house
-
సెలబ్రిటీలు కూడా కొనలేకపోతున్న ఇల్లు ఇది!
సాధారణంగా వ్యాపార ప్రముఖులు, బాలీవుడ్ సెలబ్రిటీలు ఖరీదైన ఇళ్లు కొంటూ వార్తల్లో నిలుస్తుంటారు. కానీ ముంబైలోని ఒక పెంట్‌హౌస్ వార్తల్లో నిలిచింది. రూ.120 కోట్లకు అమ్మకానికి పెట్టిన ఈ ఇంటికి ‘అర్హులైన’ కొనుగోలుదారు దొరకడం లేదు. చాలా మంది సెలబ్రిటీలు రూ.కోట్లు పెట్టి కొనడానికి ముందుకు వచ్చినా ఓనర్ వారికి అమ్మడం లేదు.వన్ అవిఘ్నా పార్క్ 60వ అంతస్తులో ఉన్న విశాలమైన 16,000 చదరపు అడుగుల ఈ పెంట్ హౌస్ గ్లాస్-వాల్డ్ ఎలివేటర్, రూఫ్‌టాప్ పూల్, జిమ్, ఆరు బెడ్రూమ్లు, ఎనిమిది వాహనాల వరకు పార్కింగ్ వంటి అనేక విలాసవంతమైన ఫీచర్లను అందిస్తుంది. అద్భుతమైన ఆఫర్లు ఉన్నప్పటికీ, యజమాని కఠినమైన ఎంపిక ప్రమాణాల కారణంగా కొనుగోలుదారు దొరకడం లేదు.డబ్బుకు మించి..బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఈ ఇంటి అమ్మకం లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే కాదని పెంట్ హౌస్ యజమాని, భవనాన్ని అభివృద్ధి చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీకి అధిపతి కూడా అయిన నిశాంత్ అగర్వాల్ చెబుతున్నారు. “ఈ ఇంటిని కేవలం డబ్బుతో కొనలేరు. కొనుగోలుదారు సరైన వ్యక్తి అని మేము నిర్ధారించుకోవాలి" అని అగర్వాల్ వివరించారు.సేల్‌ను పర్యవేక్షించేందుకు, ప్రముఖ రియల్ ఎస్టేట్ బ్రోకర్ రవి కేవల్రమణితో సహా ఉన్నత స్థాయి బృందం ఏర్పాటు చేశారు. కొనుగోలుదారుల ఆర్థిక స్థితి, సమాజంలో ప్రతిష్టతోపాటు వారి నేపథ్యాన్ని సమగ్రంగా తనిఖీ చేస్తారు. ఇందు కోసం కొనుగోలుదారుల ఆఫీస్‌లను సైతం సందర్శించాలని ఏజెంట్లకు సూచనలు ఉండటం గమనార్హం.స్క్రీనింగ్‌లో ఫెయిల్బాలీవుడ్ సెలబ్రిటీలు సహా డజన్ల కొద్దీ ప్రముఖులు పెంట్ హౌస్ కొనుగోలుపై ఆసక్తి చూపినప్పటికీ, యజమాని నిర్ణయించిన కఠినమైన అర్హతలను ఎవరూ అందుకోలేకపోతున్నారు. పరిశ్రమలోని కొన్ని పెద్ద స్టార్స్ కూడా స్క్రీనింగ్ ప్రక్రియలో అర్హత సాధించలేదని కేవల్రమణి తెలిపారు. "మేము పొరుగువారితో బాగా కలిసిపోయే కుటుంబాన్ని కోరుకుంటున్నాము. వినయంతోపాటు తమ సంపదను చాటుకోని గుణం ఉన్నవారు కావాలి" అని ఆయన చెప్పారు.ఒకవేళ తాము కోరుకుంటున్న సరైన కొనుగోలుదారు రాకపోతే నెలకు రూ.40 లక్షలకు ఈ పెంట్‌హౌస్‌ను అద్దెకు ఇవ్వాలని యాజమాన్యం యోచిస్తోంది. అయితే అద్దెకు వచ్చేవారికి కూడా అదే కఠినమైన పరిశీలన ప్రక్రియ వర్తిస్తుంది. View this post on Instagram A post shared by Ravi Kewalramani (@rk.ravikewalramani) -
సకల సౌకర్యాలున్న గుండ్రని ఇల్లు (ఫొటోలు)
-
ఇళ్ల కూల్చివేతలపై.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
-
సోనమ్ కపూర్ డ్రీమ్ హౌస్, అది మరో ప్రపంచం
బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇల్లుభారతీయ హస్తకళ, రాచరికపు వారసత్వ కళతో ఆకట్టుకుంటుంది. ముంబైలో ఉన్న ఆమె ఇల్లు తంజోర్ పెయింటింగ్స్, నాగా ప్యానెల్స్, రాజస్థానీ జాలీస్, జర్దోజీ ఎంబ్రాయిడరీలతో.. రాజ సౌధాలకు మించిన అద్భుతంతో అలరారుతుంటుంది. సోనమ్ ఆంటీ ఎడి 100 ఇంటీరియర్ డిజైనర్ కవితా సింగ్ సోనమ్ ఇంటి డిజైనింగ్‌లో పాలుపంచుకుంది.మనం అత్యంత ఇష్టపడే తారల్లో సోనమ్ కపూర్ ఒకరు. ఆమెకు ఇష్టమైనది మాత్రం భారతీయ వారసత్వ కళ అని ఆమె ఇంటిని చూసిన వారికి ఇట్టే అర్ధం అవుతుంది. ఇంటీరియర్ డిజైనర్ కవితా సింగ్ ఈ హంగులను ప్రస్తావిస్తూ –‘‘సోనమ్ ఆసక్తిని లోతుగా పరిశోధించడానికి ఆమెతో కలిసి కొంత కాలం ప్రయాణించాను. సెప్టెంబర్ 2021లో ఆమె నాటింగ్ హిల్ పైడ్ – ఎ – టెర్రే, కెన్సింగ్టన్ స్టూడియోలు రెండింటినీ చూశాను. వాటి పునరుద్ధరణలో ఆమె ప్రతిభ, కళల పట్ల ఉన్న అవగాహనను చూసి ఆశ్చర్యపోయాను. ఆమె నాతో మాట్లాడుతూ ‘నేను నా భర్త ఆనంద్, కొడుకు వాయుతో పంచుకునే ఈ ఇంటిని ఒక మహిళగా, నిర్వాహకురాలిగా, తల్లిగా నాకు ఓ కొత్త అనుభూతిని అందించాలి‘ అని తెలిపింది. ఈ సందర్భంగా సోనమ్ చెప్పిన విషయాలు కూడా ప్రస్తావించాలి. ప్రాచీన వస్తువుల సేకరణ‘సినిమా చిత్రీకరణలో భాగంగా చాలా చోట్లకు వెళుతుంటాం. ఆ విధంగా సంవత్సరాలుగా నేను సేకరించిన అన్ని వస్తువులను అలంకరించడానికి ఒక స్థావరం కోసం ఎంతో కాలంగా ఎదురుచూశాను. భారతదేశం అంతటా మురికి హవేలీలు, పురాతన వస్తువుల దుకాణాలు గుండా తిరిగాను. నేను దేనినైనా ప్రేమిస్తే, అది నా ఇంటికి చేరకుండా ఉండదు. లక్ష్మీ నివాస్ ప్యాలెస్‌లో చిత్రీకరణ సమయంలో దొరికిన విశాలమైన బికనీర్ డ్యూరీని మోసుకొచ్చేశాను’ అని ఆనందంతో వివరిస్తుంది. ఓ వైపు ప్రాచీన చైనీస్ గ్లాస్ పెయింటింగ్‌లు, మరో ప్రపంచంలా అనిపించే పియరీ ప్యారీ వాల్‌పేపర్‌తో రూపొందించిన గదులు, పాదాల క్రింద హృదయాన్ని మెత్తగా హత్తుకుపోయే ఎరుపు, నారింజల రంగుల తివాచీలు మనల్ని అబ్బురపరుస్తాయి.అమ్మమ్మ ప్రభావంకపూర్ సౌందర్య అభిరుచులను ్ర΄ోత్సహించింది ఆమె అమ్మమ్మ. ‘మా ఆమ్మమ్మ ఒక సామాన్యమైన మహిళ, కానీ చాలా చురుకుదనంతో ఉంటుంది’ అని గుర్తు చేస్తుకుంటుంది కపూర్. ‘అమ్మమ్మ తన మారుతి సుజుకీలో దాదర్ పూల మార్కెట్‌కు ఉదయం 5 గంటలకు తన ఇంటిని సువాసనలతో నింపడానికి స్పీడ్‌గా వెళ్లేది. శాస్త్రీయ సంగీతం, కళలు, తివాచీలను ఆరాధించేది. కరాచీలో విభజనకు ముందు సింధీ కుటుంబం నుండి వచ్చినందున, మా అమ్మమ్మకి తన అభిరుచులపై మంచి ఆసక్తి ఉంది. నాపై ఆమె ప్రభావాన్ని తగ్గించడం కష్టం’ అంటుంది. ఇలా సోనమ్ ఇష్టాయిష్టాలను కనుక్కుంటూ ఒక్కో వస్తువును అలంకరణలో భాగం చేసుకుంటూ ఆమె ఇంటిని సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాం. -
దొరా.. ఇళ్లు రెడీ!
కొయ్యూరు: విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుతో కలసి తెల్లదొరలపై సాయుధ పోరాటం చేసిన గంటందొర, మల్లుదొర వారసుల సొంతింటి కల అతి త్వరలోనే సాకారం కానుంది. సామాజిక బాధ్యతగా నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ(ఎన్సీసీ) రూ.2 కోట్లతో మల్లుదొర సొంత ఊరు అయిన కొయ్యూరు మండలం నడింపాలెం పంచాయతీలోని లంకవీధిలో నిర్మిస్తున్న ఇళ్లు దాదాపు పూర్తయ్యాయి. నెల రోజుల్లో గంటందొర, మల్లుదొర వారసులు 11 మందికి వాటిని అందజేస్తారు. స్వాతంత్య్ర సమరయోధులు గాం గంటందొర, మల్లుదొర వారసుల కుటుంబాలకు సొంతిళ్లు లేక, గుడిసెల్లో నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ద్వారా క్షత్రియ సేవా సమితి నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ దృష్టికి తీసుకెళ్లింది.సామాజిక బాధ్యతగా సమరయోధుల వారసులకు ఇళ్లు నిర్మించానలి కోరారు. ఈ మేరకు 11 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ఎన్సీసీ ముందుకొచ్చింది. గత ఏడాది అక్టోబర్‌లో అప్పటి అరకు ఎంపీ జి.మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మమ్మ, ఐటీడీఏ పీవో అభిషేక్ గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేస్తామని ఇచ్చిన హామీని సంస్థ నిలబెట్టుకుంది. రూ.2 కోట్లు వెచ్చింది రెండు భవనాలను నిర్మించింది. ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లు... ఒక్కో భవనంలో ఆరు ఫ్లాట్లను ఎన్సీసీ నిర్మించింది. ఒక్కో ఫ్లాట్‌లో రెండు బెడ్ రూమ్‌లు, అటాచ్డ్ బాత్రూమ్లు, హాలు, వంటగదితో సహా అన్ని వసతులు కల్పించింది.మల్లుదొర , గంటందొర వారసులు 11 మందికి 11 ఫా్లట్లు కేటాయించి, ఒక ఫ్లాట్‌ను ఎన్సీసీ తమ కార్యకలాపాల కోసం వినియోగించుకోనుంది. ఈ నిర్మాణ పనులను క్షత్రియ సేవా సమితి పర్యవేక్షిస్తోంది. ఆనందంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి సరైన గూడు లేక అవస్థలు పడుతున్నాం. ఇప్పటికి మా నిరీక్షణ ఫలించింది. చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచి గృహాలు నిర్మించి ఇస్తున్న సంస్థకు కృతజ్ఞతలు. – గాం గంగరాజు, లంకవీధిసొంతిల్లు అదృష్టం ఎట్టకేలకు సొంత గూటికి చేరుతున్నామన్న ఆనందంలో ఉన్నాం. ఇంత అద్భుతంగా ఇళ్లు నిర్మించి ఇస్తారని అనుకోలేదు. రెండు బెడ్ రూమ్‌లతోపాటు హాలు, కిచెన్, అటాచ్డ్ బాత్రూమ్లు నిర్మించడం ఆనందంగా ఉంది. – గాం సన్యాసమ్మ, లంకవీధిసమస్యను పరిష్కరించాం ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని స్వాతంత్య్ర సమరయోధుల పక్కా ఇళ్ల నిర్మాణం మా హయాంలో చేపట్టినందుకు ఆనందంగా ఉంది. నాగార్జున కన్స్ట్రక్షన్స్ సంస్థ బాధ్యత తీసుకుని ఇంత అద్భుతంగా గృహాలను నిర్మించడం మరిచిపోలేని విషయం. లబ్ధిదారులు జీవితకాలం ఆ కంపెనీకి రుణపడి ఉంటారు. – జి.మాధవి, మాజీ ఎంపీ, అరకు -
లోకేష్ ఇంటికి ఒకేసారి టీడీపీ మంత్రుల క్యూ.. ‘కూటమి’లో ఏం జరుగుతోంది?
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వంలో వింత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి నారా లోకేష్ ఇంటికి ఒకేసారి 18 మంది టీడీపీ మంత్రులు క్యూ కట్టడం రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది. ఈ రోజు ఉదయం మంత్రులందరినీ లోకేష్ తన ఇంటికి పిలిపించుకోగా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చినందుకు అభినందనలు తెలిపినట్లు లోకేష్ టీం ప్రకటించింది.లోకేష్ పిలవగానే 18 మంది టీడీపీ సీనియర్, జూనియర్ మంత్రులు హాజరయ్యారు. ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చిన నారా లోకేష్ తనకు విషెస్ చెప్పించుకోవడానికి మంత్రులందరిని ఇంటికి రప్పించుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, బీజేపీ మంత్రి సత్యకుమార్ మాత్రం లోకేష్‌ను అభినందించలేకపోవడం కూడా కూటమి వర్గాల్లో చర్చ నడుస్తోంది.కాగా, ఒక మంత్రి ఇంటికి ఒకేసారి మంత్రులు వెళ్లడం ఏపీలో ఎప్పుడు ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. రాష్ట్రంలో ఇప్పటికే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తోన్న నేపథ్యంలో లోకేష్ ఎందుకు 18 మంది టీడీపీ మంత్రులను ప్రత్యేకంగా పిలిపించుకున్నారనే సందేహాలు కలుగుతున్నాయి.ఇదీ చదవండి: అధికారంలోకి వచ్చినా అవే డ్రామాలు! -
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ.. విలువైన పత్రాలు మాయం!
సాక్షి, కొమురంభీం జిల్లా: కాగజ్ నగర్ మండలం కోసిని గ్రామంలోని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. బీరువా తాళాలు పగులగొట్టి విలువైన పత్రాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.తన ఇంట్లో జరిగిన చోరీ ఘటనపై ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. తెలంగాణలో దోపిడీ దొంగల పాలన నడుస్తుందని మండిపడ్డారు. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని తన ఇంట్లో దొంగలు పడ్డారని.. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారని తెలిపారు. దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా డీజీపీని ఆయన కోరారు.తెలంగాణ లో దోపిడి దొంగల పాలన నడుస్తున్నది. ఇది ముమ్మాటికీ నిజం. నిన్న సిర్పూర్-కాగజ్ నగర్ కోసిని గ్రామంలోని మా స్వగృహం లో దొంగలు పడ్డారు. కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొచుకోని పోయారు.దీని వెనక ఉన్న కుట్ర కోణాన్ని కూడా శోధించాల్సిందిగా @TelanganaDGP గారిని కోరుతున్న.My home in… pic.twitter.com/A5ewLPMzCa— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) October 31, 2024 -
మోస్ట్ పాపులర్ హౌస్ కొన్న సోనమ్ కపూర్ జంట
ప్రముఖ నటి సోనమ్ కపూర్, ఆమె భర్త ఆనంద్ అహూజా ఇటీవల ముంబైలోని నీరవ్ మోదీకి చెందిన ఐకానిక్ మ్యూజిక్ స్టోర్ 'రిథమ్ హౌస్'ను కొనుగోలు చేశారు. నీరవ్ మోదీ బ్యాంక్ రుణాలను సకాలంలో చెల్లిచకపోవడంతో దీనిని 2018లో మూసివేశారు. కాగా ఇప్పుడు 478.4 మిలియన్లకు (రూ.47.84 కోట్లు) సోనమ్ కపూర్ దంపతులు సొంతం చేసుకున్నారు.సుమారు 3,600 చదరపు అడుగుల రిథమ్ హౌస్ ఒకప్పుడు ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని నీరవ్ మోదీ నిర్వహణలో ఉండేది. దీనిని కొనుగోలు చేసినట్లు భానే ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే ఆ వ్యక్తి డీల్ విలువను వెల్లడించలేదు.భానే అనేది షాహీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్‌కు చెందిన ఒక విభాగం. ఇది ఆనంద్ అహూజా తండ్రి హరీష్ అహుజాకు చెందినది. అంతే కాకుండా ఇది భారతదేశంలోని అతిపెద్ద దుస్తులు తయారీదారులలో ఒకటి. ఈ కంపెనీ అనేక అంతర్జాతీయ బ్రాండ్స్ విక్రయిస్తోంది.1940లో ప్రారంభమైన రిథమ్ హౌస్.. ఒకప్పుడు పండిట్ రవిశంకర్, ఇయాన్ ఆండర్సన్ వంటి సంగీత విద్వాంసులకు మాత్రమే కాకుండా ఎంతోమంది బాలీవుడ్ తారల బృందాలకు ఆతిథ్యం ఇచ్చింది.ఇదీ చదవండి: గూగుల్‌లో ఉచిత భోజనం ఎందుకంటే?: సుందర్ పిచాయ్కొన్ని వారాల క్రితం సోనమ్ కపూర్, హరీష్ అహూజా లండన్‌లోని నాటింగ్ హిల్ జిల్లాలో 231.47 కోట్ల రూపాయలకు ఆస్తిని కొనుగోలు చేశారు. ఈ జంటకు ఢిల్లీలో రూ.173 కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లా కూడా ఉంది. అంతే కాకుండా వీరి వద్ద ల్యాండ్ రోవర్ డిఫెండర్, పోర్స్చే టైకాన్, మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్580 వంటి విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. -
మనసు మార్చుకున్న నిఖిల్ కామత్!.. అప్పుడు అద్దె ఇల్లే బెస్ట్ అని..
