దర్శన్‌కు సపోర్ట్‌గా విజయలక్ష్మి కామెంట్‌ | Vijayalakshmi Urged The Actor Fans To Keep Supporting Her Husband Darshan In Renukaswamy Case | Sakshi
Sakshi News home page

దర్శన్‌కు సపోర్ట్‌గా విజయలక్ష్మి కామెంట్‌

Published Fri, Jun 28 2024 4:40 PM | Last Updated on Fri, Jun 28 2024 5:55 PM

Vijayalakshmi Support To Darshan

రేణుకాస్వామి హత్యకేసులో నిందితునిగా ఉన్న సినీ హీరో దర్శన్‌ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. గతంలో 2011లో భార్యపై దాడికి పాల్పడిన కేసులో ఇదే జైలుకు తొలిసారిగా వచ్చి 20 రోజులకు పైగా ఉన్నారు. 13 ఏళ్ల తరువాత రెండోసారి మళ్లీ రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్‌, ఆయన ప్రియురాలు, నటి పవిత్రా గౌడ సమేతంగా పరప్పన జైలులో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా దర్శన్‌ను సతీమణి విజయలక్ష్మి తన కుమారుడితో వెళ్లి కలుసుకున్నారు.

దర్శన్‌, విజయలక్ష్మి మధ్య విభేదాలు ఉన్నాయి. వారిద్దరూ కూడా వేరువేరుగా ఉన్నారని సమాచారం. అయితే, దర్శన్‌ కష్టాల్లో ఉండటంతో ఆయనకు అండగా నిలబడేందుకు ఆమె సిద్ధం అయింది.  ఈ క్రమంలో ఇటీవలే కుమారుడు వినీష్‌తో కలిసి జైలుకు వెళ్లి సుమారు రెండు గంటలపాటు దర్శన్‌తో మాట్లాడారు ఆమె. ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. 

ఈ కేసులో దర్శన్‌కు న్యాయం లభిస్తుందనే నమ్మకం ఉందని, అంతవరకూ ఆయనకు అండగా ఉందామని, అభిమానులు ఓపికతో ఉండాలని పోస్ట్‌ చేశారు. ఇది పరీక్షా సమయమని, సహనం కోల్పోయి మాట్లాడినా, పోస్టులు పెట్టినా దర్శన్‌కు ఇబ్బంది కలుగుతుందన్నారు. అభిమానుల అంతరంగాన్ని మీ తరఫున దర్శన్‌కు వివరించాను. కోర్టులపై నమ్మకం ఉంచి న్యాయ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement