న్యూఢిల్లీ: బుల్డోజర్ రాజ్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ ట్రెండ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించింది.
ఢిల్లీ జహంగీర్‌పురిలో నిందితుడు అద్దెకున్న ఇళ్లు కూల్చివేయడంపై సీనియర్ న్యాయవాదులు దుష్యంత్‌దవే, సీయూ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్.గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌ల బెంచ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
’క్రిమినల్ కేసుల్లో నిందితులు, దోషుల ఇళ్లు కూల్చివేయాలన్న నిబంధన ఎక్కడ ఉంది. ఒక కట్టడం అక్రమమైనదైతే దానిని కూల్చేందుకు ఒక విధానం ఉంది. అవసరమైతే ఆ కట్టడాన్ని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న కూల్చివేతల ట్రెండ్‌పై మేం మార్గదర్శకాలు జారీ చేస్తాం’అని బెంచ్ తెలిపింది. కేసు విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కొడుకు నేరం చేస్తే తండ్రి ఇళ్లు కూల్చిన ఘటనపైనా కోర్టు మండిపడింది.
Comments
Please login to add a commentAdd a comment