సొంతిల్లు కొనడం మంచిదా? అద్దె ఇంట్లోనే ఉండటం మంచిదా? అంటే.. ఇప్పటి వరకు అద్దె ఇల్లే బెస్ట్ అని బిలియనీర్ & జెరోధా సహ వ్యవస్థాపకుడు 'నిఖిల్ కామత్' చెప్పుకుంటూ వచ్చారు. అయితే నేను సొంత ఇల్లు కొనుగోలు చేశాను అంటూ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కామత్ వెల్లడించారు.డబ్ల్యుటీఎఫ్ ఈజ్ విత్ నిఖిల్ కామత్.. లేటెస్ట్ ఎపిసోడ్లో కామత్, ప్రెస్టీజ్ గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ ఇర్ఫాన్ రజాక్, బ్రిగేడ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిరూపా శంకర్, వీవర్క్ ఇండియా సీఈఓ కరణ్ విర్వానీ అద్దె ఇల్లు vs కొనుగోలు చేసిన ఇల్లు అంశం మీద చర్చ మొదలు పెట్టారు.అద్దె ఇల్లు అన్ని విధాలుగా బాగానే ఉన్నపటికీ.. ఒక సమస్య ఉంది. అద్దె ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోతామనేది ఖచ్చితంగా తెలియదు. ఎక్కువకాలం అద్దె ఇంట్లోనే ఉండాలనుకుంటే కుదరదు. నేను అద్దె ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఈ కారణంగానే ఇల్లు కొనుగోలు చేశానని నిఖిల్ కామత్ వెల్లడించారు.ఇదీ చదవండి: ఇలా అయితే కొత్త ఉద్యోగాలు లభిస్తాయి: నితిన్ గడ్కరీనేను ఒకే ఇంట్లో చాలా కాలం ఉండటానికి ఇష్టపడతాను. అయితే రియల్ ఎస్టేట్ అనేది ఇల్లిక్విడ్ అని, అది తనకు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. బంగారం మీద నాకు ఆసక్తి ఉంది. కానీ రియల్ ఎస్టేట్ విషయంలో అమ్మకాలు, కొనుగోలు కొంత కష్టమని అన్నారు. అంతే కాకుండా స్టాంప్ డ్యూటీ చెల్లించడం మీద కూడా నిఖిల్ కామత్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాలను కొనుగోలు చేయడం, అద్దెకు ఇవ్వడంలో ఎవరూ ఎక్కువ డబ్బు సంపాదించలేరని ఆయన అన్నారు. దీనికంటే స్టాక్ మార్కెట్ చాలా ఉత్తమమని పేర్కొన్నారు. -
‘నీల్’ కాన్సెప్ట్' ఒకే ఒక రంగుతో అద్భుతం ..!
అందమైన రంగులు ఇంటికి అందాన్నిస్తాయనుకుంటాం. కానీ ఒకే ఒక రంగుతో ఇంటిని అద్భుతంగా అలంకరించవచ్చని ‘నీల్’ కాన్సెప్ట్ రుజువు చేస్తోంది. స్వచ్ఛమైన తెలుపుకి లేత నీలంరంగు థీమ్‌తో డిజైన్ని చూస్తుంటే నీలి మేఘం నట్టింట్లోకి వచ్చినట్లుంది. ఆకాశంలో మబ్బుల్లో రూపాలను వెతుక్కుంటాం. ఇది నట్టింట్లో ఆవిష్కరించిన కళారూపం. ఇందులో ప్రతి ఒక్కటీ చేత్తో చేసినవే. అచ్చమైన హ్యాండ్ క్రాఫ్టెడ్ హోమ్ డెకరేషన్ అన్నమాట. బెడ్ స్ప్రెడ్, పిల్లో కవర్, రన్నర్, కార్పెట్, డోర్ మ్యాట్, ల్యాంప్ షేడ్, సోఫా కుషన్లు, కవర్లతోపాటు డిన్నర్ సెట్ కూడా గౌరంగ్ షా డిజైన్ చేసిన నీల్ థీమ్‌లో ఒదిగి పోయింది. ఇండియన్ టెక్స్టైల్స్ అండ్ ఫ్యాషన్ డిజైనర్‌గా జాతీయ అవార్డు గ్రహీత గౌరంగ్ షా ఇంటీరియర్ డెకరేషన్లో చేసిన ప్రయోగం ఇది. తన ప్రయోగాన్ని ఇటీవల హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఇది ‘గౌరంగ్ హోమ్’ అంటూ సగర్వంగా ప్రదర్శించాడు షా. ఇంటి నుంచి మనం ఏం కోరుకుంటున్నామో అది మన ఇంటి డెకరేషన్లో ప్రతిబింబిస్తుంది. వారసత్వ కళల సమ్మేళనం! లేత నీలం రంగులో అలరిస్తున్న పూలు, ఆకుల్లో కొన్ని జామ్దానీ నేతకు ప్రతిరూపాలు. కొన్ని కసౌటీ, చికన్కారీలతో సూదిమొన చెక్కిన రూ΄ాలు. మరికొన్ని అచ్చు అద్దిన పూలు. తెల్లటి పింగాణీ మీద విరిసిన నీలాలు ఫ్యాషన్‌తో ΄ోటీ పడుతున్నట్లున్నాయి. జామ్దానీ, అజ్రక్, కలంకారీ, చికన్‌కారీ, హ్యాండ్ ప్రింట్లతో ఇంటిని అలంకరిస్తే భారతీయ వారసత్వ హస్తకళకు ఇంతకంటే గొప్ప గౌరవం ఇంకేముంటుంది? కళాకారులకు ఇవ్వగలిగిన ప్రోత్సాహం మరేముంటుంది? ఎకో ఫ్రెండ్లీ మెటీరియల్, నాచురల్ రంగులతో పర్యావరణ హితమైన జీవనశైలికి మరో నిర్వచనం ఇంకెక్కడ దొరుకుతుంది. -
సోఫా, ఏసీ, ట్యాప్‌లు ఎత్తుకెళ్లారు: తేజస్వి యాదవ్‌పై బీజేపీ ఆరోపణలు
రాష్ట్రీయ జనతాదళ్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌పై బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. పాట్నాలోని ఉప ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఖాళీ చేేసే సమయంలో అందులోని సామాన్లను దొంగిలించారని ఆరోపించింది. అధికారిక బంగ్లాలోని ఏసీ, సోఫాలు, బెడ్, వాషూరూమ్‌లో ట్యాప్స్ వంటి అనేక వస్తువులు మాయమయ్యాయని తెలిపింది. బిహార్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి వ్యక్తిగత కార్యదర్శి శత్రుధన్ కుమార్ ఈ ఆరోపణలు చేశారు. తాము ఆరోపణలు మాత్రమే చేయడం లేదపి, ఆధారాలు కూడా చూపిస్తున్నామని తెలిపారు. దీనిపై తేజస్వి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీలో అఖిలేష్ యాదవ్ కుళాయిలు కనుమరుగయ్యేలా చేశారని, ఇక్కడ కూడా అదే జరిగిందని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై ఆర్జేడీ నేత ఇంకా స్పందించలేదు.కాగా ఆర్జేడీ-జేడీయూ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం హయాంలో తేజస్వీ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోవడంతో డిప్యూటీ సీఎం పదవిని కోల్పోయారు.బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా పాట్నా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గతంలో తోసిపుచ్చింది. ఆయనను ప్రతిపక్ష నేత నివాసానికి మార్చాలని కోర్టు ఆదేశించింది.ఈ క్రమంలోనే పట్నాలోని ఆయన అధికారిక నివాసాన్ని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీకి కేటాయిస్తూ ఇటీవల నీతీశ్ కుమార్ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆదివారం తేజస్వీ ఈ నివాసాన్ని ఖాళీ చేశారు. -
‘అయ్యో.. దేవుడా!’.. హైడ్రా పంజా-బోరుమంటున్న జనం (చిత్రాలు)
-
బంగారు ఇల్లు!.. ధర తెలిస్తే గుండె జల్లు (ఫోటోలు)
-
సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో ఓ బ్యాగ్ కలకలం రేపింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి సమీపంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగ్ కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం స్వాధీనం చేసుకుంది. బ్యాగ్‌ను అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించి తనిఖీ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ట్యాంక్‌బండ్ వద్ద ఉద్రిక్తత.. గణేశ్ ఉత్సవ సమితి Vs పోలీసులు -
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసుల మోహరింపు
-
మూడంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి
మీరట్: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా హెడ్ క్వార్టర్స్‌లోని జనసాంద్రత అధికంగా ఉండే జాకీర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.అకస్మాత్తుగా ఇల్లు కూలిపోవడంతో 12 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు, శిథిలాల నుండి మొత్తం ఆరుగురిని వెలికితీశారు. వారిలో ముగ్గురు మృతిచెందారు. గాయపడిన ముగ్గురిని లాలా లజపతి రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీకి తరలించారు.మీరట్ డిఎం దీపక్ మీనా మీడియాతో మాట్లాడుతూ సంఘటనా స్థలంలో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు. వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మీరట్ జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా జాకీర్ కాలనీలోని మూడంతస్తుల ఇల్లు కూలిన విషయాన్ని ధృవీకరిస్తూ, శిథిలాల కింద ఆరుగురు సమాధి అయ్యారని తెలుస్తోందని సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు.ఇది కూడా చదవండి: చమురు ట్యాంకర్‌కు మంటలు -
అక్కడ భారీగా పెరిగిన ఇళ్ల ధరలు: ఇదిగో ప్రూఫ్..
భారతదేశంలో రియల్ ఎస్టేట్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయాలంటే లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చించాల్సిందే. అయితే కేరళలో కూడా ఇళ్ల ధరలు ఏ మాత్రం తక్కువ కాదని ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక పోస్ట్ వెల్లడిస్తోంది.ఇటీవల సోషల్ మీడియాలో వెల్లడైన ఒక సోషల్ మీడియా పోస్టులో 4 బీహెచ్‌కే (3500 చదరపు అడుగులు) ఇల్లు ధర రూ. 3 కోట్లు అని వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి చూస్తే కేరళలో రియల్ ఎస్టేట్ ఎంతగా ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది నగరానికి దగ్గర ఉందా? దూరంగా ఉందా? అనే వివరాలు వెల్లడించలేదు.ఇదీ చదవండి: పేమెంట్ ఆలస్యమైతే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారా? కరోనా తరువాత స్థిర ఆస్తిని కలిగి ఉండాలని.. భూములు, భవనాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ప్రాపర్టీ ధరలు పెరిగాయి. ఢిల్లీ, నోయిడా, బెంగళూరు వంటి నగరాల్లో 3 బీహెచ్‌కే అపార్ట్మెంట్ ధర సగటున రూ. 2 కోట్లు. 4 బీహెచ్‌కే ధర రూ. 2.5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకు ఉన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టుకు పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు ఇల్లు బాగుందని చెబుతుంటే.. మరికొందరు ధర చాలా ఎక్కువని అని పేర్కొంటున్నారు.4 BHK, 3500 sq ft is what 3Cr gets you in Kerala. pic.twitter.com/oRqSzmWqZg— Sidharth II सिद्धार्थ (@sidharthgehlot) September 9, 2024 -
ప్రధాని మోదీ ఇంటికి ప్రత్యేక అతిథి.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తాను ప్రత్యేకంగా ఏమి చేసినా దానిని ఆయన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇవి త్వరగా వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ప్రధాని మోదీ ఇంటికి ఒక చిన్న ప్రత్యేక అతిథి వచ్చింది. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా తెలియజేశారు. ఈ అతిథికి పేరు కూడా పెట్టినట్లు మోదీ పేర్కొన్నారు. हमारे शास्त्रों में कहा गया है - गाव: सर्वसुख प्रदा:'। लोक कल्याण मार्ग पर प्रधानमंत्री आवास परिवार में एक नए सदस्य का शुभ आगमन हुआ है। प्रधानमंत्री आवास में प्रिय गौ माता ने एक नव वत्सा को जन्म दिया है, जिसके मस्तक पर ज्योति का चिह्न है। इसलिए, मैंने इसका नाम 'दीपज्योति'… pic.twitter.com/NhAJ4DDq8K— Narendra Modi (@narendramodi) September 14, 2024ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ హ్యాండిల్లో ‘మన శాస్త్రాల్లో చెప్పినదాని ప్రకారం గోమాత మనకు సర్వసుఖాలను అందిస్తుంది. ప్రధానమంత్రి కుటుంబంలోకి కొత్త సభ్యురాలు అడుగుపెట్టింది. ప్రధానమంత్రి నివాసంలో గోమాత కొత్త దూడకు జన్మనిచ్చింది. దాని నుదుటిపై జ్యోతి గుర్తు ఉంది. అందుకే దానికి 'దీప్జ్యోతి' అని పేరు పెట్టాను’ అని పేర్కొన్నారు. ఆ దూడకు సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ షేర్ చేశారు. అందులో ప్రధాని మోదీ దీప్జ్యోతిని ప్రేమగా నిమురుతూ కనిపిస్తున్నారు. మోదీ తన ఇంటిలోని పూజాగదిలో దీప్జ్యోతికి పూలమాల వేసి, తన ఒడిలో కూర్చోబెట్టుకుని లాలించడం కనిపిస్తుంది. దీప్జ్యోతి కూడా ప్రధానమంత్రికి చాలా సన్నిహితంగా మెలుగుతుండటాన్ని వీడియోలో చూడవచ్చు. A new member at 7, Lok Kalyan Marg! Deepjyoti is truly adorable. pic.twitter.com/vBqPYCbbw4— Narendra Modi (@narendramodi) September 14, 2024ఇది కూడా చదవండి: ఆకాశవీధిలో రోజూ 4.3 లక్షల మంది -
పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి..
ఖమ్మం మయూరిసెంటర్: ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం రూరల్ మండలంలో మున్నేరు వరద ముంపు బాధితులకోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు ఖాళీ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో వరద నీరు తగ్గడంతో ముంపు బాధితులంతా పునరావాస కేంద్రాలను వీడి ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 1న మున్నేరుకు వచి్చన భారీ వరదలతో ఖమ్మం నగరంలోని 13 డివిజన్లతో పాటు ఖమ్మం రూరల్ మండలంలోని 20 కాలనీలు నీట మునిగాయి. వందలాది ఇళ్లను వరద ముంచెత్తగా.. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో ప్రభావిత ప్రాంతాల ప్రజలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలోని రామన్నపేట ప్రభుత్వ పాఠశాల, జూబ్లీ క్లబ్, స్వర్ణభారతి కల్యాణ మండపం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ధంసలాపురం పాఠశాలల్లో 8,200 మందికి, ఖమ్మం రూరల్ మండలంలో టీసీవీ రెడ్డి ఫంక్షన్‌హాల్, రామ్‌లీలా ఫంక్షన్‌హాల్, పోలేపల్లి స్ఫ్రింగ్ లీఫ్ పాఠశాల, సాయిబాబా ఆశ్రమంలో 2,300 మందికి ఆశ్రయం కలి్పంచి ఇన్నాళ్లూ భోజనం సమకూర్చారు. బాధితులు వెళ్లిపోవడంతో కేంద్రాల మూసివేత వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పారిశుధ్య పనులు పూర్తికావడం, ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసుకోవడంతో పునరావాస కేంద్రాలను వీడి ఇళ్లకు చేరుకున్నారు. ఈనెల 10 వరకు ప్రభుత్వ యంత్రాంగం పునరావాస కేంద్రాలను నిర్వహించగా.. బాధితులు ఇళ్లకు వెళ్లిపోతుండడంతో శుక్రవారం పూర్తిగా మూసివేసింది. అయితే, ఇళ్లు పూర్తిగా నేలమట్టమైన వారు మాత్రం ఎక్కడకు వెళ్లాలో దిక్కుతోచక.. మిగిలిన ఒకటి, అరా సామగ్రితో చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇళ్లు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. కొనసాగుతున్న దాతల చేయూతవరద బాధితులకు పలువురు నిత్యావసరాలతో పాటు భోజనం అందిస్తున్నారు. అనేక మంది ఇళ్లను కోల్పోయి వండుకునేందుకు సామగ్రి లేక భోజనం కోసం ఇబ్బంది పడుతుండగా.. వారికి స్వచ్ఛంద సేవా సంస్థలు భోజనం సమకూరుస్తున్నాయి. శుక్రవారం కూడా ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్ప, ఖమ్మంలోని వెంకటేశ్వరనగర్‌లో బాధితులకు పలు సంస్థల ద్వారా భోజనం సమకూర్చారు. -
శంభీపూర్ రాజు నివాసం వద్ద భారీ పోలీస్ బందోబస్తు
-
కౌశిక్ రెడ్డిపై రాళ్లు, కర్రలతో దాడి
-
కరకట్ట కొంపలో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు.. విజయవాడకు పారిపోయిన చంద్రబాబు
-
కష్టమంతా వరదపాలు
ఈ చిత్రంలోని సంతోష్, దుర్గ దంపతులు విజయవాడ వన్‌టౌన్ సాయిరాం థియేటర్ వెనుక రాజీవ్‌శర్మ వీధిలో నివసిస్తున్నారు. మూడు రోజుల క్రితం వరద నీరు ఇంట్లోకి చేరడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎక్కడి సామాన్లు అక్కడే వదిలేసి డాబాపైకి వెళ్లిపోయారు. రూ.20 వేల విలువైన వాషింగ్ మెషిన్, రూ.22 వేల ఫ్రిడ్జ్, రూ.50 వేల విలువైన డబుల్ కాట్, రూ.15 వేల దివాన్, రూ.10 వేల మిక్సీ గ్రైండర్ నీటిలో పూర్తిగా మునిగిపోయాయి.వీటి విలువే రూ.1.17 లక్షలు. ఇవి పనిచేసే పరిస్థితి లేదు. నాలుగు బియ్యం బస్తాలు, వంట సామగ్రి, సరుకులు ఏవీ మిగల్లేదు. భవన నిర్మాణంలో టైల్స్ అమర్చే పని చేసే సంతోష్ వాయిదా పద్ధతిలో 2016 నుంచి ఒక్కొక్కటిగా కొనుక్కొంటున్నారు. ఎనిమిదేళ్ల కష్టం ఒక్క రోజులో నీటిపాలైంది. మళ్లీ ఇన్ని వస్తువులు సమకూర్చుకోవడం ఇప్పట్లో తమ వల్ల అయ్యే పని కాదని సంతోష్, దుర్గ బోరున విలపిస్తున్నారు.(ముంపు ప్రభావిత ప్రాంతాల నుంచి సాక్షి ప్రతినిధి): వరదల కారణంగా బెజవాడ, పరిసర ప్రాంతాల్లో కొన్ని వేల కుటుంబాలు ఇలా వేలు, లక్షల్లో నష్టపోయాయి. జీవిత కాలం కష్టమంతా వరద నీటి పాలైపోయింది. గృహావసరాలకు ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, మంచం, ఫ్యాను, గ్రైండర్ వంటికి కొనుక్కోవడానికి కూడా పేద, మధ్య తరగతి ప్రజలు పడే తిప్పలు అన్నీ ఇన్నీ కావు. రూపాయి రూపాయి పోగేసి, చిట్టీలు కట్టి, ఈఎంఐలతో కొంటుంటారు. ఇప్పుడు వరదలో అన్నీ పాడైపోయాయి. ఇవే కాదు.. పిల్లల విద్యకు సంబంధించిన సర్టిఫికెట్లు, ఆస్తి దస్తావేజులు, పాఠశాలల ఫీజు రసీదులు, కష్టపడి సంపాదించుకున్న నగదు, శుభకార్యాల కోసం, రోజువారీ అవసరాల కోసం అప్పు చేసి తెచ్చిన డబ్బు బీరువాల్లో తడిసిముద్దయ్యాయి. కొన్ని వరదలో కొట్టుకొనిపోయాయి. ప్రతి ఇంటికీ రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకూ నష్టం వాటిల్లింది. ఇప్పుడు మళ్లీ జీరో నుంచి జీవితం మొదలుపెట్టాలని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మాకు మిగిలిందేమీ లేదు..ఇళ్లలోకి నీళ్లు వచ్చేశాయి. సామగ్రి మొత్తం మునిగిపోయింది. పాములు కూడా ఇళ్లలోకి చేరాయి. జీవితాంతం కష్టపడి సమకూర్చుకున్నవన్నీ వరద పాలయ్యాయి. మాకు మిగిలిందేమీ లేదు. – సాయికుమారి, రాజరాజేశ్వరిపేటవిలువైన పత్రాలేవీ మిగల్లేదుపిల్లల సర్టిఫికెట్లు, ఇంటి పట్టాలు, గుర్తింపు కార్డులన్నీ నీటిలో నానిపోయాయి. ఇంట్లో వస్తువులన్నీ పోయి దుర్బర స్థితిలోకి వచ్చేశాం. మా స్కూటీ కూడా కొట్టుకెళ్లిపోయింది. పూలు అమ్ముకునే నాలాంటోళ్లు ఎన్నేళ్లు కష్టపడితే ఇంటి సామగ్రిని సమకూర్చుకోగలం? – గోపమ్మ, రాజరాజేశ్వరి పేటమళ్లీ వస్తువులు కొనుక్కోవడం మా వల్ల కాదుఇంట్లో ప్రతి వస్తువూ వాయిదాల్లో కొన్నవే. రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కొన్నాం. వాటి కోసం ఇతర ఖర్చులూ తగ్గించేసుకున్నాం. ఒక్కో వస్తువు రూ.20వేలుపైనే ఉంటుంది. అవన్నీ మళ్లీ కొనుక్కోవాలంటే మావల్ల కాదు. – జగన్నాథం దుర్గ, బాధితురాలు, రాజరాజేశ్వరిపేటడ్రోన్లతో ఆహారం ఎవరికిస్తున్నారో..?నేను ప్రైవేటు ఉద్యోగం చేస్తూ సింగ్‌నగర్ పైపులరోడ్డులోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాం. ఆదివారం ఉదయం మా ఇంట్లోకి ఒక్కసారిగా వరద నీరు చేరింది. దీంతో ప్రాణాలు దక్కించుకునేందుకు మొదటి అంతస్తుకు చేరాం. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. వారు ఆకలి అని ఏడుస్తుంటే ఆదివారం సాయంత్రం అటుగా వెళ్తున్న బోటు అడిగితే రూ.4 వేలు ఇవ్వమన్నారు. అంత ఇవ్వలేక అక్కడే ఉండిపోయాం. మమ్మల్ని పట్టించుకున్నవారు లేరు. ఆహారం, నీరు కూడా అందించలేదు. మా బిల్డింగ్‌పై ఉన్న వాటర్ ట్యాంకులో నీళ్లు తాగి బతికాం. ఆ ట్యాంకులో కూడా నీళ్లు ఖాళీ కావడంతో పీకల్లోతు నీటిలో నడుచుకుంటూ ఒడ్డుకు చేరాం. డ్రోన్లు, హెలికాప్టర్లలో ఆహారం ఎవరికి ఇస్తున్నాయో తెలియడం లేదు. – బూర అనీల్, పైపులరోడ్డు, అజిత్సింగ్నగర్మానవ తప్పిదమే..ప్రకృతి ప్రకోపిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఇది ప్రకృతి వైపరీత్యం అని సరిపెట్టుకునేందుకు వీల్లేదు. ఇది కచ్చితంగా మానవ తప్పిదంగానే భావిస్తున్నాను. ప్రాణ భయంతో ఎక్కడి వస్తువులను అక్కడే వదిలేసి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒకటి, రెండు అంతస్తుల్లోకి వెళ్లిపోయాం. ఎవరు ఎక్కడికి వెళ్లిపోతున్నారో తెలియని అయోమయ పరిస్థితి. అప్పటికే గ్రౌండ్ ఫ్లోర్‌లోకి నీళ్లు వచ్చేసి అన్నీ మునిగిపోయాయి. ప్రాణ భయం అంటే ఏమిటో తెలిసింది. – నక్కా ప్రభుదాస్, జక్కంపూడి వైఎస్సార్ కాలనీ -
బాబు ఇల్లు వరదపాలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణా నదీ తీరంలో కరకట్ట వెంబడి సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని కూడా కృష్ణమ్మ వరద ముంచెత్తింది. కనీసం సామాన్లు కూడా బయటకు తెచ్చుకోలేనంతగా రెండో అంతస్తు వరకు వరద వచ్చింది. ఇది అక్రమ కట్టడమే అన్న విషయం అందరికీ తెలుసు. అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రే స్వయంగా అందులో నివాసం ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనిపై ఎన్ని విమర్శలు వచి్చనా కొన్నేళ్లుగా చంద్రబాబు అదే తన నివాసంగా చేసుకొన్నారు. రెండు రోజులుగా కృష్ణా నదికి తీవ్రంగా వరద రావడంతో ఆదివారం ఉదయం 6 గంటలకే ఇంటిని వరద నీరు చుట్టుముట్టింది. ఆ విషయాన్ని బయటకు చెప్పకుండా కప్పిపుచ్చారు. సీఎం చంద్రబాబు ఆదివారం నుంచి విజయవాడలోని ఎనీ్టఆర్ జిల్లా కలెక్టరేట్లోనే ఉంటున్నారు. ఇంటి వద్దకు వరద ఎంత వస్తుందో కూడా ప్రభుత్వం అంచనా వేయలేకపోయింది. దీంతో సోమవారం సీఎం ఇంట్లోని రెండో అంతస్తులోకి వరద నీరు వచి్చంది. ముఖ్యమంత్రి నివాసమే మునిగిపోయింది. కనీసం అందులో ఉన్న సామగ్రిని కూడా బయటకు తీయలేకపోయారు. ప్రకాశం బ్యారేజి పరిసర ప్రాంతాలకు పోటెత్తిన వరద కృష్ణా నది ప్రకాశం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద నీరు రావడంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో నది పరిసర ప్రాంతాలన్నీ వరద పోటెత్తింది. బ్యారేజ్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో సోమవారం 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచి్చంది. దీంతో ప్రకాశం బ్యారేజిపై రాకపోకలు నిలిపి వేశారు. పుష్కర ఘాట్లకు వెళ్లే మార్గంలో రిటైనింగ్ వాల్ కూలి ప్రమాదభరితంగా మారింది. బకింగ్‌హామ్ కాలువ నీరు రెండు బ్రిడ్జిల మధ్య ఓవర్ ఫ్లో అవుతోంది. కొండవీటి వాగు స్లూయిజ్ వద్ద తూటాకు అడ్డుపడడంతో నీటిని బయటకు పంపడం సాధ్యం కావడంలేదు. కెనాల్‌లోని తూటాకును తొలగించేందుకు అధికారులు భారీ క్రేన్లు ఉపయోగించినా ఫలితం లేకుండా పోయింది. కృష్ణా నీరు కొండవీటి వాగులోకి ప్రకాశం బ్యారేజ్ వద్ద కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా నదిలోకి ఎత్తిపోసేందుకు రూ. 200 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని నిరి్మంచారు. అయితే వాగు వద్ద స్లూయిజ్ గేట్లు కొట్టుకుపోవడంతో ఎత్తిపోతల వరకు భారీగా వరద వస్తోంది. కృష్ణానది ఎత్తులో ఉండడంతో ఆ నీరంతా వాగులోకి వచ్చి అక్కడి నుంచి గుంటూరు చానల్‌కు వెళ్లి ఉండవల్లిలోని పలు ప్రాంతాలను జలమయం చేసింది. ఉండవల్లి అమరావతి రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి.సారపాక వాగులోంచి వచి్చన వరద నీరంతా సీడ్ యాక్సెస్ రోడ్ వద్ద నిలిచిపోయింది. అధికారులు ఇక్కడ గండి కొట్టి నీటిని మళ్లించారు. కాగా, వెంకటపాలెం వద్ద మంతెన సత్యనారాయణ రాజు నిరి్మంచిన ప్రకృతి వైద్యం ఆశ్రమానికి సోమవారం ఉదయం వరద నీరు రావడంతో ఆందోళన చెందిన రోగులు పెద్దపెద్దగా కేకలు వేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. అతికష్టం మీద తాడు సహాయంతో పై అంతస్తుల్లో ఉన్న వారిని కిందకు దించి పంపించి వేశారు. కరకట్టకు ముప్పు ప్రకాశం బ్యారేజ్ నుంచి హరిశ్చంద్రపురం వరకు కరకట్ట పలుచోట్ల దెబ్బతిని పంట పొలాల్లోకి, గ్రామాల్లోకి వరద నీరు వస్తోంది. రాయపూడి, వెంకటపాలెం, బోరుపాలెం గ్రామాల్లోకి నీరు చొచ్చుకు వస్తోంది. కొల్లిపర వద్ద కరకట్టకు గండ్లు పడే పరిస్థితి తలెత్తడంతో అధికారులు ఇసుక బస్తాలు వేస్తున్నారు. రేపల్లె పులిగడ్డ వద్ద కరకట్ట తెగే ప్రమాదం ఉన్నట్లు సమాచారం. కరకట్ట ఎక్కడైనా గండిపడితే నష్టం భారీగా ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. గతంలో ఎప్పుడు వరదలు వచి్చనా ముందస్తుగా వివిధ శాఖల అధికారులు పలు ప్రాంతాల్లో ఇసుక బస్తాలను సిద్ధం చేసి ఉంచేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించలేదు. -
నిందితుల ఇళ్లు కూల్చడమేంటి? : సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: బుల్డోజర్ రాజ్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ ట్రెండ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించింది.ఢిల్లీ జహంగీర్‌పురిలో నిందితుడు అద్దెకున్న ఇళ్లు కూల్చివేయడంపై సీనియర్ న్యాయవాదులు దుష్యంత్‌దవే, సీయూ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్.గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌ల బెంచ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ’క్రిమినల్ కేసుల్లో నిందితులు, దోషుల ఇళ్లు కూల్చివేయాలన్న నిబంధన ఎక్కడ ఉంది. ఒక కట్టడం అక్రమమైనదైతే దానిని కూల్చేందుకు ఒక విధానం ఉంది. అవసరమైతే ఆ కట్టడాన్ని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న కూల్చివేతల ట్రెండ్‌పై మేం మార్గదర్శకాలు జారీ చేస్తాం’అని బెంచ్ తెలిపింది. కేసు విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కొడుకు నేరం చేస్తే తండ్రి ఇళ్లు కూల్చిన ఘటనపైనా కోర్టు మండిపడింది.