మూడు రోజుల పాటు నిర్వహణ
హాజరుకానున్న సినీ ప్రముఖులు
హన్మకొండ కల్చరల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ లఘు చిత్రోత్సవానికి ఓరుగల్లు వేదిక కానుంది. శుక్రవారం నుంచి జరగనున్న చిత్రోత్సవానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోయంలో చిత్ర ప్రదర్శనలు ఉంటాయని ఫిల్మ్ ఫెస్టివల్ చైర్మన్ కె.నాగేశ్వరరావు తెలి పారు.
కాకతీయుల కీర్తి పతాకను దేశవిదేశాల లో ఎగురవేసిన ప్రముఖ దర్శకుడు, రుద్రమదేవి చిత్ర నిర్మాత, దర్శకుడు గుణశేఖర్‌ను, సినీ రచయిత తోట ప్రసాద్‌ను మంత్రి అజ్మీరా చం దూలాల్ సన్మానించనున్నారు. శనివారం జరిగే రెండో రోజు కార్యక్రమాలకు మంత్రి హరీష్‌రా వు హాజరవుతారని నాగేశ్వర్‌రావు తెలిపారు. మూడు రోజుల పాటు జరగనున్న చిత్రోత్సవం లో వివిధ దేశాల దర్శకులే కాకుండా స్థానిక యువత నిర్మించిన లఘు చిత్రాలను ప్రదర్శించనున్నామని తెలిపారు.
నేటి నుంచి అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం
Published Fri, Jan 8 2016 2:30 AM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM
Advertisement