నేను ఉన్నంత కాలం వాడు నా కుమారుడే: సుమలత | Actress Sumalatha Comments On Darshan | Sakshi
Sakshi News home page

నేను ఉన్నంత కాలం వాడు నా కుమారుడే: సుమలత

Published Sun, Nov 10 2024 2:11 PM | Last Updated on Sun, Nov 10 2024 6:56 PM

Actress Sumalatha Comments On Darshan

కన్నడ హీరో దర్శన్‌ గురించి సినీ నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన రాజకీయ మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో దర్శన్‌ గురించి పలు కీలవ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి తాను కృషి చేస్తానని, జనవరి తర్వాత సంపూర్ణంగా రాజకీయాల్లో పాల్గొంటానని మండ్య మాజీ ఎంపీ సుమలత అంబరీష్‌ పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో ప్రధాని మోదీ మాటకు విలువనిచ్చి మండ్య లోక్‌సభ నియోజకవర్గానికి దూరంగా ఉన్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం కాలి నొప్పి సమస్యకు చికిత్స పొంది కొంత విరామం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. బీజేపీ తనను నిర్లక్ష్యం చేస్తుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె పేర్కొన్నారు. మండ్యలో బీజేపీని బలోపేతం చేస్తానని పార్టీ హైకమాండ్‌కు తాను చెప్పినట్లు తెలిపారు. 

నటుడు దర్శన్‌ గురించి సుమలత ఇలా మాట్లాడారు. 'గతంలో దర్శన్‌తో తన సంబంధం ఎలా ఉందో ఇప్పటికీ అదే విధంగా ఉంది. దర్శన్‌ సతీమణి నాతో రోజూ టచ్‌లో ఉన్నారు. దర్శన్‌ ఆరోగ్యం ప్రస్తుతం అంత మెరుగ్గాలేదు. ముందు అతని ఆరోగ్యం మెరుగు పడాలి. ఇప్పటికే వాడి ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. తనపై వచ్చిన అన్ని ఆరోపణల నుంచి బయట పడతాడనే నమ్మకం ఉంది. నేను జీవించి ఉన్నంత వరకు దర్శన్‌ నా కుమారుడి లాంటివాడే, అతనికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. రేణుకస్వామి హత్య కేసులో నిజం బయటపడి దర్శన్‌ నిరపరాధిగా నిలవాలని దేవుడిని ఆశిస్తున్నా' అని ఆమె  చెప్పారు.  వైద్యచికిత్సల కోసం ఆరు వారాల పాటు దర్శన్‌కు కోర్టు  బెయిల్‌ ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement