demolish buildings
-
హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
హైదరాబాద్, సాక్షి: హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. హైడ్రా వల్లే ఓ మహిళ బలవనర్మణానికి పాల్పడిందన్న కథనాల నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. అయితే హైడ్రా గురించి ఉద్దేశపూర్వకంగానే కొందరు.. కొన్ని వీడియోలతో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. పేద, మధ్య తరగతులను భయాందోళనలకు గురి చేస్తున్నారని అన్నారాయన. ‘‘హైడ్రా ఎవరికి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. బుచ్చమ్మ ఆత్మహత్యపై కూకట్పల్లి ఇన్స్పెక్టర్తో మాట్లాడాను. శివయ్య దంపతుల కూతుర్లుకు రాసిచ్చిన ఇల్లు.. కూకట్పల్లి చెరువుకు సమీపంలోనే ఉన్నప్పటికీ ఎఫ్టీఎల్ పరిధికి దూరంగా ఉన్నాయి. కూల్చివేతల్లో భాగంగా తమ ఇళ్లను కూలుస్తారనే భయంతో వారి కూతుర్లు బుచ్చమ్మను ప్రశ్నించారు. దీంతో మనస్తాపానికి గురైన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. బుచ్చమ్మ సూసైడ్‌తో హైడ్రాకు సంబంధం లేదు. హైడ్రా గురించి మీడియాలో గానీ, సామాజిక మాధ్యమాల్లోగానీ భయాలు పుట్టించవద్దని కోరుతున్నాను. సంబంధిత వార్త: హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య!.. రాష్ట్రంలో జరుగుతున్న కూల్చివేతలను హైడ్రాకు ఆపాదిస్తున్నారు. కూల్చివేతలకు సంబంధించి మూసీ పరిధిలో చేపట్టిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. మూసి నదిలో శనివారం భారీగా ఇళ్లను కూల్చివేయబోతున్నట్లు నకిలీ వార్తలు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు ప్రత్యేక ఎజెండాతో హైడ్రాపై అవాస్తవ, నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఈ విషయాన్ని మీడియా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. .. హైడ్రా కూల్చివేతల గురించి అనవసర భయాలు వద్దు. పేదలు, మధ్యతరగతి ప్రజలు కూల్చివేతల వల్ల ఇబ్బందులు పడవద్దని, దీనికి సంబంధించి ప్రభుత్వం కచ్చితమైన సూచనలు జారీ చేసింది’’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రాపై సందేహాలా?.. ఇక్కడ క్లిక్ చేయండి -
నిందితుల ఇళ్లు కూల్చడమేంటి? : సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: బుల్డోజర్ రాజ్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి ఇళ్లను కూల్చివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ ట్రెండ్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించింది.ఢిల్లీ జహంగీర్‌పురిలో నిందితుడు అద్దెకున్న ఇళ్లు కూల్చివేయడంపై సీనియర్ న్యాయవాదులు దుష్యంత్‌దవే, సీయూ సింగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్ బిఆర్.గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌ల బెంచ్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ’క్రిమినల్ కేసుల్లో నిందితులు, దోషుల ఇళ్లు కూల్చివేయాలన్న నిబంధన ఎక్కడ ఉంది. ఒక కట్టడం అక్రమమైనదైతే దానిని కూల్చేందుకు ఒక విధానం ఉంది. అవసరమైతే ఆ కట్టడాన్ని నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలి. దేశవ్యాప్తంగా ప్రస్తుతం నడుస్తున్న కూల్చివేతల ట్రెండ్‌పై మేం మార్గదర్శకాలు జారీ చేస్తాం’అని బెంచ్ తెలిపింది. కేసు విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కొడుకు నేరం చేస్తే తండ్రి ఇళ్లు కూల్చిన ఘటనపైనా కోర్టు మండిపడింది. -
సఫిల్‌గూడ చెరువులో మిగిలింది ఇదే
-
వరంగల్‌లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
వరంగల్: బాంబులతో వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల కూల్చివేత జరుగుతుండగా.. బాంబుల మోతతో నగరం దద్దరిల్లింది. పెద్ద శబ్దాలకు చుట్టుపక్క ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిన్న తప్పిదం జరిగినా భారీ నష్టం వాటిళ్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉండటం గమనార్హం.ఇక.. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల తొలగింపు పనులు చకచకా సాగుతున్నాయి. రూ.70 కోట్లతో అధునాతన బహుళ అంతస్తుల బస్‌స్టేషన్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్‌స్టేషన్‌ను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో భవనాలను కూల్చి వేశారు. పురాతన భవనాలు దృఢంగా ఉండటంతో ఎక్స్కవేటర్లతో కూల్చడం సాధ్యం కాకపోవడంతో, కూల్చివేతలకు పేలుడు పదార్థాలు ఉపయోగించారు. -
హీరో వెంకటేష్, రానాలపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానాలకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేష్, సురేష్, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారని నంద కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్‌ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని పేర్కొన్నారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్‌ను ధ్వంసం చేశారని అన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేష్, ఇతర కుటుంబ సభ్యులపై IPC 448, 452,380, 506,120b కింద కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: 24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై పిటిషన్లు.. కేటీఆర్, హరీశ్ విజయంపై కూడా -
మనీష్ మల్హోత్రాకు బీఎంసీ నోటీసులు
ముంబై: బాద్రాలోన కంగనా రనౌత్ కార్యాలయాన్ని నిన్న బృహన్ ముంబై కార్పోరేషన్(బీఎంసీ) అక్రమ నిర్మాణంగా పేర్కొంటూ కూల్చివేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనిష్ మల్హోత్రాకు బీఎంసీ సివిక్ బాడీ నోటీసులు ఇచ్చింది. అక్రమ నిర్మాణం, ఇతర నిబంధనలు ఉల్లఘించినందుకు గాను బీఎంసీ గురువారం నోటిసులు జారీ చేసింది. కంగనా పాలి హిల్స్ కార్యాలయం పక్కనే మనీష్ భవనం కూడా ఉంది. సెక్షన్ 351 కింది బీఎంసీ ఈ నోటిసులు జారీ చేసింది. ఇందులో ముంబై మున్పిపల్ చట్టం నిబంధనలకు వ్యతిరేకంగా మనీష్ భవన నిర్మాణం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేగాక దీని కట్టడంలో నాలుగు ఉల్లంఘనలు ఉన్నట్లు బీఎంసీ నోటీసులో పేర్కొంది. (చదవండి: ‘క్వీన్’ ఆఫీస్‌లో కూల్చివేతల) మొదటి అంతస్తును ఇటుక రాతితో రెండు గోడలు అక్రమంగా నిర్మించి క్యాబిన్లుగా పార్టిషన్స్ చేశారని, రెండవ అంతస్తులో గోడలను ఆనధికారికంగా నిర్మించడమే కాకుండా, అదే అంతస్తులో టెర్స్ మీద సిమెంట్ షీట్ పైకప్పు, సెడ్‌లను నిర్మాణాం, అలాగే టేర్స్‌పై ఉక్కు రాడ్లు, సిమెంట్ షీట్‌ను పైకప్పు నిర్మించినట్లు నోటీసులలో వివరించారు. అయితే కంగనా కార్యాలయాన్ని ముంబై హైకోర్టు ఆదేశాల మేరకే కూల్చిట్లు బీఎంసీ ఇవాళ స్పష్టం చేసింది. అంతేగాక కంగనా రనౌత్ కార్యాలయం కూల్చివేతపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి ఉన్నతాధికారులను ఇవాళ ఉదయం ప్రశ్నించారు. కాగా గత కొద్ది రోజులుగా శివసేనకు, కంగనాకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో కంగనా ముంబైని పీఓకేతో పోలుస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది. (చదవండి: కంగన ఆఫీస్ కూల్చివేత.. గవర్నర్ సీరియస్!) -
మరదు ఫ్లాట్స్ కూల్చివేత
-
అక్రమ వేదిక కూల్చివేత
-
రణరంగం
యనమలకుదురు గ్రామంలో కొండ వెనుక ప్రాంతంలో కట్టడాల కూల్చివేత రణరంగమైంది. పోలీసులు, సీఆర్డీఏ అధికారులతో భవన యజమానులు, స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఒకదశలో అధికారులు, పోలీసులతో తోపులాటలతో రణరంగాన్ని తలపించింది. యనమలకుదురు (పెనమలూరు): యనమలకుదురులో పలు గ్రూప్హౌస్లను అక్రమంగా నిర్మించారని, వాటిని కూల్చేయాల్సిందేనని శుక్రవారం సీఆర్డీఏ అధికారులు రావడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ భవనాలను ధ్వంసం చేయవద్దని పలువురు ప్రాధేయపడ్డారు. తమకు వారం రోజులు గడువు ఇస్తే ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుకుంటామని కోరారు. అయితే సీఆర్డీఏ అధికారులు ససేమిరా అన్నారు. వివాదం ఇలా మొదలైందిలా వరుసగా మూడవరోజు కూల్చివేతకు ప్రజల నుంచి తీవ్ర పతిఘటన ఎదురైంది. తొలుత చందూ అనే బిల్డర్ భవనం స్లాబ్ కూల్చడానికి సీఆర్డీయే అధికారులు రాగా స్థానికులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేనే ఈ పని చేయిస్తున్నాడని తీవ్రంగా ఆరోపణలు చేశారు. పోలీస్ బందోబస్తుతో ఆ భవనం స్లాబ్‌కు కన్నాలు పెట్టారు. అలాగే రామరాజు అనే బిల్డర్ భవనం పై రెండు అంతస్తులు తొగించటానికి రాగా అప్పటికే దాదాపు 200 మంది భవనం మందు బైఠాయించి ఉన్నారు. వారిని లోపలకు వెళ్లనీయలేదు. భవనం లోనికి అడుగుపెడితే చనిపోతానని బిల్డర్ సోదరుడు సీతారామరాజు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పరుగులు తీయించిన పోలీసులు ఈ సమాచారం తెలుసుకున్న సెంట్రల్ ఏసీపీ సత్యానందం, పటమట సీఐ దామోదర్ భారీగా సిబ్బందితో వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ తూర్పు కన్వీనర్ బొప్పన భవకుమార్ వచ్చి భవనాలు కూల్చవద్దని అధికారులను కోరారు. అన్ని గ్రామాల్లో ఇటువంటి నిర్మాణాలు ఉన్నాయని, అవకాశం ఇస్తే రెగ్యులర్ చేయించుకుంటారని తెలిపారు. తమకు ఉన్న ఆదేశాలమరకు అక్రమ కట్టడాలు కూల్చుతున్నామని అధికారులు తేల్చి చెప్పారు. దీంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. భవకుమార్‌తో పాటు పలువురిని అదుపులోకి తీసుకుని పీఎస్‌కు తరలించారు. గ్రామస్తులను లాఠీలతో పరుగులు తీయించారు. సీఆర్డీ అధికారులు భవనంలోకి వెళ్లి భవనం స్లాబ్‌లు పగులకొట్టించారు. టీడీపీ ఆదేశాలతోనే విధ్వంసం – భవకుమార్ ఆరోపణ భవనాలను సీఆర్డీఏ అధికారులు ధ్వంసం చేయటం దారుణమని భవకుమార్ ఖండించారు. బిల్డర్లు గ్రామాభివృద్దికి నిధులు ఇచ్చినా అధికారులు కఠినంగా వ్యవహరించటం తగదన్నారు. నిర్మించేటప్పడు అధికారులు మౌనంగా ఉండి, ఇప్పుడు టీడీపీ నేతలు చెబితే భవనాలు ధ్వంసం చేయటం దుర్మార్గమని ఆరోపించారు. పోలీసులు గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేయటం తగదన్నారు.