sumalatha
-
నేను ఉన్నంత కాలం వాడు నా కుమారుడే: సుమలత
కన్నడ హీరో దర్శన్ గురించి సినీ నటి, మాజీ ఎంపీ సుమలత అంబరీష్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన రాజకీయ మీడియా సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ క్రమంలో దర్శన్ గురించి పలు కీలవ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో బీజేపీని బలోపేతం చేయడానికి తాను కృషి చేస్తానని, జనవరి తర్వాత సంపూర్ణంగా రాజకీయాల్లో పాల్గొంటానని మండ్య మాజీ ఎంపీ సుమలత అంబరీష్ పేర్కొన్నారు.గత ఎన్నికల్లో ప్రధాని మోదీ మాటకు విలువనిచ్చి మండ్య లోక్‌సభ నియోజకవర్గానికి దూరంగా ఉన్నానని ఆమె తెలిపారు. ప్రస్తుతం కాలి నొప్పి సమస్యకు చికిత్స పొంది కొంత విరామం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. బీజేపీ తనను నిర్లక్ష్యం చేస్తుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె పేర్కొన్నారు. మండ్యలో బీజేపీని బలోపేతం చేస్తానని పార్టీ హైకమాండ్‌కు తాను చెప్పినట్లు తెలిపారు. నటుడు దర్శన్ గురించి సుమలత ఇలా మాట్లాడారు. 'గతంలో దర్శన్‌తో తన సంబంధం ఎలా ఉందో ఇప్పటికీ అదే విధంగా ఉంది. దర్శన్ సతీమణి నాతో రోజూ టచ్‌లో ఉన్నారు. దర్శన్ ఆరోగ్యం ప్రస్తుతం అంత మెరుగ్గాలేదు. ముందు అతని ఆరోగ్యం మెరుగు పడాలి. ఇప్పటికే వాడి ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. తనపై వచ్చిన అన్ని ఆరోపణల నుంచి బయట పడతాడనే నమ్మకం ఉంది. నేను జీవించి ఉన్నంత వరకు దర్శన్ నా కుమారుడి లాంటివాడే, అతనికి అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా. రేణుకస్వామి హత్య కేసులో నిజం బయటపడి దర్శన్ నిరపరాధిగా నిలవాలని దేవుడిని ఆశిస్తున్నా' అని ఆమె చెప్పారు. వైద్యచికిత్సల కోసం ఆరు వారాల పాటు దర్శన్‌కు కోర్టు బెయిల్ ఇచ్చింది. -
జానీ మాస్టర్ భార్య ఓవరాక్షన్ మీడియా ప్రతినిధులపై చిందులు
-
రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థ ఉండాలి!
మలయాళ చిత్ర పరిశ్రమలో చోటు చేసుకున్న లైంగిక వేధింపులపై జస్టిస్ హేమా కమిటీ ఇచ్చిన నివేదిక సినిమా రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇతర భాషల్లోనూ హేమా తరహా కమిటీని ఏర్పాటు చేయాలని పలువురు నటీనటులు కోరుతున్నారు. వేధింపుల ఘటనలపై తాజాగా నటి, మాజీ ఎంపీ సుమలత స్పందిస్తూ– ‘‘చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపుల అనుభవాలను నాతో చాలామంది పంచుకున్నారు. సెట్స్‌లో చాలా మందికి భయానక అనుభవాలు ఎదురవుతున్నాయని విన్నాను. అవకాశాల కోసం వేధింపులు ఎదుర్కొన్నామని పలువురు మహిళలు నాతో చె΄్పారు. అయితే నాకు ఇలాంటి ఘటనలు ఎప్పుడూ ఎదురవలేదు. నేను చూడలేదు కాబట్టి వేధింపులు జరగలేదని కాదు. కేవలం సినిమా అనే కాదు.. రాజకీయ రంగంతోపాటు ప్రతి రంగంలోనూ ఇలాంటి పవర్ గ్రూపులు ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఎవరూ బయటపెట్టని రహస్యాలు చాలా ఉన్నాయి. ఈ విషయాలను ధైర్యంగా బయటపెట్టిన మహిళలకు, అందుకు బాటలు వేసిన డబ్ల్యూసీసీ (ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్)కి ధన్యవాదాలు. తమకు జరిగిన చేదు అనుభవాలను బయట పెడుతోన్న మహిళలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. సెట్స్‌లో మహిళలకు భద్రత కల్పించేలా నిబంధనలను తీసుకురావడం, అలాగే వాటిని ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఒక పరిష్కారం. ఒకవేళ ఫిర్యాదు చేసినా యూనియన్లు, సినిమా పరిశ్రమలోని ఇతర విభాగాలు వినకపొవచ్చు. అందుకే సెన్సార్ బోర్డు ఉన్నట్లే మహిళలకు సంబంధించిన భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఉండాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాను’’ అని పేర్కొన్నారు. -
దర్శన్ నా కుమారుడితో సమానం.. సుమలత లేఖ వైరల్
ఆటో డ్రైవర్ రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో హీరో దర్శన్ (A2), నటి పవిత్ర (A1) ఉన్నారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు. ఇప్పటికే దర్శన్ అరెస్ట్ విషయంలో చాలామంది నటీనటులు తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. కానీ, రాజకీయ నాయకురాలు, సినీ నటి సుమలత అంబరీష్ స్పందన గురించి చాలామంది ఎదురుచూశారు. ఎట్టకేలకు ఆమె రియాక్షన్ ఇచ్చారు. దర్శన్‌తో తనకు ఉన్న బంధాన్ని ఆమె వివరించారు.'నేను 44 ఏళ్ల నుంచి సినిమా రంగంలో నటిగా, కళాకారిణిగా జీవిస్తున్నాను. ఐదేళ్లపాటు ఎంపీగా పని చేశా. అనేక రంగాలలో బాధ్యతగా నిర్వర్తించా. అనవసరంగా వ్యాఖ్యలు చేయడం వేస్ట్. నా కుటుంబంతో దర్శన్ కుటుంబానికి మధ్య ఉన్న బంధం మీకు అర్థం కాదు. అతను స్టార్ కాకముందు 25 ఏళ్లుగా నాకు తెలుసు. స్టార్‌డమ్‌కి మించి దర్శన్ నాకు కుటుంబ సభ్యుడు, కొడుకు లాంటివాడు. అంబరీష్‌ని ఎప్పుడూ నాన్నగా పిలిచే ఆయన జీవితంలో నాకు ప్రత్యేక స్థానం ఇచ్చారు. ఏ తల్లి తన కొడుకుని ఇలాంటి పరిస్థితిలో చూడడానికి ఇష్టపడదు. నాకు తెలిసిన దర్శన్ ఎప్పుడూ ఇలాంటి నేరం చేయడు. దర్శన్‌లో ప్రేమ, ఉదార హృదయం ఉన్న వ్యక్తిగా నాకు తెలుసు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయాలనే సంకల్పం అతని పాత్రకు సాక్ష్యమిస్తున్నాయి. దర్శన్ అటువంటి నేరం చేసే వ్యక్తి కాదని నేను నమ్ముతున్నాను.' అని సుమలత తన లేఖలో రాశారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున తాను ఇకపై వ్యాఖ్యానించనని పేర్కొన్నారు.దర్శన్ భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వారిని సుమలత తప్పుబట్టారు. అలాంటి వారిని విమర్శిస్తూ సుమలత తన లేఖను ముగించారు. 'దర్శన్ ఇప్పటికీ నిందితుడే.. అతనికి వ్యతిరేకంగా ఏదీ నిరూపించబడలేదు, శిక్షించబడలేదు. దర్శన్‌కు న్యాయమైన విచారణ జరగనివ్వండి. దర్శన్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మాట్లాడకండి. దర్శన్ విషయం వల్ల ఇప్పటికే శాండల్‌వుడ్ స్థంభించిపోయింది.' అని ఆమె రాశారు.18 వరకు దర్శన్‌కు కస్టడీరేణుకాస్వామి హత్య కేసులో అరైస్టె జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న హీరో దర్శన్, అనుచరులకు కోర్టు కస్టడీ పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. దర్శన్, నటి పవిత్ర, మరో 15 మంది నిందితులకు కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెస్స్ ద్వారా జడ్జి ముందు హాజరుపరిచారు. ఇందులో నలుగురు నిందితులు తుమకూరు జైల్లో ఉన్నారు. బెయిలు దక్కుతుందని ఆశించిన దర్శన్ గ్యాంగ్‌కి నిరాశ ఎదురైంది. జూలై 18 వరకూ కస్టడీని పొడిగిస్తూ జడ్జి ఆదేశాలిచ్చారు. -
Children's Story: సహన రెండవ తరగతి చదువుతోంది.. ఒకరోజూ..!
సహన రెండవ తరగతి చదువుతోంది. ఆమె అన్నింటికీ తొందరపడుతుంది. ఏదయినా సరే తను అడిగిన వెంటనే నిమిషాల్లో జరిగిపోవాలి. లేదంటే గొడవ చేసి అమ్మ నాన్నలను విసిగిస్తుంది.‘అమ్మా! నా జడకు రబ్బర్ బ్యాండ్ వదులుగా ఉంది, సరిగ్గా పెట్టు’ వంట చేస్తున్న మానస దగ్గరకు వచ్చి అంది సహన. ‘పప్పు తాలింపు పెడుతున్నాను, ఐదు నిమిషాలు ఆగు’ అంది మానస. ‘అమ్మా! ప్లీజ్ అమ్మా, రామ్మా’ అంటూ నస పెట్టింది అమ్మాయి. దాంతో చేసే పని ఆపి సహన జడకి రబ్బర్ బ్యాండ్ సరిగ్గా పెట్టింది మానస.‘డాడీ! నాకు సాయంత్రం రంగు పెన్సిళ్లు తీసుకురండి’ ఆఫీసుకు వెళ్తున్న తండ్రితో చెప్పింది సహన.‘సరే అలాగే‘ అంటూ వెళ్ళిన ఆయన సాయంత్రం రంగు పెన్సిళ్లు మరచిపోయి వచ్చారు. అందుకు సహన మొండి పేచీ పెట్టింది. ఆ పేచీ భరించలేక ఆయన మళ్ళీ బజారుకి వెళ్ళి తీసుకువచ్చారు. ‘సహనా! నీకసలు ఓపిక లేదు. ఏదైనా అడిగిన వెంటనే దొరకదు. సమయం పడుతుంది. దానికోసం ఓర్పుగా ఎదురు చూడాలి. ఇలా తొందరపడితే.. తొందరపెడితే ముందు ముందు చాలా కష్టపడాల్సి వస్తుంది’ బాధపడుతూ కూతురితో అన్నారాయన. ఆ మాటలను సహన పెద్దగా పట్టించుకోలేదు.ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే అమ్మతో ‘స్కూల్ యాన్యువల్ డేకి నన్నో గ్రూప్ డాన్స్‌కి సెలెక్ట్ చేశారు టీచర్. గ్రూప్ డాన్స్ కాదు సోలో డాన్స్ చేస్తానని చెప్పాను’ అంది సహన.‘మంచిదే.. కానీ గ్రూప్ డాన్స్ అంటే నువ్వెలా చేసినా అందరిలో కలసిపోతుంది. సోలో డాన్స్ అయితే చాలా శ్రద్ధపెట్టి నేర్చుకోవాలి! ఒక్కసారి ప్రాక్టీస్‌కే నాకంతా వచ్చేసిందని తొందరపడితే కుదరదు. రోజూ ఇంటి దగ్గర కూడా సాధన చేయాలి మరి!’ అంది మానస. ‘అలాగేలే అమ్మా’ అంటూ తల ఊపింది సహన నిర్లక్ష్యంగా! యాన్యువల్ డే కోసం స్కూల్లో డాన్స్ నేర్పించడం మొదలైంది. కానీ సహన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయట్లేదు. అది గమనించి కూతురితో అన్నది మానస ‘ఇంటి దగ్గర నువ్వు సరిగా ప్రాక్టీస్ చేయడం లేదు. అలా అయితే స్టేజీ మీద బాగా చేయలేవు’ అని! ‘స్కూల్లోనే బాగా చేస్తున్నానమ్మా! అది చాల్లే’ అని జవాబిచ్చింది సహన ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా. ఇంక చెప్పినా వినేరకం కాదని వదిలేసింది మానస.సహన వాళ్ల స్కూల్ వార్షిక దినం రానే వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సహన వంతు వచ్చింది. పాట మొదలైంది. దానికి తగ్గ స్టెప్స్.. హావభావాలతో డాన్స్ చేయసాగింది సహన. అయితే హఠాత్తుగా తను వేయాల్సిన స్టెప్స్‌ని మరచిపోయి వేసిన స్టెప్స్‌నే మళ్లీ మళ్లీ వేయసాగింది. ‘అలా కాదు సహనా.. ఇలా చేయాలి’ అంటూ స్టేజీ పక్క నుంచి వాళ్ల డాన్స్ టీచర్ చిన్నగా హెచ్చరిస్తూ చేతులతో ఆ స్టెప్స్‌ని చూపించసాగింది. అర్థం చేసుకోలేక అయోమయానికి గురైంది సహన. దాంతో డాన్స్ ఆపేసి.. బిక్కమొహం వేసి నిలబడిపోయింది.స్టేజీ మీదకు వెళ్లి ఆమెను కిందకు తీసుకొచ్చేసింది టీచర్. ప్రేక్షకుల్లో ఉన్న మానస లేచి.. గబగబా సహన దగ్గరకు వెళ్లింది. కూతురిని హత్తుకుంది. దానితో అప్పటివరకు ఉన్న భయం పోయి తల్లిని గట్టిగా వాటేసుకుంది. ‘అమ్మా! నేను డా¯Œ ్స మధ్యలో స్టెప్స్ మరచిపోయాను’ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ చెప్పింది సహన. ‘నీకు చాలాసార్లు చెప్పాను.. ఏదైనా పూర్తిగా నేర్చుకోనిదే రాదని! కొంచెం రాగానే అంతా వచ్చేసిందనుకుంటావు. ఇప్పుడు చూడు ఏమైందో! సాధన చేయకపోవడం వల్ల ఆందోళన పడ్డావు. అదే చక్కగా ప్రాక్టీస్ చేసుంటే ఈ కంగారు ఉండేది కాదు కదా! తొందరపాటు వల్ల ఇలాంటివి జరుగుతాయనే ఓర్పుగా ఉండాలని చెప్పేది’ అంది మానస.అమ్మ మాటలనే వింటూ ఉండిపోయింది సహన. ‘చదువులోనూ అంతే! జవాబులో కొంత భాగం రాగానే వచ్చేసిందంటావు. ముక్కున పట్టి అప్పచెప్పి ఇక చదవడం ఆపేస్తావు. ముక్కున పట్టింది ఎంతసేపో గుర్తుండదు. అందుకే పరీక్షల్లో సరిగ్గా రాయలేక మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు. అప్పటికప్పుడు ఏదీ వచ్చేయదు. నిదానంగా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివి అర్థం చేసుకోవాలి’ చెప్పింది మానస.అలా అంతకుముందు అమ్మ ఎన్నిసార్లు చెప్పినా సహనకు అర్థం కాలేదు. కానీ ఈసారి బాగా అర్థమయింది. తన పొరబాటును గ్రహించింది. ‘అమ్మా.. ఇప్పటి నుంచి తొందరపడను. నిదానంగా ఆలోచిస్తాను. దేన్నయినా పూర్తిగా నేర్చుకుంటాను’ అన్నది సహన .. అమ్మను చుట్టేసు కుంటూ! ‘మా మంచి సహన.. ఇక నుంచి పేరును సార్థకం చేసుకుంటుంది’ అంటూ.. కూతురు తల నిమిరింది మానస. – కైకాల వెంకట సుమలతఇవి చదవండి: మిస్టరీ.. 'ఆ వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే.. ఎందుకలా జరుగుతుంది'? -
ఈసారికి త్యాగమే.. బీజేపీలోకి సుమలత అంబరీష్
తన తదుపరి రాజకీయ ఎత్తుగడపై ఊహాగానాలకు తెరదించుతూ కర్ణాటకలోని మండ్యా స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీష్ తాను భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరనున్నట్లు ప్రకటించారు. అయితే ఈసారి తాను మండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదన్నారు. మండ్యాలో తన మద్దతుదారులను ఉద్దేశించి సుమలత ప్రసంగిస్తూ.. ‘నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ మండ్యా పట్ల నా నిబద్ధత ఎప్పటికీ అలాగే ఉంటుంది. టికెట్ దక్కనప్పుడు కొంతమంది తమ పార్టీని వీడుతారు. కానీ నేను నా సీటును వదులుకుని బీజేపీతోనే ఉండేందుకు నిర్ణయించుకున్నాను’ అన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై సుమలత విజయం సాధించారు. కర్ణాటకలో జేడీఎస్‌తో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో ఈసారి ఎన్నికల్లో మండ్యా సీటును మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామికి కేటాయించారు. 2019 ఎన్నికల్లో నిఖిల్‌పై సుమలత విజయం సాధించి జేడీఎస్ కంచుకోటగా భావించే మండ్యాలో రాజకీయ మార్పును తీసుకొచ్చారు. 2018లో తన భర్త అంబరీష్ మరణానంతరం, సుమలత ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించి మండ్య నుంచి పోటీ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మండ్య లోక్‌సభ నియోజకవర్గానికి సుమారు రూ. 4,000 కోట్ల గ్రాంట్లు అందించినట్లు సుమలత గుర్తు చేశారు. మండ్యాకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు తనతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నందుకు బీజేపీ నేతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. “బీజేపీకి నా అవసరం ఉందని, పార్టీని వీడవద్దని ప్రధాని (మోదీ) అభ్యర్థించినప్పుడు నేను ఆయనను గౌరవించాలి” అన్నారు. ఇదే సందర్భంగా సుమలత మండ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. తనను తాను జిల్లా 'కోడలు'గా పేర్కొంటూ తనకు ఇతర చోట్ల నుండి పోటీ చేసేందుకు బీజేపీ నుండి ప్రతిపాదనలు వచ్చినా తిరస్కరించినట్లు చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాలని కొంతమంది కోరినప్పటికీ ఆత్మాభిమానం ఉన్నవారు ఆ పార్టీలో చేరరని ఆమె చెప్పుకొచ్చారు. -
సోదరీ సహకరించు.. సుమలత ఇంటికి కుమారస్వామి
బెంగళూరు: కర్ణాటకలోని మండ్య నియోజకవర్గంలో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని విధంగా జేడీఎస్ రాష్ట్ర చీఫ్, మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ప్రస్తుత ఎంపీ సుమలత అంబరీష్‌ను కలిశారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న తనకు సహకరించాలని కోరారు. 'సోదరి' సహకారం వచ్చా.. బెంగళూరులోని సుమలత అంబరీష్ నివాసంలో ఆమెతో సమావేశం అనంతరం కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశమని వెల్లడించారు. “అంబరీష్ ఇల్లు నాకు కొత్త కాదు. మేము చాలా సంవత్సరాలు కలిసి నడిచాం. నేను మాండ్య లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 3న నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఇందులో భాగంగా సోదరి (సుమలత) సహకారం కోసం ఇక్కడికి వచ్చాను" అన్నారు. తమ అనుచరులు మద్దతుదారులతో సమావేశమైన తర్వాత ఏప్రిల్ 3న మండ్యలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని సుమలత తనతో చెప్పినట్లుగా పేర్కొన్నారు. సమావేశం అనంతరం సుమలత అంబరీష్ కూడా విలేకరులతో మాట్లాడారు. ‘‘ఆరోగ్యకరమైన చర్చ జరిగింది. పాత విభేదాలను మనసులో పెట్టుకోవద్దని ఆయన (కుమారస్వామి) కోరారు. భవిష్యత్ కార్యాచరణ గురించి కూడా చర్చించాం" అని ఆమె వివరించారు. మండ్య లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీగా గెలిచిన సుమలత బీజేపీకి మద్దతిస్తూ వస్తున్నారు. ఆమె మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే ఈ ఎన్నికల్లో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈ సీటును జేడీఎస్‌కు కేటాయించింది. ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ హెచ్డీ కుమారస్వామి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఆమె బీజేపీకి మద్దతుగా నిలుస్తారా లేక మళ్లీ స్వతంత్రంగా బరిలోకి దిగుతారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా లోక్‌సభ ఎన్నికల తర్వాత సుమలతకు కేంద్రంలో మంచి పదవి, హోదా కల్పిస్తామని బీజేపీ హైకమాండ్ హామీ ఇచ్చినట్లు సమాచారం. 2019 లోక్‌సభ ఎన్నికలలో మండ్య నుండి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన తరువాత, సుమలత అంబరీష్ బీజేపీకి మద్దతు ఇస్తూ వస్తున్నారు. అయితే ఆమె ఇంకా అధికారికంగా కాషాయ పార్టీలో చేరలేదు. -
సీటు దక్కని సుమలత.. ఏం చేయబోతున్నారు?
బెంగళూరు: బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడిన ప్రముఖ సినీ నటి, ప్రస్తుత మండ్య ఎంపీ సుమలత అంబరీష్.. తన భవిష్యత్తు కార్యాచరణను త్వరలో వెల్లడిస్తానని చెప్పారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మండ్య సీటును బీజేపీ తనకే ఇస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా బీజేపీ ఈ సీటును జేడీఎస్‌కు ఇచ్చింది. ఈనేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, షికారిపుర ఎమ్మెల్యే బీవై విజయేంద్రతో సుమారు గంటసేపు చర్చించిన అనంతరం సుమలత బెంగళూరులో విలేకరులతో మాట్లాడారు. ‘విజయేంద్ర తన అభిప్రాయాన్ని, అంచనాలను తెలిపారు. నేనూ నా పరిస్థితుల గురించి చెప్పాను. నేను బీజేపీతోనే ఉండాలని కోరుకుంటున్న ఆయన పార్టీలో చేరాలని కోరారు’ అని ఆమె పేర్కొన్నారు. “రేపు నా మద్దతుదారులు వస్తున్నారు. వారితో సంప్రదించకుండా ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోనని ఆయనకు (విజయేంద్ర) చెప్పాను. నేను వారి అంచనాలను, అభిప్రాయాలను వినాలి. మండ్యలో నా వైఖరిని స్పష్టం చేస్తానని చెప్పాను' అని సుమలత అన్నారు. మరో వైపు ఆమె తమతోనే నిలబడుతుందన్న నమ్మకం ఉందని కర్ణాటక బీజేపీ చీఫ్ విజయేంద్ర తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మండ్య స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బీజేపీ మద్దతుతో బరిలోకి దిగిన సుమలత.. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ మనవడు నిఖిల్ కుమారస్వామిని ఓడించారు. కాగా ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ మండ్య సీటును జేడీఎస్‌కు కేటాయించింది. ఈసారి ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. ಮಂಡ್ಯ ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಜನಪ್ರಿಯ ಸಂಸದರಾದ ಶ್ರೀಮತಿ ಸುಮಲತಾ ಅಂಬರೀಶ್ ಅವರನ್ನು ಇಂದು ಭೇಟಿಯಾಗಿ ಪ್ರಸ್ತುತ ಲೋಕಸಭಾ ಚುನಾವಣೆಯಲ್ಲಿ ದೇಶದ ಹೆಮ್ಮೆಯ ಪ್ರಧಾನಿ ಶ್ರೀ ನರೇಂದ್ರ ಮೋದಿಯವರನ್ನು ಮತ್ತೊಮ್ಮೆ ಪ್ರಧಾನಿಯನ್ನಾಗಿಸುವುದು ನಮ್ಮೆಲ್ಲರ ಗುರಿಯಾಗಿದ್ದು ಈ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ತಮ್ಮ ಸ್ವಾಭಿಮಾನದ ಬೆಂಬಲವನ್ನು ಮಾನ್ಯ ಮೋದಿ ಅವರಿಗಾಗಿ… pic.twitter.com/kMEQauL0RH — Vijayendra Yediyurappa (Modi Ka Parivar) (@BYVijayendra) March 29, 2024 -
రాజకీయాల్లో సత్తా చాటిన వెండితెర మహారాణులు
రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ఆషామాషి విషయం కాదు. మహిళలు రాణించాలంటే అంతకు మించిన సామర్థ్యమే ఉండాలి. అలాంటి రంగంలో సినిమా హీరోయిన్లు రాణించడం అనేది అంత సులభం కాదు. సాధారణంగా సినిమా హీరోయిన్ అంటే చాలామందిలో చిన్నచూపు కనిపిస్తుంది. అందుకే కొందరు వారిపై నోటికి వచ్చిన కామెంట్లు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజకీయాలంటేనే రొంపి... ఇందులోకి దిగితే దేనినైనా దిగమింగుకోవాలి. అవమానాలు, హేళనలు భరించాలి. అందుకే అతివలు వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని కొందరు దూరంగా ఉంటారు. కానీ మరి కొందరు రాజకీయ కదనరంగంలోకి దూకుతున్నారు.. ఈ క్రమంలో సినిమా పరిశ్రమకు చెందిన హీరోయిన్లు కూడా శివంగిలా తనదైన మాటలతో రాజకీయ యుద్ధంలో పోరాడుతున్నారు. వారి పోరాటంలో అవమానాలు ఎదురైనా భూదేవి అంత సహనంతో ఓర్చుకొని అలాంటి వారి బుద్ధి చెబుతున్నారు. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజకీయాల్లో రాణించిన వెండితెర మహారాణుల కొందరి గురించి తెలుసుకుందాం. తమిళనాడు అమ్మగా జయలలిత తమిళ రాజకీయ ముఖ చిత్రాన్ని తలచుకుంటే ఎవరికైనా గుర్తుకు వచ్చే పేరు జయలలిత. తమిళనాడు రాజకీయాలను కంటి చూపుతోనే శాసించిన అతి కొద్ది మంది రాజకీయ నేతల్లో జయలలిత ఒకరు. 1948లో జన్మించిన ఆమె.. సినీ నటిగా తన జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అన్నాడీఎంకే అధినేత్రిగా.. తమిళనాడు సీఎంగా ఎదిగిన తీరు నిజంగా అద్భుతం. 1991 నుంచి 2016 మధ్య ఆమె 14 ఏళ్లపాటు తమిళనాడు సీఎంగా పనిచేశారు. 1948 ఫిబ్రవరి 24న కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవవుర తాలూకాలోని మెల్కోటేలో.. తమిళ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. అయ్యంగార్ల సంప్రదాయం ప్రకారం తల్లిదండ్రులు ఆమెకు పెట్టిన రెండు పేర్లు కోమలవల్లి, జయలలిత. సంధ్య అనే పేరుతో తన ప్రస్థానాన్ని నాటకాలతో ప్రారంభించి.. సినీ నటి స్థాయికి ఎదిగింది. జయలలిత తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడేవారు. జయలలిత 1981లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. 43 ఏళ్లకే ఆమె ముఖ్యమంత్రి అయ్యారు ఆమె తమిళనాడు సీఎం అయ్యారు. దీంతో అత్యంత పిన్న వయసులోనే తమిళనాడు సీఎంగా ఎన్నికైన వ్యక్తిగా ఆమె రికార్డు నెలకొల్పారు. 2016 డిసెంబరు 5న చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో ఆమె మరణించారు. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా ఆర్ కే రోజా చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన రోజా 1972 నవంబర్ 17న జన్మించారు. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్శిటీలో చదివారు. రాజకీయ విజ్ఞానంలో నాగార్జున యూనివర్సిటీ నుంచి పీజీ పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. 2004, 2009 శాసనసభ ఎన్నికల్లో నగరి, చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పోటీచేసి ఓడిపోయిన ఆమె తన పోరాటాన్ని మాత్రం ఆపలేదు. ఆ తర్వాత వరుసగా 2014, 2019 శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా రోజా ఉన్నారు. రాజకీయాల్లోకి రాక ముందు చిత్ర పరిశ్రమలో ఎంతో కాలం కొనసాగిన రోజా. తొలినాళ్లలో హీరోయిన్గా రాణించడం చాలా కష్టమని ఎంతో మంది ఎగతాలి చేశారని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయినప్పటికీ.. ఎంతో కష్టపడి నటన, డాన్స్ నేర్చుకుని. పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినట్లు రోజా చెప్పారు. రాజకీయాల్లో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని. విమర్శలను పాజిటివ్‌గా తీసుకుని. నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఆమె పొలిటికల్ జర్నీ కొనసాగుతుంది. కన్నడలో సుమలత తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అగ్రనటి సుమలత.220 కి పైగా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో ఆమె నటించారు. సినీ కెరీర్లో స్వీట్‌స్పాట్‌కు చేరుకొన్నాక అంబరీశ్‌ను వివాహం చేసుకున్నారు. ఆయన మరణం తర్వాత 2019 ఎన్నికల్లో కర్ణాటకలోని మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు, నటుడు నిఖిల్ గౌడపై లక్ష ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో సుమలత విజయం కోసం కేజీఎఫ్ స్టార్ యశ్, దర్శన్, రాక్‌లైన్ వెంకటేశ్, దొడ్డన్న వంటి సినీ ప్రముఖులు కృషి చేశారు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పనిచేస్తానని ఇటీవల సుమలత ప్రకటించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ తరపున మాండ్య నుంచే పోటే చేస్తానని ఆమె చెప్పారు. విజయశాంతి సినీ నటిగానే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర కోసం ప్రయత్నించారు విజయశాంతి. 25 ఏళ్లకు పైగానే రాజకీయాల్లో ఆమె కొనసాగుతున్నారు. బీజేపీలో తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన విజయశాంతి. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. తన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేసి.. ఆ పార్టీ తరపున మెదక్ ఎంపీగా గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. మెదక్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తిరిగి బీజేపీలో చేరారు. అమరావతిని శాసించిన తొల మహిళగా నవనీత్ కౌర్ నవనీత్ స్వస్థలం పంజాబ్. ఆమె తెలుగు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2003లో ‘శ్రీను వాసంతి లక్ష్మి’తో మొదలుపెట్టి 2010లో కాలచక్రం వరకు దాదాపు 20 తెలుగు సినిమాల్లో ఆమె నటించారు. ఆపై 2011లో ఎమ్మెల్యే రవి రాణాతో పెళ్లి జరగడంతో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. రవి రానాను పెళ్లి చేసుకున్న తర్వాత, నవనీత్ అమరావతికి వచ్చేశారు. తొలిసారి ఆమె 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేశారు. అమరావతి నియోజిక వర్గంలో శివసేన నాయకుడు అనందరావ్ అడ్సూల్‌కు విపరీతమైన పట్టు ఉంది. దీంతో ఆ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. కానీ, నవనీత్ అంత తేలిగ్గా వదిలిపెట్టే వ్యక్తి కాదు. పేదల ఇళ్లకు వెళ్లి భోజనం చేసేవారు. వారి ఇంట్లోకి వెళ్లి వారి కూతురిలా కలిసిపోయారు. 2019 ఎన్నికల్లో శివసేన-బీజేపీ కలిసి మళ్లీ ఆనంద్‌రావ్‌ను ఇక్కడి నుంచి పోటీ చేయించాయి. అయితే, కాంగ్రెస్-ఎన్సీపీల మద్దతున్న నవనీత్ భారీ ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు. మరావతి నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీ ఆమె కావడం విశేషం. అయితే, ఇప్పుడు ఆమె రాజకీయాలు బీజేపీకి దగ్గరగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఓబీసీ బిల్లుపై చర్చ సమయంలో 2021లో లోక్‌సభలో ఆమె తెలుగులో మాట్లాడి తెలుగు వారందిరినీ మురిపించారు. స్టార్ క్యాంపెయినర్‌గా నగ్మా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయడం లేదు కానీ.. సినీ నటిగానే కాకుండా రాజకీయ నేతగా కూడా నగ్మా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. చాలా సంవత్సరాల కిందటే కాంగ్రెస్ పార్టీలో చేరిన నగ్మా.. ఆ పార్టీ తరపున వివిధ రాష్ట్రాల వ్యవహారాలను సమీక్షిస్తున్నారు. ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా కొనసాగుతున్నారు. కానీ ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీకి కాస్త దూరంగానే ఉన్నారు. -
ఎన్నికల ప్రచారానికి దూరంగా పాన్ ఇండియా హీరోలు.. కారణం ఇదేనా..?
కర్ణాటక మాండ్య లోక్‌సభ ఎంపీ, ప్రముఖ సినీనటి సుమలత అంబరీశ్ మరోసారి కూడా అక్కడి నుంచే పోటీకి దిగనున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్‌కు కంచుకోట లాంటి మాండ్యలో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు నిఖిల్‌ను ఆమె ఓడించారు. సుమారు లక్షా ముపై వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. ఆ సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సుమలత కోసం పాన్ ఇండియా స్టార్లు అయిన యశ్,దర్శన్‌లు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆమె కోసం పెద్ద ఎత్తున వారు పలు ర్యాలీలు నిర్వహించారు. 2024 ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కూటమి నుంచి తాను తప్పకుండా పోటీ చేస్తానని సుమలత చెప్పారు. మాండ్య లోసకభ నియోజకవర్గం నుంచి వంద శాతం నాకే సీటు దక్కుతుందని ఆమె తెలిపారు. గత సారి జరిగిన ఎన్నికల్లో స్టార్ నటులు యశ్, దర్శన్ తనకు మద్దతుగా ప్రచారం చేశారని.. ఈసారి ఎన్నికల ప్రచారానికి వారిద్దరూ రాకపోవచ్చని ఆమె అన్నారు. అప్పుడు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను.. ఇప్పుడు బీజేపీ పార్టీ గుర్తుతో బరిలోకి దిగుతున్నాను. ఇప్పుడు వారిద్దరినీ ఇబ్బంది పెట్టవద్దనుకున్నాను. అయినా తాను తప్పకుండా గెలిచి తీరుతానని ఆమె చెప్పుకొచ్చారు. '2019 ఎన్నికల్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను కాబట్టి ఇద్దరు స్టార్ నటులు యశ్, దర్శన్ నాతో కలిసి ప్రచారం చేశారు. ఇప్పుడు నేను బీజీపీ- జేడీఎస్ కూటమి తరుపున బరిలో ఉన్నాను కాబట్టి వారి అవసరం ఉండకపోవచ్చు. సుమారు 25 రోజుల పాటు గత ఎన్నికల్లో వారిద్దరూ నా వెంటే ప్రచారం చేశారు. వారు నా కోసం త్యాగం చేశారు. మద్దతు మాత్రమే కాదు. ఎలాంటి స్వార్థం లేకుండా నాకు అండగా నిలిచారు. నా కోసం వారి విలువైన సమయాన్ని మళ్లీ మళ్లీ వదిలేయడం సరికాదు. నేను అంగీకరించను కూడా. యశ్, దర్శన్‌లు సినిమా షూటింగ్స్‌లలో బిజీగా ఉన్నారు. అవి వదిలేసి రావడం సరికాదు. వాళ్లు రాజకీయాల్లోకి రావడం వల్ల వారిపై పలు విమర్శలు వస్తున్నాయి. ఒక పార్టీ వైపు సినిమా నటులు ఉంటే.. వారి కెరియర్ మీద కూడా ప్రభావం పడవచ్చు. వారిద్దరూ ఎప్పటికీ నా ఇంటి బిడ్డలే.. ఒకవేళ నాకు వారి అవసరం ఉంది అంటే వారు తప్పకుండా వస్తారు. వారు వస్తే, నేను వారిని హృదయపూర్వకంగా స్వాగతిస్తాను. ఎన్నికల ప్రచారం కోసం యశ్ వస్తే నాకు గొప్ప శక్తి అవుతారని భావిస్తున్నాను.' అని సుమలత అన్నారు. -
Leelavathi: ఆమె మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది: సుమలత పోస్ట్ వైరల్
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ నటి లీలావతి(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమెఇటీవలే ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూనే శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సీనియర్ నటి సుమలత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ రోజు ఆమె ఫామ్‌హౌస్‌లో ఆమె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. శనివారం ఆమె అంత్యక్రియలు నెలమంగళలోని నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుమలత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'లీలావతి మరణవార్త నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆమె మరణం దక్షిణాది సినీ పరిశ్రమకు తీరని లోటు. ఆరు వందలకు పైగా సినిమాల్లో నటించిన లీలావతి సౌత్‌లో విజయవంతమైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సినిమాలో నాకు కథానాయకిగా నటించే అవకాశం వచ్చింది. ఈ విషాద సమయంలో ఆ భగవంతుడు లీలావతి కుటుంబ సభ్యులకు, అభిమానులకు శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను' అంటూ పోస్ట్ చేసింది. లీలావతి కన్నడ, తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో దాదాపు 600 చిత్రాలలో నటించింది. సినీ ఇండస్ట్రీలో ఆమె కెరీర్ ఆరు దశాబ్దాలుగా సాగింది. ఆమెకు 1999-2000లో జీవితకాల సాఫల్యానికి ప్రతిష్టాత్మకమైన డా. రాజ్‌కుమార్ అవార్డు, 2008లో తుమకూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సహా అనేక ప్రశంసలను అందుకుంది. బెల్తంగడిలో జన్మించిన లీలావతి చిన్నతనంలోనే నాటకరంగంపై మక్కువ పెంచుకున్నారు. 1949లో సినీ రంగ ప్రవేశం చేసిన లీలావతి ఆ తర్వాత కన్నడ సినిమాలో ప్రముఖ నటిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు అయిన వినోద్ రాజ్‌తో కలిసి జీవించారు. 1949లో శంకర్ సింగ్ దర్శకత్వం వహించిన నాగకన్నికే సినిమాతో అరంగేట్రం చేశారామె. View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) -
నువ్వు లేని జీవితం చాలా మార్పు తెచ్చింది.. సుమలత ఎమోషనల్!
ప్రముఖ సీనియర్ నటి సుమలత పరిచయం అక్కర్లేని పేరు. కర్ణాటకకు చెందిన సుమలత టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోలతో నటించారు. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న ఆమె.. తన భర్త, దివంగత నటుడు అంబరీశ్‌ను తలుచుకుని ఎమోషనలైంది. ఆయన మరణించి ఇప్పటికీ ఐదేళ్లు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో తన భర్త ఫోటోను పంచుకుంది. సుమలత ఇన్‌స్టాలో రాస్తూ..' నువ్వు లేని ఈ ఒంటరి జీవితం నాలో చాలా మార్పు తెచ్చిపెట్టింది! మన ఆనందం , దుఃఖం , నవ్వు , కన్నీళ్లు ప్రతి ఒక్క క్షణం ఎప్పటికీ గుర్తుంటాయి . మీరు లేని లోటు నా జీవితాంత తీర్చలేనిది. కానీ నీ ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నిన్ను ఇప్పటికీ.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. నా జీవితంలో నువ్వే నాకున్న ఓకే ప్రపంచం. ఈరోజు నువ్వు గర్వంగా నవ్వుతూ పైనుంచి మన అభిషేక్ చిత్రాన్ని ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నా.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు మిస్ యూ సార్, కన్నడ సూపర్ స్టార్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా.. ఇవాళ సుమలత తనయుడు అభిషేక్ నటించిన చిత్రం బ్యాడ్ మ్యానర్స్ కర్ణాటక వ్యాప్తంగా రిలీజైంది. ఇటీవలే సుమలత తనయుడు అభిషేక్.. అవివా బిడపాను పెళ్లాడారు. జూన్‌లో వీరి విహహం బెంగళూరులో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి సూపర్ స్టార్ రజనీకాంత్, యశ్, మోహన్‌బాబు సహా పలువురు సినీతారలు హాజరయ్యారు. అంబరీశ్- సుమలత లవ్ స్టోరీ 1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో అంబరీష్, సుమలత మొదటిసారి కలుసుకున్నారు. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్ రాజకీయంగానూ చురుకుగా ఉండేవారు. 2018 నవంబర్ 24న అంబరీష్ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది. View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) -
జస్టిస్ సుమలత, జస్టిస్ సుదీర్‌కుమార్‌కు హైకోర్టు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: బదిలీపై ఇతర రాష్ట్ర హైకోర్టుల కు వెళ్తున్న జస్టిస్ చిల్లకూర్ సుమలత, జస్టిస్ ముమ్మినేని సుదీర్‌కుమార్‌లకు హైకోర్టు ఘనంగా వీ డ్కోలు పలికింది. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఫస్ట్ కోర్టు హాల్లో భేటీ అయిన ఫుల్ కో ర్టు వారిద్దరిని సన్మానించింది. జస్టిస్ సుమలతను కర్ణాటక హైకోర్టుకు, జస్టిస్ సుదీర్‌కుమార్‌ను మ ద్రాస్ హైకోర్టుకు బదిలీ చేస్తూ కేంద్రం గత వారం ఉత్తర్వులు వెలువరించిన విషయం తెలిసిందే. న్యా యాన్ని అందించడంతోపాటు వారిచి్చన పలు తీ ర్పులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరా ధే ప్రశంసించారు. తీర్పుల వివరాలను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చదివి వినిపించారు. అనంతరం హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ (హెచ్‌సీఏఏ) బదిలీ అయిన న్యాయమూర్తులను ఘనంగా స న్మానించింది. ఈ సందర్భంగా జస్టిస్ సుమలత మాట్లా డుతూ.. కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ స్థాయి కి చేరానన్నారు. యువ న్యాయవాదులు కష్టపడి పనిచేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని సూ చించారు. విధి నిర్వహణలో భాగంగా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా ఇబ్బంది పడబోనని.. వెళ్లిన చోట మన తెలంగాణ ప్రతిభను చాటేలా విధులు నిర్వహిస్తానని చెప్పారు. ‘బార్’తో కలసి పనిచేస్తానని తాను ప్రమాణం చేసే సందర్భంలోనే చెప్పానని, అలాగే న్యాయవాదుల విజ్ఞప్తులను అనుమతిస్తూ, వీలైనంత వరకు అనుకూలంగా పనిచేశానని జస్టిస్ సు«దీర్‌కుమార్ అన్నారు. అయితే ‘బార్’తో కలసి పనిచేశానా.. లేదా అన్నది న్యాయవాదులు చెప్పాలన్నారు. -
శక్తి స్వరూపిణి..! మోదీపై ప్రశంసలు
-
నటి సుమలత కుమారుడి సంగీత్ వేడుక (ఫొటోలు)
-
సీనియర్ నటి కుమారుడి పెళ్లికి ముహూర్తం ఫిక్స్
ప్రముఖ దివంగత నటుడు అంబరీష్, సుమలతల తనయుడు అభిషేక్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఎంటర్ప్రెన్యూర్ అవివా బిడప్పతో ఏడడుగులు వేయనున్నాడు. బెంగళూరులో జూన్ 5న వీరి వివాహం జరగనుంది. ఆ తర్వాత రెండు రోజులకే గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇటు అభిషేక్ తల్లి సుమలత అటు వధువు పేరెంట్స్, ఫ్యాషన్ డిజైనర్స్ ప్రసాద్ బిడప్ప, జుడిత్ ఇప్పటికే పెళ్లి పనులు మొదలుపెట్టారు. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ వివాహానికి సినీ,రాజకీయ ప్రముఖులు విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా అభిషేక్, అవివా కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. పెద్దలు పచ్చజెండా ఊపడంతో పెళ్లికి రెడీ అయ్యారు. గతేడాది డిసెంబర్లో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఫంక్షన్‌కు పలువురు సెలబ్రిటీలు అతిథులుగా విచ్చేసిన సంగతి తెలిసిందే! అభిషేక్, అవివాతో సుమలత అభిషేక్ పేరెంట్స్ బ్యాగ్రౌండ్.. 1985లో వచ్చిన కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో మొదటిసారి కలుసుకున్నారు అంబరీష్, సుమలత. అలా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆ తర్వాత మరింత దగ్గరైన వీరు 1991 డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ హీరోహీరోయిన్లుగా ఆహుతి, అవతార పురుషా, శ్రీ మంజునాథ, కళ్లరాలై హువగీ తదితర సినిమాల్లో జంటగా నటించారు. వీరి ఏకైక సంతానం అభిషేక్ గౌడ. కన్నడ ఇండస్ట్రీలో రెబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న అంబరీష్ రాజకీయంగానూ చురుకుగానే ఉండేవారు. 2018 నవంబర్ 24న అంబరీష్ గుండెపోటుతో కన్నుమూశారు. తెలుగు, కన్నడ భాషల్లో అనేక చిత్రాలు చేసిన సుమలత ప్రస్తుతం మాండ్య నియోజకవర్గం ఎంపీగా సేవలందిస్తోంది. సుమలత, అంబరీష్ తండ్రీకొడుకులకు ఎదురైన బాధా సంఘటన 1978లో పదువరల్లి పాండవురు అనే కన్నడ చిత్రం షూటింగ్ చేస్తున్న సమయంలో అంబరీష్ తండ్రి మరణించారు. ఆయన అంత్యక్రియలను పూర్తి చేసి మూడు రోజుల్లో తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యారు అంబరీష్. తండ్రికి ఎదురైన పరిస్థితే తర్వాత కొడుక్కి కూడా ఎదురైంది. అమర్ సినిమా షూటింగ్ సమయంలో అంబరీష్ చనిపోయారు. ఆయన అంత్యక్రియలను దగ్గరుండి జరిపించిన అతడు మూడు రోజుల్లో తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యాడు. కుటుంబానికి వచ్చిన కష్టం నిర్మాతకు నష్టంగా మారకూడదనే ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ప్రస్తుతం అభిషేక్ బ్యాడ్ మేనర్స్ అనే సినిమా చేస్తున్నాడు. ఇది త్వరలో రిలీజ్ కానుంది. చదవండి: మంచి జోడీ కోసం వెతుకున్న సమంత ఇదంత సులువేమీ కాదంటూ ఏడ్చేసిన హీరోయిన్ -
ఘనంగా నటి సుమలత కొడుకు నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్
సీనియర్ నటి, లోక్‌సభ ఎంపీ సుమలత తనయుడు అభిషేక్ అంబరీష్ నిశ్చితార్థం బెంగళూరులో ఓ హోటల్లో ఘనంగా జరిగింది. ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిద్దప్ప కుమార్తె అవివాతో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో అభి–అవివా ఉంగరాలు మార్చుకున్నారు. ఈ వేడుకకు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అంబరీష్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన రాకింగ్ స్టార్ యష్, తన భార్య రాధికతో కలిసి వచ్చారు. సుమలత మాండ్యా నియోజకవర్గం నుండి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు కూడా అభిషేక్ – అవివా నిశ్చితార్థానికి వచ్చి వారిని ఆశీర్వదించారు. కాగా అభిషేక్, అవివాల మధ్య గత నాలుగేళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సుమలత కన్నడ నటుడు, రాజకీయవేత్త అంబరీష్‌ను డిసెంబర్ 8న 1991 వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఒకే కుమారుడు అభిషేక్ గౌడ. 2018 నవంబర్‌లో అంబరీష్ గుండెపోటుతో మరణించారు. ఇటీవల వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా దివంగత భర్త అంబరీష్‌ను తలుచుకుంటూ సుమలత ఓ ఎమోహనల్ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భర్త అంబరీష్‌తో సుమలత(ఫైల్) ನಿಶ್ಚಿತಾರ್ಥವನ್ನು ಮಾಡಿಕೊಂಡ ಅಭಿಷೇಕ್ ಅಂಬರೀಶ್ ಹಾಗೂ ಅವಿವ ಜೋಡಿಗೆ ಶುಭಾಶಯಗಳು💐#AbishekAmbareesh #AvivaBidapa #Engagement #Marraige #Cinema #Sandalwood #Entertainment #aviva #abhishekambarish #Sumalatha @dasadarshan @sumalathaA #darshan #dboss #dbossfans #Kaali #AA04 #AvivaBidappa pic.twitter.com/Kn4SxeXrLo — OTTRelease (@ott_release) December 11, 2022 -
నువ్వు ఎక్కడికి వెళ్లిపోలేదు.. నాలోనే ఉన్నావు.. సుమలత ఎమోషనల్ నోట్
కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు టాలీవుడ్లో అభిమానుల మనసులు గెలుచుకున్న సీనియర్ నటి సుమలత. తెలుగులో అగ్రహీరోలతో పలు సినిమాల్లో ఆమె నటించింది. దివంగత సూపర్‌స్టార్ కృష్ణతోనూ పలుచిత్రాల్లో ఆమె జంటగా కనిపించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఆమె వివాహ వార్షికోత్సవం సందర్భంగా దివంగత భర్త అంబరీష్‌ను తలుచుకుంటూ ఓ నోట్‌ను విడుదల చేసింది. (ఇది చదవండి: ఆ హీరోతో ఏడాదికో సినిమా చేయాలి: మంచు లక్ష్మి) నోట్లో సుమలత రాస్తూ.. 'ఈ రోజు గాలిలో మీ గొంతు విని నేను మీ ముఖం వైపు తిరిగా. నేను నిశ్శబ్దంగా నిలబడి ఉన్నప్పుడు గాలి వెచ్చదనం నన్ను తాకింది. నీ ఆలింగనం కోసం నేను కళ్లు మూసుకున్నా. నేను కురుస్తున్న వానను చూస్తూ కిటికీలో నుంచి చూశా. ప్రతి వాన చినుకులో మీ పేరు వినిపించింది.ఈరోజు నేను నిన్ను నా హృదయంలో దాచుకున్నా. అది నాకు సంపూర్ణమైన అనుభూతిని కలిగించింది. నువ్వు చనిపోయి ఉండొచ్చు.. కానీ నువ్వు ఎక్కడికి వెళ్లిపోలేదు. ఎప్పుడూ నాలో భాగమై ఉంటావు. సూర్యుడు ప్రకాశిస్తున్నంత కాలం గాలి వీస్తుంది. వర్షం కురుస్తుంది. అలాగే నువ్వు నాలో ఎప్పటికీ నివసిస్తావు. అది నా హృదయానికి తెలుసు.' అంటూ ఎమోషనల్ అయ్యారు. సుమలత, అంబరీష్ ప్రేమకథ: సుమలత డిసెంబర్ 8న 1991న కన్నడ నటుడు,రాజకీయ నాయకుడు అంబరీష్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు అభిషేక్ గౌడ జన్మించారు. అంబరీష్ 1984లో కన్నడ చిత్రం ఆహుతి సెట్స్‌లో మొదటిసారిగా కలిసిన తర్వాత నటి సుమలతతో స్నేహాన్ని పెంచుకుని మరింత దగ్గరయ్యారు. కాగా.. 24 నవంబర్ 2018న అంబరీష్ గుండెపోటుతో మరణించారు. కన్నడ సినీ పరిశ్రమ మొత్తం ఆయనకు నివాళులర్పించింది. ప్రభుత్వ లాంఛనాలతో అంబరీష్ అంత్యక్రియలు నిర్వహించారు. (ఇది చదవండి: సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో మునిగిపోయిన బాలీవుడ్ జంట) అనే నా జీవితానికి గొప్ప బహుమతి: సుమలత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఆ రోజు నీతో నడిచిన క్షణం ఎప్పుడూ కొత్తగానే అనిపిస్తుంది. నువ్వు నా లైఫ్ పార్టనర్‌గా నా జీవితంలోకి వచ్చిన రోజు నుంచి నాలో ఏదో కొత్త ఉత్సాహం. ఆ రోజుని పదే పదే గుర్తు చేస్తూ పెళ్లినాటి జ్ఞాపకాలన్నీ అక్కడే ఉన్నాయి. ఆ రోజుని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుంటా. మన 31 ఏళ్ల వివాహబంధంలో జీవితకాల జ్ఞాపకాలను నాటారు. మీరు అందించిన ప్రేమ, ఆప్యాయతలు నా జీవితానికి బహుమతులు' అంటూ ఎమోషనల్ అయ్యారు సీనియర్ నటి సుమలత. View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) View this post on Instagram A post shared by Sumalatha Ambareesh (@sumalathaamarnath) -
పెళ్లి సందD చిత్రం బాగుంటుంది: రాఘవేంద్రరావు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని సోమవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సినీ డైరెక్టర్ రాఘవేంద్రరావు, నటి సుమలత, పెళ్లి సందడి చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితోపాటు హీరో రోషన్, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, కర్ణాటక హీరో దర్శన్ కూడా ఉన్నారు. అనంతరం దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. పెళ్లి సందడి చిత్రం షూటింగ్ పూర్తి అయిపోయిందని తెలిపారు. చిత్రం చాలా బాగుంటుందని, శ్రీకాంత్ తనయుడితో మరోసారి పెళ్లి సందడి చిత్రం చేస్తున్నామన్నారు. రెండు సంవత్సరాల అనంతరం స్వామివారి దర్శనానికి వచ్చానని సీనియర్ నటి సుమలత అన్నారు. శ్రీవారిని దర్శించుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. పెళ్లి సందడి చిత్ర షూటింగ్ విజయవంతంగా పూర్తి అయిందని హీరో రోషన్ అన్నారు. అందుకే స్వామివారి దర్శనం యూనిట్ సభ్యులు దర్శనం చేసుకున్నామన్నారు.పెళ్లి సందడి చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కాగా నిన్న(ఆదివారం) స్వామివారిని 20,446 మంది భక్తులు సందర్శించుకోగా.. స్వామివారికి 8,610 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 2.50 కోట్లు వచ్చింది. -
పులి ముందు ఎలుకలా నిల్చున్నది ఎవరు?
సాక్షి, బెంగళూరు: దివంగత నటుడు అంబరీశ్ ముందు జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి చేతులు కట్టుకుని నిలబడిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనిపై కుమార గురువారం స్పందిస్తూ నేను ప్రజల ముందు కూడా చేతులు కట్టుకుని నిలబడతాను, ఈ విషయానికి అంత ప్రాధాన్యం అవసరం లేదు అన్నారు. ఆడపిల్లపై ప్రస్తుతం చర్చ వద్దని, ఎన్నికల సమయంలో మాట్లాడతానని ఎంపీ సుమలతను ఉద్దేశించి అన్నారు. కాగా ప్రముఖ నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్ గురించి కుమారస్వామి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మండ్య జిల్లాలోని కేఆర్ఎస్ డ్యామ్ గేట్ల లీకేజ్‌ని అరికట్టడానికి ఎంపీని అడ్డుగా పడుకోబెడితే సరిపోతుందంటూ ఆయన వ్యాఖ్యానించడం కలకలం రేపింది. ఇందుకు సుమలత ఘాటుగానే స్పందించారు. ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి స్థాయికి దిగజారి మాట్లాడితే ఆయనకు, తనకూ తేడా ఉండదని చురకలు అంటించారు. అదే విధంగా కేఆర్ఎస్ డ్యామ్ విషయం గురించి మాట్లాడుతూ.. కుమారస్వామి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని, మండ్యా జిల్లాలోని శ్రీరంగ పట్టణ తాలుకాలో అక్రమ గనుల తవ్వకాలు తాను ఆపేయాలని ఆదేశించినట్లు సుమలత పేర్కొన్నారు. ఈ విషయంలో కుమారస్వామి అవినీతి వైపు నిలబడి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో కుమారస్వామి వర్సెస్ సుమలత అన్నట్లుగా అనుచర వర్గాలు సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి తెర తీశారు. ఈ నేపథ్యంలో సుమలత- అంబరీష్ ఫ్యాన్స్ కుమార- అంబి పాత ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘పులి ముందు ఎవరు ఎలుకలా నిలబడ్డది ఎవరు? ఇప్పుడు ఆయన మహిళల గురించి ఏం మాట్లాడుతున్నారు’’ అంటూ తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. -
ఇప్పుడు బతికి ఉన్నది నేను కాదు
‘‘నా కళ్లను నేను మూసి ఉంచుతున్నాను. మళ్లీ మిమ్మల్ని చూడాలనే ఆరాటంతో.. నా చెవులను మూసి ఉంచుతున్నాను. మీ మాటలను వినగలనని’’ అని ఎంతో భావోద్వేగంతో ప్రముఖ నటి సుమలత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ని షేర్ చేశారు. తెలుగింటి ఆడపడుచు సుమలత ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్‌ని వివాహం చేసుకుని కన్నడ ఇంటి కోడలైన విషయం తెలిసిందే. 1991లో వీరి పెళ్లయింది. ఒక కుమారుడు ఉన్నాడు. అంబరీష్–సుమలత హ్యాపీ కపుల్. భర్త మరణం తర్వాత సుమలత పైకి ధైర్యంగా కనబడుతున్నప్పటికీ లోలోపల ఆయన్ను ఎంతగా మిస్సవుతున్నారో ఆమె మాటలు చెబుతున్నాయి. అంబరీష్ చనిపోయి ఈ నవంబర్ 24తో రెండేళ్లవుతోంది. ఈ సందర్భంగా సుమలత తన మనసులోని భావాలను ఈ విధంగా పంచుకున్నారు. ‘‘కళ్లు మూసి ఉంచగలను.. చెవులను కూడా మూయగలను కానీ నా హృదయాన్ని మాత్రం మూయలేను. ఎందుకంటే ఒక అనంతమైన ప్రేమ, ఒక అపూర్వమైన శక్తి, ఎన్నో జ్ఞాపకాలు దాగి ఉన్న హృదయం అది. మీరు లేకుండా రెండేళ్లు గడిచాయి. మీతో గడిపిన ప్రతి క్షణం ఎంత విలువైనదో తలుచుకుంటున్నాను. మనం పంచుకున్న ఆ తీయని క్షణాలు, జ్ఞాపకాలు, నవ్వులు, ప్రేమ.. అన్నీ అపూర్వమైనవి. సవాళ్లు ఎదురైనప్పుడు నా చెయ్యి పట్టుకుని నడిపించిన క్షణాలు, కలిగించిన ఆత్మవిశ్వాసం, నింపిన ధైర్యం, చీకటి క్షణాల్లో నింపిన నమ్మకం, ప్రేమ, వదిలి వెళ్లిన వారసత్వం (కుమారుడిని ఉద్దేశించి).. ఇవన్నీ నా జీవితం మొత్తం నన్ను నడిపిస్తాయి. మీ మంచితనం తాలూకు వెలుగు జీవితంలో నాకెదురయ్యే కష్టాల నుంచి నన్ను కాపాడుతుంది. నా చివరి శ్వాస వరకూ మీరు ఉంటారు. నా నవ్వు, నా ఏడుపు అన్నింట్లోనూ ఉంటారు. నేను పడిపోయినా, తడబడినా మీ అనంతమైన బలం నన్ను నిలబడేలా చేస్తుందని నాకు తెలుసు. ఇప్పుడు బతికి ఉన్నది నేను కాదు.. నా ద్వారా బతికి ఉన్నది మీరే.. మళ్లీ మనం ఒక్కటయ్యేవరకూ నా హృదయాన్ని పదిలంగా పట్టుకునే ఉండండి.. నన్ను బలంగా ఉంచండి’’ అంటూ భర్త మీద తనకున్న అపారమైన ప్రేమను వ్యక్తపరిచారు సుమలత. -
సీనియర్ నటికి కరోనా పాజిటివ్!
బెంగుళూరు: చిన్న, పెద్ద, ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రముఖుల దగ్గర నుంచి సామాన్యుల వరకు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా.. రిపోర్టులో పాజిటివ్ వచ్చింది. శనివారం ఆమెకు తలనొప్పి, గొంతు నొప్పి రావడంతో అనుమానం వచ్చి.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దానికి సంబంధించి రిపోర్ట్ ఇవాళ(సోమవారం) రాగా.. అందులో కరోనా పాజిటివ్ వచ్చింది. (‘నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఈటల’) ప్రస్తుతం సుమలత హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. డాక్టర్ సలహాతో ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. ప్రజలందరి ఆశీర్వాదంతో..త్వరలోనే కరోనా నుంచి బయటపడతానని ఆమె చెప్పారు. ఇటీవల తాను కలిసిన వారందరి వివరాలను అధికారులు వెల్లడంచానని తెలిపారు. వారంతా వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాలం భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సుమలత 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా లోక్‌సభ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. జేడీఎస్ అభ్యర్థి, దేవెగౌడ మనవడు నిఖిల్‌పై గెలిచి, పార్లమెంట్లో అడుగుపెట్టారు. తన నియోజక వర్గంలోని ప్రజలకు పలుమార్లు సుమలత కరోనా పై అవగాహన కల్పించారు. తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. (కరోనాకు మందు కనిపెట్టిన స్టార్ డైరెక్టర్!) -
‘కిలేడీ’ కేసులో మరో కొత్తకోణం
ఒంగోలు: జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిన సుమలత కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. మహిళే మగ వేషం ధరించి బాలికలపై కృత్రిమ సాధనాలతో లైంగిక దాడికి పాల్పడిందనేందుకు మరో బలమైన ఆధారం పోలీసులకు లభ్యమైంది. సుమలతే మగవాడిలా విగ్ పెట్టుకొని సాయి అనే పేరుతో చలామణి అయినట్టు తెలుస్తోంది. కంఠంతోపాటు మగవాడిలా వేషం మార్చి కథ నడిపిందన్న బాగోతం వెలుగులోకి రావడంతో అందుకు సంబంధించిన ఆధారాలుసేకరించే పనిలో పడ్డారు పోలీసులు. నిందితురాలు సుమలత భర్త ఏడుకొండలు ఆత్మహత్య చేసుకోవడం, ఫోక్సో కేసులో ఆమె రిమాండ్‌లో ఉండడంతో దర్యాప్తు కోసం సాంకేతిక సహకారంతోపాటు భౌతిక సాక్ష్యాల కోసం వేట మొదలు పెట్టారు. కేసును విచారణలో భాగంగా సింగరాయకొండ సీఐ టీఎక్స్ అజయ్‌కుమార్ శుక్రవారం సుమలత నివాసం ఉండే ఒంగోలు మారుతీనగర్‌లోని పెంట్ హౌస్‌లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. మొత్తం ఏడు ప్రేమ లేఖలను సీజ్ చేశారు. అవన్నీ నోటు పుస్తకాలను చించి రాసినట్లుగా ఉన్నాయి. వాటిలో మూడు లేఖలు ‘హాయ్’ పేరుతో ఉంటే మరో నాలుగు లేఖలు మాత్రం ‘సాయి చరణ్’ పేరుతో ఉన్నాయి. దీంతో సాయిచరణ్ అన్న పేరు కేవలం కల్పితం అన్న విషయం రూఢీ అయింది. పొడవాటి జుట్టును ఎలా కప్పి పెట్టి ఉంటుందనే సంశయం కూడా తాజా తనిఖీలలో గుర్తించిన విగ్‌తో వీగిపోయింది. పొడవాటి జడ సైతం అందులో ఇమిడి పోయే మగవారు ధరించే విగ్ శుక్రవారం తనిఖీల్లో పోలీసులకు లభ్యమైంది. దీంతో బాలికలను ఆకట్టుకునే క్రమంలో సుమలతే సాయిచరణ్‌గా వేషం ధరించేదనే నిర్ధారణకు వచ్చారు. ప్రేమ లేఖలపై సస్పెన్స్.. పోలీసులు సీజ్ చేసిన ఏడు ప్రేమ లేఖల్లో ఒకే చేతిరాత ఉన్నప్పటికీ ఎక్కడా దిగువన సంతకాలు మాత్రం లేవు. దీంతో వాటిని రాసింది ఎవరనేది నిర్థారణ చేయాల్సి ఉంది. సుమలత జీవితానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడం ద్వారా ఆమె ఎందుకు ‘షీ మ్యాన్’లా వ్యవహరిస్తుందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. (చదవండి: ఆమె ఇంట్లో కృత్రిమ లైంగిక సాధనాలు, ప్రేమలేఖలు) -
పార్లమెంట్లో ఫస్ట్‌డే
అందరికీ స్కూల్, కాలేజీ, ఆఫీస్... ఇలా అన్నింటికీ ఫస్ట్‌డే గుర్తుండే ఉంటుంది. చిన్న టెన్షన్, చాలా ఉత్సాహంతో మొదటిరోజు గడుస్తుంది. ప్రస్తుతం పార్లమెంట్లో తొలిసారి అడుగుపెడుతున్నారు నటి సుమలత. ఎంపీగా తొలిరోజును జ్ఞాపకంగా ఓ ఫొటో తీసుకొని ‘‘ప్రజాస్వామ్యానికి దేవాలయం అయినటువంటి పార్లమెంట్లో మొదటిరోజు. ఇది చాలా సుదీర్ఘమైన ప్రయాణం. ఈ అవకాశాన్ని అదృష్ణంగానూ, గౌరవంగానూ భావిస్తున్నాను’’ అని క్యాప్షన్ పెట్టారామె. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యా ప్రాంతం నుంచి సుమలత ఎంపీగా ఎన్నికయిన సంగతి తెలిసిందే. -
ఓటమిపై బాధ్యత నాదే : ముఖ్యమంత్రి కుమారుడు
మండ్య : రాష్ట్రంలోనే అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మండ్య లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఎన్నికలోనే ఓటమిని చవి చూసిన ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ తొలిసారిగా తన ఓటమిపై స్పందించారు. తన ఓటమికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేడీఎస్ నాయకులు, కార్యకర్తలు కారణం కాదని, తన ఓటమికి తానే బాధ్యత తీసుకుంటున్నాని తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. మండ్యలో తన ఓటమికి తానే కారణమని ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టు చేశారు. భవిష్యత్‌లో మండ్య జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ విషయంపై త్వరలో మీడియా సమావేశం నిర్వహిస్తానని చెప్పారు. అభినందనలు : మండ్య పార్లమెంటు స్థానం నుంచి విజయం సాధించిన స్వతంత్ర అభ్యర్థి సుమలతకు ఆయన అభినందనలు తెలిపారు. అదే విధంగా అభిషేక్ గౌడ నటించిన అమర్ సినిమా విజయవంతం కావాలని తన ట్విటర్లో ఆకాంక్షించారు. దీంతో నిఖిల్ కుమార స్వామి చేసిన పోస్ట్ చూసిన వేలాది మంది అభిమానులు, ప్రజలు లైక్స్ కొడుతూ తమ స్పందనలను సైతం తెలిపారు. -
కీలక భేటీ
ఆదివారం బెంగళూరులో బీజేపీ నేతలు యడ్యూరప్ప, ఎస్ఎం కృష్ణను కలిసి మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత. ప్రజలు కోరితే బీజేపీలో చేరతానని ఆమె అన్నారు. సాక్షి, బెంగళూరు: మండ్య స్వతంత్ర ఎంపీ, నటి సుమలత అంబరీశ్ ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పతో భేటీ అయ్యారు. మండ్య లోక్‌సభ ఎన్నికల్లో తనకు సహకరించి విజయాన్ని అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బెంగళూరు ఈమేరకు బెంగళూరులో డాలర్స్ కాలనీలోని యడ్యూరప్ప నివాసంలో కలిసి చర్చలు జరిపారు. బీజేపీ సీనియర్ నాయకులు ఎస్ఎం కృష్ణ, ఆర్.అశోక్ తదితరులు కూడా చర్చలు పాల్గొనడం గమనార్హం. మండ్య ప్రజల నిర్ణయం మేరకు బీజేపీలో చేరాలా, వద్దా అనే నిర్ణయం తీసుకుంటానని ఆమె తెలిపారు. బీజేపీలోకి వస్తే సంతోషం – యడ్డీ యడ్యూరప్ప మాట్లాడుతూ మండ్య ప్రజ లు ఈసారి మార్పును కోరుకుని సుమ లతను గెలిపించడం ఆనందంగా ఉందన్నారు. ఏ పార్టీలో చేరాలనేది ఆమె నిర్ణ యమే అన్నారు. బీజేపీలోకి వస్తే సంతో షం, సాదరంగా ఆహ్వానిస్తామని, కేంద్రం లోని ఎన్డీయే కూటమికి మద్దతు ఇచ్చినా సంతోషమే అన్నారు. సుమలత సునామీ విజయంలో తాము కూడా భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని చెప్పారు. ప్రజాభీష్టం మేరకు ఓటర్లకు సుమలత కృతజ్ఞతలు తెలిపారు. అయితే నియమ నిబంధనల ప్రకారం తాను ఏ పార్టీలోకి అధికారికంగా చేరకూడదన్నారు. మండ్య పార్లమెంటులోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించి ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతానని తెలిపారు. అప్పుడు ప్రజల నుంచి సలహాలు తీసుకుని ఏ పార్టీలో చేరాలనే నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. -
విజయకాంత్, ప్రేమలతపై సెటైర్లు..
సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతే కాదు, ఓటింగ్ శాతాన్ని డీఎండీకే పూర్తిగా కోల్పోయింది. వరుస పతనాల నేపథ్యంలో ఆ పార్టీ మరింత కష్టాల్లోకి కూరుకుపోయింది. ఆ పార్టీకి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తింపు రద్దు అయినట్టే. అలాగే, ఢంకా చిహ్నం దూరం కావడం దాదాపుగా ఖాయమైంది. విజయకాంత్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగలడం ఓ వైపు ఉంటే, ఆయన సతీమణి ప్రేమలత తీరుపై డీఎండీకే వర్గాలు విమర్శలు గుప్పించే పనిలో పడడం గమనార్హం. సినీ నటుడిగా అశేషాభిమాన లోకం మదిలో ముద్ర వేసుకున్న విజయకాంత్ 2005లో మదురై వేదికగా డీఎండీకేను ప్రకటించారు. దేశీయ ముర్పోగు ద్రావిడ కళగంతో 2006లో ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో విజయకాంత్ ఒక్కడే అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అయితే, ఆ ఎన్నికల్లో విజయకాంత్ సొంతం చేసుకున్న ఓటు బ్యాంక్ ఆ పార్టీ బలాన్ని మరింతగా పెంచింది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన విజయకాంత్ 10.3 శాతం ఓటు బ్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. ఆ తదుపరి పరిణామాలతో 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఇందుకు కారణం అన్నాడీఎంకేతో పొత్తుతో ఆ ఎన్నికల్ని ఎదుర్కొనడమే. ప్రధాన ప్రతి పక్ష నేతగా ఉన్నత స్థితికి ఎదిగిన వేళ అన్నాడీఎంకేతో వైరం విజయకాంత్‌ను కష్టాల సుడిగుండంలో పడేసింది. పార్టీ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే జై కొట్టడం వంటి పరిణామాలు విజయకాంత్‌ను ఇరకాటంలో పెట్టాయి. అయినా, ఏ మాత్రం తగ్గని విజయకాంత్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేకు ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ నేతృత్వంలో కూటమి ఏర్పాటులో సఫలీకృతుడయ్యారు. అయితే, ఆ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతుతో పాటు ఓటు బ్యాంక్ పతనం మొదలైంది. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముఖ్య నేతలు డీఎంకే, అన్నాడీఎంకేల్లోకి వెళ్లడంతో అభ్యర్థుల కోసం తీవ్ర కుస్తీలు పట్టక తప్పలేదు. చివరకు ఆ ఎన్నికల ఫలితాలు విజయకాంత్‌ను పాతాళంలోకి నెట్టే పరిస్థితిని కల్పించాయి. విజయకాంత్ సైతం ఓటమి పాలు కాగా, ఓటు బ్యాంక్ ఐదు శాతం పైగా దక్కించుకుని పార్టీ గుర్తింపు రద్దు కాకుండా గట్టెక్కారు. గుర్తింపు రద్దయినట్లే.... 2016 ఎన్నికల అనంతరం అనారోగ్య కారణాలతో విదేశాలకు వెళ్తూ వచ్చిన విజయకాంత్‌కు 2019 లోక్‌సభ ఎన్నికల్లో డిమాండ్ పెరిగింది. ఆయన్ను తమ వైపు అంటే, తమ వైపు తిప్పుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రయత్నించాయి. చివరకు అన్నాడీఎంకే – బీజేపీతో జతకట్టిన విజయకాంత్ నాలుగు చోట్ల పోటీ చేశారు. అయితే, ఎన్నికల ఫలితాలు డీఎండీకేను కష్టాల కడలిలో పడేసింది. డిపాజిట్లే కాదు, ఓటు బ్యాంక్ పూర్తిగా పతనమైంది. విజయకాంత్ బావ మరిది సుదీష్ కళ్లకురిచ్చి నుంచి పోటీ చేయగా, 3 లక్ష 21 వేల 794 ఓట్లు దక్కించుకున్నారు. విరుదునగర్‌లో ఆ పార్టీ నేత అళగర్ స్వామి 3 లక్షల 16 వేల 329 ఓట్లు రాబట్టుకోగలిగారు. ఇక, ఉత్తర చెన్నైలో మోహన్ రాజు లక్షా 29 వేల 468, తిరుచ్చిలో ఇలంగోవన్ లక్షా 61 వేల 999 ఓట్లతో సరిపెట్టుకున్నారు. పార్టీ ఓటు బ్యాంక్ అన్నది 2.19 శాతానికి దిగ జారింది. దీంతో ఆ పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు రద్దు అయినట్టే అన్న పరిస్థితి. డిపాజిట్లతో పాటు ఓటు బ్యాంక్ తగ్గిన దృష్ట్యా, ఆ పార్టీ ఎన్నికల చిహ్నం ఢంకా కూడా దూరమైనట్టే. ఎన్నికల కమిషన్ గుర్తింపు ఓ పార్టీకి తప్పనిసరిగా ఉండాలంటే, కనీసం ఆరు శాతం మేరకు ఓటు బ్యాంక్‌ను కల్గి ఉండాల్సి ఉంది. అలాగే, ఒక ఎంపీ లేదా, కనీస సంఖ్యలో ఎమ్మెల్యేలైనా ఎన్నిక కావాల్సి ఉంది. అయితే, డీఎండీకేకు వరసుగా మూడు ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతు కావడంతో ఆ పార్టీ గుర్తింపు ఇక రద్దయినట్టే. అలాగే, ఢంకా చిహ్నం కూడా ఆ పార్టీకి శాశ్వతంగా దూరం ఖావడం తథ్యం. కాగా, పార్టీ ఓటమికి కోశాధికారి ప్రేమలత విజయకాంత్ కారణం అంటూ ఆ పార్టీ వర్గాలే విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. ఇందుకు తగ్గట్టుగా, సామాజిక మాధ్యమాల్లో ప్రేమలత విజయకాంత్‌పై సెటైర్లు జోరందుకోవడం గమనార్హం. డీఎంకే తలుపులు తెరచి ఉన్నప్పుడే లోనికి వెళ్లకుండా, అన్నాడీఎంకే వైపుగా వెళ్లి వదినమ్మ పెద్ద తప్పే చేశారని, ఇప్పడు అన్నయ్యకు మరింత కష్టాలు తెచ్చి పెట్టారన్నట్టుగా వ్యాఖ్యల తూటాలు సామాజిక మాధ్యమాల్లో పేలుతున్నాయి. -
ముఖ్యమంత్రి తనయుడి ఓటమి
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సుమలత ఈ ఎలక్షన్లలో తొలిసారిగా రాజకీయ అరంగేట్రం చేసి ఘన విజయం సాధించారు. అంబరీష్ మరణంతో రాజకీయ తెర మీదకు వచ్చిన సుమలత, తన భర్త పోటి చేసిన మాండ్య నియోజిక వర్గం నుంచే బరిలో దిగాలని నిర్ణయించుకున్నారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్‌ల పోత్తు కారణంగా మాండ్య సీటును కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌కు వదిలేసింది. అక్కడి నుంచి కర్ణాటక ముఖ్యమంత్రి తనయుడు, యువ హీరో నిఖిల్ గౌడ జేడీఎస్ తరపున బరిలో నిలిచాడు. దీంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుమలత ఇండిపెండెంట్‌గా బరిలో దిగారు. కన్నడ చిత్రసీమలోని స్టార్ హీరోలంతా సుమలతకు మద్ధతుగా నిలిచి ప్రచారంలో పాల్గొన్నారు. అంబరీష్ పై ఉన్న అభిమానంతో పాటు సింపతీ కూడా కలిసి రావటంతో సుమలత ఘన విజయం సాధించారు. అధికార పార్టీ నిఖిల్ ను గెలిపించేందుకు చేసిన ప్రయత్నాలన్నింటిని తిప్పి కొట్టి సుమలత విజయం సాధించారు. -
సుమలతను గెలిపించండి: మోహన్ బాబు
సాక్షి, హైదరాబాద్ : స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు అంబరీష్ సతీమణి, నటి సుమలతను భారీ మెజార్టీతో గెలిపించాలని వైఎస్సార్సీపీ నేత, నటుడు మంచు మోహన్‌బాబు మండ్య ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేశారు. ‘కర్ణాటక ప్రజలందరికీ.. మండ్య ప్రజలు, అభిమానులకు ప్రత్యేకంగా.. మన అభిమాన నటుడు, ప్రజల మనిషి, గొప్ప వ్యక్తిత్వం గల నటుడు అంబరీష్. మండ్యప్రజల సంక్షేమం కోసం నిరంతరం పరితపించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేశారు. ఇవన్నీ మనకు తెలుసు. ఇప్పుడు మనందరి బాధ్యత ఆ గొప్ప వ్యక్తి సతీమణి సుమలతకు అండగా నిలబడటం. మీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. మీ అందరి ఆశీస్సులు సుమలతకు ఉంటాయని, ఆమెను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. అంబరీష్‌తో పాటు నేను కూడా మిమ్మల్ని ప్రేమించాను. మండ్య ప్రజలు సహృదయం కలవారు. వారందరికి నా నమస్కారాలు. చంద్రబాబు నాయుడు ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం. ఇప్పుడు కాదు.. ఇక ఎప్పటికీ కారు. మంచి మనస్సు గల అంబరీష్.. చంద్రబాబు నా ద్వారా పిలిచిన చాలా కార్యక్రమాలకు హాజరయ్యారు. కానీ చంద్రబాబుకు ఏమాత్రం కృతజ్ఞతాభావం లేదు. అతని కోసం అంబరీష్ చాలా చేశారు. అలాంటి అతని భార్యను ఓడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రచారం చేయడం హాస్యాస్పదకం.. ఆశ్చర్యకరం. కులం, డబ్బు రాజకీయాలను పక్కనబెట్టి సుమలతను గెలిపిస్తారని ఆశీస్తున్నాను.’ మోహన్‌బాబు పేర్కొన్నారు. To all the people of Kannada, especially Mandya people and fans... pic.twitter.com/E3jiTbjKax — Mohan Babu M (@themohanbabu) April 17, 2019 -
తెలుగు మహిళపై చంద్రబాబు యుద్ధం
సాక్షి బెంగళూరు/ యశవంతపుర (బెంగళూరు): అలనాటి నటి, ఇటీవల భర్తను కోల్పోయిన తెలుగింటి ఆడబిడ్డ సుమలతను ఎన్నికల్లో ఓడించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. తన భర్త అంబరీష్ ఆశయ సాధన కోసం మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా సుమలత పోటీ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఆమెకు మద్దతుగా నిలబడడానికి బదులు ఓడించేందుకు చంద్రబాబు సమాయత్తమయ్యారు. మండ్యలో కర్ణాటక సీఎం కుమారస్వామి తనయుడు, జేడీఎస్ అభ్యర్థి నిఖిల్ తరఫున చంద్రబాబు ప్రచారానికి దిగనున్నారు. దీనిపై కన్నడనాట ఉన్న తెలుగువారి నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇదేనా 40 ఏళ్ల చంద్రబాబు రాజకీయం అని సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. సోమవారం చంద్రబాబు నిఖిల్ తరఫున మండ్య సమీపంలోని పాండవపురంలో ప్రచారం చేశారు. చంద్రబాబు ప్రభావం ఉండదు: సుమలత ఏపీ సీఎం చంద్రబాబు మండ్యకు వచ్చి జేడీఎస్ తరఫున ప్రచారం చేసినంత మాత్రాన ఆయన ప్రభావం ఏమాత్రం ఉండదని నటి, స్వతంత్ర అభ్యర్థి సుమలత స్పష్టం చేశారు. సోమవారం ఆమె మండ్య పరిధిలోని మంచనహళ్లిలో ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. మండ్యలో తెలుగువారు లేనందున చంద్రబాబు జేడీఎస్ తరఫున ప్రచారం చేసినా ఆయన ప్రభావం ఏమీ ఉండదన్నారు. ప్రధాని పదవికి వన్నె తెచ్చిన దేవెగౌడ కర్ణాటక వ్యాప్తంగా కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఓటర్లను కోరారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ, సీఎం కుమారస్వామిలకు మద్దతుగా సోమవారం సాయంత్రం ఆయన మండ్య లోక్‌సభ నియోజకవర్గంలోని పాండవపురలో నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. దక్షిణ భారత్‌కు దేవెగౌడ పెద్దదిక్కు అని, దేశం కోసం ఆయన ప్రధాని పీఠం చేపట్టి.. ఆ పదవికే వన్నె తెచ్చారని పొగడ్తలు గుప్పించారు. తొలుత కన్నడలో కొన్ని పదాలు మాట్లాడుతూ ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. మండ్యలో దేవెగౌడ మనవడు, సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్‌ను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ – జేడీఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ పతనమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని, బీజేపీని గెలిపిస్తే దేశం నాశనం అవుతుందని, ప్రధాని మోదీ, అమిత్‌షా అవినీతిపరులని ధ్వజమెత్తారు. మోదీనే మరోసారి ప్రధాని కావాలంటూ శత్రు దేశమైన పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఆ దేశంతో కలసి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారనే అనుమానం కలుగుతోందన్నారు. కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమని, ఈ ఎన్నికల్లో మోదీ ఓడిపోయి గుజరాత్‌కు వెళ్లిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. -
సుమలతను ఓడించేందుకు ఇన్నికుట్రలా?!
సాక్షి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు విమర్శలు- ప్రతివిమర్శలతో దూకుడు పెంచుతున్నాయి. ఎలాగైనా విజయం దక్కించుకోవాలనే కసితో వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కర్ణాటకలోని మండ్య పార్లమెంట్ స్థానంలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఎందుకంటే ఇక్కడి నుంచే సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ తొలిసారి పోటీ చేస్తుండగా.. దివంగత నటుడు, కేంద్ర మంత్రి అంబరీష్ భార్య సుమలత కూడా ఇక్కడి నుంచే బరిలో దిగుతున్నారు. అయితే కాంగ్రెస్-జేడీఎస్ కూటమి పొత్తులో భాగంగా సుమలతకు కాంగ్రెస్ అధిష్టానం మొండిచేయి చూపడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమెకు మద్దతుగా నిలుస్తామంటూ బీజేపీ ముందుకొచ్చింది. దీంతో సుమలత- నిఖిల్ల మధ్య మాత్రమే ప్రధాన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్- జేడీఎస్ నాయకుల మధ్య భేదాభిప్రాయాల కారణంగా నిఖిల్ గెలుపుపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో కుమారుడి కోసం రంగంలోకి దిగిన సీఎం కుమారస్వామి సుమలతను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. భర్త చనిపోయిన బాధ ఆమె ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదని.. ఏదో నాటకీయంగా సినిమా డైలాగ్‌లు చెబుతూ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో విమర్శలకు సమాధానం చెబుతూనే సుమలత తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. అయితే ఆమెను ఓడించేందుకు అధికార పార్టీ మరో ఎత్తుగడకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. సుమలత పేరుతో మరో ముగ్గురు మహిళలు.. అది కూడా కుమారస్వామి సామాజిక వర్గానికి చెందిన వారు మండ్య స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. తద్వారా సుమలతకు పడే ఓట్లను చీల్చాలనేదే వీరి ప్రధాన ఉద్దేశంగా కనపడుతోంది.(చదవండి : సుమలతపై కుమారస్వామి ఘాటు విమర్శలు) ఇలా చేస్తారని ముందే తెలుసు.. సుమలత అంబరీష్ దాఖలు చేసిన అఫిడవిట్లో భాగంగా తాను ఎస్ఎస్ఎల్సీ పాసయ్యానని పేర్కొన్నారు. కాగా ఎం. సుమలత(భర్త పేరు- మంజె గౌడ) విద్యార్హత ఎనిమిదో తరగతిగా పేర్కొనగా, సుమలత(భర్త పేరు- సిద్దె గౌడ) ఏడో తరగతి వరకు చదివినట్లుగా పేర్కొన్నారు. వీరితో పాటుగా మరో సుమలత(భర్త పేరు- కె.దర్శన్) పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక సుమలతా అంబరీష్ తరఫున దర్శన్ అనే నటుడు ప్రచారం చేస్తుండటం గమనార్హం. ఈ విషయం గురించి సుమలతా అంబరీష్ మాట్లాడుతూ..‘ వాళ్లు ఇలాంటి గిమ్మిక్కులకు పాల్పడతారని ముందే తెలుసు. నన్ను ఓడించడానికి వారు వేసిన ఎత్తుగడ. నేను కూడా వారిలా చేయవచ్చు కానీ అది నాకు నచ్చదు. నేరుగా, న్యాయంగా ‘యుద్ధం’ చేసి గెలవాలనుకుంటున్నా. వాళ్లలా దొంగచాటు రాజకీయాలు నాకు చేతకావు అని వ్యాఖ్యానించారు. (చదవండి : నా భర్త ఆత్మకు శాంతి చేకూరాలంటే నిఖిల్‌కు ఓటు వేయాలా?!) కాగా 1994లో రాజకీయాల్లో అడుగు పెట్టిన అంబరీష్ సొంత నియోజకవర్గం మండ్య నుంచే కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలుపొందారు. 1998, 99, 2004లో అక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించారు. నటుడిగా, సమాజ సేవకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన అంబరీష్‌కు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చరిష్మా ఉంది. అంబరీష్ మరణం తర్వాత సుమలత ఎన్నికల్లో పోటీ చేయాలంటూ అభిమానులు ఒత్తిడి చేయగా ఆమె ముందుకు వచ్చారు. అయితే కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో కొడుకు గెలుపు కోసం కుమారస్వామి సహా ఆయన అనుచరవర్గం రంగంలోకి దిగడంతో.. ‘ఒక మహిళను ఓడించేందుకు ఏకంగా సీఎం స్థాయి వ్యక్తి, మంత్రులు ఆమెపై చవకబారు విమర్శలకు దిగుతున్నారు. వాళ్ల మాటలు వింటుంటే ఇప్పటికే సుమలత సగం విజయం సాధించినట్లుగా అన్పిస్తుంది’ అని విశ్లేషకులు భావిస్తున్నారు. -
నా భర్త ఆత్మకు శాంతి చేకూరాలంటే నిఖిల్‌కు ఓటు వేయాలా?!
సాక్షి, బెంగళూరు : తమ తరపున ప్రచారాల్లో పాల్గొంటున్న హీరోలు దర్శన్, యశ్‌లు పంటల్ని మేసే జోడెద్దులంటూ వ్యాఖ్యానించి సీఎం కుమారస్వామి తన స్థాయి దిగజార్చుకున్నారని సుమలతా అంబరీష్ మండిపడ్డారు. తన భర్త, దివంగత కేంద్ర మంత్రి అంబరీష్ ప్రాతినిథ్యం వహించిన మాండ్య పార్లమెంట్ స్థానం నుంచి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మంగళవారం శ్రీరంగపట్టణ తాలూకా కేఆర్‌ఎస్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన కుమారుడు నిఖిల్(కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మండ్య అభ్యర్థి) గెలుపు కోసం సీఎం కుమారస్వామి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జేడీఎస్ పార్టీ సమావేశాలు నిర్వహించే సమయంలో పోని విద్యుత్ సరిగ్గా తాము నిర్వహించే సమావేశాల సమయంలోనే ఎలా పోతుందంటూ సుమలత ప్రశ్నించారు. తమ సమావేశాల సమయంలో కరెంట్ కట్ చేయకూడదంటూ సీఎం కుమారస్వామి విద్యుత్ అధికారులకు రాసిన లేఖను ఎన్నికల సంఘానికి సమర్పించామన్నారు. ‘హీరోలు యశ్, దర్శన్‌లు తమ తరఫున ప్రచారం చేస్తే సీఎం కుమారస్వామి ఓర్వలేకపోతున్నారన్నారు. గతేడాది విధానసభ ఎన్నికల్లో మంత్రి సా.రా మహేశ్ హీరో యశ్‌తో ఎన్నికల ప్రచారాలు చేయించుకున్న విషయాన్ని ఆయన ఓసారి గుర్తు చేసుకుంటే మంచిది’ని హితవు పలికారు. (రసవత్తరంగా మాండ్య పోరు!) అంబరీశ్ ఆత్మకు శాంతి చేకూరాలంటే .. ‘కాంగ్రెస్- జేడీఎస్ కూటమి అభ్యర్థి తరపున సినీతారలు ప్రచారంలో పాల్గొంటే అది ప్రచారం. మా తరఫున పాల్గొంటే అనాచారం’ అనే విధంగా కొంతమంది మంత్రులు వ్యాఖ్యానించడం వారి మనఃస్థితిని తెలియజేస్తోందని సుమలత పరోక్షంగా కాంగ్రెస్ నేత, మంత్రి డీకే శివకుమార్‌ను విమర్శించారు. ఆయనకు నిఖిల్‌పై అంత ప్రేమ ఉంటే తమ్ముని నియోజకవర్గాన్ని కేటాయించి ఉండాల్సిందని ఎద్దేవా చేశారు. అది వదిలేసి మండ్యకు రావడమే కాకుండా అంబరీశ్ ఆత్మకు శాంతి చేకూరాలంటే ఎన్నికల్లో నిఖిల్‌కి ఓట్లు వేయాలంటూ అడగమేమిటని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారాల్లో అంబరీశ్ పేరు ప్రస్తావించాల్సిన అవసరం లేదన్నవారు మాటపై నిలబడాలని సవాల్ చేశారు. ఈ సందర్భంగా ఆమె పలువురు మహిళలను కలిశారు. -
సీఎం మాట తప్పారు
సాక్షి, బెంగళూరు: ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం అంబరీష్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారా? అంని సీఎం కుమారస్వామి సుమలత ప్రశ్నించారు. మండ్య జిల్లాలో సుమలతా మీడియాతో మాట్లాడుతూ అంబరీష్ పేరును ఉపయోగించుకున్న వారు ఎవరు, ఇప్పుడు ఆయనకు విరుద్ధంగా మాట్లాడేవారు ఎవరనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. అంబరీష్ గురించి ఏమీ మాట్లాడనని రెండు రోజుల క్రితం చెప్పిన సీఎం అప్పుడే మాట తప్పారని విమర్శించారు, అంబరీష్‌కు ఏం చేశారో మాట్లాడుతున్న సీఎం, మండ్య ప్రజలకు ఏమీ చేశారో కూడా చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. -
కొత్త సినిమాలకు కోడ్ దెబ్బ?
కొన్నినెలల కిందట శాండల్‌వుడ్‌ను లైంగిక వేధింపుల మీ టూ సంక్షోభం కుదిపేయడం తెలిసిందే. తాజాగా సార్వత్రిక ఎన్నికల నియమావళి చిత్రసీమకు నిద్ర లేకుండా చేస్తోంది. నియమావళి ప్రకారం ఎన్నికల్లో పోటీచేసే నటీనటుల చిత్రాలను కోడ్ సమయంలో విడుదల చేయడానికి వీల్లేదు. ఫలితంగా ఈ ఏప్రిల్‌లో రాబోయే పలు భారీ సినిమాలు బాక్సుల్లోనే ఉండిపోవచ్చు. సాక్షి, బెంగళూరు: శాండల్‌వుడ్‌కు ఎన్నికల కోడ్ సెగ తగిలింది. ఎన్నికల్లో పోటీ చేయదలచిన నటుల సినిమాల విడుదలకు ఎన్నికల కోడ్ ఆటంకంగా మారింది. ఉపేంద్ర, ప్రకాశ్‌రాజ్, సుమలతా, నిఖిల్ నటించిన సినిమాలు ఏప్రిల్‌లో విడుదల కావాల్సి ఉంది. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో వీరు నటించిన చిత్రాల నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఏయే సినిమాలు ♦ ఉపేంద్ర నటించిన ‘ఐ లవ్ యూ’, సుమలతా అంబరీశ్ నటించిన ‘డాటర్ ఆఫ్ పార్వతమ్మ’, నిఖిల్ కుమార, దర్శన్ కాంబినేషన్లో‘కురుక్షేత్ర’, ప్రకాశ్ రాజ్ నటిస్తున్న కొన్ని తెలుగు, తమిళ చిత్రాలు మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందు రావాల్సి ఉంది. ♦ ఉపేంద్ర చిత్ర ‘ఐ లవ్ యూ’ చిత్రాన్ని మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారంలో విడుదల చేసేందుకు నిర్మాత, దర్శకుడు ఆర్.చంద్రు సిద్ధమవుతున్నారు. కోడ్ నేపథ్యంలో విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. తెలుగులో ఆలస్యమయినా ఫర్వాలేదు కానీ కన్నడలో విడుదల ఆసల్యమైతే ఇబ్బందులు తప్పవని నిర్మాత యోచనలో పడ్డారు. ఉపేంద్ర ఉత్తమ ప్రజాకీయ పార్టీ ద్వారా ఈ ఎన్నికల్లో తన అభ్యర్థులను పోటీని నిలపబోతున్న సంగతి తెలిసిందే. ♦ సీఎం తనయుడు నిఖిల్ మండ్య లోక్‌సభ నియోజవర్గం నుంచి పోటీకి నిలబడడం దాదాపు ఖాయమైంది. ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కురుక్షేత్ర విడుదల వాయిదా పడే అవకాశాలు లేకపోలేదు. ♦ సుమలత నటించిన ‘డాటర్ ఆఫ్ పార్వతమ్మ’ చిత్రం ఏప్రిల్ మొదటి వారంలో విడుదల కావాల్సి ఉంది. ఆమె ఎన్నికల ప్రచారంలో తలమునకలయ్యారు. పోటీపై సందిగ్ధం కొనసాగుతోంది. దీంతో చిత్ర విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. ప్రకాశ్‌రాజ్ సినిమాలు సైతం బహుభాషా నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించి ప్రచారం సాగిస్తున్నారు. ఆయన నటించిన కొన్ని తెలుగు, తమిళ ప్రముఖ చిత్రాలు విడుదలపై జాప్యం నెలకొంది. చాలా చిత్రాల్లో ఆయా భాషల్లో స్టార్ హీరోలు నటించినవే కావడం విశేషం. ఆ చిత్రాలు కర్ణాటకలోనూ విడుదలయ్యేవే. ఎన్నికల నియమావళితో వీటికి బ్రేక్‌పడే అవకాశముంది. -
సుమలతకు కాంగ్రెస్ మద్దతు ఉండదు
కర్ణాటక, శివాజీనగర : ప్రస్తుత ఎంపీలకు టికెట్ల కేటాయింపుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. మైసూరు–కొడుగు నియోజకవర్గాల టికెట్ కేటాయింపు విషయంపై అధిష్టానం తనకు బాధ్యత అప్పగించిందని అన్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా మండ్య నియోజకవర్గాన్ని జేడీఎస్‌కు అప్పగించిన నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ నుంచి సుమలత పోటీ చేయడం కుదరదని, ఒకవేళ ఆమె పోటీ చేసినా ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా ఆమె మద్దతు ఇవ్వరని తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున సుమలత పోటీ చేయటం లేదని, దీంతో ఆదివారం డీకే.శివకుమార్ ఏర్పాటు చేసిన మండ్య జిల్లా కాంగ్రెస్ నాయకుల సమావేశానికి కొందరు నాయకులు వెళ్లారన్న విషయంపై తనకు తెలియదని చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సమావేశమై చర్చించామని, త్వరలోనే కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేస్తామని, అంతేకాకుండా కాంగ్రెస్, జేడీఎస్‌కు ఎన్నిసీట్లు అనే విషయంపై కూడా నిర్ధారణ జరుగుతుందన్నారు. ఇప్పటికే పలుమార్లు చర్చించామని, ఫైనల్‌గా నిర్ధారించటమే మిగిలి ఉందని ఆయన తెలిపారు. -
సుమలత కీలక వ్యాఖ్యలు..!
సాక్షి, బెంగళూరు : కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి, దివంగత నటుడు అంబరీష్ భార్య సుమలత పొలిటికల్ ఎంట్రీ గురించి కొన్ని రోజులుగా చర్చ నడుస్తోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అంబరీష్ దూరమైన విషాదం నుంచి ఇంకా కోలుకోనప్పటికీ.. ప్రజల ఒత్తిడి మేరకు తాను ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆమె పేర్కొన్నారు. ఈ క్రమంలో తన భర్త అంబరీష్ ప్రాతినిథ్యం వహించిన మాండ్య పార్లమెంట్ స్థానం నుంచే ఎన్నికల బరిలో దిగాలని ఆమె భావిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ తరపున టికెట్ ఆశిస్తున్నారు. అయితే కర్ణాటకలో జేడీఎస్- కాంగ్రెస్ కూటమి అధికారం పంచుకుంటోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సీట్ల సర్దుబాటు విషయమై మాండ్య స్థానాన్ని జేడీఎస్‌కు కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్ కీలక నేత, మంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని సుమలత పేర్కొన్నారు. ఈ క్రమంలో ‘మీకు పరోక్షంగా మద్దతు ఇస్తామ’ని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సుమలతకు ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం.(సర్జికల్ స్ట్రైక్స్‌పై మాట్లాడను.. ఆమెకు టికెట్ కష్టమే!) కాగా సుమలత భర్త అంబరీష్ మాండ్య జిల్లాలోనే జన్మించారు. 1994లో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఆయన సొంత నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలుపొందారు. 1998, 99, 2004లో మాండ్యకు ప్రాతినిథ్యం వహించారు. నటుడిగా, సమాజ సేవకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన అంబరీష్‌కు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చరిష్మా ఉంది. ఈ నేపథ్యంలో మాండ్య నుంచి పోటీ చేస్తే సుమలత తప్పక గెలుస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడు, కర్ణాటక సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి(కన్నడ నటుడు) రాజకీయ ప్రవేశం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కూడా మాండ్య నుంచే పోటీచేయాలని భావిస్తున్నారు. ఒకవేళ నిఖిల్ బరిలో దిగితే సుమలతకు టికెట్ రాదనే విషయం సుస్పష్టమే. ఈ నేపథ్యంలో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే మద్దతు ఇస్తామని బీజేపీ లీకులివ్వడంతో మాండ్యలో పోరు రసవత్తరంగా మారనుంది. (బరిలో మనవళ్లు.. ఢీ అంటే ఢీ?!) -
సుమలత రాజకీయాల్లోకి వస్తారా?
మండ్య: తమ రాజకీయ ప్రవేశం మండ్య నుంచే కాంగ్రెస్ పార్టీ నుంచి జరుగుతుందని సుమలత అంబరీశ్ స్పష్టం చేశారు. సమయం వస్తే మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ తరపున అభ్యర్థిగా పోటీ చేసి రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని ఆమె తెలిపారు. ఆదివారం కుమారుడు అభిషేక్‌తో కలసి నాగమంగళ తాలూకా ఆదిచుంచనగిరిలోని శ్రీక్షేత్రాన్ని సందర్శించుకొని కాలభైరేశ్వర స్వామి కి పూజలు నిర్వహించిన అనంతరం సుమలత మీడియాతో మాట్లాడారు. అంబరీశ్ దూరమైన విషాదం నుంచి తాము ఇంకా పూర్తిగా కోలుకోకముందే తమ గురించి రాజకీయ చర్చలు జరుగుతాయని ఊహించలేదన్నారు. అయితే మండ్య జిల్లా ప్రజలు, అభిమానుల ఒత్తిడి మేరకు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని, దీనిపై సన్నిహితులు, రాజకీయ సలహాదారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తాము ఎప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించినా మండ్య నుంచేనని ఆమె స్పష్టం చేశారు. తల్లి నిర్ణయానికి అభిషేక్ మద్దతు తాను నటించిన కొత్త చిత్రం అమర్ టీజర్‌ను ఈ నెల 14న విడుదల కానున్నట్లు సుమలత అంబరీశ్ కుమారుడు అభిషేక్ తెలిపారు. మొదటి చిత్రం అమర్‌తో పాటు మున్ముందు నటించే ప్రతీ చిత్రంలో కూడా తమ తండ్రి అంబరీశ్ తప్పకుండా ఉంటారన్నారు. రాజకీయాల్లో ప్రవేశించాలని తల్లి సుమలత తీసుకున్న నిర్ణయానికి మద్దతు తెలుపుతున్నామని రాజకీయాల్లో మాత్రమే కాకుండా తమ చిత్రాల విషయంలో కూడా తల్లి సుమలత నిర్ణయాలు,ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని చెప్పారు. -
లోక్‌సభ ఎన్నికల్లో సుమలత పోటీ?
సాక్షి బెంగళూరు: మాజీ మంత్రి, కన్నడ రెబెల్‌స్టార్, దివంగత అంబరీశ్ భార్య సుమలత రాజకీయాల్లోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మాండ్య లోక్‌సభ స్థానం నుంచి ఆమె పోటీచేస్తారని సమాచారం. ఆమె భర్త అంబరీశ్ కాంగ్రెస్‌లో కొనసాగడం తెల్సిందే. అనారోగ్యంతో ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ నుంచి సుమలత పోటీ చేయాలనుకున్నా మాండ్య స్థానాన్ని సంకీర్ణంలోని జేడీఎస్ ఆశిస్తోంది. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్ తదితరులు సుమలతకు మద్దతుగా ఉన్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో నిలిచేందుకు ఆమె సిద్ధమని సమాచారం. కాంగ్రెస్– జేడీఎస్ కూటమిలో భాగంగా మాండ్య స్థానం నుంచి సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ పోటీ చేస్తారని వార్తలొస్తున్నాయి. సుమలత పోటీ చేస్తే నిఖిల్ గెలుపు కష్టమని రాజకీయ విశ్లేషకుల అంచనా. సుమలతకు జేడీఎస్ వర్గాల నుంచి భారీ స్థాయిలో మద్దతు ఉన్నట్లు సమాచారం. దీంతో సుమలత, నిఖిల్ మధ్య ఓట్లు చీలి చివరకు బీజేపీ గెలిచే చాన్సుందని భావిస్తున్నారు. -
సుమలత భావోద్వేగం
కన్నడ సీనియర్ నటుడు అంబరీష్ మరణం నుంచి ఆయన కుటుంబం, సాండల్‌వుడ్ ఇండస్ట్రీ ఇంకా కోలుకోలేకపోతున్నారు. శనివారం తమ పెళ్లి రోజు కావటంతో అంబరీష్‌తో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకొని సుమలత భావోద్వేగానికి లోనయ్యారు. తన భావలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరిచారు. ‘మా మనసు నిండా నీవే... 27 ఏళ్ల పాటు మీతో గడిపిన క్షణాలు మరిచిపోలేనివి, అనుక్షణం నీ జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాము’ అంటూ తమ 27వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఫేస్బుక్లో ఆవేదనతో కూడిన సందేశాన్ని పోస్టు చేశారు. ‘‘డిసెంబరు 8 మన పెళ్లి రోజు. 27 ఏళ్ల తర్వాత తొలిసారి నువ్వు నా పక్కన లేవు.. నా ప్రపంచంలో నువ్వు ఓ కేంద్రం మాత్రమే కాదు.. నా పూర్తి ప్రపంచమే నువ్వు. నా చేయి పట్టుకుని నడిపించిన చేయి నీది.. నాకు అమితమైన ప్రేమను పంచిన హృదయం నీది. నువ్వు నన్ను ప్రేమించిన తర్వాతే నా జీవితం ప్రారంభమైంది. నీ ప్రేమ నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చింది. నువ్వు ఎక్కడున్నప్పటికీ ఇంకా నన్ను చూస్తున్నావని నాకు తెలుసు’’ అంటూ ట్వీట్ చేశారు. ‘అంబి మా చేయి పట్టి నడిపించావు... నీ నగుమోము మాకు ఎంతో ఇష్టం, ఎన్ని యుగాలైనా మరచిపోము. నీవెక్కడ ఉన్నా మా కోసమే వెతుకుతుంటావు, నీ కుమారుడికి ఇకపై నీవే రక్షణగా నిలబడాలి, అభిమానుల్లో మిమ్ములను చూసుకుంటున్నాను’ అంటూ అంబరీశ్‌పై ఉన్న ప్రేమను సుమలత తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. 27 ఏళ్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా సుమలత రాసిన లేఖను చూసిన అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. -
వెల కట్టలేని ప్రేమ
కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ సహాయగుణం, ప్రేమ గుణం గురించి గొప్పగా చెబుతారు ఆయన సన్నిహితులు. ఆయన ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. అంబరీష్ చనిపోయినా కూడా తన ప్రేమను పంచుతూనే ఉన్నారు. కన్నడ యంగ్ హీరో యష్ భార్య రాధికా పండిట్ ఓ పాపకు జన్మ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పాపకు ఓ ఊయల గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నారట అంబరీష్. సుమారు లక్షన్నర విలువ చేసే ఈ ఊయలను ఆన్లైన్లో బుక్ చేశారాయన. యష్‌కు పాప జన్మించేలోపే అంబరీష్ చనిపోయారు. బుక్ చేసిన ఈ ఊయలకు సంబంధించిన మెసేజ్ రావడంతో ఈ విషయాన్ని తెలుసుకున్నారు అంబరీష్ భార్య సుమలత. ఈ గిఫ్ట్‌ను యష్ కూతురికి అందిం చారామె. ఈ ఊయల తమకు అపురూపం అని యష్ దంపతులు పేర్కొన్నారు. -
ఆయన కోసం పూజలు చేశారు
డిసెంబరు 8న సుమలత–అంబరీష్‌ల పెళ్లి రోజు. ఈలోపే... ఊహించని విషాదం! జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు ఎవరినైనా పుట్టెడు దుఃఖం ఆవహిస్తుంది. సుమలత ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నారు. ఆమె దుఃఖాన్ని ఎవరూ పట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో.. సుమలత పుట్టినరోజు (ఆగస్ట్, 27) సందర్భంగా గతంలో సాక్షి ‘ఫ్యామిలీ’ చేసిన ఇంటర్వ్యూలోని కొన్ని భాగాలను తిరిగి ప్రచురిస్తున్నాం. ► మీ ఇద్దరిదీ ప్రేమ వివాహం కదా! అంబరీష్లో మీ మనసును దోచుకున్నదేమిటి? సుమలత: ఆయన మనస్తత్వమే. చాలా మంచి వ్యక్తి. దాన వీర శూర కర్ణ, కలియుగ కర్ణ, మానవతామూర్తి... ఇలా కన్నడ రంగంలో ఆయన మంచితనానికి బోల్డన్ని బిరుదులున్నాయి. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ఆయన వెనకడుగు వేయలేదు. అవన్నీ స్వయంగా చూశాను. అందుకే... ఆయనే నా భర్త అయితే బాగుండనుకున్నాను. నాది సున్నితమైన మనస్తత్వం కాబట్టి ఆయన నన్ను ఇష్టపడ్డారు. ► తెలుగింటి ఆడపడుచైన మీరు కన్నడ ఇంటి కోడలిగా సెటిలైపోయారు... జీవితం ఎలా ఉంది? చాలా బాగుందండి. కన్నడవాళ్లు నన్ను తమ అమ్మాయిగా అంగీకరించారు. నన్నెంతగా అభిమానిస్తున్నారంటే.. నా నేపథ్యం తెలియనివాళ్లు నేను కన్నడ అమ్మాయినే అనుకుంటున్నారు. ఒక రాష్ట్రంలో పుట్టి, పెరిగి మరో రాష్ట్రంలో ఇంతటి అభిమానం సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. మన గోంగూర ఎంత రుచిగా ఉంటుందో కన్నడ బిసిబేళా బాత్ కూడా అంతే రుచిగా ఉంటుంది. ► అంబరీష్‌గారు, మీ మధ్య ఎప్పుడు ప్రేమ మొదలైంది? మాది తొలి చూపులో ఏర్పడ్డ ప్రేమ కాదు. ఇద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. ముందు మంచి స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ మార్పు ఫలానా సమయంలో వచ్చిందని చెప్పలేను. మాకు తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. అంబరీష్‌కి బోల్డంత మంది మంచి స్నేహితులున్నారు. రజనీకాంత్ గారైతే.. ‘నాకు తెలిసి ఇండియాలో మీ ఆయనకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ ఉండరేమో’ అంటుంటారు. స్నేహితుల కోసం ఆయన ఏమైనా చేస్తుంటారు. ► ఆ స్నేహం వల్ల మీరెప్పుడూ ఇబ్బంది పడలేదా? పెళ్లయిన కొత్తలో ప్రైవసీ కోరుకుంటాం కాబట్టి, కొంచెం ఇబ్బందిగా ఉండేది. చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఆ గొడవలు ముదురి పాకాన పడి, విడిపోయేంత వరకూ రాలేదు. ఆయన పగలంతా స్నేహితులు, పనులతో బిజీగా ఉన్నా, సాయంత్రం మాత్రం పూర్తిగా కుటుంబానికే అంకితమైపోతారు. ► స్నేహితులకు సహాయం చేసే విషయంలో అంబరీష్‌గారిని మీరు వెనక్కి లాగడానికి ప్రయత్నించేవారా? లేదు. ఎందుకంటే, నేను ఆయనను ఎక్కువ ఇష్టపడానికి కారణం అదే. పెళ్లికి ముందు ఇష్టపడిన విషయం తీరా పెళ్లి అయిపోయాక ఎందుకు కష్టంగా ఉంటుంది. కాకపోతే, అర్హత లేనివాళ్లకు సహాయం చేసినప్పుడు మాత్రం వారిస్తుంటాను. అప్పుడాయన ‘నాకు సహాయం చేయాలనిపించింది.. చేశాను. ఒకవేళ వెన్నుపోటు పొడిచారనుకో.. అది వాళ్ల కర్మ’ అంటుంటారు. ఎవరికైనా సహాయం చేస్తే, వాళ్లు తిరిగి తనకేదో చేయాలనీ, జీవితాంతం ఋణపడి ఉండాలనీ కోరుకోరు. ఇన్నేళ్ల వైవాహిక జీవితం బోల్డన్ని జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ దేవుడు నాకు ఇచ్చిన మంచి బహుమతి ‘అంబరీష్’. ► తెలుగు పరిశ్రమలో కూడా మీవారికి మంచి స్నేహితులున్నారనుకుంటా? అవును. మోహన్‌బాబు గారు, చిరంజీవి గారు, హిందీ రంగంలో శతృఘ్న సిన్హా గారు, తమిళంలో రజనీకాంత్ గారు.. ఇలా చాలామంది స్నేహితులున్నారు. ఆ మధ్య అంబరీష్‌కి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళందరూ పరామర్శించారు. మోహన్‌బాబు గారైతే బెంగళూరు వచ్చి, మా ఆయనను చూడగానే ఒక్కసారిగా కంట తడిపెట్టుకున్నారు. ఆ అభిమానం చూసి, చాలా సంతోషం అనిపించింది. ► మీ జీవితంలో బాగా టెన్షన్ పడిన సందర్భం అంబరీష్గారికి ఆరోగ్యం బాగా లేనప్పుడేనేమో? వంద శాతం కరెక్ట్. ఆ సమయంలో నేను అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తెలియగానే... అభిమానులు పూజలు చేశారు. హోమాలు నిర్వహించారు. పొర్లుదండాలు పెట్టారు. అలాంటివన్నీ విని కదిలిపోయాను. అసలు అభిమానులు మమ్మల్ని కలుస్తారో లేదో తెలియదు. పోనీ మా ద్వారా ఏమైనా లాభం కలుగుతుందా? అంటే అదీ లేదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నవాళ్లు సైతం ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేశారు. అసలే సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా అభిమానం. ఈ సంఘటనతో ఆ అభిమానం మరింత పెరిగిపోయింది. ‘సినిమా పరిశ్రమ మీకు ఇంతమంది అభిమానులను ఇస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెస్తోంది’ అని ఆ దేవుడు ఇలాంటి సంఘటనల ద్వారా మా సినిమా పరిశ్రమవారికి చూపిస్తాడేమో అనిపించింది. ► అంబరీష్గారికి రీల్ జీవితంలోనే కాదు.. రియల్ జీవితంలోనూ ‘రెబల్ స్టార్’ అనే ఇమేజ్ ఉంది. ఎలా నెట్టుకొస్తున్నారు? (నవ్వుతూ...) జీవిత భాగస్వాముల్లో ఒకరు రెబల్‌గా ఉంటే ఒకరు సాఫ్ట్‌గా ఉండాలి. అంబరీష్ మొదటి రకం అయితే నేను రెండో రకం. అందుకని, మా జీవితం సాఫీగా సాగుతోంది. అంబరీష్ స్నేహపూర్వకంగా ఉంటారు. మంచి విలువలున్న వ్యక్తి. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అంబరీష్‌తో ఉన్న సాన్నిహిత్యం గురించి మోహన్‌బాబు, ఖుష్బూ, నరేశ్‌ల ‘ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలు’; మంచి మనిషి, ఆప్త మిత్రుడు అంబరీష్. నిన్ను కోల్పోయాను. ఎప్పటికీ మిస్ అవుతుంటాను. – రజనీకాంత్ చిరకాల మిత్రుడు అంబరీష్ ఆకస్మిక మృతి నన్ను తీవ్రంగా కలచివేసింది. తన మరణం దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. నటుడిగా, గొప్ప రాజకీయ నాయకుడిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. – కృష్ణంరాజు నా కెరీర్ తొలినాళ్లలో సంపాదించుకున్న స్నేహితుడివి నువ్వు. సంవత్సరాలు పెరిగే కొద్ది అది పెరిగి పెద్దదయింది. ఎంత రాసినా నువ్వు లేని లోటును వర్ణించలేనని తెలుసు. ‘బాస్’ అని నువ్వు పిలిచే పిలుపు మిస్ అవుతాను. – మమ్ముట్టి అంబరీష్‌గారు ఎంతో గొప్ప వ్యక్తి. ఆయన లేరంటే గుండె పగిలిపోతోంది. మిమ్మల్ని చాలా మిస్సవుతాం. సుమలతతో పాటు కుటుంబ సభ్యులందరూ ధైర్యంగా ఉండాలి. – రాధికా శరత్‌కుమార్ మోహన్‌బాబు కుమారుడు అభిషేక్, భర్త అంబరిష్లతో సుమలత – డి.జి. భవాని -
డాటర్ ఆఫ్ పార్వతమ్మ
వైదేహీ.. పేరు కాస్త క్లాస్‌గా ఉంది కదా అమ్మాయి కూడా అలాగే ఉంటుందనుకోకండి. రఫ్ అండ్ టఫ్. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అంటే ఆ మాత్రం రఫ్‌నెస్ లేకపోతే ప్రొఫెషన్లో రాణించడం కష్టం. ‘తకిటతకిట, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా’.. రీసెంట్గా ‘జై సింహా’ సినిమాలతో తెలుగు తెరపై కనిపించారు కథానాయిక హరిప్రియ. తెలుగులో అప్పుడప్పుడూ నటించినప్పటికీ కన్నడలో ఆమె బిజీ. హరిప్రియ లేటెస్ట్గా నటించిన కన్నడ చిత్రం ‘డాటర్ ఆఫ్ పార్వతమ్మ’. సీనియర్ నటి సుమలత ఈ సినిమాలో పార్వతమ్మ క్యారెక్టర్ చేశారు. ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ ౖవైదేహీ పాత్రలో హరిప్రియ నటించారు. చిత్రీకరణ పూర్తయింది. ఓ రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కించారట. ‘‘వండర్ఫుల్ యాక్ట్రస్ సుమలతగారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు హరిప్రియ. త్వరలో ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
అంబి అనాసక్తి, అర్ధాంగికి టికెట్ ఇస్తే చాలు
సాక్షి, బెంగళూరు: విధానసభ ఎన్నికల్లో మాజీ మంత్రి, నటుడు అంబరీశ్‌తో పాటు పలు నియోజకవర్గాలకు చెందిన ప్రముఖ నేతలకు కాంగ్రెస్ టికెట్ దక్కే సూచనలు కనిపించడం లేదు. ముఖ్యంగా మండ్య ఎమ్మెల్యే అంబరీశ్ గతకొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటుండడం, టికెట్‌కు సైతం దరఖాస్తు చేయకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వడానికి సుముఖంగా లేదని సమాచారం. ఈ నేపథ్యంలో తనకు బదులుగా అర్ధాంగి సుమలతకు టికెట్ ఇవ్వాలని అంబి కోరుతున్నట్లు వినికిడి. రాష్ట్రంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుసుకున్న అంబరీశ్ మండ్య నుంచి టికెట్ తమకే వస్తుందన్న ధీమాతో అర్జీ వేయలేదని సమాచారం. దీంతో కాంగ్రెస్ పెద్దలు కూడా రెబెల్‌స్టార్‌ను కరుణించేలా లేరు. అంబరీశ్‌కు టికెట్ వద్దా? అయితే నేరుగా టికెట్ ఇవ్వడం కుదరదనే ప్రకటన చేస్తే అంబరీశ్ తిరుగుబాటు బావుటా ఎగురవేసే ప్రమాదం ఉందని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం అంబరీశ్ అనారోగ్యాన్ని సాకుగా చూపి టికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు సమాచారం. సీఎం సిద్ధరామయ్య మాత్రం మండ్య నుంచి అంబరీశ్కే టికెట్ ఇప్పించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. మండ్య నుంచి ఆయన కాకుండా ఇంకెవరు పోటీ చేసినా ఓటమి తప్పదనే అనుమానం సిద్ధరామయ్యను పీడిస్తున్నట్లు తెలుస్తోంది. సుమలతకు అవకాశానికి వినతి అయితే అంబరీశ్ ఆలోచన మరోలా ఉన్నట్లు సమాచారం. మండ్యలో తనకు బదులు సతీమణి సుమలతకు టికెట్ ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం. తనకు అనారోగ్య సమస్యలు ఉన్నందువల్ల పోటీ చేయాలనుకోవడం లేదని, కాబట్టి భార్యకు అవకాశం కల్పించాలని అంబి కోరినట్లు సమాచారం. ఈ విషయంపై అంబరీశ్, సుమలతలు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. కాగా, అంబరీశ్‌తో పాటు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందిస్తున్న బాదామి ఎమ్మెల్యే చిమ్మనకట్టి, హానగల్‌కు చెందిన నేత మనోహర్ తదితరులకు కూడా ఈసారి టికెట్ దక్కే అవకాశాలు దాదాపు లేనట్లేనన్న వార్తలు వినిపిస్తున్నాయి. -
వనితా సలాం
మహిళామూర్తిని వర్ణించేందుకు పదాలు చాలవు. సమాజంలో అంతటి ప్రాధాన్యం ఉన్న మహిళలు ప్రస్తుతం వివక్షను ఎదుర్కొంటున్నారు. రక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, అవి ఎందుకూ పనికి రాకుండాపోతున్నాయి. అయినా మొక్కవోని దీక్షతో సమాజ రుగ్మతలను ఎదిరిస్తూ స్వయం సాధికారత వైపు మహిళలు అడుగులేస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం. మనం సంతోషంగా ఉన్నాం. ఇదే మనకు వరమని సరిపుచ్చుకోలేదామె. అందరూ సంతోషంగా ఉండాలని తపన పడుతున్నారు. యువకుల్లో సైతం సేవాభావాన్ని పెంపొందిస్తూ దానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించడంతో పాటు మీ కోసం మేము ఫౌండేషన్‌కు తెరవెనుక సూత్రధారిగా ఉంటూ నడిపిస్తూ పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు కొడవలూరు మండలం బసవాయపాళేనికి చెందిన గనకాల సుమలత. కొడవలూరు: కొడవలూరు మండలం బసవాయపాళేనికి చెందిన సుమలత వివాహానంతరం నెల్లూరులో స్థిరపడ్డారు. ఆమె ఇతరులకు సాయపడటంలోనే సంతృప్తి ఉందని భావించారు. ఆమెలోని సేవాభావాన్ని భర్త హరికృష్ణకు వివరించారు. ఆమె సమాజ సేవాభావానికి ఆయన అడ్డు చెప్పకుండా తనవంతు ప్రోత్సాహించారు. భావాలకు భర్త సహకారం కూడా తోడవడంతో సేవా కార్యక్రమాల వైపు అడుగులేశారు. సేవ దిశగా ప్రోత్సాహం సేవా దృక్పథం ఉన్న సుమలత కార్యక్రమాల అమలుకు ఒక వేదిక అవసరమని భావించారు. ఇలాంటి కార్యక్రమాలను యువకులైతే ఎంతో ఉత్సాహంగా చేపట్టగలరని నిర్ణయించుకున్న ఆమె స్వగ్రామానికి చెందిన యువకుడు చల్లకొలుసు కార్తీక్‌లోని సేవా భావాన్ని గుర్తించారు. దిక్కులేని వారికి సాయపడేందుకు తన వంతు సాయమందిస్తానని కార్తీక్‌తో తన మనస్సులోని మాటను తెలిపారు. సేవ చేయడంపై ఆసక్తి ఉన్న అతడు తన మిత్రుడైన పోసిన సునీల్‌కుమార్‌కు ఈ విషయాన్ని తెలియజేశారు. అందుకు సునీల్‌కుమార్ కూడా ఉత్సుకత చూపడంతో సేవాభావమున్న స్నేహితులతో కలిసి మీ కోసం మేము ఫౌండేషన్‌ను స్థాపించారు. ఫౌండేషన్‌లో కోశాధికారిగా ఉంటున్న సుమలత సంస్థ నిర్వహించే ప్రతి సేవా కార్యక్రమంలో తన వంతు సాయం అందిస్తున్నారు. వృద్ధులకు వస్త్ర, అన్నదానం చేయడం, ప్లాట్‌ఫారాలపై ఉంటున్న వారికి దుప్పట్లు, వస్త్రాలను అందించడం, అనాథ పిల్లలకు వారి అవసరాలను తెలుసుకొని సాయపడుతున్నారు. రక్తదానం చేసి ఇతరుల ప్రాణా లను నిలపడంలోనూ ఫౌండేషన్ ముందంజలో ఉంది. సాయంలోనే తృప్తి ఇతరులకు సాయపడటంలో ఎంతో సంతృప్తి ఉంది. మనం ఎంతగా సుఖపడినా, ఇతరులకు సాయపడటంలో ఉన్న సంతృప్తి ఎందులో ఉండదు. ఇతరుల ఆకలిని తీర్చినపుడు, ఆపదల్లో రక్తదానం చేసినప్పుడు వారు చూపే కృతజ్ఞత మనస్సును కదిలిస్తుంది. అందువల్లే ఉన్నంతలో ఇతరులకు సాయపడాలని నిర్ణయించుకున్నా. మరిన్ని సేవా కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా చేపట్టాలన్నదే నా లక్ష్యం. : గనకాల సుమలత,మీ కోసం మేము ఫౌండేషన్ కోశాధికారి -
స్టాఫ్‌నర్స్ ఆత్మహత్యాయత్నం
పెనుకొండ రూరల్ : మండలంలోని గుట్టూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ స్టాఫ్‌నర్స్‌గా విధులు నిర్వహిస్తున్న సుమలత సోమవారం విషపుగుళికలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు మాట్లాడుతూ రెండు నెలలుగా నిరవధికంగా డ్యూటీ చేస్తున్నా వైద్యాధికారి జగదీష్‌బాబు సెలవు ఇవ్వడం లేదని వాపోయింది. తాను 6 నెలల గర్భిణిని అని, కాలు ఫ్రాక్చర్ అయినా 3 రోజుల నుంచి రాత్రీ, పగలు డ్యూటీ చేయిస్తున్నారని చెప్పింది. సోమవారం సెలవు అడిగానని, కానీ ఇవ్వకపోవడంతో మనస్థాపం చెంది విషపుగుళికలు మింగినట్లు తెలిపింది. కుటుంబ సభ్యులు బాధితురాలిని చికిత్స నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
ఆయనే కావాలి !
నిడమనూరు : రెండున్నరేళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకున్న మహిళ తనకు ఆయనే కావాలని అత్తింటి ఎదుట వారం రోజులుగా చేస్తున్న ఆందోళన సోమవారం కూడా కొనసాగింది. వివరాలు..చండూరు మండలం కురంపల్లికి చెందిన తలారి లింగయ్య, సత్తమ్మల పెద్ద కూతురు సుమలతకు మండలంలోని మారుపాకకు చెందిన ఇస్రం రమేష్‌తో 2014మే30న వివాహం జరిగింది. మొదటి నెల వరకు శోభనం జరుగలేదని దంపతులు తరచూ గొడవ పడేవారు. పెద్ద మనుషుల సమక్షంలో రమేష్ తాను వివాహానికి అనర్హుడిని కాబట్టి విడాకులు ఇవ్వాలని కోరగా వారు ఇద్దరి మధ్య విడాకుల ఒప్పందం చేయించారు. నష్టపరిహారంగా రూ.3 లక్షలను అమ్మాయి తల్లిదండ్రులకు ఇచ్చారు. పెళ్లి కుదుర్చుకోవడంతో.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటున్న రమేష్‌కు ఇటీవల అమ్మాయితో పెళ్లి నిశ్చయం అయింది. ఈ విషయం తెలుసుకుని సుమలత మారుపాకకు వచ్చి రమేష్ ఇంటి ఎదుట భైఠాయించింది. పెద్ద మనుషులు ఇప్పించిన విడాకులతో తనకు సంబంధం లేదని, తనకు రమేష్ భర్తగా కావాలని కోరుకుంటోంది. అయితే ప్రస్తుతం రమేష్ కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. వారం రోజులుగా సుమలత వచ్చి బైఠాయించి సాయంత్రం తిరిగివెళ్లిపోతోంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందలేదు. -
బాలుడ్ని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన చైల్డ్‌లైన్ సంస్ధ
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపై తిరుగుతున్న బాలుడిని చేరదీసి పోలీసులు సమక్షంలో తల్లితండ్రులు చెంతకు చేర్చిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, చైల్డ్‌లైన్ సంస్ధ ప్రతినిధి సుమలత తెలిపిన వివరాల ప్రకారం.. భరత్‌నగర్‌కు చెందిన కే.సాయిమణికంఠరెడ్డి మెట్టుగూడలోని బంధువుల ఇంట్లో ఉంటూ స్థానిక ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. స్కూలుకు వెళ్లడం ఇష్టంలేని సాయిమణికంఠ ఈనెల 28వ తేదిన ఇంటి నుంచి పారిపోయాడు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫారంపై తిరుగుతున్న బాలుడిని చైల్డ్‌లైన్ సంస్థ ప్రతినిధులు గుర్తించి చేరదీశారు. ఈనెల 30వ తేదిన ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన బాలుడి అదృశ్యం కథనాన్ని చూసిన చైల్డ్‌లైన్ నిర్వాహకులు బాలుడు తమ వద్దే ఉన్నాడని చిలకలగూడ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఎస్ఐ బీ శ్రీనివాసులు సమక్షంలో సాయిమణికంఠరెడ్డిని తల్లితండ్రులు అచ్చిరెడ్డి, సునీతలకు అప్పగించారు. బాలుడిని చేరదీసిన చైల్డ్‌లైన్ ప్రతినిధులు, పోలీసులతోపాటు ‘సాక్షి’ యాజమాన్యానికి బాలుని తల్లితండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. -
పెదరాయుళ్లు
మన సమస్య మనకు ఎప్పుడూ పెద్దగా అనిపిస్తుంది.. ఇతరుల సమస్య అర్థం చేసుకున్నప్పుడు మన సమస్య చిన్నగా అవుతుంది.. పెద్ద గీత ముందు చిన్న గీత లాగా! పెద్ద పెద్ద కష్టాలను చిన్నబోయేలా చేస్తున్నారు ప్రయోజనాత్మకమైన సృజనాత్మక టెలివిజన్ షోస్ హోస్ట్ చేస్తున్నారు! సుమలత, జీవితలు ఇతరుల సమస్యలు, కష్టాలను అర్థం చేసుకుని తమ కష్టాలుగా భావించి ‘జీవిత’ ‘సుమాలు’గా మారారు. • పెద్ద తెర నుంచి చిన్ని తెరకు ఎలా అడ్జస్ట్ కాగలిగారు? జీవిత: పెద్ద తెరకు ఇవాళ చిన్ని తెర ఏమాత్రం తక్కువ కాదు. గేమ్ షోస్, పర్పస్‌ఫుల్ షోస్ పెరుగుతున్నాయ్. చేసేది ప్రయోజనాత్మక కార్యక్రమం కాబట్టి చిన్ని తెర కోసం ప్రత్యేకంగా అడ్జస్ట్ కావల్సిన అవసరం ఏర్పడలేదు. నటిగా నేను సినిమాలు చేసింది ఎక్కువగా రాజశేఖర్ గారితోనే. ఆ తర్వాత దర్శకురాలిగా-నిర్మాతగా చేశాను. ఇప్పుడు బుల్లితెర ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది. సుమలత: ప్యాషన్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా అడ్జస్ట్ కావాల్సిన అవసరం రాలేదు. సినిమా, టీవీ దేని ప్రభావం దానిదే. టీవీకే రీచ్ ఎక్కువ. సినిమాలు చూడాలంటే ప్రేక్షకులు థియేటర్‌కి రావాలి. కానీ, టీవీతో మనం ప్రేక్షకుల ఇంట్లోకి వెళ్తాం. అందుకే ఒక కుటుంబ సభ్యుల్లా మన ల్ని చూస్తారు కాబట్టి హ్యాపీగా ఉంది. • టీవీ వాళ్లంటే సినిమా స్టార్స్‌కి చిన్న చూపు ఉంటుందేమో... సుమలత: ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు లేదు. పెద్ద పెద్ద స్టార్స్ టీవీలోకి వచ్చేశారు. అమితాబ్ లాంటి సూపర్ స్టార్ స్మాల్ స్క్రీన్ స్వరూపాన్ని మరో ఎత్తుకు తీసుకెళ్లారు. ఆయన ముందు మాలాంటి వాళ్లెంత. • ఈ ప్రోగ్రామ్ గురించి మీ భర్త అంబరీష్‌గారు ఏమంటారు? నిన్ను ఇంట్లో మహారాణిలా చూసుకుంటే నువ్వెందుకు అందరి సమస్యలు వింటూ ఇబ్బంది పడతావు అంటారు. కానీ సామాన్య జనాలతో కలవడం, వాళ్ల ప్రాబ్లమ్ వినడం, పరిష్కారాలు చెప్పడం నాకు చాలా సంతృప్తినిస్తుంది. ఇలాంటి కార్యక్రమాలతో తప్ప వాళ్లను కలిసే అవకాశం ఎలా ఉంటుంది? ఆ మాటే అంబరీష్‌గారితో అన్నాను. దాంతో కన్విన్స్ అయ్యారు. ‘బాగా చేస్తున్నావ్’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. మన చుట్టూ ఉన్న సమాజంలో జీవితాలు ఇలా కూడా ఉన్నాయా అన్నది తెలుస్తుంది. ఒక్కోసారి ఇంత కష్టాలు పడి మనుషులు బతుకుతున్నారా అనిపిస్తుంటుంది. వాళ్ల పెదాలపై చిన్న చిరునవ్వు కలిగిస్తే చాలనిపిస్తుంది. జీవిత: ఒకప్పుడు బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ అనే తేడా ఉండేది. ఇప్పుడలాంటిది లేదు. స్మాల్ స్క్రీన్‌కి బిగ్ స్టార్స్ వస్తున్నారు. దానివల్ల చిన్ని తెరకు క్రేజ్ పెరిగింది. చిన్న చూపు కూడా పోయింది. • ఎంటర్టైన్మెంట్ షోస్ ఉండగా సమస్యలను పరిష్కరించే షోని అంగీకరించడానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? జీవిత:ఈ కార్యక్రమానికి సోషల్ కాజ్ ఉంది కాబట్టి ఒప్పుకున్నాను. జీ తెలుగువాళ్లు ‘బతుకు జట్కా బండి’ రెండోసారి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఈ షో దర్శకుడు కిశోర్ ‘జీవితగారు చేస్తే బాగుంటుంది’ అన్నారట. ఆ తర్వాత నన్ను కలిశారు. పదిమందికి ఉపయోగపడే షో అనే ఉద్దేశంతోనే అంగీకరించాను. సుమలత:హాలీవుడ్లో ఓప్రా విన్ఫ్రే చేసే టీవీ షోలు బాగుంటాయి. అలాంటి షో చేయాలనిపించింది. ఆ చాన్స్ దక్కినందుకు హ్యాపీగా ఉంది. ఇలాంటి కార్యక్రమా లు ఎన్ని ఎక్కువ వస్తే అంత మంచిది. విడిపోయిన కుటుంబాలు కలవడానికి మరిన్ని వేదికలు దొరుకుతాయి. • ఒక మహిళగా మీరు మహిళలకు ఎక్కువగా మద్దతిచ్చే అవకాశం ఉంటుందని కొందరి అభిప్రాయం? సుమలత: జనరల్‌గా ఆడ, మగ మధ్య సమస్య అంటే దానికి కారణం మగవాళ్లే అనే అభిప్రాయం ఉంటుంది. నిజానికి మహిళల వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. మా దగ్గరికి వచ్చే వాటిలో 80 నుంచి 90 శాతం కేసులు మహిళల గొడవలతోనే ఉంటున్నాయి. ఎవరి వైపు న్యాయం ఉందో వాళ్ల వైపే మాట్లాడతా. ప్రత్యేకంగా మహిళలకు సపోర్ట్ చేయడం అంటూ ఉండదు. • మీ దగ్గరకు వచ్చిన కేసుల్లో గుర్తుండిపోయిన కేసు ఏది? సుమలత: కర్నూలు నుంచి ఒక కేసు కౌన్సిలింగ్‌కు వచ్చింది. టైలర్ పని చేసుకునే పుట్టు మూగ, చెవిటి వ్యక్తికి ఒక అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. అమ్మాయి చాలా మంచిది. ఏమీ వినపడని, మాటలు రాని భర్తకి తనే అన్ని సేవలు చేసేది. అతని మూగ భాషను అర్థం చేసుకుంది. సైగలతో మాట్లాడటం నేర్చుకుంది. ఇద్దరికీ ఓ బాబు పుట్టాడు. అతను టైలర్ పని మానేస్తే... తనే ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించేది. ఇలా ఇరవై ఏళ్లు భర్తను కాపాడుకొచ్చింది. కొన్నేళ్ల తర్వాత భర్త ప్రవర్తనలో మార్పు వచ్చింది. తన అంగవైకల్యం వల్ల భార్య మరో వ్యక్తిని ఇష్టపడుతుందేమోనన్న అనుమానం అతనిలో మొదలైంది. భార్యను తిట్టేవాడు, కొట్టేవాడు. అన్నీ సహించిందామె. ఈ కార్యక్రమానికి వచ్చారు. అతను విడాకులు కావాలన్నాడు. ఆమె నాకు కుటుంబమే కావాలంది. ఎందుకమ్మా ఇంకా ఇతన్ని భరిస్తావు? అని అడిగితే... ‘నేను లేకపోతే నా భర్తను ఎవరూ చూసుకోరు. ఆయన్ను నేను మాత్రమే కాపాడగలను’ అంది. ఆ అమ్మాయి మంచితనం, సహనం నా మనసుని క దిలించింది. కౌన్సిలింగ్ తర్వాత అతనిలో మార్పు వచ్చింది. మేం చేయాల్సిన సాయం చేశాం. ఇప్పుడు వాళ్లు కలిసి ఉంటున్నారు. జీవిత: ఓ కేసుని ఎప్పటికీ మర్చిపోలేను. పెళ్లయిన ఒక అమ్మాయి ఇద్దరు పిల్లలు పుట్టాక, తన భర్తని వదిలిపెట్టి వేరే ఎవరితోనే వెళ్లిపోయింది. ‘నా కోసం వద్దు. పిల్లల కోసమైనా వచ్చెయ్. నీ దారిన నువ్వు ఉండు. నీ జోలికి నేను రాను’ అని మా అందరి సాక్షిగా ఆ అమ్మాయి భర్త అన్నాడు. కానీ, ఆ అమ్మాయి మాత్రం పిల్లలు మొహం చూసో, భర్త కోసమో, సమాజం గురించి ఆలోచించో నిర్ణయం తీసుకోలేదు. ఎవరితో వెళ్లిపోయిందో అతనితోనే ఉంటానని చెప్పింది. ఈ అమ్మాయిని ఎవరైతే తీసుకెళ్లాడో అతన్ని మానవతా దృక్పథంతో ఆలోచించమంటే, ‘చచ్చినా.. బతికినా ఆ అమ్మాయితోనే. విడిపోయే ప్రసక్తి లేదు’ అని తెగేసి చెప్పాడు. పిల్లలు కూడా ‘రామ్మా..’ అని బతిమాలారు. కానీ, ఆ తల్లి కనికరించలేదు. కావాలంటే ‘మీరు రండి.. నాతో ఉండండి’ అంది. పిల్లలు మాత్రం ‘నువ్వూ, నాన్నా కలిసి ఉంటేనే మేం ఉంటాం. లేకపోతే నాన్నతోనే ఉంటాం’ అన్నారు. అప్పుడు నేను చెప్పిన తీర్పు ఏంటంటే.. ఆ అమ్మాయి భర్తను పిలిచి, ‘నీకు తగ్గ అమ్మాయిని, నీ పిల్లలను బాగా చూసుకునే అమ్మాయిని చేసుకో. నువ్ కాబట్టి ఆ అమ్మాయిని మళ్లీ తీసుకువెళతానంటున్నావ్. వేరేవాళ్లయితే ఒప్పుకోరు’ అన్నాను. జీవిత: దర్శక-నిర్మాతలు షో ప్రారంభానికి ముందు నా దగ్గర కేసు గురించి పది నిముషాలు వివరిస్తారు. దాంతో ఎవరు ఏంటో ఒక అవగాహన వచ్చేస్తుంది. ఆ తర్వాత షోలోకి వెళతాను. అక్కడ రెండు వర్గాలవాళ్లు చెప్పినవన్నీ వింటాను. మామూలుగా కొన్ని షోస్‌లో డెరైక్టర్ ఎలా చెబితే అలా చేయాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడ నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఒక కేస్‌ని డీల్ చేసేటప్పుడు ఆడ, మగ అనేది ఉండదు. న్యాయంవైపే ఉంటాను. • ఇక్కడికొచ్చేవాళ్లు సమస్యలను కాస్త ఎక్కువ చేసి చెప్పే అవకాశం ఉంటుంది కదా? సుమలత: మేం ప్రశ్నించేటప్పుడు పూర్తిగా కాకున్నా 70 శాతం ఎవరు నిజం మాట్లాడుతున్నారు? ఎవరు అతిగా చెబుతున్నారనేది ఒక అంచనాకు వస్తాం. ఈ షో ప్రొడ్యూసర్స్ ఆ జంటలో ఎవరు తప్పు చేశారనేది ముందుగానే కనుక్కుంటారు. ఆ ఫీడ్‌బ్యాక్‌తో ఎవరు అతిగా చెబుతున్నారనేది తెలిసిపోతుంది. జీవిత: ఒకట్రెండు సార్లు చెప్పిన తర్వాత నాకు క్లారిటీ రాకపోతే.. ఒకటికి నాలుగు సార్లు అడుగుతాను. వాళ్లే కన్ఫ్యూజ్ అయ్యి అసలు విషయం చెప్పేస్తారు. ఏ విషయాన్నయినా అతిగా చెబితే ఇట్టే పట్టేయొచ్చు. 200 శాతం నేను కరెక్ట్‌గా జడ్జ్ చేస్తాను. • ఈ కార్యక్రమంతో మీరెంత సంతృప్తిగా ఉన్నారు? సుమలత: కౌన్సిలింగ్‌కు వచ్చిన చాలామంది.. మూడు నాలుగు నెలల తర్వాత మళ్లీ వస్తారు. ‘మేడమ్ ఇప్పుడు మా కుటుంబం బాగుంది’ అని చెబుతుంటారు. అప్పుడు నాకు దొరికే సంతృప్తి డబ్బుతో రాదు. ఒక కుటుంబాన్ని నిలబెట్టామనే సంతోషం వెల కట్టలేనిది. జీవిత: ఓ పెద్ద యూనివర్శిటీ వీసీ (వైస్ చాన్సలర్) ‘మేడమ్.. మీ షో చాలా బాగుంది. నేనా షోకి మా ఇంట్లో వాళ్లను తీసుకొచ్చే పరిస్థితిలో లేను. విడిగా మీరు టైమ్ ఇస్తే, నా కూతురు, అల్లుణ్ణి తీసుకువస్తాను. మీరు మాట్లాడితే సర్దుకుంటుందని నమ్ముతున్నాను’ అన్నారు. ఇంతకన్నా సంతృప్తి ఏముంటుంది? • ఇలాంటి షోస్ ఇంకా ఉన్నాయి కదా.. మరి పోటీ? జీవిత: ఎవరు షో ఎంత బాగా సక్సెస్ అయిందనే పోటీ ముఖ్యం కాదు. వచ్చిన వాళ్ల సమస్యలకు పరిష్కారం చూపించగలుగుతున్నామా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తాను. ఆ షో కన్నా మనం ఇంకా బాగా చేయాలి? అనుకోవడానికి ఇది నటన కాదు... జీవితం. సుమలత: ఇలాంటి షోస్ ఎన్ని ఉన్నా చాలదు. ఎందుకంటే ప్రపంచంలో బోల్డన్ని సమస్యలున్నాయి. ఒకవేళ లేకపోతే వీటి అవసరమే లేదు. ఎవరి షో వాళ్లదే. న్యాయ నిర్ణేతల మధ్య పోలికలు పెడుతున్నారు. ఆవిడ ఇలా చేస్తోంది? ఈవిడ ఇలా చేస్తోంది? అని మాట్లాడు కుంటారు. అది సహజం. మా మధ్య పోటీ లేదు. • మీ భర్త రాజశేఖర్‌గారు మీ ప్రోగ్రామ్ చూస్తుంటారా? ఆయన ప్రోత్సహించడంవల్లే చేస్తున్నాను. నాకూ వ్యక్తిగతంగా ఇష్టమే. షో చూసినప్పుడల్లా ‘నీ పెదరాయుడు తీర్పు ‘బతుకు జట్కా బండి’లో చూపించుకో. నా దగ్గర కాదు’ అని సరదాగా ఆటపట్టిస్తుంటారు. నా కూతుళ్లేమో ‘నువ్వేమైనా చేసుకో మమ్మీ. నువ్ మాత్రం మా బానిసవే’ అని నవ్వుతుంటారు. నేను కూడా ‘యస్.. నేను మీ బానిసనే’ అంటుంటాను. షో ఇంత సక్సెస్ అవు తుందని ఊహించలేదు. ఆ మధ్య ఓ పెళ్లికి వెళితే.. పెద్ద పోలీసాఫీసర్స్ ‘ఏమ్మా.. మా పని నువ్వే చేసేస్తున్నావ్. సమస్యలన్నీ తీర్చేస్తున్నావ్’ అని అభినందించారు. • ఒక్కోసారి సహనం కోల్పోయి తిట్టే స్థాయి వరకూ..? జీవిత: ప్రతి షో గురించి ప్రేక్షకులు, మీడియా మాట్లాడుకుంటారు. ఆ షోలో ఆ నటి కొట్టిందట.. మరో షోలో ఆ నటి బూతులు తిట్టిందట.. అని. జీవిత ఇలా మాట్లాడిందట అని తప్పు వెతికితే.. ఎవరో దగ్గర కాకుండా నేరుగా నా దగ్గరే ఆ మాట అంటే సమాధానం చెబుతా. మాస్, క్లాస్ విషయానికొస్తే.. నేను మాసే. సుమలత: కొన్నిసార్లు కోపం వస్తుంది. కానీ, కోపాన్ని ప్రదర్శించి డ్రామా క్రియేట్ చేయడం నాకిష్టం ఉండదు. అలా చేస్తే ఎక్కువ మంది నా ప్రోగ్రామ్ చూస్తారు. మా లక్ష్యం అది కాదు. వాళ్ల సమస్యను ఎలా పరిష్కరించగలం అని మాత్రమే ఆలోచిస్తాం. ఎవరినైనా తిట్టినా అది ఆపుకోలేని కోపమే గానీ వాళ్లను కించపరచాలని కాదు. - శివ మల్లాల -
ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
ఫిరంగిపురం: గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక వీణాపూర్ కళాశాలలో బీఫార్మసీ రెండో సంవత్సరం చదువుతున్న యువతి మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు.. అనంతపురం జిల్లా కురాకులపల్లి గ్రామానికి చెందిన మలపుల సుమలత(20) కళాశాల హాస్టల్లో ఉంటూ బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో వారం రోజుల క్రితం హాస్టల్లో ఫోన్ వాడకం పై వార్డెన్‌కు విద్యార్థినికి మద్య వాగ్వాదం జరగింది. అప్పటి నుంచి అన్యమనస్కంగా ఉంటోంది. మంగళవారం రాత్రి గదిలో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థినులు హాస్టల్ వార్డెన్ సాయంతో తలుపును పగలగొట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఆమె రూమ్ లో దొరికిన నోట్‌బుక్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాని నోట్ బుక్ లోని మొదటి పేజీని ఎవరో చించినట్లు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నోట్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో ఉన్న వివరాల ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. -
ఈ ఆటలో ఆమే విజేత!
సంసారం సజావుగా సాగితే సంబరంలా ఉంటుంది. కానీ కలతలు వచ్చాయో కల్లోలమవుతుంది. చదరంగంలా గజిబిజిగా, గందరగోళంగా తయారవుతుంది. ఆ గందరగోళాన్ని తొలగించడం అంత సులభమైన పనేమీ కాదు. అయినా ఆ బాధ్యతని తలకెత్తుకున్నాయి కొన్ని టెలివిజన్ షోలు. వాటిలో ‘సంసారం ఒక చదరంగం’ ఒకటి. అయితే దీని సక్సెస్‌లో సగంపైన క్రెడిట్ హోస్ట్ సుమలతకే ఇవ్వాలి. గతంలో ‘బతుకు జట్కాబండి’ కార్యక్రమాన్ని నడిపారు సుమలత. ఆ తర్వాత ఈ షో బాధ్యతలు స్వీకరించారు. ఆవిడ తన బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నిర్వరిస్తున్నారు. ఇరు వర్గాల వాదననూ ఓపికగా వినే విధానం, వారి వ్యక్తిత్వాలనూ ఆలోచనా విధానాలనూ అంచనా వేసే తీరు ఎంతో చక్కగా ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆవిడ మాట తీరు గురించి చెప్పుకోవాలి. తప్పు చేసినవారితో సైతం ఎంతో మర్యాదగా మాట్లాడటం, ఎంత కోపంగా మందలిస్తున్నా ఎక్కడా మాట తూలకపోవడం ఆవిడలోని స్పెషల్ క్వాలిటీస్. ఆవిడ విజ్ఞత చూస్తుంటే హోస్ట్‌గా ఆవిడ్ని సెలెక్ట్ చేయడం నూరు శాతం కరెక్ట్ అనిపిస్తోంది. సంసారపు చదరంగంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా... ఈ షో వరకూ మాత్రం ఆమే విజేత! -
బీటెక్ విద్యార్థిని బలవన్మరణం
మదనపల్లె రూరల్: చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అమ్మచెరువు మిట్ట గ్రామంలో బుధవారం ఉదయం ఓ బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన శివలక్ష్మి కూలి పనులు చేసుకుంటూ తన కుమార్తె సుమలత( 22) ను కురబలకోట సమీపంలోని అంగళ్లు ఎంఐటీ కళాశాలలో బీటెక్ చదివిస్తోంది. ప్రస్తుతం బీటెక్ ఫైనలియర్లో ఉన్న సుమలత గురువారం ఉదయం తల్లి ఇంట్లో లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
ఉపాధ్యాయురాలి అరెస్ట్
హిందూపురం: అనంతపురం జిల్లాలో ఓ ఉపాధ్యాయురాలు కటకటాల పాలయ్యింది. అప్పు తీర్చకుండా కోర్టు వాయిదాలకు హాజరు కాని ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూపురం మండలం రాచపల్లి ప్రభుత్వ పాఠశాల టీచర్ సుమలత (42) అదే పాఠశాలలో సుజాత అనే టీచర్ వద్ద కొంత నగదును అప్పుగా తీసుకున్నారు. తిరిగి చెల్లించకపోవడంతో సుజాత కోర్టును ఆశ్రయించారు. విచారణకు సుమలత హాజరు కాకపోవడంతో పోలీసులు మంగళవారం ఆమెను అరెస్ట్ చేసి స్థానిక కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. -
హీరోలు, హీరోయిన్ల శుభాకాంక్షల వెల్లువ
చిరంజీవి షష్టిపూర్తి సందర్భంగా ఆయనను పలువురు హీరోలు, హీరోయిన్లు, దర్శకులు, గాయకులు, సంగీత దర్శకులు.. ఇలా సినిమా రంగంలోని అన్ని విభాగాలకు చెందినవాళ్లు అభినందనలతో ముంచెత్తారు. అలనాడు ఆయనతో పాటు నటించిన ప్రముఖ హీరోయిన్లు రాధిక, సుమలత దగ్గర్నుంచి ఈనాటి టాప్ హీరోయిన్లు శ్రుతిహాసన్, అనుష్క లాంటివాళ్లు కూడా ట్విట్టర్ ద్వారా చిరుకు అభినందనలు తెలిపారు. అలాగే హీరోయిన్లు ఇషాచావ్లా, మధుశాలిని, హీరోలు అల్లరి నరేష్, నితిన్, దర్శకులు గుణశేఖర్, శ్రీనువైట్ల, సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్, గాయకుడు బాబా సెహగల్ .. ఇలా చాలామంది ట్విట్టర్ ద్వారా మెగాస్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. వాటిలోంచి కొన్నింటిని మీకు అందిస్తున్నాం.. Happy Birthday" to #MEGASTAR Chiranjeevi sir, God bless you and your Family,Long Live....Inspiring Personality #HappyBirthdayMegastar -
అంబరీష్‌తో జాగ్రత్త
నటుడు అంబరీష్‌తో జాగ్రత్తగా ఉండాలని నటి సుహాసిని చెప్పినట్లు నటి సుమలత చెప్పారు. సినీ రంగంలో సహ నటీనటుల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న వారి సంసార జీవితాల్లో చాలా మట్టుకు సమస్యలమయంగా సాగుతున్నది అనేది ఎవరూ కాదనలేని విషయం అలాగని సంతోషంగా జీవిస్తున్న వారు లేరని చెప్పలేం. అలా జీవితాన్ని అన్యోన్యంగా మలచుకునే నటి జంటల్లో కన్నడ నటుడు అంబరీష్, నటి సుమలత ఒకరు. సుమలత 1990 ప్రాంతంలో తమిళం, తెలుగు, కన్నడం చిత్ర పరిశ్రమల్లో ప్రముఖ హీరోయిన్గా వెలుగొందారు. ఇక అంబరీష్ కన్నడ చిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా రాణించారు. ఈయన తమిళంలోనూ కొన్ని చిత్రాలు చేశారు. నటుడు రజనీకాంత్‌కు మంచి మిత్రుడు. అంబరీష్, సుమలత ఒకరి నొకరు ప్రేమించుకున్నారు. ఆ సమయంలో అంబరీష్‌తో జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించిన వారిలో నటి సుహాసిని కూడా ఉన్నారట. ఈ విషయాన్ని నటి సుమలత స్వయంగా చెప్పడం విశేషం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గతాన్ని నెమరువేసుకున్న ఆమె తన సుదీర్ఘ వివాహ జీవితం గురించి చెబుతూ వివాహానికి ముందు తన భర్త అంబరీష్‌తో కలసి పలు చిత్రాల్లో నటించానన్నారు. ఆయనతో తన జీవితాన్ని పంచుకోవాలని భావించినప్పుడు నటి సుహాసినితో పాటు పలువురు అంబరీష్‌తో జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరించారన్నారు. తన మేకప్‌మన్ కూడా అంబరీష్‌కు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారన్నారు. అయినా అంబరీషే తనకు నచ్చడంతో ఆయన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, ఇప్పటి వరకు తమ దాంపత్య జీవితం హాయిగా సాగుతోందని చాలా సంతోషంగా జీవిస్తున్నట్లు పేర్కొన్నారు. -
సుమలతకు మరో రూ. 31 వేల వితరణ
పొందూరు: బురిడికంచరాం గ్రామానికి చెందిన వండాన సుమలతకు గురువారం మరికొంతమంది దాతలు రూ. 31వేల ఆర్థిక సాయం అందించారు. శ్రీకాకుళం పీఎన్ కాలనీలో ఉన్న సాయి విద్యామందిర్ టెక్నోస్కూల్ సిబ్బంది రూ. 27వేలను, వాల్తేరు జిల్లా పరిషత్ హైస్కూల్ సిబ్బంది రూ. 4వేలు ఇచ్చారు. సుమలత బోన్‌మారో లోపంతో బాధపడుతున్న వైనంపై గత ఏడాది డిసెంబర్ 5న ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి వారు స్పందించి నగదును అందించారు. సిస్టం డిగ్రీ కళాశాల విద్యార్థులు సురేష్, జగన్నాథనాయుడు కృషితో నిధులు సేకరించామని సాయివిద్యామందిర్ సిబ్బంది తెలిపారు. కాగా, వండాన సుమలత కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకొంది. సుమలత తల్లి తవిటమ్మ కడుపులో కణితి ఉండటంతో ప్రస్తుతం శ్రీకాకుళం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. -
మనసు పలికే...
