Bio Pharmaceutical
-
బయోటెక్ రంగానికి సత్వర అనుమతులు కావాలి
న్యూఢిల్లీ: బయోఫార్మాలో భారత్ మరింత బలమైన పాత్ర పోషించేందుకు పరిశ్రమల మండలి సీఐఐ కీలక సూచనలు చేసింది. బయోటెక్ రంగానికి వేగవంతమైన నియంత్రణ ప్రక్రియ, అనుమతులు అవసరమని పేర్కొంది. ఉత్పత్తిని ప్రవేశపెట్టడంలో జాప్యం చోటుచేసుకుంటే అది భారీ నష్టానికి దారితీస్తుందని ప్రస్తావించింది. బయోటెక్ రంగాన్ని మూడు మంత్రిత్వ శాఖల పరిధిలోని విభాగాలు, ఉప కమిటీలు నియంత్రిస్తున్నాయంటూ.. వాటి మధ్య సమన్వయం బలహీనంగా ఉన్నట్టు పేర్కొంది. ఇది జాప్యానికి దారితీస్తోందని, దీన్ని పరిహరించాల్సిన అవసరాన్ని సూచించింది. ‘రోడ్‌మ్యాప్ ఫర్ ఇండియన్ లైఫ్ సైన్సెస్ ః2047’ పేరుతో సీఐఐ ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘ప్రస్తుతానికి బయోసిమిలర్ బ్యాచ్‌ను సమీక్షించేందుకు 20–25 రోజులు, తయారీ సైకిల్‌కు 45–90 రోజుల సమయం తీసుకుంటోంది. ఈ అంతరాలను తొలగించేందుకు పరిశ్రమకు చెందిన నిపుణులతో సలహా మండళ్లను ఏర్పాటు చేయాలి. అప్పుడు ఈ తరహా వ్యవహారాల్లో నిపుణులతో కూడిన సలహా మండళ్ల నుంచి సలహాలు పొందొచ్చు’’అని సీఐఐ నివేదిక పేర్కొంది. విధానాల రూపకల్పన, అమలులో స్వయంప్రతిపత్తి అవసరమని తెలిపింది. సమయం, పరిశోధన, అభివృద్ధి ప్రభావం బయోసిమిలర్ ఔషధ ఉత్పత్తి ధరపై గణనీయంగా ఉంటుందని పేర్కొంది. చైనాను ఉదహరిస్తూ.. ఏకైక అనుమతుల విండో అయిన ‘చైనా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్’ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. అలాగే, యూఎస్ఎఫ్డీఏ కూడా విధానాల రూపకల్పన, అమలును ఒకే గొడుగు కింద చూస్తున్నట్టు గుర్తు చేసింది. 2030 నాటికి అంతర్జాతీయంగా ఫార్మా రంగంలో బయోఫార్మా వాటా 40 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. -
ఔషధ రంగాభివృద్ధికి బీ–హబ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బయో ఫార్మా రంగాభివృద్ధికి ఊతమిచ్చేందుకు బయోఫార్మా హబ్ (బీ–హబ్)ను ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ప్రకటించారు. బీ–హబ్ భవనం నమూనా డిజైన్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించి, ట్విట్టర్లో వాటి ఫొటోలను పోస్టు చేశారు. ఫార్మారంగంలో అడుగుపెట్టే కొత్త కంపెనీల శీగ్రాభివృద్ధికి కేంద్రం (గ్రోత్–ఫేజ్ సెంటర్)గా బీ–హబ్ సేవలందించనుందని తెలిపారు. దీంతో ఫార్మా ఉత్పత్తుల తయారీ సదుపాయం కూడా విస్తరిస్తుందన్నారు. 15 నెలల్లో బీ–హబ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ఫార్మా రంగంలో తెలంగాణ ఆధిపత్యాన్ని నిలపడానికి ఇది దోహదపడనుందని చెప్పారు. రెండుదశల్లో లక్ష చదరపు అడుగుల నిర్మిత స్థలం (బిల్టప్ ఏరియా)లో జినోమ్ వ్యాలీలో దీన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. కేంద్రప్రభుత్వ సంస్థ బయోటెక్ ఇండియాతో పాటు సైటియా, సెరెస్ట్రా సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం బీ– హబ్‌ను నిర్మించనుందని, స్టార్టప్‌ల పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందులో ప్రయోగశాలలుంటాయని వివరించారు. ఇతర సంస్థలతో చర్చలు, భాగస్వామ్యాలు చేసుకోవడానికి బీ–హబ్ వేదికగా ఉపయోగపడనుందని కేటీఆర్ పేర్కొన్నారు. -
Telangana : ఔషధ రంగాభివృద్ధికి బీ–హబ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బయో ఫార్మా రంగాభివృద్ధికి ఊతమిచ్చేందుకు బయోఫార్మా హబ్ (బీ–హబ్)ను ఏర్పాటు చేయనున్నట్లు పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి కేటీఆర్ ప్రకటించారు. బీ–హబ్ భవనం నమూనా డిజైన్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించి, ట్విట్టర్లో వాటి ఫొటోలను పోస్టు చేశారు. ఫార్మారంగంలో అడుగుపెట్టే కొత్త కంపెనీల శీగ్రాభివృద్ధికి కేంద్రం (గ్రోత్–ఫేజ్ సెంటర్)గా బీ–హబ్ సేవలందించనుందని తెలిపారు. దీంతో ఫార్మా ఉత్పత్తుల తయారీ సదుపాయం కూడా విస్తరిస్తుందన్నారు. 15 నెలల్లో బీ–హబ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ఫార్మా రంగంలో తెలంగాణ ఆధిపత్యాన్ని నిలపడానికి ఇది దోహదపడనుందని చెప్పారు. రెండుదశల్లో లక్ష చదరపు అడుగుల నిర్మిత స్థలం (బిల్టప్ ఏరియా)లో జినోమ్ వ్యాలీలో దీన్ని నిర్మించనున్నట్లు వెల్లడించారు. కేంద్రప్రభుత్వ సంస్థ బయోటెక్ ఇండియాతో పాటు సైటియా, సెరెస్ట్రా్ట సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం బీ– హబ్‌ను నిర్మించనుందని, స్టార్టప్‌ల పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇందులో ప్రయోగశాలలుంటాయని వివరించారు. ఇతర సంస్థలతో చర్చలు, భాగస్వామ్యాలు చేసుకోవడానికి బీ–హబ్ వేదికగా ఉపయోగపడనుందని కేటీఆర్ పేర్కొన్నారు. -
బ్లాక్ ఫంగస్‌కు హైదరాబాద్ సెలాన్ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పెషాలిటీ బయోఫార్మాస్యూటికల్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సెలాన్ ల్యాబొరేటరీస్ బ్లాక్ ఫంగస్‌కు (మ్యుకోర్మైకోసిస్) ప్రత్యామ్నాయ ఔషధాన్ని తయారు చేసింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే లిపోసోమాల్ యాంఫోటెరిసిన్-బి ఔషధానికి కొరత ఉన్న నేపథ్యంలో.. ఎమల్షన్ ఆధారిత యాంఫోటెరిసిన్-బి ఫార్ములేషన్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. రోజుకు 10,000 వయల్స్ తయారు చేయగల సామర్థ్యం ఉందని సంస్థ వెల్లడించింది. వీటితో నెలకు 6,000 మంది రోగులకు ఉపశమనం కలుగుతుందని వివరించింది. మూడు వారాల్లోనే కంపెనీకి చెందిన పరిశోధన, అభివృద్ధి బృందం దీనికి రూపకల్పన చేసిందని సెలాన్ ల్యాబ్స్ ఎండీ ఎం.నగేశ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. 2013 నుంచి లిపోసోమాల్ యాంఫోటెరిసిన్–బి తయారు చేస్తున్నామని, అయితే ఈ ఔషధం తయారీలో ఉపయోగించే కీలక ముడి పదార్థం లిపాయిడ్స్ లభించకపోవడంతో డిమాండ్‌ను చేరుకోలేకపోయామని కంపెనీ తెలిపింది. లిపాయిడ్స్ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సెలాన్ను లండన్‌కు చెందిన కెలిక్స్ బయో ప్రమోట్ చేస్తోంది. చదవండి: డిజిటల్ కరెన్సీ ఇన్వెస్టర్లకు కాస్త ఊరట -
ఫార్మాకు ని‘బంధనాల’ తగ్గింపుపై కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా వ్యాపారాల నిర్వహణను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ తెలిపారు. ఇందులో భాగంగా ఫార్మా రంగానికి అనేకానేక నిబంధనల పాటింపు భారాన్ని తగ్గించడంపై కసరత్తు చేస్తోందని వివరించారు. ’ది ఇండియా ఫార్మా 2021, ఇండియా మెడికల్ డివైజ్ 2021’ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ‘2030 నాటికి 130 బిలియన్ డాలర్ల టర్నోవరు లక్ష్య సాధనకు అవసరమైన సామర్థ్యాలు దేశీ ఫార్మా పరిశ్రమకు పుష్కలంగా ఉన్నాయి. అలాగే, 2025 నాటికి వైద్య పరికరాల పరిశ్రమ 50 బిలియన్ డాలర్ల స్థాయికి వృద్ధి చెందగలదు‘ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వివిధ రంగాల్లో సంస్కరణలు అమలు చేస్తున్న ప్రభుత్వం.. ఫార్మా రంగంపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సందర్భంగా తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో 145వ స్థానం నుంచి 79వ స్థానానికి వచ్చాం. ఫార్మాలోనూ మన ర్యాంకింగ్ మెరుగుపడి 63వ స్థానానికి చేరాము. సంస్కరణల అమలుకు ఇదే నిదర్శనం‘ అని ఆయన పేర్కొన్నారు. అందుబాటు ధరల్లో ఔషధాలు అందించాలి .. వృద్ధి సాధనతో పాటు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఔషధాలను అందించే ఉన్నత లక్ష్యాలకు కూడా పరిశ్రమ కట్టుబడి ఉంటుందని ఆశిస్తున్నట్లు గౌడ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఫార్మా రంగానికి ఇప్పటికే రూ. 6,564 కోట్ల ప్రోత్సాహకాలిచ్చే ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర వేసిందని, అలాగే మరో రూ. 15,000 కోట్ల మద్దతుతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీమును కూడా ఆమోదించిందని ఆయన చెప్పారు. తయారీ రంగ సంస్థలు అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని గౌడ పేర్కొన్నారు. బయోఫార్మా, సంక్లిష్టమైన జనరిక్ ఔషధాలు వంటి స్పెషలైజ్డ్ ఉత్పత్తుల తయారీకి అవసరమైన సామర్థ్యాలను దేశీయంగా రూపొందించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని వివరించారు. స్వావలంబన భారత్ నినాదంలో భాగంగా రూ. 3,400 కోట్లతో బల్క్ డ్రగ్, మెడికల్ డివైజ్ పార్క్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనుమతులు సులభతరం చేయాలి .. నియంత్రణ వ్యవస్థ విధానాలను మరింత సరళతరం చేయాలని .. ముఖ్యంగా ఔషధాలకు అనుమతుల ప్రక్రియను సులభతరం చేయాలని జైడస్ గ్రూప్ చైర్మన్, ఫిక్కీ ఫార్మా కమిటీ మెంటార్ పంకజ్ ఆర్ పటేల్ కోరారు. కొత్తగా ట్యాక్స్ రీఫండ్ స్కీమును ప్రవేశపెట్టాలని కోరారు. వివిధ శాఖలు, విభాగాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫార్మా రంగ అవసరాలన్నింటి కోసం ఒకే శాఖ, ఒకే డిపార్ట్మెంటు విధానాన్ని అమలు చేయాలన్నారు. -
ఫైజర్ చేతికి అనకార్ ఫార్మా
డీల్ విలువ 520 కోట్ల డాలర్లు న్యూయార్క్: బయోఫార్మాస్యూటికల్ సంస్థ అనకార్ ఫార్మాస్యూటికల్స్‌ను ఫార్మా దిగ్గజం ఫైజర్ కొనుగోలు చేయనున్నది. అనకార్ ఫార్మాను 520 కోట్ల డాలర్లకు(రూ.34,320 కోట్లుసుమారుగా) అంతా నగదులోనే కొనుగోలు చేయనున్నామని ఫైజర్ తెలిపింది. దీనికి సంబంధించి ఇరు కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా అనకార్ ఫార్మా షేర్ ఒక్కోదానిని 99.25 డాలర్లకు కొనుగోలు చేస్తామని వివరించింది. ఎగ్జిమా రుగ్మతకు సంబంధించి చికిత్సలో ఉపయోగించే అనకార్కు చెందిన జెల్, క్రిసబోరల్ అనుమతులకు సంబంధించి ప్రస్తుతం అమెరికా ఎఫ్‌డీఏ సమీక్షిస్తోంది. అనకార్ ఫార్మా కొనుగోలు తమకు మంచి అవకాశమని ఫైజర్ గ్లోబల్ ఇన్నోవేటివ్ ఫార్మా, వ్యాక్సిన్స్ హెడ్ అల్బర్ట్ బొర్లా చెప్పారు.