పరిశోధన ఫలితాలు సామాన్యులకు అందాలి | Here are the results of research should | Sakshi
Sakshi News home page

పరిశోధన ఫలితాలు సామాన్యులకు అందాలి

Published Sat, Mar 29 2014 3:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM

Here are the results of research should

  •       కేయూ వీసీ వెంకటరత్నం
  •      ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సు
  •  కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : శాస్త్ర, సాంకేతిక పరిశోధన ఫలితాలు సామాన్య ప్రజలకు సైతం అందేలా కృషి చేయాల్సిన అవసరముందని కాకతీయ యూనివర్సిటీ వీసీ బి.వెంకటరత్నం అభిప్రాయపడ్డారు. కాకతీయ యూని వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో ‘ఫొటోనిక్స్, వీఎల్‌ఎస్‌ఐ సిగ్న ల్ ప్రాసెసింగ్’ అంశంపై రెండు రోజుల పాటు జరగనున్న అంతర్జాతీయ సదస్సులో క్యాంపస్ పరిపాలనా భవనంలోని సెనేట్ హాల్‌లో శుక్రవారం ప్రారంభమైం ది.

    వీసీ ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ కంప్యూటర్, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అనేక మార్పులు వస్తుం డ గా.. సమస్యలు కూడా ఎదురవుతున్నాయన్నారు. మలేషియాలో జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించి సరైన స్థలాన్ని తెలుసుకునేందుకు సమయం ప ట్టిందని.. మరింత మెరుగైన పరిశోధనలు జరగాల్సిన అవసరాన్ని ఈ ఘటన ఎత్తి చూపుతోందన్నారు.
     
    అన్ని రంగాల్లో ఫొటోనిక్స్ టెక్నాలజీ

     
    ఆధునిక జీవన విధానంలో అన్నిరంగాల్లోను ఫొటోనిక్స్ టెక్నాలజీ విస్తృతంగా ఉపయోగిస్తున్నారని అమెరికా ఆర్మీ రక్షణ విభాగం సైంటిస్టు ప్రొఫెసర్ లతా నటరాజ్ అన్నారు. సదస్సులో ఆమె కీలకోపన్యాసం చేస్తూ కంప్యూటర్ చిప్స్ టెలీ కమ్యూనికేషన్ టెక్నాలజీలో విరివిగా ఉపయోగిస్తున్నారన్నారు. వైద్యరంగంలో యాంటీ బయాటిక్స్, మైక్రో క్యాప్సుల్స్ మం దుల తయారీ, ఔషధాల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించే దిశగా ఫొటోనిక్స్‌లో పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.

    అనంతరం మలేషియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గురుమూర్తిహెగ్డే, కెనడాలోని మాక్‌గిల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వంశీ చోడవరపు, కేయూ రిజి స్ట్రార్ ప్రొఫెసర్ కె.సాయిలు, హైదరాబాద్ డీఈఆర్‌ఎల్ డెరైక్టర్ ఎస్‌పీ.దాస్, కేయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసులు మాట్లాడారు. కాగా, అంతర్జాతీయ సదస్సులో భాగంగా రెండు రోజు ల పాటు 17 టెక్నికల్ సెషన్స్ నిర్వహిస్తుండగా.. పరిశోధకులు సమర్పించే పరిశోధనాపత్రాల్లో నుంచి 49 పత్రాలను అంతర్జాతీయ ఎల్సేయర్ ప్రచురణ సంస్థ ప్రచురించనుందని నిర్వాహకులు తెలిపారు.

    సదస్సు లో తొలుత సదస్సు ప్రొసీడింగ్స్, సావనీర్‌తో పాటు సీడీని వీసీ, అతిథులు ఆవిష్కరించారు. సదస్సులో కన్వీనర్ వి.మహేందర్, ఆసిం ఇక్బాల్, బరోడా యూ నివర్సిటీ డాక్టర్ మూర్తి, డీఆర్‌డీఎల్ గుప్తా, ఇ.హరికృష్ణ, ఇ.మునీందర్, వీవీ.రాధారుక్మిణి, సీహెచ్.రాధిక, కె.సుమలత, ప్రొఫెసర్ డి.రాజేంద్రప్రసాద్, ప్రొఫెసర్ టి.రవీందర్‌రెడ్డితో పాటు వివిధ యూనివర్సిటీల ప్రతినిధులు, పరిశోధకులు, ఇంజినీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement