delivery
-
ప్రాణం లేని బిడ్డను నెలరోజులు కడుపులో మోసిన నటి.. ఎట్టకేలకు..! (ఫోటోలు)
-
గుట్కా లేటుగా ఇచ్చాడని.. చాయ్‌వాలాపై కాల్పులు
నలంద:బీహార్‌లోని నలందలో ఘోరం చోటుచేసుకుంది. మత్తుకు అలవాటు పడిన కొందరు వ్యక్తులు క్షణికావేశంలో తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.వివరాల్లోకి వెళితే బీహార్‌లోని నలంద జిల్లాలో టీ దుకాణదారునిపై కాల్పులు జరిపిన ఉదంతం వెలుగుచూసింది. గుట్కా ఇవ్వడంలో ఆలస్యం చేశాడనే కారణంతో దుండగులు ఆ చాయ్‌వాలాపై కాల్పులకు పాల్పడ్డారు. బుల్లెట్ శబ్దం విని చుట్టుపక్కలవారు టీ దుకాణం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. వారిని చూసిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. దుకాణదారుడిని గాయపడిన స్థితిలో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటన నలంద జిల్లాలోని సారే పోలీస్ స్టేషన్ పరిధిలోని అలీనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. రాత్రివేళ ముగ్గురు సాయుధ దుండగులు టీ దుకాణానికి వచ్చి, చాయ్‌వాలాను గుట్కా ప్యాకెట్లు కావాలని అడిగారు. అతను వాటిని ఇవ్వడంతో కొంత జాప్యం చేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ దుండగులు దుర్భాషలాడుతూ, చాయ్‌వాలాపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుల్లెట్ దుకాణదారుడి వీపు గుండా దూసుకెళ్లింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన దుకాణదారుడిని నరేష్ యాదవ్ కుమారుడు రాకేష్ యాదవ్‌గా గుర్తించారు.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ ధర్మేష్ కుమార్ గుప్తా మీడియాకు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుని దర్యాప్తు ప్రారంభించారని, బాధితుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. ముగ్గురు యువకులు ఈ నేరానికి పాల్పడ్డారని, ఈ కేసును త్వరలోనే చేధిస్తామని తెలిపారు.ఇది కూడా చదవండి: దీక్ష విరమించను.. వైద్య చికిత్సకు ఓకే: రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ -
ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిన ఆన్లైన్ సేవలు
ఆన్లైన్ క్విక్ కామర్స్ సర్వీసులు అందించే డంజో మొబైల్ యాప్, వెబ్సైట్ సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. ఇప్పటి వరకు కంపెనీ సీఈఓగా వ్యవహరించిన కబీర్ బిశ్వాస్ డంజోకు రాజీనామా చేసిన కొద్దిసేపటికే ఇలా సర్వీసులు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాయి. తాను ఫిప్కార్ట్ క్విక్ కామర్స్ విభాగంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అయితే ఇంకా దీనిపై స్పష్టత రాలేదు.గత ఏడాది కాలంగా డంజో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులే ఇలా సర్వీసులు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లేందుకు కారణమని కొందరు చెబుతున్నారు. జనవరి 2022లో రిలయన్స్ రిటైల్ నుంచి గణనీయంగా 200 మిలియన్ డాలర్ల(రూ.1,600 కోట్లు) పెట్టుబడితో సహా 450 మిలియన్ డాలర్లకు(సుమారు రూ.3500 కోట్లు) పైగా నిధులు సమీకరించినప్పటికీ డంజో తన మార్కెట్ స్థానాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేసింది. ఇప్పటికే సమీకరించిన నిధులతో కంపెనీ కార్యకలాపాల నిర్వహణ భారంగా మారింది. అదనపు ఈక్విటీని సమీకరించలేకపోవడంతో కంపెనీ మరింత నష్టాల్లో జారుకుంది. తీసుకున్న బకాయిలు చెల్లించకపోవడంతో డంజో రుణదాతలు కంపెనీని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)కు తీసుకెళ్లాయి. దాంతో పరిస్థితి మరింత దిగజారింది. డంజోలో 26% వాటాను కలిగి ఉన్న రిలయన్స్ రిటైల్, గూగుల్‌తో సహా ఇతర పెట్టుబడిదారులు అదనపు నిధుల సమీకరణకు సంబంధించిన చర్చల నుంచి దూరంగా ఉన్నారు.ఇదీ చదవండి: ‘మీ లాభాల కోసం మేం చావలేం’ఈ నేపథ్యంలో కంపెనీ సీఈఓ బిశ్వాస్ సంస్థను వీడడం పెద్దదెబ్బగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇకమీదట డంజోను నిర్వహించడానికి బోర్డు లేదా నాయకత్వం లేకుండా పోయింది. పెండింగ్ జీతాలు, ఇన్వెస్టర్ల నిష్క్రమణ కారణంగా కంపెనీలోని చాలా మంది ఉద్యోగులు సంస్థను వీడారు. తమకు జీతాలు చెల్లించడం లేదంటూ కొందరు ఉద్యోగులు బిశ్వాస్‌పై ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో ఆయన ఫ్లిప్‌కార్ట్ క్విక్ కామర్స్ విభాగంలో చేరుతున్నారనే వార్తలు రావడం గమనార్హం. -
మళ్లీ జొమాటో క్విక్ సర్వీసులు
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో రెండేళ్ల తదుపరి క్విక్ సర్విసులను తిరిగి ప్రారంభించింది. ఎంపిక చేసిన పట్టణాలలో 15 నిమిషాల్లో ఫుడ్ డెలివరీ సేవలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వినియోగదారులకు 2 కిలోమీటర్ల పరిధిలో ఎంపిక చేసిన రెస్టారెంట్ల నుంచి ఫుడ్ అందించనుంది. తద్వారా రేసులోకి వచ్చింది. ప్రత్యర్ధి సంస్థ స్విగ్గీ స్నాక్ పేరుతో 15 నిమిషాల్లోనే ఆహారం, పానీయాలు తదితరాలను అందిస్తోంది. -
అర్ధరాత్రి ఆర్డరిచ్చి లాగించేస్తున్నారు
సాక్షి, అమరావతి: కాలం మారింది.. అభిరుచులు, అలవాట్లూ మారిపోతున్నాయి. అర్ధరాత్రి వేళ మనం గాఢ నిద్రలో ఉన్న సమయంలో చాలా విందులు జరిగిపోతున్నాయి. రాత్రి పెందరాళే పడుకోవాలన్న పెద్దల మాట ఇప్పుడు చెల్లుబాటు కావడంలేదు. అర్ధ రాత్రి 12 దాటిన తర్వాత మొదలు తెల్లారేవరకు దేశంలో చాలా ఫుడ్ డెలివరీ జరిగిపోతోంది. లక్షలాది మంది నిశిరాత్రిలో ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇందులో చిప్స్, కూల్డ్రింక్స్దే అగ్రస్థానం. 2024 సంవత్సరానికి సంబంధించి ఈ కామర్స్ సంస్థలు విడుదల చేసిన డేటా ఈ విషయాన్ని వెల్లడించింది. అర్థరాత్రి 12 నుంచి తెల్లవారుఝామున 4 గంటల మధ్య ఫుడ్ ఆర్డర్లు అత్యధికంగా వస్తున్నట్లు ఈ కామర్స్ సంస్థలు బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వంటి సంస్థల డేటా పరిశీలిస్తే తెలుస్తోంది. 2024లో ఈ సమయంలో ఏకంగా రెండు కోట్లపైగా ఆర్డర్లు స్నాక్స్ కోసం వచ్చినట్లు ఈ కామర్స్ సంస్థలు వెల్లడించాయి. ఒక్క ముంబైలోనే ఈ సమయంలో 31.5 లక్షల ఆర్డర్లు డెలివరీ చేసినట్లు తెలిపాయి. నిరంతరం భారీ ఆర్డర్లుపగలూ రాత్రీ నిరంతరం ఆన్లైన్లో భారీ ఆర్డర్లు వస్తున్నట్లు ఈ సంస్థలు చెబుతున్నాయి. చాలా మంది నిత్యావసర సరుకులూ ఆన్లైన్లో భారీగానే తెప్పించేస్తున్నారు. గోధుమ పిండి, ఆయిల్, దోశ పిండి, పాలు, పెరుగు, చిప్స్, కూల్‌డ్రింక్స్, పచ్చి మిరపకాయలు, టమోటాలు వంటివి ఆన్లైన్ ద్వారా కొంటూ లక్షల్లో బిల్లులు చేస్తున్నారు. ఢిల్లీ, డెహ్రాడూన్లలో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ద్వారా కొందరు ఏడాదికి రూ. 20 లక్షలు విలువైన కొనుగోళ్లు చేశారంటే ఆర్డర్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చిప్స్, కూల్డ్రింక్స్దీ పెద్ద మార్కెట్టే. బ్లింకిట్ ఒక్కటే ఈ సంవత్సరం 1.75 కోట్ల మ్యాగీ ప్యాకెట్లను డెలివరీ చేస్తే, జెప్టో 12 లక్షల లేస్ మ్యాజిక్ మసాలా చిప్స్ సరఫరా చేసింది. అంతేకాదు.. బ్లింకిట్ 1.85 కోట్ల కోకోకోలా కాన్స్, 84 లక్షల బాటిల్స్ థమ్సప్, 14.6 లక్షల మజా బాటిల్స్‌ను డెలివరీ చేసింది. ఒక్క వ్యక్తే ఏకంగా 1,203 స్స్రైట్ బాటిల్స్ ఆర్డరు పెట్టాడు. 43 మంది ఒకొక్కరు రూ.75,000 విలువైన చిప్స్ ప్యాకెట్లను ఈ ఏడాదిలో కొన్నారు.హైదరాబాద్, చెన్నై, కొచ్చి, కోల్‌కతా వంటి పట్టణాల్లో చిప్స్ ఆర్డర్లు అత్యధికంగా ఉంటున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఒకాయన ఫ్రూటీ కోసం ఒక్క ఏడాదిలో రూ.35,000 ఖర్చుచేస్తే, మరో వ్యక్తి గ్యాస్ సమస్య తగ్గించే ఈనో ప్యాకెట్లు 217 కొనేశాడు. వాలెంటైన్స్ డే రోజున ప్రతి నిమిషానికి 307 గులాబీ పువ్వులు ఈ సంస్థలు డెలివరీ చేశాయి. జెప్టో ఏడాది మొత్తం మీద 8.25 లక్షల గులాబీ పువ్వులను సరఫరా చేసింది.ముంబైకి చెందిన జంతు ప్రేమికుడు ఒకాయన కుక్కలు, పిల్లుల ఆహారం కోసం రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేశాడట. చెన్నైకి చెందిన మరో జంతు ప్రేమికుడు జెప్టో నుంచి 5,234 క్వింటాళ్ల ఆహారం జంతువుల కోసం ఆర్డర్లు పెట్టారు. విజయవాడ వాళ్లకి పాలు, పెరుగుంటే చాలురాష్ట్రంలోని విజయవాడ విషయానికి వస్తే ఇన్‌స్టామార్ట్‌లో అత్యధికంగా పాలు, పెరుగు, టమోటా, పచ్చిమిర్చి, సన్‌ఫ్లవర్ ఆయిల్ వంటి వాటిని అత్యధికంగా కొంటున్నారు. రోజువారీ ఆర్డర్లలో బ్రెడ్, కోడిగుడ్లు కూడా ఉంటున్నాయి. విజయవాడలో పది నిమిషాలకు ఒకసారి ఎల్రక్టానిక్ వస్తువులను కొంటున్నారు. పండుగల సమయంలో సుమారుగా రూ.1.5 లక్షల విలువైన ఎల్రక్టానిక్ వస్తువులను ఆన్లైన్ ద్వారా కొంటున్నట్లు ఈ సంస్థలు వెల్లడించాయి. -
తెగ కొనేశారు!
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా దేశంలో క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్స్ రికార్డు స్థాయి అమ్మకాలు నమోదు చేశాయి. వివిధ వస్తువులు, ఆహారం వంటివాటి విక్రయాల్లో సాధించిన రికార్డులను జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ తదితర ప్లాట్‌ఫామ్‌ల ఎగ్జిక్యూటివ్‌లు, ప్రతినిధులు ఘనంగా ప్రకటిస్తున్నారు. ‘రియల్ టైమ్ ఆర్డర్ల’గణాంకాలను సోషల్ మీడియా మాధ్యమాల్లో షేర్ చేస్తూ సంతోషం వ్యక్తంచేస్తున్నారు. 2023 డిసెంబర్ 31వ తేదీతో పోల్చితే 2024 డిసెంబర్ 31న (మంగళవారం) సాయంత్రం 5 గంటలకే అధిక ఆర్డర్లు వచ్చినట్టు బ్లింకిట్ సహ–వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా వెల్లడించారు. 2023తో పోల్చితే 2024 చివరి రోజు తమకు 200 శాతం అధిక ఆర్డర్లు వచ్చినట్లు జెప్టో కో–¸ఫౌండర్, సీఈవో ఆదిత్ పాలిచా తెలిపారు. బ్లింకిట్, జెప్టోల మాదిరిగానే స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ డిసెంబర్ 31న గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో ఆర్డర్లు సాధించినట్లు ఆ సంస్థ కో–ఫౌండర్ ఫణి కిషన్ ఆద్దెపల్లి తెలిపారు. ఆర్డర్లలో రికార్డులివే.. » గోవాలోని ఒక కస్టమర్ అత్యధికంగా రూ.70,325లకు ఇన్‌స్టామార్ట్ ప్లాట్‌ఫామ్‌పై ఆర్డర్ చేశాడు. » కోల్‌కత్తాకు చెందిన ఒక వినియోగదారుడు బ్లింకిట్‌లో రూ.64,988లకు ఆర్డర్ ఇచ్చాడు. » అన్ని క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై డిస్పోజబుల్ గ్లాసులు, ఆలుగడ్డ చిప్స్, ఐస్‌క్యూబ్స్, చాక్లెట్లు, టానిక్వాటర్, నిమ్మకాయలు, సోడాలు, కూల్‌డ్రింక్‌లు, ఇతర వస్తువుల ఆర్డర్లు అధికంగా వచ్చాయి. » ఫుడ్ డెలివరీ యాప్‌లలో వివి ధరకాల ఆహార పదార్థాలను కస్టమర్లు ఆర్డర్ చేశారు. స్విగ్గీలో బిర్యానీ ప్రాధాన్యత ఆహారంగా నిలిచింది. » ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఆర్డర్ చేసిన 164 సెకండ్లలోనే (మూడు నిముషాలలోపే) బిర్యానీని వినియోగదారుడి ఇంటి ముంగిటికి స్విగ్గీ చేర్చింది. » కేక్‌ల కోసం మొత్తం 2,96,711 ఆర్డర్లు స్విగ్గీకి వచ్చాయి. » తమ డెలివరీ భాగస్వాములతో కలిపి స్విగ్గీ సంస్థ డెలివరీ ఏజెంట్లు ఆర్డర్లను అందజేసేందుకు మొత్తం 65,19,841 కి.మీ దూరం ప్రయాణించారు (ఇది భూమి నుంచి చంద్రుడిపైకి ఎనిమిది మార్లు వెళ్లి వచి్చనదానికంటే అధిక దూరం) » రెస్టారెంట్ రిజర్వేషన్ సర్వీస్ స్విగ్గీ డైనౌట్లో మొత్తం ఆర్డర్లలో బెంగళూరు ప్రథమస్థానంలో నిలిచింది. » ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ‘మ్యాజిక్ పిన్’బిజినెస్ టైమ్‌లో నిమిషానికి 1,500 ఆర్డర్లు అందుకుంది. ఈ పాŠల్ట్ఫామ్పై ఢిల్లీకి చెందిన కస్టమర్ రూ.30 వేల అతిపెద్ద ఆర్డర్ ఇచ్చాడు. అత్యధిక టిప్ హైదరాబాదీదే.. » బ్లింకిట్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లకు సంబంధించి డిసెంబర్ 31న ఓ హైదరాబాదీ ఫుడ్ ఆర్డర్ తెచి్చన డెలివరీ ఏజెంట్‌కు అత్మధికంగా రూ.2,500 టిప్‌గా ఇచ్చాడు. » మొత్తంగా అన్ని నగరాలు కలుపుకుంటే.. అత్యధికంగా బెంగళూరు వాసులు రూ.1,79,735 టిప్పులు ఇచ్చారు. » బర్గర్లకు సంబంధించి మొత్తం 35 వేలకు పైగా ఆర్డర్లు రాగా.. వీటిలో బెంగుళూరు కస్టమర్లు అగ్రభాగాన నిలిచారు. » డిసెంబర్ 31న క్యూకామర్స్ ప్లాట్‌ఫామ్స్‌పై చేసిన ప్రతీ 8 ఆర్డర్లలో ఒకటి కూల్‌డ్రింక్. » కాక్టెయిల్ మిక్సర్లు, సోడా, మింటీ ఫ్రెస్ ఇంట్రీడియెంట్స్కు స్విగ్గీలో 2,542 శాతం డిమాండ్ నమోదైంది. » నాన్ ఆల్కహాలిక్ బీర్లకు 1,541 శాతం డిమాండ్ పెరిగింది. » గేమ్స్, పజిల్స్ వంటి వాటి డిమాండ్ 600 శాతం పెరిగింది. » క్లౌడ్ కిచెన్ స్టార్టప్ క్యూర్ఫుడ్స్కు 2023 కంటే 2024 చివరి రోజు అధిక ఆర్డర్లు వచ్చారు. అధికంగా ఇచి్చన ఆర్డర్లవారీగా చూస్తే వరుసగా బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్, ఢిల్లీ నిలిచాయి. » బ్లింకిట్‌లో 1,22,356 ప్యాకెట్ల కండోమ్స్, 45,531 మినరల్ వాటర్ బాటిళ్లకు ఆర్డర్లు వచ్చాయి. » ఇదే ప్లాట్‌ఫామ్‌పై 2,34,512 ఆలూ బుజియా ప్యాకెట్లు, 45,531 టానిక్ వాటర్ కాన్లు, 6,834 ప్యాకెట్ల ఐస్‌క్యూబ్‌లు, 1,003 లిప్‌స్టిక్‌లు, 762 లైటర్స్ అమ్ముడయ్యాయి. -
2024లో స్విగ్గీ హవా.. హైదరాబాద్‌లో రికార్డ్ డెలివరీలు
ఫుడ్ డెలివరీ సంస్థగా మొదలైన 'స్విగ్గీ' (Swiggy) నేడు పండ్లు, కూరగాయలు మొదలైన వాటిని డెలివరీ చేస్తోంది. అత్యధిక డెలివరీలతో రికార్డ్ బ్రేక్ చేసి.. అర్ధరాత్రి వరకు కూడా కస్టమర్లను సేవలను అందిస్తూనే ఉంది. హైదరాబాద్‌లో వేగవంతమైన డెలివరీలు చేస్తూ అందరికీ అందుబాటులో ఉంది.జూన్ 2021లో ప్రారంభమైన స్విగ్గీ.. రోజువారీ అవసరాలు, బొమ్మలు, బ్యూటీకి సంబంధించిన వస్తువులు, అలంకరణ సామాగ్రి, పండుగల సమయంలో కావాల్సిన వస్తువులను కూడా డెలివరీ చేస్తోంది. కేవలం 10 నిమిషాల్లో డెలివరీ (Fast Delivery) చేస్తున్న వాటిలో పాలు, టమోటా, ఉల్లిపాయలు, కొత్తిమీర, మిరపకాయలు, కిరాణా సామాగ్రి, ఎలక్ట్రానిక్స్ వంటివి ఉన్నాయని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ సీఈఓ 'అమితేష్ ఝా' అన్నారు.హైదరాబాద్ (Hyderabad)లో 1.8 కిమీ దూరాన్ని కేవలం 96 సెకన్లలో చేరుకొని డెలివరీ చేసిన ఘనత స్విగ్గీ సొంతం. అంతే కాకూండా.. నగరంలో 2024లో 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను డెలివరీ చేసింది. పాల కోసం 19 లక్షలకు పైగా ఆర్డర్లను పొందింది. బ్రెడ్, గుడ్ల కోసం రూ.1.54 కోట్ల విలువైన ఆర్డర్లకు స్వీకరించింది.లోదుస్తుల కోసం 18,000 కంటే ఎక్కువ ఆర్డర్లు, కండోమ్‌ల కోసం దాదాపు 2 లక్షల ఆర్డర్లను స్విగ్గీ స్వీకరించింది. 2024లో 25,00,000 మ్యాగీ ప్యాకెట్లను ఆర్డర్ చేసింది. ప్రజలు ఆర్డర్ చేసిన మ్యాగీ ప్యాకెట్లను ఒకదానిపై ఒకటి పేర్చితే ఎవరెస్ట్ పర్వతం కంటే దాదాపు 25 కిలోమీటర్ల ఎత్తు అవుతుందని సమాచారం. మొత్తం మీదీ అదీ.. ఇదీ అని తేడా లేకుండా ప్రజలకు అవసరమైన వస్తువులను డెలివరీ చేసి అందరికీ అందుబాటులో ఉంది. -
తల్లి ప్రేమకు దూరమైన పసికందు
బొమ్మనహళ్లి: బళ్లారిలో బాలింతల మరణాల పరంపర మరువక ముందే బెంగళూరులో ప్రసవించిన ఓ మహిళ శస్త్ర చికిత్స చేయించుకున్న అనంతరం అవయవ వైఫల్యం, ఇతర సమస్యలతో మరణించిన హృదయవిదారక ఘటన జరిగింది. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా గర్జే గ్రామానికి చెందిన గర్భిణీ అనూష మృతితో బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాలు...చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా గర్జే గ్రామానికి చెందిన గర్భిణీ అనూషను తరికెరెలోని రాజ్ నర్సింగ్ హోంలో చేర్పించారు.సాధారణ ప్రసవం ద్వారా పాప పుట్టింది. కాన్పుకు ముందు స్కానింగ్ చేయగా కిడ్నీలో స్టోన్ ఉందని, డెలివరీ అయిన నెల తరువాత షిమోగాలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో సర్జరీ చేశారని సమాచారం. అయితే పేగులు దెబ్బతిన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనూషను ఇంటికి తీసుకువచ్చిన తరువాత కాళ్లు, చేతులు వాపు కనిపించింది. మళ్లీ ఆస్పత్రికి వెళ్లగా సమస్య లేదని వైద్యుడు చెప్పారు. అయితే ఆమె ఆరోగ్య క్షీణించడంతో స్థానికంగా ఉన్న మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వారు కామెర్లు ఉన్నట్లు నిర్ధారించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తీసుకువచ్చి నగరంలోని నాగరబావిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు. లివర్ సమస్యకు మరో ఆపరేషన్ చేసి సీటీ స్కానింగ్, ఎంఆర్ఐ, సర్జరీ అంటూ కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు దండుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి అనూష స్పృహలో లేదు. ఆమెకు గుండె సమస్య ఉందని చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో మరింత ఆందోళన నెలకొంది. నిరంతర చికిత్స, వైద్య పరిశీలన లేక పోవడంతో తన భార్య మరణించిందని ఆమె భర్త ఆరోపిస్తున్నారు. అనూష ఎలా చనిపోయిందనేది కూడా వైద్యులు చెప్పలేకపోతున్నారని ఆమె బంధువులు, భర్త రోదించారు. ఆమె మృతితో రోజుల బిడ్డ అనాథగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ప్రైవేట్ ఆస్పత్రిలో బాలింత మృతి చెందడంపై ప్రజల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. -
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ సింగర్స్ జంట (ఫొటోలు)
-
ఫుడ్ డెలివరీ యాప్‌పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్
ఒక బిజినెస్ అభివృద్ధి చెందాలంటే.. పబ్లిసిటీ చాలా అవసరం. ఈ పబ్లిసిటీ కోసం వ్యాపార వేత్తలు వివిధ మార్గాలను అన్వేషిస్తారు. అయితే ఇటీవల బెంగళూరులో.. ఓ ఫుడ్ డెలివరీ యాప్ కంపెనీ వినూత్నంగా అలోచించి, పబ్లిసిటీ కోసం మనుషులనే వాడేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు నెట్టింట్లో ఫైర్ అయిపోతున్నారు.ఫుడ్ డెలివరీ యాప్‌ను ప్రచారం చేయడానికి బిల్‌బోర్డ్‌లను భుజాన వేసుకుని బెంగళూరులోని వీధుల్లో నడుస్తున్న మనుషుల ఫోటోను ఒక ఎక్స్ (ట్విటర్) యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. లక్షల మంది ఈ ఫోటోలను వీక్షించారు.చాలామంది నెటిజన్లు ఆ ఫుడ్ డెలివరీ యాప్ యాజమాన్యం మీద విరుచుకుపడుతున్నారు. ఆ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో కనిపించకుండా చేయాలని చెబుతున్నారు. ఇది శ్రమ దోపిడీకి నిదర్శమని దుమ్మెత్తి పోస్తున్నారు. బిజినెస్ పబ్లిసిటీ కోడం ఇంత చెత్త ఆలోచన మరొకటి ఉండదని కోప్పడుతున్నారు. అంత బరువున్న బోర్డులను మోయడం ఎంత కష్టంగా ఉంటుందో అంటూ ఆ వ్యక్తుల మీద పలువురు జాలి చూపించారు.VC : how much funding do you need ?Startup : 5 million $ VC : what's your customer acquisition plan Then : Human ads VC : Take my money pic.twitter.com/67BkVHLG1j— Roshan (@roshanonline) December 6, 2024 -
రెండో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ఉదయ్ కిరణ్‌తో మొదటి సినిమా!
ప్రముఖ బుల్లితెర నటి అదితి దేవ్ శర్మ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఆమె మరో బిడ్డకు జన్మనిచ్చింది. తనకు కూతురు జన్మించిందని సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని పంచుకుంది. తన రాక కోసం మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశామంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తన భర్తతో దిగిన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేసింది.కాగా.. 2014లో బుల్లితెర నటుడు సర్వర్ అహుజాను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే ఓ కుమారుడు ఉన్నారు. హిందీలో టీవీ సీరియల్స్‌తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆదితి శర్మ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్లో ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన గుండె ఝల్లుమంది మూవీతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో ఓం శాంతి, బబ్లూ లాంటి చిత్రాల్లో మెరిసింది. బుల్లితెర నటిగా గంగా, సిల్సిలా బదల్తే రిష్టన్ కా, కథా అంకాహీ సీరియల్స్‌లో పాత్రలకు గుర్తింపు తెచ్చుకుంది. గంగా, కథా అంకహీ లాంటి టీవీ షోలతో తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆదితి శర్మ హిందీ, తెలుగు చిత్రాలతో పాటు పంజాబీ సినిమాల్లోనూ నటించింది. View this post on Instagram A post shared by Aditi Sharma (@aditidevsharma) -
రెండు గంటల్లో డెలివెరీ!.. సిద్దమవుతున్న మింత్రా
లైఫ్‌స్టైల్ ఈ కామర్స్ దిగ్గజం మింత్రా క్విక్‌కామర్స్‌లోకి అడుగుపెట్టడానికి యోచిస్తోంది. కేవలం రెండు గంటల్లో డెలివరీ చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బెంగుళూరులోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ సర్వీస్ అందించడానికి ప్రయోగాలను చేస్తోంది.మింత్రా తన కస్టమర్లకు వేగంగా డెలివరీ చేయడానికి కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే.. ఎంపిక చేసిన ఉత్పత్తులను డెలివరీ చేయనుంది. దీనికోసం పైలట్ ప్రాజెక్ట్, 'M-Now' బెంగళూరులో కొన్ని పిన్ కోడ్లలో పనిచేస్తోంది. ఇది ఎలా పని చేస్తుందో చూడటానికి ప్రయోగాత్మకంగా సేవలు అందిస్తోంది.నిజానికి 2022లోనే మింత్రా బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఎం ఎక్స్‌ప్రెస్ అనే డెలివరీ సర్వీస్ ప్రారంభించింది. ఈ సర్వీస్ ఉద్దేశ్యం ఏమిటంటే.. ఆర్డర్ పెట్టిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ఉత్పత్తులను డెలివరీ చేయడం. ఇప్పుడు రెండు గంటల్లో డెలివరీ చేయడానికి సంకల్పించింది. -
కిరాణాలో... ‘క్విక్’ పాగా!
న్యూఢిల్లీ: సౌకర్యవంతంగా నిమిషాల వ్యవధిలోనే సరుకులను డెలివరీ చేసే సేవలకు ఆదరణ పెరుగుతుండటంతో సాంప్రదాయ కిరాణా దుకాణాల మార్కెట్ వాటాను క్విక్ కామర్స్ కంపెనీలు ఆక్రమిస్తున్నాయి. ఒక సర్వేలో పాల్గొన్న వినియోగదారుల్లో 46 శాతం మంది కిరాణా షాపుల నుంచి కొనుగోళ్లు గణనీయంగా తగ్గించుకున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో క్విక్ కామర్స్ మార్కెట్ పరిమాణం 2030 నాటికి 40 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్లు సర్వే నిర్వహించిన డాటమ్ ఇంటెలిజెన్స్ సంస్థ తమ నివేదికలో తెలిపింది.2024లో ఈ మార్కెట్ 6.1 బిలియన్ డాలర్లుగా నమోదవుతుందని అంచనా. నివేదిక ప్రకారం ఈ ఏడాది కిరాణా అమ్మకాల్లో క్విక్ కామర్స్ మార్కెట్ దాదాపు 1.28 బిలియన్ డాలర్ల వాటాను దక్కించుకోనుంది. 2024 అక్టోబర్‌లో దేశీయంగా 10 నగరాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 3,000 మంది పాల్గొన్నారు. పరిశ్రమ వర్గాలు, నిపుణులు, కిరాణా దుకాణాల యజమానుల ఇంటర్వ్యూలు, బ్రోకరేజి సంస్థలు..మీడియా రిపోర్టుల ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. సగటు ఆర్డరు రూ. 400.. ముందుగా ప్రణాళిక వేసుకోకుండా అప్పటికప్పుడు కొనుగోలు చేసే వారికి క్విక్ కామర్స్ మాధ్యమం సౌకర్యవంతంగా ఉంటోంది. నివేదిక ప్రకారం క్విక్ కామర్స్‌ను ఉపయోగించుకునే వినియోగదారుల సగటు ఆర్డరు విలువ సుమారు రూ. 400గా ఉంటోంది. ఆన్లైన్లో నిత్యావసరాలను షాపింగ్ చేసేవారిలో 75 శాతం మంది గత ఆరు నెలల్లో గణనీయంగా ఇలాంటి కొనుగోళ్లు చేశారు. 82 శాతం మంది వినియోగదారులు కిరాణా స్టోర్స్‌లో నిత్యావసరాల కొనుగోళ్లను పావు భాగం తగ్గించుకుని, దాన్ని క్విక్ కామర్స్ వైపు మళ్లించారు.సాంప్రదాయ రిటైల్ విధానంలో వివిధ దశల్లో ఉండే మధ్యవర్తుల కమీషన్ల బాదరబందీ లేకపోవడంతో క్విక్ కామర్స్ సంస్థలు ఆకర్షణీయమైన ధరకే ఉత్పత్తులను అందిస్తుండటం సైతం కస్టమర్లు వాటివైపు మొగ్గు చూపేందుకు దోహదపడుతోంది. ఈ నేపథ్యంలో నిత్యావసరాల మార్కెట్లో ఆధిపత్యం ఉన్న కిరాణా స్టోర్స్ మనుగడ కోసం పోరాడే పరిస్థితులు నెలకొంటున్నాయి. ‘క్విక్ కామర్స్ వినియోగం అసాధారణ వేగంతో పెరిగింది. 2024లో ఇది 74% వృద్ధి నమో దు చేయనుంది. 2023–28 మధ్యలో 48% వార్షిక వృద్ధితో అత్యంత వేగంగా ఎదిగిన మాధ్యమంగా నిలవనుంది‘ అని నివేదిక పేర్కొంది. క్విక్ కామర్స్ ‘కిక్’..10–30 నిమిషాల్లో సరుకులను ఇంటి దగ్గరకే అందించే సర్వీసులను క్విక్ కామర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ విభాగంలో బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ మొదలైనవి టాప్‌లో ఉన్నాయి. షాపింగ్ సౌలభ్యాన్ని కోరుకునే కస్టమర్లకు వేగవంతంగా, సౌకర్యవంతంగా సేవలు అందించడంపై క్విక్ కామర్స్ సంస్థలు ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. నిత్యావసరాల డెలివరీతో మొదలుపెట్టిన క్విక్ కామర్స్ సంస్థలు ప్రస్తుతం వివిధ ఉత్పత్తులకు విస్తరించాయి. ఎలక్ట్రానిక్స్, దుస్తులు, కాస్మెటిక్స్, గృహోపకరణాలు, ఔషధాలు, పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు, పుస్తకాలు మొదలైనవన్నీ కూడా అందిస్తున్నాయి. -
స్మార్ట్ కార్డు ‘బట్వాడా’ కష్టాలు
సాక్షి, హైదరాబాద్: రవాణా, పోస్టల్ శాఖల మధ్య ఏర్పడిన సమస్య వాహనదారులకు కష్టాలు తెచ్చిపెట్టింది. రవాణాశాఖ జారీచేసే లైసెన్సులు, ఆర్సీ సహా అన్ని రకాల స్మార్ట్ కార్డుల బట్వాడాను తపాలాశాఖ నిలిపేయటంతో కార్డులు అత్యవసరమైన వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. 15 నెలలుగా కార్డుల బట్వాడా చార్జీలను తపాలా శాఖకు రవాణాశాఖ చెల్లించటం లేదు. దాదాపు రూ.2 కోట్ల చార్జీలు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.ఎంతకూ ఈ బిల్లు రాకపోవటంతో నవంబర్ ఒకటో తేదీ నుంచి పోస్టల్ శాఖ ఆర్టీఏ కార్యాలయాల నుంచి కార్డుల బట్వాడాకు సంబంధించిన ముందస్తు బుకింగ్‌తోపాటు సిద్ధమైన కార్డులను వాహనదారులకు చేరవేసే సేవలను కూడా నిలిపివేసింది. దీంతో ఆర్టీఏ కార్యాలయాల్లోనే దాదాపు 2 లక్షల కార్డులు పేరుకుపోయాయి. దీంతో జేబులో ఆర్సీ, లైసెన్స్ లేకుండా వాహనంతో రోడ్డెక్కితే ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేస్తున్నారని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రాబడి లెక్కే.. చెల్లింపు లెక్కలేదు వాహనదారుల నుంచి వసూలు చేసే వివిధ రకాల చార్జీలను రవాణాశాఖ ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి జమ కడుతుంది. దీన్ని ఆదాయంగా ప్రభుత్వం భావిస్తుంది. తదుపరి సంవత్సరానికి ఈ ఆదాయాన్ని పెంచాలని రవాణా శాఖకు ప్రభుత్వం కొత్త టార్గెట్ నిర్దేశిస్తుంది. ప్రభుత్వం ఆదాయాన్ని అయితే వసూలు చేస్తోంది కానీ.. ఖర్చులకు కావల్సిన మొత్తాన్ని విడుదల చేయటంలేదు. 2014–15లో రూ.1,855 కోట్ల ఆదాయాన్ని రవాణాశాఖ ద్వారా పొందిన ప్రభుత్వం.. 2023–24 నాటికి రూ.6,990 కోట్లకు పెంచుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జూన్ నాటికి రూ.1,593 కోట్ల ఆదాయం పొందింది. రూ.4 కోట్లు వసూలు చేసినా.. గత 15 నెలల్లో వాహనదారుల నుంచి ‘కార్డుల బట్వాడా రుసుము’పేరుతో రవాణాశాఖ దాదాపు రూ.4 కోట్లు వసూలు చేసింది. ఇందులో రూ.2 కోట్లు తపాలాశాఖకు చెల్లించాల్సి ఉంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం రవాణాశాఖ ద్వారా రూ.6,990 కోట్లు రాబట్టుకుంది. ఇందులో రూ.2 కోట్లంటే సముద్రంలో నీటిబొట్టంతే. కానీ, ఆ చిన్న మొత్తాన్ని కూడా తపాలా శాఖకు చెల్లించలేకపోయింది.ఆర్సీ, లైసెన్సు, రెన్యువల్స్, కొన్ని రకాల డూప్లికేట్ స్మార్ట్ కార్డులను రవాణాశాఖ వాహనదారులకు పోస్టు ద్వారా చేరవేస్తుంది. ఆయా లావాదేవీకి సంబంధించి దరఖాస్తు సమయంలోనే ఆన్లైన్లో తపాలా బట్వాడా రుసుము వసూలు చేస్తుంది. తపాలా బట్వాడా చార్జీ కింద వాహనదారు నుంచి రూ.35 చొప్పున రవాణా శాఖ వసూలు చేసుకుంటోంది. పోస్టల్ శాఖకు మాత్రం ఒక్కో కార్డు బట్వాడాకు చెల్లిస్తున్నది రూ.17 మాత్రమే. కవర్ చార్జీ కింద మరో రూపాయి చెల్లిస్తుంది. తపాలాశాఖ ఉదారం.. రవాణాశాఖ నిర్లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వ విభాగాలకు తన వంతుగా మెరుగైన సేవలు అందించేందుకు తపాలాశాఖ కొంత ఉదారంగానే వ్యవహరిస్తోంది. ‘బుక్ నౌ.. పే లేటర్’విధానాన్ని ప్రారంభించి బట్వాడాకు సంబంధించిన పార్శిళ్లను ముందుగా బుక్ చేసి, వాటి రుసుములను తర్వాత చెల్లించినా ఫర్వాలేదు అన్న ‘ఉద్దెర’పాలసీ తీసుకొచ్చింది. దీంతో కార్డుల బట్వాడా చేయించుకుంటూ.. రుసుములు తర్వాత చెల్లించే పద్ధతికి రవాణాశాఖ అలవాటు పడింది. చార్జీలు రాకున్నా సేవలు ఎందుకు అందిస్తున్నారని రెండేళ్ల క్రితం ఆడిట్ విభాగం తపాలాశాఖను ప్రశ్నించింది. తపాలాశాఖ అధికారులు ఇదే విషయాన్ని రవాణాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి తీరు మారలేదు. -
జొమాటో డెలివరీ సిబ్బందికి ఇన్వెస్టింగ్ పాఠాలు
న్యూఢిల్లీ: గిగ్ ఎకానమీ వర్కర్లలో మదుపు, ఆర్థికాంశాలపైన అవగాహన పెంచే దిశగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) వెల్లడించింది. దీని ప్రకారం ప్రత్యేకంగా జొమాటో డెలివరీ పార్ట్నర్స్ కోసం రూపొందించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.ఇందులో పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్, ఇన్వెస్టింగ్‌కి సంబంధించి ప్రాథమిక అంశాలు ఉంటాయని ఎన్ఎస్ఈ తెలిపింది. పలు ప్రాంతీయ భాషల్లో బడ్జెటింగ్, పొదుపు, పెట్టుబడులు, బీమా మొదలైనవాటి గురించి వివరించనున్నట్లు పేర్కొంది. ఇప్పటికే 2,000 మంది డెలివరీ పార్ట్నర్స్ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమంలో భాగమైనట్లు వివరించింది. దేశవ్యాప్తంగా 50,000 మంది తాత్కాలిక వర్కర్లకు ఇది ప్రయోజనం చేకూర్చగలదని ఎన్ఎస్ఈ పేర్కొంది. -
నేటి నుంచి స్విగ్గీ ఐపీవో
న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ దిగ్గజం స్విగ్గీ పబ్లిక్ ఇష్యూ నేడు(6న) ప్రారంభం కానుంది. ఒక్కో షేరుకి రూ. 371–390 ఆఫర్ ధరలో వస్తున్న ఇష్యూ శుక్రవారం(8న) ముగియనుంది. ఐపీవోలో భాగంగా రూ. 4,499 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 6,828 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్, ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. తద్వారా రూ. 11,327 కోట్లు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. వెరసి 11.3 బిలియన్ డాలర్ల(రూ. 95,000 కోట్లు) విలువను ఆశిస్తోంది. ఇప్పటికే (2021 జూలై) లిస్టయిన ప్రత్యర్ధి కంపెనీ జొమాటో విలువ ప్రస్తుతం రూ. 2.13 లక్షల కోట్లకు చేరింది.నిధుల వినియోగమిలా...2014లో ఏర్పాటైన స్విగ్గీ 2024 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ. 611 కోట్ల నష్టం ప్రకటించింది. ఈక్విటీ జారీ నిధులను టెక్నాలజీ, క్లౌడ్ ఇన్ఫ్రా, బ్రాండ్ మార్కెటింగ్, రుణ చెల్లింపులు, ఇతర సంస్థల కొనుగోళ్లు తదితరాలకు వినియోగించనుంది.ఆఫర్ ధర: రూ. 371–390 సమీకరణ: రూ. 11,327 కోట్లురిటైలర్లకు కనీస లాట్: 38 షేర్లు ఆఫర్ ముగింపు: శుక్రవారం (8న)షేర్ల అలాట్మెంట్: 11న లిస్టింగ్: 13న -
ఫుడ్ డెలివరీ వేగంగా రావాలంటే?.. ఇలా చేయండి
ఈ రోజుల్లో ఫుడ్ కావాలంటే ముందుగా గుర్తొచ్చేది స్విగ్గీ, జొమాటో. అయితే ఈ ఫ్లాట్‌ఫామ్‌లలో ఫుడ్ ఆర్డర్ చేస్తే కొన్నిసార్లు డెలివరీ చేయడంలో ఆలస్యం అవుతుంది. అలాంటి ఆలస్యానికి స్వస్తి చెప్పడానికి ఓ మార్గం ఉందంటూ ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.ఆర్డర్ పెట్టినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ ఎంచుకోవాలి. ఆ సమయంలో మీకు డెలివరీ వేగంగా వస్తుంది. నిజం చెప్పాలంటే డెలివరీ ఏజెంట్స్ గోల్డ్ కస్టమర్ల కంటే కూడా ముందుగా మీకే డెలివరీ చేస్తారు. డెలివరీ మీకు ఆలస్యంగా వస్తే.. మీరు నేరుగా కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడవచ్చు. అంతే కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నప్పటికీ డెలివరీ ఏజెంట్‌కు మీరు యూపీఐ లేదా వాలెట్ నుంచి కూడా డబ్బు చెల్లించవచ్చు.ఇదీ చదవండి: అక్టోబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!ఈ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఇందులో ఒకరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నానని, డెలివరీ సకాలంలో వచ్చేసిందని పేర్కొన్నారు. ఇబ్బందులు ఎదురైనప్పుడు మాట్లాడటానికి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అందుబాటులో ఉంటారని.. డబ్బు కూడా రీఫండ్ వచ్చేదని మరొకరు వివరించారు. -
రోడ్డుపై మహిళ డెలివరీ.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ముంబై: మహారాష్ట్రలోని ముంబై పోలీసులు తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ముంబై పోలీసు విభాగానికి చెందిన నిర్భయ స్క్వాడ్ వెంటనే ఆదుకుంది. ఆమెకు రోడ్డుపైనే డెలివరీ చేయించి, తల్లీ బిడ్డలను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.వివరాల్లోకి వెళితే ముంబైలోని డోంగ్రీ పోలీస్ స్టేషన్‌కు చెందిన నిర్భయ స్క్వాడ్ రోడ్డుపై 45 ఏళ్ల మహిళకు బిడ్డను ప్రసవించడంలో సహాయం చేసింది. ఆ తర్వాత ఆ మహిళను ఆమె నవజాత శిశువును జేజే ఆస్పత్రికి తరలించింది. డోంగ్రీలోని చార్ నల్ జంక్షన్లో ఫుట్‌పాత్‌పై ఓ మహిళ ప్రసవ నొప్పితో బాధపడున్నదని నిర్భయ స్క్వాడ్‌కు తెలిసిందని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే స్క్వాడ్‌లో ఉన్న మహిళా పోలీసులు బాధితురాలిని ఆదుకునే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో వారు బాధిత మహిళ చుట్టూ కవర్ కట్టి, స్థానికుల సహాయంతో డెలివరీ చేశారు. ఈ మహిళకు పండంటి మగబిడ్డ జన్మించాడు. తరువాత పోలీసులు ఆ శిశువును, తల్లిని జేజే ఆస్పత్రికి తరలించారు. నిర్భయ స్క్వాడ్‌ను ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ అభినందించారు. Short of words to express my appreciation for the presence of mind & composure displayed by Dongri Pstn Nirbhaya Squad, in helping a lady deliver a baby on road. The Dongri Pstn Nirbhaya squad while patrolling found a 45-year-old lady bleeding in labour pain on the road near… pic.twitter.com/QPKqmkOhTc— पोलीस आयुक्त, बृहन्मुंबई - CP Mumbai Police (@CPMumbaiPolice) September 20, 2024ఇది కూడా చదవండి: సీల్‌కు రేబిస్.. తొలి కేసును గుర్తించిన శాస్త్రవేత్తలు -
10 నిమిషాల్లో ఐఫోన్ 16 డెలివరీ
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ సేల్స్ మొదలైపోయాయి. దేశంలోని పలు యాపిల్ స్టోర్లు కస్టమర్లతో కిటకిలాడాయి. చాలామంది ఈ మొబైల్ ఫోన్ కొనుగోలు చేయడానికి గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో ఐఫోన్ 16 సిరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి నిత్యావసరాల సరఫరాదారు బిగ్ బాస్కెట్, బ్లింకిట్ సిద్ధమయ్యాయి. బుక్ చేసుకున్న కేవలం 10 నిమిషాల్లోనే డెలివరీ చేసి కస్టమర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.బిగ్ బాస్కెట్ఈ రోజు ఉదయం 8:00 గంటలకు ఐఫోన్ ఆర్డర్ చేస్తే.. బిగ్ బాస్కెట్ దానిని 8:07 గంటలకు కస్టమర్ చేతికి అందించింది. అంటే కేవలం 7 నిమిషాల్లోనే డెలివరీ చేసింది. ఈ విషయాన్ని సీఈఓ హరి మీనన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఐఫోన్ డెలివరీ కోసం బిగ్ బాస్కెట్ ఎలక్ట్రానిక్ పరికరాల సేల్స్ విభాగం క్రోమాతో కలిసి పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ వేగవంతమైన డెలివరీలు ఎంపిక చేసిన నగరాలకు (ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై) మాత్రమే పరిమితమై ఉన్నాయి. అయితే ఈ మొబైల్స్ కొనుగోలు మీద ఎలాంటి ఆఫర్లను బిగ్ బాస్కెట్ ప్రకటించలేదు.Today’s the day!At 8:00 am, the first iPhone 16 order hit Bigbasket Now. By 8:07 am, it was in our customer’s hands. Yes, just 7 minutes from checkout to unboxing!We’re now serving more than groceries before you finish your morning coffee.Stay tuned, big things are on the… pic.twitter.com/J3uKHkkwk2— Hari Menon (@harimenon_bb) September 20, 2024ఇదీ చదవండి: 'రిటర్న్ టు ఆఫీస్.. ఇదో పెద్ద ప్లాన్': మాజీ ఉద్యోగి ఫైర్బ్లింకిట్బ్లింకిట్ కూడా ఐఫోన్ 16 సీరీస్ డెలివరీలను వేగవంతం చేయడానికి రంగంలోకి దిగింది. దీని కోసం కంపెనీ యూనికార్న్ సోర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మొబైల్ బుక్ చేసుకున్న 10 నిమిషాల్లో కస్టమర్లకు డెలివరీ చేస్తామని సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా ఎస్బీఐ, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డులపైన రూ. 5000 డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం బ్లింకిట్ వేగవంతమైన డెలివరీలు ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పూణే, బెంగళూరుకు మాత్రమే పరిమితమయ్యాయి.Get the all-new iPhone 16 delivered in 10 minutes!We’ve partnered with @UnicornAPR for the third year in a row, bringing the latest iPhone to Blinkit customers in Delhi NCR, Mumbai, Pune, Bengaluru (for now) — on launch day!P.S - Unicorn is also providing discounts with… pic.twitter.com/2odeJPn11k— Albinder Dhindsa (@albinder) September 20, 2024 -
ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినగా మిగిలింది డెలివరీ బాక్స్‌లోనే పెట్టి పడేస్తున్నారా?
మనం సాధారణంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటుంటాం. ఈ మధ్య స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలొచ్చక క్షణాల్లో ఫుడ్ మనముందు ఉంటోంది. ఏ సమయమైన మనకునచ్చింది ఆర్డర్ పెట్టుకుని చిటికెలో తినేయొచ్చు. ఈ మధ్య కాలంలో వీటి వినియోగం బాగా బాగా ఎక్కువగా ఉంది. అయితే చాలామంది తినగ మిగిలింది అదే డెలివరీ బాక్స్‌లో పెట్టి పడేస్తారు. ఇలా అస్సలు చేయకూడదట. దీనిపై అవగాహాన కల్పిస్తూ ఇద్దరు డిజటల్ క్రియేటర్స్ ఓ వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆ ఇద్దరు క్రియేటర్స్ ఓ పేపర్ బ్యాగ్‌లో ప్లాస్టిక్ బాక్స్‌లో ఉంచిన రెండు రోజుల కిందట ఆహారాన్ని ఉంచి వాసనను చూడమంటూ పలువురి ఇస్తారు. వారంతా ఛీ..య్యాక్ అంటూ ఏంటిది అని అడుగుతారు. అదేంటో గెస్ చేయమని వారందర్నీ అడగగా..మురికి, టాయిలెట్లు, విరేచనాలకు సంబంధించనదిగా రకరకాలుగా వర్ణించి మరీ చెబుతారు. ఆ తర్వాత ఆ డిజిటల్ క్రియేటర్లు అదేంటనేది చివర్లో చూపించగా.. అంత విస్తుపోతారు. మనమంతా ఆన్లైన్లో ఫుడ్‌ని ఆర్డర్ చేసుకుని తింటున్నాం బాగానే ఉంది. కానీ మిగిలింది ఆ డెలివరీ బాక్స్‌లోనే ఉంచి పడేస్తున్నాం. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. దీని వల్ల దుర్వాసన తోపాటు పలు రోగాలకు దారితీస్తుందని హెచ్చరిస్తారు. మనం ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని డెస్ట్ బెన్‌లో పడేసి ఆ తర్వాత ప్లాస్టిక్ బాక్స్‌ని క్లీన్ చేసి పడేయాలి. అప్పుడే అది రీసైకిలింగ్‌కి పనికి వస్తుంది. అంతేగాదు మనం ఇలా చేస్తే వ్యర్థాలను సేకరించేవారికి ఎలాంటి ఆరోగ్య ప్రమాదం ఉండదంటూ ఆ వీడియోలో ప్రజలకు అవగాహన కల్పించే యత్నం చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజన్లు చాలామంది మాకు ఇలా అవుతుందని తెలియదు, తప్పక మార్చుకుంటామని చెప్పగా, కొందరూ "వ్యర్థాల నిర్వహణను మన విద్యా వ్యవస్థలో విలీనం చేయాలి. దీనివల్ల తరువాతి తరాలు బాధ్యతయుతంగా వ్యవహరించడం, పునర్వినియోగం గురించి తెలుసుకోగలుగుతారంటూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Jordindian (@thejordindian) (చదవండి: ముంచుకొస్తున్న ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్..ఏకంగా 27 దేశాలకు..!) -
క్లౌడ్ కిచెన్
ఒకరి వద్ద ఉద్యోగిగా పనిచేయడం కన్నా.. ఏదైనా చిన్న వ్యాపారం చేసి తన కాళ్లపై తాను నిలబడాలనుకుంటోంది ప్రస్తుత తరం. అలాంటి వారే ‘స్టార్టప్ కంపెనీ’ అనే పేరుతో వివిధ రకాల వ్యాపారాలను ప్రారంభిస్తున్నారు. ఇందులోంచి పుట్టిందే క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్ట. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యంత ట్రెండింగ్, సక్సెస్ఫుల్ బిజినెస్ అంటే ఇదే. 2015లో మొదటి క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభమైంది. 2016లో ఇది ఓ వ్యాపారంగా మారింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,500కి పైగా క్లౌడ్ కిచెన్ స్టార్టప్‌లు నడుస్తున్నాయి. త్వరలో మరిన్ని మార్కెట్లోకి రానున్నాయి. జాతీయ క్లౌడ్ కిచెన్ బిజినెస్ మార్కెట్ విలువ ఈ ఏడాది చివరి నాటికి రూ.25వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా.క్లౌడ్ కిచెన్ అంటే..సాధారణంగా ఒక పెద్ద రెస్టారెంట్గానీ, హోటల్గానీ పెట్టాలనుకుంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. రెస్టారెంట్ డిజైన్ చేయించుకోవాలి. అది వాణిజ్య ప్రదేశంలో ఉండాలి. అందువల్ల అద్దె కూడా ఎక్కువగా చెల్లించాలి. కానీ, ఈ క్లౌడ్ కిచెన్ కాన్సెప్్టలో కేవలం ఒక మంచి వంటగది ఏర్పాటుచేసుకుంటే సరిపోతుంది. రెస్టారెంట్లో ఏ విధంగా కిచెన్ ఏర్పాటుచేస్తారో అలాగే ఇంటి వద్ద కూడా కిచెన్ ఏర్పాటుచేసుకోవచ్చు. ఫుడ్ ఆర్డర్లను మీరు ఆన్లైన్ ద్వారా పొందవచ్చు. ఇందుకోసం స్విగ్గి, జొమాటో వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్‌లతో ఒప్పందం చేసుకుంటే సరిపోతుంది. అంతేకాదు.. కిచెన్ సమీపంలోని ఐదు కిలోమీటర్ల పరిధిలో ఫోన్ ద్వారా ఆర్డర్లు తీసుకుని సొంత డెలివరీ బాయ్స్ ద్వారా ఫుడ్ చేరవేస్తే మరింత లాభం వచ్చే అవకాశం ఉంది.రెస్టారెంట్ పరిశ్రమలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. డైన్–ఇన్ కంటే డోర్‌స్టెప్ ఫుడ్ డెలివరీని కస్టమర్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో క్లౌడ్ కిచెన్ల హవా పెరిగింది. వీటిని డార్క్ కిచెన్లు, గోస్ట్ కిచెన్లు, వర్చువల్ రెస్టారెంట్లు, శాటిలైట్ రెస్టారెంట్లు అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ఇవి జనాదరణ పొందుతుండడంతో చాలా రెస్టారెంట్లు ఇప్పుడు డైన్–ఇన్ రెస్టారెంట్ కల్చర్ నుంచి డోర్ డెలివరీ సెటప్ వైపు మొగ్గుచూపుతున్నాయి. తక్కువ నిర్వహణ ఖర్చులతో ఎక్కువ లాభాలు పొందడమే ఈ క్లౌడ్ కిచెన్ల ప్రత్యేకత. –సాక్షి, అమరావతిఅనుమతులు తప్పనిసరి..⇒ క్లౌడ్ కిచెన్ నిర్వహణ కోసం స్థానికంగా మున్సిపాలిటీ నుంచి అనుమతి తీసుకోవాలి. ⇒ అలాగే, సంస్థను రిజిస్టర్ చేయించుకోవడంతోపాటు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ లైసెన్స్, జీఎస్టీ రిజి్రస్టేషన్, హెల్త్ లైసెన్స్, ఫైర్ అండ్ సేఫ్టీ లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అవసరం. ⇒ ఇలా కేవలం రూ.50 వేల నుంచి రూ.5 లక్షలు పెట్టుబడితో క్లౌడ్ కిచెన్‌ను ప్రారంభించవచ్చు. ⇒కాస్త భారీస్థాయిలో అయితే రూ.30 లక్షలు పెట్టుబడి పెట్టాలి. అధ్యయనం ముఖ్యం.. క్లౌడ్ కిచెన్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముఖ్యమైంది అధ్యయనం. కిచెన్ పెట్టాలనుకుంటున్న ప్రాంతంలో ఎలాంటి ఫుడ్‌కు డిమాండ్ ఉంది? ప్రజల ఇష్టాయిష్టాలు, ఆహారపు అలవాట్లు, ఇప్పటికే ఎలాంటి ఫుడ్ ఎంత ధరలో అందుబాటులో ఉంది.. దాని ధరలు ఎలా ఉన్నాయి.. వంటి వివరాలను తెలుసుకుని దానిబట్టి ప్రజలు ఎక్కవగా ఇష్టపడే ఆహారాన్నే రుచికరంగా, నాణ్యతతో, తక్కువ ఖర్చులో అందించాలి. క్లౌడ్ కిచెన్‌కు లొకేషన్‌తో సంబంధంలేదు. కానీ, రోడ్డుకు కొంచెం దగ్గరగా ఉంటే మంచిది. 500 చదరపు అడుగుల స్థలం సరిపోతుంది. డెలివరీ చేసే వాహనాల పార్కింగ్‌కు స్థలం ఉండేలా చూసుకోవాలి. సోషల్ మీడియాయే ప్రచారాస్త్రం.. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. వ్యాపారం ఏదైనాసరే సోషల్ మీడియా పేజీ ఉండాల్సిందే. ఎందుకంటే దీనిద్వారా మరింత మంది కస్టమర్లు రావచ్చు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ట్విట్టర్లలో అకౌంట్లు ఓపెన్ చేయాలి. రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తుంటే. ఆటోమెటిగ్గా ఈ బిజినెస్ గురించి జనాలకు తెలుస్తుంది.ఖర్చు తక్కువ.. క్లౌడ్ కిచెన్ కాన్సెప్‌్టతో వ్యాపారాన్ని తొలుత హైదరాబాద్‌లో మొదలుపెట్టాలనుకున్నాం. కానీ, విజయవాడ వాసులు ఆహార ప్రియులు కావడంతో ఇక్కడే ఏర్పాటుచేసుకున్నాం. మా దగ్గర నాణ్యత ఉన్న ఆహారాన్ని బాక్స్‌లో ప్యాక్‌చేసి ఇస్చ్తాం. ఉ.11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఆహారాన్ని ఆన్లైన్ ద్వారా డెలివరీ ఇస్తున్నాం. సాధారణ రెస్టారెంట్‌తో పోలి్చతే దాదాపు 30–50 శాతం ఖర్చులు తక్కువ. అందువల్లే ధరలు తగ్గించి ఇవ్వగలుగుతున్నాం. – ప్రసాద్, క్లౌడ్ కిచెన్ నిర్వాహకుడు, విజయవాడ -
8.5 లక్షల జాబ్స్.. కలిసొచ్చిన ఫెస్టివల్ సీజన్
భారతదేశంలో పండుగ సీజన్ మొదలైపోయింది. వినాయక చవితి, విజయ దశమి, దీపావళి, సంక్రాంతి ఇలా వరుసగా పండుగలు వచ్చేస్తున్నాయి. ఓ వైపు ఆటోమొబైల్ కంపెనీ తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకోవడానికి సన్నద్ధమవుతుంటే.. మరోవైపు ఈ కామర్స్ దిగ్గజాలు ఉద్యోగులను పెంచుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగానే 'మీషో' (Meesho) కంపెనీ ఏకంగా 8.5 లక్షల ఉద్యుగులను నియమించుకోవడానికి సన్నద్ధమవుతోంది.పండుగ సీజన్లో విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని విక్రయదారులు, లాజిస్టిక్ సేవల పరిధిలో 8.5 లక్షల మంది సీజనల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడానికి మీషో సిద్ధమైంది. ఉద్యోగ నియామకాల్లో 60 శాతం కంటే ఎక్కువ టైర్ 3, టైర్ 4 నగరాల్లో ఉండనున్నట్లు సమాచారం.ఈ కామర్స్ దిగ్గజం మీషో డెలివెరీ, ఈకామ్ ఎక్స్‌ప్రెస్, షాడోఫాక్స్, ఎక్స్‌ప్రెస్‌బీస్ వంటి థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ ప్రొవైడర్లతో కలిసి పనిచేస్తోంది. ఈ భాగస్వామ్యం కూడా ఉద్యోగ నియమాలకు పెంచడంలో సహాయపడింది. ఉద్యోగులలో పికింగ్, సార్టింగ్, లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం, రిటర్న్‌లను నిర్వహించడానికి సంబంధించిన ఉద్యోగులు ఉంటారు.ఇదీ చదవండి: ఆగష్టులో 27000 మంది!.. ఇలా అయితే ఎలా?ఉద్యోగ నియమాలకు కారణంఅమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ కంపెనీలకు సైతం గట్టి పోటీ ఇవ్వడానికి పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. పండుగ సీజన్లో వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి కంపెనీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే మీషో ఈ చర్యలు తీసుకుంటోంది. -
క్విక్ డెలివరీకి క్రేజ్
సాక్షి, హైదరాబాద్: కస్టమర్ల అభిరుచులు..అవసరాలకు తగ్గట్టుగా వేగంగా వివిధ రకాల వస్తువులు, సామగ్రి వంటి వాటిని అందించేందుకు క్విక్ (క్యూ)కామర్స్ సంస్థలు పోటీ పడుతున్నాయి. కొత్తకొత్త ఆలోచనలను తెరపైకి తీసుకురావడంతోపాటు, విభిన్నమైన సర్వీసులను త్వరితంగా అందించడం ద్వారా వినియోగదారుల మనసును గెలుచుకునే దిశగా ఈ సంస్థలు వేగం పెంచాయి. తాజాగా ‘ప్రీ ప్రిపేర్డ్ ఫుడ్’క్విక్ డెలివరీ పేరిట టీ, కాఫీ, సమోసా, ఇతర స్నాక్స్ అందించేందుకు జెప్టో, జొమాటో, స్విగ్గీ వంటి క్యూ–కామర్స్ దిగ్గజాలు పోటీకి సై అంటున్నాయి. తమతమ యావరేజ్ ఆర్డర్ వాల్యూ (ఏవోయూ)లను పెంచుకునేందుకు 10 నిమిషాల్లో కుక్కుడ్ ఫుడ్ అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ముంబై, బెంగళూరులలో ఈ సేవలు ›మొదలై ఆదరణ పొందుతున్నాయి. రానున్న రోజుల్లో హైదరాబాద్ సహా ఇతర నగరాలకు తమ ప్రణాళికలను ఈ సంస్థలు విస్తరించనున్నాయి. ప్రధాన నగరాలు, పట్టణాలే కాకుండా ద్వితీయ, తృతీయశ్రేణి నగరాలు, పట్టణాలతోపాటు నా¯Œన్ మెట్రో నగరాలకు ఈ సేవల విస్తరణకు ఏర్పాట్లు మొదలుపెట్టాయి. రోజువారీ బిజీ జీవితం, ఆఫీసు నుంచి ఇళ్లకు సుదీర్ఘ ప్రయాణాలు, ట్రాఫిక్ సమస్యలు తదితరాలతో క్విక్ ఫుడ్ డెలివరీ యాప్స్ వైపు వినియోగదారుల మొగ్గు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. » జెప్టో ప్రయోగాత్మకంగా గతేడాది ముంబైలో ‘జెప్టో కేఫ్’ను ప్రారంభించింది. ఇప్పుడు ముంబైతోపాటు బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉంది. » స్విగ్గీ కూడా బెంగళూరులో ఇన్‌స్టామార్ట్ ద్వారా ఇన్స్టాకేఫ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. » క్యూ– కామర్స్ సంస్థల మధ్య పోటీ తీవ్రంకావడంతో తమతమ సరాసరి