Telangana Police Department
-
వీధుల్లో కాదు విధుల్లోకి...
కొన్ని సంవత్సరాల క్రితం...‘పోలిస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేయాలని ఉంది’ అన్నది శ్రీకళ. అక్కడ ఉన్న వాళ్లు పెద్దగా నవ్వారు. ‘నేను జోక్ చేయడం లేదు. నిజమే చెబుతున్నాను’ అన్నది ఆమె. మరోసారి బిగ్గరగా నవ్వారు వాళ్లు. ఆ నవ్వులలో వెటకారాల వేటకొడవళ్లు దాగి ఉన్నాయి. ఆ పదునుకు గాయపడ్డ హృదయంతో శ్రీకళ కళ్లలో నీళ్లు. ‘ఇక నా బతుకు ఇంతేనా’ అనే బాధతో తల్లడిల్లి పోయింది.ట్రాఫిక్ అసిస్టెంట్లుగా శిక్షణలో భాగంగా ట్రాన్స్జెండర్లు కట్ చేస్తే...ట్రాన్స్జెండర్లకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి, సమాజంలో గౌరవం కల్పించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఆదేశాలతో హైదరాబాద్ పోలీసు విభాగం ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ఎంపిక చేసుకుంది. తుదిదశ శిక్షణలో ఉన్న 39 మంది విధుల్లోకి రానున్నారు. బహుశా ఈ వార్త ట్రాన్స్‌జెండర్ శ్రీకళకు చేరి ఉంటుంది. ఆమెలాంటి ఎంతోమంది ట్రాన్స్జెండర్లకు ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది.‘నా బిడ్డ భవిష్యత్తు గురించి భయంగా ఉంది’ అని తెలిసిన వాళ్ల దగ్గర కళ్ల నీళ్లు పెట్టుకునే శ్రీవల్లి తల్లి బాలమణి ఇప్పుడు ‘దేవుడు నా బిడ్డను సల్లగా సూసిండు. ఇంక నా బిడ్డకు ఢోకాలేదు’ అని సంబరపడిపోతోంది. భానుప్రియను చూసి చుట్టాలు, పక్కాలు పక్కకు తప్పుకునేవాళ్లు.‘నేను చేసిన తప్పేమిటీ!’ అంటూ తనలో తాను కుమిలిపోయేది భానుప్రియ. ‘నువ్వేమీ తప్పు చేయలేదమ్మా... ధైర్యంగా ఉండు... తలెత్తుకు తిరుగు’ అంటూ పోలీస్ ఉద్యోగం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. ఎం.ఏ. చదువుతున్నప్పటికీ భిక్షాటన చేయక తప్పని పరిస్థితుల్లో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడింది లచ్చిగూడెం బిడ్డ జెస్సీ. ‘మేమున్నాం’ అంటూ ఎవరూ ముందుకు రాలేదు. ‘నాకు నేనే ఒక సైన్యం’ అని ధైర్యం చెప్పుకున్న జెస్సీ ట్రాఫిక్ అసిస్టెంట్‌గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించనుంది.‘పోలీసు ఉద్యోగం చేయాలి’ అనేది కారం సన చిన్నప్పటి కల. ఆ తరువాతగానీ తనకు తెలియదు... అదెంత కష్టమో! తన కల గురించి ఇతరులతో చెప్పుకోవడానికి కూడా భయపడే సన ఇప్పుడు... ‘నా కలను నిజం చేసుకున్నాను’ అంటుంది గర్వంగా.కందుల భానుప్రియ నుంచి కారం సన వరకు ఎంతోమంది ట్రాన్స్జెండర్లు పడని మాట లేదు. పడని కష్టం లేదు. ఆ కష్టాలకు ముగింపు వాక్యంలా వారికి ఉద్యోగాలు వచ్చాయి. అయితే అవి కేవలం ఉద్యోగాలు మాత్రమే కాదు... వారి ఆత్మస్థైర్యాన్ని మరోస్థాయికి తీసుకువెళ్లిన ఆత్మగౌరవ సంకేతాలు.అపూర్వ అవకాశంతెలంగాణ పోలీసు విభాగంతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్తంగా ఈ ట్రాఫిక్ అసిస్టెంట్ల ఎంపిక విధివిధానాలను ఖరారు చేసింది. మహిళా శిశుసంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రాంచంద్రన్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవి గుప్త, హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నిబంధనలు ఖరారు చేశారు. సాంఘిక సంక్షేమశాఖ నుంచి అర్హులైన ట్రాన్స్జెండర్ల జాబితాను సేకరించారు. దీని ఆధారంగా ఎంపిక ప్రక్రియ చేపట్టారు. దీనికి 58 మంది ట్రాన్స్జెండర్లు హాజరు కాగా. 44 మంది ఎంపికయ్యారు. అనివార్య కారణాలతో ఐదుగురు శిక్షణ మధ్యలోనే వెళ్లిపోగా, మిగిలిన 39 మంది దాదాపు 20 రోజులపాటు వివిధ అంశాల్లో శిక్షణ తీసుకున్నారు. వీరికి ఇటీవల ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందించారు. ఒకటి రెండు రోజుల్లో వీరు యూనిఫాంతో విధుల్లోకి రానున్నారు. వీరికి హోంగార్డుల మాదిరిగా రోజుకు రూ.921 చొప్పున వేతనం ఇవ్వనున్నారు.ఎవరూ పని ఇవ్వలేదుఖమ్మంలోని పందిళ్లపల్లి కాలనీ నా స్వస్థలం. పదో తరగతి పూర్తి చేసినా ఇప్పటివరకు ఎవరూ పని చేయడానికి అవకాశం ఇవ్వలేదు. దీంతో రోడ్లపై భిక్షాటన చేసుకుంటూ బతికా. నా తల్లి బాలమణి, కుటుంబ సభ్యులు అంతా నా భవిష్యత్తుపై ఆందోళనతో ఉండేవాళ్లు. హైదరాబాద్ పోలీసులు ఇచ్చిన ఈ అవకాశం నన్ను నేను నిరూపించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 20 రోజుల శిక్షణ కాలం ఎన్నో విషయాలు నేర్పింది. జీవితానికి ఉన్న విలువని తెలిపింది.– కె.శ్రీవల్లిబాబాయి పెళ్లికి రావద్దన్నారు! సూర్యాపేట జిల్లా కందిబండలో పుట్టా. ఇంటర్ వరకు చదివా. కుటుంబీకులు కూడా దూరం పెట్టారు. సొంత బాబాయి పెళ్లికి కూడా నన్ను రావద్దని, వస్తే తమ పరువు పోతుందని చె΄్పారు. ఇప్పుడు పోలీసు విభాగంలో ఉద్యోగం వచ్చిందని తెలిసి అంతా ఫోన్లు చేస్తున్నారు. నా భర్త, అత్తమామలు కూడా సంతోషించారు. కేవలం పోలీసు విభాగమే కాదు అన్నింటిలోనూ మాకు సమాన అవకాశాలు ఇవ్వాలి. టాన్స్జెండర్లకు వివిధ రంగాల్లో ఆసక్తి ఉన్నా అవకాశం దొరకట్లేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో వీధుల్లో భిక్షాటన చేసుకుని బతుకుతున్నారు.– కందుల భానుప్రియచిన్నప్పటి కల నెరవేరిందిభద్రాచలం సమీపంలోని రామచంద్రునిపేట నా స్వస్థలం. బీఏ కంప్యూటర్స్ పూర్తి చేసిన తర్వాత సొంతంగా వ్యాపారం పెట్టాలనుకున్నాను. బ్యాంకు రుణాలు రావని కొందరు చెప్పడంతో మిన్నకుండిపోయా. ఏ ఉద్యోగాలూ దొరకలేదు. చిన్నప్పటి నుంచి పోలీసు అవాలనే కోరిక ఉంది. అయితే సర్టిఫికెట్ల ప్రకారం పురుషుడిగా, రూపం, హావభావాలు స్త్రీ మాదిరిగా ఉండటంతో అది సాధ్యం కాలేదు. ఇప్పుడు ట్రాఫిక్ అసిస్టెంట్ ఉద్యోగం ద్వారా పోలీసు డిపార్ట్మెంట్లోకి అడుగుపెడుతున్నా. ఈ శిక్షణలో నేర్పిన అనేక అంశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో నన్ను నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను.– కారం సనఎక్కువ జీతం కాదనుకొని...భద్రాచలం సమీపంలోని గిరిజన ప్రాంతమైన లచ్చిగూడెం నా స్వస్థలం. నర్సింగ్ పూర్తి చేసి ప్రస్తుతం ఎం.ఏ. సోషియాలజీ చేస్తున్నాను. గతంలో ఎనిమిదేళ్లపాటు భద్రాచలంలోని ఓ ఎన్జీవోలో పని చేశా. మూడేళ్లక్రితం హైదరాబాద్‌కు వచ్చి ఓ ఎన్జీవోలో కౌన్సిలర్‌గా చేరా. రెండేళ్లకు వారి ఒప్పందం పూర్తికావడంతో అప్పటి నుంచి భిక్షాటన చేసుకుంటూ బతుకుతున్నా. ఈమధ్య మరో ఎన్జీవోలో ఎక్కువ జీతానికి ఆఫర్ వచ్చింది. అది వదులుకుని దానికంటే తక్కువ జీతం వస్తుందని తెలిసినా ట్రాఫిక్ అసిస్టెంట్‌గా చేరుతున్నా. ఎందుకంటే ఎన్జీవోలో పని చేస్తే నేను ఏం చేస్తున్నాననేది నా వాళ్లకు తెలియదు. భిక్షాటన చేస్తూనో, మరోరకంగానో బతుకుతున్నా అనుకుంటారు. ఈ ఉద్యోగం చేస్తుంటే యూనిఫాంతో నా పని అందరికీ తెలుస్తుంది. మాపై ఉన్న దురభిప్రాయం పోతుంది. – జెస్సీ– శ్రీరంగం కామేష్, సాక్షి, హైదరాబాద్ -
TGSP: ఎందుకీ వివాదం.. ఏమిటీ ‘ఏక్ పోలీస్’?
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగంలో కొనసాగుతూ ధర్నాలు, ఆందోళనలకు నాయకత్వం వహించారని.. నిరసనలను ప్రేరేపించి క్రమశిక్షణను ఉల్లంఘించారంటూ ఆర్టికల్ 311ను తెలంగాణ పోలీస్ శాఖ ప్రయోగించింది. 39 మంది మంది తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేస్తూ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘ఏక్ పోలీస్’? అంటే ఏంటి? అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయి ఒకసారి పరిశీలిస్తే.. రాష్ట్రంలో మొత్తం 13 బెటాలియన్లు ఉన్నాయి. వాటిలో అధికారులు, సిబ్బంది కలిపి ఒక్కో బెటాలియన్‌లో వెయ్యి మంది వరకు ఉంటారు. సాధారణంగా పోలీస్‌శాఖలో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), స్పెషల్ పోలీస్ విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేస్తుంటారు. పోలీస్స్టేషన్లలో ఉంటూ శాంతిభద్రతల పర్యవేక్షణ, నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుండగా వారికి బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు సహాయపడుతుంటారు. కానీ టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది శాంతిభద్రతల విధులు నిర్వహిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లోనూ పనిచేస్తారు. అయితే తమను ఐదేళ్లలో ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్)లోకి, ఆ తర్వాత ఐదేళ్లకు సివిల్ కానిస్టేబుల్‌గా మార్చాలని టీజీఎస్పీ కానిస్టేబుళ్లు కోరుతున్నారు. అయితే ఇందుకు రాష్ట్ర సర్వీస్ నిబంధనలు అంగీకరించవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుందంటూ డీజీపీ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీస్ సిబ్బంది నిర్వహిస్తున్న విధులు కొన్ని దశాబ్దాల నుంచి అమలు జరుగుతున్నాయి. జిల్లాల స్థాయిలో నేర విచారణ చేయడం, నేరాలు నిరోధించడం నేరస్తులను గుర్తించడం వంటి విధులను సివిల్ పోలీస్ సిబ్బంది చేస్తుంటారు. బందోబస్తు తదితర విధులలో ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసులు సహాయపడుతుంటారు. కానీ, టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శాంతి భద్రతల అంశాలలో విధులు నిర్వహిస్తుంటారు. ఎన్నికల సమయంలో ఇతర రాష్ట్రాల్లో అప్పగించిన బాధ్యతలను సైతం అద్భుతంగా నిర్వహించిన ఘనత టీజీఎస్పీ సిబ్బందికి ఉంది.దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఈ రకమైన విధానాలనే అమలు చేస్తున్నాయి.. టీజీఎస్పీ సిబ్బంది సమస్యలను మెరిట్ ప్రాతిపదికన సానుభూతితో పోలీస్ శాఖ పరిశీలిస్తుంది. ఇతర ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు ఎవరికీ లేని విధంగా టీజీఎస్పీ సిబ్బందికి సరెండర్ లీవ్‌లు, అడిషనల్ సరెండర్ లీవులు మంజూరు చేశాము. పండుగలు, సెలవుల సందర్భాలలో టీజీఎస్పీ సిబ్బంది నిర్వహించే విధులను దృష్టిలో ఉంచుకొని వారికి ఈ సౌకర్యం కల్పిస్తున్నాము. వేతనాలు, భత్యాలు ఇతర రాష్ట్రాల పోలీస్ సిబ్బందితో పోలిస్తే అధికంగా ఉన్నాయి. భద్రత, ఆరోగ్య భద్రత వంటి సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ సిబ్బంది కోసం సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుంది. ఈ పరిస్థితుల్లో టీజీఎస్పీ సిబ్బంది ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం సమంజసం కాదు’’ అంటూ ప్రకటనలో డీజీపీ పేర్కొన్నారు.ఇదీ చదవండి: కులగణనకు ఇంటింటి సర్వే‘‘యూనిఫామ్ ధరించే టీజీఎస్పీ సిబ్బంది అత్యంత క్రమశిక్షణ తో విధులను నిర్వహించాల్సి ఉంటుంది. క్రమశిక్షణతో విద్యుక్త ధర్మాన్ని నిర్వహిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్ట ను పెంచాలి.. కానీ సిబ్బంది పోలీస్ శాఖకు మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించకూడదు. సమస్యలను సరైన పద్ధతిలో పరిశీలిస్తామని టీజీఎస్పీ పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాను. యథావిధిగా టీజీపీఎస్పీ సిబ్బంది వారి సాధారణ విధులను నిర్వహించాలి. సమస్యలు ఏమైనా ఉంటే వారి కోసం నిర్వహిస్తున్న "దర్బార్" కార్యక్రమం ద్వారా వారి అధికారులకు తెలియజేయాలి. యూనిఫామ్ సిబ్బంది క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడం, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం తీవ్రమైన విషయంగా పరిగణించాల్సి వస్తుంది’’ అంటూ డీజీపీ హెచ్చరించారు. -
బెటాలియన్ కానిస్టేబుళ్ల ఆందోళనపై పోలీసు శాఖ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ బెటాలియన్లలో పనిచేసే కానిస్టేబుళ్ల ఆందోళనలపై రాష్ట్ర పోలీస్ శాఖ సీరియస్ అయ్యింది. విధులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి పోలీసులు ఆందోళన చేయడం తీవ్రమైన క్రమశిక్షణ ఉల్లంఘనగా భావిస్తున్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు. దీనిని ఎట్టి పరిస్థితుల్లో సహించమని హెచ్చరించారు. పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సామాన్య జనానికి ఇబ్బంది కలిగేలా రోడ్లపై వచ్చిన పోలీసులపై చట్టపరమైన, శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. సెలవుల విషయంలో పాత పద్ధతినే అనుసరిస్తామని ఇప్పటికే చెప్పినప్పటికీ మళ్లీ ఆందోళన చేయడంపై సరికాదన్నారు. ఆగ్రహం వ్యక్తం చేసింది. బెటాలియన్స్‌లో ఆందోళన చేస్తున్న వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానిస్టేబుళ్ల ఆందోళన వెనక ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తముందని అనుమానం ఉందన్నారు.కాగా తెలంగాణలో ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అన్ని జిల్లాలోలనూ కానిస్టేబుళ్లు, వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారువరంగల్ జిల్లా మమూనూరు క్యాంపులో మొదలైన ఆందోళన సెక్రటేరియట్ చేరింది. క్రమంగా రాష్ట్రంలోని అన్ని బెటాలియన్లకు పాకింది.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, నల్గొండ రూరల్, మంచిర్యాలలో నిరసనలు చేపట్టారు. అయితే మామునూరు బెటాలియన్ ఆవరణలో ఏకంగా యూనిఫాం ధరించిన పోలీసులే నిరసనకు దిగారు. టీజీఎస్పీ వద్దు ఏక్ పోలీస్ ముద్దు, టీజీఎస్పీకో హఠావో.. ఏక్ పోలీస్ బనావో అంటూ నినాదాలు చేశారు. -
రాష్ట్ర అవతరణ ఉత్సవాలు.. పోలీసుల రిహార్సల్స్ (ఫొటోలు)
-
తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇక, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఏకంగా 62 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. వివరాల ప్రకారం.. తెలంగాణలో అధికారుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు వివిధ శాఖల్లోని పలువురు అధికారులను ట్రాన్స్ఫర్ చేయగా.. తాజాగా పోలీసు శాఖలో మరోసారి పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ఆదివారం 62 మంది డీఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ క్రమంలో డీజీ ఆఫీస్‌లో వెయిటింగ్లో ఉన్న డీఎస్పీలందరికీ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. తాజా బదిలీలతో తెలంగాణలో ఇప్పటి వరకు 300 మంది డీఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. డీఎస్సీలతో పాటుగా హైదరాబాద్‌లో పలువురు ఏసీపీలను సైతం బదిలీ చేసింది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే పలు బదిలీలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. -
TS: వాహనదారులకు గుడ్‌న్యూస్.. ట్రాఫిక్ చలాన్లపై భారీ డిస్కౌంట్
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు విషయంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చలాన్ల చెల్లింపుల్లో వాహనదారులకు ఊరట అందించింది. చలాన్ల చెల్లింపులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలకు చల్లాన్లపై 80 శాతం రాయితీ ప్రకటించింది. వివరాల ప్రకారం.. ట్రాఫిక్ చలాన్ల విషయంలో తెలంగాణ పోలీసులు భారీ ఆఫర్ ఇచ్చారు. చలాన్ల చెల్లింపులో భారీ డిస్కౌంట్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన దాని కన్నా ఎక్కువ వెసులుబాటు కల్పించారు. ఇక, ఈనెల 26వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టే అవకాశం ఇచ్చారు. చలాన్లను ఆన్‌లైన్‌తో పాటుగా మీ సేవ కేంద్రాల్లో కూడా చెల్లించవచ్చు. చలాన్లలో డిస్కౌంట్ ఇలా.. ►ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి 90 శాతం డిస్కౌంట్ ► ద్విచక్ర వాహనాల చలాన్లకు 80 శాతం డిస్కౌంట్ ►ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం డిస్కౌంట్ ►లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కి 50 శాతం డిస్కౌంట్. కాగా, నవంబర్ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. గతంలో మాదిరే రాయితీ ప్రకటించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఇదిలా ఉండగా.. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైంది. అందుకే ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. మరి ఈసారి ఎలా ఉండనుందో చూడాలి. -
పెరుగుతున్న గృహ వేధింపులు!
సామాజికంగా ఎన్ని మార్పులు చేసుకుంటున్నా.. గృహ హింసలో మాత్రం తగ్గుదలఉండడం లేదు. అదనపు కట్నం కోసం వేధింపులు, తాగుబోతు భర్తలు, అత్తింటి వారి వేధింపులకు గురయ్యే మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఏటా పెరుగుతున్న గృహ హింస సంబంధిత ఫిర్యాదుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. అయితే గతంలో మాదిరిగా ఇంటి పరువు, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వస్తాయోనన్న భయాన్ని గృహిణులు వీడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ఫిర్యాదుదారులకు కౌన్సెలింగ్ గత ఐదేళ్లలో నమోదైన గృహ హింస ఫిర్యాదులను పరిశీలిస్తే.. 2019లో రాష్ట్రవ్యాప్తంగా 43 ఫిర్యాదుల నమోదైతే..ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లోనే 162 మంది మహిళలు గృహ హింసకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుల్లో కొందరు నేరుగా మహిళా భద్రత విభాగానికి, పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదు ఇవ్వగా, మరికొందరు మహిళా భద్రత విభాగం వాట్సాప్ నంబర్‌కు, ఈ–మెయిల్ ద్వారా, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖలో ప్రత్యేకించి మహిళా భద్రత కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు, షీటీమ్స్, ఇతర చర్యలతో మహిళల్లో పోలీసులపై భరోసా పెరగడం వల్ల కూడా వారు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు ఇస్తున్నారని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. గృహ హింస ఫిర్యాదులు పెరగడానికి, మహిళల్లో పెరిగిన అవగాహన, భరోసాయే కారణమని పేర్కొన్నారు. మహిళా భద్రత విభాగానికి వచ్చే గృహ హింస ఫిర్యాదులపై సఖి, భరోసా సెంటర్ల ద్వారా, అవి అందుబాటులోని లేని ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లలో ప్రైవేటు కౌన్సిలర్ల ద్వారా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సమస్య తీవ్రతను బట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఫిర్యాదుల్లో కొన్నిటిని కుటుంబీకుల మధ్య సయోధ్య కుదుర్చడం ద్వారా పరిష్కరిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద డ్రోన్ లేజర్ షో అదుర్స్ (ఫొటోలు)
-
హైదరాబాద్‌లో ‘సురక్ష దినోత్సవం’.. పోలీసుల ర్యాలీ (ఫోటోలు)
-
రూ.2వేల నోట్ల మార్పిడి పేరిట మోసాలు..
సాక్షి, హైదరాబాద్: రూ.2వేల నోట్లను మార్పిడి చేసి ఇస్తామని కొందరు మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు హెచ్చరిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ.2వేల నోట్లను ఉపసంహరించడం తెలిసిందే. రూ.2వేల నోట్లను బ్యాంకులలో జమ చేసి ఇతర కరెన్సీ నోట్లు పొందాలని ఇప్పటికే సూచించింది. దీంతో కొన్ని రోజులుగా రూ.2వేల నోట్ల మార్పిడి పెరిగింది. ఇదే అదనుగా రూ.2వేల నోట్లను కమీషన్లకు మార్చి ఇస్తామని మోసగిస్తున్న వారి వలలో పడవద్దని తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన తెలంగాణ స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ప్రజల్లో ఈ తరహా మోసాలపై అవగాహన పెంచేందుకు ట్విట్టర్ ద్వారా పోలీస్ అధికారులు ప్రచారం చేస్తున్నారు. రూ.2వేల నోట్ల మార్పిడి పేరిట మోసగించే వారిపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానం ఉంటే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని వారు సూచిస్తున్నారు. నోట్ల మార్పిడికి బ్యాంకులకే వెళ్లాలని, కొత్తవారిని నమ్మి మోసపోవద్దని వారు సూచించారు. -
హైకోర్టు తీర్పుతో తేలనున్న తెలంగాణ డీజీపీ భవితవ్యం.. ఏపీకి వెళ్లాల్సిందేనా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర డీజీపీగా అంజనీకుమార్ కొనసాగుతారా? లేక ఏపీకి వెళ్లాల్సి వస్తుందా అనేది నేడు తేలిపోనుంది. 2014లో ఉమ్మడి ఏపీ విభజన నేపథ్యంలో కేంద్రం నియమించిన ప్రత్యూ ష్ సిన్హా కమిటీ నివేదిక ప్రకారం ఆలిండియా సర్వీస్ ఉద్యోగుల విభజనలో భాగంగా అంజనీకుమార్‌ను ఏపీకి కేటాయించారు. అయితే కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించిన అంజనీకుమార్ తెలంగాణలో విధులు నిర్వహించేలా ఉత్తర్వులు పొందారు. గత నెలలో డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ చేయడంతో ప్రభుత్వం ఆ బాధ్యతలను అంజనీకుమార్‌కు అప్పగించింది. బాధ్యతలు చేపట్టి ఇంకా నెలైనా పూర్తికాకముందే కేడర్ కేటాయింపులకు సంబంధించి తీర్పు రానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన సోమేశ్ కుమార్‌కు ఈనెల 10న హైకోర్టు షాక్ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు కేటాయించినందున అక్కడే వెళ్లి విధులు నిర్వహించాలని తేల్చిచెప్పింది. దీంతో ఆయన సీఎస్ విధులకు రాజీనామా చేసి, ఏపీకి వెళ్లి రిపోర్టు చేశారు. ఆయన ఏపీలో బాధ్యతలు చేపడ తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఈ నేపథ్యంలో నేడు వెలువడనున్న తీర్పు డీజీపీకి అనుకూలమా.. ప్రతికూలమా? అన్నది సందిగ్ధంగా మారింది. సోమేశ్‌లానే తీర్పు వెలువడితే అంజనీకుమార్ కూడా ఏపీకి వెళ్లాల్సి వస్తుంది. ఇదే జరిగితే ఒక రాష్ట్రంలో కోర్టు తీర్పుల కారణంగా ఒకే నెలలో సీఎస్, డీజీపీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి రావడం దేశంలో ఇదే తొలిసారి అవుతుంది. వీరిద్దరూ బిహార్ రాష్ట్రానికి చెందినవారే కావడం గమనార్హం. అంజనీకుమార్‌తోపాటు మరికొందరు ఆలిండియా కేడర్ సర్వీస్ అధికారులు కూడా క్యాట్ అనుమతి పొంది తెలంగాణలో పనిచేస్తున్నారు. వీరందరికీ సంబంధించి కేంద్రం దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. నేటి తీర్పుతో డీజీపీ అంజనికుమార్ సహా 12 మంది అధికారుల భవితవ్యం కూడా తేలిపోనుంది. -
జి–20 వర్కింగ్ గ్రూప్ భేటీకి పటిష్ట భద్రత
సాక్షి, హైదరాబాద్: ఈనెల 28 నుంచి జూన్ 17 మధ్య హైదరాబాద్‌లో జరగనున్న జి–20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలకు తెలంగాణ పోలీస్‌శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పా టు చేస్తోంది. ఈ సమావేశాలు విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలని డీజీపీ అంజనీకుమార్ అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన జి–20 సెక్యూరిటీ కోఆర్డినేషన్ కమిటీలో నిర్ణయించారు. డీజీపీ అధ్యక్షతన ఆయన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో సీనియర్ పోలీస్ అధికారులతోపా టు, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీస్, ఎన్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఎన్ఎస్జీ తదితర భద్రతా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, జి–20 దేశాల అధినేతల అత్యున్నత సమావేశానికి ముందస్తుగా దేశంలోని 56 నగరాల్లో 215 వర్కింగ్ గ్రూ పు సమావేశాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో 6 సమావేశాలు జరగనున్నాయని వెల్లడించారు. వీటిలో జనవరి 28న తొలి సమావేశం జరగనుండగా, మార్చ్ 6,7 తేదీల్లో, ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో, జూన్ 7,8,9 తేదీల్లో, జూన్ 15,16 తేదీల్లో జూన్ 17న వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. సమన్వయం ఎంతో ముఖ్యం.... జీ–20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు సజావుగా, భద్రతాపరమైన అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వయం అవసరమని డీజీపీ సూచించారు. సమావేశాలకు హాజ రయ్యే ఉన్నతస్థాయి ప్రతినిధులు నగరంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశమున్నందున ఆయా ప్రాంతాల్లో విస్తృత భద్రతా చర్యలు చేపట్టాలని, సమర్థవంతమైన సమన్వయం కోసం అంతర్గత వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని సమాచారాన్ని పంచుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీజీలు అభిలాష బిస్త్, సంజయ్‌కుమార్ జైన్, స్వాతిలక్రా, విజయకుమార్, నాగిరెడ్డి, సైబరాబాద్ పోలీస్ కమీషనర్ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, డీఐజీ తఫ్సీర్ ఇక్బాల్, హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, హోంశాఖ ఎస్ఐబీ డిడి సంబల్ దేవ్, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సీఎస్ఓ భారత్ కందార్, డిప్యూటీ పాస్‌పోర్ట్ ఆఫీసర్ ఇందు భూషణ్ లెంక, ఎన్ఎస్జీ కల్నల్ అలోక్ బిస్త్, జీఏడీ ప్రోటోకాల్ అధికారి కె.నాగయ్య తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. -
డేంజరస్ భవేరియా గ్యాంగ్.. చైన్ స్నాచింగ్‌లపై పోలీసులు అలర్ట్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఇటీవల చోటుచేసుకున్న వరుస చైన్ స్నాచింగ్‌లపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. కాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన భవేరియా గ్యాంగ్ ఈ దొంగతనాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు, భవేరియా గ్యాంగ్ బెంగళూరులో చోరి చేసి వారు హైదరాబాద్‌కు వచ్చి దొంగతనాలకు చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇక, వీరిని పట్టుకునేందుకు 30 టీమ్‌లను ఏర్పాటు చేసినట్టు రాచకొండ, హైదరాబాద్ పోలీసులు తెలిపారు. కాగా, భవేరియా గ్యాంగ్ సభ్యులు బృందాలుగా ఏర్పడి చోరీలు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. అయితే, హైదరాబాద్‌లో చోరిల అనంతరం.. భవేరియా గ్యాంగ్ రైలు మార్గంలో ఇతర రాష్ట్రాలకు పారిపోయినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
డీజీపీ మహేందర్‌రెడ్డి పదవీ విరమణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్‌శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) ఎం.మహేందర్‌రెడ్డి శనివారం పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మరో సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మహేందర్‌రెడ్డి పదవీ విరమణ సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఉదయం 8:25 గంటలకు పరేడ్ నిర్వహించనున్నారు. నూతన డీజీపీగా అంజనీకుమార్ శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు అంజనీకుమార్‌కు ప్రస్తుత డీజీపీ మహేందర్‌రెడ్డి గౌరవ లాఠీని అందిస్తారు. అనంతరం అంజనీకుమార్‌ను డీజీపీ కుర్చీలో గౌరవప్రదంగా కూర్చోబెట్టనున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం మహేందర్‌రెడ్డికి సీనియర్ అధికారులు, ఇతర సిబ్బంది వీడ్కోలు పలకనున్నారు. మహేందర్‌రెడ్డి సేవలు అభినందనీయం: హోంమంత్రి డీజీపీగా పదవీ విరమణ పొందుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డిని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శాలువాతో సత్కరించారు. ఈ మేరకు లక్డీకాపూల్‌లోని హోంమంత్రి కార్యాలయానికి వెళ్లిన డీజీపీ మహేందర్‌రెడ్డి హోంమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డికి మంత్రి చార్మినార్ జ్ఞాపికను అందించారు. పోలీస్ అధికారిగా వివిధ హోదాల్లో మహేందర్‌రెడ్డి చక్కటి సేవలందించారని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే రాష్ట్ర పోలీసు శాఖను అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషి చేశారని ప్రశంసించారు. విధినిర్వహణలో తనదైన ముద్రవేశారని, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా, డీజీపీగా, ఇతర అనేక హోదాల్లోనూ పనిచేసి అందరి మన్ననలు పొందారని హోంమంత్రి గుర్తు చేశారు. డీజీపీగా మహేందర్‌రెడ్డి పనిచేసిన ఈ ఐదేళ్లలో తెలంగాణ పోలీసు శాఖను దేశంలోనే అగ్రభాగాన నిలిపారని పేర్కొన్నారు. గురువారం బదిలీలు పొందిన హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, అడిషనల్ డీజీపీలు జితేందర్, సంజయ్ కుమార్ జైన్ తదితరులు సైతం హోంమంత్రిని కలిశారు. -
పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కేబినెట్ ఆమోదం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని మొత్తం 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది. వీటితోపాటు.. మూడు కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అదే విధంగా శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనీ, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్‌ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయని కేబినెట్ చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు కేటీఆర్ వరాల జల్లు -
సిబిఐ వర్సెస్ తెలంగాణ పోలీస్
-
సర్వీసు అధికారులు వెయిటింగ్లో.. రిటైర్డ్ అధికారులు పోస్టింగ్‌లో..
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగమైనా, ప్రైవేట్ రంగమైనా ఉద్యోగానికి ఒక రిటైర్మెంట్ వయసు ఉంటుంది. కీలక విభాగాల్లో, ఉన్నతమైన స్థానాల్లో పనిచేసే అధికారుల పదవీ విరమణ వల్ల కొంత ఇబ్బంది ఎదురవుతుందనుకుంటే సలహాదారుడి గానో లేదా ఓఎస్డీగానో కొద్ది రోజులు నియమించుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుంది. కానీ పోలీస్ శాఖలో మాత్రం రిటైరై ఎన్నేళ్లయినా ఫర్వాలేదు.. ఓఎస్డీ, చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ లాంటి పేర్లతో కీలక విభాగాలకు బాస్‌లుగా చలామణి అవ్వొచ్చు. రాష్ట్రం ఏర్పడకముందు ఇద్దరు, ముగ్గురు అధికారులు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ఏళ్లపాటు ఓఎస్డీలుగా పెత్తనం చెలాయించారు. తీరా తెలంగాణ ఏర్పడిన తర్వాత రిటైరైన అధికారులు పదవిలో కొనసాగుతున్న అధికారుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇలా పోలీస్ శాఖలోని కీలక విభాగాలతోపాటు డిప్యుటేషన్ యూనిట్లలోనూ ఇదే రకమైన ఓఎస్డీల పెత్తనం పెరిగిపోయింది. అత్యంత కీలక విభాగంలో... రాష్ట్ర పోలీస్ శాఖకే కాదు, ప్రభుత్వానికీ ఇంటెలిజెన్స్ విభాగం అత్యంత కీలకం. ప్రతీక్షణం శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రాజకీయాల్లో జరుగుతున్న మార్పులు.. ఇలా ప్రతీ అంశాన్ని ఎప్పటికప్పుడు పసిగట్టి ప్రభుత్వానికి నివేదించాలి. ఇలాంటి విభాగంలోని కీలకమైన ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) మొత్తం పదవీ విరమణ పొందిన అధికారుల పెత్తనంలోనే నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ పేరుతో రిటైర్డ్ ఐజీ, ఓఎస్డీల పేరుతో మరో ముగ్గురు నాన్‌కేడర్ అదనపు ఎస్పీలు ఎస్ఐబీని నడిపిస్తున్నారనే చర్చ పోలీస్ శాఖలో జరుగుతోంది. మరోవైపు, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ (సీఐసెల్) విభాగంలో రిటైరైన ఇద్దరు అదనపు ఎస్పీలు, ట్రాన్స్‌కోలో ఓ రిటైర్డ్ అదనపు ఎస్పీ, పోలీస్ అకాడమీలో ఒక రిటైర్డ్ ఎస్పీ, ఏసీబీలో రిటైరైన ఓ ఐఈపెస్ అధికారి ఏళ్ల నుంచి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పేరుతో కొలువులో ఉన్నట్లు తెలిసింది. ఇకపోతే నగర కమిషనరేట్‌కు అత్యంత కీలకమైన టాస్క్‌ఫోర్స్ విభాగానికి డీసీపీగా నేతృత్వం వహిస్తున్న అధికారి సైతం ఏళ్ల నుంచి ఓఎస్డీగా పనిచేస్తుండటం గమనార్హం. ఇలా మొత్తం పోలీస్ శాఖలో 23 మంది పదవీ విరమణ పొందిన అధికారులు ఓఎస్డీ పేరుతో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. వెయిటింగ్లో 43 మంది అన్నీ ఉండి అల్లుడి నోట్లో శని అన్న సామెత రాష్ట్ర పోలీస్ శాఖకు సరిగ్గా సరిపోతుంది. ఒకవైపు 43 మంది ఐపీఎస్ అధికారులు పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నారు. వీరిని వివిధ విభాగాలకు అటాచ్మెంట్ల పేరుతో అంతర్గత ఆదేశాలు ఇచ్చి కూర్చోబెట్టారు. కానీ కీలక విభాగాల్లో ఐపీఎస్‌లు చేయాల్సిన విధులను రిటైరైన అధికారులకు ఇచ్చి కూర్చోబెట్టడం వివాదాస్పదమవుతోంది. రిటైరై ఓఎస్డీగా ఉన్న అధికారులు ఎక్కడ కూడా అధికారికంగా సంతకాలు గానీ, ప్రతిపాదనలపై పెత్తనం గానీ చేయకూడదు. కానీ వీరు ఏకంగా అధికారిక ఉత్తర్వులపై సంత కాలు చేస్తూ వివాదానికి తెరలేపుతున్నారు. సర్వీస్‌లో ఉన్న ఐపీఎస్, నాన్‌కేడర్ అధికారులను కాదని రిటైరైన అధికారులకు పెత్తనం ఇవ్వడం వెనకున్న ఆంతర్యమేంటనే చర్చ జరుగుతోంది. -
దేశంలో పోలీసు పోస్టులు ఖాళీ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు బలగాలు కొన్నే ళ్లుగా గణనీయ అభివృద్ధి సాధించినా.. ఇప్పటికీ అనేక లోపాలు వెంటాడుతున్నాయని ‘ది ఇండియన్ జస్టిస్ నివేదిక (ఐజేఆర్)’ నివేదిక పేర్కొంది. ‘డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్స్ రిపోర్ట్–2021’ పేరుతో గురువారం దీనిని విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీసు బలగాల్లో సిబ్బంది సంఖ్య 2010–2020 మధ్య 32% పెరిగిందని.. అయితే మహిళా సిబ్బంది, అధికారుల సంఖ్య మాత్రం 10.5 శాతమే పెరి గిందని నివేదిక స్పష్టం చేసింది. పోలీసు ఉద్యో గాల్లో మహిళలకు 33% ఇవ్వాలన్న లక్ష్యానికి ఇది ఆమడ దూరంలో ఉన్నట్టేనని పేర్కొంది. గత ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా మొత్తం 20.7 లక్షల పోలీసు ఉద్యోగాలు ఉండగా.. అందులో 5.62 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేల్చింది. ఐజేఆర్ నివేదికలోని కీలక అంశాలివీ.. ►అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం.. ప్రతి 300 మంది ప్రజలకు ఒక సివిల్ పోలీసు ఉండాలి. కానీ ప్రస్తుతం దేశంలో ప్రతి 841 మందికి ఒక సివిల్ పోలీసు మాత్రమే ఉన్నారు. ►ప్రభుత్వాలు పోలీసు విభాగాల కోసం చేసే ఖర్చులో కేవలం 1.2 శాతమే వారి శిక్షణకు కేటాయిస్తున్నాయి. ►బాధితులుగా మారి, సహాయార్థం పోలీస్స్టేషన్లకు వచ్చే మహిళలకు సహాయ సహకారాలు అందించడానికి ఉద్దేశించిన విమెన్ హెల్ప్‌డెస్క్‌లు ఇంకా పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి రాలేదు. దేశంలోని 59 శాతం పోలీసుస్టేషన్లలో మాత్రమే అవి అందుబాటులోకి వచ్చాయి. మిగతా ఠాణాల్లో ఇప్పటికీ బాధిత మహిళలకు పూర్తి భరోసా లభించని పరిస్థితి నెలకొంది. దేశంలో మొత్తంగా 17,233 పోలీస్స్టేషన్లు ఉండగా.. అందులో 10,165 ఠాణాల్లో మాత్రమే విమెన్ హెల్ప్ డెస్క్‌లు ఉన్నాయి. ►మొత్తంగా పోలీసు ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలవారు 2010లో 12.6% ఉండగా.. 2020 నాటికి ఇది 15.2 శాతానికి చేరింది. అయితే షెడ్యూల్డ్ తెగలవారి శాతం మాత్రం 10.6 శాతం నుంచి 11.7 శాతానికి మాత్రమే చేరింది. ఓబీసీల సంఖ్య మాత్రం గణనీయంగా పెరిగి 20.8% నుంచి 28.8 శాతానికి పెరిగింది. ►2010–20 మధ్య మొత్తంగా పోలీసు బలగాల సంఖ్య 32 శాతం పెరిగి.. 15.6 లక్షల నుంచి 20.7 లక్షలకు చేరింది. కానీ మంజూరు చేసిన పోస్టుల్లో ఇప్పటికీ 5.62 లక్షల ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే.. బిహార్‌లో అత్యధికంగా 41.8 శాతం, ఉత్తరాఖండ్‌లో అత్యల్పంగా 6.8 శాతం ఖాళీలు ఉన్నాయి. ►కానిస్టేబుల్ స్థాయి పోస్టుల్లో ఖాళీలు 2019లో 18 శాతం ఉండగా.. తర్వాతి ఏడాదికి ఖాళీలు 20 శాతానికి పెరిగాయి. అధికారుల పోస్టులను చూస్తే.. ఖాళీలు 29 శాతం నుంచి 32 శాతానికి పెరిగాయి. కేవలం తెలంగాణ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే ఇటీవల పోలీసు ఉద్యోగ ఖాళీల సంఖ్య తగ్గింది. ►ప్రతి పోలీసుస్టేషన్లో సీసీ కెమెరాలు తప్పని సరిగా పెట్టాలని సుప్రీంకోర్టు 2020 డిసెంబర్లో ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటికీ మూడింట రెండొంతుల ఠాణాల్లోనే ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 17,233 పోలీసుస్టేషన్లలో ఇప్పటివరకు 11,837 ఠాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఒడిశా, పుదుచ్చే రిలలో మాత్రం ప్రతి ఠాణాలో కనీసం ఒక సీసీ కెమెరా ఉన్నాయి. రాజస్తాన్‌లోని మొత్తం 894 పోలీసుస్టేషన్లలో కేవలం ఒక్కచోట మాత్రమే సీసీ కెమెరాలు ఉండగా.. మణిపూర్, లడఖ్, లక్ష ద్వీప్ల్లో ఒక్క ఠాణాలోనూ సీసీ కెమెరాలు లేవు. ►పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి, బాధితులకు న్యాయం చేయడానికి ప్రతి జిల్లాకు ఓ సైబర్ సెల్ ఉండాలని నాలుగేళ్ల క్రితం పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. కానీ దేశంలోని 746 జిల్లాలకుగాను.. 466 జిల్లాల్లో మాత్రమే సైబర్ సెల్స్ ఉన్నాయి. 14 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతి జిల్లాలో సైబర్ సెల్ ఉండగా.. పంజాబ్, మిజోరం, జమ్మూకశ్మీర్‌లలో ఒక్క జిల్లాలోనూ లేవు. ఏమిటీ ఐజేఆర్? న్యాయవ్యవస్థలో సంస్కరణల కోసం కృషి చేస్తున్న వివిధ సంస్థలు ఉమ్మడిగా రూపొంది స్తున్న నివేదికే ‘ది ఇండియా జస్టిస్ రిపోర్టు’. సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్, కామ న్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, ద„Š , టిస్– ప్రయాస్, విధిసెంటర్ ఫర్ లీగల్ పాల సీ, హౌ ఇండియా లీవ్స్ సంస్థలు ఇందులో ఉన్నాయి. ఎన్సీఆర్బీ, బీపీఆర్ అండ్ డీ కేంద్ర సంస్థల నివేదికలు, గణాంకాల ఆధారంగా 2019నుంచి ఐజేఆర్ను రూపొందిస్తున్నారు. తెలంగాణలో మొత్తం పోలీసు సిబ్బందిలో మహిళలు 8%కాగా.. సిబ్బంది, అధికా రుల హోదా రెండింటిలోనూ 8 శాతమే ఉన్నారు. ∙ఏపీలో మొత్తం పోలీసు సిబ్బందిలో మహిళలు 6.3%ఉన్నారు. అధికారి స్థాయిలోని పోస్టుల్లో 5.4% ఉన్నారు. -
Telangana: ఇదేమి ‘పని’ష్మెంట్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలోని పలువురు ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి ఎలాంటి కచ్చితమైన విధులు లేకుండా, పోస్టింగుల్లేకుండా కాలం వెళ్లదీస్తున్న వైనం విస్మయానికి గురిచేస్తోంది. ఇలా మొత్తం 47 మంది ఐపీఎస్ అధికారులు వెయిటింగ్ / అటాచ్మెంట్ పేరుతో ఎలాంటి ఉద్యోగం, బాధ్యత లేకుండా గడిపేస్తున్నారు. ఏదో ఒక విభాగానికి అటాచ్ అయిన కొందరికి జీతభత్యాలు అందుతున్నా, పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్నవారి పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. ఎప్పుడు శాశ్వత పోస్టింగ్ వస్తుందో తెలియని పరిస్థితుల్లో వీరంతా తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నట్టు పోలీసు అధికారులే చెబుతుండటం గమనార్హం. అసలు ఎందుకు ఐపీఎస్ అధికారులయ్యామో తెలియని దుస్థితిలో ఉన్నామంటూ అదనపు ఎస్పీ, ఏఎస్పీ స్థాయిలో ఉన్న కొందరు అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పదోన్నతి పొందినా పరిస్థితి మారకపోవడం మానసికంగా కుంగుబాటుకు కారణమవుతోందని చెబుతున్నారు. సీనియర్ ఐపీఎస్‌ల పరిస్థితి ఇలా ఉంటే శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఐపీఎస్‌ల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. పాసింగ్ ఔట్ పరేడ్ తర్వాత ప్రజల్లోకి వెళ్లాల్సిన వారిని అటాచ్మెంట్ పేరుతో మూడేళ్లుగా గ్రేహౌండ్స్‌లోనే కొనసాగించడం వివాదాస్పదమవుతోంది. ఏళ్ల తరబడి ఒకే పోస్టులో.. ► కొందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏళ్ల తరబడి ఒకే పోస్టులో కొనసాగుతున్న వైనం కూడా విస్మయపరుస్తోంది. ► సీనియర్ ఐపీఎస్‌గా ఉన్న అదనపు డీజీపీ నాగిరెడ్డి, ప్రస్తుతం నార్త్‌జోన్ ఇన్చార్జి ఐజీగా ఆరేళ్ల నుంచి కొనసాగుతున్నారు. ► అదనపు డీజీపీ సంజయ్‌కుమార్ జైన్, ప్రొవిజనల్ అండ్ లాజిస్టిక్ ఐజీగా జూన్ 6, 2015 నుంచి కొనసాగుతున్నారు. పదోన్నతి వచ్చినా ఆయనకు మరోచోట పోస్టింగ్ ఇవ్వకుండా అవే బాధ్యతల్లో కొనసాగింపజేస్తున్నారు. ► బి.శివధర్‌రెడ్డి, అదనపు డీజీపీ. ఈయన ఐజీ హోదాలో సెప్టెంబర్, 2016లో పోలీస్ శాఖ పర్సనల్ విభాగం బాధ్యతలు చేపట్టారు. దాదాపు ఆరేళ్లు పూర్తిచేసుకొని పదోన్నతి పొందినా ఇంకా అక్కడే కొనసాగుతున్నారు. ► కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి అదనపున డీజీపీ. మార్చి, 2017 నుంచి గ్రేహౌండ్స్ ఐజీ. ప్రస్తుతం పదోన్నతి పొంది అక్కడే అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ► ఐజీ సుధీర్‌బాబు ప్రస్తుతం రాచకొండ అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డీఐజీ హోదాలో మార్చి, 2018లో బాధ్యతలు స్వీకరించిన ఆయనకు ఐజీగా పదోన్నతి కల్పించినా ఇంకా అక్కడే అదనపు కమిషనర్‌గా ప్రభుత్వం కొనసాగిస్తోంది. ► ఐజీ రాజేష్‌కుమార్ 2016, జూన్ 30వ తేదీ నుంచి ఇంటెలిజెన్స్ విభాగంలోని కౌంటర్ ఇంటెలిజెన్స్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డీఐజీ నుంచి ఐజీ అయినా ఆరేళ్లుగా పాత పోస్టులోనే కొనసాగుతున్నారు. ► చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రస్తుతం ఐజీ. ఈయన పరిస్థితి మరీ విచిత్రం. ఐజీ హోదా ఉన్నప్పటికీ ఎస్పీ హోదా కలిగిన రామగుండం కమిషనర్ పోస్టులో పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 10 నెలలుగా ఆయన ఈ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారు. కుర్చీలో ఖాళీగా.. ఐపీఎస్ అధికారికి పక్కా పోస్టింగ్ కల్పిస్తేనే పూర్తి స్థాయిలో బాధ్యత నిర్వహణ సాధ్యమవుతుంది. కానీ రాష్ట్ర పోలీస్ శాఖలో ఓ పద్ధతి లేకుండా పోయింది. వెయిటింగ్/అటాచ్మెంట్ అనే పేరుతో ఏదో ఒక విభాగంలో కుర్చీ ఇచ్చి ఖాళీగా కూర్చోబెడుతున్నారు. అటాచ్‌మెంట్‌పై ఉన్న అధికారులు ఏదైనా పనిచేయడానికి కానీ, ఏదైనా విషయంలో సొంతంగా నిర్ణయం తీసుకోవడం గానీ, ఆదేశాలివ్వడం గానీ, పరిపాలన చేయడం గానీ ఉండదు. ఈ పరిస్థితుల్లోనే అధికారులు తీవ్ర నిరాశానిస్పృహలకు గురవుతున్నారు. 2017లో ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న యువ అధికారులను సైతం అటాచ్మెంట్ పేరుతో పోలీస్ శాఖ కొనసాగించడం ఏమిటో అర్ధం కావడం లేదని సీనియర్ అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సమయంలో అదనపు డీజీపీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు పదోన్నతులు పొందినా ఇంకా పాత పోస్టింగ్‌ల్లోనే కొనసాగుతున్నారు. -
కొత్త జిల్లాల్లో కానరాని మహిళా ఠాణాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో మహిళా పోలీస్ ఠాణాల ఏర్పాటుపై సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. కొత్త జిల్లాలు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఆ ఠాణాల ఏర్పాటుపై ప్రతిపాదనలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియని దుస్థితి ఏర్పడింది. ఐదేళ్లు పూర్తి కావచ్చినా నూతన జిల్లాల్లో మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటుపై పోలీస్ శాఖ ఉలుకూపలుకు లేకుండా ఉండటం చర్చనీయాంశమైంది. కొత్త జిల్లాల్లో అవసరమే.. కొత్త జిల్లాలుగా ఏర్పడిన కామారెడ్డి, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్, గద్వాల్, నారాయణపేట, సూర్యాపేట, కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లిలో మహిళా ఠాణాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని కమిషనరేట్లలో ఒకే ఒక మహిళా ఠాణా ఉంది. ఉదాహరణకు రామగుండం కమిషనరేట్‌లో మహిళా పోలీస్‌స్టేషన్ మంచిర్యాలలో ఉండగా, పెద్దపల్లి జిల్లా నుంచి అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి డీసీపీ పరిధిలో మరో ఠాణా ఏర్పాటు చేయాల్సి ఉందని అంటున్నారు. మహిళా స్టేషన్లలో పురుష ఇన్స్పెక్టర్లు.. రాష్ట్రంలో ప్రస్తుతమున్న మహిళా స్టేషన్లలో కొన్ని చోట్ల పురుష ఇన్స్పెక్టర్లకు పోస్టింగ్ కల్పించడం వివాదాస్పదమవుతోంది. మహిళలు తమ సమస్యలను పురుషులకు ఎలా చెప్పుకుంటారన్న కనీస అవగాహన లేకుండా పోస్టింగ్ ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఉదాహరణకు సైబరాబాద్ పరిధిలోని మహిళా ఠాణాకు పురుష ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓగా పని చేస్తున్నారు. అలాగే కరీంనగర్ కమిషనరేట్‌లో ఉన్న మహిళా ఠాణా ఎస్హెచ్ఓగా పురుష ఇన్స్పెక్టర్ విధులు నిర్వర్తిస్తున్నారు. రామగుండం కమిషనరేట్‌లోని ఉమెన్స్ పోలీస్‌స్టేషన్‌కు కూడా పురుష ఇన్స్పెక్టర్ బాధ్యతలు నిర్వర్తించడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ కమిషనరేట్‌లో ఉన్న రెండు మహిళా ఠాణాల్లో ఇద్దరు ఎస్హెచ్ఓలూ పురుష ఇన్స్పెక్టర్లే కావడం విమర్శలకు దారితీస్తోంది. పెరుగుతున్న మహిళా సిబ్బంది.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన పోలీస్ నియామకాల్లో మహిళలకు ప్రభుత్వం ప్రత్యేకంగా కోటా ఏర్పాటు చేసింది. సివిల్ (లా అండ్ ఆర్డర్) విభాగంలో 33 శాతం, ఆర్మ్డ్ (ఏఆర్) కేటగిరీలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. దీనితో పోలీస్ శాఖలో మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నియామకాల్లో పోలీస్ శాఖలోకి వచ్చిన మహిళా అధికారులంతా నాన్ ఫోకల్ పోస్టుల్లో, డిప్యూటేషన్ విభాగాల్లో కాలం వెల్లదీస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్న మహిళా ఇన్స్పెక్టర్లను కనీసం మహిళా ఠాణాల్లో ఎస్‌హెచ్‌ఓలుగా నియమించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీతో సైబర్ నేరాల ఆటకట్టు
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు పోలీసు శాఖ ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్సీ విభాగాన్ని ప్రారంభిస్తున్నట్టు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ సంబంధిత విభాగాలు, రాష్ట్రంలోని ప్రముఖ ఐటీ సంస్థలు, ఐఐటీ, ఐబీఎం సంస్థల భాగస్వామ్యంతో ఈ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీని త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. గచ్చిబౌలి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో సైబర్ సేఫ్టీ, జాతీయ భద్రత అనే అంశంపై శనివారం జరిగిన జాతీయ సదస్సులో డీజీపీ మహేందర్ రెడ్డి హాజరై ప్రసంగించారు. సైబర్ నేరాల నిరోధంపై రూపొందించిన చైతన్య, అవగాహన పోస్టర్లను డీజీపీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ప్రతీ స్టేషన్లో సైబర్ వారియర్ సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ పోలీస్ కీలక పాత్ర పోషిస్తోందని దీనిలో భాగంగానే రాష్ట్రంలోని 800 లకు పైగా పోలీస్ స్టేషన్లలో శిక్షణ పొందిన పోలీస్ ఆఫీసర్లను సైబర్ వారియర్లుగా నియమించామని డీజీపీ తెలిపారు. జిల్లా, కమిషనరేట్, రాష్ట్రస్థాయిలోను సైబర్ నేరాల పరిశోధన విభాగాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. సైబర్ నేరం అనేది వ్యక్తులనే కాకుండా ప్రభుత్వ సంస్థలు, వాణిజ్య, వ్యాపార, సేవా రంగాలకు ముప్పుగా పరిణమించిందని తద్వారా దేశ భద్రత కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. సదస్సుల్లో హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, కేంద్ర హోంశాఖ డైరెక్టర్ పౌసమి బసు, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఇంటెలిజెన్స్ ఐజీ రాజేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
256 మంది పోలీసులకు ‘వర్టికల్’ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో వర్టికల్ విధానాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న 256 మంది కానిస్టేబుల్, హోంగార్డులు, ఎస్ఐలు, ఇన్స్పెక్టర్లకు ఉత్తమ అవార్డులను డీజీపీ మహేందర్‌రెడ్డి అందించారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో పోలీస్ స్టేషన్లో హోంగార్డు, కానిస్టేబుల్, ఇతర అధికారులు ఎవరు ఏ రోజు ఏ విధులు నిర్వర్తిస్తున్నారో తెలిసేది కాదని, తమ విధి ఏంటన్నది వారికి కూడా క్లారిటీ లేకుండా ఉండేదన్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యాధునిక టెక్నాలజీ వినియోగం అందుబాటులోకి రావడంతో ప్రతి అధికారి జవాబుదారీతనంతో పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరికీ కచ్చితమైన డ్యూటీ ఉంటోందని వెల్లడించారు. కార్యక్రమంలోసీఐడీ డీజీపీ గోవింద్‌సింగ్, అదనపు డీజీపీలు రాజీవ్ రతన్, జితేందర్, నాగిరెడ్డి, సంజయ్‌కుమార్ జైన్, స్వాతిలక్రా తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ: పోలీస్ అభ్యర్థులకు మరో గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు వరుస నోటిఫికేషన్లతో శుభవార్తలు చెబుతున్న తెలంగాణ సర్కార్ తాజాగా మరో గుడ్‌న్యూస్ అందించింది. పోలీసుశాఖ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండేళ్లు పొడగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమలులోకి రావడంతో పాటు, రెండేళ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీ మహేందర్ రెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. కాగా పోలీసుశాఖతో పాటు ఫైర్, జైళ్లు, ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్, ఎస్పీఎస్ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 2వ తేదీ నుండి పోలీస్ ఉద్యోగాల కోసం ధరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఒకే అభ్యర్ధి ఎన్ని పోస్టులకైనా ధరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల దరఖాస్తుకు ఈనెల 20 రాత్రి 10 గంటల వరకు మాత్రమే సమయముంది. అయితే వయోపరిమితి పెంచిన నేపథ్యంలో దరఖాస్తు గడువు తేదీని కూడా పొడగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చదవండి: నోటిఫికేషన్లో అర్హతలే అంతిమం..పిటిషనర్ అప్పీల్‌ను కొట్టేసిన హైకోర్టు -
మహిళలూ.. పోలీసులవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చాక తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయబోతోంది. ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర తత్సమాన కేటగిరీల్లో మొత్తం 17 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని ఇటీవలే ప్రకటించింది. కొత్త జోనల్లో కానిస్టేబుల్ పోస్టులన్నీ జిల్లా కేడర్‌కు చెందినవే కావడంతో ఈసారి మహిళా ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. నియామకాల్లో భాగంగా సివిల్ కేటగిరీలో మహిళలకు 33 శాతం, ఆర్మ్డ్ రిజర్వ్‌లో 10 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తోందని చెబుతున్నారు. పురుషులతో పోలిస్తే ఫిజికల్ టెస్టుల్లో మహిళలకు కొంత మినహాయింపులు ఉంటాయని, వీటిని వినియోగించుకొని ఖాకీ కొలువులు సాధించాలని సూచిస్తున్నారు. 15,575 కానిస్టేబుల్.. 538 ఎస్ఐ పోస్టులు తాజాగా 16,113 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో 15,575 కానిస్టేబుల్, 538 ఎస్ఐ పోస్టులున్నాయి. పురుష అభ్యర్థుల తరహాలో మహిళా అభ్యర్థులకు కూడా భౌతిక, శారీరక దారుఢ్య పరీక్షలుంటాయి. కాబట్టి ప్రిలిమినరీ పరీక్షలకు సిద్ధమవుతూనే సమాంతరంగా ఫిజికల్ టెస్ట్‌లకు కూడా సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వివాహితులు, పిల్లలు న్న మహిళా అభ్యర్థులు కొంచెం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుందని, లేదంటే శారీరక దారు ఢ్య పరీక్షల వేళ కళ్లు తిరిగి పడిపోవడం, డీహైడ్రేషన్ లాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఎండాకాలం దృష్ట్యా ఉదయం 7 గంటల్లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతే మైదానంలో ప్రాక్టీస్ చేయాలని సూచిస్తున్నారు. వ్యాయామానికి తగిన పోషకాహారం తీసుకోవాలంటున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో.. పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమైన వారిని పోలీస్ శాఖ ఎంపిక చేసి ఉచితంగా శిక్షణ అందిస్తోంది. గ్రేటర్‌లోని 3 కమిషనరేట్లలో సైబరాబాద్‌లోని బాలా నగర్, శంషాబాద్ జోన్లలో శిక్షణ ప్రారంభమైంది. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లో స్క్రీనింగ్ టెస్టులు పూర్తయ్యాయి. త్వరలోనే శిక్షణ ప్రారంభం కానుంది. బాలానగర్ జోన్లో 1,050 మందికి శిక్షణ ఇస్తుండగా ఇందులో 300 మంది మహిళలు న్నారు. శంషాబాద్‌లో 1,400 మంది ట్రైనింగ్‌లో ఉండగా 500 మంది మహిళా అభ్యర్థులున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రెండు బ్యాచ్‌లు చేసి శిక్షణ ఇస్తున్నారు. 60–70 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. రాచకొండ పరిధిలో ఉచిత శిక్షణ కార్యక్రమానికి 9 వేల మంది దరఖాస్తులు చేసుకోగా 6,085 మంది అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. ఇందులో 1,383లకు పైగా మహిళా అభ్యర్థులున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రీ రిక్రూట్మెంట్ ఎలిజిబులిటీ టెస్టుకు 16 వేల మంది హాజరయ్యారు. ఇందులో 5 వేల మందికి పైగా మహిళలున్నారు. మూడు దశల్లో పరీక్షలు ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్ట్‌లకు 3 దశల్లో పరీక్షలుంటాయి. తొలుత ప్రిలిమినరీ పరీక్ష, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ ఉంటుంది. పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్ దేహదారుఢ్య పరీక్షలుంటాయి. మూడింటిలో రెండింటిలో అర్హత సాధించాలి. ఇందులో 100 మీటర్ల పరుగులో అర్హత తప్పనిసరి. తర్వాత తుది రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ప్రకటిస్తారు. అర్హతలివే.. ♦ఎస్ఐ పోస్టులకు ఏదైనా డిగ్రీ, తత్సమాన అర్హత ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాలలోని అభ్యర్థులకు అర్హతలో సడలింపులుంటాయి. వయసు 21–25 ఏళ్ల మధ్య ఉండాలి. ♦కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. ♦ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఇతర రంగాల్లోని మహిళలకు ఆదర్శం మహిళలు పోలీస్ ఉద్యోగం సాధిస్తే మహిళా సాధికారతే కాదు.. సమాజంలో ఆదర్శంగా ఉంటారు. ఇతర రంగాల్లోని స్త్రీలకు స్ఫూర్తిగా నిలుస్తారు. త్వరలోనే మాదాపూర్ జోన్లో ఉచిత శిక్షణ ప్రారంభిస్తాం. – కె. శిల్పవల్లి, డీసీపీ, మాదాపూర్ జోన్ మీపై మీరు నమ్మకం పెట్టుకోండి పోలీస్ ఉద్యోగం అనేది శారీరక, మానసిక సామర్థ్యానికి పరీక్ష. అందుకే మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. ఇతరుల కంటే మీరేం తక్కువ కాదనే ఆత్మవిశ్వాసంతో సిద్ధంకండి. –రక్షిత కృష్ణమూర్తి, డీసీపీ, మల్కాజ్గిరి జోన్ శారీరక కొలతలు ఎత్తు: 152.5 సెంటీమీటర్లు బరువు: 45.5 కిలోల కంటే తక్కువ ఉండొద్దు. ఫిజికల్ టెస్టులివే 100 మీటర్ల పరుగు: 26 సెకన్లు లాంగ్ జంప్: 2.5 మీటర్లు షాట్‌పుట్ (4 కిలోలు): 3.75 మీటర్లు (మహిళా అభ్యర్థులకు హై జంప్, 800 మీటర్ల పరుగు ఉండవు) -
పోలీసు జాబ్స్ వయోపరిమితి పెరిగేనా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ముందుగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతాయనే ప్రచారంతో నిరుద్యోగ యువత ఎక్కువగా ఈ కొలువులకే సన్నద్ధమవుతోంది. అత్యధిక పోస్టులు ఉండటంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత కావడంతో వీటికి అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. వయోపరిమితి విషయంలో నెలకొన్న అస్పష్టతతో చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. అధిక సంఖ్యలో నియామకాలు చేపట్టే కానిస్టేబుల్ ఉద్యోగానికి గరిష్ట వయోపరిమితి 22 ఏళ్లు ఉండగా, ఎస్సై పోస్టులకు 25, డీఎస్పీకి 28, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు 26 ఏళ్లు ఉంది. దీంతో గరిష్ట వయోపరిమితి పెంపుపై నిరుద్యోగ యువత గంపెడాశలు పెట్టుకుంది. వయోపరిమితి పెంచితేనే.. పోలీసు శాఖలో వివిధ కేటగిరీల్లో 16,587 కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను భర్తీ చేసేందుకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా గ్రూప్–1లో డీఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్, రీజినల్ ట్రా న్స్పోర్ట్ ఆఫీసర్ విభాగాల్లో 120 ఉద్యోగాలున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న నేపథ్యంలో ఇతర ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ యూనిఫాం కొలువులపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రిజర్వేషన్ అభ్యర్థులకు కాస్త సడలింపు ఉన్నప్పటికీ జనరల్ కేటగిరీలో సడలింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ జనరల్ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి పెంచితే రిజర్వ్డ్ అభ్యర్థులకు మరింత ఉపశమనం కలుగుతుందనే ఆశ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో కనిపిస్తోంది. వయోపరిమితిపై ప్రభుత్వం ముం దుగానే నిర్ణయం ప్రకటించాలని, నోటిఫికేషన్ విడుదలయ్యాక సడలింపు జఠిలమవుతుందని అభ్యర్థులు చెబుతున్నారు. పొరుగున 35 ఏళ్లు గ్రూప్–1 కేటగిరీలో యూనిఫాం ఉద్యోగాలు డీఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఆర్టీఓ ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీలో డీఎస్పీకి గరిష్ట వయోపరిమితి 28, ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు 26 ఏళ్లు ఉంది. అయితే, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలుగా ఉంది. ఇక్కడా వయోపరిమితి పెంచాలని, లేనిపక్షంలో చాలామంది ఆశలు గల్లంతవుతాయని నిరుద్యోగులు అంటున్నారు. -
50 వేల మందికి శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ కల్పనలో పోలీస్ శాఖ కీలకంగా పనిచేస్తోంది. యువతకు నిర్దిష్టమైన ప్రణాళికతో ఫ్రీ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ఈ క్రమంలో తాజా నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50వేల మం దికిపైగా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతంలో 5,800 మందికి ముందస్తు కోచింగ్ ఇవ్వగా 1,300 మందికి పోలీస్ శాఖలో ఉద్యోగాలు లభించాయి. వరంగల్ పరిధిలో 2 వేల మందికిగాను 324 మందికి కొలువులు వచ్చాయి. పోలీస్ శాఖలో 18 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో మరోసారి కీలకపాత్ర పోషించ బోతోంది. నగర కమిషనరేట్ పరిధిలోని 5 జోన్లలో వెయ్యి మంది చొప్పున శిక్షణ ఇప్పించాలని కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. మహిళా అభ్యర్థులు ఎన్‌రోల్‌మెంట్‌ను బట్టి వారికి ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇండోర్, ఔట్ డోర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇండోర్‌లో రాత పరీక్ష కోసం ఆయా సబ్జెక్టులపై నిష్ణాతులైనవారితో క్లాసులు నిర్వహించి, ప్రతివారం టెస్టులు పెట్టనున్నారు. ఔట్‌డోర్‌లో ఫిజికల్ టెస్టుల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్రోల్మెంట్కు స్పందన భారీగా ఉంటే స్క్రీనింగ్ కూడా అదే స్థాయిలో నిర్వహించి 5 వేల మందిని ఎంపిక చేసి కోచింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సైబరాబాద్‌లో షురూ.. ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్ భద్రతలో కీలకపాత్ర పోషిస్తున్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రెండు రోజుల క్రితమే శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. శంషాబాద్ జోన్లో 2 వేల మందికి శిక్షణ ఇస్తున్నారు. మిగిలిన జోన్లలోనూ ఎన్‌రోల్‌మెంట్‌ను బట్టి ట్రైనింగ్ కార్యక్రమాలు ఇవ్వాలని సీపీ భావిస్తున్నట్టు కమిషనరేట్ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఇచ్చిన కోచింగ్‌లోనూ సత్ఫలితాలు వచ్చినట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. రాచకొండలోనూ ఏర్పాట్లు రాచకొండ కమిషనరేట్‌లోనూ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించేందుకు సీపీ మహేశ్ భగవత్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. యూపీఎస్సీలో అనేకమంది అభ్యర్థులకు మార్గదర్శకులుగా వ్యవహరించి, అద్భుత ఫలితాలు సాధించిన అధికారిగా మంచి గుర్తింపు పొందిన ఆయన పోలీస్ ఉద్యోగాల భర్తీలోనూ ప్రముఖ పాత్ర పోషించనున్నారు. యువతకు వాట్సాప్, ఇతర మాధ్యమాల ద్వారా గైడ్ చేస్తున్నారు. మూడు జోన్ల పరిధిలో ఎన్రోల్మెంట్ నిర్వహించి ప్రత్యేక క్యాంపుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిసింది. అటు జిల్లాల్లోనూ... ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, సూర్యాపేట నుంచి నిజామాబాద్ వరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో జిల్లాకు వెయ్యి మంది చొప్పున ముందస్తు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో రామగుండం, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ కమిషనరేట్లలో ఇచ్చిన శిక్షణ మంచి ఫలితాలు ఇచ్చింది. ఈసారి యువత భారీస్థాయిలో పోటీ పడుతుండటంతో ముందస్తు శిక్షణ స్పందన అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. -
18,334 పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 18,334 పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ అనుమతి నిమిత్తం ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం వారంలో గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే తాజా ఉద్యోగాల భర్తీలోనూ పోలీస్ శాఖనే ముందు నోటిఫికేషన్ ఇచ్చినట్లవుతుంది. ఇక ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలో తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్, సివిల్, ఆర్మ్డ్(ఏఆర్), కమ్యూనికేషన్ విభాగాల్లో భర్తీ ఉండనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 1,500కు పైగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టులను పోలీస్ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. నూతన జిల్లాలు, రేంజ్‌లను దృష్టిలో పెట్టుకొని సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక మిగిలినవన్నీ కానిస్టేబుల్ పోస్టులు కాగా, వాటిని ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్), టీఎస్ఎస్పీ, కమ్యూనికేషన్ విభాగాల్లో నియామకానికి ప్రతిపాదించినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 28,000 పోస్టుల భర్తీ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు పోలీస్ శాఖ దాదాపు 28,000 పోస్టులను భర్తీ చేసింది. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ), పోలీస్ కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీవో) విభాగాల్లోని కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ల భర్తీని మూడు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేశారు. తాజాగా 18,334 పోస్టుల్లో 80 శాతం కానిస్టేబుల్, 20 శాతం సబ్ఇన్స్పెక్టర్ పోస్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, కొత్త సర్కిల్, పోలీస్స్టేషన్లకు మరింత మంది సిబ్బందిని కేటాయించేందుకు ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. స్థానికంగానే అధికం... ప్రస్తుతం భర్తీ చేయాలనుకున్న పోలీస్ పోస్టులు 60 శాతానికి పైగా లోకల్ కేడర్లోనే భర్తీ కానున్నాయి. గతంలో పోలీస్ శాఖలో నాలుగు రేంజ్‌లు ఉండేవి. తాజాగా రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం.. 7 రేంజ్‌లు ఏర్పడ్డాయి. అలాగే రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పడి.. కొత్త పోలీస్ స్టేషన్లు, సర్కిల్ ఆఫీస్‌ల ఏర్పాటుతో స్థానికంగా సిబ్బంది అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో సివిల్, ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్) కేటగిరీలో ఎక్కువ పోస్టులు భర్తీ చేయనున్నారు. స్పెషల్ పోలీస్, కమ్యూనికేషన్ విభాగంలోని కానిస్టేబుల్, ఎస్ఐ ర్యాంక్ పోస్టులు రాష్ట్రస్థాయి పోస్టులుగా ఉంటాయి. దీంతో ఈ పోస్టుల సంఖ్య తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, స్థానికత ఆధారంగా జరిగే మొట్టమొదటి నియామక ప్రక్రియ కూడా ఇదే కావడం గమనార్హం. జిల్లాల్లో కోచింగ్ సెంటర్లు... రాబోతున్న నోటిఫికేషన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రీ రిక్రూట్మెంట్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రవ్యాప్తంగా కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశించారు. నిరుద్యోగ యువతను ప్రోత్సహించేలా ఈ సెంటర్లు ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ విభాగంతో సమన్వయం చేసుకొని ఈ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు ఉండాలని డీజీపీ సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్‌లో ఉచిత ప్రీ రిక్రూట్మెంట్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటుచేయడం వేగవంతం చేశారు. -
telangana: ‘ఇల్లరికం’ పోలీస్..
సాక్షి, హైదరాబాద్: ఇరు కుటుంబాల స్థితిగతులు, కాబోయే అత్తామామలకు మగ సంతానం లేకపోవడం ఇతరత్రా కారణాలతో కొందరు ఇల్లరికం వెళుతుంటారు. అంటే వివాహానంతరం పెళ్లికూతురు అత్తారింటికి వెళ్లిపోవడం కాకుండా రివర్స్‌లో పెళ్లికొడుకు అత్తారింటికి వెళ్లి అక్కడే స్థిరపడిపోతాడన్నమాట. అచ్చం ఇలాగే కాకపోయినా ఇల్లరికపుటల్లుడు మాదిరి పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ మంది ఒకే జిల్లాలో పాతుకుపోతున్నారు. సబ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం ప్రారంభించిన తర్వాత పదోన్నతులు పొందిన అధికారులు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లాల్సి ఉన్నా అలా జరగడం లేదు. జోన్‌లోని ఇతర జిల్లాల్లో పనిచేసే అవకాశం ఉన్నా వెళ్లకుండా అక్కడక్కడే పోస్టింగ్‌లు చేస్తూ స్థానికంగా లభించిన పట్టుతో అక్రమార్జనకు పాకులాడే నేపథ్యంలో వివాదాస్పదమవుతున్నారు. కొత్తగూడెంలోని పాల్వంచలో జరిగిన వనమా రాఘవేంద్రరావు తరహా వ్యవహారాలకు ఇలాంటి అధికారులే పరోక్ష కారణమన్నది బహిరంగ రహస్యం. సిఫారసులతో ఏళ్లకేళ్లుగా అక్కడే ఉంటున్న వీరు.. తమను సిఫారసు చేసిన ప్రజాప్రతినిధులు, వారి అనుచరులు, కుటుంబీకులు చేసే అరాచకాలకు అందదండలందిస్తున్నారు. 70 శాతం ఇదే రీతి... రాష్ట్రంలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ.. ఇలా కమిషరేట్లతో పాటు అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి ఇల్లరికపు అధికారులు వందల మంది ఉన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఇన్స్పెక్టర్ ర్యాంకు అధికారులు జోన్‌లోని తన స్వంత జిల్లా కాకుండా మిగిలిన ఏ జిల్లాలో అయినా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. కానీ అనేకమంది సబ్ ఇన్స్పెక్టర్గా మంచి రెవెన్యూ ఉన్న జిల్లాలను ఎన్నుకోవడం.. అక్కడే రిటైర్మెంట్ దాకా పాతుకుపోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇలా 70 శాతం మంది పోలీస్ అధికారులు ఒకే జిల్లాలో సబ్ ఇన్స్పెక్టర్ నుంచి సర్కిల్ ఇన్స్పెక్టర్/ఇన్స్పెక్టర్ ఆ తర్వాత డీఎస్పీగానూ పదోన్నతి పొంది మళ్లీ అక్కడే పనిచేస్తుండటం గమనార్హం. రాష్ట్ర స్థాయి హోదాలో డీఎస్పీగా తన స్వంత డివిజన్ తప్ప ఎక్కడైనా పనిచేసే అవకాశం ఉన్నా తాను గతంలో పని చేసిన జిల్లాలోనే తాను ఎస్ఐ, సీఐగా పనిచేసిన సబ్‌డివిజన్ డీఎస్పీగా/ఏసీపీలుగానే పనిచేస్తున్నారు. మరికొంత మంది అధికారులైతే ఏకంగా అదనపు ఎస్పీగా కూడా అదే జిల్లాలో ఉంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆదాయంపై గురి.. అక్రమాలకు దన్ను ఇలాంటి అధికారులు టౌన్‌కు గరిష్టంగా 20 కిలోమీటర్లు దూరంలోపే పోస్టింగ్ తీసుకుంటారు. పైగా కనీస ఆదాయం అంటే తమను సిఫారసు చేసినందుకు ఇచ్చిన సొమ్ముకు రెండు, మూడింతలు వచ్చే పోస్టింగ్‌లో మాత్రమే కొనసాగుతారు. కొంతమంది అధికారులు మైనింగ్ కార్యకలాపాలుండే ప్రాంతాల్లో వరుస పోస్టింగ్‌లు తెచ్చుకుంటారు. ఇంకొంత మంది ఇసుక దందా సాగే ప్రాంతాలను ఎంచుకొని మరీ ఆయా ఠాణాల్లోనే పనిచేస్తారు. ఇంకొంత మంది గ్యాబ్లింగ్, వ్యాపార నెలవారీ కమీషన్లు, వైన్స్, బార్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటారు. ఇంకొంత మంది అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సెటిల్మెంట్ల కేంద్రంగా సాగే ఏరియా ఠాణాలను టార్గెట్ చేసుకొని పోస్టింగ్ పొందుతున్నారు. సైబరాబాద్, రాచకొండ ప్రాంతాల్లో సీఐ పోస్టింగ్‌కు సిఫారసు చేసేందుకు సంబంధిత ప్రజాప్రతినిధులు తక్కువలో తక్కువ రూ.20 లక్షలు తీసుకుంటున్నారంటే, ఆ పోస్టులో చేరి వారెంత అక్రమార్జనకు, ఎన్ని అవకతవకలకు పాల్పడతారో అర్ధం చేసుకోవచ్చు. దెబ్బతింటున్న పోలీసింగ్... ఎప్పటిప్పుడు అధికారుల మార్పు జరిగితే విధులు అంకితభావంతో పాటు పారదర్శకంగా నిర్వర్తించేందుకు అవకాశం ఉంటుంది. కానీ ఒకే అధికారి ఏళ్ల పాటు స్టేషన్లు మార్చిమార్చి పోస్టింగ్‌లు చేయడం, పదోన్నతి తర్వాత మళ్లీ అదే అధికారి సూపర్విజన్ డ్యూటీలోకి రావడం ఇష్టారీతిన జరిగిపోతోంది వనమా రాఘవతో ముడిపడిన ఘటన వంటి ఉదంతాలకు ఇలాంటి అధికారుల వ్యవహారాలే పరోక్షంగా కారణమవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉమ్మడి కరీంనగర్లో 42 మంది సెటిల్ ►ఉమ్మడి కరీంనగర్లో జగిత్యాల, పెద్దపల్లి, రామగుండం, హుజూరాబాద్, సిరిసిల్ల, వేములవాడ, కరీంనగర్ టౌన్ స్టేషన్లలో ఎస్ఐలుగా పనిచేసిన అధికారులే ఇప్పుడు సీఐలుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో ఉన్న ఓ ఏసీపీ అధికారి గతంలో అక్కడే టౌన్ ఎస్ఐ, రూరల్ ఎస్ఐ, రూరల్ సీఐగా పనిచేశారు. ఇలా 42 మంది అధికారులు ఈ జిల్లాలోనే సెటిల్ అయిపోయారు. వీరు స్టేషన్ మారడం మినహా మరో జిల్లాకు పోయి పనిచేసింది లేదు. ►ఉమ్మడి వరంగల్‌లోని హన్మకొండ, కాజీపేట, ఎల్కతుర్తి, పరకాల, మామునూర్, జనగాం, ఘన్పూర్, వర్ధన్నపేట మహబూబాబాద్, పాలకుర్తి, భూపాలపల్లి.. ఇలా సబ్ డివిజన్లలో ఎస్ఐగా, సీఐగా పనిచేసిన అధికారులే ప్రస్తుతం ఏసీపీలుగా, క్రైమ్ అధికారులుగా, టాస్క్‌ఫోర్స్, ట్రాఫిక్ విభాగాల్లో అధికారులుగా పనిచేస్తున్నారు. ►ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఖమ్మం టౌన్, కొత్తగూడెం, వైరా, సత్తుపల్లి, మధిర, ఇల్లందు, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు ఆయాసర్కిల్స్/సబ్డివిజన్లలో ఎస్ఐగా పనిచేసిన వారు ఆయా ప్రాంతాల్లోనే సీఐ, డీఎస్పీలుగా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో 70% మంది ►ఉమ్మడి ఆదిలాబాద్‌లో మంచిర్యాల, బెల్లంపల్లి, నిర్మల్, ఆదిలాబాద్ రూరల్, భైంసా, ఉట్నూర్ సబ్ డివిజన్లలో ఎస్ఐలుగా పనిచేసిన 70 శాతం మంది అధికారులు ఇప్పుడు అవే ప్రాంతాల్లో సీఐగా, ఆపై స్థాయి పోస్టింగుల్లో కొనసాగుతున్నారు. ► ఉమ్మడి నిజామాబాద్‌లో హెడ్‌క్వార్టర్స్‌లోని ఠాణాలు, ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, బోధన్, భీమ్‌గల్, డిచ్పల్లి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, బిక్నూర్ సబ్‌డివిజన్, సర్కిల్లో ఎస్ఐలు, సీఐలుగా పనిచేసిన అధికారులు అక్కడే సీఐలు, డీఎస్పీ/ఏసీపీలుగా పనిచేస్తున్నారు. ► ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో నల్లగొండ హెడ్‌క్వార్టర్‌లోని ఠాణాలు, కోదాడ, సూర్యాపేట, సాగర్, మాల్, చౌటుప్పల్, భువనగిరి, ఆలేరు, హుజూర్నగర్, చిట్యాల, మిర్యాలగూడ, దేవరకొండ, తుంగతుర్తి.. ఇలా పలు ఠాణాల్లో ఎస్ఐలుగా పనిచేసినవారు ఇప్పుడు సీఐలుగా, మరికొంత మంది డీఎస్పీలుగా అక్కడే పాతుకుపోయారు. ►ఉమ్మడి మహూబూబ్‌నగర్‌లో హెడ్‌క్వార్టర్స్‌లోని ఠాణాలతో పాటు జడ్చర్ల, నారాయణపేట్, మక్తల్, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అమన్‌గల్, అమ్రాబాద్, వనపర్తి, గద్వాల్, దేవరకద్ర.. ఇలా సర్కిల్/సబ్డివిజన్లలో 60 శాతం అధికారులు ఇంతకుముందు అక్కడక్కడ పనిచేసిన వారే. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, జహీరాబాద్, మెదక్, పటాన్చెరు, సిద్దిపేట, గజ్వేల్, నర్సాపూర్ తదితర సర్కిల్, సబ్డివిజన్లలో ఎస్ఐగా పనిచేసిన వారు ఇప్పుడు అక్కడే సీఐగా, సీఐగా చేసిన వారు డీఎస్పీలుగా పనిచేస్తున్నారు. ► ఇక సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండలో ఒక పోలీస్‌స్టేషన్‌నుంచి మరో పోలీస్‌స్టేషన్‌కు మార్పు చెందుతున్నారు కానీ కమిషనరేట్‌ను వదిలీ మరో కమిషనరేట్ లేదా జిల్లాకు మాత్రం బదిలీ కావడం లేదు. ఇలా ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో 90 శాతం అధికారులు తొలినాళ్లలో అక్కడే పనిచేసి, పదోన్నతి తర్వాత కూడా అక్కడే పనిచేస్తుండటం గమనార్హం. -
వివాదాలు... విచారణలు.. కంచపైనే కన్ను!
పోలీసులపై ఆరోపణలు సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి పాల్పడటంతోపాటు హత్యచేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరానికి గురిచేసింది. నిందితుడి కోసం వేటసాగించిన పోలీసులు సైతం ఆరోపణలకు గురిచేసేలా చేసింది. తీరా నిందితుడు వరంగల్ పరిధిలోని ఘన్పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకోవడం సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. ఇకపోతే యాదాద్రి జిల్లా అడ్డగూడూర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన దళిత మహిళ మరియమ్మ లాకప్‌డెత్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దుమారం రేపింది. దొంగతనం కేసులో మరియమ్మను పోలీస్ విచారణ పేరుతో హింసించి చంపారన్న ఆరోపణ ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీస్ శాఖ మరియమ్మ మృతిని లాకప్‌డెత్‌గా ధ్రువీకరించి అధికారులను సస్పెండ్ చేసింది. ఒక సందర్భంలో మరియమ్మ వ్యవహారంపై సీబీఐ విచారణ అవసరమని హైకోర్టు ప్రస్తావించడం పోలీస్ శాఖను ఉక్కిరిబిక్కిరి చేసింది. విచారణకు సెలబ్రిటీలు హైదరాబాద్ బోయినపల్లికి చెందిన డ్రగ్ సరఫరాదారు కెల్విన్‌తో సంబంధాలు కల్గిఉన్నారన్న ఆరోపణలతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 2017లో సినీతారలను, ప్రముఖులను విచారించింది. అయితే ఈ వ్యవహారంలో భారీస్థాయిలో మనీలాండరింగ్ జరిగిందన్న అనుమానంతో ఈ ఏడాది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. సినీ తారలు, ప్రముఖులనూ విచారించింది. డైరెక్టర్ పూరీ జగన్నాథ్, చార్మి, రవితేజ, రానా, రవితేజ, రకుల్ ప్రీత్‌సింగ్, తరుణ్, సుబ్బరాజు, తనీష్, నందు, ముమైత్‌ఖాన్ ఇలా వరుసపెట్టి విచారించడం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. ఎక్సైజ్ విచారణ జాబితాలో లేని దుగ్గబాటి రానా, రకుల్ ప్రీత్‌సింగ్‌లు ఈడీ విచారణ ఎదుర్కోవడం మరింత సంచలనం రేపింది. చుక్కలు చూస్తున్న పోలీసులు శంషాబాద్‌లో జరిగిన దిశ హత్యాచార ఘటనలో నిందితుల ఎన్కౌంటర్ వ్యవహారం పోలీస్ శాఖను నిద్రపోనివ్వలేదు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిర్పూర్కర్ కమిషన్ ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ అప్పటి సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్‌తోపాటు డీసీపీ ప్రకాశ్‌రెడ్డి, షాద్‌నగర్ ఏసీపీ, ఇన్స్పెక్టర్, సబ్ఇన్స్పెక్టర్... ఇలా పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బందిని విచారిస్తోంది. ఈ విచారణలో అనేక తప్పులను, లోపాలను కమిషన్ గుర్తించి ప్రశ్నించడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఎవరు ఎప్పుడు కమిషన్ ముందు విచారణ ఎదుర్కొంటారో అన్న అంశాలు అధికారులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టినట్టు తెలుస్తోంది. చిట్టీలు.. చీటింగ్‌లు కలర్‌ఫుల్ సెట్టింగ్‌లు.. దానికి మించి లగ్జరీ కలరింగ్.. కిట్టీ పార్టీల పేరుతో కోట్లాది రూపాయలను తీసుకొని మోసం చేసిన వ్యవహారం తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. సైబరాబాద్ పరిధిలో జరిగిన ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి శిల్పాచౌదరి సినిమా ప్రొడ్యూసర్‌గా పేరుగడించి సినీ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులనూ బురిడీ కొట్టించింది. ఈ వ్యవహారంలో సినీ హీరో కృష్ణ కుమార్తెతోపాటు అనేకమంది బాధితులయ్యారు. కిట్టీ పార్టీల పేరుతో పార్టీలు నిర్వహించడం, డబ్బున్న వారిని టార్గెట్ చేసి అడ్జెస్ట్మెంట్ పేరుతో రూ.100 కోట్లకుపైగా బురిడీ కొట్టించినట్టు సైబరాబాద్ పోలీసులు అంచనావేశారు. ఈ వ్యవహారం ఒకవైపు సైబరాబాద్‌లో హీట్ పుట్టిస్తుంటే మరోవైపు సంధ్య బిల్డర్డ్స్ యాజమాని శ్రీధర్‌రావు వ్యవహారం మరింత కాక రేపింది. భవన నిర్మాణాల పేరుతో వందల కోట్ల రూపాయలు దండుకున్నారని, భవనాలు అప్పగించకుండా వేధిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదుచేశారు. ఈయనపై ఎనిమిది పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అంతటితో ఆగని శ్రీధర్‌రావు ఏకంగా తన బాడీగార్డుగా ఉన్న జిమ్ ట్రైనర్‌పై లైంగికదాడికి పాల్పడటం తీవ్ర సంచలనమైంది. ఈ వ్యవహారం బయటకు రాకుండా ఉండేందుకు బాధితుడితో చేసిన సెటిల్మెంట్ వ్యవహారం మరింత రచ్చ రేపింది. మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తెలంగాణ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మావోయిస్టు పార్టీకి ఈ ఏడాది కోలుకోలేని దెబ్బలు తగిలాయి. ఒకవైపు కరోనాతో కేంద్ర కమిటీ నుంచి గెరిల్లా కమిటీ సభ్యుల వరకు అనారోగ్యంతో ఇబ్బంది పడగా.. పోలీసుల ఆపరేషన్లతో సీనియర్ నాయకులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఏవోబీకి పెద్దదిక్కుగా ఉన్న ఆర్కే (రామకృష్ణ) మృతి పార్టీకి తీరని లోటు తెచ్చిపెట్టింది. అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్ తేల్దుంబ్డే, డివిజన్ కార్యదర్శి, ఏసీఎం సభ్యులు సహా 26 మంది ఒకే ఎన్కౌంటర్లో మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ కోవిడ్‌తో మృత్యువాతపడటం రాష్ట్ర కమిటీని అఘాతంలోకి నెట్టింది. నేతల లొంగుబాట్లు ఒకవైపు జరుగుతుండగా వైద్య చికిత్స కోసం వచ్చిన కేంద్ర కమిటీ సీనియర్ సభ్యుడు ప్రశాంత్ బోసే అలియాస్ కిషన్ దా, అతడి భార్య మారండిని అరెస్టయ్యారు. మొత్తంగా మావోయిస్టు పార్టీకి 2021 తీర్చలేని నాయకుల లోటును తెచ్చిపెట్టిందన్న చర్చ నడుస్తోంది. ఇకపోతే మావోయిస్టు పార్టీ అనుబంధ సంఘాలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు జరపడం కలవరం రేపింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధా రంగా ఈ సోదాలు చేసినట్టు ఎన్ఐఏ చెప్పింది. మావో అనుబంధ సంఘాలపై ఉఫా చట్టం కింద కేసులు నమోదు చేయడంపై వామపక్ష సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేశాయి. ప్రభుత్వ సొమ్మును నొక్కేశారు... తెలుగు అకాడమీకి చెందిన రూ.65 కోట్లకు పైగా ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లను అధికారులు, మధ్యవర్తులు, బ్యాంక్ ఉద్యోగులు కలిసి నొక్కేసిన వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలను కలవరానికి గురిచేసింది. నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను తయారుచేసి అకాడమీ అధికారులను బురిడీ కొట్టించిన మధ్యవర్తులు.. బ్యాంక్ అధికారులతో దోచేసిన వ్యవహారం పెను దుమారం రేపింది. దీనిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులతోపాటు ఈడీ విచారణ జరిపి మధ్యవర్తులు భారీస్థాయిలో ఆస్తులు మళ్లించినట్టు నిరూపించారు. ఈ కేసులో అకాడమీలోని తాత్కాలిక ఉద్యోగులతోపాటు రెండు ప్రధాన బ్యాంకుల మేనేజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యవర్తులకు వెళ్లిన డబ్బును స్వాధీనం చేసుకునేందుకు ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఈజీ లోన్స్.. దుమ్మురేపిన ఈడీ ఈజీ లోన్స్ పేరుతో మొబైల్ యాప్‌ల ద్వారా రుణాలు ఇచ్చి అధిక వడ్డీలతో వేధించిన వ్యవహారంలో ఇటు రాష్ట్ర పోలీసులు, అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన విచారణలో అనేక సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. చైనా, హాంకాంగ్ తదితర దేశాలకు చెందిన కంపెనీలు దేశంలోని కూడోస్ ఎన్బీఎఫ్సీ వేదిక ద్వారా రూ.2,600 కోట్లకు పైగా వసూలు చేసినట్టు ఈడీ గుర్తించింది. ఈ కుంభకోణానికి సహకరించిన కూడోస్ ఎన్బీఎఫ్సీ వ్యవస్థాపకుడు పవిత్రా ప్రదీప్ వాల్వేకర్‌ను అరెస్ట్ చేసి కటాకటాల్లోకి నెట్టింది. అదేవిధంగా మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో ఇండస్ వీవా వసూలు చేసిన రూ.1,500 కోట్ల స్కాం కేసులో ఈడీ సహవ్యవస్థాపకుడితోపాటు కీలక సూత్రధారి అయిన సీఏ అంజర్, అభిలాష్ థామస్‌ను అరెస్ట్ చేసింది. ఈ కేసుల్లో రూ.360 కోట్ల ఆస్తులను ఈడీ జçప్తు చేసింది. అదేవిధంగా అగ్రిగోల్డ్ స్కాంలో రూ.4,141 కోట్ల ఆస్తులను ఈ ఏడాది వరకు దశల వారీగా జప్తు చేసినట్టు పేర్కొంది. ఇకపోతే రాష్ట్రంలో సంచలనం రేపిన ఈఎస్ఐ స్కామ్‌లో కీలక సూత్రధారి దేవికారాణి బినామీల పేర్ల మీద కొనుగోలు చేసిన రూ.144 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు చేసిన అంశాల ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. మృత్యు‘దారులు’.. రాష్ట్రంలో ఈ ఏడాది ప్రమాదాల్లో రహదారులు నెత్తురోడాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో బంధువుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గచ్చిబౌలి పరిధిలోని హెచ్‌సీయూ బస్‌డిపో సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు స్నేహితులు మరణించారు. ఈ ఘటన ఆ కుటుంబాల్లో విషాదాన్ని నిపంగా, ప్రమాదానికి గురైన కారు రెండు ముక్కలవడం ప్రమాద సమయంలో కారు స్పీడును చెప్పకనే చెబుతోంది. కీసరలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించడం ఆందోళన కల్గించింది. ఈ ఏడాది పబ్‌ల్లో పీకల దాకా మద్యం సేవించి యువతీ యువకులు వాహనాలు నడపడం వల్ల 14 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు పోలీస్ శాఖ గుర్తించింది. ఇందులో 11 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది మొత్తంగా 15,600 ప్రమాదాలు జరగ్గా అందులో 4,600 మందికి పైగా మృతిచెందినట్టు పోలీస్ వర్గాల ద్వారా తెలిసింది. 12వేల మందికి పైగా క్షతగ్రాతులైనట్లు సమాచారం. ఇంటి దొంగలపై సీబీ‘ఐ’ బ్యాంకుల్లో మేనేజర్లుగా పనిచేస్తూ అక్రమార్కులకు సహకరించిన వ్యవహారంలో సీబీఐ పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసింది. ఇలా ఈ ఏడాదిలో 13 కేసులు నమోదు చేయగా అందులో 9 కేసుల్లో బ్యాంక్ అధికారుల పాత్ర కీలకంగా ఉందని సీబీఐ పేర్కొంది. మొత్తంగా రూ.600 కోట్లకు పైగా బ్యాంకు అధికారుల సహకారంతో నిందితులు కుచ్చుటోపీ పెట్టినట్టు ఎఫ్ఐఆర్లలో పేర్కొన్నారు. పదోన్నతులు వచ్చినా పాతపోస్టుల్లోనే... పండుగ వచ్చినా పాత పచ్చడేనా అన్న సామెత పోలీస్ శాఖకు ఈ ఏడాది సరిపోతుందన్న చర్చ జరుగుతోంది. పదోన్నతులు వచ్చి ఏళ్లు గడుస్తున్నా అనేక మంది అధికారులు జూనియర్ ర్యాంకు పోస్టుల్లోనే కొనసాగుతున్నారు. గత ఏడాది పదోన్నతి వచ్చినా ఇంకా పాత పోస్టుల్లోనే కొనసాగగా, ఈ ఏడాది బదిలీ అవుతామని అనుకున్నా అది కూడా అందని ద్రాక్షగా మిగిలింది. ఇకపోతే ఏళ్లకేళ్లుగా ఒకే పోస్టులో కొనసాగుతున్న 40 మంది ఐపీఎస్, ఇతర నాన్‌కేడర్ అధికారులు ఈ ఏడాది బదిలీలు జరుగుతాయని భావించినా అది జరగలేదు. ఇలా ఏడాది నుంచి కలలు కన్నా అవి అడియాశలే అయ్యాయని వారు అసహనంలో మునిగిపోయారు. -
యూని‘ఫామ్’లోకి రానివ్వరా?
సాక్షి, హైదరాబాద్: ఆకాశంలో సగం, అర్ధాంగి.. మహిళల గురించి తరచూ చెప్పుకునే, వినే పదాలివి. రాజకీయాలు, క్రీడలు, వ్యాపారం.. ప్రతీ రం గంలోనూ పురుషులకు దీటుగా మహిళలు రాణిస్తున్నారు. ఉద్యోగాల్లోనూ ఉన్నత స్థాయిలో ప్రతిభ చూపుతున్నారు. కానీ తెలంగాణ పోలీస్ శాఖలో మాత్రం చాలామంది మహిళా అధికారులకు ప్రాధాన్యత లభించడం లేదని, శాంతి భద్రతల విభాగంలో అవకాశంతో పాటు ఫోకల్ (ప్రాధాన్యత కలిగిన) పోస్టులు దక్కడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొంతమంది ఎప్పుడో ఉద్యోగంలో చేరిన కొత్తలో శాంతి భద్రతల విభాగంలో డ్యూటీ చేశారంటే.. ఇప్పటివరకు మళ్లీ పోలీస్ యూనిఫామ్ వేసింది లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. నియామకాల్లో భాగంగా సివిల్ కేటగిరీలో 33% రిజర్వేషన్, ఆర్మ్డ్ రిజర్వ్‌లో 10% రిజర్వేషన్ కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. మహిళా అధికారులు, సిబ్బంది సంఖ్య భారీగా పెంచాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ మహిళా పోలీస్ అధికారులకు పోస్టింగుల విషయంలో మాత్రం న్యాయం జరగడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటోంది. నల్లగొండ, సూర్యాపేటల్లో మహిళా ఎస్ఐలే లేరు తెలంగాణ ఏర్పాటు తర్వాత చేపట్టిన నియామకాలతో మహిళా సబ్ ఇన్స్పెక్టర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. అయితే ట్రైనింగ్‌లో పోలీస్స్టేషన్లలో విధులు నిర్వర్తించడంతో పాటు ప్రొబేషన్ పూర్తయ్యే లోపు ఒక పోలీస్‌స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేయాల్సి ఉం టుంది. ఈ నిబంధనలను సైతం పోలీస్ శాఖ పక్కన పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 60లోపు మాత్రమే మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు శాంతి భద్రతల విభాగంలో పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సైబరాబాద్ పరిధిలోని మాదాపూర్ జోన్లో నలుగురు, బాలానగర్ జోన్లో ఇద్దరు మహిళా ఎస్ఐలు ఉండగా.. శంషా బాద్ జోన్లో ఒకే ఒక్కరు ఉన్నారు. రాచకొండ పరిధిలో ఎల్బీనగర్ జోన్లో ఇద్దరు ఉండగా.. మల్కా జ్గిరి జోన్లో ఒక్క మహిళా ఎస్ఐ కూడా లేకపోవడం గమనార్హం. భువనగిరి జోన్లో ఒకే ఒక్కరు ఈ విభాగంలో ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో సెంట్రల్ జోన్, ఈస్ట్‌జోన్, సౌత్జోన్లో ఒక్కొక్కరు చొప్పున ఉండగా, వెస్ట్‌జోన్‌లో ఇద్దరు, నార్త్‌జోన్‌లో నలుగురు ఉన్నారు. నల్లగొండ, సూర్యా పేట జిల్లాల్లో ఒక్క మహిళా ఎస్ఐ కూడా లేరు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, సంగారెడ్డి, రామగుండం, మహబూబ్‌నగర్‌లో ఒక్కొక్కరు మాత్రమే ఉండగా ఖమ్మంలో ఎనిమిది మంది, మెదక్‌లో ఇద్దరు, వనపర్తిలో ముగ్గురు, జోగులాంబ గద్వాలలో ఆరుగురు, సిద్దిపేటలో ఇద్దరు, నిర్మల్‌లో ముగ్గురు మహిళా ఎస్ఐలు పనిచేస్తున్నారు. ఈ జిల్లాల్లో ఎక్కువమంది.. మహిళా ఎస్ఐలు శాంతి భద్రతల విభా గాల్లో పనిచేస్తున్న జిల్లాల్లో జగిత్యాల, ఆదిలాబాద్, వరంగల్ కమిషనరేట్లు టాప్‌లో ఉన్నాయి. జగిత్యాల జిల్లాలో 9 మంది, ఆదిలాబాద్ జిల్లాలో 8 మంది, వరంగల్ కమిషనరేట్ లో 9 మంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు లా అండ్ ఆర్డర్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 1996 బ్యాచ్‌లో ఎస్ఐగా పోలీస్ శాఖలో అడుగుపెట్టిన అధికారుల నుంచి 2012 బ్యాచ్ వరకు మహిళా అధికారులు మొదట్లో ఒక రెండు పోలీస్స్టేషన్లలో లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు కనీ సం మహిళా ఠాణాలో కూడా అవకాశం రాకపోవ డం తీవ్ర నిరాశకు గురిచేస్తున్నట్టు ఆవేదన వ్యక్తం చేశా రు. సీఐడీ, ఏసీబీ, సీసీఎస్, డీసీఆర్బీ, ఐటీ కోర్‌టీం, షీటీమ్స్, సైబర్ క్రైమ్, కొన్ని చోట్ల ట్రాఫిక్ విభాగాల్లో ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తున్నారు. డీసీపీలు, అదనపు డీసీపీలదీ అదే పరిస్థితి గ్రూప్ వన్, ప్రమోషన్ల ద్వారా పోలీస్ శాఖలోకి అడుగుపెట్టిన మహిళా అధికారులదీ అదే పరిస్థితి కేవలం వరంగల్ మినహా ఎక్కడా కూడా శాంతి భద్రతల విభాగంలో మహిళా అధికారులకు పెద్దగా ప్రాధాన్యత దక్కింది లేదు. ట్రాఫిక్‌తో పాటు క్రైమ్, ఇతర విభాగాల్లో ఎస్పీ స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిలోనూ అవకాశం లేకపోవడం అధికారులను ఆవేదనకు గురిచేస్తోంది. అదే విధంగా అదనపు డీసీపీ శాంతి భద్రతలు, ట్రాఫిక్, క్రైమ్ పోస్టులు ఖాళీగా ఉన్నా మహిళలకు అవకాశం కల్పించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్కిల్ ఇన్స్పెక్టర్/ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఏసీపీ/డీఎస్పీ స్థాయిలో మహిళా అధికారులకు ఫోకల్ పోస్టింగులు ఇవ్వాలని పోలీస్ ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నా.. రాజకీయ పలుకుబడితో జరిగే బదిలీల కారణంగా ఇది సాధ్యపడటం లేదనే ఆరోపణలున్నాయి. 356లో ఇద్దరే ఇద్దరు రాష్ట్రంలో శాంతి భద్రతల విభాగంలో సర్కిల్ ఇన్స్పెక్టర్/ఇన్స్పెక్టర్(సీఐ) హోదా కల్గిన స్టేషన్ హౌస్‌అధికారి (ఎస్హెచ్ఓ) పోలీస్స్టేషన్లు 356 ఉన్నాయి. వీటిల్ల కేవలం ఇద్దరు మాత్రమే మహిళా ఇన్స్పెక్టర్లు (రాజన్న సిరిసిల్లా జిల్లా, మహబూబ్‌నగర్) మాత్రమే ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఉన్న మహిళా పోలీస్స్టేషన్లలోనూ పురుష అధికారులే ఎక్కువ ఠాణాలకు ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్నారు. మహిళల వేధింపుల కేసులు, భార్యాభర్తల కేసులతో పాటు సంబంధిత కేసులను పర్యవేక్షించాల్సిన స్థానాల్లో పురుషులుండటం వివాదాస్పదంగా మారుతోంది. మొత్తం 17 మహిళా పోలీస్స్టేషన్లు ఉండగా.. 13 చోట్ల పురుషులే ఎస్‌హెచ్‌ఓలుగా ఉన్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లోని మూడు ఠాణాల్లో, సరూర్‌నగర్ ఠాణాలో మాత్రమే మహిళా ఇన్స్పెక్టర్లు విధులు నిర్వస్తున్నారు. కనీసం నూతన జిల్లాల్లో అయినా మహిళా ఠాణాలు ఏర్పాటు చేస్తే కాస్తో కూస్తో యూనిఫాం వేసుకొని డ్యూటీలు చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందని ద్రాక్షగా కమిషనర్ పోస్టు ఉమ్మడి రాష్ట్రంలో, ప్రస్తుతం తెలంగాణలో ఏ ఒక్క మహిళ ఐపీఎస్‌కూ పోలీస్ కమిషనర్‌గా పనిచేసే అవకాశం రాలేదు. అదనపు డీజీపీ, ఐజీ, డీఐజీ, ఎస్పీ హోదాల్లో ఐపీఎస్ అధికారులున్నా కమిషనర్‌గా మాత్రం అవకాశం దక్కడం లేదు. తమకు అవకాశం కల్పిస్తే సత్తా చాటుతామని మహిళా అధికారులంటున్నారు. -
తెలంగాణ: సరెండర్ సెలవుల డబ్బులేవి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలో పనిచేస్తున్న వేలాది మందికి రావాల్సిన సరెండర్ సెలవుల డబ్బులను ఇప్పటివరకు చెల్లించకపోవడంతో సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఏటా 30 రోజుల పాటు ఉండే సరెండర్ (ఆర్జిత సెలవులు) లీవులను ఉపయోగించుకోలేని వారికి ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అయితే గత ఏడాదికి సంబంధించి జూన్ నెలలో చెల్లించాల్సిన సరెండర్ లీవుల డబ్బులు ఇప్పటివరకు ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదు. పోలీస్ హెడ్క్వార్టర్ల చుట్టూ తిరిగి అలసి పోతున్నామే తప్ప సమస్య మాత్రం తీరడం లేదని సిబ్బంది ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చదవండి: ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసిన ఈటల రాజేందర్ ఉన్నా.. ఉపయోగించుకోలేని పరిస్థితి పోలీస్ శాఖ అంటేనే అత్యవసరమైన విభాగం. పండుగలు, అనుకోని ఘటనలు, సభలు, సమావేశాలప్పుడు రోడ్డుపై బందోబస్తు నిర్వహించాల్సిందే. అది శాంతి భద్రతల విభాగమైనా, బెటాలియన్లు అయినా.. తప్పనిసరిగా విధుల్లో ఉండాల్సిందే. దీని వల్ల డబుల్ డ్యూటీలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకు ఉండే సాధారణ సెలవులనే వాడుకునే అవకాశం దక్కదని, కనీసం సరెండర్ లీవులకు సంబంధించిన డబ్బులైనా చెల్లిస్తే పిల్లల ఫీజులు లేదా ఇతరత్రా ఖర్చులకు ఉపయోగకరంగా ఉంటుందని వేడుకుంటున్నారు. ప్రతీ పోలీస్ ఉద్యోగికి రెండు సార్లు సరెండర్ లీవ్‌లకు డబ్బులు చెల్లిస్తారు. చదవండి: కేసీఆర్‌కు కలిసి రాని ముహూర్తం.. విజయ గర్జన సభ మళ్లీ వాయిదా.. ఏటా మొదటి ఆరునెలల కాలానికి వచ్చే 15 సెలవులకు జూన్ లేదా జూలైలో, ఆ తర్వాతి ఆరు నెలల్లో ఉండే 15 రోజుల సెలవులకు జనవరిలో ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అయితే ఈ ఏడాది సిబ్బందికి జనవరి నుంచి ఇప్పటివరకు డబ్బులు చెల్లించకపోవడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల మంది సిబ్బందిలో 80 శాతం మందికి సరెండర్ సెలవుల బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, త్వరలోనే పెండింగ్ బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. -
హైదరాబాద్ నుంచే కేన్సర్ నకిలీ మందులు!
సాక్షి, హైదరాబాద్: ముంబైలోని కళ్యాణ్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన కేన్సర్ నకిలీ మందుల తీగ లాగితే హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి డొంక కదిలింది. వీటిని విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుని సరఫరా చేస్తున్నట్లు తేలింది. దీంతో ముంబై ఎకనమికల్ ఆఫెన్సెస్ వింగ్ (ఈఓడబ్ల్యూ) అధికారులు గత వారం వ్యాపారి రాఘవేంద్రరెడ్డిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఉన్నత విద్య అభ్యసించిన ఇతను హైదరాబాద్ కేంద్రంగా మూడు ఫార్మా సంస్థలను నిర్వహిస్తుండటంతో ఇక్కడా ఆ నకిలీ మందుల విక్రయాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగరానికి చెందిన రాఘవేంద్రరెడ్డి చెన్నైలోని ఐఐటీ నుంచి బీటెక్, అహ్మదాబాద్‌లోని ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కొన్నాళ్లు లండన్‌లోని ఓ ప్రముఖ కంపెనీలో పని చేసి ఆపై హైదరాబాద్‌కు వచ్చేశారు. ఫార్మా రంగంలో అడుగుపెట్టి.. ఓ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మూడు ఫార్మా సంస్థలను నిర్వహిస్తున్నారు. వ్యాపార కార్యకలాపాల్లో భాగంగా రష్యా, చైనా, ఈజిప్ట్, టర్కీకి వెళ్లి వచ్చారు. టర్కీకి చెందిన ఓ సంస్థ ప్రతినిధులు ఇతడిని ముగ్గులోకి దింపాయి. కేన్సర్ చికిత్సలో వాడే యాడ్సెట్రస్ ఇంజెక్షన్, ఐక్లూజిగ్ టాబ్లెట్లను జపాన్‌కు చెందిన కంపెనీ తయారు చేస్తుంటుంది. అదే ఫార్ములాతో ఔషధాలను తాము తయారు చేసి తక్కువ ధరకు విక్రయిస్తామని చెప్పారు. అనుమతి లేకున్నా దిగుమతి.. జపాన్ కంపెనీ సరఫరా చేసే ఇంజెక్షన్ ధర రూ.5.8 లక్షలు ఉండగా.. తాము రూ.1.1 లక్షలకే ఇస్తామని, ట్యాబ్లెట్లు కూడా అతి తక్కువ ధరకు సరఫరా చేస్తామని టర్కీ కంపెనీ చెప్పడంతో రాఘవేంద్రరెడ్డి అంగీకరించారు. ఇతడి సంస్థల్లో దేనికీ ఎగుమతి–దిగుమతుల లైసెన్స్ లేదు. అయినా వాటిని దిగుమతి చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన వాటిని వివిధ నగరాల్లోని ఔషధ దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ముంబైలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన పూజ రాణా అక్కడి శాంతక్రుజ్లో ప్రైమ్ ఫార్మా పేరుతో ఓ దుకాణం నిర్వహిస్తున్నారు. ఈమెకు రాఘవేంద్రరెడ్డి టర్కీ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న ఔషధాలు పంపుతున్నారు. ఆమె వద్ద తక్కువ ధరకు కేన్సర్ మందులు లభిస్తున్నాయని ప్రచారం జరిగింది. ఈ విషయం జపాన్ సంస్థకు తెలియడంతో వాళ్లు ముంబైకి చెందిన ఓ సంస్థను సంప్రదించారు. తమ ఉత్పత్తుల పేరుతో కొన్ని నకిలీవి మార్కెట్లో ఉన్నాయని, వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధీకృత అధికారాలు ఇచ్చారు. దీంతో ఆ సంస్థ సెప్టెంబర్ చివరి వారంలో ముంబై ఈఓడబ్ల్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. కొనుగోలుదారుల మాదిరిగా... నేరుగా వెళ్లి దాడి చేస్తే ఆధారాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. ఈ నెల 1న కొనుగోలుదారుల మాదిరిగా ప్రైమ్ ఫార్మాకు వెళ్లారు. టర్కీ నుంచి వచ్చిన ఔషధాలను ఖరీదు చేసి, బిల్లు తీసుకుని పూజను అరెస్టు చేశారు. ఈమె వద్ద భారీ మొత్తంలో లభించిన కేన్సర్ ఔషధాలు నకిలీవిగా తేల్చారు. వీటిని హైదరాబాద్‌కు చెందిన రాఘవేంద్రరెడ్డి సరఫరా చేస్తున్నారని విచారణలో వెల్లడైంది. దీంతో గత వారం ఇక్కడకు వచ్చిన స్పెషల్ టీమ్ ఆయన్ను అరెస్టు చేసి తీసుకువెళ్లింది. ముంబై న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. ఈఓడబ్ల్యూ పోలీసులు ఈ కేసును కాపీ రైట్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్పోటిక్స్ యాక్ట్‌లోని సెక్షన్ల కిందే నమోదు చేశారు. అయితే, తన వ్యాపారంపై ఎలాంటి ఆధారాలు చిక్కండా ఉండటానికి రాఘవేంద్రరెడ్డి తన సెల్‌ఫోన్ ధ్వంసం చేశారు. దీంతో ఆధారాల మాయం చేయడానికి ప్రయత్నించాడని.. ఆ సెక్షన్‌ను జోడించారు. హైదరాబాద్‌లోనూ ఈ మందులు సరఫరా చేసి ఉంటారని ఈఓడబ్ల్యూ అధికారులు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులు, ఔషధ నియంత్రణ సంస్థలకు సమాచారం ఇవ్వనున్నారు. రాఘవేంద్రరెడ్డి చేసిన నేరంపై పూర్తి ఆధారాలు లభించే వరకు ఆయనతో పాటు సంస్థలకు చెందిన పూర్తి వివరాలు వెల్లడించలేమని ఈఓడబ్ల్యూ అధికారులు పేర్కొన్నారు. -
TS: ‘ఫిర్యాదు’కు దిక్కులేదు
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖ మరింత పారదర్శకతతో పనిచేసే క్రమంలో సుప్రీంకోర్టు తీర్పుననుసరించి రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థ (తెలంగాణ పోలీస్ కంప్లైంట్ అథారిటీ) కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైంది. బాధితులను వేధించడం, గాయపరచడం, పోలీసులపై ఆరోపణలు ఇతరత్రా తీవ్రమైన ఘటనలకు పాల్పడే వారిపై వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపేందుకుగాను ఈ ఏడాది జూలై 7న తెలంగాణ పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులిచ్చి మూడు నెలలు కావొస్తున్నా ఇప్పటివరకు తెలంగాణ పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థకు కార్యాలయాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో పోలీసులపై ఫిర్యాదు ఇచ్చేందుకు ఎవరిని ఎక్కడ సంప్రదించాలో తెలియని అయోమయపరిస్థితి నెలకొంది. కొంతమంది రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వచ్చి అక్కడ్నుంచి బాధితులు వెనుదిరిగి వెళ్లిపోతున్నారు. ఇదీ నేపథ్యం... ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులపై విచారణ కోసం దేశవ్యాప్తంగా పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని 1996లో ప్రకాశ్‌సింగ్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ మేరకు రాష్ట్రాల వారీగా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని 2006లో నాటి కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. అప్పట్నుంచి అన్ని రాష్ట్రాలు క్రమక్రమంగా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేస్తూ వచ్చాయి. ఇందులోభాగంగా 2013 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేసిన అథారిటీ యాక్ట్‌ను పరిగణనలోకి తీసుకుని 2021 జూలై 7న తెలంగాణ పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థను ఏర్పాటు చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. వెబ్సైట్లను సైతం అందుబాటులోకి తెచ్చిన ఇతర రాష్ట్రాలు తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మహరాష్ట్ర, అస్సోం, ఢిల్లీ, కర్ణాటక, హరియాణ తదితర రాష్ట్రాల్లో పోలీసు ఫిర్యాదు ప్రాధికార సంస్థలను ఏర్పాటు చేసి వాటి కార్యాలయాలతో పాటుగా వెబ్సైట్లను కూడా ఆయా రాష్ట్ర ప్రభు త్వాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చాయి. ఆ వెబ్సైట్లలో కేసుల వివరాలు, తాజా పరిస్థితి, విచారణ తేదీలు ఇలా అన్నింటినీ ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి. కానీ, రాష్ట్రం లో మాత్రం ప్రాధికార సంస్థ ఏర్పాటుకు జీవో ఇచి్చన హోంశాఖ తదుపరి ఏర్పాట్లపై చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్
సాక్షి, చిట్యాల (నల్గొండ): రోడ్లపై ప్రమాదాలు జరగకుండా, వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు పోలీసులు అక్కడక్కడ బారిగేట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఈ బారిగేట్లపై ఆగి వెళ్లుము.. చూసి వెళ్లుము, వేగం కన్నా.. ప్రాణం మిన్న వంటి సూక్తులు రాస్తుంటారు. కానీ, చిట్యాలలోని హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన బారిగేట్‌పై పోలీసులు వినూత్న హెచ్చరికను రాయించారు. ‘స్త్రీలను కాదు.. బండి రోడ్డువైపు చూసి నడుపు’ అని బారిగేట్‌పై రాసి ఉంది. దీనిని చూసిన వాహనదారులు ముసిముసిగా నవ్వుకుంటూ వెళ్తున్నారు. చదవండి: మనసిచ్చిన మేనబావ.. మనువాడుతానని చెప్పి మోసం చదవండి: ‘స్త్రీలను కాదు.. రోడ్డు చూసి బండి నడుపు’ పోలీసుల హెచ్చరిక వైరల్ -
‘రాజు’ కోసం వేట: తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్
-
‘రాజు’ కోసం వేట: తెలంగాణ పోలీసుల భారీ సెర్చ్ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసులు నిందితుడు రాజు కోసం జల్లెడ పడుతున్నారు. అతడి కోసం భారీగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. జంట నగరాలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అన్ని పోలీస్స్టేషన్లకు రాజు ఫొటో పంపించారు. హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యాచారం కేసు పోలీసులను పరుగులు పెట్టిస్తోంది. విపక్షాలు విమర్శలు తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండడంతో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ఘటన జరిగిన వారమైనా నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. సైదాబాద్ చిన్నారి హత్యాచార ఘటనపై హోం మంత్రి మహమూద్ అలీ సమీక్ష చేశారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీ కుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేశ్‌రెడ్డితో సమీక్షించి పలు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారి హత్యాచార ఘటనపై సీఎం కేసీఆర్ చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పారు. నిందితుడిని వీలైనంత తొందరగా పట్టుకోండి అని ఆదేశించారు. చట్టపరంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూడాలని స్పష్టం చేశారు. చదవండి: నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ ఈ కేసులో డీజీపీ మహేందర్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో నిందితుడు రాజు ఫొటోను డిసిప్లే చేయాలని ఆదేశించారు. కమిషనర్లు, ఎస్పీలు గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని చెప్పారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు. నిందితుడిని పట్టిస్తే రూ.10 లక్షల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక జంట నగరాల పరిధిలో గల్లీగల్లీని గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి కోసం వేట కొనసాగుతోంది. సీసీ కెమెరా ఫుటేజ్‌ను ఎప్పటికప్పుడు పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్‌లో బస్సు ఎక్కినట్లు గుర్తించారు. బస్సులో వెళ్లిన రాజు ఎక్కడ దిగారో తెలుసుకుంటున్నారు. వేల సీసీ కెమెరాల ఫుటేజ్‌ను చూస్తున్నారు. టవల్‌తో పాటు టోపీని రాజు మోత్కూరు మార్గంలో పడేసినట్లు గుర్తించారు. ఒక కవర్లో తువ్వాలు, టోపీ, కల్లు సీసా, రూ.700 నగదు ఉన్నట్లు తేలింది. రాజుకు మద్యం అలవాటు ఉండడంతో అన్నీ వైన్‌షాపుల దగ్గర పోలీసులు మఫ్టీలో నిఘా ఉంచారు. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా?: రేవంత్‌రెడ్డి ఇక వీరితో పాటు నగరంతో పాటు సరిహద్దు జిల్లాల్లో రాజు కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు నిందితుడు రాజు ఫొటోలను బస్సులు, ఆటోలకు వాల్ పోస్టర్లు అంటించారు. మరికొన్ని చోట్ల నిందితుడి ఫొటో చూపిస్తూ మీకు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. రాజు ఆనవాళ్లు లభ్యం అయితే తమకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. కొన్నిచోట్ల వాహనదారులను ఆపివేసి తనిఖీలు చేస్తున్నారు కూడా. -
ట్రాఫికింగ్‌పై ‘ధ్రువా’స్త్రం
సాక్షి, హైదరాబాద్: మానవ అక్రమ రవాణా (ట్రాఫికింగ్) ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్న సమస్య. రాష్ట్రంలో దీన్ని నిరోధించేందుకు తెలంగాణ పోలీసులు నడుం బిగించారు. కలకలం రేపుతున్న ట్రాఫికింగ్‌ను కట్టడి చేయడానికి మరో వినూత్న ప్రయోగం చేశారు. పిల్లలు, మహిళలకు ప్రమాదకరంగా మారిన మానవ అక్రమ రవాణా నిరోధకానికి దేశంలోనే తొలి వెబ్సైట్ ధ్రువహెచ్‌టీ (http://dhruvaht.orf/) (డీహెచ్‌ఆర్‌యూవీఏహెచ్‌టీ.ఓఆర్జీ)ను ఇటీవల ప్రారంభించారు. విమెన్‌సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో బ్రిటిష్ హైకమిషన్, తరుణి స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ యజ్ఞంలో పాలుపంచుకుంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో మనుషుల అక్రమ రవాణా కేసులు తరచుగా వెలుగుచూస్తున్నాయి. మహిళలు, బాలికలను ఎత్తుకెళ్లి వ్యభిచార గృహాలకు విక్రయించడం, పిల్లల చేత బలవంతంగా పనిచేయించడం, భిక్షాటన, వారి అవయవాల మార్కెటింగ్ తదితర మాఫియా ముఠాల ఆట కట్టించడం ఈ వెబ్సైట్ ముఖ్య ఉద్దేశం. అలాగే దీనిపై ఆన్లైన్లో పోలీసులకు, సాధారణ పౌరులకు సైతం శిక్షణ ఇస్తారు. ఈ వెబ్సైట్లో ఏముంటుంది? ‘ధ్రువ’వెబ్సైట్ ట్రాఫికింగ్‌కు సంబంధించిన సమస్త సమాచారంతో భాండాగారంలా పనిచేస్తుంది. ఈ వెబ్సైట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నప్పటికీ.. త్వరలోనే పూర్తి స్థాయిలో సేవలు అందించేలా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్‌లో అందుబాటులో ఉంచారు. ► హ్యూమన్ ట్రాఫికింగ్ ఎలా ఉంటుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది. ఈ సమస్య దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది? ట్రాఫికింగ్‌ను ఎలా కనిపెట్టవచ్చు? ఎలా బయటపడవచ్చో వివరిస్తుంది. ► బాధితులు ఎవరిని సంప్రదించాలి? ఎలా సంప్రదించాలో తెలియజేసే ఈ–మెయిల్, ఫోన్, వాట్సాప్ నెంబర్లు అందుబాటులో ఉంటాయి. ► భారత న్యాయవ్యవస్థలో ట్రాఫికింగ్ బాధితులకు అనుకూలంగా ఉండే చట్టాలు, తీర్పులు, వారి హక్కులు, పరిహారం తదితర వివరాలుంటాయి. ► ఈ–లెర్నింగ్ అనే ప్రత్యేక ప్రోగ్రాం ద్వారా సాధారణ పౌరులు, పోలీసులకు శిక్షణ ఇస్తారు. ఆన్లైన్ కోర్సులు నిర్వహించి అప్పటికప్పుడు సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తారు. ► రాష్ట్రం, దేశం, ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాకు సంబంధించి వివిధ భాషల్లో ప్రచురితమైన వ్యాసాలు ఉంటాయి. మనవద్ద సైతం.. అంతర్జాతీయ ట్రాఫికింగ్ ముఠాలు బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ తదితర దేశాల నుంచి పలువురు మహిళలను దొడ్డిదారిలో దేశం దాటించి దేశంలోని పలు నగరాలతోపాటు హైదరాబాద్‌లోనూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల పలుమార్లు రాచకొండ పోలీసులు ఈ తరహా కేసులను పట్టుకున్నారు. 2019లోనూ నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన పిల్లలు పట్టుబడ్డారు. కిడ్నాపింగ్, బెగ్గింగ్ మాఫియా, ఆర్గాన్ మాఫియాల ఆటకట్టించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 31 మానవ అక్రమ రవాణా నిరోధక బృందాలను ఏర్పాటు చేశారు. ఇవన్నీ విమెన్‌సేఫ్టీ వింగ్ పర్యవేక్షణలో పనిచేస్తాయి. టెక్నాలజీతో అరికడతాం మానవ అక్రమ రవాణా కేసులను తీవ్రంగా పరిగణిస్తున్నాం. వీటిని ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు బృందాలను కూడా ఏర్పాటు చేశాం. ఆయా బృందాలకు టెక్నాలజీని జోడించి హీనమైన నేరాలకు పాల్పడేవారి ఆట కట్టిస్తాం. – మహేందర్‌రెడ్డి, డీజీపీ సంపూర్ణ సహకారం ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా చాలా ఘోరమైన నేరం. వీటిని అరికట్టేందుకు నడుం బిగించిన తెలంగాణ పోలీసులకు సాంకేతికంగా, సమాచారపరంగా మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. – ఆండ్రూ ఫ్లెమింగ్ బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ నిబంధనావళి.. శిక్షణ ట్రాఫికింగ్ కేసుల్లో వేగంగా ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక నిబంధనావళి రూపొందించాం. దీనిపై ప్రత్యేకంగా నియమించిన బృందాలకు శిక్షణ ఇచ్చాం. సిబ్బందికి సాంకేతిక మెళకువల కోసం నిరంతర శిక్షణ కూడా ఇస్తున్నాం. – స్వాతి లక్రా,ఏడీజీ, విమెన్‌సేఫ్టీ వింగ్ -
లాక్డౌన్ ఉల్లంఘనులకు ‘తెలంగాణ’ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనలకు విరు ద్ధంగా బయటికి వచ్చి.. సీజ్ అయిన వాహనాల విడుదలకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. జరిమానాలు చెల్లించిన వారి వాహనాలను విడుదల చేయాలని అన్ని ఎస్పీ, పోలీస్ కమిషనరేట్లకు డీజీపీ కార్యాలయం నుంచి సోమవారం సర్క్యు లర్లు వెళ్లాయి. దీంతో పోలీసులు సీజ్ చేసిన వాహనాలను తీసుకెళ్లేందుకు వాహనదారులకు వీలు కలిగింది. ఈ–పెట్టీ, ఈ–చలానాల జరిమానాలను చెల్లించి వాహనాలను తీసుకెళ్లవచ్చు. తీవ్రమైన వాటికి మాత్రం న్యాయస్థానం గడప తొక్కాల్సిందే. కరోనా విజృంభణతో మే నెల 12 నుంచి రాష్ట్రంలో లాక్ డౌన్ విధించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘ నలకు పోలీసులు ఎపిడమిక్ యాక్ట్ సెక్షన్ ఐపీసీ 188 కింద కేసులు నమోదు చేశారు. ఈ ఉల్లంఘనలపై వారి సెల్ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపు తున్నారు. అందులో జరిమానాలను ఈ–చలానా, ఈ–పెట్టీ కేసుల కింద పోలీసులే విధిస్తే.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో చెల్లించి విడిపించుకోవచ్చు. చెల్లింపు ఇలా.. స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి సెల్‌ఫోన్‌కు సందేశం వస్తుంది. అందులో ఉల్లంఘనలకు జరిమానా ఎలా చెల్లించాలో కూడా పొందుపరిచారు. టీ–యాప్, టీ–వ్యాలెట్, ఈ సేవ/మీసేవ/పేటీఎం/టీఎస్ఆన్లైన్ లేదా https://echalan.tspolice.gov.inలో చెల్లించాలి. కోర్టుకు వెళితే ఇలా.. ఈ మొత్తంలో కొన్ని తీవ్రమైన కేసులను పోలీసులు కోర్టుకు పంపుతున్నారు. అలాంటివారు మాత్రం నేరుగా కోర్టుకు వెళ్లి అక్కడ జరిమానా చెల్లించాలి. లేకపోతే కోర్టు ప్రొసీడింగ్స్ ప్రకారం.. ఆ వ్యక్తిపై పోలీసులు చార్జీషీట్ దాఖలు చేస్తారు. దాని ఆధారంగా కోర్టు అతనికి జైలుశిక్ష ఖరారు చేస్తుంది. లాక్డౌన్ ఎత్తివేసినా.. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు ఉంటాయని పోలీసు శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ఎస్పీ, కమిషనరేట్ కార్యాలయాలకు ఆదేశాలు అం దాయి. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన దరిమిలా ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, కరోనా పూర్తిగా తొలగిపోని కారణంగా ఎపిడమిక్ యాక్ట్ కొనసాగు తుందని సోమవారం పోలీసు శాఖ స్పష్టం చేసింది. బహిరంగ, పనిచేసే ప్రాంతాల్లో మాస్కు విధిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని పునరుద్ఘాటించింది. పాటించనివారిపై ఎపిడమిక్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, రూ.1000 జరిమానా విధిస్తామని తెలిపింది. -
ఈ–పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి
సాక్షి, అమరావతి/గరికపాడు(జగ్గయ్యపేట)/దాచేపల్లి(గురజాల): కోవిడ్ ఉధృతి నేపథ్యంలో తెలంగాణ పోలీసులు ఆదివారం నుంచి ఆంక్షలను మరింత కఠినతరం చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ సరిహద్దులోని చెక్‌పోస్టుల వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అంబులెన్సులు, అత్యవసర సర్వీసుల వాహనాలను మాత్రమే తెలంగాణలోకి అనుమతిస్తున్నారు. మిగిలినవారు తెలంగాణ పోలీసుల నుంచి ఈ పాస్ (అనుమతి) తీసుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇకనుంచి తెలంగాణ ఈ పాస్‌లు ఉంటేనే తమ రాష్ట్రంలోకి అనుమతిస్తామని చెక్‌పోస్టుల వద్ద ఆ రాష్ట్ర పోలీసులు స్పష్టం చేస్తున్నారు. లాక్డౌన్ సడలింపు సమయంలోను పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల వాహనాలను తెలంగాణ పోలీసులు నిలిపేస్తున్నారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టు వద్ద ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్లే వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆంక్షలు సడలించినప్పటికీ ఆ సమయంలో వచ్చిన వాహనాలను ఎందుకు అనుమతించడంలేదంటూ పోలీసులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు. తెలంగాణలో లాక్డౌన్ సడలింపు ఉందని పాస్‌లు లేకుండా భారీగా వెళ్లిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కృష్ణాజిల్లా సరిహద్దు గరికపాడు వద్ద జాతీయరహదారిపై చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. గుంటూరు జిల్లాలో సరిహద్దు పొందుగల చెక్‌పోస్టు వద్ద తెలంగాణ పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. గంటల తరబడి ఎదురుచూసినా తెలంగాణ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వాహనదారులు వెనుదిరిగారు. ఇటీవల మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం, హైకోర్టు ఆదేశాలివ్వడంతో అప్పటినుంచి అంబులెన్సులను నిరంతరాయంగా తెలంగాణ పోలీసులు అనుమతిస్తున్నారు. ఉదయం 10 గంటల వరకు మాత్రమే గూడ్స్ (సరుకుల) వాహనాలకు అనుమతి ఇచ్చారు. తర్వాత సరుకుల వాహనాలను కూడా నిలిపేశారు. స్విగ్గీ, జొమాటో వంటి ఆన్లైన్ సరుకుల డెలివరీ సర్వీసుకు మాత్రం అనుమతి ఇచ్చారు. గరికపాడు చెక్‌పోస్టు వద్ద నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ వెంకటేశ్వరరావు, పొందుగల చెక్‌పోస్ట్ వద్ద ఎస్ఐ బాలనాగిరెడ్డి పరిస్థితిని పరిశీలించారు. -
తెలంగాణ: లాక్డౌన్ పక్కాగా అమలు.. ఉల్లంఘిస్తే కేసులే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్డౌన్ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దీని అమలుపై రేంజ్ ఐజీలు, డీఐజీలు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో మంగళవారం డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతిభద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ మాట్లాడుతూ.. సీనియర్ పోలీస్ అధికారులందరూ క్షేత్ర స్థాయిలో ఉండి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలయ్యేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. లాక్డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్క్వార్టర్లు, ప్రధాన నగరాల్లో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయాలని సూచించారు. వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణాపై ఎలాంటి ఆంక్షల్లేవని పేర్కొన్నారు. జాతీయ రహదారులపై రవాణాపై కూడా ఎలాంటి ఆంక్షల్లేవని తెలిపారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్లు లేదా గుర్తింపు కార్డులు వెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు. వ్యవసాయ, గ్రామీణ ఉపాధికి మినహాయింపు.. గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధి హామీ పనులను లాక్డౌన్ నుంచి మినహాయించినట్లు తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగుల వద్ద శాఖాపరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందని తెలిపారు. రాష్ట్రంలో జరిగే వివాహాలకు ఇరు వైపుల వారు 40 మంది మాత్రమే హాజరయ్యేలా చూడాలని చెప్పారు. వివాహాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరని పేర్కొన్నారు. అంత్యక్రియలకు 20 మంది మాత్రమే హాజరు కావాలన్నారు. కరోనా వాక్సినేషన్‌కు ఎవరైనా వెళ్లాల్సి వస్తే వారి మొదటి డోస్‌కు సంబంధించిన సమాచారం సెల్ఫోన్లో చూసి వెళ్లనివ్వాలని తెలిపారు. నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చూడాలని పేర్కొన్నారు. నిత్యావసర వస్తువుల రవాణా, ఇతర ఎమర్జెన్సీ సేవలకు సంబంధించి స్థానికంగా సమయాలను పేర్కొంటూ ప్రత్యేక పాసులు జారీ చేయాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టంతో పాటు ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేయాలని డీజీపీ పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ–పాస్ ద్వారా ప్రత్యేక పాసులు లాక్డౌన్ నేపథ్యంలో వేరే రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ–పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఈ–పాస్‌ల కోసం htt p://policeportal.tspolice.gov.in/ వెబ్సైట్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించారు. లాక్డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే పాసులు జారీచేస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు మాత్రమే పాస్‌లు జారీ చేస్తారని వివరించారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చే వారికి మాత్రం సంబంధిత రాష్ట్రాల నుంచే పాస్‌లు జారీ చేస్తారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఒక కమిషనరేట్ నుంచి మరో కమిషనరేట్ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమిషనరేట్ నుంచే పాసులు జారీ చేస్తారని వివరించారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని ఉద్ఘాటించారు. రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలకు వెళ్లే వారికి పాసులు అవసరం లేదని, వారి ప్రయాణ టికెట్లు చూపిస్తే సరిపోతుందని తెలిపారు. చదవండి: కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా చదవండి: ఏం చేయలేం: వ్యాక్సిన్‌పై చేతులెత్తేసిన ఢిల్లీ -
వాట్సప్ చేస్తే ఉచిత భోజనం: తెలంగాణ పోలీసుల శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ పోలీసులు విశేష కృషి చేస్తున్నారు. ఒకవైపు కర్ఫ్యూ పకడ్బందీగా అమలుచేస్తూనే కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. అందులో భాగంగా మరో ముందడుగు వేసి కరోనా బాధితులకు అండగా నిలబడేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధితులకు ఉచితంగా భోజనం అందించే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. ఆహారం కావాల్సిన కరోనా బాధితులు వాట్సప్‌లో మెసేజ్ చేస్తే చాలు. ఆ వివరాలు చదవండి. సత్యసాయి సేవా సంస్థ, స్విగ్గీ, బిగ్ బాస్కెట్, హోప్ సంస్థలతో కలిసి తెలంగాణ పోలీసులు ‘సేవా భోజనం’ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భోజనం అవసరమైన కరోనా బాధితులు ఉదయం 7 గంటలలోపు 77996 16163 నంబర్‌కు వాట్సప్‌లో వివరాలు పంపించాలి. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నారు. వీరిలో చిన్నారులు, వృద్ధులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలంగాణ పోలీస్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమాన్ని డీఐజీ స్వాతిలక్రా ఆయా సంస్థల ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కరోనా బాధితులకు సద్దుదేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్నియితే దుర్వినియోగం చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. చదవండి: జొమాటో సంచలనం: నోయిడాలో అమల్లోకి.. చదవండి: ఒకే రోజు లాక్డౌన్ ప్రకటించిన రెండు రాష్ట్రాలు చదవండి: తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్ Telangana State Police by taking support from @ssssoindia, @leadlife_india, @SwiggyCares, @bigbasket_com & Hope Organization has launched a “Free Food” (lunch) for COVID patients who are in isolation at their doorstep. pic.twitter.com/DemeRRhLR8 — Telangana State Police (@TelanganaCOPs) May 6, 2021 -
ఇక సులువుగా పోలీస్ వెరిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: ఇకపై పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికేషన్ (పీవీసీ), పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల (పీసీసీ)కు పోలీసు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. సర్టిఫికెట్లు కావాలనుకున్న వారు నేరుగా ఆన్లైన్లో ఐ–వెరిఫై ద్వారా దరఖా స్తు చేసుకునే విధానాన్ని పోలీస్ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విధానాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి తన కార్యాలయంలో ప్రారంభించారు. www.tspolice.gov.inను క్లిక్ చేసి పోలీస్ వెరిఫికేషన్–క్లియరెన్స్ ఆప్షన్స్ ఎంచుకుని.. నిబంధనలను ఫాలో అయితే సరిపోతుంది. పోలీసు వెరిఫికేషన్ సాధారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వ సంస్థలు, కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, రక్షణ శాఖ సంబంధ కార్యాలయాలు, అందులో అపాయింట్ అయ్యే ప్రైవేటు ఉద్యోగులు. ఆయా కార్యాలయాల్లో ఇతర సేవల కోసం పనిచేసే ప్రైవేటు ఉద్యోగులు పోలీసు వెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటారు. పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ విదేశాల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం, వలస వెళ్లే పౌరులకు ఇది అవసరం. ఒకసారి దరఖాస్తు పూర్తి చేశాక పోలీసుల పని మొదలవుతుంది. దీనిపై సందేహాలుంటే హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలి. ఇవీ లాభాలు.. ► ఈ విధానం అందుబాటులోకి రావడం వల్ల పదే పదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని తప్పుతుంది. ► డాక్యుమెంట్ల దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపులు సులభతరంగా మారుతాయి. ► ఆన్లైన్ దరఖాస్తుల్లోని ఫొటోల ఆధారంగా నేరచరిత కలిగిన వారిని సులువుగా గుర్తించే వీలుంది. ► దరఖాస్తుల పరిశీలనకు అదనపు మానవ వనరుల వినియోగం తగ్గింపు. ► దరఖాస్తు ఏ స్థితిలో ఉందో తెలుసుకునే సదుపాయం దరఖాస్తుదారులకు కలుగుతుంది. -
ఓటేసి గెలిపించండి: తెలంగాణ పోలీసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసులు మరో ప్రతిష్టాత్మక అవార్డు రేసులో ఉన్నారు. తాజాగా టెక్నాలజీ అమ లు విభాగంలో స్కోచ్ సంస్థ పలు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ రేసులో ఉన్న తమను ఓటేసి గెలిపించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మహిళల రక్షణకు పోలీసు శాఖ పలు క్యాబ్సరీ్వసులతో కలిసి వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. రాత్రిపూట పనిచేసే మహిళా ఉద్యోగినుల కోసం హాక్ఐ యాప్‌ను అందిస్తోంది. దాన్ని డౌన్లోడ్ చేసుకున్నవారు క్యాబ్‌లలో ప్రయాణించేటప్పుడు ఏదైనా ఆపద ఎదురైతే ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే ఏసీపీ, సీఐ, కంట్రోల్‌రూమ్, పెట్రోలింగ్ వాహనాలతోపాటు మొత్తం ఏడు విభాగాలకు ఎమర్జెన్సీ సందేశం వెళ్తుంది. ఈ సేవలు అందిస్తున్న పోలీసులకు ప్రజలు స్కోచ్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని ఓటేయాలని పోలీసుశాఖ కోరుతోంది. చదవండి: ఆర్బీకేలకు ‘స్కోచ్ గోల్డ్’ అవార్డు -
పదవీ విరమణ పెంపుతో పోలీస్ శాఖలో వింత పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం కురిపించిన వరాల జల్లుతో సర్కారు కొలువు చేసుకునే వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పోలీసు శాఖలో ఓవైపు పదోన్నతులు, మరోవైపు 30 శాతం ఫిట్మెంట్ పెంపు.. అన్నింటి కంటే ముఖ్యంగా రిటైర్మెంట్ వయోపరిమితిని 58 నుంచి 61 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో దాదాపు 80 వేలమంది సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారు. అదేసమయంలో పోలీసు శాఖ అంతర్గతంగా తీసుకున్న నిర్ణయంతో విచిత్రాలు చోటుచేసుకున్నాయి. పోలీసు శాఖ అదనపు ఎస్పీ నుంచి నాన్‌కేడర్ ఎస్పీలుగా 52 మందికి పదోన్నతి కల్పించేందుకు తాజాగా చర్యలు తీసుకుంది. అలాగే మొత్తం 26 మంది నాన్‌కేడర్ ఎస్పీలకు ఐపీఎస్‌హోదా కల్పించాలని నిర్ణయించింది. దీనికి ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. ఈ క్రమంలో నేడోరేపో ఐపీఎస్ హోదా లభించే ఈ 26 మంది నాన్‌కేడర్ ఎస్పీల విషయంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఐపీఎస్ నిబంధనల ప్రకారం.. రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. వీరికి ఐపీఎస్ హోదా దక్కితే రెండేళ్లు అదనంగా సర్వీసు దక్కేది. కాగా, రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం..అది 58 నుంచి 61 ఏళ్లకు చేరుకుంది. ఆ లెక్కన ఈ 26 మంది ఒక ఏడాది ముందే రిటైర్ కానున్నారు. ఒకవేళ వీరికి ఐపీఎస్ కన్ఫర్మ్ కాకపోయినా.. మరో ఏడాది నాన్ కేడర్ ఎస్పీలుగా కొనసాగే అవకాశాలు ఎలాగూ ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ఈనెలాఖరుకు ఒకే ఒక్క నాన్‌కేడర్ ఎస్పీ రిటైర్ కావాల్సి ఉంది. రిటైర్మెంటుకు సరిగ్గా వారంరోజుల ముందు ప్రభుత్వం ఆయనకు వరుసపెట్టి శుభవార్తలు చెప్పింది. ఫిట్మెంట్ పెంపు, సర్వీసు పొడిగింపు ఇలా..! మొత్తానికి ఇవన్నీ పదవి నుంచి తప్పుకునే క్రమంలో తనకు దక్కిన అపూర్వ అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. ఆయనకు త్వరలోనే ఐపీఎస్ హోదా దక్కనుందని సమాచారం. ఇది ఆయనకు దక్కిన మూడో బోనస్. కాగా, డిపార్ట్మెంటులో ఏటా 2,000 మందివరకు రిటైర్ అవుతుంటారు. ఈ లెక్కన చూస్తే.. వీరందరికీ లాభం చేకూరినట్లే. మరో మూడేళ్ల వరకు అంటే 2024 మార్చి వరకు డిపార్ట్మెంటులో దాదాపుగా రిటైర్మెంట్లు అన్న మాటే వినిపించదు. ప్రభుత్వ ప్రకటనతో డిపార్ట్మెంటులో ఉన్న దాదాపు 80 వేల మంది సిబ్బంది సంతోషంగా ఉన్నారు. మూడువారాల్లో మూడేళ్ల సర్వీస్ మిస్..! పోలీసు శాఖలో మార్చి నెలాఖరునాటికి గ్రేటర్‌లోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో దాదాపు 50 మంది, మిగిలిన జిల్లాల్లో దాదాపు 60 మంది వరకు అంటే మొత్తంగా 110 మంది రిటైర్ కావాల్సి ఉంది. కానీ, వీరందరికీ ఏకంగా మూడేళ్ల సర్వీసు, 30 శాతం ఫిట్మెంట్తో కలసివచ్చింది. అదే సమయంలో ఫిబ్రవరి 28న డిపార్ట్మెంటులో దాదాపు 100 మందికిపై పోలీసులు పదవీ విరమణ చేశారు. వయోపరిమితి పెంపు ప్రకటన వచ్చాక వీరంతా తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కేవలం మూడువారాల వ్యవధిలో మూడేళ్ల సర్వీసు కోల్పోయామని నిర్వేదంలో పడ్డారు. -
పోలీసు పరీక్షల్లో ఎత్తు ఇక పక్కా!
సాక్షి, హైదరాబాద్ : పోలీసు నియామక పరీక్షల్లో అభ్యర్థుల ఎత్తు కొలిచేందుకు అత్యంత ఆధునిక యంత్రాన్ని పోలీసు శాఖ అందుబాటులోకి తెచ్చింది. మెర్క్యురీ బ్యాలెన్స్ అనే అత్యాధునిక యంత్రాన్ని పోలీసు శాఖ కొనుగోలు చేసింది. ఇకపై తెలంగాణ పోలీసు శాఖ భర్తీ చేసే కానిస్టేబుల్, ఎస్సై పోస్టుల్లో అభ్యర్థులకు శారీరక పరీక్షలు నిర్వహించే క్రమంలో దీని సేవలు వాడుకోనున్నారు. సాధారణంగా పురుషులు 167.6 సెంటీమీటర్లు, మహిళలకు 152.5 సెంటీమీటర్లు ఎత్తుగా నిర్ధారించారు. ఇందులో రిజర్వేషన్ల వారీగా కొన్ని వర్గాలకు కాస్త మినహాయింపు ఉంటుంది. గతంలో ఎత్తు విషయంలో కొందరు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం లేదా ఎంపిక ప్రక్రియపై తమకు అన్యాయం జరిగిందంటూ ఆరోపణలు చేసేవారు. ఇలాంటి వ్యవహారాల వల్ల నియామక ప్రక్రియను ప్రభావితం అయ్యే అవకాశముంది. దీనివల్ల ఇటు అభ్యర్థులు, అటు ఉన్నతాధికారులకు సమయం వృథా అవుతోంది. అందుకే, ఇకపై అలాంటి వివాదాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు మెర్క్యురీ బ్యాలెన్స్ అనే యంత్రాన్ని తెలంగాణ పోలీసులు కొనుగోలు చేశారు. పూర్తిగా పాదరసం ఆధారంగా ఆధునిక టెక్నాలజీతో పనిచేసే ఈ యంత్రం అభ్యర్థుల ఎత్తును అత్యంత కచ్చితంగా లెక్కగడుతుంది. అలాంటి ఇబ్బందులు ఇక ఉండవు.. ప్రభుత్వంలోని వేరే శాఖల్లో పనిచేసిన కొందరు అభ్యర్థులు తమ ఎత్తు విషయంలో సమర్పించే సర్టిఫికెట్లలో ఎత్తు విషయంలో వ్యత్యాసాలుంటాయి. సాధారణంగా నిబంధనలకు విరుద్ధంగా మిల్లీమీటర్ తేడా ఉన్నా పోలీసు శాఖలో అంగీకరించరు. కానీ, కొందరు ఇతర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేసిన వారు, కొన్ని సంస్థల్లో శిక్షణ తీసుకున్న వారు తమ ఎత్తు విషయంలో నిజాలు దాస్తారు. వాస్తవంగా ఒకలా, వారు తెచ్చిన సర్టిఫికెట్లలో మరొకలా ఉంటుంది. వ్యత్యాసం స్వల్పమే అయినా.. వారి వాదన నిబంధనలకు విరుద్ధంగా ఉంటుంది. వీరిలో చాలామంది చూపించే వ్యత్యాసం కూడా మిల్లీమీటర్లలోనే ఉంటుంది. ఇకపై అలా వాదించే వారికి మెర్క్యురీ బ్యాలెన్స్ మెషీన్ ఫలితాలనే సమాధానంగా చూపనున్నారు పోలీసులు.. త్వరలో పోలీసు శాఖలో 20 వేల పోస్టుల వరకు భర్తీ చేస్తామని ఇటీవల సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసు శాఖలో ఉన్న ఖాళీలపై డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి నివేదిక కూడా అందజేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నియామక ప్రక్రియ ప్రారంభించేందుకు పోలీసు శాఖ కూడా సిద్ధంగా ఉంది. ఈసారి 6 లక్షలకు పైగా అభ్యర్థులు 20 వేల పోస్టులకు పోటీ పడవచ్చని అంచనా.. -
లాఠీలకు ‘పని’ చెప్పిన ఖమ్మం ఖాకీలు
ఖమ్మంక్రైం/సత్తుపల్లి: ఖాకీలు లాఠీలకు పని చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కొనసాగిస్తూనే.. అల్లరి మూకలు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపేందుకు శిక్షణ పొందుతున్నారు. ఇటీవల కాలంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై దాడి, హుజూర్నగర్ పరిధిలోని మఠంపల్లి వద్ద రాళ్లు రువ్విన సంఘటనలు చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పోలీసులు వైఫల్యం చెందొద్దనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో కానిస్టేబుళ్లకు లాఠీల వినియోగంపై తర్ఫీదునిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఫ్రెండ్లీ పోలీసింగ్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. దీనికితోడు ఆరేళ్ల నుంచి చెప్పుకోదగ్గ ఆందోళనలు పెద్ద ఎత్తున జరగకపోవటం వల్ల పోలీసుల చేతికి పని లేకుండా పోయింది. సాధ్యమైనంత వరకు ఎక్కడికక్కడ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారానే కేసులను పరిష్కరించాలని, సామరస్యపూర్వకంగా వెళ్లాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయితే ఆందోళనల సమయంలో ఒకటి, రెండు సంఘటనలు మినహా పోలీసులు సర్దుబాటు ధోరణిలోనే వ్యవహరిస్తూ వచ్చారు. ఆందోళనకారుల ఫొటోలను తీస్తూ పోలీస్స్టేషన్లలో బైండోవర్ కేసులతో నడిపించారు. అయితే ఇక నుంచి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే లాఠీలకు పని కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. మారిన పరిస్థితులు.. పోలీసులు శాంతిభద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న క్రమంలో జిల్లాలో చెదురు మదురు ఘటనలు మినహా ఎక్కడా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన సందర్భాలు లేవు. ఫ్రెండ్లీ పోలీసింగ్, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు.. ఇలా కారణమేదైనా పోలీసులు లాఠీలను మరిచిపోయి ఏళ్లయింది. వాటిని ఠాణాల్లోనే మూలన పెట్టాల్సి వచ్చింది. అయితే అక్కడక్కడా అల్లరి మూకలు పోలీసుల మాట వినకపోవడం.. చెప్పినా పట్టించుకోకపోవడంతోపాటు పోలీసులపై దాడులకు దిగిన పరిస్థితులు వచ్చాయి. వీటన్నింటికీ పరిష్కార మార్గం చూపేది లాఠీలేనని ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. కాగా.. ఐదేళ్లుగా పోలీసు ఉద్యోగాలకు ఎంపికవుతున్న కానిస్టేబుళ్లకు లాఠీల వినియోగం తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో డీజీపీ మహేందర్‌రెడ్డి జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లు, కమిషనరేట్ల పరిధిలో విడతలవారీగా కానిస్టేబుళ్లకు లాఠీల వాడకంపై శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. సిబ్బంది కొరత.. కాగా.. పోలీస్స్టేషన్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. జనాభా దామాషా ప్రకారం పోలీసులు లేకపోవటం వల్ల కేసులను ఛేదించటంలో ఆలస్యమవుతున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఉన్న సిబ్బంది కూడా పనిభారంతో ఒత్తిడికి లోనవుతున్నారు. వీఐపీల భద్రత, పోలీస్ పెట్రోలింగ్, ప్రముఖుల పర్యటనలు, నిత్యం ట్రాఫిక్‌పైనే దృష్టి సారించాల్సి వస్తుండటంతో క్రైం కేసులపై విచారణ విషయంలో ఆలస్యం జరుగుతున్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి ‘సాక్షి’ వద్ద వాపోయారు. పోలీస్స్టేషన్లలో సరిపడా సిబ్బందిని ఇస్తే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వారం రోజులపాటు శిక్షణ.. డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలతో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్లలో వారం రోజులపాటు లాఠీల వాడకంపై శిక్షణ ఇస్తున్నారు. ఏ సందర్భంలో లాఠీలను ఉపయోగించాలి? ఎలా ఉపయోగించాలి? శాంతిభద్రతలు శ్రుతి మించకుండా చర్యలు ఎలా చేపట్టాలి? ఘర్షణలపై ఎలా స్పందించాలి? అనే వాటిపై ప్రతిరోజు లాఠీ పరేడ్‌తోపాటు క్లాసులు తీసుకుంటున్నారు. మొదట్లో ఏఆర్ సిబ్బందికి పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శిక్షణ ప్రారంభించారు. అనంతరం అన్ని పోలీస్స్టేషన్లలో సిబ్బంది, హోంగార్డులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో.. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాలతో కానిస్టేబుళ్లకు లాఠీలపై శిక్షణ ఇస్తున్నాం. దీంతోపాటు ప్రజలతో మమేకమై ఎలా మసులుకోవాలనే దానిపై కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఆందోళనలతో శాంతిభద్రతలకు ఆటంకం కలిగితే విధిలేని పరిస్థితుల్లోనే లాఠీలను వాడుతాం. సాధ్యమైనంత వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోనే సమస్యలను పరిష్కరిస్తాం. – ఎన్.వెంకటేష్, ఏసీపీ, కల్లూరు చదవండి: పద్మశ్రీ వనజీవి రామయ్యకు అస్వస్థత -
‘ఖాకీ’ని తలపించే చేజింగ్, 45 రోజుల ఆపరేషన్
సాక్షి, కరీంనగర్: కార్తీ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా ఖాకీ కథ తెలుసుగా! ఉత్తర భారతం నుంచి సరుకు రవాణా లారీల్లో వచ్చే కొందరు దుండగులు తెలుగు రాష్ట్రాల్లో దోపిడీలు, హత్యలకు పాల్పడతారు. వారిని పట్టుకోవడానికి ఆయా రాష్ట్రాల పోలీసులతో కలిసి స్థానిక పోలీసులు భారీ ఎత్తున జాయింట్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. తాజాగా తెలంగాణ, కర్ణాటకకు చెందిన పోలీసులు అలాంటి జాయింట్ ఆపరేషన్ చేశారు. 118 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ కరుడుగట్టిన నేరస్తుడిని పట్టుకునేందుకు ఈ రెండు రాష్ట్రాల పోలీసులు దాదాపు 45 రోజులపాటు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. నవీ ముంబై, పుణె, హైదరాబాద్, బెంగళూర్, షోలాపూర్, బీదర్‌లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. ఎట్టకేలకు గజదొంగ భాకర్ అలీని కరీంనగర్ పోలీసులు షోలాపూర్‌లో శనివారం అరెస్టు చేశారు. అయితే, అతను సాదాసీదాగా పోలీసులకు చిక్కలేదు. పోలీసులపై అటాక్ చేసి తప్పించుకునేందుకు యత్నించాడు. ఆక్రమంలో భాకర్ అలీ చేతిలో పోలీసులు గాయపడ్డారు. చివరకు ఛేజింగ్ చేసి పోలీసులు అతని ఆట కట్టించారు. కాగా, భాకర్ అలీపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో పీడీ యాక్టు కేసులు ఉన్నట్టు కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి తెలిపారు. 2015 ముందే హైదరాబాద్‌లో వందకుపైగా చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. నేరస్తుడిని పట్టుకునేందుకు వందల సీసీ కెమెరాలను పరిశీలించామని పేర్కొన్నారు. నేరస్తుడి నుంచి గంజాయి సహా కార్లు స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. (చదవండి: 200కు పైగా ఇన్స్టాంట్ లోన్‌యాప్స్ తొలగింపు..) -
ఏందిరా సామి ఇది, ఆటోనేనా?!
సాక్షి, హైదరాబాద్: అమాయకుల అవసరాలే పెట్టుబడిగా ఆటో డ్రైవరన్నలు సాహసాలు చేస్తున్నారు. పరిమితికి మించి అనేకంటే అంతకు మించి ప్రయాణికులతో బండి లాగించేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతియేడు లక్షా 50 వేలకు పైగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని ఓ వైపు గణాంకాలు హెచ్చరిస్తున్నా అటు ప్యాసెంజర్ వాహనాలు, ఇటు ప్రజల నిర్లక్ష్య వైఖరి మారడం లేదు. పైన కనిపిస్తున్న ఫొటోనే ఇందుకు నిదర్శనం. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 మందితో వెళ్తున్న ఈ ఆటో ‘విన్యాసం’ బయటపడింది. మహబూబ్‌నగర్ పోలీసులు ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించింది. ‘ఏందన్నా..! అది ఆటో నా ? మినీ బస్సా ? 7 సీటరా లేక 14 సీటరా ? ఆటో నీది !, ప్రాణం ఆ అమాయకులది !, మరి ఆటోలో ప్రయాణించే సమయంలో వారి ప్రాణాలకు భరోసా ఎవరిది ?’ అంటూ కామెంట్ చేసింది. ఈ ఫొటోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు డ్రైవర్ తీరుపై విస్మయం వ్యక్తం చేయగా.. మరికొందరు ఆటో ఎక్కే ప్రయాణికులకు కూడా సోయి ఉండాలి కదా అని విమర్శిస్తున్నారు. మరికొందరేమో ప్రభుత్వం సరిపడా రవాణా సదుపాయాలు కల్పిస్తే ప్రజలెందుకు ప్రాణాలకు తెగించి మరి ఇలా ఎందుకు వెళ్తారని అంటున్నారు. అన్ని రూట్లలో బస్సులు నడపొచ్చుగా అని సూచనలు ఇస్తున్నారు. -
పదేళ్ల తర్వాత అమ్మ ఒడికి
సాక్షి,హైదరాబాద్: మానసిక స్థితి సరిగాలేని ఓ బాలుడు ఏడేళ్ల వయసులో ఇంటి నుంచి తప్పిపోయాడు. ఆ బాలుడిని పోలీసులు చేరదీసి చిల్ర్డన్స్ హోమ్‌కు పంపారు. పదేళ్లు అక్కడే గడిపిన ఆ బాలుడు తెలంగాణ పోలీసుల సాయంతో అమ్మ ఒడికి చేరాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లా కొత్వాలీకి చెందిన శ్రీవాత్సవకు చిన్నతనంలో మానసిక సమస్యలున్నాయి. 2010 అక్టోబర్ 10న ఇంటి ముందు ఆడుకుంటూ తప్పిపోయాడు. అదే నెల 21న పశ్చిమబెంగాల్లోని హుగ్లీ పోలీసులు అతన్ని చేరదీశారు. అనంతరం హౌరాలోని చిల్ర్డన్స్ హోమ్‌కు పంపారు. గుర్తించిన ‘దర్పణ్’ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీతో ‘దర్పణ్’ యాప్ ను తెలంగాణ సేఫ్టీ వింగ్ అభివృద్ధి చేశారు. తప్పిపోయిన, ఆశ్రమాల్లో ఉన్న పిల్లల ఫొటోలను దీంతో పోల్చిచూస్తారు. శ్రీవాత్సవ చిన్ననాటి ఫొటోతో హౌరాలోని చిల్ర్డన్స్ హోమ్‌లో ఉన్న బాలుడి ముఖకవళికలు ఒకేలా ఉన్నాయని యాప్ గుర్తించింది. సేఫ్టీ వింగ్ పోలీసులు శ్రీవాత్సవ తల్లిదండ్రులు, హుగ్లీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో చిల్ర్డన్స్ హోమ్‌లో ఉన్న శ్రీవాత్సవను అతని తండ్రికి అధికారులు అప్పగించారు. -
షీ టీమ్స్ పనితీరు భేష్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతపై తెలంగాణ పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన షీ టీమ్స్ పనితీరుపై 96 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 4 శాతం మంది తాము చేసిన ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను తెలపకపోవడం, ఫిర్యాదు చేసేందుకు వెళితే సరిగ్గా స్పందించలేదని చెప్పారు. ఈ గణాంకాలను పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రంలో షీ టీమ్స్ సంబంధిత నేరాలపై స్పందించిన అధికారులతో ఒక్క రోజు ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించారు. రాష్ట్రంలోని షీ టీమ్స్ అధికారులు, షీ టీమ్స్‌కు పట్టుబడ్డ దాదాపు 120 మంది నిందితులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీ టీమ్స్ మహిళల్లో ఆత్మస్థైర్యం నింపిందని స్వాతిలక్రా పేర్కొన్నారు. షీ టీమ్స్ పనితీరుపై ప్రముఖ సంస్థ ‘సెస్’ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలో సర్వే చేయించామని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలపై వేధింపుల కేసులు, ఈవ్ టీజింగ్‌లపై అధికంగా వాట్సాప్, ఫోన్ల ద్వారా ఫిర్యాదులు అందుతున్నాయని, వీటిని కేసులుగా నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఆదేశించా రు. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న డీఐజీ సుమతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో షీ టీమ్స్ పనితీరుపై ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్‌లో షీటీమ్స్‌కు పట్టుపడ్డ వారిలో అధికంగా విద్యావంతులు, మేజర్లే ఉన్నారన్నారు. తప్పు చేస్తే ఎవరినీ వది లేది లేదని.. సైబరాబాద్ పరిధిలో మహిళలను వేధించిన ఘటనలో 51 ఏళ్ల వ్యక్తిపై చర్యలు తీసుకోవడమే ఇం దుకు నిదర్శనమన్నారు. కాగా, మనో చేతనకు చెందిన గీతా చల్లా ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. నవంబర్‌లో అధికంగా ఫిర్యాదులు నవంబర్‌లో షీ టీమ్స్‌కు రాష్ట్రవ్యాప్తంగా 464 ఫిర్యాదులు అందాయి. ఇందులో నేరుగా 151, పరోక్షంగా (వాట్సాప్, ఈ–మెయిల్, ట్విటర్, హాక్–ఐ) 313 ఫిర్యాదులు అందాయి. ఇందులో ఫోన్ ద్వారా వేధింపులు కాగా, 246 ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు తదితరాలు ఉన్నాయి. వీరిలో 90 మందిని హెచ్చరించి, 82 మందికి కౌన్సెలింగ్ చేసి పంపారు. 56 మందిపై కేసులు నమోదు కాగా, 52 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. -
అడవంతా జల్లెడ!
సాక్షి, హైదరాబాద్/ మల్హర్: తెలంగాణలో గెరిల్లా ఆర్మీ (మెరుపుదాడులకు దిగే ప్రత్యేక దళాలు)ని బలోపేతం చేయాలని మావోయిస్టులు నిర్ణయించా రనే సమాచారంతో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమ య్యారు. దండకారణ్యం సరిహద్దుల్లో మావోల వేటను ముమ్మరం చేశారు. అణువణువూ జల్లెడ పడు తున్నారు. గతకొంత కాలంగా తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో మావోయిస్టుల కదలికలు క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దానికి తోడు డిసెం బరు 2 నుంచి 8వ తేదీ వరకు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాలు ఉండటంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. అడవుల్లో మావోలు సభలు, సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకోవాలని భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఓవైపు ప్రతిష్టాత్మకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల కోసం నగరంలో 52 వేల మంది పోలీసులను బందోబస్తులో ఉంచినప్పటికీ... మరోవైపు సరిహద్దులను డేగ కళ్లతో పర్యవేక్షిస్తూనే ఉన్నారు. ఇటీవల పోలీసుశాఖలో కొత్తగా చేరిన దాదాపు 10 వేల మంది పోలీసుల్లో మెరికల్లాంటి యువకులను మావోల వేటకు వినియోగిస్తున్నారు. మావోల అన్వేషణలో తలపండిన సీనియర్లు, రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ల పర్యవేక్షణలో సరిహద్దుల్లో అణువణువూ గాలిస్తున్నారు. వీరికితోడుగా సీఆర్పీఎఫ్ బలగాలు కూడా కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి. రాష్ట్రాల సరిహద్దులపై నిఘా.. పీఎల్జీఏ వారోత్సవాల నేపథ్యంలో మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ సరిహద్దులపై పోలీసులు నిఘా పెంచారు. ముఖ్యంగా ప్రాణహిత, గోదావరి నదులపై అత్యాధునిక డ్రోన్లతో పర్యవేక్షణ జరుపుతున్నారు. రాత్రిపూట మావోయిస్టులు నదులను దాటుకుని రాకపోకలు సాగించే అవకాశాలు ఉండటంతో ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిసారించారు. ఇక సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో పగలు, రాత్రి నిర్విరామంగా కూంబింగ్ కొనసాగిస్తున్నారు. ఏజెన్సీ మండలాలకు వెళ్లే అన్ని మార్గాల్లో తనిఖీలు విస్తృతం చేశారు. ఇదేవిధంగా మారుమూల గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతాలకు వెళ్లాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పీఎల్జీఏది ప్రత్యేకస్థానం మావోయిస్టు పార్టీలో పీఎల్జీఏకు ప్రత్యేకస్థానం ఉంది. ఈ ఏడాది ఘనంగా వారోత్సవాలు నిర్వహించాలని, తెలంగాణలో ఈ విభాగాన్ని పటిష్టం చేయాలని అగ్రనాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కాల్పులు, బాంబు పేలుళ్లు, ఆంబుష్ దాడులు నిర్వహించడంలో ఈ విభాగానికి ప్రావీణ్యం ఉంది. చత్తీస్‌గఢ్, ఒడిషా అరణ్యాలలో ఎంతో పటిష్టంగా ఉన్న పీఎల్జీఏ విభాగాన్ని తెలంగాణలో బలోపేతం చేయాలని, కొత్త యువకులను ఆకర్షించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ ఇటీవల ఆదేశించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రా, ఒడిషా, చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని అడవుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు పీఎల్జీఏ వారోత్సవాల్లో పాల్గొంటారని, ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి సంబంధించి ఎలాంటి పంథా అనుసరిస్తారన్న విషయంలో పోలీసులు ఉత్కంఠతో ఉన్నారు. ఈ సమావేశాలకు సంబంధించి ఇంటిలిజెన్స్ విభాగం ఇప్పటికే సమాచార సేకరణలో నిమగ్నమైంది. తృటిలో తప్పించుకున్న కంకణాల తెలంగాణలో వేళ్లూనుకునేందుకు యత్నిస్తోన్న మావోయిస్టులు గోదావరి, ప్రాణహిత పరిసరాల్లోని కొన్ని ప్రాంతాల్లో పట్టు సాధించగలిగారు. ఆదివాసీల సాయంతో ఆశ్రయం పొందగలుగుతున్నారు. ఇలాంటి వారిలో మావోయిస్టు కొత్తగూడెం డివిజన్ కమిటీ సభ్యుడు కంకణాల రాజిరెడ్డి కూడా ఒకరు. ఇతని దళం గతవారం కూంబింగ్ చేస్తోన్న పోలీసుల నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకుంది. పక్కా సమాచారంతో కూంబింగ్‌లోకి దిగిన పోలీసులకు కాటారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగారం రిజర్వ్‌ఫారెస్ట్‌లో రాజిరెడ్డి దళం ఎదురుపడింది. పోలీసులను చూస్తూనే వారు కాల్పులు జరిపి తప్పించుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో ఇరుపక్షాల్లో ఎవరికీ గాయాలు కాలేదు. వీరు గోదావరి నది దాటి చత్తీస్‌గఢ్‌కు వెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్లా, ఎర్రం, శీలంల... యాదిలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొయ్యూర్ ఎన్‌కౌంటర్‌కు బుధవారంతో 21 ఏళ్లు నిండుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్హర్ మండలం కొయ్యూర్ అటవీ ప్రాంతంలో 2 డిసెంబర్ 1999న జరిగిన ఎన్కౌంటర్లో అప్పటి పీపుల్స్‌వార్ కేంద్ర కమిటీ సభ్యులు నల్లా ఆదిరెడ్డి అలియాస్ శ్యాం, ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేష్, ఉత్తర తెలంగాణ కార్యదర్శి శీలం నరేష్ అలియాస్ మురళి నేలకొరిగారు. అప్పట్లో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో నక్సల్స్ ప్రాబల్యం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ముఖ్యనేతలు మరణించడం ఉద్యమానికి పెద్ద ఎదురుదెబ్బగా పరిగణిస్తారు. ఈ ముగ్గురు నేతలు మరణించాక సరిగ్గా ఏడాదికి డిసెంబరు 2, 2000న పీఎల్జీఏను ఏర్పాటు చేశారు. వారికి నివాళిగా ఏటా డిసెంబర్ 2 నుంచి మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే మృతుల స్మారకంగా పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేట గ్రామంలో మావోయిస్ట్ నాయకులు 53 అడుగుల ఎత్తయిన స్థూపాన్ని నిర్మించారు. దీన్ని 2005 నవంబర్ 13న కుటుంబసభ్యులు, బంధుమిత్రులు ఆవిష్కరించారు. -
వైరస్‌పై యుద్ధానికి మళ్లీ సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి కట్టడిలో తనవంతు పాత్ర పోషించేందుకు రాష్ట్ర పోలీస్ విభాగం మరోసారి సన్నద్ధమవుతోంది. వైరస్ విజృంభించిన కొత్తలో, ప్రత్యేకించి లాక్డౌన్ కాలంలో పోలీసులు అనుసరించిన వ్యూహాలు, ప్రజలకు అందించిన సేవలపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శీతాకాలంలో వైరస్ మరింత విజృంభించే అవకాశాలున్నాయనే అంచనాల నేపథ్యంలో ప్రజలకు చేదోడుగా ఉండే అంశంపై పోలీస్ విభాగం కసరత్తు చేస్తోంది. లాక్డౌన్ సమయంలో అందించిన సేవల స్ఫూర్తితోనే ఇప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లాలని పోలీస్ బాస్ నిర్ణయించారని సమాచారం. ఈసారి వీలైనంత ఎక్కువగా సామాజిక మాధ్యమాలను, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను వినియోగించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. అందరిచేత ‘కోవిడ్ ప్రతిజ్ఞ’ వైరస్ ప్రబలిన తొలినాళ్లలో దాని నియంత్రణే ధ్యేయంగా పోలీసుశాఖ పనిచేసింది. ప్రజలు భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా, లాక్డౌన్ నిబంధనలు పాటించేలా కఠినంగా వ్యవహరించారు. అవసరమైతే జరిమానాలు విధించి, కేసులు పెట్టారు. వైరస్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై నిర్వహించిన ప్రచారాలు సైతం అప్పట్లో చాలామందిని ఆలోచింపచేశాయి. అటు తరువాత అన్‌లాక్ ప్రక్రియ మొదలైంది. ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా.. కాస్త నిర్లక్ష్యమూ చూపుతున్నారు. ముఖ్యంగా పండుగల సమయంలో చాలామటుకు భౌతికదూరం, మాస్కు ధరించడంపై దృష్టి సారించట్లేదు. అందుకే, ఈసారి కేసులు, జరిమానాలు కాకుండా.. మానసిక పరివర్తన కలిగిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఇప్పటికే పలు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో ఉద్యోగుల చేత కోవిడ్ ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. దీన్ని త్వరలోనే ప్రజలందరితోనూ చేయించే ఆలోచనలో ఉన్నారు. ఇందుకు వీలుగా సోషల్‌మీడియాను సమర్థంగా వాడాలని, జనసమూహాలు, ఉత్సవాల సమయంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకోవాలని డీజీపీ జిల్లా అధికారులకు సూచించారని సమాచారం. పోలీస్ విభాగానికి తీరని నష్టం లాక్డౌన్ సమయంలో కంటికి కనబడని శత్రువుతో పోరాడుతూ విధులు నిర్వహించడం పోలీసుశాఖకు కత్తి మీద సామే అయ్యింది. మహా నగరంలో ఆ సమయంలో విధులు నిర్వర్తించడం ఒకెత్తయితే, పల్లెల్లో మరింతగా మమేకమై సేవలందించారు. ప్రజలు వైరస్ బారినపడితే.. వారిని, వారి పక్కవారిని అప్రమత్తం చేయడంతో పాటు బాధితులను చికిత్సకు తరలించడం వంటి పనులు చేశారు. మావోయిస్టులు, ఉగ్రవాదులకు ముచ్చెమటలు పట్టించిన పోలీసులకు కరోనా వైరస్ అనేక సవాళ్లను విసిరింది. ఈ క్రమంలో 5,700 మందికిపైగా పోలీసులు వైరస్ బారినపడ్డారు. అంటే డిపార్ట్మెంట్లోని దాదాపు 54 వేలమందిలో ప్రతీ పదిమందిలో ఒకరు కరోనా బారినపడ్డారు. దాదాపు 50 మందికిపైగా పోలీసులు అమరులయ్యారు. కేవలం ఏడు నెలల్లో ఈ స్థాయిలో సిబ్బందిని కోల్పోవడం పోలీసుశాఖ చరిత్రలో ఇదే తొలిసారి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ప్రతీ నాలుగు రోజులకు ఒక పోలీస్ కోవిడ్ విధుల్లో అమరులయ్యారు. కరోనా బారినపడ్డ అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల్లో పోలీసులే పెద్దసంఖ్యలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైరస్‌పై మలిదశ సమరానికి పోలీసులు మళ్లీ సన్నద్ధమవుతున్నారు. -
కరోనాపై పోలీసు శాఖ వినూత్న కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్య, పారిశుద్ధ్య రంగ సిబ్బంది ఎంత కీలకపాత్ర పోషించారో పోలీసులూ అంతే స్థాయిలో సేవలందించారు. మరీ ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో రక్షక భటులు అందించిన సేవలు ప్రశంసనీయం. వైరస్ వ్యాప్తిని అదుపు చేయడంలో సమర్థంగా వ్యవహరించి, ఆదర్శంగా నిలిచారు. అయితే, లాక్డౌన్ క్రమక్రమంగా సడలిస్తుండడంతో సాధారణ జీవితం మళ్లీ యథాస్థితికి చేరుతోంది. ఇదే క్రమంలో వైరస్ వ్యాప్తీ పెరుగుతోంది. గ్రామాల్లోనూ పాజిటివ్ కేసులు ఎక్కువవుతున్నాయి. ఇదే సమయంలో వరుసగా పండుగలు రానునుండడం, సెకండ్ వేవ్ మొదలయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు హెచ్చరిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పోలీసు శాఖ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కోవిడ్ బారిన పడకుండా ప్రజలను మరింత అప్రమత్తం చేసేందుకు ప్రతిజ్ఞ–ప్రచారం కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రతీ పౌరుడు మరింత బాధ్యతగా వ్యవహరించేందుకు కేంద్రం ఆదేశాల మేరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్లలో వీటిని అమలు చేయాలని తెలంగాణ డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. (చదవండి: రెండోసారి కరోనా.. మరింత తీవ్రం) ఏం చేస్తారంటే.. ‘‘ప్రతీ మనిషికి ఆరడుగుల దూరం పాటిస్తాను. బహిరంగ ప్రదేశాల్లో తప్ప కుండా మాస్కు ధరిస్తాను. తరచూ చేతులను సబ్బు, శానిటైజర్లతో శుభ్రం చేసుకుంటాను’’అంటూ సాగే.. ఈ ప్రతిజ్ఞను అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలోనూ ప్రారంభించారు. బస్టాండులు, కూడళ్లు, ఇన్నిస్టిట్యూషన్, మహిళా సంఘాలు, ప్రైవేటు–ప్రభుత్వ ఆఫీసులు, తదితరాలను ఎంపిక చేసుకుని పోలీసులే స్వయంగా వెళ్లి వారితో తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ముఖ్యకూడళ్లు, ప్రజలకు బాగా కనిపించే ప్రాంతాల్లో భౌతికదూరం, మాస్కు వినియోగం, చేతుల పరిశుభ్రతపై చక్కటి హోర్డింగులు ఏర్పాటు చేస్తున్నారు. మాస్కులు, సామాజిక దూరం ఉల్లంఘనలపై ఎపిడమిక్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నా.. కొందరిలో మార్పు రావడంలేదు. అందుకే, ఈ వినూత్న ఆలోచన అమలుపరుస్తున్నారు. సెకండ్ వేవ్ చాలా డేంజర్.. దేశంలో కరోనా మొదటి దశ సామాజిక, ఆర్థిక వ్యవస్థల్ని దారుణంగా దెబ్బతీసింది. త్వరలో సెకండ్ వేవ్ మొదలవనుంది. వరుసగా కురుస్తోన్న వర్షాలు, శీతాకాలం రానుండడంతో కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదముంది. ఇటీవల కేరళలో ఓనమ్ పండుగ వల్ల లక్షలాది మంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం సెకండ్ వేవ్ తీవ్రత, దాని నివారణపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే బతుకమ్మ, దసరా, దీపావళి పండుగలకు ప్రజలు ఎంతమేరకు భౌతిక దూరం పాటిస్తారన్నది అనుమానమే. అందుకే, రానున్న ఉపద్రవంపై ప్రజలను చైతన్యం చేయడానికి తెలంగాణ డీజీపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతీ జిల్లాలో ఎంతమందితో ప్రతిజ్ఞ చేయించారు? ఎందరికి అవగాహన కల్పించారు? తదితర విషయాలను ఏరోజుకారోజు డీజీపీ కార్యాలయానికి చేరేలా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఇటీవల వినాయక చవితి, రంజాన్ లాంటి పర్వదినాల సమయంలో ఆంక్షలతో వ్యవహరించడం మంచి ఫలితాలనిచ్చింది. అందుకే, రాబోయే పండుగల్లోనూ కేసులు అదుపులో ఉండేలా ఈ విధానం ఎంచుకున్నారు. భారీ వర్షాలు.. పోలీసుల సెలవులు రద్దు.. రాష్ట్రంలో వరుసగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ డిపార్ట్మెంటులో సెలవులు రద్దు చేశారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. పోలీసులంతా 24 గంటలు డ్యూటీలోనే ఉండాలని డీజీపీ ఆదేశించారు. గ్రామాల్లో విపత్తు నిర్వహణ దళం(డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్) అందుబాటులో లేని కారణంగా.. వాగులు, వంకలు, రిజర్వాయర్లు, వంతెనలు, కాలువలు, చెరువు గట్ల పరిస్థితిపై నీటిపారుదల, పంచాయతీశాఖ ఉద్యోగులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు. అలాగే కరోనా నేపథ్యంలో ప్రతీ ఠాణా పరిధిలో గ్రామస్థాయి అధికారులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూపుల్లో నిరంతరం సమాచారమార్పిడి చేస్తున్నారు. డయల్ 100 కు వచ్చే కాల్స్ విషయంలోనూ అప్రమత్తంగా ఉంటున్నారు. వరద, రోడ్డు, కరెంటు, ఇళ్లు, పాతగోడలు కూలడం, తదితర ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. వెంటనే పోలీసులు స్పందించేలా ఎస్‌హెచ్‌వోలు చర్యలు తీసుకుంటున్నారు. -
నలుగురు అడిషనల్ ఎస్పీల బదిలీ
సాక్షి, హైదరాబాద్ : పోలీసుశాఖలో అడిషనల్ ఎస్పీలు (నాన్‌కేడర్)గా విధులు నిర్వర్తిస్తున్న పలువురు అధికారులు బదిలీ అయ్యారు. రా మగుండం అడిషనల్ డీసీపీ (ఆపరేషన్స్)గా ఉన్న పి.శోభన్‌కుమార్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న కె.సురేశ్‌కుమార్‌ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయమన్నారు. వరంగల్‌లో అడిషనల్ డీసీపీ (క్రైమ్స్ అండ్ ఆపరేషన్స్)గా వి.తిరుపతిని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ చేశారు. అక్కడున్న అట్ల రమణారెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ చేశారు. -
తెలంగాణలో పోలీస్ శాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో అప్రమత్తమైన సిబ్బంది కరోనా కట్టడికి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే డిస్ ఇన్ఫెక్షన్ టీమ్‌లను రంగంలోకి దింపారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని స్టేషన్లలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నారు. తొలి విడతలో అధికంగా కేసులున్న స్టేషన్లను డిస్ ఇన్ఫెక్షన్ టీమ్‌లు శుభ్రం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్టేషన్లను శుద్ధి చేయనున్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో పల్స్ ఆక్సీమిషన్స్ పరికరాలు ఏర్పాటు చేయనున్నారు. అనారోగ్యంగా ఉన్న వారికి యుద్ధ ప్రాతిపదికన కరోనా టెస్ట్‌లు నిర్వహించనున్నారు. అలాగే దీర్ఘకాలికంగా అనారోగ్యంతో ఉన్న వారికి సెలవుపై వెళ్లాలని పై అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో కరోనా నిబంధనలు అమల్లోకి రానున్నాయి. చదవండి: అక్టోబర్‌లో తారస్థాయికి.. మళ్లీ సంపూర్ణ లాక్డౌన్! -
‘టాప్‌బాస్’లకు తప్పని బదిలీలు..?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీ అనివార్యంగా మారింది. వివిధ కారణాల నేపథ్యంలో కొన్ని పోస్టులు సుదీర్ఘకాలంగా ఇన్‌చార్జ్‌ల నేతృత్వంలో కొనసాగుతుండగా మరి కొందరు అధికారులు పదోన్నతి పొంది బదిలీ కోసం ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఈ నెలాఖరుకు ఇంకొందరు రిటైర్ కానున్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో బోనాల పండుగను ఇళ్లల్లోనే జరుపుకోవాలని ప్రభుత్వం సూచించింది. సాధారణంగా ఏటా ఈ పండుగకు భారీ స్థాయిలో బందోబస్తు అవసరం కావడంతో ఆ ప్రభావం పోలీసు బదిలీలపై ఉండేది. ఈ ఏడాది అలా కాకపోవడంతో ట్రాన్స్‌ఫర్స్‌కు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జాబితాలకు తుదిమెరుగులు దిద్దుతున్న ఉన్నతాధికారులు ఈ నెలాఖరు లోగా ప్రభుత్వానికి నివేదించి ఉత్తర్వులు జారీ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. పదోన్నతి వచ్చి ఏడాది దాటినా... నగర పోలీసు చరిత్రలో గత ఏడాది ఓ అరుదైన ఘట్టం ఆవిష్క్రృతమైంది. రాష్ట్ర పోలీసు విభాగంలో పని చేస్తున్న 23 మంది ఐపీఎస్‌లకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ 23న ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో నగరంలోని మూడు కమిషనరేట్లలో పని చేస్తున్న వారు అప్పట్లో ఏడుగురు ఉండేవారు. అయితే అప్పట్లో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పదోన్నతులు ఇవ్వడంతో పాటే బదిలీలు సాధ్యం కాలేదు. ఫలితంగా ప్రతి అధికారినీ వారు పని చేస్తున్న స్థానంలోనే పదోన్నతి పొందిన హోదాతో కొనసాగేలా ఆదేశాలు ఇచ్చింది. కేవలం రాచకొండ జాయింట్ సీపీగా పని చేస్తున్న జి.సుధీర్‌బాబును మాత్రం అదే కమిషనరేట్‌కు అదనపు సీపీగా నియమించారు. మిగిలిన వారంతా పై హోదాలో కింది పోస్టుల్లో కింది పోస్టుల్లో కొనసాగాల్సి వచ్చింది. ఇలా, ఈ స్థాయిలో అధికారులు గతంలో ఎన్నడూ పని చేయకపోవడంతో ఈ అరుదైన అంశం చోటు చేసుకుంది. సుదీర్ఘకాలంగా ఎదురు చూపులు... పోలీసు కమిషనరేట్‌కు నేతృత్వం వహించే కమిషనర్ నుంచి పోలీసు స్టేషన్‌కు ఇన్చార్జ్గా ఉండే స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) వరకు నిర్ధిçష్ట హోదాలు ఉంటాయి. ఆ హోదా దాటి పదోన్నతి వచ్చినప్పుడు వారిని బదిలీ చేయడం అనివార్యం. అదనపు డీజీ ర్యాంకు అధికారి పోలీసు కమిషనర్‌గా ఉంటారు. సిటీ పోలీసు విభాగానికి ఆయనే బాస్ కాబట్టి అదనపు కమిషనర్లు అంతా ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు (ఐజీ) ర్యాంకు వాళ్ళే ఉంటారు. గత ఏడాది ఐపీఎస్‌ల పదోన్నతి నేపథ్యంలో సిటీ కమిషనరేట్‌లో డీసీపీ నుంచి అదనపు సీపీ వరకు వివిధ హోదాల్లో ఉన్న ఆరుగురు అధికారులు ఎన్నికల కోడ్ నేపథ్యంలో బదిలీలు లేకుండా పాత స్థానాల్లోనే కొనసాగాల్సి వచ్చింది. ఈ హోదాల్లో ఇలా జరగడం అదే తొలిసారి. నగర అదనపు సీపీ (క్రైమ్స్ అండ్ సిట్)గా పని చేస్తున్న షికా గోయల్‌కు అదనపు డీజీగా పదోన్నతి వచ్చినా అక్కడే కొనసాగుతున్నారు. ఎస్పీ హోదాలో వెస్ట్‌జోన్ డీసీపీగా పని చేస్తున్న ఏఆర్ శ్రీనివాస్‌కు డీఐజీగా పదోన్నతి వచ్చింది. సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి, మధ్య మండల డీసీపీ పి.విశ్వప్రసాద్, తూర్పు మండల డీసీపీ ఎం.రమేష్ పాత పోస్టుల్లోనే కొనసాగనున్నారు. వీరితో పాటు మాదాపూర్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావుకు సీనియర్ ఎస్పీగా పదోన్నతి వచ్చింది. ఈ హోదాలో డీసీపీగానూ పని చేసే ఆస్కారం ఉండటంతో ఆ పోస్టులోనే కొనసాగుతూ ఇటీవలే డీఐజీగానూ పదోన్నతి పొందారు. నెలాఖరులో రిటైర్ అవుతున్న ఈయన మినహా మిగిలిన అధికారులు ఏడాదికి పైగా బదిలీలు కోసం ఎదురుచూస్తున్నారు. ‘టాప్‌బాస్’లకు తప్పని బదిలీలు..? భౌగోళికంగా ఒకటిగా ఉన్న రాజధానిలో పోలీసు పరంగా మూడు కమిషనరేట్లకు ఉన్నాయి. వీటిని ఐజీ, అదనపు డీజీ స్థాయి అధికారులు కమిషనర్లుగా వ్యవహరిస్తుంటారు. హైదరాబాద్‌కు అదనపు డీజీ స్థాయిలో అంజనీకుమర్, సైబరాబాద్, రాచకొండలకు ఐజీ హోదాల్లో వీసీ సజ్జనార్, మహేష్ మురళీధర్ భగవత్ నేతృత్వం వహిస్తున్నారు. సాధారణంగా ఈ పోస్టులను రెండేళ్లను టెన్యూర్ పీరియడ్‌గా పరిగణిస్తూ ఉంటారు. ఆ టైమ్ పూర్తయిన తర్వాత ఏ క్షణమైనా బదిలీలు తప్పవన్నది ప్రతి అధికారికీ తెలిసిన విషయమే. రాజధాని విషయానికి వస్తే హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్‌లు ఆ పోస్టుల్లోకి వచ్చి రెండేళ్లు దాటింది. రాచకొండ సీపీ మహేష్ భగవత్‌కు టెన్యూర్ పూర్తి కావడంతో పాటు ఆయనకు ఇటీవలే అదనపు డీజీగా పదోన్నతి వచ్చింది. దీంతో ఈ మూడు పోస్టుల్లోనూ మార్పు చేర్పులు తప్పవని వినిపిస్తోంది. మరోపక్క సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న దక్షిణ మండల డీసీపీ, నగర సంయుక్త సీపీ (పరిపాలన) ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న మాదాపూర్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు స్థాయిల్లోనూ కొత్త అధికారుల్ని నియమించాల్సి ఉంది. ఈ నెలాఖరు లోపు భారీ బదిలీలతో మూడు కమిషనరేట్లలోనూ కొత్త టీమ్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్‌లకు పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసు విభాగంలో ఇప్పటి వరకు కింది స్థాయి సిబ్బందినే చుట్టేస్తున్న కరోనా వైరస్ ఉన్నతాధికారులకూ వ్యాపిస్తోంది. ఇప్పటికే ఓ ఐపీఎస్ అధికారి వైరస్ బారినపడగా తాజాగా మరో ఇద్దరు ఐపీఎస్‌లకు పాజిటివ్ వచ్చింది. వీరు నగరం కేంద్రంగా పని చేస్తున్న వారే కావడం గమనార్హం. ఈ పరిణామంతో ఆయా అధికారుల వద్ద పని చేసిన, చేస్తున్న గన్మెన్లు, సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించారు. (ప్రపంచం పెను ప్రమాదంలో ఉంది) అలాగే మహిళా ఐపీఎస్ ఉన్నతాధికారి కూడా కరోనా బారినపడ్డారు. మరోవైపు డీజీపీ కార్యాలయంలో సైతం ఉద్యోగికి కరోనా సోకింది. తన వద్ద పనిచేసే సహాయకుడికి కూడా పాజిటివ్ రావడంతో అడిషనల్ డీజీ స్థాయి అధికారి ఒకరు హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇక ఒక్క బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే 20 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే సుల్తాన్‌బజార్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని హోమ్ ఐసోలేషన్‌కు తరలించారు. (ఒక్క రోజులోనే 14,516 కరోనా కేసులు) 19 రోజులు.. 3026 పాజిటివ్ కేసులు ఇటీవల రికార్డు స్థాయిలో నమోదవుతున్న కరోనా కేసులు గ్రేటర్ వాసుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇక్కడ..అక్కడ..వీరు..వారు అనే తేడా లేకుండా నగరంలోని అన్ని ప్రాంతాల్లోనూ కరోనా కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగి స్తుంది. గురువారం 302 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శుక్రవారం రికార్డు స్థాయిలో 329 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా గ్రేటర్లో ఈ నెలలో ఇప్పటి వరకు 3026 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 116 మంది మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఇప్పటికే ఓ ఉద్యోగికి పాజిటివ్ రాగా...తాజాగా జిల్లా అధికారికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. (విధుల విభజనతో కరోనాపై యుద్ధం) గాంధీ సెక్యూరిటీ సూపర్వైజర్ మృతి గాంధీ ఆస్పత్రి : కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సూపర్వైజర్ ఆస్పత్రి చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. జనగాం జిల్లా, బచ్చన్నపేటకు చెందిన బాలరాజు (55) మల్లాపూర్‌లో ఉంటూ ఎజిల్ సెక్యూరిటీ సంస్థ తరుపున గాంధీ ఆస్పత్రిలో సెక్యూరిటీ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురైన బాలరాజు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా కరోనా లక్షణాలు కనిపించడంతో గాంధీ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఈనెల 17న రాత్రి ఆస్పత్రిలో చేరిన అతను ఐసీయులో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. (మూడు నెలలుగా గాంధీలోనే తిండి.. ఠికానా..) -
ఇక్కడ డీఎస్పీలు.. అక్కడ ఇంకా సీఐలే..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసుశాఖలో డీఎస్పీల పదోన్నతుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది.1995 ఎస్సైల బ్యాచ్‌లో చేరిన వరంగల్ రేంజి వారంతా నిబంధనల ప్రకారం..ఇప్పటికి డీఎస్పీలుగా ఉండాలి. కానీ, వారు నేటికీ సీఐలుగానే కొనసాగుతున్నారు. మరోవైపు వారితోపాటే విధుల్లో చేరిన హైదరాబాద్ రేంజ్ పరిధి ఎస్సైలు మాత్రం ప్రస్తుతం డీఎస్పీలయ్యారు. పదోన్నతుల విషయంలో వరంగల్ రేంజ్ ఎస్సైలకు ఉమ్మడి రాష్ట్రం నుంచీ ఇదే సమస్య ఎదురవుతోంది.ఇక్కడ ఎంతకాలం పనిచేసినా తమ బ్యాచ్మేట్లకు సెల్యూట్లు కొట్టడం అలవాటుగా మారిపోతోందని పలువురు సీఐలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. కలిసొచ్చిన కొత్త కమిషనరేట్లు... హైదరాబాద్ రేంజ్లో 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ కమిషనరేట్ ఒక్కటే ఉండేది. తర్వాత సైబరాబాద్, రాచకొండ ఆవిర్భవించాయి. పోలీసుస్టేషన్లు, పోస్టులు పెరిగాయి. ఫలితంగా ఇక్కడ విధులు నిర్వహించే ఎస్సైలకు పదోన్నతుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా దక్కాయి. పైగా సీఐ, డీఎస్పీల పదోన్నతుల విషయంలో కానిస్టేబుల్ నుంచి వచ్చిన వారికి 30 శాతం, ఎస్సైగా చేరిన వారికి 70 శాతం వెయిటేజీ ఇస్తారు. హైదరాబాద్ రేంజ్లో ఇలాంటివి ఎక్కడా పాటించలేదు. వరంగల్ రేంజ్లో పోలీస్స్టేషన్ల విస్తరణ అంతగా లేదు. దీంతో కొత్త పోస్టులకు అవకాశం లేకుండాపోయింది. పైగా ఇక్కడ ఉన్నతాధికారులు పదోన్నతుల విషయంలో కానిస్టేబుల్, ఎస్సై వెయిటేజీని పక్కాగా అమలుచేస్తున్నారు. ఫలితంగా పదోన్నతుల విషయంలో వీరికి ప్రతీసారి మొండిచేయే ఎదురవుతోంది. పాతికేళ్లయినా సీఐలుగానే.. 1995 ఎస్సై బ్యాచ్‌ల వారు 2016 నుంచి 2019లో దశలవారీగా పదోన్నతులు పొంది డీఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 360 మందికిపైగా ఉండగా, హైదరాబాద్‌లో ఉన్న దాదాపు 310మందికి పైగా సీఐలు డీఎస్పీలు అయ్యారు. కానీ, వరంగల్ రేంజ్లో ఉన్న 54 మందికి మాత్రం నేటికీ పదోన్నతి దక్కలేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు. 1991 ఎస్సైల బ్యాచ్‌కు చెందిన వారికి వరంగల్ రేంజిలోనూ ఇలాగే జరిగితే సీఎం కేసీఆర్ స్వయంగా చొరవ తీసుకుని అప్పటికప్పుడు 145 సూపర్‌న్యూమర్ పోస్టులు సృష్టించి వారికి డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించారు. అంతేకాదు, 1996 ఎస్సై బ్యాచ్‌కు చెంది హైదరాబాద్ రేంజ్లో ఉన్న 64 మందికి డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనితో 1995 ఎస్సై బ్యాచ్‌ల బ్యాచ్‌కు చెందిన వరంగల్ రేంజ్ సీఐలంతా సీఎంను కలసి మొరపెట్టుకున్నారు. సీఎం సూచన ల మేరకు డీజీపీ ఆఫీసు వీరికి పదోన్నతులు కల్పించే ఫైల్‌ను తయారు చేసి ఫిబ్రవరిలో సీఎంవోకు పంపింది. కరోనా కారణంగా దానికి గ్రహణం పట్టుకుంది. 25 ఏళ్లలో ఒకే ఒక్క పదోన్న తి పొందిన తాము మానసిక వేదనతో ఉన్నామని పలువురు సీఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకంటే జూనియర్లకు పదోన్నతులు సిద్ధమవుతుంటే.. తమకు మాత్రం రేపు మాపు అంటూ నిలుపుదల చేయడం సరికాదంటున్నారు. సీనియా రిటీలో తమ కంటే ముందున్న హైదరాబాద్ రేంజ్ బ్యాచ్మేట్లు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు పొందినా.. తాము సీఐలుగానే మిగిలిపోతామన్న ఆందోళన వేధిస్తోందని ఆవేదన చెందుతున్నారు. -
తెలంగాణ పోలీసు శాఖలో తొలి కరోనా మరణం
హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖలో తొలి కరోనా మరణం చోటుచేసుకుంది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న దయాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ కరోనాతో పోరాడుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. నల్గొండ జిల్లాకు చెందిన దయాకర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరు ప్రస్తుతం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. లాక్డౌన్ విధుల్లో భాగంగా పాతబస్తీలోని ఓ చెక్‌పోస్ట్ వద్ద ఆయన విధులు నిర్వర్తించారు. అయితే ఆదివారం దయాకర్‌కు తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండటంతో అతన్ని బేగంపేటలోని నేచర్ క్యూర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతని శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపగా.. సోమవారం కరోనా సోకినట్టుగా నిర్దారణ అయింది. దీంతో దయాకర్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కరోనాతో పోరాడుతూ.. బుధవారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో అతను మృతిచెందారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ పోలీసు అధికారి ధ్రువీకరించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దయాకర్ కుటుంబ సభ్యులతోపాటు.. అతనితో కలిసి పనిచేసిన 16 మంది పోలీసుల శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. అందులో నలుగురిని హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా సూచించినట్టుగా సమాచారం. దయాకర్ కుటుంబానికి అండగా ఉంటాం : డీజీపీ దయాకర్ మృతిపట్ల తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ పోలీసులు దయాకర్ కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. -
నలుగురు ఐజీలకు పదోన్నతి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఐజీలుగా సేవలందిస్తోన్న నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు పదోన్నతి దక్కనుంది. వాస్తవానికి 1995 బ్యాచ్‌కు చెందిన విమెన్‌సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతిలక్రా, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్‌లకు ఫిబ్రవరిలోనే ప్రమోషన్లకు ప్రతిపాదనలు సిద్ధమయ్యారు. అదేసమయంలో తెలంగాణ ప్రభుత్వం 13 మంది ఐపీఎస్ అధికారులకు డీఐజీలు, ఐజీలుగా పదోన్నతి కల్పించింది. కానీ, సాంకేతిక కారణాలు, కరోనా కేసులు, లాక్డౌన్ కారణంగా నలుగురు ఐజీ ర్యాంకు అధికారులకు పదోన్నతి కల్పించే ఫైలుకు గ్రహణం పట్టుకుంది. అప్పటి నుంచి వీరి ఫైల్ పెండింగ్‌లోనే ఉండిపోయింది. తాజాగా ఈ ఫైల్లో కదలిక వచ్చిందని సమాచారం. త్వరలోనే వీరి పదోన్నతులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపనుందని తెలుస్తోంది. ప్రమోషన్లు దక్కినా.. పాత కుర్చీలోనే విధులు గతేడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం 23 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పించింది. వీరిలో సీనియర్ ఎస్పీ, డీఐజీ, ఐజీ, ఏడీజీ వరకు ర్యాంకులు ఉన్నాయి. ఈ పదోన్నతి కల్పించి దాదాపు 14 నెలలు కావస్తోంది. అయినా, వీరికి కొత్త పోస్టింగుగానీ, బదిలీగానీ కల్పించలేదు. అదే సమయంలో గతేడాది ఏప్రిల్‌లో ఎస్పీ ర్యాంకు నుంచి సీనియర్ ఎస్పీలుగా పదోన్నతి పొందిన 2006 ఐపీఎస్ బ్యాచ్‌కుచెందిన కార్తికేయ, కె.రమేశ్‌నాయుడు, వి.సత్యనారాయణ, బి.సుమతి, ఎం.శ్రీనివాసులు, ఎ.వెంకటేశ్వర్లు డీఐజీలు అయ్యారు. పదినెలల కాలంలో రెండోసారి పదోన్నతి సాధించినా ప్రభుత్వం పోస్టింగ్, బదిలీపై ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. వీరితోపాటు 2002 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన డీఐజీ అధికారులు రాజేశ్‌కుమార్, వి.రవీందర్, శివశంకర్‌రెడ్డిలకు ఐజీలుగా పదోన్నతి కల్పించింది. అదేసమయంలో ఏడీజీలుగా ఉన్న 1987 బ్యాచ్‌కుచెందిన వీకే సింగ్, ఎం.గోపీకృష్ణ, సంతోష్‌మెహ్రా, జె.పూర్ణచంద్రరావులను డీజీ ర్యాంకు ఆఫీసర్లుగా పదోన్నతి కల్పించింది. వీరిలో సంతోష్‌మెహ్రా కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లారు. మిగిలిన వారు కూడా ఎవరిస్థానాల్లో వారే ఉన్నారు. ఈ విషయంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. రెండుప్రమోషన్లు వచ్చినా.. పాత కుర్చీల్లోనే విధులు నిర్వహించాల్సి రావడం ఏమిటని అంటున్నారు. -
మాస్కులు లేకుండా రోడ్డెక్కితే అంతే!
సాక్షి, హైదరాబాద్ : ఇకపై మాస్కులు లేకుండా రోడ్డెక్కితే చర్యలు తప్పవు. ఇందుకోసం తెలంగాణ పోలీస్ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. రోడ్డుపై మాస్కులు లేకుండా తిరిగేవారిని గుర్తించటానికి అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించనుంది. సీసీటీవీ నిఘాలో లివరేజింగ్ కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్ టెక్నిన్‌కు ప్రవేశపెట్టనుంది. తద్వారా మాస్కులు ధరించని వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోనుంది. త్వరలో హైదరాబాద్-రాచకొండ-సైబరాబాద్ కమిషనరేట్‌లో ఈ టెక్నాలజీని అమలు చేయనుంది. ఇలాంటి పద్దతిని పాటించటం ఇండియాలో ఇదే మొదటిసారి కావటం గమనార్హం. కాగా, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు లేకుండా తిరిగిన వారిపై రూ.1000 జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జరిమానా ఒక్కసారికి మాత్రమే పరిమితం కాదు. మాస్కులు లేకుండా తిరిగి పట్టుబడిన ప్రతీసారి రూ. 1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. చదవండి : మాస్క్ లేకుంటే జరిమానా రూ. 1,000 -
వేరే ప్రాంతాలకు వెళ్లేవారికి ఈ–పాస్‌లు
సాక్షి, హైదరాబాద్: పర్యాటకం, విద్య, ఉద్యోగం ఇతర కారణాల వల్ల తమ సొంత ప్రాంతానికి వెళ్లలేని వారికి తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఈ–పాస్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. తమ సొంత ఊరు, రాష్ట్రం వెళ్లాలనుకునేవారు https://tsp.koopid.ai/epass లింక్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఈ–పాస్ పొందవచ్చని తెలిపారు. ఒక కుటుంబానికి చెందిన వారికి రోజుకు ఒక పాస్ మాత్రమే జారీ చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ–పాస్ అవసరమైన వారు సంబంధిత పేరు, మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, ప్రాంతం, ఇతర వివరాలు పొందుపర్చాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆన్లైన్లో పొందుపర్చిన వివరాల ఆధారంగా అన్ని అంశాల్ని పరిశీలించిన తర్వాత ఆన్లైన్లోనే ఈ పాసులు జారీ చేస్తామని, వాటి సహాయంతో సొంత ప్రాంతాలకు వెళ్లొచ్చని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. (పోలీసులపై దాష్టీకాలా?) Dear Citizens Who Got Stranded in Telangana due to #LockDown & want to leave for their Homes in other States in India can Apply for E-PASS by submitting required information @ the given link.https://t.co/WCLZ5nScIl After due verification ur E-PASS will b sent to u,to move ahead. pic.twitter.com/yasu3Ck3YG — DGP TELANGANA POLICE (@TelanganaDGP) May 2, 2020 కోవిడ్ ’ఫ్రీ’ చేసి పంపండి రెవెన్యూ, పోలీస్, మెడికల్ అధికారులతో కూడిన బృందాలు స్క్రీనింగ్ చేయాలి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వ ఉత్తర్వులు లాక్డౌన్ కారణంగా ఉండిపోయి ఇప్పుడు తమ స్వస్థలాలకు వెళ్లాలనుకునే వారిని జాగ్రత్తగా వారి రాష్ట్రాలకు పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి అంతర్రాష్ట్ర సరిహద్దుకు 2, 3 కిలోమీటర్ల ముందే పరీక్షలు నిర్వహించాలి. రెవెన్యూ, పోలీస్, మెడికల్ అధికారులతో కూడిన బృందం వారందరికీ పరీక్షలు నిర్వహించి కరోనా లక్షణాలు ఉన్నాయో లేవో పరీక్షించాలి. లేవని నిర్ధారిస్తూ ప్రభుత్వం సూచించిన ఫార్మాట్లో సర్టిఫై చేయాలి. ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న వాహనాలకు కూడా నిర్దేశిత నమూనాలో పర్మిట్లు జారీ చేయాలి. వాహనం నంబర్‌తో పాటు ఎంతమంది ప్రయాణిస్తున్నారు.. ఎక్కడికి వెళ్తున్నారనే అంశాలను పర్మిట్‌లో పేర్కొనాలి. స్క్రీనింగ్ చేసే బృందాలు అవసరం మేరకు 24 గంటలు పనిచేసే విధంగా సిద్ధం చేసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం జరగకుండా ఉండేందుకు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పర్యవేక్షించాలని వెల్లడించారు. -
కరోనా కట్టడిలో పోలీస్ భేష్
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి రాష్ట్ర పోలీసులు చేపట్టిన చర్యలను ఢిల్లీ నుంచి వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ) ప్రశంసించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు శనివారం నగరానికి చేరుకున్న ఐఎంసీటీ బృందం ఆదివారం ఉదయం డీజీపీ కార్యాలయానికి వచ్చింది. ఈ బృందంలో జలశక్తి అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోకా, పబ్లిక్ హెల్త్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, జాతీయ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్.ఎస్. ఠాకూర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేది ఉన్నారు. వారికి డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు. కోవిడ్‌పై రాష్ట్ర పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. కరీంనగర్లో ఇండోనేíసియా నుంచి వచ్చిన తబ్లిగీ జమాతే సభ్యుల గుర్తింపు నుంచి సూర్యాపేటలో కేసుల వరకు అన్నింటిని ఎలా వెలుగులోకి తీసుకొచ్చారో తెలిపారు. అత్యవసర సేవలైన ఆరోగ్యం, గుండె, డయాలసిస్, గర్భిణులు, ఇతర అనారోగ్య సమస్యలకు ఎక్కడా ఆటంకం రాకుండా చూసుకున్నామని వివరించారు. మర్కజ్ కేసుల గుర్తింపు కోసం ఏం చేసిందీ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వివరించారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్, క్వారంటైన్‌కు తరలించిన విధానాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్, అత్యసవర సేవలకు ఇబ్బందులు రాకుండా రూపొందించిన వ్యూహాలపై రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ బృందానికి విశదీకరించారు. సీఎం కేసీఆర్ సూచనలతోనే పోలీసులకు ప్రజల నుంచి సహకారం లభిస్తోందని వివరించారు. రైతులతో మాటామంతీ డీజీపీతో సమావేశం తర్వాత కేంద్ర బృందం మెహిదీపట్నం రైతుబజార్‌ను సందర్శించింది. రైతులు, వ్యాపారులు, కోనుగోలుదారులతో మాట్లాడి ధరలపై ఆరా తీసింది. కొనుగోలు, విక్రయదారులు, రైతులు విధిగా మాస్క్‌లు ధరిస్తున్నారా? భౌతికదూరం పాటిస్తున్నారా? వంటివి పరిశీలించి, రైతుబజార్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసింది. నిత్యావసరాల విక్రయాలపై ఓ కిరాణాషాపు యజమానితో మాట్లాడింది. అనంతరం సనత్‌నగర్‌లోని నేచర్‌క్యూర్ ఆస్పత్రిలోని క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లింది. రోగులకు సేవలందిస్తున్న స్టాఫ్ నర్సులతో మాట్లాడి.. ఇప్పటి వరకు ఇక్కడ ఎంతమందిని క్వారంటైన్ చేశారు? ఎలాంటి సదుపాయాలు కల్పించారు? ఎలాంటి సేవలందించారు? వంటివి ఆరాతీసింది. సేకరించిన శాంపిల్స్, పరీక్షలు, వాటి ఫలితాల రికార్డులను పరిశీలించింది. శాంపిల్ టెస్టింగ్ ల్యాబ్‌ను కూడా సందర్శించింది. క్వారంటైన్ సెంటర్లోని ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తంచేసింది. అక్కడి నుంచి మలక్‌పేట కంటైన్మెంట్ జోన్‌కు వెళ్లిన కేంద్ర బృందం.. రెడ్‌జోన్ పరిధిలో ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు ఏర్పాటుచేసిన బారికేడ్లను పరిశీలించింది. మెట్టుగూడ కంటైన్మెంట్ జోన్‌లోనూ పర్యటించింది. వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఓ షెల్టర్‌జోన్‌కు వెళ్లి.. అక్కడి లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకుంది. -
గాంధీలో డ్యూటీ.. కానిస్టేబుల్‌కు కరోనా!
సాక్షి, హైదరాబాద్: కరోనా పోరులో ముందుండే వైద్యులు, పోలీసులు వైరస్ బారినపడటం కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే పలువురు వైద్యులు, పోలీస్ సిబ్బంది కరోనా బారినపడగా.. తాజాగా హైదరాబాద్‌లో ఇద్దరు పోలీస్ సిబ్బందికి వైరస్ సోకింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వ్యక్తికి శనివారం కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తనిఖీల్లో భాగంగానే సదరు కానిస్టేబుల్ వైరస్ బారినపడినట్టు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. (చదవండి: గ్రేటర్ టెన్షన్..!) ఇక తుర్కయాంజల్ మున్సిపాలిటీ మునగనూరు కానిస్టేబుల్‌కు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అతను రెండు రోజుల క్రితం గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వహించినట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కానిస్టేబుల్ కుటుంబసభ్యులను పరీక్షల నిమిత్తం అధికారులు కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. ఇక దేశవ్యాప్తంగా రోజురోజుకూ బలం పుంజుకుంటున్న మహమ్మారి కోవిడ్-19 రాష్ట్రంలోనూ పంజా విసురుతోంది. తెలంగాణవ్యాప్తంగా ఇప్పటికే 766 కేసులు నమోదవగా.. 18 మంది మరణించారు. 186 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 562గా ఉంది. (చదవండి: చిట్యాలలో క్షుద్రపూజల కలకలం..) -
తరుముకొస్తున్న కరోనా!
సాక్షి, హైదరాబాద్: సామాజిక దూరం పాటించడం ఒక్కటే ప్రస్తుతానికి కరోనాను నియంత్రించే పద్ధతి గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా జ నం చెవికెక్కటం లేదు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు జోడించి అ ర్థించినా ప్రజల తీరు మారటం లేదు. లాక్‌డౌన్‌కు సంబంధించి కఠిన ఆంక్షలు విధించినా నిత్యావసర వస్తువుల కోసం ఉదయం నుంచి సాయంత్రం వర కు ప్రజలు రోడ్లపైకి వచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఈ వెసులుబాటును దుర్వినియోగం చేస్తూ ప్రజలు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతున్నా రు. మార్కెట్లు, మెడికల్స్ ఎదుట గుంపులుగా పోగ వుతూ సాధారణ రోజులను తలపిస్తున్నారు. ఇప్పు డు ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా పరిణ మించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెరుగుతున్న పాజిటివ్ కేసులు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉంది. సగటున దేశంలో రోజూ 100కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వచ్చే పక్షం రోజులు మనకు కీలక తరుణం. జాగ్రత్తగా ఉండాలంటూ స్వయంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. జాగ్రత్తపడాల్సిన అతివిలువైన సమయాన్ని దుర్వినియోగం చేసినందున తీవ్ర భయంకర పరిస్థితిని చవిచూస్తున్నామని, మీరైనా జాగ్రత్త పడండంటూ ఇటలీ, స్పెయిన్ దేశాలకు చెందిన పౌరులు మన దేశానికి సూచిస్తున్న వీడియోలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు ఉదయం ఆరుకు ముందు, సాయంత్రం ఆరు తర్వాత రోడ్లు ఖాళీగా మారి జనం ఇళ్లకే పరిమితమవుతున్నా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు జన సమూహాలు కనిపిస్తున్నందున లాక్‌డౌ న్ ఉద్దేశం నీరుగారుతోందని నిపుణులు అంటున్నా రు. ప్రస్తుతం రెండో దశలో ఉన్న కరోనా వ్యాప్తి, మూడో దశకు చేరుకుంటే చేతులెత్తేయటం తప్ప చేసేదేమీ ఉండదని గట్టిగానే హెచ్చరిస్తున్నా చాలా మందిలో ఆ భయం ఎక్కడా కనిపించటం లేదు. అవగాహన ఎటు పోతోంది? ఉదయం నుంచి రాత్రి వరకు ఏ టీవీ న్యూస్ చానల్ పెట్టినా కరోనాకు సంబంధించిన వార్తలే ప్రసారమ వుతున్నాయి. ఎంటర్టైన్మెంట్ చానళ్లలో కూడా ప్రముఖుల సందేశాలు ప్రసారమవుతున్నాయి. వైరస్ వ్యాప్తి అత్యంత ఉధృతంగా ఉండి రోజుకు సగటున 600 మందికి పైగా చనిపోతున్న ఇటలీ, స్పెయిన్ దేశాలకు సంబంధించిన దృశ్యాలు ప్రసారమవుతున్నాయి. వీటన్నింటికి మించి వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల్లో భయం పుట్టించే తరహాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రజల్లో చైతన్యం రాకపోవటం గమ నార్హం. సాధారణంగా ఆంక్షలు విధించినప్పుడు భయంతో అమలు చేయటం కద్దు.. కానీ, కరోనాలాంటి భయంకర వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నా.. జాగ్రత్తలు పాటించకపోవటం విచిత్రం. పోలీసులున్నప్పుడు జాగ్రత్తగా.. ప్రజలను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు రోడ్లపైనే ఉంటున్నారు. వారున్న సమయంలో మాత్రం దుకాణాల ముందు సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు మొదలు చిన్నచిన్న కూరగాయల బండ్ల వరకు పోలీసులు కనీసం ఒక మీటర్ దూరం చొప్పున చాక్‌పీసులతో రోడ్లపై వృత్తాకారంలో గీతలు గీయించారు. వాటిల్లో ఒకరి తర్వాత ఒకరు నిలబడాలని ఆదేశించారు. పోలీసులున్న సమయంలో అలాగే ఉంటున్నారు. వారు అక్కడి నుంచి వెళ్లిపోగానే గుంపులుగా పోగవుతు న్నారు. కొన్ని దుకాణాల నిర్వాహకులు మాత్రం తగిన సూచనలు చేస్తుండటంతో వాటి ముందు పోలీసులు చెప్పినట్టుగా ఉంటున్నారు. మిగతావాటి ముందు యజమానులు పట్టించుకోకపోతుండటంతో షరామామూలుగానే ఉంటోంది. కూరగాయల మార్కెట్లలో దారుణం హైదరాబాద్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్లు, రైతు బజార్లలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వేల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ఎక్కడా ఆంక్షలు అమలు కావటం లేదు. ఒక్కో దుకాణం వద్ద పదుల సంఖ్యలో గుమికూడుతున్నారు. ప్రస్తు తం రాష్ట్రంలో ఎక్కడా కూరగాయలకు కొరత లేదు. అయినా జనం మార్కెట్లకు ఎగబడుతున్నారు. కఠిన ఆంక్షలు అవసరం కూరగాయల మార్కెట్ల వద్ద వలంటీర్లనో, పోలీసు లనో ఉండేలా చేస్తే తప్ప తీరు మారే సూచనలు కనిపించటం లేదు. ఎక్కడైనా జనం గుమికూడితే చర్యలు తీసుకుంటామనో, యజమానులపై కఠినం గా వ్యవహరిస్తామనో... హెచ్చరిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం అన్ని విభాగాల సిబ్బంది ఇళ్లకే పరిమిత మైనందున అటువంటి వారి సేవలను ఇందుకు వినియోగించాలని, వారికి ఆరోగ్యపరంగా ఇబ్బం ది లేకుండా డ్రెస్సులు, మాస్కులు, శానిటైజర్లు, గ్లౌస్లు ఇచ్చి, ప్రత్యేక గౌరవ వేతనం చెల్లిస్తూ వినియోగించుకోవాలన్న సూచనలు వస్తున్నాయి. -
కర్ఫ్యూ తెలిసి కూడా బయటకు ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ పిలుపు మేరకు తెలంగాణ ప్రజలంతా జనతా కర్ఫ్యూలో భాగస్వాములయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడంతో రహదారులన్నీ బోసిపోయాయి. అయితే, కొన్ని చోట్ల ఒకరిద్దరు రోడ్లపైకి రావడంతో పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కి పంపించేశారు. ఈనేపథ్యంలో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ సైబర్ టవర్స్ సిగ్నల్స్ వద్ద రోడ్లపైకి వస్తున్న వాహనదారులను ఆపి వివరాలు తెలుసుకున్నారు. కర్ఫ్యూ ఉందని తెలిసి కూడా బయటకు ఎందుకు వస్తున్నారని ఆరా తీశారు. వారిని తిరిగి వెనక్కి పంపేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ఇది కర్ఫ్యూ కాదు కేర్ ఫర్ యూ. ప్రజలందరూ ఈ మంచి పనిలో భాగస్వామ్యం కావాలి. అవసరం ఉంటే తప్పా ప్రజలు బయటకు రావద్దు. సైబరాబాద్ పరిధిలో 6 వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఈ రోజు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రోడ్లపైకి ఎవరు రావడం లేదు. విదేశాల నుంచి వచ్చిన వారిని పరీక్షలు చేస్తున్నాం. రేపు ఆరు గంటల వరకు ప్రజలు ఇదే రీతిలో సహకరించాలి’అని పేర్కొన్నారు. -
కరోనాపై పోలీస్ శాఖ అప్రమత్తం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి తెలంగాణ పోలీస్ శాఖ అప్రమత్తం అయ్యింది. అన్ని జిల్లాల కమిషనర్లు,ఎస్పీలతో గురువారం తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి భేటీ అయ్యారు. బుధవారం ఒక్కరోజే 8 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. రాష్ట్రంలో కలకలం సృష్టిస్తున్న కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. (కరోనా: ఒక్కరోజే 475 మంది మృతి) కరోనా వైరస్‌పై అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా స్థానిక పోలీసులు చర్యలు చేపట్టాలని.. సభలు, సమావేశాలు, వివాహాలకు పోలీసులు ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. నేడు సాయంత్రం ముఖ్యమంత్రి భేటీలో పోలీస్‌శాఖ తీసుకున్న నిర్ణయాలను చర్చించనున్నారు. విదేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. (‘హృదయ విదారకం.. కన్నీళ్లు ఆగడం లేదు’) -
ఆ చిన్నారుల మోములో చిరునవ్వు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను, బాలకార్మికులు, యాచకులు, వెట్టి చాకిరీలో మగ్గుతున్న పిల్లలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన ఆరవ విడత ‘ఆపరేషన్ స్మైల్’పూర్తయింది. మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో 3,600 మంది చిన్నారులను పోలీసులు రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించగా.. మిగిలిన వారిని రెస్క్యూ హోంలలో ఉంచారు. రక్షించిన వారిలో 1,292 మంది పిల్లలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. ఈసారి నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో మొదటిసారిగా చైల్డ్ ట్రాక్ పోర్టల్, ముఖాలు గుర్తించే ఫేషియల్ రికగ్నేషన్ యాప్, దర్పణ్లను ఉపయోగించడం కూడా సత్ఫలితాలనిచ్చింది. రాష్ట్రంలో ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మతపరమైన స్థలాలు, ట్రాఫిక్ కూడళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, టీస్టాళ్లు, దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ ఆరవ ఆపరేషన్ స్మైల్‌ను మహిళా రక్షణ విభాగం నిర్వహించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశు గృహాల్లో ఉన్న పిల్లల డేటాను డిజిటలైజ్ చేయడంతో తప్పిపోయిన, దొరికిన, రక్షించిన పిల్లల ఫొటోలను పోల్చిచూడడానికి సులభంగా మారింది. దర్పణ్ యాప్ ద్వారా కల్వకుర్తి పోలీస్ స్టేషన్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో తప్పిపోయిన ఇద్దరు పిల్లలను గుర్తించారు. -
పీజీలు చదివి కానిస్టేబుల్ కావడం మంచిదే
సాక్షి, హైదరాబాద్: పీజీ చదివిన వాళ్లు కానిస్టేబుల్‌గా రావడం వల్ల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఇప్పటివరకు విదేశీ పోలీసులను ఆదర్శంగా చూపించేవాళ్లం. కానీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పాతబస్తీలో కార్ హెడ్‌క్వార్టర్స్‌లో నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసు పోస్టుల భర్తీ తెలంగాణలో అధికం ఈ సమావేశంలో మహమూద్ అలీ మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖకు మరింత ప్రాధాన్యం ఇచ్చారన్నారు. పోలీస్ శాఖలో సంస్కరణలు తీసుకొచ్చి రాష్ట్ర పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు భరోసా కల్పిస్తున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అధికంగా పోలీస్ పోస్టులను భర్తీ చేస్తున్నామని మహమూద్ అలీ తెలిపారు. దేశంలోనే తెలంగాణ నంబర్ 1.. సీపీ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. ‘సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో శాంతిభద్రతలు పరిరక్షించడంలో పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. 100 డయల్, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, టెక్నాలజీ పోలీస్ సేవలు.. ఇలా అన్ని విధాలుగా తెలంగాణ దేశంలోనే నెంబర్1 స్థాయిలో ఉంది. ఇక కానిస్టేబుల్ అభ్యర్థులకు 9 నెలల్లో స్కిల్స్, లా అండ్ ఆర్డర్, టెక్నాలజీ, కోర్టు ప్రోసీజర్, క్రైమ్ ఎవిడెన్స్, ట్రాఫిక్, వీఐపీ సెక్యూరిటీ అన్ని విధాలుగా శిక్షణ అందిస్తాం. కానిస్టేబుల్ శిక్షణ తీసుకునే వారందరూ ఓ రోల్ మోడల్‌గా ఉండాలి. ప్రజలే పోలీసులు-పోలీసులే ప్రజలు.. ఈ సూత్రం అందరూ గుర్తుంచుకోవాలి. సరైన సమయంలో యువత పోలీస్ శాఖలో చేరుతున్నారు. ఉన్నత చదువు చదివిన వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగానికి రావడం సంతోషకరం. ప్రతిభకు తగ్గట్లుగా వారిని పోలీస్ శాఖలో ఉపయోగించుకుంటాం. ఇక దేశంలోనే హైదరాబాద్ ఉత్తమ నగరంగా పేరు సంపాదించింది. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. దీని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి’ అని అంజనీ కుమార్ పేర్కొన్నారు. -
మేడారానికి భారీ బందోబస్తు
సాక్షి, హైదరాబాద్: సమ్మక్క–సారలమ్మ జాతరకు తెలంగాణ పోలీసుశాఖ ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈ వనమహోత్సవం ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మొదలవనున్న నేపథ్యంలో భద్రతాపరంగా పలు ప్రణాళికలు రూపొందించింది. భద్రత, రవాణా, పార్కింగ్, వాహనాల మళ్లింపు, సీసీకెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్‌జామ్‌ల నివారణకు అవలంబించాల్సిన వ్యూహాలను ఇప్పటికే సిద్ధం చేసింది. వాహనాల రాకపోకలపై ప్రత్యేక దృష్టి ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి మేడారానికి వచ్చే వారంతా కాటారం రహదారిని రాకపోకలకు వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వరంగల్‌తోపాటు, హైదరాబాద్, దక్షిణ తెలంగాణ జిల్లాల నుంచి వచ్చేభక్తులంతా ములుగు మీదుగా పస్రా, అక్కడ నుంచి మేడారం చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో భూపాలపల్లి మీదుగా వరంగల్ వైపునకు రావాల్సి ఉంటుంది. ఈ రెండు మార్గాల్లోనూ వన్‌వే విధానం సాగుతుంది. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడినా క్లియర్ చేయడానికి ప్రత్యేక బైకులపై పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తారు. జాతర ముగిసేవరకు ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రైవేటు వాహనాలు, ఇసుక లారీలు, ట్రాక్టర్లను వేరేవైపు వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. వరంగల్ మీదుగా మేడారం చేరుకునే భక్తులు జాకారం –జంగాలపల్లి గ్రామాల మధ్య కొలువైన ఘట్టమ్మ తల్లి వద్ద ఆగుతారు. ఇక్కడ భక్తులు, వాహనాల రద్దీ నియంత్రణకు సైతం పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక మేడారం చేరుకున్న అన్ని వాహనాలకు ‘ఊరటం’వద్ద విశాల మైదానంలో వేలాది వాహనాల పార్కింగ్‌కు వీలుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి ములుగు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జాతర జరగనుంది. రక్షణ ఇలా: గతంలో ములుగు నుంచి మేడారం వరకు రహదారి వెంట 10 కి.మీ.లకు ఒక పోలీస్ చెక్‌పోస్టు పెట్టగా.. ఈసారి 4 కి.మీ.లకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల పోలీసుల సాయం తీసుకోనున్నారు. దాదాపు 380 సీసీ కెమెరాలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. సమ్మక్క–సారక్క గద్దెలను దర్శించుకునే మార్గాల సంఖ్యను నాలుగుకు పెంచాలని యోచిస్తున్నారు. మేడారం జాతరకు ప్రధానిని ఆహ్వానిస్తాం సమ్మక్క–సారలమ్మ జాతరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌షాలను ఆహా ్వనించనున్నట్టు బీజేపీ ఎంపీ గరికపాటి మోహన్‌రావు తెలిపారు. మంగళవారం ఇక్కడి పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. -
పాఠశాలల్లో ‘పబ్లిక్ సేఫ్టీ క్లబ్బులు’
సాక్షి, హైదరాబాద్: నేటి బాలలే రేపటి పౌరులు.. వారికి నేడు కల్పించే అవగాహన జీవితాంతం గుర్తుండిపోతుంది. అందుకే, అన్ని రకాల భద్రతపై వారికి అవగాహన వచ్చేలా వినూత్న కార్యక్రమానికి తెలంగాణ పోలీసులు శ్రీకారం చుట్టారు. అందుకే, పాఠశాల విద్యార్థులకు ‘భద్రత’పై అవగాహన కల్పించడం, ప్రతీ పాఠశాలలో విద్యార్థులతో కొన్ని క్లబ్బులు నిర్వహించడం, భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారిచేతే వివరింపజేయడం, వారి నుంచి వచ్చే వినూత్న సలహాలు, సూచనలు తీసుకోవడం.. ఇదీ తెలంగాణ పోలీసుల సరికొత్త కార్యాచరణ. చికిత్స కంటే నివారణ మేలు అన్న నినాదంతో తెలంగాణ పోలీసులు ఈ విధానానికి శ్రీకారం చుట్టారు. రోజుకోరకం కొత్త కేసులు వెలుగు చూస్తోన్న నేపథ్యంలో నేరాలు, భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ విధానం అమలుకు సంకల్పించారు. తమిళనాడు స్ఫూర్తిగా.. వాస్తవానికి ఇలాంటి విధానం అమలు ఇదే తొలిసారి కాదు. తమిళనాడు పోలీసులు దీన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ‘నేరాలు– భద్రత’పై వారు చేపట్టిన ప్రతీ అవగాహన కార్యక్రమం అక్కడ సత్ఫలితాలు ఇచ్చాయి. దీంతో తెలంగాణ పోలీసులు గతేడాదే దీనిపై అధ్యయనం చేశారు. అందులో పలు అంశాలకు డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. అనంతరం కొత్త సంవత్సరం నుంచి మన రాష్ట్రంలోనూ అమలు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులతో కూడిన గ్రూపులను ఏర్పాటు చేస్తారు. వీరికి రోడ్డుభద్రత (డ్రంకెన్ డ్రైవ్, హెల్మెట్ వినియోగం, సీటుబెల్టు), మహిళా భద్రత, మానవ అక్రమరవాణా, చిన్నారుల భద్రత, వేధింపులు, డయల్ 100, షీటీమ్స్, హాక్ ఐ అంశాలలో వీరికి తొలుత శిక్షణ ఇస్తారు. తరువాత వీరు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తారు. వీరి నుంచి వచ్చే సృజనాత్మక ఆలోచనలనూ పోలీసులు స్వీకరించి ఇతరప్రాంతాల్లోనూ అమలుచేస్తారు. ఆపద ఎదురైతే.. ఎలా వ్యవహరించాలి? ఎవరిని సంప్రదించాలి? పోలీసులకు ఎలా సమాచారం ఇవ్వాలి? అన్నది ఈ ప్రచారం ప్రధాన లక్ష్యం. ప్రతీ ఠాణాలోనూ విధుల విభజన.. ఈ అవగాహన కార్యాక్రమాలను విజయవంతంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి దాకా విధుల విభజన జరిగింది. రోడ్డుభద్రత, మహిళా భద్రత, మానవ అక్రమరవాణా, చిన్నారుల భద్రత, డయల్ 100, షీటీమ్స్, హాక్–ఐ అంశాలలో అవగాహన కార్యక్రమాలు ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరుగుతాయి. ప్రతీ పోలీస్స్టేషన్లోనూ సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ దాకా అందరికీ ఒక్కోఅంశాన్ని అప్పగించారు. వారు తమకు అప్పగించిన ప్రచార, అవగాహన కార్యక్రమాలను అమలు చేయాలి. వీటితోపాటు కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ‘ఈచ్‌వన్ –టీచ్‌వన్’కార్యక్రమం కూడా పోలీసులు స్వీకరించారు. వీరు స్థానిక యువత, స్వచ్ఛంద సంస్థ, మహిళాసంఘాల సాయంతో భద్రత, ఈచ్‌వన్–టీచ్‌వన్‌పై ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వీటి పురోగతిని ఠాణా పరిధిలో ఎప్పటికపుడు పోలీసు ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. -
దేశంలోనే ఉత్తమంగా తెలంగాణ పోలీస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీసు విభాగం ఉన్నత పోలీసు విభాగంగా రూపొందిందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో స్పెషల్ పోలీస్ బెటాలియన్ కొత్తగా ఏర్పాటు చేసిన 4 బ్యాండ్ బృందాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, దీనిలో భాగంగా పోలీసు శాఖ ఆధునీకరణకు, మెరుగైన శిక్షణకు అధిక నిధులు ఇచ్చారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో మతాలు, వర్గాల ప్రజలు తమ పండుగలను కలిసికట్టుగా ప్రశాంతంగా నిర్వహించడం ద్వారా నగరం మొత్తం దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పౌరులకు, పోలీసులకు మధ్య సుహృద్భావ వాతావరణం, సత్సంబంధాలు నెలకొల్పడానికి సాంస్కృతిక వారధిగా పోలీసు బ్యాండ్ బృందాలు కీలక పాత్ర వహిస్తాయన్నారు. పోలీసు శాఖలో ఉన్న బ్యాండ్ బృందాల ద్వారా ప్రదర్శనలను ఏర్పాటు చేసి పౌరులకు వినోద కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమంలో హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా, బెటాలియన్ డీజీ అభిలాష బిస్త్, అడిషనల్ డీజీలు జితేందర్, శ్రీనివాస్‌రెడ్డి, సంతోష్ మెహ్రా, సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ హాజరయ్యారు. -
లైసెన్స్ రద్దు.. గోల!
సాక్షి, హైదరాబాద్: పెనాల్టీ పాయింట్ల విధానం అమలు, డ్రైవింగ్ లెసెన్స్ రద్దు విషయంలో పోలీసు, రవాణా శాఖలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ విషయంలో ఇటీవల సినీనటు డు రాజశేఖర్ డ్రైవింగ్ లైసెన్స్‌ను ఆర్టీఏ రద్దు చేసిన విషయం తెలిసిందే. బాగా తీవ్రమైన కేసుల్లో మినహా ఇతర సంద ర్భాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయాలన్న ఆలోచన ఇరు శాఖల్లో కొరవడిందన్న విమర్శలు వస్తున్నాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటివరకు రద్దు చేసిన డ్రైవింగ్ లైసెన్స్‌ల సంఖ్య చాలా స్వల్పంగా ఉండటమే ఇందుకు నిదర్శనం. తనిఖీలు అంతంతే... ఉభయ శాఖల నిర్లక్ష్యం, సమన్వయ లో పం ట్రాఫిక్ ఉల్లంఘన లకు పాల్పడేవారికి బా గా కలసివస్తోంది. ఎ లాంటి ఉల్లంఘనలకు పాల్పడ్డా.. చలాన్లు కట్టే సి ఎంచక్కా వెళ్లిపోతున్నారు. అదే డ్రైవింగ్ లైసెన్సు రద్దయితే.. కాస్తోకూస్తో క్రమశిక్షణ గా ఉండేవారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ వరకు వరుసగా అసెంబ్లీ, స్థానిక సంస్థలు, పార్లమెంటు ఎన్నికల నేప థ్యంలో అదనపు విధుల కారణం గా 12 పెనాల్టీ పాయింట్ల నమోదు ప్రక్రియను పోలీసులు పెద్దగా పట్టించుకో లేదు. కొంతకాలంగా సాధారణ వాహన తనిఖీలు కూడా సరిగా జర గడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెమ్మదించిన 12 పాయింట్ల విధానం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్, యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు తెలంగాణ ప్రభుత్వం 12 పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో సీటు బెల్టు పెట్టుకోకపోవడం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, మద్యం తాగి వాహనాలు నడపడం, సిగ్నల్ జంప్ తదితర ఉల్లంఘనలకు పాల్పడిన వ్యక్తి పట్టుబడితే అతడి డ్రైవింగ్ లైసెన్స్ నంబర్‌కు పెనాల్టీ పాయింట్లు జత చేస్తారు. ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా పెనాల్టీ పాయింట్లు నిర్ణయిస్తారు. వీటిని రవాణా శాఖ ఎం–వ్యాలెట్‌లోనూ పొందుపరుస్తారు. కానీ కొంతకాలంగా పోలీసులు కేవలం చలాన్లాకే పరిమితమవుతున్నారని, 12 పెనాల్టీ పాయింట్లకు సంబంధించి నమోదు సరిగా జరగడం లేదన్న విమర్శలు పెరిగిపోతున్నాయి. మరోవైపు పోలీసులు పంపిన సిఫారసులను ఆర్టీఏ కూడా అంతే తేలిగ్గా తీసుకుంటుందని పోలీసు శాఖ వారు ఆరోపిస్తున్నారు. -
నేరపరిశోధనలో నంబర్ వన్!
సాక్షి, హైదరాబాద్: నేర పరిశోధన దర్యాప్తులో ఆధునిక సాంకేతికతను వినియోగించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణ పోలీసు శాఖ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో పాత జిల్లాల ప్రకారం ఉన్న 10 ఫింగర్ ప్రింట్ యూనిట్లకు తోడు మరో 26 ఫింగర్ ప్రింట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు తగినన్ని నిధులు, సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవి పనిచేయడం ప్రారంభిస్తే.. ఆధారాల సేకరణ, నిందితుల గుర్తింపు, నేర దర్యాప్తులో ప్రపంచదేశాల సరసన చేరుతామని పోలీసు ఉన్నతాధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉండబోతోంది? నేరదర్యాప్తులో ఆధారాలు చాలా కీలకం. క్లూస్ టీంలు ఆలస్యంగా రావడం వల్ల చాలావరకు ఆధారాలు కోల్పోయే పరిస్థితి తలెత్తుతోంది. అదే నిమిషాల్లో చేరుకోగలిగితే కీలకమైన ఆధారాలు అప్పటికప్పుడు సేకరించగలుగుతారు. ఫలితంగా జరిగిన ఘటనలో నిందితుల పాత్రను శాస్త్రీయంగా, పకడ్బందీగా నిరూపించగలుగుతారు. అందుకే అదనంగా మరో 26 ఫింగర్‌ప్రింట్ యూనిట్లను ఏర్పాటు చేస్తూ హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో కమిషనరేట్ల పరంగా హైదరాబాద్‌లో ఇకపై 5, సైబరాబాద్‌లో 3, రాచకొండలో 3, వరంగల్‌లో 2, రామగుండంలో ఒకటి చొప్పున ఏర్పాటు కానున్నాయి. మొత్తం విభాగానికి ఐపీఎస్ (నాన్‌కేడర్) అధికారి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ఇంకా నలుగురు డీఎస్పీలు, 26 మంది ఇన్స్పెక్టర్లు, 57 మంది ఎస్సైలను త్వరలోనే ప్రభుత్వం నియమించనుంది. ఈ విషయంలో డీజీపీ కార్యాలయం కసరత్తు పూర్తి చేసింది. అన్ని కొత్త యూనిట్లకు కనీసం ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లతో కూడిన జాబితాను ఇప్పటికే రూపొందించింది. వీరంతా ఫోరెన్సిక్ సైన్స్, ఫింగర్‌ప్రింట్స్, శాంపిల్స్ సేకరణలో అనుభవమున్నవారు కావడం విశేషం. ఈ యూనిట్లకు కావాల్సిన సాంకేతిక పరికరాలు, వాహనాలను త్వరలోనే ఆయా కేంద్రాలకు పంపనున్నారు. త్వరలో ప్రపంచ దేశాల సరసన... వేలిముద్రల ఆధారంగా కేవలం 10 సెకండ్లలో పాతనేరగాళ్ల చిట్టా విప్పే అత్యాధునిక సాంకేతికత ‘పాపిలాన్’దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రత్యేకం. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ఈ పాపిలాన్ సాఫ్ట్‌వేర్‌తో పాత నేరస్తులను కేవలం 10 సెకండ్లలో గుర్తిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక డేటాబేస్ కూడా నిర్వహిస్తున్నారు. మొబైల్ గాడ్జెట్ల ద్వారా ఘటనా స్థలం నుంచే నిందితుడిని గుర్తించే విధానం దేశంలో ఒక్క తెలంగాణలోనే ఉంది. ఈ విషయంలో తెలంగాణ పోలీసులు ఇంగ్లండ్ కంటే ముందుండటం విశేషం. ఇంగ్లండ్‌లో పాత నేరస్తులను గుర్తించేందుకు కనీసం 60 సెకండ్లు పడుతుండటం గమనార్హం. కొత్త 26 యూనిట్లు కూడా పనిచేయడం ప్రారంభమైతే.. నేర దర్యాప్తు, నిందితుల గుర్తింపు, కేసుల పరిష్కారంలో వరల్డ్ టాప్–10లో నిలబడుతుందని పోలీసు శాఖ ధీమాగా ఉంది. -
‘మహిళా రక్షణలో పోలీసులు భేష్’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళల రక్షణకు పోలీసులు తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని మోల్డ్ టెక్ ప్యాకేజింగ్ సీఎండీ లక్ష్మణ్ ప్రశంసించారు. చిన్నారులు, మహిళలపై నమోదవుతున్న కేసుల్లో వేగంగా స్పందించేందుకు ఏర్పాటు చేసిన షీటీమ్స్, భరోసా కేంద్రాల పనితీరును ఆయన మెచ్చుకున్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రూ. 20 లక్షలను డీజీపీ మహేందర్‌రెడ్డి, విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతి లక్రాకు అందజేశారు. -
‘కానిస్టేబుల్ అని పిల్లనివ్వడం లేదు’
సాక్షి, హైదరాబాద్ : కానిస్టేబుల్ ఉద్యోగంతో జీవితం మారట్లేదనే ఆవేదనతో ఓ కానిస్టేబుల్ చేసిన రాజీనామాను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం ఆమోదించారు. చార్మినార్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిద్ధాంతి ప్రతాప్ సెప్టెంబర్‌లో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ పోలీస్ కమిషనర్‌కు రాసిన లేఖ రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పూర్వాపరాలు పరిశీలించిన కమిషనర్.. రాజీనామా ఆమోదిస్తూ ఉత్తర్వులు (డీవో నెం.9583/2019) జారీ చేశారు. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ప్రతాప్ 2014లో కానిస్టేబుల్‌గా చేరాడు. (చదవండి : కనీసం.. పిల్లనివ్వడం లేదు) కొన్నాళ్లుగా తన సీనియర్లను పరిశీలించగా.. పలువురు 35 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నా కానిస్టేబుల్‌గానే పదవీ విరమణ చేస్తున్న విషయాన్ని గుర్తించాడు. ఇంత సర్వీసు ఉన్న వారికి ఇతర విభాగాల్లో స్పెషల్ గ్రేడ్ ఇంక్రిమెంట్ లభిస్తోందని, సబ్ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారులకు పదోన్నతులతో పాటు వాహనం, పెట్రోల్ వంటి ఇతర సౌకర్యాలు ఉన్నా.. కానిస్టేబుళ్లకు అలాంటివేవీ లేవని ఆవేదన వ్యక్తం చేశాడు. కానిస్టేబుల్ అని తెలియడంతో పెళ్లి సంబంధాలు కుదరట్లేదని వాపోయారు. తన రాజీనామాపై పునరాలోచన చేస్తానంటూ ఓ దశలో ప్రతాప్ పేర్కొన్నా.. చివరకు రాజీనామాను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. -
కొత్త డీఎస్పీలకు జీతాల్లేవ్!
సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘకాలం ఎదురు చూశారు... ఎట్టకేలకు పదోన్నతి పొందారు... పక్షంలో పోస్టింగ్ అనుకున్నారు... రెండు నెలలుగా కనీసం జీతాలు కూడా లేకుండా పని చేస్తున్నారు... ఆగస్టులో ఇన్స్పెక్టర్ నుంచి పదోన్నతి పొందిన డీఎస్పీల పరిస్థితి ఇది. ఇప్పటి వరకు పోస్టింగ్స్ లేకపోవడంతో వీరికి జీతాలు చెల్లించడానికి సాంకేతిక అంశాలు అడ్డు వస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 68 మంది డీఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో కొత్తగా డీఎస్పీలు అయిన వాళ్ళు కేవలం 14 మంది మాత్రమే. మిగిలిన 39 మంది డీఎస్పీలు ఇంకా ఎదురు చూస్తున్నారు. పోలీసు విభాగంలో జీతాల చెల్లింపు అధికారి ఆధారంగా కాకుండా పోస్టు ఆధారంగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏ పోస్టు కేటాయించాలన్నా, సృష్టించాలన్నా దానికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి. ఓ అధికారి ఏ పోస్టులో పనిచేస్తుంటే దానికి సంబంధించిన జీతం ఆయనకు అందుతుంది. ఆగస్టు వరకు ఇన్స్పెక్టర్లుగా వివిధ పోలీసుస్టేషన్లు, ప్రత్యేక విభాగాల్లో పనిచేసిన 53 మందికి ఆ నెల 29న పదోన్నతులు వచ్చాయి. వీరిలో 1995తో పాటు 1996 బ్యాచ్‌కు చెందిన వారూ ఉన్నారు. అప్పటివరకు ఆయా ఠాణాలకు స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (ఎస్హెచ్ఓ), ప్రత్యేక విభాగాల్లోని పోస్టుల్లో పనిచేసిన వీరిని పరిపాలన పరమైన కారణాల నేపథ్యంలో ఎటాచ్మెంట్ పద్ధతితో అక్కడే విధులు నిర్వర్తించేలా ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 12న గణేష్ నిమజ్జనం పూర్తయ్యే వరకు ఇదే పరిస్థితి ఉండి, ఆ తర్వాత పోస్టింగ్స్ వస్తాయని అధికారులు భావించారు. అయితే ఆ తర్వాత వరుసగా దసరా, ఆర్టీసీ సమ్మె వంటివి రావడంతో వీళ్ళంతా ఎటాచ్మెంట్ మీదే కొనసాగుతున్నారు. దీంతో ఇన్స్పెక్టర్ పోస్టులో వీళ్ళు లేకపోవడం, డీఎస్పీగా పోస్టింగ్ రాకపోవడంతో జీతాలు చెల్లించడానికి సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో సెప్టెంబర్ నెల జీతాలు అందని వీరికి అక్టోబర్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇటీవల ఈ పదోన్నతి పొందిన అధికారుల స్థానాల్లో ఇన్స్పెక్టర్లుగా వేరే అధికారుల్ని నియమించారు. దీంతో ఆ పోస్టు కూడా పోయి కేవలం సూపర్ వైజింగ్ ఆఫీసర్లుగా మారిపోయారు. శుక్రవారం 68 మంది డీఎస్పీల బదిలీలు జరిగినా వీరిలో 14 మంది మాత్రమే పదోన్నతి పొందిన అధికారుల్లో ఉన్నారు. మిగిలిన వారంతా గతం నుంచి డీఎస్పీలుగా పనిచేస్తున్న వారే. దీంతో ఆగస్టులో పదోన్నతి పొందిన వారిలో ఇంకా 39 మందికి పోస్టింగ్స్ దక్కలేదు. ఇలా జీతాలకు దూరంగా ఉన్న అధికారులకు పోస్టింగ్ వచ్చిన తర్వాత అక్కడ చేరి పాత జీతం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టింగ్ వచ్చిన 14 మందికీ అక్టోబర్ నెలలో జీతం అందే అవకాశం లేదు. వీరికంటే ఆలస్యంగా ఇన్స్పెక్టర్లుగా పదోన్నతి పొందిన సబ్–ఇన్స్పెక్టర్లకు కొన్ని రోజుల్లోనే పోస్టింగ్స్ రావడంతో జీతం ఇబ్బంది తప్పింది. మరోపక్క దాదాపు ఆరు నెలల క్రితం పదోన్నతి పొందిన ఐపీఎస్ అధికారులు సైతం పోస్టింగ్స్ లేకుండా ఉన్నారు. ఫలితంగా అదనపు డీజీగా పదోన్నతి పొందిన వారు ఐజీ పోస్టులు, డీఐజీగా పదోన్నతి పొందిన వారు ఎస్పీ పోస్టుల్లో కొనసాగుతున్నారు. అయితే వీరికి జీతాల చెల్లింపులో ఇబ్బంది లేదని, తమకు మాత్రం జీతాలు కూడా అందట్లేదని కొత్త డీఎస్పీలు వాపోతున్నారు. చదవండి: 68 మంది డీఎస్పీలకు స్థాన చలనం -
మన పోలీసులకు మహా పని గంటలు
సాక్షి, అమరావతి: షిఫ్ట్‌లు.. 8 గంటల పని వేళతో సంబంధం లేకుండా శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడుతుంటారు పోలీసులు. దేశంలోని పలు రాష్ట్రాల పోలీసులు రోజుకు పది గంటల పైనే విధులు నిర్వర్తిస్తున్నారు. ఒక్క నాగాలాండ్‌లో మాత్రమే రోజుకు 8 గంటలు పనిచేస్తుంటే.. ఒడిశాలో ఏకంగా 18 గంటల పాటు విధుల్లోనే ఉంటున్నారు. ఒడిశా తరువాత 17 గంటలపాటు పనిచేస్తున్న పంజాబ్ పోలీసులు రెండో స్థానంలో ఉంటే.. రోజుకు 16 గంటల పనితో ఏపీ పోలీసులు మహా పనిమంతులుగా నిలుస్తున్నారు. తెలంగాణ, బీహార్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల పోలీసులు సైతం 16 గంటలపాటు విధుల్లో ఉంటున్నారు. మూడు రాష్ట్రాల పోలీసులు 14 గంటలు, రెండు రాష్ట్రాల్లో 13 గంటలు, మూడు రాష్ట్రాల్లో 12 గంటలు, రెండు రాష్ట్రాల్లో 11 గంటలపాటు పోలీసులు పని చేస్తున్నట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వీక్లీ ఆఫ్‌తో ఊరట తాను అధికారంలోకి వచ్చాక పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తానని పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ మాట నిలబెట్టుకోవడంతో ఏపీ పోలీసులకు ఊరట లభించింది. ఈ ఏడాది జూన్ నుంచి అమల్లోకి వచ్చిన వీక్లీ ఆఫ్ విధానం కానిస్టేబుల్ స్థాయినుంచి అధికారుల వరకు వర్తించేలా చర్యలు చేపట్టారు. దీంతో సరిపెట్టకుండా సీఎం ఆదేశాలతో పోలీసులకు ఆరోగ్య భద్రత, వారి కుటుంబాల సంక్షేమం వంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఏపీ పోలీసుల్లో ఆత్మస్థైర్యం నింపినట్టైంది. -
రవిశంకర్‌ను పట్టిస్తే రూ.లక్ష
కడప అర్బన్: నాలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న ఐతం రవిశంకర్ అలియాస్ రవి ఆచూకీ కోసం తెలంగాణా రాష్ట్ర పోలీసులు వైఎస్సార్ జిల్లాలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతన్ని పోలీసులకు పట్టిస్తే రూ.లక్ష బహుమతి ఇస్తామని ప్రకటించారు. తెలంగాణ పోలీసుల బృందం ఆదివారం కడపలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు గ్రామానికి చెందిన ఐతం రవిశేఖర్ అలియాస్ రవి (45) ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక, తమిళనాడు పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ఈ నాలుగు రాష్ట్రాల్లో అతనిపై 30 కేసులకు పైగా నమోదయ్యాయి. ఇతను వైజాగ్ కేంద్రకారాగారంలో శిక్షను అనుభవిస్తూ, ఈ ఏడాది మే 21న కోర్టుకు ఎస్కార్ట్‌తో వాయిదాకు వెళుతున్న సమయంలో కన్నుగప్పి పరారయ్యాడు. కర్ణాటకలో ఐ20 కారును దొంగిలించి, దానికి నకిలీ నంబర్ (ఏపీ 39 ఏక్యూ 1686) వేసుకుని ఫార్మసీ చదువుతున్న రంగారెడ్డి జిల్లా రంగన్నగూడకు చెందిన యువతి సోని(21)ని కిడ్నాప్ చేశాడు. అంతకు ముందు ఈనెల 23న ఉదయం సోని తల్లిదండ్రులు నడుపుతున్న హోటల్‌కు టీ తాగేందుకు వెళ్లి వారితో మాటలు కలిపాడు. సోనికి ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. ఆమె తండ్రితో కలిసి తన కారులో ఎక్కించుకుని మధ్యాహ్నం వరకు తిరిగారు. తరువాత ఆమె తండ్రిని కుమార్తెకు సంబంధించిన సర్టిఫికెట్లను జిరాక్స్ చేయించుకు రమ్మని పంపాడు. ఆయన తిరిగి వచ్చేసరికి కారు వెళ్లిపోయింది. అందులో తన కుమార్తెను తీసుకుని వెళ్లాడని, ఆమె కిడ్నాప్‌నకు గురైందని రాచకొండ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే సీపీ మహేష్ భగవత్ నిందితుడిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఓ బృందం టాస్క్‌ఫోర్స్ సీఐ రాజు ఆధ్వర్యంలో అదే రోజున కారు ఆచూకీని వెతుక్కుంటూ వైఎస్సార్ జిల్లాలోకి వచ్చారు. 24వ తేదీన కడపలో ప్రవేశించిన కారు ఉదయం ఒంటిమిట్ట హరిత హోటల్ వరకు వెళ్లిన పుటేజీలు కనిపించాయి. కడపలో ఓ సీసీ కెమెరా ఫుటేజీలో కారులో వెనుకసీటులో సోని ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆదివారం కడపలో విలేకరులతో మాట్లాడిన టాస్క్‌ఫోర్స్ సీఐ రాజు నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతిగా ప్రకటించామన్నారు. -
‘కేసీఆర్ వ్యాఖ్యలపై పోలీసులు ఏం చేస్తారు’
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది. ఇంటలిజెన్స్ సమాచారం’అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేయడం సమంజసం కాదని అన్నారు. గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న సదరు వ్యక్తి పాస్‌పోర్టును సీజ్ చేసి పోలీసులు వేధిస్తున్నారని మండిపడ్డారు. పొట్టకూటికోసం గల్ఫ్ బాటపట్టిన ఆ వ్యక్తి ఉపాధిని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో ఉన్నతాధికారుల ఒత్తిడి ఉందని చెప్తున్న స్థానిక పోలీసులు... మరి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా పరిగణిస్తారా అని ప్రశ్నించారు. ఇంటలిజెన్స్ రిపోర్టు ఉందని, టీఆర్ఎస్ పార్టీ 16 ఎంపీ సీట్లు గెలుస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారని అన్నారు. కేసీఆర్‌పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా అని ప్రశ్నించారు. చట్టం ముందు అందరూ సమానులేనని, అందర్నీ ఒకేలా చూడాలని హితవు పలికారు. ఇలాగే వ్యవహరిస్తే.. ఎన్నారైల వద్దకు టీఆర్ఎస్ వెళ్లకుండా చేస్తామని అన్నారు. పోలీసులు టీఆర్ఎస్కు కొమ్ముకాయడం మానుకోవాలని.. ఖాకీని కల్తీ చేయొద్దని అన్నారు. -
హీరా కుంభకోణంపై దర్యాప్తు ఇలాగేనా?
సాక్షి, హైదరాబాద్: చిన్న మొత్తాలకు భారీ పెద్ద మొత్తాలను తిరిగిస్తామని చెప్పి రూ.50 వేల కోట్ల మేరకు కాజేసిన హీరా గ్రూప్‌పై 2012లోనే కేసు నమోదైనా ఇప్పటివరకూ ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారని తెలంగాణ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది. అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే గతేడాది వరకూ ఆ కంపెనీ ఎండీ నౌహీరా షేక్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని అడిగింది. ఎఫ్ఐఆర్ నమోదైన ఏడేళ్లకు ఎండీని అరెస్ట్ చేసేంత జాప్యం ఎందుకు జరిగిందని, పోలీసుల దర్యాప్తు తీరు నత్తనడకగా ఉంటే సీబీఐ దర్యాప్తు ఒక్కటే మిగిలిన మార్గమని బాధితులు భావిస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. హీరా గ్రూప్‌పై నమోదైన ఎఫ్ఐఆర్ల దర్యాప్తుల ప్రగతిని సమగ్రంగా అందజేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 16కుపైగా బోగస్ కంపెనీలతో హీరా గ్రూప్ జనాన్ని మోసం చేసిందని హీరా గ్రూప్ బాధితుల సంఘం అధ్యక్షుడు సహబాజ్ అహ్మద్ ఖాన్ దాఖలు చేసిన పిల్‌ను సోమవారం హైకోర్టు మరోసారి విచారించింది. జనం నుంచి మోసపూరితంగా వసూలు చేసిన సొమ్ము రూ.50 వేల కోట్లని, అయితే ఆ కంపెనీలకు చెందిన 240 బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్ల పైచిలుకు మాత్రమే సొమ్ములున్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు. -
15 వేల పోలీసు కొలువులు
సాక్షి, హైదరాబాద్ : నిరుద్యోగులకు మరో శుభవార్త. త్వరలోనే పోలీసుశాఖలో మరో 15,000 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) కసరత్తు చేస్తోంది. త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు. ప్రస్తుతం గతేడాది జారీ చేసిన పోలీసు నియామకాల ప్రక్రియను టీఎస్ఎల్పీఆర్బీ వేగవంతం చేసింది. శారీరక, తుది రాత పరీక్షలు విజయవంతంగా ముగించిన అభ్యర్థులకు ప్రస్తుతం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కూడా పూర్తయింది. త్వరలోనే కటాఫ్ మార్కులు ప్రకటించి అభ్యర్థుల తుది ఎంపిక ప్రక్రియ చేపట్టే పనిలో తలమునకలైంది. ఈ ప్రక్రియ పూర్తయితే డిపార్ట్మెంట్లోకి కొత్తగా 18,500 మంది అధికారులు విధుల్లో చేరుతారు. వారిలో 17,156 కానిస్టేబుల్, 1,275 ఎస్సైలు ఉంటారు. కొత్త జిల్లాల ప్రాతిపదికనే.. గతేడాది మేలో విడుదలైన టీఎస్ఎల్పీఆర్బీ నోటిఫికేషన్ ప్రకారం పాత జిల్లాల ప్రాతిపదికగా ఖాళీల భర్తీ చేపడుతున్నారు. కానీ త్వరలో చేపట్టబోయే రిక్రూట్మెంట్లో మాత్రం 33 కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టుల నియామకం చేపట్టే ఆలోచనలో ఉన్నారు. ఆలోగా కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం 18,500 పోస్టులను భర్తీ చేశాక మరోసారి సివిల్, ఏఆర్, ఎస్పీఎఫ్ తదితర విభాగాల్లో కొత్త జిల్లాలవారీగా ఖాళీలను గుర్తిస్తారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే దాదాపు 15,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. వాటిలో దాదాపు 14,000 కానిస్టేబుళ్లు, సుమారు 1,000 ఎస్సై పోస్టులు భర్తీ చేయనున్నారని సమాచారం. వీక్లీ ఆఫ్ అమలుకు ఇక మార్గం సుగమం.. ప్రస్తుతం పోలీసుశాఖలో 32 వేల మంది సివిల్, 14 వేల మంది ఏఆర్, 8 వేల మంది వరకు టీఎస్ఎస్పీ కలిపి దాదాపు 54,000 మంది పోలీసులు ఉన్నారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్న పోలీసుశాఖ అనేక దశాబ్దాల తరువాత వీక్లీ ఆఫ్‌ను అమలు చేస్తోంది. త్వరలో డిపార్ట్మెంట్లో చేరబోయే 18,500 మంది చేరికతో పనిభారం కాస్త తగ్గనుంది. వారికి అదనంగా మరో 15 వేల మంది చేరితే డిపార్ట్మెంట్కు మరింత ఉపశమనం లభించనుంది. -
పోలీసులకు వీక్లీ ఆఫ్
సాక్షి, హైదరాబాద్: పోలీసులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారాంతపు సెలవు అమలుకు రాష్ట్ర పోలీసుశాఖ పూర్తిస్థాయిలో సిద్ధమైంది. ఈ మేరకు అన్ని జిల్లాలకు డీజీ కార్యాలయం నుంచి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. డ్యూటీ రోస్టర్ చార్ట్ ప్రకారం.. సిబ్బంది నిష్పత్తి ఆధారంగా వీక్లీ ఆఫ్‌లు ప్లాన్ చేయాలని డీజీ కార్యాలయం అన్ని జిల్లా ఎస్పీ, కమిషనర్ కార్యాలయాలను ఆదేశించింది. చాలా మంది ఎస్పీలు, కమిషనర్లు నేటి నుంచే అమలు చేయడానికి మొగ్గు చూపించడం గమనార్హం. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావం నుంచే ఈ డిమాండ్‌ను అమలు చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. కరీంనగర్‌లాంటి కొన్ని జిల్లాల్లో అమలు చేశారు. తరువాత అనివార్య కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. గతేడాది కూడా వీక్లీ ఆఫ్ ప్రస్తావన వచ్చినా.. అమలు చేసేలోగానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పడ్డాక కొత్త హోంమంత్రి మహమూద్ అలీ కూడా వీక్లీ ఆఫ్‌పై సానుకూలంగా స్పందించారు. కోడ్ కారణంగా కొండెక్కిన అమలు.. రాష్ట్రంలో సుదీర్ఘంగా నెలకొన్న ఎన్నికల కోడ్ కారణంగా వారాంతపు సెలవు అమలు కుదరలేదు. తరువాత సర్పంచి, స్థానిక సంస్థలు, పార్లమెంట్ ఎన్నికలతో వరుసగా రాష్ట్రంలో గత మే నెల వరకు ఎన్నికల కోడ్ ఉంది. దీంతో అమలు సాధ్యం కాలేదు. తాజాగా ఈ నెల నుంచి ఏపీ ప్రభుత్వం కూడా పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేయడంతో తిరిగి తెలంగాణలోనూ ఈ విషయంపై కదలిక వచ్చింది. దీంతో నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పోలీసు ఉన్నతాధికారులు వీక్లీ ఆఫ్ అమలు చేయడం ప్రారంభించారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖ డిమాండ్ పెరగడం, పోలీసు అధికారుల సంఘం కూడా డీజీపీ మహేందర్‌రెడ్డిని కలసి వారంతాపు సెలవుపై విన్నవించడంతో మార్గం సుగమమైంది. వేధిస్తున్న సిబ్బంది కొరత.. వాస్తవానికి రాష్ట్ర జనాభాకు ఉన్న పోలీసులు ఇప్పుడు ఏమాత్రం సరిపోరు. ఉద్యోగుల కొరత కారణంగానే ఇంతకాలం వీక్లీ ఆఫ్ అమలు సాధ్యపడలేదు. పోలీసు మాన్యువల్ 617 ప్రకారం వీక్లీ ఆఫ్ తీసుకోవచ్చు. కానీ, డిపార్ట్మెంట్లో ఉన్న సిబ్బంది కొరత కారణంగా ఇది ఇంతకాలం సాధ్యపడలేదు. మొత్తానికి పోలీసుల చిరకాల డిమాండ్ నెరవేరబోతున్నందుకు డిపార్ట్మెంట్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం.. రాష్ట్రంలో ప్రతీ 400 మందికి ఒక పోలీసు చొప్పున ఉండాలి. కానీ, సిబ్బంది కొరత కారణంగా ప్రతీ 800 మందికి ఒక పోలీసు చొప్పున ఉన్నారు. పోలీసుశాఖలో ఇప్పుడు 54 వేల మంది సిబ్బంది ఉన్నారు. త్వరలో రిక్రూట్‌కాబోతున్న 18,500 మంది పోలీసులు విధుల్లో చేరితే, వీక్లీ ఆఫ్ అమలు మరింత సులువు కానుంది. డీజీపీ, ప్రభుత్వానికి కృతజ్ఞతలు నిత్యం 24 గంటల డ్యూటీతో సతమతమయ్యే పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఈ విషయంలో డీజీపీకి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. పనిఒత్తిడి, విరామం లేని విధుల కారణంగా చాలామంది సిబ్బంది మధుమేహం, బీపీ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగులకు ఎంతో స్వాంతన చేకూరుస్తుంది. -గోపీరెడ్డి, పోలీసు అధికారుల సంఘం, రాష్ట్ర అధ్యక్షుడు -
కుర్చీలాట
సాక్షి ప్రతినిధి, వరంగల్ : పోలీసు శాఖలో కుర్చీలాట మొదలైంది. ఎస్బీ, వీఆర్, సీబీసీఐడీ, ఇంటలిజెన్స్, ట్రాన్స్‌కో, సీసీఎస్, సైబర్ క్రైం, కమ్యూనికేషన్స్ విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు లా అండ్ ఆర్డర్లో పోస్టింగ్ కోసం ఎవరికి వారు తమ వంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎన్నికల కోడ్ ముగిసినందున త్వరలోనే పెద్ద ఎత్తున బదిలీలు ఉంటాయన్న సమాచారం మేరకు ఆశావహులు తాము కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం ‘ఖర్చీప్’ వేసుకుంటున్నారు. ఈనెల 21వ తేదీ తర్వాత అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు ఉంటాయని.. ఎస్ఐ, ఎంపీడీఓ, తహసీల్దార్ మొదలు ఐఏఎస్, ఐపీఎస్‌ల వరకు బదిలీలు జరుగుతాయని ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు ఇచ్చింది. ఇందులో మిగతావన్నీ పక్కన పెడితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కోసం పలువురు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కోడ్ ముగిసింది... ఎన్నికల కోడ్ ముగియడమే తరువాయి అన్నట్లుగా పోస్టింగ్‌ల కోసం పలువురు ఇన్స్పెక్టర్లు ముమ్మర ప్రయత్నాలు చేస్తుండటం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 26 పోలీసు సర్కిళ్లు ఉంటే.. 11 సర్కిళ్లలో సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టింగ్ కోసం ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు సంబంధిత ఉన్నతాధికారులకు చేరినట్లు తెలిసింది. ఎన్నికల కోడ్‌లో భాగంగా ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లి... మళ్లీ ఈ జిల్లాలో పోస్టింగ్ ఆశిస్తున్న పలువురు సీఐలు ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల నుంచి ఇప్పటికే కమిషనరేట్‌కు చేరుకున్నారు. ఈనెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు గవర్నర్లు హాజరవుతున్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బందోబస్తులో ఉన్నతాధికారులు, సిబ్బంది నిమగ్నం కాగా.. 21వ తేదీ తర్వాత సీఐల బదిలీల ఉత్తర్వులు వెలువడనున్నాయి. పోటాపోటీ పోలీసు పోస్టింగ్‌లన్నీ పొలిటికల్ కావడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం లా అండ్ ఆర్డర్ స్థానాలకు వచ్చేందుకు పలువురు పోటీ పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 26 సర్కిళ్లకు గాను సుమారు 15 సర్కిల్ కార్యాలయాల్లో పోస్టింగ్ కోసం సీఐలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది రెండు నుంచి మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న సీఐలను కదిలించాలన్న లక్ష్యంతో ఆయా స్థానాలను ఎంచుకుంటున్నారు. కాగా ఇందులో పదింటికైతే పోస్టింగ్ కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు ఆశావహులు వెనుకాడటం లేదు. మట్టెవాడ, ఇంతెజార్గంజ్, హన్మకొండ, కాజీపేట, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, భూపాలపల్లి, వర్ధన్నపేట, హసన్‌పర్తి, ములుగు, తాడ్వాయి, తొర్రూరు, పాలకుర్తి, మహబూ బాబాద్ టౌన్ తదితర సర్కిళ్లలో పోస్టింగ్‌లు సాధిస్తే చాలు.. రొట్టె విరిగి నేతిలో పడ్డట్లేనన్న ప్రచారం ఉంది. అందుకే ఈ ఠాణాల్లో పోస్టింగ్ కోసం పెద్ద మొత్తంలో పైరవీలు, ఉన్నతా«ధికారులపై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుండటం చర్చనీయాంశం అవుతోంది. స్థానాలు ఎంపిక చేసుకున్న పలువురు? కోరుకున్న చోట కొలువు చేయాలనుకుని భావిస్తున్న కొందరు సీఐలు ఆ ఠాణాల్లో ఖర్చీఫ్(లేఖ)లు వేసుకుంటున్నారు. వరంగల్ కమిషనరేట్‌తో పాటు జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పలు పోలీసు స్టేషన్లకు మంచి గిరాకీ ఉంది. మట్టెవాడ, ఇంతెజార్గంజ్, హన్మకొండ, కాజీపేట, నర్సంపేట, స్టేషన్‌ఘన్‌పూర్, జనగాం, భూపాలపల్లి, వర్ధన్నపేట, హసన్‌పర్తి, ములుగు, తాడ్వాయి, తొర్రూరు, పాలకుర్తి, మహబూబాబాద్ టౌన్ తదితర సర్కిళ్లలో పోస్టింగ్‌ల కోసం సీఐల మధ్యన ‘కుర్చీలాట’ సాగుతోంది. ఎవరెవరు.. ఎక్కడెక్కడికి... హన్మకొండ సీఐ సంపత్‌రావు ఇక్కడకు వచ్చి మూడేళ్లు పూర్తి కావొస్తుండగా ఆయనకు పదోన్నతి వచ్చే అవకాశముంది. దీంతో ఆయన స్థానం చేజిక్కించుకునేందుకు కనీసం అర డజన్ మంది ప్రయత్నం చేస్తున్నారు. కమిషనరేట్‌లోని ఓ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, వర్ధన్నపేట డివిజన్లోని ఓ సీఐతో పాటు మరో ‘రాజు’ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇక మట్టెవాడకు జీవన్‌రెడ్డి ఎన్నికల కోడ్ బదిలీల్లో భాగంగా రాగా, తాజాగా జరగనున్న బదిలీల్లో ఈ స్థానాన్ని ఈస్ట్ జోన్ నర్సంపేట డివిజన్లో కీలక స్టేషన్‌కు చెందిన సీఐ పక్కా చేసుకున్నట్లు తెలిసింది. ఇంతెజార్గంజ్ స్థానం కోసం ఖమ్మంలో ఉన్న ఓ సీఐ ప్రయత్నం ఫలించినట్లేని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన ఐదు రోజుల క్రితమే ఖమ్మం నుంచి కమిషనరేట్‌కు వచ్చారు. ఖాళీగా ఉన్న కేయూసీ స్థానం కోసం వరంగల్ అర్భన్ స్పెషల్ బ్రాంచ్‌లో పని చేస్తున్న సీఐ పేరు వినిపిస్తోంది. సుబేదారి సీఐ సదయ్య సుమారు రెండేళ్లుగా పని చేస్తుండగా.. ఇక్కడికి వచ్చేందుకు సీసీఎస్‌లో పని చేస్తున్న ఓ సీఐ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కాజీపేటలో ప్రస్తుతం అజయ్‌కుమార్ ఉండగా, గతంలో సుబేదారిలో పని చేసి ప్రస్తుతం ఖమ్మంలో ఉన్న ఓ సీఐ ఈ స్థానంలోకి వచ్చేందుకు సిఫారసు లేఖ పొందినట్లు తెలిసింది. గతంలో కేయూసీ సీఐగా పని చేసి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మరో సీఐ పేరు కూడా వినిపిస్తుంది. ధర్మసాగర్ సీఐగా శ్రీలక్ష్మి రెండేళ్లుగా పని చేస్తుండగా ఈ స్థానానికి వచ్చేందుకు యత్నిస్తున్న వారిలో నర్సంపేట సబ్‌డివిజన్‌లోని ఓ సీఐతో పాటు కేయూసీకి ట్రై చేస్తున్న ఎస్బీ సీఐ పేరు కూడా వినిపిస్తోంది. హసన్‌పర్తిలో ప్రస్తుతం తిరుమల్ సీఐగా ఉండగా.. ఇక్కడ పోస్టింగ్ కోసం వరంగల్ ట్రాఫిక్‌లో సీఐగా పని చేస్తున్న ఒకరు ప్రజాప్రతినిధితో గ్రీన్‌సిగ్నల్ పొందినట్లు తెలిసింది. పది నెలల కిందట మామునూరు సీఐగా వచ్చిన కిషోర్ ఇటీవలే 15 రోజుల సెలవుపై వెళ్లి రాగా, జనగామ డివిజన్లోని ఓ సీఐ ఈ పోస్టింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇలా ఉమ్మడి జిల్లాలో పలు హాట్ స్టేషన్ల కోసం పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండటం పోలీసుశాఖలో చర్చనీయాంశమైంది. ఈ ‘ఠాణా’లు హాట్ గురూ రాష్త్ర వ్యాప్తంగా పోలీసు పోస్టింగ్‌లన్నీ కూడా ఎమ్మెల్యేల అనుమతి, సూచన మేరకు జరుగుతాయన్న ప్రచారం ఉంది. ఉమ్మడి వరంగల్‌లోనే ఇదే పరిస్థితి ఉంది. శాసనసభ ఎన్నికల ముందు ఎలక్షన్ కోడ్‌లో భాగంగా మూడేళ్ల సర్వీస్ దాటిన అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో బదిలీపై వివిధ ప్రాంతాలకు వెళ్లారు. అప్పటి నుంచి వారికి అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలతో పోస్టింగ్‌ల కోసం టచ్‌లో ఉన్నారు. గత నెల 23తో ఎన్నికల కోడ్ ముగియగా, ఈనెల 21 తర్వాత ఉమ్మడి వరంగల్‌లో భారీగా బదిలీలు జరిగే అవకాశం ఉంది. దీని కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇంటి ముందు కొందరు పోలీసు అధికారులు క్యూ కడుతున్నారు. దీంతో పాటు వారి ప్రధాన అనుచరులు, కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు అభిమానించే వ్యక్తులను సైతం ప్రసన్నం చేసుకుని సిఫారసు లేఖలు సంపాదించే పనిలో నిమగ్నమయ్యారు. -
‘85 శాతం మంది ఆచూకీ లభిస్తోంది’
సాక్షి, హైదరాబాద్ : ‘ఏమైపోతున్నారు’ పేరిట ఓ ప్రముఖ తెలుగు దినపత్రిక మంగళవారం ప్రచురించిన కథనంపై తెలంగాణ పోలీస్‌శాఖ స్పందించింది. అదృశ్యమైన వారి ఆచూకీ కోసం పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే వార్తలు సరికావని మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా అన్నారు. అన్ని కేసుల మాదిరగిగానే కిడ్నాప్ కేసులపై కూడా సత్వర దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనను డీజీపీ మహెందర్‌రెడ్డి ట్విటర్లో పోస్ట్ చేశారు. కిడ్నాప్ అవుతున్న వారిలో దాదాపు 85 శాతం మంది ఆచూకీ దొరుకుతోందని స్వాతిలక్రా వెల్లడించారు. ఆడా, మగా, చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారు అదృశ్యమవుతున్నారని చెప్పారు. పరీక్షా ఫలితాలు, ప్రేమ వ్యవహారాలు, వృద్ధులపట్ల పిల్లల నిరాదరణ వంటి కారణాలు కూడా ఉన్నాయని అన్నారు. ఫిర్యాదు అందగానే కేసు నమోదు చేసుకుని, బాధిత కుంటుంబ సభ్యుల సహకారంతో వారి ఆచూకీ కనుగొనేందుకు శ్రమిస్తున్నామని పేర్కొన్నారు. గస్తీ వాహనాలు, బ్లూకోల్ట్స్, దర్యాప్తు అధికారులకు కిడ్నాపైన వారి ఫొటోలు అందిస్తున్నామని తెలిపారు. అత్యాధునిక ఫేషియల్ రికగ్నైజేషన్ విధానాన్ని కూడా వినియోగిస్తున్నామని చెప్పారు. ప్రజలెవరూ ఆందోళనకు గురికావాల్సి న పనిలేదని, అదృశ్యమైన ప్రతి ఒక్కరి ఆచూకీ కనుగొనేందుకు పోలీసుశాఖ పనిచేస్తుందని ఆమె భరోసానిచ్చారు. -
రవిప్రకాశ్ కోసం గాలింపు ముమ్మరం!
సాక్షి, హైదరాబాద్: టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్‌కోసం తెలంగాణ పోలీసులు వేట ముమ్మరం చేశారు. ఫోర్జరీ, డేటా చౌర్యం కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న రవిప్రకాశ్ ఇంతవరకూ పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్ 66 (సీ) 66 (డీ),72లతోపాటు, 406, 420, 467, 469, 471, 120 బీ సెక్షన్ల కింద కేసులు నమోదు కాగా, ఇప్పటికే సైబరాబాద్ సైబర్ క్రైం విభాగం, బంజారాహిల్స్ పోలీసులు, మరోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు సీఆర్పీసీ సెక్షన్ల 160, సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు జారీ చేసినా రవిప్రకాశ్, మరో నిందితుడు, సినీనటుడు శివాజీ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. తనపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ రవిప్రకాశ్ రెండుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు భంగపాటే మిగిలింది. ఏపీ వదిలి వెళ్లాడా? తెలంగాణ నుంచి పరారైన రవిప్రకాశ్ ఏపీలోని అప్పటి అధికార పార్టీ నేతల వద్ద తలదాచుకున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో రవిప్రకాశ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మరోచోటుకు పారిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే, బెంగళూరు, విజయవాడలతోపాటు ముంబై, గుజరాత్‌లోనూ రవిప్రకాశ్ తలదాచుకునే అవకాశాలు ఉండటంతో రెండు టీంలు అక్కడా వెతికేందుకు వెళ్లినట్లు తెలుస్తోంది. రవిప్రకాశ్ తన ఆచూకీ చిక్కకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటిదాకా దాదాపు 30 వరకు సిమ్‌కార్డులు మార్చాడని సమాచారం. సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా మాత్రం సన్నిహితులతో మంతనాలు సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మిగిలిన నిందితులు పోలీసుల విచారణకు బాగానే సహకరిస్తున్నారు. -
నలుగుతున్న నాలుగోసింహం!
సూర్యాపేట : పోలీసు శాఖ ఓ వైపు అధునాతన టెక్నాలజీని వినియోగిస్తూ దూసుకెళ్తుంటే.. మరోవైపు కిందిస్థాయి సిబ్బంది మాత్రం ఇంకా నైరాశ్యంలోనే కొట్టుమిట్టాడుతోంది. వారంలో ఒక్కరోజైనా వీక్లీ ఆఫ్‌గా తీసుకునే అవకాశం లేక సతమతమవుతోంది. మద్యానికి బానిసై కుటుంబాలకు దూరం కావొద్దంటూ కిందిస్థాయి పోలీసు సిబ్బందికి సందేశాలు పంపిస్తున్న ఉన్నతాధికారులు.. వారికి వీక్లీ ఆఫ్ మంజూరు అంశంలో మాత్రం విఫలమవుతున్నారు. వీక్లీ ఆఫ్ హామీ పదేళ్లకు పైగా ముందుకు కదలకపోవడం గమనార్హం. ఇదేమిటంటే సిబ్బంది కొరత, శాంతిభద్రత విధుల కారణంగా వీక్లీ ఆఫ్ ఇవ్వలేని పరిస్థితి ఉందనే సమాధానం వస్తోంది. అయితే గత మూడు నాలుగేళ్లలో పోలీసు శాఖలో వేల సంఖ్యలో పోస్టులను భర్తీ చేసినా కూడా వీక్లీ ఆఫ్ ఎందుకు అమలు కావడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సిబ్బంది కొరత సాకుతో.. ఉమ్మడి జిల్లాలోని ఆయా పోలీస్‌స్టేన్లలో మూడు వేలకు పైగానే హోంగార్డు నుంచి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ పీసీ, హెచ్‌సీ, ఏఎస్ఐల వరకు పనిచేస్తున్నారు. అందులో మెజారిటీ శాతం సివిల్ విభాగంలో పనిచేసే వారే. వీరికి వీక్లీఫ్ ఇస్తామని పదేళ్లకు పైగా అధికారులు ప్రకటిస్తూ వస్తున్నారు. తీరా దానిపై కసరత్తు చేసే సమయానికి సిబ్బంది కొరత అని, సివిల్ విభాగం శాంతిభద్రతల పరిరక్షణలో కీలకం కాబట్టి అమలు చేయడం కష్టమని చెబుతూ దాటవేస్తున్నారు. దీంతో కిందిస్థాయి పోలీసు సిబ్బందిలో అసంతృప్తి పెరుగుతూనే ఉంది. కొత్తగా పెద్ద సంఖ్యలో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసినందున సిబ్బంది కొరత అనేది పెద్ద సమస్య కాదని.. దీనిని అధిగమించేందుకు ఉన్నతాధికారులు కసరత్తు చేయకపోవడమే ఆందోళనకరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు టెక్నాలజీ పెరిగిన కొద్ది పనిభారం తగ్గుతోందని, పోలీసు సేవలు త్వరితగతిన అందుతున్నాయని.. ఈ నేపథ్యంలో వీక్లీ ఆఫ్ అమలుకు ప్రయత్నించాలని డిమాండ్ చేస్తున్నారు. మూడు నెలలకే పర్చి్చమితం.. జిల్లాల పునర్విభజనకు ముందు అప్పట్లో ఎస్పీలుగా పనిచేస్తున్న విక్రమ్ జిత్ దుగ్గల్, ప్రభాకర్‌రావులు జిల్లాలో పనిచేస్తున్న పోలీసు సిబ్బందికి వీక్లీ ఆఫ్ అమలులోకి తీసుకొచ్చారు. అది కూడా వారు పనిచేసిన ఏళ్ల తరబడి సమయంలో కేవలం మూడు నెలలు మాత్రమే సిబ్బందికి వీక్ ఆఫ్ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా నుంచి జిల్లాలుగా ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు ఏ ఒక్క రోజు కూడా వీక్ ఆఫ్ అమలు అయిన దాఖలాలు లేవు. అనారోగ్యాల బారిన పడుతున్న సిబ్బంది వారాంతపు సెలవు ఇప్పటికీ నినాదంగానే మారింది. పండుగ పబ్బం లేకుండా అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలూ విధుల్లోనే ఉండాల్సిన పరిస్థితి. సిబ్బంది కొరతతో తీవ్రమైన పని ఒత్తిడి వలన పోలీసు సిబ్బంది రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు శారీరక వ్యాయామంపై నిర్లక్ష్యం, మద్యం, దూమపానం వంటి వ్యసనాలు కూడా కొందరికి అనారోగ్యం పాలవడానికి మరో కారణం. పోలీసు సిబ్బందిపై పని భారం పెరిగి ఒత్తిళ్లకు లోనవుతున్నారు. వీక్ ఆఫ్ అమలు చేయాలి జిల్లాలో పోలీసు సిబ్బందిపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు వరుసగా ఎన్నికల బందోబస్తుతో నిమిషం కూడా విశ్రాంతి తీసుకునే సమయం లేకుండా పోయింది. జిల్లాలో ఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కానీ సిబ్బందికి మాత్రం వీక్లీ ఆఫ్ అమలు కావడంలేదు. వీక్లీ ఆఫ్ అమలు అయ్యే విధంగా ఉన్నతాధికారులు దృష్టిసారించాలి. – గుగులోతు అమర్‌సింగ్, పోలీసు అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు, సూర్యాపేట అమలులోనే ఉంది క్షేత్రస్థాయి పోలీస్ ఇబ్బంది వీక్లీ ఆఫ్ అమలులోనే ఉంది. వరుస ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా కొన్ని నెలలుగా అమలు చేయడం లేదు. క్షేత్రస్థాయి పోలీసు సిబ్బంది నేరుగానైనా.. అసోసియేషన్ ద్వారా సంప్రదించినా వారి సమస్యలను సత్వరమే పరిషరిస్తా. సిబ్బంది ఒత్తిడికి లోనుకాకుండా విధులు నిర్వహించుకోవాలి.– ఏవీ రంగనాథ్, నల్లగొండ ఎస్పీ త్వరలో అమలు చేస్తాం క్షేత్ర స్థాయి పోలీసు సిబ్బంది ఒత్తిడిలో మగ్గుతున్న విషయం వాస్తవమే. వరుస ఎన్నికల నేపథ్యంలో వీక్ ఆఫ్ అమలు చేయడం లేదు. త్వరలోనే వీక్ ఆఫ్‌ను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు అన్ని ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీస్ సిబ్బంది ఎంతగానో కృషిచేసింది. వారి సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నా. – రావిరాల వెంకటేశ్వర్లు, ఎస్పీ, సూర్యాపేట -
రవిప్రకాశ్ మరోసారి...
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటున్న టీవీ 9 చానల్ మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తాజాగా మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన మూడు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు నేడు విచారించే అవకాశముంది. రవిప్రకాశ్‌పై సైబరాబాద్ సైబర్‌క్రైమ్‌లో రెండు, బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఒక కేసు నమోదైంది. మరోవైపు రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం రవిప్రకాశ్ జాడ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా తెలంగాణ పోలీసుల విచారణకు హాజరుకాకుండా కోర్టులో మాత్రం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. వీరిద్దరిని ప్రశ్నిస్తేనే కేసులు కొలిక్కి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. -
రవిప్రకాశ్ కోసం మూడు బృందాలు
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, డేటాచౌర్యంతోపాటు పలు కేసులు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపును తీవ్రతరం చేశారు. అతని ఆచూకీ కోసం ఇప్పటికే మూడు బృందాలు రంగంలోకి దిగినట్లు సమాచారం. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులతోపాటు టాస్క్‌ఫోర్స్ పోలీసుల బృందం రవిప్రకాశ్ జాడ కనిపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. రవిప్రకాశ్‌కు ఏపీలోని కొందరు రాజకీయ నాయకులు ఆశ్రయమిచ్చినట్లు సమాచారం. వారి వద్దే సినీనటుడు శొంఠినేని శివాజీ కూడా ఉన్నట్లు తెలిసింది. ప్రముఖుల అండతోనే శివాజీ తెలంగాణ పోలీసుల విచారణకు హాజరుకాకుండా కోర్టులో మాత్రం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేస్తూ వస్తున్నారు. ఇందుకోసం లాయర్లు, అనుచరులతో మాట్లాడేందుకు పదేపదే సిమ్‌కార్డులు మారుస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు వాట్సాప్ కాల్స్‌ను కూడా వాడుతున్నారని సమాచారం. పోలీసులు అతని కాల్స్‌పై నిఘా పెట్టారు. అయితే, ఆయన నిత్యం ఫోన్లు మారుస్తున్నట్లు గుర్తించారు. ఎవరి కేసు వారిదే..! రవిప్రకాశ్ కేసుల విషయంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. రెండు కేసుల్లో ఒకటి హైదరాబాద్, మరొకటి సైబరాబాద్‌లో నమోదయ్యాయి. శివాజీతో కలసి నకిలీ కొనుగోలు పత్రాల సృష్టి, నిధుల మళ్లింపు, కుట్ర, నకిలీపత్రాల సృష్టి, సంస్థ కార్యదర్శి సంతకం ఫోర్జరీ తదితర ఆరోపణలపై రవిప్రకాశ్‌పై ఐటీ యాక్ట్, 66, 72, ఐపీసీ 406, 420, 467, 469, 471 సెక్షన్ల కింద కేసులు సైబరాబాద్ పోలీసులు నమోదు చేశారు. టీవీ9 లోగో, కాపీరైట్స్, ట్రేడ్‌మార్కులు 2018 మే నెలలో మీడియా నెక్స్ట్ ఇండియా కంపెనీకి బదలాయించడంపై బంజారాహిల్స్ పోలీస్‌ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో ఐపీసీ 467, 420, 409, 406, 120 (బీ) సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండింటిలో నిందితుడు ఒకరే అయినా కేసుల నేపథ్యం వేర్వేరు కావడంతో ఎవరి దర్యాప్తును వారే కొనసాగించాల్సి వస్తోంది. గతంలో ఐటీ గ్రిడ్ వ్యవహారంలో మాదాపూర్, ఎస్సార్‌నగర్ ఠాణాలలో ఫిర్యాదులు అందాయి. నేరస్వభావం ఒకటే కావడంతో ఈ రెండు కేసులను కలిపి విచారించేందుకు పోలీసు విభాగం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ అవకాశం లేకుండాపోయింది. రవిప్రకాశ్ కోసం పోలీసులు టాస్క్‌ఫోర్స్‌ను కూడా రంగంలోకి దించినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఉద్యోగి ఎంకేవీఎన్ మూర్తి, మోజో టీవీ చైర్మన్ హరికిరణ్‌లు పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారు. రవిప్రకాశ్ విషయంలో పాత ఉద్యోగులను కూడా పోలీసులు పిలిపించి కూపీలాగుతున్నారు. అవకతవకల విషయంలో పలు వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. -
వేధిస్తే వేటాడుతారు..!
కరీంనగర్‌క్రైం: మహిళలు, యువతులు, విద్యార్థినులను వేధించే పోకిరీలను షీటీమ్స్ కట్టడి చేస్తున్నాయి. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి పక్కా ఆధారాలు సేకరించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నాయి. కరీంనగర్ కమిషనరేట్‌గా మారిన తర్వాత మహిళలపై వేధింపులకు చెక్ పెట్టేందుకు 2016 నవంబర్ 3న పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి షీటీమ్స్ ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లోని షీటీంలు ఈవ్‌టీజింగ్‌లను వీడియో రికార్డ్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ పద్ధతిని కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోనూ అమలు చేస్తున్నారు. ఈవ్‌టీజింగ్‌ను అడ్డుకుని వారిని పట్టుకునేందుకు షీటీం సభ్యులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. మొదట ఈవ్‌టీజింగ్ జరుగుతున్న ప్రాంతాలను గుర్తిస్తారు. అనంతరం షీటీం సభ్యులను రంగంలోకి దింపుతారు. ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడుతున్న వారిని వీడియో కెమెరాలో రికార్డ్ చేసిన తర్వాత రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. పోలీస్స్టేషన్లకు తరలించి వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వెంటపడి వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై మహిళల ఫిర్యాదుల ద్వారా వలపన్ని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతీ కేసును కూడా ఒక కేసు స్టడీగా ఎక్కడా ఆరోపణలకు తావులేకుండా ఆకతాయిలను అగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో దాదాపు ప్రతీ కాలేజీ, బస్టాప్, ఆర్టీసీ బస్టాండ్ల వద్ద షీ బృందాలు పని చేస్తున్నాయి. వీటికి కరీంనగర్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ పర్యవేక్షణలో మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ సంతోష్‌కుమార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ వారం కేసులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. వాట్సాప్‌కు పోలీస్ స్పందన.. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో వేములవాడకు వెళ్తున్న మహిళల పట్ల ముగ్గురు ఆటో డ్రైవర్లు వెంటపడి వేధింపులకు పాల్పడడమే కాకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించారు. దీంతో సదరు మహిళ వెంటనే ఆటోను ఫొటో తీసి సీపీ కమలాసన్‌రెడ్డి, షీటీం ఇన్చార్జి సంతోష్‌కుమార్‌లకు పంపించింది. రంగంలోకి దిగిన షీటీం ఇన్చార్జి బృందం ఆటోడ్రైవర్లను పట్టుకుని కటకటాల్లోకి పంపారు. వేధింపులు, ఈవ్‌టీజింగ్‌లపై మహిళలు నేరుగా ఫిర్యాదు చేయడానికి ఇబ్బందులు పడుతుంటే వాట్సాప్, హక్‌ఐ, ఫేస్బుక్ ద్వారా ఫిర్యాదు చేసినా షీటీంలు స్పందిస్తున్నాయి. షీటీం వాట్సప్ నంబర్ 9440795182. అందుబాటులో ఉన్నాయి. కాలేజీల్లో విద్యార్థినులు, ఉద్యోగినులు, మహిళలు వేధింపులకు గురైతే ఆయా నంబర్లకు కాల్ చేసి చేప్పడం లేదా మెయిల్ చేసినా షీటీం స్పందించి చర్యలు తీసుకుంటుంది. ఫిర్యాదుదారుల వివరాలు బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసకుంటున్నారు. అమాయకులు బలి కాకుండా పగడ్బందీగా వీడియో రికార్డ్ చేసి పక్కాగా ఈవ్టీజర్లనే పట్టుకుంటున్నారు. మొదటిసారి పట్టుబడితే కౌన్సెలింగ్, రెండోసారి పట్టుబడితే బైండోవర్, మూడో సారి పట్టుబడితే జైలుకు పంపిస్తున్నారు. అవగాహన సదస్సులు.. షీటీంలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి పనితీరుపై షీటీం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో కాలేజీల్లో, యువతులు, ఉద్యోగుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ కాలేజీల్లో 89 అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రతీ వారం ఏదో కాలేజీ, కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. షీటీంలు ఎలా పని చేస్తాయి, వేధింపుల సమయంలో ఎలా స్పందించాలో వివరిస్తున్నారు. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కాలేజీ యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నారు. పట్టుబడిన వారిలో.. షీటీంలు ఏర్పాటు చేసిన తర్వాత పట్టుబడిన వారిలో మైనర్లు, 50 ఏళ్ల దాటిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటున్నారు. మైనర్లకు కొందరు తల్లిదండ్రులు వేగవంతమైన బైకులు కొనివ్వడంతో వారు చదువులు మాని విద్యార్థినుల వెంటపడి వేధింపులకు దిగుతున్నారు. ఇంట్లో మృధుస్వభావిగా ఉంటూ బయటకు రాగానే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో షీటీం బృందాలు వారి ఆగడాలను వీడియో రికార్డ్ చేసి మరీ పట్టుకుంటున్నారు. – 2016 నవంబర్ 3న ప్రారంభించిన షీటీంలు ఇప్పటి వరకు 1,607 మందిని పట్టుకున్నాయి. వారిలో మైనర్లు 139 మంది, 19 నుంచి 24 ఏళ్లలోపు వారు 530 మంది, 25 నుంచి 35 ఏళ్ల లోపు వారు 377 మంది, 36 నుంచి 50 ఏళ్లలోపు వారు 470 మంది, 50 ఏళ్లు అపైన 91 మందిని పట్టుకున్నారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోకిరీలపై 18 కేసులు నమోదు చేశారు. వీరిలో మొదటి తప్పుగా బావించి 1469 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. 120 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. సుమారు 50 వేల పైగా విద్యార్థినులు, మహిళలకు హక్‌ఐ ఆప్లికేషన్ డౌన్లోడు చేయించారు. విద్యార్థినులకు ఎంతో భరోసా షీటీం ఏర్పాటు చేయడమనేది విద్యార్థినులకు ఎంతో భద్రత కలిగిస్తోంది. పోకిరీల వేధింపుల నుంచి రక్షణ పొందవచ్చు. విద్యార్థినులు వీటిపై మరింత అవగాహన పెంచుకోవాలి. వేధింపుల వల్ల నష్టపొతున్న విషయం కూడా ఈవ్‌టీజర్లకు తెలియాలి. స్వీయరక్షణ పద్ధతుల్లో కూడా విద్యార్థినులు, యువతులు శిక్షణ పొందాలి.– గాజుల దీప్తి, విద్యార్థిని అవగాహన కలిగి ఉండాలి.. షీటీం పని విధానంపై అవగాహన కలిగి ఉండాలి. మహిళలకు ముఖ్యంగా విద్యార్థినుల భద్రత కోసం షీటీంలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల వివరాలు బయటకు చెప్పకుండా ఈవ్‌టీజర్లపై చర్య తీసుకోవడం మంచి పరిణామం. గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులకు నిత్యం వేధింపులు తప్పడం లేదు. ఈవ్‌టీజింగ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.– డి మాలతి, బీటెక్ విద్యార్థిని మరింత బలోపేతం చేస్తాం.. సీపీ ఆదేశాల మేరకు షీటీంలను మరింత బలోపేతం చేస్తాం. ప్రస్తుతం 20 టీంలు పని చేస్తున్నాయి. త్వరలో మరిన్ని పెంచడంతోపాటు ఆధునిక గాడ్జెట్ అందిస్తాం. ఈవ్‌టీజర్లపై షీటీం సభ్యులకు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. ఎలాంటి అనుమానాలు, అపోహాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తూ ఈవ్‌టీజర్లను పట్టుకుంటున్నారు. విద్యార్థినులు, మహిళలు అవగాహన కలిగి ఉండాలి. ఈవ్‌టీజింగ్ చేసినా, వేధించినా వెంటనే 9440795182కు సమాచారం అందించండి.– సంతోష్‌కుమార్, ఇన్స్పెక్టర్, మహిళా పోలీస్‌స్టేషన్, షీటీం ఇన్చార్జి -
అంతా మా ఇష్టం!
‘వేములవాడ సర్కిల్ పరిధిలోని ఓ మండలంలో ఎస్సై మోడల్ గ్రంథాలయం నిర్మాణం కోసం చందాల పేరుతో రూ.లక్షలు వసూలు చేశాడు. అక్కడ గ్రంథాలయం ఏర్పాటైంది కానీ ఎస్సై వసూలు చేసిన డబ్బులతో కాదు... మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్‌రావు రూ.20 లక్షలు ఇవ్వడంతో..’ ‘మంథని సర్కిల్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు, అమరవీరుల స్తూపం నిర్మాణం కోసం ఇక్కడి పోలీస్ అధికారి వ్యాపారుల నుంచి రూ.లక్షలు వసూలు చేశాడు. సదరు అధికారి చేసిన ఘనకార్యాల గురించి అక్కడి వ్యాపారులు డీజీపీని కూడా ఆశ్రయించారు’ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు తమకున్న విశేష అధికారాలను ఉపయోగించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతోనో... లేక డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారితోనో మంచి సంబంధాలు కొనసాగించి ఆయా స్టేషన్లలో ఉన్నన్నాళ్లూ నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చనే ధోరణితో ఖాకీలు వ్యవహరిస్తున్నారు. రియల్టర్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో ఆర్థిక లావాదేవీలు నడుపుతూ చేతిలో అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకునే పనిలో ఉన్న ఖాకీలు కరీంనగర్ పాత జిల్లాలో అనేక మందే ఉన్నారు. ఈ నెల 4న మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో కాంట్రాక్టర్ ‘రవన్న’ బర్త్‌డే ఉత్సవాలు ఘనంగా జరపడం వెనుక కూడా ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి. గతంలో సుల్తానాబాద్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తించినప్పుడు కూడా పలు వివాదాలకు కారణమైన చరిత్ర సదరు అధికారిది. అలాగే కాళేశ్వరంలో బంధువులతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు స్థానిక గ్రామస్తులతో జరిగిన గొడవలో తన ఐడెంటిటీని చూపించేందుకు సర్వీస్ రివాల్వర్‌తో భయపెట్టిన ఘనుడు ఆయన. ఉన్నతాధికారులతో సంబంధాలు కొనసాగించడం వల్ల తనకేం కాదనే ధీమాతో ఉన్న కొందరు పోలీసులు వివాదాలకు కారణం అవుతున్నారనడంలో సందేహం లేదు. మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో ప్రైవేటు వ్యక్తికి బర్త్‌డే వేడుకలు జరిపిన సీఐ ఇంద్రసేనారెడ్డిని కమిషనర్ కమలాసన్‌రెడ్డి హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ రూరల్ సీఐ సంతోష్‌కుమార్‌కు మానకొండూరు బాధ్యతలు అప్పగించారు. రియల్టర్లు... కాంట్రాక్టర్లు... అక్రమార్కులతో బంధాలు కరీంనగర్ శివార్లతోపాటు కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో రియల్ వెంచర్లు సాగుతున్నాయి. దీంతో పోలీస్ అధికారులతో సంబంధాలు సర్వసాధారణంగా మారాయి. ఈ బంధంతో రియల్ వెంచర్లలో భాగస్వాములుగా మారిన పోలీసు అధికారులు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలి కాలంలో వేరే జిల్లాల్లో వెంచర్లు చేస్తున్న రియల్టర్లకు పెట్టుబడి సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఉన్న సంబంధాలతో సెటిల్మెంట్లు కూడా కొందరు ఖాకీలకు సాధారణ అంశాలుగా మారాయి. ఏఎస్సై మోహన్‌రెడ్డి రియల్ దందా, సెటిల్మెంట్లు తరువాత చోటుచేసుకున్న పరిణామాలు కరీంనగర్‌లోనే గాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఓ ఏఎస్సై కోట్లకు పడగలెత్తిన తీరు ఖాకీలకు, అక్రమ దందాలు సాగించే వారికి మధ్యనున్న బంధాన్ని తేటతెల్లం చేసింది. ఆయన స్థాయిలో కాకపోయినా... ఉమ్మడి జిల్లాలో పలువురు పోలీస్ అధికా>రులు బినామీలుగా సొంత దందాలు సాగిస్తున్నారనేది నిర్వివాదాంశం. సివిల్ దందాల్లో జోక్యం చేసుకొని శాఖాపరమైన చర్యలను ఎదుర్కొన్న పోలీసులు కూడా జిల్లాలో ఉన్నారు. అలాగే రాజకీయ ప్రముఖులు, అక్రమార్కులతో కూడా పలువురు పోలీసులకు సంబంధాలు అందరికీ తెలిసిన సత్యాలే. గతంలో చోటు చేసుకున్నకొన్ని సంఘటనలు... పెద్దపల్లి జిల్లా కమన్పూర్ పోలీస్‌స్టేషన్‌లో కొన్ని నెలల క్రితం ఎస్సై, ఇతర సిబ్బంది ఒకరినొకరు దూషించుకుని తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో సర్పంచ్ ఎన్నికలు, హోలీ సందర్భంగా కిందిస్థాయి సిబ్బంది పలువురు నుంచి మామూళ్లు వసూలు చేసి వాటా పంపకాల విషయంలో గొడవకు దిగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఓ భూ సమస్యపై వీణవంక ఎస్సై విచారణ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన ముదిగంటి నర్సింహరెడ్డి వీడియో తీస్తున్నాడనే నేపంతో చితకబాదడంతో యువకుడు తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. హుజూరాబాద్ డివిజన్లో ఓ సీఐ భార్యాభర్తల పంచాయతీని సెటిల్ చేసి వారి నుంచి సుమారు రెండు లక్షలకు పైగా వసూలు చేశారని ప్రచారంలో ఉంది. ఉన్నతాధికారులు విచారించగా రాజకీయ ఒత్తిడితో చర్యలు తీసుకోలేదని సమాచారం. ఆర్థిక లావాదేవిలకు సంబంధించిన ఓ అనే వ్యక్తిని స్టేషన్‌కు పిలిపించి చితకబాదిన హుజూరాబాద్ ఎస్సైపై బాధితులు సీపీకి ఫిర్యాదు చేశారు. అదే ఎస్సై ఓ కేసు విషయంలో నిర్లక్ష్యం చేయడంతో సదరు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. కోరుట్లలో పనిచేసిన ఓ ఎస్సైని నెలరోజుల క్రితం అవినీతి ఆరోపణలపై కుమురంభీం జిల్లాకు బదిలీ చేశారు. ఓ కేసు విషయంలో ఒక వర్గం నుంచి డబ్బులు తీసుకున్నడన్న ఆరోపణలతో కొద్ది రోజుల క్రితం గంగాధర ఎస్సైని రెండు నెలల క్రితం హెడ్‌క్వార్టర్‌కు అటాచ్డ్ చేశారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలో గతంలో పనిచేసిన ఓ ఎస్సై ఇసుక అక్రమ రవాణాదారులకు సహకరించారన్న ఆరోపణలతో కుమురంభీం జిల్లాకు బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేసిన మరో ఎస్సై కూడా అవినీతి ఆరోపణలతోనే బదిలీ అయ్యాడు. మెట్పల్లి సబ్‌డివిజన్ పరిధిలోని దాదాపు అన్ని పోలీస్స్టేషన్లలో ఇసుక దందా నుంచి రూ.లక్షల్లో మామూళ్లు ముడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో జరిగే ఇసుక దందాలు, ఇటుక బట్టీలు, రైస్‌మిల్లుల యజమానులతో కూడా పోలీసులకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. మంథనిలో అక్రమార్కులతో పోలీసు సంబంధాల గురించి రామగుండం కమిషనరేట్‌కు, డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదుల రూపంలో ఇప్పటికే చేరాయి. ఇటీవల మానకొండూరుకు ఎన్నికల విధులకు వచ్చిన ఓ ప్రొబేషనరీ ఎస్సై రాత్రి పార్టీ చేసుకొని ఇంటికొచ్చిన ఇద్దరు వ్యక్తులను తీవ్రంగా కొట్టాడు. అందులో ఒక వ్యక్తి అపోలో రీచ్‌లో జాయిన్ అయి చికిత్స పొందగా, పోలీసులు రూ.50వేలు విదిలించుకోవాల్సి వచ్చింది. కానిస్టేబుళ్లు, హోంగార్డు స్థాయిల్లో పలువురిపై వేటు పడింది. కానీ రాజకీయ, ఉన్నతాధికారుల అండదండలు ఉన్నవారు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నారు. -
తప్పు చేసి.. తప్పించుకోలేరు
సాక్షి, హైదరాబాద్: మహిళలు, చిన్నారులపై లైంగిక దాడి జరిగిన సమయంలో బాధితులు సకాలంలో పోలీసులను ఆశ్రయించినా.. శాస్త్రీయ ఆధారాలు సేకరించడంలో జరిగే జాప్యం వల్ల చాలాసార్లు నిందితులు తప్పించుకుంటున్నారు. నిందితుల పీచమణచడానికి తెలంగాణ పోలీసుశాఖ ఇకపై ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని నిర్ణయించింది. లైంగిక దాడి లేదా హత్యజరిగినపుడు ఘటనాస్థలం నుంచి సెమెన్, రక్తం, వెంట్రుకలు, వేలిముద్రలు, తదితరాలను సేకరించి తక్షణమే విశ్లేషించి పకడ్బందీగా కేసు నమోదు చేసేందుకు ప్రత్యేకమైన మెడికల్ కిట్‌ను రూపొందించారు. దీనిపై ప్రభుత్వ వైద్యులకు ఇప్పటికే శిక్షణ ఇస్తున్నారు. త్వరలోనే వీటిని రాష్ట్రంలోని అన్ని పోలీస్స్టేషన్లకు పంపనున్నారు. వీటి ఆధారంగా సేకరించిన శాంపిల్స్‌తో నేరనిరూపణ, నిందితులకు శిక్ష వంటివి వేగంగా అమలు జరిగి, బాధితులకు సత్వర న్యాయం జరుగుతుంది. ఈ కిట్‌ను ప్రవేశపెట్టడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమం మొత్తం మహిళా రక్షణ విభాగ చీఫ్, ఐజీ స్వాతిలక్రా నేతృత్వంలో జరుగుతోంది. మొత్తం కార్యక్రమాన్ని ఎస్పీ సుమతి పర్యవేక్షిస్తున్నారు. కార్పొరేట్ సదస్సు 27న ఆఫీసుల్లో ఉద్యోగం చేసుకునే మహిళలకు ఎదురయ్యే వేధింపులపై అవగాహన కల్పించడానికి మహిళా రక్షణ విభాగం నిర్ణయించింది. ఈనెల 27న మాదాపూర్‌లో తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు పలు ప్రముఖ ఐటీ కంపెనీల ముఖ్యులు కూడా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా పనిచేసే చోట మహిళలకు ఎదురయ్యే లైంగిక వేధింపులు, బెదిరింపులు వాటిని ఎలా ఎదుర్కోవాలి తదితర విషయాలపై అవగాహన కల్పిస్తారు. గ్రామీణ ఫిర్యాదులపై వేగంగా స్పందించేందుకు.. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఫిర్యాదులు చేసేందుకు ఇప్పుడిప్పుడే ముందుకు వస్తున్నారు. నం 100కు డయల్ చేసి ఫిర్యాదు చేసినపుడు పోలీసులు వేగంగా స్పందించి, సమీపంలోని వారు 5 నిమిషాలలోపు సంఘటనా స్థలికి చేరుకునే విధంగా ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు. గృహహింస, వేధింపులు, లైంగిక దాడి ఘటన ఎలాంటిదైనా, నేర తీవ్రతతో సంబంధం లేకుండా.. అన్ని ఫిర్యాదులపై ఒకే రకంగా స్పందించేలా చర్యలు చేపట్టనున్నారు. మహిళల రక్షణ మా భరోసా తెలంగాణలో మహిళలకు అన్ని విధాలా రక్షణ కల్పించడమే మా ధ్యేయం. ముఖ్యంగా పలు రకాల దాడులకు గురైన కేసుల్లో బాధితుల నుంచి శాస్త్రీయ ఆధారాల సేకరణ ఇకపై పకడ్బందీగా ఉండనుంది. నేరస్తులకు వీలైనంత వేగంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటున్నాం. – స్వాతి లక్రా ఐజీ,చీఫ్ విమెన్స్ సేఫ్టీ వింగ్ బాధితులకు వేగంగా న్యాయం శాస్త్రీయ ఆధారాల సేకరణతోపాటు, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వేధింపులు, దాడులపై అవగాహన కల్పిస్తున్నాం. దీని వల్ల నేర నియంత్రణ సాధ్యమవుతుంది. – సుమతి, ఎస్పీ, విమెన్స్ సేఫ్టీ వింగ్ ప్రతీరోజు డీజీపీకి నివేదిక.. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న నేరాలను ఎప్పటికపుడు విమెన్ సేఫ్టీ వింగ్ పర్యవేక్షిస్తోంది. నేరాల దర్యాప్తు, నిందితులను కోర్టుకు పంపడం తదితర విషయాలన్నీ నిత్యం డీజీపీకి నివేదిక పంపుతున్నారు. ముఖ్యంగా ఫోక్సో కేసుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిందితులను 24 గంటల్లోనే అరెస్టు చేయడంలో చాలా వరకు సఫలీకృతులవుతున్నారు. త్వరలో స్కూళ్లు,కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఈ సదస్సుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇలాంటి కేసులపై మహిళా ప్రజాప్రతినిధుల్లోనూ అవగాహన పెంచేందుకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులకు కూడా మహిళా పోలీసులు శిక్షణ ఇవ్వనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కాగానే వీటి తేదీలు ఖరారు చేస్తారు. -
నేతలపై నిఘా నీడ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంటోంది. నామినేషన్ల పర్వం ముగిసిన దరిమిలా ఆయా పార్టీల అధినేతలు, అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు, బహిరంగసభలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పోలీసులు అప్రమత్తమై ప్రముఖుల భద్రతకు పక్కా ప్రణాళికలు రూపొందించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణహాని ఉన్న నేతలకు ప్రత్యేకంగా పలు సూచనలు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వచ్చివెళ్లారు. సీఎం కేసీఆర్ వంటి వీవీఐపీల సభలు జరుగుతున్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థుల సభలకు బందోబస్తు కల్పించడం పోలీసులకు సవాలుగా మారింది. ఒకవైపు ప్రత్యేక బందోబస్తులతో నేతలకు రక్షణ కల్పిస్తూనే, మరోవైపు షాడో టీంలతో వారిని నీడలా వెంటాడుతున్నారు. నేతల అనుచరుల కదలికలపైనా నిఘా ఉంచుతున్నారు. అక్రమాలకు, ప్రలోభాలకు, నగదు పంపిణీకి తావు లేకుండా ఎక్కడికక్కడ డేగ కళ్లతో పర్యవేక్షిస్తున్నారు. కమిషనరేట్లలో ఏసీపీ, జిల్లాల్లో డీఎస్పీ స్థాయి అధికారులు వీఐపీల భద్రత, షాడో టీంల మోహరింపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాల్గొనబోయే రాజకీయ కార్యక్రమాలు, పర్యటించే ప్రాంతాల వివరాలు ముందుగానే స్థానిక ఎస్పీ, కమిషనరేట్‌ల్లో ఇవ్వాలని ప్రాణహాని ఉన్న నేతలకు పోలీసులు సూచించారు. 400 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు రూ.13 కోట్లకు చేరింది. 260 కంపెనీల కేంద్ర బలగాలు కావాలని తెలంగాణ పోలీసులు కేంద్రానికి నివేదించారు. 166 వరకు కేంద్ర బలగాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. -
ఎదురుదాడితో నేరం మాసిపోదు
‘మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కడం’ అనే సామెత చంద్రబాబు లాంటివారిని చూసి పుట్టిందేమో? తెలంగాణ రాజ ధాని హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్స్ అనే సంస్థ దగ్గర ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించిన రహస్యమైన డేటా అక్రమంగా ఉన్నదని, ఆ డేటా ఆధారంగా వైసీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని లోకేశ్వర్ రెడ్డి అనే పౌరుడు, పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై తెలంగాణ పోలీసులు ఆ ఐటీ సంస్థ కార్యాలయంలో తనిఖీలు చేపడితే, దానికి ఏపీ సీఎం చంద్రబాబు గగ్గోలు పెట్టడం పైగా వైఎస్సార్సీపీయే తెలుగుదేశం అనుకూల ఓట్లను తొలగించడానికి కుట్ర పన్నిందని, దానికి కేసీఆర్ ప్రభుత్వం సహకరిస్తున్నదని ఎదురుదాడికి దిగడం ఏమిటి? పోలీసులు దాడి చెయ్యగానే, ఐటీ గ్రిడ్స్ సంస్థ యజమాని అశోక్ పోలీసులకు దొరకకుండా అమరావతి పారిపోవడం ఎందుకు? పోలీసుల ముందే తన వాదనను వినిపించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవచ్చు కదా? ప్రభుత్వం వద్ద మాత్రమే ఉండాల్సిన రహస్య సమాచారం ఒక ప్రయివేట్ సంస్థకు ఎలా చేరింది? ఆ సంస్థకు పౌరసమాచారం చేరవేసినవారు ఎవరు? ఆ సంస్థకు సమాచారం ఇవ్వuraడం సబబే అనుకుంటే, ఆ సంస్థ కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఎందుకు నడిపిస్తున్నారు? అమరావతి నుంచే నిర్వహించుకోవచ్చు కదా? ఇక్కడే ఒక కుట్ర కోణం ఉన్నదని నిరక్షరాస్యులకు కూడా అర్ధమవుతోంది. ఈ ఐటీ గ్రిడ్స్ సంస్థ యజమాని అశోక్‌కు, చంద్రబాబుకు, ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖామంత్రి లోకేష్‌కు అతి దగ్గరి సంబంధాలు ఉన్నాయనేది బహిరంగ రహస్యం. ఈ సంస్థ స్థాపన వెనుక లోకేష్ ప్రోద్బలం, సహకారం ఉన్నాయనేది అందరికీ తెలిసిన విషయం. డేటా చౌర్యం విషయం బయటపడగానే చంద్రబాబు రాష్ట్ర డీజీపీ, న్యాయ సలహాదారులతో గంటన్నర పాటు సమావేశం అయ్యారన్నది ఒక వార్త అయితే, ఈ అంశం మీద ఏకంగా కేబినెట్ సమావేశాన్ని కూడా నిర్వహించి, వైఎస్సార్సీపీ మీద ఎలా ఎదురు దాడి చెయ్యాలో సీఎం ఆదేశాలు జారీ చెయ్యడం మరింత విస్తుగొలిపే అంశం. అది ఏపీకి చెందిన కంపెనీ అయితే కావచ్చు. కానీ, దాని కార్యస్థానం ఉన్నది తెలంగాణలో అయినపుడు ఆ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చెయ్యకుండా ఎలా ఉంటారు? పోలీ సులనుంచి పారిపోయిన అశోక్‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసారు. న్యాయస్థానం నుంచి ఆదేశాలను కూడా తీసుకునే అవకాశం ఉన్నది. ఐటీ గ్రిడ్స్ సంస్థ చేసిన డేటా చౌర్యం రాజ్యాంగ బద్ధంగా పౌరులకు సంక్రమించిన వ్యక్తిగత గోప్యత, ఓటు హక్కులను కాలరాయడమే అని రాజ్యాంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజలకు సంబంధించిన డేటా ప్రయి వేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం చట్టవిరుద్ధం అని, ఆ వివరాలను అడ్డం పెట్టుకుని పాలకపక్షం వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని, అది తీవ్రమైన రాజ్యాంగ అపచారంగా పేర్కొంటున్నారు. ఇప్పటికే లక్షలాది ఓట్లు గల్లంతు అయ్యాయని తెలుస్తున్నది. చివరకు ఈ నైచ్యం ఎంతవరకు వెళ్లిందంటే సాక్షి దినపత్రికను ఎవరు కొంటున్నారో చూసి వారి ఓట్లను కూడా తొలగిస్తున్నారట! ఒక ఐటీ సంస్థ సైబర్ నేరానికి పాల్పడితే, తెలంగాణ పోలీసులు చర్యలకు ఉపక్రమిస్తే, అదేదో ఆంధ్రా తెలంగాణ మధ్య యుద్ధం లాగా చంద్రబాబు చిత్రించడానికి తెగిస్తున్నారు. సీమాంధ్రులలో సెంటిమెంట్‌ను రెచ్చగొడుతున్నారు. తాను తలచుకుంటే తెలంగాణలో ఒక్క ఐటీ కంపెనీ ఉండదని çహూంకరిస్తున్నారు. చంద్రబాబు అంతటి సమర్థుడే అయితే.. గత నాలుగున్నరేళ్లలో ఇప్పటికి ఎన్ని ఐటీ కంపెనీలు ఆంధ్రా వెళ్లిపోయాయి? ఎన్ని కొత్త కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో స్థాపితమయ్యాయి? ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి? ఒక కంపెనీ చేస్తున్న అక్రమాలను వెలుగులోకి తెస్తే.. దానికి భయపడి హైద్రాబాద్‌లోని ఐటీ కంపెనీలు ఆంధ్రాకు వెళ్ళిపోతాయా? ఏమిటీ బెదిరింపులు? నిజానికి అనుకూల ఓట్లను తొలగిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నది. ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా మొరపెట్టుకున్నది. గత ఎన్నికలలో వైఎస్సార్సీపీకి, టీడీపీకి మధ్య ఓట్ల తేడా కేవలం అయిదు లక్షలు మాత్రమే. రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం తథ్యం అని ఎప్పటి నుంచో పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తమ అవినీతి, దోపిడీ పాలనను చూపించి ఓట్లు సాధించి అధికారాన్ని చేపట్టే అవకాశం లేదని గ్రహించిన చంద్రబాబు చివరకు ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడటం ద్వారా మళ్ళీ అధికారాన్ని చేపట్టాలని విఫల ప్రయత్నాలను చేస్తున్నారు. ఆయన కోరిక ఫలించే సూచనలు లేవు కానీ ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎంతమంది సిబ్బందిని అయినా రంగంలోకి దించి ఇంటింటికీ తిరిగి ఓటర్లను మళ్ళీ నమోదు చేయించాలి. అవకతవకలు కనిపిస్తే సరిదిద్దాలి. ప్రతి ఒక్క ఓటరుకు ఓటు ఉన్నదని ధ్రువపరచుకున్న తరువాతే ఎన్నికల ప్రక్రియను చేపట్టాలి. ఎన్నికలకు ఇంకా రెండు మాసాల వ్యవధి ఉన్నది కాబట్టి, తక్షణమే ఓటర్ల నమోదు ప్రక్రియను యుద్ధప్రాతిపదిక మీద చేపట్టాలి. ఇలపావులూరి మురళీ మోహనరావు వ్యాసకర్త సీనియర్ రాజకీయ విశ్లేషకులు మొబైల్ : 81433 18849 -
ఒత్తిడిలో పోలీసన్న!
