darsan
-
కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరు
రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ మంజూరు అయింది. ఆయనతో పాటు ఏడుగురికి ఈ కేసులో బెయిల్ ఇస్తున్నట్లు న్యాయస్థానం వెళ్లడించింది. దర్శన్ ఇప్పటికే తన చికిత్స కోసం బెయిల్‌పై బయట ఉన్నాడు. నేటితో ఆయన బెయిల్ గడవు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో గడవుతో నిమిత్తం లేకుండా బెయిల్ మంజూరు కావడంతో దర్శన్ అభిమానులు ఆనందిస్తున్నారు.రేణుకాస్వామి హత్య కేసులో సుమారు ఆరు నెలలుగా పరప్పన జైలులో హీరో దర్శన్ ఉన్నారు. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దర్శన్ లాయర్లు పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. కానీ, ఫలితం లేదు. అయితే, మరోసారి బెయిల్ కోసం ఆయన ధరఖాస్తు చేసుకున్నారు. విశ్వజీత్ శెట్టితో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు కూడా బెయిల్ లభించినట్లు తెలుస్తోంది.కర్ణాటకలో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దర్శన్ ప్రియురాలు పవిత్రకు అసభ్యతతో కూడిన మెసేజ్‌లు రేణుకాస్వామిని చేస్తున్నాడనే కారణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడికి కరెంట్ షాకులు కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. అయితే, వారికి ఇప్పుడు బెయిల్ రావడం సంచలనంగా మారింది. -
నేను ఉన్నంత కాలం వాడు నా కుమారుడే: సుమలత
కన్నడ హీరో దర్శన్ గురించి సినీ నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన రాజకీయ మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో దర్శన్ గురించి పలు కీలవ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి తాను కృషి చేస్తానని, జనవరి తర్వాత సంపూర్ణంగా రాజకీయాల్లో పాల్గొంటానని మండ్య మాజీ ఎంపీ సుమలత అంబరీష్ పేర్కొన్నారు.గత ఎన్నికల్లో ప్రధాని మోదీ మాటకు విలువనిచ్చి మండ్య లోక్‌సభ నియోజకవర్గానికి దూరంగా ఉన్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం కాలి నొప్పి సమస్యకు చికిత్స పొంది కొంత విరామం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. బీజేపీ తనను నిర్లక్ష్యం చేస్తుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె పేర్కొన్నారు. మండ్యలో బీజేపీని బలోపేతం చేస్తానని పార్టీ హైకమాండ్‌కు తాను చెప్పినట్లు తెలిపారు. నటుడు దర్శన్ గురించి సుమలత ఇలా మాట్లాడారు. 'గతంలో దర్శన్‌తో తన సంబంధం ఎలా ఉందో ఇప్పటికీ అదే విధంగా ఉంది. దర్శన్ సతీమణి నాతో రోజూ టచ్‌లో ఉన్నారు. దర్శన్ ఆరోగ్యం ప్రస్తుతం అంత మెరుగ్గాలేదు. ముందు అతని ఆరోగ్యం మెరుగు పడాలి. ఇప్పటికే వాడి ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. తనపై వచ్చిన అన్ని ఆరోపణల నుంచి బయట పడతాడనే నమ్మకం ఉంది. నేను జీవించి ఉన్నంత వరకు దర్శన్ నా కుమారుడి లాంటివాడే, అతనికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. రేణుకస్వామి హత్య కేసులో నిజం బయటపడి దర్శన్ నిరపరాధిగా నిలవాలని దేవుడిని ఆశిస్తున్నా' అని ఆమె చెప్పారు. వైద్యచికిత్సల కోసం ఆరు వారాల పాటు దర్శన్‌కు కోర్టు బెయిల్ ఇచ్చింది. -
ఆసుపత్రిలో చేరిన నటుడు దర్శన్
రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆరోగ్యం కొద్దిరోజులుగా మెరుగ్గాలేదు. దీంతో తనకు అత్యవసర చికిత్స అవసరం అంటూ కోర్టుకు వెళ్లడంతో ఆయనకు బెయిల్ మంజూరు అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన సుమారు 140 రోజుల నుంచి జైలులో ఉన్నారు. దర్శన్‌కు 6 వారాలు పాటు బెయిలు అమల్లో ఉంటుంది.తీవ్రమైన వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న దర్శన్ తాజాగా ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఆయన లాయర్ నాగేశ్ తెలిపారు. దర్శన్‌కు వెన్నులో ఎల్–5, ఎస్–1 డిస్క్‌లలో సమస్య ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మైసూరులో ఒక ప్రముఖ ఆసుపత్రిలో దర్శన్ చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యంపై డాక్టర్ నవీన్ అప్పాజీ గౌడ ఇలా చెప్పారు.చికిత్స చేస్తున్న డాక్టర్ నవీన్ అప్పాజీ గౌడ్ శుక్రవారం మాట్లాడుతూ.. దర్శన్ కాలిలో శక్తి కోల్పోయినట్లు ఉందని తెలిపారు. ఆయన వెన్ను భాగంలో తీవ్రమైన నొప్పి ఉండటం వల్ల కాలిలో కూడా ఆ ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. దర్శన్‌కు ఇప్పటికే ప్రాథమిక చికిత్సలు ప్రారంభించామని తెలిపారు. పూర్తి రిపోర్ట్లు వచ్చిన తర్వాత అవసరం అయితే ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చని చెప్పారు. బళ్లారి కేంద్ర కారాగారంలోని వైద్యులు పంపిన మెడికల్ రిపోర్టులను కూడా తాము పరిశీలించామని పేర్కొన్నారు. -
కన్నడ నటుడు దర్శన్‌కు సర్జరీ
రేణుకాస్వామి హత్య కేసులో రెండవ నిందితుడు, ప్రముఖ నటుడు దర్శన్ ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని జైలు అధికారులకు హైకోర్టు ఆదేశించింది. బెయిల్ కోరుతూ దర్శన్ సమర్పించిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్ శెట్టి విచారించారు. పిటిషన్ గురించి అభ్యంతరాలుంటే తెలపాలని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ ప్రసన్నకుమార్‌కు సూచించారు. బళ్లారి జైలులో దర్శన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారు. ఆపరేషన్ అవసరముందని వైద్యులు తెలిపారు. అందుచేత బెయిల్ ఇవ్వాలని దర్శన్ వకీలు కోరారు. నేర విచారణలో అనేక లోపాలు ఉన్నాయని, అన్ని ఆధారాలను పోలీసులే సృష్టించారంటూ పలు ఆరోపణలు వినిపించారు. తదుపరి విచారణ అవసరం కూడా లేనట్లుందని పేర్కొన్నారు. దీంతో వైద్య నివేదిక ఇవ్వాలని జడ్జి ఆదేశించి కేసును వాయిదా వేశారు.100 రోజులు దాటిందిదర్శన్, పవిత్రలు జూన్ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. వారిద్దరూ జైలుకు వెళ్లి 100 రోజులు దాటింది. ఇటీవల సిట్ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్జైల్లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు. ఈ క్రమంలో మరోసారి వారు బెయిల్ పిటీషన వేశారు. -
దర్శన్,పవిత్రల బెయిల్‌పై తీర్పు వెల్లడి
కన్నడ హీరో దర్శన్ ఆశలు నిరాశగానే మిగిలిపోయాయి. ఆయనతో పాటు వేలాది మంది అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూసిన బెయిలు దక్కలేదు. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, నటి పవిత్రగౌడ బెయిల్ పిటిషన్‌ను నగర 57 వ సీసీహెచ్ కోర్టు కొట్టివేసింది. బెయిల్ వస్తుందనే ఆశతో ఉన్న ఇరువురు తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారు. బెయిల్ పిటిషన్ మీద ప్రభుత్వ వకీలు ప్రసన్నకుమార్, దర్శన్ న్యాయవాది సీవీ.నాగేశ్ సుదీర్ఘ వాదనలు వినిపించారు. బెయిలు ఇవ్వరాదని ప్రభుత్వ వకీలు, ఇవ్వాలని దర్శన్ ప్లీడరు వాదించారు. గత కొన్ని రోజులుగా బెయిలు అర్జీపై వాదనలు సాగుతున్నాయి. జడ్జి జైశంకర్ తీర్పు వెలువరిస్తూ బెయిలు ఇవ్వడం లేదని ప్రకటించారు. కానీ, ఇదే కేసులో రవిశంకర్, దీపక్ అనే ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.జూన్ 10 నుంచి జైలువాసందర్శన్, పవిత్రలు జూన్ 10 నుంచి అరెస్టయి కారాగారంలో ఉన్నారు. ఇటీవల సిట్ చార్జిషీట్లు దాఖలు చేయడంతో బెయిలు వస్తుందని ఆశించారు. దర్శన్ భార్య విజయలక్ష్మి, సన్నిహితులు బెయిలు కోసం ప్రముఖ లాయర్లతో ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో దర్శన్ బళ్లారి, పవిత్ర బెంగళూరు సెంట్రల్జైల్లో ఇంకొన్ని రోజులు ఉండక తప్పదు. -
రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది: దర్శన్
కన్నడలో సంచలనం సృష్టించిన రేణుకాస్వామి (29) హత్యకేసులో ప్రధాన నిందితులుగా నటుడు దర్శన్, పవిత్రగౌడ సుమారు ఐదు నెలలుగా జైలులో ఉన్న విషయం తెలిసిందే. రేణుకాస్వామి హత్యకు సంబంధించి దర్శన్ ఏ2, నటి, ఆయన ప్రియురాలు పవిత్రగౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు. అయితే, గత కొద్దిరోజులుగా జైల్లో దర్శన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు కన్నడ మీడియాలో వార్తలు వస్తున్నాయి.బళ్లారి జైలులో దర్శన్ పలు ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా సరైన నిద్రలేకుండా ఆయన ఉన్నారట. ఈ క్రమంలో తనను రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోందని జైలు అధికారులతో దర్శన్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. నిద్రపోతున్న సమయంలో రేణుకాస్వామి ఆత్మ కలలోకి వచ్చి బయపెడుతుందని ఆయన చెప్పుకొస్తున్నారట. ఇక్కడ తాను ఒంటరిగా ఉండలేకపోతున్నట్లు అధికారులతో చెబుతూ.. తనను బెంగుళూరు జైలుకు తరలించాలని వేడుకుంటున్నారని సమాచారం. అర్ధరాత్రి సమయంలో నిద్రలోనే దర్శన్ కేకలు పెడుతున్నట్లు తోటి ఖైదీలు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ విషయం గురించి జైలు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.ఇదీ చదవండి: పరారీలో హర్షసాయి.. లుక్అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులుదర్శన్ బెయిల్పిటిషన్ విచారణ తాజాగా మళ్లీ వాయిదాపడింది. బెంగళూరు నగర 57వ సీసీహెచ్ కోర్టులో బెయిల్‌పై శుక్రవారం విచారణ జరిగింది. దర్శన్ తరఫున న్యాయవాది నాగేశ్ వాదనలు వినిపించారు. అయితే, విచారణను శనివారం నాటికి వాయిదా వేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. నేడు సాయింత్రం విచారణ జరిగే అవకాశం ఉంది. -
ఈ చెత్త పనేంటి దర్శన్.. ఇంకా మార్పు రాకుంటే ఎలా..?
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నిందితుడుగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. మీడియా పట్ల అసభ్య రీతిలో ప్రవర్తించాడు. బళ్లారి సెంట్రల్ జైల్లో ఉన్న దర్శన్‌ను కలుసుకునేందుకే ఆయన కుటుంబ సభ్యులు తాజాగా వచ్చారు. భార్య విజయలక్ష్మి, సోదరుడు దినకర్, లాయర్ సునీల్ జైలుకు చేరుకొని ములాఖత్ అయ్యారు, అర్ధగంటకు పైగా విడివిడిగా మాట్లాడారు. ఈ క్రమంలో దర్శన్‌కు డ్రైఫ్రూడ్స్, బిస్కెట్లు, దేవుని ప్రసాదం ఆమె అందజేశారు.జైలు ఆవరణలో లాయర్‌తో మాట్లాడేందుకు దర్శన్ వెళ్తున్న సమయంలో అక్కడే ఉన్న కన్నడ మీడియా ఆయన్ను కవరేజ్ చేసింది. అదేదో నేరం అయినట్లుగా మీడియా సిబ్బందికి మిడిల్ ఫింగర్‌ను చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సుమారు నాలుగు నెలలుగా జైల్లో ఉన్నప్పటికీ దర్శన్‌కు ఏమాత్రం అహం తగ్గలేదంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదో గొప్పగా సాధించి జైలుకు ఏమైనా పోయావా..? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరైతే దర్శన్ ట్రాక్ రికార్డ్ అంతా వివాదస్పందంగానే ఉంటుందని చెబుతున్నారు. తన భార్యతో గొడవపడి గతంలో కూడా జైలుకెళ్లాడు.. ఆపై ఓ రెస్టారెంట్లో దాడికి పాల్పడి పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాడు.. తన మేనేజర్ మిస్సింగ్ కేసులో దర్శన్ హస్తం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఇలా ఆయన చుట్టూ వివాదాలే ఉన్నాయంటూ కొందరు గుర్తుచేస్తున్నారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఇలాంటి అసభ్య సంజ్ఞలే చేస్తారంటూ పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ, రాధిక శరత్‌కుమార్ సెల్ఫీ.. ఎక్కడో తెలుసా..?ప్రియురాలు పవిత్ర గౌడకు అసభ్యకరమైన మెసేజ్‌లతో ఇబ్బందిపెడుతున్నాడని అభిమాని రేణుకాస్వామిని దర్శన్ చంపించారని ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అనంతరం 3,991 పేజీలతో ఛార్జిషీట్ రెడీ చేసి కోర్టుకు అందించారు. రేణుకాస్వామిని దర్శన్ కాలితో తన్నాడమే కాకుండా పవిత్ర గౌడకు చెప్పులు ఇచ్చి కొట్టిపించాడని ఛార్జిషీట్లో పోలీసులు పేర్కొన్నారు. Darshan can be seen showing Middle finger to media. .Media atleast stop the witch hunt and leave him alone. Let the law take it's course pic.twitter.com/XaXgRSJgxV— 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) September 12, 2024 -
ఆగిపోయిన దర్శన్ సినిమాలు.. సంజయ్ దత్ మాదిరి జైలు నుంచి రాగలడా..?
రేణకాస్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ A2 గా ఉన్నారు. దీంతో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో గత 30 రోజులుగా దర్శన్ ఉండటం వల్ల తను నటిస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోయింది. దాదాపు పూర్తి కావచ్చిన డెవిల్ సినిమా షూటింగ్ ఇప్పుడు అర్దాంతరంగ ఆగిపోయింది. అయితే, దర్శన్ జైల్లో ఉండగానే ‘డెవిల్’ సినిమా షూటింగ్ లో పాల్గొనవచ్చా అనే చర్చ కన్నడ చిత్రసీమలో జరుగుతోంది. అందుకు ఉదాహరణగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఉదంతాన్ని తెరమీదకు తీసుకొస్తున్నారు.గతంలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జైలులో శిక్ష అనుభవిస్తూనే సినిమా షూటింగ్లో కూడా పాల్గొన్నాడు. దాన్ని ఉదాహరణగా పెట్టుకుని దర్శన్ కూడా ‘డెవిల్’ సినిమాను పూర్తి చేయగలడా? అని ఆయన అభిమానులు చర్చిస్తున్నారు. ‘కాటేరా’ సినిమా తర్వాత దర్శన్ ‘డెవిల్’ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మిలన్ ప్రకాష్, దర్శన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో 'డెవిల్'పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు 'డెవిల్' సినిమా షూటింగ్‌ను ఆపేయాల్సి వచ్చింది. ప్రస్తుతం నిందితుడి స్థానంలో ఉన్నప్పటికీ దర్శన్ జైలులోనే ఉండాల్సి రావడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది.ముంబై పేలుళ్ల కేసులో సంజయ్ దత్‌కు కూడా ఐదేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే సంజయ్ దత్ జైలులో ఉండగానే కోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొంది సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. 2013లో పెరోల్ పొంది ‘జంజీర్’ సినిమాతో పాటు పోలీస్ గిరి చిత్రాల్లో నటించారు. జైలులో శిక్ష అనుభవిస్తూనే ఈ రెండు సినిమాల పనులను ఆయన పూర్తి చేశారు.ఇప్పుడు దీన్నే ఉదాహరణగా తీసుకుని దర్శన్ ఫ్యాన్స్ కూడా ‘డెవిల్’ సినిమా తీస్తారా..? అని ఎదురు చూస్తున్నారు. దర్శన్ కూడా పెరోల్ పొంది జైలు నుంచి బయటకు వచ్చి సినిమా షూటింగ్లో పాల్గొనవచ్చని అభిప్రాయ పడుతున్నారు. అయితే, ఇది ఇప్పట్లో సాధ్యం కాదని న్యాయవాదులు అంటున్నారు.దర్శన్ ఇప్పటికీ నిందితుడుగానే ఉన్నారని వారు తెలుపుతున్నారు. పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కోర్టులో వాదనలు జరగాలి. ఆ తర్వాత దర్శన్ నేరం చేసినట్లు దోషిగా తేలితే శిక్షను న్యాయమూర్తి ప్రకటిస్తారు. ఆ తర్వాతే పెరోల్‌పై బయటకు వచ్చి షూటింగ్లో పాల్గొనవచ్చని న్యాయ నిపుణులు అంటున్నారు. అదికూడా అర్దాంతరంగా ఆగిపోయిన సినిమాల్లో మాత్రమే నటించే ఛాన్స్ ఉంటుందని వారు తెలిపారు. చార్జిషీట్ సమర్పించే వరకు అంతా వేచి చూడాల్సిందేనని లాయర్లు తెలుపుతున్నారు. -
రేణుకాస్వామి కేసులో దర్శన్, పవిత్రగౌడ నుంచి కీలక ఆధారాలు లభ్యం
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్న విధానం ఆశ్చర్యం కలిగిస్తోంది. పక్కా ప్రణాళికతో పోలీసులు సాక్ష్యాధారాలు సేకరిస్తూ కేసుతో సంబంధం ఉన్న ఏ ఒక్క వ్యక్తిని, వస్తువునీ వదలకుండా విచారణ చేసి, సాక్ష్యంగా మలచుకుంటున్నారు. తాజాగా ఈ హత్య కేసులో నిందితుల వేలిముద్రలకు సంబంధించిన రిపోర్ట్ పోలీసుల చేతికి అందింది.రేణుకాస్వామి హత్య జరిగిన ప్రాంతంతో పాటు మృతదేహాన్ని తరలించిన వాహనంలోని వేలి ముద్రలతో దర్శన్, పవిత్ర గౌడ వేలిముద్రలు మ్యాచ్ అయ్యాయి. వారిద్దరితో పాటు జైలులో ఉన్న మరో 10 మంది వేలి ముద్రలు కూడా సరిపోలాయి. హత్య జరిగిన చోట లభ్యమైన వేలిముద్రలను హైదరాబాద్, బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్స్‌కు అధికారులు పంపారు. అయితే, రెండు చోట్ల ఒకే రిపోర్ట్ వచ్చింది. ఇక డీఎన్ఏ రిపోర్ట్ రావాల్సి ఉంది.రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన 17 మందిపై గతంలో పోలీసులు కేసులు ఉన్నాయి. వారిలో కొందరు హత్యలు కూడా చేసినట్లు తేలుతుంది. ఈక్రమంలో కామాక్షిపాళ్య పోలీసులు తాజాగా పీడబ్ల్యూడీ అధికారులకు బ్లూఫ్రింట్ తయారుచేసి ఇవ్వాలని లేఖ రాశారు. కామాక్షిపాళ్యలోని పట్టణగెరె మెకానిక్ షెడ్డు నుంచి రేణుకాస్వామి శవాన్ని ఏ మార్గాన తరలించారు? ఎక్కడ విసిరేసారు?, తర్వాత ఏ మార్గాల్లో ఎవరెవరు సంచరించారనే పూర్తి సమాచారం ఆధారంగా బ్లూ ఫ్రింట్ తయారు చేసి ఇవ్వాలని లేఖ రాశారు. -
దర్శన్ నా కుమారుడితో సమానం.. సుమలత లేఖ వైరల్
ఆటో డ్రైవర్ రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో హీరో దర్శన్ (A2), నటి పవిత్ర (A1) ఉన్నారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు. ఇప్పటికే దర్శన్ అరెస్ట్ విషయంలో చాలామంది నటీనటులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ, రాజకీయ నాయకురాలు, సినీ నటి సుమలత అంబరీష్ స్పందన గురించి చాలామంది ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆమె రియాక్షన్ ఇచ్చారు. దర్శన్‌తో తనకు ఉన్న బంధాన్ని ఆమె వివరించారు.'నేను 44 ఏళ్ల నుంచి సినిమా రంగంలో నటిగా, కళాకారిణిగా జీవిస్తున్నాను. ఐదేళ్లపాటు ఎంపీగా పని చేశా. అనేక రంగాలలో బాధ్యతగా నిర్వర్తించా. అనవసరంగా వ్యాఖ్యలు చేయడం వేస్ట్. నా కుటుంబంతో దర్శన్ కుటుంబానికి మధ్య ఉన్న బంధం మీకు అర్థం కాదు. అతను స్టార్ కాకముందు 25 ఏళ్లుగా నాకు తెలుసు. స్టార్‌డమ్‌కి మించి దర్శన్ నాకు కుటుంబ సభ్యుడు, కొడుకు లాంటివాడు. అంబరీష్‌ని ఎప్పుడూ నాన్నగా పిలిచే ఆయన జీవితంలో నాకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఏ తల్లి తన కొడుకుని ఇలాంటి పరిస్థితిలో చూడడానికి ఇష్టపడదు. నాకు తెలిసిన దర్శన్ ఎప్పుడూ ఇలాంటి నేరం చేయడు. దర్శన్‌లో ప్రేమ, ఉదార హృదయం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే సంకల్పం అతని పాత్రకు సాక్ష్యమిస్తున్నాయి. దర్శన్ అటువంటి నేరం చేసే వ్యక్తి కాదని నేను నమ్ముతున్నాను.' అని సుమలత తన లేఖలో రాశారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున తాను ఇకపై వ్యాఖ్యానించనని పేర్కొన్నారు.దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిని సుమలత తప్పుబట్టారు. అలాంటి వారిని విమర్శిస్తూ సుమలత తన లేఖను ముగించారు. 