వరంగల్: బాంబులతో వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల కూల్చివేత జరుగుతుండగా.. బాంబుల మోతతో నగరం దద్దరిల్లింది. పెద్ద శబ్దాలకు చుట్టుపక్క ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిన్న తప్పిదం జరిగినా భారీ నష్టం వాటిళ్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉండటం గమనార్హం.
ఇక.. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల తొలగింపు పనులు చకచకా సాగుతున్నాయి. రూ.70 కోట్లతో అధునాతన బహుళ అంతస్తుల బస్‌స్టేషన్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్‌స్టేషన్‌ను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో భవనాలను కూల్చి వేశారు. పురాతన భవనాలు దృఢంగా ఉండటంతో ఎక్స్‌కవేటర్లతో కూల్చడం సాధ్యం కాకపోవడంతో, కూల్చివేతలకు పేలుడు పదార్థాలు ఉపయోగించారు.
Comments
Please login to add a commentAdd a comment