సాక్షి, కామారెడ్డి: మారుతున్న కాలాని కి అనుగుణంగా పోలీసింగ్‌లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. పోలీస్ అంటే భయపడే రోజుల నుంచి మనకోసమే పోలీసు అన్న భావన కలిగించేందుకు ఆ శాఖ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. పోలీసు అధికారులు, సిబ్బంది సైతం తమ వైఖరిని మార్చుకుంటున్నారు. దీంతో ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావర ణం ఏర్పడుతోంది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీ స్ సిబ్బంది పెరగకపోవడం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఉన్న సిబ్బందిని ఆయా జిల్లాలకు విభజిం చి కేటాయించారు. కొత్తగా నియామకాలు అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో ఉన్న కొద్దిమందిపై పనిభారం పెరిగింది. దీంతో పని ఒత్తిడితో చాలామంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తామని పాలకులు చెప్పడమే తప్ప అమలు చేయకపోవడంతో వారికి విశ్రాంతి దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడి చాలా మంది అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు. విధులు నిర్వహిస్తూనే తీవ్రమైన గుండెపోటుకు గురై ఇద్దరు పోలీసులు కన్నుమూసిన సంఘటనలు ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్లో ఈ నెల 14న రాత్రి విధులు నిర్వహించి స్టేషన్ పైఅంతస్తులో నిద్రకు ఉపక్రమించిన ఏఎస్సై పీవీఎస్ఎంకే రాజు (56) నిద్రలోనే గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ నెల 23న బాన్సువాడ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ విజయ్‌బాబు (52) గుండెపోటుకు గురై మృత్యువాతపడ్డారు. ఇలాంటి సంఘటనలు పోలీసు కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సిబ్బంది కొరత... అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం లక్ష జనాభాకు 220 మంది చొప్పున పోలీసులు ఉండాలి. మన దేశంలోని పరిస్థితుల ప్రకారం లక్ష జనాభాకు 145 మంది ఉండాలి. కామారెడ్డి జిల్లా జనాభా దాదాపు పది లక్షలకు చేరింది. ఈ లెక్కన జిల్లాలో కనీసం 1,450 మంది పోలీసు సిబ్బంది అవసరం.. కానీ ప్రస్తుతం జిల్లాలో హోంగార్డు నుంచి జిల్లా పోలీసు అధికారి వరకు కలిపి మొత్తం 990 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇంకా 450 పైచిలుకు మంది సిబ్బంది అవసరం. ఇప్పటికిప్పుడు జిల్లాలో ఏఆర్ విభాగానికి వంద మంది, సివిల్ విభాగానికి వంద మంది సిబ్బంది, అధికారులు అవసరమని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. ఉరుకుల పరుగుల జీవితం.. జిల్లాల విభజన తరువాత పోలీసు సిబ్బందికి పనిభారం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, వీఐపీల పర్యటనలు ఉన్నా ఇరు జిల్లాల పోలీసులను అటూ, ఇటూ పంపించడం పరిపాటిగా మారింది. సంఘటనల తీవ్రత పెరగకుండా చూడడానికి పోలీసు అధికారులు బలగాలను దింపుతున్నారు. దానికితోడు ఆరు నెలలుగా ఎన్నికల హడావుడి పెరిగి వీఐపీల తాకిడి రెట్టింపైంది. మరో ఐదారు నెలల పాటు ఎన్నికల వాతావరణం కొనసాగేలా ఉంది. దీంతో పోలీసు సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టాల్సిందే.. రెస్ట్ అనేది లేకుండా ఎక్కడ అవసరం ఉందంటే అక్కడికి పరుగులు తీయాల్సిందే.. ఉద్యోగం చేస్తున్న చోటనే ఉన్నన్ని రోజులు సమయానికి తిండి తినే పరిస్థితి ఉంటుంది. అదే బయటకు వెళ్లినపుడు సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారు. ఒత్తిడితో కొందరు.. వ్యసనాలతో మరికొందరు పోలీసు శాఖలో పని ఒత్తిడితో కొందరు ఇబ్బంది పడుతుంటే, రకరకాల వ్యసనాలతో మరికొందరు అనారోగ్యం పాలవుతున్నారు. పోలీసు శాఖలో పనిచేసే ఉద్యోగులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. కానీ కొన్నిచోట్ల పోలీసు అధికారులు, సిబ్బంది వ్యాయామంపై దృష్టి పెట్టడం లేదు. మరికొందరు మద్యానికి బానిసలుగా మారి అనారోగ్యం పాలవుతున్నారు. చాలామంది పోలీసులు పొట్టపెరిగి ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నారు. దీనికి రకరకాల కారణాలున్నాయి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరిపడా నిద్ర లేకపోవడం, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది కొరత ఉన్నా.. జిల్లాలో ప్రస్తుతం పోలీసు సిబ్బంది కొరత ఉంది. అయితే ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఉద్యోగి అయినా ఒత్తిడిని దరిచేరనీయకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. వ్యసనాలు సైతం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. – ఎన్.శ్వేత, కామారెడ్డి ఎస్పీ -
తెలంగాణ పోలీస్ యాప్‌తో ఇంటికి చేరిన అస్సాం బాలిక
సాక్షి, హైదరాబాద్: ఏడాదిన్నర కిందట తప్పిపోయిన అస్సాం బాలికను తెలంగాణ పోలీస్ రూపొందించిన ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ఇంటికి చేర్చింది. అస్సాంలోని లక్మీపూర్ బోగినోడి గ్రామానికి చెందిన అంజలి టిగ్గా(16) 2017, ఆగస్టులో ఇంటి నుంచి తప్పిపోయి ఢిల్లీకి చేరి అక్కడ నెల రోజుల పాటు కార్మికురాలిగా పనిచేసింది. పనిచేస్తున్న చోట ఇతర కార్మికులందరూ కలిసి మళ్లీ తనను అస్సోం పంపించారు. అస్సాం రైల్వే స్టేషన్‌కు చేరిన అంజలి ఇంటికి వెళ్లేందుకు భయపడి సోనిత్‌పూర్‌లో ఏదైనా పనిచేసుకుని జీవించాలని నిర్ణయించుకుంది. అయితే, రైల్వే స్టేషన్లో అంజలిని గుర్తించిన రైల్వే పోలీసులు ఆమెను చైల్డ్, ఉమెన్ కేర్ (సీడబ్ల్యూసీ) సంస్థ ప్రతినిధులకు అప్పగించారు. తెలంగాణ పోలీసులు తయారుచేసిన ఫేస్ రికగ్నైజ్ యాప్‌లోని డేటా బేస్ ద్వారా దేశంలోని అన్ని రాష్ట్రా ల్లో అదృశ్యమైన వారి ఫొటోలు, వివరాలు అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రుల వివరాలు చెప్పేందుకు అంజలి నిరాకరించగా అక్కడి సంస్థ ప్రతినిధులు ఆమె ఫొటోలను తెలంగాణ పోలీస్ రూపొందించిన ఫేస్ రికగ్నైజేషన్ డేటా బేస్‌లో సరిపోల్చి చూశారు. దీంతో అంజలి అడ్రస్ అందుబాటులో ఉండగా ఆమెను ఆదివారం అస్సాంలోని బోగినోడిలో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించినట్లు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతిలక్రా ఒక ప్రకటనలో వెల్లడించారు. -
కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత
సాక్షి, హైదరాబాద్: ఓట్ల లెక్కింపు జరిగే కౌంటింగ్ కేంద్రాల వద్ద తెలంగాణ పోలీస్ శాఖ భారీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రవ్యాప్తంగా మూడు అంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. 25 కంపెనీల కేంద్ర బలగాలతో పాటు, మరో 20 వేల మంది రాష్ట్ర పోలీసులు కౌంటింగ్ సెంటర్ల వద్ద పహారా కాస్తున్నారు. ప్రతి కౌంటింగ్ సెంటర్ వద్ద ఓ సీనియర్ పోలీసు ఆఫీసర్ పరిస్థితిని పర్యవేక్షిస్తారు. పాసు ఉన్నవారికే కౌంటింగ్ సెంటర్లోకి అనుమతి ఉంటుంది. అలాగే కౌంటింగ్ మొదలు నుంచి ముగిసేవరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేలా ప్రతిఒక్కరూ సహకరించాలని పోలీసులు కోరారు. మితిమీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని తెలంగాణ పోలీసు శాఖ ఓ ప్రకటనలో హెచ్చరించింది. -
ఎన్నికల ‘హవా’లా!
సాక్షి, జనగామ: ఎన్నికలకు మరో రెండు రోజులే మిగిలి ఉండటంతో పంపిణీ నిమిత్తం డబ్బు విపరీతంగా రవాణా అవుతోంది. చిన్న నోట్లను తరలించడంలో ఇబ్బందులు ఉండటంతో రూ.500, రూ.2 వేల నోట్ల కట్టలను తరలిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అక్రమ మార్గంలో వందల కోట్లు ఇక్కడికి రవాణా అవుతున్నాయి. ఏపీ అధికార పార్టీ తమ అభ్యర్థులతో పాటు కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో హవాలా మార్గంలో తరలిస్తున్న రూ.5.80 కోట్లను మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకోవడంతో పాటు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ డబ్బంతా కాంగ్రెస్, టీడీపీ నేతృత్వంలోని కూటమి అభ్యర్థులకు ఇవ్వడానికి తీసుకెళుతున్నట్లు పోలీసులు నిర్ధారించారు. జనగామ జిల్లా హైదరాబాద్–వరంగల్ 163వ జాతీయ రహదారిపై పెంబర్తి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ పోలీస్ కమిషనర్ వి.రవీందర్ మీడియాకు వెల్లడించారు. వెనుక సీటు కింద నోట్ల కట్టలు.. ‘హైదరాబాద్ నుంచి కారులో పెద్ద మొత్తంలో డబ్బు తరలిస్తున్నట్లు స్టేట్ ఇంటలీజెన్స్కు సమాచారం అందింది. కారు వివరాలు కూడా తెలియడంతో గూగుల్ మ్యాప్ ద్వారా సెర్చ్ చేశారు. మంగళవారం తెల్లవారుజామున ఆ కారు వరంగల్ దిశగా వెళుతున్నట్లు గుర్తించిన అధికా>రులు జనగామ పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో జనగామ జిల్లా పెంబర్తి చెక్‌పోస్టు వద్ద ఎస్సై శ్రీనివాస్ వాహనాల తనిఖీలు చేస్తుండగా, ఏపీ 37 సీకే 4985 నంబర్ షిప్టు డిజైర్ కారు వచ్చింది. అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు, డ్రైవర్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో వారిని విచారించారు. ఈ సమయంలో హైదరాబాద్ గోషామహల్‌కు చెందిన కీర్తి కుమార్ జైన్, రాజస్తాన్‌కు చెందిన డ్రైవర్ నవరాం, మహబూబాబాద్ జిల్లా కాన్వాయ్గూడెంకు చెందిన ముత్యం ప్రకాష్ కారులో ఉన్నారు. విచారణ సందర్భంగా కారులో డబ్బు ఉందని, వరంగల్‌కు తీసుకుపోతున్నామని చెప్పారు. కారులోని వెనుక సీట్ల కింద దాచిన నోట్ల కట్టలను పోలీసులు గుర్తించారు. కారును, అందులో ప్రయాణిస్తున్న వారిని జనగామ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఎన్నికల అధికారులు, పోలీసుల సమక్షంలో కౌంటింగ్ మిషన్ల సాయంతో డబ్బును లెక్కించగా మొత్తం రూ.5,80,65,000 ఉన్నట్లు తేలిందని’ సీపీ చెప్పారు. ‘కూటమి’ అభ్యర్థులకు ఇవ్వడానికి.. ‘తనిఖీల్లో పట్టుబడిన డబ్బు కాంగ్రెస్, టీడీపీ నేతృత్వంలో ఏర్పడిన కూటమి అభ్యర్థులకు చెందినదిగా గుర్తించాం. కీర్తి కుమార్ జైన్ హైదరాబాద్‌లోని గోషామహల్ ఏరియాలో నివాసం ఉంటూ హవాలా మార్గం ద్వారా డబ్బును రవాణా చేస్తుంటాడు. ఎన్నికలు కావడంతో స్థానికంగా కొందరు డబ్బు కావాలని అతన్ని కోరారు. దీంతో హైదరాబాద్ నుంచి డబ్బు తీసుకొని వరంగల్ వస్తూ పెంబర్తి వద్ద పట్టుపడ్డారు. ఈ డబ్బులో ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్న టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వర్రావుకు రూ.1.5 కోట్లు, వరంగల్ తూర్పు కాంగ్రెస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్రకు రూ.2 కోట్లు, పరకాల కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ భర్త ఎమ్మెల్సీ కొండా మురళీకి రూ. 2.3 కోట్లు ఇవ్వడానికి తీసుకువెళుతున్నట్లు చెప్పారు. మొత్తం డబ్బు రూ.5,80,65,000లతో పాటు కారును స్వాధీనం చేసుకొని ప్రధాన నిందితుడు కీర్తి కుమార్ జైన్, డ్రైవర్లు నవరాం, ముత్యం ప్రకాశ్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించాం. కారు కీర్తి కుమార్ జైన్ సోదరుడు ప్రవీణ్‌కుమార్ జైన్ భార్య సుమిత్రా జైన్ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. కోట్లలో డబ్బు పట్టుబడటంతో పూర్తిస్థాయి విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ఈడీ)కు అప్పగించే అవకాశాలున్నాయని’ రవీందర్ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీతో పాటు డీసీపీ శ్రీనివాసరెడ్డి, సీఐ ముష్క శ్రీనివాస్, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు. అన్నీ పెద్ద నోట్ల కట్టలే.. పట్టుబడిన నగదులో అన్నీ రూ.2000, రూ.500 నోట్ల కట్టలే ఉన్నాయి. 2000 నోట్లు 20,051 ఉండగా, వాటి విలువ రూ.4,01,02,000. 500 నోట్లు 35,926 ఉండగా, వాటి విలువ రూ.1,79,63,000. తెల్లవారుజామున 5 గంటలకు నగదును లెక్కింపు ప్రారంభించగా ఉదయం 11 గంటలకు పూర్తయింది. నోట్లను లెక్కించడానికే ఆరు గంటల సమయం పట్టడం గమనార్హం. పట్టుకున్న నగదులో నకిలీ రెండు వేల నోటును కూడా గుర్తించారు. భారీ నగదులో నకిలీ నోటు రావడం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఏపీ నుంచి తెలంగాణకు.... కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ నుంచి డబ్బు ప్రవాహం కట్టలు తెంచుకుంది. కాంగ్రెస్‌తో కలసి ప్రజాకూటమి ఏర్పాటు చేసిన టీడీపీ.. తమ అభ్యర్థులకు ఏపీ నుంచి ఆర్థిక వనరులను సమకూర్చుతోందని పోలీసులకు పట్టుబడుతున్న డబ్బు సంచులు చెబుతున్నాయి. పెంబర్తి చెక్‌పోస్టు వద్ద పట్టుబడ్డ రూ.5.80 కోట్లు ఏపీ నుంచి వచ్చిన కారులోనే లభించడం విశేషం. కీర్తి కుమార్ జైన్ కూడా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంనకు చెందిన వ్యాపారి కావడం గమనార్హం. పాలకొల్లు పక్కనే ఉన్న నరసాపురం కేంద్రంగా పెద్ద ఎత్తున హవాలా వ్యాపారం సాగుతూ ఉంటుంది. కారు పాలకొల్లుకు చెందినది కావడంతో ఏపీకి చెందిన అధికార పార్టీ నేతలే ఇలా హవాలా రూపంలో పెద్ద మొత్తం తరలించే ఏర్పాట్లు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. కాగా కీర్తికుమార్ జైన్ గతంలో అనేక సందర్భాల్లో డబ్బుతో పట్టుబడ్డాడు. 2014 ఎన్నికల్లో భీమవరంలో అత్యధిక మొత్తం దొరికిన సొమ్ము కీర్తికుమార్‌కు చెందినదేనని అప్పట్లో విచారణ జరిపారు. అదే ఎన్నికల్లో ఒక అధికార అభ్యర్థి తమ అధిష్టానానికి ఇదే హవాలా వ్యాపారి ద్వారా రూ.5 కోట్లు ఎన్నికల ఫండ్ పంపిన తర్వాతే సీటు వచ్చిందన్న ప్రచారం ఉంది. కృష్ణా, గోదావరి నదుల గట్టుదాటి.. ఏపీ నుంచి తెలంగాణకు డబ్బు రవాణాకు జలమార్గాన్ని మేలైన మార్గంగా ఎంచుకున్నారనేది విశ్వసనీయ సమాచారం. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నడుమ ఉన్న కృష్ణా, గోదావరి నదులు దాటితే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి చేరుకోవచ్చు. ఎక్కడికక్కడ డబ్బు తరలింపునకు వీలవుతుంది. ఎవరికీ అనుమానం రాకుండా నాటు పడవల ద్వారా డబ్బు సంచులు చేరవేస్తున్నారని ఓ నిఘా అధికారి విశ్లేషించారు. మరోవైపు ప్రతిరోజూ ఏపీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లే వందలాది ఇసుక లారీలు, కార్లు, ఇతర వాహనాల సీట్లు, బాడీ కింద అరల్లోను, పాలవ్యాన్లు, ఇతర వాహనాల్లోను నోట్ల కట్టలను సునాయాసంగా తరలిస్తున్నారని, ఇందుకు తమకు అనుకూలురైన అధికారులను ఎక్కడికక్కడ సెట్ చేసుకున్నారని ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ముందుగానే ఎంపిక చేసుకున్న వాహనాలను ఎవరూ తనిఖీ చేయకుండా ఏపీలోని చెక్‌పోస్టులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్టు కూడా పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. అశ్వారావుపేట నుంచి ఏపీలో కలిసిన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల నుంచి, మరోవైపు జీలుగుమిల్లి, చింతలపూడి మండలాల సరిహద్దుల నుంచి డబ్బు, పెద్ద ఎత్తున మద్యం నిల్వలు తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
విపక్షాల కార్లపైనే పోలీసుల నిఘా!
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ మధ్య ట్విట్టర్లో ఆరోపణలు, ప్రత్యారోపణల పరంపర కొనసాగుతోంది. టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావును కేటీఆర్‌కు అంకుల్ అంటూ సంబోధిస్తూ.. కేవలం ప్రతిపక్ష నేతల కార్లను మాత్రమే రాధాకృష్ణరావు తనిఖీ చేస్తున్నారని తొలుత ఉత్తమ్ ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి అక్రమ, పక్షపాత చర్యల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి దిగజారుడు, చౌకబారు ఆరోపణలు మానుకోవాలని మంత్రి కేటీఆర్ ప్రతిస్పందించారు. ఓ సామాజికవర్గానికి చెందిన వారంతా బంధువులు, పక్షపాతం గల వారని మీ ఉద్దేశమా? అని ఉత్తమ్‌ను ప్రశ్నించారు. 2014లో మీ కారులో రూ.3 కోట్లు కాలిన కరెన్సీ నోట్లు లభించిన నేపథ్యంలో కార్ల తనిఖీ పట్ల మీకున్న ఆందోళనను అర్థం చేసుకోగలని కేటీఆర్ ఎద్దేవా చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచారని, అనవసర రాజకీయాల కోసం కష్టపడి పనిచేసే పోలీసు అధికారుల మనోబలాన్ని దెబ్బతీయొద్దని హితువు పలికారు. అనంతరం దీనిపై తిట్లు, రోత, అసహ్యకర భాషను ప్రయోగించి రాజకీయంగా ఎదిగిన మీ లాంటి వ్యక్తుల నుంచి హితబోధలు తమకు అవసరం లేదని ఉత్తమ్ తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ నోరు ఎలాంటిదో? మీ బావ హరీశ్‌రావు ఓ పోలీసును ఎలా చితకబాదారో? నువ్వు పోలీసులను ఎలా దుర్భాషలాడావో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని కేటీఆర్‌కు ఉత్తమ్ బదులిచ్చారు. ఉద్యమ కాలంలో ఓ పోలీసుపై హరీశ్‌రావు జరిపిన దాడి, పోలీసులను కేటీఆర్ దుర్భాషలాడిన రెండు ఘటనల వీడియోలను ఉత్తమ్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ పై ఆరోపణలు చేశారు. దీనికి స్పందిస్తూ ఉద్యమంలో మీరెక్కడ ఉన్నారు? అని ఉత్తమ్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. అప్పటి సీఎంను అనుసరించడం, ప్రజాధనాన్ని దోచుకోవడంలో బిజీగా ఉన్నారన్న విషయాన్ని మరిచిపోయానని ఎద్దేవా చేశారు. తెలంగాణ పోరాటంలో తన పాత్ర పట్ల గర్వపడుతున్నానన్నారు. అప్పట్లో తాను తిట్టిన పోలీసులకు బహిరంగంగా క్షమాపణ చెప్పానని గుర్తు చేశారు. కారులో దొరికిన రూ.3 కోట్ల డబ్బు మీదేనని అంగీకరిస్తారా? అని ఉత్తమ్‌కు సవాలు విసిరారు. ‘మీ వాహనంలో రూ.3 కోట్లు లభించిన నేపథ్యంలో మీలాంటి నేరస్తులు ఎన్నికల్లో అక్రమాలు పునరావృతం చేస్తారని తెలిసీ కేంద్ర ఎన్నికల సంఘం మీ పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తుందని ఎలా అనుకుంటున్నారు’అని ఉత్తమ్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. -
అభ్యర్థుల ‘కేసులపై’ స్పష్టతనివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమపై ఉన్న కేసుల వివరాలన్నింటినీ ఎన్నికల అఫిడవిట్లో చెప్పాలా? లేక తమకు తెలిసిన కేసుల గురించి మాత్రమే చెప్పాలా? అన్న అంశంపై స్పష్టతనివ్వాలని హైకోర్టు గురువారం తెలంగాణ పోలీసులను ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలను తమ ముందుంచాలంది. తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి ఉత్తర్వులు జారీ చేశారు. తనపై రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలు అందచేసేలా డీజీపీని ఆదేశించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ శేషసాయి గురువారం మరోసారి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, పిటిషనర్‌కు నోటీసులు అందిన ప్రతి కేసులో కూడా న్యాయపరంగా వాదనలు వినిపిస్తున్నామన్నారు. పోలీసులు నమోదు చేసిన పలుకేసుల్లో వారి నుంచి కనీసం నోటీసులు కూడా రాలేదని, దీంతో ఆ కేసులకు సంబంధించిన పూర్తివివరాలు తెలిసే అవకాశం లేకుండా పోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే డీజీపీని కేసుల వివరాలు ఇవ్వాలని కోరామన్నారు. తరువాత హోంశాఖ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి నామినేషన్ దాఖలు చేసేటప్పుడు తనకు తెలిసి తనపై ఉన్న కేసుల వివరాలు చెబితే చాలునన్నారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, అసలు నిబంధనలు ఏం చెబుతున్నాయో చెప్పాలన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి తనకు తెలిసి తనపై ఉన్న కేసుల వివరాలను అఫిడవిట్లో పొందుపరిస్తే సరిపోతుందా? లేక అన్నికేసులనూ పొందుపరచాలా? అన్న విషయంపై స్పష్టతనివ్వాలని తేల్చి చెప్పారు. -
పోలీస్ రేంజ్‌లపై కసరత్తు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో జోన్లు, మల్టీజోన్ల పునర్వ్యవస్థీకరణతో పోలీస్ శాఖలోనూ నూతన రేంజ్‌లు, జోన్ల ఏర్పాటుపై కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శాఖలో రెండు జోన్లు, నాలుగు రేంజ్‌లు ఉన్నాయి. వెస్ట్‌జోన్ (హైదరాబాద్) కింద ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాలున్నాయి. అదేవిధంగా నార్త్‌జోన్ (వరంగల్) కింద ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఉన్నాయి. నూతన జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు వెస్ట్‌జోన్ కింద, మరికొన్ని ప్రాంతాలు నార్త్‌జోన్ కిందకు వచ్చాయి. దీనితో సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ల పోస్టింగులు, వారి పై తీసుకునే క్రమశిక్షణ చర్యలు, మానిటరింగ్ తదితరాల పర్యవేక్షణకు సరిహద్దు సమస్యలు ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న జోన్లు, మల్టీజోన్లతో పోలీస్ శాఖలో రేంజ్‌లు, జోన్ల పునర్వ్యవస్థీకరణ క్లారిటీ వచ్చినట్టుగా ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఒక్కో జోన్ కింద రెండు రేంజ్‌లున్నాయి. జోన్లకు ఐజీ హోదా కలిగిన అధికారులుండగా, రేంజ్‌లను డీఐజీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. నూతనంగా మరో రెండు... ప్రస్తుతం కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ రేంజ్లుండగా, వీటికి తోడుగా మరో రెండు రేంజ్‌లు ఏర్పాటు చేసే అవకాశముందని పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. అదేవిధంగా ఇప్పుడున్న రేంజ్‌ల పేర్లు కూడా మార్పు జరిగే అవకాశం ఉందని, మొత్తంగా 6 రేంజ్‌లకు కొత్తపేర్లతో పునర్వ్యవస్థీకరణ జరగనున్నట్టు తెలుస్తోంది. ఒక్కో రేంజ్ కింద 5 జిల్లాల పోలీస్ యూనిట్లు పనిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్ జోన్‌తో పాటు మరో జోన్ కూడా ఏర్పాటు జరిగితే ఒక్కో జోన్ కింద రెండు రేంజ్‌ల పర్యవేక్షణ ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. నూతనంగా ఏర్పడిన కమిషనరేట్లలో బదిలీలు, క్రమశిక్షణ చర్యలు ఎవరి అధీనంలో ఉండాలన్న దానిపై త్వరలో క్లారిటీ వస్తుందని, ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తామని సీనియర్ ఐపీఎస్‌లు స్పష్టం చేశారు. -
దేశంలోనే అత్యుత్తమం
♦ తెలంగాణ పోలీసుకు గుర్తింపు వచ్చిందన్న డీజీపీ అనురాగ్‌శర్మ ♦ శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో విజయం సాధించాం ♦ రెండేళ్ల కాలంలో ప్రజలకు పోలీసుల పట్ల నమ్మకం పెరిగింది ♦ టెక్నాలజీని విస్తృతంగా వినియోగంలోకి తీసుకొచ్చాం ♦ పోలీసు అధికారులు లంచం తీసుకుంటే సస్పెండ్ చేస్తాం సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల కాలంలోనే యావత్ దేశంలో తెలంగాణ పోలీసు శాఖ అత్యుత్తమ గుర్తింపు తెచ్చుకుందని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకూ తావివ్వకుండా శాంతియుత వాతావరణం నెలకొల్పడంలో పోలీసులు విజయం సాధించారని, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతోనే రాష్ట్ర పోలీసులకు దేశంలోనే పేరుప్రతిష్టలు వచ్చాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతిభద్రతలు అదుపులో ఉండి ప్రశాంత వాతావరణం ఉంటేనే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి అభివృద్ధి చెందవచ్చన్నారు. సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు ఇస్తున్న ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలను అదుపులో ఉంచగలిగామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీస్ స్టేషన్ల నిర్వహణకు ప్రతి నెలా డబ్బులు విడుదల చేస్తున్నామన్నారు. పోలీసు ఎమర్జెన్సీ నంబర్ ‘100’కు భారీగా కాల్స్ వస్తున్నాయని, వాటన్నింటినీ పరిష్కరిస్తున్నామని తెలిపారు. మహిళల భద్రతకు ప్రత్యేకంగా ‘షీ’ టీమ్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఇటీవల భరోసా సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీసు కోసం థర్డ్‌పార్టీ చేత విచారణ జరుపుతున్నామని డీజీపీ తెలిపారు. పాస్‌పోర్టు వెరిఫికేషన్, ఠాణాల్లో ప్రజలతో పోలీసు సిబ్బంది వ్యవహరించే తీరును ఎప్పటికప్పుడు థర్డ్‌పార్టీ ద్వారా నివేదికలు తెప్పించుకుని పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు. పోలీసులెవరైనా లంచం తీసుకున్నట్లు తమ దృష్టికి వస్తే వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ట్రాఫిక్ విభాగంలో ఈ-చలాన్, బాడీ కెమెరాలను తీసుకొచ్చి పారదర్శకతను పాటిస్తున్నట్లు చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులు చేస్తున్న ప్రత్యేక డ్రైవ్ వల్ల పరిస్థితి మెరుగుపడిందన్నారు. కార్డన్ సెర్చ్ ద్వారా నేరగాళ్లను అదుపు చేయడమే కాక.. చట్టవిరుద్ధంగా జరిగే కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశామని చెప్పారు. ఇటీవల స్టడీ టూర్లో భాగంగా అమెరికా, బ్రిటన్‌లో పోలీసు ఉన్నతాధికారుల పర్యటన విషయాలను వివరించారు. అక్కడ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, అడిషనల్ డీజీలు పూర్ణచందర్రావు, గోపీకృష్ణ, కృష్ణప్రసాద్ తదితర సీనియర్ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి స్వేచ్ఛా గీతం...
ఈవెంట్ పట్టపగలు రోడ్డు మీదకు వెళితేనే జీవితాన్ని చీకటిపాలు చేసేందుకు కాచుక్కూచున్న మృగాలెన్నో ఉన్న పరిస్థితిలో ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా సంచరించగలిగితేనే స్వాతంత్య్రం వచ్చినట్టన్న మహాత్ముడి మాటలు నిజమయేది ఎప్పుడు? ‘‘ఆఫీస్ టైమింగ్స్ మరీ అర్ధరాత్రి దాకా అట. ఎలా వస్తావో ఆ సమయంలో ఒక్కదానివే...’’ ‘‘పర్లేదమ్మా ఏంకాదులే. ఆఫీస్ క్యాబ్ ఉంటుంది’’ ‘‘ఏమో... ఆ టివీలో రోజూ వార్తలు చూస్తుంటే భయమేస్తోంది. శుభ్రంగా పొద్దుటి పూట ఉద్యోగం చూసుకో అంటే వినవు’’ కూతురెంత ధైర్యం చెబుతున్నా... కన్నపేగు వణుకుతూనే ఉంది... ఇల్లు చేరేవరకూ క్షణమొకయుగం. ఎటువైపు నుంచి ఏ మృగం మీద పడుతుందో తెలీదు... రాత్రిపూట రోడ్డెక్కితే నలుగురూ ఉన్నారా లేరా అని కళ్లు వెతుకుతాయి. నిశ్శబ్దం, నిశీధిని చూస్తే కాళ్లు వణుకుతాయి. ఎందుకీ దుస్థితి? ఎప్పుడు మారుతుందీ పరిస్థితి? ‘‘అర్ధరాత్రి సమయంలో కూడా ధైర్యంగా సంచరించగలమనే ఆత్మవిశ్వాసాన్ని ఆడవారికి ఇవ్వాలి’’ అంటున్నారు ఫ్రీడమ్ వాక్ పేరుతో ఇండిపెండెన్స్ వచ్చిన అర్ధరాత్రి వేళ వెలుగు నడకకు శ్రీకారం చుట్టనున్న ఈవెంట్ నిర్వాహకులు ఆర్య. వియ్ సపోర్ట్ షి పేరుతో కార్పొరేట్ మహిళలకు, పోలీసులకు మధ్య వారధిగా సేవలు అందిస్తున్న ఈ సంస్థ స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని వేల లాంతర్లను నిశీధిలోకి పంపి ఆ వెలుగులో నిర్భీతిగా నడిచే ‘ఫ్రీడమ్వాక్’ నమూనాను ఆవిష్కరించనుంది. ఈ కార్యక్రమంలో 3వేల మందికిపైగా మహిళలు పాల్గొననున్నారంటున్నారు. ఆర్య అర్ధరాత్రి కూడా నిర్భయంగా తిరిగే హక్కు తమకుందని తెలియజెప్పడమే వీరి ఉద్దేశమని వివరించారు. తమ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ద్వారా ఏ మహిళైనా సాయం పొందవచ్చునని ఆర్య చెప్పారు. తమ సేవలు రోజంతా అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటికే 1800 మంది వాలంటీర్లుగా నమోదు చేసుకున్నార ంటున్న మహతి ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులు విక్కీ గోకవరపు, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఈ కార్యక్రమంలో షీ టీమ్ సభ్యులు కూడా పాల్గొంటారన్నారు. ఈవెంట్: ఫ్రీడమ్ వాక్; సమయం: ఆగస్టు 14 (తెల్లవారితే స్వాతంత్య్ర దినోత్సవం) రాత్రి 12గంటల తర్వాత వేదిక: హైటెక్ సిటీ చౌరాస్తా నుంచి హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్ వరకూ... (3 కిలోమీటర్లు), హైదరాబాద్ - ఎస్.సత్యబాబు