
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్పెషాలిటీ బయోఫార్మాస్యూటికల్ తయారీలో ఉన్న హైదరాబాద్ కంపెనీ సెలాన్ ల్యాబొరేటరీస్ బ్లాక్ ఫంగస్‌కు (మ్యుకోర్‌మైకోసిస్) ప్రత్యామ్నాయ ఔషధాన్ని తయారు చేసింది. బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే లిపోసోమాల్ యాంఫోటెరిసిన్-బి ఔషధానికి కొరత ఉన్న నేపథ్యంలో.. ఎమల్షన్ ఆధారిత యాంఫోటెరిసిన్-బి ఫార్ములేషన్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. రోజుకు 10,000 వయల్స్ తయారు చేయగల సామర్థ్యం ఉందని సంస్థ వెల్లడించింది. వీటితో నెలకు 6,000 మంది రోగులకు ఉపశమనం కలుగుతుందని వివరించింది.
మూడు వారాల్లోనే కంపెనీకి చెందిన పరిశోధన, అభివృద్ధి బృందం దీనికి రూపకల్పన చేసిందని సెలాన్ ల్యాబ్స్ ఎండీ ఎం.నగేశ్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు. 2013 నుంచి లిపోసోమాల్ యాంఫోటెరిసిన్–బి తయారు చేస్తున్నామని, అయితే ఈ ఔషధం తయారీలో ఉపయోగించే కీలక ముడి పదార్థం లిపాయిడ్స్ లభించకపోవడంతో డిమాండ్‌ను చేరుకోలేకపోయామని కంపెనీ తెలిపింది. లిపాయిడ్స్‌ను జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. సెలాన్‌ను లండన్‌కు చెందిన కెలిక్స్ బయో ప్రమోట్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment