వరంగల్ బస్టాండ్లో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తారంటూ ఆర్టీసీ ఎండీ శవయాత్ర చేపట్టి, దిష్టిబొమ్మను దగ్దం చేశారు.
వరంగల్ : వరంగల్ బస్టాండ్లో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తారంటూ ఆర్టీసీ ఎండీ దిష్టిబొమ్మకు శవయాత్ర చేపట్టి, అనంతర దగ్దం చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్లోకి చొచ్చుకు వచ్చేందుకు కార్మికులు యత్నించారు. అయితే వారి ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. తెలంగాణ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ఈ నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణాలో ఆర్టీసీ లాభాల్లో ఉందని, తెలంగాణ ఉద్యమ పోరాటలో ముఖ్యపాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను విస్మరించటం మంచి పద్ధతి కాదన్నారు. మరోవైపు ఆందోళన చేస్తున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.