Kakatiya University
-
ఫీజుల కోసం ఫలితాల నిలిపివేత
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల ఫీజు బకాయిలు చెల్లించలేదని కాకతీయ విశ్వవిద్యాలయం 112 ప్రైవేటు కాలేజీలకు చెందిన విద్యార్థుల పరీక్ష ఫలితాలను నిలిపివేసింది. మొత్తం బకాయిలు చెల్లించే వరకూ వెల్లడించబోమని తేల్చి చెప్పింది. దీంతో యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన 80 వేల మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలోని మిగతా వర్సిటీలు కూడా కాకతీయ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. గత ఏడాది నవంబర్, డిసెంబర్లో కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ, ద్వితీయ, మూడో ఏడాది విద్యార్థులకు వివిధ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. వర్సిటీ పరిధిలోని 390 కాలేజీల విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు. ఈ నెల 4వ తేదీన ఫలితాలు ప్రకటించారు. కానీ ఫీజు బకాయిలు ఉన్న 112 కాలేజీల ఫలితాలు మాత్రం నిలిపివేశారు. ఏంటీ ఫీజులు?ప్రైవేటు డిగ్రీ కాలేజీలు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్, విద్యార్థుల గుర్తింపు, విద్యార్థుల సంక్షేమ నిధి, ఇంటర్ టోర్నమెంట్, అనుబంధ గుర్తింపు ఫీజులను ఏటా యూనివర్సిటీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం కోర్సును బట్టి రూ.1,000 నుంచి రూ.5 వేల వరకూ ఉంటుంది. అన్ని యూనివర్సిటీల పరిధిలో దాదాపు రూ.100 కోట్ల ఫీజు బకాయిలుండగా.. కాకతీయ పరిధిలోనే 112 కాలేజీలు రూ.2.5 కోట్లు చెల్లించాల్సి ఉంది.రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లు!కొన్నేళ్ళుగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం సక్రమంగా అమలు కావడం లేదు. బోధన రుసుములు, ఉపకార వేతనాల కింద ప్రభుత్వం 2023–24 విద్యా సంవత్సరం వరకే రూ.5,195 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని కలిపితే ఈ మొత్తం దాదాపు రూ.8 వేల కోట్లకు చేరుతుంది. కొన్నేళ్లుగా రీయింబర్స్మెంట్ నిధులు రాకపోవడంతో ప్రైవేటు కాలేజీలకు నిధుల కొరత ఏర్పడింది. అధ్యాపకులకే వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో గత పరీక్షల సమయంలో కాలేజీలు ఆందోళనకు కూడా దిగాయి. అప్పుడు నెల రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. సాధారణంగా వర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజులను కాలేజీలు విద్యార్థుల నుంచి ముందే వసూలు చేస్తాయి. రీయింబర్స్మెంట్ వచ్చినప్పుడు విద్యార్థులకు తిరిగి చెల్లిస్తాయి.అయితే విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కాలేజీలు యూనివర్సిటీలకు చెల్లించడం లేదని అధికారులు అంటున్నారు. కాలేజీలు ఎక్కువ ఉండటం, పోటీ పెరగడంతో ఫీజులు ఒత్తిడి చేసి వసూలు చేసే పరిస్థితి లేదని మరోవైపు యాజమాన్యాలు అంటున్నాయి. ఏది ఏమైనా ఫలితాల నిలిపివేతతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. రీయింబర్స్మెంట్ రావడం లేదుమూడేళ్ళుగా ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదు. ప్రతి కాలేజీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ప్రభుత్వానికి ఈ విషయం చెప్పాం. అయినా ఫలితం లేదు. వర్సిటీని కూడా కొంత సమయం అడిగాం. పట్టించుకోకుండా ఫలితాలు నిలిపి వేయడం సరికాదు. తక్షణమే ప్రకటించాలి.– జె.శ్రీధర్‌రావు (ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్) సమయం ఇచ్చినా చెల్లించలేదువర్సిటీకి చెల్లించాల్సిన దాదాపు రూ.2.5 కోట్ల బకాయిలు చెల్లించమని కాలేజీలను కోరాం. వారితో చర్చలు జరిపాం. కొంత సమయం కూడా ఇచ్చాం. అయినా చెల్లించలేదు. ఫీజులు చెల్లించకపోతే యూనివర్సిటీ నడిచేదెలా? అందుకే ఫలితాలు నిలిపివేశాం. – ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి (కాకతీయ యూనివర్సిటీ వీసీ)మాకెందుకీ శిక్ష?కష్టపడి చదివి పరీక్షలు రాశాం. కాలేజీలకు, వర్సిటీకి ఉన్న లావాదేవీలు వాళ్ళు చూసుకోవాలి. మేమేం తప్పు చేశాం. మాకు ఎందుకీ శిక్ష? – బి.సరిత (బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థిని, ఖమ్మం) -
యూనివర్సిటీల పునర్వ్యవస్థీకరణ ఎప్పుడో..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించి పదేళ్లు దాటినా.. విశ్వవిద్యాలయాల పరిపాలనకు తగిన విధంగా వాటిని పునర్వ్యవస్థీకరించలేదు. దీంతో ఆయా జిల్లాల విద్యార్థులు, అఫిలియేషన్ కలిగిన కళాశాలలు ఇబ్బంది పడుతున్నాయి. కొత్త రాష్ట్రంలో ఎనిమిదేళ్ల క్రితం కొత్త జిల్లాలు, మూడేళ్ల క్రితం కొత్త జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ వర్సిటీల పరిధి విషయంలో మాత్రం అవసరమైన మార్పులు చేయలేదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్న సమయంలోనే కొత్తగా శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు యూనివర్సిటీలను ఏర్పాటు చేసినప్పటికీ.. అవి ఇప్పటికీ ఆయా ఉమ్మడి జిల్లాల పరిధికి మాత్రమే పరిమితమయ్యాయి. దీంతో గతం నుంచే ఉన్న ఉస్మానియా, కాకతీయ వర్సిటీలపై మాత్రం భారం అలాగే ఉంది. మరోవైపు ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వారు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విశ్వవిద్యాలయాలను పునర్వ్యవస్థీకరించాలని పలువురు కోరుతున్నారు.ప్రత్యేక కమిటీ నివేదిక రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు సంబంధించి ఆయా కళాశాలల అఫిలియేషన్ విషయమై.. జిల్లాల కేటాయింపుల్లో మార్పులు, చేర్పులు చేయాలంటూ ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ గతంలోనే నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఉన్నత విద్యామండలికి అందజేయగా.. ఉన్నత విద్యామండలి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఉమ్మడి ఏపీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణలో శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేశారు. అయితే కళాశాలల అఫిలియేషన్ విషయానికి వస్తే.. తెలంగాణ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, శాతవాహన వర్సిటీ పరిధిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా, పాలమూరు వర్సిటీ పరిధిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలు మాత్రమే ఉన్నాయి.అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కళాశాలల అఫిలియేషన్ మాత్రం.. ఇప్పటికీ కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోనే ఉంది. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత.. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలను ఆనుకున్న నిజామాబాద్‌లోని తెలంగాణ వర్సిటీని దాటుకుని ఆయా జిల్లాల వారు సుదూరంలోని వరంగల్ కాకతీయ వర్సిటీకి వెళ్లాల్సి వస్తోంది. కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీని అనుకున్న ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల వారు కరీంనగర్ మీదుగానే వరంగల్ వెళ్లాల్సి వస్తోంది. అయితే గతంలోనే ప్రత్యేక కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఆయా వర్సిటీలు, కొత్త జిల్లాల మధ్య దూరం, కళాశాలల సంఖ్యను బట్టి పరిధి మార్పుపై ప్రతిపాదనలు చేశారు. ఆయా అంశాల ఆధారంగా ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ మేరకు తెలంగాణ వర్సిటీ పరిధిలోకి కొత్తగా నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు, శాతవాహన వర్సిటీ పరిధిలోకి ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట జిల్లాలను కేటాయించేలా నివేదికలో ప్రతిపాదించారు.చదవండి: ‘మరియు’ స్థానంలో ‘నుండి’ టైప్ చేయడంతో ఆగిన రిజిస్ట్రేషన్లుగతంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఉస్మానియా పరిధిలో ఉండగా.. కొత్త ప్రతిపాదనల ప్రకారం సంగారెడ్డి జిల్లా మాత్రమే ఆ వర్సిటీ పరిధిలో ఉంచాలని నిర్ణయించారు. అంటే ఉస్మానియా వర్సిటీ పరిధిలో సంగారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, వికారాబాద్ జిల్లాలు ఉండేలా ప్రతిపాదించారు. ఇక కాకతీయ వర్సిటీ పరిధిలో ఉమ్మడి వరంగల్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉండేలా నిర్ణయించారు. ఇక మహాత్మాగాంధీ వర్సిటీ పరిధిలో ఉమ్మడి నల్లగొండలోని మూడు జిల్లాలు, పాలమూరు వర్సిటీ పరిధిలో ఉమ్మడి మహబూబ్‌నగర్ పరిధిలోని ఐదు జిల్లాలు యధావిధిగా ఉండేలా నివేదికలో ప్రతిపాదించారు. కాగా ఇందుకు సంబంధించి విధాన నిర్ణయం విషయంలో జాప్యం జరుగుతోంది.పరిధులపై ప్రత్యేక కమిటీ ప్రతిపాదనలు..ఉస్మానియా: రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్గిరి, వికారాబాద్ కాకతీయ: వరంగల్, హన్మకొండ, జనగాం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం తెలంగాణ: నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, నిర్మల్ శాతవాహన: కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట మహాత్మాగాంధీ: నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి పాలమూరు: మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట -
మాడిన అన్నం.. రుచిలేని పప్పు
కేయూ క్యాంపస్: భోజనం బాగా లేదని, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలోని మహిళా హాస్టల్ విద్యార్థినులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద బైఠాయించారు. భోజనం బాగుండటం లేదని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. అన్నం మాడిపోతోందని, పప్పు కూడా బాగుండటం లేదని వివరించారు.వీసీ, రిజిస్టర్ రావాలని నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పే యత్నం చేశారు. సమాచారం అందుకున్న హాస్టళ్ల డైరెక్టర్ రాజ్‌కుమార్ రాత్రి 11.30 గంటలకు అక్కడికి వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులు తీసుకొచ్చిన ఆహారాన్ని పరిశీలించారు. ఈ సమస్యను శనివారం పరిశీలించి.. తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. వెంటనే డైరెక్టర్ హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు. -
‘సెట్’ చేసేశారా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ సంవత్సరం నిర్వహించిన పలు ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్) నిధులు పక్కదారి పట్టినట్టు ఆరోపణలొస్తున్నాయి. వీసీలు మారడంతో సెట్ కన్వీనర్లపై ఉన్నత విద్యామండలికి ఫిర్యాదులొస్తున్నాయి. ‘సెట్’కు కేటాయించిన నిధులు కన్వినర్లు, ఆయా యూనివర్సిటీ వీసీలు అడ్డగోలు లెక్కలతో కాజేశారని పెద్దఎత్తున ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాకతీయ వర్సిటీ నిర్వహించిన ఐసెట్ వ్యవహారం ఇప్పటికే తీవ్ర వివాదంగా మారింది. జేఎన్టీయూహెచ్ నేతృత్వంలో సాగిన ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఈఏపీసెట్)పైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై మండలి చైర్మన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. వాస్తవాలు తెలియజేయాలని కొత్త వీసీలను కోరారు. అవసరమైతే ప్రత్యేక బృందాన్ని విచారణకు పంపాలని చైర్మన్ భావిస్తున్నట్టు తెలిసింది. అసలేం జరిగింది? రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏటా ఈఏపీ, ఈసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, లాసెట్, పీఈసెట్, పాలిసెట్, పీజీసెట్ నిర్వహిస్తారు. వివిధ వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో ప్రవేశం పొందేందుకు విద్యార్థులు ఈ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కో సెట్ నిర్వహణను ఒక్కో వర్సిటీకి అప్పగిస్తారు. ప్రతీ సెట్‌కు ఒక కన్వీనర్, కొంతమంది సభ్యులను ఎంపిక చేస్తారు. అతిపెద్ద సెట్ అయిన ఈఏపీ సెట్‌ను సాధారణంగా జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తుంది. మరికొన్ని కీలకమైన సెట్స్‌ను ఉస్మానియా వర్సిటీకి అప్పగిస్తారు. ఐసెట్‌ను కొన్నేళ్లుగా కాకతీయ విశ్వవిద్యాలయానికి అప్పగిస్తున్నారు. సెట్ రాసే విద్యార్థుల సంఖ్యను బట్టి ఉన్నత విద్యామండలి కాన్ఫిడెన్షియల్ నిధులు ఇస్తుంది. సెట్ ప్రశ్నపత్రం కూర్పు, ప్రింటింగ్, రవాణా, నిర్వహణకు వీటిని ఉపయోగిస్తారు. ఈ వ్యవహారం మొత్తం రహస్యంగా ఉంటుంది. కాబట్టి ఏ బాధ్యత ఎవరికి అప్పగిస్తున్నారనేది ముందే చెప్పరు. పరీక్ష పూర్తయిన తర్వాత బిల్లులు పెట్టడం, ఆడిట్ నిర్వహించి, వాటిని ఉన్నత విద్యా మండలి అనుమతించడం ఆనవాయితీగా వస్తోంది. సంబంధం లేని వ్యక్తులు, ఊహించని విధంగా కంప్యూటర్లు, ఇతర వస్తువుల కొనుగోళ్లు చేపట్టినట్టు బిల్లులు ఉండటంతో కొత్త వీసీలు సందేహాలు లేవనెత్తుతున్నారు. ఐసెట్ నిధులు గందరగోళం కాకతీయ వర్సిటీ నిర్వహించిన ఐసెట్ నిధుల లెక్కలపై ప్రస్తుత వీసీ అభ్యంతరాలు లేవనెత్తినట్టు సమాచారం. దీనిపై అందిన ఫిర్యాదులను మండలి చైర్మన్‌కు పంపినట్టు తెలిసింది. ఐసెట్ నిర్వహణ కోసం ఈ వర్సిటీ రూ.99.50 లక్షలు ప్రతిపాదించగా, మండలి రూ. 92.76 లక్షలు మంజూరైంది. ఈ నిధులను కన్వినర్ ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకూ ఖర్చు చేసినట్టు గుర్తించారు. దాదాపు రూ.16 లక్షలు సెల్ఫ్ చెక్కుల ద్వారానే విడుదల చేయడం అనుమానాలకు తావిస్తోందని మండలి వర్గాలు సందేహిస్తున్నాయి. సంబంధమే లేని ఓ వ్యక్తికి రూ.2 లక్షలు ఇవ్వడం, అవసరం లేని రవాణాకు రూ. 40 వేలు వెచ్చించడం, కార్యాలయంలో పనిచేస్తున్న ఓ చిన్న ఉద్యోగి ఖాతాలో నగదు జమవ్వడం, ఏ సంబంధం లేని మహిళకు రూ.82 వేలు వెళ్లడం, సరైన ప్రమాణాలు లేకున్నా రూ.87 వేల చొప్పున 6 కంప్యూటర్లు కొనడం అనుమానాలకు తావిస్తోంది.ఇందులో రూ.29 లక్షల వరకూ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈఏపీసెట్ నిర్వహణ నిధుల విషయంలోనూ పలు ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. అయితే, ఈ వ్యవహారంలో మండలి వర్గాలు గోప్యత పాటిస్తున్నాయి. ఈ సెట్ కోసం దాదాపు రూ.3 కోట్లు వెచ్చించారు. పరిశీలిస్తున్నాంకాకతీయ నిర్వహించిన ఐసెట్పై ఆరోపణలు వచ్చిన మాట నిజమే. ఇందులో వాస్తవాలు ఏమిటనేది పరిశీలిస్తున్నాం. ఇతర సెట్ల విషయంలోనూ ఫిర్యాదులు వస్తే విచారణ జరిపిస్తాం. వాస్తవాలు పరిశీలించిన తర్వాత ఏం జరిగిందనేది వెల్లడిస్తాం. – ప్రొఫెసర్ వి.బాలకృష్ణారెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
Thota Jyothi Rani: పేదరికం దేశాన్ని వదలని రుగ్మత
నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్‌గార్ యోజన, సంపూర్ణ గ్రామీణ రోజ్‌గార్ యోజన, రూరల్ హౌసింగ్ కోసం ఇందిరా ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి గ్రామోదయ యోజన, రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్స్ రోజ్‌గార్ యోజన, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన... ప్రభుత్వం ఇన్ని పథకాలను అమలు చేస్తోంది. ఇవన్నీ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం రూపొందించినవే. దశాబ్దాలుగా పథకాలు అమలవుతున్నప్పటికీ దేశంలో పేదరికం అలాగే ఉంది. పేదరికం మాత్రమే కాదు ఆకలి తీవ్రమవుతోంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచంలోని 127 దేశాల జాబితాలో మనదేశానిది 105వ స్థానం. ఏడు పదులు దాటిన స్వతంత్ర భారతంలో ప్రభుత్వాలు అనుసరించిన పాలన పద్ధతులతో పేదరికం తగ్గలేదు సరి కదా ఆకలి పెరుగుతోందని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ తెలియచేస్తోందని చెప్పారు కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ తోట జ్యోతి రాణి. ఇంటర్నేషనల్ పావర్టీ ఇరాడికేషన్ డే సందర్భంగా పేదరికం మనదేశంలో మహిళల మీద ఎంతటి ప్రభావాన్ని చూపిస్తోందో పరిశీలిద్దాం. ఫోను... లూనా... ప్రమాణాలు కాదు!మనదేశం అభివృద్ధి చెందలేదా అంటే ఏ మాత్రం సందేహం లేకుండా అభివృద్ధి చెందిందనే చెప్పాలి. కరెంట్ వాడకం, గ్యాస్ వినియోగం పెరిగాయి. ఉల్లిపాయలు, కూరగాయలమ్మే వాళ్లు కూడా టూ వీలర్, మినీ ట్రక్కుల మీద వచ్చి అమ్ముకుంటున్నారు. జనాభాలో ఎక్కువ మంది మొబైల్ ఫోన్ వాడుతున్నారు. వీటిని చూసి పేదరికం తగ్గిపోయిందనే అభిప్రాయానికి రావడం ముమ్మాటికీ తప్పే. అవి లేకపోతే ఆ మేరకు పనులు చేసుకోవడం కూడా సాధ్యం కాని రోజులు వచ్చేశాయి. కాబట్టి ఇప్పుడు వీటిని సంపన్నతకు ప్రతిరూపాలుగా చూడరాదు. నిత్యావసర సౌకర్యాలనే చెప్పాలి. ఈ ఖర్చులిలా ఉంటే కడుపు నింపుకోవడానికి మంచి ఆహారం కోసం తగినంత డబ్బు ఖర్చుచేయలేని స్థితిలో ఉంది అల్పాదాయవర్గం. సమాజం పేదరికాన్ని ఆర్థిక కోణంలోనే చూస్తుంది. నిజానికది సామాజిక కోణంలో చూడాల్సిన అంశం. భారం మహిళల మీదనే!అల్పాదాయ కుటుంబంలోని మహిళ పేదరికానికి తన జీవితకాలమంతటినీ మూల్యంగా చెల్లించుకుంటుంది. పేదరికం భారం ప్రధానంగా మహిళ మీదనే పడుతుంది. పొయ్యి మీదకు, పొయ్యి కిందకు సమకూర్చుకోవడంలో నలిగిపోయేది ఆడవాళ్లే. ఒకప్పుడు అడవికి పోయి కట్టెలు తెచ్చుకునే వాళ్లు. గ్రామీణ మహిళకు కూడా ఇప్పుడా అవకాశం లేదు. తప్పని సరిగా గ్యాస్ సిలిండర్, కిరోసిన్, బొగ్గులు ఏదో ఒకటి కొనాల్సిందే. ఇంట్లో అందరికీ సరిపోయేటట్లు వండాలి. ఉన్న డబ్బులో అందరికీ పెట్టగలిగిన వాటినే వండుతుంది. ఆ వండిన పదార్థాలను ఇంట్లో అందరికీ పెట్టిన తర్వాత మిగిలింది తాను తినాలి. ఆ తినగలగడం కూడా అందరూ తినగా మిగిలితేనే. అందరికీ పెట్టి పస్తులుండే మహిళలు ఇంకా దేశంలో ఉన్నారు. బీహార్‌లో అత్యంత పేదరికంలో మగ్గుతున్న ముసాహర్ సామాజిక వర్గంలో మహిళలు రొట్టెలు చేసి తాము సగం రొట్టెతో ఆకలి తీర్చుకుంటారు. వాళ్లు ఒక రొట్టె అంతటినీ తినగలగడం అంటే ఆ రోజు వాళ్లకు పండగతో సమానం. ఇంటి నాలుగ్గోడల మధ్య ఏం వండారో, ఏం తిన్నారో బయటకు తెలియదు. కానీ జాతీయ సర్వేలు ఈ విషయాలను బయటపెడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో క్రానిక్ ఎనర్జీ డెఫిషియెన్సీతో బాధ పడుతున్న మహిళలు నూటికి ఎనభై మంది ఉన్నారు. పట్టణాల్లో ఆ సంఖ్య యాభై ఏడుగా ఉంది. పేదరికం విలయతాండవం చేస్తోందని చెప్పడానికి ఇంతకంటే రుజువులు ఇంకే కావాలి. అభివృద్ధి గమనం సరైన దిశలో సాగకపోవడమే ఇందుకు కారణం. అభివృద్ధి క్రమం తప్పడం వల్లనే పేదరిక నిర్మూలన అసాధ్యమవుతోంది. ఆలోచన అరవై ఏళ్ల కిందటే వచ్చింది!మనదేశంలో పాలకులకు పేదరికం గురించిన ఆలోచన 1960 దశకంలోనే వచ్చింది. నేషనల్ సాంపుల్ సర్వే 1960–61 ఆధారంగా వి.ఎమ్. దండేకర్, ఎన్. రాత్ల నివేదిక దేశంలో పేదరికం తీవ్రతను తెలియచేసింది. ఉద్యోగ కల్పన ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనే ఆలోచనతో ప్రణాళికలు రూపొందాయి. కానీ అవి అమలులో అనుకున్న ఫలితాలనివ్వలేదు, పూర్తిగా వక్రీకరణ చెందాయి. దాంతో ప్రభుత్వాలు తాత్కాలిక ఉపశమన చర్యల వైపు చూశాయి. ఆ చర్యల్లో భాగమే పైన చెప్పుకున్న పథకాలు. ఇన్ని దశాబ్దాలుగా ఈ పథకాలు అమలులో ఉన్నప్పటికీ సమాజంలో వాటి అవసరం ఇంకా ఉందని హంగర్ ఇండెక్స్ చెబుతోంది. ప్రణాళిక బద్ధమైన ఉద్యోగ కల్పన ఇప్పటికీ జరగలేదు, ఇంకా తాత్కాలిక ఉపశమనాలతోనే నెట్టుకు వస్తున్నాం. ఇదిలా ఉంటే పంచవర్ష ప్రణాళికలను కూడా నిలిపివేసింది ప్రభుత్వం. పేదరిక నిర్మూలన సాధనలో ఉపాధి హామీ అనేది చిరుదీపం వంటిదే. అదే సంపూర్ణ పరిష్కారం కాదు. సమ్మిళిత అభివృద్ధి జరగకపోవడంతో సమాజంలో అంతరాలు పెరుగుతున్నాయి. సంపన్నులు మరీ సంపన్నులవుతున్నారు. పేదవాళ్లు మరింత పేదరికంలోకి జారిపోతున్నారు. పేదరికం ప్రభావం మహిళలు, పిల్లల మీద తీవ్రంగా చూపిస్తుంది. విద్య, వైద్యం కార్పొరేటీకరణ చెందడంతో ఒక్క అనారోగ్యం వస్తే కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఆవిరైపోతుంది. వైద్యాన్ని కూడా కొనసాగించలేకపోతున్నారు. – ప్రొ‘‘ తోట జ్యోతిరాణి, రిటైర్డ్ ఫ్రొఫెసర్, ఎకనమిక్స్, కాకతీయ యూనివర్సిటీ– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం.. 78 మంది సస్పెండ్
సాక్షి, వరంగల్: వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారన్న కారణంతో 81 మంది విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు పడింది. జూనియర్లను కొంతకాలంగా ర్యాగింగ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న ఆరోపణలపై వారం రోజులపాటు సస్పెండ్ చేశారు అధికారులు. ఈ విషయంపై యూనివర్సిటీ వైఎస్ ఛాన్సలర్ రమేష్ మాట్లాడుతూ.. యూనివర్సిటీలో ర్యాగింగ్ జరగలేదని తెలిపారు. పరిచయ వేదిక పేరుతో జూనియర్లను సీనియర్లు పిలిచి మాట్లాడారని హాస్టల్లోనూ మరోసారి ఇంట్రడక్షన్ తీసుకున్నారని చెప్పారు. ఈ క్రమంలో జూనియర్లను వేధించిన ఆరోపణలపై 78 మంది సీనియర్ విద్యార్థులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. సస్పెన్సన్‌కు గురైన వారిలో పీజీ చదువుతున్న 28, కామర్స్ 28, ఎకనామిక్స్ 25 మంది, జువాలజీ సెకండ్ ఇయర్ విద్యార్థినులు ఉన్నారు. వారం రోజులపాటు సస్పెన్డ్ చేస్తున్నట్లు వర్సిటీ అధికారులు ధృవీకరించారు. అయితే అర్ధరాత్రి హాస్టల్ రూమ్‌కు పిలిచి సీనియర్లు వేధించారని జూనియర్లు చెబుతున్నారు. దీనిపై వర్సిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన అనంతరం వేధింపులు నిజమేనని నిర్థారించి 81 మంది విద్యార్థులను ర్సిటీ అధికారులు వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. చదవండి: HYD: మూసారాంబాగ్ బ్రిడ్జి మూసివేత -
కేయూలో విద్యార్థుల ఆందోళన ఉధృతం
సాక్షి, హన్మకొండ జిల్లా: హన్మకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డీ అడ్మిషన్ల అవకతవకలపై విద్యార్థుల ఆందోళన, పోలీసుల దాడి వివాదాస్పదంగా మారింది. ఆందోళనకు దిగిన ఏబీవీపీ విద్యార్థులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి గాయపర్చారని విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. గాయపడ్డ విద్యార్థులను కేయూలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పరామర్శించారు. కాళ్ళు చేతులు విరిగేలా పోలీసులు కొట్టడంపై రఘునందన్ రావు సీరియస్‌గా స్పందించారు. శాంతియుతంగా ఆందోళనకు దిగిన విద్యార్థులను కొట్టలేదు.. ఇబ్బంది పెట్టలేదంటున్న సీపీ రంగనాథ్ లైవ్ డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. సీపీ తీరుపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రైవేటుగా కేసు నమోదు చేయిస్తామని స్పష్టం చేశారు. విద్యార్థులను క్రిమినల్‌గా చిత్రీకరించాలనే ఆలోచను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేయూ వైస్ ఛాన్సలర్ పై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. విద్యార్థులపై దాడికి నిరసనగా 12న వరంగల్ బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు, విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు రఘునందన్‌రావు. -
పరీక్ష ఒకటి.. పేపర్ మరొకటి.. రాసినా 'నో ప్రాబ్లమ్'..!?
ఆదిలాబాద్: కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య విధానం ఎస్డీఎల్సీఈ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన ఓ పరీక్షలో విచిత్రం చోటు చేసుకుంది. విద్యార్థులు రాయాల్సిన పరీక్షకు బదులు మరో పరీక్ష పత్రాన్ని అందించారు. తర్వాత విద్యార్థులు తాము రాసే పరీక్షకు ఈ ప్రశ్న పత్రంతో సంబంధం లేదని గుర్తించారు. ఈ విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు తర్వాత విద్యార్థులకు సంబంధిత పరీక్ష పత్రాన్ని అందించి పరీక్ష రాయించారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత అదనంగా కొంత సమయం కేటా యించి పరీక్ష రాయించారు. ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. బుధవారం ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విద్యార్థులు చర్చించుకోవడంతో బండారం బయటపడింది. తెలంగాణ హిస్టరీకి బదులు ఇండియన్ హిస్టరీ పేపర్‌ను విద్యార్థులకు ఇచ్చారు. ఈ విషయమై కేయూ పరీక్షల విభాగం అడిషనల్ కంట్రోలర్ నరేందర్‌ను వివరణ కోరగా హిస్టరీలో మూడు విభాగాలు ఉంటాయని, ఇందులో ఏ విభాగం రాసినా ఇబ్బంది లేదని తెలిపారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు. -
కేయూలో మూడు రోజుల నుంచి జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు
కేయూ క్యాంపస్ : మొక్కలలో జన్యుసవరణలతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఆస్ట్రేలియా ముర్దోక్ వర్సిటీ సైంటిస్టు ఎంజీకే జోన్స్ అన్నారు. కేయూలోని సేనేట్‌హాల్‌లో నిర్వహిస్తున్న ప్లాంట్ బయోటెక్నాలజీ ‘జీనమ్ ఎడిటింగ్‘ పై నిర్వహిస్తున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో బుధవారం ఆయన ప్రసంగించారు. ‘జీనోమ్ ఎడిటింగ్’ ద్వారా సృష్టించిన నూతన వంగడాలను, పంటలను ఏఏ దేశాలల్లో ఎలా ఉపయోగిస్తున్నారనే అంశంతోపాటు వాటి వినియోగం భవిష్యత్తులో ఎలా ఉంటుందో కూడా వివరించారు. అనంతరం పూణేలోని సావిత్రి బాయి ఫూలే యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీలమిత్ర .. టమాటా మొక్కల అభివృద్ధిలో వివిధ రకాల ఒత్తిళ్లు, కరువు పరిస్థితులను తట్టుకునేలా ఉండే ప్రయోగాలను వివరించారు, ఓయూ ప్రొఫెసర్ కేవీ రావు.. రసం పీల్చే పురుగులు, క్రిమి కీటకాలను తట్టుకునే పత్తి, వరి పంటల గురించి వివరించారు. భారతీయర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సతీశ్ కుమార్.. ట్రాన్స్‌జీన్ టెక్నాలజీ, పరిశోధన గురించి వివరించారు. మలేషియా మలయా యూనివర్సిటీ ప్రొఫెసర్ జెన్నిఫర్ అన్న హరికష్ణ.. జీవసాంకేతిక జన్యుసవరణల పరిశోధనల ద్వారా నిలబడే అరటి మొక్కలను గురించి వివరించారు. బెంగళూర్ టీఎఫ్ఆర్ ఎన్సీబీసీ శాస్త్రవేత్త పీవీ శివప్రసాద్.. ఆహార ఉత్పత్తి పెంచడానికి ఉన్న అవకాశాలు వివరించారు. సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రకాశ్ పి కుమార్ మాట్లాడుతూ పంటల అభివృద్ధికి బయో టెక్నాలజీ పరిష్కారమన్నారు. కార్యక్రమంలో కేయూ బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్లు ఎన్ రామస్వామి, ఎ సదానందం, వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు రోజారాణి, ఎంవీ రాజం, ప్రశాంత మిశ్రా, కోటా శ్రీనివాస్, కేవీ సరిత, రిటైర్డ్ ప్రొఫెసర్లు చేరాలు, మాధురి, కేయూ బయోటెక్నాలజీ విభాగం అఽధిప తి వెంకటయ్య, ఏవీ రావు, శాసీ్త్ర పాల్గొన్నారు.కాగా, అతిథులు సాంస్కతిక కార్యక్రమాలను వీక్షించారు. ఆకట్టుకున్న పోస్టర్ల ప్రజెంటేషన్స్.. కేయూలో బయోటెక్నాలజీ విభాగం, యూకే అబెర్విసిత్ వెల్స్ యూనివర్సిటీ కొలబరేషన్‌లో ప్లాంట్ బయోటెక్నాలజీ ‘జీనమ్ ఎడిటింగ్’ అనే అంశంపై నిర్వహిస్తున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో పలువురు పరిశోధకులు పోస్టర్లను ప్రజెంటేషన్ చేశారు. జీవసాంకేతిక పరిజ్ఞానంతో నూ తన వంగడాలు తదితర అంశాలపై అక్కడికి వచ్చిన పరిశోధకులు, విద్యార్థులకు తెలిపారు. 25 వరకు పోసర్లు ప్రజెంటేషన్ చేయగా అందులో ప్రతిభ ప్రదర్శించిన వారికి ప్రోత్సాహకంగా ఈనెల 29న ముగింపు సభలో బహుమతులు అందజేస్తారు. నేడు ముగియనున్న కాన్ఫరెన్స్ కేయూలో మూడు రోజుల నుంచి జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు గురువారం సాయంత్రం ముగి యనుంది. ఈముగింపు సదస్సుకు తెలంగాణ ఉన్న త విద్యామండలి చైర్మన్ లింబాద్రి, కేయూ మాజీ వీసీ విద్యావతి, కేయూ రిజిస్ట్రార్ శ్రీనివాస్‌రావు, రాజమండ్రి ఐసీఏఆర్, సీటీఆర్ఐ డైరెక్టర్ శేషుమాధవ్, కేయూ సైన్స్ డీన్ మల్లారెడ్డి, యూజీసీ కోఆర్డినేటర్ మల్లికార్జున్‌రెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సి పాల్ సురేశ్‌లాల్ తదితరులు హాజరవుతారు. -
సివిల్స్‌లో కేయూ ప్రొఫెసర్ మంద అశోక్ కుమార్ కూతురుకు 646 ర్యాంక్
కాకతీయ యూనివర్సిటీ అర్థశాస్త్ర ఆచార్యులు మంద అశోక్ కుమార్ కూతురు మంద అపూర్వ సివిల్స్ ఫలితాలలో 646 ర్యాంకు సాధించారు. మంద అపూర్వ ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం ఎంటెక్ చేస్తున్నారు. హనుమకొండ ఎక్సైజ్ కాలనీలో నివసిస్తున్న అపూర్వ తల్లి మంద రజనీ దేవి ప్రభుత్వ టీచర్ గా భీమదేవరపల్లి మండలం మాణిక్య పూర్లో పనిచేస్తున్నారు. మందా అపూర్వకు ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు పెద్దన్నయ్య అరుణ్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, చిన్న అన్నయ్య అభినవ్ పూణేలో ఫార్మసీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇక, మంద అపూర్వ సివిల్స్‌లో ర్యాంక్ సాధించడంపై పలువురు ప్రముఖులు అభినందనలు తెలియజేశారు. -
కేయూలో ఉద్రిక్త వాతావరణం
-
టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
కేయూ క్యాంపస్: ఈ విద్యాసంవత్సరం (2023–2024) ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం వరంగల్ కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్ హాల్లో టీఎస్ ఐసెట్ చైర్మన్ తాటికొండ రమేశ్‌తో కలిసి వివరాలు వెల్లడించారు. అపరాధ రుసుము లేకుండా మార్చి 6 నుంచి మే 6వ వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.550, ఇతరులకు రూ.750 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. రూ.250 అపరాధ రుసుముతో మే 12 వరకు, రూ.500తో మే 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్లను మే 22 నుంచి సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రవేశ పరీక్ష ఇలా... టీఎస్ ఐసెట్ ప్రవేశపరీక్షను మే 26, 27 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహిస్తారు. ►26న మొదటి సెషన్ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మూడో సెషన్ మే 27న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12–30 గంటల వరకు, నాలుగో సెషన్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. ►14 ప్రాంతీయ కేంద్రాలు, సుమారు 75 పరీక్షకేంద్రాలను కూడా గుర్తించారు. ►ప్రాథమిక కీని జూన్ 5న విడుదల చేస్తారు. ►ప్రాథమిక కీపైన అభ్యంతరాలు ఉంటే జూన్ 8వ తేదీ వరకు తెలియజేయాల్సింటుంది. ►ఫలితాలు జూన్ 20న విడుదల చేస్తారు. 25 శాతం అర్హత మార్కులు టీఎస్ ఐసెట్‌లో ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు కనీస అర్హత మార్కులు లేవని, మిగతా కేటగిరీలవారికి అర్హత మార్కులు 25%గా నిర్ణయించినట్లు లింబాద్రి తెలిపారు. సిలబస్, మోడల్ పేపర్, సూచనలు, ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ విధాన, ఆన్లైన్ పరీక్ష, పరీక్ష కేంద్రాల జాబితా, మాక్ టెస్టుల సమాచారం జ్టి్టpట//జీఛ్ఛ్టి.్టటజ్ఛి.్చఛి.జీn లో అందుబాటులో ఉన్నట్లు టీఎస్ ఐసెట్ కన్వీనర్ పి.వరలక్ష్మి తెలిపారు. -
విద్యలో వివక్ష ఉండొద్దు
విద్యారణ్యపురి(హనుమకొండ): ‘విద్య ప్రాథమిక హక్కు. బాలబాలికలందరికీ సమానంగా విద్యావకాశాలు ఉండాలి. విద్యనందించడంలో వివక్ష ఉండొద్దు. బాలలు విద్యార్థి దశ నుంచే మానవీయ విలువలను పెంపొందించుకోవాలి’అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అన్నారు. సోమవారం ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో వేలాదిమంది విద్యార్థులతో నిర్వహించిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ప్రపంచంలో వాస్తవ హీరోలు బాలబాలికలేనని పేర్కొన్నారు. సమాజంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్లంటూ మత విభేదాలు లేకుండా కలిసికట్టుగా చదువుకోవడానికి విద్యార్థులు ముందుకురావాలన్నారు. విద్యార్థి దశ నుంచే తాము భవిష్యత్‌లో ఏమి కావాలో నిర్దేశించుకోవాలని, అందుకు కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ‘మీలో ఎవరైనా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కావాలని అనుకుంటున్నారా’అని విద్యార్థులను ప్రశ్నించారు. తాను ఒకప్పుడు జర్మనీలో ఓ నోబెల్ బహుమతి గ్రహీతను కలిసినప్పుడు అప్పట్లో తనకు మొబైల్ ఫోన్ లేదని, అతనితో ఫొటో తీసుకోలేకపోయానన్నారు. కానీ అప్పుడే నోబెల్ బహుమతి గ్రహీతను కావాలనే సంకల్పం పెట్టుకున్నానని, చివరికి దానిని సాధించగలిగానని పేర్కొన్నారు. ఆఫ్రికా లాంటి దేశాల్లో చాక్లెట్లు తయారీ చేసే పరిశ్రమల్లో బాలకార్మికులు పనిచేస్తున్నారని, అలాంటి చాక్లెట్‌ను తినొద్దని, అలా చేస్తేనే బాలకార్మిక వ్యవస్థకు విముక్తి కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్, ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయభాస్కర్, కుడా చైర్మన్ సుందర్రాజు యాదవ్, మేయర్ గుండు సుధారాణి, హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, గోపి, బల్దియా కమిషనర్ ప్రావీణ్య, సీపీ ఏవీ రంగనా«థ్, వడుప్సా అధ్యక్షుడు రమేశ్‌రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. బాలల హక్కులు రక్షించినప్పుడే శాంతి బాలల హక్కులు రక్షించినప్పుడే ప్రపంచశాంతి, సుస్థిరత నెలకొంటుందని కైలాస్ సత్యార్థి అభిప్రాయపడ్డారు. సభ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం పెద్దల కంటే బాలబాలికలపైనే తీవ్రప్రభావం చూí³ందని, పిల్లలు ఎంతోమంది మరణించారన్నారు. బాల్యవివాహాల నిరోధక చట్టం ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవటంలేదని, గ్రామాల్లో ప్రతి నలుగురు బాలికల్లో ఒకరికి బాల్య వివాహం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. -
టీఎస్ ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ఈ విద్యాసంవత్సరం ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తు తేదీని పొడిగించింది. రూ.250 అపరాధ రుసుముతో ఈనెల 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్ ఐసెట్ కన్వీనర్, కాకతీయ వర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ కె.రాజిరెడ్డి సోమవారం తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 15 నుంచి 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఇప్పటివరకు టీఎస్ ఐసెట్‌కు 67,361 దరఖాస్తులు వచ్చాయని, గత ఏడాదితో పోలిస్తే 1,700 దరఖాస్తులు పెరిగినట్లు పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 18 నుంచి హాల్‌టికెట్లు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 27, 28 తేదీల్లో మూడు సెషన్లలో టీఎస్ ఐసెట్–2022 నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ప్రత్యక్ష బోధన, హాస్టల్ వసతి కావాలి
కేయూ క్యాంపస్ (వరంగల్): కాకతీయ యూనివర్సిటీలో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ విద్యార్థులకు ప్రత్యక్ష విద్యాబోధన, హాస్టల్ వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, బీఎస్ఎఫ్, ఏబీఎస్ఎఫ్, ఏబీవీపీ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న వర్సిటీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హాస్టళ్ల మరమ్మతులు పూర్తికాగానే హాస్టల్ సౌకర్యంతోపాటు ప్రత్యక్ష విద్యాబోధన ఉంటుందని రిజిస్ట్రార్ విద్యార్థులను సముదాయించే ప్రయత్నం చేశారు. మరమ్మతులు తొలుత ఈ నెల 7నాటికి పూర్తి చేస్తామని, ఆ తర్వాత 16వరకు అని చెప్పారని, ఇంకా ఎన్నిరోజులు చేస్తారని రిజిస్ట్రార్‌తో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. ఈ దశలో విద్యార్థులు పరిపాలనా భవనంలోనికి చొచ్చుకెళ్లేయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు ఆగ్రహంతో మొక్కల కుండీలను పగలగొట్టారు. రిజిస్ట్రార్ చాంబర్‌లోని కుర్చీలను ఎత్తిపడేశారు. చివరికి జూలై 4వతేదీ వరకు మరమ్మతులు పూర్తిచేసి హాస్టల్ వసతి కల్పిస్తామని, లేకుంటే తన పదవికి రాజీనామా చేస్తానని రిజిస్ట్రార్ హామీనివ్వడంతో విద్యార్థులు అక్కడినుంచి వెళ్లిపోయారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నేతలు పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణకు ఒక్కరోజు ముందు పదోన్నతి
కేయూ క్యాంపస్: ఈ నెల 31న ఉద్యోగ విరమణ ఉండగా 30వ తేదీన ప్రమోషన్ ఇచ్చారు కాకతీయ వర్సిటీ అధికారులు. యూనివర్సిటీలో పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వివిధ విభాగాల ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించాలని అకుట్ బాధ్యులు విన్నవించినా అధికారులు జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో అర్హులైన ముగ్గురు ప్రొఫెసర్లు పదోన్నతి పొందకుండానే ఉద్యోగ విరమణ చేశారు. జియాలజీ ప్రొఫెసర్ కె.డేవిడ్ కూడా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్నారు. దీంతో ఎట్టకేలకు వర్సిటీ అధికారులు సోమవారం సబ్జెక్టు ఎక్స్‌పర్ట్‌ను పిలిపించి ఇంటర్వ్యూ నిర్వహించి సీనియర్ ప్రొఫెసర్‌గా పదోన్నతి కల్పించారు. వీసీ తాటికొండ రమేశ్, పాలక మండలిసభ్యుల సమక్షంలో రిజిస్ట్రార్ వెంకట్రామ్రెడ్డి సోమవారం సాయంత్రం డేవిడ్‌కు పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. రమేశ్ వీసీగా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం గడిచినా, సీనియర్ ప్రొఫెసర్ల ప్రమోషన్స్‌లో జాప్యం చేసి ఉద్యోగ విరమణకు ఒకరోజు ముందు పదోన్నతి కల్పించడం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. -
కేయూ క్యాంపస్.. కామన్మెస్లో ఏం జరుగుతోంది?
సాక్షి, కేయూ క్యాంపస్(వరంగల్): కాకతీయ యూనివర్సిటీలోని కామన్మెస్లో క్యాజువల్ ఉద్యోగి (సూపర్వైజర్) నిరంజన్‌రెడ్డిపై హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ మంజుల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈనెల 16న కామన్మెస్కు వచ్చిన మంజుల ‘నిన్ను లా కళాశాల హాస్టల్‌కు ట్రాన్స్ఫర్ చేశాను. ఇక్కడ్నుంచి వెళ్లు గెటవుట్’ అంటూ నిరంజన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘నేను ఏం తప్పుచేశానో చెప్పాలి, నిరూపించాలి’ అని సూపర్వైజర్ నిరంజన్‌రెడ్డి హాస్టళ్ల డైరెక్టర్‌తో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో క్యాజువల్ ఉద్యోగి కామన్మెస్ సూపర్వైజర్గా నిరంజన్‌రెడ్డి కొన్నేళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల కామన్మెస్కు సంబంధించిన పలు విషయాలను హాస్టళ్ల సూపరింటెండెంట్, హాస్టళ్ల డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. కేయూలోని ఓ నాన్బోర్డర్కు నిరంజన్‌రెడ్డికి మధ్య గతంలో కొన్ని విబేధాలున్నాయి. నాన్బోర్డర్లను కామన్ మెస్‌లోకి రాకుండా నిరంజన్‌రెడ్డి అడ్డుకుంటున్నట్లు, దీంతో ఓ నాన్బోర్డర్ కామన్మెస్ విధుల నుంచి నిరంజన్‌రెడ్డిని తొలగించాలని డైరెక్టర్‌తో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతటితో ఆ నాన్బోర్డర్ ఆగకుండా.. నీతో కామన్మెస్ విధుల నుంచి తొలగించి చిప్పలు కడిగిస్తానని అని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే డైరెక్టర్ మంజుల కామన్ మెస్‌కు వచ్చి నిరంజన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేయడం, లా కళాశాల హాస్టల్‌కు ట్రాన్స్ఫర్ చేశామని చెప్పడం, ఆ తర్వాత నిరంజన్‌రెడ్డి విధులకు హాజరవకపోవడం ప్రస్తుతం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. -
కాకతీయ యూనివర్సిటీలో ఆందోళన
-
ఐసెట్‌లో 90.09% ఉత్తీర్ణత
కేయూ క్యాంపస్: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్ ఐసెట్–21 ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి, కేయూ వీసీ ఆచార్య తాటికొండ రమేష్, టీఎస్ఐసెట్ చైర్మన్ ఆచార్య కె.రాజిరెడ్డితో కలిసి విడుదల చేశారు. మొత్తం 66,034మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా, 56,962 మంది పరీక్ష రాశారు. వారిలో 51,316 మంది (90.09) ఉత్తీర్ణత సాధించారని లింబాద్రి తెలిపారు. పురుషుల విభాగంలో 28,848 మందికిగాను 26,057 మంది ఉత్తీర్ణత (90.33శాతం) సాధించారు. మహిళా విభాగంలో 28,111 మందికిగాను 25,256 మంది (89.84 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ట్రాన్స్జెండర్లు ముగ్గురు రాయగా, ముగ్గురూ ఉత్తీర్ణత సాధించారు. తెలంగాణ, ఏపీ కలిపి నిర్వహించిన ఈ పరీక్షలో హైదరాబాద్‌కు చెందిన ఆర్.లోకేష్ 155.36716 మార్కులతో మొదటి ర్యాంకు సాధించారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ టి.పాపిరెడ్డి, కేయూ రిజిస్ట్రార్ బి.వెంకట్రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఐఏఎస్ కావాలనేది లక్ష్యం.. నేను ఐఏఎస్ కావాలనే లక్ష్యంగా సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా. టీఎస్ఐసెట్ను సివిల్స్ ప్రిపరేషన్లో భాగంగా రాశాను. 155 మార్కులతో మొదటిర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే బీటెక్ ఈసీఈ పూర్తిచేశాను. – ఆర్.లోకేష్, మొదటి ర్యాంకర్. బ్యాంకు మేనేజర్ కావాలనేది లక్ష్యం.. నేను బీటెక్ ఈఈఈ 2020లోనే పూర్తి చేశా. అప్పటినుంచి బ్యాంకు మేనే జర్ కావాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నా. ఎంబీఏ కూడా చదువుకోవాలనే టీఎస్ఐసెట్ రాశాను. రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు వస్తుందని ఊహించలేదు. రెండో ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఓయూలో ఎంబీఏలో చేరుతా. – పామడి సాయి తనూజా, రెండో ర్యాంకర్. ఫైనాన్స్ మేనేజ్మెంట్లో చేరుతా.. నేను గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్నా. ఐసెట్‌లో మూడవ ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. సీబీఐటీలో ఫైనాన్స్ మేనేజ్మెంట్ కోర్సులో చేరతాను. – నవీనాక్షంత, మూడో ర్యాంకర్. -
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదల
సాక్షి, వరంగల్: తెలంగాణ ఐసెట్ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి విడుదల చేశారు. వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో గురువారం ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 56,962 మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా 51,316 మంది అర్హత సాధించారు. ఉత్తీర్ణత 90.09 శాతం నమోదైంది. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి: రేపు ఢిల్లీకి సీఎం కేసీఆర్.. హస్తినలో మూడు రోజులపాటు ర్యాంకులు ఇలా.. హైదరాబాద్‌కు చెందిన లోకేశ్ మొదటి ర్యాంక్ సాధించాడు. రెండో ర్యాంక్ హైదరాబాద్ విద్యార్థి పమిడి సాయి తనూజ, మల్కాజిగిరికి చెందిన నవీన్ కృష్ణన్ మూడవ ర్యాంక్, హైదరాబాద్ నుంచి ఆర్.నవీనశాంత, తుమ్మ రాజశేఖర నాల్గో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ పరీక్ష ఫలితాలు వెలువడిన వెంటనే ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం షెడ్యూల్ విడుదల చేస్తామని ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
ఇది ఆత్మహత్యకాదు.. ప్రభుత్వ హత్య!
హైదరాబాద్: ఆత్మహత్యకు పాల్పడిన కేయూ విద్యార్థి సునీల్‌నాయక్ మృతి చెందడం పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్య అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. తెలంగాణలో ఇక ఉద్యోగాలు రావని, పోరాటం చేయాలని, తాను బతికి వస్తే మీతో కలుస్తానని సునీల్ నాయక్ పిలుపునివ్వడం రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్యానికి పరాకాష్ట అని శుక్రవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. నిరుద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని, కేసీఆర్ మెడలు వంచి ఉద్యోగాలు సాధించుకుందామని ఆ ప్రకటనలో ఉత్తమ్ వెల్లడించారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్లనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని, పట్టభద్రుడు సునీల్ నాయక్ ఆత్మహత్య కేవలం కేసీఆర్ సర్కార్ చేతగానితనంతోనే జరిగిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి వారి ఆత్మహత్యలకు కారణమయిన కేసీఆర్ అండ్ కో, ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగాలివ్వకుండా వారి చావులకు కారణమవుతున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. సునీల్‌కు నివాళి... ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ నేతృత్వంలో పలువురు సునీల్ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం శ్రవణ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇది అత్యంత దుర్దినమని, కలెక్టర్ అవుతానన్న గిరిజన బిడ్డ కాటికి పోవడం తమను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాంపల్లి ప్రధాన రహదారిపై సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ డౌన్‌డౌన్... మా ఉద్యోగాలు–మాక్కావాలి అంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎర్రబెల్లి ఇంటి ముట్టడి సునీల్ మృతి వార్త ఉమ్మడి వరంగల్‌లో దావానలంలా వ్యాపించింది. విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. సునీల్ ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ ధర్నా లు, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చేపట్టడంతో పలుచోట్ల ఉద్రిక్తత చోటు చేసుకుంది. హన్మకొండలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటిని ముట్టడించిన విద్యార్థి సంఘాలు ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశా యి. ఇంటి ఆవరణలోని సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు ఇంటిపైకి రాళ్లు రువ్వారు. పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇదిలాఉండగా, సునీల్ మృతదేహం శుక్రవారం సాయంత్రం తండాకు చేరుకోగా.. ఎమ్మెల్యే సీతక్క, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు గ్రామస్తులతో కలసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంబులెన్స్ ముందు బైఠాయించారు. సునీల్ కుటుంబానికి రూ.కోటి పరిహారం కావాలంటూ డిమాండ్ చేశారు. అండగా ఉంటాం: ఎర్రబెల్లి సాక్షి, హైదరాబాద్: ఉద్యోగం రాలేదన్న బాధ, ఆందోళనతో ఆత్మహత్యకు పాల్పడిన కాకతీయ వర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్ మృతి పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతాపం ప్రకటించారు. సునీల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ కుటుంబానికి సునీల్ లేని లోటు తీర్చలేనిదని, వారికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని చెప్పారు. -
హాస్టళ్ల మూసివేతపై ఉద్రిక్తత
కేయూ క్యాంపస్ (వరంగల్): కరోనా కట్టడికిగాను విద్యాసంస్థలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కాకతీయ విశ్వవిద్యాలయానికి కూడా సెలవులు ప్రకటించారు. అలాగే, బుధవారం మధ్యాహ్నం భోజనం అనంతరం వసతిగృహాలను కూడా మూసి వేయనున్నట్లు చెప్పడం.. మరోవైపు పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొనడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అధికారులు, విద్యార్థులకు మధ్య స్వల్ప ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరీక్షలు నిర్వహిస్తూ హాస్టళ్లను మూసివేస్తే తామెక్కడ ఉండాలంటూ విద్యార్థులు ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆవరణ నుంచి కేయూ క్రాస్ రోడ్డు వరకు వెళ్లి రాస్తారోకో చేశారు. ఆందోళన కారణంగా రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో అధికారులు యూనివర్సిటీ పరిధిలోని అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
కేయూలో వివాదం.. నాన్‌బోర్డర్స్ వీరంగం
సాక్షి, వరంగల్ : చారిత్రక కాకతీయ యూనివర్సిటీలో మరో వివాదం చోటుచేసుకుంది. సౌత్ జోన్, ఆల్ ఇండియా, ఇంటర్ యూనివర్సిటీ పోటీల సందర్భంగా రాజుకున్న గొడవ.. కొట్లాట వరకు వెళ్లింది. స్థానిక విద్యార్థులు, అధికారుల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. గద్వాల్ జిల్లాకు చెందిన గల్లా వెంకటేష్ ఆయన సోదరి కాకతీయ యూనివర్సిటీలో విద్యానభ్యసిస్తున్నాడు. ఇటీవల జాతీయ స్థాయి యూనివర్సిటీ గేమ్స్ లో పాల్గొన్న వెంకటేష్ సోదరి పట్ల కొందరు సహా విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తించారు.ఈ ఘటనపై వెంకటేష్ కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సురేష్ లాల్‌కి పిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే గురువారం రోజున స్పోర్ట్స్ విభాగంలో మహిళా విద్యార్థులకు ట్రాక్ షూట్స్ పంపిణీ చేశారు. ఈ సమయంలో తన సోదరిపై వేధింపులకు పాల్పడిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని డైరెక్టర్ సురేష్ లాల్‌ను వెంకటేష్ గట్టిగా నిలదేశాడు. దీంతో అప్పటికే డైరెక్టర్ ఛాంబర్ లో ఉన్న కొందరు నాన్ బోర్డర్స్ వెంకటేష్‌పై మూకుమ్మడిగా పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డారు. జరిగిన ఘటనపై బాధితుడు కేయూ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాడు. మరోవైపు డైరెక్టర్ సురేష్ లాల్‌పై చర్యలు తీసుకోవాలని, విధుల నుంచి తొలగించాలని విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. విద్యార్థులపై బయటి వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటనపై విద్యార్థి సంఘాలు ఆగ్రహంతో ఆందోళనలుకు సిద్ధమవుతుండడంతో కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో యాజమాన్యం సైతం తగిన చర్యలను సిద్ధమవుతోంది. -
పీజీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు
సాక్షి, కేయూ క్యాంపస్(వరంగల్) : కాకతీయ యూనివర్సిటీలోని అన్ని విభాగాల పీజీ విద్యార్థులకు ఆన్లైన్లో తరగతులు బోధించాలని రిజిస్ట్రార్ ఆచార్య పురుషోత్తం సూచించారు. కేయూలోని విభాగాధిపతులతో ఆయన ఆన్లైన్ ద్వారా గురువారం సమీక్షించారు. ఈనెల 1వ తేదీ నుంచే ఆన్లైన్ పాఠాల బోధన ప్రారంభం కావాల్సి ఉందన్నారు. ఇకనైనా త్వరగా విద్యాబోధన చేపట్టేందుకు విద్యార్థులతో వాట్సాప్ గ్రూపులు సిద్ధం చేయాలని తెలిపారు. ఆ వెంటనే జూమ్ యాప్ లేదా గూగుల్ మీట్ ద్వారా తరగతులు నిర్వహించాలని, అవసరం మేరకు ఎంపిక చేసిన పార్ట్ టైం లెక్చరర్ల జాబితా అందిస్తే ఉత్తర్వులు ఇవ్వనున్నామని వెల్లడించారు. మేం సిద్ధమే కానీ... పలువురు విభాగాధిపతులు మాట్లాడుతూ ఆన్లైన్ తరగతుల నిర్వహణకు తాము సుముఖంగానే ఉన్నా విభాగా ల్లో కొందరు అధ్యాపకులు సంతకాలు చేసి ఇళ్లకు వెళ్లిపోతున్నారని రిజిస్ట్రార్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ కోవిడ్ దృష్ట్యా ఇళ్లకు వెళ్లి ఉంటే అక్కడి నుంచే పాఠాలు బోధించేలా విభాగాధిపతులు పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే, విద్యార్థులతో కూడా తరచుగా మాట్లాడాలని తెలిపారు. డిగ్రీ సెమిస్టర్ల విద్యార్థులు ప్రమోట్ కేయూ పరిధిలోని డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ రెండో సెమిస్టర్ విద్యార్థులను మూడో సెమిస్టర్‌కు, నాలుగో సెమిస్టర్ విద్యార్థులను ఐదో సెమిస్టర్‌కు ప్రమో ట్ చేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ పురుషోత్తం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ నేపథ్యంలో పరీక్షలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో యూజీసీ నిబంధనల మేరకు కేయూ డీన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా విద్యార్థులను ప్రమోట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత మళ్లీ.. ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు
సాక్షి, వరంగల్: జై భారత్.. జై జవాన్.. జై కిసాన్ నినాదంతో విద్యారంగ సమస్యలు, వ్యవసాయంలో రైతులకు గిట్టుబాటు ధరలు తదితర సామాజిక సమస్యలపై చర్చించేందుకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) 38వ రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నారు. వరంగల్‌లోని కేయూ ఆడిటోరియం వేదికగా మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు ఈ సభలు జరుగుతాయి. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, గతంలో 2008 లో హన్మకొండలోని ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల ఆడిటోరియంలో ఏబీవీపీ రాష్ట్ర మహాసభలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు వరంగల్ వేదికగా నిలుస్తోంది. రెండు వేలమంది ప్రతినిధులు.. కేయూలో మంగళవారం నుంచి నిర్వహించనున్న ఏబీవీపీ రాష్ట్ర మహాసభలకు రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి ఎంపిక చేసిన రెండు వేలమంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో సుమారు 8లక్షల సభ్యత్వం కలిగిన ఏబీవీపీలో రాష్ట్ర, జిల్లా, మండల, కళాళాశాల బాధ్యులు ప్రతినిధులుగా హాజరవుతారు. వీరి కోసం కేయూలో పలుచోట్ల వసతి ఏర్పాట్లు చేశారు. చర్చించనున్న అంశాలు ఇవే.. రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్రంలోని పాఠశాల, కళాశాలల స్థాయి నుంచి యూనివర్సిటీల్లో నెలకొన్న సమస్యలపై చర్చించనున్నారు. రేషనలైజేషన్ పేరుతో పాఠశాలల మూసివేత, యూనివర్సిటీల్లో అధ్యాపకులు, ఉద్యోగుల ఖాళీలు, వీసీల భర్తీలో ఆలస్యం, ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతి, సంక్షేమ హాస్టళ్ల సౌకర్యాల కల్పన, స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు తదితర అంశాలపై చర్చించి తీర్మానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందజేయనున్నారు. మొదటిరోజు కేవలం జెండా ఆవిష్కరణ.. నాలుగు రోజుల పాటు జరిగే ఏబీవీపీ మహాసభల్లో భాగంగా మంగళవారం తొలిరోజు సాయంత్రం 6గంటలకు సభాప్రాంగణం వద్ద ఏబీవీపీ జెండాను రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మీసాల ప్రసాద్.. రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్‌తో కలిసి ఆవిష్కరిస్తారు. ఏబీవీపీ ప్రముఖ్ మాసాడి బాబురావు పాల్గొంటారు. ఇక రెండో రోజైన బుధవారం రాష్ట్ర మభసభలను ఉద్ధేశించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఏబీవీపీ జాతీయ సంఘటసహాకార్యదర్శి కేఎన్ రఘునందన్ పాల్గొననుండగా.. అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తారు. మూడో రోజైన గురువారం మధ్యాహ్నం 3గంటలకు కేయూ నుంచి ఏకశిలా పార్కు వరకు శోభాయాత్రగా వెళ్లి అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభలో ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి,న్రాష్ట్ర నూతన అధ్యక్షడు శంకర్ పాల్గొని ప్రసంగిస్తారు. మహాసభలను విజయవంతం చేయాలి.. కేయూలో మంగళవారం నుంచి జరగనున్న ఏబీవీపీ 38వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని స్వాగత సమితి అధ్యక్షుడు డాక్టర్ నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. కేయూలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సభల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయని.. ఈ సందర్భంగా విద్యారంగ, సామాజిక అంశాలపై చర్చిస్తామని తెలిపారు. మహాసభల కన్వీనర్ ఏలేటి నాగరాజు, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్, కేయూ అధ్యక్షుడు చట్ట సతీష్, నగర కార్యదర్శి భరత్ పాల్గొన్నారు. 1970 దశకం నుంచే ఏబీవీపీ.. స్వాతంత్రనంతం 1949, జూలై 9న ఐదుగురు విద్యార్థులతో ప్రొఫెసర్ బెహల్ ఢిల్లీలో విశ్వవిద్యాలయంలో ఏబీవీపీ ఏర్పాటైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1970 దశకం నుంచి ఎక్కువగా ఏబీవీపీ విస్తరణ యూనివర్సిటీల్లో జరిగింది. అప్పటి నుంచే వరంగల్ ప్రాంతంలోనూ ఏబీవీపీ విద్యారంగ సమస్యలపై పోరాడుతూనే విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు కృషి చేస్తోంది. 1982లో కేయూలో జాతీయ జెండాకు అవమాన జరిగిందంటూ సామ జగన్మోహన్రెడ్డి న్యాయపోరాటం చేస్తూ అసువులు బాశారు. ఆయన స్ఫూర్తిగా ముందుకెళ్తూ విద్యారంగ, సామాజిక సమస్యలపై పోరాడుతోంది. -
కేయూలో ఉద్రిక్తత; విద్యార్థులపై లాఠీచార్జి
సాక్షి, వరంగల్ అర్బన్: జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావారణం నెలకొంది. నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళితే.. కాకతీయ యూనివర్సిటిలో డిగ్రీ సిలబస్ ఇంకా పూర్తికాకముందే సెమిస్టర్ పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతందని ఏబీవీపీ విద్యార్థులు బుధవారం ఆందోళనకు దిగారు. 90 రోజుల షెడ్యూల్ క్లాసులు పూర్తిగా జరగకముందే పరీక్షలు పెట్టడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్ చాంబర్ ముందు విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఎంతసేపు నిరసన చేపట్టినప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో విద్యార్థులు లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్‌కు దిగారు. కాగా శాంతియుతంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై పోలీసులు లాఠీ ఝలిపించడం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
హక్కుల ఉద్యమ కరదీపిక
‘అందరికీ ఒకే విలువ ‘ అన్న అంబేడ్కర్ కాగడాను స్వతంత్ర భారత హక్కుల ఉద్యమ చరి త్రలో మూడు దశాబ్దాల పాటు కొనసాగించిన అసాధారణ వ్యక్తి బాలగోపాల్. మేధావిగా, రచయితగా, కార్యకర్తగా ఉన్నత మానవ విలువల దిశగా సమాజాన్ని మార్చడం కోసం ప్రజాతంత్ర ఉద్యమాల హక్కుల పరిరక్షణ ఉద్యమాల నిర్మాణంలో చిరస్మరణీయ పాత్రను పోషించాడు. జూన్ 10, 1952లో పార్థనాధ శర్మ, నాగమణి దంపతులకు బళ్లారిలో జన్మించిన బాలగోపాల్ నెల్లూరు, తిరుపతిలో పాఠశాల, కళాశాల విద్యను పూర్తి చేసుకున్నాడు. రీజనల్ ఇంజనీరింగ్ కళాశాల వరంగల్‌లో ఎంఎస్సీ అప్లయిడ్ మాథ్‌్సను, అలాగే స్వల్పకాలంలో పీహెచ్‌డీని పూర్తి చేసిన అసాధారణ ప్రతిభావంతుడు. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్సిస్టిట్యూట్ ఢిల్లీ నుండి పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్‌ను సాధించాడు. తెలంగాణ రైతాంగ సాయుధపోరు, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరు, నక్సల్బరీ పోరాటలకు భూకంప కేంద్రంగా ఎరుపెక్కిన వరంగల్ బాలగోపాల్‌లో తీవ్రమైన మేధోమథనాన్ని కల్గించింది. శివసాగర్, కాళోజీ, కేఎస్, వరవరరావు వంటి ఉద్యమ సారథులతో పరిచయాలు, సాన్నిహిత్యం, మార్క్స్, గ్రాంసీ, రస్సెల్ తత్వశాస్రా్తల అధ్యయనంతో నిబద్ధత, సామాజిక బాధ్యతతో పనిచేసే అధ్యాపకునిగా మారిపోయాడు. 1981–1985 వరకు కాకతీయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేశాడు. దున్నేవారికే భూమి కావాలనే పోరాటకారులను బూటకపు ఎన్కౌంటర్లతో అంతం చేయడాన్ని తీవ్రంగా ప్రతిఘటించాడు. ప్రభుత్వమైనా, ఉద్యమసంస్థలైనా జీవించే హక్కును కాలరాయడం అమానవీయమైన నేరంగా ప్రకటించాడు. 1984లో పౌరహక్కుల సంఘ ప్రధాన కార్యదర్శిగా మరింత క్రియాశీలకంగా పనిచేశాడు. ప్రజల డాక్టర్ రామనాథం హత్య తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయి కార్యకర్తగా మారాడు. తన సహచరులు నర్రా ప్రభాకర్ రెడ్డి, అజం ఆలీ, లక్ష్మారెడ్డిలను కోల్పోయినా చెదరని స్థైర్యంతో హక్కుల ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించాడు. ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడే రాజ్యాంగంలోని 5, 6 షెడ్యూళ్లను పటిష్టంగా అమలు చేయాలని కోరాడు. అనుమానం ఉంటే చాలు.. చంపేసే ‘సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం’ను ఉపసంహరించాలని కోరాడు. తన జీవిత కాలంలో సందర్శించిన ఏకైక దేశం’ జమ్మూకశ్మీర్ అని ప్రకటించాడు. కశ్మీర్ రాజా హరిసింగ్‌తో కుదుర్చుకున్న షరతుల ఒప్పం దాన్ని భారత పాలకులు ఉల్లంఘించడం వల్లే కలల లోయ కల్లోల లోయగా మారిందని, 1995 నుంచి 2005 వరకు ఐదుసార్లు కశ్మీర్లో పర్యటించి వాస్తవాలను ప్రపంచానికి తెలియచేశాడు. బ్రిటిష్ కాలంనుంచి ఇప్పటిదాకా దేశం సాధించిన అభివృద్ధి పేరుతో జరిగిన విధ్వంసాలకు అధికంగా నష్టపోతున్నది గిరిజనులేనని, ఎక్కువగా తిరుగుబాట్లు చేసిందీ వారేనని చెప్పాడు. ఇంద్రవెల్లి నుండి వాకపల్లి వరకు ఆదివాసీలపై జరిగే దాడులను ఖండిస్తూ వారి ఉద్యమాలకు సంఘీభావం ప్రకటిస్తూ న్యాయ సహాయాన్ని అందించాడు. కృష్ణా, గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు న్యాయమైన వాటా దక్కడం లేదని, ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్ర డిమాండ్ అత్యంత ప్రజాస్వామికమని చెప్పాడు. సామాజిక ప్రయోజనార్థం అంబేడ్కర్ తర్వాత అధికంగా రాసిన వ్యక్తిగా బాలగోపాల్ ప్రఖ్యాతి గాంచాడు. దుఃఖిత మానవాళిపై అనుకంపన, విసుగు ఎరగని, విరతి లేని జ్ఞానాన్వేషణతో సామాజిక కార్యకర్తలకు కరదీపిక అయ్యాడు. తల్లిదండ్రులకు, గురువుకు, దేశానికి ప్రతి మనిషీ రుణపడి ఉంటాడు. మేధావికి మరో రుణం కూడా ఉంది. తన తలను పొలంగా మార్చి, దున్ని ఎరువులు వేసి పంట లను ప్రజలకు పంచడం. ఇది తీర్చవలసిన బాకీ. తల బీడు పడిపోయేదాక, ఆ తర్వాత ప్రపంచం శాశ్వతంగా ఆ మేధావికి బాకీ పడి ఉంటుంది. బాలగోపాల్‌ను ప్రేమిద్దాం, కొనసాగిద్దాం. (నేడు బాలగోపాల్ 10వ వర్ధంతి) వ్యాసకర్త : అస్నాల శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం సభ్యులు సెల్ : 96522 75560 -
సుమార్గ్ శిక్షణతో అద్భుత ఫలితాలు
సాక్షి, కేయూ క్యాంపస్: పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో యువత ప్రభుత్వ పోటీ పరీక్షల్లో రాణించేందుకు ఏర్పాటుచేసిన సుమార్గ్ ఉచిత శిక్షణలో అద్భుత ఫలితాలు సాధించామని వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ తెలిపారు. సుమార్గ్ ఉచిత శిక్షణ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందిన సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు సాధిం చిన యువతకు సోమవారం కాకతీయ యూనివర్సిటీలోని సేనెట్‌హాల్‌లో అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు సీపీ ముఖ్యఅతిథిగా సీపీ హాజరై మాట్లాడారు. సుమార్గ్ రెండోవిడత ఉచిత శిక్షణ తరగతులకు 300ల మంది యువతను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వగా 250 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారన్నారు. ఇందులో ప్రధానంగా సబ్ ఇన్స్పెక్టర్లు 40మంది, కానిస్టేబుళ్లుగా 165మంది, మరో 49మం ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా శిక్షణ అందించిన అభ్యర్థుల్లో 80శాతం మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ప్రధమస్థానంలో నిలిచిందన్నారు. మీరు ప్రతిభతో సాధించిన ఉద్యోగంతో సంతృప్తి చెందకుండా మరింత ఉన్నతస్థాయికి ఎదిగే విధంగా కృషిచేయాలని ఆయన కోరారు. సుమార్గ్ శిక్షణ అందించటంలో పూర్తి సహకారం అందించిన ప్రతిఒక్కరికి అభినందనలు తెలిపారు. అనంతరం శిక్షణ పొంది ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువతకు పోలీస్ కమిషనర్ చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు. అంతేగాకుండా శిక్షణ ఇచ్చిన పోలీస్ అధికారులకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు డీసీపీ గిరిరాజు, ఎసీపీలు శ్రీధర్, శ్యాంసుందర్, శ్రీనివాస్, ఆర్ఐ సతీష్, హతీరాం, శ్రీనివాస్‌రావు, నగేష్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్, కేయూ పోలీస్టేషన్ ఇన్స్పెక్టర్ డేవిడ్‌రాజు పాల్గొన్నారు. -
కేయూలో అధికారి సంతకం ఫోర్జరీ
సాక్షి, కేయూ: కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగంలోని పీజీ సెక్షన్లో క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్న ఒకరు అధికంగా సొమ్ము సంపాదించాలనే ఆశతో అక్రమానికి తెగపడ్డాడు. ఏకంగా అదనపు పరీక్షల నియంత్రణాధికారి సంతకం ఫోర్జరీ చేసి.. వాల్యుయేషన్ చేసినట్లుగా కొందరు అధ్యాపకుల పేర్లతో బిల్లులు తీసుకునేందుకు యత్నించాడు. అయితే, ఈ బిల్లును పరీక్షల విభాగంలోని అకౌంట్స్ విభాగం అధికారులు గుర్తించడంతో సదరు క్యాజువల్ లేబర్ మోసం బయటపడింది. ఈ మేరకు ఆయనను తొలగిస్తూ రిజిస్ట్రార్ కె.పురుషోత్తం శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పీజీ పరీక్ష జవాబుపత్రాలు దిద్దినట్లుగా... కేయూ పీజీ కోర్సుల వివిధ సెమిస్టర్ పరీక్షలు జరిగాక జవాబుపత్రాల వాల్యూయేషన్ చేయిస్తారు. ఇందులో పాల్గొ నే అధ్యాపకులు తాము ఎన్ని పేపర్లు దిద్దామో చెబుతూ బిల్లులు సమర్పించాలి. వీటిని తొలుత అదనపు పరీక్షల నియంత్రణాధికారి పరిశీలించి సంతకం చేస్తే అకౌంట్స్ విభాగం ఉద్యోగులు పాస్ చేసి అకౌంట్లలో రెమ్యూనరేషన్ జమ చేస్తారు. దీనిని పరీక్షల విభాగం పీజీ సెక్షన్లో కొన్నేళ్ల నుంచి క్యాజువల్ లేబర్‌గా పనిచేసే రవి అనే వ్యక్తి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. వివిధ సెమిస్టర్ల పరీక్షల జవాబుపత్రాలు ముగ్గురు అధ్యాపకులు వాల్యూయేషన్ చేసినట్లుగా.. ఒకరు ఓయూ అధ్యాపకుడు, మరో ఇద్దరు కేయూ అధ్యాపకుల పేరిట దొంగ బిల్లులు తయారు చేశాడు. మూడు బిల్లులు కలిపి రూ.37వేలకు పైగా సమర్పించాడు. ఆ బిల్లులపై ఏకంగా అదనపు పరీక్షల నియంత్రణాధికారి సురేఖ సంతకం పోర్జరీ చేశారు. ఆ తర్వాత బిల్లులును ఇటీవల పరీక్షల విభాగంలోని అకౌంట్స్ విభాగంలో అందజేయగా అక్కడి ఉద్యోగులకు అనుమానం వచ్చింది. ముగ్గురు అధ్యాపకుల పేరిట సమర్పించిన బిల్లుల్లో పక్కన ఒకే బ్యాంకు అకౌంట్ నంబర్ ఉండడంతో ఆరా తీయగా అది రవి భార్య అకౌంట్‌గా తేలింది. దీంతో విషయాన్ని గుర్తించి బిల్లులు ఆపేయడంతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, పాత బిల్లులను కూడా పరిశీలించగా గత ఏడాది కూడా దొంగబిల్లు సమర్పించి రూ.2,600 కాజేసినట్లు తేలింది. క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశాలు కాకతీయ యూనివర్సిటీ పరీక్షల విభాగంలోని పీజీ సెక్షన్లో క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్న రవి వ్యవహారాన్ని అధికారులు ఇన్చార్జి వీసీ జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రవిని తొలగించాలని సూచించగా కేయూ రిజిస్ట్రార్ ఆచార్య కె.పురుషోత్తం, పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎస్.మహేందర్‌రెడ్డిని శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా సంతకాన్ని ఫోర్జరీ చేసినందుకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
నాణ్యమైన విద్య అందించాలి
సాక్షి, కేయూ క్యాంపస్: రాష్ట్రంలో పాఠశాల నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రమాణాలు పెంపొందించి నాణ్యమైన విద్య అందించాల్సిన అవసరం ఉందని పాఠశాల విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ, కేయూ ఇన్చార్జి వీసీ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి అన్నారు. ప్రధానంగా హాజరు శాతం పెంచేలా కృషి చేయాలని, అధ్యాపకులు స్వీయ మూల్యం కణం బేరీజు వేసుకోవాలని సూచించారు. కేయూ ఇన్చార్జి వీసీగా నియామకమైన తర్వాత తొలిసారి సోమవారం క్యాంపస్‌కు వచ్చిన ఆయన అన్ని విభాగాల అధ్యాపకులతో నిర్వహంచిన సమావేశంలో మాట్లాడారు. కొందరు పాఠశాల విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు లేవని, సబ్జెక్టుల అంశాలు చెప్పలేక పోతున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 29 లక్షల మంది విద్యార్థులు ఉండగా నిత్యం 30శాతం మంది గైర్హాజరవుతున్నారని తెలిపా రు. ఇదే పరిస్థితి కళాశాల విద్యలోనూ ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కేయూలో హాజరుశాతం గురించి అడగ్గా సైన్స్ విభాగాల్లో 80 శాతం, ఆర్ట్స్ విభాగాల్లో 50 శాతం ఉందని ఆయా విభాగాల అధిపతులు తెలిపారు. పీజీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని తీరిక సమయాలు, సెలవుల్లో వారికి విద్యాబోధన చేయాలని, ఇందుకు వర్సిటీల హెచ్వోడీలు అధ్యాపకులు సహకరించాలని అన్నా రు. వనరుల కొరత సాకుగా చూపకుండా కౌన్సిలర్ సిస్టం అమలు చేయాలని తెలిపారు. ఫార్మాసీ విభాగం ప్రొఫెసర్ ఎం.సారంగపాణి మాట్లాడుతూ కేయూలో 391 అధ్యాపక పోస్టులకు 128 మంది పనిచేస్తున్నారని పలు విభాగా ల్లో ఇద్దరు ముగ్గురే ఉన్నారని, రిటైర్ అయిన సీనియర్ ప్రొఫెసర్ల సేవలను వినియోగించుకుంటే బాగుంటుందని అనగా.. విభాగాల వారీ గా ఎంత మంది ఉన్నారు.. జాబితా తయారు చేయాలని వీసీ సూచించారు. అందులో ఉచితంగా సేవలను అందించే, గెస్ట్ ఫ్యాకల్టీలుగా ఉండేవారి జాబితా ఇస్తే ఉత్తర్వులు జారీ చేస్తానని చెప్పారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో వసతులకు నిధులు అవసరమని, అధ్యాపకుల కొరత ఉం దని కోఎడ్యూకేషన్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సి పాల్ పి.మల్లారెడ్డి తెలుపగా ప్రతిపాదనలు ఇస్తే వచ్చే ఏడాది బడ్జెట్లో నిధులను కేటాయించేలా చూస్తానని వీసీ హామీ ఇచ్చారు. ఎమ్మెస్పీ ఐదేళ్ల కోర్సుల విద్యార్థులకు బోధన చేయడానికి అధ్యాపకుల కొరత ఉందని కెమిస్ట్రీ విభాగం అధిపతి డాక్టర్ జి.హన్మంతు అనగా రెగ్యులర్ అధ్యాపకుల నియామకం అయ్యేవరకు గెస్ట్‌ఫ్యాకల్టీగానే తీసుకోవాలని సూచించారు. మీవద్ద ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయని అడగ్గా.. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా గాంధీయన్ స్టడీసెంటర్ ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని పొలిటికల్‌సైన్స్ విభాగం అధిపతి సంజీవరెడ్డి చెప్పగా.. సెమినార్లు, వర్క్‌షాప్‌ను నిర్వహించబోతున్నట్లు కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. మైక్రోబయాలజీ విభాగం అధిపతి డాక్టర్ సుజాత మాట్లాడుతూ బయాలజీ ఉపాధ్యాయులకు వర్క్‌షాప్ నిర్వహించబోతున్నామన్నారు. కేయూ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ కోల శంకర్ మాట్లాడుతూ కేయూలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఖాళీగా ఉన్న డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులను అర్హులకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాలని కోరారు. కేయూ టెక్నికల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పుల్లా శ్రీనివాస్, డాక్టర్ విష్ణువర్ధన్, కేయూ ఎన్జీవో జనరల్ సెక్రటరీ వల్లాల తిరుపతి, ఏఆర్ పెండ్లి అశోక్, డాక్టర్ మహేష్ తదితరులు వీసీతో మాట్లాడారు. సమావేశంలో రిజిస్ట్రార్ కె.పురుషోత్తంమాట్లాడారు. -
ఎల్ఎల్ఎం పరీక్ష రాసిన ఎమ్మెల్యే
సాక్షి, వరంగల్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి కాకతీయ యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం క్యాంపస్‌లోని దూరవిద్యా కేంద్రం భవనంలో నిర్వహించిన ఎల్ఎల్ఎం ఫైనలియర్ రెండో పేపర్ ఇన్సూరెన్స్ లా పరీక్షను ఆయన రాశారు. హన్మకొండలోని ఆదర్శ లా కళాశాలలో ఎల్ఎల్ఎం ఫైనల్ ఇయర్ చదవుతున్న ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరీక్షలు రాస్తున్నారు. ప్రజాప్రతినిధిగా బిజీగా ఉండే జీవన్‌రెడ్డి చదువు కొనసాగిస్తుండటం విశేషం. ఆర్మూర్ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం ఆయన రెండోసారి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. -
కేయూలో నకిలీ కలకలం
సాక్షి, కేయూ : కాకతీయ యూనివర్సిటీలో ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు రెండేళ్ల క్రితం సమర్పించిన టైప్‌రైటింగ్ సర్టిఫికెట్లు నకిలీవని తేలింది. ఈమేరకు యూనివర్సిటీ అధికారులు ఇటీవల హైదరాబాద్‌లోని స్టేట్ టెక్నికల్ బోర్డుకు సర్టిఫికెట్లను పంపించగా అక్కడి అధికారులు తాము జారీ చేసినవి కావని తేల్చిచెప్పారు. దీంతో ఆ ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లకు నోటీసులు ఇవ్వగా సమాధానం వచ్చినా చర్యలు తీసుకోకుండా తాత్సారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కారుణ్య నియామకాలు కింద... కాకతీయ యూనివర్సిటీలో కొన్నేళ్ల క్రితం ఇద్దరు కారుణ్య నియామకాల కింద టైపిస్టు కమ్ క్లర్క్‌లుగా నియమితులయ్యారు. ఆ సమయంలో వారి వద్ద టైప్‌రైటింగ్ ఉత్తీర్ణత పొందినట్లుగా సర్టిఫికెట్లు లేకపోయినప్పటికీ ఏడాదిలోగా ఉత్తీర్ణత సాధించాలనే నిబంధనతో పోస్టింగ్ ఇచ్చారు. అయితే, వారు గడువులోగా ఉత్తీర్ణత పొందకపోవడంతో ఇంక్రిమెంట్లో కోత విధించారు. ఆ తర్వాత స్టేట్ టెక్నికల్ బోర్డు ఇచ్చినట్లుగా చెబుతూ నకిలీ సర్టిఫికెట్లను సమర్పించారు. అయితే, వాటినిసరిగ్గా పరిశీలించకుండానే టైపిస్టు కమ్ క్లర్క్‌లుగా కొనసాగిస్తూ బెనిఫిట్స్ ఇచ్చారు. 2017లో పదోన్నతుల సందర్భంగా వీరిద్దరికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించగా ఒకరు క్యాంపస్‌లోని పరీక్షల విభాగంలో, మరొకరు కొత్తగూడెం ఇంజనీరింగ్ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారంటూ ఫిర్యాదు కాకతీయ యూనివర్సిటీలో వివిధ కేడర్లలో కారుణ్య నియామకాల సందర్భంగా, పదోన్నతుల పొందిన వారు నకిలీ సర్టిఫికెట్లు సమర్పించాలని ఉద్యోగ సంఘాల బాధ్యులు కొంతకాలం క్రితం అప్పటి వీసీ ఆచార్య సాయన్నకు ఫిర్యాదు చేశారు. తొలుత స్పందించకున్నా వీసీగా పదవీకాలం ముగియబోతున్న సమయంలో 12 మంది ఉద్యోగుల ఎస్సెస్సీ, ఇంటర్, డిగ్రీతో పాటు టైప్ రైటింగ్ కోర్సుల సర్టిఫికెట్లను పరిశీలన కోసం హైదరాబాద్‌కు పంపించారు. అయితే, ఇద్దరు సీనియర్ అసిస్టెంట్ల సర్టిఫికెట్లు నకిలీవనీ తేల్చారు. అయితే, ఇతర కేడర్లలోని మరో 12 మంది సర్టిఫికెట్లను కూడా పరిశీలనకు పంపించగా నివేదిక రావాల్సి ఉందని.. అందులోనూ ఇద్దరు, ముగ్గురు తప్పుడు సర్టిఫికెట్లు సమర్పించారనే ప్రచారం సాగుతోంది. కాగా, నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినట్లు తేలిన ఇద్దరికి కేయూ రిజిస్ట్రార్ ఆచార్య పురుషోత్తం నోటీసులు జారీచేశారు. ఆ నోటీసులకు వారు సమాధానం కూడా ఇచ్చారని సమాచారం. అయితే, సర్టిఫికెట్లు నకిలీవని తేలాక కూడా తేలాక నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముందే పరిశీలిస్తే... యూనివర్సిటీలో వివిధ కేడర్లలో ఉద్యోగాలు పొందినప్పుడు, పదోన్నతులు ఇచ్చినప్పుడే సర్టిఫికెట్లను పరిశీలించాల్సి ఉంటుంది. కానీ అలా చేయకపోవడంతో కొన్నేళ్ల తర్వాత నకిలీ బయటపడుతోంది. అప్పటికే ఆయా ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్ తీసుకుని ఉంటున్నారు. ఎట్టకేలకు కొన్నినెలల క్రితం అప్పటి వీసీ సాయన్న స్పందించినా.. మిగతా వీసీల హయాంలో జరిగిన పదోన్నతులు, నియామకాలను పట్టించుకోకుండా తన హయాంలో జరిగినవే పరిశీలనకు పంపించారు. అలా కాకుండా యూనివర్సిటీలో గత కొన్నేళ్లుగా పదోన్నతులు పొందిన, నియమాకమైన ఉద్యోగుల విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలనకు పంపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత..!
-
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత..!
సాక్షి, వరంగల్ అర్బన్ : డిగ్రీ, పీజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో హన్మకొండలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నయీమ్ నగర్ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు ర్యాలీ నిర్వహించిన అనతరం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ముందు ధర్నాకు దిగారు. విదార్థుల గుంపును పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రికత్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో బిల్డింగ్ అద్దాలు ధ్వంసమయ్యాయి. గాజు ముక్కలు కోసుకుపోవడంతో ఓ విద్యార్థి చేతికి గాయాలయ్యాయి. పోలీసులు లాఠీతో కొట్టాడంతో గాజు ముక్కలపై పడ్డాడని విద్యార్థి ఆరోపించాడు. ఫలితాల్లో అవకతవకలపై చర్యలు తీసుకునే వరకు కదిలేది లేదంటూ విద్యార్థులు యూనివర్సిటీలో బైఠాయించారు. -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: నగరంలోని కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెంచిన పీహెచ్డీ అడ్మిషన్ ఫీజు తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్కాలర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. వెంటనే ఫీజులు తగ్గించాలంటూ యూనివర్సిటీ పరిపాలన భవనం ముందు ధర్నా చేపట్టారు. ఆందోళన చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పరిపాలన భవనం అద్ధాలు ధ్వంసమయ్యాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
ఫీజు పిడుగు
సాక్షి, హైదరాబాద్: ఒకే రాష్ట్రం.. ఒకే డిగ్రీ కోర్సు.. అయినా ఫీజులు మాత్రం ఒక్కో వర్సిటీలో ఒక్కో రకంగా ఉన్నాయి. అంతేకాదు యాజమాన్యాలు కూడా ఒక్కో కాలేజీలో ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని యూనివర్సిటీల బీఏ కోర్సుకు తక్కువ ఫీజు ఉంటే.. మరికొన్నింటిలో ఎక్కువ ఫీజులున్నాయి. ఈ మోతను నియంత్రించాల్సింది పోయి.. మరోభారీ ఫీజు వడ్డనకు ఉన్నతవిద్యామండలి సిద్ధమైంది. అన్ని వర్సిటీల్లో ఒకేరకమైన ఫీజు విధానం ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఇందులో సమస్యేముంది అనుకుంటున్నారా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ఫీజు సమం పేరిట ఒక్కో కోర్సుపై రూ.5వేల నుంచి రూ.10వేల వరకు పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలోని డిగ్రీలో చేరుతున్న 2.20 లక్షల మంది విద్యార్థులపై ఫీజుల భారం తప్పేట్లు లేదు. డిగ్రీకి పేదలు దూరమే! కాకతీయ యూనివర్సిటీలో బీఏ కోర్సు వార్షిక ఫీజు ప్రస్తుతం రూ.6,170. ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నట్లు కనీసం రూ.5వేల పెంచితే అది రూ.11,170కి చేరుతుంది. అదే రూ.10వేలు పెంచితే ఫీజు కాస్తా రూ.16,170గా ఉండనుంది. అదే ఏటా రూ.13,520 ఉన్న బీఎస్సీ వంటి కోర్సుల్లో ఈ పెంపును వర్తింపజేస్తే.. రాష్ట్రంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు డిగ్రీ చదువులకు దూరమయ్యే ప్రమాదం లేకపోలేదు. ఇప్పటివరకు ఉన్న తక్కువ ఫీజుతో గ్రామీణ నిరుపేద కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు డిగ్రీ కోర్సులు చదువుతున్నారు. పెంచిన ఫీజులు అమల్లోకి వస్తే.. పేదలకు ఉన్నత విద్య ఇక నెరవేరని కలగా మారడం ఖాయమే. యాజమాన్యాల ఒత్తిడితోనే.. డిగ్రీ కాలేజీల యాజమాన్యాల ఒత్తిడికి తలొగ్గే.. ఉన్నతాధికారులు ఈ ఫీజుల పెంపు ఆలోచనకు వచ్చినట్లు తెలిసింది. ఫీజుల పెంపు ద్వారా యాజమాన్యాలకు మేలు చేకూర్చేందుకు మండలిలోని కొంతమంది ఉన్నతాధికారులు పావులు కదిపినట్లు తెలిసింది. అందులో భాగంగానే కామన్ ఫీజు చేస్తామనే సాకుతో.. అన్ని వర్సిటీల పరిధిలోకి ఒకే రకమైన ఫీజు విధానం తీసుకురానున్నట్లు తెలిసింది. తల్లిదండ్రులపై ఫీజు పెంపు భారం! సాధారణంగా డిగ్రీలో చేరుతున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తోంది. అయితే ఇపుడు కామన్ ఫీజు అమల్లోకి తెచ్చి అదనంగా పెంచే మొత్తాన్ని విద్యార్థులనుంచే వసూలు చేసేలా నిబంధనను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిసింది. తద్వారా విద్యార్థు«లకు, తల్లిదండ్రులకు తాము కొంత ఫీజు చెల్లిస్తాం కనుక డిగ్రీ చదువులపై శ్రద్ధ పెరుగుతుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ఉన్న యూనివర్సిటీ ఫీజుకు అదనంగా ఒక్కో విద్యార్థిపై రూ.10 వేల వరకు వసూలు చేసుకునేలా రెండేళ్ల కిందటే ఆదేశాలు జారీ అయ్యాయి. పెంచిన ఫీజు మొత్తం ఫీజు–రీయింబర్స్మెంట్ పరిధిలో రాదు. తల్లిదండ్రులే చెల్లిస్తున్నారు. అదే తరహాలో ఇపుడు అన్ని యూనివర్సిటీల్లో రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఫీజులను పెంచి తల్లిదండ్రులపై భారం మోపాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. త్వరలోనే జరిగే డిగ్రీ ప్రవేశాల కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి అధికారికంగా ప్రకటించనుందని తెలిసింది. రాష్ట్రంలోని 1,084 డిగ్రీ కాలేజీల్లో 4.20లక్షల సీట్లు అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం 2.20 లక్షలకు మించి భర్తీ కాలేదు. ఐదారేళ్లుగా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఫీజులు పెంచితే మరిన్ని ఖాళీలు తప్పవు. -
ప్రజల ఆకాంక్షల సాధనకే టీజేఎస్
పోరాడి సాధించుకున్న తెలంగాణలో నాలుగున్నర ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తెలంగాణ జన సమితి(టీజేఎస్) లక్ష్యమని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్లో ఆదివారం రాత్రి టీజేఎస్ నిర్వహించిన ఓరుగల్లు పోరుసభ ధూంధాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేయూ క్యాంపస్: పోరాడి సాధించుకున్న తెలం గాణ రాష్ట్రంలో నాలుగున్నర ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తెలంగాణ జన సమితి (టీజేఎస్) లక్ష్యమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నా రు. హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియం గ్రౌండ్లో ఆదివారం రాత్రి టీజేఎస్ నిర్వహించిన ఓరుగల్లు పోరుసభ ధూంధాంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తాను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోనే డిగ్రీ చదువుకున్నానని, ఇక్కడ అప్పట్లోనే తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలతో చర్చలు జరిగేవని, పోరా టాలగడ్డ వరంగల్‌లో కాళోజీ స్వాగతం పలికేవారని గుర్తుచేసుకున్నారు. ఆచార్య జయశంకర్, బియ్యాల జనార్దన్‌రావు, భూపతి కృష్ణమూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమానికి నాంది వరంగల్‌లోనే జరిగిందని అన్నారు. కేసీఆర్ ఏం చేశాడు ? ఎంతోమంది యువత ఆత్మబలిదానాల తర్వాత సాధించుకున్న తెలంగాణాలో గద్దెనెక్కిన కేసీఆర్ ఏం చేశాడని ప్రశ్నించారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఏవి? తెలంగాణ వచ్చాక ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని అన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం ఉన్న ఇళ్లను కూలగొట్టగా ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. హైదరాబాద్‌లో ధర్నా చౌక్‌ను ఎత్తివేశారని తెలిపారు. గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని అక్కడ ధర్నాకు ఉపక్రమించితే వారిని బలవంతంగా అరెస్ట్ చేయించారన్నారు. అప్రజాస్వామికంగా నియంతృత్వ పోకడలతో వ్యవహరించారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా కుర్చీలో కూర్చుంటే అడిగే హక్కు వారికి ఉందన్నారు. తెలంగాణకు ఆదాయం ఉందని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చేశారని అన్నారు. టీఆర్ఎస్ ముందే అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తోందని, మద్యం సీసాలు కూడా పంచుతున్నారంటా.. ఇదేం ప్రచారమని ప్రశ్నించారు. అగ్గిపెట్టె గుర్తుకు ఓటు వేసి టీజేఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీజేఎస్ రాష్ట్ర బాధ్యుడు అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ సీఎంగా కేసీఆర్ అప్రజాస్వామిక పాలన చేశారని, కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చలేదని విమర్శించారు. టీజేఎస్ రాష్ట్ర నాయకుడు భద్రోద్రి మాట్లాడుతూ మైనార్టీలకు రూ.2వేల కోట్లు కేటాయించామని చెప్పారు కానీ రూ.200కోట్లు కూడా విడుదల చేయలేదన్నారు. సమావేశంలో టీజేఎస్ నాయకులు గాదె ఇన్నయ్య, రాజేంద్రప్రసాద్, శ్యాం సుందర్‌రెడ్డి, బొట్ల బిక్షపతి, మంద భాస్కర్, డాక్టర్ తిరుణహరిశేషు, పులిసత్యం, జి.రవీందర్, శైలేందర్‌రెడ్డి, డోలి సత్యనారాయణ, పిల్లి సుధాకర్, పులి సత్యం, రాజేందర్, వినయ్‌కుమార్, లక్ష్మి, రమేష్, ఎ.రాజేందర్, శ్రవణ్ పాల్గొన్నారు. అలరించిన ధూంధాం.. ధూంధాం కార్యక్రమంలో కిషోర్, నాగరాజు, దేవేందర్, రవి, రమ కళాకారుల బృందం పాటలతో మాటలతో చైతన్యం కల్పించారు. కేసీఆర్ ఫాంహౌస్‌కే పరిమితం అయ్యారంటూ.., జైబోలో తెలంగాణ, వందనం వీరులకు వందనం అమరులకు వందనం అంటూ పాటలు పాడి సాంస్కృతిక నృత్యాలతో ప్రజలను ఉర్రూతలూగించారు. -
తిరోగమనంలో ‘పరిశోధనలు’
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ,అంతర్జాతీయ విద్యాసంస్థలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు. వివిధ రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు లెక్కకు మిక్కుటంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ తరువాత మన రాష్ట్రంలోనే 11 రాష్ట్రవిశ్వవిద్యాలయాలు , 3 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు , 2 జాతీయ స్థాయి సంస్థలు ఎన్ఐటి,త్రిపుల్ ఐటీ, 1 డీమ్డ్ విశ్వవిద్యాలయం.. ఇలా మొత్తం 17 విశ్వవిద్యాలయాలు తెలంగాణలో ఉన్నాయి. రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో మెరుగైన వసతులు లేమి, ఆర్థిక సంక్షోభం వల్ల పరిశోధనలు ఆవిష్కరణలు వాటి ఫలితాల అభివృద్ధి కేవలం కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. నూతన పద్ధతులను ఉపయోగించి పరిశోధన చేయాలంటే పరిశోధనాత్మక పరికరాలు, ఆధునిక ప్రయోగశాలలు , విశాలమైన భవనాలతోపాటు అనుభవం కల్గిన ఆచార్యులు పూర్తిస్థాయి లో ఉండాలి. కానీ మన రాష్ట్రం లో ఇప్పటికే 1200 ఆచార్య, సహా ఆచార్య పోస్టులు ఖాళీగా ఉండగా రాబోయే రెండేళ్లలో చాల మంది సీనియర్ ఆచార్యులు పదవి విరమణ పొందే అవకాశం ఉంది ఇది పరిశోధనకు గొడ్డలి పెట్టులాంటి చర్య. దేశ వ్యాప్తంగా నేషనల్ ఫెలోషిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ పేరు మీద కేంద్ర మానవ వనరుల శాఖ వారు షెడ్యూల్ కులాల వారికి 3000 ,ట్రైబల్ కులాలవారికి 800, వెనుకబడిన కులాలు ఓబీసీ వారికీ 300 స్లాట్స్ చొప్పున అందిస్తున్న సరిపోవడం లేదు. దేశవ్యాప్తంగా 331 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉండగా ఓబీసీ వారికి కేవలం 300 ఫెలోషిప్ మాత్రమే కల్పించడం వల్ల విశ్వవిద్యాలయానికి ఒక్కఫెలోషిప్ కూడా నోచుకోని స్థితిలో ఓబీసీ విద్యార్థులు ఉన్నారు కాబట్టి జనాభా ప్రాతిపదికన 50 శాతం ఉన్న ఓబీసీ లకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని 10000 స్లాట్స్ వారికి పెంచాలి. అలాగే.. ఎస్సీ, ఎస్టీ కులాల వారికీ అదనంగా 5000 స్లాట్స్‌ను పెంచాలి. మన విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోనే పరిశోధన రంగంలో అత్యున్నత స్థానాన్ని ఆక్రమించే ఆస్కారం వుండే దిశగా యూనివర్సిటీ నిధుల సంఘము, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఉండాలి. మన రాష్ట్ర ఉన్నత విద్య మండలి ప్రమాణాలకు పట్టం కట్టినపుడే తెలంగాణ పరిశోధన రంగంలో గొప్ప స్థానంలో ఉంటుంది. – ఈర్ల రాకేష్, పరిశోధక విద్యార్థి, కాకతీయ వర్సిటీ -
వర్సిటీల ‘పరిధి’ మార్పులపై కసరత్తు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల భౌగోళిక పరిధుల మార్పులపై ఉన్నత విద్యా మండలి కసరత్తు వేగవంతం చేసింది. ఈ మేరకు చేయాల్సిన మార్పులతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సమగ్ర అధ్యయనానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇటీవల యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కూడా వర్సిటీల పరిధిలో అనుబంధ కాలేజీలు 200కు మించి ఉండటానికి వీల్లేదని, అంతకంటే ఎక్కువ కాలేజీలు ఉన్న వర్సిటీలకు నిధులను ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన రెండో దశ రూసా సమావేశంలోనూ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో యూనివర్సిటీల పరిధిలోని అనుబంధ కాలేజీలను ఎలా తగ్గించాలన్న అంశంపై కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 500కు పైగా అనుబంధ కాలేజీలు ఉండగా, కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనూ 300కు పైగా కాలేజీలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు జేఎన్టీయూహెచ్ పరిధిలో 280కి పైగా అనుబంధ కాలేజీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి పరిధిలోని కాలేజీలను కొన్నింటిని ఇతర యూనివర్సిటీల పరిధిలోకి తీసుకెళ్లేలా విద్యా మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీలైనన్నిమార్పులు ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో పాత వరంగల్ జిల్లాతోపాటు పాత ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నుంచి పాత ఆదిలాబాద్‌లోని కొన్ని కొత్త జిల్లాలను తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి, మరికొన్నింటిని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోకి, ఇంకొన్నింటిని మçహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోకి మార్చేలా విద్యా మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఓయూ పరిధిలోని జిల్లాలు కొన్నింటిని తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి, ఇంకొన్నింటిని శాతవాహన యూనివర్సిటీ పరిధిలోకి, మరికొన్నింటిని మహత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోకి మార్పు చేసేలా చర్యలు చేపడుతోంది. అయితే ఇలా మార్పులు చేసినా ఓయూ, జేఎన్టీయూహెచ్ పరిధిలో అనుబంధ కాలేజీలు 200కు పైగానే ఉండే అవకాశం ఉంది. దీంతో వీటిపై ఏం చేయాలన్న దానిపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కర్ణాటకలో ఇదే పరిస్థితి ఉండటంతో అక్కడ ఒక్కో యూనివర్సిటీని వేర్వేరు పేర్లతో విభజించారు. అదే విధానంలో ఇక్కడ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అందుకే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది. పరిధుల మార్పు ప్రతిపాదనలు కూడా త్వరలోనే పంపించాలని భావిస్తోంది. సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలోనూ దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. -
66 వేల డిగ్రీ సీట్లకు కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో దాదాపు 66 వేల సీట్లకు కోత పడే అవకాశముంది. గడిచిన రెండేళ్లలో వరుసగా 25 శాతం సీట్లు కూడా భర్తీ కానీ కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు చేపట్టొద్దని, వాటిల్లోని విద్యార్థులను ఇతర కాలేజీల్లోకి పంపాలని యూనివర్సిటీలు ఇప్పటికే నిర్ణయించాయి. ఇందులో భాగంగా అన్ని యూనివర్సిటీలు తమ పరిధిలోని ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 25 శాతం లోపు సీట్లు భర్తీ కానీ కాలేజీల లెక్కలు తేల్చాయి. ఇందులో 51 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని, దాదాపు 250 కాలేజీల్లో 25 శాతంలోపే సీట్లు భర్తీ అయ్యాయని లెక్కలు వేశారు. ఒక్కరు కూడా చేరని కాలేజీల్లో మొత్తం 10,150 సీట్లు ఉండగా, 25 శాతంలోపు విద్యార్థులు చేరిన కాలేజీల్లో 56,285 సీట్లు ఉన్నట్లు తేలింది. అందులో 8,803 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీంతో ఆయా కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు చేపట్టొద్దని వర్సిటీలు ఆలోచిస్తున్నట్లు తెలిసింది. 25 వేల సీట్లలో 4 వేలే భర్తీ.. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో భర్తీ కానీ సీట్లు కాకతీయ యూనివర్సిటీ పరిధిలోనే అత్యధికంగా ఉన్నాయి. 25 శాతంలోపే సీట్లు భర్తీ అయిన కాలేజీల్లో మొత్తం సీట్లు 25,055 ఉంటే 4,047 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 25 శాతంలోపే భర్తీ అయిన కాలేజీల్లో మొత్తం సీట్లు 10,610 ఉంటే వాటిల్లో 1,731 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఈ నేపథ్యంలో అలాంటి కాలేజీల్లో ఈసారి ప్రవేశాలకు అవకాశం ఇవ్వొద్దని యూనివర్సిటీలు కసరత్తు చేస్తున్నాయి. -
కాకతీయ వర్సిటీలో ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: కాకతీయ వర్సిటీలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీలో పీహెచ్డీ సీట్లలో అవకతవకలు జరిగాయని విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే బంద్ కోసం వచ్చిన విద్యార్థి సంఘాలకు, ఇంజనీరింగ్ విద్యార్థులకు మధ్య ఘర్షణ జరిగి ఇరువర్గాల వారు కొట్టుకున్నారు. దీంతో పలువురు విద్యార్థలకు గాయాలయ్యాయి. వర్సిటీ అధికారుల సమాచారంతో పోలీసులు వచ్చి పరిస్థితిని సమీక్షించారు. విద్యార్థుల ఆందోళన నేపధ్యంలో భారీగా సిబ్బంది మోహరించారు. -
బ్రాండెడ్‌కు బదులుగా...
కేయూ క్యాంపస్: టెండర్లలో పేర్కొన్న విధంగా బ్రాండెండ్ నిత్యావసర వస్తువులు కాకుండా వేరే కల్తీ వస్తువులను సరఫరా చేస్తున్నారని ఆరోపిస్తూ కేయూలోని కామన్ మెస్ వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. సంబంధిత కాంట్రాక్టర్ ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి లారీలో కామన్మెస్కు వివిధ రకాల నిత్యావసరాల వస్తువులను తీసుకొచ్చారు. వాటిని కామన్ మెస్‌లోని స్టోర్‌కు తరలిస్తుండగా మెస్ కమిటీ బాధ్యులు పరిశీలించారు. టెండర్లో పేర్కొన్నట్లు కారం, పసుపు, ధాన్యాలు, గోదుమ పిండి బ్రాండెండ్వి కాకుండా ఇతర కంపెనీలకు చెందినవి తీసుకొచ్చారు. ఆగ్రహం చెందిన విద్యార్థులు సరుకులను లోనికి తీసుకెళ్లకుండా అడ్డుకుని ఆందోళనకు దిగారు. ఆ కాంట్రాక్టర్ టెండర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లారీని కామన్ మెస్లోనికి వెళ్లనీయకుండా గేట్‌కు తాళం వేయడంతో వాటర్ క్యాన్లు బయటే ఉన్నాయి. దీంతో కేయూ హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ ఇస్తారి వచ్చి గేట్ తాళం పగలగొట్టించి నీటి క్యాన్లను లోనికి పంపించారు. ఈ సందర్భంగా విద్యార్థులు డైరెక్టర్ ఇస్తారితో వాగ్వాదానికి దిగారు. మరోవైపు విద్యార్థుల సమాచారంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి నిత్యావసర వస్తువుల శాంపిళ్లనుతీసుకెళ్లారు. కాగా టెంటర్లలో పేర్కొన్న బ్రాండెడ్ వస్తువులను రెండు రోజుల్లో తీసుకురాకుంటే కాంట్రాక్టర్ టెండర్‌ను రద్దు చేస్తామని డైరెక్టర్ హామీ ఇవ్వ డంతో విద్యార్ధులు ఆందోళన విరమించారు. నాలుగు రకాల వస్తువుల్లో వ్యత్యాసం టెండర్లో పేర్కొన్న విధంగా 36 రకాల సరకులను కాంట్రాక్టర్ సరఫరా చేస్తారు. ఆదివారం తీసుకొచ్చిన సరకుల్లో కారం, పసుపు, గోదుమ పిండి, ధనియాలు బ్రాండెడ్‌వి తీసుకురాలేదు. మెస్ కమిటీ బాధ్యులు గుర్తించగా నేను వెంటనే అక్కడికి వెళ్లి పరిశీలించాను. రెండురోజుల్లో మళ్లీ బ్రాండెండ్ వస్తువులు తీసుకురాకుంటే టెండర్‌ను రద్దుచేస్తాం. కేయూ హాస్టళ్ల డైరెక్టర్ డాక్టర్ ఇస్తారి -
పోటాపోటీగా ప్రచారం
కేయూ క్యాంపస్: కేయూ అధ్యాపకుల సంఘం (అకుట్ ) ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం ముగియనుంది. ఇప్పటివరకు అకుట్ అధ్యక్ష పదవికి జియాలజీ విభాగాధిపతి ఆర్.మల్లికార్జున్‌రెడ్డి, దూరవిద్య కేంద్రం డైరెక్టర్ దినే‹ష్‌కుమార్ నామినేషన్లను దాఖలు చేశారు. కొద్ది రోజులుగా పోటా పోటీ గా ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రధా న కార్యదర్శి పదవికి ముగ్గురు అధ్యాపకులు పోటీపడుతున్నారు. బోటనీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ముస్తఫా, కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ హన్మంతు, జువాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజేందర్ తమ నామినేషన్లను సమర్పించారు. ఉపాధ్యక్ష పదవికి మ్యాథమెటిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరుమలాదేవి నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శి వివిధ విభాగాల అధ్యాపకులు సుజాత, పద్మజ, రమణ నామినేషన్లు సమర్పించారు. 8న ఎన్నికలు.. శనివారం సాయంత్రం 4గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది, 5న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈనెల 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. క్యాంపస్‌లోని సెనేట్ హాల్,ఆర్ట్స్ కళాశాలలోని గ్రంథాలయం, కొత్తగూడెం ఇంజినీరింగ్ కళాశాలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 162 మంది రెగ్యులర్ అధ్యాపకులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈనెల 9న ఓట్లను లెక్కించి అదేరోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఏఆర్ శ్రీధర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు. -
అసలు నాయినికి టికెట్ వస్తుందా..
న్యూశాయంపేట: కాకతీయ యూనివర్సిటీ భూముల కబ్జాపై ఫైలును తిరగతోడి కలెక్టర్, జేసీ, ఏడీ ల్యాండ్ సర్వే, ఆర్డీఓలతో ప్రత్యేక కమిటీవేసి కబ్జాకోరుల భరతం పడుతామని గ్రేటర్ వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.హన్మకొండ నయింనగర్‌లోని అర్బన్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల కళ్లు కుట్టి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటిఆర్ కార్టూన్ కాదని కడిగిన ముత్యం అని అభివర్ణించారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్పై నాయిని లేని పోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. 2019లో అసలు నాయిని రాజేందర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా లేదా తెలుసుకొని వినయ్‌భాస్కర్ గురించి మాట్లాడాలన్నారు. కుడా చైర్మెన్ మర్రి యాదవరెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ప్రజల కష్టాలను తెలుసుకొని ముందుకు సాగుతున్న వినయ్భాష్కర్పై ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ తరపున టికెట్ తెచ్చుకొని ఎమ్మెల్యే గెలిస్తే తాను రాజకీయాల్లోంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు. విలేకరుల సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మెన్ మహ్మద్ అజీజ్‌ఖాన్, తాడు గౌరవ అధ్యక్షుడు గుడిమళ్ల రవికుమార్, కార్పొరేటర్లు వద్దిరాజు గణేష్,వీరగంటి రవిందర్,జోరిక రమేష్, టిఆర్ఎస్వి నేతలు కంచర్ల మనోజ్,ప్రవీణ్,చాగంటి రమేష్, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు. కమిటీని స్వాగతిస్తాం : నాయిని కాకతీయ యూనివర్సిటీ భూముల కుంభకోణంపై వేయబోతున్న కమిటీని స్వాగతిస్తున్నామని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. కేయూ భూముల కుంభకోణంపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ ప్రకటించడంపై ఆయన స్పందిం చారు. ఈ మేరకు ‘సాక్షి’కార్యాలయానికి ఫోన్ చేసి చెప్పా రు. కాకతీయ యూనివర్సిటీ భూముల కుంభకోణంపై వేయబోతున్న కమిటీకి స్వాగతిస్తున్నాం. కమిటీలో ఇద్దరు విద్యార్థి సంఘ నాయకులు, ఇద్దరు అధ్యాపకులను సభ్యులుగా చేర్చాలి. విచారణ జరిగేంత వరకు కేయూ ఆర్చి గేటుదగ్గర చెప్పుల దండ ఉంచాలి..దోషులుగా తేలిన వారి మెడలో ఆ దండ వేసి ఊరేగించాలని పేర్కొన్నారు. -
కనీసం సొంత భవనం లేదు!
ఇదీ కాళోజీ ఆరోగ్య వర్సిటీ దుస్థితి - వర్సిటీ ఏర్పాటై మూడేళ్లయినా.. నిలువ నీడ లేదు - కాకతీయ వర్సిటీకి చెందిన పాత భవనంలోనే పాలన సాక్షి, హైదరాబాద్: కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పరిస్థితి దయనీయంగా తయారైంది. వర్సిటీ ఏర్పడి మూడేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ సొంత భవనం లేని పరిస్థితి నెలకొంది. వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాలకు చెందిన ఓ పాత భవనంలోనే వర్సిటీ పాలన నడుస్తోంది. ఎంబీబీఎస్, బీడీఎస్ వైద్య కోర్సుల సీట్ల భర్తీకి జూలై 22న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. వరంగల్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు కాళోజీ వర్సిటీలో స్థలం లేక కాకతీయ వర్సిటీలో నిర్వహిస్తున్నారు. స్వయంగా ఆరోగ్య విశ్వవిద్యాలయంలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసే వ్యవస్థ, వసతి లేకపోవడంతో వర్సిటీ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. రూ.45 కోట్లతో భవనం నిర్మాణానికి ప్రణాళిక ఉమ్మడి ఏపీలో వైద్య విద్య నిర్వహణ కోసం విజయవాడలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఉండేది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వైద్య విద్య కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వరంగల్‌లో కాళోజీ నారాయణరావు పేరుతో ఆరోగ్య వర్సిటీని ఏర్పాటు చేసింది. వర్సిటీ పరిపాలన, ఇతర అవసరాల కోసం భవనాలను నిర్మించేందుకు రూ.130 కోట్లను కేటాయించింది. అందులో రూ.45 కోట్లతో పరిపాలన భవనం నిర్మించేలా ఉన్నతాధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. వరంగల్ సెంట్రల్ జైలుకు చెందిన స్థలంలో భవనం నిర్మించేలా ప్రభుత్వం అనుమతులూ ఇచ్చింది. పరిపాలన భవనం నిర్మాణం కోసం 2016 ఆగస్టు 7న ప్రధాని మోదీ గజ్వేల్‌లో శంకుస్థాపన చేశారు. ఈ మేరకు పరిపాలన భవనం నిర్మాణం బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ ఐడీసీ)కు ప్రభుత్వం అప్పగించింది. టీఎస్ఎంస్ఐడీసీ ఆలస్యంగా టెండరు ప్రక్రియ మొదలు పెట్టింది. రూ.20 కోట్లతో భవనాన్ని నిర్మించేలా కొత్త ప్లాన్ రూపొందిం చింది. ఇంకా టెండరు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. -
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత
వరంగల్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీహెచ్డీ ఫలితాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. బుధవారం అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం ముట్టడికి యత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కొందరు ఆందోళనకారులు వీసీ చాంబర్లోకి చొచ్చుకెళ్లడానికి యత్నించగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
టీఎస్ లాసెట్-2017 ఫలితాలు విడుదల
వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్ల, ఐదేళ్ల, పీజీ న్యాయశాస్త్ర కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్-2017 ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. ఫలితాలను కేయూ ఉపకులపతి ఆచార్య ఆర్.సాయన్న శనివారం ఉదయం 9 గంటలకు హన్మకొండలోని విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో విడుదల చేశారు. మొత్తం 87 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు శాతం ఉత్తీర్ణత పెరిగింది. లాసెట్‌ను మూడోసారి కాకతీయ విశ్వవిద్యాలయమే నిర్వహించింది. -
లొంగుబాటలో మావోయిస్టు నేత ప్రకాశ్?
కొన్నాళ్లుగా ఆస్తమాతో ఇబ్బంది.. సాక్షి, ఖమ్మం: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కత్తి మోహన్‌రావు అలియాస్ ప్రకాశ్ అలియాస్ రాజన్న పోలీసులకు లొంగిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన కొన్నేళ్లుగా ఆస్తమాతో బాధపడుతున్నట్లు తెలిసింది. కత్తి మోహన్రావుది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గార్ల మండల కేంద్రం. ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి, తర్వాత కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చదివారు. 1977లో ఉస్మానియా వర్సిటీలో ఎంఏ చదువుతూ ఆర్ఎస్యూలో పనిచేశారు. అప్పటి పీపుల్స్‌వార్ కార్యకలాపాలకు ఆకర్షితులై అజ్ఞాతబాట పట్టారు. 40 ఏళ్లపాటు అజ్ఞాతంలో ఉన్న ఆయన ఐదేళ్ల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో లొంగిపోవాలని భావించినట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఆయనపై పలు కేసులు ఉన్నాయి. -
ఆదిమ మానవుని గుహ
కామారెడ్డి : ప్రాచీన శిలాయుగానికి చెందిన ఆనవా ళ్లు మాచారెడ్డి మండలం ఎల్లంపేట అటవీ ప్రాంతంలోని మఠంరాళ్లతండాలో వెలుగుచూసాయి. ఈ ప్రాంతంలో క్రీ.పూ. 10 వేల నుంచి 5 వేల సంవత్సరాల కాలం నాటి ఆదిమ మానవుడు నివసించిన గుహను కాకతీయ విశ్వవిద్యాలయంలో చరిత్ర విభాగంలో పరిశోధన చేస్తున్న తూ ము విజయ్‌కుమార్ కనుగొన్నారు. గురువారం ఆయన ‘సాక్షి’ కి వివరాలు అందజేశారు. 6వ శతాబ్దంలో జనప దం ఏర్పడడానికి ఇక్కడ పూర్వం నుంచి మానవ సంచా రం ఉన్నదని శిలాయుగం నాటి కుడ్య చిత్రాల ద్వారా తెలుస్తుందన్నారు. అటవీ ప్రాంతం కావడం వల్ల నాటి మానవులు అక్కడే నివసిస్తూ, ఆహార సేకరణ చేసి ప్రాచీన శిలాయుగానికి ఇక్కడ గుహాలయం ఏర్పాటు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాంతం చారిత్రాత్మకమైనటువంటి ఆనవాళ్లు కలది బాహ్య ప్రపంచంలోకి రాకపోవడం ఆశ్చర్యకరమైన విషయమన్నారు. మానవ పరిణామ క్రమంలో చరి త్ర రచనకి ఆధారంగా మన ప్రాంతం చెప్పవచ్చన్నారు. ఈ ఆదిమ మానవుని నివాస ప్రాంతం, (గుహ) నాటి సంస్కృతికి సంబంధించినటువంటి కుడ్య చిత్రాలు ఎరుపు వర్ణం తో వేసిన చిత్రాలు నేటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడ జీవనం సాగించిన ఆదిమ మానవులు వారి జీవనశైలి, వారి భావాలు, వారు వాడిన వస్తువులు, జంతువుల చిత్రాలు, గణితశాస్త్ర గుర్తులు, గుహ గోడలపై కలవు. జింక, దుప్పి, కొమ్ములు, దుప్పి, కుక్క, చేప, మనిషి కుడ్య చిత్రాలు ఉన్నాయి. ఈ చిత్రాలను పరిశీలించినట్టయితే ఆదిమ మానవుడు తాను అడవిలో జంతువులతో సంచారం చేస్తూ వాటితో సహజీవనం చేయడం, వాటిని ఎర్రని వర్ణంతో చిత్రాలుగా గీయడం చేశారు. ఈ గుహలో 4 వందలకు పైగా చిత్రాలు ఉన్నాయి. ఎంతో నైపుణ్యంతో కుడ్య చిత్రాల్ని గీశారు. గుహ పెద్ద బండరాయి కింద ఉంది. దీనిని ఆవాస కేంద్రంగా చేసుకుని గుహకి కుడి, ఎడమ వైపుల నుంచి ప్రహరీ లాంటి రాళ్లతో గోడ నిర్మించారు. ఆదిమ మానవునికి నిర్మాణం కూడా తెలుసని అర్థమవుతోంది. -
ఇంకెప్పుడో?
పీహెచ్డీ నోటిఫికేషన్ కోసం మూడేళ్లుగా ఎదురుచూపులు పీజీ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థుల నిరీక్షణ ఆర్‌జీఎన్‌ఎఫ్, ఎంఫిల్, ఇతర ఫెల్లోషిప్ అభ్యర్థులకు ప్రవేశాలు కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశ పరీక్ష కోసం నోటిఫికేషన్ ఇవ్వడంలో అధికారులు జాప్యం చేస్తున్నారు. మూడు సంవత్సరాలుగా నోటిఫికేషన్ రాకపోవడంతో పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు నిరీక్షిస్తున్నారు. కేయూ క్యాంపస్ : పీహెచ్‌డీలో ప్రవేశాలకు మార్గదర్శకాల కోసం కొన్ని నెలల క్రితమే ప్రొఫెసర్లతో కూడిన ఓ కమిటీని వేశారు. ఆ కమిటీ మార్గదర్శకాలను రూపొందించి నివేదిక ను యూనివర్సిటీ అధికారులకు ఇచ్చింది. ఆ తర్వాత పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం వివిధ విభాగాల నుంచి ఎన్నిసీట్లు ఉన్నాయో అన్ని విభాగాల అధిపతుల నుంచి సమాచారం సేకరించారు. ఇక పీహెచ్డీ నోటిఫికేషన్ ఇచ్చే ముందు పలు అభ్యంతరాలతో యూనివర్సిటీ అధికారులు మళ్లీ మరో కమిటీని ఈ ఏడాది ఏప్రిల్‌లో నియమించారు. అందులో ప్రధానంగా ఇప్పటికే రాజీవ్గాంధీనేషనల్ ఫెల్లోషిప్ (ఆర్‌జీఎన్‌ఎఫ్) కలిగిన అభ్యర్థులకు పీహెచ్‌డీలో నేరుగా అడ్మిషన్లు కల్పించాలా వద్దా అనే విషయంలో ఆ కమిటీ వేశారు. కేయూ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ప్రొఫెసర్ ఎం.సుబ్రహ్మణ్యశర్మ చైర్మన్‌గా, మెంబర్ కన్వీనర్‌గా డాక్టర్ జి.బ్రహ్మేశ్వరితోపాటు మరో నలుగురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీ నియమించారు. ఆ కమిటీ యూజీసీ నియమనిబంధనలు, ఇతర యూనివర్సిటీల్లో ఆర్‌జీఎన్‌ఎఫ్ అభ్యర్థులకు అడ్మిషన్ల కల్పిస్తున్న అంశాలను పరిశీలించి నివేదికను ఈ ఏడాది ఏప్రిల్ 28న యూనివర్సిటీ అధికారులకు సమర్పించారు. ఆర్జీఎన్ఎఫ్తోపాటు జేఆర్ఎఫ్, సీఎస్ఐఆర్, డీఎస్టీ తదితర ఫెల్లోషిప్ కలిగి ఉన్న అభ్యర్థులకు ఎంట్రె న్‌సతో సంబంధం లేకుండా నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని ఆ కమిటీ నివేదించింది. ఫెల్లోషిప్ కలిగిన అభ్యర్థులకు త్రిసభ్య కమిటీతో ఇంటర్వ్యూలు నిర్వహించి పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు వివిధ ఫెల్లోషిప్లు, ఎంఫిల్ అభ్యర్థులకు పలు విభాగాల్లో ప్రవేశాలు కల్పించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని విభాగాల్లో ప్రవేశాలు కల్పించారు. కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. దీంతో ఆ విభాగంలో ఆర్‌జీఎన్‌ఎఫ్ ఫెల్లోషిప్, ఎంఫిల్ కలిగిన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పించలేదు. ఆయా అభ్యర్థులు యూనివర్సిటీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. రెగ్యులర్ వీసీ ఉన్నా.. పీజీ పూర్తిచేసిన అభ్యర్థులకు నేరుగా ప్రవేశపరీక్ష ద్వారా కూడా పీహెచ్‌డీలో ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వడంలో మాత్రం జాప్యం చేస్తున్నారు. నెలలు గడిచినా పీహెచ్డీ ప్రవేశాల పరీక్షకు యూనివర్సిటీ అధికారులు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇన్చార్జి వీసీల పాలనలో పీహెచ్‌డీల ప్రవేశాల నోటిఫికేషన్‌ను పట్టించుకోలేదు. ఇప్పుడు కేయూ రెగ్యులర్ వీసీగా ప్రొఫెసర్ ఆర్.సాయన్న బాధ్యతలను స్వీకరించారు. పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వాలని వివిధ విద్యార్థి సంఘాల బాధ్యులు కూడా పలుసార్లు వీసీకి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదు. తగ్గనున్న సీట్లు.. నోటిఫికేషన్ ఇచ్చేనాటికి పలు విభాగాల్లో సీట్లు తగ్గే అవకాశాలున్నారుు.మరికొన్నింట్లో పెరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే. ఆర్‌జీఎన్‌ఎఫ్ తదితర ఫెల్లోషిప్లు, ఎంఫిల్ అభ్యర్థుల ప్రవేశాలు పూర్తయ్యాక మళ్లీ వేకెన్సీలు సేకరిస్తారని సమాచారం. దీంతో పీహెచ్డీ నోటిఫికేషన్ ఇంకా జాప్యం కానుందని భావిస్తున్నారు. పీహెచ్డీ సీట్ల వేకెన్సీలు ఇవే.. కాకతీయ యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో పీహెచ్డీ సీట్ల ఖాళీల వివరాలు ఇలా ఉన్నారుు. బాటనీ 18, బయోకెమిస్ట్రీ 7, కెమిస్ట్రీ 13, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ 38, కంప్యూటర్ సైన్స 4, ఎకనామిక్స్ 13, ఇంగ్లిష్ 18, ఎడ్యుకేషన్ 8, జియాలజీ 1, హిస్టరీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ 4, మ్యాథమెటిక్స్ 8, మైక్రోబయాలజీ 9 ,ఫిజిక్స్ 5, ఫిజికల్ ఎడ్యుకేషన్ 6, పొలిటికల్ సైన్స 12, ఫార్మసీ 16, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ఎం 3, సోషియాలజీ 15, తెలుగు 11, జువాలజీ 18, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ విభాగం 11, మెకానికల్ ఇంజనీరింగ్ 23, కంప్యూటర్ సైన్సలో 9, ఎలక్టిక్రల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 3, ఎలక్టాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్స 5, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్సలో 4 సీట్లు ఉన్నారుు. వివిధ ఫెల్లోషిప్, ఎంఫిల్ కలిగిన అభ్యర్థులకు నేరుగా ప్రవేశాల పూర్తయ్యాక ఆయా విభాగాల్లో మిగిలిన సీట్లకు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నారు. ఆయా విభాగాల్లో సీట్లు తగ్గిపోనున్నాయి. కొన్నింట్లో అసలే ఖాళీలు ఉంటాయో లేదో అనేది కూడా అనుమానమే. ప్రవేశ పరీక్షలతోనే జాప్యం.. పీహెచ్డీ నోటిఫికేషన్ కోసం పీజీ పూర్తిచేసిన అభ్యర్థులు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఒకప్పుడు రెండు ఆర్టికల్స్ ఉంటే పీహెచ్‌డీలో అడ్మిషన్లు ఇచ్చేవారు. ప్రతి ఆరునెలలకోసారి పీహెచ్‌డీలో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించేవారు. ప్రవేశ పరీక్షలు వచ్చాక అనేక కారణాలతో సంవత్సరాల తరబడి జాప్యం అవుతోంది. పీహెచ్డీ నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యార్థి సంఘాల బాధ్యులు ఆందోళనలు చేసినా యూనివర్సిటీ అధికారులు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. కొంతకాలంగా వివిధ విభాగాల్లో సీనియర్ ప్రొఫెసర్లు ఉద్యోగ విరమణ పొందడం వలన కూడా పీహెచ్‌డి వివిధ విభాగాల్లో సీట్లు తగ్గిపోతున్నాయి.జాప్యం కావడంతో ఇంకా పలు సమస్యలు తలెత్తుతున్నాయి. -
అక్టోబర్ 6 నుంచి కేయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, ఫైనల్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షలు అక్టోబర్ 6 నుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె. పురుషోత్తమ్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.అక్టోబర్ 6 నుంచి నవంబర్ 3 వరకు ఈ పరీక్షలు జరుగుతాయన్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు, సెకండ్, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయన్నారు. పూర్తి టైం టేబుల్‌ను కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని ఆయన పేర్కొన్నారు. -
తలవంచి ధరను జయించిన తల్లి ఆమె!
మార్చి 1, 1980న వరంగల్‌లోని కాకతీయ యూనివర్శిటీ మూడవ స్నాతకోత్సవానికి నోబెల్ ప్రపంచ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసాను ఆహ్వానించారు. అయితే ఆమెను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని విద్యార్థులలో ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించి నిరసనలు చేపట్టింది. అంతటి మహోన్నత వ్యక్తి వరంగల్‌లాంటి పట్టణానికి రావడమే మహాభాగ్యమని, ఆమెను అడ్డుకొని అవమానించవద్దని యూనివర్శిటీ జిల్లా, పోలీసు అధికారులు, ప్రముఖులు వారికి నచ్చజెప్పేందుకు అనేక దఫాలుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో యూనివర్శిటీలో ఆమె కారు ప్రయాణించే రోడ్డుకు కొంత దూరంలో ఒక గీత గీసి అది దాటకుండా నిరసన వ్యక్తం చేసుకొమ్మని పోలీసులు విద్యార్థుల నాదేశించారు. వారి నిరసన ప్రజల దృష్టిని పెద్దగా ఆకర్షించకున్నా యూనివర్శిటీ కేంపస్‌లో మాత్రం ఉద్రిక్తత నెలకొంది. అప్పుడు ఎం.ఎ. ఎకనమిక్స్ రెండో సంవత్సరంలో ఉన్న నాలాంటి అభిమానులకు ఒక వైపు ఆనందం, మరోవైపు మదర్ భంగపడ్తారేమోనన్న భయం! మార్చి1 న రాష్ట్ర గవర్నర్ పి.సి.అబ్రాహాముతో సహా మదర్ వచ్చారు. యాభైమందికి పైగా విద్యార్థులు ‘మదర్ థెరిస్సా గో బ్యాక్’ లాంటివి రాసిన ప్లకార్డులు, రకరకాల నినాదాలతో వారికి నిర్దేశిత స్థలంలో నిలబడ్డారు. అంతలోనే ఆమె కారు వారున్న స్థలాన్ని సమీపించింది. ఆమె వారిని చూడదులే అనుకున్న పోలీసుల అంచనాలు తారుమారయ్యాయి. మదర్ వారిని చూడనే చూశారు. అంతే! మరుక్షణం డ్రైవర్‌తో కారు ఆపించారు. ఏం జరుగుతున్నదో అర్థం చేసుకునేలోగానే మదర్ మెరుపు వేగంతో కారు దిగడం, విద్యార్థుల ముందుకు వెళ్లిపోయి రెండు చేతులూ జోడించి నిలబడటం జరిగిపోయాయి. పోలీసులు ఆమెకు భద్రతా వలయంగా ఏర్పడబోగా ఆమె వారిని సున్నితంగా వారించి దూరంగా నిలబెట్టారు. ఇది నిరసనకారులు కూడా ఊహించని పరిణామం. అక్కడున్న వీఐపీలందరి మొహాల్లో ఆందోళన... మదర్‌పై దాడి జరుగుతుందేమోనన్న భయం, కాని ఆమెలోని నిశ్చలత్వాన్ని అడుక్డుకునే సాహసం చేయలేదెవరూ. ఐదడుగుల పొడవు కూడా లేని మదర్‌లోని ప్రశాంతత, నిర్మలత్వం, నిర్భయత్వం, విధేయత, సాత్వికత ఆందోళనకారులనే కాదు, అక్కడున్న వారెవరికీ మాట పెగలకుండా చేశాయి. ‘నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి’ అంటూ చేతులు జోడించి అంటున్న ఆమె మాటల్లోని యధార్థత అంతా తలదించుకునేలా చేసింది. నినాదాలు ఆగిపోయాయి, ప్లకార్డులు నేలకూలాయి. నిశ్శబ్దం అలుముకుంది. ‘ఇది మీ ఉత్సవం. నేను మీ అతిథిని. మీరు లేకుండా అదెలా జరుగుతుంది? మనమంతా కలిసి వెళ్దాం పదండి’ అంటూ విద్యార్థుల్లో ఇద్దరిని తన రెండుచేతులతో పట్టుకొని పోలీసులు దారి చూపగా వారితోబాటు ఉత్సవ ప్రాంగణానికి గబగబా నడవడం ఆరంభించారు మదర్. అంతే! నిరసనకారులతో సహా అంతా మదర్‌ను వెంబడించారు. అధికారులు అన్ని రోజులుగా సాధించలేకపోయిన శాంతిని మదర్ ఒక్క నిమిషంలో తన సాత్వికత్వంతో సాధించారు. ఎంతో గందరగోళం మధ్య జరుగుతుందనుకున్న స్నాతకోత్సవం ఆనాడు ఎంతో ప్రశాంతంగా, అర్థవంతంగా జరిగింది. కేవలం పదినిమాషాలే సాగిన తన ప్రసంగంలో మదర్ దేవుని ప్రేమను అత్యద్భుతంగా ప్రకటించారు. చేతలతో దేవుని ప్రేమను అంత అద్భుతంగా చాటే వ్యక్తికి ప్రవచనాలు, ప్రసంగాల అవసరం ఏముంటుంది? సాత్వికులు ధన్యులు. వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారన్న యేసుక్రీస్తు ప్రవచనంలోని శక్తి, వాస్తవికత ఆరోజు నాలాంటి వారెందరికో అర్థమైంది. ఆమెకు మొన్ననే సెంయిట్ హుడ్ ఇచ్చారు. సెయింట్ అంటే అక్కడెక్కడో, మరోలోకంలో ఉండి పూజలందుకుంటున్న భావన. కాని మదర్ అంటే మన పక్కనే ఉండి ప్రేమతో కన్నీళ్లు తుడుస్తున్న ఆదరణ!! అందుకే ఇప్పుడూ ఎప్పుడూ ఆమె అమ్మే!! - రెవ.డా. టి.ఎ.ప్రభుకిరణ్ -
అన్నీ పాత ఫీజులే
- ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, ఎంటెక్, ఎంఫార్మసీ, లా ఫీజులు ఖరారు - 2013-2015 నాటి ఫీజులే 2016 నుంచి 2018-19 వరకు అమలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీటెక్ మినహా మిగతా సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులకు గతంలో అమలు చేసిన ఫీజులనే కొనసాగిం చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ, బీఈడీ, లా, ఫార్మ్-డీ, ఎం-ఆర్క్, ఎం-ప్లానింగ్ కోర్సులన్నింటికి పాత ఫీజుల ఆధారంగానే ప్రవేశాలను చేపట్టాలని స్పష్టం చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. 2013-14, 2014-15, 2015-16 విద్యా సం వత్సరాల్లో ఆయా కోర్సులకు వివిధ కాలేజీల్లో ఎంత ఫీజు ఉందో, వచ్చే మూడేళ్లపాటు (2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో) దానినే అమలు చేయాలని స్పష్టం చేశారు. దీంతో ఆ కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం సుగమమైంది. ప్రవేశాల కమిటీ లు వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపునకు రంగం సిద్ధం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులకు ఫీజు విషయంలో ఉపశమనం లభిం చింది. ప్రభుత్వంపైనా ఫీజు రీయింబర్స్మెంట్ భారం భారీగా తగ్గనుంది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ(టీఏఎఫ్ఆర్సీ) నాలుగైదు నెలలపాటు కాలేజీల యాజమాన్యాలతో పలు దఫాలు చర్చించి, కాలేజీల ఆదాయ వ్యయాలనుబట్టి ఫీజుల ప్రతిపాదనలను ప్రభుత్వామోదం కోసం పంపింది. ఈ ప్రతిపాదనలను 3 నెలలుగా పెండింగ్‌లో ఉంచిన ప్రభుత్వం పాత ఫీజుల విధానాన్నే ఈ విద్యా సంవత్సరం నుంచి మూడేళ్లపాటు అమలు చేయాలని ఎట్టకేలకు నిర్ణయించింది. ఇన్నాళ్లూ ఫీజుల జీవోలు రాకపోవడం వల్ల ఆయా కోర్సుల్లో ప్రవేశాలు నిలిచిపోయాయి. కొత్త కాలేజీలకు కనీస ఫీజు... ఈసారి కొత్తగా ప్రవేశాలకు అనుమతి, అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలకు కనీస ఫీజునే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలు చేపట్టే అటువంటి కాలేజీల న్నింటినీ ఆయా కోర్సులకు సంబంధించిన కనీస ఫీజునే తీసుకోవాలని పేర్కొంది. మరోవైపు పాత, కొత్త కాలేజీల్లో కనీస, గరిష్ట ఫీజులకు అదనంగా స్పెషల్ ఫీజులు ఉ న్నాయి (ఉదాహరణకు బీఈడీలో రూ. 3 వేల స్పెషల్ ఫీజు). కోర్సునుబట్టి స్పెషల్ ఫీజుకు గతంలో నిర్ణయించిన దానినే అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత ప్రవేశాల కౌన్సెలింగ్ వెబ్సైట్లలో పొందొచ్చు. 2016-17 నుంచి 2018-19 వరకు ఫీజులివీ... నోట్: ఎంటెక్కు సంబంధించి యూనివర్సిటీ కాలేజీల్లో ఫీజు రూ. 30 వేలుగా ఉంది. ఎంఫార్మసీ కోర్సుకు ఒక్కో వర్సిటీ పరిధిలో ఒక్కో రకంగా ఫీజును నిర్ణయించారు. కాకతీయ యూనివర్సిటీలో ఎంఫార్మసీ ఫీజు రూ. 30 వేలుగా ఉంది. -
నలభై ఏళ్లుగా విద్యాసుగంధాలు
నేడు 41వ ఏట అడుగిడనున్న కాకతీయ యూనివర్సిటీ 1968లో ఓయూ పరిధిలో పీజీ సెంటర్ ఏర్పాటు నాలుగు విభాగాలతో 1976లో యూనివర్సిటీ ఆవిర్భావం వైభవమంతా గతమే... రాజ్యమేలుతున్న సమస్యలు కేయూ క్యాంపస్ : లక్షలాది మందికి విద్యాబుద్ధులు నేర్పి.. ఎందరినో ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాకుండా ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదిన కాకతీయ యూనివర్సిటీ ఏర్పడి నేటితో నలభై సంవత్సరాలు పూర్తికానున్నాయి. నిత్యం వందలాది మంది అధ్యాపకులు, ఉద్యోగులు... యూనివర్సిటీ పరిధిలో పలు కళాశాలలు, పీజీ సెంట ర్లు.. చదువుకునే లక్షలాది మంది విద్యార్థులకు కళకళలాడే యూనివర్సిటీ శుక్రవారం 41వ సం వత్సరంలో అడుగు పెడుతోంది. అయితే, ఎం తో వైభవం, ఎన్నో ప్రత్యేకతలు ఉన్న యూనివర్సిటీ ప్రతిష్ట రోజురోజుకు మసకబారుతోంది. నూతన నిర్మాణాలు లేక... ఏటా రిటైర్ అవుతు న్న అధ్యాపకుల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడం వంటి కారణాలతో కేయూ వైభవమంతా గత చరిత్రగా మిగిలిపోనుందా అని విద్యావేత్తలు ఆవేదన చెందుతున్నారు. ఓయూలో అంతర్భాగంగా.. ఉస్మానియా యూనివర్సిటీ 1968నుంచి పరిధి లో వరంగల్‌లో కాకతీయ యూనివర్సిటీగా పీజీ సెంటర్ మాత్రమే కొనసాగేది. ఆ తర్వాత 1976 ఆగస్టు 19వ తేదీన కాకతీయ యూనివర్సిటీ ఆవిర్బవించింది. తొలుత తెలుగు, ఇం గ్లిష్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ విభాగాలు ఏర్పాటుకాగా 1974లో ఎకనామిక్స్ విభాగం ఏర్పాటుచేశారు. ఫార్మసీ కోర్సు కూడా తొలుత ఓయూలో ఏర్పాటుకాగా ఆ కోర్సును 1975లో కేయూకు షిఫ్ట్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ ప్రస్తుతం మూడు జిల్లాల పరిధిలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో కొనసాగుతోంది. గతంలో కరీంనగర్ కూడా జిల్లా కూడా కేయూ పరిధిలోనే ఉన్నా అక్కడ శా>తవాహన యూనివర్సిటీ ఏర్పాటుకావడంతో మూడు జిల్లాలకే పరిమితమైంది. కేయూ పరిధిలో 305 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, మూడు అటానమస్ డిగ్రీ కళాశాలలు ఉండగా.. సాధారణ, వృత్తి విద్యాకోర్సులు కొనసాగతున్నాయి. పీజీ కళాశాలలు 76 ఉండగా అందులో 30కిపైగా పీజీ కోర్సులు ఉన్నాయి. ఫార్మసీ కళాశాలలు 25, బీఈడీ 42, ఎంఈడీ నాలుగు కళాశాల లతో పాటు ఎనిమిది ఇంజనీరింగ్ కళాశాలలు, ముప్ఫై ఎంబీఏ, ఐదు ఎంసీఏ, మూడు ఎల్ఎల్ బీ, నాలుగు ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలు ఉన్నాయి. 650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కాకతీ య యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో రెండు లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇంకా ఇక్కడ అంబేద్కర్ స్టడీసెంటర్, ఉమెన్స్ స్టడీ సెంటర్, ప్లేస్మెంట్ సెల్, స్టూడెంట్ వెల్ఫేర్ అండ్ గైడెన్స్ సెల్ సెం టర్ ఉంది. కేయూ పరిధిలోని ఎన్ఎస్ఎస్ యూనిట్లో 350కి పైగా సబ్ యూనిట్లు, 35 వేల మంది వలంటీర్లు ఉన్నారు. ఇక్కడ 24 గం టలు తెరిచి ఉండే గ్రంథాలయం కొనసాగుతోం ది. యూనివర్సిటీలో చదువుకుని ఇక్కడే అధ్యాపకులుగా చేరిన వారు ఎందరో ఉన్నారు. పడిపోతున్న విద్యాప్రమాణాలు కాకతీయ యూనివర్సిటీలో గతంలో విద్యాబోధన, పరిశోధన నాణ్యతగా ఉండేది. తరగతులు సక్రమంగా సాగుతుండగా అధ్యాపకులు శ్రద్ధగా బోధించేవారు. సమాజంలో జరిగే అన్యాయాలను ప్రశ్నించేతత్వం కలిగిన పలువురు అధ్యాపకులు, విద్యార్థులు ఉండేవారు. ఇక్కడినుంచే వెళ్లిన వారు విప్లవ ఉద్యమంలో అగ్రనేతలుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. అయితే, కొన్నేళ్లుగా యూనివర్సిటీలో అనేక అవకతవకలు బయటపడగా.. విద్యాప్రమాణాలు బయటపడుతున్నాయి. 2009 సంవత్సరం నుంచి యూనివర్సిటీలో విద్యాబోధనపై తీవప్రభావం చూపింది. 30కిపైగా విభాగాలు ఉండగా పలు విభాగాల్లో క్లాస్‌లు జరగడం లేదు. ఇక పరిశోధన రంగంలో ఎంఫిల్, పీహెచ్‌డీలు బాగానే అవార్డ్ అవుతున్నా పరిశోధనలు నాణ్యత ఉండడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటయ్యాక రెండేళ్ల తర్వాత ఇటీవల వీసీని నియమించింది. సరిపడా లేని హాస్టళ్ల భవనాలు కాకతీయ యూనివర్సిటీలో వివిధకోర్సుల్లో ప్ర వేశాలు పొందుతున్నా విద్యార్థులకు సరిపడా హాస్టళ్లు లేవు. యూనివర్సిటీ ఆవిర్భంచిన తర్వా త నిర్మించిన హాస్టళ్ల భవనాలు ఇప్పటికీ ఉపయోగిస్తుండగా.. రెండు, మూడు తప్ప కొత్త భవనాలు నిర్మించిన దాఖలాలు లేవు. అలాగే, హాస్టళ్ల విద్యార్థులకు స్కాలర్షిప్లు ప్రభుత్వం పెంచకపోవడంతో విద్యార్థుల మెస్ బకాయిలు పేరుకుపోయి ఇబ్బంది పడుతున్నారు. అలాగే, కేయూ పరిధిలో 391 టీచింగ్ పోస్టులకు 179 మందే పనిచేస్తున్నారు. ఇదే పరిస్థితి నాన్ టీచింగ్ విభాగాల్లో కనిపిస్తోంది. 1992 తర్వాత నాన్‌టీచింగ్ ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. బ్లాక్ గ్రాంట్ ఏటా రూ.68 కో ట్లే వస్తుండడంతో పింఛనర్లకు బెనిఫిట్స్ చె ల్లించలేని దుస్థితి నెలకొంది. మిగతా అవసరాల కు అంతర్గత నిధులు వెచ్చించాల్సి వస్తోంది. కాగా, నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న కేయూ పరిధిలోని దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలు కూడా నిర్వహించలేని పరిస్థితి విమర్శలకు తావిస్తోం ది. కాపీయింగ్ తదితర అంశాలతో దూరవిద్య ను కొందరు వ్యాపారంగా మార్చారు. ఈనెల 17నుంచి జరగాల్సిన దూరవిద్య డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేయడం తాజాగా పరిస్థితికి అద్దం పడుతోంది. భవనాలు లేని పీజీ సెంటర్లు యూనివర్సిటీ పరిధిలో మూడేళ్ల క్రితం భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్‌లో పీజీ సెంటర్లు ఏర్పాటుచేశారు. అయితే, వీటికి సొం త భవనాలు లేకపోగా, రెగ్యులర్ అధ్యాపకు ల ను నియమించకపోవడం గమనార్హం. దీంతో పీజీ సెంటర్లలో చేరిన విద్యార్థులు ఇబ్బంది ప డుతున్నారు. ఇదే పరిస్థితి క్యాంపస్‌లోని రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ నెలకొంది. -
సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్లాలి
కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న కేయూ క్యాంపస్ : విశ్వవిద్యాలయాలు విజ్ఞాన కేంద్రాలని.. ఇక్కడ సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తేనే రాష్ట్రం, తద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఆర్.సాయన్న అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేయూ పరిపాలనా భవనంలో సోమవారం ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. కేయూ ఏర్పాౖటెన 40 ఏళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. ఈ మేరకు పాలనలో భేష్ అనిపించుకున్న వారిని స్ఫూర్తిగా తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.రవీందర్‌రెడ్డి, అకుట్ అధ్యక్షుడు ప్రొఫెసర్ గాదె దయాకర్, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తం, అదనపు పరీక్షల నియంత్రణా«ధికారులు ప్రొఫెసర్ సీహెచ్.రాజేశం, ప్రొఫెసర్ జి.రామేశ్వరం, డాక్టర్ రాంచంద్రం, అకడమిక్ డీన్ ప్రొఫెసర్ రమేష్, స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ డాక్టర్ గాదె పాణి, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్.దినేష్‌కుమార్, యూజీసీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ గిరీశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేయూ న్యూస్ లెటర్ వివేచనను వీసీ ఆవిష్కరించారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన వీసీ.. కేయూలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం ఏర్పాటుచేసిన పెన్షన్ సెల్‌ను ప్రారంభించారు. అలాగే,కెమిస్ట్రీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ జగన్నాథస్వామి, పలువురు పరిశోధకులు కలిసి ఏర్పాటుచేసిన నిర్భయ ఫౌండేషన్ ద్వారా ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీలో ప్రతిభచూపిన పి.నాగరాజుకు రూ.10వేల విలువైన పుస్తకాలను వీసీ సాయన్న చేతుల మీదుగా అందజేశారు. -
16, 18 తేదీల్లో ప్రీ పీహెచ్డీ పరీక్షలు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో ప్రీ పీహెచ్డీ పరీక్షలు ఈనెల 16, 18వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.పురుషోత్తం, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వి.రాంచంద్రం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. హ్యూమనిటీస్ భవనంలో మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని, అభ్యర్థులు గమనించాలని వారు సూచించారు. -
కేయూ వీసీ మనోడే
ఆర్.సాయన్నది కొరట్పల్లి రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్‌గా నియామకం డిచ్పల్లి : కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.సాయన్న నియమితులయ్యారు. ఆయన డిచ్పల్లి మండలం కొరట్పల్లికి చెందినవారు. సోమవారం వీసీగా ఉత్తర్వులు వెలువడగా.. అదే రోజు కేయూలో బాధ్యతలు స్వీకరించారు. ఆయన కేయూలో మూడేళ్లపాటు వీసీగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. జూనియర్ లెక్చరర్ నుంచి.. కోరట్పల్లికి చెందిన ఆర్.సాయన్న 1955 ఆగస్టు 18న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో 1978లో బీఎస్సీ (ఎంపీసీ), 1980లో ఎమ్మెస్సీ(ఫిజిక్స్) పూర్తి చేశారు. ఓయూలోనే 1988లో ఫిజిక్స్ విభాగంలో పీహెచ్డీ పట్టా పొందారు. ఆయన ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తికాగానే 1981–1983 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా, 1983 నుంచి 1989 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో 1989 నుంచి 1991 వరకు ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, 1991 నుంచి 1999 వరకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1999 నుంచి ప్రొఫెసర్‌గా పనిచేసి కొద్దికాలం క్రితం రిటైరయ్యారు. ఇంజినీరింగ్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్, డిజిటల్ లాజిక్‌డిజైన్, ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్టులలో బోధించారు. ఏడు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొన్నారు. పలు పరిశోధనాlపత్రాలను సమర్పించారు. నలుగురు అభ్యర్థులు ఆయన వద్ద పీహెచ్డీ చేస్తున్నారు. పరిపాలనానుభవం.. 1991లో సైఫాబాద్ పీజీ కాలేజీ హాస్టల్ వార్డెన్‌గా పనిచేశారు. నిజాం కాలేజీ కాన్ఫిడెన్షియల్ పరీక్షల విభాగం బాధ్యతలను కూడా నిర్వర్తించారు. 1996లో పీజీ అడ్మిషన్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. స్పోర్ట్స్ కమిటీ సభ్యులుగా బాధ్యతలు చూశారు. అకడమిక్ పరంగా వివిధ కమిటీల్లోనూ సభ్యుడిగా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సులకు అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా 1996 నుంచి 2000 వరకు వ్యవహరించారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో జీవితకాల సభ్యుడి, సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ సాలిడ్ స్టేట్ సైన్స్ ఫౌండర్ సభ్యుడు పనిచేశారు. -
కేయూ వీసీగా సాయన్న
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం ఎట్టకేలకు రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్ నియామకం రెండు సంవత్సరాలుగా ఇన్చార్జుల పాలనలో యూనివర్సిటీ కేయూ క్యాంపస్ :కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా ఉస్మానియా యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.సాయన్న నియమితులయ్యారు. ఈమేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేరకు ఆయన సోమవారం సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. 2014 మే 17న కేయూ వీసీగా ప్రొఫెసర్ వెంకటరత్నం పదవీకాలం ముగిశాక ఇప్పటి వరకు నలుగురు ఇన్చార్జి వీసీలుగా పనిచేశారు. నాల్గవ ఇన్చార్జీ వీసీగా టి.చిరంజీవులు గత సంవత్సర కాలంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కేయూకు రెగ్యులర్ వీసీని నియమాకం చేసింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం కోరట్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్.సాయన్న 1955 అగస్టు 18న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. కేయూలో మూడు సంవత్సరాలపాటు వీసీగా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. జూనియర్ కళాశాల లెక్చరర్ నుంచి.. సాయన్న ఉస్మానియా యూనివర్సిటీలో 1978లో బీఎస్సీ (ఎంపీసీ), 1980లో ఎమ్మెస్సీ (ఫిజిక్స్) పూర్తిచేశారు. ఓయూలోనే 1988లో ఫిజిక్స్ విభాగంలో పీహెచ్డీ పట్టా పొందారు. 26 సంవత్సరాల బోధన పరిశోధనానుభవం కలిగిన ప్రొఫెసర్ సాయన్న ఎమ్మెస్సీ ఫిజిక్స్ పూర్తికాగానే 1981–1983 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్‌గా పనిచేశారు. అనంతరం 1983 నుంచి 1989 వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా ఆరెళ్లపాటు పనిచేశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో 1989 నుంచి 1991 వరకు ఫిజిక్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, 1991నుంచి 1999వరకు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1999 నుంచి ప్రొఫెసర్‌గా పనిచేస్తూ కొద్దికాలం క్రితం రిటైర్డ్ అయ్యారు. ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్ డివైస్ అండ్ సర్క్యూట్స్, డిజిటల్ లాజిక్‌డిజైన్, ఇన్స్ట్రుమెంటేషన్ సబ్జెక్టులలో భోధన చేశారు. నలుగురు అభ్యర్థులు ఆయన వద్ద పీహెచ్డీ చేస్తున్నారు. ఏడు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో ఆయన పాల్గొన్నారు. పలు పరిశోధనాపత్రాలను సమర్పించారు. పరిపాలనా పదవులు ఇలా.. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సులకు అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా 1996 నుంచి 2000వరకు బాధ్యతలను నిర్వర్తించారు. సైఫాబాద్ పీజీ కాలేజీ హాస్టల్ వార్డెన్‌గా 1991లో పనిచేశారు. నిజాం కాలేజీ కాన్ఫిడెన్షియల్ పరీక్షల విభాగం బాధ్యతలను కూడా నిర్వర్తించారు. 1996లో పీజీ అడ్మిషన్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. స్పోర్ట్స్ కమిటీ సభ్యులుగా పనిచేశారు. అకాడమిక్ పరంగా వివిధ కమిటీల్లోనూ సభ్యుడిగా పనిచేశారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో జీవితకాల సభ్యుడుగాను, సొసైటీ ఫర్ అడ్వాన్స్మెంట్ ఇన్ సాలీడ్ స్టేట్ సైన్స్ ఫౌండర్ సభ్యుడుగాను పనిచేశారు. యూనివర్సిటీ అభివృద్దికి కృషిచేస్తా కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధికి కృషిచేస్తాన ని వీసీ ప్రొఫెసర్ సాయన్న అన్నారు. సోమవారం సాయంత్రం కేయూ వీసీగా బాధ్యతలను స్వీకరించిన సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను వీసీ స్థాయికి చేరినందుకు తన తల్లిదండ్రులకు రుణపడిఉంటానన్నారు. నిరక్ష్యరాస్యులైన తన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తాను ఉన్నత విద్య అభ్యసించేలా ప్రోత్సహించారని చెప్పారు. తనమీద నమ్మకంతో కేయూకు వీసీగా నియమించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. -
సమాజ హితమే జర్నలిస్టుల ఆకాంక్ష
శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ‘కేయూ ఎక్స్‌ప్రెస్ ల్యాబ్ జర్నల్’ ఆవిష్కరణ కేయూ క్యాంపస్ : సమాజహితమే ఆకాంక్షగా జర్నలిస్టులు నిస్వార్థంగా, అంకితభావంతో పనిచేస్తున్నారని.. ప్రజలను చైతన్యవంతులుగా చేయడంలో జర్నలిజం కీలక పా త్ర పోశిస్తుందని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అభిప్రాయపడ్డారు. కాకతీయ యూని వర్సిటీలోని జర్నలిజం విభాగం ఆధ్వర్యంలో వెలువరించనున్న కేయూ ఎక్స్‌ప్రెస్ ల్యాబ్ జర్నల్ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో స్పీకర్ మాట్లాడు తూ సమాచారాన్ని ప్రజలకు చేరవేయటంలోను జర్నలిస్టుల పాత్ర ఎనలేదని కొనియాడారు. చాలా రంగాల్లోని వారు ఆర్థికంగా ఎదిగినా, 30ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో ఉన్న పలువురు తమకు ఇళ్లు మం జూరు చేయాలని కోరే పరిస్థితుల్లో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ లో పత్తి పండించకముందే పత్తి ఆధారిత మిల్లుగా ఆజాంజాహి మిల్లు ఎందరికో ఉపాధినిచ్చినా, గత పాలకుల నిర్లక్ష్యంగా అది మూ తపడిందన్నారు. ఇప్పుడు తెలంగాణలోని అన్ని జిల్లా ల్లో పత్తి విస్తారంగా సాగు చేస్తుండగా మిల్లు మూత పyìందని, ఇలాంటి విషయాలపై జర్నలిస్టులు లోతుగా అధ్యయనం చేసి పరిశోధనాత్మక కథనాలు రాయాలని సూచించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ బంగారు తె లంగాణ సాధనలో జర్నలిజం విద్యార్థులు భాగస్వాములు కావాలని సూచించారు. నగర మేయర్ నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కేయూ ఎక్స్‌ప్రెస్ ద్వా రా ప్రజలను ఆలోపింపచేసే కథనాలు వస్తాయని ఆకాంక్షించారు. కేయూ జర్నలిజం విభాగాధిపతి డాక్టర్ సంగాని మల్లేశ్వర్ మాట్లాడుతూ కేయూలో జర్నలిజం పూర్తిచేసిన విద్యార్థులు దేశవ్యాప్తంగా వివిధ చోట్ల జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారని తెలిపారు. సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.బెనర్జీ, వైస్‌ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.దయాకర్‌రావు, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ సీహెచ్.దినేష్‌కుమార్, రచనా జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్ మహేశ్వర్‌రావు, నగర డిప్యూటీ మేయర్ సిరాజోద్దీన్, జర్నలిజం అధ్యాపకులు డాక్టర్ వీరాచారి, కె.నర్సింహారాములు, రామాచారి, ఎస్.నర్సయ్య, శ్రీకాంత్, పులి శరత్‌కుమార్, వంగాల సుధాకర్, పద్మశ్రీ, వెంకట్, జర్నలిజం విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, ఈ సమావేశంలో స్పీకర్ మధుసూదనాచారి, ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్‌ను నిర్వాహకులు సన్మానించారు. -
స్పీకర్ కాదు.. కంట్రోలర్ అనాల్సింది
శాసన సభాపతి మధుసూదనాచారి కేయూ క్యాంపస్ : శాసనసభలో ‘స్పీకర్’ మాట్లాడటమనేది అసలే ఉండదని, సభ్యులే మాట్లాడుతారని స్పీకర్ అనేవారు సభను కంట్రోల్ చేస్తుంటారని.. అలాంటప్పుడు స్పీకర్ అని ఎందుకు అంటున్నారో అర్థం కావటం లేదని శాసన సభాసతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. కాకతీయ యూనివర్సిటీలో జర్నలిజం విభాగం ఆధ్వర ్యంలో ‘కేయూ ఎక్స్‌ప్రెస్’ అనే జర్నల్ను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. స్పీకర్ అనే పదం వాడడంలో ఉన్న ఆంతర్యమేంటో జర్నలిస్టులే వెలికి తీయాలని నవ్వుతూ అన్నారు. రాష్ట్ర శాసనసభలో తాను స్పీకర్‌గా వ్యవహరిస్తున్నాని, తానేమీ మాట్లాడేది ఉండదని సభ్యులెవరైనా అదుపుతప్పి మాట్లాడితే కంట్రోల్ చేయడమే తన డ్యూటీ అని చెప్పారు. -
నేడు ఎంసెట్-2
హాజరుకానున్న 4,698 మంది విద్యార్థులు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ కేయూ క్యాంపస్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు శనివారం జరుగనున్న టీఎస్ ఎంసెట్ -2కు జిల్లా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్, కాకతీయ యూని వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి తెలిపారు. ఈ పరీక్షకు 4,698 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని చెప్పారు. శనివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించే ఈ పరీక్షకు 8కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. హన్మకొండలోని సుబేదారి యూనివర్సిటీ ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, కేయూ ఇంజనీరింగ్ కళాశాల, యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల, యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల, యూనివర్సిటీ కాలేజీ కేయూ క్యాంపస్, సీకేఎం ఆర్ట్స్‌అండ్‌సైన్స్ కళాశాల, ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ కళాశాల, లాల్‌బహుదూర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. ఎంసెట్ నిర్వహణకు 8మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 12మంది అబ్జర్వర్లను, రెండు ఫ్లయింగ్స్క్వాడ్లను నియమించినట్టు చెప్పారు. పరీక్షాకేంద్రాలకు ఒక గంట ముందుగా చేరుకోవాలని, నిర్దేశించిన సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షాకేంద్రాల్లోకి అనుతించబోరన్నారు. సెల్ఫోన్లు తదితర ఎలక్ట్రానిక్పరికరాలు తీసుకురావద్దన్నారు. -
మహిళా రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్యాయత్నం
* అడ్డుకున్న భర్త.. ప్రొఫెసర్ల వేధింపులే కారణం... * ఈనెల 11 నుంచి ఆందోళనకు సిద్ధమైన దంపతులు కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో ఇంగ్లిష్ విభాగంలోని ఇద్దరు ప్రొఫెసర్లు వ్యవహరిస్తున్న తీరుతో మనోవేదనకు గురైన ఓ మహిళా స్కాలర్ తన ఇంట్లో బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నానికి యత్నించగా, ఆమె భర్త అడ్డుకున్నారు. ప్రొఫెసర్ల వైఖరికి నిరసనగా ఈనెల 11 నుంచి ఆందోళన చేయూలని నిర్ణయించుకున్నట్లు ఆ దంపతులు వెల్లడించారు. గురువారం కేయూలో పీహెచ్డీ పరిశోధకురాలు పైండ్ల జ్యోతి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. క్యాంపస్‌లో ఇంగ్లిష్ విభాగంలో 2015 ఆగస్టులో ఆమె పీహెచ్డీ స్కాలర్‌గా ప్రవేశం పొందారు. జ్యోతి భర్త కిరణ్‌కుమార్ కూడా ఇంగ్లిష్ విభాగంలోనే ఎంఫిల్ చేస్తున్నారు. ఈ మేరకు ఆమె విభాగాధిపతి ప్రొఫెసర్ దామోదర్ వద్ద ఉన్న హాజరు పట్టికలో సంతకం చేయూల్సి ఉంటుంది. ముందు వెళ్తే తాను లేనప్పుడు ఎందుకు సంతకం చేశావని ప్రశ్నిస్తున్న ఆయన.. ఆలస్యంగా వెళ్తే ఇష్టమొచ్చినప్పుడు రావడమేమిటని అనుచితంగా వ్యవహరిస్తున్నారని జ్యోతి తెలిపారు. అంతేకాకుండా దూరవిద్యలో చదువుకున్న నీకు ఎలా పీహెచ్‌డీలో సీటు వచ్చింది? అంటూ కులం పేరుతో తిట్టారని పేర్కొన్నారు. ఇంకా ఇటీవల ఇంగ్లిష్ విభాగంలో జరిగిన సదస్సుకు వెళ్తే బొమ్మలా వచ్చి వెళ్లిపోయావన్నారనీ, మహిళా పీజీ కళాశాలలో తరగతులు తీసుకుంటే క్లాసులెందుకు చెప్పావని ప్రశ్నించారని తెలిపారు. ఇదిలా ఉండగా ఇంగ్లిష్ విభాగంలో జ్యోతి బ్యాచ్ పీహెచ్డీ ప్రవేశాలపై ఒకరు కోర్టుకు వెళ్లగా అధికారులు అడ్మిషన్లు రద్దు చేసి మళ్లీ పలువురికి మెరిట్ కమ్ రిజర్వేషన్లు, రోస్టర్ ప్రకారం ప్రవేశాలు కల్పించారు. దీంతో జ్యోతికి సైతం బీసీ-ఏ కేటగిరీలో పీహెచ్డీ సీటు వచ్చింది. ఈనెల 15వ తేదీ వరకు ప్రవేశాలకు గడువు ఉండగా.. అడ్మిషన్ తీసుకునేందుకు బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపస్‌లోని ఇంగ్లిష్ విభాగానికి జ్యోతి వెళ్లగా బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా ఉన్న ప్రొఫెసర్ శ్రీనివాస్ అనుచితంగా మాట్లాడారన్నారు. స్థానికురాలివై ఉండి ఆలస్యంగా రావడమేమిటని ప్రశ్నిస్తే తమ బంధువులు ఆస్పత్రిలో ఉండడంతో ఆలస్యమైందని చెప్పినట్లు తెలిపారు. విభాగాధిపతి దామోదర్, డీన్ ప్రొఫెసర్ కె.పురుషోత్తంతోపాటు పరిశోధకుల ముందే శ్రీనివాస్ అనుచితంగా మాట్లాడడంతో ఆవేదన చెందిన తాను.. బుధవారం రాత్రి ఇంటికి వెళ్లాక వంటింట్లో గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే తన భర్త కిరణ్ కాపాడారని తెలిపారు. ఇద్దరు ప్రొఫెసర్లు తన పట్ల వ్యవహరిస్తున్న వైఖరిని గైడ్ ప్రొఫెసర్ లత దృష్టికి తీసుకెళ్లామనీ, ఈనెల 11వ తేదీ నుంచి ఇంగ్లిష్ విభాగం ఎదుట ఆందోళన చేయనున్నట్లు జ్యోతి, కిరణ్‌కుమార్ తెలిపారు. -
కేయూ చరిత్రలోనే అతి తక్కువ ఉత్తీర్ణత
మూడు జిల్లాల్లో కలిపి 28.40 శాతం నమోదు డిగ్రీలో పడిపోతున్న విద్యాప్రమాణాలు ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లోనూ అదేతీరు కేయూ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ చివరి సంవత్సరంలో కేవలం 28.40 శాతం మంది విద్యార్థులే ఉత్తీర్ణత సాధించడం ఆందో ళన కలిగిస్తుంది. కేయూ చరిత్రలోనే ఇంత తక్కువ ఫలితాలు రావడమనేది ఇదే తొలిసారి అని తెలుస్తోంది. చివరి సంవత్సరం పరీక్షలకు 44,506 మంది విద్యార్థులు హాజరై తే కేవలం 12,641మందే ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది 33.97శాతం ఉత్తీర్ణత నమోదైంది. అంటే ఈ సారి 5.57శాతం ఉత్తీర్ణత తగ్గింది. ఇక మొ దటి, రెండు, చివరి సంవత్సరాల్లో కలిపి 1,55,273 మంది విద్యార్థులకు 39,456 మం ది(25.41శాతం) ఉత్తీర్ణత సాధించడం గమనా ర్హం. బీఏ కోర్సులోనైతే వరంగల్ జిల్లాలో 17.19శాతం, బీఎస్సీలో 27.50 శాతం, బీకాం లో 31.87 శాతమే ఉత్తీర్ణత న మోదైంది. సాధించారు. డిగ్రీ విద్యలో ఇంత తక్కువ ఫలి తాలు రావటం అనేది కాకతీయ యూనివర్సి టీ చరిత్రలో ఇది తొలిసారిగా అని తెలుస్తోంది. అర్హులైన అధ్యాపకులు ఉన్నా... కేయూ పరిధిలో డిగ్రీ ఫలితాలను పరిశీలిస్తే డిగ్రీ విద్యలో విద్యాప్రమాణాలు పడిపోయిన ట్లుగా భావించాల్సి వస్తోంది. ప్రభుత్వ, ప్రైవే ట్ కళాశాలల్లోనూ ఇదే పరిస్థితి ఉండడం ఆం దోళన కలిగిస్తుంది. యూనివర్సిటీ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి 305 డిగ్రీ కళాశాలలు ఉండగా.. వరంగల్ జిల్లాలో 14 ప్రభుత్వ, సు మారు 90నుంచి 100వరకు ప్రైవేట్ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ డిగ్రీ కళా శాలల్లో ప్రాక్టికల్స్ కూడా సరిగ్గా చేయించడం లేదు. ఏదో విధంగా ప్రాక్టికల్స్‌లో ఉత్తీర్ణత సాధించినా థియరీలో ఉత్తీర్ణత ఆశించనంతగా ఉండడం లేదు. ప్రైవేట్ కళాశాలల బాధ్యులు తాయిలాలు చూపి, తరగతులకు రాకున్నా పర్వాలేదని చెబుతూ విద్యార్థులను చేర్చుకుం టున్నారు. సరిపడా అధ్యాపకులు లేకపోవడం తో విద్యార్థులు పలువురు కాపీయింగ్‌పై ఆధారపడుతున్నట్లు చెబుతున్నారు. ఈ ఏడా ది మూడు జిల్లాల్లో కలిపి 1300 మందికి పైగా విద్యార్థులు డిబార్ కావడానికి దీనికి నిదర్శ నంగా చెప్పుకోవచ్చు. కేవలం స్కాలర్షిప్, ఫీజు రీయింబర్సమెంట్ కోసమే అన్నట్లుగా డిగ్రీ కాలేజీలు కొనసాగుతున్నాయనే విమ ర్శలున్నాయి. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విషయానికొస్తే ఎంఫిల్, పీహెచ్డీ డిగ్రీలు కలిగిన అధ్యాపకులు ఉన్నా ఆశించిన ఫలితా లు రాకపోవడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఉన్నత విద్య ఆర్జేడీగా ఇన్చార్జీలు ఉండడంతో కళాశాలలపై పర్యవేక్షణ లోపించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వె త్తున సాగిన మూడేళ్లలో తరగతులు సక్రమం గా జరగకపోయినా పర్వాలేదనే విధంగా ఫలితాలు వచ్చాయి. అలాంటిది ఈ ఏడాది ఫలి తాలు దిగజారిపోవడంపై పలువురు ఆం దోళన వ్యక్తం చేశారు. పదో తరగతిలో 95శా తం, ఇంటర్లో 49 నుంచి 75 శాతం వరకు ఫలితాలు వచ్చినా.. డిగ్రీలో 35 శాతం దాట కపోవడంపై యూ నివర్సిటీ అధికారులు విశ్లేషించుకోవాల్సిన అవసరముంది. డిగ్రీలో ఈ విద్యాసంవత్సరం నుంచి చాయిస్ బేస్డ్ సిస్టమ్ సెమిస్టర్ విధానాన్ని అమలుచేయను న్నారు. అయితే, విద్యాప్రమాణాలు ఇప్పటిలా ఉంటే ఈ విధానం ఏ మేరకు సత్ఫలి తాలని స్తుందో వేచి చూడాల్సిందే. -
డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల గడువు పొడిగింపు
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 15వ తేదీ వరకు పొడిగించారు. ఇటీవల ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువు సోమవారంతో ముగియగా.. పొడిగించినట్లు కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు తమ దరఖాస్తులను జాగ్రత్తగా అప్లోడ్ చేయూలని, సందేహాలు ఉంటే హెల్ప్‌లైన్ సెంటర్లలో సంప్రదించాలని సూచించారు. అంతేకాకుండా ఏ కాలేజీ బాధ్యులకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని ఆయన తెలిపారు. ఇప్పటివరకు 17,845 దరఖాస్తులే కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రవేశాల కోసం ఆన్లైన్లో ఇప్పటి వరకు 17,845 దరఖాస్తులే వచ్చాయి. మొత్తం 21,633 మంది విద్యార్థులు రూ.100 చొప్పున ఫీజు చెల్లించినా అందరూ దరఖాస్తు చేసుకోలేదు. మూడు జిల్లాల్లోని కళాశాలల్లో ఒక లక్ష 25వేల వరకు సీట్లు ఉన్నాయి. ఎంసెట్ కౌన్సెలింగ్ ముగిసి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలైతే దరఖాస్తుల సంఖ్య పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. -
రేపే టీఎస్ లాసెట్-2016
కేయూ క్యాంపస్ (వరంగల్) : తెలంగాణ రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న లాసెట్ మంగళవారం జరగనుంది. మూడేళ్ల ఎల్ఎల్ బీ కోర్సు ప్రవేశపరీక్షకు 13,323 మంది, ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశ పరీక్షకు 4,104 మంది, ఎల్ఎల్ఎం ప్రవేశ పరీక్షకు 1,793 మంది.. మొత్తంగా 19,220 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ ప్రవేశపరీక్ష మంగళవారం ఉదయం 10 నుంచి 11-30గంటల వరకు, ఎల్ఎల్ఎం ప్రవేశపరీక్ష మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 4గంటల వరకు జరుగుతుంది. రాష్ట్రంలోని 14 రీజినల్ సెంటర్ల పరిధిలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా, అభ్యర్థులు అర గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని టీఎస్ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు సూచించారు. నిర్ణీత సమయానికి ఒక నిముషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించబోమని, బయోమెట్రిక్ విధానంలో అభ్యర్థుల వేలిముద్రలు సేకరిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు సెల్ఫోన్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకురావొద్దని సూచించారు. పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు 37మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 50 మంది పరిశీలకులతో పాటు ఆరు ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు ఆయన వివరించారు. -
ఐసెట్ పకడ్బందీగా నిర్వహించాలి
ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి కేయూ క్యాంపస్ : ఐసెట్ -2016ను పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి సూచించారు. కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో రాష్ట్రంలోని ఐసెట్ రీజినల్ సెంటర్ల కోఆర్డినేటర్ల సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ ఈనెల 19న ఐసెట్ నిర్వహించనుండగా, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తొలిసారి బయోమెట్రిక్ విధానం అమలుచేస్తున్న నేపథ్యంలో ఎలాంటి లోపాలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలని సూచించారు. రాష్ట్రంలో అన్ని 16 రీజినల్ సెంటర్ల పరిధిలో 127 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేయగా, 72,44 8మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని ఆయన తెలి పారు. నిర్ణీత సమయం కంటే నిముషం ఆలస్యమైనా కేంద్రాల్లోకి అనుమతించొద్దని స్పష్టం చేశారు. సమావేశంలో ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాశ్, వరంగల్ రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె.సాయిలు ఇతర రీజినల్ సెంటర్ల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
5నుంచి కేయూ పీజీ పరీక్షలు
హైదరాబాద్: కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ పరీక్షలు మే నెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి తెలిపారు. పీజీ నాల్గవ సెమిస్టర్ పరీక్షలు మే 5 నుంచి, రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహిస్తారు. రెండో సెమిస్టర్ పరీక్షలు మే 6, 10, 12, 17, 19, 21 23 తేదీలలో, నాల్గవ సెమిస్టర్ పరీక్షలు మే 5, 7, 9, 11, 13, 16 తేదీలలో జరుగుతాయి. -
పీజీ సెట్ నోటిఫికేషన్ విడుదల
కేయూ క్యాంపస్ (వరంగల్) : కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలో వచ్చే విద్యాసంవత్సరం 2016-2017లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను సోమవారం నోటిఫికేన్ విడుదలైంది. ఈ పీజీ సెట్‌కు అడ్మిషన్ల ప్రక్రియలో తొలిసారిగా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబోతున్నారు. ఈనెల 12వ తేదీ నుంచి విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కాకతీయ యూనివర్సిటీ అడ్మిషన్ల డెరైక్టర్ ప్రొఫెసర్ ఎం.కష్ణారెడ్డి, జాయింట్ డెరైక్టర్లు డాక్టర్ వెంకయ్య, డాక్టర్ జె.లక్ష్మణ్‌నాయక్ సోమవారం వెల్లడించారు. అభ్యర్థులు మీసేవా లేదా ఏపీ ఆన్లైన్ సెంటర్, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా కేయూ అడ్మిషన్ల వెబ్సైట్ www.kakatiya.ac.in లేదా www.kudoa.in ద్వారా దరఖాస్తులను అప్లోడ్ చేయాలన్నారు. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజును కూడా క్రెడిట్ కార్డు, డిబెట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చన్నారు. ఓసీ, బీసీ విద్యార్థులకు రిజస్ట్రేషన్ ఫీజు రూ.400, ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్థులు ఫీజు రూ.300 చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిషన్లకు సంబంధించిన నియమ నిబంధనలు వెబ్సైట్లో ఉంచారు. అపరాధ రుసుము లేకుండా మే 3వ తేదీ వరకు, రూ.600 అపరాధ రుసుముతో మే 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఆన్లైన్ అప్లికేషన్ హెల్ప్‌లైన్ కేంద్రం నంబర్లు 90524 565721, 99856 66721కు ఫోన్ చేయవచ్చని అడ్మిషన్ల డైరెక్టర్ తెలిపారు. మే చివరి వారంలో పీజీ కోర్సుల్లో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నామని, ప్రవేశ పరీక్షల సమయంలో విద్యార్థులు ఆన్లైన్ ద్వారానే తమ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. -
మాస్ కాపీయింగ్ చేస్తున్న విద్యార్థులు అరెస్ట్
హైదరాబాద్: కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. నారాయణగూడ సీఐ భీమ్‌రెడ్డి వివరాల ప్రకారం.. కాకతీయ వర్సిటీ నిర్వాహకులు సురేష్, రాజిరెడ్డితో కలిపి మరో నలుగురు డిగ్రీ దూరవిద్య పరీక్షలను నిజాం కళాశాల సెంటర్లో రాయాల్సి ఉండగా కింగ్ కోఠీలోని పద్మశాలి భవన్లో పరీక్షలు రాస్తూ మాస్ కాపీయింగ్‌కు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మాస్‌కాపీయింగ్ పాల్పడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసి నారాయణగూడ పోలీసులకు అప్పగించినట్లు భీమ్‌రెడ్డి తెలిపారు. -
ప్రొఫెసర్ కుటుంబాన్ని పరామర్శించిన ఈటల
ఓ ప్రొఫెసర్ కుటుంబాన్ని మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం పరామర్శించారు. కాకతీయ యూనివర్సిటీలో పనిచేసే ప్రొఫెసర్ దినేష్ తల్లి వజ్రమ్మ ఇటీవల మృతి చెందారు. దీంతో వారి స్వగ్రామమైన నల్లగొండ జిల్లా ఆలేరు మండలం మధిర గ్రామంలోని సాయిగూడెంకు మంత్రి ఈటల మంగళవారం వెళ్లారు. ప్రొఫెసర్ దినేష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించి వజ్రమ్మ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. -
వంద కోట్ల క్లబ్లో ‘రుద్రమదేవి’
షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్లో దర్శకుడు గుణశేఖర్ హన్మకొండ : కాకతీయ వీరనారి రుద్రమదేవి జీవిత చరిత్రను తీసినందుకు గర్వంగా ఉందని ప్రముఖ సినీ దర్శకుడు గుణశేఖర్ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగిన అంతర్జాతీయ షార్ట్ ఫిలిమ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆనాడు కాకతీయ మహారాణి నడయాడిన నేలపైనుంచి ప్రసంగిస్తున్నందుకు ఉద్విగ్నంగా ఉందన్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు ఆడిటోరియం చప్పట్లు, ఈలలతో హోరెత్తి పోయింది. రుద్రమాదేవి, తెలంగాణ ప్రభుత్వం, వరంగల్ గురించి ఆయన వెల్లడించిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.... ఓరుగల్లు అనగానే ఓకే అన్నా.. ఇంటర్నేషన్ షార్ట్ఫిలిమ్ ఫెస్టివల్‌కు ఆహ్వనం వచ్చిందని నాకు చెప్పగానే ఎక్కడా అని అడిగాను .‘ వరంగల్ ’.. అని చెప్పగానే వెంటనే ఓకే అన్నా. మూడు నెలలుగా ఎప్పుడెప్పుడు వరంగల్ వద్దామా అని ఎదురు చూస్తున్నా? నిర్వాహకులకు నేను ఫోన్ చేసి మరీ కార్యక్రమం కోసం వాకాబు చేశాను. రుద్రమాదేవి నడిచిన ఈ నేలలో జరుగుతున్న ఈ ఫెస్టివల్ మరెన్నో ఫెస్టివల్స్‌కి నాంది కావాలి. కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ తరహాలో ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరగాలి. రికార్డు కలెక్షన్లు ఎంతో వ్యయప్రయాసల కోర్చి నేను రుద్రమదేవి చిత్రాన్ని స్వయంగా నిర్మిస్తూ దర్శకత్వం వహించాను. మొత్తం రూ.70 కోట్ల వ్యయమైంది. కానీ అంతర్జాతీయంగా తెలుగు, తమిళ్, మళయాలం, హిందీల్లో కలిపి ఈ చిత్రం వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. యూఎస్ఏలో మహేశ్, పవన్ కళ్యాణ్ చిత్రాల తరహాలో వన్ మిలియన్ డాలర్ల కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది. రుద్రమదేవి చిత్రం వంద కోట్ల రూపాయల క్లబ్లో చేరినందుకు నేను గర్వపడటం లేదు. నాకు సన్మానాలు, సత్కారాలన్నా ఇష్టం లేదు. కానీ రుద్రమాదేవి వంటి చిత్రాన్ని నిర్మించాను, దర్శకత్వం వహించాను అని చెప్పుకునేందుకు గర్విస్తా. రుద్రమదేవి కోసం మాట్లాడేందుకు నేను ఇక్కడికొచ్చా. ఎందరో తెలుసుకుంటున్నారు రుద్రమదేవి సినిమా తీస్తున్నాని తెలియగానే కథ గురించి తెలుసుకున్న తమిళ్, మళయాలం, హిందీ వాళ్లు ఆశ్చర్యపోయారు. రుద్రమదేవి కోసం మా వాళ్లకు తెలియాలి అంటూ డబ్బింగ్ హక్కులు తీసుకున్నారు. ఈ సినిమా విడుదలైన తర్వాత గూగుల్‌లో రుద్రమాదేవి, కాకతీయ కింగ్డమ్, ఓరుగల్లు కోసం వెతుకుతున్నవారి సంఖ్య పెరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కువ మంది సెర్చ్ చేసిన జాబితాలో రుద్రమదేవి మూడో స్థానంలో నిలిచింది. కేసీఆర్‌కు అభినందనలు ఏ ప్రాంతం వాడన్నది చూడకుండా రుద్రమదేవి సినిమా తీశానని చెప్పగానే నా భుజం తట్టి వినోదపన్ను రాయితీ ఇచ్చి ప్రోత్సహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. చరి త్ర అంటే రేపటి దారిని చూపించే నిన్నటి వెలుగు. ఆనాడు చెరువుల ప్రాముఖ్యతను గుర్తించిన రుద్రమదేవి ఎన్నో చెరువులను తవ్వించారు. ఆ నాటి చరిత్రను గౌరవిస్తూ చెరువుల పునరుద్ధరణ పథకానికి మిషన్ కాకతీయ అని సీఎం కేసీఆర్ గారు పేరు పెట్టారు. ఆయనకు మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణలో అమలవుతున్న మిషన్ కాకతీయ నేడు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. స్మార్ట్ఫోన్లు, డిజిటల్ కాలంలో కూడా ఎనిమిది వందల ఏళ్ల కిత్రం కాకతీయులు అవలంభించిన పద్ధతి నేటి ప్రభుత్వాలకు స్ఫూర్తిని ఇచ్చిందంటే.. మాటలు కాదు. పవర్ ఫుల్ మీడియా సినిమా అనేది పవర్ఫుల్ మీడియా. సినిమా రంగంలోకి ప్రవేశించేందుకు షార్ట్‌ఫిల్మ్ మేకింగ్ అనేది మంచి ఫ్లాట్‌ఫాం. ఎంతోమంది షార్ట్ఫిలిమ్ల ద్వారానే ఎదిగి పెద్ద దర్శకులు అయ్యారు. మా కాలంలో దర్శకుడు కావాలంటే నిర్మాత, హీరోలకు కథలు చెప్పి, ఒప్పించి, మెప్పించాల్సి వచ్చేది. ఇప్పుడు డిజిటల్ కెమోరాతో పనితనం చూపించి దర్శక అవకాశం పొందవచ్చు. ఇటీవల కాలంలో ఈ పద్ధతిలో ఎంతోమంది టాలీవుడ్లో దర్శకులయ్యారు. ఇంకా ఎంతో ఉంది రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మించబడలేదు అనే ఒక సామెత ఉంది. అదే విధంగా ఓరుగల్లు నగరం కూడా ఒక్క రోజులో నిర్మించబడలేదు. రుద్రమదేవితో పాటు ఎందరో రాజులు ఉన్నారు. వీరందరి చరిత్ర మనం తెలుసుకోవాలి. ఇటలీకి చెందిన మార్క్పోలో చెప్పే వరకు మనకు రుద్రమదేవి గురించి ఎక్కువగా తెలియదు. మన చరిత్రను మనం తెలుసుకోవాలి. అందుకోసం ప్రయత్నాలు జరగాలి. ప్రపంచ వ్యాప్తంగా ఓరుగల్లుకు ప్రాచుర్యం రావాలి. అందుకే నా పరిశోధనలు కొనసాగుతున్నాయి. తప్పకుండా ‘ప్రతాపరుద్ర - ది లాస్ట్ ఎంపరర్’ సినిమా నిర్మిస్తాను. మళ్లీ మళ్లీ వరంగల్‌కు వస్తాను. -
మాజీ ఎంపీ రాజయ్య భార్య మాధవి సస్పెన్షన్
వరంగల్: కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ బయో టెక్నాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్, మాజీ ఎంపీ రాజయ్య భార్య మాధవిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు బుధవారం కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు కుమారుల సజీవ దహనం కేసులో నిందితురాలిగా ఉన్న రాజయ్య భార్య మాధవిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది నవంబర్ 3న తెల్లవారుజామున సారిక సజీవ దహనం కాగా, అదే రోజు పోలీసులు మాధవిని అరెస్ట్ చేసినప్పటికీ పోలీసుల నుంచి రిమాండ్ రిపోర్టు అందలేదు. తాజాగా ఆ రిపోర్టు కేయూ అధికారులకు రిమాండ్ రిపోర్టు అందగా, కేయూ ఇన్చార్జి వీసీ చిరంజీవులు అనుమతి మేరకు ఇన్చార్జి రిజిస్ట్రార్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ బుధవారం మాధవిని సస్పెండ్ చేశారు. అయితే ఈనెల 5 నుంచి మాధవిపై సస్పెన్షన్ వేటు వర్తిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, మాధవి సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని ఓ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తూ 2010లో కేయూ బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితులయ్యూరు. ఈ మేరకు క్యాంపస్‌లోని బయో టెక్నాలజీ విభాగంలో సుమారు రెండేళ్ల పాటు పనిచేశాక, హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి బదిలీ అయ్యూరు. కేయూ చరిత్రలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ సస్పెండ్ కావడం ఇదే తొలిసారని భావిస్తున్నారు. -
అటానమస్ ఆర్ట్స్ కాలేజీ
అకడమిక్ పరంగా స్వయం ప్రతిపత్తి వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు కేయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆమోదమే తరువాయి.. కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధి హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి అటానమస్ హోదా లభించింది. ఈ మేరకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పంపిన లేఖ సోమవారం అందింది. వచ్చే విద్యాసంవత్సరం(2016-2017) నుంచి ఈ హోదా అమలులోకి రానుంది. ఈ ఏడాది జులై 27, 28వ తేదీల్లో యూజీసీ నియమించిన ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ ఆర్ట్స్ కాలేజీని సందర్శించి వసతులు, సౌకర్యాలపై ఆరా తీసింది. వారు ఇచ్చే నివేదిక ప్రకారం ప్రస్తుతం అటానమస్ హోదా లభించింది. తద్వారా ఆర్ట్స కాలేజీ కేయూ పరిధిలో ఉన్నప్పటికీ స్వయం నిర్ణయాలతో ముందుకెళ్లవచ్చు. ప్రస్తుతం నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సులలో సిలబస్ రూపకల్పనతోపాటు విద్యాబోధన, పరీక్షల నిర్వహణ, ప్రశ్నపత్రాల సెట్టింగ్, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాలు విడుదల సొంతంగా చేసుకోవచ్చు. టైంటేబుల్ కూడా యూనివర్సిటీతో సంబంధం లేకుండా సొంతంగా చేసుకునే వెసలుబాటు లభిస్తుంది. నిధులు కూడా యూజీసీ నుంచి నేరుగా అందనున్నందున సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశపెట్టుకోవచ్చు. అయితే, కాకతీయ యూనివర్సిటీ మాత్రం ఆర్థికపరమైన అంశాలను పర్యవేక్షిస్తుంది. అలాగే, ఆర్ట్స్ కాలేజీకి లభించిన అటానమస్‌కు కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఆమోదించాల్సిన అవసరముంది. మినీ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి మినీయూనివర్సిటీగా పిలువబడుతుంది.40 ఎకరాల విస్తీర్ణంలో ఉండి అనేక భవనాలతో మౌళిక వసతులు కలిగి ఉండగా 1927లో కాలేజియట్ హైస్కూల్‌గా ఉండి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతోంది. డిగ్రీ కోర్సులతో 1959లో ఓయూ పరిధిలో ఉండి ఆ తరువాత 1976 అగస్టు 19న కాకతీయ యూనివర్సిటీ పరిధిలోకి వచ్చింది. 1995నుంచి పీజీ కోర్సులు కూడా నిర్వహిస్తుండగా.. మాజీ ప్రధాని దివంగత పీవీ.నర్సింహారావు తదితరులెందరో ఈ కళాశాలలో చదువుకున్నారు. కాలేజీలో ప్రస్తుతం 30 వరకు వివిధ కాంబినేషన్లలో డిగ్రీ కోర్సులు, పది పీజీ కోర్సులతో పాటు ఒకేషనల్ కోర్సులు నడుస్తున్నాయి. అలాగే, ఈ కళాశాలకు 2004లో తొలిసారి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లభించగా.. 2014-2015లో రీ అక్రిడేషన్ లభించింది. రెగ్యులర్ అధ్యాపకుల నియమాకం అవసరం యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి అన్ని హంగులున్నా ఉ ద్యోగ విరమణ చేస్తున్న ప్రొఫెసర్ల స్థానంలో కొత్త నియామకాలు జరగడం లేదు. దీంతో 90మంది రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులకు కేవలం 23మందే ప్రస్తుతం ఉ న్నారు. మిగతా వారందరూ కాంట్రాక్ట్ లెక్చరర్లే. ప్రస్తు తం అటానమస్ హోదా లభించినందున ఆర్ట్స కళాశాల అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం నియామకాలు చేపట్టాల్సి ఉంది. రెగ్యులర్ ప్రిన్సిపాల్‌ను నియమిస్తేనే అటానమస్ హోదా లభించిన ఫలితం దక్కుతుంది. రిజిస్ట్రార్‌కు లేఖ ఇచ్చాం.. అటానమస్ ఆర్ట్స్ అండ్ై సెన్స్ కాలేజీకి అటానమస్ హోదా కల్పిస్తూ యూజీసీ నుంచి వచ్చిన లేఖను కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ అల్తాఫ్ హుస్సేన్‌కు ఇచ్చామని కాలేజీ ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.రామానుజరావు తెలిపారు. ఇక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లోఆమోదించేలా యూనివర్సిటీ అధికారులు కృషి చేయాల్సి ఉంది. -
కేయూ కామన్ మెస్ ఎదుట ధర్నా
కేయూక్యాంపస్ : కాకతీయ యూని వర్సిటీ కామన్ మెస్ ఎదుట విద్యార్థి సంఘాలు గురువారం ధర్నా నిర్వహించారుు. నాణ్యమైన భోజనం అందటంలేదని, కేర్‌టేకర్‌ను తొల గించాలని డిమాండ్ చేశారు. ప్రైవే టు మెస్ కాంట్రాక్టర్‌కు అనుకూలం గా కేర్‌టేకర్ వ్యహరిస్తున్నారని ఆరోపించారు. హాస్టళ్ల డెరైక్టర్ మనోహర్ నాణ్యమైన భోజనం అందించి, కేర్‌టేకర్‌ను తొలగించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటంతో విద్యార్థులు ఆందోళన విరమిం చారు. ఈకార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్, టీజీవీపీ, ఏబీవీపీ, ఎంఎస్ఎఫ్ నాయకులు మేడారపు సుధాకర్, ముదిగొండ రాజు, మంద భాస్కర్, రాకేష్, సిద్దు, శ్రావణ్, రాంబాబు, మధు, రమేష్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
కేయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి ‘అధిపతి’ కావలెను
బాధ్యతలు వద్దంటూ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యాదగిరిరావు రిజిస్ట్రార్‌కు లేఖ సుజాతకుమారికి అవకాశం? కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానవనరుల విభాగానికి విభాగ అధిపతిగా ఆవిభాగం ప్రొఫెసర్ యాదగిరిరావును ఈనెల 7వ తేదీన నియమాకం చే స్తూ కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈనెల 19వ తేదీ వరకు కూడా ఆయన బాధ్యతలను స్వీకరంచ లేదు. అంతేగాకుండా తాను విభాగం అధిపతిగా బాధ్యతలను స్వీకరించబోనని కూడా రెండు రోజుల క్రితం కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్‌కు లేఖను అందజేశారు. విభాగం అధిపతిగా ఉన్న ప్రొఫెసర్ ఎం. విద్యాసాగర్‌రెడ్డి ఈనెల 4వతేదీతో పదవీకాలం ముగిసింది. రొటేషన్ ప్రకారం విభాగం అధిపతిగా ప్రొఫెసర్ సత్యనారాయణ నియమాకం కావాల్సి ఉండగా తాను విభాగం అధిపతిగా బాధ్యతలను చేపట్టబోనని సత్యనారాయణ బీవోఎస్గానే కొనసాగుతానని ఇన్చార్జి రిజిస్ట్రార్‌కు లేఖ అందజే యటంతో కేయూ యూజీసీ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ యాదగిరిరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆయన కూడా బాధ్యతలను స్వీకరించనని నాట్ విల్లింగ్ ఇస్తూ లేఖ అందజేశారు. దీంతో15 రోజులుగా విభాగంనకు అధిపతి లేకపోవటంతో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మానవవనరుల విభాగం‘హెడ్’లేని విభాగంగా కొనసాగుతుంది. ప్రొఫెసర్ యాదగిరిరావు వెనుకంజకు కారణమేమిటీ కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మానవనరుల విభాగం విభాగం అధిపతిగా నియామకం అయ్యాక ఈనెల 12వతేదీన ప్రొఫెసర్ యాదగిరిరావు విభాగం అధిపతిగా బాధ్యతలను స్వీకరించేందుకు విభాగానికి వెళ్లగగా పీహెచ్‌డీలో సీట్లు రాని అభ్యర్థులు వచ్చి ప్రవేశాల ఎంపికలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ యాదగిరిరావుతో వాగ్వాదాలకు దిగారు. అనంతరం వెళ్లిపోయిన ప్రొఫెసర్ యాదగిరిరావు బాధ్యతలను స్వీకరించటం లేదు. చివరికి యాదగిరిరావు రెండు రోజుల క్రితం తాను ఆవిభాగం అధిపతిగా ఉండబోనని ఇన్చార్జి రిజిస్ట్రార్‌కు లేఖ అందజేశారు. గత 15రోజులుగా విభాగం అధిపతి ఎవరు లేకపోవటం వలన విద్యార్థులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. అయితే విభాగం అధిపతిగా ఎవరిని నియమించినా వారికి చార్జీ ఇచ్చేందుకు విద్యాసాగర్‌రెడ్డి నిరీక్షిస్తున్నారు. ప్రస్తుతం యాదగిరిరావు యూజీసీ కో ఆర్డినేటర్‌గా కొనసాగుతున్నారు. ఇక సుజాతకుమారి వంతు ? కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మానవ వనరుల విభాగం అధిపతిగా ఇద్దరు ప్రొఫెసర్లు నాట్ విల్లింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ సుజాతకుమారిని విభాగ అధిపతిగా నియమించే అవకాశాలున్నాయి. ఈమేరకు ఒకటి రెండురోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశాలుంటాయని సర్వత్రా భావిస్తున్నారు. సమస్య కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ దృష్టికి వెళ్లినా త్వరతగతిన సమస్యను పరిష్కరించి విభాగం అధిపతిని నియమించటంలో జాప్యం చేయటం పట్ల పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
పత్తాలేని ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు
పూర్తరుున రెండో సెమిస్టర్ పరీక్షలు ఆరు నెలలు గడిచినా తప్పని నిరీక్షణ ఆందోళనలో ఎంకామ్ విద్యార్థులు కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఎంకామ్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాల విడుదలతో తీవ్ర జాప్యం చోటుచేసుకోవడంతో విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అరుుతే, వివిధ కోర్సుల పరీక్షలు సకాలంలో జరగకపోవడం ఫలితాల వెల్లడిపై ప్రభావం చూపుతోంది. అరుుతే, పరీక్షలు ముగిసి దాదాపు ఆర్నెల్లు గడిచినా ఫలితాలు వెలువడక పోవడానికి అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొంటున్నారు. మూడు జిల్లాలు.. నాలుగు వేల మంది విద్యార్థులు.. యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో గల పీజీ కళాశాలలు, క్యాంపస్‌లో ఎంకామ్ మొదటి సెమిస్టర్ పరీ క్షలు ఈఏడాది జనవరి 17నుంచి 29వ తేదీ వరకు నిర్వహించారు. సుమారు నాలుగువేల మంది విద్యార్థులు హాజరయ్యూరు. అరుుతే, వాల్యూయేషన్‌లోనే అధికారులు జాప్యం చేస్తున్నారని విమర్శలు వస్తున్నారుు. పీజీ కోర్సుల్లో ఇంటర్నల్, ఎక్సటర్నల్‌గా రెండు దఫాలు జవా బు పత్రాల వాల్యూయేషన్ ప్రక్రియ చేపడతా రు. తొలిసారి ఇంటర్నల్‌గా కేయూలోని అధ్యాపకులు వాల్యూయేషన్ చేశాక ఎక్స్టర్నల్గా మరో యూనివర్సిటీ అధ్యాపకులతో వాల్యూయేషన్ చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ వి ద్యార్థుల్లో ఎవరికైనా ఒక సబ్జెక్టు పేపర్లో మొ దటి వాల్యూయేషన్‌లో వచ్చిన మార్కుల కం టే రెండో వాల్యూయేషన్‌కు మధ్య 19 మా ర్కుల తేడా ఉంటే ఆ సబ్జెక్టు పేపర్ జవాబుపత్రాన్ని థర్డ్ వాల్యూయేషన్ చేయిస్తారు. ఇలా ఎంకామ్‌లో 1700 జవాబుపత్రాలు థర్డ్ వా ల్యూయేషన్కు వెళ్లాయని తెలుస్తోంది. ఆ ప్ర క్రియ కూడా పూర్తియిందని తెలుస్తోంది. అ రుుతే, ఫలితాలు ఆలస్యం కావడంతో జవాబుపత్రాల వాల్యూయేషన్ ప్రక్రియ సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? లేదా? అనే అనుమానాలు తలెత్తుతున్నారుు. ఏ కోర్సు పరీక్షల ఫలితాలై నా 40రోజుల్లో విడుదల చేయూలి. కానీ, ఎం కామ్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు పరీక్షలు నిర్వహించిన ఆర్నెల్లు గడించినా విడుదల కావడంలేదు. ఇక రెండో సెమిస్టర్ పరీ క్షలు కూడా ఇటీవలే పూర్తియ్యాయి. వాస్తవం గా మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యూకే రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ 2014-2015విద్యాసంవత్సరంలో ఇప్పటికే రెండో సెమిస్టర్ పరీక్షలు కూడా ఆలస్యంగా ఇటీవల ముగిశా రుు. వాటి ఫలితాలు కూడా వెల్లడించాల్సి ఉం ది. ఇక ఆయా విద్యార్థులకు రెండో సంవత్సరంలో మూడో సెమిస్టర్ తరగతులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలే విడుదల కాకపోవబం, రెండో సెమిస ్టర్ పరీక్షలు ఇటీవల ముగియడంతో ఫలితాలు మరింత జాప్యమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎంకామ్ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేయూలని విద్యార్థులు కోరుతున్నారు. -
డిగ్రీ సిలబస్ మార్పుల అమలెప్పుడు?
* పట్టించుకోని ప్రధాన యూనివర్సిటీలు * ఇప్పటికే ప్రారంభమైన తరగతులు * ఇంకా ముద్రణకు నోచుకోని పుస్తకాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా డిగ్రీ కోర్సుల్లో సిలబస్ మార్పులపై ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టినా ప్రధాన యూనివర్సిటీలు మాత్రం వాటి అమలుపై దృష్టి సారించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1,200 వరకు డిగ్రీ కాలేజీలు ఉంటే ప్రధానమైన ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల పరిధిలోనే 800కు పైగా కాలేజీలున్నాయి. సిలబస్ మార్పు అమలుపై ఆ రెండు యూనివర్సిటీల నిర్లక్ష్య వైఖరి కారణంగా వాటి పరిధిలోని సిలబస్ మారుతుందా లేదా అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. ఇప్పటికే డిగ్రీ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. అయితే ఎక్కువ డిగ్రీ కాలేజీలు ఉన్న ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలు స్పందించకపోవడంతో మార్పు చేసిన సిలబస్‌కు అనుగుణంగా తెలుగు అకాడమీ పుస్తకాలను రూపొందించలేకపోతోంది. ఆ యూనివర్సిటీలు తమ అకడమిక్ కౌన్సిళ్లలో మార్పు చేసిన సిలబస్ అమలుకు తీర్మానం పంపితేనే కొత్త పుస్తకాలు ముద్రణకు నోచుకుంటాయని తెలుగు అకాడమీ పేర్కొంటోంది. ఇప్పటివరకు 300కు పైగా కాలేజీలు ఉన్న శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ యూనివర్సిటీలు మాత్రమే సిలబస్ మార్పుల అమలుకు తమ అకడమిక్ కౌన్సిళ్లలో తీర్మానం చేశాయి. అంతేకాదు ఈ మార్పులు ప్రథమ సంవత్సరలోనే చేసినందున ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లోనూ ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలను తొలగించి, తెలంగాణ అంశాలను చేర్చుకునేందుకు ఉన్నత విద్యా మండలి అనుమతి ఇచ్చింది. పోటీ పరీక్షలకు ఇవే ప్రామాణికం రాష్ట్రంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలోని సోషియాలజీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఫిజిక్స్, తెలుగు, కామర్స్, ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టుల సిలబన్ను మార్పు చేసింది. ఏపీకి సంబంధించిన అంశాలను తొలగించి, తెలంగాణకు సంబంధించిన అంశాలపై సిలబస్‌ను రూపొందించింది. భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ పోటీ పరీక్షల్లో తెలంగాణపై ప్రశ్నలు ఉండనున్నాయి. గ్రూపు-1లో తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా పేపరునే పెట్టబోతోంది. ఈ నేపథ్యంలో సిలబస్ మార్పులకు యూనివర్సిటీలు అన్నీ ఆమోదం తెలపకపోవడంతో గందరగోళం ఏర్పడింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు కొత్త సిలబస్ అందక ఆందోళన చెందుతున్నారు. -
కేయూలో షార్ట్ ఫిలిం ఫెస్టివల్
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో జూన్ 15, 16, 17వ తేదీల్లో ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్‌ను నిర్వహించనున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ చెప్పారు. హన్మకొండలోని ఆఫీసర్స్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఫిలిం పెస్టివల్ వివరాలను వెల్లడించారు. గతంలో రాష్ట్రస్థాయిలో హైదరాబాద్‌లో మాత్ర మే ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్ నిర్వహించేవారన్నారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా వరంగల్‌లో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఉత్సవాలను మూడురోజులపాటు నిర్వహించనున్నట్లు వివరించారు. తద్వారా వరంగల్ జిల్లాలోని చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, గుర్తింపు పొందడంతోపాటు పర్యాటకపరంగా ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ ఫిలిం ఫెస్టివల్లో 20 దేశాల నుంచి వంద షార్ట్ఫిలిమ్స్ ఎం ట్రీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో ఫెస్టివల్ ఫౌండర్ జి.భద్రప్ప, ఫెస్టివల్ ైచె ర్మన్ నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ షార్ట్‌ఫిలిం ఫెస్టివల్ పోస్టర్‌ను మంత్రి ఆవిష్కరించారు. -
కేయూ పీజీ సెట్ షెడ్యూల్
కేయూ క్యాంపస్: కాకతీయ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు కేయూ పీజీ సెట్-2015 పరీక్షలు జూన్ 17 నుంచి 24 వరకు నిర్వహించనున్నట్లు కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు, కేయూ అడ్మిషన్ల ఇన్చార్జి డెరైక్టర్ డాక్టర్ ఎస్.నర్సింహాచారి తెలిపారు. ఈ సంవత్సరం వరంగల్‌తోపాటు కరీంనగర్లో కూడా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జూన్ మొదటి వారం నుంచి అభ్యర్థులకు హాల్‌టికెట్లను పంపిణీ చేయనున్నామని, ఇతర వివరాలను కేయూ వెబ్సైట్లో చూడవచ్చన్నారు. అన్ని సబ్జెక్టులకు కలిపి 37,560 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. కాగా, ఎంఏ సంస్కృతి, ఎంఏ హిందీ, ఎంఏ ఉర్దూ, ఎమ్మెస్సీ నాటో సైన్స్ అండ్ నానోటెక్నాలజీ, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుల్లో డిగ్రీ స్థాయిలో మార్కుల మెరిట్‌ను బట్టి ప్రవేశాలు కల్పించనున్నారు. -
‘పది’లో కాకతీయ ప్రభంజన
విద్యార్థులను సన్మానించిన ఆర్ఐఓ నిజామాబాద్‌అర్బన్ : పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన కాకతీయ విద్యార్థులను ఆర్ఐఓ విజయ్‌కుమార్ మంగళవారం సన్మానించారు. 10 జీపీఏ సాధించిన సీహెచ్.దినేష్, ఆర్.జిగీషతో పాటు 9.8 జీపీఏ సాధించిన ఏడుగురిని అభినందించారు. ఈ సందర్భంగా ఆర్ఐవో మాట్లాడుతూ ఉత్తమఫలితాలు సాధించడంలో కాకతీయ విద్యార్థులు ముందంజలో ఉంటారని అన్నారు. 9 రాష్ట్ర స్థాయి జీపీఏ మార్కులతో 102 మంది, 8 రాష్ట్ర స్థాయి గ్రేడు మార్కులతో 300 మంది విద్యార్థులు ప్రభంజనం సృష్టించారన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం ఫరీదొద్దీన్ మాట్లాడుతూ.. ఇటీవల వెలువడిన ఐఐటీ రామయ్య ఫలితాల్లో కుమారి, జగదీష్, సీహెచ్.భానుతేజ ఎంపికయ్యారన్నారు. అంతేకాకుండా ఐఐటీ మెరుున్స్‌లో 20 మంది విద్యార్థులు సత్తా చాటారని అన్నారు. భవిష్యత్‌లో ఇదే స్ఫూర్తితో మెరుగైన ప్రణాళికలతో విద్యార్థులను తీర్చిదిద్ది జాతీయ స్థాయిలో ప్రతిభ చూపేలా కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో కాకతీయ హైస్కూల్ అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకుందాం
- రేపటి నుంచి 25వరకు విలేజ్ క్యాంపెరుున్ - 25న జిలా ్లకేంద్రంలో ర్యాలీ - విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షురాలు ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే కేయూ క్యాంపస్ : ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతపై గ్రామాల్లో, బస్తీల్లో చైతన్య కార్యక్రమాలను నిర్వహించబోతున్నామని విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షురాలు, కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ప్రొఫెసర్ కె.కాత్యాయనీ విద్మహే తెలిపారు. కాకతీయ యూనివర్సిటీలోని గెస్ట్‌హౌస్‌లో విద్యాపరిక్షణ కమిటీ బాధ్యులు, వివిధ విద్యార్థి సంఘాలు, ప్రజాసంఘాల బాధ్యులు ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్నిరకాల వసతులు, సౌకర్యాలు కల్పించి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రేషనలైజేషన్ పేరుతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే నెపంతో నాలుగు వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ పాఠశాలల ను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలను చైతన్యపరిచేందుకు ‘గ్రామాలకు తరలండి, బస్తీలకు తరలండి’ అనే కార్యక్రమాలను విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి నిర్వహించబోతున్నట్లు తెలి పారు. స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడి తమ గ్రామాల్లోని పాఠశాలలను పరిక్షించుకోవాల్సిన బాధ్యతపై చైతన్యం కలిగిస్తామన్నారు. 12న తొలుత ఆదర్శ గ్రామం గంగదేవునిపల్లి నుంచి ఈ కార్యాక్రమం ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 25న జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.గంగాధర్, విద్యాపరిరక్షణ కమిటీ జిల్లా సహాధ్యక్షుడు ఎం. రవీందర్, విద్యా పరిక్షణ కమిటీ జిల్లా కన్వీనర్ టి.లింగారెడ్డి, కోకన్వీనర్ కడారి భోగేశ్వర్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర బాధ్యులు అభినవ్, పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యద ర్శులు పైండ్ల యాకయ్య, బి.నరసింహారావు, డీఎస్‌యూ జిల్లా కార్యదర్శి జనార్దన్, టీవీవీ జిల్లా బాధ్యులు బి.బాలరాజు, పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి దుర్గం సారయ్య, కేయూ అధ్యక్షుడు సూత్రపు అనిల్ మాట్లాడారు. ఆయా విద్యార్థి సంఘాల బాధ్యులు మాట్లాడుతూ విద్యాపరిక్షణ కమిటీ ఈ నెల 12నుంచి చేపట్టబోతున్న గ్రామాలకు తరలండి చైతన్య కార్యక్రమంలో తామంతా కూడా భాగస్వాములు అవుతామని వెల్లడించారు. -
టార్గెట్ స్టూడెంట్స్!
వర్సిటీ విద్యార్థులపై మావోయిస్టుల కన్ను ఉద్యమంలోకి ఆక ర్షించే యత్నాలు చాపకింద నీరులా పార్టీ సంస్థాగత నిర్మాణం విద్యావంతులను చేర్చుకుంటున్నట్లు నిఘా వర్గాల హెచ్చరిక అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం కరీంనగర్: మావోయిస్టులు చాపకింద నీరులా ఉద్యమాన్ని బలోపేతం చేసుకునే పనిలో ఉన్నారని నిఘా వర్గాలు గుర్తించాయి. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం ఏ మాత్రం లేని ప్రాంతాల్లో యువకులను ఉద్యమంలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిఘా వర్గాల వద్ద కచ్చితమైన సమాచారం ఉంది. రాష్ట్ర విభజనకు ముందు, తర్వాత కూడా తెలంగాణలో మావోయిస్టుల కార్యకలాపాలు దాదాపు లేనేలేవు. కరీంనగర్ జిల్లా మంథని ప్రాంతంలో నామమాత్రంగా, ఖమ్మం జిల్లా చింతూరు ప్రాంతంలో (ఛత్తీస్‌గఢ్ సరిహద్దు) తప్ప ఎక్కడా వారి కదలికలు లేవు. అయితే పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా ఉద్యమంలోకి విద్యావంతులను ఆకర్షించేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. దీంతో అప్రమత్తమైన ఉత్తర తెలంగాణ పోలీసులు కాలేజీల్లో చదువుకుంటూ అదృశ్యమైన యువకుల జాడ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచిఇప్పటికే కొందరు విద్యార్థులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వారి విచారణలో వెల్లడైంది. ‘విశ్వవిద్యాలయాల్లో మావోయిస్టు కార్యకలాపాలపై మనం నిఘా వేయాలి. ఇప్పటికే కొందరు విద్యార్థులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తంగా ఉండాలి’ అని ఇటీవల శాంతిభద్రతలపై సమీక్షలో ఓ ఎస్పీ పేర్కొన్నట్లు తెలిసింది. ఉద్యమంలో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులతోపాటు, పరిస్థితుల ప్రభావంతో లొంగిపోయిన మాజీలను కూడా తిరిగి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని పోలీసులు భావిస్తున్నారు. హరిభూషణ్ రాకతో... మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ఎన్నికైనప్పటి నుంచి సంస్థాగత నిర్మాణం జోరందుకున్నట్లు తెలుస్తోంది. దళిత, గిరిజన, బలహీన వర్గాలనే కాకుండా మేధావులు, విద్యావంతులను ఆకర్షించాలని భావిస్తున్న మావోయిస్టు అగ్రనేతలు ఆ దిశగా ప్రయత్నాలను తీవ్రం చేసినట్లు తెలుస్తోంది. వచ్చే వర్షాకాలంలో దట్టంగా మారే అడవులను అనుకూలంగా మార్చుకుని ప్రజా దర్బారులు నిర్వహించాలని, పలు సంచనాలతో తమ ఉనికి చాటుకోవాలని మావోయిస్టులు ప్రణాళిక రూపొందించుకున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటి నుంచే రాజకీయ నేతలు, పోలీసు అధికారులు, ప్రభుత్వానికి సంబంధించిన సమగ్ర వివరాలను ఇప్పటినుంచే సేకరిస్తున్నట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీంతో మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లోని అన్ని పోలీస్స్టేషన్ల సిబ్బందిని సర్కారు అప్రమత్తం చేసింది. రాష్ర్ట సరిహద్దు ప్రాంతాల్లో కూంబింగ్‌ను కూడా పోలీసులు విస్తృతం చేశారు. మావోయిస్టుల దాడులను ఎదుర్కొనడం, ఆయుధాల వినియోగంపైనా పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు సమాచారం. -
కేయూలో స్పాట్ వాల్యుయేషన్ రేపటి నుంచే..
వరంగల్ : కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ జవాబు పత్రాల స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఏప్రిల్ 27వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని పరీక్షల నియంత్రణాధికారి బి.వెంకట్రామ్రెడ్డి తెలిపారు. ఉదయం 9 గంటల నుండి ఇంగ్లిష్, జువాలజీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, తెలుగు పత్రాలు... మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాథ్స్, కెమిస్ట్రీ, కామర్స్ పత్రాల వాల్యుయేషన్ జరుగుతుందని చెప్పారు. పరీక్షల విభాగంలో ఓ అధికారికి, కాంట్రాక్టు లెక్చరర్‌కు మధ్య ఏప్రిల్ 18న వివాదం జరగడంతో స్పాట్ వాల్యుయేషన్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. -
నేను కొనసాగలేను
కేయూ క్యాంపస్ : ఉద్యోగ సంఘాల ఒత్తిళ్లతోపాటు వివిధ రకాల సమస్యల నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ పదవికి రాజీనామా చేసిన ప్రొఫెసర్ రంగారావు తాను ఆ పదవిలో కొనసాగలేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు కేయూ ఇన్చార్జి వీసీ వీరారెడ్డికి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రం సమర్పించినట్లు సమాచారం. ఈ నెల 13న యూనివర్సిటీలో జరిగిన పరిణామాలు, అనేక సమస్యలు పరిష్కరించలేని స్థితి, ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అరుుతే ఇదే విషయమై ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వీరారెడ్డి ప్రొఫెసర్ రంగారావుకు ఫోన్ చేసి ఏప్రిల్ 18 వరకు తాను ఇన్చార్జీ వీసీగా ఉంటానని, అప్పటి వరకైనా ఉండాలని ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా కొనసాగాలని కోరినట్లు సమాచారం. అరుుతే ప్రొఫెసర్ రంగారావు మాత్రం ఆ బాధ్యతలను మళ్లీ స్వీకరించబోననిస్పష్టం చేసినట్లు తెలిసింది. యూనివర్సిటీలోని ఉద్యోగ సంఘాల్లోని పలువురు కూడా రంగారావును ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా కొనసాగాలని కోరినా ఉండబోనని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇన్చార్జి వీసీ వీరారెడ్డి యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలను ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకపోనున్నారు. ఈ వ్యవహారం కాస్తా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన మరోప్రొఫెసర్ను ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది. గాడితప్పిన పాలన క్రమశిక్షణ తప్పిన కాకతీయ యూనివర్సిటీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కూడా కొన్నిపనులు చేయాలనే వారు అధికారులపై వివిధరకాలుగా ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. దీంతో ఈ పదవి ముళ్ల కిరీటంగా మారిం ది. జిల్లాకు చెందిన కడియం శ్రీహరి విద్యాశాఖమంత్రిగా ఉన్నందున యూనివర్సిటీకి సంబంధించి రెగ్యులర్ వీసీని, రెగ్యులర్ రిజిస్ట్రార్‌ను త్వరగా నియమించేలా చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కేయూ ఇన్చార్జి రిజిస్ట్రార్ రాజీనామా?
ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని ప్రశ్నించిన సంఘాలు అబ్జర్వర్ల డ్యూటీలు వేయాలంటూ మరికొందరి ఒత్తిళ్లు ఇన్చార్జి రిజిస్ట్రార్, ఫైనాన్స్ ఆఫీసర్‌కు మధ్య విభేదాలు కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు తన పదవికి శుక్రవారం రాజీనామా చేసినట్లు తెలిసింది. తాను రాజీ నామా చేస్తున్నట్లు ఆయన ఉద్యోగ సంఘాల సమక్షంలో చెప్పి యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ కె.వీరారెడ్డిని కలవడం కలకలం సృష్టించింది. యూనివర్సిటీలోని అన్ని కేట గిరీల ఉద్యోగాల్లో ఎంతమంది పనిచేస్తున్నారో తెలియజేయాలని ఇటీవల ప్రభుత్వం ఓ ప్రొఫార్మాను పంపి వివరాలను అందజేయూలని ఆదేశించిన విషయం తెలి సిందే. అంతేగాక యూనివర్సిటీ టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులకు వేతనాల కోసం ఇచ్చే బ్లాక్గ్రాంటు నిధులు రాలేదు. ఫలితంగా ఫిబ్రవరికి సం బంధించిన వేతనాలను సకాలంలో ఇవ్వలేకపోయారు. తర్వాత యూనివర్సిటీ కళాశాలల్లోని వివిధ విభాగాల నుంచి అంతర్గత నిధులు సమీకరించి కొందరికి వేతనాలు ఇచ్చినప్పటికీ ఇంకా కొందరి ఉద్యోగులకు వేతనాలివ్వలేదు. ఈ క్రమంలోనే శుక్రవారం వివిధ ఉద్యోగ సంఘాల బాధ్యు లు యూనివర్సిటీ ప్రిన్సిపాల్ కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఎందుకు ఇవ్వడం లేదని ఇన్చార్జీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రంగారావును ప్రశ్నించారు. దీంతో తాను ఇప్పటికే వేతనాలు ఇవ్వాలని కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ రమేష్‌కుమార్‌ను కోరానని సమాధానమిచ్చారు. అయితే యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ కార్యాలయం నుంచి రావాల్సిన నిధు లు రాకపోవడంతోనే వేతనాలు ఇవ్వలేకపోతున్నట్లు ఫైనాన్స ఆఫీసర్ చెబుతున్నట్లు రంగారావు పేర్కొన్నా రు. తాను కూడా యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖను కూడా పెట్టానన్నారు. దీంతో మిగతా ఉద్యోగులకు ఎలాగైతే వేతనాలు ఇచ్చారో వీరికి కూడా వేతనాలు యూనివర్సిటీయే ఇవ్వాలని వివిధ ఉద్యోగ సంఘాల బాధ్యులు ఇన్చార్జీ రిజిస్ట్రార్‌తో వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే అనేక సమస్యలున్నాయని, అబ్జర్వర్ల డ్యూటీల కోసం కూడా కొందరు తనపై ఒత్తిడి చేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారని ఇన్చార్జీ రిజిస్ట్రార్ వారితో వాపోయూ రు. తనకు ఆరోగ్యం కూడా సహకరించటం లేదన్నారు. ఆ వెంటనే తాను ఇన్చార్జీ రిజిస్ట్రార్ పదవికి రాజీనామా చేస్తానని అక్కడికక్కడే ఓ లేఖ రాసి అక్కడనున్న సిబ్బం ది ఒకరికి టైప్ చేయాలని సూచించారు. అదే సమయంలోనే అకౌంట్స్ విభాగం నుంచి పంపాల్సిన డాటా విషయమై ఆయనకు కేయూ ఇన్చార్జి వీసీ వీరారెడ్డి ఫోన్ చేయగా తాను రాజీనామా చేస్తున్నట్లు రంగారావు చెప్పారు. ఆ తర్వాత తనచాంబర్ నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయా రు. నేరుగా ఇన్ చార్జి వీసీ వద్దకు వెళ్లి రాజీనామా పత్రం సమర్పించినట్లు తెలిసింది. శుక్రవారం రాత్రి కేయూ ఇన్చార్జి వీసీ వీరారెడ్డిని ‘సాక్షి’ సంప్రదించగా తనకు రంగారావు రాజీ నామా లేఖ అందలేదని, ఫోన్లో చెప్పగా వద్దని వారించినట్లు సమాధానమిచ్చారు. స్పందించని యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ గ్రాంటు ఇవ్వటంలో జాప్యం చేసింది. దీంతో ప్రభుత్వ సూచన మేరకు అంతర్గత నిధుల సేకరణకు ఇన్చార్జీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రంగారావు యూనివర్సిటీ కాలేజీలకు, పరీక్షల విభాగానికి, అడ్మిషన్ల డెరైక్టరేట్‌కు, దూరవిద్యాకేంద్రానికి లేఖలు రాశారు. యూనివర్సిటీల కాలేజీల వద్ద ఉన్న ట్యూషన్ ఫీజుల నిధులను ఇవ్వాలని కోరగా అందులో యూనివర్సిటీ అడ్మిషన్ల డెరైక్టరేట్ నుంచి రూ. కోటి, పరీక్షల విభా గం నుంచి రూ.కోటి, ఫార్మసీ కాలేజీ నుంచి రూ.5 లక్ష లు, ఆర్ట్స్ కాలేజీ నుంచి రూ.22 లక్షలు ఇచ్చారు. అయితే ఈ నెల 12 వరకు యూనివర్సిటీ కాలేజి ప్రిన్సిపాల్ కార్యాలయం నుంచి ట్యూషన్ ఫీజులు పంపలేదు. దీం తో ఆ కార్యాలయ ఉద్యోగులకు వేతనాలిచ్చేందుకు ఫైనాన్స్ ఆఫీసర్ రమేష్‌కుమార్ నిరాకరించారు. నిధులేమి ఉందని ప్రిన్సిపాల్‌కు చెప్పినా ఇవ్వనప్పుడు వేతనాలు ఎలా ఇస్తారని నిరాకరించినట్లు రమేష్‌కుమార్ వాదన. ఏ కాలేజీలైతే నిధులు ఇస్తాయో.. ఆ కాలేజీ సిబ్బందికి వేతనాలు ఇస్తున్నామనేది ఆయన వాదన. ఇన్చార్జి రిజిస్ట్రార్ రాజీ నామా చేసినట్లు చెప్పి వెళ్లిపోయాక, నిధుల వ్యవహారం పై చర్చతో ప్రిన్సిపాల్ రూ.25 లక్షల చెక్ పంపడం కొసమెరుపు. రూ.7.70 కోట్లు బ్లాక్ గ్రాంట్ మంజూరు కేయూకు ఎట్టకేలకు ప్రభుత్వం శుక్రవారం రూ.7 కోట్ల 70 లక్షలు బ్లాక్ గ్రాంటు నిధులు మం జూరు చేసింది. గతంలో రూ.17 కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రతినెలా రూ 6.50 కోట్ల నుంచి రూ.7 కోట్ల వరకు టీచింగ్, నాన్‌టీచింగ్, పార్ట్‌టైం, కాంట్రాక్ట్, కొందరు తాత్కాలిక, టైంస్కేల్, లం ప్సమ్ ఉద్యోగుల వేతనాలకు అవస రం అవుతుండగా 2 నెలల కోసం ప్రస్తుతం రూ.7.70 కోట్లు మంజూరయ్యాయి. దీంతో కొంత ఊరట కలిగినట్లయింది. ఏటా రూ.83 కోట్లకుపైగా నిధులు అవసరమవుతుండగా ప్రభుత్వం నుంచి రూ 47.88 కోట్లు మాత్రమే బ్లాక్గ్రాంటు నిధులు వస్తున్నాయి. -
18 నుంచి కేయూ డిగ్రీ వార్షిక పరీక్షలు
- 2,33,782 మంది విద్యార్థులు - 153 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని డిగ్రీ కళాశాలల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఈనెల 18వ తేదీ నుంచి జరుగనున్నాయి. ఈ మేరకు పరీక్షల నియంత్రణ అధికారులు మూడు జిల్లాలో మొత్తం 153 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లాలో 60, ఖమ్మం జిల్లాలో 46 , ఆదిలాబాద్ జిల్లాలో 47 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా, పరీక్షలకు మొత్తం 2,33,782 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో బీఏ ఫస్టియర్‌లో 19,671, సెకండియర్‌లో 13,874, ఫైనల్ ఇయర్లో 10,292 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. అలాగే బీకాం ఫస్టియర్‌లో 31,182 మంది, సెకండియర్‌లో 26,717 మంది, ఫైనల్ ఇయర్లో 21,575, బీఎస్సీ ఫస్టియర్‌లో 43,182, సెకండియర్‌లో 36,527, ఫైనల్ఇయర్లో 29,707, బీబీఎం ఫస్టియర్‌లో 377, సెకండియర్‌లో 353, ఫైనల్ ఇయర్లో 325 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. కాగా, డిగ్రీ సెకండియర్, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్నాయి. అలాగే మొదటి సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎంవీ రంగారావు, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ బి. వెంకట్రామ్రెడ్డి బుధవారం వెల్లడించారు. ఈనెల 18నుంచి ఏప్రిల్ 18వతేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు చెప్పారు. ఫస్టియర్, ఫైనల్ఇయర్ పరీక్షలు ఒకే రోజు ఉంటాయని, మరుసటి రోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు టైంటేబుల్ ప్రకారం జరుగుతాయని వారు పేర్కొన్నారు. -
అంతా మాకు తెలియాలి..!
కేయూ ఉద్యోగుల వివరాలు అడిగిన తెలంగాణ ప్రభుత్వం కేటగిరీల వారీగా జాబితా అందించాలని ఆదేశాలు లెక్కలు అందించిన తర్వాతనే బ్లాక్ గ్రాంట్ మంజూరు వివరాల సేకరణలో ఇన్చార్జి రిజిస్ట్రార్ కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో పారదర్శక పాలన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా యూనివర్సిటీలో ఎంతమంది పనిచేస్తున్నారనే వి షయంపై వివరాలు అందించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇన్చార్జి రిజిస్ట్రార్ రంగారావు వివరాల సే కరణలో నిమగ్నమయ్యారు. కాగా, ప్రభుత్వం అడిగిన వివరాలతో ఫిబ్రవరికి సంబంధించిన వేతనాల విడుదలకు బ్రే క్ పడింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కేయూ సమస్యలతో సతమతమవుతుంది. రెగ్యు లర్ వీసీ లేకపోవడంతో యూనివర్సిటీ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతోపాటు దినసరి వేతన ఉద్యోగులను ఇష్టారాజ్యంగా నియమించుకోవడంతో సమస్యలు త లెత్తుతున్నాయి. కాగా, యూనివర్సిటీకి ఏటా రూ.48 కోట్ల బ్లాక్ గ్రాంట్ మంజూరవుతున్నా అవి పూర్తిగా సరిపోవడంలేదు. ఈ క్రమంలో యూనివర్సిటీలో అసలు ఎంతమంది టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు.. పెన్షన ర్లు, కాంట్రాక్ట్, దినసరి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంతమంది.. సెల్ఫ్ ఫైనాన్స ద్వారా నిర్వహిస్తున్న కోర్సులు, వా టి ఆదాయం, ఖర్చులు, ఫిక్స్డ్ డి పాజిట్లు, 2014-2015 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద ఎన్ని నిధులు పొందారనే వివరాలను తెలుపాలని ప్రభుత్వం ప్రత్యేక ప్రొఫార్మాను రూపొందించి ఇన్చార్జి రిజిస్ట్రార్‌కు పంపించింది. అలాగే ప్రస్తుతం కావాల్సిన పో స్టుల మంజూరు, దినసరి వేతన ఉద్యోగులను ఏయే సంవత్సరంలో ఎంతమందిని నియమించుకున్నారో తెలుపాలని కోరింది. కాగా, ప్రభుత్వం అడిగిన వివరాలను స్పష్టంగా తెలియజేస్తేనే బ్లాక్ గ్రాంట్ మంజూరు కానుంది. రూ. 17 కోట్లు బ్లాక్‌గ్రాంట్ మంజూరు.. కాగా, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.17 కోట్లు బ్లాక్ గ్రాంట్ కింద మంజూరు చేసింది. వాస్తవంగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు విరమణ పొందినా అందుకు సంబంధించిన వివరాలు ప్రభు త్వానికి తెలియజేయకుండా మొత్తం పోస్టుల మంజూరు పేరిట అధికారులు బ్లాక్ గ్రాంట్‌ను విడుదల చేసుకుంటూ వస్తున్నట్లు తెలిసింది. అయితే తెలంగాణ ప్రభుత్వం గతం లో, ఇటీవల భర్తీ చేసిన పోస్టుల వివరాలను కూడా అడుతుండడం గమనార్హం. ఇదిలా ఉండగా, 2013-2014 కే యూ బడ్జెట్ నివేదిక ప్రకారం అధ్యాపకులకు ఏడాదిపాటు వేతనాలు చెల్లింపులకు రూ 33.86 కోట్లు, నాన్ టీచింగ్ వేతనాలకు రూ.17.80 కోట్లు, పెన్షనర్లకు రూ. 6.50కోట్లు, దినసరి వేతన ఉద్యోగుల్లో కొందరికి యూనివర్సిటీ నుంచి చెల్లించేది రూ. 6.32 కోట్లుగా.. మొత్తంగా రూ. 83.98 కో ట్లు కాగా అప్పటిప్రభుత్వం విడుదల చేసిన బ్లాక్ గ్రాంట్ రూ.48 కోట్లు మాత్రమే వచ్చింది. దీంతో మిగతా లోటు రూ. 36 కోట్ల భారాన్ని దూరవిద్య కేంద్రం, పరీక్షల వి భాగం, అడ్మిషన్ల డెరైక్టరేట్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, ఇతర యూనివర్సిటీల కాలేజీల నుంచి వచ్చిన ఆదాయం ద్వారా సమకూర్చుకున్న పరిస్థితి ఉంది. 223 మంది దినసరి ఉద్యోగుల నియామకం.. యూనివర్సిటీ కాలేజీల్లోనూ, వివిధ విభాగాల్లోనూ లం ప్సమ్, దినసరి వేతన ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు. కాగా, గత మూడేళ్లలో 223 మంది దినసరి వేతన ఉద్యోగులను ఇష్టారాజ్యంగా నియమించినట్లు సమాచారం. అయి తే వారు ఎక్కడ పనిచేస్తున్నారో ఆ విభాగాల నుంచే సంబంధిత అధికారులు వేతనాలు ఇస్తున్నారు. ఇంకా కొందరి ఉద్యోగుల లెక్కలు యూనివర్సిటీ అధికారుల వద్దలేవు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్ని కేటగిరీల ఉద్యోగుల వివరాలు ఆదాయం, ఖర్చులన్ని ప్రభుత్వం లేఖ ద్వారా అడగడంతో ఇన్చార్జి రిజిస్ట్రార్ వాటిని అందించేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, యూనివర్సిటీ కాలేజీలకు, క్యాంపస్‌లోని అ న్ని బ్రాంచ్‌ల హెడ్లకు లేఖను పంపుతూ మీమీ వద్ద పనిచేస్తున్న కేటగిరీల ఉద్యోగుల వివరాలు, దినసరి, లంప్సమ్ ఉద్యోగులతో సహా కాంట్రాక్ట్, పార్ట్‌టైం ఉద్యోగుల పేర్లతో ఈనెల 10లోగా తమకు పంపాలని రిజిస్ట్రార్ ఆదేశించారు. టీచింగ్‌నాన్, టీచింగ్ ఉద్యోగుల సంఖ్య.. కేయూలో టీ చింగ్ పోస్టులు మంజూరైనవి 382. ఇందులో ప్రస్తుతం పనిచేస్తున్న అధ్యాపకుల సంఖ్య 236. ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు 146 వరకు ఉన్నాయి. కాగా, నాన్‌టీచింగ్ ఉద్యోగులు వివిధ కేటగిరీల్లో కలిపి 634 పోస్టులు మంజూరుకాగా, ప్రస్తుతం 488 మంది రెగ్యులర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతోపాటు దినసరి, లం ప్సమ్ ఉద్యోగులు 450 మంది వరకు పనిచేస్తున్నారు. వేతనాలు ఇచ్చేందుకు ప్రత్నామ్నాయ మార్గాలు.. బ్లాక్ గ్రాంట్ మంజూరు కాకపోవడంతో ఫిబ్రవరి వేతనాలు ఇంకా విడుదల కాలేదు. దీంతోఅధికారులు ప్రత్నామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ఫిబ్రవరి వేతనాలు చెల్లించాలం టే రూ. 6.50 కోట్ల వరకు అవసరం ఉంది. ఇదిలా ఉండగా, దూరవిద్యా కేంద్రం ద్వారా తమకు రూ. 2కోట్లు కావాలని ఇన్చార్జి రిజిస్ట్రార్ రంగారావు కోరారు. కాగా, దీనిపై దూరవిద్యా కేంద్రం ఇన్చార్జి డెరైక్టర్ ప్రొఫెసర్ సీహెచ్ దినేష్‌కుమార్ ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. -
వెంబడించారు... అపహరించారు
బైక్ నుంచి రూ.2.95 లక్షలు మాయం భీమారం : ఇంటి నిర్మాణానికి బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకొస్తున్న ఓ వ్యక్తిని వెంబడించి డబ్బులు అపహరించారు. ఈ సంఘటన హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం... బ్యాంక్ కాలనీకి చెందిన భాస్కర్ లింగం స్థానికంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇందుకోసం బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకురావడానికి దయం వెళ్లాడు. పెట్రోల్ పంప్ సమీపంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో రూ.2లక్షలు డ్రా చేశాడు. అక్కడి నుంచి మర్కజీ పాఠశాల ఎదుట ఉన్న మరో బ్యాంక్ నుంచి రూ.95 వేలు తీసుకున్నాడు. భాస్కర్‌లింగం ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేస్తున్న క్రమంలోనే కొంతమంది దుండగులు అతడిని అనుసరించినట్లు తెలుస్తోంది. మర్కజీ ఎదుట ఉన్న బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకుని భీమారం వైపునకు వస్తున్న క్రమంలో వెనుక వైపు నుంచి ఏదో ద్రవపదార్ధం ఆయనపై చల్లారు. దీంతో కొంత దూరం వరకు ఆయన ఇబ్బందులకు గురయ్యాడు. కాకతీయ యూనివర్సిటీ సమీపంలోకి రాగా, ఆయన బైక్ (కెనెటిక్ హోండా) పంక్చర్ అయింది. తన వాహనాన్ని కొద్ది దూరం నెట్టుకెళ్లాడు. అక్కడికి వెళ్లి ట్యూబ్‌ను పరిశీలిస్తే... గుండుపిన్తో టైర్‌కు కుచ్చినట్లు గ్రహించాడు. పంక్చర్‌ను అతికించుకున్న తర్వాత అక్కడి నుంచి సమీపంలోని ఓ కిరాణం షాపుకు వచ్చి కోడి గుడ్లు తీసుకున్నాడు. ఆ సమయంలో భాస్కర్‌లింగం.. వాహనంలో తన డబ్బులు ఉన్నాయా.. లేవా... అని పరిశీలించాడు. కనిపించకపోవడంతో లబోదిబోమంటూ అక్కడే కుప్పకూలాడు. ఈ మేరకు బాధితుడు కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
కేయూలో విద్యార్థుల రాళ్ల దాడి
వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో భోజనం అందలేదని కారణంతో విద్యార్థులు ప్రిన్సిపాల్ కార్యాలయంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. శుక్రవారం క్యాంపస్‌లోని ప్రతాపరుద్ర మెస్‌కు సంబంధించిన పీజీ ఫస్టియర్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ప్రైవేట్ మెస్ కాంట్రాక్టర్‌ను మార్చాలని డిమాండ్ చేస్తూ కేయూ మొదటి గేట్ వద్ద ఆందోళనకు దిగారు. కాంట్రాక్టర్ తమకు నాణ్యమైన భోజనం అందించడం లేదని మూడురోజలుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. దీంతో యూనివర్సిటీ అధికారులు ఆ కాంట్రాక్టర్‌ను తప్పించారు. క్యాంపస్ కామన్ మెస్‌లోని మరో కాంట్రాక్టర్‌తో వంటచేయించి ప్రతాపరుద్ర మెస్‌కు మధ్యాహ్నం భోజనం పంపారు. 400 మంది విద్యార్థుల్లో కొందరికి మాత్రమే భోజనం సరిపోయింది. దీంతో భోజనం అందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం ఇవ్వాల్సిన గుడ్డు, అరటిపండ్లు కూడా ఇవ్వలేదంటూ ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ కార్యాలయంపై రాళ్లతో దాడి చేయడంతో అద్దాలు పగిలిపోయాయి. వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దామోదర్‌రావుకు చెందిన కారుఅద్దాలు ధ్వంసమయ్యూయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. పోలీసులు దాడికి పాల్పడిన విద్యార్థులను అదుపులోకి తీసుకునేందుకు యత్నించడంతో యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎవరు దాడి చేశారో వారంతట వారే స్టేషన్‌కు రావాలని పోలీసులు సూచించగా... సుమారు 150 మంది విద్యార్థులు కేయూ పోలీస్టేషన్‌కు తరలివచ్చారు. మరోవైపు కేయూలోని హాస్టళ్లు, మెస్‌లను శనివారం నుంచి మూసివేయాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. పీజీ కోర్సుల ఫస్టియర్ విద్యార్థులకు ఇప్పటికే రెండు పరీక్షలు జరిగాయిజ మిగతా పరీక్షలను నిరవధికంగావాయిదా వేస్తున్నామని, పీజీ తరగుతులన్నీ రద్దుచేసినట్లు కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఎంవీ.రంగారావు వెల్లడించారు. -
మమ్మల్ని గుర్తించండి!
ఉద్యమంలో ముందున్నా రాని అవకాశాలు ఎన్నికలు, నామినేటెడ్‌లో దక్కని ప్రాధాన్యం అసంతృప్తిలో కాకతీయ వర్సిటీ జేఏసీ నేతలు టీఆర్ఎస్ నాయకత్వాన్ని కలిసి విజ్ఞప్తులు ‘‘తెలంగాణ పోరులో విద్యార్థి సంఘాలు ఏకమై ఉద్యమించింది కాకతీయ యూనివర్సిటీలోనే. ఉస్మానియాలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎన్నో విద్యార్థి సంఘాలు పని చేశాయి. రాజకీయ, ఇతర అవకాశాల విషయంలో మాత్రం మాకు దక్కాల్సిన ప్రాధాన్యత కనిపించడంలేదు.. ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశం ఇవ్వలేదు.. కనీసం నామినేటెడ్ పోస్టుల్లోన్నైనా అవకాశం కల్పించాలని’’ కేయూ జేఏసీ నేతలు పేర్కొంటున్నారు.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) విద్యార్థులు ప్రముఖపాత్ర పోషించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతో మలుపుతిరిగిన ఉద్యమంతోపాటు అన్ని పోరాటాల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టంలో తమ పాత్ర ఏమిటనేది కేయూ జేఏసీ నేతల్లో మొదలైంది. టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం టీఆర్ఎస్వీ ముఖ్య నేతల్లో మరీ అధికంగా కనిపిస్తోంది. ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉస్మానియా విద్యార్థి నాయకులకు అవకాశం ఇవ్వడం బాగానే ఉన్నా.. కేయూ వారికి రాజకీయ అవకాశాలు రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఉద్య మం, ఉప ఎన్నికలు, రాజకీయ కార్యక్రమాలకు తప్ప తమకు అవకాశాల విషయంలో ప్రాధాన్యత దక్కడంలేదని వీరు అభిప్రాయపడుతున్నారు. అవకాశం ఇవ్వాలి.. కేయూ జేఏసీ అభిప్రాయం ప్రకారమే టీఆర్ఎస్ పార్టీ సాధారణ ఎన్నికల్లో కేయూ విద్యార్థులకు అవకాశం కల్పించలేదు. ఇదే సమయంలో ఉస్మానియా విద్యార్థి నేతల్లో ముగ్గురికి పోటీ చేసే అవకాశం కల్పించింది. మాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టుల్లోనైనా అవకాశం కల్పిస్తే ఇక్కడి విద్యార్థుల పోరాటాన్ని గుర్తించినట్లుగా ఉంటుంది. ఉద్యమంలో కీలకంగా ఉన్న వారికి అవకాశం కల్పిస్తేనే.. ఉద్యమాల్లో, టీఆర్ఎస్లో కొత్త తరం వస్తుంది’ అని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై నమ్మకం పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఉద్యమంలో ముందున్న వారిలో ఒక్కొక్కరికీ అవకాశం వస్తోందని.. తమ వంతు వస్తుందని ఆశిస్తున్నారు. ‘హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు ముందున్నారు. ఉద్యమంలో పాత్ర ఉన్న ప్రతి ఒక్క వర్గాన్ని కేసీఆర్ గుర్తుపెట్టుకుని ప్రాధాన్యత ఇస్తున్నారు. కేయూ నుంచి ప్రొఫెసర్లకు అవకాశం కల్పించడంతో సీతారాంనాయక్ ఎంపీగా గెలిచారు. రాజకీయ జేఏసీ జిల్లా చైర్మన్ వ్యవహరించిన ప్రొఫెసర్ టి.పాపిరెడ్డికి కీలకమకైన ఉన్నత విద్యామండలి చైర్మన్ పదవి ఇచ్చారు. ఇలా అవకాశం ఇస్తారని పేర్కొంటున్నారు. కేయూ విద్యార్థుల పాత్ర కీలకం తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన కేసీఆర్ నిరహారదీక్ష కార్యక్రమానికి ఊపు తెచ్చింది కాకతీయ విశ్వవిద్యాలయంలోనే. 2009 నవంబరు 29న కేసీఆర్ నిరహార దీక్ష చేస్తున్నట్లు ప్రకటించి అంతముందు కొన్ని వారాలపాటు సన్నాహాక కార్యక్రమాలు నిర్వహించారు. అదే ఏడాది నవంబరు 23న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు ఐక్యంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కటిగా ముందుకు నడిపించేందుకు కేయూ విద్యార్థులంతా ఏకమై 2009 నవంబరు 17న జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమంలో జేఏసీ అవిర్భావం అనేది ఇక్కడే మొదలైందని విద్యార్థి నేతలు చెబుతున్నారు. ఇలా మొదలైన విద్యార్థుల ఉద్యమం.. కేసీఆర్ నిరహార దీక్ష భగ్నంతో ఊపందుకుంది. కేసీఆర్‌ను కరీంనగర్ జిల్లాలోని అల్గునూరు వద్ద అరెస్టు చేసి ఖమ్మం తీసుకువెళ్లే క్రమంలో కేయూ వద్ద విద్యార్థులు చేసిన పోరాటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చేందుకు దోహదపడిందని జేఏసీ నేతలు చెబుతుంటారు. ఆ తర్వాత నిర్వహించిన పొలికేక బహిరంగ సభ, జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఉద్యమాల్లో కేయూ విద్యార్థులు ముందున్నారు. ఉద్యమంలో కీలకంగా ఉన్న తమకు ఇప్పుడు కొత్త రాష్ట్రంలో అవకాశాం ఇవ్వాలని కోరుకుంటున్నారు. కేయూ విద్యార్థి నేతలు ఇటీవలే హైదరాబాద్‌కు వెళ్లి టీఆర్ఎస్ కీలక నేతలు టి.హరీశ్‌రావు, కేటీఆర్, ఈటెల, జగదీశ్వర్‌రెడ్డిలకు, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్యకు తమ కోరికలను విన్నవించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. -
కేయూ ప్రొఫెసర్ రవీందర్‌కు అరుదైన గౌరవం
రాయల్ కెమికల్ సొసైటీ ఫెలోగా ఎంపిక వరంగల్: కాకతీయ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ వడ్డె రవీందర్ ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ ఫెలోగా ఎంపికయ్యారు. తెలంగాణ వర్సిటీల నుంచి ప్రథమంగా రవీందర్‌కు ఈ గౌరవం లభించింది. మూడు దశాబ్దాలకుపైగా బోధన, పరిశోధనల అనుభవం ఉన్న ప్రొఫెసర్ రవీందర్ 115 పరిశోధన పత్రాలను సమర్పించారు. రెండు పుస్తకాలు రచించారు. ఆయన పేరున రెండు పేటెంట్లు ఉన్నాయి. 2010లో రాష్ర్ట ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, 2013లో అప్కాస్ట్ డీఎస్టీ ఆఫ్ సెన్సైస్ అవార్డు అందుకున్నారు. పలు విదేశీ వర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. కాగా, కేయూలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రవీందర్‌కు రాయల్ సొసైటీ ఆఫ్ కెమిస్ట్రీ మెడల్, సర్టిఫికెట్, బ్యాడ్జీని ఐఐసీటీ డెరైక్టర్ లక్ష్మీకాంతం అందజేశారు. -
పేద విద్యార్థుల ఆకలి కేకలు..
కొత్తగూడెం : ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులకు ఆసరాగా ఉండాల్సిన కార్పొరేషన్లు కొంతకాలంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కళాశాలలకు మెస్ చార్జీలు అందించకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. స్కాలర్షిప్ రెన్యువల్‌తో పాటు నూతన స్కాలర్‌షిప్‌ల మంజూరులో కార్పొరేషన్లు జాప్యం చేస్తుండటంతో పేద విద్యార్థులు రోడ్డున పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కొత్తగూడెంలోని కాకతీయ యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఏడాది కాలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు వీరికి అందించాల్సిన రూ. 25లక్షలు బకాయిలను అందించకపోవడంతో నాలుగు రోజులుగా మెస్‌ను మూసివేశారు. దీంతో విద్యార్థులు పక్కనే ఉన్న హోటళ్లలో ఒక్క పూట భోజనం చేస్తున్నారు. ఈ ఇంజనీరింగ్ కళాశాలలో మొత్తం 350 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారు. వీరి కోసం సెల్ఫ్మేనేజ్మెంట్ కింద కళాశాల మెస్‌ను నిర్వహిస్తున్నారు. ప్రతీ విద్యార్థికి నెలకు రూ.1900 నుంచి రెండు వేల వరకు ఖర్చవుతోంది. ప్రతి నెల ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.950, బీసీ విద్యార్థులకు రూ.1200 ఆయా కార్పొరేషన్లు చెల్లిస్తున్నాయి. వీటిని మినహాయించి మిగిలిన మొత్తాన్ని కళాశాలకు విద్యార్థులు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది కాలంగా పెండింగ్‌లో బకాయిలు.. ఏడాది నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల నుంచి స్కాలర్‌షిప్‌ల రూపంలో వచ్చే మెస్ చార్జీలు రాకపోవడంతో మెస్ నిర్వహణ కళాశాల సిబ్బందికి భారంగా మారింది. ఈ మూడు కార్పొరేషన్ల నుంచి రూ.25 లక్షల వరకు బకాయి ఉండడం, ఇప్పటి వరకు బయట అప్పులు చేసి మెస్ నిర్వహించారు. ప్రస్తుతం బకాయిలు పెరగడం, బయట అప్పులు ఇచ్చే వారు లేకపోవడంతో నాలుగు రోజులుగా బీటెక్ థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులకు మెస్ నిలిపివేశారు. అర్ధాకలితో అలమటిస్తున్న విద్యార్థులు.. కళాశాలలో మెస్ నిలిపివేయడంతో విద్యార్థులు బయట ఉన్న హోటళ్లలో భోజనం చేస్తున్నారు. అది కూడా ఒక్కపూటే చేస్తూ అర్ధాకలితో కళాశాలకు వెళ్తున్నారు. కళాశాల నుంచి వెళ్లిపోతే చదువు ఆగిపోతుందనే భయంతో అర్ధాకలితోనే చదువుకుంటున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తల్లిదండ్రులకు ఈ సమాచారం తెలిపినప్పటికీ వారు పేదలు కావడంతో డబ్బులు కూడా పంపించలేకపోతున్నారని అంటున్నారు. చేతిలో డబ్బులు లేకపోవడంతో తోటి విద్యార్థుల వద్ద అప్పు చేసి భోజనం చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మెస్ బిల్లులు అందేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. -
ప్రాణాలు తీస్తున్న పోలీసు జీపులు
అతివేగంగా వాహనాలను నడిపే వాహనచోదకులను నియంత్రించాల్సిన పోలీసులే దూకుడుగా వాహనాలు నడుపుతున్నారు. పోలీసులమనే అహంభావంతోనో.. ఏమరుపాటుగానో వాహనాలను నడిపి ప్రజల ప్రాణాల మీదికి తెస్తున్నారు. కొద్దినెలల క్రితం చేర్యాలలో ఎస్సై జీపు ఢీకొని ఓ వ్యక్తి కాలు విరగింది. ఇటీవల నర్సంపేట పట్టణంలో పోలీస్ జీపు బైక్‌ను ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నవంబర్ 24న కాకతీయ యూనివర్సిటీ క్రాస్‌రోడ్డులో సిగ్నల్ పాయింట్ వద్ద కరీంనగర్ నుంచి హన్మకొండకు వస్తున్న పోలీస్ జీప్ ఏకంగా రెడ్ సిగ్నల్ పడ్డాక కూడా ముందుకు దూసుకెళ్లి విధ్వంసం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఒక టాటాఏస్ వాహనం, ఒక ద్విచక్ర వాహనం ధ్వంసం కావడంతోపాటు ఆటోలో ఉన్న 8 మందికి గాయాలయ్యారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అత్యవసరమైనా.. కాకున్నా ఇష్టారాజ్యంగా రోడ్లపై జీపులను అతి వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
కేయూ విద్యార్థుల ఆమరణ దీక్ష
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలోని కామన్మెస్లో నాణ్యమైన భోజనం అందడం లేదని, యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే ప్రైవేట్ మెస్‌ను నడిపించాలని డిమాండ్ చేస్తూ గురువారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగారు. బుధవారం రాత్రి భోజనంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ బీరకాయ కర్రి ఇచ్చారు. అది చేదుగా ఉందని కొందరు విద్యార్థులు అప్పుడే నిరసన తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఉదయం విద్యార్థులు కామన్మెస్కు తాళం వేశారు. తరగతుల బహిష్కరించి ఆమరణ దీక్షకు దిగారు. సమాచారం అందుకున్న క్యాంపస్ ప్రిన్సిపాల్ ఎన్.రామస్వామి అక్కడికి వచ్చి ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. నాణ్యమైన భోజనం అందడం లేదని, కాంట్రాక్టర్‌ను మార్చాలని కోరామని... ఈ మేరకు హామీ ఇచ్చి మరచిపోయూరంటూ ఆయనతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. బీరకాయ కూర చేదుగా ఉండడంతో వాంతులయ్యే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నాణ్యమైన భోజనమందించేలా చర్యలు తీసుకుంటామని, ఆందోళన విరమించాలని విద్యార్థులకు ప్రిన్సిపాల్ సూచించారు. వారు ససేమిరా అనడంతో ఆయన వెళ్లిపోయారు. సాయంత్రం కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఎంవీ.రంగారావు, ప్రిన్సిపాల్ రామస్వామి ,అసిస్టెంట్ రిజిస్ట్రార్ శ్యాంసన్ ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థుల వద్దకు వచ్చి నచ్చజెప్పేందుకు యత్నించారు. ప్రైవేట్ మెస్‌ను ఎత్తివేసి యూనివర్సిటీ ఆధ్వర్యంలో కోరుతున్నా.. పట్టించుకోకోపోవడంతో ఆమరణ దీక్షకు దిగామని విద్యార్థులు చెప్పారు. యూనివర్సిటీలో ప్రైవేట్ మెస్‌లను ఎత్తివేయడం తమ చేతుల్లో లేదని, రెగ్యులర్ వీసీ వచ్చేవరకు ఆగాలని రంగారావు వారికి సూచించారు. ప్రైవేట్ మెస్‌ను ఎత్తివేయకపోతే యూనివర్సిటీని బంద్‌చేసి ఆందోళనలు చేస్తామని విద్యార్థులు స్పష్టం చేయడంతో వారు వెళ్లిపోయూరు. కాగా, కామన్మెస్ కు తాళం వేసి విద్యార్థులు ఆమరణ దీక్షకు దిగడంతో గురువారం ఉదయం అల్పాహారంతో సహా రెండు పూటల భోజనం బంద్ కావ డంతో పీజీ ఫైనలియర్ విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కాగా, రాత్రి ఇన్చార్జ రిజిస్ట్రార్, క్యాంపస్ ప్రిన్సిపాల్ విద్యార్థులతో చర్చించారు. మూడు ప్రధాన సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో విద్యార్థులు రాత్రి పది గంటలకు దీక్ష విరమించారు. -
లక్ష్యంతో ముందుకెళ్తే ఏదైనా సాధ్యమే
విద్యార్థులు.. నిత్యం పుస్తకాలతో కుస్తీ.. మార్కులపైనే దృష్టి. కానీ.. గురువుల ప్రోద్బలం.. ప్రోత్సాహంతో వయసుకంటే కంటే పెద్ద సాహసం చేశారు.. ఏకంగా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు.. అందరి మన్ననలు పొందారు విద్యార్థులు పూర్ణ, ఆనంద్. ఈ ఘనత సాధించిన వారిని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల పూర్వ విద్యార్థుల సంఘం(స్వారోస్) ఆధ్వర్యంలో శనివారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఘనంగా సన్మానించారు. కేయూక్యాంపస్ : లక్ష్యంతో ముందుకెళ్తే దేనినైనా సాధించవచ్చని, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ, ఆనంద్ లే అందుకు సాక్ష్యమని అర్బన్ ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా అన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు, కళాశాలల పూర్వవిద్యార్థుల సంఘం(స్వారోస్) ఆధ్వర్యంలో శనివారం రాత్రి కాకతీయ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఇటీవల ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన పూర్ణ,అనంద్లను ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అర్బన్ ఎస్పీ మాట్లాడుతూ.. జీవితంలో అనేక సవాళ్లు ఎదరవుతాయని, సానుకూల దృక్పథంతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. చిన్నవయసులోనే పూర్ణ, ఆనంద్‌లు ఎవరెస్టు శిఖరం అధిరోహించడం గర్వకారణమన్నారు. కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ రంగారావు మాట్లాడుతూ విద్యార్థులు అకుంఠిత దీక్షతో ముందుకు వెళ్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చన్నారు. గురుకుల విద్యార్థుల కోసం ప్రవీణ్‌కుమార్ చేస్తున్న వివిధ కార్యక్రమాలు స్ఫూర్తిని కలిగిస్తున్నాయన్నారు. క్యాంపస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి మాట్లాడుతూ విద్యార్ధి దశ నుంచే ప్రణాళిక బద్ధంగా లక్ష్యంతో చదువుకుంటే అనుకున్న స్థానానికి చేరుకోవచ్చన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ పుల్లయ్య మాట్లాడుతూ ప్రవీణ్‌కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వచ్చే ఏడాది గురుకులాల్లో డిగ్రీ కాలేజీలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఈ సభకు స్వారోస్ జిల్లా అధ్యక్షుడు పట్టాభి అధ్యక్షత వహించారు. స్వారోస్ రాష్ర్ట కోకన్వీనర్ చలపతి, రాష్ట, జిల్లా స్వారోస్ బాధ్యులు పుల్లాకిషన్, రవి, కరుణాకర్, ఒంటేరు చక్రి, సదానందం, పరుశరామ్, కుంటా శ్రీనివాస్, మహేష్ , శోభన్‌బాబు, మానస, పీఈటీ శ్రీలత పాల్గొన్నారు. కలెక్టర్ అభినందన జిల్లాలోని స్వారోస్ కమిటీ సన్మాన కార్యక్రమానికి వచ్చిన పూర్ణ, ఆనంద్‌లకు సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాలల విద్యార్థులు ఘనస్వాగతం పలికారు. అనంతరం హన్మకొండలోని కీర్తిస్తూపం నుంచి ర్యాలీ ప్రారంభించారు. తొలుత కలెక్టర్ కిషన్‌ను కలిసిన పూర్ణ, అనంద్లను ఆయన అభినందించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకున్నారు. -
చదువుల తోట..
సీతారాంనాయక్.. ప్రస్తుతం మహబూబాబాద్ ఎంపీ. దేశఅత్యున్నత చట్టసభలో సభ్యుడు. మొన్నటి వరకు కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్. యూనివర్సిటీ నుంచి లోక్‌సభకు వెళ్లిన సీతారాంనాయక్.. మళ్లీ ఒకసారి కాకతీయ యూనివర్సిటీకి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యావిధానం.. యూనివర్సిటీలో పరిస్థితులపై విద్యార్థి నాయకులతో, అధ్యాపకులతో ‘సాక్షి’ ప్రతినిధిగా ముచ్చటించారు. ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ : తెలంగాణ సాధన ఉద్యమంలో కాకతీయ విశ్వవిద్యాలయం చరిత్ర సృష్టించిన మాట వాస్తవం. తెలంగాణలో విశ్వవిద్యాల యాలు, విద్యార్థులు, అధ్యాపకులు ఎలా ఉండాలి? మీరు ఏం కోరుకుంటున్నారు? బి.వీరేందర్(పార్ట్ టైం లెక్చరర్) : సమైక్య రాష్ట్రంలో అనేక మంది విద్యార్థులు పీజీలు, పీహెచ్డీ పట్టాలు తీసుకుని నిరుద్యోగులుగా ఉన్నారు. వీరికి చదువుల తోటఉపాధి అవకాశాలు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యావిధానాన్ని తీసుకురావాలి. సీతారాంనాయక్ : సమైక్య రాష్ట్రంలోని చట్టాలే ఇప్పుడు ఉన్నారుు. అప్పటి ఉమ్మడి విధానమే ఉంది. దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? మోహన్‌రాజ్(టీఎఫ్ఏడీ అధ్యక్షుడు) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని, ప్రత్యేక రాష్ట్రంతో ఆ ఫలాలు అందుతాయని విద్యార్థులు త్యాగం చేసిండ్లు. కొత్త ప్రభుత్వం నాణ్యమైన విద్యను, కొఠారి కమిషన్ ప్రకారం కామన్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. విదేశీ యూనివర్సిటీలను తీసుకురావడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం దీనిని అడ్డుకోవాలి. విద్యార్థులకు ఎన్నికలు జరగాలి. దీనివల్ల రాజకీయంగా చైతన్యమవుతారు. సీతారాంనాయక్ : కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రవేశపెట్టాలని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించింది. ఇప్పుడు చేస్తున్నాయి? దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? చల్లా శ్రీనివాస్(కుర్సా అధ్యక్షుడు) : భారతీయ విద్యా విధానం ఇప్పటివరకు శాస్త్రీయంగా ఉంది. పెట్టుబడిదారీ విధానం మన విద్యా విధానంలోకి వస్తే మన విద్య కుంటుబడుతుంది. మన విద్యార్థుల్లో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల వారు. గ్రామీణ విద్యార్థి ఒకేసారి పెట్టుబడిదారీ విధానానికి అలవాటుపడలేదు. మన ఆచార, సంస్కృతి కూడా భ్రష్టుపడుతుంది. సీతారాంనాయక్ : అటానమస్పై మీ అభిప్రాయం ఏమిటి? డిగ్రీ కాలేజీలకు విశ్వవిద్యాలయంతో సంబంధం ఉండదు? ప్రైవేటు కాలేజీలకు స్వయంప్రతిపత్తి ఇవ్వాలని అంటున్నారు? కొంగర జగన్(కుర్సా వర్కింగ్ ప్రెసిడెంట్) : ప్రైవేటు కాలేజీలకు అటానమస్ ఇస్తే విద్య ప్రైవేటు పరమవుతుంది. దీనివల్ల విద్యా వ్యవస్థ, విద్యా విధానం ప్రైవేటు పరమైపోతాయి. ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో.. పీజీ సెంటర్లకు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు స్వయం ప్రతిపత్తి ఇస్తే బాగుంటుంది. అకడమిక్ విద్య దెబ్బతినదు. ఉపాధి అవకాశాలకు ఇబ్బంది ఉండదు. విద్య అనేది ప్రభుత్వమే నిర్వహించాలి. సీతారాంనాయక్ : కొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు, ఇక్కడ ఉన్న కొన్ని పేరున్న సంస్థలు.. అప్‌గ్రేడ్ చేసి ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా చేయాలని కోరుతున్నారుు? దీనిపై మీ అభిప్రాయం? ఎం.చిరంజీవి(పీడీఎస్‌యూ) : ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థులు పోరాటం చేశారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రూ.వేల కోట్లతో వ్యాపారం చేస్తున్నాయి. ప్రైవేటీకరణను మేం వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు పర్మిషన్ ఇవ్వొద్దనేది మా అభిప్రాయం. సీతారాంనాయక్ : పీహెచ్డీ పూర్తి చేసిన వారు ప్రైవేటు కాలేజీల్లో నామమాత్రపు జీతాలకు పని చేస్తున్నారు. విద్యార్థులకు క్యాలిబర్‌ను బట్టి ఉపాధి దొరికే పరిస్థితి ఉంది. మీరు ఎలాంటి కోర్సులు కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుతున్నారు? ఓడపెల్లి మురళి(టీబీఎస్ఎఫ్) : అన్ని ప్రభుత్వాలు సైన్స్ గ్రూపులకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆర్ట్స్ గ్రూపులు తీసివేయాలని ప్రయత్నించారు. అప్పుడు తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం వల్ల ఇక్కడ ఆర్ట్స్ గ్రూపులు అలాగే ఉన్నారుు. ఆర్ట్స్ గ్రూపులతో ఉపాధి కల్పించే సంస్థలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాసుదేవరెడ్డి(టీఆర్ఎస్వీ): బంగారు తెలంగాణకు బాటలు వేయాలంటే విద్యా విధానంలో మార్పులు చేయాలి. సమైక్య రాష్ట్రంలో భారీగా కాలేజీలకు అనుమతులు ఇవ్వడం వల్ల కోర్సులకు డిమాండ్ తగ్గింది. ఇంజినీరింగ్ కాలేజీలు పుట్టగొడుగుల్లా ఏర్పడ్డాయి. నాణ్యత కొరవడింది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసిన వారు నైపుణ్యం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం సాధ్యంకాదు కాబట్టి వృత్తి విద్యా కోర్సులు రావాలి. హైదరాబాద్‌లో ఇప్పటికే సాఫ్ట్వేర్, ఇతర పరిశ్రమలకు పనికి వచ్చే నిపుణత కలిగే కోర్సులను తీసుకురావాలి. ఎంబీబీఎస్లాగే.. ఇంజినీరింగ్ విద్యార్థులకు నైపుణ్యం పెంచేందుకు కాలేజీలకు, పరిశ్రమలకు అనుబంధం ఉండాలి. సీతారాంనాయక్ : సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థులకు విద్యా, ఉపాధి పరంగా ఏమైనా నష్టం జరిగిందా? ఇప్పుడు మీరేం ఆశిస్తున్నారు? వలీ ఉల్లాఖాద్రీ(ఏఐఎస్ఎఫ్) : సమైక్య రాష్ట్రంలో యూనివర్సిటీల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. యూనివర్సిటీ గ్రాంట్ విషయంలో ప్రతిసారి ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను పట్టించుకోలేదు. ఇలాంటి అన్యాయాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఉస్మానియా, కేయూలకు రూ.500 కోట్ల చొప్పున కేటాయించాలి. ఉపాధి, జానపద కళలకు ప్రాధాన్యత ఇచ్చేలా కోర్సులు ఉండాలి. సీతారాంనాయక్ : కాంట్రాక్టు ఉద్యోగ విధానం ఎందుకొచ్చింది? దీనివల్ల ప్రయోజనాలు ఏమిటీ? దీనిపై మీ అభిప్రాయం చెప్పండి? దుర్గం సారయ్య(పీడీఎస్‌యూ) : చంద్రబాబు హయూంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేక.. కాంట్రాక్టు పద్ధతిని తీసుకొచ్చారు. కాంట్రాక్టు విధానంలో ఉద్యోగం చేస్తున్న వారు.. కుటుంబానికి తిండిపెట్టలేని పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేయాలి. విద్యా, ఉపాధి విషయాలు ప్రభుత్వ పరిధిలోనే ఉండాలి. సీఎం కొడుకు, పేద పిల్లవాడు ఒకేచోట చదివేలా కామన్ విద్యా విధానం ఉండాలి. సీతారాంనాయక్ : ప్రాథమిక విద్యా ఎలా ఉండాలి? కులాల పేర్లతో హాస్టళ్లు ఉన్నాయి. ఇలా ఉంటే విద్యార్థుల్లో న్యూనత భావం ఏర్పడుతుంది. దీనిని ఎలా చేస్తే బాగుంటుంది? సుత్రపు అనిల్(పీడీఎస్‌యూ) : ప్రాథమిక విద్య అనేది కుల, మత బేధం లేకుండా అందరికీ ఒకే విద్యా విధానం ఉండాలి. ప్రస్తుతం ప్రీప్రైమరీ, ఆశ్రమ, గురుకుల, సాంఘిక సంక్షేమం, ఐటీడీఏ స్కూళ్లు ప్రాథమిక విద్యలో 12 రకాలు ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో ఈ విధానాన్ని మార్చాలి. ఉపాధ్యాయులకు కూడా ఏకీకృత సర్వీసు రూల్స్‌ను తీసుకురావాలి. సీతారాంనాయక్ : యూనివర్సిటీల్లో హాస్టల్స్‌పై మీ అభిప్రాయం ఏమిటీ? హాస్టళ్ల ప్రైవేటీకరణ ఉండాలా? వద్దా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఎలా ఉంటే బాగుంటుంది? మాతంగి మురళి(టీఎన్ఎస్ఎఫ్) : తెలంగాణలోని యూనివర్సిటీల్లో చదుకునేవారిలో ఎక్కువ మంది బడుగు, బలహీన వర్గాల విద్యార్థులే. కాంట్రాక్టు, ప్రైవేటు మెస్ విధానాల వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు. విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటోంది. రంజిత్(టీఆర్ఎస్వీ) : వర్సిటీల్లో గ్రామీణ, పేద విద్యార్థులే ఉంటున్నారు. విద్యార్థులతో మెస్ కమిటీలు లేకపోవడం వల్ల ప్రైవేటు కాంట్రాక్టర్లు లాభమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాగే హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై శ్రద్ధ పెడితే బాగుంటుంది. సీతారాంనాయక్ : విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ అపాయింట్మెంట్లు జరగడం లేదు. వీసీలుగా వచ్చిన వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఉదంతాలు ఉన్నాయి. నాట్ టీచింగ్ రిక్రూట్మెంట్ విషయంలో ఎలా వ్యవహించాలి? పి.కొండల్‌రెడ్డి(ఉద్యోగుల జేఏసీ చైర్మన్) : ఉన్నత విద్యను అందించే విశ్వవిద్యాలయాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్‌లో అర్హత, నైపుణ్యం ఉన్న వారికి అవకాశాలు రావాలి. కేయూలో ఏడాదిగా నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ జరగలేదు. వైస్ చాన్సలర్, ఎగ్జిక్యూటీవ్ కమిటీ ఉండాలి. దీని వల్ల అక్రమాలను నివారించవచ్చు. సీతారాంనాయక్ : వర్సిటీలో వీసీలను ఘెరావ్ చేయడం లేదా రిజిస్ట్రార్లను బయటపెట్టడం తరచుగా చూస్తున్నాం. ఇలాంటి గొడవలకు కారణమేమిటీ? కె.శంకర్(ఎన్జీవోస్, కేయూ, అధ్యక్షుడు) : వ్యవస్థ అన్నప్పుడు అన్ని రకాల వ్యక్తులు ఉంటరు. యూనివర్సిటీలోనూ స్వార్థపరులు ఎక్కువైనప్పుడు పరిపాలన సరిగా ఉండదు. ఉన్నతాధికారులు పరిపాలన విషయంలో నిక్కచ్చిగా ఉంటే ఏమీ జరగదు. కేయూలో నియామకాలు, బదిలీలు పారదర్శకంగా జరగడంలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వీటిని మార్చుకోవాలి. సీతారాంనాయక్ : విశ్వవిద్యాలయం పరిరక్షణ విషయంలో అకుట్ ఏ రకమైన బాధ్యత నిర్వర్తిస్తోంది? డాక్టర్ వెంకయ్య(అకుట్) : ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం పోరాటాల్లో అకుట్ ముందుంటోంది. ఈ మధ్య కాలంలో యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతమవుతుంటే మేం స్పందించి గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి, కలెక్టర్‌కు లేఖలు రాశాం. సీతారాంనాయక్ : కేయూలో ఉత్తరాలు రాయడం మొదటి నుంచి ఉంది. ఉత్తరాలు రాస్తే ప్రయోజనం ఏమిటి? కేయూ భూమి 554 ఎకరాలు ఉండగా, ఇప్పుడు 500 ఎకరాలు కూడా లేదు. భూ ఆక్రమణల విషయంలో మీరు ముందుండడం లేదు? డాక్టర్ వెంకట్ : గతంలో పరిపాలన పరంగా తప్పులు దొర్లారుు. యూనివర్సిటీ వైపు నుంచి సరైన చర్యలు తీసుకోలేదు. వీసీ, రిజిస్ట్రార్ సరిగా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. సీతారాంనాయక్ : వాళ్లు చేయలేదు సరే. మీరేం చేశారు? అకుట్గా మీరు చేయాల్సి ఉండె కదా? డాక్టర్ వెంకట్ : జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాం. ఐదు నెలలుగా వీసీ లేరు. దీనిపై మా వంతుగా చర్యలు చేపడుతాం. సీతారాంనాయక్ : దూరవిద్య అనేది యూనివర్సిటీ నిధుల పరంగా ఉత్పత్తి కేంద్రం. ఎస్డీఎల్సీఈలో అక్రమాలు జరుగుతున్నాయని చాలాసార్లు పేపర్లలో చూస్తుంటాం. ఇలాంటివి జరుగుతాయా? జరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? వల్లాల తిరుపతి(ఉద్యోగి) : యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా ఎస్డీఎల్సీఈని నడుపుతోంది. కొందరు అధికారులు మాత్రం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ బంగారుబాతులాగే చూస్తున్నారు. రెవెన్యూ తీసుకుంటున్నారుగానీ, అక్కడ ప్రక్షాళన జరగడం లేదు. సీతారాంనాయక్ : మీకూ అధికారాలు ఉన్నారుు కదా? డెరైక్టర్, అసిస్టెంట్ డెరైక్టర్ అందరు ఉన్నారు కదా? అలాంటివి ఎందుకు జరుగుతాయి. అపనిందలు ఎందుకు వస్తాయి? వల్లాల తిరుపతి : వీరికి నామమాత్రపు అధికారాలే ఇచ్చారు. ఏదీ చేయాలన్నా మళ్లీ వీసీ, రిజిస్ట్రారు అనుమతి తీసుకోవాల్సిందే. సీతారాంనాయక్ : యూనివర్సిటీల్లోని పరిశోధనల విషయంలో నానారకమైన భావనలు వ్యక్తమవుతున్నాయి. సూపర్వైజర్ల లోపం ఏమైనా ఉందా? ఇటీవల కొత్త నామ్స్ వచ్చాయి. గైడ్‌గా నియమించిన వారి వద్దే విద్యార్థి పరిశోధన పూర్తి చేయాలని ఉంది. ఇది మంచిదా? పాత విధానమే మంచిదా? డాక్టర్ ముస్తఫా(అసిస్టెంట్ ప్రొఫెసర్) : పరిశోధనకు సంబంధించిన విద్యార్థులకు మెరిట్ కంటే ముఖ్యంగా ఆసక్తి ఉండాలి. ఎవరికీ బిగినింల్లో ఏమీ రాదు. నేర్చుకుంటే అనుభవపరంగా ఎంతో వస్తుంది. ఆసక్తి ఉన్న వారికే అవకాశం కల్పించాలి. ప్రొఫెసర్ తెలిసిన విద్యార్థులకు గైడ్లుగా ఉంటే మంచిది. కొత్త వారితో అయితే కొంత గ్యాప్ ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న వసతులు సరిపోవు. ఉన్నత ప్రమాణాలతో ఉండాలి. దీని కోసం ప్రయత్నించాలి. -
కేయూలో ఉద్యోగుల ఆందోళన
కేయూ క్యాంపస్ : తెలంగాణలోని యూనివర్సిటీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ కాకతీయ యూనివర్సిటీలో గురువారం ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీల ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు టీచింగ్, నాన్ టీ చింగ్ ఉద్యోగులు కేయూ పరిపాలనా భవనం ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఉద్యోగుల వేతనాలకు సరిపడా బడ్జెట్ కేటాయించాలని, హెల్త్‌కార్డులు వర్తింపజేయాలంటూ నినాదాలు చేశారు. అనంతరం అధ్యాపక, బోధనేతర ఉద్యోగ సంఘాల బాధ్యులు మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో కాకతీయ యూనివర్సిటీ ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. యూనివర్సిటీల పట్ల రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యధోరణిని అవలంబిస్తోందని ఆరోపిం చారు. ఇప్పటికైనా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉద్యో గ సంఘాల నాయకులు, ఉద్యోగులు పి.కొండల్‌రెడ్డి, డాక్టర్ కోలా శంకర్, పి.వెంకట్రాంనర్సయ్య, డాక్టర్ వై.వెంకయ్య, డాక్టర్ జి.వీరన్న, డాక్టర్ సురేఖ, వై.శ్యాంసన్, వి.కృష్ణమాచార్య, టి.రాజయ్య, కె.సంపతి, కె.రవి, బి.సృజన, సీహెచ్.ప్రభాకర్, అబ్దుల్ షుకూర్, కొముర య్య, చిరంజీవి, అంకూస్, మల్లికాంబ, మెట్టు రవి, రాజిరెడ్డి పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగ సంఘాల నాయకులు డి.విజయ్‌కుమార్, ఎస్.వెంకటేశ్వర్లు, డి.విజయకుమార్, ఎం.చేరాలు తదితరులు ఉద్యోగుల ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఆర్ట్స్ కాలేజీలో... తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా యూనివర్సిటీల్లోని ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి నోచుకోకపోవడం గర్హనీయమని కేయూ ఎన్జీవో జనరల్ సెక్రటరీ డాక్టర్ పుల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్‌తో సుబేదారిలోని ఆర్ట్స్ కళాశాలలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం యూనివర్సిటీలకు వీసీ లు, రిజిస్ట్రార్లను నియమించలేకపోవడం గర్హనీ యమన్నారు. ఇప్పటికైనా యూనివర్సిటీల్లోని సమస్యలే కాకుండా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ఈసం నారాయణ, ఉద్యోగ సంఘాల నాయకులు హరిగోవింద్ సింగ్, బాలాజీ, అంకూస్, రాజు, మల్లయ్య, నారాయణరావు, సురేష్, సూపరింటెండెంట్ కిష్టయ్య పాల్గొన్నారు. -
కలకలం సృష్టించిన ‘సాక్షి’ కథనం
విధుల్లోకి రాని రంగారావు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరీక్షల ని యంత్రణాధికారిగా ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు పదవీకా లం గత నెల 24వ తేదీతో ముగిసినా ఆయన ఇప్పటికీ విధులు నిర్వర్తిస్తున్న వైనంపై గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం కలకలం సృష్టించింది. ‘పదవీకాలం ము గిసినా కుర్చీ వదలని ప్రొఫెసర్’ శీర్షికన ఈ కథనం రావ డం తెలిసిందే. దీంతో రంగారావు పరీక్షల నియంత్రణాధికారి, ఇన్చార్జ రిజిస్ట్రార్ బాధ్యతలు నిర్వర్తించేందుకు గురువారం క్యాంపస్‌కు రాలేదు. ఆ రెండు బాధ్యతల నుంచి రంగారావు తప్పుకున్నట్లేనని భావిస్తున్నారు. ఇక పరీక్షల నియంత్రణాధికారిగా పదవీకాలం ముగిసినందున ఇన్చార్జ రిజిస్ట్రార్‌గా కూడా బాధ్యతలు కూడా నిర్వర్తించే వీలు లేకుండా పోయింది. మళ్లీ పరీక్షల నియంత్రణాధికారిగా ఆయన పదవీకాలం పొడిగించే అవకాశము న్నా దీనికి ఇన్చార్జ వీసీ అప్రూవల్ ఉండాలి. కానీ ఇన్చార్జ వీసీ కె.వీరారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో రంగారావు విషయమై స్పష్టత రావడం లేదు. కా గా, పదవీకాలం ముగిసిన విషయాన్ని ఉన్నత విద్యా కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లకపోవడం నిబంధనలకు విరుద్ధమేనని పలువురు ప్రొఫెసర్లు అభిప్రాయం వ్యక్తం చేశా రు. అయితే, యూనివర్సిటీలో కీలకమైన వీసీ, రిజిస్ట్రార్, పరీక్షల నియంత్రణాధికారి పోస్టులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో పాలన స్తంభించినట్లయింది. ఇన్చార్జ వీసీ వీరారెడ్డి రాజీనామా చేసి ఇరవై రోజులు దాటుతున్నా ఉన్నతాధికారులు ఆమోదించలేదని సమాచారం. ఆయన రాజీనామాను ఆమోదించి మరొకరిని నియమిస్తేనే నియామకాలు చేపట్టే అవకాశముంటుంది. నిబంధనలకు విరుద్ధం కేయూ పరీక్షల నియంత్రణాధికారిగా పదవీకాలం ముగిసి 12రోజులు గడిచినా ఎంవీ.రంగారావు ఆ పదవిలో కొనసాగడం సరికాదని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్(ఎంఎస్ ఎఫ్) ఇన్చార్జ వంగాల సుధాకర్, అధ్యక్షుడు గాదెపాక అనిల్‌కుమార్ పేర్కొన్నారు. యూనివర్సిటీలో గురువా రం జరిగిన సంఘం సమావేశంలో వారు మాట్లాడారు. పదవీకాలం ముగిసిన తర్వాత బాధ్యతలు నిర్వర్తించిన రంగారావు సంతకాలు చేసిన ఫైళ్లకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కాగా, ప్రభుత్వం వెంటనే కేయూ వీసీతో పాటు మిగతా పదవులను భర్తీ చేయాలన్నారు. సమావేశంలో మురళి, కె.సునీల్, నేరెళ్ల విఠల్, దాట్ల నరే ష్, వంశీ, కృష్ణ, కరుణాకర్, శ్రీను పాల్గొన్నారు. -
వీసీ నియామకంపై తొలగని ప్రతిష్టంభన
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జ వీసీ ప్రొఫెసర్ కె. వీరారెడ్డి రాజీనామా ఆమోదం, కొత్త ఇన్చార్జి వీసీ నియామకంపై ఇంకా ప్రతిష్టం భన తొలగలేదు. ఆయన రాజీనామా చేసి ఆరు రోజులైనా ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు. ఆయన రాజీనామాను ఆమోదించక.. ఇన్చార్జ వీసీ గా మరొకరిని నియమించకపోవడంతో యూనివర్సిటీ పాలన అస్తవ్యస్థంగా మారింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిమిత్తం ఈ నెల 17న ఇన్చార్జి ప్రొఫెసర్ కె.వీరారెడ్డి యూనివర్సిటీకి రాగా ఆయ న చాంబర్లో పీహెచ్డీ అడ్మిషన్ల ఇంటర్వ్యూ లు, ఓ విద్యార్థి నకిలీ అడ్మిషన్ వ్యవహారంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అంతేగాక పలువురు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా.. అవి ఇన్చార్జి వీసీగా తాను పరిష్కరించలేనని తేల్చిచెప్పారు. అయినా చేయాల్సిందేనని ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన వీరారెడ్డి తాను ఇన్చార్జి వీసీగా పని చేయలేనని ఉన్నతవిద్యా కార్యదర్శి వికాస్‌రాజ్‌కు, ఉన్నతవిద్యా శాఖమంత్రి జగదీశ్వర్‌రెడ్డికి రాజీనామా లేఖలు సమర్పించారు. అయితే వారు ఆయన రాజీనామాను ఇంకా ఆమోదించలేదని తెలిసింది. లేఖ ఇచ్చి ఆరు రోజులు గడిచినా ఆయన రాజీనామాను ఆమోదించకపోవడం.. మరో ఇన్చార్జి వీసీని నియమించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్చార్జి వీసీగా ఎవరూ లేకపోవటంతో రోటీన్ ఫైళ్లు కూడా పెండింగ్‌లో పడిపోయాయి. డిగ్రీ, పీజీ తదితర పట్టా సర్టిఫికెట్లపై కూడా వీసీ సంతకాలు కావడం లేదు. మొత్తంగా కేయూ పాలన స్థంభించిపోయింది. ముళ్ల కిరీటంలా ఇన్చార్జి వీసీ పదవి.. ఇదిలా ఉండగా ప్రస్తుతం యూనివర్సిటీలోని అనేక సమస్యల కారణంగా ఇన్చార్జీ వీసీ పదవిని ముళ్లకిరీటంగా భావిస్తున్నారు. దీంతో కేయూ ఇన్చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని తెలిసింది. కాగా ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఉన్న కేయూ రిటైర్డ్ ప్రొఫెసర్ టి. పాపిరెడ్డికి అదనంగా కేయూకు ఇన్చార్జి వీసీగా నియమిస్తారా ? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. అయితే ఇందుకు పాపిరెడ్డి కూడా సుముఖంగా లేరని సమాచారం. ఎవరూ ముందు కు రాకపోతే మళ్లీ కేయూకు ఇన్చార్జి వీసీగా ఉన్నత విద్యాకార్యదర్శి వికాస్ రాజ్(ఐఏఎస్)నే నియమించే అవకాశముంది. ఈ ఏడాది జూలై 10 నుంచి సెప్టెంబర్ 24 వరకు ఆయన కేయూకు ఇన్చార్జి వీసీగా పనిచేశారు. పని ఒత్తిడితో ఆయన ఒక్కసారి కూడా కేయూకు రాకపోవడం.. పట్టా సర్టిఫికెట్ల సంతకాల్లో జాప్యం జరిగింది. ఏదేమైనప్పటికీ యూనివర్సిటీలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాలంటే వీలైనంత త్వరగా రెగ్యులర్ వీసీని నియమించాలనే డిమాండ్ అన్నివర్గాల నుంచి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఆ దిశగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. -
స్టాండింగ్ కమిటీ సమావేశం నిరవధిక వాయిదా
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం జరగాల్సి ఉండగా నిరవధికంగా వాయిదా వేశారు. కేయూ ఇన్చార్జ వీసీగా ఉన్న ప్రొఫెసర్ కె.వీరారెడ్డి రాజీనామా చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఇప్పటికే స్టాండింగ్ కమిటీ సమావేశం వాయిదా పడడం ఇది నాలుగో సారి గమనార్హం. ప్రతీసారి తేదీ ప్రకటించడం, ఏదో కారణంతో వాయిదా వేయడం పరిపాటిగా మారింది. అయితే, ఈసారి ఎప్పుడు సమావేశం నిర్వహించే విషయాన్ని కూడా కేయూ ఇన్చార్జ ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు వెల్లడించకపోతుండడం గమనార్హం. పీహెచ్డీ ప్రవేశాలు ఎప్పుడు? యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించాలంటే వీరారెడ్డి స్థానంలో మరొకరిని ఇన్చార్జ వీసీగా నియమించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ స్టాండింగ్ కమిటీలోని ఎజెండాను వీసీ దృష్టికి తీసుకువెళ్లి ఆమోదించాక తేదీ నిర్ణయించాల్సి ఉంటుంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో అధికారులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఇక కేయూ పరిధిలోని పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి స్టాండింగ్ కమిటీలో ఆమోదించాల్సి ఉంది. అయితే, తాజాగా కూడా సమావేశం వాయిదా పడడంతో రెండున్నరేళ్లుగా ప్రవేశాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వివిధ విద్యార్థి సంఘాలు వీసీ చాంబర్లో ఆందోళనకు దిగితే బుధవారం నాటి స్టాండింగ్ కమిటీ సమావేశంలో తేదీ ప్రకటిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. కానీ ఇన్చార్జ వీసీ రాజీనామాతో సమావేశం వాయిదా పడడంతో పీహెచ్డీ ప్రవేశాల కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలాంటివి ఇంకా కొన్ని సమస్యలు కూడా అలాగే మిగిలిపోనున్నాయి. -
యువ శాస్త్రవేత్త పురస్కారానికి డాక్టర్ సతీష్ ఎంపిక
కేయూక్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ బాటనీ విభాగంలో డాక్టరేట్ పూర్తిచేసిన డాక్టర్ సుతారి సతీష్ యువ శాస్త్రవేత్త పురస్కారానికి ఎంపికయ్యూరు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు (ఎస్ఈఆర్బీ) డీఎస్టీ వారు ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. 2013లో పీహెచ్డీ చేసిన సతీష్ ఈ పురస్కారం అందుకోనుండడం విశేషం. గ్రేటర్ హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలు రకాల కాలుష్యాల వల్ల పర్యావరణంలో సంభవిస్తున్న మార్పులు... దానికనుగుణంగా మారుతున్న మొక్కల అనుక్రమం... సహజ, కాలుష్య ప్రాంతంలో పెరుగుతున్న మొక్కల అనుక్రమం వంటి పలు అంశాలపై 3 సంవత్సరాలపాటు పరిశోధన చేయనున్నారు. క్షేత్ర పర్యటనలో వెల్లడైన అంశాలను నివేదికను అందజేసి మార్గదర్శకాలను సూచిస్తారు. కేయూలోని బాటనీ విభాగంలో రిటైర్డ్ ప్రొఫెసర్ వత్సవాయ ఎస్ రాజు పర్యవేక్షణలో పీహెచ్డీ పూర్తిచేసిన సతీష్ అంతర్జాతీయ జర్నల్స్‌లో పది పరిశోధన పత్రాలు ప్రచురించారు.18 జాతీయ ,అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధన పత్రాలను సమర్పించారు. 2009 నుంచి 2011 వరకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ డెహ్రాడూన్ వారి ఫెల్లోషిప్, 2012-2013లో యూజీసీ న్యూఢిల్లీ నుంచి ఫెల్లోషిప్ అందుకున్నారు. ప్రస్తుతం యువశాస్త్రవేత్త పురస్కారంతో మరో మూడు సంవత్సరాలపాటు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో హైదరాబాద్‌లో ప్రముఖ శాస్త్రవేత్త సీనియర్ ఆచార్యులు ఎంఎన్వీ ప్రసాద్ ఆధ్వర్యంలో పరిశోధనలు చేయనున్నారు. -
ఉచిత విద్య అందించాలి
కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్రంలో కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందించడం కష్టసాధ్యమైనా అమలు చేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ వికాస సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ దూరవిద్యా కేంద్రంలోని జాఫర్ నిజాం సెమినార్ హాల్లో ‘తెలంగాణ రాష్ట్రంలో కేజీ టూ పీజీ ఉచిత విద్య సాధ్యాసాధ్యాలు’ అంశంపై శనివారం చర్చా వేదిక నిర్వహించారు. చర్చావేదికలో వికాస సమితి నేతలతోపాటు, పలువురు ప్రొఫెసర్లు, ఉపాధ్యాయసంఘాల బాధ్యులు, అధ్యాపకులు, వివిధ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వికాస సమితి గౌరవ సలహాదారుడు, కేయూ ప్రొఫెసర్ సీతారామరావు మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని చెబుతున్న కే సీఆర్‌ను అభినందించాల్సిందేనని, అయితే ఎలా అమ లు చేస్తారనే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ విద్యావ్యవస్థను పటిష్టం చేసే క్రమంలో భాగంగా కామన్ స్కూల్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను ఆకట్టుకునేలా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంగ్లిష్ మీడియానికి పెరుగుతున్న ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఐదో తరగతి నుంచే అమలు చేయాలన్నారు. సరైన నిర్ణయాలు తీసుకోవాలి విద్యావ్యవస్థపై ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోవాలని డీటీఎఫ్ అధ్యాపక జ్వాల సంపాదకుడు గంగాధర్ సూచించారు. విద్యారంగంలో మార్పుల కోసం పలు కమిషన్లు చేసిన సిఫార్సులను ఏ ప్రభుత్వమూ అమలు చేయలేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఉచిత విద్యను కేజీటూ పీజీ వరకు అందిస్తామని చెబుతూనే రేషనలైజేషన్ వంటి నిర్ణయాలు తీసుకోవడం విస్మయం కలిగిస్తోందన్నారు. విద్యారంగానికి జీడీపీలో 6 శాతం నిధులు కేటాయించాల్సి ఉన్నా 3 నుంచి 4 శాతం నిధులే కేటాయిస్తున్నారని విమర్శించా రు. ఇంజనీరింగ్ విద్యలో నాణ్యతా ప్రమాణా లు క్షీణిస్తున్నాయని పాలిటెక్నిక్ రిటైర్డ్ ప్రొఫెసర్ రామాచంద్రమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. ఎంటెక్ చేసిన అభ్యర్థుల్లోను ఉద్యోగానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం లేదన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏటా 3 లక్షల మంది బయటకు వస్తుండగా, వారిలో 13 శాతం మందికే ఉపా ధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. తెలంగాణ వికాస సమితి నల్లగొండ జిల్లా బాధ్యుడు బద్దం అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెంపొందిస్తేనే పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందన్నారు. కేజీ టూ పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రభుత్వమే ముందుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నాణ్యత పెంపొందించాలి ఎస్సీఈఆర్టీ ఏఎంఓ సురేష్‌బాబు మాట్లాడుతూ ఉచిత విద్య అమలుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. బీఈడీ, డీఈడీ కళాశాలల్లో విద్యార్థులకు సరైన విధంగా శిక్షణ ఇవ్వాలని సూచిం చారు. కేయూ విద్యావిభాగం ప్రొఫెసర్ రాం నాథ్కిషన్ మాట్లాడుతూ విద్యలో నాణ్యత పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సరైన ప్రాతిపదికన కేజీ టూ పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని సూచించారు. కేయూ మాజీ రిజిస్ట్రార్సదానందం, ప్రొఫెసర్ విజయ్‌బాబు, ప్రొఫెసర్ వీరన్ననాయక్, ఉపాధ్యాయుడు నర్సింహాస్వామి, తెలంగాణ వికాస సమితి జిల్లా అధ్యక్షుడు జోగు చంద్రశేఖర్, సాదు రాజేష్, సైదిరెడ్డి, బిక్షపతినాయక్, ఎర్రోళ్ల శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, రామ్మూర్తి, ఎం.శ్రీనివాస్, ఆదిలక్ష్మి, పద్మారావు, శంకర్‌నారాయణ, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆస్నాల శ్రీనివాస్, విద్యావేత్తలు, పరిశోధకులు పాల్గొన్నారు. -
ఆదివాసీల హక్కుల కోసం పోరాడాలి
అణచివేతను దీటుగా ఎదుర్కోవాలి సీహెచ్ఆర్ఈ ఫ్యాకల్టీ మెంబర్ షమీమ్ మోదీ కాకతీయ యూనివర్సిటీలో బాలగోపాల్ స్మారకోపన్యాసం కేయూ క్యాంపస్ : ఆదివాసీల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని సెంటర్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్(సీహెచ్ఆర్ఈ-ముంబై), టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్‌సెన్సైస్(టీఐఎస్ఎస్) ఫ్యాకల్టీ మెంబర్ షమీమ్ మోదీ అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని సెనేట్హాల్లో బుధవారం బాలగోపాల్ ఐదో స్మారకోపాన్యాసం నిర్వహించారు. ఈ మేరకు ‘ట్రైబల్ స్ట్రగుల్స్ అండ్ ఇండియన్ స్టేట్’ అంశంపై ఆమె ప్రసంగించారు. ఆదివాసీలు స్వేచ్ఛాయుత జీవనం గడిపేందుకు పోరాడుతున్న వారందరూ ఒక వేదికపై రావాలని సూచించారు. మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ఆదివాసీలు దుర్భర జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. అడవి నుంచి వంట చెరుకు తెచ్చుకునే వి షయంలోనూ పిల్లలను సైతం జైళ్లకు పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భూస్వాము లు చెప్పిన వారికే ఆదివాసీలు ఓటు వేస్తుం డడం వారి అమాయకత్వానికి నిదర్శనమని తెలిపారు. జీవనాధారం కోల్పోయేలా చేస్తారన్న భయంతో వారు భూస్వాములకు ఓట్లు వేయాల్సిన దుర్భర పరిస్థితి ఉందన్నారు. తాను 18 ఏళ్లుగా తాను ఆదివాసీల తరఫున పోరాడుతున్నానని, ఈ క్రమంలో తనపై ఓ సారి హత్యాయత్నం సైతం జరిగిందని వివరించారు. ఆదివాసీల జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు కృత నిశ్చయంతో పోరాటాలు చేసినప్పుడే ఆశించిన మేర ఫలితాలు సాధించగలుగుతామన్నారు. ఫైట్ ఫర్ జస్టిస్ నినాదంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి సామాజిక సమస్యలపై యువత స్పందిస్తే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. పెట్టుబడిదారీ వ్యవస్థ వల్లే.. పెట్టుబడిదారీ వ్యవస్థ వల్లే మానవ హక్కుల ఉ ల్లంఘనలు జరుగుతున్నాయన్నాని ప్రొఫెసర్ జి.హరగోపాల్ అన్నారు. ప్రొఫెసర్ బాలగోపాల్ జీవించి ఉన్నప్పుడే ఏర్పాటైన పర్స్పెక్టివ్ సంస్థ ద్వారా ఇప్పటివరకు సుమారు 50 పుస్తకాలను ప్రచురించామన్నారు. బాలగోపాల్ ఆ లోచన విధానాలతో సామాజిక అంశాలపై పు స్తకాలను ప్రచురిస్తూనే ఉన్నామన్నారు. మరో 25 పుస్తకాలను ప్రచురించేందుకు సభ్యులుగా తాము కృషి చేస్తున్నామన్నారు. అంతకుముందు డాక్టర్ బాలగోపాల్ చిత్రపటానికి షమీమ్మోదీ పూలమాలవేసి నివాళులర్పించా రు. కార్యక్రమంలో షమీమ్ మోదీని ఇన్చార్జ్ రిజిస్ట్రార్ రంగారావు సన్మానించారు. కార్యక్రమంలో క్యాంపస్ ప్రిన్సిపాల్ ఎన్.రామస్వామి, ప్రొఫెసర్ కె.సీతారామారావు, న్యాక్ మాజీ డెరైక్టర్ శివలింగ ప్రసాద్, నర్సింహారెడ్డి, జీవన్‌కుమార్, అంపశయ్య నవీన్, కె.కాత్యాయనీ విద్మహే, నాగిళ్ల రామశాస్త్రి, కవి లోచన్, వసంతలక్ష్మి, ఎం.సారంగపాణి, వి.కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
పరిశోధన చేసినందుకు..గర్వంగా ఉంది
తెలంగాణ మలిదశ ఉద్యమంలో స్ఫూర్తిగా నిలిచి ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ‘బతుకమ్మ’కే దక్కుతుంది. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలతో మమేకమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ ప్రజల జీవనంలో కలిసిపోయిన ఈ పండుగపై 24ఏళ్ల క్రితమే పరిశోధన చేశారు చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన ఉపాధ్యాయుడు తాటికొండ విష్ణుమూర్తి. బతుకమ్మ పండుగపై పరిశోధన చేపట్టిన మొదటి వ్యక్తిగా పేరుగాంచిన ఆయన తన పరిశోధన నేపథ్యాన్ని వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. హన్మకొండ కల్చరల్ : బతుకమ్మతో నా అనుబంధం చిన్నప్పుటి నుంచి ఉంది. బతుకమ్మ పండుగను ఆసక్తిగా గమనించేవాడిని. మా ఇంట్లో బతుకమ్మను నేనే పేర్చేవాడిని. మా అమ్మ బతుకమ్మ పాటలు బాగా పాడుతుంది. ఆ పాటల్లోని సాంఘిక, పౌరాణిక అంశాలు నన్ను ఆకర్షించాయి. అప్పుడే ఈ పండుగకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అనిపించింది. నేను ఆకునూరులోనే చదువుకున్నా. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశా. 1985లో డిగ్రీ పూర్తయిన తర్వాత తెలుగుశాఖలో ఎంఏలో చేరి 1987లో పూర్తిచేశాను. అనంతరం ఎల్ఎల్బీ చేశాను. బతుకమ్మపై పరిశోధన 1990లో కాకతీయ యూనివర్సిటీ తెలుగుశాఖలోనే ఎంఫిల్ విద్యార్థిగా చేరాను. ఎంఫిల్ డిసర్టేషన్ పూర్తిచేయాల్సిన సమయంలో అధ్యాపకులను కలిసినప్పుడు ఆచార్య పేర్వారం జగన్నాథం సార్.. నీకు ఏ సాహిత్యమంటే ఇష్టమని నన్ను అడిగారు. నేను జానపద సాహిత్యం అని చెప్పాను. ఆయనకు కూడా అదే ఇష్టం. దీంతో వెంటనే ఆయన బతుకమ్మ పండుగపై పరిశోధన చేయమని సలహా ఇచ్చారు. అలా.. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టం.., సార్ చెప్పిన టాపిక్.. ఒకటే అయింది. ఆ సమయంలో అక్కడే ప్రొఫెసర్ జ్యోతి, ఫ్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, ఆచార్య రుక్మిణి ఉన్నారు. జానపద సాహిత్యమంటే క్షేత్ర పర్యటన విస్తృతంగా చేయాల్సి ఉంటుందని జ్యోతి మేడం చెప్పారు. మగాడివి.. మహిళల దగ్గరికి వెళ్లి పాటలు ఎలా సేకరిస్తావయ్యా.. అని కాత్యాయనీ మేడం అన్నారు. కానీ నేను చేయగలనని చెప్పా. అలా బతుకమ్మ టాపిక్ ఓకే అయింది. తీపిగుర్తుగా మిగిలిపోయింది బతుకమ్మపై పరిశోధన మరిచిపోలేని అనుభవాలను మిగిల్చింది. మొదటిసారి పాటలు సేకరించడానికి పోయినప్పుడు పాడేవారు కాదు. వారి అన్నదమ్ములను, తండ్రులను దోస్తీ చేసుకుని వారి ద్వారా పాడమని చెప్పించేది. బచ్చన్నపేటలో నేను టీచర్‌గా పనిచేస్తున్న జయ్యారం గ్రామంలోనే మొదట పాటలు సేకరించాను. మా సొంతూరులో మా అమ్మ జయలక్ష్మి ఎన్నో పాటలు పాడారు. మెట్‌పల్లిలోని గుడిదగ్గర ఎంగిలిపూవు బతుకమ్మ ఆడుతున్న మహిళల పాటలు రికార్డు చేయాలని టేప్‌రికార్డర్‌తో వెళ్లాను. వాళ్లు పాడలేదు. బతుకమ్మ ఆడడం పూర్తయి వారు వెళ్లిపోతున్న సమయంలో అంతకుముందు నేను రికార్డు చేసిన పాటలను వినిపించాను. దీంతో వారుకూడా ముందుకొచ్చి పోటీపడి మరీ పాటలు పాడారు. అక్కడి నుంచి సైకిల్‌పై బొమ్మలమేడిపల్లికి వెళ్లాను. ప్రముఖ సినీరచయిత, గాయకుడు సుద్దాల అశోక్‌తేజ అక్కడే టీచర్‌గా పనిచేసేవారు. ఆ రాత్రి వాళ్లింట్లోనే ఉన్నాను. మరుసటిరోజు ఆయన నన్ను బీడీల కంపెనీకి, హరిజన కాలనీకి తీసుకెళ్లారు. రాత్రి 12గంటల వరకు అక్కడి మహిళలతో పాటలు పాడించారు. అలాగే కోరుట్లలో శ్రీవేంకటేశ్వర భజనమండలి నిర్వహిస్తున్న వెంకట్రాజం సార్ మహిళలను పిలిపించి పాటలు పాడించారు. అలా మెదక్, వరంగల్ , కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లోని 50గ్రామాల్లో తిరిగి 400 పాటలు సేకరించా. వీటిలో 380 పాటలను పరిశోధనకు ఎంచుకున్నాను. పాటల సేకరణ సమయంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. మన సంస్కృతీసంప్రదాయాలు కనుమరుగవుతున్న తీరు కన్పించింది. జయ్యారంలో ఓ అమ్మాయి రెండుగంటలపాటు పాడింది. దీంతో విసుగొచ్చి రికార్డింగ్ ఆపుచేశాను. మా గైడ్ ప్రొఫెసర్ పి.జ్యోతి వద్ద చర్చిస్తున్నప్పుడు ఆమె అదే పాట కావాలని అనడంతో మళ్లీ వెళ్లాను. అప్పటికే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది. దీంతో వాళ్ల నాన్నను కలిసి విషయం చెప్పి ఆమెను పిలిపించి మళ్లీ పాట రికార్డు చేశాను. మొదటి పుస్తకంగా .. 1991లో ఎంఫిల్ అవార్డు అయింది. బతుకమ్మపై మొదటిసారి పరిశోధన చేసినందుకు గర్వంగా ఉంది. చేర్యాల మిత్రులు బతుకమ్మ పాటల పుస్తకాన్ని ప్రచురించాలని ప్రోత్సహించారు. అప్పుడు ఆచార్య పేర్వారం జగన్నాథం తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌గా ఉన్నారు. ఆయనే విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక సహకారం అందజేశారు. 1993లో పుస్తకావిష్కరణసభ చేర్యాల మండల పరిషత్ ఆఫీసులో జరిగింది. ముఖ్య అతిథిగా జగన్నాథం సార్, స్థానిక ఎమ్మెల్యే నాగపురి రాజలింగం(ప్రస్తుతం ఎమ్మెల్సీ), ఎంపీ డాక్టర్ పరమేశ్వర్, తెలుగు లెక్చరర్ బాసిరి సాంబశివరావు, ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య, కవి,విమర్శకుడు వేముగంటి నరసింహాచార్యులు, కవితిరునగరి, విద్యావేత్త కృష్ణాజీరావు, లెక్చరర్ అబ్బు రామయ్య(నెహ్రూ యూత్ కోఆర్డినేటర్, నిజామాబాద్) పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ ఇంత వైభవంగా ఉంటుందని ఈ పుస్తకం ద్వారానే తెలిసిందని చాలామంది మెచ్చుకున్నారు. ఆ తర్వాత 1995లో జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో జానపద విజ్ఞానంపై జాతీయస్థాయి సమావేశం జరిగినప్పుడు ప్రొఫెసర్ బిరుదరాజు రామరాజు బతుకమ్మ పుస్తకాన్ని చూసి ‘నాకోరిక ఇన్నాళ్లకు సఫలమయింది’ అనడం మర్చిపోలేను. ప్రస్తుతం సాక్షిపత్రికలో బతుకమ్మ పండుగపై వస్తున్న కథనాలు బాగుంటున్నాయి. -
కెయూలో ర్యాగింగ్ కలకలం
-
వరంగల్‌లో పడగ విప్పిన ర్యాగింగ్ భూతం
వరంగల్: వరంగల్ నగరంలోని కాకతీయ యూనివర్శిటీ క్యాంపస్‌లో ర్యాగింగ్ భూతం పడగ విప్పింది. స్థానిక గణపతి దేవా హాస్టల్లో హిస్టరీ డిపార్ట్మెంట్లోని సీనియర్ విద్యార్థులు... గత రాత్రి జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేశారు. దీంతో బాధితులైన జూనియర్లు గురువారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై మీడియాకు సమాచారం అందింది. దీంతో మీడియా క్యాంపస్‌కు చేరుకుని యూనివర్శిటీ అధికారులను ర్యాగింగ్‌పై వివరణ కోరింది. క్యాంపస్‌లో ర్యాగింగ్ జరిగినట్లు తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు. దీంతో పోలీసులను సంప్రదించగా ర్యాగింగ్ ఘటనపై విచారణ చేస్తున్నామని యూనివర్శిటీ ఎస్ఐ దేవేందర్‌రెడ్డి వెల్లడించారు. -
అడవి తంగేడుతో ఎయిడ్స్‌కు చెక్!
తిప్పతీగకూ ఔషధగుణాలు ఎయిడ్స్ కారక వైరస్‌లను తగ్గిస్తారు పరిశోధనలో తేల్చిన కాకతీయ వర్సిటీ బాటనీ విభాగం నివేదికపై కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సంతృప్తి మరింత పరిశోధనకు నిధులు మంజూరు సాక్షి, హన్మకొండ: ఇప్పటివరకు అకడమిక్ విషయాలకే ప్రాధాన్యమిచ్చిన మన యూనివర్సిటీలు ఇప్పుడు పరిశోధనల బాటపట్టాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఎయిడ్స్‌ను ఎదుర్కొనే శక్తి మన వనమూలికలకు ఉందంటున్నారు కాకతీయ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు. తెలంగాణలోని అటవీప్రాంతాల్లో సాధారణంగా కనిపించే అడవి తంగేడు, తిప్పతీగలకు ఎయిడ్స్ వ్యాధికారక వైరస్‌ను అడ్డుకునే లక్షణాలు ఉన్నట్లుగా కనుగొన్నారు. వీరు ప్రాథమికంగా జరిపిన పరిశోధనల్లో కొంత ఫలితాలు వచ్చాయి. మరింత లోతుగా పరిశోధనలు చేసేందుకు కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ రూ.21 లక్షలు విడుదల చేయగా.. బయోటెక్నాలజీ విభాగం రూ.47 లక్షలు మంజూరు చేసింది. ఎయిడ్స్ వ్యాధి హెచ్ఐవీ అనే వైరస్ ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. ఒక వ్యక్తి శరీరంలోకి ఎయిడ్స్ కారక హెచ్ఐవీ వైరస్ ప్రవేశించిన తర్వాత దాని వృద్ధి రేటు అనేది ఆ వైరస్‌లో ఉండే ఇంటిగ్రేజ్, క్రోటేజ్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఎంజైములపై ఆధారపడి ఉంటుంది. ఈ ఎంజైముల చర్యశీలత ఎక్కువగా ఉంటే హెచ్ఐవీ వైరస్ త్వరితగతిన అభివృద్ధి చెంది రోగం ముదురుతుంది. ఫలితంగా మనిషి త్వరగా మరణానికి చేరువ అవుతాడు. అయితే, కేషియా యాక్సిడెంటాలిస్ (అడవి తంగేడు) ఆకుల్లో, టినోస్ఫోరా కార్డిఫోలియా (తిప్పతీగ) మొక్కలలో ఉండే ఔషధ గుణాలకు ఈ ఎంజైముల చర్యశీలతను తగ్గించే లక్షణం ఉందని కేయూ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ ఇస్తారి మామిడాల అంటున్నారు. తమ ప్రయోగాల్లో ఈ విషయం తేటతెల్లమైందని ఆయన వెల్లడించారు. పరిశోధన ఇలా.. కాకతీయవర్సిటీ పీహెచ్డీ పరిశోధనలో భాగంగాా అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ ఇస్తారి మామిడాల.. ‘తెలంగాణ అడవుల్లో నివసించే గిరిజనులు - వనమూలిక వైద్యం’ అనే అంశంపై పరిశోధనలు జరిపారు. వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలోని గిరిజనులు, వనవాసీలు వివిధ వ్యాధులను నయం చేయడానికి 65 జాతులకు చెందిన ఔషధ మొక్కలను ఎక్కువగా వినియోగిస్తున్నట్లు కనుగొన్నారు. వీటిలో పునర్నవ (బహెరా డిప్యూరా), పిండికూర (ఎర్వాలానేటా), బ్రహ్మమేడి (ఫైకస్ హిస్పెడా), పులిచేరు (ఫిల్లాంథస్ రెటిక్యూలస్), నరమామిడి (లిట్సాగ్లుటిన్మో), సోమిడిచెక్క (సోమిడి ఫిబ్రుజా), కేషియా యాక్సిడెంటాలిస్ (అడవి తంగేడు), టినోస్ఫోరా కార్డిఫోలియా (తిప్పతీగ) వంటి మొక్కలు ఉన్నాయి. వీటితో సుఖవ్యాధులు, పాముకాటు, రక్తశుద్ధి, వీర్యవృద్ధి, జీర్ణసంబంధిత ఇతర ప్రాణాంతక వ్యాధులను మందులుగా ఉపయోగిస్తున్నారు. ఆదివాసీ వైద్యం వనమూలికా వైద్య విధానంలో భాగంగా ఆదివాసీలు, గిరిజనులు సుఖవ్యాధుల నివారణ ఔషధాలుగా తిప్పతీగ, అడవితంగేడు మొక్కలను ఉపయోగిస్తున్నట్లుగా కాకతీయ యూనివర్సిటీ స్కాలర్స్ జరిపిన ప్రాథమిక పరిశోధనలో వెల్లడైంది. దీంతో ఈ రెండు మొక్కలపై మరిన్ని పరిశోధనలు చేసేందుకు సిద్ధమయ్యారు. తిప్పతీగ మొక్కలో అన్ని భాగాలు రెండు కిలోల పరిమాణంలో ఎండబెట్టి తర్వాత ప్రయోగశాలలో సారం తీయగా 2.9 మిల్లీ గ్రాముల సారం వస్తుంది. అడవితంగేడు మొక్క ఆకులను పూర్తిగా ఎండబెట్టి వీటి నుంచి తీసిన సారాన్ని హెచ్ఐవీ వ్యాప్తికి కారకాలుగా పనిచేసే మూడు ఎంజైములపై ప్రయోగించారు. రెండు కేజీల ఎండిన అడవితంగేడు ఆకుల నుంచి 1.5 మిల్లీ గ్రాముల సారం తీసుకుని హెచ్ఐవీ కారక ఎంజైములైన ఇంటిగ్రేజ్, క్రోటేజ్, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్లపై ప్రయోగించగా వీటిలో రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైముల పనితీరు మందగించినట్లుగా గమనించారు. ఈ పరిశోధనల ఫలితాలను ప్రముఖ సైన్స్ మ్యాగజైన్లు ఇంటర్నెషన్ జర్నల్స్ అయిన సైంటిఫిక్ ఇంజనీరింగ్ రీసెర్చ్, ఇన్ఫెక్షియస్ డీసీజెస్ అనే బ్రిటన్ పత్రికలో ప్రచురితమయ్యాయి. అనంతరం ఈ ప్రయోగ ఫలితాలను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ శాఖలకు పంపించారు. కేంద్రం నుంచి రూ.68 లక్షలు మంజూరు అడవితంగేడు, తిప్పతీగలలో ఉన్న ఏ మూలకాలకు ఎయిడ్స్ వ్యాధిని నిరోధించే ఔషధ లక్షణాలు ఉన్నాయో కనుగొనేందుకు, కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న పరిశోధనలు కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అంగీకరించాయి. అడవి తంగేడు, తిప్పతీగలలో హెచ్ ఐవీ వైరస్‌లో ఉండే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైము పనితీరును తగ్గిస్తున్న ఔషధ మూలం (మాలిక్యూల్) ఏదో కనిపెట్టే పనిని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇస్తారీ మామిడాలతో నేతృత్వంలో స్కాలర్స్ రాజేంద్రాచారి, రాజేంద్రప్రసాద్, వెంకన్న, సాయినాథ్, ప్రసాద్‌లతో కూడిన బృందం ప్రయోగాలు చేస్తోంది. ఇందుకుగాను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ 2013 అక్టోబరులో రూ.21 లక్షలు విడుదల చేసింది. ఈ నిధులతో ‘యాంటీ హెచ్ఐవీ ప్రొటేజ్ ఇన్హెలిటరీ ఆక్టివిటీ ఆఫ్ సెలెక్టెడ్ మెడిసినల్ ప్లాంట్స్ ఎక్స్‌ట్రాట్స్’ అనే ఆంశంపై పరిశోధన సాగుతోంది. మరోవైపు డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఈ ఏడాది మార్చిలో రూ.47 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో ఐసోలేషన్ ప్యూరీఫికేషన్ ఆఫ్ ఆంటీ హెచ్ఐవీ కాంపౌండ్ ఫ్రం మెడిసినల్ ప్లాంట్ ఎక్స్‌ట్రాట్స్ అనే అంశంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. -
16 నుంచి కేయూ దూరవిద్య పీజీ పరీక్షలు
ఇంకా అందుబాటులోకి రాని హాల్‌టికెట్లు గడువు ముగిశాక కూడా అడ్మిషన్లు ఇచ్చిన అధికారులు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య పీజీ కోర్సులు ప్రీవియస్, ఫైనల్ ఇయర్ పరీక్షలను ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఎంఏ, ఎంకాం, హెచ్ఆర్ఎం, రూరల్ డెవలప్మెంట్, ఎల్ఎల్ఎం, ఎమ్మెస్సీ మ్యాథ్‌మెటిక్స్ కోర్సుల ప్రీవియస్ పరీక్షలు ఈనెల 16, 18, 20, 23, 25వ తేదీల్లో, ఫైనల్ ఇయర్ పరీక్షలు ఈనెల 17, 19, 22, 24, 26వ తేదీల్లో నిర్వహించేందుకు కేయూ పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు జరుగుతాయని అధికారులు తెలిపారు. పీజీ ప్రీవియస్ పరీక్షలను 7,465మంది, ఫైనల్ ఇయర్ పరీక్షలను 5,937మంది రాయనుండగా, టైంటేబుల్‌ను కేయూ ఎస్డీఎల్సీఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. హాల్‌టికెట్లు ఏవీ? పరీక్షల నిర్వహణకు రెండు రోజులే గడువు ఉన్నా అభ్యర్థుల హాల్‌టికెట్లు శనివారం రాత్రి వరకు కూడా వెబ్సైట్లో అందుబాటులో లేవు. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సెల్ఫోన్ల ద్వారా మెసేజ్‌లు పంపించిన అధికారులు ఆచరణలోకి వచ్చే సరికి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ విషయమై దూరవిద్య కేంద్రం డెరైక్టర్ ప్రొఫెసర్ డి.రాజేంద్రప్రసాద్‌ను వివరణ కోరగా సోమవారం వరకు ఎస్డీఎల్సీఈ వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అంతేకాకుండా పరీక్ష కేంద్రాల వద్ద హాల్‌టికెట్లు ఇస్తామని, ఒక రోజు ముందు విద్యార్థులు వాటిని తీసుకోవచ్చని సూచించారు. ఇష్టారాజ్యంగా ప్రవేశాలు కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య పీజీ ప్రీవియస్, ఫైనల్ ఇయర్ పరీక్షల టైంటేబుల్‌ను అధికారులు కొద్దిరోజుల క్రితమే వెల్లడించారు. అయితే, పరీక్షల తేదీకి నాలుగైదు రోజుల ముందు కూడా పీజీ ప్రీవియస్ కోర్సుల్లో పలువురికి ప్రవేశాలు కల్పించారనే విమర్శలు వస్తున్నాయి. కొంతకాలం క్రితమే అడ్మిషన్ల ప్రక్రియకు గడువు ముగియగా.. విషయం తెలియని కొందరు విద్యార్థులు ప్రవేశాల కోసం ఎస్డీఎల్సీఈకి వస్తే అధికారులు తిప్పిపంపించారు. కానీ ఒకటి, రెండు స్టడీ సెంటర్ల నుంచి వచ్చిన వారికి మాత్రం నాలుగు రోజుల క్రితం వరకు పీజీ ప్రీవియస్‌లో అడ్మిషన్లు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ప్రవేశాలు పొందిన వారం లోపే ఆయా అభ్యర్థులు పరీక్షలు రాయనుండడం గమనార్హం. ఎస్డీఎల్సీఈ పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి తప్పకుండా తరగతులకు హాజరుకావాలనే నిబంధన ఉంది. కానీ ఈ నిబంధనను విస్మరించి ఫీజులు వస్తే చాలునన్న చందంగా అధికారులు ప్రవేశాలు కల్పిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొందరు ఎంఓయూ సెంటర్ల నిర్వాహకులు ప్రవేశాలు లేకున్నా అభ్యర్థులతో పరీక్షలు రాయిస్తున్నారనే ఆరోపణలు గతంలో వచ్చాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు కేయూ అధికారులు ఇప్పటికైనా నిబంధనలను పకడ్బందీగా అమలుచేయాలని పలువురు కోరుతున్నారు. -
ఫారెస్ట్ ఆఫీసర్ కావాలనుకున్నా..
ఐఎఫ్ఎస్ నా లక్ష్యం రూ.ఆరువేలు లేక ఎంబీబీఎస్ సీటు వదులుకున్నా ఇంగ్లిష్‌లో గ్రిప్లేక లక్ష్య ఛేద నలో వెనుకబడ్డా జమానత్ సీతారాం అనే పిలుపు గర్వంగా ఉండేది అతి తక్కువ ఖర్చుతో గెలిచింది దేశంలో నేనొక్కడినే నా చదువులో నానమ్మది కీలకపాత్ర నా ప్రతి అడుగులో భార్య సహకారం ఉంది ఆటలంటే ఎంతో ఇష్టం హరిత తెలంగాణ సాధనకు నా వంతు కృషి చేస్తా మానుకోట ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ సాక్షిప్రతినిధి, వరంగల్: మాది వెంకటాపురం మండలంలోని మల్లయ్యపల్లి. నారాయణపురం గ్రామపంచాయతీ అనుబంధ గ్రామం. నాన్న అజ్మీరా లక్ష్మణ్, అమ్మ మంగమ్మ. ముగ్గురం అన్నదమ్ములం. నేనే పెద్దోడిని. ఇద్దరు చెల్లెళ్లు. వ్యవసాయ కుటుంబం. మా తాతలప్పుడు 50 ఎకరాల వరకు ఉండేది. అన్నదమ్ములు పంచుకోగా కొంత తగ్గింది. ఇంటి నిర్వహణ విషయంలో మా నానమ్మ పాపమ్మ గ్రేట్. నా చదువులో ఆమెది కీలకపాత్ర. 1957 ఆగస్టు 20న పుట్టాను. డిగ్రీలో ఉన్నప్పుడే పెళ్లయింది. భార్య పేరు శారద. కుమార్తె పల్లవి, కాకతీయ వర్సిటీలో బయోటెక్నాలజీ ఎమ్మెస్సీ ఫస్ట్ బ్యాచ్. అల్లుడు బూక్యా లచ్చిరాంనాయక్, ఐఆర్ఎస్ అధికారి. కాజీపేట రైల్వే డివిజన్ సీనియర్ మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. పెద్ద కుమారుడు రాకేశ్, ఎంఎస్(ఆర్థోపెడిక్) పూర్తిచేశాడు. చిన్నోడు రాజేశ్, ఎంటెక్. ప్రస్తుతం కేయూలోనే అకడమిక్ కన్సల్టెంట్గానూ పనిచేస్తున్నాడు. నా జీవిత పయనంలో వృత్తిపరంగా, కుటుంబపరంగా నా భార్య సహకారమే ఎక్కువ. చదువుకునే రోజుల్లో, ఉద్యోగ సమయంలో, తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. ఈ విషయంలో నా భార్య ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. ఇంటి నిర్వహణ ఆమే చూసుకుంటుంది. పిల్లల సెటిల్మెంట్ ఘనత పూర్తిగా ఆమెదే. ఎన్నికల సమయంలోనూ కీలకంగా వ్యవహరించింది. జమానత్ సీతారాం.. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటులోనే పెద్ద కుట్ర ఉన్నది. ఎస్టీ, ఎస్సీలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చాలా అన్యాయం జరిగింది. నీళ్లు, నిధులు, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికపరంగానూ ఈ వర్గాలే ఎక్కువ నష్టపోయాయి. ఆంధ్రరాష్ట్రం, తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన 1956 నుంచి మాకు(లంబాడీ) ఎస్టీగా రిజర్వేషన్లు లేవు. అదే ఆంధ్ర ప్రాంతంలోని లంబాడీలు ఎస్టీల్లో ఉండేవారు. 1976లో తెలంగాణ ప్రాంతంలోని లంబాడీలను ఎస్టీల్లో చేర్చారు. ఇలాంటి వాటితో ఎంతోమంది విద్యావంతులు నష్టపోయారు. ఎంబీబీఎస్ సీటు విషయంలో నాకు ఇదే అనుభవం ఉంది. ఇలా ఎన్నో అన్యాయాలు. ఇవన్నీ చూసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో నా వంతుగా ప్రయత్నించా. ఎన్ఎస్ఎస్ యూనివర్సిటీ సమన్వయకర్తగా ఉన్న పరిచయాలతో తెలంగాణ యూనివర్సిటీల గిరిజన అధ్యాపకుల సంఘం(తుటా)ను ఏర్పాటు చేశాను. 2009లో కేసీఆర్ నిరహార దీక్ష తర్వాత ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ పాత్ర చెప్పలేనిది. పోలీసు నిర్బంధంతో విద్యార్థులపై దాడులకు తెంపు ఉండేది కాదు. ఉద్యమం కేసుల పేరిట పగలు, రాత్రి తేడాలేకుండా పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసేవారు. నేను వెళ్లి వారికి జమానత్ ఇచ్చేవాడిని. దీంతో ఒకసారి జడ్డి... ఎంతమందికని జమానత్ ఇస్తరు. మీపై అధికారులకు లెటర్ రాస్తా అన్నారు. ‘నేను దేశద్రోహులకు, ఉగ్రవాదులకు జమానత్ ఇస్తలేను. నా జీతం కట్ అయినా పర్వాలేదు’ అని చెప్పాను. ఉద్యమం కీలక సమయంలో నన్ను జమానత్ సీతారాం అనేవారు. అలా పిలవడం నాకు గర్వంగా అనిపించేది. ఎన్ఎస్ఎస్తో గుర్తింపు.. ఎన్ఎస్ఎస్లో పనిచేయడం అదృష్టంగా భావిస్తా. సమాజంలో అనేక సమస్యలను తెలుసుకునే అవకాశం దీంతోనే వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులతో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాలను నిర్వహించా. సామాజిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టాం. మంచిర్యాలలో ఉన్నప్పుడే ఎన్ఎస్ఎస్ జిల్లా సమన్వకర్తగా, వరంగల్‌కు వచ్చాకా జిల్లాస్థాయి ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల అధికారిగా పనిచేశా. సామాజిక, రక్తదానం కార్యక్రమాలు నిర్వహించా. మేడారం జాతర సమయాల్లో మూడుసార్లు మెగాక్యాంపులు విజయవంతంగా నిర్వహించాం. 17 రాష్ట్రాల విద్యార్థులతో ములుగులో క్యాంప్ నిర్వహించా. క్యాంపులో ఉన్నప్పుడే కాకతీయ యూనివర్సిటీలో పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వచ్చాయి. 50 వేల యూనిట్ల రక్తం సేకరించాం. రెడ్‌క్రాస్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యుడిగా ఎంపికయ్యా. రెండుసార్లు యూనివర్సిటీకి గవర్నర్ సుర్జిత్‌సింగ్ బర్నాలాను తీసుకువచ్చా. 35 గిరిజన తెగలకు పరిశోధన చేశా. గుల్బార్గా, మిథిలా వర్సిటీలతోపాటు అమెరికా, నేపాల్, థాయ్‌లాండ్‌లో అంతర్జాతీయ సదస్సులో పరిశోధనాపత్రాలను సమర్పించా. అవార్డులూ వచ్చాయి. సీతారాంనాయక్‌కు గుర్తింపు తెచ్చింది ఎన్ఎస్ఎస్ అని గట్టిగా చెబుతాను. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన హరిత తెలంగాణకు నా వంతుగా కృషి చేస్తాను. మనిషి పుట్టుక నుంచి జీవితాంతంలోనూ చెట్టు ప్రాధాన్యతను వివరించేలా ఉన్న ‘చెట్టమ్మ.. చెట్టు’ పాటతో పచ్చదనం ప్రాధాన్యతను వివరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నా. నాకు మొదటి నుంచి స్పోర్ట్స్ అంటే ఇష్టం. కబడ్డీ, బాల్‌బ్యాడ్మింటన్ ఆడేవాడిని. ఎన్నికల్లో నాది రికార్డు సామాజిక కార్యక్రమాలపై నాకు మొదటి నుంచి ఆసక్తి. వీటి వల్లే రాజకీయాలపైనా ఇష్టం ఏర్పడింది. యూనివర్సిటీలో ఉన్నప్పుడు పీడీఎస్‌యూ, ఆర్ఎస్యూ బలంగా ఉండేవి. అంతా ఖమ్మం వాళ్ల డామినేషన్ నడిచేది. వరంగల్ లోకల్ ఫీలింగ్‌తో కొందరు మిత్రులతో కలిసి నేను విద్యార్థి సంఘం ఎన్నికల్లో పోటీచేశా. సమానంగా ఓట్లు రావడంతో టాస్ వేస్తే ప్రత్యర్థి సోమిరెడ్డి గెలిచారు. డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌గా ఉన్నప్పుడే ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు పరిశీలనలో ఉన్నట్లు పత్రికల్లోనే వార్తలు వచ్చేవి. 2004, 2009 ఎన్నికల్లో ఒక జాతీయ పార్టీ టిక్కెట్ ఇచ్చే విషయాన్ని పరిశీలించింది. డబ్బులు లేవనో, మధ్యవర్తులు లేకనో నాకు అవకాశం రాలేదు. జనాభా నిష్పత్తి ప్రకారం ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఎస్టీల స్వయంపాలన కోసం తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుతామన్నారు. అందుకే నేను టీఆర్ఎస్లో చేరా. మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలిచి టికెట్ ఇచ్చారు. ఎంపీగా పోటీచేస్తావా? ఎమ్మెల్యే టికెట్ కావాలా? నీ ఇష్టం అన్నారు. ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి నన్ను సన్నిహితులు ఎంపీగారు అనేవారు. నేను దానికే ఫిక్సయ్యా. మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలో ఖమ్మంలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా నాకు ఇబ్బంది రావద్దనే ఉద్దేశంతో కేసీఆర్‌గారు ఎమ్మెల్యే టెకెట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మానుకోట ప్రజలను నన్ను ఎంపీగా గెలిపించారు. ఎన్నికల్లో సాధారణ రవాణా, ప్రచారం కోసమే ఖర్చు చేశా. ఓట్ల కోసం ఒక్క రూపాయీ ఇయ్యలేదు. దేశంలోనే అతి తక్కువ ఖర్చుతో ఎంపీగా గెలిచింది నేనేనని గర్వంగా చెబుతా. 13 ఏళ్లపాటు కేయూలో పనిచేశాను. అడ్మిషన్ల డెరైక్టరుగా, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్‌గా, ఆర్ట్స్ కాలేజీ ఇన్చార్జ్గా, కేయూ పాలకమండలి సభ్యుడిగా పదవులు నిర్వహించా. రెండుసార్లు వర్సిటీ బడ్జెట్ ప్రవేశపెట్టా. యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహం, ఎస్టీలపై బుక్‌బ్యాంక్, పరిపాలన భవనం ఎదుట ఎన్ఎస్ఎస్ మార్గ్ ఏర్పాటు, చెక్‌డ్యాం నిర్మాణం తృప్తి కలిగించాయి. ఒక్క విమర్శ, ఆరోపణ లేకుండా 13 ఏళ్లపాటు యూనివర్సిటీలో పనిచేశా. రాజకీయాల్లోనూ ఇలాగే ఉండాలని నా ఉద్దేశం. ఇంగ్లిష్‌లో పట్టులేక.. వ్యక్తి అభివృద్ధికి చదువే మూలం. ఇందుకు నేనే నిదర్శనం. మా చిన్నాన్న వెంకట్రాం 1950ల్లోనే తొమ్మిదో తరగతి వరకు చదివారు. నా చిన్నప్పుడు వ్యాపారం చేసుకునేందుకు మా ఊరొచ్చిన ఓ వైశ్య కుటుంబం మా ఇంట్లోనే ఉండేది. వారు మా నాన్నను, నానమ్మను ఒత్తిడి చేయడంతో నన్ను స్కూలుకు పంపించారు. నాలుగో తరగతి వరకు నారాయణపురంలో చదివాను. నాలుగు నుంచి ఆరు వరకు గుర్రంపేటలో, ఆరు నుంచి తొమ్మిది వరకు ఘణపురం(ఎం) ప్రభుత్వ పాఠశాలలో చదివాను. పదో తరగతి కోసం హన్మకొండ మర్కజీ స్కూల్లో చేరాను. హాస్టల్ సీటు కోసం మా ఊరి దగ్గర్లోని లక్ష్మీదేవిపేటకు చెందిన సూర్యనేని రాజేశ్వరరావు.. సంక్షేమ అధికారితో మాట్లాడారు. అయితే మర్కజీ స్కూల్‌కు వెళ్లలేదు. తర్వాత పరకాల స్కూళ్లో చేరా. ఎందుకో ఉండబుద్ధి కాకపోయేది. చిన్నప్పటి నుంచి ఫస్ట్ లేదా సెకండ్ ర్యాంక్‌లో ఉండేవాడిని. 1969 తెలంగాణ ఉద్యమంతో చదువులో కొంత వెనుకబడ్డా. 50 శాతం మార్కులతో పాసయ్యా. హన్మకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్‌లో చదువుకున్నా. కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీలో చేరా. అప్పుడు కాకతీయ డిగ్రీ కాలేజీనీ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆ రోజుల్లోనే మంత్రి చాంబర్ ఎదుట నిరసన తెలిపాం. డిగ్రీ నుంచి నా చదువు బాగా మెరుగయ్యింది. మెరిట్ వచ్చింది. కేయూలో బాటనీలో ఎమ్మెస్సీ పూర్తిచేశా. 1982లో ఎమ్మెస్సీ అయ్యింది. అటవీ ప్రాంతంతో ఉన్న అనుబంధం వల్ల కావచ్చ.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు(ఐఎఫ్ఎస్) అధికారి కావాలని లక్ష్యంగా ఉండేది. అందుకే బైపీసీ చదివా. ఎంబీబీఎస్ రాశాను. అప్పుడు సీటు రాలేదు. రూ.ఆరు వేలు ఫీజు కడితే సీటు వస్తుందన్నారు. అంత కట్టలేక డిగ్రీలో చేరాను. ఫారెస్ట్ శాఖలో ఉద్యోగం, లేకుంటే గెజిటెడ్స్థాయిలో ఉండే ఉద్యోగం చేయాలని అనుకునేవాడిని. అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగాలు, చదువులకు దేనికి దరఖాస్తు చేయాలన్నా గెజిటెడ్ సంతకం తప్పనిసరి. దీనికోసం గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చేది. ఆ నిరీక్షణ చూసి నేను గెజిటెడ్‌స్థాయి ఉద్యోగం చేయాలని అనుకునేవాడిని. ఐఎఫ్ఎస్ అనేది బాగా మనసులో ఉండేది. డిగ్రీ పూర్తి కాగానే ఐఎఫ్ఎస్ రాశాను. ఇంగ్లిషులో గ్రిప్ లేకపోవడం వల్ల రాలేదు. పీహెచ్డీ పూర్తి కాకముందే డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం వచ్చింది. పీహెచ్‌డీకి ఇబ్బంది లేకుండా మంచిర్యాలలో పోస్టింగ్ వచ్చింది. ఈ విషయంలో మేచినేని కిషన్‌రావుగారు సహకరించారు. 1984 నుంచి 1995 వరకు అక్కడే పనిచేశా. తర్వాత 2001 వరకు కాకతీయ డిగ్రీ కాలేజీ. 2001 నుంచి ఇటీవలి వరకు కేయూలో రీడర్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేశా. కాలం మారింది మేం విద్యార్థులుగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులంటే ఎంతో గౌరవం ఉండేది. ఇద్దరి అనుబంధం ఉండేది. ఇప్పుడు అది కనిపించడంలేదు. జగన్మోహన్రావు, సుబ్బారావు, తిరుపతిరావు, రామ్మోహన్రావు ఇప్పటికీ నాకు చాలా గుర్తు. పీహెచ్డీ గైడ్‌గా దిగంబరరావు సార్ ఉండె. ఉన్నత విద్య అనేది వ్యక్తుల జీవితాలకు, జీతాలకు కాకుండా సమాజానికి ఉపయోపడాలని చెప్పేవారు. వల్లంపట్ల నాగేశ్వర్రావు నాకు పరకాల నుంచీ మిత్రుడే. ఎందుకో తెలియదుగానీ సబ్జెక్టు పరంగా మన కంటే మెరుగైన వాళ్లతో స్నేహం చేయాలని నాకు మొదటి నుంచి ఉండేది. అది కెరియర్ పరంగా నాకు బాగా ఉపయోగపడింది. భగవాన్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, విజయాకర్, దేవదాసు, నేను బాగా కలిసి ఉండేవాళ్లం. అప్పుడు ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాలకు వెళ్లేవాడిని. సినిమా అనేది పవర్ఫుల్ మీడియా. ఇప్పుటి సినిమాల్లో విలువలే ఉండడం లేదు. హీరోల పేరుతో కొందరు చేసే చేష్టలు చూస్తేనే వికారం వస్తుంది. -
కాళన్నతో తీపిజ్ఞాపకాలు
కాళోజీ.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరిది. ప్రజల కష్టాలను తనవిగా భావించి కలంతో పోరాడిన ధీరుడు కాళోజీ నారాయణరావు. కవిగా.. పోరాట యోధుడిగా.. ప్రజల మనిషిగా.. మనలో ఒకడిగా జీవించిన ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే... ఆయనను అతి దగ్గరి నుంచి చూసినవారు మాత్రం కాళోజీలోని మరో మనిషిని చూశారు. ఎవరితోనైనా సరే చిన్నపిల్లాడిలా కలిసిపోవడం, ఆత్మీయత పంచడం, ఆప్తుడిలా సలహాలు, సూచనలు ఇవ్వడం..వారికి మాత్రమే తెలుసు. కాళోజీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనతో పరిచయమున్న ప్రముఖుల అభిప్రాయాలు మీకోసం.. ఓసారి కాళోజీతో పరిచయమైనా, ఆయనతో ఎక్కడైనా మాట్లాడినా ఆ అనుభవాన్ని ఎవరూ మరిచిపోలేరు. చిన్నాపెద్దా తేడా లేకుండా పలకరించడం.. రచనలు ప్రారంభించిన వారికైతే సలహాలు, సూచనలు ఇవ్వడం ఆయన అలవాటు. ఆ సూచనలు పాటించిన ఎందరో ప్రస్తుతం గొప్ప రచయితలుగా పేరు పొందారు. కాళోజీతో పరిచయం ఉన్న వారే కాదు ఒక్కసారి కలిసిన వారినైనా సరే.. పలకరిస్తే చాలు ఆయనతో అనుబంధం, గడిపిన క్షణాలను తమ జ్ఞాపకాల దొంతర నుంచి తెరతెరలుగా బయటకు తీసి ఉద్విగ్నత, ఆనందం కనిపించే కళ్లతో చెప్పుకుంటూ పోతారు. కాళోజీ జయంతి మంగళవారం జరగనున్న నేపథ్యంలో ఆయనతో పరిచయమున్న పలువురిని ‘సాక్షి’ పలకరించింది. ఈ సందర్భంగా వారు చెప్పిన వివరాలు వారి మాటల్లోనే... - హన్మకొండ కల్చరల్ అప్రజాస్వామిక వ్యవస్థ గజగజలాడేది.. ప్రజాచైతన్య ఉద్యమాలకు నిలువెత్తు సంతకం ప్రజాకవి కాళోజీ నారాయణరావు. తన ఎక్స్‌రే కళ్లతో సమాజాన్ని దర్శించి కవిత్వం రాశారాయన. కాళోజీ ఒక వ్యక్తి కాదు.. శక్తి. కాలంతో నడిచిన ఆయన భాగస్వామ్యం వహించని ప్రజా ఉద్యమం లేదు. ఆయన జ్ఞాపకాలను పుస్తకంలా గ్రంథస్థం చేయడమే కాకుండా విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరముంది. తనను క్షోభ పెట్టిన ప్రతీ ఘటనను కవిత్వం చేసిన మహానుభావుడాయన. సామాన్య ప్రజల బాధలు, గాథలను చిత్రించేటప్పుడు సామాన్యుడికి అర్థమయ్యే రీతిలోనే కవితా శిల్పం ఉండాలని కాంక్షించారు. కాళన్నను చూస్తే ఆ కాలంలో అప్రజాస్వామిక వ్యవస్థ గజగజలాడేది. ప్రశ్నించని నాడు మనం జీవించడం మరిచిన వాళ్లమవుతామని సూటిగా చెప్పారు కాళన్న. - ప్రొఫెసర్ బన్నా అయిలయ్య, కాకతీయ యూనివర్సిటీ ‘నా గొడవ’ ఆవిష్కరణ మా స్కూల్లోనే.. వరంగల్ మహబూబియా హైస్కూల్లో నేను 9వ తరగతి చదువుతున్న కాళోజీ ‘నా గొడవ’ ఆవిష్కరణ జరిగింది. అప్పుడు కాళోజీ గురువు గార్లపాటి రాఘవరెడ్డి మా పాఠశాల హెచ్ఎంగా ఉండగా ఆవిష్కరణ సభకు శ్రీశ్రీ కూడా హాజరయ్యారు. ఆ తర్వాత కాళోజీతో పరిచయం పెరిగినా మిత్రమండలి సమావేశాలకు వెళ్లింది తక్కువ. వరంగల్‌లోని జనధర్మ పత్రిక కార్యాలయం లేదా మా మిత్రుడు నిరంజన్ తండ్రి పాములపర్తి సదాశివరావు ఇంట్లోనో కాళోజీని దగ్గరగా చూసేవాడిని. ఆయన సరళమైన భాష, సూటిగా మాట్లాడే విధానం నన్ను ఆకర్షించింది. ఒకసారి వనం మధుసూదన్‌రావు రాసిన జీర్ణజీవితాలు పుస్తకావిష్కరణ సభకు వచ్చిన కాళోజీ.. ఎంతో అభిమానంగా పిలిస్తే వచ్చాను కానీ కానీ పుస్తకాన్ని చదవనందున ఏమీ మాట్లాడలేనని ఆయన చెప్పడం ఇంకా గుర్తే. వరంగల్‌లో అఖిల భారత తెలుగు రచయితల సభలు జరిగినప్పుడు కాళోజీ, దాశరథితో పాటు కవిత చదివే అవకాశం నాకు దక్కడాన్ని మరిచిపోలేను. - రామా చంద్రమౌళి, కవి -
మెడికల్ కౌన్సెలింగ్ విధి విధానాలు
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులు సంబంధిత ధ్రువపత్రాలన్నీ తప్పనిసరిగా తీసుకురావాలి. ఏ ఒక్కటి లేకున్నా కౌన్సెలింగ్‌లో అనర్హతకు గురయ్యే ఆస్కారం ఉంది. సీట్లు పొందిన విద్యార్థులు ఎంసెట్ కోసం పడిన శ్రమకు ప్రతిఫలం లభించిందని సరిపెట్టుకోకుండా భవిష్యత్తులో మంచి వైద్యునిగా గుర్తింపు పొందడం లక్ష్యంగా చేసుకోవాలి. దీని కోసం కళాశాలలలో చేరిన మొదటి రోజు నుంచే శ్రమించాలి. -డాక్టర్ టి. రవి రాజు, వీసీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రాష్ట్ర విభజన అనంతరం తొలి సారిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కలిపి ఉమ్మడిగా మెడికల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. అయితే కౌన్సెలింగ్ విధానంలో ఎటువంటి మార్పులు లేవు. ఆన్లైన్ పద్ధతిలో ఐదు కేంద్రాల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టనున్నారు. కేంద్రాల వివరాలు.. జేఎన్టీయూ- హైదరాబాద్ కాకతీయ యూనివర్సిటీ-వరంగల్ ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం ఎస్వీ యూనివర్సిటీ -తిరుపతి. విద్యార్థులు ఈ ఐదు కేంద్రాల్లో ఎక్కడైనా కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. కొత్తగా: ఈ ఏడాది కొత్తగా అందుబాటులోకి వచ్చిన తిరుపతిలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలలో 150 సీట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 120 జీవో మేరకు 15 శాతం సీట్లు ఎన్ఆర్ఐ కోటా కిందకు వస్తాయి. మిగతా 127 సీట్లకు హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. ఇందులో 85 శాతం సీట్లను స్థానిక విద్యార్థులకు (ఆంధ్రప్రదేశ్) కేటాయించారు. మరో 15 శాతం సీట్లను అన్ రిజర్వుడ్ కింద భర్తీ చేస్తారు. అర్హత-వయసు: మెడికల్/డెంటల్ కోర్సుల్లో చేరాలంటే ఎంసెట్ ర్యాంక్‌తోపాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిర్దేశించిన కొన్ని అర్హతలు తప్పనిసరి. అవి.. ఓపెన్ కేటగిరీ 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (బైపీసీ) ఉత్తీర్ణత (బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులు 40 శాతం; ఓసీ వికలాంగ విద్యార్థులు 45 శాతం మార్కులు సాధించాలి)ఎంసెట్‌లో ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు 50 శాతం (80 మార్కులు); బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం (64 మార్కులు); ఓసీ పీహెచ్ అభ్యర్థులు 45 శాతం (72 మార్కులు) పొంది ఉండాలి. వ యసు: 31-12-2014 నాటికి 17 సంవత్సరాలు నిండి ఉండాలి. 02-01-1998 తర్వాత జన్మించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు అనర్హులు. కావల్సిన సర్టిఫికెట్లు: ఎంసెట్ హాల్‌టికెట్ ఎంసెట్ ర్యాంకు కార్డు జనన ధ్రువీకరణ పత్రం (ఎస్ఎస్సీ/తత్సమాన సర్టిఫికెట్) ఇంటర్మీడియెట్/తత్సమాన మార్కుల జాబితా టీసీ (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్) ఆరు నుంచి ఇంటర్మీడియెట్ వరకు స్టడీ సర్టిఫికెట్లు ఇతర రాష్ట్రాల్లో చదివి ఉంటే... తహసీల్దార్/ఎంఆర్ఓ జారీ చేసిన పదేళ్ల రెసిడెన్స్ సర్టిఫికెట్ స్పెషల్ కేటగిరీ కింద హాజరయ్యే విద్యార్థులకు నిర్దేశించిన సర్టిఫికెట్లు రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులు ఎంఆర్ఓ/తహసీల్దార్ జారీ చేసిన కుల ధ్రువీకరణ సర్టిఫికెట్ (ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ సర్టిఫికెట్), ఫీజు రీయింబర్స్మెంట్ అర్హత ఉన్న విద్యార్థులు ఎంఆర్ఓ/ తహసీల్దార్ 1-1-2014 తర్వాత జారీ చేసిన ఆదాయ ధ్రువీకరణ సర్టిఫికెట్. కౌన్సెలింగ్ ఫీజులు: కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు అటెస్ట్ చేసిన రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తెచ్చుకోవాలి. అడ్మిషన్ పొందిన విద్యార్థులు యూనివర్సిటీ, ట్యూషన్ ఫీజులను కౌన్సెలింగ్ కేంద్రాల్లోనే ఏర్పాటు చేసిన బ్యాంక్ కౌంటర్లలో చెల్లించాలి. గతంలో మాదిరిగానే: గతంలో మాదిరిగానే ఉస్మానియా, ఆంధ్రా, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ల వారీగా కౌన్సెలింగ్ జరుగుతుంది. స్థానికతను నిర్ణయించడానికి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ (అర్హత పరీక్ష) వరకు విద్యార్ధి చదివిన ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇంటర్మీడియెట్‌తో సహా అంతకు ముందు వరుసగా ఏడేళ్లు (ఆరు నుంచి ఇంటర్ వరకు)ఏ యూనివర్సిటీ పరిధిలో చదివితే ఆ యూనివర్సిటీ పరిధిలోని మెడికల్/డెంటల్ కళాశాలకు స్థానిక అభ్యర్థిగా గుర్తింపు లభిస్తుంది. అలా కాకుండా ఇంటర్మీడియెట్లోపు వేర్వేరు యూనివర్సిటీ పరిధిల్లో సమానంగా చదివి ఉంటే... ఇంటర్మీడియెట్ పూర్తి చేసే నాటికి ఏ వర్సిటీ పరిధిలో చదివితే ఆ వర్సిటీ స్థానిక అభ్యర్థిగా పరిగణిస్తారు. మొదట అన్ రిజర్వ్డ్: కౌన్సెలింగ్‌లో మొదట అన్‌రిజర్వుడ్ కేటగిరీ కింద 15 శాతం ీసీట్లను భర్తీ చేస్తారు. తర్వాత 85 శాతం లోకల్ సీట్లలో ప్రవేశ ప్రకియను చేపడతారు. తొలుత భర్తీ చేసే 15 శాతం అన్‌రిజర్వుడ్ సీట్ల కోసం... విద్యార్థులు తమ రీజియన్‌తో సంబంధం లేకుండా రెండు రాష్ట్రాలలోని కళాశాలల్లో సీట్ల కోసం పోటీ పడొచ్చు. సీట్లను భర్తీ చేసే క్రమంలో రిజర్వేషన్, స్థానికతతో నిమిత్తం లేకుండా ముందుగా ర్యాంకు ఆధారంగా సీటు లభిస్తుందో? లేదో చూస్తారు. తర్వాత యూనివర్సిటీ ఏరియా, రిజర్వేషన్, లోకల్, నాన్‌లోకల్ వీటిని వరుసగా పరిగణనలోకి తీసుకుని సీటును కేటాయిస్తారు. మెరిట్ అభ్యర్థి నాన్‌లోకల్ ఏరియాలో ఎక్కడైనా సీటు పొందే అవకాశం ఉంది. నిబంధనల ప్రకారం: రెండు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆయా వర్గాలకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం ఉంటుంది. జీవో నం. 165: ప్రభుత్వం 2010, జూలై 20వ తేదీన విడుదల చేసిన జీవో నం.165 ప్రకారం మెడికల్, డెంటల్ కోర్సుల్లో సీట్లు పొంది న అభ్యర్థులు కోర్సు పూర్తయిన వెంటనే సంవత్సర కాలం పాటు గ్రామీణ ప్రాంతాల్లో తప్పనిసరిగా పని చేయాలి. ఫీజులు: ఎంబీబీఎస్: వర్సిటీ ఫీజు రూ. ట్యూషన్ ఫీజు రూ. ప్రభుత్వ కళాశాల 7,000 10,000 ప్రైవేట్-ఎ: 11,500 60,000 ప్రైవేట్-బి: 20,500 2,40,000 బీడీఎస్: ప్రభుత్వ కళాశాల 6,000 9,000 ప్రైవేట్-ఎ: 10,500 45,000 ప్రైవేట్-బి: 14,500 1,30,000 ఆర్మీ డెంటల్: 14,500 1,35,000 వెబ్సైట్: http://ntruhs.ap.nic.in -రాజ్‌కుమార్ ఆలూరి, న్యూస్‌లైన్, విజయవాడ. మొదటి విడత కౌన్సెలింగ్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరుగుతుంది. షెడ్యూల్ వివరాలు.. ఆగస్టు 30, 2014 అన్ని కేటగిరీల వారికి ఉదయం 9 గం. 1-800 ర్యాంకు వరకు మధ్యాహ్నం 1 గం. 801-1500 ర్యాంకు వరకు ఆగస్టు 31, 2014 అన్ని కేటగిరీల వారికి ఉదయం 9 గం. 1501-3000 ర్యాంకు వరకు మధ్యాహ్నం 1 గం. 3001-4500 ర్యాంకు వరకు సెప్టెంబర్ 1, 2014 అన్ని కేటగిరీల వారికి ఉదయం 9 గం. 4501-6500 ర్యాంకు వరకు మధ్యాహ్నం 1 గం. 6501-8500 ర్యాంకు వరకు సెప్టెంబర్ 2, 2014 బీసీ-ఎ, బి, సి, డి, ఈ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారికి ఉదయం 9 గం. 1-2000 ర్యాంకు వరకు మధ్యాహ్నం 1 గం. 2001-3000 ర్యాంకు వరకు సెప్టెంబర్ 3, 2014 బీసీ-ఎ, బి, సి, డి, ఈ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారికి ఉదయం 9 గం. 3001-4500 ర్యాంకు వరకు మధ్యాహ్నం 1 గం. 4501-6500 ర్యాంకు వరకు సెప్టెంబర్ 4, 2014 బీసీ-ఎ, బి, సి, డి, ఈ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారికి ఉదయం 9 గం. 6501-8000 ర్యాంకు వరకు మధ్యాహ్నం 1 గం. 8001-10000 ర్యాంకు వరకు సెప్టెంబర్ 5, 2014 ఎస్సీ కేటగిరీ వారికి ఉదయం 9 గం. 10001-15000 ర్యాంకు వరకు ఏయూ పరిధిలోని బీసీ-ఈ కేటగిరీ వారికి మధ్యాహ్నం 1 గం. 10001-20000 ర్యాంకు వరకు ఎస్వీయూ, ఏయూ పరిధిలోని ఎస్టీ కేటగిరీ వారికి మధ్యాహ్నం 1 గం. 10001-20000 ర్యాంకు వరకుఏయూ పరిధిలోని ఎస్టీ కేటగిరీ వారికి మధ్యాహ్నం 1 గం. 20001-25000 ర్యాంకు వరకు ఎన్సీసీ, ఆర్మీ, క్రీడాకారులు, వికలాంగులు, పోలీస్ మిలటరీ చిల్డ్రన్ కేటగిరీ విద్యార్థులకు సెప్టెంబర్ 7, 8 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
ఓయూ మార్గదర్శకాలే ప్రామాణికం
కేయూలో పీహెచ్డీ ప్రవేశాలపై నివేదిక ఇచ్చిన కమిటీ ఆమోదించిన ఇన్చార్జ్ వీసీ వికాస్‌రాజ్ వారం రోజుల్లో ఇంటర్వ్యూల తేదీల ఖరారు కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఆర్ట్స్, సోషల్ సైన్స్, సైన్స్, లా, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాల ప్రక్రియ ఓ కొలిక్కి వస్తోంది. ఉస్మానియా యూనివర్సిటీ మార్గదర్శకాలకనుగుణంగానే ఇక్కడ కూడా పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించాలని యూనివర్సిటీ నియమించిన కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు కమిటీ నివేదికను కేయూ ఇన్చార్జ్ వీసీ వికాస్‌రాజ్ ఆమోదించారు. దీంతో ఎంతో కాలంగా పీహెచ్‌డీలో ప్రవేశాల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులకు ఉపశమనం కలిగినట్లయింది. పీహెచ్డీ ప్రవేశపరీక్ష జరిగాక ఫలితాలు వెల్లడించడంలోనూ జాప్యం చేసిన అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించడంలో కూడా అదే వైఖరి అవలంబించారు. పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించే విషయంలో ప్రస్తుత మార్గదర్శకాలను అవలంబిస్తే ప్రవేశపరీక్షలో ప్రతిభ చూపిన వారికి సీట్లు దక్కే అవకాశం లేదు. దీంతో ఓయూ మార్గదర్శకాలను అవలంబించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందించిన కేయూ అధికారులు బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్.సదానందం చైర్మన్‌గా, ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు కన్వీనర్‌గా ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యులు పలు దఫాలుగా సమావేశమై వివిధ యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశాలకు పాటిస్తున్న నిబంధనలను పరిశీలించడమే కాకుండా ఓయూ మార్గదర్శకాలను ఇక్కడ అనుసరించాలని పేర్కొంటూ నివేదిక సమర్పించారు. ఈ నివేదికను కేయూ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంఏ.సింగరాచార్య.. ఇన్చార్జ్ వికాస్‌రాజ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన అప్రూవల్ చేశారు. దీంతో త్వరలోనే కమిటీ బాధ్యులు సమావేశమై పీహెచ్డీ ప్రవేశాలకు తేదీలను నిర్ణయించే అవకాశముంది. రెండు కేటగిరీలుగా ప్రవేశాలు కేయూ పీహెచ్డీ సీట్ల భర్తీని రెండు కేటగిరీలుగా విభజించనున్నారు. కేటగిరీ-1లో సీఎస్ఐఆర్, జేఆర్ఎఫ్, ఐసీఎస్ఎస్ఆర్, ఐసీహెచ్ఆర్, ఆర్‌జీఎన్‌ఎఫ్ ఫెల్లోషిప్ అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారు. రెండో కేటగిరీలో పీహెచ్డీ ప్రవేశపరీక్ష రాసిన, నెట్, ఎంఫిల్, స్లెట్ అభ్యర్థులందరికీ విభాగాల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అభ్యర్థుల్లో నెట్ ఉన్న వారికి 20 మార్కులు, ఎంఫిల్‌కు 15 మార్కులు, స్లెట్‌కు 12 మార్కులు, ఎంట్రెన్స్‌కు 12 మార్కులు, పీజీలో డిస్టింక్షన్ కలిగి ఉంటే 10మార్కులు, ఇంటర్వ్యూకు 10మార్కులు, రీసెర్చ్ ప్రపోజల్స్‌కు ఐదు మార్కులు కేటాయించారు. ఆయా అభ్యర్థులకు నెట్ ఉంటే 20, స్లెట్ ఉండి ఎంఫిల్ ఉంటే ఎంఫిల్‌కు 15మార్కులే కేటాయిస్తారు. ఇలా ఆయా కేటగిరీలో కేటాయించిన మార్కులన్నింటిలో 50 మార్కులనే ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు ఇంటర్వ్యూ ల ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. మొత్తం 50 మార్కుల్లో ఎక్కువ మార్కులు వచ్చిన వారిలో రోస్టర్ రిజర్వేషన్ల ప్రాతిపదికన పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే, పీహెచ్డీ నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నాటి సీట్లు భర్తీ చేయాలా, ప్రస్తుతం ఉన్న ఖాళీలను పరిగణనలోకి తీసుకోవాలా అనేది అధికారులు త్వరలోనే నిర్ణయిస్తారు. అనంతరం పీహెచ్డీ ఇంటర్వ్యూల తేదీలు ఖరారు చేస్తారు. ఫార్మసీ విభాగంలో పూర్తి కొన్నినెలల క్రితం పీహెచ్డీ ప్రవేశపరీక్ష ఫలితాలను కేయూ అధికారులు వెల్లడించగా.. అప్పటి ఫార్మసీ డీన్ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 43మంది అభ్యర్థులకు ఇటీవల పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిం చారు. ఇందులో జీ ప్యాట్ అర్హత కలిగిన వారికే చోటు దక్కగా, ఎంట్రెన్స్ రాసిన వారు కొందరే ఉన్నారు. తొలుత 29 పీహెచ్డీ సీట్లు ఉండగా, ఇంటర్వ్యూలు నిర్వహించాక రెండు నెలలకు అడ్మిషన్ల సమయంలో 43 మం దికి ప్రవేశాలు కల్పించారు. ఇందులో ఇద్దరు ప్రొఫెసర్లకు ఎనిమిది మంది కంటే ఎక్కువగా అభ్యర్థులను కేటాయించారని సమాచారం. -
అందుబాటులో...అరుదైన రికార్డులు..
కాకతీయ యూనివర్సిటీలో రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయం 1930 నుంచి 1975 వరకు రెవెన్యూ రికార్డులు భద్రం ‘ఈస్ట్ ఇండియా’ పుస్తకాలు మొదలు ‘హైదరాబాద్ రాష్ర్ట చరిత్ర’ వరకు లభ్యం కేయూ క్యాంపస్ : మొగల్ చక్రవర్తుల చరిత్ర, ఏపీ గెజిట్‌కు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, వివిధ జిల్లాల కైఫియత్తులు, మీర్ నిజాం అలీఖాన్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన పుస్తకాలు... వీటి పేర్లు వింటుంటే చదవాలనే ఆసక్తి కలిగినా ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయిలే అనే నిరాశ కూడా అలుముకుంటుంది. అయితే, మన జిల్లా వాసులకు ఆ నిరాశ అవసరం లేదు. ఏమంటే కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో ఉన్న రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయం ఆ వెసులుబాటును కల్పిస్తోంది. వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన సుమారు 75 ఏళ్లకు పైగా రెవెన్యూ రికార్డులు, చరిత్ర పుస్తకాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. ఔత్సాహికులు ఎలాంటి ఖర్చు లేకుండా వాటిని చదువుకునే అవకాశం ఉండగా, ఏమైనా ప్రతులు కావాలంటే స్వల్ఫ ఫీజు చెల్లించి జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. చరిత్రకు సంబంధించి అద్భుతమైన పుస్తకాలు, రికార్డులు ఉన్న ఈ నిలయం విశేషాలపై ప్రత్యేక కథనం. హైదరాబాద్‌లో స్టేట్ ఆర్క్యూస్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిస్ట్యూట్ ఉంది. పరిశోధకులకు ఉపయోగపడే ఎన్నో లక్షల పుస్తకాలు, వేల రికార్డులు అక్కడ అందుబాటులో ఉన్నాయి. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్క్యూస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తర్వాత విశాఖపట్నం, గుంటూరు, రాజమం డ్రి, తిరుపతి, అనంతపురంలో అనుబంధంగా రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయాలు ఏర్పాటుచేశారు. అలాగే, మన ప్రాంతంలో కూడా ఆ శాఖ ఉన్నతాధికారులు 1992లో కాకతీయ యూనివర్సిటీ ఆవరణలో ప్రాంతీయ నిల యం ఏర్పాటుచేశారు. దీంట్లో వరంగల్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన అనేక పాత రికార్డులను తెప్పించి భద్రపరిచారు. ఏమేం ఉన్నాయి... కాకతీయ యూనివర్సిటీ ఆవరణలోని రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయంలో విధ చరిత్ర పుస్తకాలతో పాటు గత 75 ఏళ్లకు సంబంధించిన రికార్డులు, ముఖ్యమైన ఫైళ్లు భద్రపరిచారు. మొగలు చక్రవర్తుల చరిత్ర మొదలుకుని ఎందరో రాజుల, రాజ్యాల చరిత్ర పుస్తకాలు ఉన్నాయి. చరిత్ర పరిశోధకులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పాలి. ఇంకా 1930 నుంచి 1975 సంవత్సరం వరకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని రెవెన్యూ, ఇనాం, ఆలయాల భూముల రికార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఏపీ గెజిట్‌కు సంబంధించిన పలు రికార్డులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన 50ఏళ్ల ఫైళ్లు ఉంచారు. అంతేకాకుండా ద్రాక్షారామం శాసనాలు, ది ఫ్రీడమ్ స్టేట్ ఇన్ హైదరాబాద్-ఆంధ్రప్రదేశ్, హిస్టరీ ఆఫ్ ది ఫ్రీడమ్ మూవ్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, పర్మాన్స్ అండ్ సానాదస్, డక్కన్ సుల్తాన్స్, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విశాఖపట్నం కైఫీయుత్తులు, ఆంధ్రోద్యమ చరిత్ర, పీవీ.రంగారావు రచించిన ప్రసగ చంద్రిక, 1780-1798కు సంబంధించిన మీర్ నిజాం అలీఖాన్ అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ పుస్తకాలు అందులో ఉన్నాయి. ఇతిహాస్ జర్నల్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్య్కూస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ల పుస్తకాలను ఇక్కడ భద్రపరిచారు. కేయూ రికార్డులు సైతం..1992లో ఏర్పాటు కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటు కోసం తొ లుత(పీజీ సెంటర్ పేర ఏర్పాటుకోసం) అప్ప ట్లో 1967నుంచే భూసేకరణ యత్నాలు చేశా రు. ఈ ప్రయత్నాలకు సంబంధించి సర్వే నం బర్లతో కూడిన పాత రికార్డులు కూడా రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయంలో ఉన్నాయి. వా టి మ్యాప్‌లను కూడా భద్రపరిచారు. రికార్డులు పాడు కాకుండా.. కేయూలోని రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయానికి తీసుకొచ్చే రికార్డులు, పుస్తకాలు చెదలు పట్టకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. దీని కోసం బీరువా మాదిరిగా ఫెమినేషర్ చాంబర్ ఉంటుంది. దీని అడుగు భాగంలో ఓ కెమికల్ కప్ ఉంచుతారు. ఆ తర్వాత ఆ బీరువాలో పుస్తకాలను రెండు వారాల పాటు భద్రపరుస్తారు. ఈ మేరకు కెమికల్ ప్రభా వం పుస్తకాలపై పడి వాటికి చెదలు పట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత పుస్తకాలు, రికార్డులను తీసి భద్రపరుస్తారు. అసౌకర్యాల నడుమ.. కాకతీయ యూనివర్సిటీలోని రాజ్యాభిలేఖ ప్రాంతీయ నిలయంలో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయి. క్యాంపస్‌లోని ఎన్ఎస్ఎస్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న ఈ కేంద్రానికి వెళ్లేందుకు సరైన దారి కూడా లేదు. అంతేకాకుండా ఈ నిలయానికి సంబంధించి పెద్దగా ప్రచారం చేయకపోవడంతో... అరుదై న రికార్డులు పరిశీలించే అవకాశం ఉందని ఇ ప్పటికీ చాలా మంది పరిశోధకులకు తెలియదు. ఈ నిలయం ఇప్పటికే పుస్తకాలు, రికార్డులు, ఫైళ్లతో నిండిపోగా, వరంగల్, ఖమ్మం జి ల్లాల నుంచి ఇంకా పాత రికార్డులు తీసుకురావడం లేదు. ఈ విషయమై అనువైన భవనం కేటాయించాలని స్టేట్ ఆర్య్కూస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధికారులు.. కేయూ అధికారులను కోరినా పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా ఈ నిలయానికి కనీసం అటెండర్ లేకపో గా.. ఉన్న ఒకే అధికారి కార్యాలయం తలుపులు తెరవడం మొదలు అన్ని పనులు చేసుకోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా ఇటు కేయూ అధికారులు.. అటు జిల్లా ధికారులు స్పందించి రా జ్యాభిలేఖ ప్రాంతీయ నిలయానికి మంచి భవ నం కేటాయించడంతో పాటు పరిశోధకులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాల్సిన అవసరముంది. సమాచారం సర్టిఫైడ్ కాపీలు ఇస్తాం ఇనాం, దేవాలయాలు, లావణీ పట్టా భూములే కాకుండా ప్రభుత్వ కార్యాలయాల భూములకు సంబంధించి పాత రికార్డులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటి సమాచారం కావాలంటే స్వల్ఫ ఫీజు తీసుకుని సర్టిఫైడ్ కాపీలు ఇస్తాం. ఇంకా హిస్టరీ పరిశోధకులకు ఉపయోగపడే ఎన్నో పుస్తకాలు నిలయంలో ఉన్నాయి. యూనివర్సిటీ అధికారులు మంచి భవనం కేటాయిస్తే రాజ్యాభిలేఖ నిలయం ఏర్పాటుచేసిన ఉద్దేశం నెరవేరుతుంది. ప్రస్తుతం స్థలాభావం కారణంగా ఇంకా చాలా పాత రికార్డులను ప్రభుత్వ కార్యాలయాల నుంచి తీసుకోలేకపోతున్నాం. మహ్మద్ తెహర్ అలీ, ఆర్చివిస్టు -
‘ఇంజినీరింగ్’ సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం
కేయూ క్యాంపస్ / పోచమ్మమైదాన్ : ప్రస్తుత విద్యాసంవత్సరం ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి సర్టిఫికెట్ల పరిశీలన గురువారం ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలల్లో సెంటర్లు ఏర్పాటుచేశారు. కేయూలో అడ్మిషన్ల డెరైక్టరేట్లో 17,001 నుంచి 25వేల వరకు ర్యాంకు వచ్చిన విద్యార్థులను పిలవగా, 300 మంది వరకు సర్టిఫికెట్ల పరిశీల నకు హాజరయ్యారు. ఈ కేంద్రాన్ని ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంఏ.సింగరాయచార్య పరిశీలన పత్రాలను విద్యార్థులకు అందజేశారు. కేయూ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ నర్సింహాచారితో పాటు ఇ.సురేష్‌బాబు, డాక్టర్ ఎ.సదానందం, ఎన్.రమణ, గురురాజ్, కె.సుమలత పాల్గొన్నారు. అలాగే, హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ కేంద్రంలో 9,001 నుంచి 17వేల ర్యాంకు వచ్చిన విద్యార్థులను పిలవగా 270 మంది సర్టిఫికెట్లు పరిశీలన చేయించుకున్నారు. కార్యమ్రాన్ని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.భద్రునాయక్ పరిశీలించగా, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.రామానుజరావు, డాక్టర్ రమేష్‌కుమార్, ప్రొఫెసర్ గంగాధరరెడ్డి, డాక్టర్ నరేందర్ పాల్గొన్నారు. పాలిటెక్నిక్‌లో.. వరంగల్‌లోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటుచేసిన సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రానికి తొలిరోజు 1 నుంచి 9వే ల ర్యాంకు వరకు పిలవగా 163 మంది విద్యార్థులు హాజరయ్యారు. హెల్ప్‌లైన్ సెంటర్ ఇన్చార్జ్ శంకర్‌తో పాటు వెంకటనారాయణ, అభినవ్, యుగేందర్‌రెడ్డి, రాఘవులు, పోచయ్య, అప్పారావు పాల్గొన్నారు. వన్‌టైం పాస్‌వర్డ్‌పై అవగాహన సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న విద్యార్థులకు బ్యాచ్‌ల వారీగా వన్‌టైం పాస్‌వర్డ్‌పై అవగాహన కల్పిస్తున్నారు. గత సంవత్సరం స్క్రా చ్ కార్డులు ఇవ్వగా, ఇందులో పలు లోపాలు ఉన్నాయని తేలడంతో ప్రస్తుతం వన్ టైం పాస్వర్డ్ విధానా న్ని ప్రారంభించారు. ప్రతీ విద్యార్థి రిజిస్ట్రేషన్ సందర్భంగా సెల్ నంబర్‌ను దరఖాస్తులో పేర్కొనాల్సి ఉం టుంది. ఈ మేరకు వెబ్ఆప్షన్లు నమోదు చేసుకునే ముందు రోజు కన్వీనర్ నుంచి లాగిన్ ఐడీతో పాటు వన్ టైం పాస్‌వర్డ్‌ను మెసేజ్ ద్వారా పంపిస్తారు. దాన్ని ఉపయోగించుకుని అభ్యర్థులు తమ పుట్టిన రోజు, హాల్‌టికెట్ ఫీడ్ చేస్తే వెబ్ తెరుచుకుంటుంది. అయితే, ఎన్నిసార్లైనా వెబ్ ఆప్షన్లు మార్చుకునే వెసులుబాటు ఉండగా, ప్రతీసారి పాస్వర్డ్ మారుతుంటుంది. ఇక విద్యార్థులు కూడా పాస్‌వర్డ్‌ను మార్చుకునే వెసులుబా టు ఉంది. ఈ మేరకు 17వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే విధానం అందుబాటులోకి వస్తుంది. కాగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవా రం, కుటుంబ, సామాజిక, ఆర్థిక సర్వేను పురస్కరించుకుని ఈనెల 19వ తేదీన సర్టిఫికెట్ల పరిశీలన ఉండదని అధికారులు తెలిపారు. -
కేయూ భూముల సర్వే ప్రారంభం
రిజిస్ట్రార్ సాయిలు నేతృత్వంలో ప్రత్యేక కమిటీ మూడు రోజుల్లో కొలతలు పూర్తి కేయూక్యాంపస్ : కాకతీయ విశ్వవిద్యాలయం భూముల అన్యాక్రాంతం అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రాజకీయ ఒత్తిళ్లతో ఇన్నాళ్లూ మరుగునపడిన ఈ వ్యవహారం మళ్లీ అదే రాజకీయ కారణాలతోనే చర్చనీయాంశంగా మారింది. అసలు యూనివర్సిటీకి సంబంధించి మొత్తం ఎంత భూమి ఉందనే విషయాన్ని తేల్చేందుకు రెవెన్యూ అధికారులు గురువారం సర్వే మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళితే.. యూనివర్సిటీ అధికారులు కేయూలోని భూముల లెక్క తేల్చేందుకు ఇటీవల రిజిస్ట్రార్, ప్రొఫెసర్ సా యిలు నేతృత్వంలో కమిటీని నియమించారు. ఇందులో క్యాంపస్ ప్రిన్సిపాల్ రామస్వామి చైర్మన్‌గా, కేయూ అభివృద్ధి అధికారి సమ్మూలాల్ కన్వీనర్‌గా ఉన్నారు. అలాగే కేయూలోని ఉద్యోగ , విద్యార్థి సంఘాల బాధ్యు లు కూడా సభ్యులుగా ఉన్నారు. కాగా, గురువారం ఉద యం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆర్డీ ఓ వెంకటమాధవరం, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ, కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సాయి లు, పలువురు డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయ ర్లు క్యాంపస్‌లోని ఫార్మసీ హాస్టళ్ల వెనకభాగం నుంచి సర్వే మొదలు పెట్టారు. అక్కడి నుంచి కొంత దూరం నాన్‌టీచింగ్ క్వార్టర్ల వర కు ఉన్న భూములను కూడా కొలతలు వేశారు. ఇందులో 214 సర్వే నంబర్లోని భూమి కూ డా ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. కాగా, సర్వేను మూడురోజుల్లో పూర్తి చేయనున్నారు. సర్వే ఎందుకంటే.. కాకతీయ యూనివర్సిటీలో భూముల్లోని 214 సర్వే నంబర్లో తన భూమి ఉందని గతంలో ఓ వ్యక్తి సర్వేయర్లతో కొలతలు వేయించుకుని హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. కాగా, 214 సర్వే నంబర్లోని 5.38 ఎకరాల భూమి మొ త్తం తనదేనని సదరు వ్యక్తి కొన్నేళ్ల నుంచి అధికారులతో వాదిస్తున్నాడు. అయితే ప్రైవేటు వ్యక్తి చెబుతున్న 5.38 ఎకరాల్లో ఎకరం 36 గుం టల భూమి ఎవరిదనే విషయంపై కొన్నేళ్లుగా ప్రైవేటు వ్యక్తికి, యూనివర్సిటీకి మధ్య కోర్టులో కేసు నడిచింది. అనంతరం జరిగిన పరిణమాలతో కొన్ని నెలల క్రితం సదరు వ్యక్తి ల్యాండ్ అండ్ సర్వే రికార్డ్స్ అధికారుల ద్వారా సర్వే చేయించుకుని తన భూమిగా చెప్పుకుంటున్న స్థలంలో హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమయంలో కాకతీయ యూనివర్సిటీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతోనే అధికారులు భూ మి విషయాన్ని పట్టించుకోవడంలేదని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ప్రైవే టు వ్యక్తి ఎంతభూమి వరకు హద్దులు ఏర్పాటు చేసుకున్నాడనే విషయాన్ని తేల్చేందుకు అధికారులు మళ్లీ సర్వేను ప్రారంభించారు. వాస్తవం గా రెవెన్యూ రికార్డుల ప్రకారం 640 నుంచి 650 ఎకరాల భూమి కాకతీయ యూనివర్సిటీకి ఉండాల్సి ఉంది. అయితే పలు చోట్ల కాకతీయ కెనాల్ ఏర్పాటైన తర్వాత ఆ ప్రాంతంలో కూడా ఆక్రమణలు జరిగాయి. యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీ క్యాంపస్ చుట్టూ హద్దు లు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే ఆక్రమణలు జరిగినట్లు తెలిసిం ది. కాగా, ఆక్రమణల వ్యవహారంపై కేయూ విద్యార్థి, ఉద్యోగ సంఘాల నాయకులు చేసిన ఆందోళనలతోనే అధికారులు సర్వేను చేపడున్నట్లు తెలుస్తోంది. -
ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా ప్రొ. పాపిరెడ్డి
ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌గా కాకతీయ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం విద్యా శాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ జీవో నంబర్ 8 జారీ చేశారు. ఆయన ఈ పదవిలో మూడేళ్లు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1988 ప్రకారం ఆయన్ని నియమించినట్లు పేర్కొన్నారు. మరోవైపు మండలి ఏర్పాటుపై ప్రభుత్వం గెజిట్‌లో నోటిఫై చేస్తూ మరో జీవో జారీ చేశారు. దీని ప్రకారం ఈనెల 5 నుంచి తెలంగాణ ఉన్నత విద్యా మండలి అధికారికంగా ఏర్పాటు అయింది. ఇందులో చేపట్టే నియామకాలు 5వ తేదీ నుంచే వర్తిస్తాయి. చైర్మన్‌గా పాపిరెడ్డిని నియమించగా, ఒక వైస్ చైర్మన్‌ను నియమించాల్సి ఉంది. ఎక్స్ అఫీషియో సభ్యులుగా విద్యా, ఆర్థిక శాఖ, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శులు, ఇతర వర్సిటీల వీసీలు ఉంటారు. విద్యార్థులు ఆందోళన చెందవద్దు : పాపిరెడ్డి ఉన్నత విద్యమండలి చైర్మన్‌గా నియమాకమైన సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో విద్యార్థులు ఎలాంటి ఆందోళనా చెందవద్దన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను సజావుగా చేపడతామన్నారు. ఉద్యమం నుంచి.. హన్మకొండ : పాపిరెడ్డి వరంగల్ జిల్లా పొలిటికల్ జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ ఈ ఏడాది జూన్ లో రిటైర్ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా జయపూర్ మండలం పవునూర్ ఆయన స్వగ్రామం. ప్రస్తుత మండలికి లేఖ: తెలంగాణ ఉన్నత విద్యా మండలికి చైర్మన్‌ను నియమించినట్లు ఏపీ ఉన్నత విద్యా మండలికి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మంగళవారం లేఖ రాసింది. తెలంగాణ మండలికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని అందులో పేర్కొంది. -
ప్రజలకు అండదండగా ఉండాలి
వారిలో విశ్వాసం కలిగించాలి మనోధైర్యం నింపాలి పోలీస్ అధికారుల వర్క్‌షాప్‌లో డీఐజీ కాంతారావు కేయూ క్యాంపస్ : ‘పోలీసులు ప్రజలకు అం డగా నిలుస్తారని, వారిలో విశ్వాసాన్ని కలిగిం చాలి.. మనోధైర్యం నింపాలి.. ఆ విధంగా మన సేవలు ఉం డాలి...’అని వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం. కాంతారావు ఆ శాఖ అధికారులకు సూచిం చారు. అర్బన్ పోలీస్ విభాగం కమిషనరేట్‌గా రూపాంతరం చెందనున్న నేపథ్యంలో పోలీసు ల పనితీరు, ప్రవర్తనలో మార్పు రావాల్సి ఉంటుందని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల కు మరింత చేరువ కావాల్సి ఉంటుందని, అప్పుడే పోలీసు శాఖ ప్రతిష్ఠ ఇనుమడిస్తుం దని పేర్కొన్నారు. ఈ మేరకే వర్క్‌షాపు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాకతీయ యూనివర్సి టీ సెనేట్ హాలులో గురువారం ఏర్పాటు చేసి న ఈ వర్క్‌షాపును ఆయన ప్రారంభించి.. ప్రసంగించారు. సమాజంలో పోలీసుల కదలికలను, నడవడికను ప్రతీ వ్యక్తి గమనిస్తుంటాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతోనే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. కాలానికి అనుగుణంగా వృత్తి నైపుణ్యతను పెంపొందించుకోవాల్సిన అవరం ఉందని పేర్కొన్నారు. వివిధ సమస్యలతో పోలీస్స్టేషన్లకు వచ్చే మహిళలు, వృద్ధులు, వికలాంగులు, పిల్లల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. వారి కి పోలీస్‌శాఖ అండగా ఉంటుందనే విశ్వాసం కలిగించేలా ప్రవర్తన ఉండాలని చెప్పారు. అప్పుడే.. ప్రజలు ఆశించిన వ్యవస్థ : అర్బన్ ఎస్పీ పోలీసులపై ప్రజలు ఎప్పుడూ భారీ అంచనాలతో ఉంటారని, వారి ఆలోచనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు తెలిపారు. అప్పుడే వారు ఆశించిన పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేయగలుగుతామని స్పష్టం చేశారు. వ్యామోహంతోనే ఒత్తిళ్లు : డాక్టర్ పట్టాభిరామ్ సమాజంలో ప్రతీ వ్యక్తికి ఒత్తిళ్లు అనేవి సహజమని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు డాక్టర్ పట్టాభిరామ్ తెలిపారు. వ్యామోహాలు తగ్గించుకుంటే ఒత్తిళ్లకు దూరంగా ఉండవచ్చని చెప్పారు. ఈ వర్క్‌షాపులో పోలీసు అధికారులకు ‘విధులు.. ఒత్తిళ్లు.. పరివర్తన’ అనే అంశాలపై సలహాలు, సూచనలు చేశారు. పోలీసు వ్యవస్థ సవాళ్లతో కూడుకున్నదని, వాటిని కఠినతరంగా భావించవద్దని, నిర్మలంగా ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకుని అడుగు ముందుకేస్తే విజయం సాధించవచ్చని, ఒత్తిళ్లను అధిగమించవచ్చని పేర్కొన్నారు. సమావేశంలో అర్బన్ ఎస్పీ యాదయ్య, హన్మకొండ, కాజీపేట, మామునూరు, క్రైం, ట్రాఫిక్, ఏఆర్ డీఎస్పీలు దక్షిణమూర్తి, రాజిరెడ్డి, సురేశ్‌కుమార్, రామమహేంద్రనాయక్, ప్రభాకర్, రమేష్, ఇన్స్పెక్టర్లు,సబ్ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
పేపర్ లీకేజీ.. వారికి చాలా ఈజీ
కేయూక్యాంపస్ : కాకతీయ విశ్వవిద్యాలయం ఎల్డీఎల్డీసీఈ పరీక్షల నిర్వహణ అవినీతిమయంగా మారింది. దూరవిద్య పరీక్షలు స్టడీ సెంటర్ల నిర్వాహకులకు, యూనివర్సిటీ అధికారులకు బంగారు బాతులా మారాయి. పేపర్ లీక్ వ్యవహారం ఒకటి శుక్రవారం వెలుగులోకి వచ్చినప్పటికీ.. పరీక్షకు ముందు రోజు పేపర్ లీక్ చేయడం చాలా సెంటర్లలో ప్రతిఏటా జరిగే సాధారణ విషయమని తెలుస్తోంది. అంతేగాక మెజార్టీ సెంటర్లలో కేయూ పరీక్ష నియంత్రణ అధికారుల అండ, అబ్జర్వర్ల సహకారంతోనే మాస్ కాపీరుుంగ్ నిర్వహిస్తున్నారనే విమర్శలు ఉన్నారుు. ముడుపులిస్తే.. సెల్ఫ్ సెంటర్లు.. కేయూ దూర విద్య డిగ్రీ పరీక్షల నిర్వహణ లోపభూయిష్టంగా మారింది. ఎస్డీఎల్సీఈ పరిధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లో కలిపి మొత్తం 97 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాల్లో డిగ్రీ మూడు సంవత్సరాలకు చెందిన సుమారు 50 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అరుుతే యూనివర్సిటీ పరీక్షల విభాగంలో ముఖ్యస్థానాల్లో ఉన్న అధికారులు స్టడీ సెంటర్ల యూజమాన్యాలు ఇచ్చే ముడుపులు మింగి సెల్ఫ్ సెంటర్లు కేటారుుస్తున్నారనే ఆరోపణలు ఉన్నారుు. దీంతో ఆయా పరీక్షా కేంద్రాల యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా కాపీయింగ్ చేయిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాస్ గ్యారంటీ స్కీమ్‌తో ఒక్కో అభ్యర్థి నుంచి పరీక్షల సమయంలో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. యూనివర్సిటీ నుంచి వచ్చే అబ్జర్వర్లకు సుమారు రూ.50 వేల నుంచి లక్ష వరకు డబ్బులు ముట్టజెప్పి అభ్యర్థులతో చూచిరాతలు రారుుస్తున్నారు. ఇలా కొన్ని సెంటర్ల నిర్వాహకులు మాస్ కాపీరుుంగ్ను ప్రోత్సహిస్తుండగా హైదరాబాద్‌లోని కొన్ని ఎంఓయూ స్టడీ సెంటర్ల నిర్వాహకులు మాత్రం మరింత బరితెగిస్తున్నారు. వారి పరీక్ష కేంద్రాలకు రెండు, మూడు రోజుల ముందుగానే ప్రశ్నపత్రాలు చేరుకోవడంతో తమకు డబ్బులు ఇచ్చిన విద్యార్థులకు ముందుగానే పేపర్ లీక్ చేసి పరీక్షలు రారుుస్తున్నారు. టైం టేబుల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించినట్లు కనిపించినా.. ముందే రారుుంచిన జవాబు పత్రాల బండిల్స్‌ను పరీక్షల విభాగానికి పంపిస్తున్నారని తెలిసింది. హైదరాబాద్‌లోని ఎనిమిది ఎంఓయూ స్టడీసెంటర్లలో ఇదే తంతు సాగుతున్నట్లు సమాచారం. అంతేగాక ఏరోజు పరీక్షకు సంబంధించిన జవాబుపత్రాలను అదేరోజు సాయంత్రం ఓయూలోని గెస్ట్‌హౌస్‌లో ఉన్న ఎస్డీఎల్సీఈ సిబ్బందికి అందించాల్సి ఉండగా.. కొందరు మరుసటి రోజు తెల్లవారుజామున అక్కడికి చేరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నారుు. లీకేజీలకు అవకాశమిస్తున్న పరీక్షల నిర్వహణ తీరు.. టెన్త్, ఇంటర్ పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాలను ఆయూ పరీక్ష కేంద్రాల పరిధిలోని పోలీస్స్టేషన్లలో భద్రపరచడం తెలిసిందే. కానీ యూనివర్సిటీ అధికారులు మాత్రం ఈ పద్ధతిపై దృష్టిసారించడం లేదు. దీని వెనక చేతులు మారుతున్న పైసలే కారణమని తెలుస్తోంది. ఇకనైనా టెన్త్, ఇంటర్ పరీక్షల తరహాలో పోలీస్స్టేషన్లకు ప్రశ్నపత్రాలు చేరవేస్తే లీకేజీని కొంతమేరకైనా అరికట్టవచ్చనే పలువురు యూనివర్సిటీ అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. పైసలిస్తే పాస్ నుంచి... లీకేజీ వరకు.. పరీక్షల విభాగంపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఎస్డీఎల్సీఈలో అడ్మిషన్లు లేకుండానే కొందరు విద్యార్థులను పరీక్షలు రారుుంచిన ఘటనలు కూడా వెలుగుచూశారుు. ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా తమకేమి పట్టనట్లు వ్యవహరించటం అధికారులకు పరిపాటిగా మారింది. అంతేగాక యూనివర్సిటీ పరీక్షల విభాగంలో రెగ్యులర్ డిగ్రీ విధానంలో కూడా పైసలిస్తే పాస్ చేసిన కుంభకోణం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అప్పటి పరీక్షల నియంత్రణాధికారులతోపాటు పలువురు సిబ్బందిపై కేసులు నమోదయ్యూరుు. పరీక్షల విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసినా వారి తీరు మారడం లేదనే విమర్శలు వినిపిస్తున్నారుు. పరీక్షల విభాగంలో వరుసగా వెలుగు చూస్తున్న ఈ దందాలు యూనివర్సిటీ ప్రతిష్టను రాష్ట్రవ్యాప్తంగా దిగజారుస్తున్నారుు. న్యాక్ ఏ గ్రేడ్ పొందిన వర్సిటీకి అవి మాయని మచ్చలుగా మిగిలారుు. కేయూక్యాంపస్ : ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నారుు. పరీక్షల నియంత్రణాధికారుల అసమర్ధతను ఎండగడుతూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం పరీక్షా కేంద్రాలకు వెళ్లిన విద్యార్థుల సెలఫోన్లకు పరీక్షలు వాయిదా వేసినట్లు మెసేజ్ రావడంతో విద్యార్థులు ఆగ్రహం చెందారు. యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థుల్లో కొందరు దూరవిద్యాకేంద్రానికి వచ్చి అధికారులపై మండిపడ్డారు. అలాగే పరీక్షల విభాగం వద్ద వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా చేశారు. వెంటనే పరీక్షల రీషెడ్యూల్ ప్రకటించాలన్నారు. ప్రశ్నపత్రం లీక్‌కు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పీడీఎస్‌యూ, టీఆర్ఎస్వీ, టీ జీవీపీ, టీఎన్ఎస్ఎఫ్, ఎంఎస్ఎఫ్ తదిరత సంఘాల నాయకులు సూత్ర పు అనిల్, సీహెచ్. వీరన్న, వి. సుధాకర్, ముదిగొండరాజు, రడపాక విజయ్, రంజిత్, వీరన్న, మేడారపు సుధాకర్, వినోద్‌నాయక్, మహేష్, శరత్చంద్ర, తిరుపతి తదితరులు పాల్గొని నిరసన తెలిపారు. అలాగే పీడీ ఎస్‌యూ విద్యార్థులు కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సాయిలు కారుకు అడ్డంగా బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో పీడీఎస్‌యూ నాయకులు ఎం. చిరంజీవి, దుర్గం సారయ్య పాల్గొన్నారు. ఆందోళనలతో రిజిస్ట్రార్‌తోపాటు, పరీక్షల నియంత్రణాధికారి, పరీక్షల అదనపు నియంత్రణాధికారి పత్తా లేకుండా పోయూరు. పరీక్షలు యథావిధిగా నిర్వహించాలి దూరవిద్య డిగ్రీ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని, పేపర్ లీక్ జరిగిందని వాయిదా వేయటం సరికాదని మిగతా పేపర్ల సబ్జెక్టుల పరీక్షలను నిర్వహించాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్పీఆర్డీ జిల్లాకమిటీలు డిమాండ్ చేశాయి. అలాగే అబ్జర్వర్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయూ సంఘాల నాయకుల నూకల సతీష్‌కుమార్, శ్రీకాంత్, అశోక్‌స్టాలిన్, మదార్‌సాహెబ్, యాకయ్య, వై.సతీష్, వీరన్న, శ్రీకాంత్, ప్రశాంత్ కోరారు. ప్రశ్నాపత్రం లీక్‌పై కేయూ ఇన్చార్జ్ వీసీ సీరియస్ ప్రశ్నాపత్రం లీకైన ట్లు హైదరాబాద్‌లో ఉన్న కేయూ ఇన్చార్జ్ వీసీ వికాస్‌రాజ్ దృష్టికి వెళ్లగానే ఆయన సీరియస్‌గా స్పందించారు. వెంటనే పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించడంతోనే అధికారులు వాయిదా వేశారు. శుక్రవారం సాయంత్రం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. సాయిలు, పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎంవీ రంగరావు, దూరవిద్యా కేంద్రం డెరైక్టర్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ హైదరాబాద్ వెళ్లారు. రీ షెడ్యూల్ప్రకటించాలి : విద్యార్థిని ఎస్. పల్లవి ఉదయం పరీక్షకు 15 నిమిషాల సమయం ఉందనగా పరీక్షలు వాయిదా అని మెస్సేజ్ వచ్చింది. దీంతో షాక్‌కు గురయ్యూం. ఎందుకంటే మే నెలలోనే నిర్వహించాల్సిన పరీక్షలు ఆలస్యంగా జులైలో నిర్వహిస్తున్నారు. నేను పీజీ ఎంకామ్ ఎంట్రెన్స్ రాశాను. సీటు వచ్చే అవకాశం ఉంది. కానీ ఫైనలియర్ పరీక్షలు ఎప్పుడు జరిపిస్తారో కూడా వెల్లడించడం లేదు. -
ఏ బాధ్యతనైనా నిర్వర్తిస్తా..
ఒకప్పుడు విప్లవాలకు కేంద్ర బిందువు.. తెలంగాణ ఉద్యమానికి మూలంగా నిలిచిన కాకతీయ యూనివర్సిటీలో పీజీ ఎకనామిక్స్ విభాగం మొదటి బ్యాచ్ విద్యార్థిగా చేరిన తుమ్మల పాపిరెడ్డి ఆ తర్వాత ఇక్కడే అధ్యాపకుడిగా చేరి ప్రొఫెసర్ స్థాయికి ఎదిగారు. అంతేకాకుండా యూనివర్సిటీలో పలు పరిపాలన పదవులు చేపట్టిన ఆయన 2009 సంవత్సరం నుంచి టీ జేఏసీ జిల్లా చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అటు యూనివర్సిటీలో పాఠాలు బోధిస్తూనే.. ఇటు తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి విశేష కృషి చేసిన కేయూ ఎకనామిక్స్ సీనియర్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి సోమవారం ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయనతో ‘సాక్షి’ మాట్లాడగా.. కేయూలోనే పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తి చేసిన తాను ఇక్కడే ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించి, ఉద్యోగ విరమణ చేయడాన్ని మరిచిపోలేని అనుభూతిగా వర్ణించారు. మూడున్నర దశాబ్దాల పాటు కేయూతో తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, కేయూలో క్షీణిస్తున్న పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసిన పాపిరెడ్డి.. టీ జేఏసీ చైర్మన్‌గా కొనసాగుతూనే ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పిస్తే ప్రభుత్వంతో కలిసి ఏ బాధ్యత నిర్వర్తించేందుకైనా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే... - కేయూ క్యాంపస్ ఎకనామిక్స్‌లో మొదటి బ్యాచ్ కాకతీయ యూనివర్సిటీ పీజీలో ఎకనామిక్స్ వి భాగం ప్రారంభించిన 1977లో మొదటి బ్యాచ్‌లో నేను చేరాను. అప్పట్లో దేశంలో ఎమర్జెన్సీ విధిం చగా అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. యూనివర్సిటీలోమౌలిక వసతులు లేని కాలంలో పీజీ పూర్తి చేసి ఎంఫిల్ 1980లో పూర్తిచేశాను. ఆ తర్వాత అధ్యాపకుడిగా పనిచేస్తుండగా, 1988లో పీహెచ్ డీ అవార్డు అయింది. నేను అధ్యాపకుడిగా పనిచేస్తున్న కాలంలో కేయూ విప్లవాలకు కేంద్రంగా ఉండగా, 1980వ దశకంలో పీపుల్స్‌వార్, ఆర్ఎస్ యూ, లెఫ్ట్భావాలు కలిగిన అధ్యాపకులు, విద్యార్థులే ఎక్కువగా ఉండేవారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వంతో పాటు సామాజిక మార్పు జరగాలనే ఆకాంక్షకు అనుగుణంగా అధ్యాపకులు కూడా వ్యవహరించేవారు. తెలంగాణ కోసం.. కాకతీయ యూనివర్సిటీలో అధ్యాపకుల సంఘం అధ్యక్షుడిగా రెండు సార్లు, ప్రధాన కార్యదర్శిగా రెండు సార్లు పనిచేసిన నేను సభ్యుడిగా అనేక పర్యాయాలు పనిచేశారు. కేయూలో అప్పట్లోనే ఉన్న ఆంధ్ర ప్రాంతీయుల వివక్ష, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ప్రొఫెసర్ జయశంకర్, భూపతి కృష్ణమూర్తితో కలిసి 1986లో నవంబర్ 1న విద్రోహదినం కూడా పాటించాం. టీడీపీ ప్రభుత్వం వచ్చాక 1994లో ఓయూకు చెందిన ప్రొఫెసర్ వైకుంఠంను కేయూ వీసీగా నియమిస్తే కేయూ అధ్యాపకులను నియమించకపోవడంపై ఆందోళనలు చేశాం. ఆనాడే కేసీఆర్‌తో టీడీపీ ప్రభుత్వంలో కేసీఆర్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. అదే సమయంలో ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావుతో పాటు పలువురు తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం కృషి చేస్తున్నారు. దీంతో అందరం కలిసి కేసీఆర్‌ను కలిసి తెలంగాణ ఆవశ్యకతను వివరించాం. ఆ తర్వాత కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపిస్తే ప్రిసీడియం మెంబర్లుగా నేను, ప్రొఫెసర్ వెంకటనారాయణ, రేవతి, దినేష్‌కుమార్ వ్యవహరించాం. 2009 నుంచి జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ కేయూ విద్యార్థులు చేసిన ఉద్యమం మరువలేనిది. నేను 2009 నుంచి ఇప్పటి వరకు టీ జేఏసీ జిల్లా చైర్మన్‌గా కొనసాగుతున్నా. ఈ నేపథ్యంలో ఎన్నో ఉద్యమాలు, బలిదానాల అనంత రం తెలంగాణ ఏర్పడగా కేసీఆర్ సీఎం అయ్యా రు. ఉద్యమం సందర్భంగా ప్రజలు ఆశించినవన్నీ కేసీఆర్ చేస్తారని జేఏసీ చైర్మన్‌గా నమ్ముతున్నా. కేయూకు పూర్వవైభవం తెస్తా.. కేయూలో ఒకప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులను చూస్తే బాధ కలుగుతోంది. అకడమిక్ పరంగానే కాకుండా అనేక విషయాల్లో సరిగ్గా లేదు. పలువురు పరిపాలన పదవుల కోసం వెంపర్లాడుతున్నారు. ఫలితంగా యూనివర్సిటీ అంటే మేధావులు ఉంటారనే ప్రజల నమ్మకం సన్నగిల్లుతోంది. ఈ మేరకు యూనివర్సిటీకి పూర్వవైభవం రావాలంటే విలువలు ఉన్న వీసీ రావాల్సిన అవసరముంది. ఈ విషయమై త్వరలోనే అధ్యాపకులతో ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయనున్నాం. ఏ అవకాశం ఇచ్చినా ఓకే.. ప్రొఫెసర్‌గా ఉద్యోగ విరమణ పొందుతున్నం దున ఇక నుంచి ఎక్కువ సమయం వీలు కుదురుతుంది. ప్రభుత్వం ఉన్నత విద్యలో సంస్కరణలు చేపట్టాలని యోచిస్తున్నందున నా వంతు సహకారం అందిస్తా. ఇప్పటికే కేసీఆర్‌తో టచ్‌లో ఉన్న నాకు.. ప్రభుత్వం కావొచ్చు ఇంకా ఏదైనా కావొ చ్చు.. ఎలాంటి అవకాశం కల్పించినా నిర్వర్తించేం దుకు సిద్ధంగా ఉన్నాను. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలోని కుగ్రామమైన పవునూర్ నుంచి చదువురీత్యా 1970లోనే హన్మకొండ కు వచ్చి ఇక్కడ స్థిరపడిన నేను ఉద్యోగ విరమణ చేసినా ఇక్కడే ఉంటాను. పదవులు - పరిశోధనలు ప్రొఫెసర్ పాపిరెడ్డి కాకతీయ యూనివర్సిటీలో ఎకనామిక్స్ విభాగాధిపతిగా 2004నుంచి 2006వరకు, బీఓఎస్‌గా 2006నుంచి 2008 వరకు, పరీక్షల నియంత్రణాధికారిగా 2006నుంచి 2009వరకు, కేయూ ఇన్చార్జ రిజిస్ట్రార్‌గా 2002నుంచి 2003వరకు పనిచేశారు. ఆయన పర్యవేక్షణలో ఎనిమిది మంది పీహెచ్‌డీలు, 8మంది ఎంఫిల్ పూర్తిచేయగా, మరో ఐదుగురు పీహెచ్డీ, మరో ఇద్దరు ఎంఫిల్ చేస్తున్నారు. ఐదు పుస్తకాలు, 13 జర్నల్స్ ప్రచురించిన పాపిరెడ్డి 15 పరిశోధన పత్రాలను వివిధ సదస్సుల్లో సమర్పించారు. నాలుగు మైనర్, రెండు మేజర్ ప్రాజెక్టులు పూర్తిచేసిన ఆయన ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్, ఇండియన్ లేబర్ ఎకనామిక్ అసోసియేషన్, ఇండియన్ అగ్రికల్చరల్ ఎకనామిక్ అసోసియేషన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇండియన్ పొలిటికల్ ఎకనామి అసోసియేషన్లలో లైఫ్‌టైమ్ మెంబర్షిప్ కలిగి ఉన్నారు. -
జర్నలిజంతో ఉపాధి అవకాశాలు
కేయూ క్యాంపస్ : జర్నలిజం కోర్సు పూర్తిచేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని కాకతీయ యూని వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎన్.రామస్వామి తెలిపారు. కేయూలో రెగ్యులర్ ఎంసీజే ప్రవేశపెట్టిన తర్వాత మొదటి బ్యాచ్ కోర్సు ఇటీవల పూర్తయింది. ఈ సందర్భంగా దూరవిద్యా కేంద్రంలోని సెమినార్‌హాల్‌లో శుక్రవారం విద్యార్థులకు ఏర్పాటుచేసిన ఫేర్వెల్ సమావేశంలో రామస్వామి ముఖ్యఅతిథిగా మాట్లాడారు. జర్నలిజం విద్యార్థులు గ్రామీ ణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. తెలంగాణ యూనివర్సిటీ జర్నలిజం విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.రాజారాం మాట్లాడుతూ ఉత్తమ జర్నలిస్టులుగా ఎదగాలంటే నిరంతర అధ్యయనం, నిశిత పరిశీలన, ప్రశ్నించేతత్వం అవసరమని తెలిపారు. సమావేశంలో కేయూ జర్నలిజం విభాగం కోర్సు కోఆర్డినేటర్ డాక్టర్ సంగని మల్లేశ్వర్, అధ్యాపకులు ఎ.సంపత్‌కుమార్, భూక్యా దేవేందర్, కె.నర్సింహరాములు పాల్గొన్నారు. -
నేటితో ముగియనున్న కేయూ రిజిస్ట్రార్ పదవీకాలం
కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు పదవీ కాలం సోమవారంతో ముగియనుంది. క్యాంపస్‌లో ని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభా గంలో ప్రొఫెసర్ అయిన సాయిలు మూడేళ్ల పాటు రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తించారు. అ యితే, కేయూ ఇన్చార్జ వీసీ ఆర్ఎం డోబ్రి యాల్ రిజిస్ట్రార్‌గా సాయిలునే కొనసాగిస్తా రా, లేదా అనేది తేలడం లేదు. కాగా, సాయి లును కొనసాగించే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. ఇటీవల పలువురు ప్రొఫెసర్లు ఇన్చార్జ వీసీ డోబ్రియాల్‌ను కలిసి రిజిస్ట్రార్‌కు సంబంధించి పలు అంశాలపై ఫిర్యాదు చేశా రు. యూనివర్సిటీలో నిబంధనలకు విరు ద్ధం గా పలువురిని నియమించారని, పరీక్షల విభాగం పనులను ప్రైవేట్ కంపెనీకి అప్పగిం చారని, నిబంధనలకు వ్యతిరేకంగా టైం స్కేల్ ఉద్యోగులకు ఇంక్రిమెంట్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఇన్చార్జ వీసీ దృష్టికి తీసుకువె ళ్లారు. కొత్తగూడెం ఇం జినీరింగ్ కాలేజీలో నూ అక్రమాలు జరిగా య ని ఫిర్యాదులో పేర్కొ న్నారు. దీంతో సాయి లును రిజిస్ట్రార్‌గా కొన సాగిస్తారా, లేదా అనేది వేచిచూడాల్సిందే. -
ఐసెట్ -2014 ఫలితాల విడుదల
* 92.45 శాతం మంది ఉత్తీర్ణత * జూన్ 17 నుంచి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు హన్మకొండ, న్యూస్‌లైన్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది మే 23న కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్ -2014 పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఐసెట్ చైర్మన్, కేయూ ఇన్చార్జి వీసీ ఆర్ఎం.డోబ్రియాల్, ఐసెట్ కన్వీనర్, కేయూ ప్రొఫెసర్ ఓంప్రకాశ్‌లు ఫలితాలను ప్రకటించారు. ఐసెట్-2014 పరీక్షకు 1,42,462 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... 1,29,529 మంది హాజరైనట్లు వెల్లడించారు. ఇందులో 1,19,756 మంది అభ్యర్థులు (92.45 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. పురుషులు 83,868 మంది పరీక్షకు హాజరు కాగా... 77,211 మంది(92.06 శాతం) మహిళలు 45,661 మంది పరీక్షకు హాజరుకాగా.. 42,545 మంది (92.45 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 263 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్‌ను ప్రశాంతంగా నిర్వహించారన్నారు. పరీక్ష ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా విడుదల చేశామన్నారు. ఫైనల్ కీ www,apicet.org.inవెబ్సైట్లో అందుబాటులో ఉందన్నారు. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను ఈ నెల 17వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని వివరించారు. రీ కౌంటింగ్ ఆప్మార్క్స్, ఫొటోస్టాట్ కాపీ ఆఫ్ ఓఎంఆర్ ఆన్సర్షీట్ కోసం ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కన్వీనర్ ఐసెట్-2014 పేర డిమాండ్ డ్రాఫ్ట్ పంపించాలని అభ్యర్థులకు సూచించారు. బెస్ట్ కంపెనీలో మేనేజర్ కావాలని ఉంది ఐసెట్ ఫలితాల్లో 181 మార్కులతో మొదటి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే బీటెక్ పూర్తిచేశాను. మంచి కంపెనీలో మేనేజర్ కావాలనేదే లక్ష్యం. దీంతో ఐసెట్‌కు ప్రిపేరయ్యాను. కేరళలోని కోయికుడ్ లేదా జంషెడ్‌పూర్‌లో ఎంబీఏ కోర్సు చదువుకోవాలని ఉంది. ఇప్పటికే క్యాట్ పరీక్షను కూడా రాసి.. అందులో ప్రతిభ చూపాను. - అనుభవ్ కున్నేల్ ప్రేమ్, ఐసెట్ మొదటి ర్యాంకర్ -
తెలంఘన సంబురం
అర్ధరాత్రి ఆవిష్కృతమైన రాష్ట్రం ఉద్విగ్నభరితంగా ఆవిర్భావ వేడుకలు సబ్బండవర్ణాల జనజాతరల హోరు వరంగల్, న్యూస్‌లైన్ : కళ్లెదుట ఆవిష్కృతమైన తెలంగాణ.. గుండెల్లో అమరుల జ్ఞాపకాలు.. ఆకాశమే హద్దుగా సాగిన జై తెలంగాణ నినాదాలహోరు మధ్య ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆదివారం అర్ధరాత్రి పురుడుపోసుకున్నది. 60 యేళ్ల తం డ్లాట, 120మంది అమరవీరుల త్యాగాలఫలం సాక్షిగా ఓరుగల్లు జనం రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో ఓలలాడారు. జనజాతరలు పల్లే పట్నం తేడాలేకుండా జిల్లా అంతటా జనజాతరలై సాగాయి. ఓరుగల్లు సేవాసమితి ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఆకట్టుకున్నాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ బంగ్లాకు ఎదురుగా ఏర్పాటు చేసిన కీర్తి స్థూపం ఉద్యమ చరిత్రలో నిలిచిపోయింది. కలెక్టర్ కిషన్ ఆధ్వర్యంలో కీర్తి స్థూపం ఆవిష్కరించారు. కళాకారుల ధూంధాం, కార్నివాల్ తో జాతరను తలపించింది. ఉద్యోగ, రాజకీయ ప్రతినిధులతోపాటు జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పట్నంలో కలిసికట్టుగా.. ఎన్నికల జాతర ముగిసిన తర్వాత అన్ని వర్గాలు మరోసారి సమూహమై సాగారు. ఆర్తి, ఆవేదన, ఆకాంక్షను చాటిచెప్పేందుకు కడలి తరంగాల్లా కదిలివచ్చారు. ముందుగానే సన్నద్ధమై న విద్యార్థులు, న్యాయవాదులు, డాక్టర్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, యువజను లు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు, కార్మికులు, జర్నలిస్టులు సబ్బండవర్ణాల సకలజనులు పోరు వారసులై సాగివచ్చారు. జిల్లా కేంద్రమైన హన్మకొండలో చౌరస్తా, అశోకసెంటర్, అంబేద్కర్ సెంటర్, కాళోజీ సెంటర్, అమరవీరుల సెంటర్, కలెక్టరేట్ పరిసరాలు, నిట్ ప్రాంతం జనంతో కిక్కిరిసిపోయింది. కాకతీయ యూని వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు పోరుజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వరంగల్ ఎంజీ ఎం సెంటర్, పోచమ్మమైదాన్, చౌరస్తా, ఖిలావరంగల్, రంగశాయిపేట సెంటర్లలో ప్రజ లు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. కోట జనసంద్రాన్ని తలపించింది. ఎంజీఎం సెంటర్ నుంచి కోట వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ కాగడాల ర్యాలీ నిర్వహిం చారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తాలో వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమా ల్లో టీజేఏసీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఉద్యోగ సంఘాలు కొవ్వత్తులతో ర్యాలీలు నిర్వహించి అమరుల కు నివాళులర్పించారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బీజేపీ, టీడీపీ, సీపీఐ, న్యూడెమోక్రసీ తదితర రాజకీయ పార్టీలన్నీ ఉత్సవాల్లో భాగస్వామ్యమయ్యాయి. కొత్త రాష్ట్రానికి స్వాగతం పలుకుతూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పనిలో పనిగా నూతన ఎమ్మెల్యేలు, ఎంపీల స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పల్లెల్లో జట్లుగా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, ములు గు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, పాలకుర్తి, తొర్రూరు, వర్ధన్నపేట, హసన్‌పర్తి, ఆత్మకూరు తదితర సెంటర్లతోపాటు పల్లెపల్లెనా, ఇంటింటా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు కనులపండువగా జరిగా యి. అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అమరవీరుల కుటుం బాలను గుండెలకు హత్తుకున్నారు. పరకాల అమరధామం వద్ద నివాళులు అర్పించారు. దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. కులం, మతం అనే తేడా లేకుండా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కేక్‌లు కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. కళాకారుల ధూంధాంలతో జిల్లాలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కన్పించింది. ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా రమేష్
దేశంలో ఒక్కరికే దక్కిన అవకాశం వృత్తి-విద్యకు అనుసంధానంగా రెండేళ్ల పరిశోధనలు కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ విద్యావిభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఘంటా రమేష్ కు అరుదైన గౌరవం దక్కింది. యూజీసీ ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేయూ విద్యావిభాగంలో రెండేళ్ల పాటు ఆయన వృత్తి-విద్యకు అనుసంధానంగా పరిశోధనలు చేయనున్నారు. విద్యావిభాగంలో దేశవ్యాప్తంగా రమేష్ ఒక్కరే ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా నియమితులు కావడం విశేషం. దీం తో ఆయనకు వృత్తికి, విద్యకు అనుసంధానం చేసే ఒకేషనలైజేషన్ అంశాలకు సం బంధించి విస్తృత పరిశోధనలు చేసే అవకాశం లభించింది. రెండేళ్ల పాటు ఆయన నెలకు రూ.50వేల చొప్పున కాంటింజెన్సీ ఫెలోషిప్‌ను యూజీసీ నుంచి అందుకుంటారు. కేయూలో ఉద్యోగ విరమణ కాకతీయ యూనివర్సిటీలో విద్యావిభాగంలో ప్రొఫెసర్ పనిచేసిన ఘంటా రమేష్ గత ఏడాది జూలైలో ఉద్యోగ విరమణ పొందారు. అదే ఏడాది డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీ య ఉర్దూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్.. ఆ యూనివర్సిటీ పరిధిలో మూడు బీఎడ్ కళాశాలలు, రెండు ఎంఈడీ కళాశాలల స్థాపనకు విశేష కృషి చేశారు. అంతకుముందు రమేష్ ఒకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంశంపై కొంతకాలం క్రితం లండన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రం సమర్పించారు. అదేసమయంలో అక్కడికి వచ్చిన అనేక దేశాల విద్యావేత్తలతో వృత్తివిద్యపై విస్తృతంగా చర్చలు జరిపారు. విద్యారంగంలో విశేషమైన కృషి ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర అనే మారుమూల గ్రామంలో జన్మించిన ఘంటా రమేష్ కాకతీయ యూనివర్సిటీలో విద్యావిభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ హన్మకొండలోనే స్థిరపడిపోయారు. ఆయన ఉద్యోగం చేసిన సమయంలో అనేక బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా పలు అవార్డులు అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యావిభాగం అధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, డీన్‌గా బాధ్యతలు నిర్వహించారు. గతం లో అమెరికా ప్రభుత్వం నుంచి పుల్‌బ్రైట్ విజిటింగ్ ఫెలోగా అవార్డు పొందిన రమేష్ కేయూ విద్యావిభాగం ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్(ఐఏఎన్ఈ) ఉన్నతీకరణకు విశేష కృషి చేశారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా బీఈడీలో కామన్ సిలబస్, అకడమిక్ క్యాలెండర్ రూపకల్పన చేసి పలువురి ప్రశంసలు అం దుకున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్సీటీఈ) దక్షిణ ప్రాంత కమి టీ సభ్యుడిగా, యూజీసీ, న్యాక్, రాష్ట్ర జాతీయ కమిటీల్లో సభ్యులుగా కొనసాగిన రమేష్ విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేశారు. రాష్ట్రంలో నాలుగు సార్లు ఎడ్‌సెట్ సమర్థవంతంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గిరిజన ఆది వాసీల విద్యాభివృద్ధి కోసం ఐటీడీఏ నేతృత్వంలో బీఈడీ కళాశాలను ఏర్పాటుచేయడంలో కూడా రమేష్‌దే కీలకపాత్ర. విద్యా విభాగంలో మూడు దశాబ్దాల కు పైగా సేవలందించిన ఆయనకు 1997 లో రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు, 2009 సంవత్సరంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్ సంస్థ నుంచి జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డు లభించింది. వయోజన విద్యలో విశేషమైన కృషి చేసినందుకు 2010లో భారత ప్రభు త్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుం చి ఉత్తమ రాష్ట్ర రిసోర్స్ సెంటర్ అవార్డును కూడా అందుకున్నారు. యువతకు ఉపాధి లభించేలా పరిశోధనలు గతంలో లండన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు వెళ్లినప్పుడు అనేక దేశాల విద్యావేత్తలతో చర్చించే అవకాశం లభించింది. ఆ అనుభవం ఇప్పుడు నా పరిశోధనకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రభుత్వాలు ఒకేషనల్ కోర్సులు నిర్వహిస్తున్నా అనుకున్న స్థాయిలో విజయవంతం కావడం లేదు. వృత్తివిద్య అనేది ఉపాధికి మార్గంగా ఉండాలి. ఉన్నత విద్యను కూడా వృత్తికి అనుసంధానం చేసి విద్యార్థుల్లోకి తీసుకెళ్లేలా పరిశోధనలు చేసి వాటి ఫలితాలను అమలు చేస్తే యువతకు ఉపాధి లభిస్తుంది. ఈ మేరకు రెండేళ్ల పాటు పరిశోధనలు చేయనున్నాం. - ఘంటా రమేష్ -
నోచందా..దందా..ప్రజాసేవే పరమావధి
కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్‌గా.. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్‌గా.. పల్లెలు, గిరిజనతండాలు తిరిగాను.. సామాజిక రుగ్మతలపై ప్రజలకు అవగాహన కల్పించాను.. తండాల్లోని సమస్యలపై అధ్యయనం చేశాను.. తెలంగాణ ఉద్యమ సమయంలో జాక్ స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశాను.. తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడిన క్రమంలో ఇప్పుడు ప్రజా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను.. ఎంపీగా విజయం సాధించాను.. తనను గెలిపించిన ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేస్తాను.. చందా.. దందా.. పర్సంటేజీలు తీసుకోకుండా ప్రజా సేవకే అంకితమవుతా.. అని అంటున్నారు మాను కోట ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్. ‘న్యూస్‌లైన్’ అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. న్యూస్‌లైన్, కేయూ క్యాంపస్: హబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో గిరిజనులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. గుడుంబాను కుటీర పరిశ్రమగా ఎంచుకుని దానికే బానిసలవుతున్నారు. యుక్త వయసులోనే అర్ధంతరంగా తనువు చాలిస్తున్నారు. గుడుంబా విక్రయిస్తున్న వారిపై ఇప్పటివరకు నాలుగు లక్షల కేసులున్నాయి. గుడుంబా తయారీ నుంచి వారికి విముక్తి కల్పించడానికి ప్రత్యామ్నాయంగా ఉపాధి మార్గం చూపించాలి. గిరిజన, గిరిజనేతరుల్లో డిగ్రీ, పీజీ చేసిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు లభించడం లేదు. కొందరు గిరిజనులు పేదరికంతో పసిపిల్లలను అమ్ముకునే దుస్థితి నెలకొంది. ప్రస్తుతం గిరిజనులకు ఉన్న 6 శాతం రిజర్వేషన్ సరిపోవడం లేదు. దానిని కనీసం 12 శాతం చేయాల్సిన అవసరం ఉంది. తాను ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్‌గా ఉన్నప్పుడు యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలను తిరిగినప్పుడు అనేక సమస్యలపై అధ్యయనం చేశాను. దీనిపై ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించాను. గిరిజనుల సమస్యలపై చట్టసభల్లో అంతగా ప్రస్తావనకు రాలేదు. గిరిజనేతరుల సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తాను. రాజకీయాల్లోకి రావడం వల్ల కొన్ని సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. పుష్కలంగా సహజ వనరులు పార్లమెంట్ పరిధిలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఖమ్మం జిల్లా బయ్యారంలో లక్షల ఎకరాల్లో ఐరన్‌ఓర్ నిక్షేపాలు ఉన్నాయి. రాబోయే టీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టేలా తనవంతు కృషి చేస్తాను. ఇక్కడ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే గిరిజన, గిరిజనేతర యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఇక్కడ ఏర్పాటు చేస్తే రెండు జిల్లాల్లోని ఎంతోమంది గిరిజన విద్యార్థులు ఉన్నత విద్యను అందించడమే కాకుండా సంస్కృతిని కూడా పెంపొందించే విధంగా ఉంటుంది. పాకాల, రామప్ప, లక్నవరం లాంటి సరస్సులు ఉన్నాయి. వీటిని కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను జాతీయ ఫెస్టివల్‌గా గుర్తించేలా కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టడానికి కృషి చేస్తాను. కేయూను సెంట్రల్ యూనివర్సిటీగా చేస్తా.. కేయూను సెంట్రల్ యూనివర్సిటీగా చేయాలనే డిమాండ్ ఉంది. దీనికోసం తనవంతు కృషి చేస్తాను. కేయూలో టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. కొత్త పాలక మండలిని ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఉద్యమ ప్రస్థానం.. సామాజిక సేవ వెంకటాపూర్ మండలం మల్లయ్యపెల్లితండా(నారాయణపూర్)కు చెందిన అజ్మీరా లక్ష్మణ్, మంగమ్మ దంపతులకు సీతారాంనాయక్ జన్మించారు. కిలోమీటరున్నర దూరంలోని ప్రాథమిక పాఠశాలకు వెళ్లి చదువుకున్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు ములుగుఘనపూర్‌లో చదువుకున్నారు. పదో తరగతి హన్మకొండలోని లష్కర్ బజార్ స్కూల్లో, హన్మకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్, కేడీసీలో బీఎస్సీ చదువుకున్నారు. కేయూ 1979-1981లో ఎమ్మెస్సీ(బాటనీ) పూర్తి చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 1984లో నియమాకమయ్యారు. 1994లో పీహెచ్డీ పూర్తి చేశారు. అప్పట్లో లంబాడీ గిరిజన తెగ నుంచి సైన్స్ విభాగంలో పీహెచ్డీ పొందిన వారిలో మొదటివారు. 1995 వరకు అక్కడే పనిచేసిన ఆయన హన్మకొండ కేడీసీకి బదిలీ అయ్యారు. ఆ తరువాత కేయూలో 2002 నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరి ప్రస్తుతం ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్‌గా, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. దీని ద్వారానే సమాజంలోని అనేక సమస్యలను కూడా తెలుసుకునే అవకాశం కలిగింది. మూఢ నమ్మకాలు, ఎయిడ్స్ లాంటి సామాజిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. కేయూ పాలక మండలి సభ్యుడిగా కీలక పాత్ర పోషించారు. కేయూ ఎగ్జామినేషన్ రీఫార్మేషన్ కమిటీ సభ్యుడిగా, పీజీ కళాశాలల స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేశారు. కేయూ అడ్మిషన్ల డెరైక్టర్‌గా, ఫైనాన్స్ కమిటీ సభ్యుడిగా, ఎస్డీఎల్సీఈ సలహా మండల సభ్యుడిగా, పీజీ అడ్మిషన్ల జాయింట్ డెరైక్టర్‌గా పనిచేశారు. కర్ణాటకలోని గుల్బార్గా యూనివర్సిటీ, బీహార్‌లోని లలిత్ నారాయణ్ మిథిలా విశ్వవిద్యాలయంతోపాటు అమెరికా, నేపాల్, థాయ్‌లాండ్ లలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించారు. రాష్ట్రంలోని 35 తెగలకు సంబంధించిన గిరిజనులపై, ముఖ్యంగా అధిక శాతం ఉన్న లంబాడీల మరణాలు, పసిపిల్లల అమ్మకాలపై పరిశోధన చేశారు. పలు పదవులు బాటనీ ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే తెలంగాణ ఐక్య కార్యాచరణ సభ్యులు(టీజాక్)గా, తెలంగాణ యూనివర్సిటీ ట్రైబల్ ప్రొఫెసర్స్ అధ్యక్షుడిగా, ఆలిండియా బంజార సేవాసంగ్ కౌన్సిల్ సభ్యులుగా పనిచేశారు. రైల్వే లైన్‌కు కృషి ఖమ్మం జిల్లా మణుగూరు వరకు రైల్వే లైను ఉంది. ఇల్లెందు వరకు కొంత, భద్రాచలం వరకు కూడా రైల్వే లైను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనిని పూర్తి చేయించేందుకు కృషి చేస్తాను. మహబూబాబాద్, డోర్నకల్ రైల్వేస్టేషన్లలోని సమస్యలు, పలు రైళ్ల నిలుపుదల కోసం ప్రయత్నిస్తాను. -
నేటి నుంచి కేయూ పీజీ సెట్
కేయూ క్యాంపస్(వరంగల్), న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న కేయూ పీజీ సెట్ శనివారం నుంచి జూన్ 1వ తేదీ వరకు జరుగుతుందని కేయూ ఇన్చార్జ్ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ నర్సింహచారి తెలిపారు. పీజీ సెట్లో భాగంగా 37 కోర్సులకు 32,321 దరఖాస్తులు వచ్చాయని, ఈ మేరకు కోర్సుల వారీగా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశామని పేర్కొన్నారు. కేయూ పీజీ సెట్ రాసే అభ్యర్థులకు హాల్‌టికెట్లను పోస్టు ద్వారా పంపించామని, అందని వారు ఆన్లైన్లో డౌన్‌లోన్ చేసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా ఆయన పీజీ సెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. పీజీ సెట్ షెడ్యూల్ ఇదే.. కోర్సుల వారీగా పీజీ సెట్ నిర్వహించే తేదీల వివరాలిలా ఉన్నాయి. ఈనెల 24న ఉదయం 11నుంచి మధ్యాహ్నం 12-30గంటల వరకు ఎమ్మెస్సీ బాటనీ, మధ్యాహ్నం 2-30 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎంఎల్ఐఎస్సీ, ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్‌డబ్ల్యూ ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. 25వ తేదీన ఉదయం ఎంఈడీ, మధ్యాహ్నం ఎమ్మెస్సీ ఫిజిక్, ఫిజిక్స్(ఇంట్రుమేషన్), ఎంఏ సోషియాలజీ, పీజీ డిప్లోమా ఇన్ సెరికల్చర్, 26న ఉదయం ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంటీఎం, మధ్యాహ్నం ఎంఏ ఇంగ్లిష్, 27న ఉదయం ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంపీఈడీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులైన ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, మధ్యాహ్నం ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ పరీక్షలు జరుగుతాయి. 28న ఉదయం ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జువాలజీ, మధ్యాహ్నం ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లెడ్ మ్యాథమెటిక్స్, ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, 29న ఉదయం ఎంసీజే, మధ్యాహ్నం ఎమ్మెస్సీ సైకాలజీ, 31న ఉదయం ఎంహెచ్ఆర్ఎం, మధ్యాహ్నం ఎంఏ హిస్టరీ, ఎమ్మెస్సీ జియాలజీ కోర్సులో ప్రవేశాలకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. అలాగే, జూన్ 1వతేదీన ఉదయం ఎంకాం, ఎంకాం(ఫైనాన్సియల్ అకౌంటింగ్), ఎంకాం బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఎంకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్, మధ్యాహ్నం ఎంఏ తెలుగు, ఎంఏ జెండర్ స్టడీస్, ఎమ్మెస్సీ నానోసైన్స్ అండ్ నానోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు పరీక్షలు జరుగతాయి. -
ఐసెట్ ప్రశాంతం
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశ పరీక్ష(ఐసెట్) శుక్రవారం సిద్దిపేటలో ప్రశాంతంగా కొనసాగింది. కాకతీయ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్ పరీక్ష నిర్వహణ ఆద్యాంతం పరిశీలకుల పర్యవేక్షణలో కొనసాగింది. ఒక్క నిమిషం నిబంధన దృష్ట్యా విద్యార్థులు పరుగుపరుగున కేంద్రాలకు తరలివచ్చారు. సిద్దిపేటలోని మూడు కేంద్రాల్లో జరిగిన ప్రవేశ పరీక్షకు 1,641 మంది హాజరు కావాల్సి ఉండగా 1,519 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. వివిధ కారణాలతో 122 మంది విద్యార్థులు ఐసెట్‌కు గైర్హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి కొనసాగిన ప్రవేశ పరీక్ష మధ్యాహ్నం 12.30 గం. వరకు జరిగింది. పరీక్షలను రీజినల్ కో ఆర్డినేటర్ జీఎం రాములు పర్యవేక్షించారు. పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో 781 మంది, ఎస్ఆర్కే డిగ్రీ కళాశాలలో 372 మంది, ప్రతిభా డిగ్రీ కళాశాలలో 366 మంది పరీక్షలు రాశారు. నిబంధనల మేరకు నిర్ణీత సమయం కంటే ముందే విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. సిద్దిపేటలో ఐసెట్ ప్రవేశ పరీక్షను తెలంగాణ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ సత్యనారాయణ చారి పరిశీలించారు. స్థానిక పోలీసులు కేంద్రాల వద్ద బందోబస్తు నిర్వహించారు. -
నేటి ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : గురువారం జరిగే ఎంసెట్-2014 నిర్వహణకు వరంగల్ రీజినల్ పరిధిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రీజినల్ కోఆర్డినేటర్, కాకతీయ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు తెలిపారు. ఇంజనీరింగ్‌కు 14,323 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని, ఇందుకు 23 కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ఈ పరీక్షకు 36 మంది అబ్జర్వర్లను నియమించామన్నారు. మధ్యాహ్నం 2-30గంటల నుంచి సాయంత్రం 5-30 గంటల వరకు మెడిసిన్, అగ్రికల్చర్‌కు ప్రవేశ పరీక్ష జరుగుతుందని, 6,669మంది అభ్యర్థులు పరీక్షను రాయబోతున్నారన్నారు. ఈ పరీక్ష నిర్వహణకు 10 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 18మంది అబ్జర్వర్లను నియమాకం చేశామని చెప్పారు. ఆయా పరీక్షలకు నిర్ధేశించిన విధంగా ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షాకేంద్రాలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఇంజనీరింగ్ పరీక్షా కేంద్రాలు ఇవే.. కేయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, వరంగల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్ (విట్స్), చైతన్య డిగ్రీ కాలేజీ, ఏవీవీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ, న్యూసైన్స్ డిగ్రీ కాలేజీ, న్యూసైన్స్ డిగ్రీ పీజీ కాలేజీ, ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, సుమతిరెడ్డి ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఎల్బి పీజీ కాలేజీ, ఎల్యూజీ కాలేజీ, జయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్, కాకతీయ మెడికల్ కాలేజీ, సీకెఎం, కాకతీయ కాలేజీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, మాస్ట ర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, ఎస్వీఎస్ కాలేజీ, కాకతీ య ప్రభుత్వ కాలేజీ, వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, యూనివర్సిటీ కాలేజీ(హ్యూమనిటీస్ బిల్డింగ్), సహారా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ పరీక్షా కేంద్రాలు వరంగల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సెన్సైస్(విట్స్), చైతన్య డిగ్రీకాలేజీ, ఏవీవీ డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, ఎల్బీ పీజీ కాలేజీ, ఎల్బి యూజీ కాలేజీ, కాకతీయ మెడికల్ కాలేజీ, కాకతీయ ప్రభుత్వ కాలేజీ, వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, శ్రీ గాయత్రి డిగ్రీ కాలేజీ, సహారా కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయి. -
వరంగల్ పోలీసులు భేష్
మావోయిస్టుల అణచివేతలో అగ్రభాగం పోలీసుల సమష్టి కృషితోనే ఎన్నికలు ప్రశాంతం డీజీపీ ప్రసాదరావు జిల్లా కేంద్రంలో పలు ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపన వరంగల్ క్రైం, న్యూస్‌లైన్: పోలీసుల సమష్టి కృషితోనే ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని డీజీపీ బి.ప్రసాదరావు అన్నారు. మావోయిస్టుల అణచివేతలో వరంగల్ పోలీసులు ముందున్నారని అన్నారు. ఆయన బుధవారం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని భీమారం గ్రామంలో నిర్మించిన పోలీసు కల్యాణ మండపాన్ని తన సతీమణి సౌమినితో కలిసి ప్రారంభించారు. ఆ తర్వాత హన్మకొండ పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించతలపెట్టిన సిబ్బంది విశ్రాంతి బ్యారక్‌కు శంకుస్థాపన చేశారు. జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో డిస్ట్రిక్ట్ గార్డ్స్ బ్రీఫింగ్ హాల్, పార్కింగ్ షెడ్, ధ్యాన మందిరం, ఎంటీ విభాగం నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం అర్బన్, రూరల్ పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతిభ చూపిన రూరల్ అధికారులకు క్యాష్ రివార్డులను అందజేయగా, అర్బన్ పరిధిలోని అధికారులకు ట్యాబ్‌లను అందజేశారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రంలో మావోయిస్టులను అణచివేసి ప్రశాంతమైన వాతావరణం కల్పించడంలో వరంగల్ పోలీసులు ముఖ్య భూమిక పోషించారని అన్నారు. మావోయిస్టులను ఎదుర్కోవడంలో జిల్లాకు చెందిన అధికారులు, సిబ్బంది తమ ప్రాణ త్యాగాలు చేశారని, అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, సార్వత్రిక ఎన్నికల ప్రశాంత నిర్వాహణ కోసం పోలీసులు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. ఇందుకోసం శ్రమించిన హోంగార్డు స్థాయి నుంచి ఎస్పీ స్థాయి అధికారుల వరకు అందరికీ అభినందనలు తెలిపారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, ఆంధ్రప్రదేశ్ పోలీసులు తమ విధులలో రాణించడంలో పోలీసు సిబ్బంది సతీమణుల పాత్ర కూడా కీలకమని అన్నారు. ఈ సమావేశంలో వరంగల్ రీజియన్ ఐజీ రవిగుప్తా, రేంజ్ డీఐజీ డాక్టర్ ఎం.కాంతారావు, వరంగల్ రూరల్, అర్బన్ ఎస్పీలు లేళ్ల కాళిదాసు, ఎ.వెంకటేశ్వరరావు, అదనపు ఎస్పీలు యాదయ్య, కె.శ్రీకాంత్, డీఎస్పీలు జనార్దన్, దక్షిణమూర్తి, రాజిరెడ్డి, హిమవతి, సురేష్‌కుమార్, సీఐలు కిరణ్‌కుమార్, పృథ్వీధర్‌రావు, దేవేందర్‌రెడ్డిలతో పాటు ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. కల్యాణ మండపాన్ని ప్రారంభించిన డీజీపీ దంపతులు భీమారం : వరంగల్ నగర పరిధిలోని కేయూసీ పోలీస్‌స్టేషన్ సమీపంలో నిర్మించిన పోలీసుల కల్యాణ మండపాన్ని డీజీపీ ప్రసాదరావు దంపతులు బుధవారం ప్రారంభించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ పోలీసుల సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. పోలీసుల కుటుంబాల కోసం ఈ ఫంక్షన్ హాల్‌ను నిర్మించినట్లు తెలిపారు. సుమారు రూ.70 లక్షలతో ఈ కల్యాణ మండపం పనులు చేపట్టారు. -
నేటితో ముగియనున్న కేయూ వీసీ పదవీకాలం
కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం పదవీకాలం శనివారంతో ముగియనుంది. వెంకటరత్నం వీసీగా బాధ్యతలను చేపట్టి ఈనెల 17తో మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. అయితే మరో రెండు సంవత్సరాల నాలుగు నెలలపాటు ఇంకా ప్రొఫెసర్ వెంకటరత్నానికి సర్వీస్ ఉంది. కాకతీయ యూనివర్సిటీలో కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన చివరి కేయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వెంకటరత్నం స్థానంలో మరో నూతన వీసీని నియమించే వరకు ప్రభుత్వం ఉన్నత విద్యలోని ఐఏఎస్ ఆఫీసర్‌కు లేదా ఇతర యూనివర్సిటీలోని వీసీకి ఇన్చార్జ్గా నియమించే అవకాశాలున్నాయి. పలు అభివృద్ధి పనులు కాకతీయ యూనివర్సిటీ వీసీ వెంకటరత్నం మూడేళ్ల కాలంలో పలు అభివృద్ధి పనులను చేపట్టారు. అంతేగాకుండా ఎమ్మెస్సీ సైకాలజీ, జర్నలిజం, ఎంఈడీ, ఎంపీఈడీ, ఇంజినీరింగ్ కళాశాల, ఎంబీఏ కోర్సులను ఏర్పాటు చేశారు. అలాగే కాకతీయ యూనివర్సిటీలో మహిళా ఇంజినీరింగ్ కళాశాలను, జనగామ, మహబూబాబాద్, భూపాలపల్లిలో పీజీ సెంటర్లను, ఖమ్మంలో బీపీఈడీ కోర్సును ప్రారంభించారు. యూజీసీ, డీఎస్టీల నుంచి కూడా నిధులు రాబట్టారు. యూనివర్సిటీలో స్పోర్ట్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ హ్యాండ్‌బాల్ టోర్నమెంట్, సెంట్రల్ జోన్ కబడ్డీ, క్రికెట్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. నాన్ టీచింగ్ ఉద్యోగులకు పదోన్నతలు కల్పించారు. సుమారు 60 మంది వరకు పార్ట్ టైం లెక్చరర్లకు కాంట్రాక్ట్ లెక్చరర్లుగా నియామకం చేశారు. ఇటీవల కేయూ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. ఈ క్రమం లో కాకతీయ యూనివర్సిటీ ఎంప్లాయీస్ జాక్ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సేనెట్ హాల్లో వీసీ వెంకటరత్నంను ఘనంగా సన్మాని స్తామని జాక్ చైర్మన్ కొండల్‌రెడ్డి, కన్వీనర్ డాక్టర్ కోల శంకర్ తెలిపారు. -
చదువుకున్న చోటే..గౌరవ సత్కారం
కేయూ స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ అందుకోనున్న సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ రామ్మోహన్రావు కాకతీయ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి కావడం, స్నాతకోత్సవ ముఖ్య అతిథి కూడా ఆయనే కావడం ఈసారి ప్రత్యేకత. కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ 20వ స్నాతకోత్సవానికి క్యాంపస్‌లోని నూతన ఆడిటోరియం సిద్ధమైంది. సోమవారం ఉదయం 11గంటలకు స్నాతకోత్సవం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఇప్పటివరకు యూనివర్సిటీలో 19 స్నాతకోత్సవాలు జరగ్గా 35మంది ప్రముఖులు గౌరవ డాక్టరేట్లు అందుకున్నా రు. హైదరాబాద్‌లోని సెంట్రల్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డెరైక్టర్ సీహెచ్ రామ్మోహన్‌రావుకు ఈసారి గౌరవ డాక్టరేట్ అందించనున్నారు. గౌరవ డాక్టరేట్ పొందేవారినే ముఖ్య అతిథిగా కూడా ఆహ్వానించాలనే నిబంధన ఈసారి ఉండడంతో రామ్మోహన్రావే ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. గతంలో నిర్వహించిన స్నాతకోత్సవాల్లో ఒకరి నుంచి ఆరుగురి వరకు గౌరవ డాక్టరేట్లు ఇవ్వ గా ప్రస్తుతం ఒక్కరికే ఇవ్వాలనే నిబంధన వి దించారు. ఏర్పాట్లు పూర్తి స్నాతకోత్సవం కోసం యూనివర్సిటీలో ఏర్పా ట్లు పూర్తి చేశారు. ఆడిటోరియంను ముస్తాబు చేశారు. గెస్ట్‌హౌస్‌ను రంగులతో తీర్చిదిద్దారు. వీసీ, రిజిస్ట్రార్ పర్యవేక్షణలో వివిధ కమిటీలు పలు విధులు నిర్వర్తిస్తున్నాయి. నిరాశపరిచిన గవర్నర్ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ వస్తారని యూనివర్సిటీ అధికారులు భావించి నప్పటికీ ఆయన రావడం లేదని గవర్నర్ పేషీ నుంచి శనివారమే యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందింది. దీంతో గవర్నర్ చేతుల మీదుగా పట్టాలు అందుకోవాలని ఆశపడిన పీహెచ్డీ పూర్తిచేసిన విద్యార్థులు నిరాశ చెందు తున్నారు. గవర్నర్ స్థానంలో కేయూ వీసీ వెంకటరత్నం పట్టాలు, బంగారు పతకాలు ప్రదా నం చేస్తారు. ఈ స్నాతకోత్సవంలో డిగ్రీ,పీజీ, డిప్లోమా కోర్సుల్లో 174 గోల్డ్‌మెడల్స్, 510 వర కు పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేయనున్నా రు. నోటిఫికేషన్ ఇచ్చాక సకాలంలో స్నాత కో త్సవంపై దృష్టి సారించకపోవటంతో 150 మంది వరకు విద్యార్థులు తమ పట్టాలను తీసు కెళ్లారు. 2010 మే 25నుంచి ఈనెల 10వతేదీ వరకు అవార్డు పొందిన అభ్యర్థులకు కూడా పీ హెచ్డీ పట్టాలను అందించనున్నారు. ఆయా అభ్యర్థులకు పాస్‌లు, బ్యాడ్జీలు అందజే శారు. రామ్మోహన్రావు అందుకున్న అవార్డులు యంగ్ సైంటిస్ట్ అవార్డ్ ఆఫ్ ది ఇండియన్ అసోసియేషన్ ఫర్ రేడియేషన్ ప్రొటెక్షన్(1990) యంగ్ సైంటిస్ట్ అవార్డ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ (1982) శ్రీనివాసయ్య మెమోరియల్ అవార్డ్(1996) ది సొసైటీ ఆఫ్ బయాలాజికల్ కెమిస్ట్రీ (ఇండియా) రోహతో అవార్డ్ ఫస్ట్ ఏసియన్ క్యాటరాక్ట్ కాన్ఫరెన్స్(1996-చైనా) శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ (1999) రాన్‌బ్యాక్సీ అవార్డ్ ఫర్ బేసిక్ మెడికల్ సెన్సైస్(2000) జేసీ బోస్ నేషనల్ ఫెల్లోషిప్,డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్అండ్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా (2011) ది స్టేట్ ఇంటలెక్చువల్ ఆనర్ గ్రేట్ సన్ ఆఫ్ ది సాయిల్ (2010) బిరెస్ చంద్రగుహ మెమోరియల్ లెక్చర్ అవార్డ్ ఐఎన్ఎస్ఏ (2014) మెంబర్షిప్ ఇన్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఇవికాక పలు అసోసియేషన్లలో మోహన్‌రావుకు మెంబర్షిప్ ఉంది. అమెరికా అసోసియేషన్ ఫర్ బయోకెమిస్ట్రీ అండ్ మాలిక్యూలర్ బయాలజీ( యూఎస్ఏ). అసోసియేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్విజన్ అండ్ ఆఫ్తాల్మాలజీ (యూఎస్ఏ), ఇండియన్ ఫొటో బయాలజీ సొసైటీ (ఇండియా), సొసైటీ బయాలజికల్ కెమిస్ట్రీ (ఇండియా). 2009 నుంచి 2011వరకు ఇండియన్ బయోఫిజికల్ సొసైటీకి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. 2012 నుంచి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రామ్మోహన్రావు కేయూ పూర్వ విద్యార్థే స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్ అందుకోనున్న సీసీఎంబీ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ రామ్మోహన్రావు కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న వారే. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చెందిన ఆయన జనవరి19, 1954న మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. హుజూరాబాద్‌లోనే హైస్కూలు విద్య పూర్తిచేసిన మోహన్‌రావు ఓయూలో బీఎస్సీ పూర్తిచేశారు. అనంతరం కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తిచేశారు. 1984లో హైదరాబాద్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్న రామ్మోహన్రావు 2009 నుంచి సీసీఎంబీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన వద్ద 17మంది పరిశోధక విద్యార్థులు పీహెచ్డీ చేశారు. 13మంది పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్‌కు పర్యవేక్షకులుగా వ్యవహరించారు. జాతీయ, అంతర్జాతీయ సైంటిఫిక్ జర్నల్స్‌లో ఎడిటోరియల్ బోర్డ్ సభ్యుడిగా వ్యవహరించిన డాక్టర్ రామ్మోహన్రావు ప్లాంట్స్ఫీల్డ్లో నూతన ఆవిష్కరణలకు గాను నాలుగు యూఎస్ పేటెంట్లు కలిగి ఉన్నారు. జన విజ్ఞాన వేదిక గౌరవ అధ్యక్షుడిగాను వ్యవహరిస్తున్న ఆయన ‘సైన్స్ ఫర్ ది పీపుల్స్ మూవ్మెంట్’కు తనవంతు సహకరిస్తున్నారు. -
కేయూ పీజీసెట్ షెడ్యూల్ విడుదల
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు కేయూ పీజీ సెట్ ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇన్చార్జ్ అడ్మిషన్ల డెరైక్టర్ డాక్టర్ ఎస్.నర్సింహాచారి గురువారం తెలిపారు. ప్రవేశ పరీక్షలు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వారం రోజుల తర్వాత విద్యార్థులు తమ హాల్‌టికెట్లను కేయూ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ప్రవేశపరీక్షల షెడ్యూల్ ఇదే... 24న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎమ్మెస్సీ బోటనీ, ఎంఏ తెలుగు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎంఎల్ఐఎస్సీ, ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్‌డబ్ల్యూ పరీక్షలు జరుగుతాయి. 25న ఉదయం ఎంఈడీ, మధ్యాహ్నం ఎమ్మెస్సీ ఫిజిక్స్, ఇంజినీరింగ్ ఫిజిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎంఏ సోషియాలజీ, 26న ఉదయం ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, ఎంటీఎం, మధ్యాహ్నం ఎంఏ ఇంగ్లిష్, 27న ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంపీఈడీ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు ఎమ్మెస్సీ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, మధ్యాహ్నం ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ, 28న ఉదయం ఎంఏ ఎకనామిక్స్, ఎమ్మెస్సీ జువాలజీ, మధ్యాహ్నం ఎమ్మెస్సీ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, అప్లయిడ్ మ్యాథ్స్, ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షలు నిర్వహిస్తారు. 29న ఉదయం ఎంసీజే, మధ్యాహ్నం ఎమ్మెస్సీ సైకాలజీ, 31న ఉదయం ఎంహెచ్ఆర్ఎం, మధ్యాహ్నం ఎంఏ హిస్టరీ, ఎమ్మెస్సీ జియాలజీ, జూన్ 1న ఉదయం ఎం.కామ్, ఎం.కామ్ ( ఫైనాన్సియల్ అకౌంటింగ్), ఎం.కామ్ బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అండ్ ఎం.కామ్ (కంప్యూటర్ అప్లికేషన్స్), మధ్యాహ్నం ఎంఏ (జెండర్ స్టడీస్), ఎమ్మెస్సీ (నానో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ ) కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు ఉంటాయి. ఇదిలా ఉండగా ఎంఏ సంస్కృతం, ఎంఏ హిందీ, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయో కెమిస్ట్రీ, ఎంఏ ఉర్దూ, ఎమ్మెస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రవేశపరీక్ష ఉండదని నర్సింహాచారి తెలిపారు. డిగ్రీ స్థాయిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని నర్సింహాచారి పేర్కొన్నారు. -
విదేశీయురాలికి కేయూ డాక్టరేట్
కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : ఇరాన్ దేశానికి చెందిన ఆజాదేదావోదీ ఫార్ కు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఆమె కేయూ ఇంగ్లిష్ విభాగంలో పరిశోధకురాలిగా అడ్మిష న్ పొందారు. ‘కల్చరల్ కన్ఫిగరేషన్ అండ్ సోషల్ డిటర్మినేషన్ ఇన్ థామస్ హార్టీ వెస్సెక్స్ నావల్స్’ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు గురువారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు తెలిపారు. ఆమె ప్రొఫెసర్ రాజేశ్వర్ పర్యవేక్షణలో పరిశోధనను పూర్తిచేశారు. ఈ విభాగంలో పీహెచ్డీ సాధించిన మొదటి విదేశీ యురాలు ఆజాదేదావోదీ ఫార్ కావడం గమనార్హం. -
ఐసెట్‌కు 1,44,436 దరఖాస్తులు
500 రుసుముతో నేటి వరకు గడువు హన్మకొండ, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఈ విద్యాసంవత్సరంలో (2014-2015)ఐసెట్ -2014కు ఇప్పటివరకు 1,44,436 దరఖాస్తులు వచ్చాయని ఐసెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ సోమవారం తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు మంగళవారంతో ముగియనుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఇంకా దరఖాస్తులను అప్లోడు చేయని విద్యార్థులు రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 15వరకు అప్లోడుచేసుకోవాలన్నారు. రూ.2,000 అపరాధ రుసుముతో ఈ నెల 25వరకు, రూ.5,000 అపరాధ రుసుముతో మే 6వ తేదీవరకు, రూ 10 వేల అపరాధ రుసుముతో మే19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓంప్రకాష్ తెలిపారు. -
కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : అధ్యాపకులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొం దించుకోవాల్సిన అవసరం ఉందని కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం అన్నారు. కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖ, నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ త్రూ ఐసీటీ అనే కార్యక్రమంలో భాగంగా కేయూ ఇంజినీరింగ్ కళాశాలలో మైక్రోసాఫ్ట్ సంస్థ సహకారంతో అధ్యాపకులకు పది రోజులుగా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీపై నిర్వహిస్తున్న శిక్షణ గురువా రం ముగిసింది. ఈ సందర్భంగా వీసీ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం అన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అధ్యాపకులు ఐసీటీ పరిశోధనలతోపాటు, తరగతి గదిలో విరివిగా ఉపయోగించుకునే అవకాశాలున్నాయని వివరించారు. ఇలాంటి శిక్షణ శిబి రాలు నూతన టెక్నాలజీపై ఎంతో అవగాహన కలిగిస్తాయని తెలిపారు. కేయూలో అకడమిక్ స్టాఫ్ ట్రైనింగ్ కళాశాల ఏర్పాటు చేసే యోచన ఉందని, ఈ మేరకు ప్రతిపాదనలను కూడా రూపొందించామన్నారు. గ్రంథాలయం లో విద్యార్థి సాధికారిత విభాగం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు మాట్లాడుతూ నేడు ఈ క్లాస్ రూం, ఈ బుక్స్, ఈ జర్న ల్స్, ఈ కాంటెంట్ సర్వసాధారణమయ్యాయని చెప్పా రు. వీటిని అధ్యాపకులు ఉపయోగించుకోవాలని కోరా రు. పది జీబీఎస్‌తో క్యాంపస్‌లో వైఫై ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ షహీనా షఫీ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను తోటి అధ్యాపకులు, విద్యార్థులకు నేర్పాలని సూచించారు. ప్రోగ్రాం కన్వీనర్, కేయూ వెబ్ ఇన్చార్జ ఎన్.రమణ మాట్లాడుతూ కొందరు అధ్యాపకులకు శిక్షణ ఇచ్చామన్నారు. కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు మాట్లాడుతూ కంప్యూటర్ బోధనలో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. మైక్రోసాఫ్ట్ ప్రతినిధి తోమర్, ఎస్.నర్సింహాచారి, వై.వెంక య్య, ఎం.సురేఖ, షాయదా, ముంజం శ్రీనివాస్ పాల్గొన్నారు. శిక్షణ పొందిన అధ్యాపకులకు వీసీ వెంకటరత్నం సర్టిఫికెట్లను అందజేశారు. -
పరిశోధన ఫలితాలు సామాన్యులకు అందాలి
కేయూ వీసీ వెంకటరత్నం ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : శాస్త్ర, సాంకేతిక పరిశోధన ఫలితాలు సామాన్య ప్రజలకు సైతం అందేలా కృషి చేయాల్సిన అవసరముందని కాకతీయ యూనివర్సిటీ వీసీ బి.వెంకటరత్నం అభిప్రాయపడ్డారు. కాకతీయ యూని వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ‘ఫొటోనిక్స్, వీఎల్ఎస్ఐ సిగ్న ల్ ప్రాసెసింగ్’ అంశంపై రెండు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ సదస్సులో క్యాంపస్ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్లో శుక్రవారం ప్రారంభమైం ది. వీసీ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ కంప్యూటర్, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక మార్పులు వస్తుం డ గా.. సమస్యలు కూడా ఎదురవుతున్నాయన్నారు. మలేషియాలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి సరైన స్థలాన్ని తెలుసుకునేందుకు సమయం ప ట్టిందని.. మరింత మెరుగైన పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని ఈ ఘటన ఎత్తి చూపుతోందన్నారు. అన్ని రంగాల్లో ఫొటోనిక్స్ టెక్నాలజీ ఆధునిక జీవన విధానంలో అన్నిరంగాల్లోను ఫొటోనిక్స్ టెక్నాలజీ విస్తృతంగా ఉపయోగిస్తున్నారని అమెరికా ఆర్మీ రక్షణ విభాగం సైంటిస్టు ప్రొఫెసర్ లతా నటరాజ్ అన్నారు. సదస్సులో ఆమె కీలకోపన్యాసం చేస్తూ కంప్యూటర్ చిప్స్ టెలీ కమ్యూనికేషన్ టెక్నాలజీలో విరివిగా ఉపయోగిస్తున్నారన్నారు. వైద్యరంగంలో యాంటీ బయాటిక్స్, మైక్రో క్యాప్సుల్స్ మం దుల తయారీ, ఔషధాల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించే దిశగా ఫొటోనిక్స్‌లో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. అనంతరం మలేషియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గురుమూర్తిహెగ్డే, కెనడాలోని మాక్‌గిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వంశీ చోడవరపు, కేయూ రిజి స్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు, హైదరాబాద్ డీఈఆర్‌ఎల్ డెరైక్టర్ ఎస్పీ.దాస్, కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు మాట్లాడారు. కాగా, అంతర్జాతీయ సదస్సులో భాగంగా రెండు రోజు ల పాటు 17 టెక్నికల్ సెషన్స్ నిర్వహిస్తుండగా.. పరిశోధకులు సమర్పించే పరిశోధనాపత్రాల్లో నుంచి 49 పత్రాలను అంతర్జాతీయ ఎల్సేయర్ ప్రచురణ సంస్థ ప్రచురించనుందని నిర్వాహకులు తెలిపారు. సదస్సు లో తొలుత సదస్సు ప్రొసీడింగ్స్, సావనీర్‌తో పాటు సీడీని వీసీ, అతిథులు ఆవిష్కరించారు. సదస్సులో కన్వీనర్ వి.మహేందర్, ఆసిం ఇక్బాల్, బరోడా యూ నివర్సిటీ డాక్టర్ మూర్తి, డీఆర్డీఎల్ గుప్తా, ఇ.హరికృష్ణ, ఇ.మునీందర్, వీవీ.రాధారుక్మిణి, సీహెచ్.రాధిక, కె.సుమలత, ప్రొఫెసర్ డి.రాజేంద్రప్రసాద్, ప్రొఫెసర్ టి.రవీందర్‌రెడ్డితో పాటు వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు, పరిశోధకులు, ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
లోటు.. రూ.14.01కోట్లు
ఎనిమిది భాగాలుగా కేయూ బడ్జెట్ సెనేట్ సమావేశంలో ఆమోదం తెలంగాణలో యూనివర్సిటీ మరింత అభివృద్ధి : వీసీ వెంకటరత్నం కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్: కాకతీయ యూనివర్సిటీ వార్షిక(2014-15) బడ్జెట్‌ను బుధవారం ఆమోదించారు. క్యాంపస్‌లోని పరిపాలన భవనంలోని సెనేట్ హాల్లో కేయూ వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం అధ్యక్షతన 29వ అకడమిక్ సెనేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కామ ర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం సీనియర్ ప్రొఫెసర్ ఎం.సుబ్రమణ్యశర్మ వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.190.07 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.170.42కోట్ల రాబడి వస్తుందని అంచనా వేయడంతో పాటు రూ.190.07కోట్లు ఖర్చు ప్రతిపాదించారు. ప్రస్తుతం రూ.5.64కోట్లు నిలువ ఉండగా.. రూ.14.01కోట్లు లోటు ఉంటుందని వివరించారు. ఆదాయం ఇలా... రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచనల మేరకు కాకతీయ యూనివర్సిటీ బడ్జెట్‌ను ఎనిమిది భాగాలుగా రూపొందించారు. ప్రతీ భాగం కింద ఆదాయ వ్యయాలను చూపారు. ఇందులో నాన్‌ప్లాన్ రెవెన్యూ బడ్జెట్‌గా రూ.190.07 కోట్లు, డెవలప్మెంట్ ఫండ్ ప్లాన్ బడ్జెట్ రూ.10.25కోట్లు,స్పెషల్ ఫండ్స్ బడ్జెట్ రూ. 1.78 కోట్లు, డిపాజిట్లు, అడ్వాన్సుల బడ్జెట్ రూ.5.77 కోట్లు, సెల్ఫ్ సపోర్టింగ్ ప్రోగ్రామ్స్ బడ్జెట్ రూ.7.08 కోట్లు, దూరవిద్య బడ్జెట్ రూ.16.62కోట్లు, వనరుల సమీకరణ బడ్జెట్ రూ.33.36కోట్లు కేటాయించారు. రాష్ర్ట ప్రభుత్వం నుంచి వేతన భత్యాల కింద రూ. 47.88 కోట్లు గ్రాంట్ ఇన్ఎయిడ్గా రానుందని, మిగ తా ఆదాయాన్ని అంతర్గతవనరుల ద్వారా సమీకరిం చనున్నామన్నారు. అయితే బడ్జెట్లో 40శాతం వేతనా లు, పెన్షన్లకు 17శాతం, అభివృద్ధి పనులకు 21 శాతం వెచ్చించనున్నట్లు అంచనా ప్రతిపాదించారు. ఇవీ కేటాయింపులు.. వచ్చే సంవత్సరం యూనివర్సిటీలో చేపటనున్న అభివృద్ధి పనులకు రూ.37.47కోట్లు కేటాయించగా ప్రధానంగా నూతన భవనాల నిర్మాణానికి రూ.18కోట్లు, రూ. 50లక్షలు ఆడిటోరియం కోసం కేటాయించారు. యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలకు రూ.10 కోట్లు, క్రీడావిభాగానికి రూ.1.02కోట్లు, ఎన్ఎస్ఎస్ విభాగానికి రూ. 1.69కోట్లు, ఇంటర్నెట్ సౌకర్యానికి రూ.7లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అలాగే, పరీక్షల నిర్వహణకు రూ.31,51కోట్లు, కేంద్ర గ్రంథాలయానికి రూ.13.35లక్షలు, ఆరోగ్య కేంద్రానికి రూ. 7.80లక్షలు, వెల్ఫేర్ రిక్రియేషనల్ కార్యక్రమాలకు రూ.9.50లక్షలు, స్టూడెంట్ సర్వీసెస్‌కు రూ.10.25లక్షలు, లైబ్రరీకి రూ 3లక్షలు, అవెన్యూ ప్లాంటేషన్, క్యాంపస్ సుందరీకరణ లాన్స్‌కు రూ.17లక్షలు, రోడ్ల కు రూ.30లక్షలు కేటాయించారు. ఇంకా విద్యార్థుల హాస్టల్ సౌకర్యాల అభివృద్ధి, కొత్త హాస్టళ్లలో సౌకర్యాల కల్పనకు రూ.25లక్షలు, హాస్టళ్ల పునరుద్ధరణకు రూ. 25లక్షలు, విద్యార్థినుల మెస్ నిర్మాణానికి రూ.25లక్షలు, న్యాక్ డెవలప్మెంట్కు రూ.50లక్షలు, క్యాంటీన్ నిర్మాణానికి రూ.25లక్షలు కేటాయించారు. యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడాలి వీసీగా తాను యూనివర్సిటీలో పలు కోర్సులు, నూత న కళాశాలల ఏర్పాటుకు కృషి చేశానని వీసీ వెంకటరత్నం తెలిపారు. సెనేట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందున రానున్న రోజుల్లో కేయూ ఇంకా అభివృద్ధి చెందుతుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు సెనేట్ సభ్యులు కూడా కృషి చేయాలని కోరారు. ఈ ఏడాది మే నెలలో యూనివర్సిటీ స్నాతకోత్సవం నిర్వహించాలని భావి స్తున్నట్లు తెలిపారు. అనంతరం సెనేట్ సభ్యులు మాజీ వీసీ విద్యావతి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ఎకనామిక్స్ ప్రొఫెసర్ విజయ, న్యాయవాది కేఎస్ఆర్జీ.ప్రసాద్, బొమ్మ ల కట్టయ్య, ప్రొఫెసర్ దామోదర్ మాట్లాడారు. సమావేశంలో కేయూ రిజి స్ట్రార్ కె.సాయిలు, ఎస్డీఎల్సీఈ డెరైక్టర్ డి.రాజేంద్రప్రసాద్, ఫైనాన్స్ ఆఫీసర్ పీవీ.రమేష్‌కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్లు మామిడాల సుధాకర్, ఎండీ.సలీం అహ్మద్‌తో పాటు ప్రొఫెసర్లు ఎన్.రామస్వామి, జి.భద్రునాయక్, కె.యాదగిరి, కె.రాజిరెడ్డి, టి.శ్రీనివాసులు, రాంనాథ్కిషన్, ఎంఏ.సింగరాయచార్య, టి.రవీందర్‌రెడ్డి, ఎంవీ.రంగారావు, టి.యాదగిరిరావు, దిగంబర్‌రావు, కె.సీతారామారావు, డాక్టర్ బి.సురేష్‌లాల్, డాక్టర్ మోయిజ్ అహ్మద్, డాక్టర్ సుమతి ఉమామహేశ్వరి, రఘురామారావు, డాక్టర్ వై.నర్సింహారెడ్డి, ఎం. గౌరీశంకర్, డి.రఘుపతి, ఇ.సురేష్‌బాబు, ఆర్.వెంకటేశ్వర్లు, నేతాజీ పాల్గొన్నారు. -
తెలంగాణ పునర్నిర్మాణానికి పాటుపడాలి
{పజల్లో చైతన్యం కల్పించిన ఉద్యమం విద్యార్థుల పాత్ర గొప్పది టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్క రూ పాటుపడాలని టీజేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. కాకతీయ యూనివర్సిటీ రీసె ర్చ్ స్కాలర్స్ అసోసియేషన్(కుర్సా) ఆధ్వర్యం లో శనివారం ‘తెలంగాణ రాష్ట్రం సమస్యలు- సవాళ్లు, విశ్వవిద్యాలయాల పాత్ర’ అంశంపై క్యాంపస్‌లోని సెనేట్హాల్లో సదస్సు నిర్వ హించారు. సదస్సుకు కోదండరాం ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. ఉద్యమా లు, సమ్మెలతోనే కాకుండా ఎంతోమంది విద్యార్థుల ఆత్మ బలి దానాలతో నేడు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందన్నారు. ఇదే స్ఫూర్తితో యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. నాడు రాజ్యాంగం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణను విలీనం చేసిన సమయంలో చేసుకున్న పెద్ద మనుషుల ఒప్పందాలకు తూట్లు పొడిచి ఇష్టారాజ్యంగా వనరుల దోపిడీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఆ విధంగా ఇంతకాలం నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, భూమిని కొల్లగొట్టారని చెప్పారు. ప్రస్తుతం మాత్రం తెలంగాణ ఉద్యమం ఇక్కడి ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని కలిగించిందన్నారు. ప్రజలు సంఘటితమై ఉద్యమించగా ఏర్పడుతున్న తెలంగాణలో అభివృద్ధి ఫలాలు సామాన్యుల కు సైతం అందేలా పునర్నిర్మాణం జరగాల్సి ఉందని ఆయన వివరించారు. తెలంగాణ విలేజీ డెవలప్మెంట్ కమిటీలను కూడా ఏర్పా టు చేసుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని, విద్యార్థులు కూడా తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోదండరాం సూచించారు. పల్లెల విధ్వంసం జరిగింది.. సీమాంధ్రుల పాలనలో పల్లెల విధ్వంసం జరగగా, చెరువులు కబ్జాకు గురయ్యాయని రాజ కీయ విశ్లేషకులు వి.ప్రకాష్ అన్నారు. చెరువు ల్లో పూడికతీత తీయకపోవడం మూలంగా సాగు విస్తీర్ణం తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు అందరికీ లాభం జరిగేలా తెలంగాణ పునర్నిర్మాణం జరగాలం టే బలమైన ప్రభుత్వం రావాల్సిన అవసరముందని చెప్పారు. అంబేద్కర్ వర్సిటీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన క్రమంలో అన్ని పార్టీల నాయకులు పునర్నిర్మాణాన్ని ఎన్నికల ప్రణాళికల్లో చేరుస్తూ కొత్త నాటకానికి తెరలేపాయని ఆయ న ఆరోపించారు. తెలంగాణ పునర్నిర్మాణం, నవ తెలంగాణ అని కాకుండా తెలంగాణ భవిష్యత్ నిర్మాణమంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటు కాకముం దే టీఆర్ఎస్ అధినేత పునర్నిర్మాణమంటూ కొన్ని తాయిలాలు ప్రకటించారని, ఏనాడు ఉద్యమంలో పాల్గొనని పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు బంగారు తెలంగాణ అంటున్నారని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తెలంగాణలో బీసీలకు సారథ్యం అనగానే ఆర్.కృష్ణయ్య కూడా తెరపైకి వస్తున్నారని ఆయన విమర్శిం చారు. తెలంగాణపై.. పై నాయకుల్లో ఎవరికి ప్రేమ, చిత్తశుద్ధి లేవని.. ఏ ప్రభుత్వం ఏర్పడినా తెలంగాణ పునర్నిర్మాణం సక్రమంగా సాగుతుందా, లేదా అనేది అనుమానమేనన్నా రు. దీన్ని దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమం మాదిరిగానే ఇప్పుడు కూడా ముఖ్య పాత్ర పోషించాలని సూచిం చారు. అనంతరం ఓయూ ప్రొఫెసర్ డాక్టర్ సి.కాశీం, కేయూ ప్రొఫెసర్లు కె.సీతారాంనాయ క్, పి.సాంబయ్య, తెలంగాణ విద్యావంతుల వేదిక బాధ్యులు ప్రొఫెసర్ కె.సీతారామారావు, ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు వలీఉల్లాఖాద్రీ, కేయూ జేఏసీ నాయకులు సాదు రాజేష్, కె.వాసుదేవరెడ్డి, ఫిరోజ్‌పాషా, కుర్సా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా శ్రీనివాస్, మహ్మద్ సర్దార్తో పాటు కొంగర జగన్ మా ట్లాడారు. సదస్సులో ప్రొఫెసర్ సీహెచ్.దినేష్‌కుమార్, న్యాయవాది రాజేంద్రప్రసాద్, కేయూ అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఈసం నారాయణ, డాక్టర్ సైదిరెడ్డి, అధ్యాపకు లు, పరిశోధకులు పాల్గొన్నారు. -
డిగ్రీ ‘పరీక్ష’లు ఆరంభం
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ వార్షిక పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ పురుషుల, మహిళా డిగ్రీ కళాశాలల్లో సౌకర్యాలు లేక విద్యార్థులు నానా తంటాలు పడ్డారు. మహిళ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు తరగతి గదిలో కూర్చొని చదువుకునే విధంగా ఒకే బెంచీపై ముగ్గురు విద్యార్థులు, విరిగిన కూర్చీలపై పరీక్ష రాశారు. చీకటి గదిలో కూర్చోబెట్టడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. పురుషుల కళాశాలలో కూడా ఇనుప కూర్చీల్లోనే కూర్చొబెట్టి పరీక్ష రాయించారు. ఏడాది పాటు కష్టపడి చదివిన పరీక్ష ప్రశాంతంగా రాసెందుకు కూడా సౌకర్యా లు కల్పించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రోజు మొ దటి, తృతీయ సంవత్సరం విద్యార్థులు పరీక్ష రాశారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 1వరకు జరుగుతాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా 74 మంది డిబా ర్ అయ్యారు. ఇందులో కడెంలో 30, ఖానాపూర్‌లో 25, మంచిర్యాలలో 20 మంది ఉన్నారు. కడెం మండలంలోని ఏఆర్ఎస్ కళాశాలలో ఎల్ఎంఆర్ డిగ్రీ క ళాశాలకు చెందిన 450 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. కాకతీయ యూనివర్సిటీ వరంగల్ కు చెందిన ముగ్గురు ప్రొఫెసర్ల బృందం స్క్వాడ్లుగా వచ్చారు. మాస్ కాపీయిండ్కు పాల్పడుతున్న 130 మంది పరీక్ష కేంద్రం నుంచి వెళ్లగొట్టారు. సకాలంలో చేరని జవాబు పత్రాలు మంచిర్యాల సిటీ : కాకతీయ యునివర్సిటీ డిగ్రీ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉదయం తృతీయ సంవత్సరం పరీక్షకు హాజరైన విద్యార్థుల జవాబు పత్రములు సాయంత్రం వరకు కూడా మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నోడల్ కేంద్రానికి చేరుకోలేదు. దీంతో యూనివర్సిటీ అధికారుల ఆదేశాలను పలువురు పరీక్ష కేంద్రం నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు తలెత్తుతున్నా యి. సాయంత్రం 7 గంటల వరకు కూడా పలు ప్రైవేటు పరీక్ష కేంద్రం వారు జవాబు పత్రములు పంపలేదని నోడల్ కేంద్రం వారు తెలిపారు. ఈ విషయమై నోడల్ కేంద్రం పరీక్ష విభాగం ఇన్చార్జి గోపాల్ మాట్లాడుతూ కెటాయించిన సమయం ప్రకారం జవాబు పత్రములు రాకుంటే ఉపేక్షించేది లేదన్నారు. -
విజయీభవ!
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ వార్షిక పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 41 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రథమ, తృతీయ సంవత్సరం విద్యార్థులకు మంగళవారం నుంచి.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 5 నుంచి పరీక్షలు జరుగుతాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు.. తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. మరుసటి రోజు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులు 65,589 డిగ్రీ పరీక్షలకు 65,589 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో బీఏ విద్యార్థులు 13,106 మంది, బీకాం 18,651, బీఎస్సీ (బీజెడ్సీ) 18,575, ఎంపీసీ 15,255, బీఎస్సీ ఒకేషనల్ కోర్సు విద్యార్థులు ఇద్దరు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు సోమవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరుగుతాయి. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా కేంద్రాల్లో అబ్జర్వర్లను, ఫ్లయింగ్ స్క్వాడ్లను, యూనివర్సిటీ ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించినట్లు కాకతీయ యూనివ ర్సీటీ పరీక్షల విభాగం కంట్రోలర్, అదనపు కంట్రోలర్లు రంగారావు, వెంకట్రామిరెడ్డిలు తెలిపారు. -
అణగదొక్కాలని చూస్తే ఊరుకోం
ఎల్‌హెచ్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్యనాయక్ వీరయ్య, సీతక్క పద్ధతి మార్చుకోకుంటే ఓడిస్తాం గోవిందరావుపేట, న్యూస్‌లైన్ : జాతిని అభివృ ద్ధి చేసుకోవడం ఎవరికైనా బాధ్యతే.. అలా అని ఇతరులను అణగదొక్కాలను కోవడం మూర్ఖత్వం అవుతుంది.. గిరిజనులను అణగదొక్కాల ని చూస్తే ఊరుకునేది లేదని లంబాడీ హక్కుల పోరాట సమితి(ఎల్‌హెచ్‌పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్యనాయక్ అన్నా రు. ఎల్‌హెచ్‌పీఎస్ మండల అధ్యక్షుడు రసపూత్ సీతారాం నాయక్ అధ్యక్షతన ‘తెలంగాణ పునర్నిర్మాణం-గిరిజనుల డిమాండ్లు’ అనే అంశంపై శనివారం స్థానికంగా నిర్వహించిన గిరిజన గర్జన సభలో ఆయన మాట్లాడారు. అన్నింటినీ లంబాడీ లు తినేస్తున్నారనేది కేవలం అపోహ మాత్రమేనని, గిరిజనుల హక్కులతోపాటు గిరిజనేతరు ల హక్కులను కూడా కాపాడాలన్నారు. కోయల అభివృద్ధి జరగాలని తాము కూడా కోరుకుం టున్నామని, అందుకోసం మిగతా తెగలను తొక్కేయాలన్న భావన సరికాదన్నారు. పొదెం వీరయ్య ఎమ్మెల్యేగా ఉండగా ఇద్దరు లంబాడీ సర్పంచ్‌లను కొట్టాడని, దాంతో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసి ఓటమికి కృషి చేశామని చెప్పారు. ప్రస్తుత ఎమ్మెల్యే సీతక్క సైతం తమ జాతిని అణగదొక్కే విధానాలను అవలంభిస్తోం దని ఆరోపించారు. వీరిద్దరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాతే ఆదివాసీలు, లంబాడీల మధ్య వివాదాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పద్ధతి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవనివ్వమని హెచ్చరించారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించే లంబాడీల రాజ్యాధికార సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్ మాట్లాడుతూ రాజ్యాంగం తెలిసిన మూర్ఖులు సీమాంధ్ర ప్రజాప్రతినిధులని ధ్వజమెత్తారు. తెలంగాణకు సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని, 100 శాతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని చెప్పారు. తెలంగాణ పోరాటంలో 70 మంది గిరిజనులు ప్రాణాలు వదిలారని, అయితే కొంతమంది గిరిజనులు, ఆదివాసీలను విడదీసే కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం లంబాడీలకు ఉపాధి కల్పించకుండా చిన్న తప్పుచేసినా వారిపై కేసులు పెట్టి, కోర్టుల చుట్టూ తిరిగేలా చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తండాలలో గుడుంబా తయారీని ఆపి అభివృద్ధివైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ట్రైబల్ జాక్ గౌరవ అధ్యక్షుడు కొర్ర రఘురాంనాయక్, కన్వీనర్ జైసింగ్ రాథోడ్, కేయూ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బానోతు సురేష్‌లాల్, వివిధ పార్టీలలోని నియోజకవర్గ, రాష్ట్ర నాయకులు అజ్మీరా చందూలాల్, పోరిక గోవింద్‌నాయక్, అజ్మీరా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. సభలో లంబాడా గిరిజన చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. -
ఉరకలెత్తిన ఉత్సాహం
నర్సంపేట, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవాసంస్థ విభాగం ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని సిద్ధార్థ డి గ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో జిల్లాస్థాయి యువజనోత్సవం వైభవంగా ప్రారంభమైంది. విద్యార్థుల కేరింతలతో ప్రాంగణం మార్మోగింది. ఆటపాటలతో విద్యార్థులు ఉర్రూతలూగించారు. కేయూ ఎన్ఎస్ఎస్ విభాగాధిపతి, ప్రొఫెసర్ సురేష్‌లాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపాల్ గోగుల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కందిగోపాల్రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ సురేష్‌లాల్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో సేవాదృక్పథాన్ని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. సృజనాత్మకశక్తి వెలుగులోకి వస్తుందన్నారు. ఇనుములాంటి సమాజంలోని విద్యార్థులను ఎన్ఎస్ఎస్ అయస్కాంతంలా ఆకర్షిస్తోందన్నారు. దేశంలోని 250కిపైగా యూనివర్సిటీల నుంచి 3.75కోట్లమంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు గ్రామాల పునర్నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారన్నారు. కష్టపడితేనే ఉన్నతస్థానం కష్టపడి చదివితే భవిష్యత్‌లో ఉన్నతస్థానాలు అలంకరించవచ్చని రూరల్ ఎస్పీ కాళిదాసు వెంకటరంగారావు అన్నారు. యువజనోత్సవం ముగింపు సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ 1983లో రెండు సంవత్సరాలు తాను కూడా ఎన్ఎస్ఎస్ వలంటీర్‌గా పనిచేసినట్టు చెప్పారు. ఇంటర్లో 20 కిలోమీటర్లు, డిగ్రీలో ఆరు కిలోమీటర్లు సైకిల్‌పై ప్రయాణం చేసి చదువుకున్నానన్నారు. విద్యార్థులు దేశానికి వెన్నెముకలాంటి వారని, దేశ భవిష్యత్ వారి చేతుల్లోనే ఉందన్నారు. పోలీసుల ఆధ్వర్యంలో ప్రబోధ్ పేరుతో ఒక వుహత్తర కార్యక్రవూన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహువుతుల ప్రదానం చేశారు. కార్యక్రవుంలో కళాశాల డెరైక్టర్ గోగులసృజనప్రభాకర్రెడ్డి, ప్రిన్సిపాల్ వీరవుళ్ల వూధవరెడ్డి, కూతురు వీరారెడ్డి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. -
అది ప్రభుత్వ స్థలమే
=కబ్జాకు గురైందని గతంలో పోలీసు శాఖ నివేదిక =హద్దు రాళ్లు పాతిన రెవెన్యూ శాఖ =అవేమీ పట్టని పోలీసు అధికారి =కేయూ భూవివాదంలో మరో మలుపు సాక్షి, హన్మకొండ :జిల్లాలో కలకలం రేపిన కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ భూవివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ స్థలం తనదేనంటూ ఓ అధికారి ప్రయత్నం... కబ్జా చేస్తున్నాడంటూ కేయూ సిబ్బం ది, విద్యార్థుల ప్రతిఘటన.. వెరసి ఈ అంశం గడిచిన రెండు రోజులుగా హాట్‌టాపిక్‌గా మారింది. కాగా తాజాగా వివాదానికి కారణమైన సర్వే నంబ రు 413-1లో ఉన్న భూమి ప్రభుత్వానిదేనని, దాన్ని కొందరు వ్యక్తులు నకిలీ ధ్రువపత్రాలతో కబ్జా చేశారంటూ 2013 మార్చిలో పోలీసు శాఖ స్వయంగా నివేదిక ఇవ్వడం గమనార్హం. ఇప్పుడు అదే స్థలం నాదంటూ మరో పోలీసు యత్నించడం అందరిని విస్మయానికి గురిచేస్తోంది. శేత్వార్ 1955 ప్రకారం.. ప్రస్తుతం వివాస్పదంగా మారిన హన్మకొండ మండలం పలివేల్పుల గ్రామ పరిధిలోని సర్వే నంబరు 413, 414లలో ఉన్న భూమి రెవెన్యూ రికార్డు శేత్వార్ 1955 ప్రకారం ఇది పూర్తిగా ప్రభుత్వ భూమి. అయితే 1975లో కాకతీయ యూనివర్సిటీ(అప్పట్లో పీజీ సెంటర్)కి ఆ తర్వాత ఎస్సారెస్పీ కెనాల్లకు ప్రభుత్వం ఈ భూమిని వివిధ సర్వే నంబర్లుతో కేటాయించింది. అందులో భాగంగా 413-1లో 3.07 ఎకరాల భూమిని కాకతీయ యూనివర్సిటీకి సర్వే నంబరు 413-2లో ఉన్న 0.02 ఎకరాల భూమిని కాకతీయ కెనాల్‌కి కేటాయించింది. దీని పక్కనే ఉన్న సర్వే నంబరు 414లో 28 గుంటల భూమిని ఎస్సారెస్పీకి ఇచ్చారు. మరో ఇరవై గుంటల భూమిని రోడ్డుకు కేటాయించారు. అలాగే సర్వేనంబరు 4142లో ఉన్న ఎకరం భూమిని కాకతీయ కెనాల్, పంపింగ్ హౌజ్‌కి కేటాయించింది. ఖాళీగా ఉన్న స్థలం ప్రభుత్వం కేటాయించిన భూముల్లో కాకతీయ కెనాల్, పంపింగ్ హౌస్, రోడ్డుల నిర్మాణం జరిగింది. కానీ కాకతీయ పీజీ సెంటర్‌కి సంబంధించిన భవనం నిర్మించలేదు. ఇప్పటికీ సుబేదారిలో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలోనే కొనసాగుతోంది. ఆ తర్వాత పలివేల్పుల మాజీ సర్పంచ్ దేవరకొండ అనిల్ 413 సర్వే నంబర్లో ఉన్న మూడు ఎకరాల ఏడుగుంటల ఖాళీ భూమిలో 968 చదరపు అడుగుల స్థలాన్ని 414 సర్వే నంబర్లో ఉన్నట్లు 2009లో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించాడు. ఇదే భూమిని ఆ నకిలీ పత్రాలపై 2010, 2011లో వేరే వ్యక్తులకు అమ్మేశాడు. అనిల్ నుంచి భూమిని కొన్న వ్యక్తులు అక్కడ నిర్మాణాలకు ఏర్పాట్లు మొదలు పెట్టారు. పీజీ సెంటర్‌కు కేటాయించిన భూమి కబ్జాకు గురవుతుండడాన్ని గమనించిన కేయూ సిబ్బంది, విద్యార్థులు దీనిపై కేయూ పోలీస్‌స్టేషన్ 2012లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరిపి సర్వే నంబరు 413-1లో ఉన్న 3.07 ఎకరాల ప్రభుత్వ భూమిని నకిలీ ధ్రువపత్రాలతో కబ్జా చేసేందుకు యత్నించారని ఎస్పీకి నివేదిక సమర్పించారు. అనంతరం 2013లో ఫిబ్రవరి 2న విద్యార్థి సంఘాలు, కేయూ సిబ్బంది, రెవెన్యూ అధికారుల సమక్షంలో తిరిగి కొలతలు చేపట్టి హద్దురాళ్లను పాతారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మరోసారి వివాదంలోకి తాజాగా 2014 జనవరి 1న సీఐ జానీ నర్సిం హులు 414 సర్వే నంబరులో ఉన్న 968 గజాల స్థలం తనేదేనని అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు తన దగ్గర ఉన్నాయంటూ 413 సర్వే నం బరులో నిర్మాణానికి ఉపక్రమించడంతో మరోసా రి వివాదం చెలరేగింది. ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందంటూ పోలీసు శాఖ నివేదిక ఇచ్చిన భూమిలోకే మరో పోలీసు అధికారి నిర్మాణానికి యత్నిం చడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. -
నేనేరా పోలీస్..
=భూకబ్జాలు.. సెటిల్మెంట్లు =కొట్టుకోవడం..తిట్టుకోవడం నిత్యకృత్యం =బజారునపడిన పోలీస్ శాఖ పరువు =ఉలుకు..పలుకు లేని ఉన్నతాధికారులు సాక్షిప్రతినిధి, వరంగల్ : క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన ఖాకీలు కట్టుతప్పుతున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో కీలకమైన పోలీసు శాఖలో కొందరి ప్రవర్తన విమర్శలకు తావి స్తోంది. ఖాకీలే పరస్పరం కొట్టుకోవడం.. తిట్టుకోవడం చేస్తుండడంతో మొత్తం పోలీసు శాఖ అభాసుపాలవుతోంది. సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకుని సెటిల్మెంట్లు చేస్తూ విమర్శలపాలవుతున్న పోలీసులు ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేశారు. తగాదాల్లో ఒకరి తరఫున మాట్లాడడం ఎందుకనుకుంటున్నారో ఏమోగానీ... పంచాయతీ పెట్టుకున్న ఇద్దరినీ పక్కకు తప్పిస్తూ తమకే అంతా అంటున్నారు. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు కూత వేటు దూరంలో కాకతీయ విశ్వ విద్యాలయం పరిధిలోని స్థలాన్ని ఇన్స్పెక్టర్ ఆక్రమిస్తున్నారని వర్సిటీ అధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసు శాఖ పరువు పూర్తిగా పోరుుంది. భూ కబ్జా ఆరోపణల్లో ఉన్న ఇన్స్పెక్టర్, ఫిర్యాదుపై స్పందించి సంఘటన స్థలానికి వెళ్లిన మరో ఇన్స్పెక్టర్ మధ్య జరిగిన వాగ్వాదం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇద్దరు వ్యక్తులు భూమి విషయంలో గొడపడితే... పోలీసులకు పండగే. సెటిల్మెంట్ పేరిట దందా సాగిస్తున్నారు. ఉన్నతస్థాయి అధికారుల ఉదాసీనతతోనే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఆరోపణలు వచ్చిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోకపోతే కాకతీయ వర్సిటీ వంటి సంఘటనలు పెరుగుతూనే ఉంటాయి. కాకతీయ విశ్వవిద్యాలయానికి చెందిన భూములను వేరే వ్యక్తి దగ్గర తాను కొనుగోలు చేశానని చెబుతూ సీఐ జానీ నర్సింహలు మంగళవారం చదును చేయించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ విషయం తెలిసిన విశ్వవిద్యాలయం అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సీఐ దేవేందర్‌రెడ్డి అక్కడికి వచ్చారు. దీంతో అక్కడ ఇద్దరు సీఐల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇలా ఇద్దరు సీఐలు గొడవకు దిగడంపై విమర్శలు వస్తున్నాయి. ఇంత జరిగినా గొడవ పడిన వారిపై ఉన్నతాధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడం పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చుతోంది. డీఐజీ ఎం.కాంతారావు, అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు పర్వతగిరి పోలీస్ స్టేషన్ తనిఖీకి వెళ్లినప్పుడు.. పోలీసులకు కేటాయించిన నివాస గృహాల్లో సిబ్బంది నివాసం ఉండకపోవడం అంశంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. చివరికి ఈ అంశం రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి వరకు వెళ్లింది. డీఐజీపై అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. మామూనూరు పోలీసు విభాగంలో వింత పరిస్థితి నెలకొంది. అక్కడి డీఎస్పీ సురేశ్‌కు, సీఐ రణధీర్‌కు అస్సలు పొసగడం లేదు. వీరి మధ్య విబేధాలతో అక్కడి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే వారిలోని రెండు వర్గాలు చెరొక అధికారిని సంప్రదిస్తుండడంతో పిటిషన్లు ఎటూ తెగడం లేదు. ఇవన్నీ తెలిసినా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఉదయభాస్కర్ అనే ఆర్ఎస్సై వేధింపులను తట్టుకోలేక స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. జనగామలో ఇసుక లారీలను పట్టుకున్న సందర్భంలో మామూళ్లలో వాటా కోసం ఇద్దరు కానిస్టేబుళ్లు గొడవపడి తీవ్రస్థాయిలో తిట్టుకున్నారు. ఏటూరునాగారం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ స్టేషన్‌లోని తుపాకీతో కాల్చుకుని చనిపోయారు. ఎస్సై వెంకటేశ్వర్లు వేధింపుల కారణంగానే చనిపోయాడని కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణాలు ఏమిటనేది అధికారులు వెల్లడించలేదు. ఇది జరిగిన మర్నాడే కాజీపేటలో.. సెలవు ఇవ్వకపోవడంతో ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. కారణాలు ఏమైనా ఈ సంఘటనలు కింది స్థాయి పోలీసు సిబ్బంది స్థైర్యం బాగా దెబ్బతీశారుు. ఈ విషయంలోనూ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించ లేదు. జిల్లా కేంద్ర కారాగారంలో ఇద్దరు హోంగార్డులకు సంబంధం లేని విధులు అప్పగించారు. తన మాట వినడం లేదనే కారణంతో జిల్లా జైలు సూపరింటెండెంట్ వీరిద్దరినీ సెల్లో నిర్బంధించారు. సొమ్మసిల్లినా వినకుండా క్రమశిక్షణ పేరుతో పరుగెత్తించారు. దీనిపై బాధితులు పోలీస్ బాస్‌కు ఫిర్యాదు చేశారు. ఇదిలావుంటే.. గత శనివారం అధికారుల సమక్షంలో ఓ ఉన్నతాధికారి తన సిబ్బందిపై చేయి చేసుకున్నారు. -
‘ఖాకీ’ కబ్జాలో కేయూ భూమి
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని ఓ ఖాకీ కబ్జా చేశాడు. సుమారు వేయి గజాల భూమి తనదేనంటూ మంగళవారం చదును చేసే కార్యక్రమం చేపట్టాడు. కేయూ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని భూమి యూనివర్సిటీదేనని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా.. సదరు సీఐ వారి మాటను బేఖాతరు చేయడమేగాక స్థానిక సీఐని అవమానించాడు. దీనికి సంబంధించినవివరాలు ఇలా ఉన్నాయి. పలివేల్పుల శివారులోని సర్వే నంబర్ 413లో కేయూకు సంబంధించిన భూమి ఉంది. అయితే ఆ భూమిని కొందరు వ్యక్తు లు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు.దీంతో కేయూసీ అధికారులు ఇటీవల ల్యాండ్ సర్వే అధికారులతో కొలతలు వేయించి హద్దులు నిర్ధారించారు. భూమి కబ్జాకు గురి కాకుండా ఉండేందుకు ప్రహారీ నిర్మాణ పను లు చేపట్టడానికి ఉపక్రమించారు. విషయం తెలుసుకున్న నగర పరిధిలోని ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న ఓ సీఐ అక్కడికి చేరుకుని యంత్రాలతో భూమి చదును చేసే కార్యక్ర మం చేపట్టాడు. అందులో వేయి గజాల భూ మి కొనుగోలు చేసినట్లు కేయూ అధికారులకు తెలిపాడు. సర్వే చేసిన రికార్డు తమ వద్ద ఉం దంటూ కేయూ అధికారులు ఎంత చెప్పినా ఆయన వినలేదు. డబ్బులు ఇచ్చి భూమి కొనుగోలు చేశా.. ఇది ఆక్రమించింది కాదంటూ ఎదురుతిరిగాడు. దీంతో పరిస్థితి ఉద్రి క్తంగా మారింది. సద రు సీఐ, అధికారుల మధ్య మా టమాట పెరిగింది. సమాచా రం అందుకున్న రిజిస్ట్రార్ సాయిలు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే సీఐపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న కేయూ సీఐ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేయూ సీఐపై మండిపాటు.. ఇది కేయూకు చెందిన భూమేనని సీఐ దేవేందర్‌రెడ్డి చెప్పినందుకు భూమి అక్రమించుకున్న సీఐ ఆయనతో వాగ్వాదానికి దిగారు. సివిల్ తగదాలో పోలీసుల జోక్యం ఏమిటం టూ ఎదురు ప్రశ్నించారు. ఓ సీఐగా ఉండి.. తోటి సీఐకి సహకరించవా.. అంటూ మండిపడ్డాడు. అంతేగాక కేయూ సీఐని అవమానకరమైన పదజాలంతో దూషించాడు. నీ వద్ద ఏమైనా డాక్యుమెంట్లు ఉంటే చూపించమని కోరినా సదరు సీఐ చూపించలేదు. చివరికి సీఐ దేవేందర్‌రెడ్డి అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం కేయూ భూమిని ఆక్రమించుకోవడమేగాక తనను అవమానించాడని సీఐ దేవేందర్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. -
27 నుంచి సెంట్రల్ జోన్ క్రికెట్ పోటీలు
వరంగల్‌స్పోర్ట్స్, న్యూస్‌లైన్: కాకతీయ యూనివర్సిటీలో ఈనెల 27 నుంచి సెంట్రల్‌జోన్ పురుషుల క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కేయూ రిజిస్ట్రార్ సాయిలు వెల్లడించారు. మంగళవారం కేయూలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ దిగంబరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే సెంట్రల్‌జోన్ పురుషుల కబడ్డీ, పురుషుల, మహిళల హ్యాండ్‌బాల్ పోటీలను విజయవంతంగా నిర్వహించామని అన్నా రు. ఈనెల 27 నుంచి జనవరి 3వ తేదీ వరకు సెంట్రల్‌జోన్ పురుషుల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీలకు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, యూపీ, మధ్యప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలోని జట్లు వస్తున్నాయన్నారు. 43 జట్లు వస్తుండగా 688 మంది క్రీడాకారులు పాల్గొంటారని, 86 మంది అఫీషియల్స్ హాజరవుతారని చెప్పారు. క్రీడలు నిర్వహించేందుకు తొమ్మిది క్రీడా మైదానాలను సిద్ధం చేశామన్నారు. ఈ క్రీడల నిర్వహణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి 50 మంది టెక్నికల్ అఫీషియల్స్ వస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ జోన్లో విజయం సాధించిన జట్లతో పాటు క్వాలీఫై అయిన జట్లు జనవరి 30 నుంచి ఉత్తరాఖండ్‌లో జరిగే ఆలిండియా యూనివర్సిటీ పోటీల్లో పాల్గొంటాయన్నారు. జనవరి 8 నుంచి మహిళా క్రికెట్ పోటీలు కేయూలో జనవరి 8 నుంచి 13వ తేదీ వరకు సెంట్రల్‌జోన్ మహిళా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ ప్రొఫెసర్ దిగంబరరావు తెలిపారు. ఈ పోటీలకు సెంట్రల్‌జోన్ పరిధిలోని యూనివర్సిటీల నుం చి 23 జట్లు వస్తున్నాయన్నారు. మహిళల పోటీ ల్లో విజయం సాధించిన జట్లు జనవరి 24 నుం చి ఫిబ్రవరి 1 వరకు యూపీలోని పూర్వంచల్ జరిగే ఆలిండియా యూనివర్సిటీ పోటీల్లో పా ల్గొంటాయన్నారు. క్రీడల నిర్వహణలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకునేందు కు పలు కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించామన్నారు. క్రీడాకారులకు, అఫీషియల్స్‌కు యూనివర్సిటీలో వసతి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్లు దిగంబరరావు తెలిపారు. -
ఉత్సవాల వెలుగులు..
=పర్యాటకరంగానికి ఊపునిచ్చిన వేడుకలు =ఎల్లలు దాటిన పేరిణి నృత్యం =కాకతీయుల చరిత్రపై 20 పుస్తకాలు =ఓరుగల్లుకు ప్రపంచవ్యాప్త గుర్తింపు సాక్షి, హన్మకొండ: ప్రభుత్వం, ప్రజల సహకారంతో ఏడాదిపాటు జరి గిన కాకతీయ ఉత్సవాలు పది కాలాల పాటు గుర్తుండే తీపి జ్ఞాపకాలను జిల్లా ప్రజలకు పంచింది. వందల ఏళ్లుగా గు ర్తింపుకు నోచుకోని కాకతీయ కళా రూపాలను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు అవసరమైన ప్రాథమిక చర్యలకు పునాది వేసింది. అంతేకాదు... ఇక్కడి పర్యాటక రంగానికి ఊతమిచ్చే పలు అభివృద్ధి కార్యక్రమాలను పెండింగ్ జాబితా నుంచి తొలగించి నిర్మాణ పట్టాలపైకి మళ్లించింది. కలెక్టర్ కృషితో కొత్త కళ కాకతీయ ఉత్సవాలను ప్రారంభించిన తర్వాత కాకతీయ ఔన్నత్యాన్ని నలుదిశలా చాటేందుకు స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, ప్రజలు ముందుకు వచ్చారు. వీరి భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా కలెక్టర్‌గా జి.కిషన్ బాధ్యతలు చే పట్టాక కాకతీయ వేడుకలు జనరంజకంగా మారాయి. నిధుల కొరత వెంటాడుతున్నా... ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసి నిధులు వచ్చేలా చూశారు. ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే పక్కా ప్రణాళిక రూపొందించారు. వివిధ శాఖలను సమన్వయం చేస్తూ... వరుసగా నాలుగు నెలలపాటు అన్ని కార్యక్రమాలను విజయవంతమయ్యేలా చూసి సలీకృతుడయ్యూరు. దేశవ్యాప్త గుర్తింపు ఉత్సవాల సందర్భంగా కాకతీయ హెరిటేజ్ ట్రస్టు, ఇన్టాక్ సంస్థలు సంయుక్తంగా పలు కార్యక్రమాలు చేపట్టాయి. వా టి ఆధ్వర్యంలో పేరిణి నృత్యంపై కాకతీయుల సేనాని జ యూపసేనాని సంస్కృతంలో రచించిన నృత్యరత్నావళి గ్రంథాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పుస్తకం ప్రపంచ భాషలోకి అనువదించడం వల్ల వీరరసం ప్రధానంగా సాగే అరుదైన పేరిణి నృత్యం విశిష్టతను మన రాష్ట్ర ఎల్లలు దా టించి అన్ని ప్రాంతాల వారికి అందుబాటులోకి తెచ్చినట్లైం ది. అదేవిధంగా విదేశాల నుంచి మనదేశంలో పర్యటించే వారికి కాకతీయ కట్టడాల సొబగులు, నిర్మాణ కౌశలం, శిల్పకళల సౌందర్యాన్ని తెలిపేలా... ప్రపంచ పర్యాటకులకు వ రంగల్ పంపిన ఆహ్వాన పత్రికలా కాకతీయ డైనస్టీ పేరుతో కాఫీ టేబుల్ బుక్‌ని ముద్రించారు. వీటితో పాటు పలువురు రచయితలు 20కి పైగా పుస్తకాలను రచించారు. అంతేకాకుం డా... ఇంజినీరింగ్ ప్రతిభకు తార్కాణాలుగా నిలిచిన నీటి లో తేలియాడే ఇటుకలు, సాండ్‌బాక్స్ టెక్నాలజీ, గొలుసుక ట్టు చెరువులపై న్యూఢిల్లీ, హైదరాబాద్‌లో సదస్సులు నిర్వహించడంతో నాటి కాకతీయుల గొప్పదనాన్ని చాటారు. స్పీడ్ పెంచిన పర్యాటకశాఖ తెలంగాణలో హైదరాబాద్‌ని మినహాయిస్తే లక్నవరం, రా మప్ప, ఖిలావరంగల్, వేయిస్తంభాల గుడి, పాకాల వంటి ప్రకృతి, చారిత్రక పర్యాటక ప్రాంతాలకు జిల్లా నెలవుగా ఉం ది. కానీ... ఇక్కడికి వచ్చే పర్యాటకులు బస చేసేందుకు చక్క ని హోటల్ లేదు. ఉత్సవాల సందర్భంగా వచ్చిన ఊపుతో అప్పటివరకు నెమ్మదిగా సాగుతున్న పలు పనులు వేగం పుంజుకున్నాయి. హన్మకొండలో హరిత కాకతీయ హోటల్ అందుబాటులోకి రావడమే కాదు... ఈ ఏడు ఉత్తమ హోటల్‌గా పర్యాటక శాఖ అవార్డును గెలుచుకుంది. రూ. 5 కోట్లతో ఖిలావరంగల్‌లో సౌండ్ అండ్ లైట్షో ఏర్పాటు చేశారు. గణపురం కోటగుళ్లలో రూ.65 లక్షల వ్యయంతో పర్యాటకులకు వసతి సౌకర్యం, లక్నవరంలో లేక్కాటేజీలు అందుబాటులోకి వచ్చాయి. కాకతీయ ఫెస్టివల్ గుర్తుగా కాజీపేట వడ్డేపల్లి చెరువుపై పైలాన్ నిర్మాణం, కాకతీయుల విశిష్టతను తెలిపే సావనీర్‌ను ఆవిష్కరించారు. జాకారం శివాలయం అభివృద్ధికి రూ.22 లక్షలు విడుదల అయ్యాయి. -
కేయూ డిగ్రీ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
=22.06 శాతం ఉత్తీర్ణత నమోదు =ఫైనల్ ఇయర్లో 14.19 శాతం ఉత్తీర్ణత కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సప్లిమెం టరీ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. యూనివర్సిటీ పరిధిలోని వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని ఎక్స్ విద్యార్థులకు ఈ ఏడాది అక్టోబర్ 1నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. కాగా, బీఏ, బీబీఎం, బీకాం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, చివరి సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఈ పరీక్ష ఫ లితాలను వీసీ ప్రొఫెసర్ బి.వెంకటరత్నం, రిజి స్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు విడుదల చేశారు. 98,196మందికి 21,665 మంది ఉత్తీర్ణత కేయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 98,196మంది విద్యార్థులు హాజరుకాగా, 21,665మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో వి ద్యార్థులు 11,744 మంది ఉండగా, విద్యార్థినులు 9,921మంది ఉన్నారు. కాగా, ఇందులో ఫైనల్ ఇయర్ విద్యార్థులు మాత్రం 14.19 శాతమే ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను కే యూ వెబ్సైట్లో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎంవీ.రంగారా వు, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ వెంకట్రాంరెడ్డి, డాక్టర్ ఈసం నారాయణ, డాక్టర్ క్రిస్టోఫర్ పాల్గొన్నారు. సంవత్సరాల వారీగా... డిగ్రీ ప్రథమ సంవత్సరం బీఏ, బీబీఎం, బీకాంసప్లిమెంటరీ పరీక్షలకు 46,762మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 10,665 మంది(22.70శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 30,611 మంది విద్యార్థులు హాజరుకాగా, 8,095 మంది (26.44) ఉత్తీర్ణత సాధించారు. చివరి సంవత్సరం పరీక్షలకు 20,823 మంది హాజరైతే 2,955మంది విద్యార్థులు(14.19శాతం) ఉత్తీర్ణత సాధించారని కేయూ అధికారులు వివరించారు.