కాకతీయ వర్సిటీ హాస్టల్ విద్యార్థినుల ఆందోళన
కేయూ క్యాంపస్: భోజనం బాగా లేదని, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలోని మహిళా హాస్టల్ విద్యార్థినులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద బైఠాయించారు. భోజనం బాగుండటం లేదని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. అన్నం మాడిపోతోందని, పప్పు కూడా బాగుండటం లేదని వివరించారు.
వీసీ, రిజిస్టర్ రావాలని నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పే యత్నం చేశారు. సమాచారం అందుకున్న హాస్టళ్ల డైరెక్టర్ రాజ్‌కుమార్ రాత్రి 11.30 గంటలకు అక్కడికి వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులు తీసుకొచ్చిన ఆహారాన్ని పరిశీలించారు. ఈ సమస్యను శనివారం పరిశీలించి.. తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. వెంటనే డైరెక్టర్ హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment