తెగ కొనేశారు! | Record orders for quick commerce and food delivery platforms | Sakshi
Sakshi News home page

తెగ కొనేశారు!

Published Fri, Jan 3 2025 4:32 AM | Last Updated on Fri, Jan 3 2025 4:32 AM

Record orders for quick commerce and food delivery platforms

డిసెంబర్‌ 31న ఆన్‌లైన్‌లో దుమ్మురేపిన అమ్మకాలు 

క్విక్‌ కామర్స్, ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌కు రికార్డు ఆర్డర్లు 

గోవాలో ఒక కస్టమర్‌ అత్యధికంగా రూ.70,325లకు ఆర్డర్‌ 

ఏజెంట్‌కు అత్యధికంగా రూ.2,500 టిప్‌ ఇచ్చిన హైదరాబాదీ  

నెల్లూరులో ఆర్డర్‌ చేసిన 164 సెకండ్లలోనే బిర్యానీ డెలివరీ  

సాక్షి, హైదరాబాద్‌: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశంలో క్విక్‌ కామర్స్, ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌ రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేశాయి. వివిధ వస్తువులు, ఆహారం వంటివాటి విక్రయాల్లో సాధించిన రికార్డులను జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌ తదితర ప్లాట్‌ఫామ్‌ల ఎగ్జిక్యూటివ్‌లు, ప్రతినిధులు ఘనంగా ప్రకటిస్తున్నారు. 

‘రియల్‌ టైమ్‌ ఆర్డర్ల’గణాంకాలను సోషల్‌ మీడియా మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 2023 డిసెంబర్‌ 31వ తేదీతో పోల్చితే 2024 డిసెంబర్‌ 31న (మంగళవారం) సాయంత్రం 5 గంటలకే అధిక ఆర్డర్లు వచ్చినట్టు బ్లింకిట్‌ సహ–వ్యవస్థాపకుడు అల్బిందర్‌ ధిండ్సా వెల్లడించారు. 

2023తో పోల్చితే 2024 చివరి రోజు తమకు 200 శాతం అధిక ఆర్డర్లు వచ్చినట్లు జెప్టో కో–¸ఫౌండర్, సీఈవో ఆదిత్‌ పాలిచా తెలిపారు. బ్లింకిట్, జెప్టోల మాదిరిగానే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ డిసెంబర్‌ 31న గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఆర్డర్లు సాధించినట్లు ఆ సంస్థ కో–ఫౌండర్‌ ఫణి కిషన్‌ ఆద్దెపల్లి తెలిపారు.  

ఆర్డర్లలో రికార్డులివే.. 
» గోవాలోని ఒక కస్టమర్‌ అత్యధికంగా రూ.70,325లకు ఇన్‌స్టామార్ట్‌ ప్లాట్‌ఫామ్‌పై ఆర్డర్‌ చేశాడు. 
» కోల్‌కత్తాకు చెందిన ఒక వినియోగదారుడు బ్లింకిట్‌లో రూ.64,988లకు ఆర్డర్‌ ఇచ్చాడు. 
» అన్ని క్విక్‌ కామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌పై డిస్పోజబుల్‌ గ్లాసులు, ఆలుగడ్డ చిప్స్, ఐస్‌క్యూబ్స్, చాక్‌లెట్లు, టానిక్‌వాటర్, నిమ్మకాయలు, సోడాలు, కూల్‌డ్రింక్‌లు, ఇతర వస్తువుల ఆర్డర్లు అధికంగా వచ్చాయి. 
»  ఫుడ్‌ డెలివరీ యాప్‌లలో వివి ధరకాల ఆహార పదార్థాలను కస్టమర్లు ఆర్డర్‌ చేశారు. స్విగ్గీలో బిర్యానీ ప్రాధాన్యత ఆహారంగా నిలిచింది. 
»  ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఆర్డర్‌ చేసిన 164 సెకండ్లలోనే (మూడు నిముషాలలోపే) బిర్యానీని వినియోగదారుడి ఇంటి ముంగిటికి స్విగ్గీ చేర్చింది. 
»    కేక్‌ల కోసం మొత్తం 2,96,711 ఆర్డర్లు స్విగ్గీకి వచ్చాయి. 
»  తమ డెలివరీ భాగస్వాములతో కలిపి స్విగ్గీ సంస్థ డెలివరీ ఏజెంట్లు ఆర్డర్లను అందజేసేందుకు మొత్తం 65,19,841 కి.మీ దూరం ప్రయాణించారు (ఇది భూమి నుంచి చంద్రుడిపైకి ఎనిమిది మార్లు వెళ్లి వచి్చనదానికంటే అధిక దూరం) 
»  రెస్టారెంట్‌ రిజర్వేషన్‌ సర్వీస్‌ స్విగ్గీ డైనౌట్‌లో మొత్తం ఆర్డర్లలో బెంగళూరు ప్రథమస్థానంలో నిలిచింది. 
»  ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ ‘మ్యాజిక్‌ పిన్‌’బిజినెస్‌ టైమ్‌లో నిమిషానికి 1,500 ఆర్డర్లు అందుకుంది. ఈ పాŠల్ట్‌ఫామ్‌పై ఢిల్లీకి చెందిన కస్టమర్‌ రూ.30 వేల అతిపెద్ద ఆర్డర్‌ ఇచ్చాడు. 

అత్యధిక టిప్‌ హైదరాబాదీదే.. 
»   బ్లింకిట్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి డిసెంబర్‌ 31న ఓ హైదరాబాదీ ఫుడ్‌ ఆర్డర్‌ తెచి్చన డెలివరీ ఏజెంట్‌కు అత్మధికంగా రూ.2,500 టిప్‌గా ఇచ్చాడు. 
»  మొత్తంగా అన్ని నగరాలు కలుపుకుంటే.. అత్యధికంగా బెంగళూరు వాసులు రూ.1,79,735 టిప్పులు ఇచ్చారు. 
»  బర్గర్లకు సంబంధించి మొత్తం 35 వేలకు పైగా ఆర్డర్లు రాగా.. వీటిలో బెంగుళూరు కస్టమర్లు అగ్రభాగాన నిలిచారు. 
» డిసెంబర్‌ 31న క్యూకామర్స్‌ ప్లాట్‌ఫామ్స్‌పై చేసిన ప్రతీ 8 ఆర్డర్లలో ఒకటి కూల్‌డ్రింక్‌. 
» కాక్‌టెయిల్‌ మిక్సర్లు, సోడా, మింటీ ఫ్రెస్‌ ఇంట్రీడియెంట్స్‌కు స్విగ్గీలో 2,542 శాతం డిమాండ్‌ నమోదైంది. 
» నాన్‌ ఆల్కహాలిక్‌ బీర్లకు 1,541 శాతం డిమాండ్‌ పెరిగింది. 
» గేమ్స్, పజిల్స్‌ వంటి వాటి డిమాండ్‌ 600 శాతం పెరిగింది. 
»  క్లౌడ్‌ కిచెన్‌ స్టార్టప్‌ క్యూర్‌ఫుడ్స్‌కు 2023 కంటే 2024 చివరి రోజు అధిక ఆర్డర్లు వచ్చారు. అధికంగా ఇచి్చన ఆర్డర్లవారీగా చూస్తే వరుసగా బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నిలిచాయి.  
» బ్లింకిట్‌లో 1,22,356 ప్యాకెట్ల కండోమ్స్, 45,531 మినరల్‌ వాటర్‌ బాటిళ్లకు ఆర్డర్లు వచ్చాయి.  
»  ఇదే ప్లాట్‌ఫామ్‌పై 2,34,512 ఆలూ బుజియా ప్యాకెట్లు, 45,531 టానిక్‌ వాటర్‌ కాన్లు, 6,834 ప్యాకెట్ల ఐస్‌క్యూబ్‌లు, 1,003 లిప్‌స్టిక్‌లు, 762 లైటర్స్‌ అమ్ముడయ్యాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement