Renukaswamy
-
కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్
బొమ్మనహళ్లి: హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌కు భారీ ఊరట లభించింది. ఆయనతోపాటు ఏడుగురికి హైకోర్టు బెయిలిచ్చింది. వెన్నునొప్పితో బాధపడుతున్న దర్శన్ మధ్యంతర బెయిల్‌పై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది. అనంతరం దర్శన్, అతడి సన్నిహితురాలు పవిత్రా గౌడ, ప్రదోశ్, అనుకుమార్, నాగరాజు, లక్ష్మణ్, జగదీష్‌కు బెయిల్ మంజూరు చేస్తు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురికి బెయిల్ లభించింది. పవిత్రా గౌడను దుర్భాషలాడాడనే కోపంతో రేణుక స్వామి అనే వ్యక్తిని చంపారనే ఆరోపణలపై దర్శన్‌ను జూలైలో పోలీసులు అరెస్ట్ చేశారు. -
కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరు
రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ మంజూరు అయింది. ఆయనతో పాటు ఏడుగురికి ఈ కేసులో బెయిల్ ఇస్తున్నట్లు న్యాయస్థానం వెళ్లడించింది. దర్శన్ ఇప్పటికే తన చికిత్స కోసం బెయిల్‌పై బయట ఉన్నాడు. నేటితో ఆయన బెయిల్ గడవు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో గడవుతో నిమిత్తం లేకుండా బెయిల్ మంజూరు కావడంతో దర్శన్ అభిమానులు ఆనందిస్తున్నారు.రేణుకాస్వామి హత్య కేసులో సుమారు ఆరు నెలలుగా పరప్పన జైలులో హీరో దర్శన్ ఉన్నారు. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దర్శన్ లాయర్లు పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. కానీ, ఫలితం లేదు. అయితే, మరోసారి బెయిల్ కోసం ఆయన ధరఖాస్తు చేసుకున్నారు. విశ్వజీత్ శెట్టితో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు కూడా బెయిల్ లభించినట్లు తెలుస్తోంది.కర్ణాటకలో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దర్శన్ ప్రియురాలు పవిత్రకు అసభ్యతతో కూడిన మెసేజ్‌లు రేణుకాస్వామిని చేస్తున్నాడనే కారణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడికి కరెంట్ షాకులు కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. అయితే, వారికి ఇప్పుడు బెయిల్ రావడం సంచలనంగా మారింది. -
దర్శన్ మానసిక స్థితి బాగాలేదు : లాయర్
కన్నడ నటుడు దర్శన్ అనారోగ్యంతో ఇబ్బుందులు పడుతున్న విషయం తెలిసిందే. రేణుకా స్వామి హత్య కేసులో ఈ కారణం వల్లే ఆయనకు ఆరు వారాల పాటు బెయిల్ లభించింది. వెన్నెముక శస్త్ర చికిత్స కోసం ఆయనకు కోర్టు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. పాస్‌పోర్టును ట్రయల్ కోర్టుకు అప్పగించాలని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని షరతు విధించింది.ఆపరేషన్ చేయడానికి దర్శన్ మానసికంగా సిద్ధంగా లేరని దర్శన్ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పటికే నాలుగు వారులు కావస్తుంది. అయితే, ఇన్ని రోజులైనా దర్శన్ ఆపరేషన్ చేయించుకోకపోవడంతో పోలీసులు సుప్రీంకోర్టుకు అప్పీలు వెళ్లారు. దర్శన్ బెయిలు రద్దు చేయాలని, లేదంటే ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసులు అభిప్రాయపడ్డారు. దర్శన్‌కు ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, దర్శన్ కూడా మానసికంగా సిద్ధమవుతున్నారని, ముఖ్యంగా అధిక రక్తపోటు వల్ల ఆపరేషన్ వాయిదా పడుతోందని కోర్టుకు దర్శన్ తరుపు లాయర్ వివరించారు. అందుకు సంబంధించి వైద్యులు ఇచ్చిన రిపోర్టులను కూడా సమర్పించారు. ప్రస్తుతం కన్సర్వేటివ్ ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు. ఫిజియోథెరపీ, మందులతో నొప్పిని అదుపులో ఉంచడం జరుగుతోందని వివరించారు. -
ఆసుపత్రిలో చేరిన నటుడు దర్శన్
రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆరోగ్యం కొద్దిరోజులుగా మెరుగ్గాలేదు. దీంతో తనకు అత్యవసర చికిత్స అవసరం అంటూ కోర్టుకు వెళ్లడంతో ఆయనకు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన సుమారు 140 రోజుల నుంచి జైలులో ఉన్నారు. దర్శన్‌కు 6 వారాలు పాటు బెయిలు అమల్లో ఉంటుంది.తీవ్రమైన వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న దర్శన్ తాజాగా ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఆయన లాయర్ నాగేశ్ తెలిపారు. దర్శన్‌కు వెన్నులో ఎల్–5, ఎస్–1 డిస్క్‌లలో సమస్య ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మైసూరులో ఒక ప్రముఖ ఆసుపత్రిలో దర్శన్ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై డాక్టర్ నవీన్ అప్పాజీ గౌడ ఇలా చెప్పారు.చికిత్స చేస్తున్న డాక్టర్ నవీన్ అప్పాజీ గౌడ్ శుక్రవారం మాట్లాడుతూ.. దర్శన్ కాలిలో శక్తి కోల్పోయినట్లు ఉందని తెలిపారు. ఆయన వెన్ను భాగంలో తీవ్రమైన నొప్పి ఉండటం వల్ల కాలిలో కూడా ఆ ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దర్శన్‌కు ఇప్పటికే ప్రాథమిక చికిత్సలు ప్రారంభించామని తెలిపారు. పూర్తి రిపోర్ట్లు వచ్చిన తర్వాత అవసరం అయితే ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చని చెప్పారు. బళ్లారి కేంద్ర కారాగారంలోని వైద్యులు పంపిన మెడికల్ రిపోర్టులను కూడా తాము పరిశీలించామని పేర్కొన్నారు. -
దర్శన్,పవిత్రల బెయిల్‌పై తీర్పు వెల్లడి
కన్నడ హీరో దర్శన్ ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. ఆయనతో పాటు వేలాది మంది అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన బెయిలు దక్కలేదు. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, నటి పవిత్రగౌడ బెయిల్ పిటిషన్‌ను నగర 57 వ సీసీహెచ్ కోర్టు కొట్టివేసింది. బెయిల్ వస్తుందనే ఆశతో ఉన్న ఇరువురు తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారు. బెయిల్ పిటిషన్ మీద ప్రభుత్వ వకీలు ప్రసన్నకుమార్, దర్శన్ న్యాయవాది సీవీ.నాగేశ్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. బెయిలు ఇవ్వరాదని ప్రభుత్వ వకీలు, ఇవ్వాలని దర్శన్ ప్లీడరు వాదించారు. గత కొన్ని రోజులుగా బెయిలు అర్జీపై వాదనలు సాగుతున్నాయి. జడ్జి జైశంకర్ తీర్పు వెలువరిస్తూ బెయిలు ఇవ్వడం లేదని ప్రకటించారు. కానీ, ఇదే కేసులో రవిశంకర్, దీపక్ అనే ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.జూన్ 10 నుంచి జైలువాసందర్శన్, పవిత్రలు జూన్ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. ఇటీవల సిట్ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్జైల్లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు. -
ఆ ఫోటోలన్నీ ఫేక్.. దర్శన్ కేసులో కీలక మలుపు
కర్ణాటకలో సంచలనాత్మకంగా మారిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయగా, కోర్టులో విచారణ ప్రారంభమైంది. రేణుకాస్వామి హత్య సమయంలో వచ్చిన ఫోటోలు నిజమా, అబద్ధమా అనే ప్రశ్న తలెత్తింది. ఈ కేసులో పోలీసులు చూపుతున్న సాక్ష్యాలన్నీ అబద్ధాలని నటుడు దర్శన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కొన్నిసాక్ష్యాల ధృవీకరణ పత్రాలు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా పోలీసుల చేతికి అందలేదు. ఆర్ ఆర్ నగరలో బస్సు షెడ్డులో రేణుకాస్వామిని బంధించి దర్శన్, పవిత్రగౌడ, అనుచరులు తీవ్రంగా కొట్టి చంపారనేది ప్రధాన అభియోగం. ఆ సమయంలో కొన్ని ఫోటోలను వారి మొబైల్ ఫోన్ల నుంచి సేకరించినట్లు పోలీసులు తెలిపారు. రేణుకాస్వామి చేతులెత్తి సమస్కరిస్తూ కూర్చున్న ఫోటో, మృతదేహం ఫోటోలు ఇందులో ఉన్నాయి. కానీ ఈ ఫోటోలు ఏఐ టెక్నాలజీతో సృష్టించారని దర్శన్ న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఫోటోలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి త్వరగా నివేదిక పంపాలని పోలీసులు కోరారు. దీంతో ఈ కేసులో మరో మలుపు తీసుకున్నట్లు అయింది. -
రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది: దర్శన్
కన్నడలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ సుమారు ఐదు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు. అయితే, గత కొద్దిరోజులుగా జైల్లో దర్శన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.బళ్లారి జైలులో దర్శన్ పలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా సరైన నిద్రలేకుండా ఆయన ఉన్నారట. ఈ క్రమంలో తనను రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోందని జైలు అధికారులతో దర్శన్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. నిద్రపోతున్న సమయంలో రేణుకాస్వామి ఆత్మ కలలోకి వచ్చి బయపెడుతుందని ఆయన చెప్పుకొస్తున్నారట. ఇక్కడ తాను ఒంటరిగా ఉండలేకపోతున్నట్లు అధికారులతో చెబుతూ.. తనను బెంగుళూరు జైలుకు తరలించాలని వేడుకుంటున్నారని సమాచారం. అర్ధరాత్రి సమయంలో నిద్రలోనే దర్శన్ కేకలు పెడుతున్నట్లు తోటి ఖైదీలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయం గురించి జైలు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.ఇదీ చదవండి: పరారీలో హర్షసాయి.. లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులుదర్శన్ బెయిల్పిటిషన్ విచారణ తాజాగా మళ్లీ వాయిదాపడింది. బెంగళూరు నగర 57వ సీసీహెచ్ కోర్టులో బెయిల్‌పై శుక్రవారం విచారణ జరిగింది. దర్శన్ తరఫున న్యాయవాది నాగేశ్ వాదనలు వినిపించారు. అయితే, విచారణను శనివారం నాటికి వాయిదా వేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. నేడు సాయింత్రం విచారణ జరిగే అవకాశం ఉంది. -
ఐటీ దర్యాప్తునకు దర్శన్!
సాక్షి, బళ్లారి: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రముఖ సినీ నటుడు దర్శన్ బళ్లారి జైల్లో ఖైదులో ఉన్నారు. ఆయన మరో విచారణను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. హత్యను కప్పిపుచ్చేందుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు ఆధారాలు బయటకు రావడంతో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు దర్శన్‌ను ప్రశ్నించవచ్చని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం బళ్లారి జైలులో దర్శన్‌ను కలిసిన ఆయన న్యాయవాది త్వరలో బెయిల్ లభిస్తుందని సూచనలిచ్చారు. ఇంతలో ఐటీ అధికారులకు పూర్తి సహకారం అందించాలని కోర్టు నుంచి సెంట్రల్ జైలు అధికారులకు ఈ–మెయిల్ వచ్చింది. ఐటీ అధికారులు అడిగే ప్రశ్నలకు దర్శన్ సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. రేణుకాచార్య హత్య తరువాత మృతదేహం తరలింపు, ఆ నేరాన్ని ఇతరులు వేసుకోవాలని రూ. 30 లక్షలకు పైగా నగదును దర్శన్ కొందరు నిందితులకు ఇచ్చినట్లు, ఆ నగదును ఓ నిందితుని ఇంట్లో స్వాధీనం చేసుకున్నట్లు చార్జిషీటులో పోలీసులు పేర్కొన్నారు. దీంతో నగదు గురించి ఐటీ అధికారులు పూర్తి వివరాలను సేకరించాలని సిద్ధమయ్యారు. -
రేణుకాస్వామి హత్యకేసులో ఇద్దరికి బెయిల్
బనశంకరి: సంచలనాత్మక రేణుకాస్వామి హత్య కేసులో ఇద్దరు నిందితులకు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. ప్రముఖ నటుడు, రెండవ నిందితుడు దర్శన్ బెయిల్ అర్జీ విచారణను 27వ తేదీకి నగర 57వ సీసీహెచ్.కోర్టు వాయిదావేసింది. కానీ 15, 17 నిందితులుగా ఉన్న కార్తీక్, నిఖిల్నాయక్కు బెయిలు జారీ చేసింది. సాక్షులపై ఒత్తిడి చేయరాదని, పూచీకత్తు ఇవ్వాలని కోర్టు తెలిపింది. పవిత్రాగౌడ బెయిల్ విచారణ 25 కి వాయిదా పడింది. -
దర్శన్,పవిత్రలకు నిరాశ.. కస్టడీ పొడిగింపు
రేణుకాస్వామి హత్య కేసులో బెయిల్ కోసం ఎదురుచూస్తున్న దర్శన్‌కు మరోసారి నిరాశే మిగిలింది. ఆయన రిమాండును కోర్టు పొడిగించింది. కొద్దిరోజుల క్రితం హత్యకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించిన బెంగళూరు పోలీసులు 3,991 పేజీలతో చార్జిషీట్ రెడీ చేశారు. దానిని కోర్టులో కూడా దాఖలు చేశారు. రేణుకాస్వామి హత్య కుట్రలో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ ఉన్నారని పోలీసులు తెలుపుతున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు అందించారు.ఇదీ చదవండి: డాక్టర్‌పై నటి రోహిణి ఫిర్యాదుఈ కేసులో హీరో దర్శన్, పవిత్రగౌడ, గ్యాంగ్‌కు బెయిలు భాగ్యం దక్కలేదు. కోర్టు వారి కస్టడీని పొడిగించింది. శుక్రవారంతో జ్యుడీషియల్ రిమాండు ముగియడంతో పోలీసులు 17మంది నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 24వ ఏసీఎంఎం కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. పూర్తి చార్జిషీట్ సమర్పించాలని, ఎల్రక్టానిక్స్ సాక్ష్యాలను ఒక వారంలోపు ప్రవేశ పెట్టాలని పోలీసులను ఆదేశించిన కోర్టు నిందితులకు సెప్టెంబర్ 17 వరకూ కస్టడీని పొడిగించింది. పవిత్ర బెయిలు అర్జీ వాపస్ ఈ హత్య కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్రగౌడ కోర్టులో పెట్టుకున్న బెయిలు పిటిషన్ వెనక్కు తీసుకుంది. అయితే చార్జ్‌షీట్ దాఖలైందని, పలు సాంకేతిక కారణాలు చూపుతూ ఆమె న్యాయవాదులు వాపస్ తీసుకున్నారు. త్వరలో కొత్త బెయిలు అర్జీ దాఖలు చేసే అవకాశముంది. -
ఫోటోలు, వీడియోలతో నా భర్తను లొంగదీసుకుంది: దర్శన్ సతీమణి
కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ ఉన్నారు. వారిద్దరూ సుమారు నాలుగు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి 3,991 పేజీలతో చార్జిషీట్‌ను పోలీసులు దాఖలు చేశారు. ఈ క్రమంలో దర్శన్ సతీమణి విజయలక్ష్మి ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా చార్జిషీట్లో పొందుపరిచారు. దర్శన్, పవిత్రల గురించి ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది.కన్నడలో స్టార్ హీరోగా ఉన్న దర్శన్ వైవాహిక జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయాడు. 2000 సంవత్సరంలో విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. అయితే, పలు విభేదాలు రావడంతో వారిద్దిరూ చాలాకాలంగా వేరువేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ పవిత్ర గౌడ్ వారి జీవితంలో అడుగుపెట్టడంతో ఆ దూరం కాస్త మరింత పెరిగింది. అయితే, ఇప్పుడు రేణుకాస్వామి హత్యకేసులో చిక్కుకునన తన భర్త దర్శన్, పవిత్రల రిలేషన్ గురించి చార్జిషీట్లో విజయలక్ష్మి ఇలా తెలిపారు.దర్శన్‌ను పవిత్రగౌడ ఫోటోలు, వీడియోలతో బ్లాక్మెయిల్ చేసిందని దర్శన్ భార్య విజయలక్ష్మి విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇదే విషయాన్ని పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 2014లో పవిత్రగౌడతో దర్శన్ ప్రేమ, సహ జీవనం గురించి తాను గొడవపడినట్టు విజయలక్ష్మి తెలిపారు. ఈ క్రమంలో పవిత్రగౌడ దర్శన్‌తో ఏకాంత సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు చూపించి ఆయనను బెదిరించిందని ఆరోపించారు. దర్శన్ నుంచి పవిత్రగౌడ ఇళ్లు, కార్లు, కోట్లాది రూపాయల నగదు తీసుకుందని చెప్పారు. పవిత్రగౌడ పరిచయం కానంత వరకు తమ కాపురం సజావుగా సాగిందని తెలిపారు. మరోవైపు అంతా మంచి జరగాలని విజయలక్ష్మి అసోంలో గువాహటిలోని ప్రసిద్ధ కామాఖ్య మాత దేవాలయాన్ని దర్శించుకున్నారు. పోలీసులు వేసిన చార్జిషీట్ గురించి కన్నడ టీవీ చానెళ్లలో విస్తృతంగా వార్తా కథనాలు ప్రసారమవుతున్నాయి. -
నెలకు రూ.10వేలు ఇస్తానంటూ హీరోయిన్‌కు మెసేజ్
కన్నడలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గం వాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్రగౌడతో పాటు మరో 15 మంది పాత్ర ఉందని పోలీసులు 3,991 పేజీలతో చార్జిషీట్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్‌బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు.కన్నీరుపెట్టిన పవిత్రాగౌడ రేణుకాస్వామి హత్యకేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న పవిత్రాగౌడ పోలీస్ కస్టడీలో కన్నీరుపెట్టిన ఫొటో వైరల్ అయింది. అన్నపూర్ణేశ్వరినగర పోలీస్‌స్టేషన్‌లో హాజరైన సమయంలో పవిత్రాగౌడను ఫొటో తీశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వేసిన చార్జిషీట్లో ఒక్కొక్కటిగా పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గౌతమ్ పేరుతో రేణుకాస్వామి సందేశాలు రేణుకాస్వామి హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. రేణుకాస్వామి గౌతమ్ పేరుతో నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా సృష్టించి పవిత్రాగౌడకు అశ్లీల మెసేజ్ పంపించేవాడని పోలీసులు కోర్టుకు సమరి్పంచిన చార్జిషీట్లో పేర్కొన్నారు. నెలకు రూ.10వేలు ఇస్తా, తనతో లివింగ్ రిలేషన్షిప్ కొనసాగించాలని మెసేజ్ పెట్టడంతో నటి పవిత్రాగౌడ కోపోద్రిక్తురాలైంది. తన స్నేహితుడు పవన్ పేరుతో రేణుకాస్వామితో చాటింగ్ చేసి అతను ఎక్కడ ఉన్నాడు, ఏ ఊరిలో ఉన్నాడనే విషయాలను ఆరా తీసినట్లు అందులో పేర్కొన్నారు. -
హత్యకు ముందు రేణుకాస్వామి పరిస్థితి.. ఫోటోలు వైరల్
కన్నడ సినీ నటుడు దర్శన్ అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో తాజాగా కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హత్యకు ముందు అతనిపై తీవ్రంగా దాడిచేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఈ ఫోటోలు తీసినట్లు సమాచారం. వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తుంటే ఒక లారీ ముందు రేణుకాస్వామిని కూర్చోబెట్టినట్లు అర్థమవుతుంది. దుస్తులు లేకుండాే ఆయన ఏడుస్తున్నట్లు ఫోటోలో కనిపిస్తుంది. ఆయన చేతిపై తీవ్రమైన గాయాలు ఉన్నాయి.రేణుకాస్వామి హత్యకేసులో నిందితుడిగా ఉన్న ప్రదోశ్ మొబైల్‌ఫోన్ నుంచి ఫోటోలు, వీడియోలు పోలీసులు సేకరించారు. నన్ను కొట్టొద్దు అంటూ రేణుకాస్వామివారిని వేడుకున్నట్లు పలు వీడియోల్లో కనబడింది. ఆర్ ఆర్ నగరలోని పట్టణగెరె షెడ్లో సీసీ కెమెరా చిత్రాల్లో దర్శన్ ఉండడం, పవిత్రాగౌడ పాదరక్షలకు ఉన్న రక్తపు మరకలను సాక్ష్యాలుగా పేర్కొన్నారు. రేణుకాస్వామిని షెడ్ కు తీసుకువచ్చాం అని ఇతర నిందితులు దర్శన్ మొబైల్‌కి మెసేజ్ చేయగా, పోలీసులు దానిని సేకరించారు. నగరంలోనే ఓ పబ్‌లో ఎంజాయ్ చేస్తున్న దర్శన్ నేరుగా షెడ్ కు వెళ్లి రేణుకాస్వామిని చితకబాదినట్లు తెలిపారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారడానికి ఓ నిందితుడు ఒప్పుకున్నట్లు చార్జిషీట్లో పొందుపరిచారు. ఈ కేసు దర్యాప్తును పశ్చిమ విభాగం డీసీపీ ఎస్.గిరీశ్, ఏసీపీ చందన్‌కుమార్ బృందం దర్యాప్తు చేసింది.రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిత్రదుర్గంవాసి రేణుకాస్వామి (29) హత్యకేసులో నటుడు దర్శన్, పవిత్రగౌడ, మరో 15 మంది పాత్రను ధృవీకరిస్తూ పోలీసులు 3,991 పేజీలతో కూడిన బృహత్ చార్జిషీట్‌ను తాజాగా బెంగళూరు నగర 24 వ ఏసీఎంఎం కోర్టులో సమర్పించారు. దర్శన్ ఏ2 నిందితుని, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 నిందితురాలిగా పేర్కొన్నారు. పవిత్ర బెంగళూరు పరప్పన జైల్లో, దర్శన్‌బళ్లారి జైలులో రిమాండులో ఉన్నారు. హత్యకేసులో ఇప్పటివరకు దర్యాప్తులో సేకరించిన ప్రత్యక్ష, సాంకేతిక, ఇతరత్రా సాక్ష్యాధారాలను చార్జిషీటులో పొందుపరచినట్లు నగర పోలీస్ కమిషనర్ బీ దయానంద్ విలేకరులతో తెలిపారు. -
దర్శన్ తూగదీప చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
బెంగళూరు : అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగదీప చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తుంది. తాజాగా, బెంగళూరు పోలీసులు దర్శన్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.ప్రస్తుతం హత్య కేసులో బళ్లారీ జైల్లో ఉన్న దర్శన్ జ్యుడిషయల్ కస్టడీ సెప్టెంబర్ 9తో ముగియనుంది. ఈ నేపథ్యంలో దర్శన్‌కు మరిన్ని కఠిన శిక్షలు పడేలా బెంగళూరు పోలీసులు బుధవారం కేసుకు సంబంధించి మరిన్ని 200పైగా ఆధారాల్ని సేకరించారు. వాటిల్లో దర్శన్‌తో పాటు, ఇతర నిందితులు ధరించిన దస్తులపై రక్తపు మరకల ఫోరెన్సిక్ రిపోర్ట్లు సైతం ఉన్నాయి. నేరం జరిగిన ప్రదేశం నుండి తీసిన ఫోటోలు, తనని కొట్ట వద్దని రేణుకా స్వామి వేడుకుంటున్న సీసీటీవీ పుటేజీతో పాటు, దాడి చేసే సమయంలో నటి పవిత్ర గౌడ చెప్పులకు అంటిన రేణుకాస్వామి రక్తపు మరకల తాలూకు ఆధారాల్ని పోలీసులు సేకరించారు. వాటిని ఛార్జ్ షీట్లో జత చేశారు. పరప్పన జైలు నుంచి అగ్రహార జైలుకుఅభిమాని రేణుకాస్వామి హత్య కేసులో పరప్పన అగ్రహార జైల్లో ఖైదీగా ఉన్న దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు.. పరప్పన అగ్రహార జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య దర్శన్‌ను బళ్లారి జైలుకు పోలీసులు తరలించారు. ఈ కేసులో ఇతర నిందితులను సైతం కర్ణాటకలోని ఇతర జైళ్లకు తరలించారు.కాగా, రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, పవిత్ర గౌడతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
కన్నడ హీరో దర్శన్‌పై చార్జ్‌షీట్.. బెయిల్‌పై అభిమానుల్లో ఆశలు
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు 3 వేల పేజీలతో సుదీర్ఘమైన చార్జ్‌షీట్‌ను తయారు చేశారు. ఈ హత్య కేసులో కన్నడ ప్రముఖ హీరో దర్శన్, నటి పవిత్రగౌడ, మరో 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు రప్పించడం, హత్య చేయడం, శవాన్ని డ్రైనేజీలో పారవేయడంతో సహా అన్ని అంశాలను సవివరంగా పొందుపరిచినట్లు తెలిసింది. పెద్దసంఖ్యలో సాక్షుల, నిందితుల వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేశారు. కొందరిని జడ్జీల ముందు హారుపరిచి స్టేట్మెంట్ ఇప్పించారు. ముందు ప్రథమ ముద్దాయిగా పవిత్రగౌడను పోలీసులు పేర్కొన్నప్పటికీ, తరువాత దర్శన్ ప్రమేయం ఎక్కువని తేలడంతో ఆయననే ఏ1 నిందితుడిగా తేల్చారు. త్వరలో కోర్టులో చార్జిషీటును సమర్పించే అవకాశం ఉంది. ఆ తరువాత దర్శన్, ఇతర నిందితులకు బెయిలుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. సుమారు గత మూడు నెలలుగా దర్శన్ జైలులోనే ఉన్నారు. ఇప్పటికే బెయిల్ కోసం ఆయన పలుమార్లు అప్పీలు చేసుకున్నా కోర్టు ఇవ్వలేదు. ఇప్పటి వరకు విచారణ మాత్రమే జరుగుతుందని కోర్టు తెలిపింది. పోలీసులు చార్జ్‌షీట్ వేసిన తర్వాత దానిని పరిశీలించి బెయిల్ ఇచ్చే అంశం గురించి నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. అయితే, తాజాగా పోలీసులు 3 వేల పేజీలతో చార్జ్ షీట్ రెడీ చేశారు. దీంతో దర్శన్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. పవిత్ర బెయిలు అర్జీ వాయిదా పవిత్రగౌడ పెట్టుకున్న బెయిలు అర్జీని కోర్టు 27వ తేదీకి వాయిదా వేసింది. ఆమెకు బెయిలు ఇవ్వరాదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. జూన్ 10న అరెస్టైన పవిత్రగౌడ అప్పటి నుంచి పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. -
పోలీసుల చేతిలో దర్శన్ ఇంటి సీసీ కెమెరాల దృశ్యాలు..
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అండ్ గ్యాంగ్‌కు ఉచ్చు మరింత బిగుస్తోంది. జూన్ 8, 9, 10 తేదీల్లో దర్శన్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన దృశ్యాలు డీవీఆర్‌లో డిలీట్ చేయడం జరిగింది. సదరు డీవీఆర్‌లను తీసికెళ్లిన పోలీసులు వాటిని రిట్రీవ్ చేయించారు. దృశ్యాల్లో నిందితులు దర్శన్ ఇంటికి వచ్చి వెళ్లిన సంగతి వెలుగు చూసింది. అంతేకాకుండా శవాన్ని తరలించే క్రమంలో లభించిన సాక్ష్యాధారాల్లో దర్శన్ ఫింగర్ ప్రింట్లు లభించాయి. ఇక పవిత్రగౌడకు వ్యతిరేకంగా కూడా బలమైన సాక్ష్యాధారాలు లభించాయి. రేణుకాస్వామి పవిత్రగౌడకు పంపించిన అన్ని మెసేజ్‌లను పోలీసులు పవిత్ర మొబైల్ నుండి రిట్రీవ్ చేశారు. -
దర్శన్ పశ్చాత్తాపం.. రేణుకాస్వామి భార్యకు సాయం చేయనున్నాడా..?
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ప్రముఖ హీరో దర్శన్‌కు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి తనకు అనుమతి ఇప్పించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు నిరాకరణ ఎదురుకావడంతో జైల్లో ఆయన ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఈ క్రమంలో దర్శన్‌లో పశ్చాత్తాపం కనిపిస్తుందని సమాచారం.రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. ఈ కేసుకు సంబంధించిన నిందితులందరూ నెల రోజుల నుంచి కటకటాల వెనుక ఉన్నారు. దర్శన్ సహా 13 మంది నిందితులు పరప్ప అగ్రహార జైలులో ఉండగా, నలుగురు నిందితులు తుమకూరు జైలులో ఉన్నారు.జైల్లో ఉన్న దర్శన్‌లో పశ్చాత్తాపం కనిపిస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జైలు అధికారులు కూడా ఇదే మాట అంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శన్ నుంచి వస్తున్న ప్రతి మాటలో కూడా పశ్చాత్తాపం కనిపిస్తుందని అంటున్నారు. రేణుకాస్వామి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు కాడంతో ఇప్పుడు ఆయన మరణం వల్ల కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న దర్శన్ కాస్త చలించిపోయినట్లు తెలుస్తోంది.రేణుకాస్వామి కుటుంబ సభ్యులకు సహాయం అందించాలని దర్శన్ పూనుకున్నారట. ఈ విషయాన్ని రేణుకాస్వామి కుటుంబ సభ్యులతో దర్శన్ అనుచరులు చర్చించారట. అందుకు వారు కూడా అంగీకరించినట్లు సమాచారం. గర్భంతో ఉన్న రేణుకాస్వామి భార్యకు సాయం చేయడంతో పాటు ఆయన తండ్రి, తల్లికి విడివిడిగా సాయం చేయాలని దర్శన్ ఆలోచించాడట. ఈ వార్త తన అనుచరుల ద్వారా కన్నడ మీడియాలో చక్కర్లు కొడుతుంది.దర్శన్‌ను పెళ్లికి ఆహ్వానించిన 'కాటేరా' దర్శకుడుదర్శన్ను కలిసేందుకు 'కాటేరా' చిత్ర దర్శకుడు తరుణ్ సుధీర్ ఈరోజు పరప్ప అగ్రహార జైలుకు వెళ్లారు. దర్శన్‌ని కలిసిన అనంతరం తరుణ్ సుధీర్ మీడియాతో ఇలా మాట్లాడారు.. 'దర్శన్ సర్‌కు ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నన్ను చూడగానే ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయనకు చెప్పాను. దర్శన్ సార్‌కు రెండు పుస్తకాలు ఇచ్చాను. జీవిత పాఠం గురించి తెలిపే పుస్తకంతో పాటు అర్జునుడి గురించి మరొక పుస్తకాన్ని ఆయనకు అందించాను.' అని తరుణ్ సుధీర్ అన్నారు. -
కస్టడీ పొడిగింపు.. ఆగస్టు 1 దాకా జైల్లోనే దర్శన్, పవిత్ర..
దొడ్డబళ్లాపురం: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు. తనకు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి అనుమతి ఇప్పించాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్ వేశాడు. అయితే ఇందుకు ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలుపుతూ కౌంటర్ దాఖలు చేశారు. గురువారంనాడు హైకోర్టులో వీటిపై విచారణ సాగింది. ఇంటి నుంచి భోజనం, పరుపు, దిండు, చదవడానికి కొన్ని పుస్తకాలు కావాలని దర్శన్ కోరాడు. జైలు నిబంధనల ప్రకారం జైలులో పౌష్టికాహారం ఇస్తున్నామని, అవసరం మేరకు ఇంటి భోజనం, ఇతర సౌకర్యాలు కల్పించేందుకు జైళ్ల శాఖ ఐజీని కోరితే ఆయన నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. అయితే దర్శన్ ఎవరినీ సంప్రదించకుండా నేరుగా కోర్టును ఆశ్రయించడం సరికాదని పేర్కొన్నారు. ఈ కేసులో కోర్టు నిర్ణయం తీసుకోనుంది.దర్శన్ అండ్ గ్యాంగ్‌కు కస్టడీ పొడిగింపు ఇదిలా ఉంటే దర్శన్, నటి పవిత్రగౌడ, ఇతర నిందితులకు న్యాయస్థానంలో మళ్లీ చుక్కెదురైంది. వీరి బెయిలు ఆశలు నిరాశలయ్యాయి. వారి జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఆగస్టు 1వ తేదీ వరకూ పొడిగించింది. గతంలో కోర్టు విధించిన కస్టడీ గురువారంతో ముగియడంతో పోలీసులు నిందితులను కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఇరువర్గాల వాదనల తరువాత కస్టడీని పొడిగించారు.చదవండి: 'డార్లింగ్' సినిమా రివ్యూ -
రేణుకాస్వామి కేసులో దర్శన్, పవిత్రగౌడ నుంచి కీలక ఆధారాలు లభ్యం
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. పక్కా ప్రణాళికతో పోలీసులు సాక్ష్యాధారాలు సేకరిస్తూ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్క వ్యక్తిని, వస్తువునీ వదలకుండా విచారణ చేసి, సాక్ష్యంగా మలచుకుంటున్నారు. తాజాగా ఈ హత్య కేసులో నిందితుల వేలిముద్రలకు సంబంధించిన రిపోర్ట్ పోలీసుల చేతికి అందింది.రేణుకాస్వామి హత్య జరిగిన ప్రాంతంతో పాటు మృతదేహాన్ని తరలించిన వాహనంలోని వేలి ముద్రలతో దర్శన్, పవిత్ర గౌడ వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయి. వారిద్దరితో పాటు జైలులో ఉన్న మరో 10 మంది వేలి ముద్రలు కూడా సరిపోలాయి. హత్య జరిగిన చోట లభ్యమైన వేలిముద్రలను హైదరాబాద్, బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కు అధికారులు పంపారు. అయితే, రెండు చోట్ల ఒకే రిపోర్ట్ వచ్చింది. ఇక డీఎన్ఏ రిపోర్ట్ రావాల్సి ఉంది.రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన 17 మందిపై గతంలో పోలీసులు కేసులు ఉన్నాయి. వారిలో కొందరు హత్యలు కూడా చేసినట్లు తేలుతుంది. ఈక్రమంలో కామాక్షిపాళ్య పోలీసులు తాజాగా పీడబ్ల్యూడీ అధికారులకు బ్లూఫ్రింట్ తయారుచేసి ఇవ్వాలని లేఖ రాశారు. కామాక్షిపాళ్యలోని పట్టణగెరె మెకానిక్ షెడ్డు నుంచి రేణుకాస్వామి శవాన్ని ఏ మార్గాన తరలించారు? ఎక్కడ విసిరేసారు?, తర్వాత ఏ మార్గాల్లో ఎవరెవరు సంచరించారనే పూర్తి సమాచారం ఆధారంగా బ్లూ ఫ్రింట్ తయారు చేసి ఇవ్వాలని లేఖ రాశారు. -
కన్నడ హీరో దర్శన్‌కు మరో షాక్!
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసుకు సంబంధించి డెవిల్ సినిమా డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ అయిన మిలన ప్రకాశ్‌కు పోలీసులు మరోసారి విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. శుక్రవారంనాడు ప్రకాశ్ విజయనగర ఏసీపీ ముందు హాజరయ్యారు. మరోసారి విచారణకు రావాలని శనివారం పోలీసులు ప్రకాశ్‌కు నోటీసులు ఇచ్చారు. రేణుకాస్వామి హత్య తరువాత హీరో దర్శన్ మైసూరులో డెవిల్ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. ఈ అంశాలపై సమాచారం కోసం ప్రకాశ్‌ను విచారించారు. 66 వస్తువుల సీజ్ రేణుకాస్వామి హత్యకేసుకు సంబంధించి దర్యాప్తు చేసిన పోలీసులు మొబైల్ఫోన్లో కలిపి మొత్తం 66 వస్తువులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. రేణుకాస్వామి దుస్తులు, సీసీ కెమెరాల ఫుటేజీ, మొబైల్ ఫోన్లు, దాడికి వాడిన వస్తువులు తదితరాలను సేకరించారు.కరావళి నుంచి దర్శన్ ఔట్?పరప్పన అగ్రహార జైలులో ఊచలు లెక్కిస్తున్న దర్శన్‌కు మరో షాక్ తగిలింది. కొత్తగా నిర్మిస్తున్న కరావళి సినిమా నుంచి దర్శన్‌ను తొలగిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న కరావళిలో దర్శన్ ముఖ్య పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదలైన పోస్టర్లో దర్శన్ కనిపించలేదు. దర్శన్ స్థానంలో కిచ్చ సుదీప్ నటిస్తున్నట్లు సమాచారం. ఇది దర్శన్ ఫ్యాన్స్‌కు మింగుడుపడడం లేదు. -
దర్శన్ నా కుమారుడితో సమానం.. సుమలత లేఖ వైరల్
