
సాక్షి, హైదరాబాద్ : సమ్మెను మరింత ఉధృతం చేస్తామంటున్న ఆర్టీసీ కార్మికుల ప్రకటనలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు స్పందించారు. సమ్మెతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని తామెప్పుడూ హామీ ఇవ్వలేదని వెల్లడించారు. ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ప్రతిపక్షాల వలలో పడ్డారని విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తామని సీఎం ఎక్కడా చెప్పలేదని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని ఎందుకు విలీనం చేయలేదని ప్రశ్నించారు. కార్మికులను రెచ్చగొటిట్టన వారే తలెత్తే పరిణామలకు బాధ్యత వహించాలని ఎర్రబెల్లి తేల్చిచెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment