warangal bustand
-
వరంగల్‌లో అర్ధరాత్రి బాంబుల మోత, కారణం ఏంటంటే..
వరంగల్: బాంబులతో వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల కూల్చివేత జరుగుతుండగా.. బాంబుల మోతతో నగరం దద్దరిల్లింది. పెద్ద శబ్దాలకు చుట్టుపక్క ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చిన్న తప్పిదం జరిగినా భారీ నష్టం వాటిళ్లే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా కూతవేటు దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉండటం గమనార్హం.ఇక.. వరంగల్ ఆర్టీసీ బస్టాండ్ పాత భవనాల తొలగింపు పనులు చకచకా సాగుతున్నాయి. రూ.70 కోట్లతో అధునాతన బహుళ అంతస్తుల బస్‌స్టేషన్ నిర్మాణంలో భాగంగా సిటీ బస్‌స్టేషన్‌ను అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో భవనాలను కూల్చి వేశారు. పురాతన భవనాలు దృఢంగా ఉండటంతో ఎక్స్కవేటర్లతో కూల్చడం సాధ్యం కాకపోవడంతో, కూల్చివేతలకు పేలుడు పదార్థాలు ఉపయోగించారు. -
ఆర్టీసీ ఎండీ దిష్టిబొమ్మకి శవయాత్ర చేశారు
వరంగల్ : వరంగల్ బస్టాండ్‌లో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తారంటూ ఆర్టీసీ ఎండీ దిష్టిబొమ్మకు శవయాత్ర చేపట్టి, అనంతర దగ్దం చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు కార్మికులు యత్నించారు. అయితే వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణాలో ఆర్టీసీ లాభాల్లో ఉందని, తెలంగాణ ఉద్యమ పోరాటలో ముఖ్యపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను విస్మరించటం మంచి పద్ధతి కాదన్నారు. మరోవైపు ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.