డిగ్రీ చదివినా.. ఉద్యోగం చేస్తున్నా.. మనసు మాత్రం నటనపైనే. దానికి పొట్టి చిత్రాలను వేదికగా చేసుకొని.. అభిమానులను ఆకట్టుకుంటోంది నటి సుమలత. ఇటీవల సిటీలో జరిగిన అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సహాయనటి అవార్డు అందుకున్న సుమలతతో ‘చిట్‌చాట్’.. నటన, సంగీతం అంటే చాలా ఇష్టం. డిగ్రీ తర్వాత ఉద్యోగం కోసం నగరానికి వచ్చాను. ఒక డివోషనల్ చానల్లో టెక్నికల్ ఉద్యోగిగా చేరాను. అవసరం కోసం ఉద్యోగం చేస్తున్నా నటనపై ఉన్న ఇష్టం తగ్గలేదు. అవకాశం వస్తే తప్పకుండా నటించాలని, చిన్నప్పటి నుంచి కోరిక. అలా మొదటిసారి ఫ్రెండ్స్ తీసిన ‘మౌనంగానే’ షార్ట్‌ఫిలింలో నటించా. తొలిసారి కెమెరా ముందుకి వెళ్లినప్పుడు నటన గురించి ఏమీ తెలియదు. ఫ్రెండ్స్ గెడైన్స్‌లో నటించేశా. అలా కెమెరా ముందే ఓనమాలు నేర్చుకున్నా. గోపురం, ఇదే ప్రేమతో పాటు 10 షార్ట్ ఫిలింస్ చేశా. నటిగా ఈ ఏడాదిన్నర కాలంలో బుల్లి చిత్రాలతో పాటు ఫీచర్ ఫిలింస్‌లోనూ నటించాను. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘నువ్వలా నేనిలా’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా చేశా. ఇదే నా బిగ్ స్క్రీన్ ఎంట్రీ. తర్వాత రొమాన్స్, వీకెండ్ లవ్ ఇంకా కొన్ని చిత్రాల్లో కూడా నటించాను. బుల్లి సినిమాలతో పాటు సిల్వర్ స్క్రీన్‌పై కూడా నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు చేయాలనేది నా కోరిక. -
ఆయనే నా భర్త అయితేబాగుండనుకున్నా!
రీల్ పైనా, రియల్ గానూ అంబరీష్ రెబల్‌స్టార్... కానీ, సుమలత అలా కాదు! ఆన్ స్క్రీన్ ఆమె చాలా ఫాస్ట్... ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలా చాలా సాఫ్ట్.. అంబరీషేమో సోసోగా ఉంటారు... సుమలతేమో గొప్ప అందగత్తె... కానీ జోడీ కుదిరింది.. ఇద్దరూ ప్రేమలో పడ్డారు... పెళ్లి కూడా చేసుకున్నారు... భిన్న మనస్తత్వాలున్న ఈ ఇద్దరి కాపురం ఇప్పుడు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది... అసలు వీళ్ల ప్రేమకథ ఎలా మొదలైంది? రెబల్‌స్టార్ అంబరీష్‌ని సుమలత ఇష్టపడటానికి కారణం ఏంటి? తెలుగింటి గోంగూర రుచి తెలిసిన సుమలత, కన్నడ బిసిబేళా బాత్‌ను ఎలా ఇష్టపడగలిగారు? ఒకప్పుడు కథానాయికగా దక్షిణాదిన ఓ వెలుగు వెలిగిన సుమలత ఇప్పుడేం చేస్తున్నారు? తెలుగు సినీరంగానికి దూరమైన తర్వాత ఇంటర్వ్యూలకి కూడా దూరంగా ఉంటున్న సుమలత పుట్టిన రోజు ఈ నెల 27న. ఈ సందర్భంగా ఈ తెలుగింటి సుమపరిమళాలు ‘సాక్షి’ పాఠకులకు ప్రత్యేకం... తెలుగింటి ఆడపడుచైన మీరు కన్నడ ఇంటి కోడలిగా సెటిలై పోయారు... జీవితం ఎలా ఉంది? సుమలత: చాలా బాగుందండి. కన్నడవాళ్లు నన్ను తమ అమ్మాయిగా అంగీకరించారు. నన్నెంతగా అభిమానిస్తున్నారంటే.. నా నేపథ్యం తెలియనివాళ్లు నేను కన్నడ అమ్మాయినే అనుకుంటున్నారు. ఒక రాష్ర్టంలో పుట్టి, పెరిగి మరో రాష్ట్రంలో ఇంతటి అభిమానం సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. మన గోంగూర ఎంత రుచిగా ఉంటుందో కన్నడ బిసిబేళా బాత్ కూడా అంతే రుచిగా ఉంటుంది. కానీ, తెలుగు సినిమాలకు దూరం కావడం బాధగా లేదా? ఎందుకుండదు? అడపా దడపా నేను కన్నడ చిత్రాల్లో నటిస్తున్నాను. అప్పుడు మన మాతృభాషలో సినిమాలు చేయలేకపోతున్నామనే బాధ కలుగుతుంటుంది. తెలుగు పరిశ్రమ నుంచి నాకు అవకాశాలు వస్తున్నాయి. కానీ, తీరిక చిక్కడం లేదు. ఒకవేళ తీరిక చేసుకుని చేస్తే, ఆ పాత్ర ఎంతో విలువైనది అయ్యుండాలి. అప్పుడే అర్థం ఉంటుంది. ఈ మధ్యకాలంలో గొప్పగా అనిపించిన పాత్రలేవీ రాలేదు. పైగా, అప్పట్లో మాతో సినిమాలు చేసిన విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారి లాంటి దర్శకులు ఇప్పుడు సినిమాలు చేయడం లేదు. ఒకవేళ చేస్తే ఆ సినిమాల్లో నటించవచ్చు. అంటే.. ఇప్పుడు వస్తున్న దర్శకులతో సినిమాలు చేయాలనుకోవడం లేదా? అలా ఏం లేదు. ఇప్పుడొస్తున్నవారిలో రాజమౌళి, శేఖర్ కమ్ముల లాంటి ప్రతిభావంతులైన దర్శకులు చాలామంది ఉన్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటి దర్శకులను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తున్నారు. టెక్నాలజీ మీద మంచి అవగాహన ఉంటోంది. కొత్త తరహా పాత్రలను సృష్టిస్తున్నారు. మా తరంలో ఇలాంటి దర్శకులు కూడా ఉండుంటే బాగుండేది కదా అనిపిస్తుంటుంది. ఆ మధ్య తెలుగులో ‘బతుకు జట్కా బండి’ షో చేశారు కదా! ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు? బుల్లితెరపై నా మొదటి షో అది. ఆ కాన్సెప్ట్ నచ్చి చేశాను. ముందు నలభై ఎపిసోడ్స్ అనుకున్నాం.. స్పందన బాగుండటంతో 100 ఎపిసోడ్స్ చేశాం. దక్షిణాదిన అన్ని భాషల్లో కలిపి నేను రెండు వందల పైచిలుకు చిత్రాలు చేశాను. వాటి ద్వారా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఈ షో తెచ్చిన గుర్తింపు అంతకు రెట్టింపు. ప్రపంచంలో ఏ మూలకెళ్లినా దీని గురించి మాట్లాడి, అభినందిస్తున్నారు. ఇప్పటికీ చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్లు, వ్యాపారస్థులు కూడా ఈ షో గురించి మాట్లాడుతున్నారు. ఓ సినిమా నటిగా ‘కామన్ మేన్’ జీవితంలో ఉండే ఒడుదొడుకుల గురించి చర్చించే వీలు నాకు దొరకలేదు. కానీ, ఈ షో ద్వారా ఎంతోమంది జీవితాలను తెలుసుకున్నాను. ‘ఇలాంటి కష్టాలు కూడా ఉంటాయా’ అనిపించింది. ఇదే షోను కన్నడంలో చేయమన్నారు. కానీ, నా భర్త రాజకీయాల్లో ఉన్నారు కదా. స్వలాభం కోసం మేమిలాంటి షో చేస్తున్నామనే రంగు పులిమేస్తారని భయంతో ఒప్పుకోలేదు. మీ తరం వారిలో సీరియల్స్ నిర్మిస్తున్న, నటిస్తున్న తారలున్నారు... మరి మీరు సీరియల్స్ జోలికి వెళ్లకపోవడానికి కారణం? నాకంత ఓపిక, సమయం లేదు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా సీరియల్స్‌కి దూరంగానే ఉండాలనుకుంటున్నా. మరి... ఏం జరుగుతుందో? సమయం లేదంటున్నారు. అంత బిజీయా? నేను కాకపోయినా నా భర్త చాలా బిజీ. ఆయన కర్నాటక రాష్ట్ర మంత్రి అనే విషయం తెలిసిందే. అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తుంటారు. నిత్యం బిజీగా ఉంటారు. ఆయనకు నా సపోర్ట్ చాలా అవసరం. నేను కూడా బిజీ అయిపోతే ఎలా? ఎవరో ఒకరు ఖాళీగా ఉంటే.. ఇంకొకరికి సహాయంగా ఉండొచ్చు కదా! అందుకే నేనెక్కువ కమిట్మెంట్స్ పెట్టుకోవడం లేదు. అంబరీష్‌కు రీల్ జీవితంలోనే కాదు.. రియల్ జీవితంలోనూ ‘రెబల్ స్టార్’ అనే ఇమేజ్ ఉంది. ఎలా నెట్టుకొస్తున్నారు? (నవ్వుతూ...) జీవిత భాగస్వాముల్లో ఒకరు రెబల్‌గా ఉంటే ఒకరు సాఫ్ట్‌గా ఉండాలి. అంబరీష్ మొదటి రకం అయితే నేను రెండో రకం. అందుకని, మా జీవితం సాఫీగా సాగుతోంది. అంబరీష్ చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. మంచి విలువలున్న వ్యక్తి. మీ ఇద్దరిదీ ప్రేమ వివాహం కదా!అసలు అంబరీష్‌పై ప్రేమ కలగడానికి కారణం? ఆయన మనస్తత్త్వమే. చాలా మంచి వ్యక్తి. దాన వీర శూర కర్ణ, కలియుగ కర్ణ, మానవతామూర్తి... ఇలా కన్నడ రంగంలో ఆయన మంచితనానికిబోల్డన్ని బిరుదులున్నాయి. ఇతరులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ఆయన వెనకడుగు వేయలేదు. అవన్నీ స్వయంగా చూశాను. అందుకే... ఆయనే నా భర్త అయితే బాగుండనుకున్నాను. నాది సున్నితమైన మనస్తత్త్వం కాబట్టి, ఆయన ఇష్టపడ్డారు. మీ మధ్య ఎప్పుడు ప్రేమ మొదలైంది? మాది తొలి చూపులో ఏర్పడ్డ ప్రేమ కాదు. ఇద్దరం కలిసి చాలా సినిమాలు చేశాం. ముందు మంచి స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. ఆ మార్పు ఫలానా సమయంలో వచ్చిందని చెప్పలేను. మాకు తెలియకుండానే ప్రేమలో పడిపోయాం. అంబరీష్ మంచి స్నేహశీలి. ఆయనకు బోల్డంత మంది మంచి స్నేహితులున్నారు. దాంతో, ఎప్పుడూ బిజీయే. రజనీకాంత్ గారైతే.. ‘నాకు తెలిసి ఇండియాలో మీ ఆయనకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ ఉండరేమో’ అంటుంటారు. స్నేహితుల కోసం ఆయన ఏమైనా చేస్తుంటారు. మరి.. ఆ స్నేహం కారణంగామీరెప్పుడూ ఇబ్బంది పడలేదా? పెళ్లయిన కొత్తలో ప్రైవసీ కోరుకుంటాం కాబట్టి, కొంచెం ఇబ్బందిగా ఉండేది. స్నేహితుల గురించి మా మధ్య చిన్న చిన్న గొడవలు కూడా జరిగాయి. అయితే, అదృష్టవశాత్తూ ఆ గొడవలు ముదురు పాకాన పడి, విడిపోయేంత వరకూ రాలేదు. ఆయన పగలంతా స్నేహితులు, పనులతో బిజీగా ఉన్నా, సాయంత్రం మాత్రం పూర్తిగా కుటుంబానికే అంకితమైపోతారు. సహాయం చేసే విషయంలో అంబరీష్ వెనకాడరని చెప్పారు కదా! ఆ విషయంలో ఆయన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నించేవారా? లేదు. ఎందుకంటే, నేను ఆయనను ఎక్కువ ఇష్టపడానికి కారణం అదే. పెళ్లికి ముందు ఇష్టపడిన విషయం తీరా పెళ్లి అయిపోయాక ఎందుకు కష్టంగా ఉంటుంది. కాకపోతే, అర్హత లేనివాళ్లకు సహాయం చేసినప్పుడు మాత్రం వారిస్తుంటాను. అప్పుడాయన ‘నాకు సహాయం చేయాలనిపించింది.. చేశాను. ఒకవేళ వెన్నుపోటు పొడిచారనుకో.. అది వాళ్ల కర్మ’ అంటుంటారు. ఎవరికైనా సహాయం చేస్తే, వాళ్లు తిరిగి తనకేదో చేయాలనీ, జీవితాంతం ఋణపడి ఉండాలనీ కోరుకోరు. ఆయన అంత మంచి వ్యక్తి. అందుకే, ఆయనను జీవిత భాగస్వామిగా పొందడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈ డిసెంబర్‌కి మా పెళ్లయ్యి 23 ఏళ్లు పూర్తవుతోంది. ఇన్నేళ్ల మా వైవాహిక జీవితం బోల్డన్ని మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ దేవుడు నాకు ఇచ్చిన మంచి బహుమతి ‘అంబరీష్’. మీకు కూడా స్నేహితులున్నారా? మా తరంలో నటించినవారిలో నాకు సుహాసిని క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం తెలుగు, తమిళంలో ఏడెనిమిది సినిమాల్లో కలిసి నటించాం. ఆ సమయంలో మంచి స్నేహం ఏర్పడింది. ఇద్దరం తరచూ ఫోన్లో మాట్లాడుకోం కానీ, స్నేహితులమే. సుహాసిని బెంగళూరు వస్తే.. మా ఇంటికి రాకుండా వెళ్లదు. నేను చెన్నై వెళితే వాళ్లింటికి వెళ్లకుండా ఉండను. తెలుగు పరిశ్రమలో కూడా మీవారికి మంచి స్నేహితులన్నారనుకుంటా? అవును. మోహన్‌బాబు గారు, చిరంజీవి గారు, హిందీ రంగంలో శతృఘ్న సిన్హా గారు, తమిళంలో రజనీకాంత్ గారు.. ఇలా చాలామంది స్నేహితులున్నారు. ఆ మధ్య అంబరీష్‌కి ఆరోగ్యం బాగాలేకపోతే వాళ్ళందరూ పరామర్శించారు. మోహన్‌బాబు గారైతే బెంగళూరు వచ్చి, మా ఆయనను చూడగానే ఒక్కసారిగా కంట తడిపెట్టుకున్నారు. ఆ అభిమానం చూసి, చాలా సంతోషం అనిపించింది. బహుశా మీ జీవితంలో బాగా టెన్షన్ పడిన సందర్భం అంబరీష్‌కి ఆరోగ్యం బాగా లేనప్పుడేనేమో? వంద శాతం కరెక్ట్. ఆ సమయంలో నేను అనుభవించిన బాధ అంతా ఇంతా కాదు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తెలియగానే... అభిమానులు పూజలు చేశారు. హోమాలు నిర్వహించారు. పొర్లుదండాలు పెట్టారు. అలాంటివన్నీ విని కదిలిపోయాను. అసలు మమ్మల్ని కలుస్తారో లేదో తెలియదు. పోనీ మా ద్వారా ఏమైనా లాభం కలుగుతుందా? అంటే అదీ లేదు. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నవాళ్లు సైతం ఆయన ఆరోగ్యం కోసం పూజలు చేశారు. అసలే సినిమా పరిశ్రమ అంటే నాకు చాలా అభిమానం. ఈ సంఘటనతో ఆ అభిమానం మరింత పెరిగిపోయింది. ‘సినిమా పరిశ్రమ మీకు ఇంతమంది అభిమానులను ఇస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెస్తోంది’ అని ఆ దేవుడు ఇలాంటి సంఘటనల ద్వారా మా సినిమా పరిశ్రమవారికి చూపిస్తాడేమో అనిపించింది. ఇప్పుడు అంబరీష్ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా బాగున్నారు. అంతా ఆ దేవుడి దయ. మీ పిల్లల గురించి? మాకు ఒకే ఒక్క బాబు. పేరు - అభిషేక్ గౌడ. లండన్‌లో ఎం.ఎస్. చేస్తున్నాడు. తన చదువు కూడా పూర్తయిపోతే నాకు పెద్ద బాధ్యత తీరిపోతుంది. మీ అబ్బాయిని సినిమాల్లోకి తీసుకు రావాలనుకుంటున్నారా? అభిషేక్‌కు ఏది నచ్చితే దానికి ఓకే చెప్పడానికి నేను, అంబరీష్ సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ సినిమాల్లోకి రావాలనుకున్నాడనుకోండి.. అప్పుడు గెడైన్స్ మాత్రమే ఇస్తాం. ‘మన అబ్బాయి కోసం నేను సినిమా తియ్యను. ఆర్టిస్ట్ కావాలనుకుంటే వాడే శిక్షణ తీసుకోవాలి. అన్ని రకాలుగా తయారైన తర్వాత నేను గెడైన్స్ ఇస్తా. అంతేకానీ రికమండేషన్ చేయను’ అని అంబరీష్ అంటుంటారు. నా అభిప్రాయం కూడా అదే. కష్టం, సుఖం.. ఏదైనా స్వయంగా తెలుసుకుంటేనే జీవితం బాగుంటుందన్నది మా ఇద్దరి అభిప్రాయం. మా వాడికి రాజకీయాలంటే ఆసక్తి ఉంది. ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నాడనుకోండి... అప్పుడు కింద స్థాయి నుంచి కృషి చేసి, పైకి రమ్మని చెబుతాం. అంతేకానీ ‘మా వారసుడు వస్తున్నాడు...’ అంటూ వాడికి రహదారి వేయాలని అనుకోం. ఓసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళదాం.. అప్పట్లో హీరోయిన్ కావాలని మీకు ఉండేదా? లేదు. నేను బాగా చదువుకునేదాన్ని. స్కాలర్షిప్ కూడా వచ్చేది. నేను మిస్ ఆంధ్రప్రదేశ్ బిరుదు సంపాదించిన తర్వాత సినిమా అవకాశాలు రావడం మొదలైంది. అప్పుడు పదో తరగతి చదువుతున్నాను. పరీక్షలు పూర్తయిన తర్వాత సెలవుల్లో సినిమా చేశాను. అది తమిళ చిత్రం. పేరు - ‘దిశై మారియ పరవైగళ్’. ఒకవేళ ఆ సినిమా వర్కవుట్ కాకపోతే, హాయిగా చదువుకోవచ్చనుకున్నాను. కానీ, మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు రావడం, బిజీ కావడం జరిగిపోయాయి. 1979లో ఆ సినిమా చేశాను. అదే ఏడాది ‘సమాజానికి సవాల్’ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు పరిచయమయ్యాను. ఆ చిత్రం తర్వాత తెలుగులో కూడా బిజీ అయ్యాను. దాంతో చదువుకు ఫుల్స్టాప్ పెట్టక తప్పలేదు. పోనీ ప్రైవేట్‌గా చదువుకుందామన్నా కుదరలేదు. అదొక్కటే బాధ. సినిమా రంగం పరంగా పశ్చాత్తాపపడాల్సిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? మంచి పాత్రలు చాలానే చేశాను. ఇంకా చేసి ఉంటే బాగుండేదనే ఫీలింగ్ తప్ప, వేరే రకంగా నాకెలాంటి పశ్చాత్తాపమూ లేదు. చాలామంది సినిమా రంగం గురించి తప్పుగా మాట్లాడతారు. కానీ, ఇది అద్భుతమైన పరిశ్రమ. పేరు, డబ్బుతో పాటు అభిమానులను ఇస్తుంది. ఈ అదృష్టం ఏ రంగంలో దక్కుతుంది. గత 34 ఏళ్లుగా సినిమా పరిశ్రమతో నా అనుబంధం కొనసాగుతోంది. ఈ పరిశ్రమలో ఉండడం ఆ దేవుడి ఆశీర్వాదం అనుకుంటున్నా. మీకో చెల్లెలున్నారు కదా.. ఆవిడ ఏం చేస్తున్నారు? నా చెల్లెలు ప్రియ హైదరాబాద్‌లో ఉంటోంది. ప్రసాద్ ల్యాబ్ సీజీ, త్రీడీ యానిమేషన్ శాఖకు హెడ్‌గా వ్యవహరిస్తోంది. కెమెరామేన్ అజయన్ విన్సెంట్‌ను వివాహం చేసుకుంది. {పతి ఏడాదీ ‘సౌత్ సూపర్ స్టార్స్ 1980 రీ యూనియన్’ పేరుతో మీ తరం నటీనటులు కలుసుకుంటున్నారు కదా! దాని గురించి చెబుతారా? నాకు తెలిసి మన భారతదేశంలో ఉత్తరాదిన ఇలాంటి రీ యూనియన్ లేదు. ఏడాదికోసారి కలుసుకోవాలని మేం ఐదేళ్ల క్రితం అనుకున్నాం. దానిని ఆచరిస్తున్నాం. పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, హాయిగా కబుర్లు చెప్పుకోవడం, ఆటపాటలతో మా రీ-యూనియన్ పార్టీ చాలా జోరుగా ఉంటుంది. గత ఐదేళ్లుగా కలుసుకుంటున్నాం.. రానున్న సంవత్సరాల్లో కూడా కలవాలనే అనుకుంటున్నాం. ఫైనల్‌గా వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం గురించి ఏం చెబుతారు? రెండూ సంతృప్తికరంగానే ఉన్నాయి. సినిమాలు చేసినా చేయకపోయినా అభిమానులు మాత్రం అలానే ఉంటారు. ఎక్కడైనా కనిపిస్తే.. ‘సినిమాలు చేయడం లేదేంటి’ అంటూ ఆప్యాయంగా పలకరిస్తారు. అంతకన్నా ఏం కావాలి? (నవ్వుతూ..) ఇక, అంబరీష్ లాంటి భర్తను పొందిన ఏ భార్య జీవితం అయినా హాయిగా ఉంటుంది. - డి.జి. భవాని మా ఆయన కోసం నేను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నాను కానీ, రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. ఎంపీగా పోటీ చేయమని కొంతమంది ఒత్తిడి చేశారు. కానీ, ఆయనా రాజకీయాల్లో ఉండీ, నేను అక్కడే ఉంటే ఇక ఇంటిని చూసుకునేదెవరు? 100 శాతం కాకపోయినా 99 శాతం న్యాయం చేయగలం అనేంత తీరిక చిక్కితే అప్పుడు రాజకీయాల గురించి ఆలోచిస్తా. దర్శకత్వం అనేది అంత సులువైన పని కాదు. సినిమా మీద చాలా పట్టు ఉండాలి. అన్ని శాఖల మీద అవగాహన ఉండాలి. చాలా ఓపిక ఉండాలి. నాకు తెలిసి దర్శకత్వం నాకు సరిపడదు. -
శ్రీవారిని దర్శించుకున్న నటి సుమలత
-
శ్రీవారి సేవలో సుమలత
తిరుమల: సినీతార సుమలత గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాత్రి నైవేద్య విరామ సమయంలో ఆమె శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సుమలత దర్శనం అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. చాలా రోజుల తరువాత స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఏ చిత్రాల్లోనూ నటించడం లేదని చెప్పారు. రాజకీయలపై కూడా ఆసక్తి లేదన్నారు. ‘చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే మళ్లీ నటిస్తారా’ అనే ప్రశ్నకు నవ్వుతూ చూద్దామని సమాధానమిచ్చారు. ఆలయం వెలుపల సుమలతను చూడడానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఆమెతో కలిసి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. -
మైసూరులో సూపర్ స్టార్ లింగ
చాముండేశ్వరి కొండపై సినిమా ముహూర్త కార్యక్రమం మైసూరు, న్యూస్‌లైన్ : అక్షయ తృతీయ రోజున బ్రహ్మీ ముహూర్త సమయంలో మైసూరులోని చాముండీకొండపై వెలిసిన చాముండేశ్వరీ మాతను సూపర్‌స్టార్ రజనీకాంత్ దర్శించుకున్నారు. ప్రముఖ నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ సారధ్యంలోని రాక్‌లైన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రజనీకాంత్ హీరోగా నటించనున్న ‘లింగ’ సినిమా ముహూర్త కార్యక్రమాన్ని శుక్రవారం మైసూరులో నిర్వహించారు. ఈ ముహూర్త కార్యక్రమానికి ప్రముఖ నటుడు, రాష్ట్ర మంత్రి అంబరీష్, ఆయన సతీమణి సుమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ మాట్లాడుతూ...మండ్య, మేలుకొటే, మైసూరు ప్రాంతాల్లో మే11 వరకు చిత్ర నిర్మాణం జరగనుందని తెలిపారు. సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు హీరోయిన్లు సోనాక్షి సిన్హా, అనుష్కా శెట్టి ఈ షూటింగ్లో పాల్గొననున్నారని వెల్లడించారు. రజనీ సరికొత్త స్టైల్ : గురువారం రాత్రి మైసూరుకు చేరుకున్న రజనీకాంత్ శుక్రవారం తెల్లవారు ఝామున 3 గంటల సమయంలో చాముండేశ్వరీ కొండపైకి చేరుకున్నారు. ఎటువంటి మేకప్ లేకుండా ఓ సాధారణ వ్యక్తిలా కొండపైకి వచ్చిన రజనీకాంత్‌ను చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమయంలో పోలీసుల సహాయంతో ఆయన చాముండేశ్వరీ మాత ఆలయంలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం తెల్లటి పంచ, చొక్కా వేసుకొని సన్నపాటి మీసాలు, విగ్‌తో సరికొత్త స్టైల్లో బయటికి వచ్చిన రజనీని చూసిన అభిమానులు ఇదో కొత్త స్టైల్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక సినిమా విజయవంతం అవ్వాలని ముహూర్త కార్యక్రమంలో పాల్గొన్న అంబరీష్, సుమలత ఆకాంక్షించారు. -
రెబల్ స్టార్‌గా తిరిగి వస్తా
* అభిమానులకు అంబి భరోసా * మరో వారంలో బెంగళూరుకు * సీడీ విడుదల బెంగళూరు : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్ పూర్తిగా కోలుకున్నారు. మరో వారం రోజుల విశ్రాంతి అనంతరం ఆయన బెంగళూరుకు తిరిగి వస్తారు. శ్వాస కోశ వ్యాధికి అంబరీశ్ సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజలు తన ఆరోగ్యం గురించి ఇక ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతూ ఆయన సీడీ రూపంలో ఓ సందేశాన్ని పంపారు. అందులో ఆయన ఏమన్నారంటే....‘నమస్కారం. అందరికీ మీ అంబరీశ్ నమస్కారం. మీకు తెలిసిన విధంగానే నా ఆరోగ్యం గురించి అభిమానులు, పెద్దలు, దేశ, విదేశాల్లోని స్నేహితులు ఆందోళన చెందారు. అయితే ఎవరూ కలత చెందాల్సిన పని లేదు. నేను సంపూర్ణ ఆరోగ్యంతో కచ్చితంగా తిరిగి వస్తాను. విక్రం ఆస్పత్రి వైద్యులు చూపించిన వాత్సల్యం, విశ్వాసానికి నేను సదా రుణ పడి ఉంటా. వారి ప్రయత్నం వల్లే నేను బతికాను. అందరి ఆపేక్ష మేరకు సింగపూర్‌కు చికిత్స కోసం వచ్చాను. ఇప్పుడు కోలుకున్నాను. అయితే ఇప్పటికిప్పుడు ఊరికి రావడం కుదరదు. ఎందుకంటే.. వైద్యుల సలహా మేరకు ఇంకా ఓ వారం ఇక్కడే ఉండాలి. అనంతరం తిరిగి వస్తాను. ప్రభుత్వం నాకు అవసరమైన సాయం అందించింది. నాపై ఉంచిన విశ్వాసం, వాత్సల్యానికి జీవితాంతం రుణపడి ఉంటాను. అభిమానులు నా ఆరోగ్యం కోసం పూజలు చేశారు. అందరిలోనూ ఆందోళన నెలకొంది. అయితే ఇకమీదట ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. విక్రం ఆస్పత్రిలో ఉన్నప్పుడు అనేక మంది ప్రముఖులు వచ్చి నా ఆరోగ్యం గురించి వాకబు చేశారు. వారందరికీ హృదయ పూర్వక వందనాలు. కొద్ది రోజుల్లోనే రెబల్ స్టార్ లాగానే తిరిగి వస్తా. జై హింద్, జై కర్ణాటక’. -
'దయచేసి సింగపూర్ రావద్దు'
బెంగళూరు : సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రిలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రముఖ నుటుడు అంబరీష్‌ను పరామర్శించేందుకు వెళుతున్న సన్నిహితులు, అభిమానుల సంఖ్య ఎక్కువ అవుతోంది. దీంతో అంబరీష్‌ను పరామర్శించేందుకు సన్నిహితులెవ్వరూ సింగపూర్ రావద్దని ఆయన సతీమణి సుమలత కోరారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సాధారణ వార్డులో అంబరీష్ చికిత్స తీసుకుంటున్నారని, ఇతరులనెవరినీ వార్డులోనికి అనుమతించడం లేదని సుమలత పేర్కొన్నారు. అందుకే సన్నిహితులెవరూ సింగపూర్‌కు రావాల్సిన అసవరం లేదని, అంబరీష్ పూర్తిగా కోలుకున్నాక తామే బెంగళూరుకు వస్తామని ఆమె తెలిపారు. శనివారం నటుడు దర్శన్, నిర్మాత సందేశ్ నాగరాజ్‌లు అంబిని పరామర్శించిన విషయం తెలిసిందే. దీంతో మరికొంతమంది సన్నిహితులు అంబరీష్‌ను పరామర్శించేందుకు నగరం నుండి బయలుదేరారు. -
అంబికి సింగపూర్‌లో చికిత్స
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శ్వాస కోశం ఇన్ఫెక్షన్తో బాధ పడుతున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీశ్‌ను శనివారం ఉదయం 6.30 గంటలకు సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి తరలించారు. సింగపూర్ ఎయిర్ అంబులెన్స్‌లో ఆయన వెంట సతీమణి సుమలత, కుమారుడు అభిషేక్ గౌడ, నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌లు కూడా వెళ్లారు. అక్కడ చికిత్సకు ఆయన చక్కగా స్పందిస్తున్నారని సమాచారం. వారం రోజులుగా ఇక్కడి విక్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఉన్నత వైద్యం కోసం సింగపూర్‌కు తరలించాలని ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు చెందిన వైద్యులు సూచించారు. ఉదయం పది గంటలకు అక్కడికి చేరుకున్న అంబరీశ్‌కు వైద్యులు ఐసీయూలో చికిత్సలు ప్రారంభించారు. పూర్తి స్వస్థతతో తిరిగి వస్తారు : ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంబరీశ్‌ను ఉత్తమ చికిత్స కోసం సింగపూర్‌కు తీసుకు వెళుతున్నామని, ఆయన పూర్తి స్వస్థతతో తిరిగి వస్తారని ఆయన సతీమణి సుమలత అభిమానులకు భరోసా ఇచ్చారు. సింగపూర్‌కు వెళ్లే ముందు విలేకరులతో మాట్లాడుతూ అసంఖ్యాక అభిమానుల ఆశీర్వాదం వల్ల ఆయనకు ఎటువంటి సమస్యలు ఎదురు కాబోవని అన్నారు. ఉత్తమ చికిత్సను అందించడం ద్వారా ఆయనను మళ్లీ రెబల్ స్టార్‌గా అభిమానుల ముందుకు తీసుకు వస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. విక్రమ్ ఆస్పత్రి వైద్యులు ఆయనను బిడ్డ లాగా చూసుకున్నారని, శ్వాస సమస్య ఇంకా ఉన్నందున అనివార్యంగా సింగపూర్‌కు పిలుచుకు పోతున్నామని ఆమె చెప్పారు. -
సింగపూర్‌కు అంబరీష్ తరలింపు!
బెంగళూరు : శ్వాస కోశానికి ఇన్ఫెక్షన్ కారణంగా ఇక్కడి విక్రమ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గృహ నిర్మాణ శాఖ మంత్రి, నటుడు అంబరీష్ ను శనివారం తెల్లవారుజామున సింగపూర్‌కు తరలించినట్లు సమాచారం. ఆయన్ను సింగపూర్ ఎయిర్ లైన్స్ అంబు లెన్స్ లో తీసుకెళ్లేందుకు వైద్యులు చర్యలు తీసుకున్నారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్‌కు చెందిన వైద్య నిపుణుడు రణదీప్ గులేరియా, విక్రమ్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ సతీశ్‌తో కలసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మరో రెండు వారాల పాటు అంబరీష్ కు విశ్రాంతి అవసరమని తెలిపారు. అంబరీష్ క్రమంగా కోలుకుంటున్నారని గులేరియా చెప్పారు. అంబరీష్ శ్వాస కోశ ఇన్ఫెక్షన్ను నివారించడానికి కొంత సమయం పడుతుందన్నారు. అప్పటి వరకు కృత్రిమ శ్వాసతోనే చికిత్సను కొనసాగిసాగించాల్సి ఉంటుందన్నారు. మెదడు, మూత్ర పిండాలు, గుండె చక్కగా పని చేస్తున్నాయన్నారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తాను కూడా ఇక్కడే ఉండి ఇక్కడి వైద్యులకు సహకరిస్తానన్నారు. డాక్టర్ సతీశ్ మాట్లాడుతూ అంబరీష్ చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ఆయన క్రమంగా కోలుకుంటున్నారని చెబుతూ, వదంతులను విశ్వసించ వద్దని కోరారు. కాగా మూడు రోజుల క్రితం నటుడు రజనీకాంత్ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఉన్నత చికిత్స కోసం సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి తీసుకెళ్లాల్సిందిగా అంబరీష్ సతీమణి సుమలతకు సూచించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఈ సూచన పట్ల సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ దశలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులామ్ నబీ ఆజాద్‌ను సంప్రదించారు. ఆయన సూచన మేరకు గులేరియా ఇక్కడికి చేరుకుని అంబరీష్ వైద్య పరీక్షల నివేదికలను పరిశీలించారు. ప్రస్తుతానికి సింగపూర్‌కు తీసుకెళ్లాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడినట్లు తెలిసింది. అయినా కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు అంబరీష్ ను సింగపూర్‌కు తరలించడానికి వైద్యులు చర్యలు చేపట్టారు. -
నిలకడగా అంబి ఆరోగ్యం
ప్రకటించిన ప్రభుత్వం .. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్వస్థత లండన్‌నుంచి కుమారుడి రాక సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి, ప్రముఖ నటుడు అంబరీశ్ ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతోంది. ఆయన ఆరోగ్యంపై వ్యాపిస్తున్న వదంతులను నమ్మవద్దని ఆయన సతీమణి, నటి సుమలత మరో మారు విజ్ఞప్తి చేశారు. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని శాసన సభలో సోమవారం బీజేపీకి చెందిన ఆర్. అశోక్, జేడీఎస్‌కు చెందిన చెలువరాయస్వామి డిమాండ్ చేశారు. అంబరీశ్ మంత్రి కనుక ఆయన ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రకటన చేసి తీరాలని వారు పట్టుబట్టారు. దీంతో ప్రభుత్వం తరఫున ప్రజా పనుల శాఖ మంత్రి డాక్టర్ హెచ్‌సీ. మహదేవప్ప ప్రకటన చేశారు. ‘అంబరీశ్ ఆరోగ్యం పట్ల ఆందోళన వద్దు. వైద్యులు నిరంతరం ఆయనను పర్యవేక్షిస్తున్నారు. ఆయనను ఐసీయూ నుంచి జనరల్ వార్డులోకి తరలించాల్సి ఉంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అంబరీశ్ సతీమణి కూడా ప్రకటన చేశారు. వైద్యులు కూడా ఆయన ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళనా వద్దని చెప్పారు’ అని ప్రకటించారు. మరో వైపు మండ్య ఎంపీ, నటి రమ్య...అంబరీశ్ చికిత్స పొందుతున్న విక్రమ్ ఆస్పత్రిని సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వైద్యులు ఇప్పటి వరకు ఆయనలో 10-11 లీటర్ల నీటిని తొలగించారని, మరో ఐదారు లీటర్ల నీటిని తీయాల్సి ఉందని వెల్లడించారు. కాగా అంబరీశ్ వేగంగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు రాష్ర్ట వ్యాప్తంగా ధన్వంతరి, వృత్యుంజయ హోమాలను నిర్వహించారు. రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే, మాజీ ప్రధాని హెచ్డీ. దేవెగౌడ సహా పలువురు ప్రముఖులు ఆస్పత్రిని సందర్శించారు. రెండు, మూడు రోజుల్లో పూర్తి స్వస్థత అంబరీశ్ ఆరోగ్యం విషయంలో ఎలాంటి వదంతులను నమ్మవద్దని, ఆయన చికిత్సకు చక్కగా స్పందిస్తున్నారని ఆరోగ్య శాఖ మంత్రి యూటీ. ఖాదర్ తెలిపారు. విక్రం ఆస్పత్రి వైద్యులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో ఆయనకు పూర్తి స్వస్థత చేకూరుతుందని చెప్పారు. వైద్యుడు డాక్టర్ రవీశ్ మాట్లాడుతూ అంబరీశ్ ఆరోగ్యం స్థిరంగా ఉందని, విశ్రాంతి కోసం కృత్రిమ శ్వాసను అమర్చామని వెల్లడించారు. ఇంకా ఒకటి, రెండు రోజులు కృత్రిమ శ్వాస ద్వారానే వైద్యాన్ని అందిస్తామని, అనంతరం వార్డుకు తరలిస్తామని తెలిపారు. ఆయన గుండె, మూత్రపిండాలు, ఇతర అవయవాలు చక్కగా పని చేస్తున్నాయని చెప్పారు. మరో వైద్యుడు విక్రం మాట్లాడుతూ అంబరీశ్‌ను ఆస్పత్రికి తీసుకు వచ్చిన రోజుతో పోల్చుకుంటే, ఆరోగ్యం ఎంతో మెరుగు పడిందని తెలిపారు. కుమారుని రాక తండ్రి అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న లండన్‌లో విద్యాభ్యాసం చేస్తున్న అంబరీశ్ తనయుడు అభిషేక్ గౌడ సోమవారం నగరానికి వచ్చాడు. అనంతరం నేరుగా ఆస్పత్రికి వెళ్లాడు. వేకువ జామున నగరానికి వచ్చిన అభిషేక్ తొలుత జేపీ నగరలోని ఇంటికి వెళ్లాడు. ఆక్కడి నుంచి ఆస్పత్రికి వచ్చాడు. అంబరీశ్‌కు చికిత్స చేస్తున్న వైద్యులతో మాట్లాడాడు. పూర్తిగా స్వస్థత చేకూరడానికి ఎన్ని రోజులు పడుతుందని, భవిష్యత్తులో తండ్రి ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటూ వాకబు చేశాడు. అనంతరం ఆస్పత్రి వెలుపల విలేకరులతో మాట్లాడుతూ తన తండ్రి ఆరోగ్యం బాగా మెరుగు పడిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పాడు. వైద్యులు ఉత్తమ చికిత్సను అందిస్తున్నారని తెలిపాడు. పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశాడు. ‘మీ అంబరీశ్ పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావడానికి, ఎప్పటిలాగే ఆయన పనులు చేసుకోవడానికి’ దయ చేసి సహకరించండి అని అభిషేక్ అభిమానులను కోరాడు. -
అంబరీష్ ఆరోగ్యంగా ఉన్నారు : సుమలత
* రాష్ట్రవ్యాప్తంగా అంబి అభిమానుల పూజలు *లండన్ నుంచి బయలుదేరిన కుమారుడు * అంబిని పరామర్శించిన దేవెగౌడ, యడ్యూరప్ప, దర్శన్, మోహన్ బాబు బెంగళూరు, న్యూస్‌లైన్ : శాండిల్‌వుడ్ రెబల్‌స్టార్, రాష్ట్ర మంత్రి అంబరీష్ ఆరోగ్యం కుదుటపడుతోందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన సతీమణి, బహుభాష నటి సుమలత అన్నారు. ఆదివారం సుమలత విక్రమ్ ఆస్పత్రిలో వైద్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అంబరీష్ ఆరోగ్యం విషమించిందని వస్తున్న వదంతులు నమ్మరాదని విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సమస్యతో అంబరీష్ చికిత్స పొందుతున్నాడని, విక్రమ్ ఆస్పత్రి వైద్యులు సతీష్, రంగనాథ్, విజయ్, రఘు తదితరులు చికిత్స చేస్తున్నట్లు ఆమె తెలిపారు. త్వరలో ఆయనను జనరల్ వార్డుకు మారుస్తామని వైద్యులు తెలిపారని సుమలత వివరించారు. అంబరీష్ ఐసీయులో వెంటిలేటర్‌తో ఉన్నందువల్ల మాట్లాడటానికి వీలు కావడం లేదని, ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. మాజీ ప్రధాని హెచ్.డీ. దేవెగౌడ, మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, కన్నడ సినీనటుడు దర్శన్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని అంబరీష్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే అంబరీష్ ఆరోగ్యం కుదుటపడాలని బెంగళూరు నగరంతో సహ రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు, పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లండన్ నుంచి బయలుదేరిన కుమారుడు అంబరీష్, సుమలతల కుమారుడు అభిషేక్ లండన్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్నాడు. తండ్రి అనారోగ్యం విషయం తెలుసుకున్న అతడు లండన్ నుంచి బెంగళూరు బయలుదేరాడు. సోమవారం అభిషేక్ బెంగళూరు చేరుకుంటారని అంబరీష్ సన్నిహితులు తెలిపారు. అంబిని పరామర్శించిన మోహన్ బాబు శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతూ విక్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అంబరీష్‌ను ప్రముఖ తెలుగు చలన చిత్ర నటుడు మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు పరామర్శించారు. ఆదివారం నగరానికి చేరుకున్న వీరు నేరుగా ఆస్పత్రికి చేరుకుని అంబరీష్ ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అంబరీష్‌ను పరామర్శించిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. -
మెరుగుపెడతామంటూ.. నిలువునా మోసం
శంకరాపురం (శంషాబాద్ రూరల్), న్యూస్‌లైన్: బంగారు నగలకు మెరుగు పెడతామంటూ మహిళలను నమ్మించి ఏడు తులాల బంగారు మంగళసూత్రాలను ఎత్తుకెళ్లిన సంఘటన శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. ఇద్దరు ఆగంతకులు మంగళవారం ఉదయం బైక్‌పై మండలంలోని శంకరాపురం గ్రామానికి వచ్చారు. వెండి, బంగారు నగలకు మెరుగుపెడతామంటూ గ్రామంలో తిరిగారు. ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో ఊరి చివరన ఉన్న జెజ్జెల రాజు, కుమార్ సోదరుల ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఇంటి వద్ద వారి భార్యలు సుమలత, లావణ్య ఉన్నారు. దుండగులు తమ వద్ద ఉన్న పౌడర్‌తో ఇత్తడి వస్తువులకు మెరుగుపెడతామని చెప్పారు. వారు ఇంట్లోంచి ఇత్తడి దీపం తెచ్చిచ్చారు. పౌడర్‌తో కొద్దిసేపు కడిగి మెరిసేలా చేశారు. వెండి నగలకు కూడా మెరుగు పెడతామని చెప్పగా లావణ్య తన కాళ్ల పట్టీలు తీసిచ్చింది. వాటికీ మెరుగు పెట్టిన తర్వాత బంగారు నగలిస్తే వాటినీ మెరిసేలా చేస్తామని నమ్మబలికారు. దీంతో తోడికోడళ్లు తమ ఒంటిపై ఉన్న బంగారు మంగళ సూత్రాలను తీసిచ్చారు. వాటిని ఇంట్లోని వంట గదిలోకి తీసుకెళ్లి ఒక చిన్న గిన్నెలో పసుపు కలిపిన నీళ్లలో వేశారు. ఆ సమయంలో ఒకరు ఇంట్లో ఉండగా మరొకరు సమీపంలో నిలిపిన బైక్ వద్దకు వెళ్లాడు. లోపలికి వెళ్లిన ఆగంతకుడు నగలను కుక్కర్లో వేసి పది నిమిషాలు వేడి చేస్తే ధగధగలాడతాయని నమ్మించి వాటిని కుక్కర్లో వేసినట్లు చేసి కాజేశాడు. ఇద్దరూ కలిసి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వెళ్తుండడం చూసి స్థానికులకు అనుమానం వచ్చింది. వీరు ఎవరి ఇంటి నుంచి వస్తున్నారని ఆరా తీయడం మొదలు పెట్టారు. తాము మోసపోయామని తెలియని లావణ్య, సుమలత ఇంటి బయట నిలబడి ఉన్నారు. ఇంతలో ఓ యువతి వచ్చి మీ ఇంట్లోంచి ఎవరైనా వెళ్లారా, ఏదో ఎత్తుకెళ్లినట్లున్నారు అంది. మాకు ఓ కంపెనీ వారు పౌడర్ ఇచ్చారు.. మా ఇంట్లో నుంచి ఏమి తీసుకెళ్లలేదు అని వారు సమాధానం ఇచ్చారు. మీ ఒంటిమీద మంగళసూత్రాలు ఏమయ్యాయని ఆ యువతి అడగ్గా వంటింట్లో కుక్కర్లో పెట్టి వేడి చేస్తున్నామని చెప్పారు. ఒకసారి వెళ్లి నగలు ఉన్నాయో లేదో చూసుకోండి అని యువతి సూచించింది. తోడికోడళ్లు పరుగున వెళ్లి కుక్కర్ తెరిచి చూస్తే అందులో నగలు కనిపించలేదు. దీంతో ఇద్దరూ లబోదిబోమంటూ బయటికి వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానికులు బైక్‌లపై గ్రామం నలుమూలలా వెతికినా ప్రయోజనం లేకపోయింది. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాస్, ఎస్ఐ నర్సింహ సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వారం రోజుల క్రితం మొయినాబాద్ మండలం సురంగల్లోనూ ఇదే తరహా మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
నర్సింగాపురం(కొడకండ్ల), న్యూస్‌లై న్ : అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతిచెందిన సంఘటన మండలంలోని నర్సింగాపురంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. మృతురాలి సోదరుడి కథనం ప్రకారం.. మండలంలోని కాన్వాయిగూడెం గ్రామానికి చెందిన సుమలత(28)కు నర్సింగాపురం గ్రామానికి చెందిన కొయ్యూరి సోమనర్సయ్యతో ఏడేళ్ల క్రితం వివాహమైంది. భర్త సోమనర్సయ్య రోజూ తాగొచ్చి సుమలతను వేధించేవాడు. ఈ క్రమంలో మంగళవారం సుమలతను భర్త, ఆడపడుచులు కలిసి కొట్టారు. దీంతో బాధితురాలు తన అన్న సంతోష్‌కు ఫోన్ చేసి రోదిస్తూ విషయం చెప్పిం ది. సంతోష్ వెంటనే నర్సింగాపురంలోని చెల్లెలి ఇంటికి చేరుకుని పెద్దమనుషుల సమక్షంలో తన బావను, చెల్లెలి ఆడపడుచులను సముదాయిం చాడు. సుమలత నీరసంగా ఉండడంతో ఆమెకు ఆహరం తీసుకొచ్చేందుకు కాన్వాయిగూడెం వెళ్లాడు. భోజనం టిఫిన్‌బాక్స్‌లో పెడుతుండ గా సుమలత ఆడపడుచు భర్త ఫోన్ చేసి మీ చెల్లె లు ఉరివేసుకుందని చెప్పాడు. దీంతో వెంటనే సంతోష్ అక్కడికి చేరుకునేసరికి సుమలత ఇంటిపై కప్పు వాసానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, సుమలత భర్త, మామ సోమయ్య, ఆడపడుచులు పరారయ్యారు. కాగా సుమలత ఆత్మహత్య చేసుకోలేదని ఆమె భర్త సోమనర్సయ్య, మామ సోమయ్య, ఆడపడడుచులే ఆమెను కొట్టి చంపి ఉరివేశారని మృతురాలి సోదరుడు సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. మృతురాలికి కుమారులు అవినాష్(06), అర్షిత్ (04) ఉన్నారు. సంఘటన స్థలానికి కొడకండ్ల ట్రైనీ ఎస్సై వెంకట్రావు చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.