కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో జూన్ 15, 16, 17వ తేదీల్లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించనున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ చెప్పారు. హన్మకొండలోని ఆఫీసర్స్ క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఫిలిం పెస్టివల్ వివరాలను వెల్లడించారు. గతంలో రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లో మాత్ర మే ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించేవారన్నారు.
ఈ సంవత్సరం ప్రత్యేకంగా వరంగల్‌లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఉత్సవాలను మూడురోజులపాటు నిర్వహించనున్నట్లు వివరించారు. తద్వారా వరంగల్ జిల్లాలోని చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, గుర్తింపు పొందడంతోపాటు పర్యాటకపరంగా ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్‌లో 20 దేశాల నుంచి వంద షార్ట్‌ఫిలిమ్స్ ఎం ట్రీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఫెస్టివల్ ఫౌండర్ జి.భద్రప్ప, ఫెస్టివల్ ైచె ర్మన్ నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ షార్ట్‌ఫిలిం ఫెస్టివల్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు.
కేయూలో షార్ట్ ఫిలిం ఫెస్టివల్
Published Sun, Jun 7 2015 4:59 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM
Advertisement