Government of Telangana
-
Telangana: 'స్మార్ట్'గా సర్కారీ స్కూల్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ సదుపాయం, ఆధునిక కంప్యూటర్ వ్యవస్థ, డిజిటల్ లైబ్రరీ, అన్నిటికీ మించి డిజిటల్ విద్యాబోధనకు అనుగుణంగా డిజిటల్ స్క్రీన్లు..తదితర ఏర్పాట్లతో రాష్ట్రంలోని స్కూళ్లను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని విద్యా కమిషన్ భావిస్తోంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెరగాలంటే పెద్ద స్కూళ్ళ ఏర్పాటే మార్గమని స్పష్టం చేస్తోంది. ఈ విధానంతో ప్రైవేటు స్కూళ్ళకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను ముందుకు తీసుకెళ్ళొచ్చని అభిప్రాయపడుతోంది. విద్యార్థుల సంఖ్యను బట్టి మండలానికి 2 లేదా 3 స్కూళ్ళు ఉంటే సరిపోతుందని సూచిస్తోంది. విద్యా రంగం సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ వంద రోజులు స్కూళ్ళ నాణ్యతపై అధ్యయనం చేసింది. ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంది. తక్షణమే తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలకు సంబంధించిన కొన్ని సిఫారసులతో త్వరలోనే నివేదిక సమర్పించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. స్మార్ట్ విద్యా విధానంతో నాణ్యత: పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు సరిపడా టీచర్లు, ప్రయోగశాలలు, విశాలమైన తరగతులు, స్మార్ట్ కిచెన్, మౌలిక వసతులు, ఆట స్థలం ఉండేలా చూడాలి. విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి వివిధ అంశాలు నేర్చుకునేందుకు వీలుగా స్టడీ టూర్లు నిర్వహించాలి. తొలిదశలో 3,673 పాఠశాలల్లోని 7,346 తరగతుల్లో తక్షణమే డిజిటల్ స్క్రీన్ ద్వారా బోధన జరగాలి. స్మార్ట్ విద్యా విధానం నాణ్యతను పెంచుతుంది. ఇందుకు కనీసం రూ.300 కోట్లు ఖర్చవుతుంది. ఒక్కో స్కూల్లో 100కు పైగా విద్యార్థులుండాలి పెద్ద స్కూళ్ల నిర్ణయం తీసుకునే ముందు ముఖ్యమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 41,628 ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లున్నాయి. ఇందులో 59 లక్షల మంది చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళు 26,337 ఉంటే, వాటిల్లో 22.63 లక్షల మంది విద్యార్థులున్నారు. 11 వేల ప్రైవేటు స్కూళ్ళల్లో 34 లక్షల మందికి పైగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ళు కూడా ఊరూరా లేవు. మండలంలోనూ ఒకటికి మించి ఉండటం లేదు. వీటిల్లో కనిష్టంగా 500, గరిష్టంగా 4 వేల మంది విద్యార్థులుంటున్నారు. కానీ రాష్ట్రంలోని 1,800 ప్రభుత్వ స్కూళ్ళల్లో అసలు అడ్మిషన్లే లేవు. 8,782 స్కూళ్ళల్లో 30కి మించి విద్యార్థులు లేరు. ఇందులో ప్రాథమిక పాఠశాలలే 8 వేలకుపైగా ఉన్నాయి. 10 వేల స్కూళ్ళల్లో 100 మందికి మించి లేరు. 5,800 స్కూళ్ళల్లో ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధించే పరిస్థితి ఉంది. నిబంధనల ప్రకారం ప్రతి 30 మందికి ఒక టీచర్ ఉండాలి. కానీ ఇటీవల బదిలీలు, పదోన్నతుల నేపథ్యంలో 20 మందికి ఒక టీచర్ ఉండాలనే నిబంధన తెచ్చారు. అయినప్పటికీ గత ఏడాది కన్నా ఈ సంవత్సరం 1.62 లక్షల ప్రవేశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఒక్కో స్కూల్లో కనీసం వందకు పైగా విద్యార్థులు ఉండేలా చూడాలనేది మెజారిటీ అభిప్రాయంగా ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో పది వేల స్కూళ్ళను ఆయా మండలాల పరిధిలో విలీనం చేయవచ్చు. ఉచిత రవాణా వ్యవస్థ అవసరం గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను ప్రైవేటు యాజమాన్యాలు సులభంగా దూరంలో ఉన్న తమ స్కూళ్ళకు తీసుకెళ్తున్నాయి. ఇందుకోసం బస్సులు, ఆటోలు, వ్యాన్లు ఉపయోగిస్తున్నాయి. ఇదే తరహాలో ప్రభుత్వ స్కూళ్ళకు ఉచిత రవాణా వ్యవస్థ ఉండాలి. సూదూర ప్రాంతాలకు విద్యార్థులను పంపేందుకు 92 శాతం గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నట్టు మా అభిప్రాయ సేకరణలో తేలింది. అయితే రవాణా సౌకర్యం కోసం ఖర్చు పెట్టేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. అందువల్ల ప్రభుత్వం ఉచితంగా ఈ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ స్కూళ్ళ వైపే మొగ్గు చూపుతారు. -
3 ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెనక్కి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) భారీ షాకిచ్చింది. అనుమతుల కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వం పంపించిన కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు–రంగారెడ్డి, వార్ధా ప్రాజెక్టుల డీపీఆర్‌లను వెనక్కి పంపించింది. ఈ మూడు ప్రాజెక్టులపై తాము లేవనెత్తిన అంశాల(అబ్జర్వేషన్ల)కు తెలంగాణ ప్రభుత్వం దీర్ఘకాలంగా సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. బీఆర్ అంబేడ్కర్ వార్ధా ప్రాజెక్టు డీపీఆర్‌పై తాము లేవనెత్తిన అంశాలకు ఏడాదిగా సమాధానం ఇవ్వలేదని, సత్వరంగా ఇవ్వకపోతే డీపీఆర్‌ను వెనక్కి పంపిస్తామని హెచ్చరిస్తూ గత నెల 22న రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ లేఖ రాసింది. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో.. మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లను పరిశీలించలేమని, వాటిని తమ పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల జాబితా నుంచి తొలగిస్తామని తేల్చి చెప్పింది. ఈ మేరకు డీపీఆర్‌లను వెనక్కి పంపిస్తూ సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగం డైరెక్టర్ రాజీవ్‌కుమార్ ఈ నెల 19న లేఖ రాశారు. తాము లేవనెత్తిన అంశాలకు 3 నెలల్లోగా సమాధానమివ్వకపోయినా, ట్రిబ్యునల్ పరిధిలో వివాదం ఉన్నా డీపీఆర్‌లను పరిశీలించకూడదనే నిబంధనలున్నాయని గుర్తుచేసింది. తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్‌కు మార్గం సుగమం వార్ధా ప్రాజెక్టుపై పలు అంశాలను లేవనెత్తుతూ 2023 జూలై 4, జూలై 20, 2024 నవంబర్ 17 తేదీల్లో సీడబ్ల్యూసీలోని వేర్వేరు డైరెక్టరేట్లు రాసిన లేఖలకు తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. ప్రాజెక్టుతో మహారాష్ట్రలో ముంపు ఉండడంతో డీపీఆర్‌ను అంతర్రాష్ట్ర బోర్డు పరిశీలనకు పంపాలని సీడబ్ల్యూసీ గతంలో సూచించింది. ముంపుపై మహారాష్ట్ర నుంచి సమ్మతి తీసుకోవాలని కోరింది. ముంపు ఆధారంగా ప్రణాళికల్లో ఏమైనా మార్పులుంటే తెలపాలని సూచించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద హెడ్‌వర్క్స్, సొరంగాలు, ఇతర పనులు ఎంత మేరకు చేశారు? వ్యయం ఎంత? పనుల లొకేషన్ ఏమిటి? ప్రాజెక్టు కోసం సేకరించిన పంపుసెట్ల వివరాలు, వార్ధా లేదా ఇతర ప్రాజెక్టులో వాటి వినియోగంపై సమాచారం ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం సమాచారం ఇవ్వకపోవడంతో సీడబ్ల్యూసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. వార్ధా ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్ల్యూసీ వెనక్కి పంపడంతో ప్రాణహిత కింద ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి వద్ద బరాజ్ నిర్మించడానికి మార్గం సుగమమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అదనపు ప్రయోజనం లేకుండా అంత ఖర్చు ఎందుకు? ఎలాంటి అదనపు ప్రయోజనాలు లేకపోయినా కాళేశ్వరం అదనపు టీఎంసీ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లను ఎలా ఖర్చు చేస్తారని సీడబ్ల్యూసీ ప్రశ్నించింది. దీనిపై ఎన్నో లేఖలు రాసినా సమాధానం ఇవ్వడం లేదని తప్పుబట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు రోజువారీ పంపింగ్ సామర్థ్యాన్ని 2 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు పెంచడానికి ఈ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ప్రాజెక్టు నిర్వహణ ఆర్థికంగా ఆచరణీయమైనదని నిరూపించడానికి దానితో వచ్చే పంటల దిగుబడులను, వాటి విలువను భారీగా పెంచి చూపారంటూ సీడబ్ల్యూసీ తప్పుబట్టింది. చివరగా గత జనవరి 12న రాసిన లేఖకు ఇంకా సమాధానం ఇవ్వలేదని తెలిపింది. ట్రిబ్యునల్‌లో తేలేవరకు పాలమూరుకు అనుమతి నో ఏపీ, తెలంగాణల మధ్య కృష్ణా జలాల పంపిణీ వ్యవహారం కృష్ణా ట్రిబ్యునల్–2 పరిధిలో ఉన్నందున పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్‌ను పరిశీలించలేమని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీకి కృష్ణా జలాల్లో ఉన్న 811 టీఎంసీల వాటాతో పాటు ‘పోలవరం’ప్రాజెక్టు నిర్మాణంతో సాగర్ ఎగువన లభ్యతలోకి వచి్చన 45 టీఎంసీల జలాలను ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ చేసే బాధ్యతను కృష్ణా ట్రిబ్యునల్–2కు కేంద్రం అప్పగించిన విషయాన్ని గుర్తు చేసింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా బేసిన్‌కు తరలిస్తే దానికి బదులుగా సాగర్ ఎగువ రాష్ట్రాలు 80 టీఎంసీలను వాడుకోవడానికి ట్రిబ్యునల్ అవకాశం కల్పించింది. ఈ 80 టీఎంసీల్లో మహారాష్ట్ర, కర్ణాటకలు 35 టీఎంసీలు వాడుకోగా, మిగిలి ఉన్న 45 టీఎంసీలను ఏపీ, తెలంగాణకు పంచే అంశం కృష్ణా ట్రిబ్యునల్–2లో పరిధిలో ఉంది. కాగా ట్రిబ్యునల్ తుది నిర్ణయం వచ్చే వరకు నిర్ణయం తీసుకోవడానికి వీలు లేదని సీడబ్ల్యూసీ తాజాగా స్పష్టం చేసింది. -
ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఐఆర్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులతో సమానంగా వారికి మధ్యంతర భృతి మంజూరు చేసింది. మూలవేతనంపై 5 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
అలాంటి వారికి అండగా నిలుద్దాం: అల్లు అర్జున్
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు సహరించాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్) వేదికగా ఓ స్పెషల్ వీడియోని షేర్ చేస్తూ.. డ్రగ్స్ బాధితులను ఆదుకోవడానికి, సురక్షితమైన, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.‘‘మీకు తెలిసిన వారు ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్: 1908కు ఫోన్ చేయండి. వాళ్లు వెంటనే బాధితులను పునరావాస కేంద్రాలకు తీసుకువెళ్లి.. సాధారణ జీవనశైలిలోకి వచ్చేవరకూ జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ ప్రభుత్వ ఉద్దేశం వారిని శిక్షించడం కాదు. వారికి సాయం చేయడం. మంచి సమాజం కోసం బాధితులకు అండగా నిలుద్దాం’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.కాగా.. డ్రగ్స్ నియంత్రణలో సినీతారలు కూడా భాగం కావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కోరిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం ఓ ఈవెంట్లో రేవంత్ మట్లాడుతూ.. ఇకపై ఎవరికైనా సరే టకెట్ రేటు పెంపు కావాలంటే డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పిస్తూ ఓ వీడియో చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా పుష్ప 2 సినిమా రిలీజ్‌కి కొద్ది రోజుల ముందుకు అలా వీడియో చేసి పంపారు. గతంలో కమల్ హాసన్, చిరంజీవి, ఎన్టీఆర్‌తో పాటు మరికొంతమంది హీరోలు కూడా ఇలాంటి అవగాహన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. Let’s unite to support the victims and work towards building a safer, healthier society.Humbled to join this impactful initiative by the Government of Telangana.@revanth_anumula @TelanganaCMO @TG_ANB @TelanganaCOPs pic.twitter.com/tZ5Rkiw5Lg— Allu Arjun (@alluarjun) November 28, 2024 -
మన ముత్యానికి మెరుపులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకే ప్రత్యేకమైన పలు ఉత్పత్తులకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్ –జీఐ) సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలోని ఆహారం, హస్తకళలు, వంగడాలు తదితర 17 రకాల ఉత్పత్తులకు ఇప్పటికే జీఐ గుర్తింపు లభించింది. ఇప్పుడు మరిన్ని ఉత్పత్తులకు జీఐ గుర్తింపు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ఈ జాబితాలో హైదరాబాద్ ముత్యాలు, భద్రాచలం కలంకారీ, వరంగల్ మిర్చి తదితర ఉత్పత్తులు ఉన్నాయి. వీటికి జీఐ గుర్తింపు కోసం కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధీనంలోని ‘కం్రప్టోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్, ట్రేడ్‌మార్క్’విభాగానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు సమర్పించింది. 30 ఉత్పత్తులకు జీఐ ట్యాగింగ్ఇతర రాష్ట్రాలతో పోలిస్తే జీఐ ట్యాగింగ్ జాబితాలో తెలంగాణకు చెందిన ఉత్పత్తులకు పెద్దగా చోటు దక్కలేదు. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో జీఐ టాగింగ్ జాబితాలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కనీసం 30 ప్రత్యేక ఉత్పత్తులకు జీఐ టాగింగ్ దక్కేలా చూడాలని పరిశ్రమల శాఖ నిర్ణయించింది. హైదరాబాద్ ముత్యాలు, భద్రాచలం కళంకారీ, వరంగల్ చపాటా మిర్చీకి గుర్తింపు ఇవ్వాలని దరఖాస్తు చేసింది. వరంగల్ చపాటా మిర్చీ తరహాలోనే ఖమ్మం మిర్చికి కూడా జీఐ టాగింగ్ ఇవ్వాలనే డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలు కోరింది. తెలంగాణకు చెందిన ప్రత్యేక ఉత్పత్తుల జాబితాను సిద్ధం చేసే ప్రక్రియ పురోగతిలో ఉన్నట్లు జీఐ టాగింగ్ నోడల్ అధికారి శ్రీహారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. – ఇప్పటివరకు తెలంగాణకు చెందిన 17 ప్రత్యేక ఉత్పత్తులకు జీఐ టాగింగ్ లభించింది. పోచంపల్లి ఇక్కత్, కరీంనగర్ వెండి ఫిలిగ్రీ, నిర్మల్ కొయ్య బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్, గద్వాల చీరలు, హైదరాబాద్ హలీమ్, చేర్యాల పెయింటింగ్స్, పెంబర్తి ఇత్తడి కళాకృతులు, సిద్దిపేట గొల్లభామ చీరలు, బంగినపల్లి మామిడి, పోచంపల్లి ఇక్కత్ లోగో, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ డర్రీస్, తేలియా రుమాల్, లక్క గాజులకు జీఐ గుర్తింపు లభించింది. – జీఐ చట్టం 1999 ప్రకారం భౌగోళిక ప్రత్యేకత, నాణ్యత, ప్రాముఖ్యత తదితరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత కలిగిన వాటికి జీఐ గుర్తింపు ఇస్తారు. వారసత్వ, సాంస్కృతిక సంపదను కాపాడటం, ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పనను ప్రోత్సహించడం, ఉత్పత్తుల నాణ్యత, ప్రత్యేకతను పరిరక్షించడం, ఉత్పత్తులను నకలు కొట్టకుండా నిరోధించడం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్పత్తులకు ప్రాచుర్యం కల్పించడం జీఐ టాగింగ్ లక్ష్యం. -
ఫోర్త్‌సిటీకి మెట్రో
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోరైలు రెండోదశ పనులకు ప్రభుత్వం పరిపాలన ఆమోదం తెలిపింది. రెండోదశ ప్రాజెక్టులో భాగంగా రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర ఐదు కారిడార్ల (పార్ట్–ఏ కింద)ను నిర్మించనున్నారు. పార్ట్–బీలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్స్ యూనివర్సిటీ)వరకు ఆరో కారిడార్‌ను నిర్మించనున్నారు. దీనికి రూ.8 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. దీనికి సంబంధించిన అలైన్మెంట్, నిర్మాణ వ్యయం ఇతర అంశాలపై సర్వే జరుగుతోంది. ఈ మేరకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జాయింట్ వెంచర్‌గా నిర్మాణం రెండోదశ మెట్రో ప్రాజెక్టును దేశంలోని ఇతర నగరాల తరహాలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి 50:50 జాయింట్ వెంచర్ (జేవీ)గా నిర్మించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రస్తుతం నడుస్తున్న 69 కిలోమీటర్ల తొలిదశ మెట్రోరైలు ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టు. ఐదు కారిడార్లలో 76.4 కిలోమీటర్ల రెండోదశ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వేసిన రూ.24,269 కోట్లలో తెలంగాణ ప్రభుత్వం వాటా రూ. 7,313 కోట్లు (30 శాతం) కాగా, కేంద్ర ప్రభుత్వం వాటా రూ.4,230 కోట్లు (18 శాతం), జపాన్ ఇంటర్నేషన్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ), న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) మొదలైన ఆర్థిక సంస్థల వాటా రూ.11,693 కోట్లు (48 శాతం), మరో 4 శాతం అంటే రూ.1,033 కోట్లను పీపీపీ విధానం ద్వారా సమీకరిస్తారు. ఫోర్త్‌సిటీ మెట్రో కనెక్టివిటీకి రూ.8 వేల కోట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించిన ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీ లైన్ కోసం అనేక ఆకర్షణీయ ఫీచర్లతో వినూత్న రీతిలో డీపీఆర్ తయారు చేస్తున్నట్లు పురపాలక శాఖ తెలిపింది. ఈ కొత్త లైన్ డీపీఆర్ మినహా మిగిలిన ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్‌ను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని అధికారులు తెలిపారు. ఫోర్త్ సిటీ మెట్రో కనెక్టివిటీకి సుమారు రూ.8,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో మొత్తం రెండో దశ ప్రాజెక్ట్ కు అయ్యే వ్యయం దాదాపు రూ.32,237 కోట్లు (రూ.24,237 కోట్లు + రూ. 8,000 కోట్లు)గా అవుతుంది. కొత్త హైకోర్టును కలుపుతూ.. మెట్రో రైల్ రెండో దశ డీపీఆర్‌ల రూపకల్పనపై సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం పురపాలక శాఖ సీనియర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మెట్రో రెండో దశ కారిడార్ల అలైన్మెంట్, స్టేషన్లు, ఇతర ముఖ్యమైన ఫీచర్లు తదితర అంశాల గురించి ప్రెజెంటేషన్ ఇచ్చారు. హెచ్ఎండీఏ కోసం సిద్ధం చేస్తున్న సమగ్ర మొబిలిటీ ప్లాన్ (సీఎంపీ) ట్రాఫిక్ అధ్యయన నివేదిక తరువాత డీపీఆర్‌లకు తుదిరూపం ఇచ్చారు. మెట్రో మార్గాల్లో ట్రాఫిక్ అంచనాలను సీఎంపీతో క్రాస్–చెక్ చేయాల్సి ఉంటుంది. కేంద్రానికి డీపీఆర్‌లను సమర్పించడానికి ఈ అధ్యయనం తప్పనిసరి. దీంతో మెట్రో అలైన్మెంట్లు, స్టేషన్లు ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో సర్వే చేసి, నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేశారు. ఆ డీపీఆర్‌లకు సీఎం ఆమోదం తెలిపారు. కాగా గతంలో ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించిన ప్రకారం ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ ను ఇప్పుడు ఆరామ్‌ఘర్, 44వ నెంబర్ జాతీయ రహదారి (బెంగళూరు హైవే)లోని కొత్త హైకోర్టు ప్రాంతం మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేశారు. ఐదు కారిడార్ల అలైన్మెంట్లు ఇలా.. కారిడార్ –4 (ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్): నాగోల్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు దాదాపు 36.6 కి.మీ. ఎల్బీ నగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్డీఓ, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరామ్‌ఘర్, న్యూ హైకోర్టు, శంషాబాద్ జంక్షన్ ద్వారా జాతీయ రహదారి మీదుగా ఈ మార్గం ఉంటుంది. ఇది నాగోల్, ఎల్బి నగర్, చంద్రాయన్ గుట్ట వద్ద ఉన్న అన్ని మెట్రోలైన్లకు అనుసంధానం చేయబడుతుంది. 36.6 కి.మీ పొడవులో 35 కి.మీ పిల్లర్ల మీద (ఎలివేటెడ్ ), 1.6 కి.మీ మార్గం భూగర్భంలో వెళ్తుంది. విమానాశ్రయం వద్ద భూగర్భ స్టేషన్ ఉంటుంది. ఈ మార్గంలో మొత్తం 24 స్టేషన్లు ఉంటాయి కారిడార్ 5: రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట నియోపోలిస్ వరకు వరకు ఈ మార్గం ఉంటుంది. బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్, కోకాపేట నియోపోలిస్ వరకు నిర్మిస్తారు. ఇది మొత్తం పిల్లర్లపైనే ఉండే ఎలివేటెడ్ కారిడార్. ఇందులో 8 స్టేషన్లు ఉంటాయి. కారిడార్ 6 (ఓల్డ్ సిటీ మెట్రో): ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట వరకు ఇది ఉంటుంది. ప్రస్తుతం జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు ఉన్న గ్రీన్ లైన్ పొడిగింపుగా 7.5 కి. మీ మేర నిర్మించబడుతుంది. ఓల్డ్ సిటీలోని మండి రోడ్, దారుల్షిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా మీదుగా ప్రయాణిస్తుంది. ఈ కారిడార్ సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్ నుంచి 500 మీటర్ల దూరం నుంచి వెళ్తున్నప్పటికీ చారిత్రక ప్రాముఖ్యత కారణంగా ఆ పేర్లనే స్టేషన్లకు పెట్టాలని నిర్ణయించారు. ఈ రూట్లో ఉన్న రోడ్లను విస్తరిస్తారు. రోడ్డు విస్తరణ, మెట్రో అలైన్మెంట్లో దాదాపు 1100 ఆస్తులు ప్రభావితమవుతాయి. ప్రభావితమైన 400 ఆస్తులకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేశారు. ఈ మార్గంలో దాదాపు 103 మతపరమైన, వారసత్వ, ఇతర సున్నితమైన నిర్మాణాలు ఉన్నాయి. వాటన్నింటికీ తగిన ఇంజినీరింగ్ పరిష్కారాలు చూపుతారు. మెట్రో పిల్లర్ స్థానాల సర్దుబాటు ద్వారా ఆ నిర్మాణాలకు నష్టం కలుగకుండా చూస్తామని అధికారులు తెలిపారు. ఈ కారిడార్ దాదాపు 6 స్టేషన్లతో పూర్తి ఎలివేటెడ్ మెట్రో. కారిడార్ 7: ముంబై హైవేపై రెడ్ లైన్ పొడిగింపుగా నిర్మించబడుతోంది. ప్రస్తుతం ఉన్న మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి పటాన్చెరు వరకున్న 13.4 కి.మీ ఈ మెట్రోలైన్ ఆలి్వన్ క్రాస్ రోడ్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్ఈఎల్, ఇక్రిసాట్ మీదుగా వెళ్తుంది. ఇది దాదాపు 10 స్టేషన్లతో ఉండే పూర్తి ఎలివేటెడ్ కారిడార్. కారిడార్ 8: విజయవాడ హైవేపై ఎల్.బి నగర్ నుంచి ప్రస్తుతం ఉన్న రెడ్ లైన్ పొడిగింపుగా హయత్‌నగర్ వరకు 7.1 కి.మీ మేర ఈ లైన్ నిర్మిస్తారు. ఈ లైన్ చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా వెళుతుంది. ఇది కూడా పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్. ఈ లైన్లో 6 స్టేషన్లు ఉంటాయి. -
విద్యుత్ క్రయవిక్రయాలకు ఓకే
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. పవర్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్)పై గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా విధించిన ఆంక్షలపై స్టే విధించింది. ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరిపేందుకు టీజీఎస్పీడీసీఎల్కు అవకాశం కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యుత్ బిడ్డింగ్‌కు అనుమతించాలని నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)ను ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అత్యవసరంగా హైకోర్టులో కేసు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (పీజీసీఐఎల్)కు రూ.261.31 కోట్ల చార్జీలను బకాయిపడినందుకు పవర్ ఎక్స్చేంజీల్లో విద్యుత్ క్రయవిక్రయాలు జరపకుండా టీజీఎస్పీడీసీఎల్పై గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా గురువారం ఉదయం ఆంక్షలు విధించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అత్యవసరంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి.. ఈ నిర్ణయంపై స్టే విధించాలని కోరింది. నిషేధంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని, రాష్ట్రానికి మొత్తం విద్యుత్ కొనుగోళ్లు ఆగిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. రోజుకు 60 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోళ్లు నిలిచిపోతాయని.. వ్యవసాయం, పరిశ్రమలు, ఆస్పత్రులు, గృహాలు.. ఇలా యావత్ రాష్ట్రానికి ఇబ్బంది ఏర్పడుతుందని వివరించింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. కమిషన్ వద్ద పెండింగ్‌లో పిటిషన్ ప్రభుత్వం తరఫున ఏజీ ఏ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పీజీసీఐఎల్‌కు రూ.261.31 కోట్ల చార్జీల చెల్లింపు విషయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (సీఈఆర్సీ) వద్ద కేసు పెండింగ్‌లో ఉండగా, ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. కేంద్రం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. రూ.261.31 కోట్ల చెల్లింపులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైనందునే లేట్ పేమెంట్ సర్‌చార్జీ నిబంధనల మేరకు ఆంక్షలు విధించినట్లు చెప్పారు. బకాయి పడిన మొత్తంలో 25 శాతం చెల్లించాలని గత ఫిబ్రవరిలో సూచించామని, అయినా చెల్లించలేదని పీజీసీఐఎల్ తరఫు న్యాయవాది తెలిపారు. గ్రిడ్ కంట్రోలర్‌కు అధికారం లేదు వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘రూ.261.31 కోట్ల చార్జీల చెల్లింపు వ్యవహారం సీఈఆర్సీలో పెండింగ్‌లో ఉన్నందున విద్యుత్ క్రయవిక్రయాలపై నిషేధం విధిస్తూ తెలంగాణ పేరును ప్రాప్తి పోర్టల్‌లో ప్రచురించే అధికారం గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు లేదు. అందువల్ల లేట్ పేమెంట్ సర్‌చార్జ్ నిబంధనల ప్రకారం ప్రాప్తి వెబ్సైట్లో ప్రచురణపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. ఈ ఆదేశాలను వెంటనే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర విద్యుత్ శాఖకు తెలియజేయాలని డీఎస్జీకి సూచిస్తున్నాం’ అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
హైదరాబాద్ మా బలం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘పొరుగు రాష్ట్రాలు సహా భారతదేశంలోనే ఎవరి వద్దా లేని హైదరాబాద్ నగరం మా వద్ద ఉంది. ఇక్కడ ఉన్న ఔటర్ రింగు రోడ్డు వంటి మౌలిక వసతులు, వాతావరణం, శాంతిభద్రతలు దేశంలో మరెక్కడా లేవు. మేము పక్క రాష్ట్రాలతో పోటీ పడాలనే ఆలోచనలకంటే ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. కేవలం అమెరికా, దక్షిణ కొరియాకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలకు పిలుపునిస్తున్నా. తెలంగాణకు పెట్టుబడులతో వస్తే భద్రత, లాభంతో పాటు సాంకేతిక నైపుణ్యం అందించే యువశక్తి మా వద్ద ఉంది. పెట్టుబడులతో ఎవరు వచ్చినా రక్షణ ఉంటుందని హామీ ఇస్తున్నా. మీకు అవసరమైన అనుమతులు, వసతులు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ కోకాపేటలో 10 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్‌ను సీఎం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మా పోటీ కర్ణాటక, తమిళనాడు, ఏపీ వంటి రాష్ట్రాలతో కాదు. హైదరాబాద్ వంటి మహా నగరం, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపేలా పాలసీల్లో పారదర్శకత పాటిస్తాం. పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వాలని భావిస్తున్నాం’అని రేవంత్ చెప్పారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా అభివృద్ధి ‘కులీ కుతుబ్‌షాహీలు మొదలుకుని హైదరాబాద్ నగరం 430 ఏళ్లుగా రాజకీయ భిన్నాభిప్రాయాలను అధిగమిస్తూ అభివృద్ధి చెందుతోంది. అధికారంలో ఎవరు ఉన్నా భేదాభిప్రాయాలు లేనందునే ప్రపంచంతో పోటీ పడుతోంది. నిరుద్యోగ సమస్యకు సాంకేతిక నైపుణ్యంతో పరిష్కారం చూపాలనే రాజీవ్‌గాంధీ ఆలోచన మేరకు 1992లో నాటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్ సిటీకి పునాది వేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హైటెక్ సిటీ నిర్మించారు. వైఎస్ హయాంలో మూడో నగరంగా సైబరాబాద్ నిర్మాణం జరిగింది. భవిష్యత్తు అవసరాలను హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు తీర్చే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌పోర్టుకు కూతవేటు దూరంలో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తాం. చైనా బయట పెట్టుబడుల కోసం చూస్తున్న అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఫ్యూచర్ సిటీ సమాధానం చెప్తుంది. ఫ్యూచర్ సిటీలో కాగ్నిజెంట్ వంటి సంస్థలు భాగస్వాములు కావాలి..’అని సీఎం అన్నారు. ఇన్వెస్టర్ టాస్‌్కఫోర్స్ ఏర్పాటు ‘అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. త్వరలో మరిన్ని పెట్టుబడుల సాధన దిశగా సమావేశాల నిర్వహణ కోసం ‘ఇన్వెస్టర్ టాస్‌్కఫోర్స్’ఏర్పాటు చేస్తాం. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా మార్చేందుకు హైదరాబాద్‌ను కోర్ అర్బన్ ఏరియాగా, ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు నడుమ ప్రాంతాన్ని సెమీ అర్బన్ ఏరియాగా, రీజినల్ రింగు రోడ్డు వెలుపల ఉన్న ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా వర్గీకరిస్తున్నాం. సెమీ అర్బన్ ఏరియాను తయారీ కేంద్రంగా, రూరల్ తెలంగాణలోని ప్రాంతాలను ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలుగా అభివృద్ధి చేస్తాం..’అని రేవంత్ చెప్పారు. 57 వేల మంది హైదరాబాద్ నుంచే: కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ ‘హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను కేవలం ఆరు నెలల్లో సిద్ధం చేసి ప్రారంభిస్తున్నాం. 2002 నుంచి హైదరాబాద్ అభివృద్ధిలో కాగ్నిజెంట్ భాగస్వామిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కాగ్నిజెంట్‌కు 3.56 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో 70 శాతం అంటే 2.40 లక్షల మంది భారత్ నుంచే ఉన్నారు. వీరిలో 57 వేల మంది హైదరాబాద్‌లోనే పనిచేస్తుండగా, 39 శాతం మంది మహిళలే కావడం గమనార్హం..’అని కాగ్నిజెంట్ ఈవీపీ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, కాగ్నిజెంట్ ప్రతినిధులు నారాయణన్, జాన్కిమ్, కేథరిన్ డియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
స్టాన్ఫోర్డ్ వర్సిటీ సహకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. బయోడిజైన్ రంగంలో నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో స్టాన్ఫోర్డ్ బయోడిజైన్ శాటిలైట్ సెంటర్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్ఫోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగం సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా స్టాన్ఫోర్డ్ ఆధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను తెలంగాణలో విద్య, ఆరోగ్య రక్షణ విభాగాలకు అనుసంధానం చేయాలనే ఆలోచనను వర్సిటీ ప్రతినిధులతో సీఎం రేవంత్ పంచుకున్నారు. కొత్త యూనివర్సిటీల్లో భాగస్వామ్యం తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని స్టాన్ఫోర్డ్ వర్సిటీని రాష్ట్ర బృందం ఆహా్వనించింది. అధునాతన పరిజ్ఞానం మారి్పడి, ఉమ్మడి పరిశోధనలపైనా చర్చించింది. ఈ సందర్భంగా స్టాన్ఫోర్డ్ వర్సిటీ తెలంగాణతో కలిసి పనిచేస్తుందని బయోడిజైన్ విభాగం అధిపతులు అనురాగ్ మైరాల్, జోష్ మాకోవర్ ప్రకటించారు. తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ సీఎం బృందానికి లేఖ ఇచ్చారు. వైద్య, విద్య పరికరాలు, కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు. స్టాన్ఫోర్డ్ వర్సిటీతో భాగస్వామ్యం తెలంగాణ యువత భవిష్యత్తుకు కొత్త బాటలు వేస్తుందని సీఎం రేవంత్ ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ కార్యాలయానికి రేవంత్ బృందం వర్సిటీలో పర్యటన అనంతరం సీఎం రేవంత్ బృందం కాలిఫోర్నియాలోని మౌంటేన్ వ్యూలో ఉన్న గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. తెలంగాణలో టెక్ సేవల విస్తృతి, ఏఐ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు తదితర ప్రాజెక్టుల్లో భాగం పంచుకునే విషయమై గూగుల్ సంస్థ ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. ప్రొఫెసర్ రామ్‌చరణ్‌తో భేటీ సీఎం రేవంత్ కాలిఫోర్నియాలో ప్రముఖ బిజినెస్ కన్సల్టెంట్, రచయిత, వక్త ప్రొఫెసర్ రామ్‌చరణ్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ, హైదరాబాద్ ప్రత్యేకతలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం కల్పించేందుకు రాష్ట్రాన్ని సందర్శించాలని ఆహా్వనించారు. వేగంగా మారుతున్న వాణిజ్య వాతావరణంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం, పెట్టుబడుల సాధనకు అనుసరించాల్సిన మార్గాలపై వారు చర్చించారు. ప్రొఫెసర్ రామ్‌చరణ్ పలు అంతర్జాతీయ కంపెనీలు, సీఈవోలు, బోర్డులతో కలసి పనిచేశారు. హైదరాబాద్‌లో జొయిటిస్ విస్తరణ ప్రముఖ జంతు ఆరోగ్య సంస్థ జొయిటిస్ హైదరాబాద్‌లో తమ కేపబులిటీ సెంటర్ (సామర్థ్య కేంద్రం)ను విస్తరించాలని నిర్ణయించింది. 2024 సెపె్టంబర్ నుంచి విస్తరణ కార్యకలాపాలు ప్రారంభిస్తామని, వందలాది మందికి కొత్త ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు బృందంతో జొయిటిస్ ప్రతినిధులు భేటీ అయ్యారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి లైఫ్‌సైన్సెస్ హబ్‌గా తీర్చిదిద్దాలనే ఆలోచనలకు జొయిటిస్ విస్తరణ దోహదం చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ భేటీలో జోయిటిస్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కీత్ సర్బాగ్, ఇండియా కేపబిలిటీ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ రాఘవ్ తదితరులు పాల్గొన్నారు. విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్స్ ప్రణాళిక హైదరాబాద్‌లో తమ కార్యకలాపాల విస్తరణకు మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ ముందుకొచ్చింది. అమెరికాలో సీఎం రేవంత్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం మోనార్క్ ట్రాక్టర్స్ సంస్థ సీఈఓ ప్రవీణ్ పెన్మత్స, ఇతర ప్రతినిధులతో భేటీ అయింది. హైదరాబాద్‌లోని తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రానికి అనుబంధంగా అటానమస్ ట్రాక్టర్ టెస్టింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని మోనార్క్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొదటిసారిగా డ్రైవర్ లెస్ స్మార్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను తమ సంస్థ రూపొందించిందని తెలిపారు. -
తెలంగాణలో నలుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్‌ల బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నలుగురు ఐఏఎస్, 12 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ► నిజామాబాద్ అదనపు కలెక్టర్ చిత్రమిశ్రాను ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు. ఐటీడీఏ ఏటునాగారం ప్రాజెక్టు అధికారి అంకిత్‌ను నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా బదిలీ చేశారు. ► ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తాను ఉట్నూరు ప్రాజెక్టు అధికారిగా బదిలీ చేశారు. ఉట్నూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి చేతన్ బాజ్‌పాయ్‌ను తదుపరి పోస్టింగ్‌కు సాధారణ పరిపాలన శాఖను రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. రాచకొండ సీపీగా తరుణ్‌జోషీ రాచకొండ పోలీస్ కమిషనరేట్ సీపీగా మల్టీజోన్–2 ఐజీగా ఉన్న డా.తరుణ్‌జోషి నియమితులయ్యారు.రాచకొండ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సుదీర్‌బాబును మల్టీజోన్ –2 ఐజీగా నియమించారు. మల్టీజోన్–1 ఐజీగా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు ఫన్నీ సెటైర్లు
-
జయ జయహే తెలంగాణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమానికి ఊపునిచ్చి, ఉత్తేజం రగిల్చిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర గేయంగా గుర్తించాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనితోపాటు తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం భావితరాలకు గుర్తుండేలా కీలక మార్పులు చేపట్టాలని తీర్మానించింది. తెలంగాణ ఆత్మ కనిపించేలా రాష్ట్ర చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సీఎస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 25కుపైగా అంశాలపై చర్చించారు. వాహనాల రిజి్రస్టేషన్ నంబర్లలో రాష్ట్ర కోడ్‌గా ‘టీఎస్’కు బదులు ‘టీజీ’ని ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు.. కాంగ్రెస్ సర్కారు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని ఈ సమయంలోనే ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మీడియాకు వివరించారు. ఇందిరమ్మ రాజ్య ఫలాలు అందిస్తాం కాంగ్రెస్ పార్టీకి అధికారమిచ్చిన రాష్ట్ర ప్రజలకు ఇందిరమ్మ రాజ్య ఫలాలు అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిపారు. తొలిరోజున గవర్నర్ ప్రసంగిస్తారని, తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు. మూడో రోజు బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు కొనసాగించేదీ బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘ పోరాటం జరిగింది. అలాంటి పోరాటాన్ని కాదని రాచరిక పోకడలతో రూపొందించిన రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తాం. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి కనిపించేలా చిహ్నాన్ని రూపొందిస్తాం. తెలంగాణ తల్లి రూపాన్ని కూడా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు కనిపించేలా మారుస్తాం. తెలంగాణ గేయంగా అందెశ్రీ రాసిన జయజయõహే తెలంగాణ పాట గుర్తించాలని మంత్రిమండలి నిర్ణయించింది..’’ అని పొంగులేటి తెలిపారు. త్వరలోనే కులగణన రాష్ట్రంలో బీసీలకు సంక్షేమ ఫలాలు పక్కాగా దక్కేలా కులగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి చెప్పారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను అధికార యంత్రాంగం రూపొందిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో తెలంగాణ గెజిట్‌లో భాగంగా.. వాహనాల నంబర్ ప్లేట్లపై ‘టీజీ’ని నిర్దేశించిందని.. కానీ గత ప్రభుత్వం వారి పార్టీ ఆనవాళ్లు కనిపించేలా ‘టీఎస్’ను ఖరారు చేసిందని పేర్కొన్నారు. కేంద్ర గెజిట్ ప్రకారం టీఎస్‌కు బదులు టీజీగా మార్చాలని నిర్ణయించినట్టు వివరించారు. వీఆర్ఓల అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకోనప్పటికీ.. త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోనే మరో రెండు గ్యారంటీ హామీలను సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ.. రాష్ట్రంలోని 65 ఐటీఐలను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. హైకోర్టు నిర్మాణం కోసం వంద ఎకరాల భూమి కేటాయింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు చెప్పారు. త్వరలో వ్యవసాయాధికారి పోస్టుల భర్తీ చేపడతామన్నారు. గ్రూప్–1, ఇతర కేటగిరీల్లో ఉద్యోగ ఖాళీలను గుర్తించి, భర్తీ చేసే దిశగా కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం అతి త్వరలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. చక్కెర ఫ్యాక్టరీల పునరుద్ధరణపై నివేదిక ఇవ్వండి రాష్ట్రంలో మూతపడిన నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ అంశంపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీకి సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఆదివారం సచివాలయంలో సబ్ కమిటీతో ఈ అంశంపై సమీక్షించారు. బోధన్, ముత్యంపేటలలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలు చెల్లించాల్సిన పాత బకాయిలు, వాటి ఆర్థిక ఇబ్బందులు, ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ప్రస్తుత పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. చక్కెర ఫ్యాక్టరీలను తెరిపించేందుకు అన్ని మార్గాలను అన్వేషించాలని, తగిన సూచనలను అందించాలని కమిటీని కోరారు. త్వరగా నివేదిక సిద్ధం చేస్తే.. మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుందామని సూచించారు. ఈ కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, రోహిత్‌రావు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే ఎ.చంద్రశేఖర్, సంబంధిత శాఖల అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. -
నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ లో ఎడతెగని చర్చ
-
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్
-
తెలంగాణ: సొంత జాగా ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు!
సాక్షి, హైదరాబాద్: పేదలకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. తొలుత సొంత జాగా ఉన్న వారికి ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సొంత స్థలం లేనివారికి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు వంటివి ఆ తర్వాత చేపట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇంటి స్థలాల పంపిణీ కోసం భూమిని సేకరించేందుకు కాస్త సమయం పట్టే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేశాయి. ఇప్పు డు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటంతో.. మళ్లీ ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. సొంత జాగా ఉన్న అర్హులైన పేదలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. జాగా లేని పేదలకు స్థలం పట్టాలు ఇచ్చి, ఇంటి నిర్మాణానికి నిధులు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఈనెల 28వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో తొలుత సొంత జాగా ఉన్న పేదలకు ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు చొప్పున నిధులు విడుదల చేసి, వారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టేలా చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. తర్వాతే ఇంటి స్థలాల పంపిణీ.. రాష్ట్రంలో సొంత జాగా లేని నిరుపేదలు లక్షల్లో ఉన్నారు. అలాంటి వారికి తొలుత ఇంటి స్థలం ఇచ్చి, అందులో వారు ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పేదలకు పంపిణీ కోసం భారీగా భూమిని సేకరించాల్సి ఉంది. ఈ ప్రక్రియ కోసం సమయం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇళ్ల డిజైన్లపై కసరత్తు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు నమూనాలను సిద్ధం చేస్తున్నట్టు ఇటీవల గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే నిర్ధారిత డిజైన్‌లో ఇళ్లను నిర్మించాలంటే.. కాలనీల తరహాలో ఒకే చోట భూమిని సేకరించాల్సి ఉంటుంది. సొంత జాగా ఉన్నవారు నిర్మించుకునే ఇళ్లు నిర్ధారిత డిజైన్‌లో ఉండాలంటే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. కొందరు ఉమ్మడి కుటుంబంగా ఒకే ఇంట్లో ఉంటున్నారు. అందులో పెళ్లిళ్లు అయినవారు కొత్తగా ఇళ్లకు దరఖాస్తు చేసుకునే వీలుంది. వారు ఉంటున్న ఇంటికి ఆనుకుని ఉండే ఖాళీస్థలాల్లో ఇళ్లను నిర్మించుకుంటారు. అలాంటి ఖాళీ స్థలం ఆకృతి, అధికారులు సిద్ధం చేసే డిజైన్ ప్రకారం ఇల్లు నిర్మించేందుకు అనుకూలంగా ఉండకపోవచ్చనే సందేహాలు ఉన్నాయి. ఈ అంశంలో త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అమరుల కుటుంబాలకు ముందుగానే ప్లాట్లు తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు 250 చదరపు గజాల చొప్పున ప్లాట్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అదే స్థలాల్లో వారికి ఇళ్లను కూడా నిర్మించి ఇవ్వనున్నారు. ఇందిరమ్మ లబ్ధిదారుల్లో సొంత జాగా లేనివారికి పట్టాలు ఇచ్చేందుకు కాస్త సమయం తీసుకున్నా.. అమరుల కుటుంబాలకు మాత్రం వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే జాబితా రూపకల్పన, భూసేకరణ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించి.. 2004– 2014 మధ్య ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించి దాదాపు 19 లక్షల ఇళ్లను నిర్మించారు. మళ్లీ అధికారంలోకి వస్తే అదే తరహాలో ఇళ్లను నిర్మిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. గెలిచి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కసరత్తు ప్రారంభించింది. అయితే గత సర్కారు ఎన్నికల ముందు స్వీకరించిన గృహలక్ష్మి దరఖాస్తులను తిరస్కరించాలని ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలోనే పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వాటిని పరిశీలించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనున్నారు. -
మాకు రేషన్ కార్డు రాక పదేళ్లయింది!
నల్లగొండ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో నూతన రేషన్ కార్డులపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలోనే రేషన్ కార్డులను ఇచ్చింది. ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలంలో ఒక్క కార్డు కూడా ముద్రించి ఇవ్వలేదు. కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో అప్పటికే ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకున్న కొందరికి మాత్రమే ఫుడ్ సెక్యూరిటీ కార్డులను ఇచ్చింది. ఆ తర్వాత రేషన్ కార్డుల జారీ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న కొత్తవారితోపాటు పిల్లల పేర్లు కార్డులో నమోదు చేయించుకునేందుకు వేలాది మంది ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన అసెంబ్లీలో ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రస్తుతం కాంగ్రెస్సే అధికారంలోకి రావడం, పౌరసరఫరాల శాఖ మంత్రిగా జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి తాజాగా మంగళవారం ఆ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడంతో కొత్త దరఖాస్తుదారులతోపాటు పాతవారు కూడా ఆనందపడుతున్నారు. 4.66లక్షల కార్డులు జిల్లాలో మొత్తం 4,66,180 రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో పాతవాటితోపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఫుడ్‌సెక్యూరిటీ కార్డులు కూడా ఉన్నాయి. కార్డుదారులందరికీ ప్రభుత్వం ప్రతినెలా 6 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం అందిస్తోంది. ఒక్క బియ్యం తప్ప ఎలాంటి సరుకులు అందడం లేదు. అయితే జనాభా కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయన్న కారణంతో కార్డుల తొలగింపునకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేయడం వల్ల చాలా మంది అనర్హులకు కార్డులు తొలగిపోయాయి. అలాగే అనర్హులు ఉంటే కార్డును స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని కలెక్టరేట్‌తో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక బాక్సులను ఏర్పాటు చేయడంతో చాలామంది అప్పగించడంతో చాలావరకు కార్డులు తగ్గాయి కానీ, అర్హులైన వారందరికీ ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు ముదిరంచి ఇవ్వలేదు. పదేళ్లయినా రేషన్ కార్డు రాలే.. నాకు పదేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు రాలేదు. ఇప్పడు నాకు ఇద్దరు కొడుకులు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో చెయ్యి తొలగించారు. రేషన్ కార్డు లేకపోవడంతో ఆరోగ్యశ్రీ వంటి పథకం కింద వైద్యం చేయించుకోలేక పోతున్నాను. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామన్నందుకు సంతోషంగా ఉంది. – గుండగోని రాజు, కట్టంగూర్ రెండేళ్ల క్రితం 11,950 కార్డులు జారీ.. రెండేళ్ల క్రితం హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన అవకాశం మేరకు జిల్లాలో 22వేల మంది కొత్త రేషన్‌కార్డుల కోసం జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్లో 22వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో వివిధ కారణాలతో కొందరిని అనర్హులను తొలగించిన ప్రభుత్వం కేవలం11,950 మందికే ఫుడ్ సెక్యూరిటీ కార్డులు జారీచేసింది. అనంతరం కొత్త దరఖాస్తుల ఆహ్వానానికి ఓపెన్ చేసిన ప్రత్యేక సైట్‌ను బంద్ చేయడంతో దరఖాస్తులు చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకొని కార్డులురాని కుటుంబాలు ప్రస్తుతం 6,450 ఉన్నాయి. జిల్లాలో ఇంకా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు లక్ష కుటుంబాలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. -
తెలంగాణ మహిళలకే ఉచిత బస్సు సౌకర్యం..త్వరలో స్మార్ట్ కార్డులు జారీ
-
నాన్ టాక్స్ రెవెన్యూపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్
-
తెలంగాణ: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ అయ్యారు. అదే విధంగా వెయిటింగ్లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది ప్రభుత్వం. ఈ బదిలీలు, పోస్టింగుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 మంది ఐఏఎస్ అధికారులు నూతన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆర్థికశాఖ జాయింట్ సెక్రటరీగా కె. హరిత భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాంక ములుగు జిల్లా కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి టూరిజం కల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్‌గా కొర్ర లక్ష్మీ టూరిజం డైరెక్టర్‌గా కె. నిఖిల ఆయుష్ డైరెక్టర్‌గా హరిచందన సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్‌ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎమ్సీఆర్ హెచ్ఆర్డీ) డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్, ఆయుష్ డైరెక్టర్‌గా దాసరి హరిచందన, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య నియమితులయ్యారు. హైదరాబాద్ కలెక్టర్‌గా అనుదీప్ దురిశెట్టి నియమించారు. ఇక తెలంగాణ స్టేట్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్, సెర్ప్ సీఈవోగా పాట్రు గౌతమ్, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్ నికోలస్, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా మంద మకరందు, ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా ముజమిల్ ఖాన్, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా కె. హరితను నియమించారు. చదవండి: కవిత, కేటీఆర్‌పై సుఖేష్ సంచలన ఆరోపణలు, గవర్నర్‌కు మరో లేఖ హస్త కళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా అలగు వర్షిణి, క్రీడల డైరెక్టర్‌గా కొర్రా లక్ష్మి, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్‌గా హైమావతి, పర్యాటక శాఖ డైరెక్టర్‌గా కే నిఖిల, వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శిగా సత్య శారదాదేవి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్‌గా స్నేహ శబారిష్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ప్రియాంక ఆల, మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్‌గా వెంకటేశ్ ధోత్రే నియమితులయ్యారు. అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఉన్న కే స్వర్ణలతను జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి బదిలీ చేశారు. అభిలాష అభినవ్‌ను ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌గా, కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా మను చౌదరిని, టీఎస్ దివాకరను జగిత్యాల అదనపు కలెక్టర్‌గా నియమించారు. నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్‌గా కుమార్ దీపక్, పెద్దపల్లి అదనపు కలెక్టర్‌గా చెక్క ప్రియాంక, కరీంనగర్ అదనపు కలెక్టర్‌గా జల్దా అరుణశ్రీ, సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా బడుగు చంద్రశేఖర్, రంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా ప్రతిమా సింగ్, సిద్దిపేట అదనపు కలెక్టర్‌గా గరిమా అగర్వాల్ నియమితులయ్యారు. -
మన ఊరు.. తడ‘బడి’!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రాథమిక విద్య అనేది హక్కు మాత్రమే కాదు. పేదల జీవితాల్లో చీకటిని శాశ్వతంగా తొలగించే ఏకైక సాధనం. సమాజ ఆర్థికాభివృద్ధికి శక్తివంతమైన చోదకం కూడా. అందువల్ల ప్రాథమిక దశలో మంచి అభ్యాసన కోసం చక్కటి పాఠశాల వాతావరణం, అన్నిరకాల మౌలిక సదుపాయాల ఏర్పాటు అత్యంత అవశ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల రూపురేఖలు మార్చేలా ‘మన ఊరు – మనబడి’కి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని 26,195 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రూ.7,289 కోట్ల వ్యయంతో దీనిని ప్రారంభించింది. కానీ ఈ పథకం తొలి ఏడాదిలోనే తడబడుతోంది. నిధుల కొరతతో వెనకబడి పోతోంది. మూడు దశల్లో మొత్తం అన్ని పాఠశాలలను సకల హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశ కింద 9,058 పాఠశాలలను ఎంపిక చేయగా, జూన్ 12తో గడువు ముగిసినా 7 వేలకు పైగా పాఠశాలల్లో పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. చాలా పాఠశాలల్లో పనులు సుదీర్ఘంగా సాగుతుండగా, అనేకచోట్ల అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొన్నిచోట్ల చెట్ల కింద, శిథిల భవనాల్లో పాఠాలు వినాల్సిన పరిస్థితి నెలకొంది. అన్ని హంగులతో ఆకర్షణీయంగా.. మంచినీళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, కిచెన్ షెడ్లు, డైనింగ్ హాళ్ల ఏర్పాటుతో పాటు కొత్త క్లాస్‌రూంల నిర్మాణం, డిజిటల్ బోర్డు లు, పాఠశాల అంతా ఆకర్షణీయ మైన రంగులు లక్ష్యంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఇందుకోసం ప్రభుత్వ నిధుల్ని కేటాయించడమే కాకుండా పూర్వ విద్యార్థులు, కార్పొరేట్ సంస్థల నుండి కూడా విరాళాలు సేకరించాలని నిర్ణయించారు. కోటి రూపాయలకు పైబడి ఇస్తే పాఠశాలకు, రూ.10 లక్షలు ఇస్తే ఒక గదికి వారు సూచించే పేరును పెట్టాలని నిర్ణయించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల ఆధ్వర్యంలో పనులను ప్రారంభించారు. కానీ దాతల నుండి ఆశించిన స్పందన లేకపోవటం, ప్రభుత్వం నుండి నిధులు ఆగిపోవటంతో పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి (టి) గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ‘మన ఊరు– మనబడి’ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పాఠశాలలో శిథిలావస్థకు చేరిన గదులను తొలగించి నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు. దీంతో సరిపడా గదులు లేక విద్యార్థులను ఉపాధ్యాయులు ఆవరణలోని చెట్ల కింద కూర్చోపెట్టి పాఠాలు బోధిస్తున్నారు. ఇదీ లెక్క.. ♦ 2025 నాటికి అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పూర్తి చేసి, 2030 నాటికి రాష్ట్రంలో 100% అక్షరాస్యత సాధించాలన్నది లక్ష్యం. కానీ ఇప్పు డు రాష్ట్ర సగటు అక్షరాస్యత 73.3 శాతమే. ఇక మహిళల్లో అక్షరాస్యత 64.8 శాతమే. ♦ రాష్ట్రంలో మొత్తం 62.29 లక్షల మంది విద్యార్థులుండగా అందులో అత్యధికం ప్రైవేటు పాఠశాలల్లోనే చదువుతున్నారు. 50.23 శాతం ప్రైవేటులో, 49.77 శాతం ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. ♦ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారిలో 49.5% వెనకబడిన తరగతులు (బీసీ), 22.4% జనరల్ కేటగిరి, 17.5 శాతం ఎస్సీలు, 10.6 శాతం గిరిజనులు ఉన్నారు. ♦ ప్రభుత్వ పాఠశాలలు అత్యధికంగా నల్లగొండ జిల్లాలో, అతి తక్కువగా ములుగు జిల్లాలో ఉన్నాయి. ప్రైవేటు పాఠశాలలు అత్యధికంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఉన్నాయి. తక్కువ నిధులిస్తోంది మన రాష్ట్రమే రాజ్యాంగంలోని ఆరి్టకల్ 21 (ఎ) మేరకు విద్య అనేది ప్రాథమిక హక్కు. 6 నుండి 12 ఏళ్ల వరకు తప్పనిసరి విద్య అందించాలని రాజ్యాంగం చెబుతోంది. కానీ తెలంగాణలో విద్య అప్రాదాన్య సబ్జెక్ట్ అయింది. దీంతో పేదలు, వారి పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతోంది. దేశంలో విద్యకు అతి తక్కువగా నిధులు కేటాయిస్తున్న సర్కార్ మనదే. విద్య విషయంలో ప్రజల్లోనూ ప్రశ్నించే తత్వం పెరగాలి. – జస్టిస్ చంద్రకుమార్ ఆశించిన స్థాయిలో లేదు.. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా ప్రత్యేక పద్ధతుల్లో, తగిన మౌలిక సదుపాయాలతో విద్యా బోధన చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ముఖ్యంగా పేదలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడలేదు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ శాంతాసిన్హా. ఎంవీ ఫౌండేషన్ -
ధరణి పోర్టల్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
హైదరాబాద్‌లో సీ4ఐఆర్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం ప్రారంభమైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశం తొలిరోజే తెలంగాణ ప్రభుత్వం కీలక విజయం సాధించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల కార్యకలాపాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ అడుగు పెడుతోంది. సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్)కు చెందిన సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గన్స్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు. ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అధ్యక్షుడు బోర్జ్ బ్రెందే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవశాస్త్రాలు (లైఫ్ సైన్సెస్), ఆరోగ్య సంరక్షణ అంశాలపై ఈ కేంద్రం అధ్యయనం చేస్తుంది. భారత్‌లో సీ4ఐఆర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి. తెలంగాణ అనుకూలతలు, సత్తాకు నిదర్శనం: కేటీఆర్ లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, సత్తాకు సీ4ఐఆర్ కేంద్రం ఏర్పాటు నిదర్శనమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఒప్పంద కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, లైఫ్ సైన్సెస్ రంగం అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే ఈ సెంటర్ ఏర్పాటు సాధ్యమైందన్నారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో ఉన్న అవకాశాలను భారత్ అందిపుచ్చుకునేందుకు ఈ కేంద్రం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధి కల్పనలో హైదరాబాద్ సీ4ఐఆర్ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెందే అన్నారు. సీ4ఐఆర్ ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఇండియాను గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చేందుకు తెలంగాణ నాయకత్వం వహిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ డాక్టర్ శ్యామ్ బిషెన్ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న మార్పులు, రోగుల సౌకర్యాలను మెరుగు పరచడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. -
తెలంగాణ సర్కార్‌కు ఎన్జీటీ షాక్!
సాక్షి, అమరావతి: పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలుపుదల చేయాలని 2021, అక్టోబర్ 29న జారీచేసిన ఆదేశాలను ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించిన తెలంగాణ సర్కార్‌పై గురువారం జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. యథేచ్ఛగా పనులు చేయడంవల్ల పర్యావరణానికి అపారనష్టం వాటిల్లిందని తేల్చింది. దీంతో ఈ రెండు ఎత్తిపోతల పథకాల వ్యయంలో 1.5 శాతం చొప్పున మొత్తం రూ.620.85 కోట్లను జరిమానాగా తెలంగాణ సర్కార్‌కు విధించింది. అంతేకాక.. చట్టాలను అమలుచేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా వాటిని ఉల్లంఘిస్తున్నందున అదనంగా మరో రూ.300 కోట్లు జరిమానాగా చెల్లించాలని ఆదేశించింది. ఇలా మొత్తం రూ.920.85 కోట్లను మూణ్నెళ్లలోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వద్ద డిపాజిట్ చేయాలని స్పష్టంచేసింది. తెలంగాణ సర్కార్ జరిమానాగా చెల్లించే రూ.920.85 కోట్లతో నమామి గంగే ప్రాజెక్టు తరహాలో కృష్ణా నదీ పరిరక్షణ చర్యలు చేపట్టాలని కృష్ణా బోర్డును ఆదేశించింది. అలాగే, పర్యావరణ అనుమతి తీసుకునే వరకూ పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను కొనసాగించకూడదని తెలంగాణ సర్కార్ తేల్చిచెప్పింది. ఆ రెండు ఎత్తిపోతల డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక)లను కృష్ణా బోర్డుకు పంపి, సీడబ్ల్యూసీ నుంచి అనుమతి తీసుకుని, అపెక్స్ కౌన్సిల్ మంజూరు చేశాకే వాటి పనులు చేపట్టాలని స్పష్టంచేసింది. ఈ మేరకు గురువారం ఎన్జీటీ తుది తీర్పు ఇచ్చింది. వివాదం నేపథ్యం ఇదీ.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 1.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 90 టీఎంసీలు తరలించేలా రూ.35,200 కోట్ల వ్యయంతో పాలమూరు–రంగారెడ్డి.. రోజుకు 0.5 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 30 టీఎంసీలు తరలించేలా డిండి ఎత్తిపోతలను రూ.6,190 కోట్ల వ్యయంతో 2015, జూన్ 10న తెలంగాణ సర్కార్ చేపట్టింది. పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన ఈ రెండు ఎత్తిపోతలవల్ల పర్యావరణం దెబ్బతింటోందని, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన జలాలు దక్కవని.. దీనివల్ల ఆయకట్టులో పర్యావరణం దెబ్బతింటుందని ఏపీకి చెందిన రైతులు 2021లో ఎన్జీటీ (చెన్నె బెంచ్)ను ఆశ్రయించారు. ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులతో జతకలిసింది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 2060 (పునరుత్పత్తి జలాలతో కలిపి 2130) టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. ఉమ్మడి రాష్ట్రానికి 800 టీఎంసీలు (పునరుత్పత్తితో కలిపి 811) టీఎంసీలు కేటాయించిందని ఎన్జీటికి ఏపీ ప్రభుత్వం వివరించింది. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలకు నీటి కేటాయింపుల్లేవని.. వాటి ద్వారా 120 టీఎంసీలను తెలంగాణ సర్కార్ తరలిస్తే.. శ్రీశైలం, సాగర్‌పై ఆధారపడ్డ ఆయకట్టుతోపాటు కృష్ణా డెల్టా కూడా నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతుందని, ఇది పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీస్తుందని వాదించింది. దీనితో ఏకీభవించిన ఎన్జీటీ.. తక్షణమే పనులు నిలుపుదల చేయాలని 2021, అక్టోబర్ 29న తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. ఎన్జీటీ ఉత్తర్వులు తెలంగాణ బేఖాతరు కానీ, ఎన్జీటీ ఉత్తర్వులను ఉల్లంఘించి పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులను తెలంగాణ సర్కార్ కొనసాగించింది. దాదాపు 90 శాతం పనులు పూర్తిచేసింది. ఇదే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రైతులు ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిజానిజాలను నిర్ధారించడానికి కృష్ణా బోర్డు నేతృత్వంలో కమిటీని ఎన్జీటీ నియమించింది. క్షేత్రస్థాయిలో ఆ రెండు ఎత్తిపోతల పథకాలను పరిశీలించిన కమిటీ.. ఎన్జీటీ ఉత్తర్వులను తెలంగాణ సర్కార్ ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించినట్లు తేల్చింది. ఆ మేరకు ఎన్జీటీకి నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, రైతులు, కేంద్ర ప్రభుత్వం, కృష్ణా బోర్డు వాదనలను విన్న జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగస్టు 17న తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఆ తీర్పును గురువారం వెల్లడించింది. -
రూ.6200 కోట్లతో ‘కాపిటాలాండ్’
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ టెక్ పార్క్ (ఐటీపీహెచ్)లో డేటా సెంటర్ వృద్ధికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, కాపిటాలాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ (క్లైంట్) నడుమ మంగళవారం పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. 2.50లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే ఈ డేటా సెంటర్ 36 మెగా వాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తొలిదశలో రూ.1200 కోట్ల అంచనా పెట్టుబడితో వృద్ధి చేసే ఈ డేటా సెంటర్ వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో కార్యకలాపాలు ప్రారంభిస్తుంది. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందంపై ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, క్లైంట్ ప్రతినిధులు సంతకాలు చేశారు. ఆధునిక సాంకేతికతతో అభివృద్ధి చేసే ఈ డేటా సెంటర్లో కూలింగ్, భద్రత వంటి ఆధునిక సౌకర్యాలతో పాటు ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్‌ను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేసి ఆరు లక్షల చదరపు అడుగులకు విస్తరిస్తామని, రెండో దశలో భాగంగా మరో రూ.5వేల కోట్ల పెట్టుబడి పెడుతామని క్లైంట్ వెల్లడించింది. కేవలం డేటా సెంటర్ వృద్ధికే పరిమితం కాకుండా క్లైంట్ లాజిస్టిక్స్, సౌర విద్యుత్ ప్లాంట్ల వంటి మౌలిక వసతుల రంగంలోనూ తన కార్యకలాపాలను విస్తరిస్తామని వెల్లడించింది. డేటా సెంటర్లలో హైదరాబాద్ వృద్ది భారత్‌లో డేటా సెంటర్ల రంగంలో హైదరాబాద్ అతివేగంగా వృద్ధి చెందుతోందని మంత్రి కేటీ రామారావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాపిటాలాండ్‌తో కేవలం డేటా సెంటర్ల రంగంలోనే కాకుండా ఇతర మౌలిక వసతుల కల్పన రంగంలోనూ తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందన్నారు. కాపిటాలాండ్ వచ్చే ఐదేళ్లలో ఆఫీస్ స్పేస్‌ను రెట్టింపు చేయడం హైదరాబాద్ ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని కేటీఆర్ అన్నారు. యూరోప్, ఆసియా ఖండంలో 25 డేటా సెంటర్లను కలిగిన క్లైంట్ భారత్‌లో రెండో డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో వృద్ధి చేస్తుందని చెప్పారు. రెండు దశాబ్దాలుగా హైదరాబాద్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న క్లైంట్కు ఇప్పటికే స్థానికంగా ఐటీపీహెచ్, సైబర్ పెరల్, అవెన్స్ పేరిట మూడు బిజినెస్ పార్కులు ఉన్నాయని సంస్థ సీఈఓ సంజీవ్ దాస్‌గుప్తా వెల్లడించారు. 2.8 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు బిజినెస్ పార్కులు 30వేల మందికి ఉపాధి కల్పిస్తున్న 70 అంతర్జాతీయ సంస్థల అవసరాలు తీరుస్తున్నాయని చెప్పారు. యూరోప్, ఆసియా దేశాల్లో 500 మెగావాట్ల సామర్ద్యం కలిగిన 25 డేటా సెంటర్లను క్లైంట్ అభివృద్ధి చేసిందన్నారు. -
తెలంగాణలో అమర రాజా బ్యాటరీ ప్లాంటు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అమర రాజా బ్యాటరీస్(ఏఆర్‌బీఎల్) తెలంగాణ లిథియం–అయాన్ బ్యాటరీల పరిశోధన, తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. వచ్చే పదేళ్లలో వీటిపై రూ. 9,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో కంపెనీ శుక్రవారం అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. దీని ప్రకారం మహబూబ్‌నగర్ జిల్లాలో 16 గిగావాట్‌అవర్ (జీడబ్ల్యూహెచ్) అంతిమ సామర్థ్యంతో లిథియం సెల్ గిగాఫ్యాక్టరీ, 5 జీడబ్ల్యూహెచ్ వరకూ సామర్థ్యంతో బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయనుంది. ‘లిథియం–అయాన్ సెల్ తయారీ రంగానికి సంబంధించి దేశంలోనే అతి పెద్ద పెట్టుబడుల్లో ఇది ఒకటి. తెలంగాణలో గిగాఫ్యాక్టరీ ఏర్పాటు కావడమనేది.. రాష్ట్రం ఈవీల తయారీ హబ్‌గా ఎదిగేందుకు, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి సారథ్యం వహించాలన్న ఆకాంక్షను సాధించేందుకు దోహదపడగలదు‘ అని తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ‘అమర రాజా ఈ–హబ్ పేరిట అధునాతన పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. అని ఈ సందర్భంగా అమర రాజా బ్యాటరీస్ సీఎండీ జయదేవ్ గల్లా ఈ సందర్భంగా తెలిపారు. ఏపీకి కట్టుబడి ఉన్నాం.. ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు తగ్గించుకోవడం లేదని, రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని జయదేవ్ చెప్పారు. తిరుపతి, చిత్తూరు సైట్లు గరిష్ట స్థాయికి చేరాయని, కీలకమైన ఉత్తరాది మార్కెట్‌కు లాజిస్టిక్స్‌పరంగా వెసులుబాటు ఉండే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నామన్నారు. భారత ఉపఖండం పరిస్థితులకు అనువైన లిథియం–అయాన్ బ్యాటరీలపై చాలా కాలంగా పని చేస్తున్నామని, ఇప్పటికే కొన్ని ద్వి, త్రిచక్ర వాహనాల తయారీ సంస్థలకు లిథియం బ్యాటరీ ప్యాక్‌లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సంస్థ న్యూ ఎనర్జీ బిజినెస్ ఈడీ విక్రమాదిత్య గౌరినేని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
మునుగోడు మాజీ ఆర్వో సస్పెన్షన్.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఎంవీ జగన్నాథరావును తక్ష ణమే సస్పెండ్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. శుక్రవారం ఉదయం 11గంటల్లోగా సస్పెన్షన్ ఉత్తర్వులను పంపాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని కోరింది. రిటర్నింగ్ అధికారికి సరైన భద్రత కల్పించడంలో విఫలమైనందుకు గానూ స్థానిక డీఎస్పీపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో యుగ తులసి పార్టీ అభ్యర్థికి కేటా యించిన రోడ్డు రోలర్ గుర్తును మార్చి బేబీ వాకర్ గుర్తును కేటాయించడా న్ని కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తీవ్రంగా పరిగణించిన విషయం తెలి సిందే. ఈ వ్యవహారంలో బాధ్యుడైన రిటర్నింగ్ అధికారి(ఆర్వో) జగన్నాథ రావుపై వేటు వేసి ఆస్థానంలో మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌ను ఆర్వో గా నియమించింది. యుగ తులసి పార్టీ అభ్యర్థికి తిరిగి రోడ్డు రోలర్‌ను కేటాయించింది. తాజాగా ఈ ఉదంతంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన అనంతరం జగన్నాథరావును సస్పెండ్ చేయాలని నిర్ణయించింది. (చదవండి: ఉచితాలతో ఓటర్లను ఆధారపడేలా చేయొద్దు) మునుగోడు ఉపఎన్నికను రద్దు చేయండి భారత ఎన్నికల చరిత్రలోనే అతి ఖరీదైన ఎన్నిక మును గోడు ఉపఎన్నిక అని, అక్కడ జరుగుతున్న అక్రమాలు, డబ్బు, మద్యం పంపిణీని అరికట్టి ఉపఎన్నికను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు గోనెల ప్రకాశ్‌రావు వినతి పత్రాలు పంపారు. మునుగోడులో అక్టోబర్ నెలలో దాదాపు రూ.132 కోట్ల మద్యం ఏరులైపారిందని, టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ మునుగోడులో ఎన్నికల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయని వివరించారు. భారత రాజ్యాంగంలోని ఆరి్టకల్ 324 ప్రకారం ఎన్నికల రద్దు చేసే అధికారం ఎన్నికల సంఘంకు ఉందని గుర్తు చేశారు. (చదవండి: మునుగోడు సైన్మా.. టక్కర్లు, ట్విస్ట్‌లు) -
Telangana: ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాల్లో ఫీజులను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. అడ్మిషన్, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్ఆర్సీ) సిఫార్సుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ తెలంగాణ సర్కార్ బుధవారం జీవో జారీ చేసింది. అదే విధంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస రుసుమును రూ.45వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ ఫీజు రూ. లక్ష దాటింది. ఎంజీఐటీ రూ.1.60లక్షలు, సీవీఆర్ రూ.1.50లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్, వాసవీ రూ.1.40లక్షలుగా నిర్ణయించింది. మూడేళ్లపాటు కొత్త ఇంజనీరింగ్ ఫీజులు అమల్లో ఉండనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అంతేగాక ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఫీజులు సైతం ప్రభుత్వం పెంచింది. ఎంబీయే, ఎంసీయే కనీస వార్షిక ఫీజు రూ.27వేలుగా.. ఎంటెక్ కనీస వార్షిక రుసుము రూ.57వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది. చదవండి: మందుకొట్టి.. గొడ్డలి పట్టి కానిస్టేబుల్‌పై దాడి -
గోపాలమిత్రలకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక శాఖ పరిధిలో పనిచేస్తున్న గోపాలమిత్రలకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న నెలవారీ వేతనానికి అదనంగా 30 శాతం పెంచుతున్నట్టు వెల్లడించింది. గోపాలమిత్రలకు రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరహాలోనే 30 శాతం వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీచేశామని, ప్రస్తుతం నెలకు వస్తున్న రూ.8,500కు తోడు పెంచిన 30 శాతం (రూ.2550) కలిపి రూ.11,050 చెల్లిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి అందుబాటులో ఉంటూ పాడిగేదెలకు కృత్రిమ గర్భధారణ, వ్యాక్సినేషన్, నట్టల నివారణ మందుల పంపిణీ లాంటి కార్యక్రమాల అమలులో సేవలందిస్తున్న గోపాల మిత్రలను ప్రభుత్వ గుర్తించి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణలో గోపాలమిత్రలకు ఇస్తున్న వేతనాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తాజా పెంపుతో 1,530 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. (చదవండి: ఉపఎన్నికలో ఓ గ్రామ ఇన్చార్జిగా కేసీఆర్.. ఏ గ్రామానికి అంటే?) -
పోలవరంతో భద్రాద్రి భద్రమే
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలానికి ఎలాంటి ముంపు ముప్పు ఉండదని ఐఐటీ–హైదరాబాద్ తేల్చి చెప్పింది. పోలవరాన్ని కట్టాక భద్రాచలం వద్ద పెరిగే గోదావరి నీటి మట్టం కేవలం గోరంతేనని (2 సెంటీమీటర్లు) స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాను స్వయంగా చేయించిన ఈ అధ్యయనంలోనే పోలవరం ద్వారా భద్రాచలానికి ఏ మాత్రం ముప్పు లేదని స్పష్టం కావడం గమనార్హం. వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేసేలా పోలవరం గేట్లను సమర్థంగా నిర్వహిస్తే బ్యాక్ వాటర్ ప్రభావం భద్రాచలం సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాలపై ఏమాత్రం ఉండదని తెలిపింది. పోలవరం వద్ద గోదావరి గరిష్ట వరద, బ్యాక్ వాటర్ ప్రభావంపై తెలంగాణ నీటిపారుదల శాఖ 2017లో ఐఐటీ–హైదరాబాద్‌తో అధ్యయనం నిర్వహించింది. గోదావరి పరీవాహక ప్రాంతంలో సీడబ్ల్యూసీ, తెలంగాణ జలవనరుల విభాగం లెక్కల ప్రకారం వరద ప్రవాహాలు, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ నమోదు చేసిన వరద ప్రవాహాలను అధ్యయనం చేసేందుకు ఐఐటీ–హైదరాబాద్‌కు తెలంగాణ ప్రభుత్వం అందజేసింది. ముంపు ముప్పు ఉత్తదే.. ధవళేశ్వరం వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నమోదు చేసిన రికార్డులు కచ్చితంగా ఉండటంతో వాటిని పరిగణలోకి తీసుకుని పోలవరం వద్ద వెయ్యేళ్లకు, పది వేల ఏళ్లకు ఒకసారి గరిష్టంగా వచ్చే వరదను లెక్కట్టిన ఐఐటీ–హైదరాబాద్ బ్యాక్ వాటర్ ప్రభావంపై సమగ్రంగా అధ్యయనం చేసింది. అందులో వెల్లడైన అంశాలివీ.. ► పోలవరంలో 45.72 మీటర్లలో 194.6 టీఎంసీలను నిల్వ చేస్తే 637 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ముంపునకు గురవుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 601, ఒడిశాలో 12, చత్తీస్‌గఢ్‌లో 24 చ.కి.మీ. భూభాగం ఉంది. ఆంధ్రప్రదేశ్ 222 రెవెన్యూ గ్రామాలు ముంపునకు గురవుతుండగా చత్తీస్‌గఢ్‌లో పది, ఒడిశాలో ఏడు రెవెన్యూ గ్రామాలపై ముంపు ప్రభావం ఉంటుంది. ► గోదావరిలో గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 57 మీటర్లు ఉంటే.. కట్టాక 57.02 మీటర్లు మాత్రమే ఉంటుంది. ► గోదావరి చరిత్రలో 1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి గరిష్టంగా 35,06,338 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ► గోదావరి గరిష్ట వరద ప్రవాహాలను పరిగణలోకి తీసుకుంటే వెయ్యేళ్లకు ఒకసారి గరిష్టంగా 39.72 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 57.7 మీటర్లు ఉంటే.. నిర్మాణ పూర్తయ్యాక 57.77 మీటర్లు ఉంటుంది. ► పది వేల సంవత్సరాలకు ఒకసారి గోదావరికి గరిష్టంగా 44.61 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. ఆ స్థాయిలో వరద వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం పోలవరం కట్టక ముందు 61.41 మీటర్లు ఉంటే.. నిర్మాణ పూర్తయ్యాక 61.43 మీటర్లు ఉంటుంది. ► కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ మేరకు గోదావరికి గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా విడుదల చేసేలా పోలవరంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్‌వే నిర్మిస్తున్నారు. పోలవరం డిజైన్ మేరకు అంటే గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద గోదావరికి వచ్చినప్పుడు భద్రాచలం వద్ద నీటి మట్టం ప్రాజెక్టు కట్టక ముందు 61.77 మీటర్లు ఉంటే కట్టాక 61.79 మీటర్లు ఉంటుంది. గేట్ల నిర్వహణే కీలకం పోలవరం ప్రాజెక్టు గేట్లను సమర్థంగా నిర్వహిస్తే బ్యాక్ వాటర్ ప్రభావం కనిష్ట స్థాయిలో ఉంటుందని ఐఐటీ–హైదరాబాద్ తేల్చింది. బ్యాక్ వాటర్ ప్రభావం లేకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించింది. ► పోలవరంలో నీటి నిల్వలు.. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వరదను దిగువకు విడుదల చేసేలా సమర్థంగా గేట్లను నిర్వహించాలి. ► పోలవరం జలవిస్తరణ ప్రాంతంలో నదీ గర్భంలో ఎప్పటికప్పుడు ఇసుక మేటలను తొలగించాలి. దీనివల్ల నీటి మట్టం పెరగదు. ► ముంపును నివారించాలంటే ఎగువన కాళేశ్వరం, మేడిగడ్డ లాంటి ప్రాంతాల్లో బ్యారేజ్‌లు నిర్మించాలి. ► పోలవరం డ్యామ్ నిర్మించడం వల్ల తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భూఉపరితల మట్టం కంటే నీటి ఉపరితల మట్టం రెండు సెంటీమీటర్ల మేర పెరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రాధాన్యత క్రమంలో పది దశల్లో గోదావరికి ఇరువైపులా 124.55 కి.మీ. పొడవున కరకట్టలు నిర్మించాలి. ఇందుకు రూ.996.4 కోట్ల వ్యయం అవుతుంది. -
ఏపీ బకాయి పడిందంటూ కేసీఆర్ కొత్త పంచాయితీ.. ఆయన లెక్కలు సరైనవేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొత్త పంచాయితీ పెట్టారు. ఎపి ప్రభుత్వమే తెలంగాణకు రూ.17,828 కోట్లు ఇవ్వాలన్న వివాదాన్ని తెరపైకి తెచ్చారు. ఎపి నుంచి విద్యుత్ తీసుకున్నందుకు గాను తెలంగాణ ఇవ్వవలసిన మూడువేల కోట్లు, గత కొన్ని సంవత్సరాలుగా చెల్లించనందుకుగాను వడ్డీ మూడు వేలు , మొత్తం ఆరువేల కోట్లు వెంటనే ఇప్పించాలని కోరుతూ ఎపి ప్రభుత్వం కేంద్రానికి వినతులు ఇస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసినప్పుడు చేసిన విజ్ఞప్తిలో కూడా ఈ అంశం ప్రముఖంగా ఉంది. ఉత్తరప్రత్యుత్తరాల తర్వాత కేంద్రం ఒక నిర్ణయం తీసుకుని ఎపికి ఆరువేల కోట్లు రూపాయలు చెల్లించాలని తెలంగాణను ఆదేశించింది. కెసిఆర్ దానిని వివాదాస్పదం చేస్తున్నారు. తమకే ఎపి రూ.17,828 కోట్లు ఇవ్వాలని, అందులో నుంచి ఈ ఆరువేల కోట్లు మినహాయించుకుని , మిగిలిన మొత్తం తమకు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగానే ఎపి ప్రభుత్వం ఆ మొత్తం ఇవ్వవలసి ఉంటే కచ్చితంగా ఇవ్వాల్సిందే. కాని ఇంతవరకు ఎన్నడూ తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి బాకీ ఉన్నట్లు కేంద్రానికి తెలియచేసినట్లు కనిపించదు. కెసిఆర్ ఇదంతా అధికారిక లెక్క అని చెబుతున్నా, అందుకు తగ్గ ప్రాతిపదిక కూడా అవసరమే. అలాకాకుండా ఎపి ప్రభుత్వానికి బాకీ చెల్లించకుండా ఉండడానికి పోటీగా ఈ లెక్కలు చెబితే అంత అర్దవంతంగా ఉండకపోవచ్చు. ఒక వైపు జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించాలని ఆలోచిస్తున్న కెసిఆర్, తన పొరుగు రాష్ట్రమైన ఎపితోనే సంబంధాలు సజావుగా నడపడం లేదన్న భావన వస్తే అది ఆయనకు రాజకీయంగా నష్టం చేస్తుంది. ఎపి ప్రభుత్వం ఇవ్వవలసినవి అంటూ ఆయన ఇచ్చిన వివరణ లో విద్యుత్ ఉద్యోగుల ట్రస్టు నిధులు ఉన్నాయని, కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తెలంగాణ వాటా ఉందని చెప్పారు. తాను ఎక్కువగా మాట్లాడుతున్నాననే ఎపికి ఆరువేల కోట్లు చెల్లించాలని కేంద్రం ఆదేశించిందని కెసిఆర్ ఆరోపించారు. నిజానికి కేంద్రం ఎప్పుడో ఈ సమస్యను పరిష్కరించి ఉండాల్సింది. ఈ నిర్ణయం చేయడానికి కేంద్రం ఎవరు అని ఆయన ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం. ఒకవేళ కేంద్రం నిర్ణయంలో తప్పు ఉంటే దానిని ఎత్తిచూపవచ్చు. కాని విభజన చట్టం ప్రకారం ఉభయ రాష్ట్రాల మధ్య చర్చల ద్వారా పరిష్కారం కాని అంశాలను కేంద్రమే చొరవ తీసుకుని సాల్వ్ చేయాలని స్పష్టంగా ఉంది. దానిని కెసిఆర్ విస్మరించలేరు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రంలో తెలంగాణకు వాటా ఎలా వస్తుందో తెలియదు. అది నిజమే అయితే తెలంగాణలో ఉన్న కొన్ని పవర్ ప్లాంట్ లలో తమకు వాటా ఇవ్వాలని ఎపి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. అంతకన్నా ముఖ్యం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో ఉన్న వివిధ సంస్థల ఆస్తులు, బ్యాంకులలో ఉన్న నగదు పంపిణీ చేసుకోవలసి ఉన్నా, ఇంతవరకు అవి ఎటూ తెగడం లేదు. దీనివల్ల ఎపికే ఎక్కువ నష్టం జరుగుతుంది. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ ఉన్నందున ఇక్కడి వివిధ సంస్థల ఆస్తులు ఈ ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయి. ఎపి ప్రభుత్వానికి ఆ అవకాశం ఉండదు. వారు తమ వాటా అడగడం తప్ప చేయగలిగింది లేదు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సున్నిత మైన సమస్యలను ముందుగానే పరిష్కరించి విభజన చేసి ఉంటే రెండు ప్రాంతాలకు న్యాయం జరిగేది. అలాకాకపోవడం వల్ల ఆంద్రకు నష్టం జరిగిందని ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు. అలాగే పోలవరం ముంపు మండలాలను ఎపికి కేటాయించడం, సీలేరు హైడల్ ప్రాజెక్టు గురించి కూడా కెసిఆర్ ప్రస్తావించారు. కాని ఆయన ఒక విషయం మర్చిపోతున్నారు. 1956కి ముందు భద్రాచలంతో సహా పోలవరం ముంపు మండల ప్రాంతం అంతా ఆంధ్ర రాష్ట్రంలో భాగంగా ఉండేది. కాకపోతే సదుపాయాల రీత్యా దానిని తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో కలిపారు. అప్పుడు అది ఉమ్మడి రాష్ట్రం కనుక ఇబ్బంది రాలేదు. కాని విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నేపధ్యంలో దానిని పూర్తి చేయాలంటే ఈ ముంపు మండలాలు ఎపిలోనే ఉంచాలన్న ప్రతిపాదన వచ్చింది. దానిని ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించి ఆర్డినెన్స్ జారీచేయించారు. అప్పుడు ఆ పని జరగకపోతే, ప్రస్తుతం రెండు రాష్ట్రాల మద్య తలెత్తున్న పలు వివాదాలలో అది కూడా ఒకటి అయ్యేది. పోలవరం ప్రాజెక్టు ముందుకు కదలడమే కష్టం అయ్యేది. ముందుగా ముంపు మండలాల పరిహారం తదితర సంగతులు తేల్చాలని, అంతవరకు ప్రాజెక్టు ముందుకు తీసుకు వెళ్లడానికి లేదని తెలంగాణ ప్రభుత్వం వాదించి ఉండేదేమో! కేంద్ర ప్రభుత్వంపై కెసిఆర్ ఎంతైనా విరుచుకుపడనివ్వండి. కేంద్రంలో బిజెపిని దేవుడు కూడా కాపడలేరని, నాన్ బిజెపి ప్రభుత్వమే వస్తుందని ఆయన చెప్పనివ్వండి. మంచిదే. ఆయన ప్రధాని హోదాకు వెళితే తెలంగాణ ప్రజలతో పాటు ఆంద్ర ప్రజలు కూడా సంతోషిస్తారు. కాని ఆ ప్రయత్నంలో ఉన్న తరుణంలో కెసిఆర్ ఇలాంటి తగాదాలు పెట్టుకుంటే ఆయనకు రాజకీయంగా నష్టం జరగవచ్చు. ఎపి కి వ్యతిరేకంగా సెంటిమెంటును రెచ్చగొట్టడానికి ఇక ఇవి అంతగా ఉపయోగపడకపోవచ్చు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎపి, తెలంగాణల మధ్య పలు అంశాలలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఆ వాతావరణం లేదు. ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కెసిఆర్ పట్ల గౌరవంగా ఉండే వ్యక్తే. అందువల్ల సీనియర్ నేతగా కెసిఆర్ ఇప్పటికైనా చొరవ తీసుకుని ఉభయ రాష్ట్రాల సమస్యలను ఒక సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోగలిగితే మంచి పేరు వస్తుంది. తద్వారా దేశానికి ఒక మంచి సందేశం అందించినవారు అవుతారు. ఒక జాతీయ నాయకుడిగా కూడా గుర్తింపు పొందుతారు. మరి అది కెసిఆర్ చేతిలోనే ఉంది. -కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ పాత్రికేయులు -
తెలంగాణ కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ దార్శనికతతో రాజ్యాంగంలో ఆర్టికల్-3 పొందుపరచడం ద్వారా మాత్రమే తెలంగాణ నేడు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైందన్నారు. సచివాలయానికి అంబేద్కర్ నామకరణం.. తెలంగాణ ప్రజలకు గర్వకారణమన్నారు. అంబేద్కర్ పేరు సచివాలయానికి పెట్టడం దేశానికి ఆదర్శమని కొనియాడారు. భారత ప్రజలందరికీ అన్ని రంగాల్లో సమాన గౌరవం దక్కాలనే అంబేద్కర్ మహాశయుని తాత్వికతను తెలంగాణ ప్రభుత్వం అందిపుచ్చుకుని ముందుకు సాగుతున్నదన్నారు. పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. దీనిపై తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందన్నారు. త్వరలోనే ప్రధాని మోదీకి లేఖ రాస్తానని వెల్లడించారు. చదవండి: మంత్రి vs సిట్టింగ్ ఎమ్మెల్యే -
రాజాసింగ్ బెయిల్‌పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లో నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గత నెల 25న రాజాసింగ్‌ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ రాజాసింగ్ భార్య ఉషాభాయ్ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని 14, 21 అధికరణాలకు వ్యతిరేకంగా ఆగస్టు 26 నుంచి రాజాసింగ్‌ను అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. పలు కేసుల గురించి చెప్పకుండానే పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రాజాసింగ్‌కు బెయిల్ మంజూరు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఆమె కోరారు. దీనిపై జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ధర్మాసనం విచారణ చేపట్టి.. కౌంటర్ దాఖలు కోసం ప్రభుత్వానికి నాలుగు వారాలు గడువిచ్చింది. విచారణను వాయిదా వేసింది. చదవండి: పాతబస్తీ క్షుద్రపూజల కలకలం -
ఫోర్టిఫైడ్ రైస్‌గా తడిసిన ధాన్యం
సాక్షి, హైదరాబాద్: రైస్‌మిల్లుల్లో తడిసిన ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్ (పౌష్టికాహార బియ్యం)గా రాష్ట్ర ప్రభుత్వం మార్చనుంది. గత యాసంగిలో సేకరించిన 50.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులు, వాటి ఆవరణల్లో నిల్వ చేయగా అకాల వర్షాలకు భారీఎత్తున ధాన్యం తడిసిపోవడం తెలిసిందే. ప్రాథమిక అంచనా మేరకు 4.94 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయిందని తేలింది. ఈ ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేయడం సాధ్యం కానందున పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్‌గా మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆదేశా లిచ్చింది. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్‌కు బదులుగా కొంత మేర ఫోర్టిఫైడ్ రైస్‌ను సెంట్రల్ పూల్ కింద సేకరించేందుకు గతంలోనే ఒప్పుకొంది. రాష్ట్రంలోని కుమురం భీం, ఆదిలాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో పేద గిరిజనులకు రేషన్ బియ్యంగా ఫోర్టిఫైడ్ రైస్‌నే పంపిణీ చేస్తున్నందున తడిసిన ధాన్యాన్ని ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఫోర్టిఫైడ్ రైస్‌గా 5 ఎల్ఎంటీ... రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో గత మూడు సీజన్లకు సంబంధించి 90.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం నిల్వలుగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం లెక్కగట్టింది. అందులో 2020–21 యాసంగికి సంబంధించి 4.86 ఎల్ఎంటీ ఉండగా 2021–22 వానకాలానికి సంబంధించి 35.70 ఎల్ఎంటీ, మొన్నటి యాసంగికి సంబంధించి 50.39 ఎల్ఎంటీ ధాన్యం నిల్వలు ఉన్నాయి. ఈ మూడు సీజన్ల నుంచి 5 లక్షల మెట్రిక్ టన్నుల పారాబాయిల్డ్ ఫోర్టిఫైడ్ రైస్‌ను మిల్లింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 7.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమవగా యాసంగిలో తడిసిన ధాన్యం 4.5 లక్షల మెట్రిక్ టన్నులు పోను మరో 3 లక్షల మెట్రిక్ టన్నులను 2020–21 యాసంగి, 2021–22 వానాకాలం ధాన్యాన్ని ఫోర్టిఫైడ్ రైస్‌గా మిల్లింగ్ చేయాలని పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో తడిసిన ధాన్యం సమస్య కొంతమేర తీరనుంది. చదవండి: అనగనగా హైదరాబాద్.. భాగ్యనగరంలో స్వరాజ్య సమరశంఖం 20 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ కోసం.. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా యాసంగిలో సేకరించిన ధాన్యం నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నుల మేర ఫోర్టిఫైడ్ బియ్యంగా సెంట్రల్ పూల్‌కు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ కేంద్రానికి లేఖ రాయడంతోపాటు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్‌కుమార్‌ను ఢిల్లీకి పంపారు. యాసంగిలో సేకరించిన 50.39 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 34 ఎల్ఎంటీ ముడిబియ్యం ఎఫ్‌సీఐకి ఇవ్వా ల్సి ఉంటుంది. కానీ యాసంగి ధాన్యాన్ని ముడిబియ్యంగా మిల్లింగ్ చేస్తే నూకల శాతమే అధికంగా ఉంటుందని టెస్ట్ మిల్లింగ్ ఫలితాల్లో తేలినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో క్వింటాలు ధాన్యానికి 55 శాతం మాత్రమే బియ్యంగా వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో యాసంగి ధాన్యాన్ని కేంద్రం 20 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ బియ్యంగా తీసుకుంటే సమస్య ఉండదని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే కేంద్రం నుంచి ఇంకా అనుమతులు రాలేదు. ఈ పరిస్థితుల్లో తమకు అవకాశం ఉన్న 5 ఎల్ఎంటీ ఫోర్టిఫైడ్ రైస్ కోసం 4.5 లక్షల మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ముందుగా కేటాయించింది -
‘పోడు’పై తెగని పంచాయితీ!
సాక్షి, హైదరాబాద్: పోడు భూములకు సంబంధించిన పట్టాల పంపిణీకి విపక్షాలు ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో ఈ సమస్య మరోసారి రాష్ట్రంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉన్నా.. ఈ క్రమంలో అనేక సవాళ్లు ముందుకొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పోడు వ్యవసాయం చేస్తున్న రైతుల వివరాల సేకరణ ప్రక్రియలో భాగంగా దరఖాస్తులను స్వీకరించింది. 28 జిల్లాల్లోని 3,041 గ్రామపంచాయతీల పరిధిలో సుమారు 12.60 లక్షల ఎకరాల పోడు భూముల్లో సుమారు 3,95,000 మంది రైతులు వ్యవసాయం చేస్తున్నట్లు తేలింది. ఇందులో 62 శాతం గిరిజనులు, 38% గిరిజనేతరులు ఉన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వ అటవీ హక్కుల చట్టం 2006 ఆధారంగా 2008లో సుమారు 96,600 మందికి 3,08,000 ఎకరాల భూమిపై హక్కు లభించింది. అయితే పోడు వ్యవసాయం చేస్తున్నప్పటికీ కొంతమందికి హక్కులు దక్కలేదు. మరోవైపు మరికొంతమంది కొత్తగా అటవీ భూముల్లో పోడు వ్యవసాయం మొదలుపెట్టడంతో రాష్ట్రంలో పోడు రైతుల సమస్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లోనే ఉండిపోయింది. చట్ట సవరణతోనే సాధ్యం! అటవీ శాఖ భూములపై హక్కులు కల్పించే అటవీ హక్కుల చట్టం– 2006 లో అనేక కఠిన నియమ నిబంధనలు ఉన్నాయి. ఈ నియమ నిబంధనలే సమస్య పరిష్కారానికి ఆటంకంగా మారాయని, ఈ చట్ట సవరణ ద్వారానే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం సాధ్యమనే అభిప్రాయం ఉంది. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13 నాటికి పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు మాత్రమే ఆయా భూములపై హక్కులు కల్పించే అవకాశం ఉంది. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఆ తేదీ నాటికి వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు మాత్రమే హక్కులు కల్పించేందుకు ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. ఇక గిరిజనేతరులు తాము 75 ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటున్నట్లు తగిన ఆధారాలను చూపిస్తే వారికి హక్కులు దక్కేలా అప్పటి ప్రభుత్వం ఈ చట్టాన్ని తయారుచేసింది. అయితే 75 ఏళ్ల పోడుకు సంబంధించి సాక్ష్యాధారాలను సంపాదించే అవకాశాలు లేకపోవడంతో గిరిజనేతరులకు ఈ భూములపై హక్కులు దక్కడం లేదనే అభిప్రాయం గట్టిగా ఉంది. అంతా కేంద్రం చేతిలోనే..! ప్రస్తుతం తెలంగాణలో హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న సుమారు 3,95,000 మందికి ప్రయోజనం కలగాలంటే 2006 నాటి చట్టంలో ఉన్న డిసెంబర్ 2005 కట్ ఆఫ్ తేదీని మార్చాల్సి ఉంటుంది. దీంతో పాటు గిరిజనేతరులకు పోడు హక్కులు దక్కాలంటే, వారు 75 ఏళ్లుగా తాము వ్యవసాయం చేస్తున్నట్లు సాక్ష్యాధారాలను చూపించాలన్న నిబంధనను తొలగించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు అంశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న నేపథ్యంలో..దరఖాస్తులు స్వీకరించినా, అర్హులైన పోడు రైతుల ఎంపిక, క్షేత్రస్థాయిలో పరిశీలనకు అవకాశం లేకుండా పోయిందనే వాదనను రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు వినిపిస్తున్నాయి. మినహాయింపులకు అవకాశం లేదు.. అటవీ హక్కుల చట్టానికి కొన్ని సవరణలు చేసి పోడు రైతుల సమస్యను పరిష్కరించాలని తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఒక లేఖ కూడా రాశారు. అయితే తెలంగాణ సహా ఇతర రాష్ట్రాలు అడుగుతున్నట్టుగా మినహాయింపులు ఇచ్చే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరిస్తూ కేసీఆర్‌కు కేంద్ర మంత్రి అర్జున్ ముండా లేఖ రాశారు. ఒకవేళ రాష్ట్రాలు అడుగుతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వ అటవీ హక్కుల చట్టానికి మినహాయింపులు ఇస్తే, గిరిజనులతో పాటు అటవీ సంరక్షణకు తీవ్ర నష్టం కలుగుతుందని కేంద్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో ‘పోడు’మింగుడు పడని సమస్యగా మారింది. -
తెలంగాణ స్టార్టప్‌ల హబ్.. ప్రపంచంలోనే అతిపెద్దది (ఫొటోలు)
-
స్టార్టప్ గుండె చప్పుడు ‘టీ–హబ్’ డబ్
సాక్షి, హైదరాబాద్: వినూత్న ఆవిష్కరణలకు ఊతమిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ ‘టీ–హబ్’ రెండో దశను సీఎం కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రారంభించనున్నారు. రూ.400 కోట్లతో 3.62 లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించిన ఈ రెండో దశలో.. ఒకే సమయంలో ఏకంగా రెండు వేలకుపైగా స్టార్టప్‌లు కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుండటం గమనార్హం. మంగళవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ మేరకు ఏర్పాట్లను మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, టీ–హబ్ సీఈవో ఎం.శ్రీనివాస్‌రావు సోమవారం పరిశీలించారు. అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ కావడంతో ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. మంగళవారం ఉదయమే సీఎం కేసీఆర్ టీ–హబ్‌ను ప్రారంభిస్తారని భావించినా.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్టార్టప్ రంగ నిపుణులతో సదస్సులు ఉండటంతో సాయంత్రానికి వాయిదా వేసినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇక ప్రారంభోత్సవ కార్యక్రమానికి అడోబ్ చైర్మన్ శంతను నారాయణ్, సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి, స్కైమోర్ వ్యవస్థాపకుడు దేశ్పాండ్, అథేరా వెంచర్స్ ఎండీ కన్వల్ రేఖి తదితరులతోపాటు సిలికాన్ వ్యాలీ ప్రముఖులు, పలు యూనికార్న్‌ల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఈ సందర్భంగా కూ యాప్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, హీరో మోటార్స్, పోంటాక్, వెబ్ 3.0లతో టీ–హబ్ ఎంఓయూలు కుదుర్చుకోనున్నట్టు అధికారులు తెలిపారు. ఉత్తమ స్టార్టప్‌లు, యూనికార్న్‌ల ప్రతినిధులను సన్మానించనున్నట్టు వెల్లడించారు. టీ–హబ్ భవనం లోపలి దృశ్యం, పరిశీలిస్తున్న కేటీఆర్. చిత్రంలో రంజిత్‌రెడ్డి టీ–హబ్ 2.0 ప్రత్యేకతలివీ.. 2015లో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 70 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టీ–హబ్ మొదటి దశ నిర్మించిన విషయం తెలిసిందే. అనూహ్య స్పందన లభించడం, అది విజయవంతం కావడంతో.. మరింత భారీగా టీ–హబ్ రెండో దశ (టీ–హబ్ 2.0)ను రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు. రూ.400 కోట్ల వ్యయంతో 3.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన టీ–హబ్ రెండో దశలో ఏకకాలంలో 4 వేల స్టార్టప్‌లకు అవసరమైన వసతి కల్పించవచ్చు. తొలిదశతో పోలిస్తే ఐదు రెట్లు పెద్దదైన రెండోదశ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా అవతరించనుంది. టీ–హబ్ మొదటిదశలో ప్రాథమిక స్థాయి వసతులు అందుబాటులో ఉండగా.. తాజా రెండో దశలో అత్యాధునిక వసతులు జోడించారు. ‘స్పేసెస్’ అనే కొరియన్ సంస్థ టీ–హబ్ రెండో దశ భవనాన్ని అత్యంత సృజనాత్మకంగా ‘శాండ్ విచ్’ నమూనాలో డిజైన్ చేసింది. పది అంతస్తుల్లో టీ–హబ్ రెండో దశ నిర్మాణం కాగా.. ప్రస్తుతం ఐదు అంతస్తుల్లో కార్యకలాపాలు మొదలుకానున్నాయి. ఈ ఏడాది చివర వరకు అదనంగా నెలకో అంతస్తు చొప్పున వినియోగంలోకి తేనున్నారు. ఇందులో కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకునే వెంచర్ క్యాపిటలిస్టులు, స్టార్టప్‌లు, ఇతర సంస్థలను నిపుణుల బృందం ఎంపిక చేస్తుంది. స్టార్టప్ సంస్కృతిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు రాబోయే రోజుల్లో వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లో టీ–హబ్ రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఇక ఆవిష్కరణలకు రూపాన్ని ఇచ్చే ‘టీ–వర్క్స్’ను ఈ ఏడాది ఆగస్టులో, ఇమేజ్ సెంటర్‌ను మరో ఏడాదిన్నరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో దశలో ఎవరెవరికి అవకాశం ► మొదటి అంతస్తును వెంచర్ క్యాపిటలిస్టుల ఆఫీసుల కోసం పూర్తి ఉచితంగా కేటాయిస్తారు. ఇప్పటివరకు రెండు వీసీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ► ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్‌ను ఇక్కడికి తరలించడంతోపాటు ‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’, హైదరాబాద్‌లో సీఐఐ ఏర్పాటు చేయనున్న ‘సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’కు కార్యాలయ వసతి కల్పిస్తారు. ► కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్ ఇండియా’ స్టేట్ సెంటర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన ‘అటల్ ఇన్నోవేషన్ సెంటర్’ కూడా ఇక్కడే ఏర్పాటవుతాయి. ► ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్ మొదటి దశకు చెందిన 215 స్టార్టప్‌లను వెంటనే కొత్త ప్రాంగణంలోకి తరలిస్తారు. ► ఇతర ఇంక్యుబేటర్లతో పోలిస్తే తక్కువ అద్దెకు ఆఫీస్ స్పేస్ లభిస్తుంది. ► వ్యక్తిగతంగా లేదా ఒక చిన్న బృందంగా ఏర్పడి సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చే వారికి.. వారి ఆలోచన వాణిజ్య రూపం పొందేందుకు అవసరమైన అన్ని హంగులు టీ–హబ్ 2లో అందుబాటులో ఉంటాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) టీ–హబ్ తొలిదశ స్ఫూర్తితో! ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో 2015లో టీ–హబ్ తొలిదశ ఏర్పాటు చేశారు. అంతకుముందు హైదరాబాద్‌లో కేవలం ట్రిపుల్ ఐటీ, ఐఎస్బీ, జీనోమ్ వ్యాలీలో కలిపి మూడు ఇంక్యుబేటర్లు మాత్రమే ఉన్నాయి. టీ–హబ్ ఏర్పాటుతో ఆవిష్కరణల వాతావరణం పెరిగి ప్రస్తుతం 57 ఇంక్యుబేటర్లు పనిచేస్తున్నాయి. టీ–హబ్ తొలిదశ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 1,100 స్టార్టప్‌లు మొదలవగా.. రూ.10 వేల కోట్ల ఫండింగ్ అందినట్టు అంచనా. మూడు యూనికార్న్‌లు (స్టార్టప్‌లుగా ప్రస్థానం మొదలుపెట్టి రూ.8వేల కోట్ల టర్నోవర్‌కు చేరుకున్న సంస్థలు) ఇక్కడి నుంచే ప్రస్థానం ప్రారంభించగా.. అందులో రెండు యూనికార్న్‌లు నేరుగా టీ–హబ్‌తో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. తొలిదశలో కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత టెక్నాలజీ స్టార్టప్‌లకు 20శాతం మేర కేటాయించారు. ఇదే తరహాలో రెండో దశలోనూ ఎమర్జింగ్ టెక్నాలజీ స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఇస్తారు. – జయేశ్ రంజన్, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రెండో దశలో ఎవరెవరికి అవకాశం మొదటి అంతస్తును వెంచర్ క్యాపిటలిస్టుల ఆఫీసుకు ఉచితంగా కేటాయిస్తారు. ఇప్పటివరకు రెండు వీసీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్ ఇండియా’ స్టేట్ సెంటర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందిన ‘అటల్ ఇన్నోవేషన్ సెంటర్’ కూడా ఇక్కడే ఏర్పాటవుతాయి. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని టీ–హబ్ మొదటి దశకు చెందిన 215 స్టార్టప్‌లను వెంటనే కొత్త ప్రాంగణంలోకి తరలిస్తారు. ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో ఉన్న తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్‌ను ఇక్కడికి తరలించడంతోపాటు ‘సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’, హైదరాబాద్‌లో సీఐఐ ఏర్పాటు చేయనున్న ‘సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’కు కార్యాలయ వసతి కల్పిస్తారు. వ్యక్తిగతంగా లేదా చిన్నబృందంగా ఏర్పడి కొత్త ఆలోచనతో వచ్చే వారికి.. ఆ ఆలోచన వాణిజ్య రూపం పొందేందుకు అవసరమైన హంగులన్నీ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇతర ఇంక్యుబేటర్లతో పోలిస్తే తక్కువ అద్దెకు ఆఫీస్ స్పేస్ లభిస్తుంది. -
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం ముందడుగు
-
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద మళ్ళీ ఉద్రిక్తత
-
జాగరణకు సిద్దమవుతున్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
-
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు విఫలం
-
శ్రీశైలం నీటిని తోడేస్తున్న తెలంగాణ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సర్కార్ ఉల్లంఘనలకు అంతులేకుండా పోతోంది. నిబంధనలను మళ్లీ యథేచ్ఛగా బేఖాతరు చేస్తూ ఏపీ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోంది. గతేడాది అవసరం లేకున్నా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతలలో నీటినిల్వ కనీస మట్టం కంటే దిగువన ఉన్నప్పుడే ఎడమ గట్టు కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేసి.. రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన కృష్ణా జలాలను ప్రకాశం బ్యారేజీ ద్వారా వృథాగా కడలిపాలు చేసింది. ఈ ఏడాది కూడా అదే రీతిలో నీటి దోపిడీ చేస్తోంది. కృష్ణా బోర్డు నుంచి అనుమతి తీసుకోకుండానే శ్రీశైలంలోకి వచ్చిన ప్రవాహాన్ని వచ్చింది వచ్చినట్లుగా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తరలిస్తోంది. రాష్ట్రంలో ప్రకాశం, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదలను ఆపేసిన తెలంగాణ సర్కార్.. ఏఎమ్మార్పీ ద్వారా యథేచ్ఛగా నీటిని తరలిస్తోంది. ఈ వ్యవహారంపై కృష్ణా బోర్డుకు కర్నూలు ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి.. ప్రకాశం జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ శ్రీనివాసరెడ్డిలు ఫిర్యాదు చేశారు. వరద వస్తున్నా పెరగని నీటిమట్టం శ్రీశైలంలో సాగు, విద్యుదుత్పత్తికి కనీస నీటిమట్టం 854 అడుగులుగా సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం) నిర్ణయించింది. కృష్ణా బోర్డు రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ దాన్ని ఆమోదించింది. నీటి సంవత్సరం ప్రారంభమైన రోజునే అంటే ఈనెల 1న స్థానికంగా కురిసిన వర్షాలవల్ల శ్రీశైలంలోకి 862 క్యూసెక్కుల ప్రవాహం చేరింది. నీటి నిల్వ 816.8 అడుగుల్లో 38.63 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ► కృష్ణా బోర్డు నుంచి కనీసం అనుమతి తీసుకోకుండా కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ ఈనెల 1న 800 క్యూసెక్కులను తరలించింది. ► ఈనెల 2న 561 క్యూసెక్కులు శ్రీశైలంలోకి చేరితే కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 483 క్యూసెక్కులను తరలించింది. ► ఈనెల 9న శ్రీశైలంలోకి 4,618 క్యూసెక్కులు చేరితే.. 339 క్యూసెక్కులను.. ► ఈ నెల 10న 2,798 క్యూసెక్కులు చేరితే 1,300 క్యూసెక్కులను.. 11న 4,157 క్యూసెక్కులు చేరితే.. 1,266 క్యూసెక్కులను తెలంగాణ తరలించింది. ► తెలంగాణ దోపిడీతో శ్రీశైలంలోకి వరద ప్రవాహం చేరుతున్నా నీటి మట్టం పెరగడంలేదు. సాగర్ కుడి కాలువ నీరు నిలిపివేత ఇక నాగార్జునసాగర్‌లో సాగునీటికి కనీస నీటిమట్టం 510 అడుగులు. ప్రస్తుతం 534.9 అడుగుల్లో 177.87 టీఎంసీల నీరు ఉంది. రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగు, సాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువపైనే అవి ఆధారపడతాయి. ఈ హెడ్ రెగ్యులేటర్ తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉంది. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకాశం జిల్లా సీఈ శ్రీనివాసరెడ్డి కృష్ణా బోర్డుకు, సాగర్ సీఈకి లేఖ రాశారు. కానీ.. ఈనెల 1 నుంచి కుడి కాలువకు నీటి విడుదలను తెలంగాణ ప్రభుత్వం ఆపేసింది. మరోవైపు.. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే ఈనెల 1న 2,000, 2న 2,000, 3న 218, 6న 218, 7న 500, 8న 500, 9న 854, 10న 1,000, 11న 1,000 క్యూసెక్కుల చొప్పున ఏఎమ్మార్పీ నుంచి తెలంగాణ ప్రభుత్వం యథేచ్ఛగా తరలిస్తోంది. ఈ అంశంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేశామని కర్నూల్ జిల్లా ప్రాజెక్ట్స్ సీఈ మురళీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించాలని కోరామని తెలిపారు. -
నీటి పంపిణీ తర్వాతే డీపీఆర్‌లు
సాక్షి, అమరావతి: ‘కొత్తగా గోదావరి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. నదిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా మదింపు చేసి, రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలి. అప్పటివరకు ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల డీపీఆర్‌లకు సాంకేతిక అనుమతి ఇవ్వకూడదు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించాలి’ అని గోదావరి బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చిచెప్పింది. తెలంగాణ చేపట్టిన చనాకా – కొరటా, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లను మదింపు చేయవద్దని కోరింది. గోదావరి ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయలేదని గుర్తు చేసింది. వాటికి అనుమతి ఇస్తే గోదావరి డెల్టా, పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. విభజన చట్టం ప్రకారం వాటికి సాంకేతిక అనుమతి ఇచ్చి, సీడబ్ల్యూసీ ఆమోదానికి పంపాలని పట్టుబట్టింది. గోదావరి బోర్డు చైర్మన్ మహేంద్ర ప్రతాప్‌సింగ్ ఏపీ వాదనతో ఏకీభవించారు. తెలంగాణ ప్రతిపాదించిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు సాంకేతిక అనుమతి ఇవ్వకుండా రెండు రాష్ట్రాల వాదనలను సీడబ్ల్యూసీకి పంపుతామని చెప్పారు. హైదరాబాద్‌లోని గోదావరి బోర్డు కార్యాలయంలో బుధవారం చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్, సీఈ మోహన్‌కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిధిపై తలోమాట గోదావరి ప్రధాన పాయపై ఎస్సారెస్పీ నుంచి సీతారామసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని ఏపీ అధికారులు ప్రతిపాదించగా.. తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగును మాత్రమే బోర్డు పరిధిలోకి తేవాలని అన్నారు. దీనికి ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. పరిధిపై మరో మారు చర్చిద్దామని, బోర్డుకు తగినంత మంది సిబ్బందిని కేటాయించాలని చైర్మన్ కోరారు. ఇందుకు ఏపీ సుముఖత వ్యక్తం చేయగా.. తెలంగాణ అంగీకరించలేదు. జూలై 15లోగా అనుమతి తీసుకోవాల్సిందే గోదావరి బేసిన్లో అనుమతి లేని ప్రాజెక్టులకు జూలై 15లోగా అనుమతి తీసుకోవాలని, లేదంటే వాటి ద్వారా నీటి వినియోగాన్ని అనుమతించబోమని ఛైర్మన్ స్పష్టంచేశారు. గోదావరిలో నీటి లభ్యతపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, మదింపు చేయాలని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కోరామని ఏపీ అధికారులు గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయడానికి కొత్తగా గోదావరి ట్రిబ్యునల్ వేయాలని కోరామన్నారు. వీటిపై బోర్డు నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ రెండు అంశాలు బోర్డు పరిధిలో లేవని, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని బోర్డు చైర్మన్ చెప్పారు కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి సంప్రదించాలని ఏపీ అధికారులకు సూచించారు. -
ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దు
ప్రస్తుతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) మొదలు ఏరియా, సామాజిక, జిల్లా, బోధనాసుపత్రుల వరకు అన్నిచోట్లా డాక్టర్లు ఉన్నా, ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుండటంతో వారి సేవలు ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలు, దిగువ మధ్య తరగతి రోగులకు సరిగా అందడం లేదు. కొందరు డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు రెండు మూడురోజులకోసారి వెళ్లి వస్తున్నారు. ఈ పరిస్థితిపై వైద్యశాఖ దృష్టి సారించింది. నిమ్స్‌లో పనిచేస్తున్న డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేయవద్దన్న నిబంధన ఇప్పటికే ఉంది. అలాంటి నిబంధననే ప్రభుత్వ డాక్టర్లకు వర్తింపచేయాలని వైద్యశాఖ తొలుత నిర్ణయించింది. అయితే ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులకు వర్తింపజేస్తే న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల కొత్తగా నియమితులయ్యే డాక్టర్లకు వర్తించేలా సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేయాలని భావిస్తోంది. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ రద్దుతో పాటు మరికొన్ని సంస్కరణల దిశగా వైద్య, ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా చేయబోయే డాక్టర్ పోస్టుల భర్తీ సందర్భంగా సర్వీస్ రూల్స్‌ల్లో మార్పులు చేర్పులు చేయాలని, ఈ మేరకు ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాలని వైద్యశాఖ వర్గాలు యోచిస్తున్నాయి. సర్వీస్ రూల్స్‌లో మార్పులు చేశాక డాక్టర్ల పోస్టుల నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. పేదలకు అందని వైద్యం ప్రభుత్వ వైద్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రుల్లో ఉండాల్సి ఉన్నా, సొంత ప్రాక్టీస్ కారణంగా చాలామంది మధ్యాహ్నం వరకే ఉండి వెళ్లిపోతున్నారు. గాంధీ వంటి ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు కొందరు అక్కడికి సమీపంలోనే ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇలా వందలాది మంది ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తుండటంతో, పేదలకు వైద్యం అందడం లేదని వైద్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి. కొందరు డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్‌సీలకు రెండు మూడు రోజులకోసారి వెళ్లి వస్తున్నారు. హైదరాబాద్ వంటి చోట్ల ఉంటూ, ప్రభుత్వ సేవలను మరిచిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇష్టారాజ్యంగా సిజేరియన్లు దేశంలో అత్యధికంగా సిజేరియన్ ఆపరేషన్లు చేసే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటి. రాష్ట్రంలో ఎక్కువగా కరీంనగర్ జిల్లాలో సిజేరియన్లు జరుగుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. డబ్బులకు కక్కుర్తిపడి ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ఆసుపత్రులు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నాయి. సాధారణ ప్రసవానికి రూ.10 వేలు తీసుకుంటే, సిజేరియన్‌కు రూ.40 వేలు కనీసంగా వసూలు చేస్తున్నారు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. అవనసరంగా సిజేరియన్ ఆపరేషన్లు చేసే ఆసుపత్రుల లైసెన్స్ రద్దు చేసేలా ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించారు. సంబంధిత ఆపరేషన్‌లో పాల్గొనే డాక్టర్ రిజిస్ట్రేషన్ రద్దు చేసే ఆలోచనలో కూడా వైద్యశాఖ ఉంది. మరోవైపు కొందరు ముహూర్తాలు పెట్టి ఆ మేరకు సిజేరియన్ కాన్పులు చేయాలని డాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు వైద్య వర్గాలకు సమాచారం అందింది. ఇందుకోసం ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులతో ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడి తెస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కూడా నిర్ణయించారు. ఆర్డీవోలు, ఐఏఎస్‌లకు బాధ్యతలు ఇటీవల ఎంజీఎం ఐసీయూలో ఒక రోగిని ఎలుకలు కరవడాన్ని (తర్వాత నిమ్స్‌లో చనిపోయాడు) వైద్యశాఖ వర్గాలు తీవ్రంగా పరిగణించాయి. కిందినుంచి పైస్థాయి వరకు అనేక లోపాలు ఇందుకు కారణమని భావిస్తున్నాయి. ముఖ్యంగా అనేక ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో పారిశుధ్య లోపం ప్రధానంగా ఉంది. మరోవైపు రోగులు ఆసుపత్రులకు వెళితే వారిపట్ల సిబ్బంది వ్యవహరించే తీరు విమర్శలకు తావిస్తోంది. డాక్టర్లే ఆసుపత్రుల సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తుండటంతో వారికి పరిపాలనా అనుభవం ఉండటం లేదు. ఈ కారణంగానే ఆసుపత్రుల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏరియా, జిల్లా ఆసుపత్రుల పరిపాలన బాధ్యతను ఆర్డీవోలకు అప్పగించాలని వైద్య ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. వారిని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లుగా నియమించే అవకాశముంది. గాంధీ, కాకతీయ వంటి బోధనాసుపత్రుల నిర్వహణ, పరిపాలన బాధ్యతలను ఐఏఎస్ స్థాయి అధికారులకు అప్పగించనున్నారు. ఉస్మానియా ఆసుపత్రి బాధ్యతను ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ వాకాటి కరుణకు అప్పగించారు. సీసీ కెమెరాలతో నిఘా డాక్టర్లు పీహెచ్‌సీలకు వెళ్లేలా పకడ్బందీ చర్యలకు వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేసినా వాటిని పాడుచేసి డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి పీహెచ్సీలో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. డాక్టర్, నర్సు, లేబరేటరీ ఫార్మసిస్ట్ ఉండే గదుల్లో వీటిని అమర్చుతారు. ఈ మేరకు కొన్నిచోట్ల ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 900కు పైగా ఉన్న పీహెచ్సీ, యూపీహెచ్సీల కెమెరాలన్నింటినీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు మొబైల్ ఫోన్లకు లింక్ చేస్తారు. దీంతో ఏ పీహెచ్సీనైనా వారు తమ మొబైల్ ఫోన్‌ద్వారా పర్యవేక్షించేందుకు అవకాశం ఉంటుంది. మరికొన్ని కీలక నిర్ణయాలు.. – ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుధ్య నిర్వహణకు సంబంధించిన శానిటైజేషన్ కాంట్రాక్టులన్నీ రద్దు చేయాలని నిర్ణయం. కొత్త కాంట్రాక్టులకు కఠినమైన నిబంధనలను అమలు చేస్తారు. – గాంధీ, ఉస్మానియా సహా పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న ప్రైవేట్ మందుల దుకాణాలను ఎత్తివేయాలని నిర్ణయం. ప్రభుత్వమే ఉచితంగా మందులు ఇస్తున్నప్పుడు ప్రైవేట్ దుకాణాలు ఎందుకని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. – గ్రామాల్లో ఆర్థో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. మోకాళ్ల నొప్పులున్న వారిని గుర్తించి వారికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మోకాళ్ల మార్పిడి లేదా చికిత్సలు చేస్తారు. – ఒక్క గాంధీలోనే దాదాపు 60 మంది వరకు అనెస్థీషియా డాక్టర్లు ఉన్నారు. ఇతర స్పెషలిస్ట్ వైద్యులు కొన్నిచోట్ల ఎక్కువ మంది ఉన్నారు. అందువల్ల డాక్టర్ల క్రమబద్ధీకరణ చేపడతారు. – ప్రతి నెలా ఆసుపత్రుల నిర్వహణపై నివేదిక రూపొందిస్తారు. ఆ ప్రకారం సమీక్ష చేస్తారు. – ప్రభుత్వ ఆధ్వర్యంలో సంతాన సాఫల్య కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తద్వారా ప్రైవేట్ దోపిడీకి చెక్ పెడతారు. – నిమ్స్, గాంధీల్లో కొత్తగా 250 పడకల చొప్పున మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రులను (ఎంసీహెచ్) నెలకొల్పుతారు. -
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!
-
శ్రీకర శుభకర ప్రణవ స్వరూపా! శ్రీ యాదగిరి నారసింహా!
యాదగిరి గుట్టకు సంబంధించిన కథకు మూలం వాల్మీకి రామాయణంలోని విభాండక ఋషి. అతడి పుత్రుడైన ఋష్యశృంగుడి కుమారుడు యాదరుషి. అతణ్ణే యాదర్షి అంటారు. చిన్నప్పట్నుంచి నరసింహుడి భక్తుడైన అతడికి ఆ స్వామిని దర్శించాలని బలమైన కోరిక ఉండేదట. నరసింహుణ్ణి అన్వేషించడానికి అడవులూ, కొండలూ కోనలూ తిరిగాడు. నరసింహుని దర్శనం కాలేదు. అలా సంచరిస్తున్న యాదర్షి ఒకరోజు ఇప్పుడున్న యాదగిరి అరణ్య ప్రాంతానికి చేరుకుని అలసిపోయి ఒక రావిచెట్టు కింద పడుకున్నాడు. అప్పుడు కలలో ఆంజనేయస్వామి కనిపించి ‘నీ పట్టుదల నాకు నచ్చింది. నీకు తోడుగా నేనుంటాను. కఠోరమైన తపస్సు చేస్తే స్వామి తప్పక ప్రత్యక్షమవుతాడు’ అని చెప్పారట. నిద్రలేచిన యాదర్షి అక్కడే తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు ఉగ్రనారసింహుడు ప్రత్యక్షమయ్యారట. ఆ తేజస్సును చూడలేక శాంత స్వరూపంతో కనిపించమని కోరాడట యాదర్షి. అప్పుడు లక్ష్మీసమేతుడై దర్శనమిచ్చి ‘‘ఏం కావాలో కోరుకో’’ అని అడిగితే, ‘‘నీ దర్శనం కోసం ఇంత ఘోర తపస్సు సామాన్యులు చేయలేరు. అందుకే నువ్వు శాంత రూపంతోనే ఇక్కడ కొలువై ఉండిపో’’ అని కోరాడట. అప్పుడు కొండశిలమీద స్వామి ఆవిర్భవించాడు. కొన్నాళ్ల తరువాత యాదర్షికి మరో కోరిక కలిగింది. స్వామిని ఒకే రూపంలో చూశాను. వేర్వేరు రూపాల్లో చూడలేకపోయానే అనుకుని మళ్లీ ఈ ప్రాంతానికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. కొన్నాళ్లకు స్వామి మళ్లీ ప్రత్య„ý మయ్యాడు. యాదర్షి కోరిక విని, ‘‘నా రూపాలన్నీ నువ్వు చూడలేవు’ అయినా నీకోసం మూడు రూపాలు చూపిస్తాను’’ అని జ్వాలా, యోగానంద, గండభేరుండ నారసింహ రూపాల్లో దర్శనమిచ్చాడట జ్వాలా నారసింహుడు సర్పరూపంలో ఉంటాడు. యోగానందుడు అర్చా విగ్రహరూపంలో ఉంటాడు. గండభేరుండ నారసింహుడు కొండ బిలంలో కొలువై ఉంటాడు. తరువాత యాదర్షి... తనను స్వామిలో ఐక్యం చేసుకోమని కోరడంతో అలాగే చేసుకున్నాడట స్వామి. ఆ యాదర్షి పేరుమీదనే ఇది యాదగిరిగుట్ట అయింది. స్వాగత తోరణం.. యాదాద్రి కొండపైన భారీ స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల తిరుపతి తరహాలో ఈ ఆర్చీ ఉంటుంది. ఇక వైపు కొండ ఎక్కడానికి, మరో వైపు కొండ దిగేందుకు ఈ ఆర్చీని నిర్మాణం చేశారు. ఈ ఆర్చీ పైభాగంలో శంకు, చక్ర, నామాలు, శ్రీలక్ష్మీనరసింహస్వామి రూపాలను తీర్చిదిద్దారు. ఆలయ విశిష్ఠత గర్భగుడిలో ఎదురుగా ఉండే స్వామి జ్వాలా నరసింహుడు. మరి కాస్త లోపలయోగముద్రలో యోగానందస్వామి, లక్ష్మీనరసింహ స్వాములను దర్శించుకోవచ్చు. గర్భాలయం నుంచి బయటకు వస్తే మెట్లకు ఎడమపక్కన క్షేత్రపాలకుడైన హనుమంతుడి గుడి ఉంది. హనుమంతుడి విగ్రహానికి కింద గల పెద్ద రాతిచీలికలో గండభేరుండ నరసింహుని స్వయంభువు రూపం కనిపిస్తుంది. ఆంజనేయస్వామిని దర్శించుకున్నాక బయట ఎడమవైపున మెట్లు దిగితే పుష్కరిణి. కుడివైపు కొన్ని మెట్లు దిగితే పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరుని ఆలయం అగుపిస్తాయి. ఆలయమంతా స్వర్ణమయం గర్భాలయంపైన దివ్య విమాన గోపురానికి భక్తులు విరాళంగా ఇచ్చిన 125 కిలోల బంగారంతో తాపడం చేయిస్తున్నారు. పంచనారసింహులు కొలువైన గర్భాలయ ద్వారాలకు బంగారు తాపడం చేసిన కవచాలను బిగించారు. ఆళ్వార్ మండపంలో 35 అడుగుల ఎత్తులో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఈ ధ్వజస్తంభానికి సైతం బంగారు తొడుగులను ఇటీవలనే పూర్తి చేశారు. త్రితల, పంచతల, సప్తతల రాజగోపురాలకు పసిడి కలశాలు బిగించారు. వీటితోపాటు ఉప ఆలయాల ద్వారాలకు వెండి, ప్రథమ, ద్వితీయ ప్రాకారాల్లో ద్వారాలకు ఇత్తడి తొడుగులు, అష్టభుజి ప్రాకార మండప శిఖరాలపై రాగి కలశాలు బిగించారు. బంగారు తొడుగుల పనులన్నీ చెన్నైలోని స్మార్ట్ క్రియేషన్ సంస్థలో చేయించారు. శివాలయం... యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైనే ఉన్న అనుబంధ ఆలయంగా శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వరస్వామి దేవాలయం కొనసాగుతోంది. శివాలయంలో ప్రధాన ఆలయం, ముఖ మండపం, ప్రకార మండపం, త్రితల రాజగోపురం నిర్మించారు. ప్రధాన ఆలయంంలోని మండపాల్లో, నాలుగు దిశల్లో కృష్ణ శిలతో స్టోన్ ఫ్లోరింగ్ పనులు చేశారు. ప్రధాన ఆలయం ముందు భారీ నందీశ్వరుడి విగ్రహాన్ని పెట్టారు. ఆలయానికి ఉత్తర దిశలో శ్రీస్వామి వారి కల్యాణ మండపం, ఆ పక్కనే రథశాల నిర్మించారు. ఆలయ ఉద్ఘాటన నాటికి ఆలయంలో స్ఫటిక లింగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 25న శివాలయంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నారు. విష్ణు పుష్కరిణి... కొండపైన విష్ణు పుష్కరిణిని అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. గతంలో ఈ పుష్కరిణిలో భక్తులు స్నానాలు చేసే వారు. కానీ ఇప్పుడు విష్ణు పుష్కరిణిలో శ్రీస్వామి వారికి మాత్రమే ఉపయోగించనున్నారు. గిరి ప్రదక్షిణ... శ్రీస్వామి వారి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున భక్తులు గిరి ప్రదక్షిణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. వీరితో పాటు మండల దీక్ష చేసే భక్తులు సైతం ప్రతి రోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిరి ప్రదక్షిణను ఆలయ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. పుష్కరిణిలో భక్తుల స్నానాలు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం గండి చెరువు సమీపంలో నిర్మించిన లక్ష్మీ పుష్కరిణి లో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. ప్రధానాలయం ఉద్ఘాటన సందర్భంగా పలువురు భక్తులు బాలాలయం లో శ్రీస్వామి వారిని కొండపైన దర్శనం చేసుకొని, అనంతరం కొండ కింద జరుగుతున్న నిర్మాణాలను తిలకించారు. ఈ సమయంలో లక్ష్మీ పుష్కరిణిలోకి వెళ్లి స్నానాలు చేసి ఆనందంగా గడిపారు. కల్యాణ కట్ట ప్రారంభం.. ఆధునిక హంగులతో నిర్మాణం చేసిన కల్యాణ కట్టను ఈవో గీతారెడ్డి ఆదివారం ప్రారంభించారు. 28వ తేదీ నుంచి ప్రధానాలయంలో స్వయంభూల దర్శనం కలగనున్న నేపథ్యంలో భక్తులు అధికంగా క్షేత్రానికి వచ్చే అవకాశం ఉంది, ఇందులో భాగంగానే ముందస్తుగా కల్యాణ కట్టలో పూజలు చేసి ప్రారంభించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా ఈ కల్యాణ కట్టలోనే తలనీలాలను సమర్పించుకోనున్నారు. స్వామి పుష్కరిణి ఈ క్షేత్రంలోని స్వామివారి పుష్కరిణికి ఓ ప్రత్యేకత ఉంది. దీనినే ‘విష్ణుకుండం’ అని పిలుస్తుంటారు. యాదగిరి నరసింహస్వామి పాదాల వద్ద నుంచి నిరంతరం పెల్లుబుకుతూ వచ్చే నీరు ఈ పుష్కరిణిలో చేరుతుంటుంది. ఈ తీర్థం చాలా మహిమాన్వితమైనదని పేరు. భక్తుల రాక యేటేటా పెరగడంతో ఈ క్షేత్రం తెలంగాణ తిరుపతిగా వాసికెక్కింది. ఇదిలా ఉండగా హైదరాబాద్ వాస్తవ్యుడైన రాజామోతీలాల్ యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి వైభవం విని స్వామి వారిని దర్శించి స్వామి వారికి ఆలయనిర్మాణం చేయించాడు. ప్రాకారం, గోపుర ద్వారం, ముఖమండపం నిర్మించాడు. ఆ తర్వాత భక్తులు తమ యాత్ర సందర్భాల్లో పలు సౌకర్యాలు ఏర్పరుస్తూ వచ్చారు. ప్రస్తుతం ఈ క్షేత్ర యాజమాన్యం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఉంది. యాదగిరి లక్ష్మీనరసింహ క్షేత్రం జనాకర్షకమై భక్తుల కొంగుబంగారమై విరాజిల్లుతోంది. వైకుంఠద్వారం... యాదాద్రి కొండపైకి నడకదారిన వెళ్లే భక్తులు ఈ వైకుంఠ ద్వారం నుంచి వెళ్లాలి. ఈ వైకుంఠద్వారాన్ని యాలీ పిల్లర్ల మీద ఏర్పాటు చేశారు. వైకుంఠ ద్వారం వద్ద భక్తులు కొబ్బరి కాయలు కొట్టి మెట్లదారి నుంచి శ్రీస్వామి వారి క్షేత్రానికి వెళ్లవచ్చు. అన్నప్రసాదం... గండి చెరువుకు కొద్ది దూరంలో క్షేత్రానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదం కోసం అన్నసత్ర భవనాన్ని 2.7 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందుకు యాదాద్రి దేవాలయ అభివృద్ధి సంస్థ రూ.6కోట్లు ఖర్చు చేస్తుండగా.. రూ.11కోట్లను వేగేశ్న సంస్థ ఖర్చు చేస్తుంది. ప్రస్తుతం ఈ మండపం స్లాబ్ లెవల్ పనులు పూర్తయ్యాయి. కల్యాణ కట్ట... శ్రీస్వామి వారికి భక్తులు సమర్పించుకునే తలనీలాల కోసం అధునాతన హంగులతో కల్యాణ కట్టను నిర్మించారు. దీనిని 2.23 ఎకరాల విస్తీర్ణంలో రూ.20.3కోట్ల వ్యయంతో నిర్మాణం చేశారు. ఇందులో ఒకేసారి 360 మంది పురుషులు, 160 మంది మహిళ భక్తులు తలనీలాలు సమర్పించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. దీక్షాపరుల మండపం శ్రీస్వామి క్షేత్రంలో మండల దీక్ష చేసే భక్తులకు దీక్షాపరుల మండపాన్ని అధునాతనంగా నిర్మించారు. 1.88 ఎకరాల స్థలంలో రూ.8.09 కోట్ల వ్యయంతో ఈ దీక్షారుల మండపాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 140 మంది పురుషులు, 108 మంది మహిళ భక్తులు దీక్షలు చేసే సమయంలో బస చేసేలా ఏర్పాట్లు చేశారు. గండి చెరువు... శ్రీస్వామి వారి తెప్పోత్సవం కోసం గండి చెరువును వైటీడీఏ అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను తీసుకువచ్చారు. ఇందులో శ్రీస్వామి వారి తెప్పోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాకుండా భక్తులు సేద తీరేందుకు లాన్స్, గ్రీనరీ, బేంచీలను ఏర్పాటు చేసి, బోటింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఫలితాలనొసగే ‘ప్రదక్షిణల మొక్కు’ ఈ క్షేత్రంలో ప్రదక్షిణల మొక్కు’ ప్రధానమైనది. దీనివల్ల మానసిక, శారీరక, ఆర్థికబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. మండలం (41 రోజులు), అర్ధమండలం, 11 రోజుల ప్రదక్షిణల మొక్కులు మొక్కుకుంటారు భక్తులు. నిత్యం గర్భాలయానికి రెండుసార్లూ, ఆంజనేయస్వామికి 16 సార్లూ ప్రదక్షిణలు చేస్తారు.ఈ మొక్కు తీర్చుకునే దశలో స్వామి కలలోనే తమకు చికిత్సలు చేసి, శారీరక బాధల నుంచి విముక్తి చేస్తారని నమ్ముతారు. యాగ స్థలం... యాదాద్రి కొండకు దిగువన 93 ఎకరాల్లో యాగ స్థలాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గతంలో 1,008 కుండాలతో మహా సుదర్శన యాగం చేయాలని అధికారులు భావించారు. కానీ అనివార్య కారణాలతో ఈ యాగం వాయిదా పడింది. ఇప్పుడు ఇందులో భక్తుల వాహనాలను పార్కింగ్ చేసేందుకు వినియోగిస్తున్నారు. లక్ష్మీపుష్కరిణి... కల్యాణకట్టకు ఎదురుగానే భక్తుల కోసం లక్ష్మీ పుష్కరిణిని ఆధ్యాత్మిక హంగులతో అద్భుతం గా నిర్మించారు. 2.13 ఎకరాల్లో రూ.6.67కోట్ల వ్యయంతో ఈ లక్ష్మీ పుష్కరిణి రూపుదిద్దుకుంది. ఇందులో ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్లను నింపుతున్నారు. త్వరలోనే గోదావరి జలాలను సైతం నింపనున్నారు. ఈ పుష్కరిణిలో 1,500 మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే విధంగా ఏర్పాట్లు చేశారు. పురుషులకు, మహిళలకు వేర్వేరుగా స్నానఘట్టాలు ఏర్పాటు చేశారు. వ్రత మండపం... అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి క్షేత్రం తరువాత యాదాద్రీశుడి ఆలయంలోనే భక్తులు అధిక సంఖ్యలో శ్రీసత్యనారాయణస్వామి వ్రతాలను జరిపిస్తారు. ఇందుకోసం నిర్మిస్తున్న వ్రత మండపం ఇది. లడ్డూ ప్రసాదం.. క్షేత్రానికి వచ్చే భక్తులు అధికంగా లడ్డూ, పులిహోరకే మక్కువ చూపెడతారు. ఇందుకు వైటీడీఏ అధికారులు అధునాతన హంగులతో మానవ ప్రమేయం లేకుండా మిషన్ల ద్వారా ప్రసాదం తయారీ చేసే విధంగా ఏర్పాటు చేశారు. క్షేత్రానికి ఎంత మంది వస్తే అంత మందికి లడ్డూ, పులిహోర, ఇతర ప్రసాదం తయారీ చేసి ఇచ్చేందుకు సిద్ధం చేశారు. ఇందులో ప్రత్యేక కౌంటర్లు, లైన్లు ఏర్పాటు చేశారు. పూర్వ జన్మ సుకృతం ‘‘యాదాద్రి నరసింహుని ఆలయ పునర్నిర్మాణం కోసమే భగవంతుడు నన్ను భూమి మీదికి పంపించి ఉంటాడు. అందుకోసమే భక్తులకు కావాల్సిన రీతిలో క్షేత్ర నిర్మాణంలో పాలు పంచుకోగలిగాను. యాదాద్రి ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద సాయి రూపొందించిన ప్లాన్ ప్రకారం పని చేయడానికి నన్ను పిలిపించారు. ప్రధాన స్థపతి సుందర రాజన్ ద్వారా ఆలయ ప్లాన్‌ను ఆమోదించారు. ఆ క్రమంలో నన్ను అదనపు స్థపతి, సలహాదారుగా నియమించారు. స్వామివారి ప్రధానాలయం, శివాలయం కార్యనిర్వహణ పనిని అప్పగించారు. స్థపతులు, శిల్పులు, టీటీడీ శిల్ప కళాశాల విద్యార్థులు... ఇలా అందరి భాగస్వామ్యంతో నాకప్పగించిన పనులు పూర్తి చేశాను. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి నిమిషం ప్రతి మనిషి పక్కన స్వామి వారే ఉండి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఇది ఏ ఒక్కరి వల్లా పూర్తి కాలేదు. స్వామివారి ఆజ్ఞగానే భావించి అందరూ ఇందులో పాలు పంచుకున్నారు. సర్వేజనాస్సుఖినోభవంతు అన్న విధంగా స్వామి వారి ఆశీస్సులు అందరిపై ఉంటాయి. దేవాదాయ ధర్మాదాయ స్థపతి సలహాదారుగా ఎన్నో ఆలయాలు నిర్మించిన నేను.. యాదాద్రి క్షేత్ర నిర్మాణంలో పాల్గొనడం నా పూర్వ జన్మ సుకృతం. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. స్వామివారికి సహస్రాధిక నమస్సులు తెలియజేసుకుంటున్నాను’’. – స్థపతి డాక్టర్ ఆనందాచారి వేలు మహాద్భుత క్షేత్రంగా యాదాద్రి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ఎంతో అద్భుతంగా జరిగింది.దేశంలోనే మహాద్భుత క్షేత్రంగా విలసిల్లుతుంది. ఈ మహాక్రతువులో నేను కూడా భాగస్వామిని కావడం ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని నభూతో న భవిష్యతి అన్న రీతిలో పూర్తి కావించారు. యావత్ భక్త ప్రపంచం ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ మహా ఘట్టం మరికొద్ది గంటల్లో ఆవిష్కృతం కానుంది. నేటి ఉదయం నిత్యకైంకర్యం గావించగానే బాలాలయంలో నిత్య పూర్ణాహుతి జరుగుతుంది. వెంటనే శ్రీస్వామి వారు మేళతాళాలు, స్వస్తి మంత్రాలు, వేద దివ్య ప్రబంధ పాశుర పఠనాలతో ప్రధానాలయంలోకి వేంచేస్తారు. అక్కడ స్వామి వారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం. 11.45 నిమిషాల నుంచి గోపురాలకు పూజలు నిర్వహించి, 11.55కు కుంభాభిషేకం ఏకకాలంలో జరిపిస్తాం. 92 స్థానాల్లో 200 మంది రుత్విక్కులు పాల్గొని ఏకకాలంలో అన్ని గోపురాలు, ప్రాకార మండపాలు, గర్భాలయం, ఆండాల్, ఆళ్వార్, రామానుజులు, విష్వక్సేన సన్నిధి, చతుర గోపురాలకు మహా కుంభాభిషేకం నిర్వహిస్తారు. అనంతరం ప్రధానాలయంలో మొదటి పూజ, మంత్రపుష్ప నీరాజనాలు, ప్రసాద వినియోగం పూర్తవుతాయి. తర్వాత సీఎం కేసీఆర్‌కు ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం సంధ్యాసమయానికి ద్వితీయ ఆరాధన పూర్తి కాగానే శాంతి కల్యాణం నిర్వహించి ఉత్సవాలకు వచ్చిన పండితులకు సన్మానం చేస్తాం. భక్తులకు శ్రీస్వామి వారి ఆశీర్వచనం ఉంటుంది. – నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు ఆలయ ప్రధానార్చకులు కథనాలు: సాక్షి యాదాద్రి, యాదగిరి గుట్ట, ఫొటోలు: కొల్లోజు శివకుమార్, సాక్షి భువనగిరి -
మహబూబ్‌నగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు .. వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కార్!
సాక్షి, హైదరాబాద్: వెంచర్లు చేసేందుకు ఉపయోగపడే అసైన్డ్ భూములను సేకరించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు వేసినట్టే వేసి వెనక్కు తగ్గింది. గతంలో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల పక్కన, రియల్ బూమ్ ప్రాంతాల్లో ఉన్న వాటిని గుర్తించి అభివృద్ధి చేయాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుంది. ఈ జిల్లాలోని జడ్చర్ల, రాజాపూర్, భూత్పూర్, బాలానగర్ మండలాల్లో ఖాళీగా ఉన్న అసైన్డ్ భూములను సర్వే చేయాలని, అసైనీలతో మాట్లాడి ఎకరానికి 400 గజాలను వారికి ఇచ్చేవిధంగా ఒప్పించాలని ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. గత వారం రోజులుగా ఆయా మండలాల అధికారులు ఈ సర్వేలో నిమగ్నమయ్యారు. జాతీయ రహదారుల వెంట ఉన్న భూములను గుర్తించి అసైనీలతో మాట్లాడి ఆయా భూముల్లో ప్రభుత్వ బోర్డులు పెట్టే ప్రయత్నం చేశారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు అంగీకరించగా, మరికొన్ని చోట్ల రైతుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎకరం భూమి తీసుకుని అందులో 10 శాతం ఇస్తామంటే ఎలా కుదురుతుందని, కనీసం 50:50, 60:40 లాంటి ప్రతిపాదనలతో వస్తే ఆలోచిస్తామని తేల్చిచెప్పారు. జడ్చర్ల లాంటి ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు కూడా దిగాయి. దీంతో తాత్కాలికంగా ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు మళ్లీ మౌఖికంగానే ఆదేశాలు జారీ కావడం గమనార్హం. చదవండి: సీఎస్ సోమేశ్‌ను ఏపీకి కేటాయించండి: కేంద్రం మరిన్ని ప్రతిపాదనలతో మళ్లీ.. రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములున్నాయి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములూ పెద్దఎత్తున ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ భూముల వల్ల అసైనీలకూ ఉపయోగం లేనందున వాటిని స్వాధీనం చేసుకోవాలని భావించింది. స్వాధీనం చేసుకున్న భూములను ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడిన అధికారులు ఈ భూముల్లో ప్రభుత్వమే వెంచర్లు చేయాలని, హెచ్ఎండీఏకి అప్పగించి భూములను అభివృద్ధి చేసి విక్రయించాలని, అసైన్డ్ భూములను ఇచ్చినందుకు అసైనీలకు కొంత వాటా ఇవ్వాలని నిర్ణయించారు. అందులోభాగంగానే ఎకరానికి 400 గజాల ప్రతిపాదనతో పాలమూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. అయితే, ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి విరమించుకున్నప్పటికీ ప్రభుత్వం మరిన్ని ప్రతిపాదనలతో మళ్లీ వచ్చే అవకాశం లేకపోలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. పేదల అసైన్డ్ భూములను లాక్కోవద్దు: తమ్మినేని సాక్షి,హైదరాబాద్: పేదలకిచ్చిన అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్ముకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ప్రభుత్వం చట్టాలను అమలు చేయకపోగా వాటిని ఉల్లంఘించడం అన్యాయమని గురువారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల అసైన్డ్ భూములను లాక్కోవడం సరికాదన్నారు. చదవండి: వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు పట్టణాలకు దగ్గరగా అసైన్డ్ భూముల విలువ కొన్ని చోట్ల రూ.కోటి పైగా పలుకుతోందని అలాంటి భూముల నుంచి పేద అసైన్డ్‌దారులను బయటకు గెంటివేసి ప్రభుత్వం జెండాలు పాతి శాంతి–భద్రతల సమస్యను సృష్టించడం దారుణమన్నారు. ప్రభుత్వం తన తప్పుడు విధానాన్ని విరమించుకుని అసైన్డ్ భూములున్న పేదవారికి రక్షణ కల్పించాలని కోరారు. -
కరెంట్ బకాయిలపై బాధ్యత తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ.6 వేల కోట్లకుపైగా విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించేలా చొరవ తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. విభజన నష్టాలతోపాటు కోవిడ్ కారణంగా రాబడి కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి బకాయిల వసూలు అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఆదేశాల మేరకు తెలంగాణకు విద్యుత్తు సరఫరా చేసినందున బకాయిలు చెల్లించేలా బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మన్నవరంలో విద్యుత్ ఉపకరణాల తయారీ జోన్ నెలకొల్పాలని కోరారు. పన్నుల వాటాలో మినహాయించైనా.. ఏపీ జెన్కోకు తెలంగాణ డిస్కమ్‌లు చెల్లించాల్సిన రూ.6,111 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించి నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలను ఆదుకోవాలని వైఎస్సార్ సీపీ ఎంపీల బృందం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కోరింది. పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభా పక్షనేత పీవీ మిధున్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీల బృందం బుధవారం ఆర్కే సింగ్‌ను కలుసుకుని పలు అంశాలతో వినతిపత్రాన్ని సమర్పించింది. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం ఆదేశాల మేరకు ఏపీ జెన్కో 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు తెలంగాణ డిస్కమ్‌లకు విద్యుత్ సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఈ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ చెల్లించలేదని తెలిపారు. కేంద్ర విద్యుత్ శాఖ అధికారులతో గతేడాది నవంబర్ 8న తెలుగు రాష్ట్రాల అధికారుల చర్చల సందర్భంగా సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోవాలని సూచించినా ఇంతవరకు కొలిక్కి రాలేదని తెలిపారు. తెలంగాణ వాటాగా కేంద్రం విడుదల చేసే పన్నుల ఆదాయం నుంచైనా మినహాయించి ఆంధ్రప్రదేశ్‌కు బకాయిలను చెల్లించాలని విజయసాయిరెడ్డి కోరారు. వినతిపత్రంలో ఇతర అంశాలు.. ► చిత్తూరు జిల్లా మన్నవరంలో ఎన్బీపీపీఎల్ ప్లాంట్ కోసం కేవలం 5 ఎకరాలను మాత్రమే వినియోగిస్తోంది. వృథాగా ఉన్న మిగిలిన 748 ఎకరాలను ఎన్టీపీసీ – ఏపీఐఐసీ జాయింట్ వెంచర్‌తో పవర్ ఎక్విప్మెంట్ తయారీ కోసం మాన్యుఫాక్చరింగ్ జోన్‌గా మార్చాలి. ► కరువు నివారణకు రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 27 ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. రూ.12,500 కోట్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఎస్పీవీ కింద ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులను ఒకే ప్రాజెక్టుగా పరిగణించి రుణ సదుపాయం కల్పించాలి. ఆక్వా రైతులకు బీమా కేంద్ర మత్స్యశాఖ మంత్రికి వైఎస్సార్సీపీ ఎంపీల వినతి పెద్దఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు ఆక్వా రైతులకు బీమా పాలసీ అమలు చేయాలని వైఎస్సార్ సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆక్వా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని, కేంద్రం మద్దతిస్తే మెరుగైన తోడ్పాటు అందించవచ్చని నివేదించారు. ఆక్వా ఉత్పత్తులను ప్రోత్సహించి అభివృద్ధి చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుభరోసా కేంద్రాల ద్వారా ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేశారని తెలిపారు. సీడ్, ఫీడ్ అందజేయడంతోపాటు మెరుగైన గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు వివరించారు. వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం బుధవారం ఢిల్లీలో కేంద్ర మత్స్యశాఖ మంత్రి పురుషోత్తం రూపాలాను కలుసుకుని ఈమేరకు పది అంశాలపై వినతిపత్రాన్ని అందజే సింది. ఎంపీలు మోపిదేవి వెంకటరమణరావు, గురుమూర్తి, బెల్లాన చంద్రశేఖర్, వంగా గీత వీరిలో ఉన్నారు. దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టిందని తెలిపారు. విజయనగరం జిల్లా చింతపల్లి, విశాఖపట్నం జిల్లా భీమిలి, రాజయ్యపేటల్లో రూ.75 కోట్లతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్లను ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన కింద కేంద్రం అనుమతించిందన్నారు. నెల్లూరు జిల్లా తడ, తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో చేపల వేటకు వెళుతున్న మత్స్యకారులు పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. తరచూ ఘర్షణలు చోటు చేసుకోవడం, పరస్పరం కేసులు నమోదు కావడంతో శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు తెలిపారు. దీన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు పులికాట్ సరస్సులో ఇసుకమేట డ్రెడ్జింగ్‌కు రూ.45 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. నిధులు వెంటనే విడుదల చేయాలని కోరగా కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. వినతిపత్రంలో ఇతర ముఖ్యాంశాలివీ.. ► సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆక్వా కల్చర్ అథారిటీ ప్రాంతీయ కార్యాలయానికి కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల్లో భూమి కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ► ఆక్వా రంగం ఆర్జించే విదేశీ మారక ద్రవ్యంలో రూ.15,600 కోట్ల వాటా ఏపీదే. ► ఆక్వా రంగానికి పవర్ టారిఫ్ తోడ్పాటు ఇవ్వాలి. ► రూ.40 కోట్లతో విశాఖ జిల్లా బండారుపల్లిలో ఆక్వా క్వారంటైన్ సెంటర్‌కు సవరించిన అంచనాలతో కేంద్రం గ్రాంటు మంజూరు చేయాలి. ► విశాఖలో నౌకాదళ విన్యాసాల సమయంలో జీవనోపాధికి ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకు రూ.10 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ► బుడగట్లపాలెం, చింతపల్లి, ముక్కాం గ్రామాల్లో జెట్టీలు ఏర్పాటు చేయాలి. -
ఎల్ఆర్ఎస్ రసీదు పోయింది.. ఇప్పుడెలా? అ‘ధనం’ కట్టాల్సిందేనా?
‘మామునూరులో 200 గజాల ఓపెన్ ప్లాట్ ఉన్న వినయ్ భవన నిర్మాణానికి మున్సిపల్ అధికారులను సంప్రదించాడు. రెండేళ్ల క్రితం ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పాడు. నిబంధనల ప్రకారం అప్పటి మార్కెట్ విలువ ఆధారంగా భవన నిర్మాణ ఫీజు చెల్లించాలి. కానీ అతడు దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ రసీదును పోగొట్టుకున్నాడు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ సాంకేతిక సమస్యలతో తెరుచుకోకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ ప్రకారం ఫీజు చెల్లించాల్సి వస్తోంది’ ‘నర్సంపేటలో ఉండే సిద్ధు్ద తనకున్న 160 గజాల ఓపెన్ ప్లాట్‌లో ఇళ్లు కట్టుకుందామనుకున్నాడు. ఓ లైసెన్స్డ్ సర్వేయర్‌ను సంప్రదించాడు. సేల్‌డీడ్ డాక్యుమెంట్లు, లేఅవుట్ కాపీతో పాటు రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న ఎల్ఆర్ఎస్ రసీదు కావాలని సర్వేయర్ అడిగాడు. అది ఉంటే తప్ప అప్పటి మార్కెట్ విలువ ప్రకారం భవన నిర్మాణ ఫీజు దాదాపు రూ.20వేల వరకు తగ్గే అవకాశముందని చెప్పాడు. అయితే సిద్ధు ఆ రిసిప్ట్‌ను ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ ఓపెన్ అయినప్పటికీ.. సాంకేతిక సమస్యలతో దరఖాస్తు తెరుచుకోలేదు. దీంతో అతడికీ అదనంగా డబ్బు చెల్లించడం తప్పలేదు’ సాక్షి, వరంగల్: కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో సొంతిటి కల సాకారం చేసుకునేందుకు సామాన్యులు ముందుకొస్తున్నారు. ఇటీవల పెరిగిన ల్యాండ్ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం భవన నిర్మాణానికి ఆన్లైన్లో అదనంగా చెల్లించాలి. గతంలో ఎల్ఆర్ఎస్లో నమోదు చేసుకొని ఆ రసీదు పొంది ఉంటే.. ఇంటి పర్మిషన్‌కు కాస్త తక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఎల్ఆర్ఎస్లో కట్టిన రసీదును నిర్లక్ష్యం చేశారు. దీనికి తోడు ఆన్‌లైన్‌లోనూ రసీదు లభించకపోవడంతో భవన నిర్మాణదారులకు అదనపు భారం తప్పట్లేదు. తెరుచుకోని సైట్! అక్రమ లే అవుట్లలో ఓపెన్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు రెండేళ్లక్రితం ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లకపోవడంతో ప్రస్తుతం భవన నిర్మాణదారులు ఇబ్బందులు పడుతున్నారు. 2020కి సంబంధించి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు రూ.వెయ్యి ప్రాసెసింగ్ ఫీజును ప్రభుత్వం ఆన్లైన్ ద్వారా వసూలు చేసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ ప్లాట్లు, ప్లాట్ల మార్కెట్ విలువను పెంచిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ రుసుం మరింత పెరిగింది. దీనికి తోడు గతంలో ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటి రసీదు కలిగి ఉండి టీఎస్‌బీపాస్ ద్వారా భవన నిర్మాణ అనుమతి తీసుకుంటే గతంలోని మార్కెట్ విలువ ప్రకారమే ఫీజు చెల్లించవచ్చు. కానీ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ, నర్సంపేట, వర్ధన్నపేట మునిసిపాలిటీల పరిధిలో చాలా మంది ఆ రిసిప్ట్‌లను నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడూ వెబ్సైట్ https://lrs.telangana.gov.in కు వెళ్లి ఫోన్ నంబర్ ఎంట్రీ చేస్తే ఓటీపీతో దరఖాస్తు ఓపెన్ కావాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు ఓపెన్ అవడం లేదు. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ రావడం లేదు. దీంతో చాలామంది ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం భవన నిర్మాణ ఫీజులు కడుతున్నారు. (చదవండి: పేరుకే ప్రేమ పెళ్లి.. ఆడపిల్లలు పుట్టారని తన్ని తరిమేశారు..) ఇంటి నిర్మాణానికి సన్నద్ధం.. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి తగ్గడంతో వేలాది మంది సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొని రెండేళ్లుగా ఎదురుచూసిన వేలాది మంది భవన నిర్మాణ అనుమతులను పొందేందుకు సిద్ధమయ్యారు. గతంలో ఎల్ఆర్ఎస్ చెల్లించి అప్పటి రిసిప్ట్ ఉంటే.. గతంలోని మార్కెట్ విలువ ప్రకారమే భవన నిర్మాణ అనుమతికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు స్థలాల విస్తీర్ణం ప్రకారం రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉంది. కానీ చాలామంది దరఖాస్తుదారులు తమ వద్ద అప్పటి ఎల్ఆర్ఎస్ రసీదులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్లైన్లో వివరాలు లభించక 14 శాతం ఎల్ఆర్ఎస్ రుసుంతో ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారమే భవన నిర్మాణ అనుమతులు తీసుకుంటున్నారు. ఎల్ఆర్ఎస్ సైట్‌ను పునరుద్ధరించాలని, పురపాలక శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని భవన నిర్మాణదారులు విన్నవిస్తున్నారు. (చదవండి: బాప్రే.. ఒక్క నిమిషానికి 700 పెండింగ్ చలాన్లు క్లియర్!) -
జాతీయ రహదారులు పెరుగుతున్నయ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జాతీయ రహదారుల వాటా క్రమంగా పెరుగుతోంది. కొంతకాలంగా కేంద్రం భారీగా కొత్త రోడ్లను మంజూరు చేస్తుండటంతో లెక్కల్లో మార్పు కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా 3.6 శాతంగా ఉంది. మొత్తం రోడ్ల నిడివి 1,07,871.2 కిలోమీటర్లు ఉండగా ఇందులో జాతీయ రహదారులు 3,910 కిలోమీటర్ల మేర ఉన్నాయి. అయితే ఇది 10 నెలల కిందటి నాటి పరిస్థితి. 2021–22 ఆర్థిక ఆర్థిక సంవత్సరంలో దాదాపు మరో వెయ్యి కిలోమీటర్ల రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో జాతీయ రహదారుల మొత్తం నిడివి 4,983 కి.మీ. కు చేరింది. అంటే మొత్తం రోడ్లలో వీటి వాటా 4.6 శాతానికి చేరింది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు జాతీయ రహదారులు 4.06 కిలోమీటర్లు ఉండగా రాష్ట్రంలో 4.45 కిలోమీటర్లు ఉన్నాయి. నల్గొండ టాప్.. పెద్దపల్లి లాస్ట్: రాష్ట్ర సర్కారు లెక్కల ప్రకారం జాతీయ రహదారుల్లో నల్గొండ జిల్లా వాటా ఎక్కువుంది. ఈ జిల్లాలో 273 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులున్నాయి. నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో జాతీయ రహదారులే లేకపోవటంతో అట్టడుగు స్థానంలో ఉంది. -
ఆకట్టుకున్న ఊరు భంగం నాటకం
గన్‌ఫౌండ్రీ: నాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు. రసరంజని సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రవీంద్రభారతిలో ప్రదర్శించిన ఊరు భంగం అనే నాటకం ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. అంతరించిపోతున్న నాటక రంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉందన్నారు. రసరంజని సంస్థ ప్రతినిధులు, నాటక ప్రియులు పాల్గొన్నారు. -
తెలంగాణలో ఆయుష్మాన్ భారత్’ అమలు చేయాలి
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేయకుండా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దూరం చేస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. ఆయుష్మాన్ భారత్ అన్ని రాష్ట్రాలలో అమలవుతుంటే తెలంగాణలో అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం చిక్కడపల్లిలో బీజేపీ రాంనగర్ డివిజన్ ప్రధాన కార్యదర్శులు సివేగి బాలు, కె.ఉపేందర్ ఆధ్వర్యంలో ఈ–శ్రమ్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం 300లకు పైగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కె.రవిచారి, జి.భరత్‌గౌడ్, జైపాల్‌రెడ్డి, సి.పార్ధసారథి, గడ్డం నవీన్, ప్రవీణ్ నాయక్, కిరణ్, లోక్యానాయక్, రమణయ్య, సంపత్‌రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు. -
మరోసారి చాన్స్! ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ఓకే
2014 జూన్ 2 నాటికి ముందు ఆక్రమణలో ఉన్నట్టు రుజువులున్న స్థలాలనే క్రమబద్ధీకరిస్తారు. దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు కార్డు (ఆధార్‌కార్డు/ఏదైనా డాక్యుమెంట్)తోపాటు.. స్థలం తమ అధీనంలో ఉన్నట్టు నిరూపించే ఆస్తిపన్ను రశీదు/విద్యుత్ బిల్లు/తాగునీటి బిల్లు/రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వంటివాటిలో ఏదైనా ఒకటి జత చేయాలి. ఖాళీ భూములను క్రమబద్ధీకరించరు. నివాసేతర వినియోగంలో ఉన్న స్థలాల్లో కూడా ఏదో ఒక నిర్మాణం ఉండాలి. ఎలాంటి వివాదాల్లేని ప్రభుత్వ భూములు, పట్టణ భూగరిష్ట పరిమితి చట్టంలోని మిగులు భూములను మాత్రమే క్రమబద్ధీకరిస్తారు. సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పించింది. 2014 డిసెంబర్లో జారీ చేసిన జీవో నంబర్.58, 59కు అనుగుణంగా.. భూముల అసైన్మెంట్, క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపు కోసం దరఖాస్తులకు గడువిస్తూ సీఎస్ సోమేశ్‌కుమార్ సోమవారం జీవో నంబర్ 14ను జారీ చేశారు. దీనికి అనుగుణంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 21 నుంచి మార్చి 31 వరకు మీసేవ కేంద్రాల్లో క్రమబద్ధీకరణ దరఖాస్తు చేసుకోవచ్చు. 2014 జూన్ 2వ తేదీకి ముందే ఆక్రమణకు గురైన స్థలాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. పెండింగ్‌తోపాటు కొత్తగా కూడా.. గతంలో జారీచేసిన నంబర్ 58, 59 జీవోల కింద రాష్ట్రవ్యాప్తంగా 3.5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 2లక్షల వరకు దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం రెండు వాయిదాల్లో నిర్దేశిత ఫీజును చెల్లించకపోవడం, తగిన ఆధారాలు సమర్పించకపోవడంతో మిగతా 1.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. అయితే.. ఎన్ని దరఖాస్తులు, ఏయే కారణాలతో పెండింగ్‌లో పడ్డాయన్న వివరాలను ప్రభుత్వం ఇటీవలే అన్ని జిల్లాల నుంచి సేకరించింది. పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ఆ వివరాలను పరిశీలించి.. మరోమారు క్రమబద్ధీకరణ అవకాశం కల్పించాలని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెండింగ్‌లో ఉన్నవాటిని పరిష్కరించడంతోపాటు గతంలో దరఖాస్తు చేసుకోలేనివారు కూడా జీవో 14 ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చని.. వ్యక్తిగత ధ్రువీకరణతోపాటు సదరు భూమి కబ్జాలో ఉన్నట్టు తగిన ఆధారాలను సమర్పించాలని రెవెన్యూ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ భూముల ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని పేర్కొన్నాయి. 58, 59 జీవోల్లోని అంశాలివే.. – 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్లను ఉచితంగా క్రమద్ధీకరిస్తారు. – 250 చదరపు గజాల్లోపు ఆక్రమణలకు ప్రభుత్వ కనీస ధరలో 50శాతం.. 250–500 చదరపు గజాల స్థలాలకు కనీస ధరలో 75 శాతం సొమ్మును ఫీజుగా కట్టాలి. – 500 నుంచి 1000 చదరపు గజాల స్థలాల విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకున్నవారు ప్రభుత్వ కనీస ధరను పూర్తిగా చెల్లించాలి. – విస్తీర్ణంతో సంబంధం లేకుండా.. నివాసేతర వినియోగ భూములకు ప్రభుత్వ కనీస ధర పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. – ఈ భూముల క్రమబద్ధీకరణ కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. – క్రమబద్ధీకరణపై ఆర్డీవో చైర్మన్‌గా, సంబంధిత తహశీల్దార్ సభ్యులుగా ఉండే కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. – తహసీల్దార్లు సదరు దరఖాస్తుదారుల కుటుంబాల్లోని మహిళల పేరు మీదే కన్వేయన్స్ డీడ్‌ను చేసి ఇవ్వాల్సి ఉంటుంది. – ఏవైనా సమస్యలు తలెత్తితే జాయింట్ కలెక్టర్ సంబంధిత కమిటీకి తగిన సూచనలు చేస్తారు. – ఏ దరఖాస్తునైనా ఎలాంటి కారణం చూపకుండానే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని జీవోల్లో పేర్కొన్నారు. చార్జీలు/ఫీజులపై స్పష్టత కరువు! 2014 నాటి 58, 59 జీవోల ప్రకారం తాజా క్రమబద్ధీకరణ ఉంటుందని ప్రభుత్వం ప్రకటించినా.. చార్జీలు/ఫీజుల విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. గతంలో పెండింగ్‌లో పడ్డ 1.5 లక్షల దరఖాస్తులకు అప్పటి ధరలే వర్తింపజేయవచ్చని అధికారవర్గాలు చెప్తున్నా.. ఒకవేళ ప్రస్తుత మార్కెట్ ధరలను ఏమైనా పరిగణనలోకి తీసుకుంటారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక కొత్తగా చేసుకునే దరఖాస్తులకు సంబంధించి.. ఇటీవల పెంచిన భూములు/స్థలాల ధరలే వర్తిస్తాయని అధికారులు అంటున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదని పేర్కొంటున్నారు. -
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఆల్విన్‌కాలనీ/భాగ్యనగర్‌కాలనీ: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానందనగర్, ఆల్విన్ న్కాలనీ, హైదర్‌నగర్, కూకట్పల్లి డివిజన్ల పరిధిలో పలువురు లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా లబ్దిపొందిన 14 మందికి చెక్కులను శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ సంక్షేమ ప్రభుత్వంగా పేరు గాంచిందన్నారు. సంక్షేమ పథకాలకు ఏ లోటూ రాకుండా ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ పేదలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓ యాదగిరి, మాజీ కార్పొరేటర్ రంగారావు, చందానగర్ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడ ఎర్రగుడ్ల శ్రీనివాస్‌యాదవ్, హఫీజ్‌పేట్ అధ్యక్షుడు గౌతమ్‌గౌడ్, నాయకులు కాశీనాద్ యాదవ్, యాదగిరి గౌడ్, వెంకటేష్‌గౌడ్, దాత్రి గౌడ్, సత్యనారాయణ రాజు పాల్గొన్నారు. -
ఆక్షన్‌కి యాక్షన్.. వేలానికి ప్రభుత్వ ప్లాట్లు
సాక్షి, హైదరాబాద్: ఖజానాకు మరింత ఆదాయం సమకూర్చుకోవడంపై దృష్టిపెట్టిన రాష్ట్ర సర్కారు.. వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ‘రాజీవ్ స్వగృహ’ ఇళ్లస్థలాలను వేలం వేయాలని నిర్ణయించింది. తొమ్మిది జిల్లాల పరిధిలోని 1,408 ప్లాట్లను వేలం వేయడం ద్వారా రూ.800 కోట్ల వరకు రాబట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లాలవారీగా ప్లాట్ల వేలానికి సంబంధించిన వివరాలను శుక్రవారం ప్రకటించింది. జీహెచ్ఎంసీ మినహా చోట్ల భౌతికపద్ధతిలో వేలం నిర్వహిస్తామని తెలిపింది. గతేడాది హైదరాబాద్‌లో జరిగిన భూముల ‘ఈ–వేలం’లో ‘హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన అభివృద్ధి సంస్థ (టీఎస్ఐఐసీ)’ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జిల్లాల్లో జరిగే వేలం నిర్వహణలో కలెక్టర్లకు సహకరించి, పర్యవేక్షించే బాధ్యతను వాటికే అప్పగించారు. వేలానికి వీలుగా ఉన్న ప్రాజెక్టుల లేఔట్లను ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు.. ఈనెల 18న, వచ్చే నెల ఏడున ప్రిబిడ్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 12 నుంచి వచ్చే నెల 10వ తేదీ మధ్య కొనుగోలుదారులు సంబంధిత స్థలాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. వచ్చే నెల 14, 15, 16, 17 తేదీల్లో జిల్లాల వారీగా ప్లాట్ల వేలం ప్రక్రియ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. త్వరగా ఇళ్లు కట్టుకునేలా వసతులు వేలం వేసే ప్రాజెక్టుల్లో ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి అంతర్గత రోడ్లు, వీధి దీపాలు తదితర మౌలిక వసతులను పూర్తిచేస్తారు. ఎటువంటి చిక్కుల్లేని వివాద రహిత ఓపెన్ ప్లాట్లలో వెంటనే నిర్మాణాలు చేపట్టేలా అనుమతులు కూడా ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఈ ప్రాజెక్టుల్లో రెసిడెన్షియల్, ఇతర అవసరాలకు వీలుగా ప్లాట్లను 60 చదరపు గజాల నుంచి గరిష్టంగా 315 చదరపు గజాల వరకు విభజించారు. పెద్ద ప్లాట్లు, అపార్టుమెంట్లు, వాణిజ్య సముదాయాల కోసం 6,500 చదరపు గజాల విస్తీర్ణమున్న స్థలాలను కూడా వేలంలో విక్రయిస్తారు. ఇప్పటికే వేలం వేసే ప్రాజెక్టుల స్థితిగతులపై సంబంధిత జిల్లా కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. వేలానికి సంబంధించిన విధి విధానాలను ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సంబంధిత జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఖరారు చేశారు. మహబూబ్‌నగర్, గద్వాల, నల్లగొండ జిల్లాల్లో వేలం నిర్వహణ బాధ్యతలను హెచ్ఎండీఏకు అప్పగించగా.. రంగారెడ్డి, కామారెడ్డి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో జరిగే వేలాన్ని టీఎస్ఐఐసీ పర్యవేక్షిస్తుంది. హైదరాబాద్‌లో స్పందనను బట్టి.. గతేడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ భూములకు హెచ్ఎండీఏ, టీఎస్ఐఐసీ ‘ఈ–వేలం’ నిర్వహించగా భారీ స్పందన వచ్చింది. ప్రభుత్వ ఖజానాకు ఏకంగా రూ.2 వేల కోట్ల మేర ఆదాయం లభించింది. ఖానామెట్, కోకాపేట, ఉప్పల్ భగా యత్, పుప్పాలగూడ తదితర కీలక ప్రాంతాల్లో ఎక రానికి అప్సెట్ ధర సగటున రూ.25 కోట్లుగా నిర్ణ యించగా.. గరిష్టంగా రూ.60 కోట్ల వరకు కూడా ధర పలికింది. ఈ నేపథ్యంలో జిల్లాల్లోనూ నిర్వ హించే భూముల వేలానికి మంచి ధర వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వచ్చే నెలలో నిర్వ హించే వేలంలో శేరిలింగంపల్లిలోని మూడు ప్లాట్లకు చదరపు గజానికి గరిష్టంగా రూ.40 వేలు అప్సెట్ ధర నిర్ణయించగా.. జిల్లాల్లో అప్సెట్ను రూ.5 వేల నుంచి రూ.10 వేల మధ్య నిర్ణయించారు. ‘స్వగృహ’ ఆగిపోవడంతో.. మధ్యతరగతి వారికి మార్కెట్ ధరతో పోలిస్తే 25% తక్కువ ధరకు ఇండ్లు నిర్మించి ఇచ్చే లక్ష్యంతో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ‘రాజీవ్ స్వగృహ’ పథకాన్ని ప్రారంభించింది. తెలంగాణలో జీహెచ్ఎంసీ సహా 15చోట్ల రాజీవ్ స్వగృహ ప్రాజెక్టులను ప్రారంభించారు. వివిధ కారణాలతో ఇవి మధ్యలో నిలిచిపోయాయి. చాలాచోట్ల ఓపెన్ ప్లాట్లతోపాటు నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లు, ఇళ్లు నిరుపయోగంగా ఉండిపోయాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న ఇళ్ల స్థలాలను వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
మణికొండ జాగీర్ భూముల వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. హైదరాబాద్ మణికొండ జాగీర్ భూముల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1654 ఎకరాలు తెలంగాణ ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో వేల కోట్లు విలువ చేసే భూములు ప్రభుత్వానికి దక్కాయి. 2016 నుంచి సుప్రీంకోర్టులో జాగీర్ భూముల కేసు కొనసాగుతుండగా.. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో 1654 ఎకరాలపై ప్రభుత్వానికి సర్వ హక్కులు లభించాయి. కాగా ప్రభుత్వం, వక్ఫ్ బోర్డుమధ్య ఎన్నో ఏళ్లుగా భూముల వివాదం కొనసాగుతోంది. హజరత్ హుస్సేన్ షా వలి అని పిలవబడే దర్గాకు చెందిన 1654 ఎకరాల 32 గుంటలు తమవేనంటూ వక్ఫ్ బోర్డు కోర్టు కెక్కింది. ఇందుకు సంబంధించి ఏపీ హైకోర్టులో వక్ఫ్ బోర్డుకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పలుమార్లు వాదనలు నడిచాయి. అయితే, 2012 ఏప్రిల్ 3న వక్ఫ్ బోర్డుకు అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. చదవండి: అనూహ్య పరిణామం: ఎన్నికల వేళ డేరా బాబా బయటకు! దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ భూముల విషయంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు పక్కన పెట్టేసింది. హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ.. మొత్తం భూములపై సర్వ హక్కులు తెలంగాణా ప్రభుత్వానివేనంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, రామసుబ్రమణిన్ ధర్మాసనం 156 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డు మధ్య నలుగుతున్న వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. చదవండి: ఇసుక, సిమ్మెంట్ లేకుండా ఇల్లుని నిర్మించారు ఎలాగో తెలుసా!! -
భారీగా పెరిగిన వ్యవసాయ భూముల విలువ.. 42 గ్రామాల్లో 150% పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 42 గ్రామాల్లో వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలు 150 శాతం అంటే రెండున్నర రెట్లు పెరగనున్నాయి. ఈ మేరకు సగటున వ్యవసాయ భూముల విలువను 50 శాతం పెంచాలని, కొన్ని గ్రామాల్లో మాత్రం 75, 100, 125, 150 శాతం శ్లాబుల్లో సవరించాలని నిర్ణయించింది. ఇందుకు ప్రభుత్వ విలువ, అమ్మకపు ధరకు మధ్య ఉన్న తేడా (టైమ్ డిఫరెన్స్ రేంజ్ (టీడీఆర్)ను పరిగణనలోకి తీసుకుంది. వాస్తవానికి, రాష్ట్రంలో గతేడాది జూలైకి ముందు ఏడేళ్లపాటు భూముల విలువలు సవరించనందున ప్రభుత్వ విలువలకు, మార్కెట్లో అమ్మకపు ధరకు వ్యత్యాసం భారీగా పెరిగింది. దీన్నే ప్రాతిపదికగా తీసుకుని ఈ వ్యత్యాసం ఎక్కువగా ఉన్నచోట్ల వ్యవసాయ భూములతో పాటు ఖాళీస్థలాల విలువలను పెంచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ కసరత్తు పూర్తిచేసి తుది విలువలను ఖరారుచేసింది. అయితే ఫ్లాట్ల విలువల సవరణ విషయంలో మాత్రం ఆచితూచి వ్యవహరించిన అధికారులు చాలా తక్కువగా సవరణ ప్రతిపాదనలను ఖరారుచేశారు. తద్వారా మధ్యతరగతి ప్రజలు అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలుచేసినా రిజిస్ట్రేషన్ ఫీజు భారం ఎక్కువ పడకుండా జాగ్రత్త తీసుకున్నారు. దీంతోపాటు ప్రభుత్వ విలువ పెరిగితే ఆ మేరకు రియల్టర్లు బహిరంగ మార్కెట్ ధరను కూడా పెంచితే ఫ్లాట్ల ధరలు భారీగా పెరిగే అవకాశమున్న నేపథ్యంలో ఫ్లాట్ల విలువలను పెద్దగా సవరించలేదు. ఖాళీ స్థలాలను సగటున 35 శాతం పెంచగా, ఫ్లాట్ల విలువను 25 శాతం మాత్రమే సవరించారు. సమస్యలు రాకుండా నోడల్ అధికారులు సవరించిన విలువలు వచ్చేనెల 1 నుంచే అమల్లోకి వస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. జిల్లా స్థాయి కమిటీల ఆమోదం వచ్చి ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తయినందున శనివారం నుంచే విలువల అప్లోడ్పై అధికారులు దృష్టి పెట్టనున్నారు. ఆదివారం ఎలాగూ సెలవు కాబట్టి అవసరమైతే సోమవారం రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను నిలిపివేసి కొత్త విలువల అమలులో ఇబ్బందులు, సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ట్రయల్స్ పూర్తి చేసుకుంటామని చెబుతున్నారు. కొత్త విలువల అమల్లో సమస్యలూ రాకుండా చూసేందుకు 33 జిల్లాలకు 33 మంది నోడల్ అధికారులను నియమించారు. ఇందులో జిల్లా రిజిస్ట్రార్లతో పాటు పలువురు సబ్ రిజిస్ట్రార్లు ఉన్నారు. -
తెలంగాణలో ఆ 5,925 ప్రాంతాలు.. విలువల మధ్య భారీ వ్యత్యాసం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చాలాచోట్ల భూముల ప్రభుత్వ విలువలకు, బహిరంగ మార్కెట్లో అమ్ముతున్న ధరలకు పొంతనే లేదని తేలింది. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల సవరణలో భాగంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ జరిపిన పరిశీలనలో ఐదు జిల్లాల్లోని 5,925 ప్రాంతాల్లో ఈ రెండు విలువల మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్టు తేలింది. ఆ శాఖ ఉన్నతాధికారులు తయారు చేసిన నివేదిక ప్రకారం ఈ రెండు విలువల మధ్య కనీసం మూడింతల నుంచి 13 రెట్ల వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల విలువల సవరణను భారీగానే ప్రతిపాదించారని తెలుస్తోంది. ఈ ప్రాంతాల్లో అమ్మకపు విలువకు చాలా తక్కువగానే ప్రభుత్వ విలువను సవరించినా ప్రస్తుతమున్న విలువకు రెట్టింపు చేయాల్సి వచ్చింది. అదే విధంగా ఈ ప్రాంతాల్లో అపార్ట్మెంట్ల విలువల్లో కూడా రెండింతల వ్యత్యాసం ఉన్నట్టు తేలింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్న అనుకూలతకు అనుగుణంగా కొత్త ప్రభుత్వ విలువలను ప్రతిపాదించామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. -
కాలేజీలు మూసి.. స్కూళ్లు తెరుస్తారా?: తెలంగాణ హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఒకపక్క యూనివర్సిటీలు, కాలేజీలు మూసేస్తూ మరోవైపు ఈనెల 30 తర్వాత పాఠశాలలు తెరుస్తామని పేర్కొనడం ఏంటని హైకోర్టు ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వ అభిప్రాయం ఏంటో తెలిజేయాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావలిలతో కూడిన ధర్మాసనం కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలను శుక్రవారం మరోసారి విచారించింది. ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే సమ్మక్క సారలమ్మ జాతరకు లక్షలాది మంది హాజరయ్యే నేపథ్యంలో కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే జంటనగరాల్లో జరుగుతున్న వారాంతపు సంతల్లో ప్రజలు గుమిగూడకుండా, భౌతిక దూరం పాటించేలా ఎటువం టి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని అడిగింది. 3.45 లక్షల కిట్లు పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 77.33 లక్షల ఇళ్లల్లో జ్వర సర్వే నిర్వహించి స్వల్ప లక్షణాలున్నవారికి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని ప్రజా ఆరోగ్య విభాగం డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాసరావు వీడియో కాన్ఫరెన్స్‌లో ధర్మాసనానికి తెలిపారు. చిన్న పిల్లల వైద్యానికి సంబంధించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌పడకల సంఖ్య బాగా పెంచామని వివరించారు. లక్షణాలున్న వారికి పంపిణీ చేస్తున్న మందుల కిట్లలో చిన్న పిల్లలకు అవసరమైన మందులు లేవని, వారికి ప్రత్యేకంగా కిట్లు ఇచ్చేలా ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కౌటూరి పవన్‌కుమార్ నివేదించారు. చిన్నారుల వైద్యానికి ప్రభుత్వం ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని మరో పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్ నివేదించారు. వారాంతపు సంతల్లో ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారని, వీరి ద్వారా కరోనా వ్యాపించే అవకాశం ఉందని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది మయూర్‌రెడ్డి పేర్కొన్నారు. జాతరలో కోటిమంది పాల్గొనే అవకాశం గోదావరి నది తీరంలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరలో ఐదు రాష్ట్రాల నుంచి 75 లక్షల నుంచి కోటి మంది పాల్గొనే అవకాశం ఉందని, కరోనా నియంత్రణకు తగిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున కరోనా వ్యాపించే అవకాశముందని మరో పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ నివేదించారు. కుంభమేళా సందర్భంగా పెద్ద ఎత్తున కరోనా వ్యాపించడాన్ని ఆయన గుర్తు చేశారు. చిరు వ్యాపారులను రోడ్డు మీద పడేయలేం వారాంతపు సంతలకు వెళ్లే వారి ద్వారా పెద్ద ఎత్తున కరోనా వ్యాపించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో వాటిని నిర్వహించకుండా ఆదేశించాలన్న వాదనను ధర్మాసనం సున్ని తంగా తిరస్కరించింది. ‘రోడ్ల మీద కూరగాయలు అమ్ముకొని, చిరు వ్యాపారాలు చేసుకొనేవారు వారి కొచ్చే రూ.100తో కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారాంతపు సంతలను మూసేసి వాళ్ల నోటి దగ్గర ముద్ద లాక్కోమంటారా? ఉపాధి లేకుం డా చేసి రోడ్ల మీద పడేయాలా? ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూనే ఉంది..’ అని ధర్మాసనం పేర్కొంది. మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశిస్తామని తెలిపింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని డాక్టర్ శ్రీనివాసరావును ఆదేశిస్తూ తదుపరి విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేసింది. -
హైదరాబాద్‌లో రూ. 1,14,000.. ములుగులో రూ. 1,700
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఖాళీ స్థలాల విలువలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. హైదరాబాద్‌కు, ములుగుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజాగా నిర్ధారించిన గజం భూమి ప్రభుత్వ విలువ మధ్య ఉన్న తేడా..‘భూమికీ ఆకాశానికీ..’ అనే నానుడిని గుర్తుతెస్తోంది. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ నడిబొడ్డున గజం విలువ రూ.1.14 లక్ష లుగా నిర్ధారణ కాగా, ములుగు జిల్లాలో అత్యధి కంగా గజానికి రూ.1,700గా మాత్రమే నిర్ధారిం చారు. అంటే ఈ రెండు ప్రాంతాల నడుమ ఏకంగా 67రెట్ల వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ప్రభుత్వ విలువలను జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ల శాఖ ఖరారు చేసి ఆయా జిల్లాలకు పంపింది. ఈ వివరాలను పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ములుగు తర్వాత భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా రూ.2,400 గజం విలువ కాగా, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, చార్మినార్, నయాపూల్‌లో రూ.1.05 లక్షలుగా ఖరారయిం ది. హైదరాబాద్ దూద్‌బౌలీలో రూ.87,800గా విలువ ఖరారయితే, రంగారెడ్డి జిల్లా మియా పూర్, చందానగర్, రాయ్‌దుర్గ్ లాంటి ప్రాం తాల్లో రూ. 52,700గా నిర్ధారించారు. మరిన్ని ఆసక్తికర విషయాలివే.. ► హైదరాబాద్ దూద్‌బౌలీలో ప్రస్తుతం రూ.65 వేలుగా ఉన్న గజం విలువను రూ.87,800కు పెంచారు. అదే ఇక్కడ అపార్ట్మెంట్లకు సంబంధించి చదరపు అడుగుకు ప్రస్తుతం రూ. 6,200 ఉండగా దాన్ని రూ.7,800 మాత్రమే పెంచారు. ► బంజారాహిల్స్ రోడ్ నం:3, 1, పంజాగుట్ట ప్రాంతాల్లో ప్రస్తుతం రూ.84,500 ఉన్న చదరపు గజం విలువను రూ. 1,14,100కు పెంచారు. ఇక్కడ అపార్ట్మెంట్లకు గాను చదరపు అడుగుకు రూ.7,600 ఉండగా దాన్ని రూ.9,500కు పెంచారు. ► మాసాబ్‌ట్యాంక్, క్రాస్‌రోడ్స్, ఎస్ఆర్నగర్, ఖైరతాబాద్ అయోధ్య హోటల్, సంత్ నిరంకారి టూ రవీంద్రభారతి (లక్డీకాపూల్), ఏజీ ఆఫీస్ సర్కిల్ (సైఫాబాద్), అమీర్‌పేట క్రాస్‌రోడ్స్, పంజాగుట్ట రాజీవ్‌గాంధీ సర్కిల్, ఎర్రగడ్డ థెరెస్సా చర్చి, భరత్‌నగర్ ఫ్లైఓవర్, ఉమేశ్‌చంద్ర విగ్రహం తదితర ప్రాంతాల్లోనూ రూ.1.14 లక్షలుగా చదరపు గజం ఖాళీ స్థలం విలువలను నిర్ధారించారు. ► శ్రీనగర్ కాలనీలో రూ.78 వేలుగా ఉన్న విలువలను చదరపు గజానికి రూ. 1,05,300కు సవరించారు. ఫ్లాట్ల విలువ చదరపు అడుగుకు రూ. 7వేల నుంచి రూ.8,800కి సవరించారు. ► చార్మినార్ సమీపంలోని నయాపూల్‌లో కూడా ప్రభుత్వ విలువను భారీగానే పెంచారు. ఇక్కడ చదరపు గజానికి ఖాళీ స్థలం ప్రస్తుతం రూ. రూ.78 వేలు ఉండగా, దాన్ని రూ.1.05,300కు పెంచారు. ఫ్లాట్ల విలువ చదరపు అడుగుకు రూ. 7వేల నుంచి రూ.8,800కి సవరించారు. ► రంగారెడ్డి జిల్లాలో శంకరపల్లి, కేశంపేట, చౌదరిగూడ, ఫారూఖ్‌నగర్, కొందుర్గ్, మాడ్గుల్, కందుకూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఓ మోస్తరుగానే ధరలు ఖరారు చేశారు. నగర శివార్లలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పలు చోట్ల భారీ ఎత్తున ధరలు నిర్ధారణ అయ్యాయి. ► సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రోడ్డులో గజం భూమి విలువను అత్యధికంగా రూ.26,400గా నిర్ధారించగా, హుజూర్నగర్, కోదాడల్లో రూ.17,600, నేరేడుచర్లలో రూ.5,800గా అత్యధిక ధరలను ఖరారు చేశారు. ► యాదాద్రి జిల్లాలో భువనగిరిలో ఎక్కువ ధర ఉండగా, యాదగిరిగుట్టతో సహా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరుగానే ధరలను ఖరారు చేశారు. -
31 నుంచి పాఠశాలలు తెరుస్తున్నారా? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పాఠశాలల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నెల 31 నుంచి పాఠశాలలు తెరుస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టుకు తెలిపారు. అదే విధంగా వారాంతవు సంతల్లో కోవిడ్ నియంత్రణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సమ్మక్క జాతర ఏర్పాట్లపై నివేదిక సమర్పించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఆన్లైన్ ద్వారా చేపట్టిన విచారణకు డీహెచ్ శ్రీనివాస్ రావు హాజరయ్యారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 3.16 శాతం ఉందని తెలిపారు. 77 లక్షల ఇళ్లల్లో జ్వరం చేసి 3.45 లక్షల కిట్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. కిట్లలో పిల్లల చికిత్స ఔషధాలు లేవన్న న్యాయవాదులు ప్రస్తావించగా.. పిల్లలకు మందులు కిట్ల రూపంలో నేరుగా ఇవ్వకూడదన్న డీహెచ్ తెలిపారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదికను మూడు రోజుల్లో సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కరోనా పరిస్థితులపై విచారణ ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది. చదవండి: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి షాకింగ్ న్యూస్.. ఇక ఇంటికొస్తారు! -
చేనేత సంస్థ పోచంపల్లికి వచ్చేనా?
సాక్షి, హైదరాబాద్: వస్త్ర, దుస్తుల తయారీ పరిశ్రమ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభు త్వం కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎం టీపీ)తో పాటు అనేక టెక్స్టైల్, అపారెల్ పార్కులు ఏర్పాటుచేస్తోంది. కేఎంటీపీలో యాంగ్వాన్, కైటెక్స్ వంటి దిగ్గజ టెక్స్టైల్, అపారెల్ పరిశ్రమలు కార్య కలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసు కుంటున్నాయి. రాష్ట్రంలో 40 వేలకు పైగా చేనేత కార్మికులు ఉండగా.. సుమారు 35 వేలకు పైగా మరమగ్గాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో జౌళి రంగంలో సాంకేతిక నిపుణులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇందుకోసం సాంకేతిక శిక్షణ సంస్థలు ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ఉన్న అనుకూలతల దృష్ట్యా పోచంపల్లిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్ టీ) ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి పలు మార్లు ప్రతి పాదనలు పంపింది. ఐఐటీహెచ్ ఏర్పా టుకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చేం దుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే కేంద్రం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సానుకూల సంకేతాలు అందడం లేదు. ఏపీ వెంకటగిరిలో ఐఐహెచ్‌టీ దేశవ్యాప్తంగా ప్రస్తుతం పది ఐఐహెచ్‌టీలు ఉం డగా, ఆరు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ, మరో ఆరు రాష్ట్రాల టెక్స్టైల్ కమిషనర్ల పరిధిలో పనిచేస్తు న్నాయి. వారణాసి (ఉత్తరప్రదేశ్), సాలెమ్ (తమిళ నాడు), గువాహటి (అస్సాం), జోధ్‌పూర్ (రాజ స్తాన్), బార్ఘార్ (ఒడిశా), శాంతిపూర్ (పశ్చిమబెం గాల్) లోనివి కేంద్రం పరిధిలో ఉన్నాయి. వెంకట గిరి (ఏపీ), గదగ్ (కర్ణాటక), కన్నూరు (కేరళ), చంపా (ఛత్తీ‹స్‌గఢ్) ఐఐటీహెచ్లు రాష్ట్రాల పరిధి లో ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రస్తు తం తెలంగాణ విద్యార్థులకు వెంకటగిరి ఐఐటీ హెచ్లో మెరిట్ ప్రాతిపదికన ప్రవేశాలు లభిస్తున్నా యి. టెన్త్ చదివిన వారికి మెరిట్ ప్రాతిపదికన ఐఐహెచ్‌టీల్లో మూడేళ్ల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు దక్కితే స్టైపెండ్ కూడా లభిస్తుంది. 2024 నుంచి ప్రవేశాలు కష్టమే వెంకటగిరి ఐఐహెచ్‌టీలో 60 సీట్లు ఉండగా తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర కోటాలో 13 సీట్లు పోగా ఏపీ, తెలంగాణ విద్యార్థు లకు 47 సీట్లు అందుబాటులో ఉన్నాయి. విభజన చట్టం మేరకు 2023–24 విద్యా సంవత్సరం తర్వాత తెలంగాణ విద్యార్థులకు వెంకటగిరీ ఐఐటీ హెచ్లో ప్రవేశాలు నిలిచిపోనున్నాయి. విభజన సమయంలోనే ఒడిశాలోని బార్‌ఘర్ ఐఐటీహెచ్‌లో తెలంగాణ విద్యార్థులకు 8 సీట్లు ప్రత్యేకించారు. అయితే కోవిడ్ పరిస్థితుల్లో దూర ప్రాంతాల్లో ఉన్న ఐఐటీహెచ్‌లకు వెళ్లేందుకు రాష్ట్ర విద్యార్థులు విము ఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐఐటీహెచ్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరుగు తోంది. ఐఐటీహెచ్ ఏర్పాటు చేస్తే రాష్ట్ర విద్యార్థులు స్పిన్నింగ్, వీవింగ్ (నేత), డిజైనింగ్, డైయింగ్ (అద్దకం), ప్రింటింగ్ (ముద్రణ), గార్మెంట్ మేకింగ్ (దుస్తుల తయారీ), మార్కెటింగ్, మేనేజ్మెంట్ తదితర అంశాల్లో శాస్త్రీయ పద్దతుల్లో శిక్షణ, నైపుణ్యం పొందేందుకు అవకాశం లభిస్తుంది. నైపుణ్యాలు పెంపొందుతాయి ప్రస్తుతం చాలామంది యువకులు చేనేత రంగం వైపు వైపు వస్తున్నారు. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ మానేసి సొంతంగా 25 మగ్గాలు పెట్టి 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాను. నేనే స్వతహాగా డిజైన్లు తయారు చేసి చీరెలను తయారు చేయి స్తాను. ఐఐహెచ్‌టీ ఏర్పాటు ద్వారా సాంకేతిక పరి జ్ఞానం పెరిగి కొత్తకొత్త డిజైన్లు సృష్టించేందుకు అవకాశం ఏర్పడుతుంది. నాణ్యత పెరుగుతుంది. మరింత ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సాంప్రదాయ డిజైన్లకు నవీన పోకడలు చేనేత ఉత్పత్తుల్లో తెలంగాణ దేశంలోనే అగ్ర గామిగా ఉంది. అంతర్జాతీయంగా పేరొందిన ఇక్క త్తో పాటు గద్వాల పట్టు, కొత్తకోట పైఠానీ, వరం గల్ డర్రీస్ ఇలా లెక్కలేనన్ని నేత ఉత్పత్తులకు తెలంగాణ ప్రసిద్ది. ఇలాంటి చోట ఐఐహెచ్‌టీ లాంటి పేరొందిన సంస్థ ఏర్పాటు చేస్తే సాంప్రదాయ డిజైన్లకు నవీన పోకడలు జోడించి వస్త్ర రంగంలో నూతన ఆవిష్కరణలకు బాటలు వేయొచ్చు. – యర్రమాద వెంకన్న నేత, చైర్మన్, అఖిల భారత పద్మశాలి సంఘం (చేనేత విభాగం) -
తెలంగాణ: ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వైద్యారోగ్య శాఖపై సీఎం కేసీఆర్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్ వ్యాప్తి, కరోనా పరిస్థితులు, టీకా పంపిణీ వంటి అంశాలపై చర్చించారు. 16 తర్వాత వైరస్ పరిస్థితులను బట్టి సెలవులపై నిర్ణయం తీసుకోనున్నారు. చదవండి: భార్య కోసం ఇద్దరు భర్తల లొల్లి.. మీడియా సమావేశం పెట్టి మరీ.. -
తెలంగాణ ప్రభుత్వంపై చిరంజీవి ప్రశంసలు
థియేటర్లలో సినిమా టికెట్ ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు.‘తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతఙ్ఞతలు. సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది’అని చిరంజీవి ట్వీట్ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు.🙏🏻🙏🏻 సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. pic.twitter.com/w6VbRMtrG5 — Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2021 -
విదేశాల్లో చదువుకు తెలంగాణ ప్రభుత్వం 20 లక్షలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువులంటే గతంలో డిగ్రీ, పీజీ మాత్రమే. ఇక విదేశీ విద్య అంటే అది అందని ద్రాక్షగా ఉండేది. కేవలం సంపన్నులకు మాత్రమే విదేశాలకు వెళ్లి చదివే స్థోమత ఉండేది. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ప్రతిభ ఉంటే చాలు సామాన్యులు కూడా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. ఆ విధంగా అవకాశాలు ఇంటి ముంగిట్లోకి వచ్చేశాయి. ఐటీ రంగం బాగా వ్యాప్తి చెందడంతో అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. ఇది కూడా విదేశీ చదువులపై విద్యార్థులు మక్కువ చూపేందుకు కారణమైంది. చదువుల్లో అత్యుత్తమ మార్కులు సాధించి విదేశీ వర్సిటీల్లో సీటు పొందిన వారికి తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకం కింద ఆర్థిక చేయూతను అందిస్తున్నది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదని సంబంధిత అధికారులు వెల్లడించారు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో అర్హత గల సుమారు 50 వేల మంది విద్యార్థులకు ఈ పథకం విశేషంగా దోహదపడునున్నది. చదవండి: ప్రేమ పేరుతో మోసం.. శారీరకంగా లొంగదీసుకొని.. చివరకు దరఖాస్తు కోసం ఏం చేయాలి విదేశీ విద్యకోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం విదేశీ విద్యానిధి వెబ్సైట్లో చూడవచ్చు. ఇతర సామాజిక వర్గాల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఇంకో అవకాశం కల్పించనున్నారు. ఇవీ అర్హతలు ► విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారై ఉండాలి. ► వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. ► తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. ► డిగ్రీ, ఇంజనీరింగ్‌లలో 60 శాతం మార్కులు తప్పనిసరి. అర్హత సాధిస్తే రూ.20 లక్షలు మంజూరు విదేశీ విద్యానిధి పథకం కింద ప్రభుత్వం రూ.20 లక్షలు మంజూరు చేస్తుంది. వీసా వచ్చిన తర్వాత రూ.10 లక్షలు అక్కడి ఖర్చుల నిమిత్తం రూ.10 లక్షలు చెల్లిస్తుంది. విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి వడ్డీ కింద అదనంగా రూ.10 లక్షల విద్యారుణం తీసుకోవచ్చు. విమాన టిక్కెట్‌కు డబ్బులు ప్రభుత్వమే చెల్లిస్తుంది. జత చేయాల్సిన పత్రాలు ► పదో తరగతి ఇంటర్, డిగ్రీ, బీటెక్ ధ్రువీకరణ పత్రాలు ►ఆదాయ, నివాస, కుల ధవీకరణ పత్రాలు ► పాస్‌పోర్ట్, వీసా ►యూనివర్సిటీ అనుమతి పొందిన ఎఫ్–1 కాపీ ► జీఆర్ఈ, జీమాట్, టోఫెల్, ఐఎఫ్ఎల్టీఎస్ వివరాలు ►బ్యాంకు ఖాతా సమాచారం వెలువడిన ప్రకటన విద్యానిధి పథకానికి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఎస్సీ, ఎస్టీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు గాను ఇప్పటికే అన్ని కళాశాలల విద్యార్థులకు ఆయా శాఖల కమిషనర్లు అవగాహన కల్పించారు. స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం పథకం వివరాలను అందజేశారు. దేశాలు.. కోర్సులు అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా, సింగపూర్, జర్మని, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో ఈ పథకం కింద చదువుకునేందుకు అవకాశం కల్పించారు. ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, సైన్స్, అగ్రికల్చర్ సైన్స్, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, పీజీ, పీహెచ్డీ కోర్సుల్లో చేరేందుకు ఈ పథకం వర్తిస్తుంది. ఎంపిక ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కమిటీ ఎంపిక చేస్తుంది. కమిటీ చైర్మన్‌గా ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్, ఎస్సీ కమిషనర్, టెక్నికల్ ఎడ్యుకేషనల్ కమిషనర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, విదేశీ విద్యలో ఒక అనుభవజ్ఞుడు ఉంటారు. -
వచ్చే ఏడాది సెలవులివే.. ఆ నెలలోనే అధిక సెలవులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది సాధారణ సెలవులను ప్రభుత్వం వెల్లడించింది. 2022 సంవత్సరంలో మొత్తం 23 ప్రభుత్వ సాధారణ సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ నెలలోనే ఆరు సాధారణ సెలవులు రానున్నాయి. ఉగాది, శ్రీరామనవమితో పాటు మరో నాలుగు సెలవులు ఈ నెలలో రానున్నాయి. చదవండి: కావలి మేఘనకు కేటీఆర్ అభినందనలు, శాలువాతో సత్కారం అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే జనవరి 1న సెలవు దినంగా ప్రకటించినందున, ఆరోజుకు బదులుగా ఫిబ్రవరి 12 రెండో శనివారం రోజున కార్యాలయాలు పని చేస్తాయని తెలిపారు. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులు ఐదుకు మించి ఐచ్ఛిక సెలవులు (ఆప్షనల్ హాలిడేస్) వాడుకోరాదని సూచించారు. (చదవండి: కిలో టమాట రూ. 50.. ఎగబడ్డ జనం) -
మీరే ఇప్పించి.. తీసేసుకోండి!
సాక్షి, అమరావతి: తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకున్న విద్యుత్‌కు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ.6,283.68 కోట్ల బకాయిలను ఇప్పించాల్సిందిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇంధన శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ సమస్యలపై శనివారం నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర డిస్కంలు పొందుతున్న ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ పథకం రుణం కింద ఏపీ జెన్కో బకాయిలు జమ చేయాలని రాష్ట్రం కోరనుంది. ఈ పథకం ద్వారా కేంద్రం రాష్ట్రాలకు రుణాలిస్తుంటుంది. ఏపీకి సంబంధించిన రుణ బకాయిలను తెలంగాణ నుంచి తీసుకోవాలని ప్రధానంగా విజ్ఞప్తి చేయనుంది. నాడు ఆదుకున్న ఏపీ: ఏపీ విభజన సమయంలో డిమాండ్‌కు సరిపడా తెలంగాణలో విద్యుదుత్పత్తి లేకపోవడంతో ఏపీజెన్కో తెలంగాణ డిస్కంలకు 8,890 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 వరకు సరఫరా చేసింది. ఆ కాలంలో సరఫరా చేసిన విద్యుత్ ఖర్చు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం, రూ.3,441.78 కోట్లు, ఆలస్యమైనందుకు సర్‌చార్జి రూ.2,841.90 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకు తెలంగాణ చెల్లించలేదు. ప్రస్తుతం ఏపీ జెన్కో ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తెలంగాణ బకాయిలు రాకపోవడంతో.. ఏపీ జెన్కో జూన్ 2021లో విద్యుత్ ఆర్థిక సంస్థ, గ్రామీణ విద్యుదీకరణ సంస్థలకు రూ.1700 కోట్ల రుణ వాయిదాలను గడువులోగా తీర్చలేకపోయింది. జూలై, ఆగస్టులో చెల్లించాల్సిన మరో రూ.1,020 కోట్లు చెల్లించలేదు. అంగీకరించారు గానీ..: వాస్తవానికి 2019 ఆగస్టు 19న ఏపీ, తెలంగాణ విద్యుత్ సంస్థల మధ్య జరిగిన సమావేశంలోనూ, 2020 జనవరి 30న ఏపీ, తెలంగాణ సీఎస్ల సమావేశంలోనూ తెలంగాణ, ఏపీలు కలిసి ఈ బకాయిల చెల్లింపుపై వివిధ సందర్భాల్లో చర్చించాయి. తెలంగాణ డిస్కంలు ఈ మొత్తాన్ని చెల్లించేందుకు అంగీకరించాయి. కానీ డబ్బులు ఇవ్వలేదు. కేంద్రం ఆదేశాలివ్వడం వల్లనే తెలంగాణకు విద్యుత్ సరఫరా చేసినందున ఆ బకాయిలను ఆత్మనిర్భర్ పథకం ద్వారా రాష్ట్రానికి ఇప్పించి, వాటిని ఆర్ఈసీ, పీఎఫ్‌సీల రుణాలకు జమచేసుకోవాలనే ప్రతిపాదనను అమిత్ షా ముందుంచాలని రాష్ట్రం భావిస్తోంది. -
‘పాలమూరు’ కోసంమళ్లీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై ఆధారపడి చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి పర్యావరణ అనుమతుల ప్రక్రియలో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అనుమతులు పొందే వరకు నిర్మాణ పనులు పూర్తిగా నిలిపివేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించిన నేపథ్యంలో అనుమతుల సాధన ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే అవసరమైన అన్ని నివేదికలు సిద్ధం చేసిన ఇంజనీర్లు.. ప్రభుత్వం అనుమతించిన వెంటనే అనుమతుల కోసం కేంద్ర పర్యావరణ శాఖకు దరఖాస్తు చేయనున్నారు. ఈఏసీ ఓకే అంటేనే అనుమతి.. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌లు, ఇతర నిర్మాణాలకు 27,193 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి ఉండగా మరో 205.48 హెక్టార్ల మేర అటవీ భూములు అవసరం కానున్నాయి. ఇందులో ఇప్పటికే 26 వేల ఎకరాల మేర భూసేకరణ పూర్తికాగా ఆగస్టులో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ వివరాలతోపాటు ఇతర అంశాలపై ఇరిగేషన్ శాఖ అధికారులు సమగ్ర నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖకు ఈ వివరాలు సమర్పించాల్సి ఉన్నా ప్రభుత్వం మొదట గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియను ముగించి ఆ తర్వాత కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల అనుమతుల ప్రక్రియ మొదలు పెట్టాలని భావించడంతో దీన్ని పక్కనపెట్టింది. అయితే ఎన్జీటీ పర్యావరణ అనుమతులు వచ్చేవరకు పనుల కొనసాగింపుపై ముందుకెళ్లొద్దని స్పష్టం చేయడంతో ఇప్పటికే సిద్ధం చేసిన నివేదికలను కేంద్ర పర్యావరణ శాఖకు పంపాలని ఇరిగేషన్ శాఖ భావిస్తోంది. ఈ నివేదికలను ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ (ఈఏసీ) పరిశీలించి పర్యావరణంపై పడే ప్రభావాన్ని మదింపు చేస్తుంది. ప్రాజెక్టు నిర్మాణాలకు ఎలాంటి అభ్యంతరం లేదని కమిటీ తేలిస్తేనే అనుమతుల ప్రక్రియ పూర్తి కానుంది. కేంద్రానికి దరఖాస్తు చేసిన రెండు నెలల్లో అనుమతులు వచ్చే అవకాశం ఉంటుందని ప్రాజెక్టు ఇంజనీర్లు చెబుతున్నారు. -
ఆజంజాహిలో కలెక్టరేట్ కష్టమేనా!
సాక్షి, వరంగల్: ఆజంజాహి మిల్లు స్థలంలో నిర్మించ తలపెట్టిన వరంగల్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిల్లులోని 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ భవనం నిర్మిద్దామనుకున్నా ఈ సంస్థ కార్మికుల విషయంలో మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో అక్కడ కలెక్టరేట్ నిర్మాణం కష్టం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మిల్లు మూతబడిన తర్వాత జీఓ 463 ప్రకారం 2007లో 134 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 200 గజాల చొప్పున స్థలం ఉచితంగా కేటాయించారు. తమకు కేటాయించక పోవడంతో మిగిలినవారు హైకోర్టును ఆశ్రయించారు. మిగతా 318 మంది కార్మికులకు స్థలాలు ఇవ్వడం సబబేనంటూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మంగళవారం అత్యున్నత న్యాయస్థానం కూడా ఆ తీర్పును సమర్థించింది. దీంతో అక్కడ కార్మికులకు పోనూ మిగిలే కొద్ది స్థలంలో కలెక్టరేట్ కడతారా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై కలెక్టర్ గోపి వ్యక్తిగతంగా సమీక్షించి ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. ఒకవేళ ఆజంజాహి మిల్లులో కాకుంటే ఆటోనగర్‌లోని ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించే అవకాశముందని వినవస్తోంది. ఇలావుండగా సుప్రీంకోర్టు తీర్పుపై ఆజంజాహి మిల్లు రిటైర్డ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా తమకు స్థలాలు కేటాయించాలని కోరారు. -
పంట చేతికొచ్చేవేళ.. గోనె సంచులేవీ?
వానాకాలం వరి కోతలు ఇప్పటికే మొదలయ్యాయి. దీంతోపాటే రైతులకు, అధికారులకు సమస్యలూ ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది. అయితే భారీయెత్తున ధాన్యం సేకరణకు పెద్ద సంఖ్యలో గోనె సంచులు కూడా అవసరం. కేంద్రానికి ఇండెంట్ పెట్టడంతో పాటు పాత సంచుల సేకరణకు రాష్ట్ర అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ సంచుల కొరత తీవ్రంగా ఉండటం ఓ సమస్యగా మారింది. ఇటు రైతు విషయానికొస్తే.. డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో వరి కోసే యంత్రాల అద్దెలూ పెరగడంతో ఆర్థిక భారంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ధాన్యంలో తరుగు తీయవద్దంటూ తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు అన్నదాతకు కొంతమేర ఉపశమనం కలిగించనున్నాయి. సాక్షి , హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ప్రారంభమ య్యాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జోరందుకోగా, నిజామా బాద్, కరీంనగర్ జిల్లాల్లో ప్రారంభమయ్యాయి. కోసిన పంటను కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ప్రారంభించినా.. ధాన్యం సేకరించేందుకు అవసరమైన గోనె సంచులు (గన్నీ బ్యాగులు) పౌరసరఫరాల శాఖ వద్ద అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఈసారి కోటి మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని భావి స్తున్న పౌర సరఫరాల శాఖకు 25 కోట్ల వరకు గన్నీ బ్యాగులు అవసర మవుతాయి. పంట కొను గోళ్ల సీజన్లో గన్నీ బ్యాగుల సమస్య ఎదురవు తున్నా పౌర సరఫరాల శాఖ ముందస్తు చర్యలు చేపట్ట డం లేదు. దీంతో ఈసారి ధాన్యం దిగుబడి భారీగా పెరగడంతో పరిస్థితి మరింత ఇబ్బందిగా మారే సూచనలు కన్పిస్తున్నాయి. అందుబాటులో ఉన్న కొత్త బ్యాగులు 5.41 కోట్లే వానాకాలంలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 16.73 లక్షల హెక్టార్లు కాగా.. సమృద్ధిగా కురిసిన వర్షాలు, భూగర్భ జలాల కారణంగా రికార్డు స్థాయిలో దాదాపు 25 లక్షల హెక్టార్లలో వరి సాగైంది. తద్వారా 1.33 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని పౌరసరఫరాల శాఖ లెక్కలు కట్టింది. రైతుల ఆహార అవసరాలు, మిల్లర్ల కొనుగోళ్లు, విత్తనాల కోసం పోగా 1.01 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని భావిస్తున్నారు. ఇందుకోసం 25.36 కోట్ల బ్యాగులు (సంచికి 40 కిలోల ధాన్యం చొప్పున నింపితే) అవసరం అవుతాయని పౌరసరఫరాల శాఖ అంచనా వేసి కేంద్ర ప్రభుత్వ జౌళి శాఖకు వివరాలు పంపింది. ప్రస్తుతం పౌరసరఫరాల శాఖ వద్ద కొత్త గన్నీ బ్యాగులు 5.41 కోట్లు అందుబాటులో ఉండగా, ఒకసారి వాడిన బ్యాగులు 49 లక్షలు ఉన్నాయి. మరో 54 లక్షలు చౌకధరల దుకాణదారుల వద్ద అందుబాటులో ఉన్నాయి. అలాగే రైస్ మిల్లర్ల వద్ద ఒకసారి ఉపయోగించిన గన్నీ బ్యాగులు 1.38 కోట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల్లో ఉన్న పాత గన్నీ బ్యాగులు కలిపి మొత్తంగా 8.06 కోట్ల గన్నీ బ్యాగులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇంకా సుమారు 17.30 కోట్ల గన్నీ బ్యాగులు అవసరమని పౌరసరఫరాల శాఖ నిర్ధారించింది. బెంగాల్, ఏపీల్లో ఉత్పత్తిపైనే ఆధారం రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన గన్నీ బ్యాగులను సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖ ఇప్పటికే కేంద్ర జౌళి శాఖకు ఇండెంట్ పెట్టినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. తదనుగుణంగా చెల్లించిన డీడీల ఆధారంగా పశ్చిమ బెంగాల్, ఏపీలోని ఏలూరు, విజయనగరం జిల్లాల్లో అందుబాటులో ఉన్న గన్నీ బ్యాగులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. దేశం మొత్తానికి పశ్చిమబెంగాల్, ఏపీల నుంచే గన్నీ బ్యాగులు సరఫరా కావలసిన నేపథ్యంలో లభ్యత ఆధారంగా సరఫరా జరుగుతుందని ఆ అధికారి తెలిపారు. అయితే వానాకాలం పంటలో తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున , కోతలు కోసినా ఆరబెట్టి మార్కెట్‌కు తెచ్చేందుకు సమయం పడుతుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది తలెత్తక పోవచ్చని అధికారులు భావిస్తున్నారు. గోనె సంచుల సమస్య ఉత్పన్నం కాదు రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చే ధాన్యం ఎంతైనా ప్రభుత్వమే కొంటుంది. సంచుల సమస్య ఉత్పన్నం కాదు. గన్నీ బ్యాగుల ఉత్పత్తిని బట్టి కేంద్రం ఆయా రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా పంపిస్తుంది. ఇప్పటికే కేంద్ర జౌళి శాఖకు పంపిన ఇండెంట్ ఆధారంగా సప్లై జరుగుతుందని భావిస్తున్నాం. గన్నీ బ్యాగులతో పాటు కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఆదేశాలు జారీ చేశాం. – గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి -
చార్టర్డ్ ప్లేన్స్‌కు అనుమతివ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతిపాదించిన ఆరు కొత్త విమానాశ్రయాల ఏర్పాటు విషయంలో తీవ్ర జాప్యం నేపథ్యంలో తొలుత చార్టర్డ్ విమానాలను నడుపుకొనేందుకు వీలుగా అనుమతులు పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా అధికారులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు ప్రతిపాదించారు. వాస్తవానికి ఏడాదిన్నర కిందటే ఈ అంశంపై ఏఏఐతో అధికారులు చర్చించారు. ఈ లోపు కన్సల్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఏఏఐ వాణిజ్య విభాగం.. టెక్నో ఫీజిబులిటీ సర్వే నిర్వహించేందుకు సిద్ధం కావటంతో ఆ అంశం మరుగున పడింది. దాదాపు రెండు నెలల కింద ఆ నివేదిక వచ్చింది. దాని ప్రకారం విమానాశ్రయాల నిర్మాణానికి భారీగా ఖర్చు కానుందని స్పష్టం చేసింది. దీంతో వీలైనంత వరకు ఖర్చు తగ్గించేలా కొన్ని అడ్డంకులను దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో మళ్లీ సర్వే చేయాల్సి రావటంతో కొత్త విమానాశ్రయాల అంశం కొలిక్కి రాలేదు. దీంతో భవిష్యత్తులో వాటిని పెద్ద విమానాలు నడుపుకొనేందుకు వీలుగా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తూనే.. తొలుత చిన్నపాటి రన్వేలు నిర్మించి చార్టర్డ్ విమానాలను నడిపేందుకు అనుమతులు ఇవ్వాలని తాజాగా కోరింది. వరంగల్ ఒక్కటే అనుకూలం.. నిజాం హయాంలో నిర్వహించిన వరంగల్ శివారులోని మామునూరులో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను తిరిగి అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా యత్నిస్తోంది. దీంతోపాటు జక్రాన్‌పల్లి (నిజామాబాద్), పాల్వంచ (భద్రాచలం–కొత్తగూడెం), బసంత్‌నగర్ (పెద్దపల్లి), ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో కూడా కొత్త విమానాశ్రయాలు నిర్మించాలని ప్రతిపాదించింది. తాజాగా ఏఏఐ అందించిన టెక్నో ఫీజిబిలిటీ నివేదిక ప్రకారం రూ.2,300 కోట్లకుపైగా ఖర్చు కానుంది. దీన్ని వీలైనంత తగ్గించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలను ఏఏఐ ముందుంచింది. విమానాశ్రయాల ఏర్పాటుకు ఉన్న అడ్డంకుల్లో కొన్నింటిని వదిలేస్తే ఖర్చు తగ్గుతుందనేది రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం. అది సాధ్యమా కాదా అన్న విషయంలో ఏఏఐ తిరిగి నివేదిక అందించాల్సి ఉంది. ఆ తర్వాత తుది సర్వే చేయాలి. ఇదంతా జరిగేందుకు సమయం పట్టే అవకాశం ఉన్నందున చార్టర్డ్ విమానాలను నడిపితే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇవి సమయ పట్టిక ఆధారంగా ప్రయాణికుల కోసం నడిపే విమానాలు కాదు. ముందస్తుగా బుక్ చేసుకుంటే సంస్థలు వాటిని ప్రైవేటు అవసరాల కోసం నడుపుతాయి. వీటిల్లో 19 సీట్ల వరకు ఉండే విమానాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ ఈ ప్రైవేటు విమానాలకు మన వద్ద అంతగా వ్యాపారం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ వేగంగా అభివృద్ధి చెందుతుండటం, అక్కడ పరిశ్రమలు భారీగా వస్తుండటం, సాఫ్ట్వేర్ రంగాన్ని కూడా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుండటంతో చార్టర్డ్ విమానాలకు కొంత డిమాండ్ మొదలవుతుందన్న అభిప్రాయంలో ఉంది. టేకాఫ్.. ల్యాండింగ్ ఒకవైపే.. సాధారణంగా రన్‌వేలకు టేకాఫ్, ల్యాండింగ్ వసతి రెండు వైపులా ఉండేలా ప్లాన్ చేస్తారు. మరోవైపు రెండు రన్‌వేలను నిర్మిస్తారు. రాష్ట్రంలో ప్రతిపాదిత ఆరు విమానాశ్రయాల ఖర్చు తగ్గించుకునే క్రమంలో తొలుత ల్యాండింగ్, టేకాఫ్ ఒకవైపే అయ్యేలా సాధారణ రన్‌వేతో ప్రారంభించాలని అధికారులు ఏఏఐకి ప్రతిపాదించారు. భవిష్యత్తులో వాటిని రెండు వైపులా విస్తరించటంతో పాటు రెండో రన్‌వేను కూడా నిర్మించుకోవచ్చని, తొలుత ఒకవైపే టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేలా రన్‌వేకు అనుమతించాలని కోరారు. -
పెద్దవాగుతో మొదలు
సాక్షి, అమరావతి: గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) పరిధిపై ప్రాథమికంగా స్పష్టత వచ్చింది. రెండు రాష్ట్రాల అంగీకారం మేరకు ఈ నెల 14 నుంచి గోదావరి పరీవాహక ప్రాంతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయిన పెద్దవాగును తొలి దశలో బోర్డు తన పరిధిలోకి తీసుకోనుంది. శ్రీరాంసాగర్ నుంచి సీతమ్మసాగర్ వరకు గోదావరిపై ఉన్న తెలంగాణ ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకోవాలన్న ఏపీ డిమాండ్‌పై తెలంగాణ సర్కార్ అభ్యంతరం తెలిపింది. దాంతో.. పరిస్థితులపై అధ్యయనం చేసి ఆ ప్రాజెక్టులను దశలవారీగా బోర్డు పరిధిలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తామని బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ చెప్పారు. పెద్దవాగు, సీలేరుపైనే కీలక చర్చ ప్రాజెక్టుల పరిధి, సిబ్బంది నియామకం, నిధులు తదితర అంశాలపై చర్చించేందుకు హైదరాబాద్‌లోని జలసౌధలో గోదావరి బోర్డు సోమవారం పూర్తిస్థాయి ప్రత్యేక సమావేశం నిర్వహించింది. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన జరిగిన భేటీలో ఏపీ, తెలంగాణ జల వనరుల శాఖ కార్యదర్శులు శ్యామలరావు, రజత్‌కుమార్, ఈఎన్సీలు నారాయణరెడ్డి, మురళీధర్, నారాయణరెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఎస్సార్ఎస్పీ నుంచి సీతమ్మసాగర్ వరకు చేపట్టిన అన్ని ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని ఏపీ అధికారులు పట్టుబట్టారు. ఎగువ రాష్ట్రమైన తెలంగాణ నుంచే గోదావరి ప్రవాహాలు దిగువకు రావాల్సి ఉందని, ఎగువన తెలంగాణ అనేక ప్రాజెక్టులు చేపట్టి నీటిని వినియోగించడంతో పాటు ఎప్పటికప్పుడు ఎత్తిపోతల ద్వారా చెరువులన్నింటినీ నింపుకుంటోందని తెలిపారు. దీనిపై తెలంగాణ అధికారులు అభ్యంతరం తెలిపారు. పెద్దవాగు కింద ఉన్న 16 వేల ఎకరాల ఆయకట్టులో 13 వేల ఎకరాలు ఏపీలోనే ఉన్నందున ఆ ప్రాజెక్ట్ నిర్వహణ వ్యయంలో ఏపీ 85 శాతం చెల్లించాలని తెలంగాణ అధికారులు కోరారు. తొలి దశలో ప్రయోగాత్మకంగా పెద్దవాగును తమ పరిధిలోకి తెచ్చుకొని, దాని అమలు, నిర్వహణ బాధ్యతలు చూస్తామని బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర సిబ్బంది ఆ రాష్ట్ర పరిధిలోనే పనిచేస్తారని తెలిపారు. ప్రభుత్వ స్థాయిలో చర్చించి.. పెద్దవాగును బోర్డుకు అప్పగించేలా ఉత్తర్వులు జారీ చేస్తామని రెండు రాష్ట్రాల అధికారులు చెప్పారు. సీలేరు విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టును బోర్డు పరిధిలోకి తేవాలని తెలంగాణ అధికారులు కోరడంపై ఏపీ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ వ్యవహారంలో చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ జోక్యం చేసుకుంటూ.. ఈ అంశం కేంద్రం పరిధిలో ఉందని, దానిపై తర్వాత చర్చిద్దామని చెప్పారు. బడ్జెట్ ఉద్దేశం చెబితే సీడ్‌మనీ ఇస్తాం బోర్డులకు ఇరు రాష్ట్రాలు చెల్లించాల్సిన చెరో రూ.200 కోట్ల సీడ్‌మనీ అంశంపైనా చర్చ జరిగింది. కేవలం ఒక్క ప్రాజెక్టునే బోర్డు పరిధిలో ఉంచినప్పుడు రూ.200 కోట్ల నిధులు అవసరం ఏముంటుందని రెండు రాష్ట్రాల అధికారులు ప్రశ్నించారు. అదీగాక నిధుల విడుదల ఆర్థిక శాఖతో ముడిపడి ఉన్నందున బడ్జెట్ ఉద్దేశాలను బోర్డు తమకు చెబితే ఆర్థిక శాఖకు తెలియజేస్తామని వివరించారు. కొలిక్కిరాని కృష్ణా బోర్డు పరిధి తెలంగాణ జల వనరులు, జెన్కో అధికారుల దాటవేత ధోరణి వల్ల కృష్ణా బోర్డు పరిధి కొలిక్కి రాలేదు. గెజిట్ నోటిఫికేషన్లో షెడ్యూల్–2 ప్రాజెక్టుల వివరాలను సోమవారం ఇస్తామని ఆదివారం చెప్పిన తెలంగాణ అధికారులు ఆ తర్వాత మాట మార్చారు. దాంతో పరిధి, స్వభావంపై ముసాయిదా నివేదికను అసంపూర్తిగానే కృష్ణా బోర్డుకు సబ్ కమిటీ కన్వీనర్ ఆర్కే పిళ్లై అందించారు. పరిధిపై నిర్ణయాధికారాన్ని మంగళవారం జరిగే కృష్ణా బోర్డు ప్రత్యేక సమావేశానికి అప్పగించారు. ఆదివారం కృష్ణా బోర్డు సబ్ కమిటీ సమావేశంలో ప్రాజెక్టుల వివరాలను సోమవారం ఇస్తామని తెలంగాణ అధికారులు చెప్పడంతో సోమవారం రాత్రి సబ్ కమిటీ మరోసారి భేటీ అయ్యింది. కానీ.. తెలంగాణ అధికారులు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. తెలంగాణ వాదనపై ఏపీ జల వనరుల శాఖ సీఈ శ్రీనివాసరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. శ్రీశైలం, సాగర్, పులిచింతలలో తెలంగాణ ఇష్టారాజ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ.. ఏపీ హక్కులను కాలరాస్తుండటం వల్లే జల వివాదం ఉత్పన్నమైన అంశాన్ని ఎత్తిచూపారు. జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను బోర్డు నియంత్రణలోకి తీసుకోకుండా ప్రాజెక్టులను మాత్రమే పరిధిలోకి తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదని తేల్చిచెప్పారు. ఈ వాదనతో సబ్‌కమిటీ కన్వీనర్ పిళ్లై ఏకీభవించారు. బోర్డు పరిధి, స్వరూపంపై బోర్డుకు నివేదిక ఇచ్చేందుకు సబ్‌కమిటీ రూపొందించిన ముసాయిదాపై తెలంగాణ అధికారులు సంతకం చేయడానికి నిరాకరించగా.. ఏపీ అధికారులు సంతకం చేశారు. -
కృష్ణా జలాల పునఃపంపిణీ పిటిషన్ ఉపసంహరణకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య సెక్షన్ –3 ప్రకారం కృష్ణా జలాల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలంటూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. నూతన ట్రిబ్యునల్ ఏర్పాటుకు ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశం సందర్భంగా కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సూచనల మేరకు పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అంగీకరించడం తెలిసిందే. న్యాయస్థానం వెలుపల సమస్యను పరిష్కరించుకునేందుకు వీలుగా వీలైనంత త్వరగా నూతన ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని గతంలో కేసీఆర్ కోరారు. కేంద్రానికి ఎలాంటి ఆదేశాలూ ఇవ్వం కాగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు చాంబర్లో పలుసార్లు విచారణ జరిగినప్పటికీ షరతులు లేని ఉపసంహరణకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం ఎదుట బుధవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. రిట్ పిటిషన్ ఉపసంహరణకు అంగీకరిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. అయితే పిటిషన్‌లోని తమ అభ్యర్థనను పరిశీలించాలని తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాదులు సీఎస్ వైద్యనాధన్, వి.గిరి, ముకుల్ రోహత్గిలు ధర్మాసనాన్ని కోరగా మహారాష్ట్ర తరఫు సీనియర్ న్యాయవాది నార్‌గోల్కర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎలాంటి షరతులు లేకుండా ఆ పిటిషన్ ఉపసంహరణకు అభ్యంతరం లేదని ఏపీ తరఫు అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ మెహ్‌ఫజ్ నజ్కీ నివేదించారు. దీంతో దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోమని ధర్మాసనం ప్రకటించింది. నదీ జలాల అంశం చాలా సున్నితమైనదని, ఇప్పటికే కృష్ణా జలాలపై మూడు అవార్డులు ఇవ్వగా నాలుగు రాష్ట్రాలు వేర్వేరు పిటిషన్లతో సుప్రీంకోర్టును ఆశ్రయించాయని ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే నివేదించారు. పరిశీలిస్తామని మాత్రమే చెప్పాం.. తమ అభ్యర్థన పిటిషన్లో స్పష్టంగా ఉందని, దీనిపై ధర్మాసనానిదే నిర్ణయమని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాధన్ తెలిపారు. అపెక్స్ కౌన్సిల్ సమావేశం మినిట్స్‌లో పొందుపరిచిన అంశాలను సీనియర్ న్యాయవాది వి.గిరి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రిట్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటే నూతన ట్రిబ్యునల్ ఏర్పాటును పరిశీలిస్తామని మినిట్స్‌లో ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. తాము కేవలం పరిశీలిస్తామని మాత్రమే చెప్పామని కేంద్ర జలశక్తి శాఖ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. అనంతరం ఎలాంటి షరతులు లేని ఉపసంహరణకు అనుమతిస్తామని, ఏవైనా అంశాలు ఉంటే కేంద్రాన్ని కోరాలని సూచిస్తూ ధర్మాసనం విచారణను ముగించింది. -
TS: ప్రత్యామ్నాయ సాగు.. వరికి బదులు ఐదు పంటలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వరి సాగును తగ్గించాలని నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం.. వచ్చే యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు రైతులను సన్నద్ధం చేసే దిశగా వ్యవసాయ శాఖ చర్యలు మొదలుపెట్టింది. గత ఏడాది యాసంగి సాగుతో పోలిస్తే దాదాపు 23శాతం దాకా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి.. బదులుగా ఇతర పంటలను సాగు చేయించాలని జిల్లా అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీచేసింది. వ్యవసాయ అధికారులు ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులను సన్నద్ధం చేసేందుకు అవగాహన కార్యక్రమాలు మొదలుపెట్టారు. అయితే చాలాచోట్ల రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ముందుకు రావడంలేదని అధికారులు చెప్తున్నారు. ‘‘మేం గ్రామాలకు వెళ్లి వరికి బదులు ఇతర పంటలు సాగు చేయాలని రైతులను కోరుతున్నాం. కానీ విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా రైతులు వ్యక్తం చేస్తున్న సందేహాలు, లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఏం చెప్పాలో అర్థంగాక మధ్యలోనే సభలను రద్దు చేసుకొని వెనుదిరుగుతున్నాం’’ అని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మండల వ్యవసాయాధికారి పేర్కొన్నారు. కొద్దికొద్దిగా తగ్గించేలా.. రాష్ట్రంలో వరిసాగు తగ్గించాలన్న ప్రభుత్వ ఆదేశం మేరకు రంగంలోకి దిగిన అధికారులు పలు ప్రతిపాదనలు రూపొందించారు. ఒకేసారి భారీగా వరి సాగు తగ్గించాలంటే రైతులు ముందుకు రారన్న ఆలోచనతో.. ముందుగా కొద్ది మొత్తంలో తగ్గించాలని నిర్ణయానికి వచ్చారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో వరి విస్తీర్ణాన్ని ఎక్కడ, ఏ మేర తగ్గించాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రణాళికల ప్రకారం.. రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించి, ఐదు రకాల పంటలను వేయించాలని జిల్లాల అధికారులను ఆదేశించారు. తప్పదంటేనే.. మినహాయింపు ఎక్కడైనా రైతులు తప్పనిసరిగా వరి మాత్రమే వేస్తామన్న భావనతో ఉంటే, ఎక్కడైనా వరి పండించడం అనివార్యమైతేనే.. ప్రత్యామ్నాయ సాగును మినహాయించాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించింది. అదికూడా ఎఫ్‌సీఐ సూచించిన ఫైన్ రకాల వరినే పండించేలా చూడాలని స్పష్టం చేసింది. వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, పెసర, శనగ పంటలకు సంబంధించి.. ఆయా జిల్లాల పరిధిలో ఎక్కడ, ఏ పంట అనుకూలమో గుర్తించాలని సూచించింది. మొత్తంగా 2,604 క్లస్టర్ల వారీగా షెడ్యూల్‌ను తయారు చేయాలని పేర్కొంది. ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించి శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని.. స్థానిక ప్రజాప్రతినిధులు, రైతుబంధు సమితి సభ్యులు అందులో పాల్గొనేలా చూడాలని స్పష్టం చేసింది. ఈ నెల 30 నాటికి శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని సూచించింది. మాకు భరోసా ఏది? ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటూ వ్యవసాయశాఖ నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వరికి బదులు సాగుచేయాలని సూచిస్తున్న ఐదు పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తారా అని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఆయా పంటల విత్తనాలను సబ్సిడీపై అందజేసే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదేమని నిలదీస్తున్నారు. గత ఏడాది నుంచి సబ్సిడీ ఎత్తివేయడంతో విత్తనాలు కొనుగోలు చేయడం కష్టంగా మారిందని చెప్తున్నారు. వ్యవసాయశాఖ సూచిస్తున్న ఐదు రకాల పంటలు వరికి ప్రత్యామ్నాయం కాబోవని, పైగా లాభాలు కూడా ఉండబోవని స్పష్టం చేస్తున్నారు. అయితే విత్తన సబ్సిడీ, పంటల కొనుగోళ్లపై తమకు పైస్థాయి నుంచి సమాచారమేదీ లేకపోవడంతో రైతులకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేని పరిస్థితి నెలకొందని వ్యవసాయాధికారులు అంటున్నారు. మూడు జోన్లు.. ఐదు పంటలు.. ఉత్తర తెలంగాణ జోన్ కింద ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను చేర్చారు. ఈ జిల్లాల్లో గత యాసంగిలో సాగైన వరి విస్తీర్ణంలో 20–25 శాతం వరకు తగ్గించి.. బదులుగా వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయించాలని నిర్ణయించారు. సెంట్రల్ తెలంగాణ జోన్ కింద సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాల్లో గత యాసంగితో పోలిస్తే 10–15 శాతం వరి తగ్గించి.. దాని స్థానంలో వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, శనగ సాగు చేయించనున్నారు. దక్షిణ తెలంగాణ జోన్లో మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, నారాయణపేట జిల్లాలను చేర్చారు. ఈ జిల్లాల్లో ఏకంగా 20–30 శాతం దాకా వరి తగ్గించి.. బదులుగా వేరుశనగ, పొద్దు తిరుగుడు, శనగ, పెసర పంటలు వేసేలా రైతులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలను కొనే దిక్కేది? తెలంగాణ కోటి ఎకరాల మాగాణ అని చెప్పి ఇప్పుడు వరి వద్దంటే ఎలా? సాగునీరు ఉన్న ప్రాంతాల్లో వరి తప్ప మరేం సాగు చేయగలరు? వరి వద్దనడం అశాస్త్రీయం. అయినా ప్రత్యామ్నాయ పంటలు అంటూ.. వేరుశనగ, పొద్దుతిరుగుడు వంటివి చూపిస్తున్నారు. వాటిని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఇప్పటివరకు ముందుకు రాలేదు. రెండు, మూడు జిల్లాలకే పరిమితమైన వేరుశనగను కొనడానికే అప్పట్లో ప్రభుత్వం నానాయాతన పడింది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో ప్రత్యామ్నాయ పంటలు వేస్తే కొనే పరిస్థితి ఉంటుందా? ప్రభుత్వం ఈ అంశంపై వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో చర్చించి రైతులకు అనుకూలమైన నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ప్రత్యామ్నాయంగా కనీసం కూరగాయల సాగును ప్రోత్సహించినా బాగుండేది. – టి.సాగర్, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రైతు సంఘం -
నేడు సుప్రీం కోర్టు ముందుకు వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్
సాక్షి, ఢిల్లీ: వినాయక విగ్రహాల నిమజ్జనం పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిమజ్జనం అంశానికి సంబంధించి జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జీహెచ్ఎంసీ తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించనున్నారు. వినాయక విగ్రహాల నిమజ్జనానికి అనుమతిని నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఉత్తర్వులు ఇవ్వాలని జీహెచ్ఎంసీ సుప్రీంకోర్టును విజ్ఞప్తి చేసింది. (చదవండి: సైదాబాద్ చిన్నారి కేసు: నిందితుడు రాజు ఆత్మహత్య) ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరింది. ఊరేగింపుగా జరిగే వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం శాంతియుతంగా నిర్వహించేందుకు అనేకమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు, నాలుగు నెలల ముందుగానే పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించామని జీహెచ్ఎంసీ పేర్కొంది. చదవండి: రాజు ఆత్మహత్య: కేటీఆర్ స్పందన.. -
గోదావరిలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/కొవ్వూరు: నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పడుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 9,09,385 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 9,200 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 9,00,185 క్యూసెక్కుల (77.78 టీఎంసీలు)ను సముద్రంలోకి వదిలేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, ఉభయగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో ఉప నదులు ఉప్పొంగి గోదావరి ఉగ్రరూపం దాల్చింది. శుక్రవారం భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శనివారం ఉదయం నుంచి గోదావరిలో వరద ప్రవాహం తగ్గింది. దాంతో భద్రాచలం, ధవళేశ్వరం వద్ద ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. పోలవరం వద్దకు చేరుతున్న 9.10 లక్షల క్యూసెక్కులను 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు ధవళేశ్వరం బ్యారేజీలోకి చేరుతున్నాయి. కృష్ణా, ప్రధాన ఉప నది, తుంగభద్రల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 45 వేల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 880.1 అడుగులకు చేరుకుంది. ఆగని తెలంగాణ విద్యుదుత్పత్తి ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 11 వేల క్యూసెక్కులు తరలిస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 188.58 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లోకి 14,757 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో కాలువలకు, విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. సాగర్‌లో 305.51 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి 6 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 25 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 35,150 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 12,755 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 22,260 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 2,600 కుటుంబాలు తరలింపు ధవళేశ్వరం ఆనకట్ట వద్ద నీటిమట్టం క్రమం తగ్గుతూ సాయంత్రానికి 11.10 అడుగులకు చేరింది. ఆనకట్టకు దిగువన యలమంచిలి మండలం కనకాయలంక గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టింది. వరద నీరు పెరగడంతో వేలేరుపాడు మండలంలో పెద్ద వాగు, ఎద్దెలవాగు, మేళ్ల వాగులోకి వరదనీరు చేరింది. మండలంలోని 32 ఏజెన్సీ గ్రామాలు, పోలవరం మండలంలోని 19 ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా 2,600 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. -
ఔషధ రంగాభివృద్ధికి బీ–హబ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బయో ఫార్మా రంగాభివృద్ధికి ఊతమిచ్చేందుకు బయోఫార్మా హబ్ (బీ–హబ్)ను ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ప్రకటించారు. బీ–హబ్ భవనం నమూనా డిజైన్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించి, ట్విట్టర్లో వాటి ఫొటోలను పోస్టు చేశారు. ఫార్మారంగంలో అడుగుపెట్టే కొత్త కంపెనీల శీగ్రాభివృద్ధికి కేంద్రం (గ్రోత్–ఫేజ్ సెంటర్)గా బీ–హబ్ సేవలందించనుందని తెలిపారు. దీంతో ఫార్మా ఉత్పత్తుల తయారీ సదుపాయం కూడా విస్తరిస్తుందన్నారు. 15 నెలల్లో బీ–హబ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ఫార్మా రంగంలో తెలంగాణ ఆధిపత్యాన్ని నిలపడానికి ఇది దోహదపడనుందని చెప్పారు. రెండుదశల్లో లక్ష చదరపు అడుగుల నిర్మిత స్థలం (బిల్టప్ ఏరియా)లో జినోమ్ వ్యాలీలో దీన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. కేంద్రప్రభుత్వ సంస్థ బయోటెక్ ఇండియాతో పాటు సైటియా, సెరెస్ట్రా సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం బీ– హబ్‌ను నిర్మించనుందని, స్టార్టప్‌ల పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందులో ప్రయోగశాలలుంటాయని వివరించారు. ఇతర సంస్థలతో చర్చలు, భాగస్వామ్యాలు చేసుకోవడానికి బీ–హబ్ వేదికగా ఉపయోగపడనుందని కేటీఆర్ పేర్కొన్నారు. -
16,800 మందికి దళితబంధు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: దళితబంధు అమలులో తెలంగాణ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. గతనెల 16న హుజూరాబాద్ మండలం శాలపల్లిలో నిర్వహించిన దళితబంధు సభ మొదలు ప్రభుత్వం ఈ పథకం అమలుకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తోంది. గత నెల 15 మందికి రూ.10 లక్షల చొప్పున అందజేసిన ప్రభుత్వం తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 16,800 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.10 లక్షల చొప్పున జమ చేసింది. అంటే.. మొత్తంగా రూ.1,680 కోట్ల నగదు వారి ఖాతాల్లోకి బదిలీ అయింది. ఈ మేరకు శనివారం ఉదయానికి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమయ్యాయి. ఇప్పటికే ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.2,000 కోట్లను కరీంనగర్ కలెక్టరుకు బదిలీ చేసింది. వాటినుంచి తొలి 15 మంది లబ్ధిదారుల ఖాతాలో రూ.10 లక్షల చొప్పున జమ చేశారు. వారిలో మోటారు వాహనాలపై ఆసక్తి చూపిన నాలుగు కుటుంబాలకు ఇప్పటికే వాహనాలను అందజేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. నియోజకవర్గంలో మొత్తం 20,900 దళిత కుటుంబాలు ఉన్నాయి. తాజాగా పూర్తయిన దళితబంధు సర్వేతో అదనంగా మరో మూడువేల కుటుంబాలు చేరడంతో ఈ సంఖ్య 23,183 చేరింది. వీరందరికీ ప్రాధాన్యతాక్రమంలో దళితబంధు పథకం వర్తింపజేస్తామని అధికారులు స్పష్టం చేశారు. వాట్సాప్ గ్రూపు దళితుల జీవన స్థితిగతులను మార్చే ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకం 100 శాతం విజయవంతం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. అందుకే ఈ పథకం అమలు కోసం ప్రత్యేకంగా మండలానికి ఒక రిసోర్స్‌పర్సన్ (ఆర్పీ)ను నియమించింది. ఈ పథకం ద్వారా అందజేసే రూ.10 లక్షల నగదును లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా వారికి మార్గనిర్దేశనం చేసే వ్యూహంలో భాగంగా దళిత విశ్రాంత ఉద్యోగులను రంగంలోకి దించుతున్నారు. దళితబంధు అమలుకు నియోజకవర్గాన్ని ఏడు యూనిట్లు (హుజూరాబాద్, వీణవంక, జమ్మికుంట, కమలాపూర్, ఇల్లందకుంట మండలాలు, హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీ)గా విభజించారు. ఈ ఏడు యూనిట్లలో ప్రతి యూనిట్‌కు ఐదుగురు విశ్రాంత ఉద్యోగులు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా వారికి దిశానిర్దేశం చేస్తారు. ఇదే సమయంలో హుజూరాబాద్ గ్రామాల్లో ఆదర్శభావాలు కలిగి, సామాజిక చైతన్యం ఉన్న యువకులను ఏడు యూనిట్ల నుంచి ప్రతి గ్రామానికి 10 మంది చొప్పున ఎంపిక చేస్తారు. వీరికి వివిధ రంగాల్లో నిపుణులైన వారితో హైదరాబాద్‌లో ప్రత్యేక తరగతులు ఇప్పిస్తారు. ప్రతి మండలానికి బాధ్యులుగా ఉన్న ఐదుగురు విశ్రాంత దళిత ఉద్యోగులు, ప్రతీ గ్రామానికి 10 మంది యువకులతో ఓ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేస్తారు. ఈ గ్రూపునకు ఆయా మండలాల రిసోర్స్ పర్సన్లు అడ్మిన్లుగా ఉంటారు. ప్రభుత్వ అధికారులు చేస్తున్న ప్రచారానికి అదనంగా వీరు కూడా పథకం ప్రయోజనాలను వివరించనున్నారు. -
ప్రైవేటు భాగస్వామ్యంతో పాలియేటివ్‌కేర్
రాయదుర్గం: పాలియేటివ్ కేర్‌లోకి ప్రవేశించడానికి తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీరామారావు పేర్కొన్నారు.ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ సేవలు అందజేయాలని సంకల్పించినట్లు ఆయన తెలిపారు. గచ్చిబౌలి డివిజన్లోని ఖాజాగూడలో రూ.14 కోట్లతో నూతనంగా నిర్మించిన ‘స్పర్శ్ హోస్పిస్’ఆస్పత్రి భవనాన్ని మంత్రి కేటీరామారావు శనివారం జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 2016లో స్పర్శ్ హోస్పిస్ని మొదటిసారి సందర్శించినప్పుడు పాలియేటివ్‌కేర్ అంటే ఏమిటో తెలియదని, మానవత్వానికి ఇది గొప్ప సేవ అని ఆ తర్వాత తెలిసిం దని అన్నారు. ఇలాంటి ఆస్పత్రుల ఏర్పాటుకు చొరవ తీసుకుంటామని, ముందుకొచ్చే వారికి పూర్తిగా సహకరిస్తామన్నారు. స్పర్శ్ ఆస్పత్రికి మున్సిపల్ ఆస్తిపన్ను, నీటిపన్నుల మినహాయింపు ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. ఒక రాజకీయ నాయకునిగా అనేక కార్యక్రమాలకు వెళ్తామని, కానీ కొన్ని కార్యక్రమాలు ఆత్మ సంతృప్తి కలిగిస్తాయని ఈ సందర్భంగా వెల్లడించారు. పదేళ్ళుగా మానవతా దృక్పథంతో వైద్యం అందించిన స్పర్శ్ హోస్పిస్ ఆస్పత్రి కల నెరవేరి సొంత భవనానికి నోచుకోవడం సంతోషంగా ఉందన్నారు. పన్ను మినహాయింపు ఇవ్వాలి: వరప్రసాద్‌రెడ్డి మానవతా దృక్పథంతో ఉచితంగా సేవలందిస్తున్న స్పర్శ్ హోస్పిస్ ఆస్పత్రికి మున్సిపల్ ఆస్తిపన్ను, నీటి పన్ను, విద్యుత్ బిల్లుల నుంచి మినహాయింపులు ఇవ్వాలని శాంతాబయోటెక్ సంస్థ వ్యవస్థాపకులు పద్మభూషణ్ డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఆస్పత్రి సీఈఓ రామ్మోహన్రావు మాట్లాడుతూ, దేశంలోనే రెండు అతిపెద్ద పాలియేటివ్‌కేర్ సదుపాయాలలో ఇది ఒకటని, దేశంలో అత్యంత అధునాతన అల్ట్రా మోడ్రన్ పాలియేటివ్‌కేర్ ఇదేనని గుర్తు చేశారు. తుదిదశ కేన్సర్ రోగులలో బాధను తగ్గించడమే తమ లక్ష్యమన్నారు. పదేళ్లుగా తెలంగాణ, ఏపీ, ఒడిశా, ఇతర రాష్ట్రాలకు చెందిన నాలుగు వేల మంది రోగులకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. అనంతరం మంత్రి కేటీఆర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఉండే గదుల్లోకి వెళ్ళి వారితో ముచ్చటించి వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, రోటరీ ఇంటర్నేషనల్ డైరెక్టర్ డాక్టర్ మహేశ్కోట్బాగీ, ఫీనిక్స్ చైర్మన్ చుక్కపల్లి సురేష్, అధ్యక్షుడు వికాస్, ట్రస్టీలు సుబ్రహ్మణ్యం సురేష్‌రెడ్డి, జగదీశ్, ఎస్సీఎస్సీ కార్యదర్శి కృష్ణ ఎదులతోపాటు పలువురు డాక్టర్లు, దాతలు, వైద్యబృందం పాల్గొన్నారు. -
శ్రీశైలంలో ఆగని తెలంగాణ దందా
సాక్షి, అమరావతి: నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో జల విద్యుదుత్పత్తి చేయకూడదంటూ కృష్ణా బోర్డు జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా తుంగలో తొక్కుతోంది. కృష్ణా బోర్డు అనుమతి లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేయకూడదని కేంద్ర జల్ శక్తి శాఖ జారీ చేసిన ఉత్తర్వులను బేఖాతరు చేస్తోంది. నీటి సంవత్సరం ప్రారంభం నుంచే (జూన్ 1 నుంచి) ఎడమ గట్టు కేంద్రంలో అక్రమంగా నీటిని వాడుకుంటూ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు దిగువన అటు తెలంగాణ, ఇటు ఏపీకి సంబంధించి తక్షణ సాగు, తాగునీటి అవసరాలు లేవు. ఎగువ నుంచి నీటిని దిగువకు విడుదల చేయాల్సిన అవసరమూ లేదు. కానీ.. తెలంగాణ సర్కార్ అదేమీ పట్టకుండా ఎడమ గట్టు కేంద్రంలో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ రోజూ సగటున 3.15 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటోంది. దీంతో దిగువకు వదిలేసిన జలాలు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి చేరుతున్నాయి. కొద్దిపాటి నీరు కృష్ణా డెల్టాకు విడుదల చేయగా, మిగులుగా ఉన్న నీటినంతటినీ గేట్లు ఎత్తేసి దిగువకు వృథాగా వదిలేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా జూన్ 1 నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు 162.76 టీఎంసీలు సముద్రంలో కలవడం గమనార్హం. వాటా నీటిని దక్కనివ్వకుండా.. శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆగస్టు 12న వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరుకుంది. ఆ రోజున 884.4 అడుగుల్లో 211.96 టీఎంసీల నీరు నిల్వ ఉండేది. అదే రోజున సాగర్‌లో నీటి మట్టం గరిష్ట స్థాయిలో 589.5 అడుగుల్లో 311 టీఎంసీల నిల్వ ఉంది. శనివారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 878.40 అడుగుల్లో 180.28 టీఎంసీలకు తగ్గిపోయింది. రాష్ట్రానికి హక్కుగా దక్కిన జలాలను వాడుకోనివ్వకుండా చేయడానికే తెలంగాణ సర్కార్ కావాల్సిగా విద్యుదుత్పత్తి చేస్తోందని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సీజన్ ప్రారంభం నుంచీ ఇదే తీరు ► శ్రీశైలం ప్రాజెక్టులో నీటి సంవత్సరం ప్రారంభమైన రెండో రోజే అంటే జూన్ 2న 808.5 అడుగుల్లో 33.43 టీఎంసీలు మాత్రమే నీటి నిల్వ ఉండేది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులు. ప్రాజెక్టు ఆపరేషనల్ ప్రొటోకాల్ ప్రకారం కనీస నీటి మట్టానికి దిగువన నీటి నిల్వ ఉన్నప్పుడు విద్యుదుత్పత్తి చేయకూడదు. ► కానీ.. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే దిగువన ఎలాంటి సాగు, తాగునీటి అవసరాలు లేకపోయినా జూన్ 2న తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. తెలంగాణ సర్కార్ అక్రమ నీటి వినియోగంపై కృష్ణా బోర్డుకు, కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు, ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ► ‘శ్రీశైలం ప్రాజెక్టులో 854 అడుగుల కంటే ఎక్కువ స్థాయిలో నీరు నిల్వ ఉన్నప్పుడే.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్‌కు నీటిని తరలించవచ్చు. దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగు, సాగునీరు.. చెన్నైకి తాగునీరు సరఫరా చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణ సర్కార్ తీరుతో ప్రాజెక్టులో నీటి నిల్వ 854 అడుగుల కంటే తగ్గిపోతే, కేటాయింపులు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టులకు నీటిని అందించలేము’ అని కేంద్రానికి, కృష్ణా బోర్డుకు స్పష్టంగా వివరించింది. ► దీంతో తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డులు ఆదేశించాయి. అయినా సరే.. తెలంగాణ సర్కార్ ఖాతరు చేయకుండా రోజూ సగటున 3.15 టీఎంసీలను అక్రమంగా వాడుకుంటూ ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. ► ఈ పరిస్థితిలో న్యాయ పోరాటం ద్వారా రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈనెల 27న జరిగే కృష్ణా బోర్డు సమావేశంలో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించింది. -
ఎలక్ట్రానిక్ క్లస్టర్లు... ఎనర్జీ పార్కులు
సాక్షి, హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో వస్తున్న పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కూడా ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2016లోనే ఎలక్ట్రానిక్స్ పాలసీని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం... పెట్టుబడులు, ప్రోత్సాహకాలకు సంబంధించి ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశంలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో తెలంగాణ వాటా ప్రస్తుతం 7 శాతంకాగా వచ్చే నాలుగేళ్లలో అగ్రస్థానానికి చేరాలని భావిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, ఈవీ పార్కులకు తోడుగా కొత్త ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు అవసరమైన మౌలికవసతులను మెరుగుపరచడం ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ. 73 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, 3 లక్షల ఉద్యోగాలు లభించేలా చూడాలని భావిస్తోంది. ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ మాన్యుఫ్యాక్చరింగ్ (ఈఎస్డీఎం) హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు తెలంగాణ నైపుణ్య శిక్షణ అకాడమీ (టాస్క్) ద్వారా యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్తగా ఈవీ క్లస్టర్లు, ఎనర్జీ పార్కులు... ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహన రంగం కోసం ప్రస్తుతం రాష్ట్రంలో ఔటర్ రింగురోడ్డు సమీపంలోని రావిర్యాలలో ‘ఈ–సిటీ’, మహేశ్వరంలో హార్డ్‌వేర్ పార్క్ 912 ఎకరాల్లో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఎల్ఈడీ పార్కులో 10 సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించగా ఈవీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల అవసరాల కోసం మరో 3 కొత్త పార్కులు/క్లస్టర్లు ఏర్పాటు ప్రక్రియ కొలిక్కి వస్తోంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల కోసం ఈవీ క్లస్టర్‌ను టీఎస్ఐఐసీ అభివృద్ధి చేస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలోనూ 378 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఎనర్జీ పార్కు ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పార్కులో లిథియం–అయాన్ బ్యాటరీలు, సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఏర్పాటవుతాయి. కొత్తగా దుండిగల్‌లోనూ 511 ఎకరాల్లో కొత్త ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను టీఎస్ఐఐసీ ప్రతిపాదించింది. వాటితోపాటు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ప్రొటోటైపింగ్, టెస్టింగ్ వసతులతో కూడిన కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు కానుంది. ఏడాదిలోనే రూ. 4,500 కోట్ల పెట్టుబడులు... ఎలక్ట్రానిక్స్ రంగంలో పేరొందిన ఇంటెల్, మైక్రాన్, క్వాల్కామ్, మోటరోలా, ఏఎండీ, సిడాక్, యాపిల్ వంటి కంపెనీలతోపాటు మైక్రోమ్యాక్స్, స్కైవర్త్, ఒప్పో, వన్‌ప్లస్ వంటి మొబైల్‌ఫోన్ తయారీ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయి. గతేడాది ఎలక్ట్రానిక్స్ రంగంలో రూ. 4,500 కోట్ల పెట్టుబడులతోపాటు 15 వేల మందికి ఉపాధి లభించినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన కంపెనీలు కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో ఐదేళ్లపాటు విద్యుత్‌పై 25 శాతం, పెట్టుబడులపై 20 శాతం చొప్పున సబ్సిడీ, ఏడేళ్లపాటు జీఎస్టీలో 100 శాతం మినహాయింపులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో మూడు షిఫ్టుల్లో మహిళలు పనిచేసేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.