Bucket
-
డిగ్రీలో ‘బకెట్’ ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ కోర్సుల్లో గుణాత్మక మార్పుల దిశగా అడుగులేయాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి అధ్యక్షతన శుక్రవారం రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్లర్ల (వీసీ)తో సమావేశం జరిగింది. కొత్త విద్యా సంవత్సరం క్యాలెండర్, దోస్త్ నిర్వహణ, అనుబంధ గుర్తింపు, కొత్త సిలబస్ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు డిగ్రీలో ఉన్న బకెట్ విధానాన్ని ఎత్తివేయాలని నిర్ణయించారు. ఒక విద్యార్థి ఒక కాలేజీలో చేరినప్పటికీ, ఆ కాలేజీలో లేని, వేరే కాలేజీలో ఉన్న సబ్జెక్టును చదివేందుకు వీలుగా 2023లో బకెట్ విధానం తీసుకొచ్చారు. ఇప్పటికే బకెట్ సిస్టమ్‌లో చేరిన విద్యార్థులు ఆ కోర్సు పూర్తయ్యే వరకు కొనసాగుతారు. డిగ్రీ ఆన్లైన్ సర్విస్, తెలంగాణ (దోస్త్)ను ఎత్తివేయాలనే ప్రతిపాదనను మండలి వెనక్కు తీసుకుంది. అయితే, రెండు కౌన్సెలింగుల్లోనే డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. డిగ్రీలో 4.6 లక్షల సీట్లుండగా, 2.25 లక్షల మందే చేరుతున్నారు. దీంతో జీరో అడ్మిషన్లు నమోదయ్యే కాలేజీలు, కోర్సులకు అనుమతి ఇవ్వొద్దని వర్సిటీలకు మండలి సూచించింది. సిలబస్‌లో మార్పులు రాష్ట్రంలోని ప్రైవేటు, ప్రభుత్వ కాలేజీల్లో కొత్త సిలబస్‌ను 2025–26 విద్యా సంవత్సరం నుంచి అమలుచేయాలని సమావేశంలో నిర్ణయించారు. ఈసారి 20 శాతం సిలబస్‌ను మార్చబోతున్నట్టు మండలి చైర్మన్ వీసీలకు తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఫిన్‌టెక్, రీసెర్చ్ ఆప్టిట్యూడ్ వంటి కోర్సులను డిగ్రీ సిలబస్‌లో చేరుస్తున్నట్టు చెప్పారు.డిజిటల్ ప్లాట్ ఫాంలో బోధన అందించేందుకు టీ–శాట్‌తో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు వివరించారు. మూల్యాంకన విధానంలో మార్పులు అవసరమని సమావేశం అభిప్రాయపడింది. అసైన్ చేసిన ప్రాజెక్టు వర్క్‌కు 25, మిడ్‌టర్మ్‌కు 25, ఆఖరు సెమిస్టర్‌కు 50 మార్కుల చొప్పున మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించారు. ఏప్రిల్ 30 నాటికి విద్యా సంవత్సరం ముగించాలని నిర్ణయించారు. యాజమాన్య కోటాకు ఆన్లైన్ లేనట్టే ఇంజనీరింగ్‌లో యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఈసారి ఆన్లైన్లో చేపడతామని చెప్పిన ఉన్నత విద్యా మండలి యూటర్న్ తీసుకుంది. ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో, ఈసారికి బీ కేటగిరీ సీట్లను ఆయా కాలేజీల యాజమాన్యాలే భర్తీ చేసుకునే వెసులుబాటు కల్పించాలని వీసీల సమావేశం నిర్ణయించింది. ఈ ఏడాది సీపీగెట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించాలని మండలి తీర్మానించింది.అన్ని వర్సిటీలకు చెందిన 2025–26 సంవత్సరం అకడమిక్ క్యాలెండర్‌కు సమావేశం ఆమోదం తెలిపింది. అన్ని వర్సిటీల పరిధిలో జూన్ 16 నుంచి డిగ్రీ మొదటి సెమిస్టర్ క్లాసులు మొదలవుతాయని అకడమిక్ క్యాలెండర్లో పేర్కొన్నారు. అక్టోబర్ 20తో సెమిస్టర్ ముగుస్తుంది. నవంబర్ 20 నుంచి రెండో సెమిస్టర్‌కు వెళ్తారు. మూడు, నాలుగు, ఐదు సెమిస్టర్లకు జూన్ 2 నుంచి క్లాసులు మొదలవుతాయి. -
బాంబీ బకెట్ అంటే ఏమిటి? కార్చిచ్చును ఎలా నియంత్రిస్తుంది?