ఆటో డ్రైవర్ రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో హీరో దర్శన్ (A2), నటి పవిత్ర (A1) ఉన్నారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు. ఇప్పటికే దర్శన్ అరెస్ట్ విషయంలో చాలామంది నటీనటులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ, రాజకీయ నాయకురాలు, సినీ నటి సుమలత అంబరీష్ స్పందన గురించి చాలామంది ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆమె రియాక్షన్ ఇచ్చారు. దర్శన్‌తో తనకు ఉన్న బంధాన్ని ఆమె వివరించారు.'నేను 44 ఏళ్ల నుంచి సినిమా రంగంలో నటిగా, కళాకారిణిగా జీవిస్తున్నాను. ఐదేళ్లపాటు ఎంపీగా పని చేశా. అనేక రంగాలలో బాధ్యతగా నిర్వర్తించా. అనవసరంగా వ్యాఖ్యలు చేయడం వేస్ట్. నా కుటుంబంతో దర్శన్ కుటుంబానికి మధ్య ఉన్న బంధం మీకు అర్థం కాదు. అతను స్టార్ కాకముందు 25 ఏళ్లుగా నాకు తెలుసు. స్టార్‌డమ్‌కి మించి దర్శన్ నాకు కుటుంబ సభ్యుడు, కొడుకు లాంటివాడు. అంబరీష్‌ని ఎప్పుడూ నాన్నగా పిలిచే ఆయన జీవితంలో నాకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఏ తల్లి తన కొడుకుని ఇలాంటి పరిస్థితిలో చూడడానికి ఇష్టపడదు. నాకు తెలిసిన దర్శన్ ఎప్పుడూ ఇలాంటి నేరం చేయడు. దర్శన్‌లో ప్రేమ, ఉదార హృదయం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే సంకల్పం అతని పాత్రకు సాక్ష్యమిస్తున్నాయి. దర్శన్ అటువంటి నేరం చేసే వ్యక్తి కాదని నేను నమ్ముతున్నాను.' అని సుమలత తన లేఖలో రాశారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున తాను ఇకపై వ్యాఖ్యానించనని పేర్కొన్నారు.దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిని సుమలత తప్పుబట్టారు. అలాంటి వారిని విమర్శిస్తూ సుమలత తన లేఖను ముగించారు. 'దర్శన్ ఇప్పటికీ నిందితుడే.. అతనికి వ్యతిరేకంగా ఏదీ నిరూపించబడలేదు, శిక్షించబడలేదు. దర్శన్‌కు న్యాయమైన విచారణ జరగనివ్వండి. దర్శన్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడకండి. దర్శన్ విషయం వల్ల ఇప్పటికే శాండల్‌వుడ్ స్థంభించిపోయింది.' అని ఆమె రాశారు.18 వరకు దర్శన్‌కు కస్టడీరేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న హీరో దర్శన్, అనుచరులకు కోర్టు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. దర్శన్, నటి పవిత్ర, మరో 15 మంది నిందితులకు కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెస్స్ ద్వారా జడ్జి ముందు హాజరుపరిచారు. ఇందులో నలుగురు నిందితులు తుమకూరు జైల్లో ఉన్నారు. బెయిలు దక్కుతుందని ఆశించిన దర్శన్ గ్యాంగ్‌కి నిరాశ ఎదురైంది. జూలై 18 వరకూ కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు. -
ఆమెను నా భర్త పెళ్లి చేసుకోలేదు.. పోలీసులకు హీరో భార్య లేఖ!
రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్‌తో పాటు నటి పవిత్రా గౌడను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు పోలీసు కస్టడీలో ఉన్నారు. అయితే ఈ కేసు విచారణలో వీరిద్దరిని దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం తెలిపింది. పవిత్రాగౌడ, దర్శన్ భార్య కాదంటూ బెంగళూరు పోలీస్ కమిషనర్‌కు లేఖ రాసింది. ‘ఇటీవల మీరు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవిత్రను దర్శన్ భార్య అని తప్పడు ప్రకటన చేశారు. ఆ తర్వాత హోంమంత్రి కూడా అలానే పేర్కొన్నారు. ఆమెను నా భర్త పెళ్లి చేసుకోలేదు. దర్శన్‌కు పవిత్ర కేవలం స్నేహితురాలు మాత్రమే. దర్శన్‌కు చట్టపరమైన జీవిత భాగస్వామిని నేనే. మా పెళ్లి 2003లో జరిగింది. దయచేసి పోలీసు రికార్డుల్లో పవిత్రాగౌడను దర్శన్ భార్య అని పేర్కొనకండి. ఇది భవిష్యత్తులో నాకు, నా కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుంది. పవిత్రకు సంజయ్‌సింగ్ అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఓ కుమార్తె కూడా ఉంది. దయచేసి ఈ వాస్తవాలను రికార్డుల్లో స్పష్టంగా రాయండి’ అని విజయలక్ష్మి విజ్ఞప్తి చేసింది.కాగా, దర్శన్‌కి విజయలక్ష్మితో వివాహమైనప్పటికీ.. కొంతకాలంగా దూరంగా ఉంటున్నాడు. కన్నడ నటి పవిత్రాగౌడతో సహజీవనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయం దర్శన్ అభిమాని రేణుకాస్వామికి తెలియడంతో.. విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని భావించి.. పవిత్రకు అశ్లీల సందేశాలు పంపించి హెచ్చరించాడు. అదే అతని హత్యకు దారి తీసిందని పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. -
డిప్రెషన్లో దర్శన్ భార్య.. ఎప్పుడూ భర్త కోసమే తపించేది!
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ హీరో దర్శన్ ప్రస్తుతం పరప్పన అగ్రహార జైల్లో ఉన్నాడు. ప్రియురాలు, నటి పవిత్ర గౌడ కోసం తన గ్యాంగ్‌తో కలిసి రేణుకాస్వామిని చంపేశాడన్న ఆరోపణలతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంలో అందరూ దర్శన్‌ను తప్పుపడుతుండగా ఆయన అభిమానులు మాత్రం హీరోను వెనకేసుకొస్తున్నారు.డిప్రెషన్దర్శన్ చేసిన తప్పు వల్ల ఏ పాపం ఎరుగని అతడి సతీమణి విజయలక్ష్మి ఇబ్బందులు పడుతోందంటోంది సింగర్ షమిత మల్నాడ్. ఆమె మాట్లాడుతూ... జరిగిన సంఘటన వల్ల విజయలక్ష్మి డిప్రెషన్‌కు లోనవుతోంది. బయటకు మాత్రం ధైర్యంగా ఉంటోంది. ఏం మాట్లాడాలో అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్న మమ్మల్ని సముదాయిస్తోంది. ఏం జరగదు.. కంగారు పడకూడదని అటు మాకు, ఇటు అభిమానులకు ధైర్యం చెప్తోంది. అయినా తను ఈ ఒత్తిడి నుంచి త్వరగానే బయటపడుతుంది. తను చాలా స్ట్రాంగ్ మహిళ.. ఈ పరిస్థితిలో తన కుమారుడిని ఎలా చూసుకోవాలి? అటు దర్శన్‌కు ఎలా ధైర్యం చెప్పాలో ఆమెకు బాగా తెలుసు. ఆమెలా ధైర్యంగా నిలబడేవాళ్లు చాలా అరుదుగా ఉంటారు. మాది 20 ఏళ్ల స్నేహం. ఇన్నేళ్లలో తను ఎప్పుడూ కుమారుడికి, భర్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. తన కుటుంబాన్ని ఎన్నటికీ విచ్ఛిన్నం కానివ్వదు అని షమిత చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Vijayalakshmi darshan (@viji.darshan)చదవండి: మామూలు ఖైదీగానే దర్శన్ -
జైలు నుంచి నిర్మాతలకు దర్శన్ ఫోన్?
శివాజీనగర: హత్య కేసులో అరెస్టయిన నటుడు దర్శన్‌కు జైలులో ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించటం లేదని, మామూలు ఖైదీలతో సమానంగా ఉన్నారని హోం మంత్రి జీ.పరమేశ్వర్ చెప్పారు. మంగళవారం సదాశివనగరలో తన ఇంటి వద్ద మాట్లాడిన ఆయన, దర్శన్‌కు జైలులో ప్రత్యేక సదుపాయాలు ఇస్తున్నారనే ఆరోపణలను తిరస్కరించారు. జైలులో బిర్యానీ వంటివి ఏవీ ఇవ్వడం లేదు. చూడాలనుకుంటే రండి, నాతో పాటు తీసుకెళ్లి చూపిస్తానన్నారు. నూతన చట్టం కింద 66 కేసులు కొత్త నేర చట్టాల కింద రాష్ట్రంలో 66 కేసులు నమోదయ్యాయి. బెంగళూరులో 20 కేసులు ఉన్నాయి. నూతన చట్టాల్లో కొన్ని అంశాలు బాగుంటే, మరికొన్ని బాగాలేవు. వాటి గురించి చర్చించి కేంద్రం దృష్టికి తీసుకొస్తామని హోంమంత్రి తెలిపారు. ఈ కొత్త చట్టాలు దేశమంతటికి సంబంధించినవి. లక్షలాది కేసులు నూతన చట్టం కింద నమోదవుతాయి. ఈ చట్టాల గురించి చర్చలు జరగాల్సి ఉంది. కొన్ని అంశాలపై కేసు నమోదుకు ఆస్కారం లేదు అని తెలిపారు. చిన్నారికి ఖైదీ డ్రెస్.. అభిమాని అతి దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి అనే యువకుని హత్య కేసులో అరెస్టయి పరప్పన అగ్రహార జైల్లో హీరో దర్శన్ కాలం గడుపుతున్నారు. బయట ఆయన అభిమానులు మాత్రం తలోరకంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఓ అభిమాని తన చిన్నారి కొడుక్కి ఖైదీ డ్రెస్ వేసి, జైలులో దర్శన్‌కు ఇచ్చిన ఖైదీ నంబర్ 6106ని రాయించాడు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీనిపై అనేకమంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శన్ అభిమానులు మాత్రం అభినందించారు. దర్శన్ ఆందోళనగా ఉన్నారు: ధనీ్వర్ దొడ్డబళ్లాపురం: నటుడు ధనీ్వర్ పరప్పన అగ్రహార జైలులో ఉన్న దర్శన్‌ను మంగళవారం కలిశారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన ఆయన దర్శన్ చాలా ఆందోళనగా కనిపించారని, ఆ స్థితిలో ఆయనను చూడలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసారు. అంతా మంచే జరగాలని ఆశిస్తున్నానన్నారు. జైలు నుంచి నిర్మాతలకు దర్శన్ ఫోన్?దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టై పరప్పన అగ్రహార జైలులో ఖైదీగా ఉన్న హీరో దర్శన్ జైలు నుండే నిర్మాతలకు ఫోన్ చేసి బెయిల్ ఇప్పించాలని ఒత్తిడి తెస్తున్నాడని సమాచారం. జైలులో ఉన్న ఫోన్‌బూత్ నుండి నిత్యం నిర్మాతలకు కాల్ చేస్తున్న దర్శన్ పలువురు నిర్మాతలతో మాట్లాడుతూ త్వరగా బెయిల్ ఇప్పించాలని కోరుతున్నాడట. తోటి ఖైదీల ఫోన్ కాల్స్ లిమిట్ కూడా తానే వినియోగించుకుంటున్నాడట. అంతేకాకుండా అర్ధాంతరంగా నిలిచిపోయిన తన సినిమాల గురించి నిర్మాతలు, డైరెక్టర్లతో చర్చిస్తున్నాడని తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో మాట్లాడని దర్శన్ రాత్రయితే ఇలా నిర్మాతలు, డైరెక్టర్లకు కాల్ చేస్తున్నాడని సమాచారం. -
రేణుకాస్వామిని హీరోను చేయడం ఆపండి.. దర్శన్‌కు యాంకర్ సపోర్ట్
స్క్రీన్‌పై హీరోగా మెప్పించే దర్శన్ నిజ జీవితంలో మాత్రం కరడుగట్టిన విలన్‌గా మారాడు. తన ప్రియురాలు పవిత్ర గౌడను వేధిస్తున్నాడన్న నెపంతో తన గ్యాంగ్‌తో కలిసి అభిమాని రేణుకాస్వామిని అతి దారుణంగా చంపాడు. ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ సీసీ కెమెరాల్లో అడ్డంగా దొరికిపోవడంతో ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.ఒక్కసారి ఆ బంధంలో..ఈ కేసు విషయంలో అందరూ దర్శన్‌ను దుమ్మెత్తిపోస్తుండగా యాంకర్ హేమలత మాత్రం హీరోకు మద్దతుగా నిలబడింది. ఇక నా వల్ల కావడం లేదు. ఎవరు ఏమైనా అనుకోని.. ఒకరిపై మనం పెంచుకున్న ప్రేమకు, స్నేహానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఒక్కసారి స్నేహం అనే బంధంలో ఇరుక్కున్నాక దాని నుంచి బయటకు రాలేము. అప్పుడు, ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ఆ బంధాన్ని వదిలేయాలని అనుకోము. ఆ గౌరవం అలాగే..జరిగిన ఘటన గురించి ఏమని మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. కానీ మీ(దర్శన్) మీద ఉన్న ప్రేమ, గౌరవం మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. దయచేసి రేణుకాస్వామిని హీరో చేయడం ఆపండి అని రాసుకొచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ పోస్టుకు దర్శన్‌తో కలిసి ఉన్న ఫోటోను జత చేసింది.చదవండి: ప్రియుడితో బిగ్‌బాస్ బ్యూటీ బ్రేకప్.. అందుకే అలా చేశారా?