'దర్శన్ ఇప్పటికీ నిందితుడే.. అతనికి వ్యతిరేకంగా ఏదీ నిరూపించబడలేదు, శిక్షించబడలేదు. దర్శన్‌కు న్యాయమైన విచారణ జరగనివ్వండి. దర్శన్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడకండి. దర్శన్ విషయం వల్ల ఇప్పటికే శాండల్‌వుడ్ స్థంభించిపోయింది.' అని ఆమె రాశారు.18 వరకు దర్శన్‌కు కస్టడీరేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న హీరో దర్శన్, అనుచరులకు కోర్టు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. దర్శన్, నటి పవిత్ర, మరో 15 మంది నిందితులకు కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెస్స్ ద్వారా జడ్జి ముందు హాజరుపరిచారు. ఇందులో నలుగురు నిందితులు తుమకూరు జైల్లో ఉన్నారు. బెయిలు దక్కుతుందని ఆశించిన దర్శన్ గ్యాంగ్‌కి నిరాశ ఎదురైంది. జూలై 18 వరకూ కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు. -
దర్శన్‌కు సపోర్ట్‌గా విజయలక్ష్మి కామెంట్
రేణుకాస్వామి హత్యకేసులో నిందితునిగా ఉన్న సినీ హీరో దర్శన్ పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. గతంలో 2011లో భార్యపై దాడికి పాల్పడిన కేసులో ఇదే జైలుకు తొలిసారిగా వచ్చి 20 రోజులకు పైగా ఉన్నారు. 13 ఏళ్ల తరువాత రెండోసారి మళ్లీ రేణుకాస్వామి హత్యకేసులో దర్శన్, ఆయన ప్రియురాలు, నటి పవిత్రా గౌడ సమేతంగా పరప్పన జైలులో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా దర్శన్‌ను సతీమణి విజయలక్ష్మి తన కుమారుడితో వెళ్లి కలుసుకున్నారు.దర్శన్, విజయలక్ష్మి మధ్య విభేదాలు ఉన్నాయి. వారిద్దరూ కూడా వేరువేరుగా ఉన్నారని సమాచారం. అయితే, దర్శన్ కష్టాల్లో ఉండటంతో ఆయనకు అండగా నిలబడేందుకు ఆమె సిద్ధం అయింది. ఈ క్రమంలో ఇటీవలే కుమారుడు వినీష్‌తో కలిసి జైలుకు వెళ్లి సుమారు రెండు గంటలపాటు దర్శన్‌తో మాట్లాడారు ఆమె. ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ కేసులో దర్శన్‌కు న్యాయం లభిస్తుందనే నమ్మకం ఉందని, అంతవరకూ ఆయనకు అండగా ఉందామని, అభిమానులు ఓపికతో ఉండాలని పోస్ట్ చేశారు. ఇది పరీక్షా సమయమని, సహనం కోల్పోయి మాట్లాడినా, పోస్టులు పెట్టినా దర్శన్‌కు ఇబ్బంది కలుగుతుందన్నారు. అభిమానుల అంతరంగాన్ని మీ తరఫున దర్శన్‌కు వివరించాను. కోర్టులపై నమ్మకం ఉంచి న్యాయ పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. -
మేకప్‌లో పవిత్ర గౌడ.. పోలీస్ అధికారికి నోటీసులు
రేణుకాస్వామి హత్య కేసులో నటి పవిత్ర గౌడ (A1) ఉన్నారు. అతని హత్యలో ఆమె కీలకమని పోలీసులు కూడా నిర్ధారించారు. రేణుకాస్వామిని హతమార్చే కుట్రలో ఆమె ప్రధాన కారణమని తెలినట్లు పోలీసుల వాదన ఉంది. రేణుకస్వామి సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నట్లు దర్శన్‌తో పవిత్ర చెప్పింది. దీంతో కోపగించిన దర్శన్ తన అనుచరులతో రేణుకాస్వామిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు.బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో నటి పవిత్ర ఉన్నారు. అంతకు ముందు 10 రోజుల పాటు ఆమె పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. జైలుకు వెళ్లకు ముందు విచారణ కోసం ఆమె రోజూ అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చేది. విచారణ అనంతరం మడివాలలోని మహిళా కేంద్రంలో ఆమెను పోలీసులు ఉంచేవారు. అలా 10 రోజుల పాటు పవిత్రను పోలీసులు ప్రశ్నించారు. విచారణ అనంతరం పవిత్ర గౌడ మేకప్‌తో కనిపించేది. పోలీస్‌స్టేషన్‌లో ఆమె కాస్మోటిక్స్ వాడడంపై పెద్ద ఎత్తున చర్చలు ప్రారంభమయ్యాయి. పవిత్ర పెదాలపై లిప్ స్టిక్‌తో పాటు ఆమె మేకప్ వేసుకున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. కన్నడ సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎతున్న చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. హత్యకేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పవిత్ర గౌడ పోలీసుల అదుపులో ఉండగానే ఎలా మేకప్ వేసుకుందంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఆమెకు కాస్మోటిక్స్ మహిళా పోలీసులే అందించారని చర్చ జరుగుతుంది. పవిత్ర గౌడ భద్రత బాధ్యతను విజయనగర పోలీస్ స్టేషన్‌లోని మహిళా సబ్‌ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించారు. ఆమె ప్రమేయంతోనే ఇదంతా జరిగిందా అనే వాదనలు కూడా వస్తున్నాయి.ఈ క్రమంలో డీసీపీ గిరీష్ ఈ అంశంలో ఫైర్ అయ్యారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితురాలికి లిప్‌స్టిక్‌తో పాటు కాస్మోటిక్స్ ఎలా వచ్చాయనేది చెప్పాలని మహిళా పీఎస్‌ఐకి మెమో ఇచ్చారు. అయితే, వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. విచారణ సమయంలో పవిత్ర గౌడ ప్రతిరోజూ మడివాలలోని మహిళా కేంద్రం నుంచి విచారణకు వచ్చేదని, అక్కడే దుస్తులు మార్చుకుని అవకాశాన్ని ఆమెకు అధికారులు కల్పించారని తెలుస్తోంది. అక్కడికి ప్రతిరోజు ఆమె కుటుంబ సభ్యులు వచ్చేవారని సమాచారం ఉంది. ఆ సమయంలోనే ఆమె మేకప్ వేసుకునే సౌలభ్యం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇప్పుడు పవిత్ర గౌడను 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. పరప్పన అగ్రహార జైలులో తాజాగా పవిత్ర గౌడ తల్లి, సోదరుడు, కూతురు ఆమెతో మాట్లాడారు.పవిత్ర గౌడకు రూ. 2 కోట్లు!ఈ హత్య కేసులో నటి పవిత్రగౌడ అరైస్టెన సమయంలో విధుల్లో ఉన్న విజయనగర మహిళా పీఎస్సైకి పోలీసు శాఖ నోటీసులు ఇచ్చింది. మహిళా పీఎస్సై విధుల్లో నిర్లక్ష్యం వహించారని, వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పవిత్రగౌడకు సౌందర్య జగదీష్ అనే వ్యాపారవేత్త రూ.2 కోట్ల నగదు ఇచ్చారని విచారణలో తేలడంతో కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.రేణుకాస్వామి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంహత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి తల్లిదండ్రులు ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఆయన నివాస కార్యాలయం కృష్ణాలో కలిశారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రేణుకాస్వామి మృతితో తమకు దిక్కుతోచడం లేదని వాపోయారు. రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని విన్నవించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి, ఉద్యోగ భరోసా ఇచ్చారని తెలిసింది. -
దర్శన్ గురించి సెన్సేషనల్ విషయాన్ని బయటపెట్టిన డాక్టర్
కర్ణాటకలో సంచలనం రేపిన రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌కు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జులై 4 వరకు పరప్పన అగ్రహారం జైలులో ఆయన ఉండనున్నారు. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ A2 అని పోలీసులు నిర్ధారించారు. ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ A1 అని తెలిపారు. వీరిద్దరితో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే దర్శన్ మానసిక పరిస్థితి గురించి పలు విషయాలు బయటకు వస్తున్నాయి.దర్శన్ ఆరోగ్యంపై అనుమానాలుదర్శన్కు మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, తగిన వైద్యం అవసరమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 10వ తేదీన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయ్యాక దర్శన్ మానసిక పరిస్థితి చర్చకు వచ్చింది. గతంలో దర్శన్ గొడవపడిన ఘటనలు, షూటింగ్లో ఇతరులను కొట్టిన సంగతులు, అతని పట్టలేని ఆగ్రహం చూస్తే మానసిక రోగంతో బాధపడుతున్నారా అనే అనుమానాలు కలుగుతాయి. గతంలో దర్శన్‌కు కౌన్సిలింగ్ ఇచ్చిన మానసిక వైద్యురాలు చంద్రిక ఈ విషయాన్ని చెప్పారు. చిన్నచిన్న విషయాలకు అతిగా స్పందించడం, కోపం రావడం తదితర లక్షణాలు ఉండేవని, అయితే అతడి స్టార్డమ్ కారణంగా అవి పెద్దగా ఎవరూ పట్టించుకోలేదని, అందుకే దర్శన్ ఇంతవరకూ వచ్చాడంటున్నారు. కౌన్సెలింగ్ కొనసాగించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదంటున్నారు. కోపం వస్తే దర్శన్ విచక్షణ మర్చిపోతారని, ఏం చేస్తున్నాడో అతడికే తెలీదన్నారు. తక్షణం అతడికి కౌన్సెలింగ్, వైద్యం చాలా అవసరమని పలువురు పేర్కొన్నారు. బెయిల్ కోసం డ్రామా..?దర్శన్ 13 ఏళ్ల కిందట భార్యపై దాడి కేసులో అరెస్టయి జైలుపాలయ్యాడు. ఇప్పుడు మళ్లీ అదే జైలుకి వెళ్లాడు. హత్య కేసులో ప్రథమ ముద్దాయి, దర్శన్ ప్రియురాలు పవిత్రగౌడ ఇప్పటికే పరప్పన జైలులో ఉన్నారు. మరోవైపు బెయిల్ కోసమే దర్శన్ ఆరోగ్య సమస్యలు, మానసిక పరిస్థితి బాగులేదనే కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మానసిక పరిస్థితి బాగులేదనే అధికారికంగా ప్రభుత్వ వైద్యులు ధృవీకరిస్తే తప్పకుండా దర్శన్‌కు బెయిల్ వచ్చే అవకాశం ఉందని పలువురు న్యాయవాదులు కూడా అభిప్రాయపడుతున్నారు. బెయిల్ కోసమే ఇలా కొత్త డ్రామాను తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. -
జైలుకు దర్శన్.. బెయిల్ కోసం రంగంలోకి దిగిన టాప్ లాయర్లు
కర్ణాటకలో సంచలనం రేపిన ఆటోడ్రైవర్ రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌కు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హత్య కేసులో గత 12రోజులుగా ఆయన్ను పోలీసులు విచారించారు. హత్య జరిగిన ప్రదేశంతో పాటు పలు చోట్ల 139 వస్తువులను సాక్ష్యాలుగా పోలీసులు సేకరించారు. అన్నిటికంటే ముఖ్యంగా దర్శన్ అనుచరుడు వినయ్ ఫోన్లో చాటింగ్ చేసిన మెసేజ్‌లు కేసులో కీలకంగా మారనున్నాయి. రేణుకాస్వామిపై దర్శన్ దాడి చేసిన దృశ్యాన్ని ముగ్గురు యువకులు మొబైల్లో వీడియో తీసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వీడియోలను సేకరించారు.దర్శన్‌తో పాటు అతని సహచరులు వినయ్, ప్రదుష్, ధనరాజ్‌లను శనివారం నగరంలోని 24వ ఏసీఎంఎం కోర్టులో హాజరుపరచగా, కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించింది. దర్శన్‌తో పాటు ఆయన ముఠాను జులై 04 వరకు జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ తాజాగా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రేణుకాస్వామి దారుణ హత్య నేపథ్యంలో ఏ1 నిందితురాలు పవిత్రగౌడ్‌తో పాటు మరో 13 మంది ఇప్పటికే పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. ఇప్పుడు దర్శన్ గ్యాంగ్ కూడా పరప్పన అగ్రహారంలో చేరారు, అందువల్ల హత్య కేసులో ప్రమేయం ఉన్న 17 మంది నిందితులకు జులై 4 వరకు కస్టడీ విధించారు.దర్శన్ బెయిల్ కోసం ప్రముఖ లాయర్లు రేణుకాస్వామి హత్య కేసులో ఏ2గా ఉన్న దర్శన్ బెయిల్ పిటిషన్ పెట్టుకోనున్నట్లు తెలుస్తోంది. దర్శన్ కేసు వాదించడానికి అనిల్, బాబు, రంగనాథ్‌రెడ్డి అనే లాయర్లను నియమించుకున్నారు. అదేవిధంగా సీనియర్ లాయర్ సీవీ నాగేశ్‌ను కూడా దర్శన్ నియమించుకున్నారు. ఇటీవల జైలుపాలైన మాజీ మంత్రి రేవన్న కేసును నాగేశ్ వాదించి బెయిలు ఇప్పించారు. అనేక క్రిమినల్ కేసులు వాదించిన అనుభవం ఆయనకు ఉంది. దర్శన్‌కు కూడా బెయిల్ ఇప్పించే ప్రయత్నంలో భాగంగా లాయర్ నాగేశ్, అసిస్టెంట్ లాయర్ రాఘవేంద్ర ఇప్పటికే అన్నపూర్ణేశ్వరి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కేసుకు సంబంధించి పూర్తి సమాచారం తీసుకున్నారు. -
పవిత్ర గౌడకు అస్వస్థత.. పోలీసుల ప్రశ్నలే కారణమా..?
కన్నడ చిత్రపరిశ్రమలో రేణుకాస్వామి హత్య పెద్ద సంచలనంగా మారింది. ఈ కేసులో మొదటి నిందితురాలిగా ఉన్న పవిత్రగౌడను గత కొద్దిరోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. రేణుకాస్వామి తనకు అసభ్య మెసేజ్‌లు పెడుతున్నట్లు తన ప్రియుడు హీరో దర్శన్‌కు చెప్పడంతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు వద్ద ఆమె ఒప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, పవిత్ర గౌడను పోలీసులు విచారిస్తున్న క్రమంలో ఆమె తీవ్రంగా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆమె అస్వస్థతకు గురై బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.పవిత్ర గౌడను గత 10 రోజులుగా పోలీసులు విచారిస్తున్నారు. దీంతో ఆమె ఆరోగ్యం కాస్త దెబ్బతినడంతో చికిత్స కోసం బెంగళూరులోని ప్రభుత్వాసుపత్రిలో పోలీసులు చేర్పించారు. రేణుకాస్వామి హత్య జరిగిన సమయంలో పవిత్ర గౌడ అక్కడే ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. హత్య జరిగాక పవిత్ర నేరుగా ఇంటికి వెళ్లిపోయింది, ఆ రోజు ఆమె ధరించిన దుస్తులు, దాడికి ఉపయోగించిన చెప్పును ఇది వరకే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రేణుకాస్వామిపై మొదట దాడిచేసింది పవిత్ర అని తెలిసింది.ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో హీరో దర్శన్ ఫాంహౌజ్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీధర్ చనిపోతూ ఒక సూసైడ్‌నోట్ రాయడంతో పాటు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖ, వీడియోలో శ్రీధర్ తెలిపాడు. తన చావుకు తానే బాధ్యుడినని వేరే ఎవరూ కారణం కాదని స్పష్టం చేశాడు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. -
దేవుణ్ణి చూడాలన్నా...ఆధార్
సాక్షి, తిరుమల: శ్రీవారి టైంస్లాట్ దర్శనాలన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయాలని టీటీడీ భావిస్తోంది. ఆదిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సర్వదర్శనానికి ఆధార్ అనుసంధానం చేశారు. రెండోదశలో పూర్తి స్థాయిలో రూ.300 టికెట్లతోపాటు కాలిబాట దర్శనాలకు ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. స్వామివారి దర్శన విధానాల్లో టీటీడీ ఇప్పటికే ఆధార్ కార్డు అమలు చేస్తోంది. దీనివల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయటంతోపాటు భక్తులకు పారదర్శక సేవలు అందుతున్నాయి. అంగప్రదక్షిణం, వృద్ధులు, దివ్యాంగులు, వీఐపీ బ్రేక్ దర్శనాలకు ఆధార్‌కార్డు అనుసంధానం చేయటం వల్ల డూబ్లికేషన్తోపాటు అక్రమాలకు అవకాశం లేకుండా పోయింది. ఏ దర్శనంలో ఎంత మంది వెళ్లారు? ఎవరు? ఎన్నిసార్లు శ్రీవారి దర్శనానికి వచ్చారు? అన్న సమగ్ర వివరాలు టీటీడీ వద్ద రికార్డు అవుతున్నాయి. దీనివల్ల భద్రతా పరంగా కూడా సంబంధిత భక్తుల వివరాలు సంక్షిప్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ ఆధార్‌కార్డు అనుసంధానంపై టీటీడీ నిర్వహించిన సర్వేలో 95 శాతంపైగా భక్తులు మద్దతు తెలిపారు. టైం స్లాట్లలో 95వేల మందికి దర్శనం తిరుమలేశుని దర్శన విధానంలో ఇప్పటి వరకు రద్దీని బట్టి రూ.300 టికెట్లు రోజూ 20 నుండి 25వేలు, కాలిబాట దివ్య దర్శనాలకు రోజూ 20 వేలు టైం స్లాట్ టికెట్లు కేటాయించి, అమలు చేస్తున్నారు. తాజాగా, సోమవారం నుండి ఆరంభమైన సర్వదర్శనంలోనూ రోజూ 20వేలు ఇవ్వాలని నిర్ణయించారు. భక్తుల రద్దీ, పర్వదినాలు బట్టి అయా టైం స్లాట్ దర్శనాల్లో సంఖ్యను పెంచటం, తగ్గించటం వంటి నిర్ణయాలకు వెసులుబాటు కల్పించారు. వాటితోపాటు ఇక వివిధ రకాల ఆర్జిత సేవా టికెట్లు, వీఐపీ దర్శన టికెట్లు, వృద్ధులు, దివ్యాంగులు, చంటి బిడ్డ తల్లిదండ్రులు, ఎన్ఆర్ఐ భక్తులు కనిష్టంగా 10 వేలు నుండి గరిష్టంగా 15 వేల వరకు ఉంటారు. అంటే మొత్తం మీద ఒక రోజులో కనిష్టంగా 75వేలు , గరిష్టంగా 90 వేల మందికి మాత్రమే సాఫీగా స్వామి దర్శనం అమలు చేయాలని టీటీడీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. అన్నిరకాల టైం స్లాట్ దర్శనాలకు ఆధార్‌కార్డు తప్పనిసరిచేస్తే డూబ్లికేషన్ అవకాశం ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న డీజీపీ
–తిరుమల బ్రహ్మోత్సవాలపై సమీక్ష సాక్షి, తిరుమల : రాష్ట్ర డీజీపీ సాంబశివరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారిగా ఆలయానికి వచ్చారు. వేకువజాము తోమాల సేవ, ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆలయం వెలుపల తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మీ, ఇతర పోలీసు అధికారులతో కొంత సమయం బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మాట్లాడి, పలు సూచనలు చేశారు. తర్వాత పోలీసు అతిధిగృహంలో ఆయన టీటీడీ విజిలెన్స్, పోలీసు అధికారులతో బ్రహోత్సావాలపై సమీక్షించారు. భద్రతాపరమైన విషయాలపై చర్చించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భద్రత కల్పించాలని సూచించారు. ఈ సారి బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. -
శ్రీవారి సేవలో ప్రముఖులు
సాక్షి,తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని గురువారం రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సభ్యులు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కార్గ్ దర్శించుకున్నారు. వీరికి డెప్యూటీఈవోలు కోదండరామారావు, హరీంద్రనాథ్, ఓఎస్డీ లక్ష్మీనారాయణ యాదవ్ ప్రత్యేకంగా శ్రీవారి దర్శనం కల్పించి, లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం సినీనటి శ్రియ కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు, భక్తులు ఉత్సాహం చూపారు. -
12 గంటల్లో శ్రీవారి దర్శనం
12 గంటల్లో శ్రీవారి దర్శనం సాక్షి, తిరుమల : వారపు సెలవుల నేపథ్యంలో శనివారం తిరుమలలో భక్తులరద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 57,810 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి 26 కంపార్ట్మెంట్లలోని సర్వదర్శనం భక్తులకు 8 గంటలు, 10 కంపార్టుమెంట్లలోని కాలినడక భక్తులకు 8 గంటల్లో స్వామి దర్శనం లభిస్తోంది. అన్ని రిసెప్షన్ కేంద్రాల్లోనూ గదుల కోసం నిరీక్షణ తప్పలేదు. కల్యాణ కట్టల వద్ద రద్దీ కనిపించింది. భక్తులు తలనీలాలు సమర్పించేందుకు వేచి ఉండాల్సి వచ్చింది. హుండీ కానుకలు రూ.2.54 కోట్లు లభించాయి.