ఫైజర్ చేతికి అనకార్ ఫార్మా | Pfizer to buy Anacor Pharma in $ 5.2 billion deal | Sakshi
Sakshi News home page

ఫైజర్ చేతికి అనకార్ ఫార్మా

Published Tue, May 17 2016 1:59 AM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

ఫైజర్ చేతికి అనకార్ ఫార్మా

ఫైజర్ చేతికి అనకార్ ఫార్మా

డీల్ విలువ 520 కోట్ల డాలర్లు
న్యూయార్క్: బయోఫార్మాస్యూటికల్ సంస్థ అనకార్ ఫార్మాస్యూటికల్స్‌ను ఫార్మా దిగ్గజం ఫైజర్ కొనుగోలు చేయనున్నది. అనకార్ ఫార్మాను 520 కోట్ల డాలర్లకు(రూ.34,320 కోట్లుసుమారుగా) అంతా నగదులోనే కొనుగోలు చేయనున్నామని ఫైజర్ తెలిపింది. దీనికి సంబంధించి ఇరు కంపెనీల మధ్య ఒక ఒప్పందం కుదిరిందని పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా అనకార్ ఫార్మా షేర్ ఒక్కోదానిని 99.25 డాలర్లకు కొనుగోలు చేస్తామని వివరించింది.

ఎగ్జిమా రుగ్మతకు సంబంధించి చికిత్సలో ఉపయోగించే అనకార్‌కు చెందిన జెల్, క్రిసబోరల్ అనుమతులకు సంబంధించి ప్రస్తుతం అమెరికా ఎఫ్‌డీఏ సమీక్షిస్తోంది. అనకార్ ఫార్మా కొనుగోలు  తమకు  మంచి అవకాశమని ఫైజర్ గ్లోబల్ ఇన్నోవేటివ్ ఫార్మా, వ్యాక్సిన్స్ హెడ్ అల్బర్ట్ బొర్లా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement