International Short Film Festival
-
రీచింగ్ ది అన్రీచ్డ్..!
వాళ్లంతా ఆదివాసులు.. కొండకోనల్లో ఎక్కడో విసిరేసినట్లు ఉండే వారికి జీవించటానికి కనీస మౌలిక సదుపాయాలు కూడా ఉండవు. రోడ్లు, కరెంటు మాటే తెలియదు. జన బాహుళ్యంలోకి రావాలంటే కొన్ని కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. ఇక వారి పిల్లలకు చదువు అంటే ఏమిటో తెలియదనే చెప్పాలి. తరతరాలు ఆదివాసుల జీవితాలు ఇలాగే తెల్లారిపోతున్నాయని కలత చెందిన కొందరు యువకులు.. వారికి అక్షర జ్ఞానం అందించాలని సంకల్పించారు. భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ (బీసీహెచ్‌సీ) పేరిట చిన్న సంస్థను నెలకొల్పి పిల్లలకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు. దీనిని గుర్తించిన ఉస్మానియా యూనివర్సిటీలోని ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతిరావు.. ఆ సంస్థ సేవలపై డాక్యుమెంటరీ నిర్మించారు. దీనికి యూజీసీ ఆధ్వర్యంలో జోధ్‌పూర్‌లో జరిగిన 16వ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటి బహుమతి లభించింది. - సాక్షి, హైదరాబాద్అసాధ్యాన్ని సుసాధ్యం చేసి.. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని అడవుల్లో జీవించే ఆదివాసీ గూడేలకు వెళ్లేందుకు కనీసం రోడ్డు కూడా ఉండదు. రాళ్లు రప్పల దారుల్లో కిలోమీటర్ల దూరం నడవాల్సిందే. వారి భాష, వేషం, నమ్మకాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. పిల్లలను స్కూల్‌కు పంపడం తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. బయటి వ్యక్తులను కనీసం నమ్మరు కూడా. అలాంటివారికి విద్యాబుద్ధులు నేర్పుతోంది బీసీహెచ్‌సీ. సంతోష్ ఈస్రం అనే యువకుడి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ సంస్థ. కొంతమంది మిత్రులతో కలిసి ఆయన.. తమ ఉద్దేశాన్ని ఆ గిరిజనులకు వివరించి ఒప్పించడానికే రెండున్నర నెలల పాటు కష్టపడ్డారు. వారి భాష కూడా నేర్చుకున్నారు. పిల్లలను బడికి రప్పించేందుకు రోజూ కోడిగుడ్లు ఇచ్చారు. అలా వారితో కలిసిపోయి నెమ్మదిగా పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. చివరికి 2020 జూన్ 23న బీసీహెచ్‌సీ పేరుతో సంస్థను స్థాపించారు. తాడ్వాయి మండలంలోని నీలంగోతు అనే చిన్న పల్లెలో గుడిసె కట్టి అందులో 10 ఏళ్ల లోపు ఉన్న 45 మంది చిన్నారులకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు.కొండ కోనల్లో నడిచి.. నీలంగోతులో పాఠశాల విజయవంతం కావడంతో భూపాలపల్లి జిల్లాల్లోని బండ్లపహాడ్, సారలమ్మగుంపు, తక్కెళ్లగూడెం, ఐలాపురం, ప్రాజెక్ట్ నగర్, కల్వపల్లి, దండుపల్లి, ముసలమ్మ పెంటలో గుడిసె బడులు తెరిచి ఒక్కో టీచర్‌ను నియమించారు. వాళ్లు రోజూ ఏకంగా 10 నుంచి 18 కిలోమీటర్లు సైకిల్‌పై వెళ్లి పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. వీరితో పాటు అనేకమంది వలంటీర్లు ఈ బృహత్ కార్యంలో పాలుపంచుకుంటున్నారు. వీరి సేవలను గుర్తించిన ప్రభుత్వం.. పిల్లలకు చదువు చెప్పేందుకు వీలుగా ఒకచోట పక్కా భవనం నిర్మించింది. డాక్యుమెంటరీకి అవార్డు.. భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ కార్యకలాపాల గురించి తెలుసుకున్న ఓయూలోని ఎడ్యుకేషనల్ మల్టీ మీడియా రిసెర్చ్ సెంటర్ డైరెక్టర్ రఘుపతి.. ఆయా ప్రాంతాల్లో కొన్ని రోజుల పాటు ఉండి, పిల్లల స్థితిగతులు.. టీచర్ల కృషిని చూసి ముగ్ధుడయ్యారు. ‘రీచింగ్ ది అన్రీచ్డ్’పేరిట డాక్యుమెంటరీ తీశారు. తాజాగా రాజస్తాన్‌లోని జోద్‌పూర్‌లో జరిగిన 16వ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో డెవలప్మెంట్ కేటగిరీలో దీనికి బెస్ట్ షార్ట్‌ఫిల్మ్ అవార్డు లభించింది. అలాగే మానవ హక్కుల కేటగిరీలో కూడా స్క్రీనింగ్‌కు ఎంపికైంది. దీనికి వచి్చన రూ.50 వేల నగదు బహుమతిని ఆయన బీసీహెచ్సీకే అందజేశారు.ఎంతో కష్టపడాల్సి వచ్చిoది..ఆదివాసుల కష్టాలు కళ్లారా చూశాను. నేను కూడా దాదాపు అదే నేపథ్యం నుంచి వచ్చాను. వాళ్ల గూడేల్లోకి వెళ్లాలంటే కనీసం రోడ్డు కూడా లేదు. అలాంటి వారికి చదువుకోవటం అనేది చాలా పెద్ద విషయం. తల్లిదండ్రులు కూడా పిల్లలకు చదువు నేర్పించేందుకు సుముఖత చూపించరు. ఎంతో కష్టపడి వారిని ఒప్పించి బడి వరకు రప్పించాం. మా సంస్థపై తీసిన డాక్యుమెంటరీకి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. –సంతోష్ ఈస్రం, భీం చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ వ్యవస్థాపకుడు -
Dr Aparna Buzarbarua: విశ్రాంత సమయాన అవిశ్రాంత కృషి
‘అపర్ణ మేడం పాఠం ఒక్కసారి వింటే ప్రతి చెట్టు, ప్రతి పువ్వుతో స్నేహం చేయాలనిపిస్తుంది’ ‘అపర్ణ స్వరపరిచిన పాటలు వింటే అద్భుతం అనిపిస్తుంది’ ‘అపర్ణ వినిపించే వీణ స్వరాలు అపురూపం’ ‘అపర్ణ రాసిన పుస్తకాలు శాస్త్రీయ విషయాలను సైతం చాలా సులభంగా అర్థమయ్యేలా చెబుతాయి’... ఇలాంటి కామెంట్స్ అపర్ణ గురించి తరచుగా వినిపిస్తుంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే డా. అపర్ణ బుజర్ బారువా బహుముఖ ప్రజ్ఞాశాలి. విశ్రాంత జీవితానికి కొత్త అర్థం ఇచ్చిన ప్రతిభావంతురాలు. కోల్‌కతాలో జరిగిన ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆమె తీసిన ‘దూలియ కల్చర్ ఆఫ్ వోల్డ్ కామ్రూప్’ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్‌ను అందుకుంది... సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టే అస్సాంలోని తేజ్‌పూర్‌లో పుట్టిపెరిగింది అపర్ణ. గువహటిలోని కాటన్ కాలేజీలో బాటనీ లెక్చరర్‌గా తన ఉద్యోగప్రస్థానాన్ని 1969లో ప్రారంభించిన అపర్ణ ఒకవైపు విద్యార్థులకు బాటనీ పాఠాలు బోధిస్తూనే మరోవైపు విద్యార్థిగా మ్యూజిక్ కాలేజీలో చేరి సంగీత పాఠాలు నేర్చుకునేది. సంగీత విద్యాపీuŠ‡ నుంచి సితార్లో విశారద్ డిగ్రీ పొందింది. ఎంతోమంది కవుల పాటలకు స్వరాలు సమకూర్చింది. ఆ పాటలు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమై ఆదరణ పొందాయి. వందపాటలకు పైగా స్వరాలు అందించిన అపర్ణ ఏఐఆర్ గువహటి ఫస్ట్ ఉమెన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అరుదైన ఘనతను దక్కించుకుంది. 2003లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ హోదాలో పదవీ విరమణ చేసిన అపర్ణ ‘ఇది విశ్రాంతి సమయం’ అనుకోలేదు. ‘ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి చాలా సమయం దొరికింది’ అనుకుంది. తన సాంస్కృతిక మూలాలను వెదుక్కుంటూ వెళ్లింది. కొత్త సంగీత ధోరణులను అధ్యయనం చేసింది. సంస్కృతి, సాహిత్యం, శాస్త్రీయ రంగాలకు సంబంధించి ఎన్నో పుస్తకాలు రాసింది. గువహటిలోని గీతానగర్‌లో తన భర్త నాగేంద్రనాథ్ బుజర్ బారువా పేరు మీద చక్కటి లైబ్రరీ ఏర్పాటు చేసింది. కాలంతో పాటు నడుస్తూ షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు తీయడం నేర్చుకుంది. 26 నిమిషాల నిడివి ఉన్న ‘దూలియ కల్చర్ ఆఫ్ వోల్డ్ కామ్రూప్’ డాక్యుమెంటరీ అపర్ణకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చింది. ‘దూలియ సంస్కృతి గత, వర్తమానాలకు అద్దం పట్టేలా ఈ డాక్యుమెంటరీని రూపొందించాను. దూలియా లాంటి ప్రత్యేక సంస్కృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది’ అంటుంది అపర్ణ. దూలియ అనేది పురాతన కళారూపం. దూలియ సంస్కృతి వైభవం గాయకుల పాటల్లో, ఆటల్లో, తోలుబొమ్మలాటలో కనిపిస్తుంది. గానం, నటన, హాస్యప్రదర్శన, డప్పులు వాయించడం... ఎన్నో కళల సమాహారంగా దూలియ సంస్కృతి ఉండేది. ఈ పురాతన కళారూపం గురించి ఊరూవాడా తిరిగి లోతైన పరిశోధన చేసింది అపర్ణ. తాను తెలుసుకున్న విషయాలకు డాక్యుమెంటరీ రూపాన్ని ఇచ్చింది. దూలియ సంస్కృతికి తన జీవితాన్ని అంకితం చేసిన డ్రమ్మర్, నటుడు మోహన్ చంద్ బర్మన్ కృషిని ఈ డాక్యుమెంటరీ హైలెట్ చేస్తుంది. దూలియ సంస్కృతిపై అపర్ణకు ఆసక్తి, అనురక్తి ఎలా పెరిగింది అనే విషయానికి వస్తే.... కొన్ని సంవత్సరాల క్రితం గువహటిలోని గీతానగర్ రాస్ ఫెస్టివల్లో కామ్రూపియా ప్రదర్శనను ప్రారంభించడానికి అపర్ణను ఆహ్వానించారు నిర్వాహకులు. ఈ ప్రదర్శను చూసి అపర్ణ మంత్రముగ్ధురాలైంది. ఈ ఆనందం ఒక కోణం అయితే కళాకారుల ఆర్థిక కష్టాలు తెలుసుకొని బాధ పడడం మరో కోణం. ఇక ఆరోజు నుంచి కామ్రూప్ కళాకారుల కోసం తన వంతుగా ఏదైనా చేయాలని తపించి పోయింది. ఈ గొప్ప కళారూపాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తే, సహాయం చేసే ద్వారాలు తెరుచుకుంటాయని నిర్ణయించుకొని తన నిర్మాణ, దర్శకత్వంలో డాక్యుమెంటరీ ప్రారంభించింది. ఏ లక్ష్యంతో అయితే ఈ డాక్యుమెంటరీ నిర్మాణానికి అపర్ణ పూనుకుందో అది నెరవేరే సమయం వేగవంతం అయింది. దూలియ సంస్కృతి గురించి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ పురాతన కళారూపాన్ని తమ భుజాల మీద మోస్తున్న అరుదైన కళాకారులకు సహాయం అందడమే ఇక తరువాయి. ఏ పని మొదలుపెట్టినా ‘అంతా మంచే జరుగుతుంది’ అనుకోవడం అపర్ణ సెంటిమెంట్. కళాకారులకు సహాయం అందే విషయంలో కూడా ఆమె సెంటిమెంట్ నెరవేరాలని ఆశిద్దాం. నా వయసు జస్ట్ 78 ప్లస్ బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్‌ను అందుకోవడానికి వేదికపైకి వచ్చినప్పుడు యాంకర్ నన్ను ఆశ్చర్యంగా చూసి ‘మీ వయసు ఎంత?’ అని అడిగారు. 78 ప్లస్ అని చెప్పగానే ‘మీరు నిజంగా ఈ తరానికి స్ఫూర్తి’ అన్నారు. ఇది విని ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ఈ చప్పట్లను కూడా నాకు వచ్చిన అపురూపమైన అవార్డ్‌గానే భావిస్తున్నాను. మొదటి డాక్యుమెంటరీకే నాకు పెద్ద పేరు రావడం అదృష్టంగా భావిస్తున్నాను. – డా.అపర్ణ బుజర్ బారువా -
వంద కోట్ల క్లబ్లో ‘రుద్రమదేవి’
షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్లో దర్శకుడు గుణశేఖర్ హన్మకొండ : కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవిత చరిత్రను తీసినందుకు గర్వంగా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు గుణశేఖర్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆనాడు కాకతీయ మహారాణి నడయాడిన నేలపైనుంచి ప్రసంగిస్తున్నందుకు ఉద్విగ్నంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు ఆడిటోరియం చప్పట్లు, ఈలలతో హోరెత్తి పోయింది. రుద్రమాదేవి, తెలంగాణ ప్రభుత్వం, వరంగల్ గురించి ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.... ఓరుగల్లు అనగానే ఓకే అన్నా.. ఇంటర్నేషన్ షార్ట్ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఆహ్వనం వచ్చిందని నాకు చెప్పగానే ఎక్కడా అని అడిగాను .‘ వరంగల్ ’.. అని చెప్పగానే వెంటనే ఓకే అన్నా. మూడు నెలలుగా ఎప్పుడెప్పుడు వరంగల్ వద్దామా అని ఎదురు చూస్తున్నా? నిర్వాహకులకు నేను ఫోన్ చేసి మరీ కార్యక్రమం కోసం వాకాబు చేశాను. రుద్రమాదేవి నడిచిన ఈ నేలలో జరుగుతున్న ఈ ఫెస్టివల్ మరెన్నో ఫెస్టివల్స్‌కి నాంది కావాలి. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ తరహాలో ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరగాలి. రికార్డు కలెక్షన్లు ఎంతో వ్యయప్రయాసల కోర్చి నేను రుద్రమదేవి చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాను. మొత్తం రూ.70 కోట్ల వ్యయమైంది. కానీ అంతర్జాతీయంగా తెలుగు, తమిళ్, మళయాలం, హిందీల్లో కలిపి ఈ చిత్రం వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. యూఎస్ఏలో మహేశ్, పవన్ కళ్యాణ్ చిత్రాల తరహాలో వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. రుద్రమదేవి చిత్రం వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరినందుకు నేను గర్వపడటం లేదు. నాకు సన్మానాలు, సత్కారాలన్నా ఇష్టం లేదు. కానీ రుద్రమాదేవి వంటి చిత్రాన్ని నిర్మించాను, దర్శకత్వం వహించాను అని చెప్పుకునేందుకు గర్విస్తా. రుద్రమదేవి కోసం మాట్లాడేందుకు నేను ఇక్కడికొచ్చా. ఎందరో తెలుసుకుంటున్నారు రుద్రమదేవి సినిమా తీస్తున్నాని తెలియగానే కథ గురించి తెలుసుకున్న తమిళ్, మళయాలం, హిందీ వాళ్లు ఆశ్చర్యపోయారు. రుద్రమదేవి కోసం మా వాళ్లకు తెలియాలి అంటూ డబ్బింగ్ హక్కులు తీసుకున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత గూగుల్‌లో రుద్రమాదేవి, కాకతీయ కింగ్డమ్, ఓరుగల్లు కోసం వెతుకుతున్నవారి సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్ చేసిన జాబితాలో రుద్రమదేవి మూడో స్థానంలో నిలిచింది. కేసీఆర్‌కు అభినందనలు ఏ ప్రాంతం వాడన్నది చూడకుండా రుద్రమదేవి సినిమా తీశానని చెప్పగానే నా భుజం తట్టి వినోదపన్ను రాయితీ ఇచ్చి ప్రోత్సహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చరి త్ర అంటే రేపటి దారిని చూపించే నిన్నటి వెలుగు. ఆనాడు చెరువుల ప్రాముఖ్యతను గుర్తించిన రుద్రమదేవి ఎన్నో చెరువులను తవ్వించారు. ఆ నాటి చరిత్రను గౌరవిస్తూ చెరువుల పునరుద్ధరణ పథకానికి మిషన్ కాకతీయ అని సీఎం కేసీఆర్ గారు పేరు పెట్టారు. ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. స్మార్ట్ఫోన్లు, డిజిటల్ కాలంలో కూడా ఎనిమిది వందల ఏళ్ల కిత్రం కాకతీయులు అవలంభించిన పద్ధతి నేటి ప్రభుత్వాలకు స్ఫూర్తిని ఇచ్చిందంటే.. మాటలు కాదు. పవర్ ఫుల్ మీడియా సినిమా అనేది పవర్ఫుల్ మీడియా. సినిమా రంగంలోకి ప్రవేశించేందుకు షార్ట్‌ఫిల్మ్ మేకింగ్ అనేది మంచి ఫ్లాట్‌ఫాం. ఎంతోమంది షార్ట్ఫిలిమ్ల ద్వారానే ఎదిగి పెద్ద దర్శకులు అయ్యారు. మా కాలంలో దర్శకుడు కావాలంటే నిర్మాత, హీరోలకు కథలు చెప్పి, ఒప్పించి, మెప్పించాల్సి వచ్చేది. ఇప్పుడు డిజిటల్ కెమోరాతో పనితనం చూపించి దర్శక అవకాశం పొందవచ్చు. ఇటీవల కాలంలో ఈ పద్ధతిలో ఎంతోమంది టాలీవుడ్లో దర్శకులయ్యారు. ఇంకా ఎంతో ఉంది రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు అనే ఒక సామెత ఉంది. అదే విధంగా ఓరుగల్లు నగరం కూడా ఒక్క రోజులో నిర్మించబడలేదు. రుద్రమదేవితో పాటు ఎందరో రాజులు ఉన్నారు. వీరందరి చరిత్ర మనం తెలుసుకోవాలి. ఇటలీకి చెందిన మార్క్పోలో చెప్పే వరకు మనకు రుద్రమదేవి గురించి ఎక్కువగా తెలియదు. మన చరిత్రను మనం తెలుసుకోవాలి. అందుకోసం ప్రయత్నాలు జరగాలి. ప్రపంచ వ్యాప్తంగా ఓరుగల్లుకు ప్రాచుర్యం రావాలి. అందుకే నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. తప్పకుండా ‘ప్రతాపరుద్ర - ది లాస్ట్ ఎంపరర్’ సినిమా నిర్మిస్తాను. మళ్లీ మళ్లీ వరంగల్‌కు వస్తాను. -
నేటి నుంచి అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం
మూడు రోజుల పాటు నిర్వహణ హాజరుకానున్న సినీ ప్రముఖులు హన్మకొండ కల్చరల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ లఘు చిత్రోత్సవానికి ఓరుగల్లు వేదిక కానుంది. శుక్రవారం నుంచి జరగనున్న చిత్రోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోయంలో చిత్ర ప్రదర్శనలు ఉంటాయని ఫిల్మ్ ఫెస్టివల్ చైర్మన్ కె.నాగేశ్వరరావు తెలి పారు. కాకతీయుల కీర్తి పతాకను దేశవిదేశాల లో ఎగురవేసిన ప్రముఖ దర్శకుడు, రుద్రమదేవి చిత్ర నిర్మాత, దర్శకుడు గుణశేఖర్‌ను, సినీ రచయిత తోట ప్రసాద్‌ను మంత్రి అజ్మీరా చం దూలాల్ సన్మానించనున్నారు. శనివారం జరిగే రెండో రోజు కార్యక్రమాలకు మంత్రి హరీష్రా వు హాజరవుతారని నాగేశ్వర్రావు తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న చిత్రోత్సవం లో వివిధ దేశాల దర్శకులే కాకుండా స్థానిక యువత నిర్మించిన లఘు చిత్రాలను ప్రదర్శించనున్నామని తెలిపారు. -
కేయూలో షార్ట్ ఫిలిం ఫెస్టివల్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో జూన్ 15, 16, 17వ తేదీల్లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించనున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ చెప్పారు. హన్మకొండలోని ఆఫీసర్స్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఫిలిం పెస్టివల్ వివరాలను వెల్లడించారు. గతంలో రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లో మాత్ర మే ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించేవారన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వరంగల్‌లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఉత్సవాలను మూడురోజులపాటు నిర్వహించనున్నట్లు వివరించారు. తద్వారా వరంగల్ జిల్లాలోని చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, గుర్తింపు పొందడంతోపాటు పర్యాటకపరంగా ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్లో 20 దేశాల నుంచి వంద షార్ట్ఫిలిమ్స్ ఎం ట్రీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఫెస్టివల్ ఫౌండర్ జి.భద్రప్ప, ఫెస్టివల్ ైచె ర్మన్ నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ షార్ట్‌ఫిలిం ఫెస్టివల్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. -
మనసు పలికే...
డిగ్రీ చదివినా.. ఉద్యోగం చేస్తున్నా.. మనసు మాత్రం నటనపైనే. దానికి పొట్టి చిత్రాలను వేదికగా చేసుకొని.. అభిమానులను ఆకట్టుకుంటోంది నటి సుమలత. ఇటీవల సిటీలో జరిగిన అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ సహాయనటి అవార్డు అందుకున్న సుమలతతో ‘చిట్‌చాట్’.. నటన, సంగీతం అంటే చాలా ఇష్టం. డిగ్రీ తర్వాత ఉద్యోగం కోసం నగరానికి వచ్చాను. ఒక డివోషనల్ చానల్లో టెక్నికల్ ఉద్యోగిగా చేరాను. అవసరం కోసం ఉద్యోగం చేస్తున్నా నటనపై ఉన్న ఇష్టం తగ్గలేదు. అవకాశం వస్తే తప్పకుండా నటించాలని, చిన్నప్పటి నుంచి కోరిక. అలా మొదటిసారి ఫ్రెండ్స్ తీసిన ‘మౌనంగానే’ షార్ట్‌ఫిలింలో నటించా. తొలిసారి కెమెరా ముందుకి వెళ్లినప్పుడు నటన గురించి ఏమీ తెలియదు. ఫ్రెండ్స్ గెడైన్స్‌లో నటించేశా. అలా కెమెరా ముందే ఓనమాలు నేర్చుకున్నా. గోపురం, ఇదే ప్రేమతో పాటు 10 షార్ట్ ఫిలింస్ చేశా. నటిగా ఈ ఏడాదిన్నర కాలంలో బుల్లి చిత్రాలతో పాటు ఫీచర్ ఫిలింస్‌లోనూ నటించాను. వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన ‘నువ్వలా నేనిలా’ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా చేశా. ఇదే నా బిగ్ స్క్రీన్ ఎంట్రీ. తర్వాత రొమాన్స్, వీకెండ్ లవ్ ఇంకా కొన్ని చిత్రాల్లో కూడా నటించాను. బుల్లి సినిమాలతో పాటు సిల్వర్ స్క్రీన్‌పై కూడా నటనకు ప్రాముఖ్యం ఉన్న పాత్రలు చేయాలనేది నా కోరిక. -
చిన్న చిత్రం... పెద్ద ప్రమోషన్
ఆక్టోపస్ స్టూడియోస్. షార్ట్ ఫిలిం ప్రమోషనే దాని లక్ష్యం. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. స్క్రీనింగ్, ఆన్లైన్ ప్రమోషన్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ షార్ట్‌ఫిలిం ఫెస్టివల్స్‌కు చిన్న సినిమాలను పంపించి ప్రమోట్ చేస్తోంది. ఆక్టోపస్ గురించి మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్ రాహుల్‌రెడ్డి మాటల్లో... షార్ట్ ఫిలింస్‌కి క్రేజ్ చాలా ఉంది. కానీ, వాటి స్క్రీనింగ్, ప్రమోషన్‌కి ఆర్గనైజ్డ్ స్థలం లేదు. ఈవెంట్స్, ఫెస్టివల్స్ ఫలానా టైమ్‌కి జరుగుతాయనే సమాచారం ఉండదు. ఈ ఇబ్బందులన్నీ గుర్తించి ఆక్టోపస్ స్టూడియోస్‌ని 2010లో ప్రారంభించాం. ఇప్పటివరకు 100 పైగా ఫిలిం మేకర్స్‌కు అవకాశం లభించింది. తణికెళ్ల భరణి, నగేష్ కుకునూర్ వంటి వాళ్లతో జ్యూరీ ఏర్పాటు చేశాం. వచ్చిన సినిమాల్లోంచి స్క్రీనింగ్‌కి ఎంపిక చేస్తారు. స్క్రీనింగ్ కోసం యూకే, యూఎస్ నుంచి కూడా ఎంట్రీలు వస్తుంటాయి. స్క్రీనింగ్స్ ద్వారా సినిమా అవకాశాలు వచ్చినవాళ్లూ ఉన్నారు. హుస్సేన్ షా, ప్రదీప్ అద్వైతమ్ తదితరులంతా ఇక్కడి నుంచే కెరీర్ మొదలు పెట్టారు. కలవాలంటే.. నాకు (rahul@octopusgroup.in) మెయిల్ చేస్తే సరిపోతుంది. సినిమా బాగుంటే ఆక్టోపస్ ఆన్లైన్ చానల్ , ఫెస్బుక్ పేజీ ద్వారా ప్రమోట్ చేస్తాం. మేకర్ అంగీకారంతో వాటిని కాంపిటీషన్స్‌కి, షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్‌కి కూడా పంపిస్తాం. ఆక్టోపస్‌లో మేం 8 ఫిలింస్ ప్రొడ్యూస్ చేశాం. జర్మనీ, టొరంటో, ఆస్ట్రేలియా, లాస్ ఏంజిలిస్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో స్క్రీన్ అయ్యాయి. భవిష్యత్తులో ఆక్టోపస్‌ను ఇండియాలోని ఇతర నగరాలకు విస్తరించాలని అనుకుంటున్నాం. టచ్ చేశాడు ‘చిన్న చిత్రం’ హరీష్ నాగరాజు జీవితాన్ని పెద్ద వులుపే తిప్పింది. ఫార్మసీ డిగ్రీ చేత పట్టిన ఇతడిని అనూహ్యంగా సినీ పరిశ్రవులో స్థిరపడేలా చేసింది. అతడు నటించిన తొలి లఘు చిత్రం ‘టచ్ చేశాడు’ యుూట్యూబ్‌లో పదకొండు లక్షల హిట్స్ సంపాదించింది. దెబ్బకు వునోడి కెరీర్‌కు సిల్వర్ స్క్రీన్ ‘టచ్’ ఇచ్చేసింది. కట్ చేస్తే... ప్రస్తుతం ప్రవుుఖ చిత్రాలకు రైటర్‌గా, నటుడిగా వూంచి జోష్ మీదున్నాడీ కుర్రాడు. సినీ రంగంలో తన ‘షార్ట్’ జర్నీ గురించి ఇలా చెప్పుకొచ్చాడు... సొంతూరు గుంటూరు. చెన్నైలో బిఫార్మసీ చేశా. మొదటి నుంచీ డ్యాన్స్‌పై వుంచి పట్టు ఉంది. కాలేజీ డేస్‌లో కల్చర్ ప్రోగ్రామ్స్‌లో భాగస్వావ్యుం. చిన్న చిన్న కవితలు, పాటలు రాసి ఫ్రెండ్స్‌కు వినిపించేవాడిని. కాలేజీ ఫంక్షన్లలో పాడేవాడిని. 2011లో వూటల రచరుుత వెన్నెలకంటి వద్ద వూటలు, రచనలో మెళకువలు నేర్చుకున్నా. అప్పుడే జెమినీ టీవీలో ‘దవుు్మంటే చెప్పేసెయ్’ కార్యక్రవుం యూంకర్‌గా అవకాశం వచ్చింది. లఘు చిత్రాలకు స్క్రిప్ట్ వర్క్ చేశా. అదే సవుయుంలో సన్నిహితులు నిర్మిస్తున్న ‘టచ్ చేశాడు’లో నటించే అవకాశం వచ్చింది. దీనికి అనూహ్యంగా 11 లక్షల హిట్స్ వచ్చారుు. ఇక అక్కడి నుంచి కెరీర్ కొత్త వులుపు తిరిగింది. ఓ పక్క రచనా సహకారం అందిస్తూనే... బిల్లా రంగా, హమ్ తుమ్ వంటి సినివూల్లో నటించా. ప్రస్తుతం ఎంఎస్ నారాయుణ కువూర్తె దర్శకత్వంలో వస్తున్న ‘సాహెబ్ సుబ్రహ్మణ్యం’లో ప్రధాన పాత్ర చేస్తున్నా. ఏ నిమిషానికి ఏమి జరుగునో... ఒకసారి మంచి జరిగిందని ప్రతిసారీ మంచే జరగదు. అలాగని ఒకసారి చెడు జరిగితే ప్రతిసారీ చెడే జరగదు. కాల మహిమ, పరిస్థితుల ప్రభావం ఎలా ఉంటాయో చెప్పేందుకు ‘ఏ నిమిషానికి ఏమి జరుగునో..’ షార్ట్ మూవీని దర్శకుడు, రచయిత వసంత్ మజ్జి తెరకెక్కించారు. దోస్త్ మేరా దోస్త్ చిన్ననాటి మోజు ఈ చిన్నోడిని సినివూ రంగం వైపు నడిపించింది. ‘పొట్టి సినివూ’తో మొదలైన ప్రయూణం ఇప్పుడు ‘బిగ్ స్క్రీన్’కు చేరింది. ‘దోస్త్ మేరా దోస్త్’... ఇదీ ఇతగాడు తీయుబోయే చిత్రం. సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసుకొంటున్న ఈ కుర్రాడు నిఖిలేష్ గోతాని... తన ప్రయూణంలోని వుుఖ్యమైన వుజిలీలను ‘సిటీ ప్లస్’ వుుందుంచాడు... సినివూ తీయుడవుంటే వూవుూలు విషయువూ! అంత వ్యయుం వునం భరించలేం. అందుకే విరాళాలు సేకరించాలనుకున్నా. ‘దోస్త్ మేరా దోస్త్’ సినివూ కోసం ‘థౌజండ్ ప్రొడ్యూసర్స్.కామ్’ ప్రారంభించా. ప్రతి జిల్లాలో వెయ్యిమంది నుంచి డొనేషన్స్ సేకరించేలా ప్లాన్ చేశాం. స్నేహితుల సహకారంతో డోర్ టు డోర్ తిరిగాం. కొందరు కాదన్నారు.. వురికొందరు చేయుూతనందించారు. మిగిలింది ఫ్రెండ్సందరం షేర్ చేసుకొంటున్నాం. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డెరైక్షన్, డైలాగ్స్, లిరిక్స్ నావే. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఇతివృత్తంతో కథ రాశా. ఫ్రెండ్స్, ప్రేవు చుట్టూ కథ తిరుగుతుంది. పొట్టిశ్రీరావుులు తెలుగు యుూనివర్సిటీ నుంచి తెరకెక్కుతున్న తొలి చిత్రం వూదే. వూ సొంతూరు ఆదిలాబాద్.. వచ్చే నెల అక్కడే షూటింగ్ ప్రారంభిస్తాం. అలా మొదలైంది... వుూవీలంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అప్పుడప్పుడూ పాటలు రాస్తూ, డ్రావూలు వేసేవాడిని. ఎంఎస్సీ చేశా. రెండేళ్లపాటు తోగాని టెక్నాలజీస్ నడిపించా. సినివూల మీదున్న ఆసక్తితో దాన్ని వదిలేసి తెలుగు వర్సిటీలో ఫిల్మ్ డెరైక్షన్ పీజీ డిప్లవూలో చేరా. ఇక్కడ నేను తీసిన ‘వురో వూసం’ షార్ట్ ఫిల్మ్‌కు వుంచి స్పందన వచ్చింది. ఆ తరువాత ‘నేషనల్ సెల్యూట్’ తీశా. ఆగస్టు 15న టైస్టు వేసుకున్న బాంబు బ్లాస్ట్ ప్లాన్‌ను వికలాంగుడైన బిచ్చగాడు ఎలా ఛేదించాడన్నది కథ. దీనికి అవార్డు వచ్చింది. ఈ స్ఫూర్తితోనే బిగ్ స్క్రీన్కు షిఫ్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యూ. అందుకు అవ్మూనాన్నల ప్రోత్సాహం కూడా ఉండటం వురింత బలాన్నిచ్చింది. - వాంకె శ్రీనివాస్ ఇండివిడ్యువల్ టాలెంట్‌ను ఎలివేట్ చేసే షార్ట్ ఫిల్మ్‌లంటే ఇప్పుడు యుూత్‌లో యువు క్రేజ్. మీరూ ఇటీవల షార్ట్ ఫిల్మ్‌లు తీసుంటే... వాటి ఫొటోలు, సంక్షిప్తంగా కథ తదితర వివరాలను వూకు పంపండి. వినూత్నంగా... విలక్షణంగా ఉన్న వాటిని ‘సాక్షి’ పాఠకులకు పరిచయం చేస్తాం. మెయిల్ టు sakshicityplus@gmail.com.