
రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ కన్నడ నటుడు దర్శన్‌కు బెయిల్ మంజూరు అయింది. ఆయనతో పాటు ఏడుగురికి ఈ కేసులో బెయిల్ ఇస్తున్నట్లు న్యాయస్థానం వెళ్లడించింది. దర్శన్ ఇప్పటికే తన చికిత్స కోసం బెయిల్‌పై బయట ఉన్నాడు. నేటితో ఆయన బెయిల్ గడవు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో గడవుతో నిమిత్తం లేకుండా బెయిల్ మంజూరు కావడంతో దర్శన్ అభిమానులు ఆనందిస్తున్నారు.
రేణుకాస్వామి హత్య కేసులో సుమారు ఆరు నెలలుగా పరప్పన జైలులో హీరో దర్శన్ ఉన్నారు. అయితే ఈ కేసులో బెయిల్ కోసం దర్శన్ లాయర్లు పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. కానీ, ఫలితం లేదు. అయితే, మరోసారి బెయిల్ కోసం ఆయన ధరఖాస్తు చేసుకున్నారు. విశ్వజీత్ శెట్టితో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించి దర్శన్‌కు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ఆయన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు కూడా బెయిల్ లభించినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దర్శన్ ప్రియురాలు పవిత్రకు అసభ్యతతో కూడిన మెసేజ్‌లు రేణుకాస్వామిని చేస్తున్నాడనే కారణంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రగౌడ సహా 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రేణుకాస్వామిని అత్యంత పాశవికంగా కొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతడికి కరెంట్ షాకులు కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. అయితే, వారికి ఇప్పుడు బెయిల్ రావడం సంచలనంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment