు లంచాలు తీసుకుంటున్నారన్నారు. నిజమైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు అధిక శాతం కేటాయించారని ఆరోపించారు. -
ఆగని బాలింతల మరణాలు
హొసపేటె: ప్రభుత్వ ఎంసీహెచ్ ఆస్పత్రిలో బుధవారం సాయంత్రం విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి తాలూకా దశమాపుర గ్రామానికి చెందిన శాంత(20) అనే బాలింత మృతి చెందింది. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో తల్లిదండ్రులు నగరంలోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ఆదివారం ఆమెకు సిజేరియన్ జరిగింది. ఆమె ఆరోగ్యకరమైన ఆడశిశువుకు జన్మనిచ్చింది. అయితే బాలింత ఆరోగ్యం క్షీణించడంతో మరణించింది. ఆమె ఆరోగ్యంపై తగిన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఆమె మరణించినట్లు మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై దర్యాప్తునకు ఆదేశించామని, కాన్పు చేసిన కాంట్రాక్టు వైద్యుడు డాక్టర్ సింధు షా, నర్సు ఎస్జే రఘునాథ్‌ను విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు విధుల నుంచి తొలగించామని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ అధికారి(డీహెచ్ఓ) డాక్టర్ ఎల్ఆర్ శంకర్ నాయక్ తెలిపారు. డాక్టర్ సింధు షా ఉజ్జయిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గైనకాలజిస్టుగా ఉన్నారు. అసైన్మెంట్ మీద ఇక్కడికి వచ్చారని, సమగ్ర దర్యాపు తర్వాతే బాలింత మృతికి కారణం తెలుస్తుందన్నారు. బాలింతకు మరేదైనా అనారోగ్యం ఉందా? అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. తాజాగా హొసపేటెలో చోటు చేసుకున్న వైనం -
ఆల్మట్టిలో నీటి కొరత.. విద్యుత్ ఉత్పత్తికి వెత
రాయచూరు రూరల్: ఆల్మట్టి జలాశయంలో నీటి కొరత ఏర్పడడంతో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడినట్లయింది. విద్యుత్ ఉత్పత్తిలో ముందుండే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులోని యూనిట్లు నేడు జలక్షామంతో స్తంభించాయి. తాగునీటి అవసరాల కోసం జలాశయంలో నీటిని నిల్వ చేశారు. 510 దశ లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యం కాగా కేవలం 235 దశ లక్షల యూనిట్ల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. వర్షాభావంతో నీరు లేక ఉత్పత్తి స్తంభించింది. ఆల్మట్టి ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 5 యూనిట్లలో 55 మెగావాట్లు, ఒక యూనిట్లో 15 మెగావాట్లతో కలిపి ఆరు యూనిట్లలో 290 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. బాగల్‌కోట 1.2, బసవన బాగేవాడి 1.2 ఫీడర్లకు విద్యుత్ సరఫరా చేపడతారు. ఆల్మట్టి జలాశయంలో 510.96 మీటర్ల ఎత్తున 34.842 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రాయచూరు ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నాలుగు యూనిట్లు బంద్ అయ్యాయి. వేసవి ఎండలు అధికం కావడంతో లోడ్‌షెడ్డింగ్ లేదని సర్కార్ చెబుతున్నా ఆర్టీపీఎస్లో నాలుగు యూనిట్లు బంద్ కావడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఎదురైంది. 210 మెగావాట్ల చొప్పున విద్యుత్ ఉత్పత్తి చేసే 1, 2, 3, 6 యూనిట్లను బాయిలర్ ట్యూబ్, బంకర్ లీకేజీల కారణంగా స్తంభింప చేశారు. నాలుగు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ వేయడంతో 840 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తిలో కోత పడింది. -
నిప్పుల కొలిమిగా ఉత్తర కర్ణాటక
సాక్షి,బళ్లారి: బిసిల బళ్లారిగా పేరొందిన బళ్లారి జిల్లాతోపాటు కళ్యాణ కర్ణాటక, ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని బీదర్, కలబుర్గి, యాదగిరి, రాయచూరు, బళ్లారి, విజయనగర, కొప్పళ, గదగ్, బాగల్కోటె, విజయపుర, బెళగావి తదితర జిల్లాల్లో భానుడు భగభగమంటున్నాడు. రోజు రోజుకు ఎండలు తీవ్రం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అకాల వర్షాలతో ముందుగానే అన్ని జిల్లాల్లో అక్కడక్కడ జోరుగా వర్షాలు కూడా కురిశాయి. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో వరి, జొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వర్షాల వల్ల నేలతల్లి చల్లబడుతుందని జనం సంతోషిస్తున్న తరణంలో ఓ వైపు పంట నష్టం మరో వైపు ఎండల తీవ్రత కూడా పెరిగిపోతోంది. అత్యధికంగా కలబుర్గి జిల్లాలో 45 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఎండలు దాటడంతో ఎండవేడిమికి తట్టుకోలేక జనం ఇళ్లకే పరిమితమవుతున్నారు. చల్లని పానీయాలు, పండ్లకు గిరాకీ మధ్యాహ్నం వేళలో రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండవేడిమి నుంచి తట్టుకునేందుకు చల్లని పానీయాలతో కొంత సేదరుతున్నా అవి కాసేపు మాత్రమే హాయిని ఇస్తున్నాయి. యాదగిరి జిల్లాలో 44 డిగ్రీలు, బళ్లారిలో 40 డిగ్రీలు, బాగల్కోటెలో 40 డిగ్రీలు, విజయపురలో 42 డిగ్రీలు ఇలా ఉత్తర, కళ్యాణ కర్ణాటక ప్రాంతాల పరిధిలోని జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో ఎక్కడ చూసిన ఎండలు పెరిగిపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు. కలబుర్గిలో విపరీతమైన ఎండలు పెరిగిపోవడంతో రోడ్లలో జనం లేక నిర్మానుష్యంగా కనిపించాయి. ఎండలు పెరిగిపోవడం ఓ వైపు, అప్రకటిత విద్యుత్ కోత వల్ల ఇళ్లలో ఉండేందుకు ఫ్యాన్లు తిరగనందుకు ఉక్కపోతతో జనం పడుతున్న అవస్థలు వర్ణించలేని విధంగా ఉన్నాయి. ఉక్కపోత పెరిగి పోవడం వల్ల ఇన్వర్టర్లను కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. కలబుర్గిలో 45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్న ఉష్ణోగ్రతలు బళ్లారితో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఎండ ప్రచండం -
అధికారులపై అసత్య ఆరోపణలు చేస్తే జైలు
బళ్లారి రూరల్: స్వార్థంతో అధికారులపై అసత్య ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తే మూడేళ్ల జైలుశిక్ష తప్పదని ఉపలోకాయుక్త న్యాయమూర్తి బీ.వీరప్ప వెల్లడించారు. గురువారం డీసీ కార్యాలయ ప్రాంగణంలోని తుంగభద్ర సభాంగణంలో అర్జీల స్వీకరణ, విచారణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యక్తిగత కక్ష్య, స్వార్థంతో అధికారులపై అసత్య ఆరోపణలు చేసినట్లు విచారణలో తేలితే 6 నెలల నుంచి గరిష్టంగా 3 ఏళ్లు జైలుశిక్ష తప్పదని తెలిపారు. సమాచార హక్కు, లోకాయుక్త చట్టాన్ని దుర్వినియోగం చేసే స్వార్థపరులపై చర్యలు ఉంటాయని తెలిపారు. అవినీతిని, అవినీతిపరులను అంతం చేయడానికే లోకాయుక్త అని తెలిపారు. లోకాయుక్తగా నియమితుడైన తర్వాత తన అస్తి వివరాలను ప్రకటించానన్నారు. ఇద్దరు లోకాయుక్తలు ప్రతి జిల్లాలో 3 రోజులు పర్యటించి అధికారులపై అవినీతి ఆరోపణలు విచారించి అవినీతిని రూపుమాపే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్య్ర సందర్భంలో 18 శాతం సాక్షరత ఉండేది, ఇప్పుడు 80 శాతం ఉంది. ఈ 80 శాతంలో 90 శాతం మంది విద్యావంతులకు చట్టంపై అవగాహన లేదని తెలిపారు. కరోనా తరువాత మనుషుల్లో మార్పు రాకపోగా అవినీతి మరింత పెరిగిందని తెలిపారు. స్వార్థపరుల వల్లనే ప్రకృతి నాశనమై పోతోందని తెలిపారు. సమానత సాధించిన మహిళలు పురుషుల కంటే అవినీతిలో ముందంజలో ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు, వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా న్యాయసేవా ప్రాధికార అధ్యక్షురాలు, జిల్లా జడ్జి వేలా, జిల్లాధికారి, జెడ్పీ సీఈఓ, జిల్లా ఎస్పీ, జిల్లా లోకాయుక్త అధికారులు పాల్గొన్నారు. అవినీతి సంపూర్ణ సంహారానికే లోకాయుక్త 90 శాతం విద్యావంతులకు చట్టంపై అవగాహన లేదు ఉపలోకాయుక్త న్యాయమూర్తి బి.వీరప్ప వెల్లడి -
టూరిస్టులతో టెర్రరిస్ట్.. ‘మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?’
సాక్షి,బెంగళూరు: ‘నాబిడ్డకు ఇంకా మూడేళ్లే నన్ను వదిలేయండి ప్లీజ్ అని ప్రాధేయపడినా కనికరించలేదు. ఉగ్రవాది మనసు కరగలేదు. భార్య ముందే తలపై తుపాకీ ఎక్కుపెట్టి మెషిన్ గన్నుతో కాల్పులు జరిపాడు. జమ్మూకశ్మీర్‌లోని మిని స్విట్జర్లాండ్ పహల్గాంను వీక్షించేందుకు వచ్చిన సామాన్యుల్ని పొట్టన పెట్టుకున్నారు. వారిలో భరత్ భూషణ్(35)ఒకరు.వేసవి సెలవులు కావడంతో భరత్ భూషణ్ తన భార్య డాక్టర్ సుజాత భూషణ్, మూడేళ్ల కొడుకుతో కలిసి పహల్గాంకు వచ్చారు. అప్పటి వరకు వందల సంఖ్యలో పర్యాటకలతో కళకళలాడుతున్న పహల్గాంలో సైనిక దుస్తులు ధరించిన ముష్కరులు పర్యాటకులపై విరుచుకు పడ్డారు. ఐడీకార్డులను చెక్ చేసి మరి కాల్చి చంపారు.అలా ముష్కరుల తూటాలకు భరత్ భూషణ్ ప్రాణాలు కోల్పోయినట్లు బాధితుడి భార్య డాక్టర్ సుజాత భూషణ్ కన్నీరు మున్నీగా విలపిస్తున్నారు. కుమారుడి భవిష్యత్ గురించి ప్రాధేయపడ్డ ఉగ్రవాదులు కనికరించకుండా ప్రాణాలు తీశారని గుండెలవిసేలా రోధిస్తున్నారు. పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన తీరును కళ్లకు కట్టినట్లు వివరించారు.మృతదేహానికి సీఎం సీఎం సిద్ధరామయ్య నివాళిపహల్గాంలో ఉగ్రవాదుల తూటాలకు బలైన భరత్ భూషణ్ మృతదేహాం ఆయన స్వస్తలం బెంగళూరుకు చేరుకుంది. భరత్ భూషణ్ మృతదేహానికి నివాళులర్పించేందుకు సీఎం సిద్ధరామయ్య భరత్ ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా తన భర్త భరత్ భూషణ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిగిన తీరు,దారుణానికి ముందు పహల్గాం ఎలా ఉందో తెలిపారు.పహల్గాంలో కాల్పుల మోత‘వేసవి సెలవులు కావడంతో ఏప్రిల్ 18న మేం పహల్గాంకు వెళ్లాం. అదే రోజు మేం బైసరీన్ వ్యాలీ వరకు గుర్రాల మీద వెళ్లాం. అక్కడికి చేరాక గుడారాలు వేసుకున్నాం. అనంతరం కశ్మీరీ వేషధారణలతో నా భర్త, మూడేళ్ల కుమారుడితో కలిసి సెల్ఫీలు దిగాం. పచ్చిక బయళ్లు,పైన్ చెట్లతో విశాలంగా విశాలవంతమైన ఆ ప్రాంతాన్ని కలియతిరుగుతున్నాం. పలువురు పర్యాటకు గుడారాలు వేసుకొని సందడి చేస్తున్నారు.ఐడీకార్డులు అడిగిసరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా బుల్లెట్ శబ్ధం వినిపించింది. అడవి జంతువుల నుంచి సంరక్షణ కోసం అటవీశాఖ అధికారులు ఫైరింగ్ చేశారేమోనని అనుకున్నాం. కానీ ఆ శబ్ధం అంతటితో ఆగలేదు. కొనసాగుతూనే ఉంది. అప్పుడే ఘటన జరిగిన (ఏప్రిల్22) రోజు మధ్యాహ్నం 2.30 తర్వాత ఉగ్రవాదులు టూరిస్టులపై కాల్పులకు తెగబడ్డారు. టూరిస్టులను వారి ఐడీకార్డులను అడుగుతున్నారు. అనంతరం కాల్పులు జరిపి ప్రాణాలు తీస్తున్నారు.మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా?బైసరీన్ గురించి మీకు తెలుసు కదా.పెద్ద మైదానం. ఎటు చూసినా ఓపెన్ స్పేస్. ఆ సమయంలో నేను, నాభర్త, నాకుమారుడికి (మూడేళ్లు) ఏ దిక్కు చూసినా తప్పించుకునే మార్గం కనిపించలేదు. వెంటనే అక్కడే ఉన్న ఓ కశ్మీర్ టెంట్ వెనక దాక్కున్నాం. మా ముందే ఓ ఉగ్రవాది ఓ టెంట్ లోపలికి వెళ్లాడు. టెంట్‌లోపల ఉన్న టూరిస్టులను బయటకు లాక్కొచ్చాడు. అతనితో ఏదో మాట్లాడాడు. అనంతరం, బాధితుడి తలపైకి గురి పెట్టి కాల్చి చంపాడు. అలా వరుసగా బాధితుల్ని కాల్చుతూ వస్తున్నాడు. మాముందే ఓ టూరిస్టుతో టెర్రరిస్టు మా పిల్లలు బాధపడుతుంటే.. మీరు సెలవులు ఎంజాయ్ చేస్తారా? అని అంటూ కాల్పులకు తెగబడ్డాడు.ఇదంతా చూస్తూ మేం భయంతో మేం దాక్కునే ప్రయత్నం చేస్తున్నాం. అప్పుడే మా దగ్గరికి ఓ టెర్రరిస్టు వచ్చాడు. అప్పటికే నాభర్త ఆ టెర్రరిస్టును నా బిడ్డకు ఇంకా మూడేళ్లే దయచేసి నన్ను వదిలేయండి’అని వేడుకున్నాడు. కానీ ఉగ్రవాది కనికరించలేదు’ అని అన్నటి పర్యంతరమయ్యారు. -
బీరప్పా.. నువ్వు గ్రేటప్పా!
‘‘నా కొడుకు ఏం పరీక్షలు రాశాడో? ఏం ఘనత సాధించాడో నాకైతే తెల్వదు. ఆర్మీలో చేరాలని వాడి కల. అది నెరవేరకపోయేసరికి బాధపడేవాడు. కానీ, ఇప్పడు వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని అంతా అంటుంటే గర్వంగా ఉంది. వాడూ సంతోషంగా ఉన్నాడు.. అది చాలు’’ అంటున్నాడు సివిల్స్ విజేత బీరప్ప సిద్ధప్ప డోని తండ్రి సిద్ధప్ప డోని.మహారాష్ట్ర అమగె గ్రామానికి చెందిన బీరప్ప సిద్ధప్ప డోని.. కర్ణాటక బెలగావి నానవాడి గ్రామంలోకి చుట్టాల ఇంటికి వచ్చాడు. బీరప్పది గొర్రెలు కాచుకునే కుటుంబం. అయినా అతని తండ్రి బిడ్డలను మంచి చదువులే చదివించాడు. ఆ పిల్లలు కూడా తండ్రి కష్టాన్ని గుర్తించి బాగా చదివారు. బీరప్ప పెద్దన్న ఆర్మీలో ఉద్యోగం. అన్నలాగే సైన్యంలో చేరాలని బీరప్ప కలలు కన్నాడు. కానీ, రకరకాల కారణాలతో ఆ కలకు దూరమయ్యాడు. బీటెక్ పూర్తి చేసి.. చివరకు పోస్టల్ జాబ్ కొట్టాడు.ఐపీఎస్ కావాలనే కలతో.. సివిల్స్ వైపు లక్ష్యాన్ని మల్చుకుని పోస్టల్ జాబ్‌ను వదిలి ప్రిపేర్ అయ్యాడు. ఈ ఏడాది మూడో అటెంప్ట్ చేశాడు. మొన్న ఏప్రిల్ 22వ తేదీ విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో బీరప్పకు 551వ ర్యాంకు వచ్చింది. ఈ విషయం తెలిసి కుటుంబ సభ్యులు సంతోషించాడు. తమకు కూడు పెట్టిన గొర్రెల కొట్టాల మధ్యలోనే బీరప్పకు తమదైన సంప్రదాయంలో ఘనంగా సన్మానం చేశారు.దేశంలోనే పెద్ద పరీక్షలు రాసి తన మేనల్లుడు సర్కారీ కొలువు కొట్టేసరికి యెల్లప్ప గద్ది సంతోషంతో ఉబ్బి తబ్బిబి అయిపోతున్నాడు. ఊరంతా స్వీట్లు పంచి మురిసిపోయాడు. మేనల్లుడు మంచి ఆఫీసర్ అయ్యి తమలాంటి పేదోలకు సాయం చస్తే చాలంటున్నాడు. బీరప్ప స్ఫూర్తితో తమ జాతిలో మరికొందరు ముందుకు వచ్చి సదువుకుంటే చాలని కోరుకుంటున్నాడాయన.Belagavi village erupts in joy as youth from the shepherding community clear UPSC🎥Special Arrangementhttps://t.co/QlwXlz3pWW pic.twitter.com/ISrBQEOoHd— The Hindu (@the_hindu) April 23, 2025 Source: The Hindu -
ముందే జాగ్రత్త పడి ఉంటే...
సాక్షి, బెంగళూరు: భార్యకు మానసిక అనారోగ్యం, ఇతరత్రా ఆస్తి గొడవలు ఉన్నప్పుడు కాస్త జాగ్రత్త పడి ఉంటే ఆ ఇంట ఘోరం జరిగేది కాదేమో అనే వాదన వినిపిస్తోంది. రాష్ట్ర రిటైర్డు డీజీపీ ఓం ప్రకాశ్ దారుణ హత్య కేసులో అందరి నోటా ఇదే మాట వస్తోంది. ఆయన భార్య పల్లవి, కూతురు కృతిని పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. వారిద్దరూ మానసిక రోగాలతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. పల్లవి 12 ఏళ్లుగా స్కిజోఫ్రినియా అనే డిప్రెషన్‌తో జీవిస్తోంది. ఓం ప్రకాశ్ ఆమెకు నగరంలోని ఓ ఆస్పత్రిలో మానసిక చికిత్స కూడా అందిస్తున్నారు. వైద్యానికి రూ. 40 లక్షలు ఖర్చు చేసినట్లు కూడా సమాచారం. దంపతుల మధ్య గొడవలను భార్య పల్లవి తరచూ పోలీసు అధికారులు గ్రూపుల్లో పలుమార్లు పోస్టు చేసినట్లు తెలిసింది. తన భర్త వద్ద అక్రమంగా తుపాకులు, మత్తు పదార్థాలు ఉన్నాయని, వాటిని తీసుకెళ్లాలని, లేదంటే వాటితో తనను చంపేస్తాడని పల్లవి మెసేజ్‌లు పెట్టేది. ఇది చూసి పోలీసు అధికారులు అయ్యో పాపం అని విస్తుపోయేవారు. భర్త నన్ను వేధిస్తున్నాడు, ఆయనను అదుపు చేయకపోతే తానే చంపేస్తానని ఆ గ్రూపులో పల్లవి పోస్టు చేసేదని సమాచారం. దీనిని బట్టి ఓం ప్రకాశ్‌తో పాటు, ఆయన మిత్రులు ముందే అప్రమత్తమై ఉంటే ప్రాణాలు దక్కేవి. తేలిగ్గా తీసుకోవడంతో రక్తపాతం అనివార్యమైంది.ఆత్మరక్షణ కోసమే..తుపాకీ తీసుకుని చంపేస్తానని నా భర్త బెదిరించాడు, ఆత్మరక్షణ కోసం తాము పోరాటం చేయాల్సి వచ్చిందని, భర్త కంట్లో కారం పొడి చల్లినట్లు, శరీరంపై వేడి వంటనూనె చల్లినట్లు పల్లవి చెప్పినట్లు తెలిసింది. బీరు బాటిల్‌తో కొట్టి చేతులు, కాళ్లు కట్లేసి చాకుతో పొడిచినట్లు, కొద్ది నిమిషాలకే తీవ్ర రక్తస్రావంతో మరణించాడని పోలీసుల విచారణలో పల్లవి తెలిపింది. ఇక కుమార్తె కృతిని ప్రస్తుతం పోలీసులు నిమ్హాన్స్లో చేర్పించారు. దుందుడుకుగా ప్రవర్తించడం, ఏదేదో మాట్లాడడం చూసి పోలీసులు వైద్యులను ఆశ్రయించారు. నిమ్హాన్స్ వైద్యులు కృతి మానసిక ఆరోగ్యంపై పరీక్షలు చేస్తున్నారు. హత్యలో కృతి పాత్రపై కూడా లోతుగా విచారిస్తున్నారు. -
కొండచరియలు విరిగి.. ముప్పు తప్పింది
యశవంతపుర: కశ్మీరు పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో 13 మంది కన్నడిగులు ప్రమాదం నుంచి బయట పడ్డారు. వీరు వెళ్లే మార్గంలో కొండచరియలు విరిగి అడ్డు పడడంతో ముందుకు వెళ్లలేకపోవడం ప్రాణాలను నిలిపింది. వేసవి సెలవులు కావడంతో బాగలకోట మార్వాడీ వీధికి చెందిన కిశోర్ కాసట్ అనే వ్యాపారి బంధువులతో కలిసి 13 మంది ఈ నెల 19న జమ్ము కశ్మీర్‌కు వెళ్లారు. వైష్ణోవిదేవి ఆలయాన్ని దర్శించుకుని మంగళవారం పహల్గామ్కి బయల్దేరారు. ఆ మార్గ మధ్యలో కొండచరియలు విరిగి పడిన కారణంగా 70 కిలోమీటర్లు తిరిగి మరో మార్గంలో ఆలస్యంగా వెళ్లవలసి వచ్చింది. ఇంతలో ఉగ్రవాదుల దాడి చేశారని బాగలకోట నుంచి కుటుంబసభ్యులు సమాచారం ఇవ్వటంతో వెనుదిరిగినట్లు తెలిపారు. శ్రీనగర్‌కు క్షేమంగా చేరుకున్నట్లు తెలిపారు. హావేరి దంపతుల అదృశ్యం కశ్మీరు పర్యటనకు వెళ్లిన హావేరి దంపతుల ఆచూకీ లభించడం లేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. శిగ్గావికి చెందిన నాగరాజు దంపతులు ముంబై నుంచి విమానంలో కశ్మీర్‌కు వెళ్లారు. వారి ముబైల్ ఫోన్ స్విచాఫ్ అని వస్తోందని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు శిగ్గావి పురసభలో ఉద్యోగి, ట్రావెల్ ఏజెన్సీ ద్వారా వీరు కశ్మీర్‌కు వెళ్లారు. కుటుంబీకులు హావేరి జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. న్యాయం జరగాలన్న సినీలోకం కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో 28 మంది మరణించడంపై సినిమా, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. నటులు శివరాజ్‌కుమార్, కిచ్చ సుదీప్, యశ్, ధ్రువ సర్జా, నటి రాధికా పండిత్‌లు ఉగ్రవాదుల ఘాతుకాన్ని ఖండించారు. గుండె చలించిందని, ఉగ్రవాదులకు కఠిన శిక్ష విధించాలని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కశ్మీర్ ఎన్నటికీ మనదేన్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలని అన్నారు. బాగల్‌కోట యాత్రికులు సురక్షితం -
క్వారీ గొడవ.. కాల్పుల రభస
● ఒకరికి తూటా గాయాలు దొడ్డబళ్లాపురం/ గౌరిబిదనూరు: క్వారీ మైనింగ్ విషయంలో వివాదం తలెత్తి పిస్టల్‌తో కాల్పులు జరిపిన సంఘటన చిక్కబళ్లాపురం జిల్లా మంచేనహళ్లి గ్రామం వద్ద చోటుచేసుకుంది. సకలేశ్‌కుమార్ అనే వ్యక్తి చికెన్ రవి అనే వ్యక్తి మీద ఫైరింగ్ చేశాడు. వివరాలు.. క్వారీ కోసం మంచేనహళ్లి వద్ద సకలేశ్‌కుమార్ ఏర్పాట్లు చేసుకున్నాడు. క్రషర్ లారీలు తిరగడానికి రోడ్డు వేస్తుండగా స్థానికులతో కలిసి చికెన్ రవి అనే వ్యక్తి ధర్నా చేపట్టాడు. తన క్వారీకి అడ్డు రావద్దని అతనితో సకలేశ్‌కుమార్ వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో సకలేశ్‌కుమార్ తలకు గాయమైంది. దీంతో పిస్టల్ తీసి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్ చికెన్ రవి కాలి తొడలోకి దిగింది. జనం వెంటనే రవిని తక్షణం చిక్కబళ్లాపుర జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో యుద్ధ వాతావరణం నెలకొంది. సకలేశ్ కుమార్ మాజీ ఎమ్మెల్సీ వైఎన్ నారాయణస్వామికి దగ్గరి బంధువు అవుతారు. మంచేనహళ్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.నిందితులు అరెస్టు చిక్కబళ్లాపురం: జిల్లా ఎస్పీ కుశాల్ చౌక్సి మాట్లాడుతూ సకలేశ్ను మంచేనహళ్లి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎంపీ కె సుధాకర్ మాట్లాడుతూ తన 50 ఏళ్ల అనుభవంలో జిల్లాలో ఎప్పుడు కాల్పుల సంఘటన ఎప్పుడూ జరగలేదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు. నేను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు ఇదే క్వారీ విషయం నా వద్దకు వచ్చింది, క్వారీ ఏర్పాటుకు నేను సమ్మతించలేదు, ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే దీనికి కారణం. వారికి తెలియకుండా ఎలా జరుగుతుందని అని మండిపడ్డారు. కాల్పులను ఖండిస్తూ గ్రామస్తులు పోలీసు స్టేషన్ వద్ద ధర్నా చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది.నేడు మహదేశ్వర బెట్టకు సీఎం మైసూరు: సీఎం సిద్దరామయ్య గురువారం నుంచి మూడు రోజుల పాటు చామరాజనగర, మైసూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. గురువారం ఉదయం 11.30 గంటలకు బెంగళూరు నుంచి మలెమహదేశ్వర బెట్టకు హెలికాప్టర్లో సీఎం చేరుకుని మధ్యాహ్నం 12 గంటలకు ప్రత్యేక కేబినెట్ భేటీలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 3 గంటలపైన మలెమహదేశ్వర స్వామి క్షేత్ర అభివృద్ధి ప్రాధికార సమావేశంలో పాల్గొని రాత్రికి బెట్ట మీదే బస చేస్తారు. శుక్రవారం ఉదయం బెట్టలోని సుత్తూరు శాఖామఠాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు మైసూరుకు వచ్చి ప్రభుత్వ అతిథిగృహంలో మైసూరు పాలికె అధికారులతో భేటీ అవుతారు. ఇంకా పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉగ్ర దాడిపై ఆగ్రహం తుమకూరు: జమ్మూ కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ తుమకూరు నగరంలో బీజేపీ నేతలు నిరసన తెలిపారు. నగర ఎమ్మెల్యే జ్యోతి గణేశ్ నేతృత్వంలో టౌన్‌హాల్ సర్కిల్లో ఆందోళన చేశారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ ఇలాంటి భయానక ఘటనలను ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఈ నెల 25న తుమకూరులో జరగాల్సిన బీజేపీ జనాక్రోశ యాత్ర వాయిదా పడింది. మృతుల గౌరవార్థం జనాక్రోశ యాత్రను వాయిదా వేసినట్లు తెలిపారు. దొంగ అరెస్టు, అర్ధ కేజీ బంగారు నగలు సీజ్ కోలారు: కోలారు జిల్లా ముళబాగిలు పట్టణం, గ్రామీణ ప్రాంతాలలో కలిపి మొత్తం 9 చోట్ల దొంగతనాలకు పాల్పడిన దొంగని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 52 లక్షల విలువ చేసే 557 గ్రాముల బంగారు నగలు, కేజీ వెండి సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. దొంగ బెంగళూరు బనశంకరికి చెందిన సయ్యద్ అఫ్సర్ (37) అని తెలిపారు. వరుసగా జరిగిన దొంగతనాలపై విచారణ చేపట్టి దొంగను అరెస్టు చేయడంలో సఫలమయ్యారు. -
వైభవంగా కాళికా మాత జయంతి
రాయచూరు రూరల్: నగరంలో కాళికా మాత జయంత్యుత్సవాలు వైభవంగా జరిగాయి. బుధవారం విశ్వ కర్మ సమాజం ట్రస్ట్, వందలాది మంది భక్తుల సమక్షంలో అమ్మ వారికి అభిషేకం చేయించారు. అలంకరణలతో కాళికా దేవి ఆలయంలో మాతకు విశేష పూజలు జరిపి అమ్మవారి విగ్రహానికి పుష్ప వృష్టి, ప్రత్యేక అలంకార సేవలు చేసి పల్లకీ సేవల్లో ఊరేగించారు. దేవికి పూలు, పండ్లు, ధవస, ధాన్యాలతో పూజలు చేశారు. కార్యక్రమంలో ఈశ్వర్, నారాయణ, జయంతాచారి, నాగరాజ్, రవీంద్ర, లక్ష్మిపతి, హరినాథ్, మల్లేష్, మౌనేష్, ఆనంద్, శ్రీకాంత్, గిరిబాబు, వినోద్, ఆకాష్, హరిహరన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
కులాల మధ్య చిచ్చుకు సర్కారు కుట్ర
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన వర్గాలపై ఇచ్చిన నివేదికల్లో వీరశైవ లింగాయతుల జనాభా గణాంకాలను తగ్గించి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి చేసిన ప్రయత్నాన్ని ఎలె బిచ్చాలి, మటమారి మఠాధిపతి తప్పుబట్టారు. మంగళవారం నగరంలోని సోమవారపేట హిరేమఠంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. గతంలో 27 శాతం ఉన్న జనాభాను నేడు 11 శాతానికి తగ్గించి వీరశైవ లింగాయతులున్నట్లు నివేదికలో పేర్కొనడం అపహాస్యంగా ఉందన్నారు. దీనిని నిరసిస్తూ ఈనెల 28న జిల్లాలో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో పోరాటం చేపడుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కులగణన పేరుతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య పదవిని కాపాడుకోవడానికి కుట్ర పన్నారన్నారు. రాజకీయ లాభం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టడానికి తోడు పదవిని రక్షించుకోవడానికి నాటక మాడుతున్నట్లు తెలిపారు. కులగణనలో సరైన గణాంకాలు లేవన్నారు. తప్పుల తడకగా నివేదికలు అందించారన్నారు. ఏనాడు ఏ అధికారి కులగణన సమీక్షకు రాలేదన్నారు. కిల్లే బృహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్య, అభినవ రాచోటి శివాచార్య, పంచాక్షరి, గురుమూర్తి, మహాలింగ, విరుపాక్ష పండితారాధ్య, వీరసంగమేశ్వర, శంభు సోమనాథ, శంభులింగ, పంపాపతి, కేంద్ర మాజీ మంత్రి బసవరాజ పాటిల్ అన్వరి, శాసన సభ్యులు హంపనగౌడ, శివరాజ్ పాటిల్, అధ్యక్షుడు శరణు భూపాల్ నాడగౌడ, బసనగౌడ, చంద్రశేఖర్, షణ్ముకప్ప, మల్లికార్జున, విజయ్ కుమార్‌లున్నారు. 28న జిల్లాలో వీరశైవ సమాజంచే పోరాటం -
ఉగ్రదాడి పిరికిపంద చర్య
సాక్షి, బళ్లారి: కశ్మీర్లో అమాయక ప్రజలపై ఉగ్రవాదులు దాడి చేసి హత్య చేయడం దారుణం అని మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం రాత్రి నగరంలోని రాయల్ సర్కిల్ వద్ద బీజేపీ నాయకులు, కార్యకర్తలు హిందూ పర సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన 30 మందికి శ్రద్ధాంజలి ఘటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఉగ్రవాదుల దాడులను కూకటి వేళ్లతో పెకలించాలన్నారు. దేశంలో భయభ్రాంతులను సృష్టిస్తున్న ఉగ్రవాదుల దాడులను ఖండించాలన్నారు. పర్యాటక రంగానికి పేరు గాంచిన కశ్మీర్‌ను తిలకించడానికి వెళ్లిన హిందువులపై కాల్పులు జరిపి చంపడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు. హిందువులపై మారణకాండపై కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా గట్టి చర్యలు తీసుకొని నివారిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. ఈ ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం వారి గుండెల్లో దడ పుట్టించాలన్నారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు వైఎం సతీష్, బీజేపీ నాయకులు రామలింగప్ప, కేఎస్.దివాకర్ తదితరులు పాల్గొన్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి దుర్మార్గం రాయచూరు రూరల్: జమ్మూకశ్మీర్‌లో బైసారన్, పహల్గాంల మధ్య మంగళవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపి పర్యాటకులను హతమార్చడం దుర్మార్గం, ఖండనీయమని యువజన కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. బుధవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు మరిస్వామి మాట్లాడారు. కశ్మీర్లో ఉన్న ఆర్టికల్–370ని రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. పహల్గాంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన సంభవించిందన్నారు. ఈ విషయంలో ప్రత్యేక దర్యాప్తు చేపట్టి తప్పు చేిసిన వారికి ఉరిశిక్ష వేయాలని కోరుతూ రాష్ట్ర గవర్నర్‌కు తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఫైజల్ ఖాన్, శాబాజ్, మధు, రషీద్, సంతోష్, అబ్దుల్, ఇస్మాయిల్, సురేష్, రఫీ, ప్రతాప్రెడ్డిలున్నారు. ఏబీవీపీ రాస్తారోకో హుబ్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యటనలకు, విహారయాత్రల కోసం వెళ్లిన భారతీయులను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన దాడిపై అంతటా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో నగరంలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. విద్యానగర్‌లోని బీవీబీ కళాశాల ఎదురుగా సమావేశమైన ఏబీవీపీ కార్యకర్తలు, వేలాది మంది విద్యార్థులు మానవహారం నిర్మించి నిరసన వ్యక్తం చేశారు. అంతేగాక టైర్లకు నిప్పు పెట్టి ఆక్రోశం వెళ్లగక్కారు. హిందువులే లక్ష్యంగా తుపాకులతో కాల్పులు జరిపి 30 మందిని హత్య చేసిన జిహాది మూకలను కూడా అదే విధంగా కాల్చి చంపాలని ఆందోళనకారులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. తమకు న్యాయం కావాలని, జమ్ముకశ్మీర్‌ను ఉగ్రవాద రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనలో ఏబీవీపీ కార్యదర్శి మణికంఠ కళసా, ఏబీవీపీ ప్రముఖులు మౌనేష్గౌడ, సిద్ధార్థ కోరి, విజయ కల్లూర, నాగదత్త, దానేష్ కిత్తూర, సంజన హిరేమఠ, రక్షిత, హర్షిత, రాజేష్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. కశ్మీర్ ఘటన అత్యంత దారుణం మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి -
కశ్మీర్లో కొప్పళవాసులు క్షేమం
హొసపేటె: జమ్ముకశ్మీర్ పర్యటనకు వెళ్లిన కొప్పళకు చెందిన 19 మంది క్షేమంగా ఉన్నారు. ఈ విషయంపై వారు తమ కుటుంబ సభ్యులతో మాట్లాడి తాము సురక్షితంగా ఉన్నామని చెప్పారు. కొప్పళ నగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాటన్ పాషా, వ్యాపారవేత్త శివకుమార్ పవలిశెట్టర్, శరణప్ప సజ్జన్, సిద్దు గన్వారీ కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజుల పర్యటన కోసం మంగళవారం శ్రీనగర్ బయలుదేరారు. ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో వారు తమ ప్రయాణాన్ని ముగించుకుని తిరిగి వస్తున్నట్లు తెలిపారు. విహారయాత్రకు వెళ్లిన శివకుమార్ పవలిశెట్టర్ సోదరుడు మల్లికార్జున్ మీడియాతో మాట్లాడుతూ తన సోదరుడు, కుటుంబం వారం రోజుల పర్యటన కోసం కశ్మీర్‌కు వెళ్లారు. వారు తమకు ఫోన్ చేసి అక్కడ సురక్షితంగా ఉన్నామని చెప్పారన్నారు. ఈ ఉదయం వారు శ్రీనగర్‌లో తిరుగుతున్న ఫోటోలు, వీడియోలను పంపారు. శ్రీనగర్ పూర్తిగా మూతపడింది. తన సోదరుడు ఈ సాయంత్రం అక్కడి నుంచి తిరిగి వస్తారు. ఆయన మంత్రి సంతోష్‌లాడ్‌ను కలిశారు అని అన్నారు. కాటన్ పాషా కుమారుడు సుఫియాన్ స్పందిస్తూ తన తండ్రి, తల్లి, ముగ్గురు సోదరీమణులు కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదులు కాల్పులు జరిపారని విన్న తర్వాత మేం భయపడ్డామన్నారు. కొప్పళ నుండి మొత్తం 19 మంది కశ్మీర్ టూర్‌కు వెళ్లారని తెలిపారు. ఫీజుల దుర్వినియోగంపై ఎఫ్‌డీఏ సస్పెండ్ హుబ్లీ: నృపతుంగ గుట్ట పార్కులో వసూలు చేసిన ప్రవేశ రుసుము బాపతు నగదును దుర్వినియోగం చేసిన ఆరోపణలపై హుబ్లీ ప్రాంతీయ అటవీ రేంజ్ ఎఫ్‌డీఏ విశ్వనాథ్ మహాజన్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ధార్వాడ డివిజన్ కార్యాలయం ద్వారా హుబ్లీ పరిధి కార్యాలయంలో 2024 జనవరి 10 నుంచి 2025 ఫిబ్రవరి 12 వరకు కార్యాలయంలో అన్ని శాఖల నిర్వహణ చేసే వారు ఈ సందర్భంగా డిప్యూటీ రేంజ్ అటవీ అధికారి ఎంఎస్ రాయనగౌడ, బందోబస్తు అటవీ పాలకి సుమిత్ర బొమ్మనవాడ, సదరు గుట్టలో వసూలు చేసిన రూ.15,57,880 సేకరించి బ్యాంక్‌కు జమ చేయకుండా విశ్వనాథ్ చేతికిచ్చారు. అయితే ఇందులో రూ.8,95,470 మాత్రమే బ్యాంక్‌లో జమ చేశారు. మిగిలిన రూ.6,62,410 లను విశ్వనాథ్ దుర్వినియోగం చేసిన నేపథ్యంలో సంబంధిత అటవీ అధికారి రామలింగప్ప ఉప్పార అశోక్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై శాఖ వారు దర్యాప్తు జరిపిన ధార్వాడ సర్కిల్ ముఖ్య అటవీ సంరక్షణ అధికారి నితీష్‌కుమార్ నియమాల ఉల్లంఘన నేపథ్యంలో డిప్యూటీ అటవీ సంరక్షణ అధికారి వివేక్ కవరి విశ్వనాథ్‌ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు వెల్లడించారు. తాగునీటి ఎద్దడి నివారించండి రాయచూరు రూరల్: గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ తాలూకా స్థాయి అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా పంచాయతీ సభా భవనంలో జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో మాట్లాడారు. వేసవి కాలం ప్రారంభమైనందున మూడు నెలల పాటు ప్రజలు తాగు నీటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. నీటి సౌకర్యాలు లేని గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీరందించేందుకు యజమానులతో చర్చించాలన్నారు. తాలూకాలో అకాల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టం అంచనాలను తయారు చేసి పరిహారం అందించాలన్నారు. జలజీవన్ మిషన్, జలధార పథకాలను సక్రమంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ గజానన బలి, టీపీ ఈఓ చంద్రశేఖర్, తహసీల్దార్ సురేష్ వర్మ, ఆర్‌ఏపీఎంసీ అధ్యక్షుడు జయంతి రావ్ పతంగి, పవన్ పాటిల్‌లున్నారు. ఉగ్రదాడి నుంచి నలుగురు సురక్షితంహొసపేటె: కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి నుంచి నగరానికి చెందిన నలుగురు సురక్షితంగా బయట పడ్డారు. రాజశేఖర్, అతని కుటుంబం ఈనెల 18న కశ్మీర్‌కు బయలుదేరారు. టీఎంఏఈ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ టీఎం రాజశేఖర్, ఆయన భార్య ఉమాదేవి, కుమార్తె డాక్టర్ గౌరిక, అల్లుడు దొడ్డబసయ్య సముద్ర మట్టానికి పది వేల అడుగుల ఎత్తులో ఉన్న పహల్గాం ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించారు. రాజశేఖర్ తప్ప, కుటుంబ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం 2.18 గంటలకు బైసార్ సమీపంలోని దుకాణానికి కుంకమపువ్వు కొనడానికి వచ్చారు. అప్పుడు అకస్మాత్తుగా ఐదు లేదా ఆరు అడుగుల దూరంలో కాల్పులు జరుపుతున్న ఉగ్రవాదులను చూసి, వారు అక్కడి నుంచి తప్పించుకుని ప్రాణాలను కాపాడుకోడానికి కిందకు దిగారు. శ్రీనగర్ నుండి దాదాపు 8 కిమీ దూరంలో ఉన్న ఈ ప్రదేశం చాలా అందమైన పర్యాటక కేంద్రం. ప్రతి రోజు దేశ, విదేశాల నుంచి వేలాది మంది పర్యాటకులు అక్కడికి వస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇక్కడ భద్రతకు సైనిక దళాలను మోహరించలేదు. ఈ ప్రదేశంలో మొబైల్ నెట్వర్క్ లేదు. చరిత్రలో ఈ ప్రదేశంలో ఎప్పుడూ ఉగ్ర దాడి జరగలేదు అని రాజశేఖర్‌ను ఫోన్లో సంప్రదించినప్పుడు తెలియజేశారు. -
కార్యాలయం తరలింపుపై నిరసన
బళ్లారి అర్బన్: బళ్లారిలోని చేనేత, జవళి శాఖ జేడీ కార్యాలయాన్ని కలబుర్గికి తరలించే ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని నగరంలో భారీ ఆందోళన చేపట్టారు. బళ్లారి జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్, సామాజిక పోరాట యోధుడు, ప్రముఖ సీఏ సిరిగేరి పన్నారాజ్, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు యశ్వంత్‌రాజ్ నాగిరెడ్డి సారథ్యంలో గాంధీ భవన్ నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు ఈ ఆందోళన చేపట్టారు. నేతలు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి బళ్లారితో పాటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో రెడీమేడ్ పరిశ్రమ కుటీర పరిశ్రమగా అభివృద్ధి చెందిందన్నారు. బళ్లారిలో 200 వరకు గార్మెంట్ తయారీ యూనిట్లు ఉన్నాయన్నారు. జీన్స్ గార్మెంట్స్, జీన్స్ వాషింగ్, జాబ్ వర్కింగ్ యూనిట్లు పని చేస్తున్నాయి. నగరంలో 50 వేల మందికి పైగా దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఆ మేరకు ప్రతి ఏటా రూ.2 వేల కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. యశ్వంత్‌రాజ్ నాగిరెడ్డి మాట్లాడుతూ బళ్లారి కేంద్రంగా బళ్లారి జీన్స్ అపారల్ పార్క్ నాలుగో దశ ముండ్రగి పారిశ్రామికవాడలో, అలాగే 80కి పైగా జీన్స్ వాషింగ్ యూనిట్లు, 1000 మందికి పైగా ఉపాధికి ప్రతిపాదన ఉందన్నారు. మొత్తానికి బళ్లారి నగరంలో టెక్స్టైల్ పార్క్‌కు అన్ని విధాలుగా వసతులు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎంకు రాసిన వినతిపత్రాన్ని డీసీ కార్యాలయ ప్రతినిధికి అందజేశారు. ఆందోళనలో ప్రముఖులు మహారుద్రగౌడ, దొడ్డనగౌడ, సురేష్‌బాబు, డాక్టర్ మర్చేడ్ మల్లికార్జున, వీ.రామచంద్ర, జిల్లా కాటన్ అసోసియేషన్, గార్మెంట్స్ తయారీదారుల సంఘం, బళ్లారి జీన్స్ వాషింగ్ అసోసియేషన్, బళ్లారి టైలరింగ్ అసోసియేషన్, జిల్లా ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు జిల్లాలోని వివిధ సంఘాల నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు పాల్గొన్నారు. ఆ కార్యాలయం బళ్లారిలోనే ఉండాలి చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుల డిమాండ్ -
ఉచితంగా మజ్జిగ పంపిణీ
బళ్లారి రూరల్ : భగభగ మండుతున్న ఎండలకు గొంతులో కాసిన్ని మంచినీళ్లు పడితే ప్రాణం కాస్త కుదుట పడుతుంది. మరి చల్లని మజ్జిగ తాగితే మరింత ఉపశమనం కలుగుతుందని భావించిన దావణగెరె స్పూర్తి సేవా ట్రస్టు దావణగెరె మహానగర పాలికె ముందు నగరవాసులకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత 30 ఏళ్లుగా నగరంలో ఉచిత మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు ట్రస్టు ప్రముఖుడు బి.సత్యనారాయణ మూర్తి తెలిపారు. ట్రస్టు ప్రముఖులు బెన్నళ్లి శివకుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. 26 నుంచి గాలికుంటు నివారణకు టీకాలుహొసపేటె: పశువుల్లో కనిపించే గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేసే కార్యక్రమాన్ని ఈనెల 26 నుంచి జూన్ 9 వరకు మొత్తం 45 రోజుల పాటు ఏకకాలంలో నిర్వహించనున్నట్లు పశుసంవర్ధక, పశువైద్య సేవల విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ పోమ్ సింగ్ తెలిపారు. పశువుల ఆరోగ్యం, వ్యాధుల నియంత్రణ కార్యక్రమం కింద జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, అన్ని స్థానిక సంస్థల్లో 7వ రౌండ్ కాళ్లు, నోటి వ్యాధికి టీకాల కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పాదం, నోటి వ్యాధి అనేది ఒక వైరల్ వ్యాధి, ఇది గిట్టలు గల అన్ని జంతువులను ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి అంటువ్యాధి, గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి పశువులు, గేదెల పాదాలు, నోటిపై పుండ్లు ఏర్పడటం ద్వారా రైతులకు ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. దీని వల్ల అపారమైన బాధ, అలసట, తక్కువ పాల దిగుబడి వస్తుంది. ఈ విధంగా జిల్లాలోని 92 విభాగ సంస్థల్లో ఒకేసారి ప్రారంభిస్తారన్నారు, 45 మంది పశువైద్య అధికారులు, 10 మంది కాంట్రాక్ట్ ఆధారిత పశువైద్య అధికారులు సహా 238 మంది వ్యాక్సినేటర్లు, 81 మంది అవుట్ సోర్సింగ్, అనుబంధ కార్మికులు సహా 157 మంది విభాగ సిబ్బంది టీకా కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. పశువుల పెంపకందారులు, ప్రజలు ఈ టీకాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. భక్తిభావం పెంచుకోవాలిరాయచూరు రూరల్: మానవుడు తన జీవితంలో భక్తిభావం పెంపొందించుకునేందుకు కృషి చేయాలని బాళెహొన్నూరు రంభాపురి పీఠాధిపతి పిలుపు ఇచ్చారు. బుధవారం బీదర్ జిల్లా హుమ్నాబాద్ తాలూకాలోని హుడిగిలో దిగంబర కరి బసవేశ్వర జాతర ఉత్సవాల్లో భాగంగా విరుపాక్షలింగ శివాచార్య పట్టాధికార ఉత్సవాల్లో భక్తులకు ఆశీర్వచనాలు అందించి మాట్లాడారు. నేడు మానవుడు పని ఒత్తిళ్లతో ప్రతి నిత్యం ఎంతో మధనపడుతున్నాడన్నారు. రోజు కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో పట్టాధికారం చేయించారు. శాంతమల్ల శివాచార్య, విధాన పరిషత్ సభ్యుడు చంద్రశేఖర్ పాటిల్, స్వామీజీలు, మాజీ శాసన సభ్యులున్నారు. ఎయిమ్స్ మంజూరు చేయించండి రాయచూరు రూరల్: రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న రాజకీయ జనాక్రోశ యాత్రకు బదులు ఎయిమ్స్ మంజూరు చేయించాలని రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు పేర్కొన్నారు. బుధవారం బెంగళూరు విధానసౌధ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనాక్రోశ యాత్ర చేపట్టడంపై ఉన్న శ్రద్ధ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్‌కు రాయచూరుకు ఎయిమ్స్ మంజూరు చేయించడంపై లేదని ఆక్రోశించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిందన్నారు. లింగాయత్ మంత్రులు రాజీనామా చేయాలిరాయచూరు రూరల్: రాష్ట్రంలో కులగణన పేరుతో ముఖ్యమంత్రి సిద్దరామయ్య తన పదవిని కాపాడుకోవడానికి కుట్ర పన్నారని, కులగణనను వ్యతిరేకిస్తూ కేబినెట్లోని ఏడుగురు లింగాయత్ మంత్రులు రాజీనామా చేయాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ డిమాండ్ చేశారు. మంగళవారం నగరంలోని సోమవారపేట హిరేమఠంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిన వర్గాలపై నివేదించిన నివేదికల్లో వీరశైవ లింగాయతుల జనాభా గణాంకాలను తగ్గించిన అంశంపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. -
అవినీతిపరులతో దేశాభివృద్ధికి అవరోధం
బళ్లారి రూరల్ : ఉగ్రవాదులు అమాయక ప్రజలకు భయభ్రాంతులు కలిగిస్తారు. అదే మన మధ్యలో ముసుగులో ఉన్న అవినీతిపరులు దేశాభివృద్ధికి అవరోధకులని ఉపలోకాయుక్త న్యాయమూర్తి బీ.వీరప్ప తెలిపారు. జిల్లా న్యాయసేవా ప్రాధికార, జిల్లా న్యాయవాదుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు న్యాయవాదుల సాంస్కృతిక సముదాయ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ జయంతిలో పాల్గొని ఆయన మాట్లాడారు. శాసకాంగం, న్యాయాంగం, పత్రికా రంగంలో కూడా అవినీతి పెరుగుతున్న నేపథ్యంలో ఆలోచించాల్సిన తరుణమని తెలిపారు. ప్రతిభావంతులైన న్యాయవాదులు అవినీతికి విరుద్ధంగా గొంతెత్తాలన్నారు. పల్లెపల్లెకు వెళ్లి పేదలకు, ఆసక్తి ఉన్నవారికి చట్టాలపై జాగృతి కలిగించాలన్నారు. రాజ్యాంగం జాతీయ గ్రంథమైంది. ఇందులోని నిబంధనలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. రాజ్యాంగ రక్షితి రక్షితః అన్న నానుడికి తాను శ్రీకారం చుట్టుతున్నట్లు తెలిపారు. ఉపలోకాయుక్త న్యాయమూర్తి నగరంలోని సిటీ కార్పొరేషన్, కేఎస్ఆర్టీసీ, ప్రభుత్వ జిల్లాసుపత్రి, వసతి నిలయాలు, సబ్ రిజిస్టార్ కార్యాలయం, తాలూకా కార్యాలయాలను పరిశీలించారు. అక్కడ సిబ్బంది నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్‌కు పైఅధికారులకు సిఫార్సు చేశారు. ఉపలోకాయుక్త వెంట ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ఉన్నారు. వారు ముసుగులో ఉన్న ఉగ్రవాదుల్లాంటివారు దావణగెరెలో ఉప లోకాయుక్త వీరప్ప ముమ్మర తనిఖీలు -
ఆరో గ్యారంటీ.. ధరల పెంపు
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఐదు గ్యారెంటీలు అమలు చేస్తామని, ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని, ఆరో గ్యారంటీ కూడా ఇస్తోందని, అదే ధరల పెంపుదల, సామాన్యుల జీవిత విధానానికి విఘాతం కలిగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర పేర్కొన్నారు. ఆయన బుధవారం యాదగిరి నగరంలో జనాక్రోశ సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఆక్రోశం రోజు రోజుకు పెరుగుతోందన్నారు. ఒక చేత్తో ఇచ్చి, ఇంకో చేత్తో లాక్కొంటున్నారని మండిపడ్డారు. ఆరో గ్యారెంటీకి ఎలాంటి ప్రచారం చేసుకోవడం లేదని వ్యంగ్యంగా అన్నారు. దాదాపు 50కి పైగా నిత్యావసర వస్తువుల ధరలను పెంచారన్నారు. దీంతో పేదలకు ఎంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. జనాక్రోశ యాత్రకు విశేష స్పందన ప్రతి గ్రామంలో జనం కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారన్నారు. తాము చేపట్టిన జనాక్రోశ యాత్రకు విశేష స్పందన లభిస్తోందన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు అమాంతంగా పెంచేస్తున్నారన్నారు. యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు రైతులు హితదృష్టితో పని చేశారని, సిద్దరామయ్య సర్కార్ ఎవరి హితదృష్టితో పని చేస్తోందో అర్థం కావడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆరో గ్యారంటీ అమలు చేయడంతో పాటు కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి ఆనందం పొందుతోందన్నారు. ఉగ్రవాదులు దాడులను కూకటివేళ్లతో పెకలించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. కశ్మీరులో హిందువులపై జరిగిన దాడులు అత్యంత హేయమైన చర్యగా, పిరికిపందలు చేసే అకృత్యం అని మండిపడ్డారు. కేంద్రం గట్టి చర్యలు తీసుకుంటుంది ఉగ్రవాదులపై కచ్చితంగా కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటుందనే నమ్మకం ఉందన్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనను రద్దు చేసుకుని హుటాహుటిన వచ్చి భవిష్యత్తు ప్రణాళికలపై చర్చిస్తుండటం సంతోషంగా ఉందన్నారు. యావత్ దేశం ఉలిక్కిపడేలా ఉగ్రవాదులు భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఇందుకు 100 రెట్టు నష్టం వారు అనుభవిస్తారని గుర్తు చేశారు. కశ్మీరులో హిందూ పండిట్లకు కూడా అవమానం చేశారని, సైనికుల మృతి కూడా కారణం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీరులో హిందువులపై జరుగుతున్న మారణకాండకు ఖచ్చితంగా పుల్‌స్టాప్ పెట్టే రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఉగ్రవాదులకు మూలాలు లేకుండా చేయాలన్నారు. మాజీ మంత్రి శ్రీరాములు, బీజేపీ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీలు చలవాది నారాయణస్వామి, రవికుమార్ పాల్గొన్నారు. ఎడమ చేత్తో ఇస్తూ కుడి చేత్తో లాక్కొంటోంది ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించాలి ఉగ్రవాదులు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లిస్తారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీ.వై. విజయేంద్ర -
యువ ప్రేమజంట ఆత్మహత్య!
సాక్షి, బళ్లారి: ప్రేమ జంట ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన ప్రేమికులు శవాలై తేలారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి బళ్లారి జిల్లాలోని హరపనహళ్లి తాలూకా బిట్టినకట్టి గ్రామానికి చెందిన మద్దనస్వామి (18), బండ్రి గ్రామానికి చెందిన దీపిక (18) అనే ఇద్దరు ప్రేమించుకున్నారు. పీయూసీలో ఇద్దరు ప్రథమ శ్రేణిలో పాసయ్యారు. అయితే వారం రోజుల క్రితం ఏమైందో కాని ఇరువురు కనబడకుండా వెళ్లిపోయారు. దీనిపై పోలీసు స్టేషన్లో కూడా తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు, కుటుంబ సభ్యులు గాలిస్తున్న నేపథ్యంలో హరపనహళ్లి పట్టణ శివారులోని ఐటీఐ కళాశాల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరి వేసుకున్న స్థితిలో శవాలై తేలారు. స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అక్కడి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. గ్రామంలో తీవ్ర విషాదం అలముకొంది. -
హత్యాయత్నం నిజమా.. నాటకమా?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై పై కాల్పులు జరిగిన కేసులో బిడది పోలీసులు అతని గన్‌మ్యాన్ మన్నప్ప విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిక్కీ రై తానే కాల్చుకుని హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నారు. రిక్కీ రైకి ఉన్న ముగ్గురు గన్ మ్యాన్లు ఒక్కొక్కరు ఒక్కో వాంగ్మూలం ఇస్తుండడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. తన పిన్ని అనురాధ, రాకేశ్ మల్లి, మరో ఇద్దరిపై ఆరోపణలు చేసి రిక్కీ కేసును పక్కదారి పట్టిస్తున్నారా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరగడానికి ముందు కుక్కలు అరవడంతో గాల్లోకి కాల్పులు జరిపామని గన్ మ్యాన్లు చెప్పిన మాటల్లో నిజం లేదని గుర్తించారు. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ మల్లి తన లాయర్లతో కలిసి రామనగర ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ శ్రీనివాసగౌడ అతనిని విచారించారు. పిన్ని అనురాధకు ఊరట ఈ కేసులో ఏ2గా ఉన్న రిక్కి రై పిన్ని అనురాధకు హైకోర్టులో ఊరట దక్కింది. కేసులో నుంచి తన పేరు తొలగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమెపై తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనురాధకు 14వ తేదీన యూరోప్‌కు వెళ్లిపోయిందని, 6 నెలల క్రితమే ఆస్తి గొడవలపై రాజీ చేసుకున్నారని ఆమె లాయర్ వాదించారు. నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..? -
దర్శన్‌కు పవిత్ర ఏమవుతారు?
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్‌కు హైకోర్టు కోర్టు సాధారణ బెయిలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బెయిలును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారంనాడు విచారణ సాగింది. ఈ సందర్భంగా జడ్జి.. దర్శన్‌కు నిందితురాలు పవిత్రగౌడ ఏమవుతారని దర్శన్ వకీలు మను సింఘ్విని ప్రశ్నించారు. మిస్ట్రెస్ అవుతుందని లాయర్ తెలిపారు. మరి దర్శన్‌కు వివాహం జరిగిందా అని ప్రశ్నించగా, అవునని లాయర్ సమాధానమిచ్చారు. దర్శన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని సింఘ్వి వాదించగా, అన్ని ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. మిస్ట్రెస్ అంటే ఇంగ్లీష్‌లో వివాహిత పురుషునితో సుదీర్ఘ కాలంగా లైంగిక సంబంధం ఉన్న మహిళ అని అర్థం. ఈ వాదనలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. -
దేశంలో అత్యున్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడమంటే మాటలు కాదు. ఏళ్ల తరబడి కఠోర సాధన, ప్రతిభ కలిస్తేనే విజయం వరిస్తుంది. అదే కోవలో కన్నడనాడు నుంచి పలువురు ప్రతిభావంతులు యూపీఎస్సీ ఫలితాల్లో మంచి ర్యాంకులు సాధించి పోస్టులకు అర్హత సాధించారు.
సాక్షి, బళ్లారి: ఢిల్లీలో మంగళవారం విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాలలో కన్నడ యువతీ యువకులు ర్యాంకులు సంపాదించారు. హావేరి జిల్లా రాణిబెన్నూరు తాలూకా హొసపేట గ్రామానికి చెందిన సచిన్ బసవరాజు 41వ ర్యాంక్ సాధించారు. ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్యునిగా పని చేస్తూ యూపీఎస్ఈ పరీక్షలు రాశారు. ఒకటి, రెండు, మూడుసార్లు పరీక్షలు రాసినా విజయం వరించలేదు. అయినా నిరాశ చెందక నాలుగోసారి జయకేతనం ఎగురవేశారు. జాతీయస్థాయిలో 41వ ర్యాంక్ సాధించిన సచిన్‌తో పాటు కుటుంబ సభ్యుల్లో ఆనందోత్సవం వెల్లువిరిసింది. కలెక్టర్ కావాలన్నదే తన కల అని చెప్పారు. మరో 10 మంది ర్యాంకర్లు బొమ్మనహళ్లి: కర్ణాటక నుంచి ఇద్దరు వైద్యులు టాప్– 50 ర్యాంకులు సాధించడం గమనార్హం. డాక్టర్.రంగమంజు 24వ ర్యాంకు పొందారు. మరొకరు హావేరి వాసి డా.సచిన్. రాష్ట్రం నుంచి ర్యాంకులు సాధించిన మిగతావారి వివరాలు.. ● అనుప్రియా సఖ్య–120వ ర్యాంకు ● బీ.ఎం.మేఘనా – 425 ● భరత్ సీ.యార– 567, ● డాక్టర్. భాను ప్రకాశ్– 523 ● నిఖిల్ ఎం.ఆర్– 724, ● టీ.విజయ్‌కుమార్– 894 ● హనుమంతప్ప నంది– 910 ● విశాకదకం– 962, ● సందీప్ సింగ్– 981, ● మోహన్ పాటిల్ 984 ర్యాంకు. కోలారులో మధు, మాధవి...శివమొగ్గలో వికాస్.. యూపీఎస్సీ ఫలితాల్లో కన్నడిగుల ప్రతిభ పలువురికి ఉత్తమ ర్యాంకులు కోలారు: సివిల్స్‌లో కోలారు జిల్లా యువతీ యువకులు సత్తా చాటుకున్నారు. జిల్లాలోని శ్రీనివాసపురం తాలూకా ఉపాధ్యాయ దంపతులు రవికుమార్, నందినిల కుమార్తె మాధవి 446వ ర్యాంకును సాధించారు. ఎంబిబిఎస్ చేసిన మాధవి మూడవ ప్రయత్నంలో ఉత్తీర్ణురాలు అయింది. కోలారు తాలూకా ఇరగసంద్ర గ్రామానికి చెందిన రైతు ఆనంద్, సుశీలమ్మ కుమారుడు ఎ.మధు 544వ ర్యాంకు సాధించారు. అగ్రి బీఎస్సీ చదివిన మధు యూపీఎస్సీ పరీక్షలను ఎంచుకుని విజయం సాధించాడు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో మరికొందరు ఉత్తమ ర్యాంకులను సాధించారు. శివమొగ్గ: శివమొగ్గ జిల్లాలోని సాగరకు చెందిన వికాస్ 228వ ర్యాంకును సాధించారు. అదే ఊరిలో పాఠశాల, ఇంటర్‌ను పూర్తిచేశారు. శివమొగ్గలో లెక్చరర్ అయిన విజయేంద్ర పాటిల్ , టీచర్ మహాలక్ష్మి దంపతుల కుమారుడు వికాస్. ఢిల్లీలో ఉంటూ సివిల్స్‌కు సన్నద్ధమయ్యాడు. మంచి ర్యాంకు సాధించడంతో బంధుమిత్రుల్లో సంతోషం నెలకొంది. -
గొర్రెల కాపరి ఆర్థిక మంత్రా?
మండ్య: గొర్రెలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టడం రాదు, ఆయనను ఆర్థిక మంత్రిని ఎందుకు చేశారని నాడు విమర్శించారు. అయితే తాను మంత్రిగా, ముఖ్యమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టానని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు. మంగళవారం జిల్లాలోని నాగమంగల తాలూకా దొడ్డబాల గ్రామంలో బీరదేవర జాతర మహోత్సవంలో సీఎం పాల్గొని మాట్లాడారు. తాను కురుబ కులంలో పుట్టినందుకు ఓ పత్రికలో తన గురించి గొర్రెలు లెక్క పెట్టడం రాదు, ఆర్థిక మంత్రిని ఎందుకు చేశారని రాశారని గుర్తు చేసుకున్నారు. విద్యావంతున్ని అయినందుకు తాను ముఖ్యమంత్రిని అయ్యానన్నారు. ఒకప్పుడు శూద్రులు సంస్కృతం నేర్చుకుంటే వారి చెవిలో కాచిన సీసాన్ని పోసేవారన్నారు. అయితే నేడు ఆ పరిస్థితి లేదన్నారు. మీ పిల్లలను విద్యావంతులను చేయకుంటే సమాజంలో మీకు గౌరవం లేదని అన్నారు. కులగణనలో తేడాలు ఉండొచ్చు కులగణనలో లోపాలుంటే సరిచేస్తాం, అభిప్రాయాలు తెలియజేయాలని కేబినెట్ మంత్రులను కోరాం, అయితే ఇంకా ఎవరూ ఇవ్వలేదు అని సిద్దరామయ్య తెలిపారు. గత సమీక్షకు, ఈ సమీక్షకు వ్యత్యాసం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు. అయితే జనాభాలో హెచ్చుతగ్గుల వల్ల సర్వేలో వ్యత్యాసం అయి ఉండవచ్చన్నారు. మంత్రులు అభిప్రాయాలు తెలిపిన తర్వాత కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని సీఎం అన్నారు. అని నన్ను హేళన చేశారు సీఎం సిద్దరామయ్య -
రచ్చకెక్కిన వీధి గొడవ
యశవంతపుర: సిలికాన్ సిటీలో వీధి గొడవ ఇప్పుడు మరో చర్చనీయాంశమైంది. వింగ్ కమాండర్ శిలాదిత్య గుప్తా వీడియోలో చెప్పినదానికి, బయట సీసీ కెమెరాల ద్వారా వెల్లడైనదానికి పొంతన లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో బైయప్పనహళ్లి పోలీసుస్టేషన్ పరిధిలో భారత వాయుసేన వింగ్ కమాండర్ దాడి కేసుకు సంబంధించి రెండు వైపులా విచారణ చేస్తున్నట్లు బెంగళూరు నగర పోలీసు కమీషనర్ బీ దయానంద తెలిపారు. వీడియోల ఆధారంగా అధిక సమాచారం సేకరిస్తామన్నారు. వింగ్ కమాండర్ చెబుతున్న మాటల్లో అనేక వ్యత్యాసాలున్నట్లు కమిషనర్ తెలిపారు. నా కొడుకునే కొట్టారు: బైకిస్టు తల్లి ఈ గొడవలో పోలీసులు అరెస్ట్ చేసిన యువకుడు వికాస్ తల్లి మీడియాతో మాట్లాడుతూ తన కొడుకుది ఎలాంటి తప్పు లేదని చెప్పారు. వికాస్ బైకు సైలెన్సర్, కారుకు టచ్ అయింది. వారు హిందీలో తిట్టారు. హిందీ అర్థం కాలేదని వికాస్ బదులిచ్చాడు, వింగ్ కమాండర్ కారు దిగి వికాస్‌ను తోసివేసి చేతిని కరిచి, శరీరాన్ని బరికాడు. బైకును ఎత్తిపడేసి కాళ్లతో తన్నాడు. పైగా మాదే తప్పని అంటున్నాడు. వింగ్ కమాండర్‌ను కూడా అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పైగా జాతి విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టాడని సోషల్ మీడియాలో వింగ్ కమాండర్ వైఖరిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వింగ్ కమాండర్ యువకునిపై పదేపదే దాడి చేసిన దృశ్యాలు, మొబైల్‌ని విసిరిపారేయడం సీసీ కెమెరాలలో రికార్డయింది. వింగ్ కమాండర్ ప్రవర్తనపై కన్నడ సంఘాలు కూడా భగ్గుమన్నాయి. దాడి చేసింది కాక ఆరోపణలు చేస్తున్నాడని తప్పుబట్టాయి. దాడి చేస్తున్న దృశ్యం వింగ్ కమాండర్, బైకిస్టులో ఎవరిది తప్పు? వీడియోలు, సీసీ కెమెరాలలో తలోరకం దృశ్యాలు విచారణ జరుపుతున్నాం: పోలీస్ కమిషనర్ -
ఎన్కౌంటర్ కేసుపై సీఐడీ ఏడీజీపీ ఆరా
హుబ్లీ: నగరంలోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 13న 5 ఏళ్ల చిన్నారిని చెరబట్టి హత్య చేసిన కేసుకు సంబంధించి నిందితుడు రితేష్‌కుమార్ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర సీఐడీ ఏడీజీపీ బీకే.సింగ్ నగరానికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. ఇప్పటికే సీఐడీ అధికారుల బృందం ఎస్పీ వెంకటేష్, ఏసీపీ శివప్రకాష్ ఆధ్వర్యంలో చురుగ్గా దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగ్ సదరు అధికారులతో కేసు సమగ్ర వివరాలను సేకరించారు. అలాగే ఘటన స్థలాన్ని కూడా పరిశీలించారు. సదరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటి కాంపౌండ్‌లో ఆటలాడుతున్న చిన్నారిని నిందితుడు చాక్లెట్ ఇస్తానని మభ్య పెట్టి ఎదురుగా ఉన్న షెడ్లోకి ఆ చిన్నారిని తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా దారుణంగా హత్య చేసిన సంగతి విదితమే. అయితే నిందితుడిని వెంటబెట్టుకొని స్థల పరిశీలన చేసే క్రమంలో తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడు పోలీసులపై దాడికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో మహిళా ఎస్ఐ అన్నపూర్ణ నిందితుడిని పారిపోవద్దు, లొంగిపొమ్మంటు హెచ్చరించి మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపినా పట్టించుకోక పోవడంతో నిందితుడి కాలిపైన, అలాగే వెన్నుపైన రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో నిందితుడు హతమైన విషయం తెలిసిందే. కాగా ఏడీజీపీ రాకతో కేసు దర్యాప్తు మరింత వేగాన్ని పుంజుకుంది. -
చెరువులో మునిగి బాలుడు దుర్మరణం
రాయచూరు రూరల్: చెరువు వద్దకు స్నానానికి వెళ్లిన ఓ బాలుడు అందులో మునిగి దుర్మరణం పాలైన ఘటన సోమవారం జిల్లాలోని సిరవార తాలూకా లక్కందిన్నిలో చోటు చేసుకుంది. మృతుడిని హుసేన్(10)గా పోలీసులు గుర్తించారు. పాఠశాలలకు సెలవులు కావడంతో స్నేహితులతో కలసి చెరువు వద్దకు స్నానానికి వెళ్లిన బాలుడు నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ ఘటనతో బాలుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రేమను కాదందని ప్రియురాలిపై హత్యాయత్నంహొసపేటె: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో ఆగ్రహం చెందిన ప్రేమికుడు జనసంచారం ఉన్న ప్రదేశంలో యువతిని కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించిన ఘటన నగరంలోని నగరసభ కార్యాలయం ముందు మంగళవారం జరిగింది. భారతి శావి (26) అనే యువతిపై ఆమె ప్రియుడు విజయభాస్కర్ దాడి చేశాడు. గత పదేళ్లుగా యువతి భారతి తన తల్లిదండ్రులతో కలసి హొససేటెలో నివసిస్తోంది. ఐదేళ్ల క్రితం ఆమెకు ఫేస్బుక్లో విజయభాస్కర్‌తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడ్డారు. యువతి ఇటీవల ప్రియుడిని దూరం పెట్టడం ప్రారంభించింది. తాను దూరంగా ఉండటమే కాకుండా విజయభాస్కర్ ప్రేమను తిరస్కరించింది. ప్రియుడు ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల నుంచి హొసపేటెకు వచ్చాడు. ప్రియురాలు బయటకు వెళుతున్న విషయాన్ని గమనించి రోడ్డు మీద వెళుతుండగా పెళ్లి చేసుకోమని బతిమాలాడు. అయితే యువతి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో కత్తితో పొడిచి హత్యాయత్నం చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతిని ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటన హొసపేటె టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీసీ కెమెరాలతో నిఘా పటిష్టంరాయచూరు రూరల్: నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు తోడు పటిష్ట నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పుట్టమాదయ్య వెల్లడించారు. సోమవారం నగరంలోని అశోక్ డిపో సర్కిల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి నుంచి రూ.35 వేల వ్యయంతో వివిధ ప్రాంతాల్లో వీటిని అమర్చారన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. సదర్ బజార్ సీఐ ఉమేష్ కాంబ్లే, ఎస్ఐ సణ్ణఈరణ్ణ, ఏఎస్ఐ శ్రీనివాస్, బసవరాజ్, చాంద్ పాషాలున్నారు. వారసులకు చోరీ మొబైళ్ల అప్పగింత రాయచూరు రూరల్: నగరంలో గత నెలలో చోరీకి గురైన మొబైల్ ఫోన్లను స్వాధీనపరచుకుని విచారణ జరిపి వాటిని తిరిగి సొంతదారులకు అప్పగించారు. నగరంలో సోమవారం సదర్ బజార్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ పుట్టమాదయ్య 25 మంది వారసులకు వాటిని అందించారు. సీఐ ఉమేష్ నారాయణ కాంబ్లే, పోలీసులు శ్రీనివాస్, రవి కుమార్, బసవరాజ్, శివానందలున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా యరగేరలోని పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం లెనిన్ 155వ జయంతిని, సీపీఐ(ఎంఎల్) సంస్థాపన దినోత్సవం, ప్రజా వ్యతిరేక దినోత్సవాలను నిర్వహించారు. బీజేపీ, జేడీఎస్‌ల వల్లే కేంద్ర సర్కార్ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం, ఏపీఎంసీ, కార్మిక, విద్యుత్, కార్పొరేట్ చట్టాలను జారీ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ కులగణన పేరుతో కులాల మధ్య చిచ్చు పెట్టడం, నిత్యావసర వస్తువుల ధరలు పెంచడంపై నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనలో అజీజ్ జాగీర్దార్, హనీఫ్, డానియల్, ఉరుకుందప్ప, ఇబ్రహీం, ఖాలిద్, గౌస్, ఆంజనేయ, తిరుమలేష్లున్నారు. -
అందరి కృషితో బళ్లారికే కేంద్ర కార్యాలయం
బళ్లారిఅర్బన్: ఎన్నో ఏళ్లుగా కర్ణాటక గ్రామీణ బ్యాంక్(కేజీబీ) కేంద్ర కార్యాలయం బళ్లారిలో ఉన్నా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధార్వాడ, బెంగళూరు ప్రాంతాలకు కేంద్ర కార్యాలయాన్ని మార్చాలని ఆదేశాలు రావడంతో బళ్లారిలోని వివిధ కన్నడ పర సంఘాల నాయకుల పోరాటం, ప్రజాప్రతినిధుల కృషితో కేజీబీ ప్రధాన కార్యాలయం తిరిగి బళ్లారికే దక్కిందని సహమత సంఘాల ఐక్యత అధ్యక్షుడు పన్నారాజ్ తెలిపారు. మంగళవారం రామప్ప సభాభవనంలో గ్రామీణ బ్యాంక్ ఉద్యోగుల సంఘం పదాధికారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేజీబీ ప్రధాన కార్యాలయం బళ్లారికి తిరిగి రావడంతో సహకరించిన సంఘాల నేతలను గుర్తించి స్వీట్లను పంచి సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కసాప అధ్యక్షుడు నిష్టిరుద్రప్ప, కన్నడ పర సంఘాల నేతలు టీ.శేఖర్, గడ్డం తిమ్మప్ప, మంజునాథ్, శ్రీనివాస్, పుష్ప, పద్మ తదితరులు పాల్గొన్నారు. -
ఈసారి బసవ జయంతిని ఘనంగా ఆచరిద్దాం
బళ్లారిఅర్బన్: ఈసారి ఎటువంటి నిబంధనలు లేకుండా బసవ జయంతిని వైభవంగా జరుపుకుందామని బళ్లారి నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఓ హోటల్లో ఏర్పాటు చేసిన వీరశైవ లింగాయత ప్రముఖుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బసవ జయంతి కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లను తాను చేస్తాను. నిబంధనల గురించి పట్టించుకోవద్దు, సమాజ బాంధవుల సహకారంతో కనీవినీ ఎరుగని రీతిలో ఈ సారి బసవ జయంతిని వైభవంగా జరుపుకుందాం అన్నారు. ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొనాలని కోరారు. జయంతి వేడుకల ఆచరణలో తన స్వార్థం ఏమి లేదు. బసవణ్ణను రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక రాయబారిగా ప్రకటించడంలో సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే.శివకుమార్ ఘనత ఉందని ఆయన చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమంతో పాటు సమాజం ఆధ్వర్యంలో కూడా జయంతి జరుపుకునే దిశలో కూడా ఆలోచించాలని సూచించారు. రూ.1.5 కోట్ల నిధులతో అశ్వారూఢ బసవణ్ణ విగ్రహాన్ని కేఈబీ సర్కిల్లో ఏర్పాటు చేద్దామని, దీనికి స్థలం ఇచ్చిన గడిగి కుటుంబ సభ్యులకు ఆయన అభినందనలు తెలియజేశారు. కమ్మరచేడు సంస్థాన కళ్యాణ స్వామి, హరగినడోణి స్వామి సాన్నిధ్యం వహించిన ఈ కార్యక్రమంలో అల్లం ప్రశాంత్, దండిన శివానంద, చోరనూరు కొట్రప్ప, కోరి విరుపాక్షప్ప, కరేనహళ్లి చంద్రశేఖర్, నరేంద్రబాబు, టీహెచ్ఎం గురుబసవరాజ్, డాక్టర్ మహిపాల్, అసుండి నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగాలిప్పిస్తానంటూ లక్షల్లో మోసం.. వ్యక్తి అరెస్ట్
బళ్లారిఅర్బన్: సాఫ్ట్వేర్ కంపెనీలో పని ఇప్పిస్తానంటూ నగరానికి చెందిన శివరామ నుంచి రూ.3.75 లక్షలను ఆన్లైన్ ద్వారా తీసుకొని మోసగించిన నిందితుడిని బళ్లారి సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం నివాసి కోనగుంట్ల సాయికుమార్‌గా గుర్తించారు. వై.భీమేష్కుమార్, అతడి స్నేహితుడు శివరామలకు ఆన్లైన్లో పరిచయం అయిన నిందితుడు సాయికుమార్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి రూ.3.75 లక్షలను ఆన్లైన్లో తీసుకొని తమను మోసగించినట్లుగా నిందితులిచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ డాక్టర్ సంతోష్ చవాన్, సీఐ రమాకాంత్, సిబ్బంది సుధాకర్, సురేష్, తిమ్మరాజులతో కూడిన బృందం నిందితుడు సాయికుమార్‌ను గాలించి పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.2.50 లక్షలను జప్తు చేశారు. కాగా నిందితుడిని పట్టుకున్న పోలీస్ బృందాన్ని జిల్లా ఎస్పీ శోభారాణి అభినందించారు. -
చెన్నకేశవునికి సూర్యాభిషేకం ●
● 4 ఏళ్ల తరువాత సాకారం దొడ్డబళ్లాపురం: నాలుగు సంవత్సరాల తరువాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. హాసన్ జిల్లా బేలూరులోని సుప్రసిద్ధ చెన్నకేశవస్వామి దేవాలయంలో స్వామి విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకాయి. గత నాలుగేళ్లుగా వర్షాలు, వాతావరణంలో మార్పుల వల్ల సూర్య కిరణాలు స్వామి విగ్రహాన్ని స్పర్శించలేదు. ప్రతి ఏడాది ఏప్రిల్ 21 లేదా 22 తేదీల్లో ఈ అద్భుతం జరుగుతుంది. ఈసారి మంగళవారంనాడు ఉదయం 6:10 గంటలకు దేవాలయం గోపురాన్ని తాకిన సూర్య కిరణాలు 6:15కి విగ్రహాన్ని స్పృశించాయి. ఈ దృశ్యాన్ని చూసి భక్తులు పరవశించిపోయారు. షేర్ల పేరుతో రూ.3 లక్షలు టోపీమైసూరు: అతి స్వల్ప సమయంలో డబ్బు సంపాదించాలని ఆశపడి లక్షలాది రూపాయలను కోల్పోయి వంచనకు గురవుతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి రూ.3 లక్షలను కోల్పోయిన ఘటన నగరంలో జరిగింది. నగరంలోని కేఎన్పుర నివాసికి టెలిగ్రాం ద్వారా షేర్ మార్కెట్ గురించి సందేశం వచ్చింది. దీంతో అతను వంచకులు చెప్పిన గ్రూప్‌లో చేరారు. తర్వాత దుండగులు మీరు మా ద్వారా షేర్ మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెడితే అధిక లాభాలు ఆర్జించవచ్చని ఆశ పుట్టించారు. వంచకుల మాటలను నమ్మిన ఆ వ్యక్తి దశల వారీగా రూ.3.05 లక్షలను వారు చెప్పిన ఖాతాలకు జమ చేసి చివరకు మోసపోయారు. ఈ ఘటనపై సైబర్‌క్రైం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కుమార్తె స్నేహితురాలిపై దారుణం ●● కామాంధుడు అరెస్టు దొడ్డబళ్లాపురం: కుమార్తె స్నేహితురాలిపై ఓ కామాంధుడు అత్యాచారం జరిపిన సంఘటన కొడగు జిల్లా మడికెరి తాలూకాలో చోటుచేసుకుంది. మధు (45) అనే వ్యక్తి సోమవారం సాయంత్రం తన కుమార్తె చేత ఫోన్ చేయించిన ఆమె స్నేహితురాలిని ఇంటికి రప్పించాడు. ముందు ఇద్దరికీ చాక్లెట్లు, ఇచ్చి మరిన్ని చాక్లెట్లు తీసుకురావాలని తన కుమార్తెను దుకాణానికి పంపించాడు. ఆ సమయంలో బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఇంతలో బాలిక తల్లి ఫోన్ చేసి కుమార్తెను పంపించాలని అడిగింది, ఆమె ఆడుకుంటోందని, కొంతసేపటికి వస్తుందని చెప్పాడు. దీంతో అనుమానం వచ్చి బాలిక తల్లితండ్రులు మధు ఇంటికి వచ్చి చూడగా ఘోరం బయటపడింది. వారు గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కామాంధున్ని అరెస్టు చేశారు. దర్శన్‌కు పవిత్ర ఏమవుతారు? ●● సుప్రీం జడ్జి ప్రశ్న దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్‌కు హైకోర్టు కోర్టు సాధారణ బెయిలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బెయిలును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారంనాడు విచారణ సాగింది. ఈ సందర్భంగా జడ్జి.. దర్శన్‌కు నిందితురాలు పవిత్రగౌడ ఏమవుతారని దర్శన్ వకీలు మను సింఘ్విని ప్రశ్నించారు. మిస్ట్రెస్ అవుతుందని లాయర్ తెలిపారు. మరి దర్శన్‌కు వివాహం జరిగిందా అని ప్రశ్నించగా, అవునని లాయర్ సమాధానమిచ్చారు. దర్శన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని సింఘ్వి వాదించగా, అన్ని ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. మిస్ట్రెస్ అంటే ఇంగ్లీష్‌లో వివాహిత పురుషునితో సుదీర్ఘ కాలంగా లైంగిక సంబంధం ఉన్న మహిళ అని అర్థం. ఈ వాదనలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. సీసీబీకి ఓంప్రకాష్ హత్య కేసు బనశంకరి: విశ్రాంత డీజీపీ ఓంప్రకాష్ హత్యకేసు దర్యాప్తును సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సీసీబీ) పోలీసులకు అప్పగించామని, దర్యాప్తులో హత్యకు గల కారణాలు వెలుగులోకి వస్తాయని హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు. మంగళవారం నగరంలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే సీసీబీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. ఓంప్రకాష్ భార్యని అరెస్ట్‌చేసి విచారిస్తున్నారని తెలిపారు. -
ఉగ్ర దాడిలో ఇద్దరు కన్నడిగుల బలి
సాక్షి బెంగళూరు: జమ్ముకశ్మీర్ ఉగ్రవాదుల దాడిలో శివమొగ్గవాసి మంజునాథ్ రావు (47)తో పాటు మరో కన్నడిగుడు మరణించాడు. హావేరి జిల్లా రాణిబెన్నూరుకు చెందిన భరత్ భూషణ్‌గా గుర్తించారు. ఈయన మాజీ స్పీకర్ కేబీ కోళివాడ అల్లుడికి స్నేహితుడు. కాగా, జమ్మూకశ్మీర్‌లో కన్నడిగులు ఉగ్రదాడికి గురయ్యారనే వార్త విన్న వెంటనే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య.. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య కార్యదర్శులు, సీనియర్ పోలీసు ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించి కన్నడిగుల కోసం తక్షణ సహాయం చేయాలని వారికి ముఖ్యమంత్రి సూచించారు. సీఎం సూచనల మేరకు అధికారుల బృందం ఒకటి కశ్మీర్‌కు పయనమైంది. పోలీసులు కూడా వెళ్లారు. -
జంధ్యం తొలగింపుపై నిరసన
హొసపేటె: సీఈటీ పరీక్షల సమయంలో బ్రాహ్మణ విద్యార్థులకు జంధ్యం తొలగించిన సంఘటనపై హొసపేటెలోని బ్రాహ్మణ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. జంధ్యం తొలగింపును ఖండిస్తూ విజయనగర జిల్లాధికారి కార్యాలయం ముందు చేపట్టిన నిరసనలో ఆందోళనకారులు మాట్లాడారు. ఆ ఘటనలతో కేవలం బ్రాహ్మణ సమాజాన్నే కాదు, మొత్తం హిందూ సమాజాన్నే అవమానించారన్నారు. ఈ ఘటనలో కేవలం అధికారులను మాత్రమే సస్పెండ్ చేశారన్నారు. ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ప్రభుత్వం. ఈ ధోరణిని వెంటనే మార్చాలి. ఉద్దేశపూర్వకంగా జంధ్యం తొలగించడం ఆగ్రహాన్ని రేకెత్తించింది. జంధ్యం బ్రాహ్మణ సమాజం హక్కు అని పేర్కొన్నారు. -
హత్యాయత్నం నిజమా.. నాటకమా?
దొడ్డబళ్లాపురం: మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్ప రై చిన్న కుమారుడు రిక్కీ రై పై కాల్పులు జరిగిన కేసులో బిడది పోలీసులు అతని గన్‌మ్యాన్ మన్నప్ప విఠల్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రిక్కీ రై తానే కాల్చుకుని హత్యాయత్నం డ్రామా ఆడుతున్నాడని పోలీసులు తాజాగా అనుమానిస్తున్నారు. రిక్కీ రైకి ఉన్న ముగ్గురు గన్ మ్యాన్లు ఒక్కొక్కరు ఒక్కో వాంగ్మూలం ఇస్తుండడంతో పోలీసుల అనుమానాలు బలపడుతున్నాయి. తన పిన్ని అనురాధ, రాకేశ్ మల్లి, మరో ఇద్దరిపై ఆరోపణలు చేసి రిక్కీ కేసును పక్కదారి పట్టిస్తున్నారా అని సందేహిస్తున్నారు. కాల్పులు జరగడానికి ముందు కుక్కలు అరవడంతో గాల్లోకి కాల్పులు జరిపామని గన్ మ్యాన్లు చెప్పిన మాటల్లో నిజం లేదని గుర్తించారు. హత్యాయత్నం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేశ్ మల్లి తన లాయర్లతో కలిసి రామనగర ఎస్పీ కార్యాలయానికి వచ్చాడు. ఎస్పీ శ్రీనివాసగౌడ అతనిని విచారించారు. పిన్ని అనురాధకు ఊరట ఈ కేసులో ఏ2గా ఉన్న రిక్కి రై పిన్ని అనురాధకు హైకోర్టులో ఊరట దక్కింది. కేసులో నుంచి తన పేరు తొలగించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించగా, ఆమైపె తొందరపాటు చర్యలు, బలవంతపు చర్యలు తీసుకోరాదని కోర్టు పోలీసులను ఆదేశించింది. అనురాధకు 14వ తేదీన యూరోప్‌కు వెళ్లిపోయిందని, 6 నెలల క్రితమే ఆస్తి గొడవలపై రాజీ చేసుకున్నారని ఆమె లాయర్ వాదించారు. రిక్కీ రై కేసులో పోలీసుల అనుమానాలు గన్‌మ్యాన్ విచారణ -
జంధ్యం తొలగింపుపై ధర్నా
మండ్య: జంధ్యం ధరించిన బ్రాహ్మణ విద్యార్థులకు సీఈటీ పరీక్ష రాసేందుకు అవకాశం ఇవ్వకుండా వారి భవిష్యత్తును నాశనం చేసిన అధికారులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని జిల్లా బ్రాహ్మణ సభ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు మంగళవారం నగరంలో ధర్నా చేపట్టారు. పరీక్ష రాయకుండా వంచితులైన విద్యార్థులకు ప్రభుత్వ కళాశాలల్లో ఉచిత సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా బ్రాహ్మణ సభ అధ్యక్షుడు ప్రొఫెసర్ హెచ్ఎస్ నరసింహమూర్తి, కార్యదర్శి గోపాలకృష్ణ శైణె, పదాధికారులు ఎస్.శంకరనారాయణ శాస్త్రి, అనంత్‌కుమార్, ఎస్.శ్రీధర్, సీపీ విద్యాశంకర్ పాల్గొన్నారు. -
ఆత్మరక్షణకు కరాటే అవసరం
బళ్లారిఅర్బన్: నేటి యువతకు ఆత్మరక్షణకు కరాటే అవసరం చాలా ఉందని కర్ణాటక చరిత్ర అకాడమి జిల్లా అధ్యక్షుడు టీహెచ్ఎం బసవరాజ్ పేర్కొన్నారు. శంకర్ కాలనీలోని విజయవిఠల కరాటే మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయన్నారు. ఇలాంటి సన్నివేశాల్లో కరాటే నేర్చుకుంటే అలాంటి నిందితులకు భయం పుడుతుందన్నారు. ప్రస్తుతం కాలం చాలా సున్నితంగా ఉందన్నారు. ఒంటరి మహిళ తిరగాడటం చాలా కష్టమన్నారు. ప్రతి ఒక్కరు ఆత్మరక్షణ కోసం కరాటే వంటి విద్యను నేర్చుకోవాలని సూచించారు. విజయవిఠల గత 15 ఏళ్లుగా కరాటే పాఠశాలను ప్రారంభించి పిల్లలకు ఉచితంగా కరాటే విద్యను నేర్పించడం అభినందనీయం అన్నారు. ఈసందర్భంగా ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. -
టీబీ డ్యాం 19వ గేటు నిర్మాణానికి శ్రీకారం
హొసపేటె: తుంగభద్ర జలాశయంలోని 19వ గేటు వద్ద ఏర్పాటు చేసిన స్టాప్‌లాగ్‌ను తొలగించి శాశ్వత క్రస్ట్‌గేట్‌ను నిర్మించడానికి గుజరాత్‌కు చెందిన హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మిషనరీ కంపెనీ టెండర్ దక్కించుకొందని తుంగభద్ర మండలి ఎస్ఈ నారాయణ నాయక్ తెలిపారు. సోమవారం మండలి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మెషినరీ ప్రాజెక్ట్స్ కంపెనీకి చెందిన ఇంజినీరింగ్ నిపుణుడు ఈరోజు డ్యాంకు చెందిన 19వ గేట్‌ను వీక్షించారన్నారు. పక్కా పకడ్బందీగా గేట్ నిర్మాణంపై కంపెనీ దృష్టి పెట్టనుందని తెలిపారు. త్వరలోనే గేట్ నిర్మాణ పనులను కంపెనీ చేపడుతుందన్నారు. ఈ నెల 17వ ఈ– టెండర్ బిడ్‌ను తెరవగా ఒక గుజరాతీ కంపెనీ టెండర్‌ను గెలుచుకుందని తెలిపారు. 19వ గేట్ నిర్మాణానికి సుమారు రూ.15 కోట్లను ఖర్చు చేపడుతున్నామన్నారు. ఈ కంపెనీ మైసూరులోని కేఆర్ఎస్ ఆనకట్ట గేట్లను నిర్మించిందని తెలిపారు. అలాగే తుంగభద్ర జలాశయం 19వ క్రస్ట్‌గేట్ వద్ద స్టాప్‌లాగ్‌ను ఏర్పాటు చేసిందన్నారు. మిగతా 32 క్రస్ట్ గేట్ల నిర్మాణానికి తుంగభద్ర బోర్డు ఈ–టెండర్లను కూడా పిలిచిందన్నారు. ఈ నెల 28తో టెండర్ గడువు ముగుస్తుందని తెలిపారు. శాశ్వత గేటు నిర్మాణం గుజరాత్ కంపెనీకి అప్పగింత మిగతా 32 క్రస్ట్‌గేట్ల నిర్మాణానికి ఈ–టెండర్ల పిలుపు టీబీ బోర్డు సూపరింటెండింగ్ ఇంజినీర్ నారాయణ నాయక్ -
మామిడి రైతుల ఆశలు ఆవిరి
శ్రీనివాసపురం : మామిడి పండ్లతో ప్రజలు తీయని రుచులను ఆస్వాదిస్తుండగా వాటిని సాగు చేసే అన్నదాతలకు చేదు అనుభవం ఎదురవుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరైన వాతావరణం అనుకూలించక మామిడి దిగుబడులు తగ్గుముఖం పట్టాయి. దీంతో మామిడి రైతుల్లో ఆశలు ఆవిరవుతున్నాయి. రాష్ట్రంలో మామిడి ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన శ్రీనివాసపురం తాలూకాలో ఈ సారి మామిడి దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. మామిడి దిగుబడి, విక్రయం పట్ల మామిడి ఉత్పత్తి దారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 30 శాతమే దిగుబడి తాలూకాలో సుమారు 59 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి పండిస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో మామిడి చెట్లలో పూత అధికంగా కనిపించింది. అయితే గాలి, అకాల వానలకు పూత గణనీయంగా రాలిపోయింది. ఈ సంవత్సరం కేవలం 30 శాతం దిగుబడి మాత్రమే ఉంటుందని అంటున్నారు. సాధారణంగా మే 15 నుంచి ప్రారంభమయ్యే మామిడి మార్కెట్ వ్యవహారాలు ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. తక్కువ దిగుబడి కారణంగా మార్కెట్ కేవలం రెండు నెలలకే పరిమతమయ్యే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. మరో వైపు ధరలు కూడా ఈసారి ఆశాజనకంగా లేవు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కూడా ఈసారి మామిడి శ్రీనివాసపురం మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉండడం వల్ల పోటీ అధికంగా ఉంటుంది. దీని వల్ల శ్రీనివాసపురం మామిడికి మంచి ధర లభించకపోవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అకాల వర్షానికి పూత రాలిందిమామిడి దిగుబడి ఈసారి ఆశాజనకంగా లేదు. అకాల వానలతో చాలా వరకు పూత రాలిపోయింది. అనంతరం పిందె దశలో కురిసిన వడగళ్ల వానకు సగానికి సగం కాయలు రాలిపోయాయి. దీనికి తోడు బూడిద రోగం తదితర చీడపీడలు మామిడిని పట్టిపీడిస్తున్నాయి. దిగుబడి 30 శాతానికి పడిపోయే అవకాశం ఉంది. రమేష్, మామిడి రైతు, తొట్లి గ్రామం అకాల వర్షాలతో రాలిన పూత, పిందె ఈ ఏడాది దిగుబడి 30 శాతమే తీవ్రంగా నష్టపోతున్న అన్నదాతలు అకాల వర్షాల దెబ్బ రోగాల నియంత్రణకు , అధిక దిగుబడికి రైతులు , వ్యాపారులు వివిధ రకాల మందులను చల్లారు. దీనికి లక్షల రూపాయలు వెచ్చించాల్సి వచ్చింది. పలువురు వ్యాపారులు ఉత్తమ దిగుబడిని ఆశించి పూత దశలోనే మామిడి తోటలను ఖరీదు చేశారు. బంపర్ లాభాలు వస్తాయని ఆశించిన వ్యాపారుల ఆశలు అడియాశలు అయ్యే అవకాశం ఉంది. ఈ సారి మామిడి దిగుబడి తగ్గించదనేది ఖచ్చితంగా కనిపిస్తోంది. ఇది రైతులు, వ్యాపారుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. -
రిమ్స్‌లో అదనపు నియామకాలు తగదు
రాయచూరు రూరల్: రాయచూరు వైద్య విజ్ఞాన సంస్థ(రిమ్స్) కళాశాల ఆస్పత్రి, పరిశోధన కేంద్రంలో గైర్హాజరైన అప్రెంటీస్ వైద్య విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని దళిత ప్రగతిశీల సంఘం వేదిక అధ్యక్షుడు రాజు పట్టి పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేఽశంలో ఆయన మాట్లాడారు. గత ఏదాడి జనవరిలో త్రిశూల్ నాయక్ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. ఏడాది పాటు అప్రెంటిస్‌గా రిమ్స్‌లో పని చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా నియమాలను గాలికొదిలి గైర్హాజరై ఐఏఎస్ కోచింగ్ కోసం న్యూఢిల్లీలో ఉన్నాడన్నారు. మరో వైపు జీవ రసాయన శాస్త్రం బోధించడానికి రిమ్స్ కళాశాలలో ట్యూటర్‌గా నెలకు రూ.40 వేల చొప్పున వేతనం పొందారని తెలిపారు. త్రిశూల్ నాయక్ తండ్రి శాసన సభ్యుడి కుమారుడు కావడంతో డీన్ రమేష్ ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. నేత్ర విభాగంలో కృష్ణయ్య ఆడియోమెట్రిగా ఉన్నా అదనంగా జిల్లాధికారి భార్య దీపికను నియమించారని ఆరోపించారు. ఈ విషయంలో అప్రెంటిస్ వైద్య విద్యార్థిపై, డీన్ రమేష్, దీపికలపై చర్యలు చేపట్టాలని ఆయన ఒత్తిడి చేశారు. సభ్యులు బేరి, నరసింహులు, చంద్రశేఖర్, భాస్కర్, శ్రీనివాసులున్నారు. -
CCTV: నిను వీడని నీడను నేనే..!
బెంగళూరు: అతనొక ఐఏఎఫ్ ఆఫీసర్.. పేరు సలాధిత్య బోస్. .డీఆర్డీవో పైలట్. ఇదంతా బానే ఉంది. అయితే తనపై కొంతమంది దాడి చేశారని ఆరోపించాడు. తాను ఎయిర్ పోర్ట్ కు వెళుతుంటే పలువురు బైక్ పై అడ్డగించి తనను తీవ్రంగా గాయపరచడమే కాకుండా భార్యను కూడా అసభ్య పదజాలంతో తిట్టారన్నాడు. ఇదంతా బోస్ రిలీజ్ చేసిన వీడియోలో చెప్పిన మాటలు. దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. బోస్ చెప్పిన దానికి పరిశోధనలో తేలిన దానికి పొంతనే లేకుండా ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా బోస్ చెప్పింది అంతా అబద్ధమేనని తేలిపోయింది. ఆ సీసీటీవీ ఫుటేజ్ క్లిప్ ల్లో కేవలం విక్రమ్ అనే వ్యక్తిపై బోస్ దాడి చేయడమే కనిపించింది. అతన్ని కిందపడేసి మరీ పిడుగు గుద్దులు కురిపించాడు.ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. న్యాయాన్ని బ్రతికించడానికి ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లు ఆధారమవుతున్నాయని, లేకపోతే అమాయకులు బలి అవుతారని నెటిజన్లు పేర్కొంట్నునారు. ప్రస్తుతం బోస్ పై హత్యాయాత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా బయ్యప్పనహళ్లి పోలీసులు.. బోస్ పై బీఎన్ఎస్ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్లు 109 (హత్యాయత్నం), 115(2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 304 (స్నాచింగ్), 324 (అల్లరి), మరియు 352 (శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.The #DRDO pilot who had alleged that he was assaulted by a motorist on Monday has now been booked for attempted murder of that same motorist, #Bengaluru police sources said. Investigations have revealed that the #wingcommander made several false claims in the vdeo. @DeccanHerald pic.twitter.com/FnaA5jzUD2— Chetan B C (@Chetan_Gowda18) April 22, 2025 ఆఫీసర్ చెప్పిన కథ ఇది.. సోమవారం ఉదయం భార్యతో కలిసి ఎయిర్ పోర్ట్ కు వెళుతున్నాను. భార్య కారు డ్రైవ్ చేస్తుండగా, బోస్ పక్క సీట్లో కూర్చున్నా. ఇంతలో మమ్మల్ని దాటుకుని వచ్చిన ఒక బైక్ మా కారుకు అడ్డంగా ఆగింది. బైక్ పై నుంచి దిగిన ఓ వ్యక్తి మమ్ముల్ని కన్నడలో తిట్టడం ప్రారంభించాడు. వారు మా కారుకు అంటించి ఉన్న డీఆర్డీవో స్టిక్కర్ చూశారు. మీరు డీఆర్డీవో వారా అంటూ నిలదీశాడు. మా భార్యను కూడా తిట్టడం ప్రారంభించారు. నేను భయపడలేదు. ఆ సమయంలో కారు నుంచి కిందకు దిగాను. ఓ వ్యక్తి తన బైక్ తాళం చెవితో నా నుదుటిపై దాడి చేశాడు. నా ముఖానికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఆర్మీకి చెందిన వారిని ఇలానే ట్రీట్ చేస్తారా అని మనసుకు బాధగా అనిపించింది.వారు చేసిన దాడి నుంచి ఏదో రకంగా తప్పించుకుని బయటపడ్డాం. ఇక్కడ మాకు దేవుడు సాయం చేశాడు. దీనిపై ఫిర్యాదు చేస్తాం. వారు ఎందుకు మాపై దాడి చేశారో తెలియడం లేదు. ప్రతీకారం తీర్చుకోకుండా ఉండే శక్తిని దేవుడు నాకు ఇస్తాడనే అనుకుంటున్నా. ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా’ అని ఐఏఎఫ్ అధికారి తెలిపాడు. -
ఐదు రోజులుగా గూగుల్‌లో అదే పని..
బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు(Om Prakash Case) దర్యాప్తులో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. గూగుల్‌లో వెతికి మరీ భర్త ఓం ప్రకాశ్‌ను పల్లవి(Wife Pallavi) హతమార్చినట్లు వెల్లడైంది. అంతేకాదు తన భర్త తనపై విష ప్రయోగం చేశాడని.. ఆయన పెట్టే హింస భరించలేకే హత్య చేశానని ఆమె పోలీసుల ఎదుట చెప్పినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తున్నాయి. హత్యకు ఐదు రోజుల ముందు నుంచి పల్లవి గూగుల్‌లో విపరీతంగా వెతుకుతూ వస్తోంది. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడోనని వెతికిందామె. చివరకు మెడ దగ్గరి నరాలను దెబ్బ తీస్తే చనిపోతారని నిర్ధారించుకుని హత్య చేసింది. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాల నేపథ్యంలో తన భర్త, కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ను పల్లవి హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే..ఓం ప్రకాశ్ కొడుకు కార్తీక్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆమె.. భర్త నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఊహించుకుంటూ వస్తోంది. ఈలోపు ఆస్తి తగదాలు కూడా మొదలు కాగా.. భర్తకు మరో మహిళతో సంబంధం ఉందంటూ కుటుంబ వాట్సాప్ గ్రూపుల్లో కొన్నిరోజులుగా ఆమె సందేశాలు ఉంచుతూ వస్తోంది. పీటీఐ కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నాం ఓం ప్రకాశ్ భోజనం చేస్తున్న సమయంలో పల్లవి భర్త ఓం ప్రకాశ్ కళ్లలో కారం కొట్టింది. ఆపై కాళ్లు చేతులు కట్టేసి విచక్షణరహితంగా పొడిచి హత్య చేసింది. భర్త ప్రాణం పోతుండగానే పోలీసులకు ఆమె సమాచారం అందించింది. పోలీసులు వచ్చి చూసే సరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉండగా.. ఆమె రిలాక్స్‌గా ఓ కుర్చీలో కూర్చుని ఉంది. హత్య అనంతరం.. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్‌లో సందేశం ఉంచిన ఆమె.. ఓ మాజీ అధికారికి తానొక మృగాన్ని చంపినట్లు సందేశం కూడా పంపినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక ఈ హత్య తన సోదరి కృతి పాత్ర కూడా ఉండొచ్చని ఓం ప్రకాశ్ తనయుడు కార్తీక్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ కేసులో పల్లవిని ప్రాథమిక నిందితురాలిగా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. -
ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌పై దాడి కేసులో ట్విస్ట్
బెంగళూరు: ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్‌పై దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. బెంగళూరులో తమపై కొందరు దాడి చేశారని వింగ్ కమాండర్ షీలాదిత్యా బోస్, ఆయన భార్య, స్క్వాడ్రన్ లీడర్ మధుమిత ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. తొలుత బోస్ దాడికి దిగినట్లుగా కన్పిస్తున్న సీసీటీవీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ విషయాన్ని ఓ పోలీసు అధికారి ధ్రువీకరించారు కూడా.భారత వైమానిక దళానికి చెందిన వింగ్ కమాండర్ బోస్ సంచలన ఆరోపణలకు దిగారు. కారులో వెళ్తున్న తమను కొందరు వ్యక్తులు బైక్‌పై వచ్చి అడ్డగించి దాడి చేశారని ఆరోపించారు. ఆయన భార్య, స్క్వాడ్రన్ లీడర్ మధుమిత కూడా.. పోలీసులకు ఈ విషయం చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోతూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో బోస్ ముఖం, మెడ నిండా రక్తం కనిపించింది. పక్కనే ఆయన భార్య కారు నడుపుతూ కనిపించింది. ఈ వ్యవహారం ‘కన్నడిగ వర్సెస్ నాన్ కన్నడిగ’గా మారింది. అయితే వీడియో ఆధారంగా విచారణ జరిపిన ఈస్ట్ జోన్ డీసీపీ దేవ్‌రాజ్ షాకింగ్ విషయం తెలియజేశారు. తొలుత బోస్ వాళ్లపై దాడికి దిగారని తెలియజేశారు. అంతేకాదు.. ఈ ఘటనకు సంబంధించిన నిందితుడు కూడా బోస్పై ఫిర్యాదు చేశారని అన్నారు. అయితే పరస్పర దాడికి కారణాలు పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాతే తెలియజేస్తామన్నారు. బోస్, మధుమిత వీడియోలో.. ‘‘కారులో వెళ్తున్న మమ్మల్ని మా వెనకే బైక్‌పై వచ్చిన వ్యక్తులు అడ్డగించారు. మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. మా కారుపై ఉన్న డీఆర్డీఓ స్టిక్కర్‌ను చూశారు. నా భార్యను తిట్టడంతో తట్టుకోలేకపోయాను. దాంతో నేను కారు నుంచి బయటకు రావడంతో.. ఒక వ్యక్తి కీతో నా ముఖంపై కొట్టాడు. దాంతో నా ముఖమంతా రక్తం కారింది. మిమ్మల్ని రక్షించే వ్యక్తులతో మీరు ఇలాగేనా వ్యవహరించేదని’’ నేను గట్టిగా మాట్లాడాను. కానీ ఆశ్చర్యంగా ఇంకా చాలా మంది వ్యక్తులు వచ్చి, మమ్మల్ని దూషించడం మొదలుపెట్టారు. ఒక వ్యక్తి రాయి తీసుకొని, కారు అద్దాలను, నా తలను పగలగొట్టాలని ప్రయత్నించాడు. అదీ నా పరిస్థితి. వెంటనే అప్రమత్తమైన నా భార్య నన్ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఫిర్యాదు చేద్దామని వెళ్తే అక్కడ ఎలాంటి స్పందనా రాలేదు. కర్ణాటకలో ఇలాంటి పరిస్థితులు ఆశ్చర్యంగా ఉన్నాయి.’’ అంటూ ఆ భార్యాభర్తలు వీడియోలో వ్యాఖ్యానించారు.#BREAKINGWing commander assault case in #BengaluruCCTV tells a different story.. Wing Commander Shiladitya Bose seen brutally assaulting the biker at Tin Factory JunctionDespite locals stepping in to stop the violence, the officer can be seen continuing the attack...blowing… pic.twitter.com/ovMg9g4xcS— Nabila Jamal (@nabilajamal_) April 21, 2025 -
బ్లాక్‌మెయిల్‌కు బలైన ప్రతిభా కుసుమం
రాయచూరు రూరల్(కర్ణాటక): పాగల్ ప్రేమికుని వేధింపులకు ప్రతిభా కుసుమం రాలిపోయింది. పరువు పోతుందనే వ్యథతో ఓ వ్యాయామ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన గదగ్ జిల్లా అసుండి గ్రామంలో చోటు చేసుకుంది. మాజీ ప్రియుడు బ్లాక్మెయిల్ చేస్తుండటంతో భయపడి గదగ్ తాలూకా అసుండి సైరా బాను నదాఫ్ (29) డెత్‌నోట్ రాసి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మే 8న సైరాబానుకు ఓ యువకునితో పెద్దలు పెళ్లి నిశ్చయం చేశారు. పెళ్లి కోసం ఆమె తల్లిదండ్రులు వస్తుసామగ్రిని కొనుగోలు చేశారు. గతంలో ఆమెకు మైలారి అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉండేది. మరొకరిని పెళ్లాడతావా అనే దుగ్ధతో మైలారి రగిలిపోయాడు. గతంలో తామివద్దరూ కలిసి ఉన్న ఫోటోలు వీడియోలను, అలాగే ఆడియోలను వైరల్ చేస్తానంటూ సైరాబానును బెదిరించసాగాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే పెళ్లి ఆగిపోతుంది, పరువు పోతుందని ఆమె బాధపడింది. తన చావుకు మైలారి కారణమని నోట్ రాసి ఉరివేసుకుని చనిపోయింది. ఆటల్లో ఆమె మేటి సైరాబాను చిన్నచాటి నుంచి ఆటపాటల్లో మేటిగా ఉండేది. క్రీడాంశాల్లో ప్రతిభావంతురాలు. స్కూలు, కాలేజీ రోజుల్లో క్రీడాకారిణిగా ట్రోఫీలను సాధించింది. కుస్తీ పోటీలలో రాష్ట్ర స్థాయిలో పేరు సంపాదించింది. అదే నైపుణ్యంతో పీఈటీ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఓ ప్రైవేటు స్కూల్లో డ్రిల్ టీచర్‌గా ఉద్యోగం చేస్తోంది. గదగ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మైలారిని అరెస్టుచేశారు. -
నాపై హత్యాయత్నం చేసింది పిన్ని అనురాధ..?
దొడ్డబళ్లాపురం: రామనగర తాలూకా బిడదిలో మాజీ మాఫియా డాన్ దివంగత ముత్తప్పరై చిన్న కుమారుడు రిక్కీ రై పై 18న అర్ధరాత్రి కాల్పులు జరిపి హత్యాయత్నం చేసిన కేసులో పోలీసులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. అలాగే రిక్కీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులు, పనివాళ్లు, సెక్యూరిటీని విచారించారు. సంఘటన జరిగిన చుట్టుపక్కల పరిసరాల్లో శోధిస్తున్నారు. మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిక్కీ రై కోలుకుంటున్నాడు.వారి మీదే అనుమానంనా మీద హత్యాయత్నం చేసింది తన పిన్ని అనురాధ, రియల్ ఎస్టేట్ వ్యాపారి నితేశ్ శెట్టి, రాకేశ్ మల్లి, వైద్యనాథన్ అనేవారని రిక్కీ రై చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు వారికి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వనున్నారు. అయితే రిక్కీ పిన్ని అనురాధ కాల్పులు జరగడానికి ఐదు రోజుల ముందు విదేశాలకు వెళ్లిపోయినట్టు సమాచారం.కుక్కలు మొరిగాయికాల్పులు జరిగిన రోజు రిక్కీ ఇంట్లో ఉండగా కుక్కలు మొరగడంతో ఒక గన్ మ్యాన్ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. కాసేపటికి రిక్కీ కారులో బయలుదేరగానే కాల్పులు జరిగాయి. రిక్కీ వెంట ఉన్న గన్‌మ్యాన్‌ను పోలీసులు విచారించారు. హోంమంత్రి పరమేశ్వర్ కాల్పుల గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్త రాకేశ్ మల్లి ప్రమేయం గురించి తనకు తెలియదన్నారు. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.