దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు. తనకు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి ఇప్పించాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఇందుకు ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేశారు. గురువారంనాడు హైకోర్టులో వీటిపై విచారణ సాగింది.
ఇంటి నుంచి భోజనం, పరుపు, దిండు, చదవడానికి కొన్ని పుస్తకాలు కావాలని దర్శన్ కోరాడు. జైలు నిబంధనల ప్రకారం జైలులో పౌష్టికాహారం ఇస్తున్నామని, అవసరం మేరకు ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు జైళ్ల శాఖ ఐజీని కోరితే ఆయన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అయితే దర్శన్ ఎవరినీ సంప్రదించకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కేసులో కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
దర్శన్ అండ్ గ్యాంగ్‌కు కస్టడీ పొడిగింపు
ఇదిలా ఉంటే దర్శన్, నటి పవిత్రగౌడ, ఇతర నిందితులకు న్యాయస్థానంలో మళ్లీ చుక్కెదురైంది. వీరి బెయిలు ఆశలు నిరాశలయ్యాయి. వారి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకూ పొడిగించింది. గతంలో కోర్టు విధించిన కస్టడీ గురువారంతో ముగియడంతో పోలీసులు నిందితులను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనల తరువాత కస్టడీని పొడిగించారు.
చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ
Comments
Please login to add a commentAdd a comment