ఉత్తరాఖండ్‌లోని కుమావోన్ డివిజన్లోని అటవీ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అడవుల్లోని కార్చిచ్చును ఆర్పేందుకు స్థానిక యంత్రాంగం మొదలుకొని, సైన్యం కూడా అనేక ప్రయత్నాలు చేస్తోంది. అయినా ఇంతవరకు మంటలు అదుపులోకి రాలేదు. హెలికాప్టర్ నుంచి బాంబీ బకెట్ ద్వారా అడవుల్లోని మంటలను అదుపు చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రయత్నిస్తోంది. ఇంతకీ బాంబీ బకెట్ అంటే ఏమిటి? అది అగ్ని కీలలను ఎలా నియంత్రిస్తుంది?అటవీ ప్రాంతంలో వ్యాపిస్తున్న మంటలను అదుపు చేసేందుకు నైనితాల్ పరిసర ప్రాంతాలలో భారత వైమానిక దళం ఎంఐ-17 వీ5 హెలికాప్టర్‌ను వినియోగిస్తోంది. దీనిసాయంతో బాంబీ బకెట్ల ద్వారా అడవుల్లో నీటిని వెదజల్లుతున్నారు. గత కొన్ని దశాబ్దాలుగా బాంబీ బకెట్లను హెలికాప్టర్లుకు అనుసంధానం చేస్తూ, అడవుల్లో చెలరేగే మంటలను అదుపు చేస్తున్నారు.బాంబీ బకెట్ అనేది ఒక ప్రత్యేక వైమానిక అగ్నిమాపక సామగ్రి. దీనిని 1980 నుండి వినియోగిస్తున్నారు. ఇది హెలికాప్టర్ నుంచి తేలికగా తెరవగల కంటైనర్. దిగువన ఉన్న ప్రాంతాలకు దీని ద్వారా నీటిని విడుదల చేయవచ్చు. బాంబీ బకెట్ వివిధ పరిమాణాలు, నమూనాలలో అందుబాటులో ఉంది. దీని సామర్థ్యం 270 లీటర్ల నుండి 9,840 లీటర్లకు మించి ఉంటుంది.బాంబీ బకెట్‌ను 1982లో కెనడియన్ వ్యాపారవేత్త డాన్ ఆర్నీ కనుగొన్నారు. ఈ బకెట్లను ఫైబర్‌గ్లాస్, ప్లాస్టిక్ కాన్వాస్‌తో మెటల్ ఫ్రేమ్‌తో తయారు చేస్తారు. ఇది హెలికాప్టర్లో బాహ్య ట్యాంక్ మాదిరిగా కనిపిస్తుంది. దీనిలో నీటిని ఎక్కడి నుండైనా నింపవచ్చు. అడవుల్లో కార్చిచ్చు నియంత్రణకు బాంబీ బకెట్లు ఎంతగానో ఉపయక్తమవుతాయి. -
ఇంట్లోనే ప్రసవించిన మహిళ.. బిడ్డను బాత్రూం బకెట్లో పెట్టి..
తిరువనంతపురం: కేరళ అలప్పుజలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ నిండు గర్భిణి ఇంట్లోనే ప్రసవించింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో తన బిడ్డను ఓ వస్త్రంలో చుట్టి బాత్రూంలోని బకెట్లో పెట్టి ఆస్పత్రికి వెళ్లింది. ఇంట్లో బకెట్లో ఉన్న బిడ్డను కాపాడాలని వైద్యులను కోరింది. ఆస్పత్రి అధికారులు వెంటనే ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించారు. నవజాత శిశువును కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులు హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. బాత్రూంలో బకెట్లో ఉన్న పసికందును బయటకు తీసుకొచ్చారు. తక్షణమే చెన్నగూర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శిశువు బరువు 1.3 కీజీలు ఉన్నట్లు తెలిపారు. శిశువును ఆస్పత్రిలో చేర్చిన అనంతరం బాగోగులు చూసుకునే బాధ్యతను పథానంతిట్ట చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు పోలీసులు. వలంటీర్ల సహకారంతో మెరుగైన చికిత్స కోసం చిన్నారిని కొట్టాయం మెడికల్ ఆస్పత్రికి తరలించారు. అయితే మహిళ ప్రసవించినప్పుడు ఆమె చుట్టుపక్కల ఎవరూ లేనట్లు తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావం కావడంతో బిడ్డను పట్టుకునే శక్తి లేక బకెట్లోనే పెట్టి చెన్నగూర్ ఆస్పత్రికి వెళ్లి అడ్మిట్ అయింది. జరిగిన విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగానే ఉన్నట్లు సమాచారం. చదవండి: ప్రియుడ్ని చంపి ముక్కలు ముక్కలుగా నరికిన ప్రియురాలు.. 400 కిలోమీటర్లు తీసుకెళ్లి బీచ్‌లో.. -
ఆగ్రహం కట్టలు తెంచుకున్న వేళ.. గోల్‌కీపర్‌పై బకెట్‌తో దాడి
A-లీగ్ మెన్ సాకర్ లీగ్‌లో అపశృతి చోటుచేసుకుంది. లీగ్‌లో భాగంగా శనివారం మెల్బోర్న్ సిటీ, మెల్బోర్న్ విక్టరీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రసాబాసగా మారింది. మ్యాచ్ జరుగుతుండగా గ్రౌండ్లోకి చొచ్చుకొచ్చిన అభిమానులు మెల్బోర్న్ సిటీ గోల్‌కీపర్ టామ్ గ్లోవర్పై బకెట్‌తో దాడికి పాల్పడ్డారు. దీంతో టామ్ గ్లోవర్ తల నుంచి రక్తం కారింది. దీంతో నిర్వాహకులు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మ్యాచ్‌లో 1-0తో మెల్బోర్న్ సిటీ ఆధిక్యంలో ఉన్న దశలో ఈ ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్ ప్రారంభమైన 20 నిమిషాల వ్యవధిలోనే మెల్బోర్న్ సిటీ గోల్ చేయడం ప్రత్యర్థి అభిమానులకు నచ్చలేదు. పైగా గోల్‌కీపర్ టామ్ గ్లోవర్ తొండిగా ఆడుతున్నాడంటూ మొదటి నుంచి అరుస్తూ వచ్చారు. అయితే ఇంతలో గోల్ నమోదు కావడంతో మెల్బోర్న్ విక్టర్స్ అభిమానులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అంతే ఒక్కసారిగా కొంతమంది అభిమానులు గోల్‌కీపర్ టామ్ గ్లోవర్ వైపు దూసుకొచ్చారు. రిఫరీ వచ్చి వద్దొని వారించినా వినకుండా మెటల్ బకెట్‌తో దాడి చేశారు. దీంతో భయాందోళనకు గురైన టామ్ గ్లోవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ తలకు గట్టిగా తగలడంతో రక్తం కారసాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక గోల్‌కీపర్‌పై దాడి చేయడాన్ని ఫుట్‌బాల్ ఆస్ట్రేలియా ఖండించింది. ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరం. ఆట అన్నాకా భావోద్వేగాలు సహజం. అయితే అవి హెచ్చుమీరితే ప్రమాదం. టామ్ గ్లోవర్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు అని పేర్కొంది. Fair to say the Melbourne Derby has kicked-off. Match abandoned. pic.twitter.com/Y3SJ8X2cp4 — Tom Reed (@tomreedwriting) December 17, 2022 చదవండి: Rafael Nadal: 18 ఏళ్ల బంధం తెంచుకున్న నాదల్ -
Pearl Farming In Bucket Special Video: బకెట్లో ముత్యాలు
-
బకెట్లో పడి మృత్యు ఒడికి చిన్నారి
మైసూరు: బకెట్లో పడి రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదం జిల్లాలోని హుణసూరు తాలూకా తరికళ్లు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సుందర్రాజ్ కుమారుడు సమర్థ(2) శుక్రవారం మధ్యాహ్నం బుడి బుడి అడుగులు వేసుకుంటూ బాత్రూంలోకి వెళ్లి బకెట్లోకి తొంగిచూసి నీటిలోకి తలకిందులుగా పడిపోయాడు. కొంతసేపటికీ ఇంట్లోని వారు బాలుడి కోసం గాలించి బాత్రూమ్లోకి వెళ్లి చూడగా అప్పటికే ప్రాణాలు విడిచాడు. -
బకెట్లో మనిషి చేయి లభ్యం
రాంచీ : మనిషి చేయి ఒకటి బకెట్లో లభించడం కలకలం రేపింది. ఈ ఘటన జార్ఖండ్‌లోని బారియాటు ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. బకెట్లో తెగిన చేయి ఒకటి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఈ విషయాన్ని రాంచీ పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు వచ్చి బకెట్లో లభించిన చేతిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ తెగిన చేతి ఒక క్యాన్సర్ పేషంట్దని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు. పరీక్షకు సంబంధించి ల్యాబ్‌కు పంపేందుకు ఒక చోట ఉంచగా అది మాయమైనట్లు సదరు ఆసుపత్రి సిబ్బంది పేర్కొంది. కాగా తెగిన చేయి ఆసుపత్రి నుంచి బకెట్లోకి ఎలా వచ్చిందన్న దానిపై విచారణ జరుపుతున్నట్లు రాంచీ సిటీ ఎస్పీ సౌరభ్ తెలిపారు. చదవండి : అస్సాంలో దారుణం.. ఆలస్యంగా వెలుగులోకి గోద్రా అల్లర్లు: మోదీ పేరు తొలగింపు -
కాదేదీ గుర్తుకనర్హం!
సాక్షి, సిటీబ్యూరో: కత్తెర, రిఫ్రిజిరేటర్‌తోపాటు ఇస్త్రీ పెట్టె, పెన్‌స్టాండ్, హెడ్‌ఫోన్, బ్రష్, బెలూన్ తదితరాలు స్వతంత్ర అభ్యర్థుల గుర్తులుగా ఉన్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లకు కేటాయించిన గుర్తుల్ని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిశోర్ ప్రకటించారు. వీటిలో కప్ సాసర్, రూమ్ కూలర్, బకెట్, టెలిఫోన్, బ్యాట్స్‌మన్, ప్రెషర్‌కుక్కర్, గ్యాస్ సిలిండర్, ద్రాక్ష, డైమండ్, హెల్మెట్, ట్రాక్టర్ నడుపుతున్న రైతు, సైకిల్పంపు, బ్యాటరీ టార్చ్, బేబివాకర్, ఫ్లూట్, క్యారమ్బోర్డు తదితరమైనవి ఉన్నాయి. -
అందమైన కథ బకెట్ లిస్ట్
మన కోరికలు మనమే తీర్చుకోవడంలో థ్రిల్లేముంది? ఎదుటి వారి కోరికలు తీర్చడంలో ఉన్న తృప్తిని ఎప్పుడైనా అనుభవించామా? ‘బకెట్ లిస్ట్’ అనేది పాశ్చాత్య సమాజం నుంచి మనకు వచ్చిన ఒక భావన. ‘జీవితంలో మనం నెరవేర్చుకోవాలనుకునే కోరికల పట్టిక’ను బకెట్ లిస్ట్ అంటారు. ఇప్పుడు ఆ పేరుతో ఒక మరాఠి సినిమా వస్తోంది. మాధురి దీక్షిత్ మొదటిసారి మరాఠిలో నటించింది. మే 25న విడుదల. ఏమిటి దాని విశేషం?ఇందులో మాధురి దీక్షిత్‌కు గుండెజబ్బు. ఎవరో ఒక దాత గుండెను దానం చేస్తే తప్ప బతకదు. చివరకు దాత దొరుకుతుంది. మాధురి కొత్త గుండెతో కొత్త ఊపిరి పొందుతుంది. ‘అవయవ దానం’ ద్వారా ఒక అమ్మాయి తన శరీరంలోని ముఖ్య అవయవాలను దానం చేసి ఎనిమిది మందికి కొత్త జీవితం ఇచ్చి మరణించిందని మాధురి తెలుసుకుంటుంది. అంతమందిని బతికించిన ఆ అమ్మాయి ఆశలూ ఆశయాలూ తీరాయా? ఆమె కోసం ఏం చేయగలం అని మాధురి అనుకుంటుంది. ఆ అమ్మాయికి ఒక ‘బకెట్ లిస్ట్’ ఉందని తెలుసుకుంటుంది. – బైక్ మీద ఒంటిరిగా దేశం తిరగాలి. – పబ్‌కు వెళ్లాలి– ఎవరిదైనా పెళ్లిలో బాగా అల్లరి చేయాలి– రణధీర్ కపూర్‌తో సెల్ఫీ దిగాలి ఇలాంటి కోరికలు ఉన్న ఒక టీనేజ్ అమ్మాయి ఆ అమ్మాయి. ఈ చిన్న చిన్న కోరికలు కూడా తీరకుండా తనలాంటి వారిని బతికించి మరణించిందా అని దుఃఖపడుతుంది మాధురి దీక్షిత్. మరి దానికి కాంపెన్సేషన్? వాటిని తాను తీర్చడానికి అంటే ఆ అమ్మాయిలా కొన్నాళ్లు జీవించడానికి బయలుదేరడమే. కాని ఆ ప్రయత్నంలో మాధురి ఏం తెలుసుకుంటుంది? తన జీవితాన్ని తాను తెలుసుకుంటుంది, తన కోరికలు తెలుసుకుంటుంది. ట్రైలర్లో మాధురి ఎంతో అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రమోషన్లో పాల్గొంటోంది. ఈ అందమైన కథను కరణ్ జొహర్ నిర్మాతగా మార్చి ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. ఈ కథ అన్ని భాషల్లోకి రీమేక్ అవ్వొచ్చని మనకు అనిపించడం లేదూ? -
బకెట్లో పడి చిన్నారి మృత్యువాత
కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : నీళ్లతో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు బకెట్లో పడి ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వైఎస్సార్ జిల్లా కమలాపురంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన బోనాల షావలి, కృష్ణవేణి దంపతులకు పెళ్లయిన 9 ఏళ్ల తర్వాత శ్రావణి(4) పుట్టింది. శనివారం ఉదయం ఆమెకు స్నానం చేయించేందుకు తల్లి బాత్రూంకు తీసుకెళ్లింది. ఇంతలో కిచెన్‌లో పని గుర్తుకురావడంతో చిన్నారిని నీళ్ల బకెట్ వద్ద వదిలి అటుగా వెళ్లింది. బకెట్లో నీళ్లతో ఆడుకుంటూ శ్రావణి అందులో పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత తల్లి వచ్చి చూసేసరికే శ్రావణి నీళ్లలో ఊపిరాడక మృతి చెంది ఉంది. ఒక్కగానొక్క కూతురి మరణంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. -
బకెట్లో పడి చిన్నారి మృతి
