కర్ణాటకలో సంచలనాత్మకంగా మారిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయగా, కోర్టులో విచారణ ప్రారంభమైంది. రేణుకాస్వామి హత్య సమయంలో వచ్చిన ఫోటోలు నిజమా, అబద్ధమా అనే ప్రశ్న తలెత్తింది. ఈ కేసులో పోలీసులు చూపుతున్న సాక్ష్యాలన్నీ అబద్ధాలని నటుడు దర్శన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కొన్నిసాక్ష్యాల ధృవీకరణ పత్రాలు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా పోలీసుల చేతికి అందలేదు.
ఆర్ ఆర్ నగరలో బస్సు షెడ్డులో రేణుకాస్వామిని బంధించి దర్శన్, పవిత్రగౌడ, అనుచరులు తీవ్రంగా కొట్టి చంపారనేది ప్రధాన అభియోగం. ఆ సమయంలో కొన్ని ఫోటోలను వారి మొబైల్ ఫోన్ల నుంచి సేకరించినట్లు పోలీసులు తెలిపారు. రేణుకాస్వామి చేతులెత్తి సమస్కరిస్తూ కూర్చున్న ఫోటో, మృతదేహం ఫోటోలు ఇందులో ఉన్నాయి. కానీ ఈ ఫోటోలు ఏఐ టెక్నాలజీతో సృష్టించారని దర్శన్ న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఫోటోలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి త్వరగా నివేదిక పంపాలని పోలీసులు కోరారు. దీంతో ఈ కేసులో మరో మలుపు తీసుకున్నట్లు అయింది.
Comments
Please login to add a commentAdd a comment