బక్కెట్ నిండా ఆహ్లాదం
బ్యూటిప్స్
రెండు టీ స్పూన్ల కోకా బటర్‌ను కరిగించి అందులో టీ స్పూన్ విటమిన్-ఇ ఆయిల్, టీ స్పూన్ నువ్వుల నూనె, 5-6 చుక్కల ఆరెంజ్ ఆయిల్, టీ స్పూన్ అల్లం రసం వేసి, కలిపి వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని ఒంటికి మసాజ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై, ఒత్తిడి నుంచి త్వరగా విశ్రాంతి లభిస్తుంది.
స్నానం చేసే బకెట్ నీటిలో కొబ్బరిపాలు, రోజ్ వాటర్ కలపాలి. ఆ నీటితో స్నానం చేస్తే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. పెప్పర్ మింట్ ఆయిల్(మార్కెట్‌లో లభిస్తుంది)ను కొద్దిగా నీటిలో కలుపుకొని స్నానం చేస్తే అలసిన దేహానికి సరైన విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి తొలగిపోయి ఆహ్లాదంగా అనిపిస్తుంది.