
సుప్రీం జడ్జి ప్రశ్న
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్‌కు హైకోర్టు కోర్టు సాధారణ బెయిలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బెయిలును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర పోలీసులు సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఈ క్రమంలో మంగళవారంనాడు విచారణ సాగింది. ఈ సందర్భంగా జడ్జి.. దర్శన్‌కు నిందితురాలు పవిత్రగౌడ ఏమవుతారని దర్శన్ వకీలు మను సింఘ్విని ప్రశ్నించారు. మిస్ట్రెస్ అవుతుందని లాయర్ తెలిపారు.
మరి దర్శన్‌కు వివాహం జరిగిందా అని ప్రశ్నించగా, అవునని లాయర్ సమాధానమిచ్చారు. దర్శన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేవని సింఘ్వి వాదించగా, అన్ని ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వ తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా తెలిపారు. మిస్ట్రెస్ అంటే ఇంగ్లీష్‌లో వివాహిత పురుషునితో సుదీర్ఘ కాలంగా లైంగిక సంబంధం ఉన్న మహిళ అని అర్థం. ఈ వాదనలు అందరి దృష్టినీ ఆకర్షించాయి.