మనసు పలికే... | cityplus chitchat with sumalatha | Sakshi
Sakshi News home page

మనసు పలికే...

Published Mon, Oct 20 2014 12:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM

మనసు పలికే...

మనసు పలికే...

డిగ్రీ చదివినా.. ఉద్యోగం చేస్తున్నా.. మనసు మాత్రం నటనపైనే. దానికి పొట్టి చిత్రాలను వేదికగా చేసుకొని.. అభిమానులను ఆకట్టుకుంటోంది నటి  సుమలత. ఇటీవల సిటీలో జరిగిన అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ సహాయనటి అవార్డు అందుకున్న సుమలతతో ‘చిట్‌చాట్’..
 
నటన, సంగీతం అంటే చాలా ఇష్టం. డిగ్రీ తర్వాత ఉద్యోగం కోసం నగరానికి వచ్చాను. ఒక డివోషనల్ చానల్‌లో టెక్నికల్ ఉద్యోగిగా చేరాను. అవసరం కోసం ఉద్యోగం చేస్తున్నా నటనపై ఉన్న ఇష్టం తగ్గలేదు. అవకాశం వస్తే తప్పకుండా నటించాలని, చిన్నప్పటి నుంచి కోరిక. అలా మొదటిసారి ఫ్రెండ్స్ తీసిన ‘మౌనంగానే’ షార్ట్‌ఫిలింలో నటించా.
 
తొలిసారి కెమెరా ముందుకి వెళ్లినప్పుడు నటన గురించి ఏమీ తెలియదు. ఫ్రెండ్స్ గెడైన్స్‌లో నటించేశా. అలా కెమెరా ముందే ఓనమాలు నేర్చుకున్నా. గోపురం, ఇదే ప్రేమతో పాటు 10 షార్ట్ ఫిలింస్ చేశా. నటిగా ఈ ఏడాదిన్నర కాలంలో బుల్లి చిత్రాలతో పాటు ఫీచర్ ఫిలింస్‌లోనూ నటించాను.
 
వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘నువ్వలా నేనిలా’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా చేశా. ఇదే నా బిగ్ స్క్రీన్ ఎంట్రీ. తర్వాత రొమాన్స్, వీకెండ్ లవ్ ఇంకా కొన్ని చిత్రాల్లో కూడా నటించాను. బుల్లి సినిమాలతో పాటు సిల్వర్ స్క్రీన్‌పై కూడా నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు చేయాలనేది నా కోరిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement