సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బయో ఫార్మా రంగాభివృద్ధికి ఊతమిచ్చేందుకు బయోఫార్మా హబ్ (బీ–హబ్)ను ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ప్రకటించారు. బీ–హబ్ భవనం నమూనా డిజైన్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించి, ట్విట్టర్‌లో వాటి ఫొటోలను పోస్టు చేశారు. ఫార్మారంగంలో అడుగుపెట్టే కొత్త కంపెనీల శీగ్రాభివృద్ధికి కేంద్రం (గ్రోత్–ఫేజ్ సెంటర్)గా బీ–హబ్ సేవలందించనుందని తెలిపారు. దీంతో ఫార్మా ఉత్పత్తుల తయారీ సదుపాయం కూడా విస్తరిస్తుందన్నారు. 15 నెలల్లో బీ–హబ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ఫార్మా రంగంలో తెలంగాణ ఆధిపత్యాన్ని నిలపడానికి ఇది దోహదపడనుందని చెప్పారు.
రెండుదశల్లో లక్ష చదరపు అడుగుల నిర్మిత స్థలం (బిల్టప్ ఏరియా)లో జినోమ్ వ్యాలీలో దీన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. కేంద్రప్రభుత్వ సంస్థ బయోటెక్ ఇండియాతో పాటు సైటియా, సెరెస్ట్రా సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం బీ– హబ్‌ను నిర్మించనుందని, స్టార్టప్‌ల పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందులో ప్రయోగశాలలుంటాయని వివరించారు. ఇతర సంస్థలతో చర్చలు, భాగస్వామ్యాలు చేసుకోవడానికి బీ–హబ్ వేదికగా ఉపయోగపడనుందని కేటీఆర్ పేర్కొన్నారు.
ఔషధ రంగాభివృద్ధికి బీ–హబ్
Published Mon, Sep 6 2021 5:02 AM | Last Updated on Mon, Sep 6 2021 5:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment