కన్నడ హీరో దర్శన్‌కు మరో షాక్‌! | Devil Movie Director Notices | Sakshi
Sakshi News home page

కన్నడ హీరో దర్శన్‌కు మరో షాక్‌!

Jul 7 2024 1:22 PM | Updated on Jul 7 2024 1:55 PM

Devil Movie Director Notices

దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి డెవిల్‌ సినిమా డైరెక్టర్‌ కం ప్రొడ్యూసర్‌ అయిన మిలన ప్రకాశ్‌కు పోలీసులు మరోసారి విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. శుక్రవారంనాడు ప్రకాశ్‌ విజయనగర ఏసీపీ ముందు హాజరయ్యారు. మరోసారి విచారణకు రావాలని  శనివారం పోలీసులు ప్రకాశ్‌కు నోటీసులు ఇచ్చారు. రేణుకాస్వామి హత్య తరువాత హీరో దర్శన్‌ మైసూరులో డెవిల్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ అంశాలపై సమాచారం కోసం ప్రకాశ్‌ను విచారించారు.   

66 వస్తువుల సీజ్‌ 
రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి దర్యాప్తు చేసిన పోలీసులు మొబైల్‌ఫోన్లో కలిపి మొత్తం 66 వస్తువులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు. రేణుకాస్వామి దుస్తులు, సీసీ కెమెరాల ఫుటేజీ, మొబైల్‌ ఫోన్లు, దాడికి వాడిన వస్తువులు తదితరాలను సేకరించారు.

కరావళి నుంచి దర్శన్‌ ఔట్‌?
పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కిస్తున్న దర్శన్‌కు మరో షాక్‌ తగిలింది. కొత్తగా నిర్మిస్తున్న కరావళి సినిమా నుంచి దర్శన్‌ను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజ్వల్‌ దేవరాజ్‌ హీరోగా నటిస్తున్న కరావళిలో దర్శన్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన  పోస్టర్‌లో దర్శన్‌ కనిపించలేదు. దర్శన్‌ స్థానంలో కిచ్చ సుదీప్‌ నటిస్తున్నట్లు సమాచారం. ఇది దర్శన్‌ ఫ్యాన్స్‌కు మింగుడుపడడం లేదు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement