butterfly
-
‘సీతాకోక’..సర్వే
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సీతాకోకచిలుక ఏ చెట్టుపై వాలుతుంది.. ఏ పువ్వులోని మకరందాన్ని స్వీకరిస్తుంది ? గతంలో ఉన్న సీతాకోక చిలుకలు.. ప్రస్తుతం ఉన్నాయా? వాటి ఆవాసం..అనుకూలత మెరుగుపడాలంటే ఏం చేయాలి? తదితర విషయాలు తెలుసుకుంటూ వాటి సంరక్షణకు కృషి చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా అటవీ శాఖ అధికారులు.మూడు నెలలుగా కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో బటర్ ఫ్లై జాతుల గుర్తింపునకు సర్వే జరుగుతోంది. డబ్ల్యూడబ్ల్యూఎఫ్(వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్), మహారాష్ట్రకు చెందిన ప్రొఫెసర్ రాంజన్ విరాని, పక్షుల నిపుణులతో ముందుగా 30 మంది అధికారులకు శిక్షణ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో ఉండే అధికారులు ప్రతీరోజు సర్వే చేస్తున్నారు. రంగు, ఆకారం తదితర గుణాల ఆధారంగా సీతాకోక చిలుకలను గుర్తించి రికార్డు చేస్తున్నారు.100 నుంచి 150జాతులు ఉన్నట్టు అంచనాకవ్వాల్ పరిధిలోని కోర్, బఫర్ ప్రాంతాల్లో 100 నుంచి 150 సీతాకోక చిలుకల జాతులు ఉంటాయని అంచనా. కడెం, గోదావరి, ప్రాణహితతోపాటు వాగులు, వంకలు, రిజర్వు ఫారెస్టు, మైదాన ప్రాంతాల్లోనూ సర్వే చేస్తున్నారు. ఇప్పటి వరకు 60 రకాల వరకు సీతాకోక చిలుకలను గుర్తించారు. వాటి ఫొటోలతోపాటు ఆవాసం, జీవన విధానం, ప్రత్యేకత తదితర వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు. టైగర్ సఫారీకి వచ్చే పర్యాటకులకు బటర్‌ఫ్లై పార్కులు చూపిస్తూ ఓ ప్రత్యేక అనుభూతి కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు. జన్నారం పరిధిలో ఓ బటర్‌ఫ్లై పార్కును అభివృద్ధి చేశారు. ఇదే తరహాలో మంచిర్యాల పట్టణానికి సమీపంలో గాంధారి ఖిల్లా, చెన్నూరు అర్బన్ పార్కు, బెల్లంపల్లి డివిజన్లలోనూ సిద్ధం చేస్తున్నారు. వనదర్శినిలో భాగంగా స్థానికులు, పర్యాటకులకు అడవులు, వన్యప్రాణులపై అవగాహనతోపాటు ఇకపై సీతాకోక చిలుక జీవన విధానం, వాటి పరిరక్షణ చర్యలను ప్రత్యేకంగా వివరించనున్నారు. జీవ వైవిధ్యానికి గుర్తు ప్రకృతిలో జీవ వైవి«ధ్యానికి గుర్తుగా సీతాకోక చిలుకను చెబుతారు. వీటి మనుగడే అక్కడి పర్యావరణ అనుకూలత, ప్రతికూలతను తెలియజేస్తుందని నిపు ణులు పేర్కొంటున్నారు. భూమిపై మొలిచే మొక్కలు, చెట్లు, గాలిలో ఎగిరే పక్షులు, ఇతర క్రిమికీటకాలు, జంతుజాలంతో ప్రత్యక్ష సంబంధముండే సీతాకోక చిలుకలు ఆ ప్రాంతం పర్యావరణ వ్యవస్థ, ఆహారపు గొలుసు లో కీలకంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పుష్పాల పుప్పొడి, మకరందం, ఆవాసాలు, విత్తన వ్యాప్తి, పక్షుల మనుగడ, క్రిమికీటకాలను సమతుల్యం చేయడం వంటివి సీతాకోకచిలుకకు ప్రధాన క్రియలుగా ఉంటాయి. ప్రత్యేకంగా పార్కులు కవ్వాల్‌లో కేవలం పులులే కాకుండా, అన్ని జీవులను సంరక్షించేవిధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ ఎన్నో రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయి. వాటిని సంరక్షిస్తే పర్యావరణానికి మేలు జరుగుతుంది. పర్యాటకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇందుకు ప్రత్యేకంగా బటర్‌ఫ్లై పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. - శివ్‌ఆశిష్ సింగ్, జిల్లా అటవీ అధికారి, మంచిర్యాల -
బ్లాక్ సీతాకోకచిలుకలా 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టి (ఫొటోలు)
-
సీతాకోక చిలుక పాలు గురించి విన్నారా? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!
ఆవు పాలు, గేదే పాలు, ఒంటె పాలు ఇలా రకరకాల పాల గురించి విన్నారు. వాటిలో అత్యంత ఖరీదైన పాలు ఏవంటే ఒంటె పాలని ఠక్కున చెప్పేస్తారు. కానీ వాటన్నింటికంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాలు ఇంకొకటి ఉన్నాయి. ఔను! అది కూడా ఓ చిన్న జీవి నుంచి వచ్చే పాలవి. ఎవ్వరూ నమ్మరు దాన్నుంచి పాలు వస్తాయా ? అని. కానీ ఓ జపాన్ వ్యక్తి ఆ జీవి నుంచి పాలను తీసి కోట్లు సంపాదిస్తున్నాడు. ఇంతకీ ఏ జీవి అంటే.. అదేనండి సీతాకోక చిలుక. ఏంటీ సీతాకోక చిలుక నుంచా..? అని నోరెళ్లబెట్టకండి. నిజంగానే సీతాకోక చిలుక నుంచి పాలు తీసున్నాడు జపాన్ వ్యక్తి. అసలు సీతాకోక చిలుకకు పాలు ఎలా వస్తాయనే కదూ..! లార్వా దశలో ఓ చిన్న గుడ్డు నుంచి గొంగళి పురుగు బయటకొచ్చి ఏ చెట్టు కాండానికో, ఏ గోడకో బలంగా చుట్టుకుని దాని చుట్టు ఓ దూదిలాంటి రక్షణ వలయాన్ని ఏర్పారుచుకుంటుదంది. అది ప్యూపా దశకు చేరుకోవడానికి నాలుగు వారాలు పడుతుంది. సరిగ్గా అది ప్యూపా దశకు చేరుకుని ఇంకొక్క వారంలో సీతాకొక చిలుకగా రూపాంతరం చెందుతుందనంగా దాని బాడిలో భారీ మొత్తంలో ద్రవాలు ఉంటాయి. ఆ టైంలో దాని కకూన్(గూడు) నుంచి ఈ ప్యూపాను తీసి జెంటిల్‌గా తోక భాగాన్ని ప్రెస్ చేయగానే తెల్లటి పాల వంటి పదార్థం వస్తుంది. ఇది చాలా గాఢతగా ఉంటుంది. ఇది ఒక లీటర్ నీటిలో కలిపి ఉపయోగించాలి. ఈ పాలని మార్కెట్లో అమ్మి కోట్లు సంపాదిస్తున్నాడు జపాన్ వ్యక్తి. ఈ సీతకోక చిలుక పాలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పాలల్లో ఒకటిగా నిలిచింది. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటంటే.. ఇది ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతున్న మహిళల పాలిట వరంలా ఉపయోగపడుతుంది. దీనిని ఉపయోగించిన చాలామంది స్త్రీలు ఈ సమస్య నుంచి బయటపడ్డారట కూడా. ఇది నేచురల్ వయాగ్రాల కూడా పనిచేస్తుందంట ఇందులో శరీరానికి అవసరమైన విటమిన్లు, పోషకాలు ఉన్నాయట. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు నిపుణులు. > (చదవండి: సీఫుడ్ ఇష్టంగా తినేస్తున్నారా? శాస్త్రవేత్తల స్ట్రాంగ్ వార్నింగ్!) -
Priyanka Singh: బటర్‌ఫ్లై మామ్
ఇల్లంటే ఎలా ఉండాలి? ఇంటిముందు గుమ్మానికి ఆకుపచ్చ తోరణం ఉండాలి. గుమ్మానికి ఇరువైపులా పచ్చటి మొక్కలుండాలి. ఆ మొక్కలకు రంగురంగుల పువ్వులుండాలి. ఇంట్లోకి అడుగుపెడుతుంటే పరిమళాలు స్వాగతం పలుకుతుండాలి. ఇవన్నీ ముంబయి నగరంలో, మల్టీ స్టోరీడ్ బిల్డింగ్‌లో సాధ్యమయ్యే పనేనా? సాధ్యం కాదని ఊరుకుంటే ప్రియాంక సింగ్ బటర్‌ఫ్లై మామ్ అయ్యేదే కాదు. ఆమె ఇల్లు వేలాది సీతాకోక చిలుకలకు పుట్టిల్లయ్యేదీ కాదు. ప్రియాంక సింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి పట్టణం. గంగానది తీరాన, వందల ఏళ్ల నాటి మహావృక్షాల నీడన పెరిగిన బాల్యం ఆమెది. చదువు, ఉద్యోగం, పెళ్లి... ఆమె గమ్యాన్ని నిర్దేశించాయి. ముంబయిలో అడుగు పెట్టింది. ఆమె ఫ్లాట్ ఆ భవనంలో పదమూడవ ఫ్లోర్లో ఉంది. తాను గడిపిన అందమైన బాల్యం తన పిల్లలకు ఉండదని దిగులు పడిందామె. మహావృక్షాల నీడన కాకున్నా, కనీసం అడుగు ఎత్తు మొక్కల మధ్య పెరిగినా చాలనుకుంది. బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచింది. మొక్కలను సేంద్రియ పద్ధతిలో పెంచాలనుకోవడమే ఆమెకు తెలియకుండా ఆమె చేసిన ఓ మంచిపని. మొక్కలకు చీడపీడలకు రసాయన క్రిమిసంహారక మందులు వాడకుండా సేంద్రియాలతో పెంచింది. ఒకరోజు ఒక లార్వా ఆమె మొక్కల ఆకుల కింద కనిపించింది. రోజుల్లోనే అది ప్యూ΄ా దశకు చేరడం, ఆ తర్వాత రంగురంగుల సీతాకోక చిలుక రెక్కలు విచ్చుకుని ఎగరడం అన్ని దశలూ చూస్తుండగానే జరిగి΄ోయాయి. అప్పటి నుంచి ఆమె సీతాకోక చిలుకల పరిణామక్రమాన్ని చదవడం మొదలు పెట్టింది. ఆ తర్వాత రసాయన క్రిమిసంహారిణులను ఇంట్లోకి తీసుకురావడమే మానేసింది. ఇప్పుడామె బాల్కనీలో నిమ్మజాతి చెట్లు, అక్షింతల చెట్టు, కరివే΄ాకు, వెస్ట్ ఇండియన్ జాస్మిన్... వంటి మొక్కలున్నాయి. వాటి మీద మోనార్క్ బటర్‌ఫ్లై, కామన్ జాయ్, లైమ్ స్వాలోటెయిల్ వంటి అరుదైన జాతుల సీతాకోక చిలుకలు కనిపిస్తున్నాయి. అలా వచ్చి వెళ్లి΄ోకుండా ఆ చెట్ల ఆకుల మీదనే గుడ్లు పెడుతున్నాయి. సంతతిని వృద్ధి చేస్తున్నాయి. ఆమె ఇంట్లో సీతాకోక చిలుకలకు అనువైన వాతావరణం ఉంది. ఆ వాతావరణాన్ని పరిరక్షిస్తోందామె. అందుకే ప్రియాంక సింగ్‌ను బటర్ ఫ్లై మామ్ అంటున్నారు ఆమె స్నేహితులు. తాను జీవవైవిధ్యత కోసం అంకితమవుతానని వారణాసి నుంచి ముంబయికి పయనమైనప్పుడు కలలో కూడా ఊహించలేదు... అంటుంది ప్రియాంక సింగ్. ఆమెకు సీతాకోక చిలుకలను చూస్తూ తేడాలను గుర్తించడంతో΄ాటు ప్రతి సీతాకోక చిలుకనూ ఫొటో తీయడం అలవాటైంది. ఇప్పటివరకు ఆమె మినీ గార్డెన్లో ఐదు వేలకు పైగా సీతాకోక చిలుకలు కొలువుదీరాయి. రెక్కలొచ్చిన తర్వాత ఎగిరి వెళ్లి΄ోయాయి. -
నవల రాసిన 13 ఏళ్ల అమ్మాయి.. త్వరలో ఇది సినిమాగా రిలీజ్
సినిమాల్ని చాలావరకు కథలు, నవలల ఆధారంగానే తీస్తుంటారు. అయితే అనుభవజ్ఞులైన రైటర్స్ రాసిన నవలల ఆధారంగా ఇప్పటికే చాలా మూవీస్ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం ఓ 13 ఏళ్ల అమ్మాయి రాసిన 'బటర్ ఫ్లై' నవలని సినిమాగా తీయబోతున్నారు. హైదరాబాద్‌కి చెందిన సైరా తన పదేళ్ల వయసులోనే ఈ బుక్ రాసింది. అది కూడా విడాకుల కాన్సెప్ట్ గురించి. ఇప్పుడు దాన్నే ఓ నిర్మాణ సంస్థ.. సినిమాగా తీయబోతుంది. (ఇదీ చదవండి: దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?) ఈ అమ్మాయి రెండో క్లాసులో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ నోటి నుంచి ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకోబోతున్నారనేది మాట విన్నది. ఆ తర్వాత కూడా క్లాస్మేట్స్ పేరెంట్స్ విడిపోవడం గురించి వింటూ వచ్చింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు విడిపోవడం వల్ల పిల్లలు ఎలా మదనపడుతున్నారనేది ఓ పుస్తకంగా రాసింది. ఈ మధ్యే జనవరి 26-28 వరకు జరిగిన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లోనూ సైరా పాల్గొంది. ఈ నవల గురించి మాట్లాడిన సైరా తల్లి.. ఈ నవలని సినిమాగా తీయడానికి పలు నిర్మాణ సంస్థ తమని సంప్రదిస్తున్నాయని చెప్పింది. అంటే ఈ నవల.. త్వరలో సినిమాగా రాబోతుందనమాట. (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) -
రెక్కల పురుగు కథ ఏమిటో అడుగు
రెక్కల పురుగులన్నీ సీతాకోక చిలుకలు కావు.కాని సీతాకోకచిలుకలన్నీ రెక్కల పురుగులే.హిమాలయప్రాంతాలకు చెందిన మాత్ (రెక్కల పురుగు)లపై తీసిన ‘నాక్టర్న్స్’ డాక్యుమెంటరీ అమెరికాలో జరిగిన ‘సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’లో స్పెషల్ జ్యూరీ అవార్డ్ పొందింది. ఇండియా నుంచి అవార్డ్ గెలిచిన డాక్యుమెంటరీ ఇదొక్కటే. డైరెక్టర్ అనుపమ శ్రీనివాసన్ పరిచయం. అమెరికాలో ప్రతి ఏటా జరిగే సండాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో నామినేషన్ పొందడమే పెద్ద గుర్తింపుగా భావిస్తారు. అవార్డు రావడం ఇంకా పెద్ద గౌరవం. ఈ సంవత్సరం ఉటాలో జనవరి 18–28 తేదీల మధ్య జరిగిన ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో మన దేశం నుంచి ‘వరల్డ్ డాక్యుమెంటరీ కాంపిటీషన్’లో ‘నాక్టర్న్స్’లో చోటు సంపాదించడమే కాకుండా ‘స్పెషల్ జ్యూరీ అవార్డ్ ఫర్ క్రాఫ్ట్’ అవార్డు పొందింది. అనిర్ బన్‌దత్తాతో కలిసి అనుపమా శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ రెక్కల పురుగుల లోకంలో ప్రేక్షకులను విహరింపచేస్తుంది. ఢిల్లీ కృత్రిమత్వం నుంచి ‘నేను, అనిర్ బన్ దత్త ఢిల్లీలో జీవిస్తుంటాము. రోజూ ఒకే రకమైన ట్రాఫిక్, ΄÷ల్యూషన్. ప్రకృతితో మాకు ఏమీ సంబంధం లేదనిపించేది. ఆ సమయంలో మాకు మాన్సీ అనే పర్యావరణ శాస్త్రవేత్త పరిచయం అయ్యింది. హిమాలయాలలో ‘మాత్స్’ (రెక్కల పురుగులు) మీద పరిశోధన చేస్తున్నానని చెప్పింది. వాతావరణ మార్పుల వల్ల వీటికి కలుగుతున్న నష్టం ఏమిటో ఆమె తెలుసుకుంటోంది. ఇది డాక్యుమెంటరీ చేయాల్సిన విషయం అనుకున్నాం. గత కొన్నేళ్లుగా నేను, అనిర్బన్ డాక్యుమెంటరీలు తీస్తున్నాం. మెయిన్‌స్ట్రీమ్ పట్టించుకోని విషయాలను మేం పట్టించుకుంటాం. దీనికి ముందు మేము ఇండో–మయన్మార్ సరిహద్దులోని తోరా అనే పల్లెకు (మణిపూర్‌లో ఉంది) కరెంటు రావడం గురించి డాక్యుమెంటరీ తీశాం. దాని పేరు ‘ఫ్లికరింగ్ లైట్స్’. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా కరెంటు లేని పల్లె ఉండటం, దానికి కరెంటు కోసం కొందరు ఎదురు చూడటం, దేశంలోనే ఉన్నా పరాయీకరణ భావన ఎదుర్కొనడం దీనిలో చూపించాం. ఈ డాక్యుమెంటరీకి ఆమ్స్టర్ డ్యామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అవార్డు దక్కింది. ఇప్పుడు మాత్స్ గురించి తీసిన ‘నాక్టర్న్స్’కు కూడా సండాన్స్ ఫెస్టివల్లో అవార్డ్ వచ్చింది. ఇందుకు మాకు చాలా సంతోషంగా ఉంది’ అని తెలిపింది అనుపమా శ్రీనివాసన్. కష్టనష్టాలకు ఓర్చి ‘నాక్టర్న్స్ డాక్యుమెంటరీలో రెండే పాత్రలుంటాయి. ఒకటి పర్యావరణ శాస్త్రవేత్త మాన్సీ, రెండు హిమాలయాల స్థానిక బగున్ తెగకు చెందిన బికి అనే గిరిజనుడు. అతని సాయంతో ఆమె రెక్కల పురుగులను అన్వేషణ చేస్తుంటే మేం రికార్డు చేస్తూ వెళ్లాం. సాయంత్రం అయ్యాక మాన్సీ పలచటి తెర కట్టి దాని వెనుక నీలం రంగు బల్బు వెలిగించేది. ఆ తర్వాత కాసేపటికే వేలాది రెక్కల పురుగులు వచ్చి ఆ స్క్రీన్ మీద వాలేవి. వాటి రంగులు, రూపాలు, ఆకారాలు అన్నీ అద్భుతం. అవి తాము మనిషితో కలిసి జీవిస్తున్నామన్నట్టు ఉన్నాయి. మనమే వాటితో కలిసి జీవిస్తున్నాం అన్న ఎరుకలో లేము’ అంటుంది అనుపమా శ్రీనివాసన్. ‘హిమాలయాల్లో షూటింగ్... అదీ అడవుల్లో అంటే చాలా శ్రమ. అక్కడంతా తేమగా ఉంటుంది. ఏ క్షణమైనా వాన పడొచ్చు. అంతేగాక రాత్రి వేళల్లో విపరీతమైన చలి. జలగలు పట్టి పీక్కుతినాలని చూసేవి. కాని ఇన్ని సమస్యల మధ్య ఆ రెక్కల పురుగుల జీవనం, వాటి కదలికలు ఎంతో ఆసక్తి కలిగించేవి. మా డాక్యుమెంటరీకి అవార్డు రావడానికి కారణం మేము ప్రకృతి ధ్వనులను పరిపూర్ణంగా రికార్డు చేశాం. ఆ ధ్వనుల వల్ల అడవిలో ఉంటూ మాత్స్‌ను చూస్తున్న అనుభూతి కలుగుతుంది’ అంది అనుపమా శ్రీనివాసన్. -
క్రాంప్టన్‌లో బటర్‌ఫ్లై విలీనం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్‌లో కిచెన్, స్మాల్ అప్లయెన్సెస్ కంపెనీ బటర్‌ఫ్లై గంధిమతి విలీనం కానుంది. ఏకీకృతం కావడం ద్వారా సంయుక్త సంస్థ పలు అంశాలలో వ్యాపార లబ్దిని పొందనుంది. దీంతో రెండు కంపెనీల కార్పొరేట్, పాలన తదితర అంశాలు సైతం సరళతరంకానున్నాయి. షేర్ల మార్పిడి ద్వారా విలీనంకానున్నట్లు రెండు సంస్థలూ విడిగా తెలియజేశాయి. ఇందుకు 22:5 నిష్పత్తిలో షేర్ల మార్పిడికి తెరతీయనున్నాయి. అంటే బటర్‌ఫ్లై వాటాదారులకు తమవద్దగల ప్రతీ 5 షేర్లకుగాను 22 క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ షేర్లను జారీ చేస్తారు. కాగా.. విలీనానికి సెబీ, స్టాక్ ఎక్సే్ఛంజీలుసహా పలు నియంత్రణ సంస్థల అనుమతిని పొందవలసి ఉంది. రుణదాతలు, ఎన్సీఎల్ టీ, వాటాదారులు సైతం ఆమోదముద్ర వేయవలసి ఉంది. కొత్త ప్రొడక్టులపై దృష్టి బటర్‌ఫ్లైతో విలీనం ద్వారా కొత్త ప్రొడక్టుల తయారీపై మరింత దృష్టి పెట్టేందుకు వీలుచిక్కనున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎండీ శంతను ఖోస్లా పేర్కొన్నారు. విలీనం వాటాదారులకు మరింత విలువను చేకూర్చుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్తో విలీనం ద్వారా కంపెనీ కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించగలదని బటర్‌ఫ్లై ఎండీ రంగరాజన్ శ్రీరామ్ పేర్కొన్నారు. ఇది వృద్ధికి, ప్రొడక్టుల అభివృద్ధికి భారీ అవకాశాలకు తెరతీస్తుందని అభిప్రాయపడ్డారు. బటర్‌ఫ్లై గంధిమతిలో 81 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు రూ. 2,076 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. -
ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ బట్టర్ఫ్లై మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తోంది. ఓ వైపు గ్లామర్ పాత్రలు పోషిస్తూనే.. మరోవైపు నటన ప్రాధాన్యమున్న పాత్రలతో మెప్పిస్తుంది. ఈ ఏడాది ‘కార్తికేయ-2’ మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ రీసెంట్గా ‘18పేజెస్’తో మరో విజయం ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం 18 పేజెస్ మూవీ సక్సెస్‌ని ఆస్వాదిస్తోన్న అనుపమ మరో చిత్రం బటర్ ఫ్లై. ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేసింది. చదవండి: షారుక్ పఠాన్ చిత్రానికి సెన్సార్ బోర్డు షాక్, మూవీ టీంకు బోర్డు ఆదేశం.. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం గత రాత్రి నుండి హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ ఏడాది ప్రథమార్థంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రిలీజ్ డేట్ పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో హాట్‌స్టార్ నుండి మంచి ఆఫర్ రావడంతో మేకర్స్ ఓటీటీ వైపు మొగ్గుచూపారు. ఘంటా సతీష్‌బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిహాల్ కోదత్య్, భూమిక చావ్లా కీలక పాత్రల్లో నటించారు. జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరవళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. చదవండి: మరో వివాదంలో రష్మిక, సౌత్ ఇండస్ట్రీపై అవమానకర వ్యాఖ్యలు -
బటర్‌ఫ్లై.. భలేగా
-
ఈ ఏడాది చివరి వారంలో రిలీజవుతున్న సినిమాలివే!
2022.. టాలీవుడ్ ఇండస్ట్రీకి బోలెడన్ని హిట్స్ ఇచ్చింది. ఈ విజయాల పరంపరలో 18 పేజెస్, ధమాకా కూడా చేరినట్లు తెలుస్తోంది. మరోవైపు కొత్త సంవత్సరంలో రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు అగ్ర కథానాయకులు. సంక్రాంతి బరిలోకి దిగుతామంటూ షూటింగ్స్‌లో మునిగిపోయారు. కుర్ర హీరోలు మాత్రం ఈ ఏడాదికి మేము గ్రాండ్‌గా ముగింపు పలుకుతామంటూ కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి 2022 ఆఖరి వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లేంటో చూసేద్దాం.. థియేర్లో రిలీజ్ కానున్న చిత్రాలు.. ► టాప్ గేర్ - డిసెంబర్ 30 ► లక్కీ లక్ష్మణ్ - డిసెంబర్ 30 ► డ్రైవర్ జమున - డిసెంబర్ 30 ► ఆ రోజే రాజయోగం - డిసెంబర్ 30 ► ఎస్5.. నో ఎగ్జిట్ - డిసెంబర్ 30 ► వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ దేవరకొండ- డిసెంబర్ 30 ► కొరమీను - డిసెంబర్ 31 ఓటీటీలో అలరించనున్న సినిమాలు, సిరీస్‌లు.. ఆహా ► అన్‌స్టాపబుల్ షో (ప్రభాస్ ఎపిసోడ్) - డిసెంబర్ 30 హాట్‌స్టార్ ► బటర్‌ఫ్లై - డిసెంబర్ 29 ► ఆర్ యా పార్ - డిసెంబర్ 30 ► ది ఎల్ వరల్డ్ - డిసెంబర్ 30 ► బ్యూటీ అండ్ ది బీస్ట్ - డిసెంబర్ 30 అమెజాన్ ప్రైమ్ ► టాప్ గన్ మేవరిక్ - డిసెండర్ 26 ► గోల్డ్ - డిసెంబర్ 29 నెట్‌ఫ్లిక్స్ ► 7 ఉమెన్ అండ్ మర్డర్ - డిసెంబర్ 28 ► డీఎస్పీ(తెలుగు డబ్బింగ్ చిత్రం) - డిసెంబర్ 30 ► వైట్ నాయిస్ - డిసెంబర్ 30 ► చోటా భీమ్ సీజన్ 15 - డిసెంబర్ 30 ► ద గ్లోరీ(కొరియన్ సిరీస్) - డిసెంబర్ 30 జీ5 ► ఉత్తవారన్ (బెంగాలీ చిత్రం)- డిసెంబర్ 30 చదవండి: అవతార్ 2 సెన్సేషన్.. ఎన్ని వేల కోట్ల కలెక్షన్స్ వచ్చాయంటే? కంగనాకు పద్మశ్రీ.. మాకు మాత్రం గుర్తింపే లేదు: సీనియర్ హీరోయిన్స్ -
ఈ ఇయర్ సెకండాఫ్ నాకు బాగుంది
‘బటర్ ఫ్లై’ సినిమాలో చేసిన గీత క్యారెక్టర్ నాకు సవాల్ అనిపించింది. ఈ పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది’’ అని అనుపమా పరమేశ్వరన్ అన్నారు. ఘంటా సతీష్ బాబు దర్శకత్వంలో అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘బటర్ ఫ్లై’. భూమికా చావ్లా, రావు రమేష్, నిహాల్ కోధాటి కీలక పాత్రల్లో రవిప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువల్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 29న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరన్ మాట్లాడుతూ – ‘‘ఈ ఇయర్ సెకండాఫ్ నాకు చాలా బాగుంది. నేను హీరోయిన్గా నటించిన ‘కార్తికేయ 2, 18 పేజెస్’ హిట్టయ్యాయి. ఇప్పుడు ‘బటర్ ఫ్లై’ రిలీజ్ అవుతోంది’’ అన్నారు. ఘంటా సతీష్ బాబు, ప్రసాద్ తిరువళ్లూరి, నిహాల్, సంగీత దర్శకుడు అర్విజ్ తదితరులు మాట్లాడారు. -
సీతాకోక చిలుక ‘పడగ విప్పడం’ ఎప్పుడైనా చూశారా?
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మునిసిపల్ పరిధి ముస్తాపురం సమీపంలోని తోటల్లో ఓ వింతైన సీతాకోక చిలుక కనిపించింది. వాయీజ్ అనే వ్యక్తి సమీపంలోని ఓ చెట్టుపై దీనిని చూసి మొదట కంగారు పడ్డాడు. ఆ తర్వాత తేరుకుని దానిని గమనించాడు. దూరం నుంచి చూస్తే అది నాగుపాము పడగను పోలి ఉంది. రెక్కలు విప్పితే దాని శరీరంపై వింతైన కళ్లు మాదిరి ఉన్నాయి. – ఆత్మకూరు (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా) -
Mulapadu Butterfly Park Photos: ఇంతందంగా ఉన్నావే..ఎవరే నువ్వు? (ఫొటోలు)
-
అమ్మకానికి సీతాకోక చిలుక ఇల్లు, సొంతం చేసుకునేందుకు ఎగబడుతున్న జనం!
సొంతిల్లు నిర్మించుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. అందుకే ఆ కలను నిజం చేసుకునేందుకు జీవిత కాలం కష్టపడుతుంటాం. అదిగో అలా కట్టుకుందే ఈ సీతా కోక చిలుక ఇల్లు. ప్రపంచంలోనే విలక్షణమైన ఇల్లుగా ప్రసిద్ధి చెందిన..ఈ బటర్ ఫ్లై హౌస్‌ను అమ్మకానికి పెట్టారు. ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశమైన 'గ్రీస్'దేశంలోని వౌలియాగ్మెని బీచ్ సరిహద్దుల్లో ఈ ఇంటిని నిర్మించారు. ఈ ఇంటిని ఎవరు నిర్మించారు. ఎప్పుడు నిర్మించారనే విషయాలు వెలుగులోకి రాకున్నా.. ప్రస్తుతం ఈ ఇల్లు అమ్మకానికి పెడుతున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 5381 స్కైర్ ఫీట్లో నిర్మాణం వౌలియాగ్మెని బీచ్ సరిహద్దుల్లో 5381 స్కైర్ ఫీట్లో ఇంటి నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాంటి వాల్స్ లేకుండా నిర్మించిన ఈ ఇల్లు ఫ్లోర్ ఫోర్ల్ ఎలివేటర్(లిఫ్ట్)సౌకర్యం ఉంది. సీతాకోక చిలుక ఇన్స్పిరేషన్తో నిర్మించిన ఈ ఇంటికి షేడింగ్, గోప్యత ఉండేలా ఆర్కిటెక్చర్లు డిజైన్ చేశారు. దిగువ అంతస్తులో హోమ్ థియేటర్, మూడు అదనపు బాత్రూమ్లతో మూడు బెడ్రూమ్లు కూడా ఉన్నాయి. నిజంగా స్మార్ట్ హోమే! స్మార్ట్ హోమ్‌గా ప్రసిద్ధి చెందిన ఈ బటర్ ఫ్లై హోంలో ఐదు బెడ్ రూమ్‌లు, నాలుగు బాత్రూంలు, ఇల్లు ఐదు బెడ్రూమ్లు, నాలుగు బాత్రూమ్లు, ప్రైవేట్ బేస్మెంట్ ఉంది. ఈ ప్రైవేట్ బేస్మెంట్ను స్టోరేజ్, డార్క్ రూమ్, పార్కింగ్ ఏరియాలుగా ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు ఒక గడపలో నుంచి లోపలికి వెళితే గోడలు, డోర్లను ఏర్పాటు చేస్తూ కిచెన్ , లివింగ్ రూమ్, డైనింగ్ రూమ్ ఉండేలా ఓపెన్ ప్లాన్ లివింగ్ ఏరియా, జియో మెట్రిక్ షేప్‌లో నిర్మించిన ఇండోర్ పూల్తో ఈ స్మార్ట్ హోమ్ చూపరులను కట్టిపడేస్తుంది. క్యూ కడుతున్నారు! చిత్రంలో చూపించినట్లుగా.. పై నుంచి చూస్తే సీతాకోక చిలుకలా కనిపిస్తుంది. సీతాకోక చిలుక డిజైన్ వచ్చేలా ఇంటిని నిర్మించేందుకు ఇంటిపై కప్పులు ఓవల్ ఆకారపు హోల్స్‌తో అందంగా తీర్చిదిద్దారు. ఇక ఈ ఇల్లును $6.78 మిలియన్లకు (రూ. 52 కోట్లు) అమ్మకానికి పెట్టినట్లు వెలుగోలోకి వచ్చిన రిపోర్ట్లు పేర్కొన్నాయి. అయితే ప్రపంచంలో విభిన్నంగా సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న ఇంటిని సొంతం చేసుకునేందుకు స్థానికంగా ఉండే ధనికులతో పాటు ప్రపంచ దేశాలకు చెందిన పలువురు క్యూ కడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. చదవండి: షాకింగ్,హైదరాబాద్‌లో చదరపు అడుగు ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడతారు! -
సీతాకోకచిలుక ఆడవాళ్లకే సొంతం కాదు!
Zero Discrimination Day 2022: Theme, history, significance జీవిత చక్రంలో భాగంగా గొంగళి పురుగు పూర్తిగా సీతాకోక చిలుకగా మారుతుంది. ఆ మారడంలో ఎంతో బాధను ఓర్చుకుని.. రంగు రంగుల రెక్కలతో పైకి ఎగురుతుంది. బతికేది కొంతకాలమే అయినా.. ఏ బాధాబందీ లేకుండా స్వేచ్ఛగా జీవిస్తుంది సీతాకోకచిలుక. అందుకేనేమో వివక్ష వ్యతిరేక దినోత్సవం కోసం సీతాకోక చిలుకనే ఎంచుకున్నారు. ప్రతీ ఏడాది మార్చి 1వ తేదీన జీరో డిస్క్రిమినేషన్ డే. కుల, మత, వర్గ, లింగ, జాతి, ఆర్థిక అసమానతలనే బేధాలతో సంబంధం లేకుండా మనిషికి ఎదురయ్యే ‘వివక్ష’ను వ్యతిరేకించే రోజు. ఐక్యరాజ్య సమితి, దాని అనుబంధ విభాగాలన్నీ ఈ తేదీని నిర్వహించుకుంటాయి. ► UNAIDS(హెచ్ఐవీ/ ఎయిడ్స్ మీద ఐరాస చేపట్టిన సంయుక్త కార్యక్రమం) ప్రకారం.. హాని కలిగించే చట్టాలను తొలగించాలి. సాధికారత కల్పించే చట్టాలను రూపొందించాలి అనే థీమ్‌తో ఈ ఏడాది వివక్ష(శూన్య) వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నారు. వివక్షాపూరిత చట్టాలకు వ్యతిరేకంగా తీసుకోవాల్సిన తక్షణ చర్యల అవసరాన్ని తెలియజేస్తుంది ఈ శక్తివంతమైన థీమ్. “Let us raise our voices together and say: No to violence, yes to peace, no to slavery, yes to freedom, no to racial discrimination, yes to equality and to human rights for all.” - Nadia Murad, awarded the 2018 Nobel Peace Prize. #ZeroDiscriminationDay pic.twitter.com/CFC7niVYz0 — The Nobel Prize (@NobelPrize) March 1, 2022 ► పని ప్రదేశంలో వివక్షను ఖండించే పోరాటంగా మొదలై.. 2013 డిసెంబర్లో ఒక భారీ ఉద్యమంగా మారింది. బీజింగ్‌లో ఒక మెగా ఈవెంట్ ద్వారా 30 పెద్ద కంపెనీల ప్రతినిధులు వివక్ష నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. అక్కడి నుంచి ఈ ఉద్యమం.. ప్రపంచం మొత్తం విస్తరించి ఐక్యరాజ్య సమితికి చేరింది. ► జీరో డిస్క్రిమినేషన్ డేను మొట్టమొదటగా.. మార్చి 1, 2014న నిర్వహించింది HIV/AIDS. హెచ్ఐవీ రోగులపై వ్యవస్థీకృత, సాంస్కృతిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు థీమ్‌తో ప్రారంభించింది. Gender discrimination is prohibited under almost every human rights treaty. This includes international laws providing for equal gender rights between men and women. Tag your leaders asking them to remove laws that discriminate and create laws that promote. #ZeroDiscriminationDay pic.twitter.com/oQycmF9pPV — Save the Children E&SA (@ESASavechildren) March 1, 2022 ► జీరో డిస్క్రిమినేషన్ డే.. సింబల్ సీతాకోక చిలుక. ఇది చూసి చాలామంది మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం కోసమే సీతాకోక చిలుకను ఎంపిక చేశారనుకుంటారు. కానీ, ఇదీ వివక్షే అవుతుంది కదా అంటోది అన్ఎయిడ్స్. సీతాకోక చిలుక కేవలం ఆడవాళ్లకే కాదని.. అందరికీ వర్తిస్తుందని, కేవలం స్వేచ్ఛా కోణంలో మాత్రమే సీతాకోకచిలుకను చిహ్నంగా ఎంచుకున్నట్లు ఒక ప్రకటనలో ఆమధ్య పేర్కొంది. Observed each year on 1 March, #ZeroDiscriminationDay this year highlights the theme “Remove laws that harm, create laws that empower”. Today, we celebrate the right of everyone to live with dignity, and call for inclusion, compassion, peace and, above all, a movement for change. pic.twitter.com/DW2gSqZOSV — UNU International Institute for Global Health (@UNU_IIGH) March 1, 2022 ► కొన్ని దేశాల్లో చట్టాల్లోని లొసుగులు.. న్యాయాన్ని దూరం చేస్తున్నాయి. పక్షపాత చట్టాలపై పోరాటాన్ని తెలియజేసేలా అవగాహన కల్పిస్తారు జీరో డిస్క్రిమినేషన్ డే నాడు. ► జీరో డిస్క్రిమినేషన్ డే.. ఇవాళ సోషల్ మీడియాలో సీతాకోక చిలుకల ఫొటోలతో అవగాహన, అనుభవాలు, జ్ఞాపకాలు.. ఇలా ఏవైనా పంచుకోవచ్చు. ::: సాక్షి, వెబ్‌స్పెషల్ -
క్రాంప్టన్ గ్రీవ్స్ చేతికి బటర్‌ఫ్లై
న్యూఢిల్లీ: బటర్‌ఫ్లై బ్రాండ్‌తో కిచెన్ అప్లయెన్సెస్ విక్రయించే గంధిమతి అప్లయెన్సెస్‌ను ప్రయివేట్ రంగ దిగ్గజం క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జూమర్ ఎలక్ట్రికల్స్ సొంతం చేసుకోనుంది. గంధిమతిలో మెజారిటీ వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ వెల్లడించింది. ఒప్పందంలో భాగంగా షేరుకి రూ. 1,403 ధరలో 55 శాతం వాటాను చేజిక్కించుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు రూ. 1,380 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా బటర్‌ఫ్లై వాటాదారులకు షేరుకి రూ. 1,434 ధరలో ఓపెన్ ఆఫర్‌ను ప్రకటించింది. సెబీ నిబంధనల ప్రకారం 26 శాతం వాటావరకూ కొనుగోలు చేయనుంది. ఇందుకు దాదాపు రూ. 667 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. వెరసి గంధిమతి అప్లయెన్సెస్ కొనుగోలుకి రూ. 2,077 కోట్లవరకూ వెచ్చించనుంది. టాప్–3లో ఒకటి..: బటర్‌ఫ్లై బ్రాండుతో గంధిమతి అప్లయెన్సెస్ మిక్సర్ గ్రైండర్లు, టేబుల్ టాప్ వెట్ గ్రైండర్లు, ప్రెజర్ కుకర్లు, ఎల్పీజీ స్టవ్‌లు, నాన్‌స్టిక్ కుక్వేర్, స్టెయిన్లెస్ స్టీల్ వ్యాక్యూమ్ ఫ్లాస్క్‌లు తదితరాలను విక్రయిస్తున్న విషయం విదితమే. ఈ విభాగంలో దేశీయంగా టాప్–3 కంపెనీలలో ఒకటిగా నిలుస్తున్నట్లు క్రాంప్టన్ గ్రీవ్స్ పేర్కొంది. డీల్ వార్తల నేపథ్యంలో బటర్‌ఫ్లై షేరు ఎన్ఎస్ఈలో స్వల్ప లాభంతో రూ. 1,396 వద్ద నిలవగా.. క్రాంప్టన్ గ్రీవ్స్ షేరు 7.5 శాతం జంప్‌చేసి రూ. 409 వద్ద ముగిసింది. -
కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ కి హ్యాపీ బర్త్ డే..!!
-
Mad Hatterpillar: ఈ గొంగళి పురుగుకు ఐదు తలలు..!
రావణుడికి ఎన్ని తలలు? పది. బ్రహ్మకు? నాలుగు.. మరి, గొంగళి పురుగుకు..? ఒకటి..! ఇక్కడే పప్పులో కాలు వేశారు. అందరూ అనుకున్నట్లు గొంగళి పురుగుకు ఒక తల కాదు, ఐదు తలలు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే వాటిని ఉంచుకుంటాయి. చాలావరకు వదిలేస్తుంటాయి. కారణం, అవి చచ్చిన తలలు కాబట్టి. గొంగళి పురుగు రూపాంతరం చెంది సీతాకోక చిలుకగా మారుతుందనే విషయం తెలిసిందే. అలా రూపాంతరం చెందే ముందు మరో పదమూడు రూపాంతరాలు చెందుతుందట. ఇలా ఈ రూపాంతరం చెందే ప్రతిసారి వాటి పాత చర్మాన్ని వదిలి.. కొత్త చర్మాన్ని ధరిస్తాయి. ఈ క్రమంలోనే వాటి తల భాగం కూడా మారుతుంది. మారే తలను కొన్ని గొంగళి పురుగులు ఓ టోపీలా వాటి తలపైనే పెట్టుకుంటే, కొన్ని వదిలేస్తుంటాయి. అలా సుమారు ఐదు తలల వరకు ధరించగలవు. ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన ఉరాబా లూజెన్స్ జాతికి చెందిన గొంగళి పురుగులు ఇలా చేస్తాయి. వీటికి ‘మ్యాడ్ హాటర్పిల్లర్’ అని పేరు. ఇతర జీవుల నుంచి తమని తాము పెద్దదిగా చూపిస్తూ, భయపెట్టడానికి కొన్ని ఈ తలల టోపీని ధరిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, ఇవి ఎక్కువ కాలం నిలువవని, విరిగిపోతాయని, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమని వారు అంటున్నారు. ఏది ఏమైనా, ఈ హ్యాటర్ పిల్లర్‌గా భలే బాగుంది కదూ! చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
కొండచిలువతో సీతకోక చిలుక ఏం చెబుతుందో చూడండి!
మనం డిస్కవరీ చానల్స్‌లో కొండచిలువ, అనకొండ లాంటి పాములు ఎలా జంతువులపై దాడి చేసి తినేస్తాయో చూసి ఉంటాం. అవి చూస్తే కాస్త రోమాలు నిక్కబొడుచుకుని వొళ్లు జలదరిస్తుంది. అచ్చం అలాంటి ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. అసలు ఇంతకీ ఆ ఫోటోలో ఏం ఉందంటే ఒక కొండచిలువ ఒక నక్కను గొంతు పిసికి చంపుతుంది. అసలు ఏముంది ఇందులో ఇలాంటివి చాలేనే చూశాం అంటారా!. (చదవండి: ఎదురుగా కంగారుల సమూహం.. ఇప్పుడు నేనెలా ఆడాలి?) అసలు విషయం ఇక్కడే ఉంది ఏంటంటే సీతాకోక చిలుక రెక్కలు విప్పుకుని కూర్చొని ఉండగా కొండచిలువ నక్కను గొంతు పిసికి చంపేసింది. అయితే అందులో సీతకోక చిలుక ఎక్కడ ఉందో చెప్పండి" అనే క్యాప్షన్‌ని జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో నెటిజన్లకు ఆ ఫోటోలో సీతాకోక చిలుక ఎక్కడ ఉంది అంటూ ఆసక్తిగా వీక్షించడంతో అది కాస్త పెద్ద రసవత్తరమైన అంశంగా మారుతుంది. ఇంతకీ ఆ సీతకోక చిలుక కొండచిలువ తలపై ప్రశాంతంగా కూర్చోని ఉంటుంది. నిజానికి చాలా మంది నెటిజన్లు గుర్తించలేకపోతారు. (చదవండి: ఈశ్వర్ అల్లా" అంటే ఇదేనేమో) Python strangles jackal. What do you think the butterfly is saying to the python?#TiredEarth pic.twitter.com/BgEjl3aeOt — Rebecca Herbert (@RebeccaH2030) October 27, 2021 -
సీతా'సోకు' చిలుకలు
సాక్షి, అమరావతి: సీతాకోక చిలుకకు చీరలెందుకు.. అంటూ సప్తవర్ణ శోభితమైన వాటి అందాన్ని ఓ సినీకవి ఎంతో రమణీయంగా వర్ణించినట్లే పచ్చదనం పర్చుకున్న ఈ ప్రకృతి కూడా ఎన్నో అందాలతో మనకు కనువిందు చేస్తుంది. ఇందులో రకరకాల వృక్ష సంపదే కాదు.. అనేక రకాల కీటకాలూ మనల్ని అలరిస్తాయి.. ఎంతో మానసికోల్లాసాన్ని కలిగిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి సీతాకోక చిలుకలు. ఓ పువ్వు మీద నుంచి ఇంకో పువ్వు మీదకు.. ఓ కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు.. వయ్యారంగా రెక్కలూపుకుంటూ ఎగిరే ఈ సీతాకోకలు సర్వమానవాళికీ ఆహార భద్రత కలిగిస్తాయి. పర్యావరణంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ జాతిలో ఇప్పుడు కొత్తగా నాలుగు రకాలు చేరాయి. అది కూడా ఎక్కడో కాదు.. మన ఏపీలోనే. ఆ వివరాలు.. రుతుపవనాలు పర్యావరణంలో కొన్ని అందమైన మార్పులు తీసుకొస్తాయి. పెరుగుతున్న పచ్చదనం, వికసిస్తున్న పువ్వులు, కొత్త వృక్ష సంపద.. వాటి చుట్టూ అనేక రకాల పురుగుల మనుగడ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రకృతిలో జరిగే ఈ అందమైన మార్పులు, కీటకాల మనుగడను ప్రకృతి ప్రేమికులు నిశితంగా పరిశీలిస్తారు. వారి అన్వేషణలో (నేచర్ వాక్స్) ఇటీవల రాష్ట్రంలో నాలుగు కొత్త సీతాకోక చిలుక జాతులు రికార్డయ్యాయి. చిత్తూరు జిల్లా తిరుమలలో ఫ్లంబియస్ సిల్వర్‌లైన్, నారో బ్యాండెడ్ బ్లూ బాటిల్ జాతి సీతాకోక చిలుకలను కనుగొన్నారు. విశాఖపట్నం ఏజెన్సీలోని కొయ్యూరు ప్రాంతంలో లాంగ్ బ్యాండెడ్ సిల్వర్‌లైన్, డార్క్ పైరాట్ జాతులను గుర్తించారు. ఈ నాలుగు జాతుల సీతాకోక చిలుకలు ఇంతవరకు మన రాష్ట్రంలో రికార్డు కాలేదు. విజయవాడ నేచర్ క్లబ్‌కి నేతృత్వం వహిస్తున్న రాజేష్ వర్మ దాసి, రాజశేఖర్ బండి బృందం ఇటీవల నిర్వహించిన నేచర్ వాక్స్‌లో తొలిసారిగా వాటిని తమ కెమెరాల్లో బంధించారు. తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో అరుదైన ఆర్కిడ్ టిట్ జాతి సీతాకోక చిలుక కూడా రికార్డయింది. ఇది గతంలో రికార్డయినా చాలా అరుదైనది. ప్రకృతి ప్రేమికుడు జిమ్మీ కార్టర్ దీన్ని రికార్డు చేశారు. ఈ ఆర్కిడ్ టిట్ సీతాకోక చిలుక 1972 వన్యప్రాణుల సంరక్షణ చట్టం షెడ్యూల్–1 పరిధిలోకి వస్తుంది. దీని ప్రకారం.. పులులను సంరక్షిస్తున్నట్లే ఈ జాతి సీతాకోక చిలుకల్ని సంరక్షించాల్సి వుంది. అందుకే పర్యావరణంలో వీటికి అత్యంత ప్రాధాన్యత ఉన్నట్లు చెబుతున్నారు. 170 సీతాకోక చిలుక జాతులు, 200 చిమ్మట జాతులు సీతాకోక చిలుకలు, చిమ్మటలు (పురుగు సీతాకోక చిలుకలు), తేనెటీగలు, కందిరీగల వంటి కీటకాలు ముఖ్యమైన పరాగ సంపర్క జీవులు. ఇవి అనేక ఆహార పంటలను పరాగ సంపర్కం చేయడం ద్వారా మానవాళికి ఆహార భద్రతను కల్పిస్తున్నాయి. మన దేశంలో వెయ్యి కంటే ఎక్కువ జాతుల సీతాకోక చిలుకలు, 10 వేల జాతుల చిమ్మటలు ఉన్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు 170కి పైగా సీతాకోకచిలుక జాతులు, 200కి పైగా చిమ్మటలు రికార్డయ్యాయి. వీటి జీవిత కాలం ఎంతంటే.. కొన్ని రకాలు కేవలం 15 రోజులు మాత్రమే జీవిస్తే.. మరికొన్ని 12 నెలల వరకూ బతుకుతాయి. నేచర్ వాక్స్‌తో కొత్త విషయాలు ఐఐఎస్ఈఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్), తిరుపతి విభాగం తరచూ నేచర్ వాక్స్ నిర్వహిస్తుంది. ఈ వాక్స్‌లో అనేక కొత్త సీతాకోక చిలుకలు, ఇతర కీటకాలను రికార్డు చేస్తున్నాం. ప్రకృతి, జీవ వైవిధ్యానికి సంబంధించి ఎన్నో కొత్త విషయాలు వీటి ద్వారా తెలుస్తాయి. సెప్టెంబర్ నెలను బిగ్ బటర్‌ఫ్లై మంత్‌గా పిలుస్తారు. వలంటీర్లు వారి చుట్టూ ఉన్న సీతాకోక చిలుక జాతులను రికార్డ్ చేసి సిటిజన్ సైన్స్ పోర్టల్స్‌లో పంచుకుంటారు. మన దేశంలో ఈ సమాచారాన్ని ifoundbutterflies,indiabiodiversityportal, moths of india and inaturalist వంటి వెబ్సైట్లలో సమర్పిస్తారు. ప్రకృతి ప్రేమికులు ఎవరైనా జీవవైవిధ్య పరిరక్షణకు ఈ పనిచేయవచ్చు. – రాజశేఖర్ బండి, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్, తిరుపతి గొప్ప జీవ వైవిధ్యం ఏపీ సొంతం రాష్ట్రంలో చాలా గొప్ప జీవ వైవిధ్యం ఉంది. దురదృష్టవశాత్తు అది తగినంతగా నమోదుకాలేదు. దైనందిన జీవితంలో మన చుట్టూ కనిపించే జీవవైవిధ్యం, జీవులను రికార్డు చేసి డాక్యుమెంట్ చేయడం చాలా ముఖ్యం. వాటి ఆవాసాల విధ్వంసం, వాతావరణ మార్పులు, పురుగు మందులు అధిక వినియోగం వంటి అనేక అంశాలు కొన్ని పరాగ సంపర్క జాతుల్ని కనుమరుగయ్యేలా చేస్తున్నాయి. అందుకే వాటి సమాచారాన్ని నమోదు చేయడం ద్వారా జీవవైవిధ్యం పరిరక్షణ కోసం ప్రణాళికను రూపొందించే అవకాశం ఉంటుంది. ఇటీవల మేం చేపట్టిన నేచర్ వాక్స్‌లో నాలుగు సీతాకోక చిలుక జాతులను కొత్తగా మన దగ్గర రికార్డు చేశాం. – రాజేష్ వర్మ దాసి, విజయవాడ నేచర్ క్లబ్ నిర్వాహకుడు -
అరుదైన సీతాకోకచిలుక.. ఎప్పుడైనా చూశారా ?
తగరపువలస (భీమిలి): విశాఖ జిల్లా భీమిలి బ్లూజే అపార్ట్మెంట్లో ఆదివారం ఉదయం అరుదైన సీతాకోకచిలుక సందడి చేసింది. ఆరెంజ్, బిస్కట్ కలర్లో ఉన్న ఈ సీతాకోకచిలుక 18 సెంటీమీటర్ల పొడవు ఉంది. ఇలాంటి అరుదైన సీతాకోకచిలుకను గతంలో ఎప్పుడూ చూడలేదని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. -
చెప్పుకోండి చూద్దాం
ఎన్నో వింతల సమాహారం ప్రకృతి. అప్పుడప్పుడు కళ్లెదుటే కనిపిస్తూ కనికట్టు చేస్తుంది. అలాంటి ఓ చిత్రాన్ని షేర్ చేశాడు కర్నాటకకి చెందిన ఓ ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఏంటో చెప్పుకోండి చూద్దాం అంటూ ఆయన అడిగితే.. సరైన సమాధానం చెప్పలేక ఎంతో మంది బోల్తా పడ్డారు. మీరు ప్రయత్నించి చూడండి -
3,600 ఎకరాల్లో బటర్‌ఫ్లై సిటీ
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తును ముందుగా ఊహించిన వాళ్లకే విజయం దక్కుతుంది. రియల్టీ రంగం విషయానికొస్తే.. ఒక ప్రాంతం అభివృద్ధిని ముందుగానే అంచనా వేసి, తక్కువ సమయంలో సామాన్యుల పెట్టుబడులను రెట్టింపు చేయడం అసలైన విజయం. సరిగ్గా ఇదే కోవలోకి వస్తుంది ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ శ్రీశైలం జాతీయ రహదారిలోని కడ్తాల్‌లో 3,600 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఫార్చ్యూన్ బటర్‌ఫ్లై సిటీ టౌన్షిప్. పదిహేనేళ్ల క్రితం బటర్‌ఫ్లై సిటీకి భూమి పూజ చేసే సమయంలో రోడ్లు, మంచినీరు, మురుగు నీటి వ్యవస్థ ఏరకమైన మౌలిక వసతులు సరిగా లేని ఆ ప్రాంతంలో... ఇప్పుడు మెరుగైన మౌలిక వసతులు, ప్రశాంతమైన వాతావరణంలో గృహాలు, స్కూల్, ఆసుపత్రి, కన్వెన్షన్ సెంటర్, పోలీస్ స్టేషన్.. ఇలా ప్రతీ ఒక్క సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీర్చిదిద్దుతుంది ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్. దశాబ్దన్నర క్రితం ఎకరం రూ.20 లక్షల కంటే తక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఇప్పుడు రూ.2 కోట్ల పైమాటే ఉందంటే సామాన్యుల పెట్టుబడి ఎంత రెట్లు పెరిగిందో అర్థమవుతూనే ఉంది. బటర్‌ఫ్లై సిటీ: 3,600 ఎకరాల్లోని బటర్‌ఫ్లై సిటీలో 3 వేల ఎకరాలు నివాసాలకు, 600ల ఎకరాలకు వాణిజ్య కేంద్రాలకు కేటాయించామని కంపెనీ సీఎండీ బీ శేషగిరి రావు తెలిపారు. ఇప్పటికే 2 వేల ఎకరాలను అభివృద్ధి చేశాం. 600 విల్లాలను నిర్మించాం. ప్రస్తుతం మరొక వెయ్యి ఎకరాల్లో ఓపెన్ ప్లాట్లను చేస్తున్నాం. 10,800 ప్లాట్లుంటాయి. 200, 267, 300 గజాల విస్తీర్ణాలు. ధర గజానికి రూ.4,200 నుంచి 12 వేలు. 25 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి అన్ని రకాల వసతులున్నాయి. ప్రస్తుతం 240 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ► ఈ ప్రాజెక్ట్‌లోని నివాసితుల పిల్లల కోసం సీబీఎస్ఈ పాఠశాలను నిర్మించింది. ప్రస్తుతం 4 ఎకరాల్లో ఆసుపత్రి, 3 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్లను నిర్మించనుంది. 6 నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించి.. ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్ సెంటర్, స్పోర్ట్స్ అకాడమీ, విశ్వవిద్యాలయాలను నిర్మిస్తాం. వచ్చే పదేళ్లలో 80 వేల కోట్ల నెట్‌వర్త్‌ను క్రియేట్ చేయాలన్నది ఫార్చ్యూన్ ఇన్ఫ్రా లక్ష్యం. నివాసితులకు రక్షణ కోసం సీఎస్ఆర్లో భాగంగా కోటి రూపాయల వ్యయంతో పోలీస్ స్టేషన్‌ను నిర్మిస్తుంది. సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆధ్వర్యంలో ఇటీవలే భూమి పూజ చేశామని.. ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వస్తుంది. -
అది ఆకు కాదు..
-
అయ్యో.. అది ఆకు కాదు.. వీడియో వైరల్
మన చుట్టూ ఉండే ప్రకృతిలో వింత వింత జీవులు సంచరిస్తుంటాయి. కొన్ని రకాల జీవులను ఎప్పుడు చూసి ఉండం. అలాంటి జీవులు ఉన్నాయనేది కూడా మనకు తెలిసి ఉండదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడిప్పుడు కొన్ని వింత జీవులను మనం చూడగల్గుతున్నాయి. తాజాగా ఓ వింత సీతాకొకచిలుకకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు సీతాకోక చిలుక అంటే రంగురంగులతో చూడముచ్చటగా ఉంటుందనే తెలుసు. కానీ ఇది మాత్రం కాస్త భిన్నంగా ఉంది. రెక్కలు ముడుచుకొని ఉన్నప్పుడు చూస్తే ఎండిపోయిన ఆకు వలె కనిపిస్తుంది. ఎగురుతోన్న సమయంలో మాత్రం రంగురంగులతో కనపడుతూ అలరిస్తోంది. తన వద్దకు ఏదైనా పక్షి వచ్చి చంపాలని చూస్తే దాన్ని మభ్యపెట్టేలా ఈ సీతాకోకచిలుక తన రెక్కలను మూసుకుంటుంది. దీంతో అది ఒక ఆకుగా భావించి ఇతర పక్షులు దానికి హాని తలపెట్టకుండా వెళ్లిపోతాయి. తన ఈ సీతాకోకచిలుక తనను తాను రక్షించుకుంటోంది. (చదవండి : పారిపోయిన తాబేలు..74 రోజుల తిరిగొచ్చింది) 18 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను బటర్‌ఫ్లై కన్జర్వేషన్ ట్విటర్లో షేర్ చేయగా దీనికి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ ప్రవీణ్ అంగుస్వామి రీట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘అద్భుతం.. ఇలాంటి సీతాకొకచిలుకను ఎప్పుడు చూడలేదు’, ‘వావ్.. ఇవి ప్రకృతి అద్భుతం’, ‘బ్యూటీపుల్ బటర్‌ఫ్లై.. ఆకర్షనీయంగా ఉంది’అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
రాత్రిపూట మెరిసే సీతాకోక చిలుక
సాక్షి, మక్కువ: ఓ సరికొత్త రూపం.. మూడు వైపులా తలలున్నట్టుగా ఆకారం.. అరచేతికన్నా పెద్దగా కనిపిస్తున్న ఈ అరుదైన జీవి సీతాకోకచిలుక జాతుల్లోకెల్లా పెద్దది. దీనిని అట్లాస్మాత్ అని పిలుస్తారు. విజయనగరం జిల్లా మక్కువ మండలం దుగ్గేరు గ్రామంలోని ఓ చెట్టు కొమ్మపై ఇది దర్శనమిచ్చింది. చూడ్డానికి చాలా అందంగా ఉన్న దీని శాస్త్రీయ నామం అట్టాకస్ అట్లాస్. శాతమిల్లేడ్ కుటుంబానికి చెందిన ఈ సీతాకోకచిలుక రాత్రిపూట మెరుస్తుందని, అందుకే దీనిని మిస్ యువరాణిగా అభివర్ణిస్తారని వ్యవసాయాధికారి తిరుపతిరావు చెప్పారు. -
బటర్‌ఫ్లై గంధిమతి- కేఎన్ఆర్.. రయ్రయ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో ఫలితాలు నిరాశపరచినప్పటికీ ఎలక్ట్రిక్ అప్లయెన్సెస్ తయారీ కంపెనీ బటర్‌ఫ్లై గంధిమతి కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్) కాలంలో పటిష్ట పనితీరు చూపిన మౌలిక సదుపాయాల కంపెనీ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. బటర్‌ఫ్లై గంధిమతి అప్లయెన్సెస్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో బటర్‌ఫ్లై గంధిమతి రూ. 8.6 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది క్యూ1లో రూ. 2.2 కోట్ల నికర లాభం ఆర్జించింది. అమ్మకాలు సైతం 50 శాతం క్షీణించి రూ. 77 కోట్లను తాకాయి. ఫలితాల నేపథ్యంలో బటర్‌ఫ్లై గంధిమతి షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 11 శాతం దూసుకెళ్లి రూ. 152 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 157 వరకూ ఎగసింది. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్లో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ నికర లాభం 9 శాతం పెరిగి రూ. 47 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం నామమాత్ర వృద్ధితో రూ. 522 కోట్లను అధిగమించింది. పన్నుకుముందు లాభం 5 శాతం బలపడి రూ. 59 కోట్లను అధిగమించింది. ఫలితాల నేపథ్యంలో కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 5 శాతం జంప్‌చేసి రూ. 242ను తాకింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 238 వద్ద ట్రేడవుతోంది. -
‘ఇవి బంగారం కాదు.. నిజంగా ప్రకృతి అద్భుతం’
న్యూఢిల్లీ: బంగారు వర్ణంలో కనిపించే చితాకోకచిలుక ప్యూపాల వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. అచ్చం బంగారు నాణేళ్లలా మెరిసిపోతున్న ఈ లార్వాల వీడియోను ఆటవీ శాఖ అధికారి ప్రవీణ్ కశ్వన్ సోమవారం ట్విటర్లో షేర్ చేశాడు. ఇవి లార్వా-ఇమాగో మధ్య చితాకోకచిలుకగా పరివర్తనం చెందె జీవ కీటక దశ అని తన ట్వీట్లో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఇవి బంగారం కాదు. టిథోరియా టారిసినా, సితాకోకచిలుకల ప్యూపాలు.. అద్బుతమైన ప్రకృతి’ అంటూ ట్వీట్ చేశాడు. 8 సెకన్ల నిడివి గల ఈ వీడియోను షేర్ చేసిన 8 గంటల్లోపే 43 వేల వ్యూస్, వందల్లో కామెంట్స్ వచ్చాయి. (వైరల్ : సందర్శకులపై నీటి జల్లులు) ఈ వీడియోకు ‘‘ఇప్పటీ వరకు ఇలాంటి ప్యూపాలనే చూడలేదు’’, ‘‘ప్రకృతి ఎప్పుడూ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది.. నీజంగా ప్రకృతి అద్భుతం’’, ‘‘బంగారం లాంటి ప్యూపా.. పరిణతి చెందిన వజ్రం’’ అంటూ నెటిజన్లు ఫిదా అవుతూ కామెంట్స్ పెడుతున్నారు. కాగా బంగారం మాదిరిగా కనిపించించే ఈ సితాకోకచిలుక ప్యుపాలను "టిథోరియా టారిసినా ప్యూపా" కశ్యన్ తన పోస్టులో వెల్లడించాడు. వీటిని ‘మచ్చల టైగర్వింగ్’ అని కూడా పిలుస్తారు. ఇవి దక్షిణ అమెరికాలోని మెక్సికోలో కనిపించే అరుదైన సీతాకోకచిలుక జాతి అని కశ్వన్ పేర్కొన్నాడు. -
‘చిహ్నం’గా సీతాకోక చిలుకలు
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడు ఇటీవల రాష్ట్ర ప్రత్యేక సంస్కతి, ప్రకతి సంపదకు చిహ్నంగా సీతాకోక చిలుకను ఎంపిక చేసింది. స్థానికంగా తమిళ మారవన్గా, అంటే తమిళ యోధుడిగా వ్యవహరించే ఈ సీతాకోక చిలుకను ఇంగ్లీషులో ‘కనోపీ బటర్ ఫ్లై’గా పిలుస్తారు. ఇది ముదురు పసుపు రంగు రెక్కలు కలిగి వాటిపై నాలుగైదేసి నల్లటి చుక్కలు ఉంటాయి. ‘నింఫాలిడ్’ జాతికి చెందిన ఈ సీతాకోక చిలుకలు సాధారణంగా 60 మిల్లీమీటర్ల నుంచి 75 మిల్లీ మీటర్ల వరకు ఉంటాయి. రాష్ట్ర చిహ్నంగా ఈ సీతాకోక చిలుకను ఎంపిక చేసేందుకు రాష్ట్ర అధికార యంత్రాంగానికి కొన్నేళ్లు పట్టింది. తమిళ యోధుడిగా వ్యవహరిస్తున్నందున, పర్వత ప్రాంతాల్లో ఇవి విరివిగా ఉండడంతో ఈ రకం సీతాకోక చిలుకను ఎంపిక చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో అంతరించి పోతున్న 35 రకాల సీతాకోక చిలుకలను పరిరక్షించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. రాష్ట్ర చిహ్నంగా సీతాకోక చిలుకను ఎంపిక చేసుకున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఐదవది. ఉత్తరాఖండ్ ‘కామన్ పీకాక్’గా వ్యవహరించే సీతాకోక చిలుకను ఎంపిక చేయగా (ఆకుపచ్చ రంగులో సిల్క్లాంటి రెక్కలు కలిగిన), కేరళ ‘మలబార్ పీకాక్ (మధ్యలో పాలపిట్ట రంగు, రెక్కల చివరన నలుపురంగు ఉండే)ను, కర్ణాటక ‘సదరన్ బర్డ్వింగ్స్ (మధ్యలో చీలి నాలుగు రెక్కలున్నట్లుగా రెండు రెక్కలుండే పలు రంగుల చిలుకలు)’ను, మహారాష్ట్ర ‘బ్లూ మార్మన్’ ముందు రెక్కలు ముదురు నీలి రంగులో ఉండి మధ్య భాగం తెలుపు, చివరి భాగంలో నీలి రంగుపై నలుపు చుక్కలు కలిగిన సీతాకోక చిలుకను ఎంపిక చేసుకున్నాయి. ఈ రాష్ట్రాలన్నీ కూడా కొండ ప్రాంతాలకు వన్నె తెచ్చే రంగు రంగుల సీతాకోక చిలుకల జాతులను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాయి. పర్యావరణ పరిస్థితులను సూచిస్తాయి కనుక సీతాకోక చిలుకలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీదుందని పర్యావరణవేత్తలు తెలియజేస్తున్నారు. సూర్యుడి కాంతి, వేడి, గాలిలో తేమ, వర్షాలను అధికంగా ఇవి తట్టుకోలేవు. అలాంటి పరిస్థితుల్లో అవి వలసలు పోతాయి. అప్పుడు వాతావరణ పరిస్థితులను మనం స్పష్టంగా అంచనా వేయవచ్చు. -
కర కరాచీ బిస్కెట్లు
తియ్యటి ఘుమఘుమల సువాసనలు కరిగించిన బటర్, కారమిలైజ్ చేసిన పంచదారల కలయిక నుండి వచ్చే మాధుర్యం.. నైపుణ్యం కలిగిన రెండు మూడు చేతుల మధ్యన మృదువుగా నలుగుతున్న పిండి... క్యాండీడ్ ఫ్రూట్స్‌ను జల్లుతున్న మరో కొన్ని చేతులు... వారి వెనకాలే పెద్ద పెద్ద అవెన్లు... అంతే... ఎంతో ఆదరణ పొందిన కరాచీ బేకరీ బిస్కెట్లు సిద్ధం... దేశవ్యాప్తంగా ఇంత ఆదరణ పొందిన ఈ బిస్కెట్ల ప్రయాణం సుమారు 60 సంవత్సరాల క్రితమే ప్రారంభమైంది. ఈ బేకరీ ఖాన్చంద్ రామ్నాని ఆలోచన నుంచి పుట్టుకొచ్చింది. కరాచీ బిస్కెట్లు... ఈ పేరుకి, పాకిస్థాన్‌లోని కరాచీకి ఏ మాత్రం సంబంధం లేదు. తన స్వస్థలం మీద మమకారంతో మాత్రమే ఈ పేరు పెట్టుకున్నారు. పుట్టుకతో సింధీ అయిన ఖాన్చంద్ రామ్‌నామీ, దేశ విభజన సమయంలో పాకిస్థాన్ కరాచీ నుంచి ప్రస్తుత ఇండియాకి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. 1953లో తనముద్రను ప్రతిబింబించేలా బిస్కెట్లు, కేక్‌లు, పేస్ట్రీల అమ్మకాలలో ప్రఖ్యాతి చెందారు. మొట్టమొదటి ఔట్‌లెట్‌ను ముజాంజాహి మార్కెట్లో ప్రారంభించారు. ఇటీవలే దుబాయ్‌లో కూడా వీరి ఔట్లెట్ తొలి అడుగు వేసింది.1960లో రామ్‌నామీ స్వయంగా తన సొంత బేకింగ్ యూనిట్‌ను ప్రారంభించి, తన మార్కులో ఫ్రూట్ బిస్కెట్లను తయారుచేయడం ప్రారంభించారు. అంతే, హైదరాబాదీల మనసులను ఇట్టే దోచేసుకున్నారు. నోటికి లవణ రుచిని కూడా చూపిస్తున్నారు. టూటీ ఫ్రూటీతో బిస్కెట్ల మీద నక్షత్రాల్లా మిణుకుమిణుకు మంటూ నోరూరేలా చేస్తున్నారు. టీ టైమ్ తినడానికి అనువుగా కాజు బిస్కెట్లు, ఉప్పు బిస్కెట్లు తయారుచేస్తున్నారు. ‘‘మా నాన్నగారు నాణ్యత మీదే మనసు లగ్నం చేశారు. ఆ నాణ్యతనే నేటికీ కొనసాగిస్తున్నాం. నా సోదరులిద్దరూ గతించారు. నా మేనల్లుళ్లు సోషల్‌మీడియాలో మా బేకరీ వస్తువుల గురించి ప్రచారం చేస్తుంటారు. నేను నిత్యం పనులలో బిజీగా ఉన్నా కూడా అందరికీ సకాలంలో డెలివరీలు అందేలా జాగ్రత్తపడుతుంటాను’’ అంటారు లేఖ్‌రాజ్ రామ్నాని. ఇక్కడి ప్రత్యేకతలు... ఎగ్‌లెస్ కుకీస్ కరాచీ బేకరీ ప్రత్యేకత. అలాగని వీరు కొత్తరకాలు తయారుచేయడంలేదని కాదు. ఇక్కడ పదిరకాల బిస్కెట్లు, షెర్మాల్ నుంచి ఒరిజానో వరకు 40 రకాల కుకీలు తయారుచేస్తున్నారు. కాజు, ఫ్రూట్స్, ఉస్మానియా... అన్నీ అప్పటికప్పుడు అమ్ముడైపోతాయి. హైదరాబాద్‌లో వీరికి విశేష ఆదరణ రావడంతో, నాణ్యత విషయంలో మరింత జాగ్రత్తలు పాటిస్తున్నారు. 2018 లో ముంబైలో కొత్తబ్రాంచ్ తెరిచారు. 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 ఔట్లెట్లు పూర్తిచేయాలనే సంకల్పంతో ఉన్నారు. స్థానిక దుకాణాలు మొదలు, అమెజాన్.కామ్ వంటి ఆన్లైన్ సంస్థల వరకు కరాచీ బిస్కెట్లను అమ్ముతున్నాయి. హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణించేవారు ఈ బిస్కెట్లను తమ బంధువులకు తప్పనిసరిగా తీసుకువెళ్తారు. నానాటికీ పెరుగుతున్న ప్రజాదరణతో ఈ ఔట్లెట్ల సంఖ్య పెరుగుతోంది. లేఖరాజ్ మాటల ప్రకారం. ... నిజమైన హైదరాబాదీకి ఉదయం టీతో పాటు కరాచీ బిస్కెట్లతోనే తెల్లవారుతుంది. మా కుటుంబీకులకు ఒక నమ్మకం ఉంది. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. అందువల్లే మేం ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇష్టపడం. చేతలతోనే మాట్లాడతాం. – లేఖ్‌రాజ్ రామ్నాని (ఖాన్చంద్ రామ్నాని కుమారుడు) కారం బిళ్లలు కావలసినవి: బియ్యప్పిండి – ఒక కప్పు; సెనగ పిండి – ఒక కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – రుచికి తగినంత; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను; నువ్వులు – ఒక టేబుల్ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, సెనగ పిండి, అల్లం వెల్లుల్లి ముద్ద, మిరపకారం, ఉప్పు వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙నువ్వులు వేసి మరోమారు కలపాలి ∙ఈ మిశ్రమాన్ని సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙చేతికి నూనె పూసుకుని పిండిని కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉండలా చేసి, చేతితో వడ మాదిరిగా ఒత్తి పక్కన పెట్టుకోవాలి ∙ఈ విధంగా అన్నీ చేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న కారం బిళ్లలను అందులో వేసి దోరగా వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙ఇవి పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటాయి. -
కేక్‌లో పలుకు చిలకలు...
ఫైలో : ఫైలో అనే పదానికి గ్రీకులో ‘ఆకు’ అని అర్థం. ఇది చాలా పల్చగా ఉంటుంది. పేస్ట్రీల తయారీలో ఫైలోను ఎక్కువగా ఉపయోగిస్తారు. బాల్కన్ క్విజీన్‌లో వీటి వాడకం ఎక్కువ. ఫైలో డఫ్‌ను మైదాపిండి, నీళ్లు, కొద్దిగా నూనె లేదా వైట్ వెనిగర్ ఉపయోగించి తయారుచేస్తారు. ఈ షీట్లను వరుసగా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ, ఆయిల్ లేదా బటర్‌తో బ్రషింగ్ చేసి, అప్పుడే పేస్ట్రీని బేక్ చేస్తారు. ఇంటి దగ్గర చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇందుకోసం పెద్ద పెద్ద రోలింగ్ షీట్లు, పెద్ద టేబుల్, పెద్ద చపాతీ కర్ర అవసరమవుతాయి. అలాగే రెండు పొరల మధ్య పొడి పిండి వేస్తూనే ఉండాలి. అందువల్ల వీటిని ఇంటి దగ్గర తయారు చేసుకోవడం కష్టం. ఫైలోలను చక్కగా తయారుచేసే యంత్రాన్ని 1970లో కనిపెట్టారు. ఇవి ఇప్పుడు సూపర్ మార్కెట్లో విస్తృతంగా దొరుకుతున్నాయి. వీటి తయారీకి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. క్రీమ్ ఆఫ్ టార్టార్: ఈ పేరు చూడగానే క్రీమ్ అనుకోకూడదు. ఇది పొడిపొడిగా ఉంటుంది. ద్రాక్ష పళ్లను పులియబెట్టి, తయారుచేసిన వైన్ నుంచి తయారయ్యే బైప్రోడక్ట్ ఇది. శాస్త్రీయంగా దీనిని పొటాషియం బైకార్బొనేట్ అంటారు. కోడిగుడ్లను గిలకొట్టేటప్పుడు ఈ పొడిని కొద్దిగా జత చేస్తే, మిశ్రమం బాగా నురుగులా, మెత్తగా వస్తుంది. షార్టెనింగ్: ఘనరూపంలో ఉన్న ఏదో ఒక ఫ్యాట్‌ని పేస్ట్రీలలో ఉపయోగిస్తారు. షార్టెనింగ్ అనే పదాన్ని మార్గరిన్కి దగ్గరగా ఉండే బటర్ పదానికి బదులుగా ఉపయోగిస్తారు. కొబ్బరి ఫ్లేక్స్: కొబ్బరిని సన్నగా ముక్కలుగా తురమాలి. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక ఈ కొబ్బరి ముక్కలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. స్వీటెన్డ్ ఫ్లేక్డ్ కోకోనట్ : సన్నగా తురిమిన కొబ్బరి ముక్కలకు కొద్దిగా పంచదార జతచేసి బాగా కలపాలి. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక ఈ ముక్కలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. ఇవి సుమారు వారం రోజులు నిల్వ ఉంటాయి. ఇదీ కేకు చరిత్ర: కేక్ అనే పదానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ పదం వికింగ్ దేశాలకు చెందిన పురాతన నార్స్ (స్కాండెనేవియా) పదం ‘కక’ నుంచి వచ్చింది. పురాతన గ్రీకులు కేక్‌ని ప్లకోస్ అని పిలిచేవారు. ఇది ఫ్లాట్ అనే పదం నుంచి పుట్టింది. కోడిగుడ్లు, పాలు, నట్స్, తేనెలను జత చేసి బేక్ చేసి తయారుచేసేవారు. గ్రీకులకు సతురా అనే ప్రత్యేకమైన కేక్ ఉండేది. అంటే ఫ్లాట్‌గా తయారుచేసిన హెవీ కేక్ అన్నమాట. రోమనుల కాలంలో ప్లాసెంటాను కేక్‌తో కలిపి బేక్ చేసేవారు. పేస్ట్రీల తయారీలో ఉపయోగించే వారు. వీరు మేకపాలను ఉపయోగించి చీజ్ తయారుచేసేవారు. పూర్వకాలంలో రోమన్లు బటర్, కోడిగుడ్లు, తేనె కలిపి బ్రెడ్ తయారీకి కావలసిన పిండిని తయారుచేసేవారు. ఇంగ్లండ్‌లో కూడా తొలినాళ్లలో బ్రెడ్‌నే కేక్‌గా ఉపయోగించుకునేవారు. స్పాంజ్కేకులు స్పెయిన్‌లో ప్రారంభమైనట్లు భావిస్తారు. కేకులు చాలా రకాలు ఉన్నాయి. బటర్ కేక్స్, స్పాంజ్ కేక్స్, చిఫాన్ కేక్స్, చాకొలేట్ కేక్స్, కాఫీ కేక్స్... -
సీతాకోక చిలుక షాపింగ్ చేసింది!
‘బటర్ ఫ్లై’ అంటే ఏంటి? సీతాకోక చిలుక! ఎక్కడైనా సీతాకోక చిలుక గాల్లో ఎగురుతుంది కానీ... షాపింగ్ చేస్తుందా? చేయదు. మరి, చేసిందని చెబుతారేంటి? అనుకుంటున్నారా? ఇప్పుడు కన్నడలో ‘బటర్ ఫ్లై’ పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. హిందీ హిట్ ‘క్వీన్’కి రీమేక్ ఇది. హిందీలో కంగనా రనౌత్ చేసిన పాత్రను కన్నడలో పరుల్ యాదవ్ చేస్తున్నారు. అంటే... ఆమె సీతాకోక చిలుకే కదా! ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఫ్రాన్స్‌లో జరుగుతోంది. చిత్రీకరణ మధ్యలో ఓ రోజు సెలవు ఇవ్వడంతో షాపింగ్ చేశానని పరుల్ తెలిపారు. ఇంతకీ, ఫ్రాన్స్‌లో షాపింగ్ ఎక్కడ చేశారో తెలుసా? తమన్నా సైట్ సీయింగ్‌కి వెళ్లారు కదా? మొనాకో... అక్కడే! షాపింగ్‌తో పాటు చుట్టుపక్కల అందమైన ప్రదేశాలు కూడా తిరిగొచ్చారట! అంతే కాదండోయ్... శనివారం పరుల్ అమ్మగారి బర్త్‌డే. ఆ సెలబ్రేషన్స్‌లోనూ ఫుల్లుగా సందడి చేశారు. ‘‘నా స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్ అండ్ ఇన్స్పిరేషన్ మా అమ్మే’’ అని పరుల్ సోషల్ మీడియా ద్వారా తెలియ చేశారు. -
‘సీతమ్మ’ సింగారం
సీతాకోక చిలుకలు రకరకాల ఆకృతులు.. వర్ణాలతో కనిపిస్తాయి.. ఇక్కడ మాత్రం పతంగి రెక్కలను అలంకరించుకున్నట్లు కనువిందు చేస్తోంది. అటూ.. ఇటూ ఎగురుతూ పతంగి ఎగరేసిన మాదిరిగా ఆకట్టుకుంది. పట్టణంలోని రాహుల్‌గాంధీ నగర్లో గల ఉపాధ్యాయుడు భాస్కర్ ఇంట్లో గురువారం కనిపించిన పతంగి రెక్కల సీతాకోక చిలుకను చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. - పాల్వంచ -
పండు.. భలే పసందు!
-
సుందరం.. సుమధురం
-
ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
-
చంద్రబాబు.. సీతాకోకచిలుక..
విజయవాడ: దేశంలో జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రత ఉన్న అతికొద్ది మంది రాజకీయ నాయకుల్లో ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఒకరన్న సంగతి తెలిసిందే. ఆర్జీ ఇచ్చుకునేందుకో, గోడు వెళ్లబోసుకునేందుకో సామాన్యులెవరైనా సీఎం సార్ ని కలవాలంటే సవాలక్ష సెక్యూరిటీ చెకింగ్ లు. వీవీఐపీగా ఆ ప్రక్రియ తప్పనిదే. అలాంటిది శనివారం విజయవాడ నగరంలో దుర్గగుడి ఫ్లై ఓవర్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను భద్రతా వలయాలను ఛేదించుకునిమరీ ఓ కీటక శ్రేష్ఠం పలకరించింది. నేరుగా చంద్రబాబు తలపై వాలిన సీతాకోకచిలుక.. నిమిషాలపాటు అక్కడే ఉండిపోయింది. బాబుగారు కూడా దానిని అదిలించే ప్రయత్నం చేయలేదు. ఇది గమనించిన సీఎం బాడీగార్డ్.. సీతాకోకచిలుకను నేర్పుగా ఒడిసిపట్టి గాలిలోకి వదిలేశారు. ఈ దృశ్యాలను సీఎం పక్కనే కూర్చున్న కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, సుజనా చౌదరిలు ఆసక్తిగా గమనించారు. -
చెంపలపై...బటర్‌ఫ్లై
మెడిక్షనరీ ముక్కుకు ఇరువైపులా చెంపల మీద సీతాకోకచిలుక ఆకృతిలో కనిపించే చర్మం మీద కనిపించే మచ్చల వల్ల ఈ సమస్యకు ‘బటర్‌ఫ్లై ర్యాష్’ అని పేరు. ల్యూపస్ అనే దీర్ఘకాలిక వ్యాధి వల్ల కనిపించే లక్షణమిది. ఇదొక ఆటోఇమ్యూన్ వ్యాధి. అంటే మన వ్యాధి నిరోధకత మనపైనే దుష్ర్పభావం చూపడం వల్ల ఈ వ్యాధి కనిపిస్తుందన్నమాట. ఆటో ఇమ్యూన్ వ్యాధి కావడం వల్ల ఇది ఒక పట్టాన తగ్గే అవకాశం అంతగా ఉండదు. కానీ సన్‌స్క్రీన్ లోషన్స్ రాయడం, ఎండవేడిమి వెళ్లకుండా ఉండటం, కొన్ని రకాల యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు వాడటం, ‘డీఎమ్‌ఏఆర్‌డీ’స్అని పిలిచే డిసీజ్ మాడిఫయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్ వాడటం వంటి చికిత్సల వల్ల ఇది కాస్త అదుపులోకి వస్తుంటుంది. -
నదులను కాపాడే సీతాకోకచిలుకలు!
రంగు రంగు రెక్కలతో.. హరివిల్లును తలపిస్తూ...పచ్చని చెట్లపై ఎగిరే అందమైన సీతాకోక చిలుకలు.. చూపరులకు కనువిందు చేస్తాయి. మొక్కలపై వాలి.. వాటి పూల పుప్పొడితో ఆ జాతి అభివృద్ధికి దోహద పడతాయి. ఇప్పటికే సీతాకోకచిలుకలు ప్రపంచంలోని అనేక ఇతర జీవుల కన్నా శక్తివంతమైనవిగా గుర్తించబడ్డాయి. ప్రస్తుతం నదులను కాపాడ్డంలోనూ, అడవుల ఆరోగ్యాన్ని రక్షించడంలోనూ ఈ కీటకాలు సహాయపడతాయంటున్నారు పరిశోధకులు. సుమారు ఆరు దశాబ్దాలుగా సీతాకోక చిలుకల సమగ్ర జాబితాను తయారు చేస్తున్నారు సైంటిస్టులు. ఉత్తరాఖండ్ నైనిటాట్ జిల్లా భిట్మాల్ లోని బట్టర్ ఫ్లై రీసెర్చ్ సెంటర్ కు చెందిన శాస్త్రవేత్త స్మెటాసెక్...ఏళ్ళ తరబడి సీతాకోకచిలుకల సంగ్రహణకు పాటుపడుతూనే వాటి కొత్త జాబితానూ రూపొందిస్తున్నారు. స్మెటాసెక్... తన పరిశోధనల్లో భారతదేశ వ్యాప్తంగా 1,318 రకాల సీతాకోక చిలుకల జాతులు ఉన్నట్లుగా కనుగొన్నారు. సంవత్సరాల కాలం సీతాకోకచిలుకల సంగ్రహణలోనే గడిపిన స్మెటాసెక్... వాటిని పత్రబద్ధం చేయడమే కాక, అవి ఇండియాలోని నదులను కాపాడేందుకు ఎంతగానో సహకరిస్తాయని చెప్తున్నారు. క్రిమి కీటకాలను ఉపయోగించి అడవుల ఆరోగ్య పరిరక్షణ గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రతయత్నిస్తున్నారు. అందులో భాగంగానే సీతాకోక చిలుకల జాబితాను సేకరిస్తున్నామని, అవి ఎక్కడ ఏ రకంగా ఉన్నాయో తెలిస్తే.. వాటి జాతుల వర్గీకరణను స్పష్టం చేయవచ్చని, ఆపై అడవుల ఆరోగ్యాన్ని కనిపెట్టవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అందుకే ముందుగా వాటి జాబితాను సిద్ధం చేస్తున్నారు. భారత దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకమైన జాతులు ఉన్నట్లుగా కనుగొన్నామని, ముఖ్యంగా నదీ ప్రాంతాల్లో ఉన్న సీతాకోక చిలుకలు నీటి ఆరోగ్యాన్ని పెంపొందించేవిగా ఉన్నాయని సైంటిస్ట్ స్మెటాసెక్ చెప్తున్నారు. నిజానికి అటవీశాఖ వారు అడవుల్లోని క్రిమి కీటకాలు, పక్షులు, ఇతర జాతుల వివరాలను సేకరించడం, వాటి లెక్కలను తెలపడంవల్ల నదీతీరాల్లోని అడవుల ఆరోగ్యం గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని సీతాకోక చిలుకల నిపుణులు అంటున్నారు. వాటి జన్మ స్థలాన్ని బట్టి అక్కడి పర్యావరణ సమాచారం ఆధారంగా జల భద్రతను నిర్థారించేందుకు, నదీ ప్రవాహం స్థిరీకరించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్తున్నారు. సీనాకోక చిలుకలు.. మొక్కల పరపరాగ సంపర్కానికి మాత్రమే కాక... కప్పలు, కందిరీగలు, పక్షులు, పలు రకాల కీటకాలకు, ఇతర జాతులకు ఆహారాన్ని అందించడంలోనూ ఉపయోగపడతాయట. స్వాతంత్ర్యానంతరం భారత దేశంలో ప్రత్యేకంగా ఓ సీతాకోక చిలుకల జాబితా తయారు చేశారు. ఆ తర్వాత పాకిస్తాన్, ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో ఎటువంటి జాతులు ఉన్నాయనేది ఎవ్వరూ తెలుసుకోలేదు. ప్రస్తుతం ఇండియాలో సైంటిస్ట్ స్మెటాసెక్ తో పాటు, జూలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ ఆర్కే వర్స్ నే... అటువంటి సమాచారాన్ని తెలుసుకున్నారు. ఇండియాలోని కేరళ, కర్నాటక ప్రాంతాల్లో మాత్రమే వైవిధ్యంగా కనిపించే ట్రావెన్కోర్ ఈవెనింగ్ బ్రౌన్ సీతాకోకచిలుకలు ఉన్నాయని, అంతరించిపోతున్న ఇటువంటి జాతికి సమీపంగా కనిపించే కొన్ని జాతులు దక్షిణ ఆమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. రక్షిత ప్రాంతాల్లో ఇటువంటి జాతులు ఉండటం ఎంతో అదృష్టమని స్మెటాసెక్ తెలిపారు. -
రెక్కల కాన్వాసుపై చక్కని చిత్రాలు
రవిగాంచని స్థలమును కవిగాంచున్ అన్నారు పెద్దలు. కళాహృదయం, తపన ఉండాలేగానీ చిత్తరువులు గీయడానికి బోర్డులతో, కాన్వాసులతో పనేముంది. తోచినచోట వేసేయొచ్చు. సరిగ్గా అదే పనిచేశాడు మెక్సికోకి చెందిన కళాకారుడు రమోస్. తొలుత మిఠాయిలు, పేస్టులపై కళాఖండాలను చెక్కి ఔరా అనిపించుకున్న రమోస్కి ఓ సరికొత్త ఆలోచన వచ్చింది. అదేమిటంటే సీతాకోకచిలుకల రెక్కలపై సిత్రాలు గీయాలని. వచ్చిందే తడవుగా సీతాకోకచిలుకల రెక్కలను సేకరించి పని ప్రారంభించాడు. 12 సెంటీమీటర్ల పొడవున్న రెక్కలపై 56 గంటలపాటు శ్రమించి చెక్కిన చిత్రాలు చూపరుల్ని కట్టిపడేశాయి. చిన్నప్పటి నుంచి తనకు సీతాకోకచిలుకలంటే ఇష్టమని, వాటి రంగులను చూసి మైమరిచిపోయేవాడినని రమోస్ చెప్పాడు. ఆ ఇష్టమే తనను వాటి రెక్కలపై చిత్రాలు గీసేలా చేసిందన్నాడు. పైగా ఇలా సీతాకోకచిలుకల రెక్కలపై పెయింటింగ్ వేసిన ప్రపంచంలోనే తొలి చిత్రకారుడిని తానేనని గర్వంగా చెప్పుకున్నాడు. -
బక్కెట్ నిండా ఆహ్లాదం
బ్యూటిప్స్ రెండు టీ స్పూన్ల కోకా బటర్‌ను కరిగించి అందులో టీ స్పూన్ విటమిన్-ఇ ఆయిల్, టీ స్పూన్ నువ్వుల నూనె, 5-6 చుక్కల ఆరెంజ్ ఆయిల్, టీ స్పూన్ అల్లం రసం వేసి, కలిపి వేడి చేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని ఒంటికి మసాజ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ మెరుగై, ఒత్తిడి నుంచి త్వరగా విశ్రాంతి లభిస్తుంది. స్నానం చేసే బకెట్ నీటిలో కొబ్బరిపాలు, రోజ్ వాటర్ కలపాలి. ఆ నీటితో స్నానం చేస్తే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. పెప్పర్ మింట్ ఆయిల్(మార్కెట్లో లభిస్తుంది)ను కొద్దిగా నీటిలో కలుపుకొని స్నానం చేస్తే అలసిన దేహానికి సరైన విశ్రాంతి లభిస్తుంది. ఒత్తిడి తొలగిపోయి ఆహ్లాదంగా అనిపిస్తుంది. -
చైనాకోకచిలుక
‘లేస్తే మనిషిని కాను... ఎగిరే సీతాకోక చిలుకన్నేను...’ అంటూ కాంగ్నింగ్ చేసిన విన్యాసాలకు చైనా ప్రజలు ఆనందభరితులయ్యారు. కాన్వాస్‌పై చేయి తిరిగిన చిత్రకారిణి అయిన కాంగ్నింగ్... కాలుష్యానికి వ్యతిరేక ప్రచారంలో భాగంగా కొత్త అవతారాలు ధరించడంలోనూ దిట్ట. తాజా న్యూ ఇయర్‌ను పురస్కరించుకుని ఈమె అచ్చంగా సీతాకోక చిలుక అవతారమెత్తింది. గత గురువారం బీజింగ్ నగర శివార్లలోని గ్రేట్‌వాల్ దగ్గర సీతాకోకచిలుకలా విన్యాసాలు ప్రదర్శించింది. ఏడాదిలోని 365 రోజులను ప్రతిబింబించే మాస్క్‌లను రెక్కలకు తొడిగి చూపరులను అబ్బురపరచింది. కొంగొత్త కోక అనుకోవద్దు... కొసరు సందేశం మరవద్దంటూన్న కాంగ్... 2015లో చైనాలో వాయుకాలుష్యాన్ని అరికట్టాలనే తన సందేశాన్ని అందిస్తోంది. కొత్త సంవత్సరంలో వాయు కాలుష్యాన్ని అరికట్టాల్సిన అవసరాన్ని చెప్పడానికే తాను ‘హ్యూవా డై’ (సీతాకోకచిలుకలా మారడం) అనే ఈ ఆర్ట్‌ను ప్రదర్శించానని ఆమె చెబుతోంది. ఎగ్గు లేని జన్మ! గుడ్డు ముందా పిల్ల ముందా? ఈ డౌట్ ఉన్నవాళ్లు తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఇండోనేసియాలోని సులవేసి ఐలాండ్ పరిసరాల్లో సంచరించే రెయిన్ ఫారెస్ట్‌లలో ఒక అరుదైన కప్ప... సిగ్గూ ‘ఎగ్గూ’ లేకుండా నేరుగా పిల్లలకి జన్మనిచ్చేస్తోందట. జంట అవసరమే లేని ఈ కప్పకు సిగ్గులూ ఎగ్గులతో పనేమీ లేదని, అయినా వాటి సంతాన సౌభాగ్యానికి ఇవేమీ అడ్డుకావడం లేదని సైంటిస్ట్‌లు వివరిస్తున్నారు. ఆడ-మగ కప్పలు కలవడం, ఆడ కప్ప గుడ్లు పెట్టడం, వాటిలో నుంచి పిల్లకప్పలు ఊపిరిపోసుకోవడం వంటి రెగ్యులర్ పద్ధతులను ఫాలో అవకుండా నేరుగా పిల్లల్ని కనే పొడవాటి దంతాలున్న కప్పల్ని కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనిపెట్టారు. గతంలో గుర్తించిన దాదాపు 6 వేల రకాల కప్పలకు ఇవి భిన్నమైనవంటున్న వీరు వీటికి లిమనెక్ట్స్ లార్విపార్టస్ అని పేరు పెట్టారు. వీటిని గుర్తించడం ఆలస్యంగా జరిగినా.. నేరుగా పిల్లలని పుట్టించే వీటి వైరుధ్యపు మూలాన్ని మాత్రం త్వరలోనే తేలుస్తామంటున్నారు. -
కిలకిలరావాలు కొన్ని నిష్ర్కమణ గీతాలు
సీతాకోకచిలుక ఓ నిత్యకల్యాణి మరి మరి బ్రతిమిలాడినా మచ్చిక్కాని ఆమె లాలిత్యాన్ని ఊహలోకి ఆహ్వానం పలుకుతాను పావురం నా సౌందర్య సఖి ఊదావృత్తాల కళ్లలోంచి ఆ చిప్పిల్లే కరుణని మధిర వలె అనుదినం నేను చిత్తుగా తాగుతాను కోకిల ఆరాధ్యదేవత అజ్ఞాతంగా అవనిని వర్ధిల్లమనే ఆ ఆకుపచ్చని పునరాకాంక్షలో కవి పరంపరగా పాలుపంచుకొన్నాను రామచిలుక జన్మతః వయ్యారి ఉరుముల మెరుపులతో ఊరించే వర్షాగమ వేళ కారు మబ్బులని గమ్మున గమ్మున కురవమని ఆమె కిలకిలవంపుల కలవరంలో రమణీయంగా కోరుకోవడం విన్నాను పిచ్చుక నా ఒక్కగానొక్క గారాల పుత్రిక ప్రతి ఇద్ద్దరి నిస్తంత్రీ సంభాషణలో అంతూ దరీ లేక వీచే వడగాడ్పుకి అదృశ్యమైన ఆ చిన్నారిపొన్నారిని ఎవ్వరైనాగాని ఎక్కడైనా చూశారా అని గడపగడపకూ తిరిగి అడుగుతున్నాను - నామాడి శ్రీధర్ 9396807070 -
అరుదైన సీతాకోక చిలుక
కోస్గి: మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి పట్టణంలో గురువారం ఓ అరుదైన సీతాకోక చిలుక కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. త్రిభుజాకారంలో వింతైన రంగుల మేళవింపుతో రెక్కలపై గుండ్రటి కళ్లలాంటి గుర్తులతో అక్కడక్కడ సేదతీరుతూ ఆక ట్టుకుంది. అందమైన సీతాకోక చిలుకను చూశామనే సంతోషాన్ని మిగిల్చి రివ్వున ఎగిరిపోయింది. -
అదిరే.. అదిరే!
తూనీగలా రివ్వున ఎగిరే అమ్మాయి ఒక్కసారిగా ఒద్దిగ్గా సీతాకోక చిలుకలా కనిపిస్తే ఎంత కనువిందుగా ఉంటుంది! రోజూ రోజాలా విలాసంగా వికసించే యువతి ఏ ప్రభాతంలోనో ముద్దమందారంలా ప్రత్యక్షమైతే ఎంత మనోహరంగా ఉంటుంది! నిత్యం మోడర్న్ లుక్స్‌తో సెలయేరులాతుళ్లిపడే టీనేజైఉ గాళైఉ ఒక్కసారిగా కళ్లు చెదిరేట్టు లంగా వోణీలో కళకళలాడితే ఎంత మార్వెలెస్గాఉంటుంది! ఇలాటప్పుడే ‘అమ్మో.. బాపుగారి బొమ్మో’ అని పాడబుద్ధేస్తుంది. అయితే ఏ దసరా వంటి పండగ సందడి వస్తేనే ఈ సోయగాలు చూడడం సాధ్యమవుతుంది. రోజూ పండగ వస్తే బాగుణ్ననుకుంటున్నారా? సారీ.. పర్వదినాన ఏ కోవెల ఆవరణలోనో, వీధి వాకిట్లోనో పట్టు పరికిణీని చూసినప్పుడు కలిగే సంతోషం... స్కూటీ మీద కాలేజీకో, ఉద్యోగాలకో పరుగులు తీస్తూ ఉన్నప్పుడు ఎలా కలుగుతుంది? అందుకే పండగొస్తేనే పట్టు పరికిణీల రెపరెపల్లో సోయగమేంటో అందరికీ తెలిసేది. ఉద్యోగాలనండి, చదువులనండి.. ఇప్పటి కాలం అమ్మాయిలు కంఫర్ట్‌కే ఓటేస్తున్నారన్నది వాస్తవం. బస్సెక్కాలన్నా, బండి నడపాలన్నా పరికిణీ, వోణీల్లో ఏం సాధ్యమవుతుంది? పరుగులు తీయాలంటే అదో ప్రతిబంధకమవుతుంది. అందుకే ఎక్కువ మంది ప్యాంటైఉ్స, చుడీదార్స్తో ఈజీనెస్‌ను వెతుక్కుంటున్నారు. అయితే పండగ నాడు మాత్రం ఈ మోడర్న్ ట్రెండ్స్ ఒక్కసారిగా మాయమవుతాయి. పక్కా ట్రెడిషనలైఉ డ్రెస్‌లు ప్రత్యక్షమవుతాయి. అయితే ఇందులోనూ మళ్లీ మోడర్న్ ట్రెండ్లు రాజ్యమేలుతున్నాయి. పూర్వకాలంలో మాదిరిగా పట్టు చీరలు పరికిణీలుగా మారిపోయే రోజులు కావివి.. స్పెషల్ డిజైనర్ల ఆలోచనల్లోనుంచి పుట్టే కొత్త డిజైనర్లతో... ఇప్పటి తరాన్ని మెప్పించే ట్రెండీ ఫ్యాషన్లతో ట్రెడిషలన్ డ్రెస్సులు మెరుపులీనుతున్నాయి. ఎంత తేడా! అమ్మదో, అమ్మమ్మదో పట్టుచీర రూపాన్ని మార్చుకుని అమ్మాయి పట్టు పరికిణీ, లంగాగా అవతరిస్తుంది.. ఇది పాత మాట. డిజైనర్ల సృజన నకారణంగా పట్టు వస్త్రం రకరకాల హొయలు పోయి, భిన్నమైన సోయగాలను సంతరించుకుని, కొత్త తళుకులు అద్దుకుని లెహంగాగా అవతరించడం కొత్త బాట. టేస్ట్‌ను బట్టి, బడ్జెట్‌ను బట్టి లంగా, వోణీ డిజైనర్ల చేతుల్లో అనేక రీతుల్లో హరివిల్లులా మారుతోంది. ప్యూర్ రా మెటీరియల్స్‌ను బయిట నుంచి తెచ్చి, కలర్స్‌తో డై చేసి కుందన్ వర్క్, కట్ వర్క్‌తో మెరుగులు దిద్దితే ట్రెండీ ట్రెడిషనల్ డ్రెస్ తయారవుతోంది. బనారస్ కావొచ్చు.. జైపూర్ కావచ్చు.. ఏపట్టయినా, జార్జెట్ అయినా, ప్యూర్ సిల్క్స్ అయినా భిన్నంగా డిజైన్ చేసి వెరైటీగా స్టిచ్ చేస్తున్నారు. అన్ని వర్గాల అమ్మాయిలకు అందుబాటులో ఉండేట్టు ఆర్డర్ మీద సిద్ధం చేస్తున్నారు. ఈ లెహంగాస్ రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఉన్నాయి. చీరలు రూ. 5 వేల నుంచి లక్ష వరకూ ఉన్నాయి.! డిజైన్ బట్టి ధర లుంటాయని డిజైనర్లు అంటున్నారు. అన్ని ఫంక్షన్లకూ.. సందర్భం ఏదైనా.. ఎక్కడైనా డిజైనర్ లెహంగాలు, చీరలు ఇప్పుడు స్టార్ ఎట్రాక్షన్‌గా ఉన్నాయి. రెడీమేడ్ స్టాక్ కూడా లభ్యమవుతున్నాయి. వీటి ధర కాస్త తక్కువగా ఉంటుంది. ట్రెండీగా ఉండడంతో యూత్ వీటిని బాగా లైక్ చేస్తున్నారు. ట్రెండీగా కనిపించే చీరల్లో, పరికిణీల్లో కళ్లు చెదిరేట్టు కనిపిస్తున్నారు. అమ్మాయిలూ ఇంకెందుకు ఆలస్యం.. దీపావళికి ట్రెండీ ట్రెడిషనలైఉ డ్రెస్‌లను ట్రై చేస్తారా? -
ఏంజెల్స్ విత్ ఫ్లవర్స్
పువ్వులను చూస్తే నవ్వులు చిందించే చిన్నారులు గుర్తుకొస్తారు. పువ్వులు పెట్టుకున్న చిన్నారులను చూస్తే తోటలో తిరుగాడే చిట్టి సీతాకోక చిలుకల్లా కనిపిస్తారు. ఈ ఐడియాతోనే ఇపుడు బర్త్ డే వేడుకలను గ్రాండ్‌గా మారుస్తున్నారు సిటీజనులు. తమ చిన్నారులను లిటిల్ ఏంజెల్స్లా ముస్తాబు చేసి మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. -పుట్టిన రోజున తమ చిన్నారిని రాకుమారిలా అలంకరించాలని, దేవదూతను తలపించేలా ఆమె ఆహార్యం ఉండాలని.. అమ్మానాన్నలు ముచ్చటపడతుంటారు. పార్టీకో ప్రత్యేకత, ఇంటికి గొప్ప కళ రావాలంటే సింపుల్ అనిపించే ఈ వెరైటీ ట్రెండ్‌ను ఫాలో అయితే చాలు. ఇప్పటి వరకు అట్ట, లోహపు కిరీటాలు.. పుట్టినరోజు పాపాయి నెత్తిన ధీమాగా మెరిసిపోయేవి. ఇప్పుడా స్థానాన్ని సుతిమెత్తని రంగురంగుల పువ్వులు ఆక్రమించేశాయి. ‘పూల కిరీటం పెట్టుకున్న మా చిట్టితల్లిని చూస్తుంటే రెండు కళ్లూ సరిపోవడం లేదు’ అంటూ మురిసిపోతున్నారు ఎల్బీనగర్‌కి చెందిన ప్రవీణ. ‘మా చిన్నారి బర్త్‌డే పార్టీకి వచ్చిన అమ్మాయిలందరికీ పూల కిరీటాలు పెట్టాం. వారంతా వేడుకలో తిరుగాడుతుంటే కథల పుస్తకాలలోని రాకుమార్తెలు ఇలా విచ్చేశారా అనిపించింది’ అంటూ సంబరంగా చెప్పారామె. పూల కిరీటాలలో లిల్లీ, మల్లె, చామంతి, గులాబీ వంటి స్వదేశీ పువ్వులే కాదు టులిప్స్, ఆర్కిడ్స్ వంటి విదేశీ పువ్వులూ అందాలొలకబోస్తున్నాయి. ‘అలంకరణలో పువ్వులది ప్రత్యేకమైన స్థానం. ఆ పరిమళాలు మనసును ఆహ్లాదపరుస్తాయి. అందుకే పిల్లలు కూడా చాలా ఇష్టంగా ధరిస్తారు’ అని చెబుతున్నారు ఫ్లవర్ క్రౌన్స్ తయారీ నిపుణురాలు కల్పన. కూకట్‌పల్లికి చెందిన ఈమె పూలకిరీటాల తయారీలో మెలకువలూ తెలుపుతున్నారు. ‘ఎక్కువ సేపు తాజాగా ఉండే పువ్వులనే కిరీటాల తయారీకి ఉపయోగించుకుంటాం. అంతేకాదు వీటిని తయారుచేసే ముందు పార్టీలో పిల్లలు ధరించే దుస్తుల రంగులను తెలుసుకొని, వాటికి మ్యాచ్ అయ్యే రంగు పూలను ఎంచుకుంటాం. అలా ఎంచుకున్న పూలను క్రౌన్ వైర్ సాయంతో అల్లి, ఈ కిరీటాలను తయారుచేస్తాం. పిల్లల తలకు ఏ మాత్రం అసౌకర్యం కలిగించని విధంగా ఈ కిరీటాల అల్లిక ఉంటుంది. వీటిని ధరించిన పిల్లల ఫొటోలు కూడా చాలా వెరైటీగా, మరింత అందంగా తీయవచ్చు’ అని తెలిపారు ఈమె. సింపుల్ అండ్ గ్రేస్ అనిపించే ఈ ఐడియాను మీ చిన్నారుల బర్త్ డే పార్టీకి మీరూ ఫాలో అయిపోవచ్చు. - విజయారెడ్డి -
సీతాకోక.. రెక్కలు విచ్చుకునే వేళ..
అప్పుడే పట్టుగూడును బద్దలుకొట్టుకుని బయటి ప్రపంచంలోకి వచ్చిన అందాల సీతాకోక చిలుక.. రెక్కలు విప్పుకొని గాలిలోకి ఎగిరిపోయే సుందర దృశ్యాన్ని ఎప్పుడైనా చూశారా? పోనీ రంగురంగుల బుల్లి సీతాకోకను స్వయంగా మీ చేతులతో గాలిలోకి వదిలిపెట్టారా? కోల్‌కతాలోని ఓ పార్కుకు వెళితే ఈ రెండూ అనుభవంలోకి వస్తాయి. జస్ట్ రూ.50 ఫీజు చెల్లిస్తే చాలు.. పట్టుగూడు(కకూన్)ను బద్దలుకొట్టుకుని సీతాకోక బయటికి రావడాన్ని చూడటమే కాదు.. అప్పుడే పుట్టిన ఆ బుల్లి సీతాకోకను గాలిలోకి విడిచిపెడుతూ ఫొటో కూడా తీసుకోవచ్చు. సీతాకోకల సంరక్షణ కోసమని ‘నేచర్ మేట్స్-నేచర్ క్లబ్’ అనే ఎన్జీవో వలంటీర్లు ఈ కొత్త కార్యక్రమం ప్రారంభించారు. పట్టణాల్లో సీతాకోకల సంఖ్యను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నేచర్ మేట్స్ కార్యదర్శి అర్జన్ బసు రాయ్ వెల్లడించారు. విద్యార్థులకు సీతాకోక జీవితచక్రంలోని దశల అభివృద్ధి గురించి కూడా తాము అవగాహన కల్పిస్తామన్నారు.