నవల రాసిన 13 ఏళ్ల అమ్మాయి.. త్వరలో ఇది సినిమాగా రిలీజ్ | Butterfly Novel Into Movie Soon To Be Release | Sakshi
Sakshi News home page

నవల రాసిన 13 ఏళ్ల అమ్మాయి.. త్వరలో ఇది సినిమాగా రిలీజ్

Published Mon, Feb 5 2024 6:13 PM | Last Updated on Mon, Feb 5 2024 6:13 PM

Butterfly Novel Into Movie Soon To Be Release - Sakshi

సినిమాల్ని చాలావరకు కథలు, నవలల ఆధారంగానే తీస్తుంటారు. అయితే అనుభవజ్ఞులైన రైటర్స్ రాసిన నవలల ఆధారంగా ఇప్పటికే చాలా మూవీస్ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఓ 13 ఏళ్ల అమ్మాయి రాసిన 'బటర్ ఫ్లై' నవలని సినిమాగా తీయబోతున్నారు. హైదరాబాద్‌కి చెందిన సైరా తన పదేళ్ల వయసులోనే ఈ బుక్ రాసింది. అది కూడా విడాకుల కాన్సెప్ట్ గురించి. ఇప్పుడు దాన్నే ఓ నిర్మాణ సంస్థ.. సినిమాగా తీయబోతుంది.

(ఇదీ చదవండి: దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?)

ఈ అమ్మాయి రెండో క్లాసులో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ నోటి నుంచి ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకోబోతున్నారనేది మాట విన్నది. ఆ తర్వాత కూడా క్లాస్‌మేట్స్ పేరెంట్స్ విడిపోవడం గురించి వింటూ వచ్చింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు విడిపోవడం వల్ల పిల్లలు ఎలా మదనపడుతున్నారనేది ఓ పుస్తకంగా రాసింది. ఈ మధ్యే జనవరి 26-28 వరకు జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లోనూ సైరా పాల్గొంది. ఈ నవల గురించి మాట్లాడిన సైరా తల్లి.. ఈ నవలని సినిమాగా తీయడానికి పలు నిర్మాణ సంస్థ తమని సంప్రదిస్తున్నాయని చెప్పింది. అంటే ఈ నవల.. త్వరలో సినిమాగా రాబోతుందనమాట.

(ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్‌ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement