
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ అండ్ గ్యాంగ్‌కు ఉచ్చు మరింత బిగుస్తోంది. జూన్ 8, 9, 10 తేదీల్లో దర్శన్ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలకు సంబంధించిన దృశ్యాలు డీవీఆర్‌లో డిలీట్ చేయడం జరిగింది. సదరు డీవీఆర్‌లను తీసికెళ్లిన పోలీసులు వాటిని రిట్రీవ్ చేయించారు.
దృశ్యాల్లో నిందితులు దర్శన్ ఇంటికి వచ్చి వెళ్లిన సంగతి వెలుగు చూసింది. అంతేకాకుండా శవాన్ని తరలించే క్రమంలో లభించిన సాక్ష్యాధారాల్లో దర్శన్ ఫింగర్ ప్రింట్‌లు లభించాయి. ఇక పవిత్రగౌడకు వ్యతిరేకంగా కూడా బలమైన సాక్ష్యాధారాలు లభించాయి. రేణుకాస్వామి పవిత్రగౌడకు పంపించిన అన్ని మెసేజ్‌లను పోలీసులు పవిత్ర మొబైల్ నుండి రిట్రీవ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment