Butterfly-Shaped House Goes on Sale for Rs 52 Crore in Greece - Sakshi
Sakshi News home page

అమ్మకానికి సీతాకోక చిలుక ఇల్లు, సొంతం చేసుకునేందుకు ఎగబడుతున్న జనం!

Published Thu, Apr 21 2022 7:23 PM | Last Updated on Thu, Apr 21 2022 10:01 PM

Butterfly Shaped House Goes On Sale For Rs 52 Crores  - Sakshi

సొంతిల్లు నిర్మించుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. అందుకే ఆ కలను నిజం చేసుకునేందుకు జీవిత కాలం కష్టపడుతుంటాం. అదిగో అలా కట్టుకుందే ఈ సీతా కోక చిలుక ఇల్లు. ప్రపంచంలోనే విలక్షణమైన ఇల్లుగా ప్రసిద్ధి చెందిన..ఈ బటర్‌ ఫ్లై హౌస్‌ను అమ్మకానికి పెట్టారు. 

ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశమైన 'గ్రీస్‌'దేశంలోని వౌలియాగ్మెని బీచ్‌ సరిహద్దుల్లో ఈ ఇంటిని నిర్మించారు.  ఈ ఇంటిని ఎవరు నిర్మించారు. ఎప్పుడు నిర్మించారనే విషయాలు వెలుగులోకి రాకున్నా.. ప్రస్తుతం ఈ ఇల్లు అమ్మకానికి పెడుతున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 
 



5381 స్కైర్‌ ఫీట్‌లో నిర్మాణం
వౌలియాగ్మెని బీచ్‌ సరిహద్దుల్లో 5381 స్కైర్‌ ఫీట్‌లో ఇంటి నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఎలాంటి వాల్స్‌ లేకుండా నిర్మించిన ఈ ఇల్లు ఫ‍్లోర్‌ ఫోర్ల్‌ ఎలివేటర్‌(లిఫ్ట్‌)సౌకర్యం ఉంది. సీతాకోక చిలుక ఇన్స్పిరేషన్‌తో నిర్మించిన ఈ ఇంటికి షేడింగ్‌, గోప్యత ఉండేలా ఆర్కిటెక్చర్‌లు డిజైన్‌ చేశారు. దిగువ అంతస్తులో హోమ్ థియేటర్, మూడు అదనపు బాత్‌రూమ్‌లతో మూడు బెడ్‌రూమ్‌లు కూడా ఉన్నాయి.

నిజంగా స్మార్ట్‌ హోమే!
స్మార్ట్‌ హోమ్‌గా ప్రసిద్ధి చెందిన ఈ బటర్‌ ఫ్లై హోంలో ఐదు బెడ్‌ రూమ్‌లు, నాలుగు బాత్రూంలు, ఇల్లు ఐదు బెడ్‌రూమ్‌లు, నాలుగు బాత్‌రూమ్‌లు, ప్రైవేట్ బేస్‌మెంట్ ఉంది. ఈ ప్రైవేట్‌ బేస్‌మెంట్‌ను  స్టోరేజ్‌, డార్క్‌ రూమ్‌, పార్కింగ్‌ ఏరియాలుగా ఉపయోగించుకోవచ్చు. దీంతో పాటు ఒక  గడపలో నుంచి లోపలికి వెళితే గోడలు, డోర్లను ఏర్పాటు చేస్తూ కిచెన్‌ , లివింగ్‌ రూమ్‌, డైనింగ్‌ రూమ్‌ ఉండేలా ఓపెన్ ప్లాన్ లివింగ్ ఏరియా, జియో మెట్రిక్‌ షేప్‌లో నిర్మించిన ఇండోర్ పూల్‌తో ఈ స్మార్ట్ హోమ్ చూపరులను కట్టిపడేస్తుంది.  

క్యూ కడుతున్నారు!
చిత్రంలో చూపించినట్లుగా.. పై నుంచి చూస్తే సీతాకోక చిలుకలా కనిపిస్తుంది. సీతాకోక చిలుక డిజైన్‌ వచ్చేలా ఇంటిని నిర్మించేందుకు ఇంటిపై కప్పులు ఓవల్ ఆకారపు హోల్స్‌తో అందంగా తీర్చిదిద్దారు. ఇక ఈ ఇల్లును $6.78 మిలియన్లకు (రూ. 52 కోట్లు) అమ్మకానికి పెట్టినట్లు వెలుగోలోకి వచ్చిన రిపోర్ట్‌లు పేర్కొన్నాయి. అయితే ప్రపంచంలో విభిన‍్నంగా సీతాకోక చిలుక ఆకారంలో ఉన్న ఇంటిని సొంతం చేసుకునేందుకు స్థానికంగా ఉండే ధనికులతో పాటు ప్రపంచ దేశాలకు చెందిన పలువురు క్యూ కడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

చదవండి: షాకింగ్‌,హైదరాబాద్‌లో చదరపు అడుగు ధర ఎంతో తెలిస్తే నోరెళ్ల‌బెడ‌తారు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement