dharsan
-
కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరు
రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ మంజూరు అయింది. ఆయనతో పాటు ఏడుగురికి ఈ కేసులో బెయిల్ ఇస్తున్నట్లు న్యాయస్థానం వెళ్లడించింది. దర్శన్ ఇప్పటికే తన చికిత్స కోసం బెయిల్‌పై బయట ఉన్నాడు. నేటితో ఆయన బెయిల్ గడవు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో గడవుతో నిమిత్తం లేకుండా బెయిల్ మంజూరు కావడంతో దర్శన్ అభిమానులు ఆనందిస్తున్నారు.రేణుకాస్వామి హత్య కేసులో సుమారు ఆరు నెలలుగా పరప్పన జైలులో హీరో దర్శన్ ఉన్నారు. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దర్శన్ లాయర్లు పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. కానీ, ఫలితం లేదు. అయితే, మరోసారి బెయిల్ కోసం ఆయన ధరఖాస్తు చేసుకున్నారు. విశ్వజీత్ శెట్టితో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు కూడా బెయిల్ లభించినట్లు తెలుస్తోంది.కర్ణాటకలో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దర్శన్ ప్రియురాలు పవిత్రకు అసభ్యతతో కూడిన మెసేజ్‌లు రేణుకాస్వామిని చేస్తున్నాడనే కారణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడికి కరెంట్ షాకులు కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. అయితే, వారికి ఇప్పుడు బెయిల్ రావడం సంచలనంగా మారింది. -
దర్శన్ మానసిక స్థితి బాగాలేదు : లాయర్
కన్నడ నటుడు దర్శన్ అనారోగ్యంతో ఇబ్బుందులు పడుతున్న విషయం తెలిసిందే. రేణుకా స్వామి హత్య కేసులో ఈ కారణం వల్లే ఆయనకు ఆరు వారాల పాటు బెయిల్ లభించింది. వెన్నెముక శస్త్ర చికిత్స కోసం ఆయనకు కోర్టు తాత్కాలిక బెయిలు మంజూరు చేసింది. పాస్‌పోర్టును ట్రయల్ కోర్టుకు అప్పగించాలని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని షరతు విధించింది.ఆపరేషన్ చేయడానికి దర్శన్ మానసికంగా సిద్ధంగా లేరని దర్శన్ తరపు లాయర్ హైకోర్టుకు తెలిపారు. ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి ఇప్పటికే నాలుగు వారులు కావస్తుంది. అయితే, ఇన్ని రోజులైనా దర్శన్ ఆపరేషన్ చేయించుకోకపోవడంతో పోలీసులు సుప్రీంకోర్టుకు అప్పీలు వెళ్లారు. దర్శన్ బెయిలు రద్దు చేయాలని, లేదంటే ఆయన బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసులు అభిప్రాయపడ్డారు. దర్శన్‌కు ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని, దర్శన్ కూడా మానసికంగా సిద్ధమవుతున్నారని, ముఖ్యంగా అధిక రక్తపోటు వల్ల ఆపరేషన్ వాయిదా పడుతోందని కోర్టుకు దర్శన్ తరుపు లాయర్ వివరించారు. అందుకు సంబంధించి వైద్యులు ఇచ్చిన రిపోర్టులను కూడా సమర్పించారు. ప్రస్తుతం కన్సర్వేటివ్ ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు. ఫిజియోథెరపీ, మందులతో నొప్పిని అదుపులో ఉంచడం జరుగుతోందని వివరించారు. -
ఆసుపత్రిలో చేరిన నటుడు దర్శన్
రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆరోగ్యం కొద్దిరోజులుగా మెరుగ్గాలేదు. దీంతో తనకు అత్యవసర చికిత్స అవసరం అంటూ కోర్టుకు వెళ్లడంతో ఆయనకు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన సుమారు 140 రోజుల నుంచి జైలులో ఉన్నారు. దర్శన్‌కు 6 వారాలు పాటు బెయిలు అమల్లో ఉంటుంది.తీవ్రమైన వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న దర్శన్ తాజాగా ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఆయన లాయర్ నాగేశ్ తెలిపారు. దర్శన్‌కు వెన్నులో ఎల్–5, ఎస్–1 డిస్క్‌లలో సమస్య ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మైసూరులో ఒక ప్రముఖ ఆసుపత్రిలో దర్శన్ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై డాక్టర్ నవీన్ అప్పాజీ గౌడ ఇలా చెప్పారు.చికిత్స చేస్తున్న డాక్టర్ నవీన్ అప్పాజీ గౌడ్ శుక్రవారం మాట్లాడుతూ.. దర్శన్ కాలిలో శక్తి కోల్పోయినట్లు ఉందని తెలిపారు. ఆయన వెన్ను భాగంలో తీవ్రమైన నొప్పి ఉండటం వల్ల కాలిలో కూడా ఆ ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దర్శన్‌కు ఇప్పటికే ప్రాథమిక చికిత్సలు ప్రారంభించామని తెలిపారు. పూర్తి రిపోర్ట్లు వచ్చిన తర్వాత అవసరం అయితే ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చని చెప్పారు. బళ్లారి కేంద్ర కారాగారంలోని వైద్యులు పంపిన మెడికల్ రిపోర్టులను కూడా తాము పరిశీలించామని పేర్కొన్నారు. -
దర్శన్,పవిత్రల బెయిల్‌పై తీర్పు వెల్లడి
కన్నడ హీరో దర్శన్ ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. ఆయనతో పాటు వేలాది మంది అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన బెయిలు దక్కలేదు. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, నటి పవిత్రగౌడ బెయిల్ పిటిషన్‌ను నగర 57 వ సీసీహెచ్ కోర్టు కొట్టివేసింది. బెయిల్ వస్తుందనే ఆశతో ఉన్న ఇరువురు తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారు. బెయిల్ పిటిషన్ మీద ప్రభుత్వ వకీలు ప్రసన్నకుమార్, దర్శన్ న్యాయవాది సీవీ.నాగేశ్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. బెయిలు ఇవ్వరాదని ప్రభుత్వ వకీలు, ఇవ్వాలని దర్శన్ ప్లీడరు వాదించారు. గత కొన్ని రోజులుగా బెయిలు అర్జీపై వాదనలు సాగుతున్నాయి. జడ్జి జైశంకర్ తీర్పు వెలువరిస్తూ బెయిలు ఇవ్వడం లేదని ప్రకటించారు. కానీ, ఇదే కేసులో రవిశంకర్, దీపక్ అనే ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.జూన్ 10 నుంచి జైలువాసందర్శన్, పవిత్రలు జూన్ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. ఇటీవల సిట్ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్జైల్లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు. -
ఆ ఫోటోలన్నీ ఫేక్.. దర్శన్ కేసులో కీలక మలుపు
కర్ణాటకలో సంచలనాత్మకంగా మారిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయగా, కోర్టులో విచారణ ప్రారంభమైంది. రేణుకాస్వామి హత్య సమయంలో వచ్చిన ఫోటోలు నిజమా, అబద్ధమా అనే ప్రశ్న తలెత్తింది. ఈ కేసులో పోలీసులు చూపుతున్న సాక్ష్యాలన్నీ అబద్ధాలని నటుడు దర్శన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కొన్నిసాక్ష్యాల ధృవీకరణ పత్రాలు ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఇంకా పోలీసుల చేతికి అందలేదు. ఆర్ ఆర్ నగరలో బస్సు షెడ్డులో రేణుకాస్వామిని బంధించి దర్శన్, పవిత్రగౌడ, అనుచరులు తీవ్రంగా కొట్టి చంపారనేది ప్రధాన అభియోగం. ఆ సమయంలో కొన్ని ఫోటోలను వారి మొబైల్ ఫోన్ల నుంచి సేకరించినట్లు పోలీసులు తెలిపారు. రేణుకాస్వామి చేతులెత్తి సమస్కరిస్తూ కూర్చున్న ఫోటో, మృతదేహం ఫోటోలు ఇందులో ఉన్నాయి. కానీ ఈ ఫోటోలు ఏఐ టెక్నాలజీతో సృష్టించారని దర్శన్ న్యాయవాదులు ఆరోపించారు. ఈ ఫోటోలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి త్వరగా నివేదిక పంపాలని పోలీసులు కోరారు. దీంతో ఈ కేసులో మరో మలుపు తీసుకున్నట్లు అయింది. -
రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది: దర్శన్
కన్నడలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ సుమారు ఐదు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు. అయితే, గత కొద్దిరోజులుగా జైల్లో దర్శన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.బళ్లారి జైలులో దర్శన్ పలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా సరైన నిద్రలేకుండా ఆయన ఉన్నారట. ఈ క్రమంలో తనను రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోందని జైలు అధికారులతో దర్శన్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. నిద్రపోతున్న సమయంలో రేణుకాస్వామి ఆత్మ కలలోకి వచ్చి బయపెడుతుందని ఆయన చెప్పుకొస్తున్నారట. ఇక్కడ తాను ఒంటరిగా ఉండలేకపోతున్నట్లు అధికారులతో చెబుతూ.. తనను బెంగుళూరు జైలుకు తరలించాలని వేడుకుంటున్నారని సమాచారం. అర్ధరాత్రి సమయంలో నిద్రలోనే దర్శన్ కేకలు పెడుతున్నట్లు తోటి ఖైదీలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయం గురించి జైలు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.ఇదీ చదవండి: పరారీలో హర్షసాయి.. లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులుదర్శన్ బెయిల్పిటిషన్ విచారణ తాజాగా మళ్లీ వాయిదాపడింది. బెంగళూరు నగర 57వ సీసీహెచ్ కోర్టులో బెయిల్‌పై శుక్రవారం విచారణ జరిగింది. దర్శన్ తరఫున న్యాయవాది నాగేశ్ వాదనలు వినిపించారు. అయితే, విచారణను శనివారం నాటికి వాయిదా వేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. నేడు సాయింత్రం విచారణ జరిగే అవకాశం ఉంది. -
దర్శన్,పవిత్రలకు నిరాశ.. కస్టడీ పొడిగింపు
రేణుకాస్వామి హత్య కేసులో బెయిల్ కోసం ఎదురుచూస్తున్న దర్శన్‌కు మరోసారి నిరాశే మిగిలింది. ఆయన రిమాండును కోర్టు పొడిగించింది. కొద్దిరోజుల క్రితం హత్యకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించిన బెంగళూరు పోలీసులు 3,991 పేజీలతో చార్జిషీట్ రెడీ చేశారు. దానిని కోర్టులో కూడా దాఖలు చేశారు. రేణుకాస్వామి హత్య కుట్రలో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ ఉన్నారని పోలీసులు తెలుపుతున్నారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు అందించారు.ఇదీ చదవండి: డాక్టర్‌పై నటి రోహిణి ఫిర్యాదుఈ కేసులో హీరో దర్శన్, పవిత్రగౌడ, గ్యాంగ్‌కు బెయిలు భాగ్యం దక్కలేదు. కోర్టు వారి కస్టడీని పొడిగించింది. శుక్రవారంతో జ్యుడీషియల్ రిమాండు ముగియడంతో పోలీసులు 17మంది నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 24వ ఏసీఎంఎం కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. పూర్తి చార్జిషీట్ సమర్పించాలని, ఎల్రక్టానిక్స్ సాక్ష్యాలను ఒక వారంలోపు ప్రవేశ పెట్టాలని పోలీసులను ఆదేశించిన కోర్టు నిందితులకు సెప్టెంబర్ 17 వరకూ కస్టడీని పొడిగించింది. పవిత్ర బెయిలు అర్జీ వాపస్ ఈ హత్య కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న నటి పవిత్రగౌడ కోర్టులో పెట్టుకున్న బెయిలు పిటిషన్ వెనక్కు తీసుకుంది. అయితే చార్జ్‌షీట్ దాఖలైందని, పలు సాంకేతిక కారణాలు చూపుతూ ఆమె న్యాయవాదులు వాపస్ తీసుకున్నారు. త్వరలో కొత్త బెయిలు అర్జీ దాఖలు చేసే అవకాశముంది. -
హై సెక్యూరిటీ మధ్య మరో జైలుకు దర్శన్ తరలింపు
కన్నడ నటుడు దర్శన్‌ను బెంగుళూరు పరప్పన అగ్రహార జైలు నుంచి బళ్లారి సెంట్రల్ జైలుకు నేడు (ఆగష్టు 29) తరలించారు. బెంగుళూరు జైలు అధికారులు దర్శన్‌కు ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు అందుకు సంబంధించిన పలు ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ అంశంపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది.కన్నడ చిత్రపరిశ్రమలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్‌ను గురువారం ఉదయం బళ్లారి సెంట్రల్ జైలుకు తరలించారు. బెంగళూరు పోలీసుల ఎస్కార్ట్‌తో సహా కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఆయనను తీసుకెళ్లారు. బల్లారిల సెంట్రల్ జైలులో కూడా ప్రత్యేకంగా నియమించబడిన హై-సెక్యూరిటీ సెల్లో దర్శన్‌ను ఉంచారు. బెంగళూరు పరప్పన అగ్రహార నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు పోలీసు వాహనం బయలుదేరి ఉదయం 9.45 గంటలకు బళ్లారి సెంట్రల్ జైలుకు చేరుకుంది. నల్లటి టీషర్ట్ ధరించి కనిపించిన దర్శన్.. కుడి చేతికి బ్యాండేజీతో ఉన్నాడు. ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ఎంట్రీ బుక్‌పై సంతకం చేసిన తర్వాత జైలు వైద్యులు ఆరోగ్య పరీక్షలను నిర్వహించి, ఆపై హై-సెక్యూరిటీ సెల్‌కు పంపారు.ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా మీదుగా వెళ్లిన దర్శన్ వాహనానికి స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎస్పీ శోభారాణి, జైలు సూపరింటెండెంట్ లత ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఎన్నో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ, దర్శన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. అయితే ముందు జాగ్రత్త చర్యగా ఆయన అభిమానులను జైలు దగ్గరకు వెళ్లకుండా అన్నీ మార్గాలను బారికేడ్లతో మూసేశారు.దర్శన్‌పై మరో రెండు కేసులు దర్శన్‌కు రాచమర్యాదులు అందిన ఘటనలో పరప్పన అగ్రహార పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదు కాగా రెండింటిలో దర్శన్ మొదటి నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుల దర్యాప్తునకు సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ సారా ఫాతిమా మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. బేగూరు పోలీస్‌స్టేషన్ సీఐ క్రిష్ణకుమార్ దర్యాప్తు ప్రారంభించనున్నారు. జైలు లాన్లో కూర్చుని దర్శన్ రౌడీషిటర్ ఇతర ఖైదీలకు ఆ ఏర్పాటు ఎవరు చేశారు?, సిగరెట్లు జైల్లోకి ఎలా వచ్చాయి అనే కోణంలో దర్యాప్తు చేస్తారు. ఈ దృశ్యాలు ఫొటో, వీడియో ఎలా తీశారనే విషయంపై హుళిమావు సీఐ దర్యాప్తు చేస్తారు. జైలు అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యం, అధికార దురి్వనియోగం తదితర అంశాలపై మూడవ కేసును ఎల్రక్టానిక్ సిటీ పోలీస్‌స్టేషన్ ఏసీపీ మంజునాథ్ దర్యాప్తు చేస్తారు. -
కన్నడ హీరో దర్శన్‌పై చార్జ్‌షీట్.. బెయిల్‌పై అభిమానుల్లో ఆశలు
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు 3 వేల పేజీలతో సుదీర్ఘమైన చార్జ్‌షీట్‌ను తయారు చేశారు. ఈ హత్య కేసులో కన్నడ ప్రముఖ హీరో దర్శన్, నటి పవిత్రగౌడ, మరో 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు రప్పించడం, హత్య చేయడం, శవాన్ని డ్రైనేజీలో పారవేయడంతో సహా అన్ని అంశాలను సవివరంగా పొందుపరిచినట్లు తెలిసింది. పెద్దసంఖ్యలో సాక్షుల, నిందితుల వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డు చేశారు. కొందరిని జడ్జీల ముందు హారుపరిచి స్టేట్మెంట్ ఇప్పించారు. ముందు ప్రథమ ముద్దాయిగా పవిత్రగౌడను పోలీసులు పేర్కొన్నప్పటికీ, తరువాత దర్శన్ ప్రమేయం ఎక్కువని తేలడంతో ఆయననే ఏ1 నిందితుడిగా తేల్చారు. త్వరలో కోర్టులో చార్జిషీటును సమర్పించే అవకాశం ఉంది. ఆ తరువాత దర్శన్, ఇతర నిందితులకు బెయిలుకు అవకాశం ఉన్నట్లు సమాచారం. సుమారు గత మూడు నెలలుగా దర్శన్ జైలులోనే ఉన్నారు. ఇప్పటికే బెయిల్ కోసం ఆయన పలుమార్లు అప్పీలు చేసుకున్నా కోర్టు ఇవ్వలేదు. ఇప్పటి వరకు విచారణ మాత్రమే జరుగుతుందని కోర్టు తెలిపింది. పోలీసులు చార్జ్‌షీట్ వేసిన తర్వాత దానిని పరిశీలించి బెయిల్ ఇచ్చే అంశం గురించి నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. అయితే, తాజాగా పోలీసులు 3 వేల పేజీలతో చార్జ్ షీట్ రెడీ చేశారు. దీంతో దర్శన్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. పవిత్ర బెయిలు అర్జీ వాయిదా పవిత్రగౌడ పెట్టుకున్న బెయిలు అర్జీని కోర్టు 27వ తేదీకి వాయిదా వేసింది. ఆమెకు బెయిలు ఇవ్వరాదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. జూన్ 10న అరెస్టైన పవిత్రగౌడ అప్పటి నుంచి పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. -