మహబూబ్‌నగర్(గోపాల్పేట్): బకెట్లో పడి ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా గోపాల్పేట మండలం నాగాపూర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి, భార్గవి దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు బిట్టు(2)ను మంచం మీద పడుకోబెట్టి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ విషాదం జరిగింది. ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తూ మంచం పక్కనే ఉన్న నీళ్ల బకెట్లో పడి మృతి చెందాడు. బాలుడు బకెట్లో పడ్డ సంగతి ఆలస్యంగా తెలియడంతో అప్పటికే ఘోరం జరిగిపోయింది. చిన్నారి బిట్టు మృతితో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. -
బక్కెట్ నిండా ఆహ్లాదం
బ్యూటిప్స్ రెండు టీ స్పూన్ల కోకా బటర్‌ను కరిగించి అందులో టీ స్పూన్ విటమిన్-ఇ ఆయిల్, టీ స్పూన్ నువ్వుల నూనె, 5-6 చుక్కల ఆరెంజ్ ఆయిల్, టీ స్పూన్ అల్లం రసం వేసి, కలిపి వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని ఒంటికి మసాజ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై, ఒత్తిడి నుంచి త్వరగా విశ్రాంతి లభిస్తుంది. స్నానం చేసే బకెట్ నీటిలో కొబ్బరిపాలు, రోజ్ వాటర్ కలపాలి. ఆ నీటితో స్నానం చేస్తే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. పెప్పర్ మింట్ ఆయిల్(మార్కెట్లో లభిస్తుంది)ను కొద్దిగా నీటిలో కలుపుకొని స్నానం చేస్తే అలసిన దేహానికి సరైన విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి తొలగిపోయి ఆహ్లాదంగా అనిపిస్తుంది. -
ఊరెళ్తున్నారా..?
ఇంటిల్లిపాదీ ఎక్కువ రోజులు ఊరెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు.. ప్రీతిపాత్రమైన ఇంటిపంటలను, పూలమొక్కలను, ఔషధమొక్కలను బతికించుకోవడం ఎలా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఈ సమస్యకు ‘ఇంటిపంట’ బృంద సభ్యురాలు కాట్రగడ్డ వరూధిని సృజనాత్మకతను జోడించి.. ఖర్చులేని చక్కటి పరిష్కారాన్ని ఆవిష్కరించారు. ఆమె 4 పొడవాటి కుండీల్లో ఆకుకూరలు పెంచుతున్నారు. వీటికన్నా ఎత్తులో ఒక స్టూల్‌పైన బక్కెట్ ఉంచి.. అందులో నీటిని నింపారు. ఒక నూలు తాడును తీసుకొని.. ఒక చివరను బక్కెట్లో వేసి.. రెండో చివరను కుండీలోని మట్టిలో పెట్టారు. కదిలిపోకుండా చిన్న రాయిని కట్టారు. 4 కుండీలకూ ఇలాగే చేశారు. ఆ తాళ్ళ ద్వారా మొక్కల వేళ్లకు అవసరం మేరకు నీటి తేమ అందింది. 12 రోజుల తర్వాత ఆమె ఊరు నుంచి వచ్చి చూస్తే.. బక్కెట్లో చాలా నీరు ఖర్చయింది. ఆకుకూరలు ఏపుగా పెరుగుతూ పలకరించడంతో పట్టలేని సంతోషం కలిగింది! ఆ సంతోషాన్ని ఆమె ‘ఇంటిపంట’ ఫేస్బుక్ గ్రూప్ సభ్యులతో పంచుకున్నారు... ఇంకేముంది లైకుల పంట పండింది! -
బకెట్లో పడి బాలుడు మృతి
చేర్యాల: వరంగల్ జిల్లా చేర్యాల మండలం ఐనాపూరులో మంగళవారం బకెట్లో పడి బాలుడు మృతి చెందాడు. గ్రామానికి చెందిన తడ్కపల్లి రుషి-సునీతల కుమారుడు వర్షిత్ (14 నెలలు). ఆటోడ్రైవర్ అయిన రుషి బయటకు వెళ్లగా, సునీత ఇంట్లో పనులు చేసుకుంటోంది. ఈ క్రమంలో వర్షిత్ ఆడుకుంటూ ఇంటి బయట నిండుగా ఉన్న బకెట్ నీళ్లలో పడిపోయాడు. చిన్నారి కనిపించకపోవడంతో సునీత వెతకగా బకెట్లో మృతి చెంది ఉన్నాడు.