
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసులు మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఉన్నారు. తాజాగా టెక్నాలజీ అమ లు విభాగంలో స్కోచ్ సంస్థ పలు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ రేసులో ఉన్న తమను ఓటేసి గెలిపించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు పోలీసు శాఖ పలు క్యాబ్‌సరీ్వసులతో కలిసి వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రాత్రిపూట పనిచేసే మహిళా ఉద్యోగినుల కోసం హాక్‌ఐ యాప్‌ను అందిస్తోంది.
దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నవారు క్యాబ్‌లలో ప్రయాణించేటప్పుడు ఏదైనా ఆపద ఎదురైతే ఎస్‌ఓఎస్ బటన్ నొక్కగానే ఏసీపీ, సీఐ, కంట్రోల్‌రూమ్, పెట్రోలింగ్ వాహనాలతోపాటు మొత్తం ఏడు విభాగాలకు ఎమర్జెన్సీ సందేశం వెళ్తుంది. ఈ సేవలు అందిస్తున్న పోలీసులకు ప్రజలు స్కోచ్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని ఓటేయాలని పోలీసుశాఖ కోరుతోంది.
Comments
Please login to add a commentAdd a comment