దర్శన్‌కు మళ్లీ నిరాశే.. రిమాండ్ పొడిగింపు
రేణుకాస్వామి హత్య కేసులో గత రెండు నెలలుగా పరప్పన జైలులో హీరో దర్శన్ ఉన్నారు. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దర్శన్ లాయర్లు పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. కానీ, ఫలితం లేదు. కనీసం ఇంటి భోజనానికి అనుమతి కోరినా కోర్టు అడ్డు చెప్పింది. దీంతో ఆయన తిండి కోసం చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుస్తోంది. మరోవైపు ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడ విషయంలోనూ ఇదే పరిస్థితి ఉంది. అయితే, తాజాగా వారిద్దరికి కోర్టు షాకిచ్చింది.రేణుకాస్వామిని హత్య చేశారని హీరో దర్శన్, నటి పవిత్రగౌడ, అనుచరులను పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. అయితే, వారిద్దరూ ఇప్పట్లో విడుదల అయ్యే భాగ్యం కనిపించడం లేదు. రేణుకాస్వామి హత్య కేసులో తాజాగా దర్శన్, పవిత్రగౌడ సహా నిందితులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో పోలీసులు హాజరుపరిచారు . పరప్పన జైలు నుంచి 13 మంది, తుమకూరు జైలు నుండి నలుగురు నిందితులను హాజరు పరిచారు. వారి రిమాండును పొడిగించాలని సిట్ లాయరు కోరారు. దీంతో ఆగస్టు 14 వరకూ పొడిగించారు. దీంతో బెయిల్ మీదు ఆశలు పెట్టుకున్న దర్శన్‌కు నిరాశే మిగిలింది. -
దర్శన్ మా ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపుతా: రేణుకాస్వామి తండ్రి
రేణకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ A2 గా ఉన్నారు. దీంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో గత 30 రోజులుగా శిక్ష అనుభవిస్తున్నారు. దర్శన్‌కు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి తనకు అనుమతి ఇప్పించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు నిరాకరణ ఎదురుకావడంతో ఆహారం కోసం జైల్లో ఆయన ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దర్శన్‌లో పశ్చాత్తాపం కనిపిస్తుందని సమాచారం.తాజాగా కన్నడ సీనియర్ హీరో వినోద్‌రాజ్ పరప్పన జైలులో ఉన్న దర్శన్‌ను కలుసుకున్నారు. ఆయన్ను పరామర్శించిన వారం తర్వాత రేణుకాస్వామి కుటుంబాన్ని కలుసుకున్నారు. అక్కడ వారి పరిస్థితి చూసి ఆయన చలించిపోయారు. రేణుకాస్వామి సతీమణితో పాటు ఆయన తండ్రి ఇప్పటికీ కోలుకోకుండా ఉన్నారని తెలిపాడు. ఇంటికి ఆధారంగా ఉన్న వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం వీధినపడుతుందని, ఆ లోటును భగవంతుడు కూడా తీర్చలేడన్నారు. కుటుంబానికి ఆయన రూ. లక్ష సాయం అందించారు.నటుడు దర్శన్ గురించి రేణుకాస్వామి తండ్రి కాశీనాథయ్య ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో దర్శన్ విడుదల అయ్యాక తన ఇంటికి వస్తే భోజనం పెడతానని, తాము జంగమ సామాజికవర్గం వారమని, ద్వేషం, అసూయ వంటివి ఉండవన్నారు. చట్ట ప్రకారం తమకు న్యాయం కావాలన్నారు. దర్శన్ భార్య విజయలక్ష్మి తన భర్త కోసం పోరాడటంలో తప్పులేదని ఈక్రమంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను కలిసి ఆమె ఏం మాట్లాడారు అనే సంగతి తమకు అనవసరమని ఆయన అన్నారు. జైలులో ఉన్న దర్శన్ ఆరోగ్యం బాగుండాలని త్వరగా విడుదల కావాలని కోరుతూ భార్య విజయలక్ష్మి నవ చండికా హోమం జరిపించారు. -
దర్శన్ పశ్చాత్తాపం.. రేణుకాస్వామి భార్యకు సాయం చేయనున్నాడా..?
చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార జైల్లో ఉన్న ప్రముఖ హీరో దర్శన్‌కు జైలు తిండి సరిపడక ఆరోగ్యం క్షీణిస్తోందని, ఇంటి భోజనం తెప్పించుకోవడానికి తనకు అనుమతి ఇప్పించాలని ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు నిరాకరణ ఎదురుకావడంతో జైల్లో ఆయన ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ఈ క్రమంలో దర్శన్‌లో పశ్చాత్తాపం కనిపిస్తుందని సమాచారం.రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ రెండో ముద్దాయి కాగా, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ మొదటి ముద్దాయి. ఈ కేసుకు సంబంధించిన నిందితులందరూ నెల రోజుల నుంచి కటకటాల వెనుక ఉన్నారు. దర్శన్ సహా 13 మంది నిందితులు పరప్ప అగ్రహార జైలులో ఉండగా, నలుగురు నిందితులు తుమకూరు జైలులో ఉన్నారు.జైల్లో ఉన్న దర్శన్‌లో పశ్చాత్తాపం కనిపిస్తుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. జైలు అధికారులు కూడా ఇదే మాట అంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం దర్శన్ నుంచి వస్తున్న ప్రతి మాటలో కూడా పశ్చాత్తాపం కనిపిస్తుందని అంటున్నారు. రేణుకాస్వామి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు కాడంతో ఇప్పుడు ఆయన మరణం వల్ల కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంది. ఈ విషయం తెలుసుకున్న దర్శన్ కాస్త చలించిపోయినట్లు తెలుస్తోంది.రేణుకాస్వామి కుటుంబ సభ్యులకు సహాయం అందించాలని దర్శన్ పూనుకున్నారట. ఈ విషయాన్ని రేణుకాస్వామి కుటుంబ సభ్యులతో దర్శన్ అనుచరులు చర్చించారట. అందుకు వారు కూడా అంగీకరించినట్లు సమాచారం. గర్భంతో ఉన్న రేణుకాస్వామి భార్యకు సాయం చేయడంతో పాటు ఆయన తండ్రి, తల్లికి విడివిడిగా సాయం చేయాలని దర్శన్ ఆలోచించాడట. ఈ వార్త తన అనుచరుల ద్వారా కన్నడ మీడియాలో చక్కర్లు కొడుతుంది.దర్శన్‌ను పెళ్లికి ఆహ్వానించిన 'కాటేరా' దర్శకుడుదర్శన్ను కలిసేందుకు 'కాటేరా' చిత్ర దర్శకుడు తరుణ్ సుధీర్ ఈరోజు పరప్ప అగ్రహార జైలుకు వెళ్లారు. దర్శన్‌ని కలిసిన అనంతరం తరుణ్ సుధీర్ మీడియాతో ఇలా మాట్లాడారు.. 'దర్శన్ సర్‌కు ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. నన్ను చూడగానే ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయనకు చెప్పాను. దర్శన్ సార్‌కు రెండు పుస్తకాలు ఇచ్చాను. జీవిత పాఠం గురించి తెలిపే పుస్తకంతో పాటు అర్జునుడి గురించి మరొక పుస్తకాన్ని ఆయనకు అందించాను.' అని తరుణ్ సుధీర్ అన్నారు. -
రేణుకాస్వామి కేసులో దర్శన్, పవిత్రగౌడ నుంచి కీలక ఆధారాలు లభ్యం
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. పక్కా ప్రణాళికతో పోలీసులు సాక్ష్యాధారాలు సేకరిస్తూ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్క వ్యక్తిని, వస్తువునీ వదలకుండా విచారణ చేసి, సాక్ష్యంగా మలచుకుంటున్నారు. తాజాగా ఈ హత్య కేసులో నిందితుల వేలిముద్రలకు సంబంధించిన రిపోర్ట్ పోలీసుల చేతికి అందింది.రేణుకాస్వామి హత్య జరిగిన ప్రాంతంతో పాటు మృతదేహాన్ని తరలించిన వాహనంలోని వేలి ముద్రలతో దర్శన్, పవిత్ర గౌడ వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయి. వారిద్దరితో పాటు జైలులో ఉన్న మరో 10 మంది వేలి ముద్రలు కూడా సరిపోలాయి. హత్య జరిగిన చోట లభ్యమైన వేలిముద్రలను హైదరాబాద్, బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కు అధికారులు పంపారు. అయితే, రెండు చోట్ల ఒకే రిపోర్ట్ వచ్చింది. ఇక డీఎన్ఏ రిపోర్ట్ రావాల్సి ఉంది.రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన 17 మందిపై గతంలో పోలీసులు కేసులు ఉన్నాయి. వారిలో కొందరు హత్యలు కూడా చేసినట్లు తేలుతుంది. ఈక్రమంలో కామాక్షిపాళ్య పోలీసులు తాజాగా పీడబ్ల్యూడీ అధికారులకు బ్లూఫ్రింట్ తయారుచేసి ఇవ్వాలని లేఖ రాశారు. కామాక్షిపాళ్యలోని పట్టణగెరె మెకానిక్ షెడ్డు నుంచి రేణుకాస్వామి శవాన్ని ఏ మార్గాన తరలించారు? ఎక్కడ విసిరేసారు?, తర్వాత ఏ మార్గాల్లో ఎవరెవరు సంచరించారనే పూర్తి సమాచారం ఆధారంగా బ్లూ ఫ్రింట్ తయారు చేసి ఇవ్వాలని లేఖ రాశారు. -
దర్శన్ నా కుమారుడితో సమానం.. సుమలత లేఖ వైరల్
ఆటో డ్రైవర్ రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో హీరో దర్శన్ (A2), నటి పవిత్ర (A1) ఉన్నారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు. ఇప్పటికే దర్శన్ అరెస్ట్ విషయంలో చాలామంది నటీనటులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ, రాజకీయ నాయకురాలు, సినీ నటి సుమలత అంబరీష్ స్పందన గురించి చాలామంది ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆమె రియాక్షన్ ఇచ్చారు. దర్శన్‌తో తనకు ఉన్న బంధాన్ని ఆమె వివరించారు.'నేను 44 ఏళ్ల నుంచి సినిమా రంగంలో నటిగా, కళాకారిణిగా జీవిస్తున్నాను. ఐదేళ్లపాటు ఎంపీగా పని చేశా. అనేక రంగాలలో బాధ్యతగా నిర్వర్తించా. అనవసరంగా వ్యాఖ్యలు చేయడం వేస్ట్. నా కుటుంబంతో దర్శన్ కుటుంబానికి మధ్య ఉన్న బంధం మీకు అర్థం కాదు. అతను స్టార్ కాకముందు 25 ఏళ్లుగా నాకు తెలుసు. స్టార్‌డమ్‌కి మించి దర్శన్ నాకు కుటుంబ సభ్యుడు, కొడుకు లాంటివాడు. అంబరీష్‌ని ఎప్పుడూ నాన్నగా పిలిచే ఆయన జీవితంలో నాకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఏ తల్లి తన కొడుకుని ఇలాంటి పరిస్థితిలో చూడడానికి ఇష్టపడదు. నాకు తెలిసిన దర్శన్ ఎప్పుడూ ఇలాంటి నేరం చేయడు. దర్శన్‌లో ప్రేమ, ఉదార హృదయం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే సంకల్పం అతని పాత్రకు సాక్ష్యమిస్తున్నాయి. దర్శన్ అటువంటి నేరం చేసే వ్యక్తి కాదని నేను నమ్ముతున్నాను.' అని సుమలత తన లేఖలో రాశారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున తాను ఇకపై వ్యాఖ్యానించనని పేర్కొన్నారు.దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిని సుమలత తప్పుబట్టారు. అలాంటి వారిని విమర్శిస్తూ సుమలత తన లేఖను ముగించారు. 'దర్శన్ ఇప్పటికీ నిందితుడే.. అతనికి వ్యతిరేకంగా ఏదీ నిరూపించబడలేదు, శిక్షించబడలేదు. దర్శన్‌కు న్యాయమైన విచారణ జరగనివ్వండి. దర్శన్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడకండి. దర్శన్ విషయం వల్ల ఇప్పటికే శాండల్‌వుడ్ స్థంభించిపోయింది.' అని ఆమె రాశారు.18 వరకు దర్శన్‌కు కస్టడీరేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న హీరో దర్శన్, అనుచరులకు కోర్టు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. దర్శన్, నటి పవిత్ర, మరో 15 మంది నిందితులకు కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెస్స్ ద్వారా జడ్జి ముందు హాజరుపరిచారు. ఇందులో నలుగురు నిందితులు తుమకూరు జైల్లో ఉన్నారు. బెయిలు దక్కుతుందని ఆశించిన దర్శన్ గ్యాంగ్‌కి నిరాశ ఎదురైంది. జూలై 18 వరకూ కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు. -
దర్శన్‌కు సపోర్ట్‌గా విజయలక్ష్మి కామెంట్
రేణుకాస్వామి హత్యకేసులో నిందితునిగా ఉన్న సినీ హీరో దర్శన్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. గతంలో 2011లో భార్యపై దాడికి పాల్పడిన కేసులో ఇదే జైలుకు తొలిసారిగా వచ్చి 20 రోజులకు పైగా ఉన్నారు. 13 ఏళ్ల తరువాత రెండోసారి మళ్లీ రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, ఆయన ప్రియురాలు, నటి పవిత్రా గౌడ సమేతంగా పరప్పన జైలులో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా దర్శన్‌ను సతీమణి విజయలక్ష్మి తన కుమారుడితో వెళ్లి కలుసుకున్నారు.దర్శన్, విజయలక్ష్మి మధ్య విభేదాలు ఉన్నాయి. వారిద్దరూ కూడా వేరువేరుగా ఉన్నారని సమాచారం. అయితే, దర్శన్ కష్టాల్లో ఉండటంతో ఆయనకు అండగా నిలబడేందుకు ఆమె సిద్ధం అయింది. ఈ క్రమంలో ఇటీవలే కుమారుడు వినీష్‌తో కలిసి జైలుకు వెళ్లి సుమారు రెండు గంటలపాటు దర్శన్‌తో మాట్లాడారు ఆమె. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ కేసులో దర్శన్‌కు న్యాయం లభిస్తుందనే నమ్మకం ఉందని, అంతవరకూ ఆయనకు అండగా ఉందామని, అభిమానులు ఓపికతో ఉండాలని పోస్ట్ చేశారు. ఇది పరీక్షా సమయమని, సహనం కోల్పోయి మాట్లాడినా, పోస్టులు పెట్టినా దర్శన్‌కు ఇబ్బంది కలుగుతుందన్నారు. అభిమానుల అంతరంగాన్ని మీ తరఫున దర్శన్‌కు వివరించాను. కోర్టులపై నమ్మకం ఉంచి న్యాయ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. -
లైట్ బాయ్ నుంచి మొదలైన దర్శన్ జీవితంలో ఎన్నో వివాదాలు
లైట్ బాయ్‌గా సినీ జీవితం ప్రారంభించి అచెలంచెలుగా ఎదిగి ఛాలెంజింగ్ స్టార్‌గా నిలబడి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న కన్నడ హీరో దర్శన్ నేపథ్యం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎన్నిసార్లు జైలు ముఖం చూసినా ఆయనలో మార్పు రాలేదు. 2011 సెప్టెంబర్ 9న దర్శన్‌పై భార్య విజయలక్ష్మి వేధింపులు, దాడి,హత్యాయత్నం కేసు పెట్టింది. ఈ కేసులో దర్శన్ జైలుకు వెళ్లాడు. తరువాత భార్య రాజీ కావడంతో కేసు వెనక్కు తీసుకోగా జైలు నుంచి బయటకు వచ్చాడు. దర్శన్ జైలుకు వెళ్లి వచ్చాక ఆయన సినిమాలు అఖండ విజయాలు సాధించాయి. వాటిలో సారథి సినిమా మొదటిది. 2018లో సెప్టెంబర్ 24న మైసూరులో దర్శన్ ఎస్యూవీ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో కారులో నటుడు దేవరాజ్, స్నేహితులు ఉన్నారు. 2021లో మైసూరులోని ఒక హోటల్లో వెయిటర్‌పై శారీరకంగా దాడికి దర్శన్ పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసుల విచారణ తర్వాత CCTV విజువల్స్ తొలగించబడ్డాయని కూడా వార్తలు వచ్చాయి. తర్వాత వెయిటర్‌కు రూ. 50,000 నష్టపరిహారం అందించారు. భరత్ అనే కన్నడ చిత్ర నిర్మాతను 2022లో దర్శన్ బెదిరించాడు. ప్రాణభయంతో పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. 2023 జనవరి 20న దర్శన్‌పై వన్యప్రాణుల సంరక్షణా చట్టం కింద కేసు నమోదైంది.2023 అక్టోబర్ 28న పెంపుడు కుక్కను తనపై వదిలి దాడి చేయించాడని దర్శన్ ఇంటికి దగ్గర్లో ఉన్న మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పార్కింగ్ స్థలం విషయంలో తన కేర్‌టేకర్‌తో ఆ మహిళ వాగ్వాదానికి దిగినందున దర్శన్ ఈ పని చేశాడని తెలిసింది. అయితే, ఆ మహిళకు ఆసుపత్రి చికిత్స ఛార్జీలతో పరిహారం చెల్లించాడు.2024 జనవరి 4వ తేదీన బెంగళూరు సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక హోటల్లో లేట్‌నైట్ పార్టీ చేసారని దర్శన్ అండ్ గ్యాంగ్‌పై పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఆయన నిజ జీవితంలో ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. ఆయన గతంలో జైలుకు వెళ్లి వచ్చారు. అయినా దర్శన్‌లో ఎలాంటి మార్పులు రాలేదని నెటిజన్లు అంటున్నారు. తప్పులు మీద తప్పులు చేస్తూ చివరకు ప్రియురాలి కోసం ఒక హత్యకు కారణం అయ్యాడని వారు తెలుపుతున్నారు. పేద కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి.. లైట్ బాయ్‌గా తన ప్రయాణం కొనసాగించిన దర్శన్ ఆపై కన్నడలో స్టార్ హీరోగా ఎదిగాడు. అలాంటి వ్యక్తి ఇంతటి సాహసానికి పాల్పడ్డాడంటే అభిమానులు కూడా నమ్మలేకపోతున్నారు. -
విచారణలో మౌనంగానే దర్శన్.. ఛాన్స్ ఉన్నా తప్పించుకోని రేణుకాస్వామి
కన్నడ ప్రముఖ నటుడు దర్శన్ ఆయన అనుచరులు రేణుకాస్వామి అనే వ్యక్తిని హత్య చేశారనే కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రియురాలు పవిత్రగౌడ కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు దర్శన్ తనకు ఏమీ తెలీదని చెప్పడం లేదా మౌనంగా ఉండిపోతున్నాడని తెలిసింది. ఈ కేసులో అరైస్టెన దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇతర నిందితులు చాలా ప్రశ్నలకు నేరుగా సమాధానాలు ఇస్తుండగా దర్శన్ మాత్రం చెప్పిందే చెబుతున్నట్లు సమాచారం. అయితే రేణుకాస్వామిని స్కెచ్ వేసి హత్య చేయలేదని, బెదిరించి కొట్టి భయపెట్టి వదిలేయాలనుకున్నామని, దెబ్బలు తట్టుకోలేని రేణుకాస్వామి మృతి చెందినట్లు నిందితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా రాత్రి రేణుకాస్వామి కేసుకు సంబంధించి పోలీసులు చిత్రదుర్గలో స్పాట్ మహజర్ నిర్వహించారు. పగటి సమయంలో మీడియా, జనాల వల్ల పని కాదని భావించిన పోలీసులు అర్థరాత్రి చిత్రదుర్గలో సీఐ సంజీవ్ గౌడ... నిందితుడు రఘును తీసుకువచ్చి రేణుకాస్వామిని కిడ్నాప్ చేసిన స్థలం, సంఘటనకు సంబంధం ఉన్న ఇతర చోట్ల మహజర్ చేశారు. రఘు దర్శన్ అభిమానుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. రేణుకాస్వామిని గుర్తించి కిడ్నాప్ చేయడంలో రఘు కీలకంగా వ్యవహరించారు.నగదు సీజ్రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ పేరు బయటకు రాకుండా కుదుర్చుకున్న డీల్ ప్రకారం చేతులు మారిన రూ.30 లక్షల నగదు పోలీసులు సీజ్ చేసినట్టు సమాచారం. దర్శన్ ఇచ్చిన రూ.30 లక్షలు దర్శన్‌కు సంబంధించిన దగ్గరి వ్యక్తి ఇంట్లో ఉన్నట్టు తెలుసుకున్న పోలీసులు ఇంటిపై రైడ్ చేసి నగదు సీజ్ చేశారు.అవకాశం దొరికినా తప్పించుకోని రేణుకాస్వామిరేణుకాస్వామిని కిడ్నాప్ చేసి చిత్రదుర్గ నుంచి బెంగళూరు తీసుకువచ్చే క్రమంలో మార్గం మధ్యలో అనేకసార్లు తప్పించుకునే అవకాశం లభించినా తప్పించుకోలేదని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ఏ8గా ఉన్న నిందితుడు రవి పోలీసులకు లొంగిపోయాడు. రవి ఇచ్చిన సమాచారాన్ని పోలీసులు మీడియాకు వివరించారు. నిందితుడు రవి క్యాబ్ డ్రైవర్. టొయోటా ఈటీఎస్ కారు అద్దెకు నడుపుతుంటాడు. ఈక్రమంలో రవి స్నేహితుడు జగ్గు కాల్ చేసి బెంగళూరుకు వెళ్లాలని కోరాడు. చిత్రదుర్గలో జగ్గు, రఘు, అను, రేణుకాస్వామి కారు ఎక్కారు. కారులో బెంగళూరు వస్తుండగానే ప్రయాణంలో పవిత్రగౌడకు పంపించిన మెసేజ్‌లపై జగ్గు, రఘు ప్రశ్నించారు. అయితే మెసేజ్‌లు పంపడం తనకు హాబీ అని రేణుకాస్వామి చెప్పుకున్నాడు. వారంతా మార్గం మధ్యలో తుమకూరులో టిఫిన్ చేయగా రేణుకాస్వామే బిల్ చెల్లించాడు. బెంగళూరు వచ్చేలోపు పలుసార్లు కారు నిలిపినా రేణుకాస్వామి తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. కారు బెంగళూరు కామాక్షిపాళ్యలోని షెడ్ వద్దకు చేరుకోగానే అక్కడ 30 మంది సిద్ధంగా ఉన్నారు. వారంతా రేణుకాస్వామిని చూసి ఈ బాడీని కొట్టడానికి ఇంతమంది అవసరమా అని నవ్వుకుని కొందరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రేణుకాస్వామిని రఘు లోపలకు తీసికెళ్లగా అను, రవి, జగ్గు చాలాసేపు బయటే వేచి ఉన్నారు. కొన్ని గంటల తరువాత బయటకు వచ్చిన రఘు రేణుకాస్వామి హత్య జరిగిపోయింది, అప్రూవర్‌గా మారతారా? అంటూ ప్రశ్నించాడు. రవి అందుకు నిరాకరించడంతో కారు అద్దె రూ.4వేలు ఇచ్చి పంపించేశాడు. రవి, అను, జగ్గు ముగ్గురూ చిత్రదుర్గకు తిరిగి వచ్చేశారు. అనంతరం హత్య వెలుగు చూసి విషయం పెద్దది కావడంతో భయపడ్డ రవి పోలీసులకు లొంగిపోయాడు. -
‘బాస్’ కోసం ఫ్యాన్స్ మధ్య రగడ
సాక్షి, బెంగళూరు: కరోనా లాక్డౌన్ సమయంలో బాస్ అనే పదంపై దర్శకుడు పవన్ ఒడెయర్ చేసిన ట్వీట్ సినీ అభిమానుల మధ్య వాడీవేడి చర్చను రేకెత్తించింది. సినిమా చిత్రీకరణ సమయంలో సామాజీక దూరంను పాటిస్తాం, లవ్యూ బంగారం, సోదర, బాస్ అని ఒడెయర్ చేసిన ట్విట్‌కు హీరో యశ్ అభిమానులు అభినందనలు చెబుతుండగా, హీరో దర్శన్ అభిమానులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ సినిమా రంగంలో ‘బాస్’ అనే పదం ఒక దర్శన్‌కు మాత్రమే దక్కుతుందని అయన ఫ్యాన్స్ వాదిస్తున్నారు. యశ్‌ను బాస్ అనడం జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో దర్శన్ అభిమానులు పవన్ ఒడెయర్పై ట్విట్టర్లో మండిపడుతున్నారు. ‘బాస్’ కోసం ఆది నుంచి గొడవలు నిజానికి యశ్–దర్శన్ మంచి స్నేహితులు. అయితే బాస్ అనే పదం కోసం వారి అభిమానుల మధ్య ట్విటర్లో మాటల యుద్ధం జరుగుతున్నా హీరోలు స్పందించలేదు. బాస్ అనే పదాన్ని ఎవరైనా ఉపయోగించవచ్చు అని యశ్ అభిమానులు వాదనకు దిగుతున్నారు. గతంలో శాండల్‌వుడ్‌లో ఎవరు బాస్ అనే విషయంపై పెద్ద వివాదం జరిగింది. హీరో శివరాజ్‌కుమార్‌కు చందనవన బాస్ అని బిరుదునివ్వడంతో గొడవకు తెరదించారు. మరో పక్క యశ్ ఇటీవల కొనుగోలు చేసిన కారుకు బాస్ అని అక్షరాలు వచ్చేలా 8055 నంబర్‌ను రిజిస్టర్ చేయించారు. రగడెందుకు: పవన్ ఒడెయర్ సినిమా రంగంలో సామాన్యంగా అందరినీ బాస్ పదంతో సంబోధిస్తారు. యశ్‌ను కలిసిన సందర్భంగా బాస్ అని అంటూ ట్వీట్ చేయటంపై ఇంత రాద్ధాంతం అవసరంలేదని దర్శకుడు పవన్ ఒడెయర్ అన్నారు. దర్శకులు, నిర్మాతలను తను బాస్ అని పిలుస్తానంటూ క్లారిటీ ఇచ్చారు. -
'పాత బాయ్‌ఫ్రెండ్‌తో రాత్రంతా.. అందుకే'
పెరంబూరు : బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోతో పాపులర్ అయిన నటుడు దర్శన్, నటి సనంశెట్టితో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. అప్పుడే వారిద్దరి మధ్య ప్రేమాయణం సాగింది. కాగా చిత్ర షూటింగ్ మధ్యలోనే దర్శన్ బిగ్‌బాస్ షోలో పాల్గొన్నాడు. అయితే ఆ షో నుంచి బయటకు వచ్చిన తరువాత ఏమైందో తెలియదుకానీ సనంశెట్టి.. దర్శన్‌పై శుక్రవారం చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దర్శిన్ తాను ప్రేమించకున్నామని... తమకు 2019 మేలో వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందని, ఇరు కుటుంబాల సమ్మతితో జూన్‌లో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు తెలిపింది. అయితే దర్శన్‌కు బిగ్‌బాస్ గేమ్‌షోలో పాల్గొనే అవకాశం రావడంతో పెళ్లిని వాయిదా వేసుకుందామన్నాడని, అందుకు తానూ అంగీకరించినట్లు చెప్పింది. బిగ్‌బాస్ కారణంగా దర్శన్‌కు పేరు వచ్చిందంటే అందుకు కారణం తానేనని పేర్కొంది. దర్శన్ కోసం రూ.15 లక్షల వరకూ ఖర్చు చేశానని, అయితే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత దర్శన్ మారిపోయాడని, పెళ్లిని ఆపేశాడని ఆరోపించింది. ఈ విషయమై దర్శన్ తల్లిదండ్రులను సంప్రదిస్తే ‘అప్పుడు దర్శన్‌కు నీపై ప్రేమ కలిగిందని, ఇప్పుడు అది పోయిందని’ అంటున్నారని వాపోయింది. దర్శన్ తనకు నమ్మకద్రోహం చేశాడని సనంశెట్టి ఆరోపించింది. కాగా దర్శన్ ...సనంశెట్టి ఆరోపణలపై స్పందించాడు. శనివారం అతను మీడియా ముందుకు వచ్చాడు. సనంశెట్టి ఇటీవల తన పాత బాయ్‌ఫ్రెండ్‌తో ఒక రాత్రి అంతా గడిపిందంటూ పలు ఆరోపణలను చేశాడు. అలాంటి ఆమెను తానెలా పెళ్లి చేసుకుంటానని వ్యాఖ్యలు చేశాడు. సనంశెట్టిని వివాహం చేసుకునే ప్రసక్తే లేదని దర్శన్ తేల్చి చెప్పాడు. -
నా ఓపికను పరీక్షించొద్దు : హీరో
బెంగళూరు : ‘నేను, నా స్నేహితులు చేతికి వేసుకునేది కంకణం. గాజులు కాదు’ అని బహుభాషా నటుడు కిచ్చ సుదీప్ ప్రకటించారు.తనపైన కుట్రలు చేస్తున్నవారు ఇంక కొన్నిరోజులు మాత్రమే ప్రశాంతంగా నిద్రపోతారని, మరోసారి ట్విట్టర్లో గొడవల జోలికి రావద్దని ప్రత్యర్థులను హెచ్చరించారు. ప్రస్తుతం శ్యాండల్‌వుడ్‌లో జరుగుతున్న స్టార్‌వార్ తీవ్రస్థాయికి చేరడంతో సుదీప్, మరో హీరో దర్శన్ అభిమానుల మధ్య జరుగుతున్న సోషల్ మీడియా యుద్ధం ఆ తారలనూ తాకింది. సుదీప్ హీరోగా తాజాగా విడుదలైన పైల్వాన్ సినిమాను వీరేష్ అనే యువకుడు ఇంటర్నెట్లో పెట్టడంతో పాటు తాను హీరో దర్శన్ అభిమానిని అని ప్రకటించుకున్నాడు. మా శ్రమను వృథా చేస్తున్నారు తన సినిమా నెట్లోకి రావడంతో సుదీప్ ట్విట్టర్లో భగ్గుమన్నారు. ‘నాకు సినిమాలు వదిలేస్తే మరో పని ఏమీ లేదు. అందుకే మౌనంగా ఉన్నాను. నా మౌనానికి పరీక్ష పెడుతున్నారు. ఇంత మంచి సినిమాను సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా తననే కాదని పైల్వాన్ సినిమా కుటుంబసభ్యులు పడిన కష్టం మొత్తం వృథా చేస్తున్నారు. దీని వెనకల ఎవరి కుట్ర ఉందో నాకు తెలుసు. ప్రస్తుతం వారు ప్రశాంతంగా నిద్రపోతుండవచ్చు. కానీ ముందురోజుల్లో నిద్రపోనివ్వను’ అని హెచ్చరించారు. పైల్వాన్ వీడియోలను పెట్టి సినిమా కలెక్షన్లను తగ్గించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక ఇరు హీరోల అభిమానులు పరస్పరం సోషల్ మీడియాలో విమర్శలకు దిగుతున్నారు. అభిమానులకు మద్దతుగా హీరోలు కూడా యుద్ధంలోకి దిగితే శాండల్‌వుడ్‌కు సెగలు తప్పవు. -
2468మందికి మాత్రమే వీఐపీ దర్శనం
తిరుమల : వైకుంఠ ఏకాదశి పర్వదినం, నూతన సంవత్సరం ఒకేసారి రావడంతో... తిరుమలకు వీఐపీలు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచే స్వామివారిని దర్శించుకునేందుకు... ఇరు రాష్ట్ర రాజకీయవేత్తలు, ప్రముఖలు పోటీపడ్డారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్వీ రమణ, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టీస్ రోహిణి, వైఎస్ఆర్ సీపీ నేతలు బుట్టా రేణుక, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, శ్రీనివాసులు, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ సీఎం రమేష్, డీకే అరుణ, మహేందర్ రెడ్డి, ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తదితరులు వెంకన్నను దర్శించుకున్నారు. 2468మందికి మాత్రమే టీటీడీ వీఐపీ దర్శనం కల్పించింది. అనంతరం రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.