తిరువనంతపురం: కేరళ అలప్పుజలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ నిండు గర్భిణి ఇంట్లోనే ప్రసవించింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తన బిడ్డను ఓ వస్త్రంలో చుట్టి బాత్‌రూంలోని బకెట్‌లో పెట్టి ఆస్పత్రికి వెళ్లింది. ఇంట్లో బకెట్‌లో ఉన్న బిడ్డను కాపాడాలని వైద్యులను కోరింది.
ఆస్పత్రి అధికారులు వెంటనే ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. నవజాత శిశువును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. బాత్‌రూంలో బకెట్‌లో ఉన్న పసికందును బయటకు తీసుకొచ్చారు. తక్షణమే చెన్నగూర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శిశువు బరువు 1.3 కీజీలు ఉన్నట్లు తెలిపారు.
శిశువును ఆస్పత్రిలో చేర్చిన అనంతరం బాగోగులు చూసుకునే బాధ్యతను పథానంతిట్ట చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు పోలీసులు. వలంటీర్ల సహకారంతో మెరుగైన చికిత్స కోసం చిన్నారిని కొట్టాయం మెడికల్ ఆస్పత్రికి తరలించారు.
అయితే మహిళ ప్రసవించినప్పుడు ఆమె చుట్టుపక్కల ఎవరూ లేనట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో బిడ్డను పట్టుకునే శక్తి లేక బకెట్‌లోనే పెట్టి చెన్నగూర్ ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయింది. జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం.
చదవండి: ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు.. 400 కిలోమీటర్లు తీసుకెళ్లి బీచ్‌లో..
Comments
Please login to add a commentAdd a comment