ఆర్డర్ల విలువలను గణనీయంగా పెంచుకోవడంపై ఇవి దృష్టిని కేంద్రీకరిస్తున్నాయి. ఈ సంస్థలు ఆఫర్ చేస్తున్న స్నాక్స్ , ఇతర ఆహార పదార్థాలు దేశవ్యాప్తంగా సూపర్ మార్కెట్ చెయిన్లలో రూ.30 నుంచి 300 లోపు అందుతున్నా, హోం డెలివరీ రూపంలో కోరుకున్న సమయానికి వేగంగా ఇళ్లకు ఆర్డర్లు అందజేయడమే ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇప్పటికైతే కస్టమర్లు ఈ సంస్థలు అందిస్తున్న సేవలను ఆహా్వనిస్తున్నారు. ముఖ్యంగా జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్‌ల మాదిరిగా కాకుండా వివిధ రకాల వస్తువులతో (రోజువారీ అవసరాలకు తగ్గట్టుగా) పాటుగా ఫుడ్ ఐటెమ్స్ కూడా ఒకేసారి తెప్పించుకునేందుకు అవకాశం ఉండటమే ఈ సేవల ప్రత్యేకతగా నిలుస్తోంది. యూఎస్ఏ, యూకే, లాంటి దేశాల్లో ఈ ఐడియాను ముందుగా అమలు చేయడంతోపాటు వినియోగదారులు చేసే ఆర్డర్ల సంఖ్యను పెంచేందుకు స్నాక్స్ ఇతర ఆహార పదార్థాలను చేర్చారు. ఎల్రక్టానిక్ గాడ్జెట్స్, ఇతర లగ్జరీ వస్తువులతో పోలి్చతే స్నాక్ ఐటెమ్స్‌కు వచ్చే మార్జిన్ అంత హెచ్చుస్థాయిలో లేకపోయినా రోజువారీ నిత్యావసర వస్తువుల కంటే మాత్రం స్నాక్స్ రేట్స్‌కు అధిక మార్జిన్‌తో ఎక్కువ ఆదాయం సమకూరుతున్నట్టుగా నిపుణులు లెక్కలు వేస్తున్నారు. » కోల్‌కతాకు చెందిన సౌమాసేన్ ప్రతీరోజు ఆఫీస్‌కు వెళ్లడానికి ముందు లోకల్ మార్కెట్‌కు వెళ్లి తాజా పండ్లు, కూరగాయలు తెచ్చుకోవడంతోపాటు అప్పుడప్పుడు తప్పని పరిస్థితుల్లో అత్యవసరంగా ఎండు మిర్చీ, మస్టర్డ్ ఆయిల్, తదితర వస్తువుల కోసం దగ్గరలోని మార్కెట్‌కు వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడేది. అదే ఇప్పుడు క్విక్ డెలివరీ యాప్, సర్వీసులు అందుబాటులోకి రావడంతో ఆయన కోరుకున్న రోజువారి వస్తువులు కేవలం ఏడు నిమిషాల సమయంలోనే హోం డెలివరీ ద్వారా ఇళ్లకు చేరుతున్నాయి. అయితే మామూలుగా కొనుగోలు చేస్తున్న దాని కంటే ఈ సర్వీసులకు కొంత ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తున్నా సేన్, ఆయన భార్య ఉద్యోగులు కావడంతో యాప్‌లపై ఆర్డర్ చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోగలుగుతున్నారు. నేడు వేగంగా మారుతున్న పరిస్థితులు..క్విక్ కామర్స్ యాప్స్ అందుబాటులోకి రావడంతో వస్తువుల ఆర్డర్ అనేది సులభమై పోయింది. » రోజువారీ జీవితంలో అత్యంత అవసరమైన వస్తువులను 10 నుంచి 15 నిమిషాల్లో ఇళ్ల వద్దనే తెప్పించుకోవడం అనేది నవయువ తరానికి ఎంతో సౌకర్యవంతంగా మారింది. రోజువారీ జీవనశైలి అలవాట్లలో మార్పులు, వేగం పెరిగిన బిజీలైఫ్ తదితరాలకు తగ్గట్టుగా వివిధ వర్గాల కస్టమర్ల అభిరుచులు, అలవాట్లు కూడా వేగంగా మారిపోతున్నాయి. వీటన్నింటిని తీర్చేలా క్విక్ కామర్స్ సంస్థలు పోటీపడి కొత్త కొత్త ఆలోచనలతో డెలివరీ యాప్స్‌కు పదును పెడుతున్నాయి. అయితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ–కామర్స్ దిగ్గజ సంస్థలు ఈ విధమైన వ్యాపారంలో ముందంజలో ఎందుకు నిలవడం లేదన్న ప్రశ్నలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇవేకాకుండా దేశీయంగా పెద్ద పెద్ద కంపెనీలు, దేశవ్యాప్తంగా సప్లయి చెయిన్లు ఉన్న బడా సంస్థలు కూడా క్యూ–కామర్స్ మార్కెట్‌ను అధిగమించలేకపోవడం కూడా ఓ సవాల్‌గానే నిలుస్తోంది. -
ఆర్డర్ క్యాన్సిల్ చేసిన రెండేళ్లకు డెలివరీ
ఏదైనా వస్తువులను ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఈ కామర్స్ సైట్లలో ఆర్డర్ చేస్తే రెండు.. మూడు రోజులు లేదా వారం రోజులలోపు ఆర్డర్ ఇంటికి వచ్చేస్తుంది. అయితే ఓ వ్యక్తికి ఏకంగా రెండేళ్ల తరువాత ఆర్డర్ డెలివరీ అయింది. దీనికి సంబంధించిన ఫోటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.జయ్ అనే యూజర్ 2022 అక్టోబర్ 1న అమెజాన్ వెబ్సైట్లో ప్రెజర్ కుక్కర్ ఆర్డర్ చేశారు. అయితే ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసాడు. దానికి డబ్బు కూడా రీఫండ్ అయిపోయింది. అయితే ఆర్డర్ క్యాన్సిల్ చేసిన రెండేళ్ల తరువాత డెలివరీ అయింది. ఇది చూసిన యూజర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. రెండు సంవత్సరాల తరువాత డెలివరీ చేసినందుకు థాంక్యూ అమెజాన్ అంటూ పేర్కొన్నారు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు నాకు కూడా క్యాన్సిల్ చేసిన తరువాత డెలివరీ వచ్చి ఉంటే బాగుండేదని అన్నాడు. మరొకరు ఇది ప్రెస్టీజియస్ కుక్కర్ అని అన్నారు.Thank you Amazon for delivering my order after 2 years. The cook is elated after the prolonged wait, must be a very special pressure cooker! 🙏 pic.twitter.com/TA8fszlvKK— Jay (@thetrickytrade) August 29, 2024 -
చౌకలో ఫుడ్, క్యాబ్.. ఇలా బుక్ చేసుకోండి
అందరిలోనూ రోజువారీ ఖర్చులపై ఆందోళన పెరిగిపోయింది. ఇప్పుడున్న రోజుల్లో ఆహారం, ప్రయాణాల కోసం అత్యధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. అయితే ప్లేస్టోర్‌లో లభ్యమయ్యే కొన్ని యాప్‌లను వినియోగించడం ద్వారా చౌకగా ఆహార, ప్రయాణ సేవలను అందుకోవచ్చు. తద్వారా ప్రతి నెలా కొంతవరకూ సొమ్ము ఆదా చేసుకోవచ్చు. ఇంతకీ ఈ యాప్‌లు ఎలా పని చేస్తాయి? అవి మీకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.ఇటీవల యష్ తివారీ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. దీనిలో చౌకగా ప్రయాణాన్ని అందించే క్యాబ్‌ను ఎలా బుక్ చేసుకోవచ్చో వివరించారు. విశేషమేమిటంటే ఈ యాప్ పూర్తిగా ఉచితం. దీనిని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ పేరు క్యాబ్ కంపేర్(Cab Compare). ఈ ఒక్క యాప్‌లో ఓలా, ఉబెర్, ర్యాపిడోలలో మన ప్రయాణ ఛార్జీలను పరిశీలించి, మనకు చౌకగా అనిపించిన దానిని ఎన్నుకోవచ్చు. ఈ యాప్‌ను ఇప్పటికే ఐదు లక్షలకుపైగా యూజర్లు వినియోగిస్తున్నారు. పైగా దీనికి మంచి ఫీడ్ బ్యాక్ కూడా ఉంది. అదే సమయంలో ఈ యాప్.. యూజర్ల గోప్యతకు సంబంధించి అనేక భద్రతా ఫీచర్లను కూడా జోడించింది.ఇక చౌకగా ఫుడ్ ఆర్డర్ చేయాలనుకుంటే క్రేవియో(Craveo) అనే యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ కూడా ‘క్యాబ్ కంపేర్’ మాదిరిగానే పనిచేస్తుంది. ఇందులో మీ జొమాటో లేదా స్విగ్గీ ఖాతాను జోడించడం ద్వారా చౌకైన ఆహారం ఎక్కడ లభిస్తుందో వెంటనే తెలుసుకోవచ్చు. ఈ యాప్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉంది. ఈ యాప్ ఉపయోగించడం చాలా సులభం. ముందుగా క్రేవియో యాప్‌ని తెరిచాక ఖాతాను జోడించే ఎంపికను పొందుతారు. దీని సాయంతో జొమాటో, స్విగ్గీలలో ఎక్కడ చౌకగా ఆహారం దొరుకుతోందో తెలుసుకోవచ్చు. మరెందుకాలస్యం? ఈ యాప్‌లను ఒకసారి వినియోగించి చూడండి.